చైతన్య గీతం
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
నమ్మి నమ్మి మోసబోకురా
నమ్మటం మరవ బోకురా
నమ్మకంలో ఉన్న నిజాయితీని
గమనించి స్నేహాన్ని పెంచుకోవాలిరా
అందించాలి నిర్మలమైన మనస్సుని
ఆదమరచి ఆశయం మరవకురా....న
న్యాయం లో ఉన్న స్థిరత్వాన్ని
గమనించి స్నేహాన్ని పెంచుకోవాలిరా
సత్యంలో ఉన్న పటుత్వాన్ని
గమనించి తీర్పు ల్ని గౌరవించాలిరా.....న
వ్యర్ధం చేయకు సమయాన్ని
ప్రతి విషయంలో తృప్తి పడాలిరా
కాలాన్ని బట్టి ఓర్పుతో గుణాన్ని
మార్పు చేయక బతుకు సాగించురా. ...న
అందించాలి సహాయ సహకారాన్ని
దానగుణం తో జీవితాల్ని నిలపాలిరా
ప్రేమను అందించి శక్తిచే ప్రపంచాన్ని
ఒకేవిధంగా ఉంచే శక్తి నీకుందిరా....న
నమ్మి నమ్మి మోసబోకురా
నమ్మటం మరవబోకురా--(())--
ప్రాంజలి ప్రభ - చైతన్య గీతం
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఏమండోయ్ శ్రీమతి గారు .... ఏమండోయ్ .....
ఏమిటండి శ్రీవారు ....... ఏమిటండి శ్రీవారు .......
ఆ ఏమన్నావ్..... ఆ ఏమన్నావ్.....
మీరన్నదే నేనన్నాను ..... మీరన్నదే నేనన్నాను .....
నేనన్నది నువ్వంటావా,,, నేనన్నది నువ్వంటావా,,,
ఏమిటండి శ్రీవారు ....... ఏమిటండి శ్రీవారు .......
ఆ ఏమన్నావ్..... ఆ ఏమన్నావ్.....
మీరన్నదే నేనన్నాను ..... మీరన్నదే నేనన్నాను .....
నేనన్నది నువ్వంటావా,,, నేనన్నది నువ్వంటావా,,,
పసిడి మెఱుపు రెక్కలతో నిను చూడాలని ఉంది
పువ్వుల వనములో నాట్యమాడాలని ఉంది
నవ్వుల మధ్య ఊయల ఊగాలని ఉంది
తృప్తిగా కలసి మెలసి ఆడాలని ఉంది
ఏమండోయ్ శ్రీమతి గారు .... ఏమండోయ్ .....
ఏమండోయ్ శ్రీమతి గారు .... ఏమండోయ్ .....
ఈ జన్మకు మిమ్ము సుఖపెట్టి సుఖపడాలి ఉంది
వయసుని బట్టి మీతో ఆడి పాడి కోర్కలు తీర్చాలని ఉంది
నిదురించని పాటలాగా మీలో కలసిపోవాలి ఉంది
చెలిమి వీణ తంత్రులలో కదలి పోవాలిని ఉంది
ఏమిటండి శ్రీవారు ....... ఏమిటండి శ్రీవారు .......
ఏమిటండి శ్రీవారు ....... ఏమిటండి శ్రీవారు .......
నీ చూపుల మిఠాయి నా ఆకలి తీరుస్తున్నది
నీ మాటల మిఠాయి నా ఆకలి తీరుస్తున్నది
నీ నవ్వుల మిఠాయి నా ఆకలి తిరుస్తున్నది
నీ చెశాల మిఠాయి నా ఆకలి తిరుస్తున్నది
ఏమండోయ్ శ్రీమతి గారు .... ఏమండోయ్ .....
ఏమిటండి శ్రీవారు ....... ఏమిటండి శ్రీవారు .......
ఆ ఏమన్నావ్..... ఆ ఏమన్నావ్.....
మీరన్నదే నేనన్నాను ..... మీరన్నదే నేనన్నాను .....
నేనన్నది నువ్వంటావా,,, నేనన్నది నువ్వంటావా,,,
ఏమండోయ్ శ్రీమతి గారు .... ఏమండోయ్ .....
ఏమిటండి శ్రీవారు ....... ఏమిటండి శ్రీవారు .......
--((**))--
ఏమిటండి శ్రీవారు ....... ఏమిటండి శ్రీవారు .......
--((**))--
రంగ రంగా నా కళ్ళోకొచ్చావు
కళ్ళోలం చేసి నవ్వించావు
ముద్దులతో మురిపించావు
అందుకే నా మనసులో ఉన్న వాడివి
రంగ రంగా
నువ్వు నాకు నచ్చావు
నువ్వే నాకు తగినోడివి
నువ్వు విప్పి చెప్పావు
నువ్వే నా ప్రేమికుడివి
నన్ను నీవు మెచ్చావు
నా ప్రేమకు దాసుడివి
నా అందాలు చూసావు
నన్ను దోచుకున్న వాడివి
నన్ను కలలో కదిలించావు
నా కైపుకి లొంగిన వాడివి
నన్ను వానళ్ళో తడిపావు
మనసును నమ్మిన వాడివి
దోంగచూపులు చూసావు
దోబూచు లాడిన వాడివి
కవ్వింపులతో నవ్వించావు
మనసులో ఉన్న వాడివి
రంగ రంగ నాకళ్ళో కొచ్చావు
కళ్ళోలం చేసి నవ్వించావు
ముద్దులతో మురిపించావు
అందుకే నా మనసులో ఉన్న వాడివి
రంగ రంగా
--((*))--
--(())--
చైతన్యు గీతం
బాబు నామాట వినరా , అమ్మనే అడుగుతున్నా బిడ్డా
అమ్మ మాట ఎప్పుడూ తప్పు రాదురా
అర్ధంచేసుకోవటంలోనే ఉంది ధర్మంరా
చెల్లెలుకు రాఖి కట్టి రక్షకుడౌతావురా
రోడ్డుమీద స్త్రీలను రోత కూతలు కూస్తావురా
నిద్రలేవగానే తల్లికి దండం పెడతావురా
మరి పిల్లనిచ్చిన అత్తను ఎందుకు తిడతావురా
తల్లి చెప్పిన మాట వింటా నంటావురా
మరి పెళ్ళాన్ని కట్నం తేలేదని వేదిస్తావురా
అపురూపమైనది ఆడజన్మ అని అంటావురా
పుట్టిన ఆడబిడ్డను చెత్తకుప్పలో పడేస్తావురా
స్త్రీల ఆకర్షణకు లోనై పాడౌతున్నావురా
ప్రేమిస్తున్న భార్యను గుర్తించి బతకరా
వెలయాలికి లొంగి అనారోగిగా మారకురా
భార్యే నీకు సంతృప్తి కలిగించే దేవతరా
అందుకే నే చెపుతున్న తల్లిగా
నక్క వినయాలు దేనికిరా
కుక్కలా విశ్వాసంగా ఉంటె చాలురా
గుడ్లగూబలా నిద్ర మానకురా
పక్షిలా హాయిగా నిద్రపోతే చాలురా
గాడిదల మోతబరువు దేనికిరా
ఏనుగులా శ్రమిస్తే మనకు చాలురా
కప్పలా ఉండుట దేనికిరా
చాపలా బతుకుట చాలురా
బాబు నామాట వినరా , అమ్మనే అడుగుతున్నా బిడ్డా
అమ్మ మాట ఎప్పుడూ తప్పు రాదురా
అర్ధంచేసుకోవటంలోనే ఉంది ధర్మంరా
--((***))--
ప్రాంజలి ప్రభ చతన్య గీతం
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ
రారెవ్వరూ అని, నిశ్చయించుకుని
నిస్త్రాణంగా నింగి, వైపు నిలిపిన చూపు
ఒక్క సారిగా విప్పారి, కళ్ళు చెమ్మగిల్లాయా లలనా
మబ్బుల చాటు నుండి, ఓ నెలవంక రేఖ కొన
కనిపించి నట్లు, అందుకోలేనట్లు, మనసు దోచినట్లు
అనిపించటం తో.... కళ్ళు చెమ్మగిల్లాయి మదనా
మబ్బు వ్యాపిస్తుందేమో, చీకటి కమ్ము కుందేమో
కనీ కనిపించని అంబరం కల కల్ల అవుతుందేమో
అన్న భయం తో.... కళ్ళు చెమ్మగిల్లాయా లాలనా
ఇంతలో, సవ్వడి చిగురుటాకులది, కాలి చిరుగజ్జెల
సంగీతం లాగా, రసధుని రమ్య మనోహర
తలపుల లేపుతూ...చిరునవ్వుతో కళ్ళు చెమ్మగిల్లాయి మదనా
కమ్ముకున్న చీకటి లో, ఓ సన్నని లేత తీగ లాంటి
కాంతి రేఖ...పాశం లా నా వైపు కు కదులుతూ !
మనసును దోచే చూపులకు కళ్ళు చెమ్మగిల్లాయి లాలనా
ఈ పాశం ప్రణయ పాశ మైనా, యమపాశ మైనా ,
సిద్ధమే నేనని, కాలు కదప బోయాను, ఏ పాశం
కన్నీళ్లను రుచి చూపిస్తుందో అర్ధం కాక కళ్ళు చెమ్మగిల్లాయి మదనా
లలనా, మదనా , లలనా, మదనా
లలనా, మదనా , లలనా, మదనా
--((**))--
రచయత:మల్లాప్రగడ రామకృష్ణ
అన్నానా పావనీ '/ ఏమని?
అరవిరసిన పువ్వు లాంటి మోము నీదని మాటవరసకు ఎపుడైనా అన్నానా పావనీ / ఏమనీ
అన్నానా రామ
నిండు వెన్నెల ముఖ కాంతులతో మనసునే దోచావని ఎపుడైన అన్నానా పావనీ / ఏమనీ
ఆదమరిచి ఎప్పుడైనా అన్నానా రామ/ ఏమనీ
లోకానికి రాజు నైన నీ ప్రేమకు దాసుడని ఎప్పుడైనా అన్నానా పావనీ / ఏమనీ
మీరన్నారని ఆదమరిచి ఎప్పుడైనా అన్నానా రామ/ ఏమనీ
నిన్నే నమ్ముకున్నాను నీవే నాప్రియసివి అని ఎప్పుడైనా అన్నానా పావనీ / ఏమనీ
నిన్నే నమ్ముకున్నా నని నీవే నా దేవుడవనీ నేనెప్పుడన్నా ఆదమరచి అన్నానా రామ/ ఏమనీ
మాటలతో మైమరిపించి మురిపించి బాధ పెట్టావని ఎప్పుడైనా అన్నానా పావనీ/ ఏమనీ
మాటకు మాట చెప్పి మీకు ఎప్పుడైనా బాధ కలిగిస్తే క్షమించమని కోరుతున్నా రామ/ ఏమనీ
ఊహల గుస గసలతో హ్రుదయాన్ని ఊగిసలాడించి ఎప్పుడైనా అన్నానా పావనీ / ఏమనీ
పిలిచిన పలికే స్వామివి నీవు ఆదమరిచి ఎప్పుడైనా అన్నానా రామ/ ఏమనీ
/ ఏమనీ / ఏమనీ అనకు
అనుకున్నవన్నీ కలసి పంచుకుందాం సమయాన్ని వ్యర్థం చేయక జీవితం సాగిద్దాం / ఏమనీ
ఆ ....... ఆ..... / ఏమనీ.......
--((**))--
చైతన్యగీతం
ఉన్నావు నవ యవ్వన చిలకలా
మనసును దోచే మన్మధమొలకలా
ఆశలు తీర్చె ఆలయ బేబీలా
ఉన్నావు బేబీ ఓ బేబీ ఓ ఓ బేబీ
మిస మిస లాడె ముఖ వర్చస్సు తో
మిళ మిళ లాడె థళుక్ మెర్పుతో
తొంగి తొంగి చూసి దోబూచులాట తో ఉన్నావా బేబీ
జల జల కదిలే బంతుల బరువుతో
చక చక నడకకు కదిలే నితంబాలతో
అంగాంగం కనబడే స్వేత వస్త్రా లతో
తుళ్ళి తుళ్ళి పడి తుంటరి కోర్కతో ఉన్నావా బేబీ
మళ్ళి మళ్ళి ఆడి మదన కోర్కతో
చూడు చూడు అని చురక చూపులతో
కసి కసి కైపు తో బిడియం తో
ముసి ముసి నవ్వు ల పువ్వు కైపుతో ఉన్నావా బేబీ
ఉన్నావు నవ యవ్వన చిలకలా
మనసును దోచే మన్మధమొలకలా
ఆశలు తీర్చె ఆలయ బేబీలా
ఉన్నావు బేబీ ఓ బేబీ ఓ ఓ బేబీ
--((***))--
చైతన్య గీతం
ఓ పిల్లా , ఓ ఓ పిల్లా
నన్ను ఊరించకే మళ్ళా
ఉన్నావులే రసగుల్లా
జుర్రుకోవాలనిఉంది పిల్లా
అరవిరిసిన అందాలతో
అనురాగపు ఆనందంతో
ఆత్మీయత భావముతో
కొత్తగా ఉన్నావే పిల్లా
సద్దు చేయక చంక నెక్కి
ముద్దుమోముతో మూతితిప్పి
తలపు స్పష్టత తో తెల్పి
కొత్తగా ఉన్నావే పిల్లా
ఓ పిల్లా , ఓ ఓ పిల్లా
నన్ను ఊరించకే మళ్ళా
ఉన్నావులే రసగుల్లా
జుర్రుకోవాలనిఉంది పిల్లా
పచ్చని చేనులా కదుల్తూ
వెచ్చని సెగలా మెదుల్తూ
నచ్చిన వానితో కలుస్తూ
కొత్తగా ఉన్నావే పిల్లా
ఉయ్యాల ఊగినట్లు ఊగుతూ
సయ్యాట ఆడినట్లు ఆడుతూ
పయ్యట అందాలన్ని చూపుతూ
కొత్తగ ఉన్నావే పిల్లా
ఓ పిల్లా , ఓ ఓ పిల్లా
నన్ను ఊరించకే మళ్ళా
ఉన్నావులే రసగుల్లా
జుర్రుకోవాలనిఉంది పిల్లా
జాలువారి నదిలా జరుగుతూ
మల్లెల జాజుల సువాసనలతో
మనసున చేరి మధిస్తూ
కొత్తగా ఉన్నావె పిల్లా
ఓ పిల్లా , ఓ ఓ పిల్లా
నన్ను ఊరించకే మళ్ళా
ఉన్నావులే రసగుల్లా
జుర్రుకోవాలనిఉంది పిల్లా
--((***))--ఓ పిల్లా , ఓ ఓ పిల్లా
నన్ను ఊరించకే మళ్ళా
ఉన్నావులే రసగుల్లా
జుర్రుకోవాలనిఉంది పిల్లా
అరవిరిసిన అందాలతో
అనురాగపు ఆనందంతో
ఆత్మీయత భావముతో
కొత్తగా ఉన్నావే పిల్లా
సద్దు చేయక చంక నెక్కి
ముద్దుమోముతో మూతితిప్పి
తలపు స్పష్టత తో తెల్పి
కొత్తగా ఉన్నావే పిల్లా
ఓ పిల్లా , ఓ ఓ పిల్లా
నన్ను ఊరించకే మళ్ళా
ఉన్నావులే రసగుల్లా
జుర్రుకోవాలనిఉంది పిల్లా
వెచ్చని సెగలా మెదుల్తూ
నచ్చిన వానితో కలుస్తూ
కొత్తగా ఉన్నావే పిల్లా
ఉయ్యాల ఊగినట్లు ఊగుతూ
సయ్యాట ఆడినట్లు ఆడుతూ
పయ్యట అందాలన్ని చూపుతూ
కొత్తగ ఉన్నావే పిల్లా
ఓ పిల్లా , ఓ ఓ పిల్లా
నన్ను ఊరించకే మళ్ళా
ఉన్నావులే రసగుల్లా
జుర్రుకోవాలనిఉంది పిల్లా
మల్లెల జాజుల సువాసనలతో
మనసున చేరి మధిస్తూ
కొత్తగా ఉన్నావె పిల్లా
నన్ను ఊరించకే మళ్ళా
ఉన్నావులే రసగుల్లా
జుర్రుకోవాలనిఉంది పిల్లా
చైతన్య గీతం
నిన్ను నేను మరువలేను
నీ తీపి గుర్తులతోనే
నే బతుకుతున్నాను
పెదాలు పలక్క పోయినా
మౌనం అంగీకారం అనుకుంటా
తనువులు దూరంగా మారినా
వలపుల తలపులు గుర్తించుకుంటా
ఆంక్షలు అడ్డుగోడలుగా ఉన్నా
మనో గవాక్షం తెరిచే ఉంటా
కను రెప్పలు మూసేసి ఉన్నా
కలలతో కాలం గడుపుతూ ఉంటా
నన్ను విడిచి వెళ్లినా
నిన్ను నేను మరువలేను
నీ తీపి గుర్తులతోనే
నే బతుకుతున్నాను
భందసౌధం పటిష్టమై జీవిస్తుంటా
ఇక్కట్లు చీకట్లుగా కమ్ముకొని ఉన్నా
హృదయదీపం తెరుచుకొని ఉంటా
విధి విషముగా ఆవరించి ఉన్నా
ప్రేమామృత ధారా ప్రాణంగా పోస్తూఉంటా
కాలం సంకెళ్లను వేసి ఉన్నా
ప్రేమ పక్షిలా రెక్కలు చాచి ఉంటా
నన్ను విడిచి వెళ్లినా
నిన్ను నేను మరువలేను
నీ తీపి గుర్తులతోనే
నే బతుకుతున్నాను
--((***))--
చైతన్య గీతం
నా ప్రేమను గుర్తించి
ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని గమనించి
ప్రేమే సర్వస్వమని తెలుసుకోవా
జీవితానికి మూలం ప్రేమేనని గమనించవా
తూరుపు వెలుతురులో మెరిసే హరితం
గాలి సవ్వడికి వీచే పూల పరిమళం
చిరుజల్లులకు వికసించే మనిషి హృదయం
వేణువులో గాలిచొరబడి తియ్యని స్వరం
ప్రేమే, అదియునూ ప్రేమే
అందుకే
నా ప్రేమను గుర్తించి
ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని గమనించి
ప్రేమే సర్వస్వమని తెలుసుకోవా
జీవితానికి మూలం ప్రేమేనని గమనించవా
వికసించించే మల్లెల సుఘంధం భరితం
తీరాన్ని తడిపే సముద్ర అలల ప్రయాణం
కళ్ళ చూపులతో ఎదురుచూసే వనితా వికాసం
ప్రేమే, అదియునూ ప్రేమే
అందుకే
నా ప్రేమను గుర్తించి
ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని గమనించి
ప్రేమే సర్వస్వమని తెలుసుకోవా
జీవితానికి మూలం ప్రేమేనని గమనించవా
చైతన్య గీతం
ఓ విద్యార్థి, ఓ హో విద్యార్థి
విద్యనేర్చుకో, వినయం నీవెంటే
కళలు నేర్చుకో, కరుణ నీవెంటే
మాట నేర్చుకో మనసు నీవెంటే
ఓ విద్యార్థి, ఓ హో విద్యార్థి
ఒక్క అడుగు ముందు వేయక నిష్క్రమించకు
అడుగు అడుగు వేసుకుంటూ భూగోళాన్ని కౌగలించుకోవచ్చు
ఒక్క నీటి చుక్కే నని చులకన చేయకు
ఆ నీటి చుక్కే పృద్విని చేరి ప్రపంచప్రజల దాహం తీర్చవచ్చు
ఓ విద్యార్థి, ఓ హో విద్యార్థి
విద్యనేర్చుకో, వినయం నీవెంటే
కళలు నేర్చుకో, కరుణ నీవెంటే
ఒక్క దీపాన్ని వెలిగించుటకు వెనుకడుగు వేయకు
చీకటి జీవితాల్లో వెలుగును నింపే జీవన జ్యోతి కావచ్చు
ఒక్క చేతిని అందించి చేయూతను మరువకు
వేళ చేతులు కలిపి చైతన్య వంతులుగా మార్చవచ్చు
ఓ విద్యార్థి, ఓ హో విద్యార్థి
విద్యనేర్చుకో, వినయం నీవెంటే
కళలు నేర్చుకో, కరుణ నీవెంటే
ఒక్క సమాజమే కదా అని నిర్లక్ష్యం చేయకు
సమాజమే దహించి నిలువునా నిన్ని కాల్చి వేయవచ్చు
ఒక్క మాటే కదా అని తప్పు మాట్లాడకు
ఆ మాటే నిన్ను నీకుటుంబాన్ని నాశనం చేయవచ్చు
ఓ విద్యార్థి, ఓ హో విద్యార్థి
విద్యనేర్చుకో, వినయం నీవెంటే
కళలు నేర్చుకో, కరుణ నీవెంటే
మాట నేర్చుకో మనసు నీవెంటే
ఓ విద్యార్థి, ఓ హో విద్యార్థి
--((***))--
మర్మస్ఫురము - త/భ/జ/త/గ UUI UIII - UIU UIU
13 అతిజగతి 2421 ఛందస్సు ( 8 )
మర్మస్ఫురమ్ము హృది - మాయలో నింపెఁగా
నర్మమ్ముగాఁ బలుకు - నాసఖుం డెప్పుడున్
ఘర్మమ్ము తగ్గు నిఁక - గాయముల్ మాయుఁగా
హర్మ్యమ్ము వెల్గు నిఁక - హర్ష దీపమ్ములన్
రాగమ్ము పాడెదను - రాగమున్ రాగిణీ
వేగమ్ము రాదరికిఁ - బ్రేమతో మోహినీ
నాగమ్య మెప్పుడును - న్యాయమై నీవెగా
సాఁగంగ డోలికయు - సంద్రమున్ జల్లఁగా
హారమ్ము వేసెదను - హర్ష మింపారఁగాఁ
దీరమ్ము చేర్చెదను - తెడ్డుతో దోనెపై
గారమ్ముతోడ నిను - గౌగిలింతున్ సకీ
సారమ్ము నీవె సమ-సారమం దెప్పుడున్
నామమ్ము తెల్పెదము - సాహసం చేసెదం
ప్రాణమ్ము నిల్పెదము - వేదనం తొల్చెదం
గానమ్ము చేసెదము - చింతలే మార్చెదం
న్యాయమ్ము తెల్పెదము - బాధలే తీర్చెదం
--((***))--
*స్త్రీ పురుష తత్త్వం ఛందస్సు ( 7 )
కనుపాప చూపులకు - కమనీయ సౌరభము
చిరునవ్వు చిందులకు - కమనీయ శోభా
విరజాజి పువ్వులతొ - కనువిందు చేయుటకు
సువిశాల వెన్నెలలు - కురిపించే రావా
మనసార మంగళము - మమతాను రాగమును
మురిపాల ముందిడుచు - మురిపించ రావా
మదిలోన మాటలను - మధురాతి వాసనతొ
మకరంద మాలికతొ - సుఖమివ్వ రావే
సిరులెల్ల వచ్చుటకు - సిరివాణి మాటలతొ
సరసాలు పంచుటకు - మధురంగ మారే
మనసున్న చిన్నదియు - మనసంత మౌనముగ
మదిలోని ఊహలను - కురులుప్పి చెప్పే
విరిదండ దాల్చుకొని - చరణాల నందియల -
సరసాల నందముగ - దరిరమ్ము దేవీ
వరవీణ మీటుచును - స్వరమాల నల్లుచును -
హరుసమ్ము జల్లుచును - వరమిమ్ము దేవీ
సిరివాణి హృల్లయల - సిరులెల్లఁ జిందిడుచు -
మురిపాల ముందిడుచు - మురిపించ రావా
తరుణేందు బింబ నవ - కిరణాల సోయగపు -
చిఱునవ్వు వెన్నెలల - కురిపించ రావా
వలపొక్క యాటయగు - వలపొక్క పాటయగు -
వలపొక్క బాటయగు - నిల జీవమందున్
వలపొక్క భావమగు - వలపొక్క రావమగు -
వలపొక్క నావయగు - నిల జీవమందున్
వలపొక్క యాసయగు - వలపొక్క లాసమగు -
వలపొక్క రాసమగు - నిల జీవమందున్
వలపొక్క పుష్పమగు - వలపొక్క ఖష్పమగు -
వలపొక్క బాష్పమగు - నిల జీవమందున్
(ఖష్పము=కోపము)
అనుమాన మయ్యదియు - పెనుభూతమౌను గద -
విను నీకు సందియము - మనమందు వద్దే
కనుముందు నుండునది - కనుపించుచున్నదియు -
ననిశమ్ము నిక్క మవ - దని చెప్పుచుంటిన్
నిను దప్ప నేనెవరిఁ - గనలేదు నా సకియ -
విను మొట్టు నీపయినఁ - గనకాంగి యుంతున్
మునువోలె నిర్వురము - మనుచుంద మిఁకమీఁద -
నని చెప్ప నా ప్రియుఁడు - విని యామె నవ్వెన్
--((*))--
ఛందస్సు ( 6 )
వృషభగతి రగడతో కనుము పండుగ - ఛందస్సు
చూడఁ జక్కఁగ వన్నె కొమ్ములు - సుందరమ్మగు పూల మాలలు
కోడె దూడలు నడచు చుండఁగ - గోల సేసిరి సడుల బాలలు
పాల రంగుల బృందము - వాల మూఁపుచు వృషభ గతితో
మేళ తాళము మ్రోఁగుచుండఁగ - మెల్లమెల్లఁగ సాఁగె జతితో
బసవ డూఁపెను తలను డూడూ - పశువు మ్రుగ్గుల నడుమ నిలువఁగ
పసిమి నవ్వుల మంగళారతి - పడతి దానిడె నాల గొలువఁగ
గగనవీథిని దాఁకుచుండిన - గాలిపటములు కనుల విందులు
సిగను దురిమిన మల్లె పువ్వుల - చిఱుత నవ్వులు మది పసందులు
అమ్మలక్కలు వచ్చి గాంచెద - రందముగ సోపానములఁ గల
బొమ్మలను బలు కొలువులోఁ గడు - మోదమున హృదయాలు రంజిల
కనుము పండుగ కడు విశేషము - కామధేనువు కోర్కె దీర్చును
వినుము గోపాలుండు నవ్వును - వేగముగ మన బ్రతుకు మార్చును
సేకరణ 🙏
--((***))--
కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్ కార్డియాలాజీ డాక్టర్ శ్రీ నిశాంత్ గారు
ఇచ్చిన సలహాలు:
*ప్రశ్న 1* : గుండె ఆరోగ్యానికి చెయ్యవలసిన పనులు ఏమిటి ?
*జవాబు* : 1)తక్కువ కార్బోహైడ్రేట్లు , ఎక్కువ ప్రోటీన్స్ , తక్కువ నూనె.
2)వారానికి కనీసం 5 రోజులు రోజుకు ఒక అరగంట చొప్పున నడక , లిఫ్ట్ ఎక్కడం మానడం , ఎక్కువ సేపు కూర్చోకుండా ఉండడం
3)ధూమ పానం మానడం.
4)బరువు కంట్రోల్ లో ఉంచుకోవడం.
5)బి పి. షుగరు కంట్రోల్ లో ఉంచుకోవడం.
*ప్రశ్న 2.* కొవ్వును కండగా మార్చుకొగలమా ?
*జవాబు* : ఇది ఒక ప్రమాదకరమైన అపోహ ! కొవ్వు - కండ ఈ రెండూ వేరు వేరు కణజాలాలు.
కొవ్వు అసహ్యకరం ప్రమాదకరం.
కొవ్వు కండగా మారదు.
*ప్రశ్న 3 :* ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి కూడా ఒక్కోసారి హార్ట్ ఎటాక్ కి గురి అవుతున్నాడు . ఇది ఆశ్చర్యం కదా ! దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?
*జవాబు* : దీనినే సైలెంట్ ఎటాక్ అంటారు. అందుకే 30 సంవత్సరాలు దాటినా ప్రతీ వ్యక్తీ హెల్త్ చెకప్ చేయించుకోవాలి.
*ప్రశ్న 4 :* గుండె పోటు వంశ పారం పర్యమా?
*జవాబు* : అవును
.
*ప్రశ్న 5 :* గుండె పై ఒత్తిడి ఎలా వస్తుంది?
ఒత్తిడి తగ్గించుకోవడం ఎలా ? ( స్ట్రెస్ )
*జవాబు :* జీవితం పట్ల మీ వైఖరి మారాలి.
ఏదీ పూర్తి పర్ఫెక్ట్ గా ఉండక పోవచ్చు అనేది గుర్తుంచుకోవాలి.
*ప్రశ్న6* : ఆరోగ్యవంతమైన గుండె కోసం జాగింగ్,నడక రెండింటిలో ఏది ఉత్తమం?
*జవాబు* : నడక మంచిది.
జాగింగ్ లో జాయింట్స్ మీద ఒత్తిడి పెరిగి ప్రమాదం జరగవచ్చు.
*ప్రశ్న 7:* మీరు పేదలకు , అవుసరమైన వారికీ సేవ చేస్తున్నారు. మీకు స్ఫూర్తి ఎవరు?
*జవాబు* : మదర్ తెరెసా !
*ప్రశ్న 8:* లో (low) బ్లడ్ ప్రెషర్ వారికి గుండె పోటు వచ్చే అవకాశం ఉందా ?
*జవాబు* : చాలా తక్కువ
.
*ప్రశ్న 9 :* కొలెస్టరాల్ బాల్యం నుండే పోగుపడుతూ వస్తుందా ?
(నా వయసు 22).
30 సంవత్సరాల తర్వాత మాత్రమె దాని గురించి వర్రీ అవ్వాలా?
*జవాబు* : చిన్నతనం నుండే పేరుకుంటూ వస్తుంది.
*ప్రశ్న 10* : అకాల భోజనాలు గుండె మీద ప్రభావం చూపిస్తాయా?
*జవాబు* : మీరు అకాల భోజనాలు చెయ్యడం వలన జంక్ ఫుడ్ తింటారు.
ఆ ఆహారం జీర్ణం కావడానికి ఊరవలసిన ఎంజైములు కన్ఫ్యూజ్ అవుతాయి.
*ప్రశ్న 11:* మందులు వాడకుండా కొలెస్టరాల్ కంట్రోల్ చెయ్యడం ఎలా ?
*జవాబు* : ఆహార నియంత్రణ , నడక , వాల్ నట్స్ తినడం ద్వారా.
*ప్రశ్న 12:* గుండె ఆరోగ్యానికి మంచి ఆహారం ఏది?
చెడ్డ ఆహారం ఏది?
*జవాబు :* పళ్ళు , కాయగూరలూ మంచివి.
నూనెలు చెడ్డవి.
*ప్రశ్న 13:* ఏ నూనె మంచిది ?
సన్ ఫ్లవర్,
వేరుశనగ నూనె,
ఆలివ్ ఆయిల్ ?
*జవాబు* : అన్ని నూనెలూ చెడ్డవే.
*ప్రశ్న 14:* ఏమేమి టెస్టులు చేయించుకోవాలి
ఏదైనా ప్రత్యెక టెస్ట్ ఉందా?
*జవాబు* :
రొటీన్ షుగర్,
బి.పి,కొలెస్టరాల్ చాలు .
ఎకో టెస్ట్ చేయించుకుని ట్రెడ్ మిల్ చేయించుకోండి.
*ప్రశ్న 15* : గుండె పోటు వచ్చిన వారికి చెయ్యవలసిన తక్షణ సహాయం ఏమిటి?
*జవాబు* : గుండె పోటు వచ్చిన వ్యక్తిని పడుకోబెట్టండి.
ఒక *ఆస్ప్రిన్* మాత్ర నాలుక కింద పెట్టండి .
*సోర్బిట్రేట్* మాత్ర అందుబాటులో ఉంటె అది కూడా పెట్టండి .
వీలయినంత త్వరగా గుండె వ్యాధి నిపుణుడి దగ్గరకి తీసుకు వెళ్ళండి.
మొదటి గంట లోపులోనే మరణం సంభవించే అవకాశాలు ఎక్కువ .
*ప్రశ్న : 16 :* గ్యాస్ట్రిక్ నొప్పికీ - గుండె నొప్పికీ తేడా తెలుసుకోవడం ఎలా ?
*జవాబు* : ఈ.సి.జీ చూస్తే గానీ చెప్పలేము.
*ప్రశ్న 17:* యువకులలో వ్యాధులూ , హార్ట్ ఎటాక్ లో పెరిగి పోవడానికి కారణం ఏమిటి ?
( 30 - 40 మధ్య యువతలో హార్ట్ ఎటాక్ లు , గుండె వ్యాధులూ ఈ మధ్య ఎక్కువ అయ్యాయి )
*జవాబు* : యువతలో అవేర్నెస్ పెరిగింది.
అందు వలన కేసులు కనిపిస్తున్నాయి.
జీవన విధానం ( బద్ధకం ),
జంక్ ఫుడ్,
వ్యాయామం లేక పోవడం,
పొగ తాగడం.
మన దేశం లో జెనెటికల్ గా అమెరికా యూరోప్ దేశాలతో పోలిస్తే గుండెపోటు అవకాశాలు 3 రెట్లు ఎక్కువ.
*ప్రశ్న 18 :* బి. పి 120 /80 కంటే ఎక్కువ గా ఉండి పూర్తి ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు ఉంటారా?
*జవాబు* : ఉంటారు.
*ప్రశ్న 19 :* దగ్గర సంబంధాలు చేసుకోవడం వలన పిల్లలకు గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అంటారు.
వాస్తవమా?
*జవాబు* : వాస్తవమే!
దగ్గర సంబంధాల వలన కంజెనిటల్ ఎబ్నార్మాలిటీ ఉన్న పిల్లలు పుట్టవచ్చు.
*ప్రశ్న 20* : మాలో చాలా మందిమి ఒక క్రమ బద్ధమైన రొటీన్ గడపము నైట్ ఎక్కువ సేపు ఆఫీసు లో ఉంటాం.
ఇది మా గుండె మీద ప్రభావం చూపుతుందా ?
*జవాబు* : మీరు యువకులుగా ఉన్నంత సేపూ మీ శరీర ప్రకృతి మిమ్మలి కాపాడుతుంది
ఇటువంటి అసంబద్ధ జీవిత విధానాల నుండి.
కానీ పెద్దవారు మీ బైయోలాజికల్ క్లాక్ ని అనుసరించండి.
*ప్రశ్న 21:* ఆంటి హైపర్టేన్సివ్ మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ?
( దీర్ఘ కాలం లో కానీ / స్వల్పకాలం లో కానీ )
*జవాబు* : చాలా మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
ఇప్పుడు వస్తున్న కొన్ని మందులు చాలా వరకూ సేఫ్.
*ప్రశ్న 22* : కాఫీ/టీ ఎక్కువ తాగడం వలన గుండెకు ఏమైనా ప్రమాదం ఉందా ?
*జవాబు* : లేదు.
*ప్రశ్న 23* : ఆస్థమా వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందా ?
*జవాబు* : లేదు
*ప్రశ్న 24 :* మీ దృష్టిలో జంక్ ఫుడ్ అంటే ఏమిటి?
*జవాబు :* వేపుళ్ళు -- ఉదాహరణ కెంటకీ , మెక్ డొనాల్డ్స్ , సమోసాలు , మసాలా దోశలు కూడా.
*ప్రశ్న 25 :* భారతీయులు గుండె జబ్బులకు గురి అయ్యే అవకాశం 3 రెట్లు ఎక్కువ అమెరికా , యూరోపు వారితో పోల్చితే అన్నారు . వాళ్ళు కూడా జంక్ ఫుడ్ ఎక్కువ తింటారు కదా!
*జవాబు* : ప్రతీ జాతీ కొన్ని జబ్బులకు గురిఅవుతూ ఉంటుంది (అనుకూలత ఉంటుంది) దురదృష్టవశాత్తూ భారతీయులు ఖరీదైన గుండె జబ్బులకు గురి కావడం జరుగుతున్నది.
*ప్రశ్న 26 :* అరటి పళ్ళు తింటే గుండె జబ్బు తగ్గుతుందా ?
*జవాబు* : నో.
*ప్రశ్న 27 :* గుండె జబ్బు వచ్చిన వ్యక్తి తనకు తనే ఏదైనా చేసుకోవచ్చా?
*జవాబు* : వెల్లకిలా పడుకోవాలి .
నాలుక కింద ఏదైనా బ్రాండ్ ఒక ఆస్ప్రిన్ మాత్ర పెట్టుకుని , అంబులెన్స్ వచ్చే వరకూ వేచి చూడకుండా దగ్గరలోని డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి.
అంబులెన్స్ రావడం త్వరగా జరగదు.
*ప్రశ్న 28 :* లో వైట్ బ్లడ్ సెల్స్ (తక్కువ తెల్ల రక్త కణాలు), హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం గుండె జబ్బులకు కారణాలు అవుతాయా?
*జవాబు :* కావు.
కానీ నార్మల్ హిమోగ్లోబిన్ వలన మీరు ఎక్సేర్సైజ్ చేసే కెపాసిటీ పెరుగుతుంది.
*ప్రశ్న 29 :* మా బిజీ షెడ్యుల్ వలన మేము ఎక్సర్‌సైజ్ చెయ్యడానికి టైం ఉండదు.
ఇంట్లో నడవడం,
మేడ మెట్లు ఎక్కడం వంటివి కూడా ఎక్సర్సైజ్ గా అనుకోవచ్చా?
*జవాబు* : తప్పకుండా ! ఒకే కుర్చీలో అరగంట కంటే ఎక్కువ కూర్చోకుండా ఈ కుర్చీ లో నుండి ఇంకో కుర్చీ లోకి మారి కూర్చోవడం కూడా చెయ్యవచ్చు.
*ప్రశ్న 30 :* షుగరుకూ, గుండె జబ్బులకూ సంబధం ఉందా?
*జవాబు* : ఉంది.
షుగర్ పేషెంట్ కి గుండె జబ్బులు వచ్చే అవకాశం మిగిలిన వారితో పోలిస్తే ఎక్కువ.
*ప్రశ్న 31* : గుండె ఆపరేషన్ తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?
*జవాబు* :
ఆహారం, ఎక్సేర్సైజ్ , మందులు సకాలం లో వేసుకోవడం , కొలెస్టరాల్ , బరువు , బిపీ లను కంట్రోల్ లో ఉంచుకోవడం.
*ప్రశ్న 32 :* రాత్రి షిఫ్ట్ లో పని చేసే వారికి, డే షిఫ్ట్ వారికంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందా?
*జవాబు* : నో .
*ప్రశ్న 33 :* Anti-hypertensive డ్రగ్స్ ఏమిటి?
*జవాబు* :
కొన్ని వందలు ఉన్నాయి .
మీకు అనుకూలమైనది మీ డాక్టర్ ఎంపిక చేసి చెబుతారు.
కానీ నా సలహా మందుల కన్నా ప్రాకృతిక విధానం లో బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంచుకోవడం (నడక).
ఆహారం విషయం లో జీవిత వైఖరులలో మార్పు తెచ్చుకోవడం.
*ప్రశ్న 34 :* డిస్పిరిన్ లేదా ఏదైనా తలనొప్పి మాత్రలు గుండె జబ్బులకు దోహదం చేస్తాయా ?
*జవాబు* : నో
.
*ప్రశ్న 35 :* ఆడవాళ్ళల్లో కంటే మగవాళ్ళల్లో గుండె జబ్బుల రేటు ఎక్కువ ఎందువలనా ?
*జవాబు* : ప్రకృతి ఆడ వాళ్ళను 45 సంవత్సరాల వరకూ రక్షిస్తూ ఉంటుంది ( ఇప్పడు వెలువడిన గణాంకాల ప్రకారం ఆడవాళ్ళల్లో ప్రస్తుతం ఈ రేటు మగవాళ్ళల్లో కన్నా ఎక్కువగా ఉంది)
*ఆఖరు ప్రశ్న :* గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా ?
*జవాబు* :
ఆరోగ్య వంత మైన ఆహారం తినండి.
ప్రతి రోజూ ఎక్సేర్సైజ్ చెయ్యండి.
జంక్ ఫుడ్ తినకండి.
స్మోకింగ్ మానండి
30 సంవత్సరాల తర్వాత ప్రతీ ఆరు నెలలకూ హెల్త్ చెక్ అప్ చేయించుకోండి ( రికమెండేడ్ )
మీకు ఇతరులకు మేలు చెయ్యాలి అనే హృదయం ఉంటె మీరు చదువుతున్న ఈ మెసేజ్ మీ మిత్రులకు, బందువులకు షేర్ చేయండి. Our friends circle
--((***))--
💐నిత్యం సంధ్యావందనంలో చెప్పే ప్రవర యొక్క అర్ధం💐
చతుస్సాగర పర్యంతం
( మానవ పరిభ్రమణానికి నలువైపులా గల మహాసముద్రాల అంచుల వరకూ ఆ చతుస్సాగరాలు
1ప్రశాంతోదధి
2ఆర్కోదధి
3అమలాంచోదధి
4 సింధోదధి
సముద్రాలు ఉన్నాయి
గో బ్రాహ్మణేభ్య శుభం భవతు
( సర్వాబీష్ట ప్రదాయిణి అగు.. గోవూ మరియు నిత్యం సంఘహితాన్నే అభిలషించే సద్బ్రాహ్మణుడు అతడి రూపంలో ప్రకాశించే వేదధర్మం.. సర్వే సర్వత్రా దిగ్విజయంగా.. శుభప్రదంగా వర్ధిల్లాలని కోరుకు
అంగీరస బార్హత్పస్య భారధ్వాజ
త్రయాఋషేయ ప్రవరాన్విత..
( మా వంశమునకూ.. మా గోత్రమునకూ మా నిత్యానుష్ట ధర్మశీలతకు మూలపురుషులైన మా ఋషివరేణ్యులకూ.. త్యాగే నైకే అమృతత్త్వ మానశుః అన్న వారి మహోన్నతమైన త్యాగనిష్ఠకు సాక్షీభూతుడన
భారధ్వాజ సగోత్రః
(మా గోత్రమునకూ..)
ఆపస్తంభ సూత్రః కృష్ణ యజుశ్శాఖాధ్యాయీ
( మా శాఖకూ.. అందలి శాస్త్ర మర్మంబులకు.. )
నాగరాజస్వామి నామధేయస్య
( కేవలం జన్మతహానే కాక.. ఉపనయనాది సంస్కారాలతో.. శాస్త్రపఠనంతో.. వేదాధ్యయనాది వైదిక క్రతువులతో.. 1. స్నానము 2. సంధ్య 3. జపము 4. హోమము 5. స్వాధ్యాయము 6. దేవ పూజ 7. ఆతిధ్యము 8. వైశ్యదేవము అనబడే అష్టకర్మలనూ క్రమంతప్పక నిర్వహిస్తూ.. త్రివిధాగ్నులు 1. కామాగ్ని 2. క్రోధాగ్ని 3. క్షుద్రాగ్ని.. అనే త్రివిధాగ్నులను అదుపులో (సమస్థితిలో) ఉంచుకొన్న వాడినై.. పేరుకు ముందు శ్రీ అనబడే.. ప్రకృతి స్వరూపమైన శక్తిస్వరూపాన్ని.. శుభప్రదమైన శ్రీకారాన్ని ధరించిన..
శిరిఆళ్వార్లు నాగరాజస్వామి అనబడే సుశ్రోత్రియుడనైన నేను.. జన్మప్రధాతలైన జననీజనకులముందు.. జ్ఞానప్రధాతలైన ఆచార్యులముందు.. జ్ఞానస్వరూపమైన వేదముముందు.. యావత్ ప్రపంచానికే మార్గదర్శకమైన వేదధర్మము ముందు.. నిరాకార నిర్గుణ అవ్యాజ పరంజ్యోతి స్వరూపుడైన పరమాత్మ ముందు..
అహంభో అభివాదయే..
( కేవలం నేనూ అన్నదిలేక.. సర్వం ఆ పరమాత్మ యొక్క అనుగ్రహ భాగ్యమేయన్న అహంకారభావ రహితుడనై.. నిగర్వినై.. త్రికరణ శుద్ధిగా ( మనసా, వాచా, కర్మణా) సాష్టాంగ పూర్వక (మానవశరీరంలోని అత్యంత ప్రాధాన్యమైన ఎనిమిది శరీరాంగములనూ శరణాగత హృదయంచే నేలపై వాల్చి సమర్పిస్తున్న) దండ ప్రణామమిదే.. అన్న పరిపూర్ణమైన ఆత్మపూర్వక వేదపూర్వక హృదయపూర్వక నమస్కార భావమే.. సశాస్త్రీయమైన ఈ ప్రవరలోని.. అర్ధం అంతరార్ధం పరమార్ధం కూడా.
సేకరణ:మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ మాష్టారు
--((***))--
*మాంద్యం మొదలైంది.... బీకేర్ఫుల్....*
ప్రియమైన ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు !!!! అప్రమత్తంగా ఉండండి ...
ఈసారి మన దేశంలో వచ్చింది హార్డ్ కోర్ మాంద్యం కావచ్చు, ఇది ఇప్పటికే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విషాన్ని వ్యాప్తి చేసింది. మొత్తం ఆర్థిక మార్కులో దాదాపు 13.67 శాతం పతనం నమోదైంది. విదేశీ మారకం, రెపో రేటులో కూడా సంక్షోభం ప్రారంభమైందని సూచిస్తున్నాయి. గత త్రైమాసికంలో ఇప్పటికే 17 లక్షల మంది ఉద్యోగులు ఉద్యోగం కోల్పోయారు. చెడు సమయాలకు సిద్ధం కండి... మీరు ఈ దశలను అనుసరించవచ్చు-
1. అదనపు ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నించండి.
2. వచ్చే 6 నెలల్లో రియల్ ఎస్టేట్ పథనం కాబోతోంది కావున ప్లాట్లు కొనుగోలు చేయడం ఆపండి.
3. ఇప్పుడు పెట్టుబడికి దూరంగా ఉండండి,
SIP (systamai investment plan), ట్రేడింగ్ మరియు NBFC (non banking finance company) ఏ మొత్తంలో నష్టాన్ని తెస్తాయో ఎవరికీ తెలియదు, ఎందుకంటే అన్నీ రికవరీపై ఆధారపడి ఉంటాయి.
4. ఇప్పుడు బంగారం కొనకండి, డిసెంబర్ నుండి ధర తగ్గే అవకాశం ఉంది.
5. మధ్యస్థమైన వ్యక్తులు, చిన్న వ్యాపారం ఎక్కువగా నష్టపోతుంది, కాబట్టి మీ బడ్జెట్‌ను కఠినతరం చేయండి.
6. సైట్లు ఇప్పటికే నష్టంలో ఉన్నందున ఆన్‌లైన్ కొనుగోలు ప్రమాదకరంగా ఉంటుంది.
7. మీ అన్ని డిజిటల్ లావాదేవీల డబ్బును (Paytm, Gpay etcetc) భౌతిక నిధిగా మార్చండి / వినియోగించండి.
8. మీ కుటుంబ ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వండి. అన్ని EMI లను మూసివేయడానికి ప్రయత్నించండి. గృహ రుణాలతో కొత్త ఫ్లాట్ కొనకండి... బ్యాంక్ లేదా ప్రైవేట్ ఫైనాన్స్‌తో కొత్త కార్లు కొనకండి.
9. అప్రమత్తంగా ఉండండి - రోడ్లపై స్నాచింగ్, రాబోయే పండుగ కాలం నుండి దోపిడీ పెరుగుతుంది.
10. ఇప్పటి నుండి మీ 6 నెలల ఖర్చులను కూడబెట్టుకోవడానికి ప్రయత్నించండి. నవంబర్, డిసెంబర్ 2019 నుండి పరిస్థితి అధ్వాన్నంగా ఉండవచ్చు. ఇది 2020 మధ్య వరకు కొనసాగవచ్చు.
దయచేసి అప్రమత్తంగా ఉండండి.
పై మెసేజ్ ని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి తెలియజేయండి.
--((***))--
ఆడవారు
తులసి చెట్టు వంటివారు.😍
మగవారు దురదగుంట చెట్టు వంటివారు.😏
సీన్ కట్ చేస్తే ..!
"బీర్బల్ ... దర్బారుకు ఆలస్యంగా ఎందుకు వచ్చావు?"
"ఆలంపనాహ్... జహా పనాహ్.... ఈ రోజు మా తులసీ మాత పూజ ప్రభూ....!! అమ్మకి పూజచేయడంలో ఆలస్యం అయిపోయింది."
అక్బర్ కి నవ్వొచ్చింది.
"తులసి... మాత....హ హ హ హ ... ఈ చిన్న మొక్క మీకు తల్లా?" అంటూ వికటాట్టహాసం చేశాడు.
"ఎవరక్కడ... ఒక తులసి చెట్టును తెప్పించండి"
పాదుషా తలచుకుంటే మొక్కలకు కొదవా?
సభలో అందరి ముందే తులసి మొక్కను చింపి పోగులు పోశాడు అక్బర్.
"చూశావా... నీ మాతను ఏం చేశానో..."
బీర్బల్ ఏమీ అనలేదు. "చిత్తం జహాపనాహ్" అన్నాడు.
మరుసటి రోజూ బీర్బల్ ఆలస్యంగా వచ్చాడు.
"ఈ రోజేమిటి బీర్బల్... మళ్లీ ఎందుకాలస్యం?"
"ప్రభూ నిన్న మా తల్లిగారి పూజ అయింది. ఇవాళ్ల తండ్రిగారి పూజ ప్రభూ..."
"మీ తండ్రి కూడా ఒక మొక్కేనా..."
"అవును ప్రభూ...."
"ఆ మొక్కని తీసుకురండి"
ఆ మొక్కని దర్బారులో పెట్టారు.
అక్బర్ "మీ అమ్మ పని పట్టాను. ఇక మీ అబ్బ పని పడ్తాను చూసుకో..." అంటూ ఆ మొక్కను చింపి పోగులు పోశాడు.
కాసేపటికి అక్బర్ కి దురద మొదలైంది. ముందు మర్యాదగా కనీ కనిపించనట్టు గోక్కున్నాడు.
తరువాత బరబరా గోక్కున్నాడు. బట్టలువిప్పి మరీ నేలపై పొర్లుతూ గోక్కోవడం మొదలుపెట్టడు.
"అమ్మోయ్... బాబోయ్... నాకేమైంది బీర్బల్ ...." అంటూ గావుకేకలు పెట్టాడు.
బీర్బల్ నెమ్మదిగా, తెచ్చిపెట్టుకున్న వినయంతో "జహాపనాహ్... మా తల్లి శాంత స్వభావురాలు. ఏమీచేయదు. కానీ మా తండ్రి అలాంటివాడు కాదు. ఆయనకు ముక్కుమీదే కోపం."
"ఎవరయ్యా ఈ తండ్రి... బాధ భరించలేకపోతున్నాను."
"ప్రభూ... తులసి మాకు తల్లి. దూలగొండి మాకు తండ్రి. దూలగొండిని కెలుక్కున్నారు మరి...." అన్నాడు బీర్బల్.
"ఏం చేయాలయ్యా... ఎలా తగ్గుతుందయ్యా ఈ దురద....?" అక్బర్ గారు నేలమీద పడి దొర్లుతున్నాడు.
"ప్రభూ దీనికి ఒకటే మార్గం. మా తండ్రి గారి కోపాన్ని మా తల్లి మాత్రమే శాంతింపచేయగలదు. కాబట్టి ఆమెకు మొక్కండి. తులసి ఆకుల రసాన్ని పూసుకొండి. దురద తగ్గుతుంది." అన్నాడు బీర్బల్.
అక్బర్ ఓ చేత్తో గోక్కుంటూనే రెండో చేత్తో తులసమ్మకు దణ్ణం పెట్టాడు.
ధర్మం గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకు ఇలాగే బుద్ధి చెప్పాలి.
🙏🙏🙏🙏🙏🙏
షేర్ చేయడం మరువకండి
మీ మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ మాష్టారు 🌹🌹🙏🙏🌹🌹🌹*మహాలయ పక్షాలు.సెప్టెంబర్ 14నుండిసెప్టెంబర్28సందర్భంగా*
🌹🌹🌹🙏🙏🌹🌹🌹
*🕉🙏🏻🚩మహాలయ పక్షాలు లేదా పితృ పక్షాలు*
*మహాభారతంలో దానశీలిగా* *పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం* *స్వర్గలోకం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గ మధ్యంలో ఆకలి - దప్పిక కలుగుతాయి.*
*ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని దాన్ని తాకడంతోనే ఆశ్చర్యంగా ఆ పండు బంగారపు ముద్దగా మారిపోయింది.*
🌹🦚🌹🦚🌹🦚🌹🦚
*ఆ చెట్టుకున్న పండ్లే కాదు మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది.*
*ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పిక యినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కూడా బంగారపు నీరుగా మారి పోయింది. ఆ తరువాత*
*స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా ఆకాశవాణి ఇలా పలికింది ''కర్ణా ! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు.*
*అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది " అని చెప్పగానే కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు.*
*నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి మాతా పితరులకు తర్పణాదులు వదిలి తిరిగి రమ్మన్నాడు.*
*ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు , బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణములు వదిలాడు. తిరిగి అమావాస్య నాడు స్వర్గానికెళ్లాడు.*
🦚🦚🌹🌹🦚🦚🌹🌹
*ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండి పోయింది, ఆకలి తీరింది.*
*కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే “ మహాలయపక్షము లేదా పితృ పక్షములు అని పేరు వచ్చింది.*
*ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.*
*అమావాస్య అను పేరుకు కూడా ఒక విశేషం ఉంది. అసలు దీనిపేరు మావస్యగా ఉండేది. మావస్య అనగా ప్రియురాలు లేదా ఆధీనురాలు అని అర్ధం.*
*పితృదేవతలు 7 గణములుగా ఉంటారు. వారికి ఒక పుత్రిక ఉంది. ఆమె పేరు “ అచ్చోద " . ఇలా ఉండగా పితృదేవతలు ఒక సరస్సును సృష్టిస్తారు. ఆ సరస్సుకు ఆమె పేరు పెడతారు. ఆమె ఒకనాడు ఆ సరస్సు దగ్గర తపస్సు చేసిన కారణంగా పితృదేవతలు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా ఆమె ఆ పితరులలో ఉన్న “ మావసుడు " అనే అతన్ని కామంతో కోరుకుంటుంది. దానితో ఆమె చేసిన అపరాధం వల్ల దేవత్వం పోతుంది. కానీ ఆ మావసుడు మాత్రం ఆమెను కోరుకోడు. అందువల్ల ఆమె మావసుడు దక్కనందువల్ల “ ఆమావస్య" గా అయింది.🕉🙏🏻🚩*
*వీటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి*.
*దయచేసి అందరు మీ గ్రూప్ ల లో షేర్ చేయండి.ప్రతిహిందువుకు తెలియ చెయ్యండి.*
🌹🌹🌹🙏🙏🌹🌹🌹
ఒకసారి చాలా పేదవాడు *బుద్దుడి* వద్దకి వచ్చాడు. అతను అడిగాడు..
*'నేను ఎందుకు పేదవాడను?*☄
*బుద్ధుడు* సమాధానం చెప్పాడు: మీరు ఎందుకు పేదవారు అంటే *మీరు ఎటువంటి ఔదార్యము కలిగి లేరు మరియు దాన ధర్మాలు చేయరు.*☄
నేను ఇతరులకు దానం చేయడానికి *నావద్ద ఏమున్నది?* అని ఆ పేదవాడు అడిగాడు. ☄
అప్పుడు *బుద్ధుడు* ఈ విధంగా చెప్పాడు
మీరు ఇతరులతో పంచుకోగల *ఐదు నిధులను*💰 కలిగివున్నారు.
మొదట *మీ ముఖం*👩🏼 ఉంది. మీరు ఇతరులతో *మీ ఆనందాలను (నవ్వులను) 😀పంచుకోవచ్చు ..* ఇది ఉచితం ... ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది ..
రెండవది *మీ కళ్ళు👀* మీకు ఉన్నాయి. మీరు *ప్రేమ మరియు శ్రద్ధతో ఇతరులను చూడవచ్చు ..* నిజం.. మీరు లక్షలాది మందిని ప్రభావితం చేయవచ్చు .. వాటిని మంచి అనుభూతిగా చేయండి ..
మూడవది *మీ నోరు👄* మీకు ఉంది. ఈ నోరుతో మీరు ఇతరులకు *మంచి విషయాలు చెప్పవచ్చు .. మంచి చర్చించండి ..* వాటిని విలువైనదిగా భావించండి .. ఆనందం మరియు సానుకూలత వ్యాప్తి చెందుతాయి ..
నాలుగవది మీకు *గుండె* 💗ఉంది. *మీ ప్రేమగల హృదయంతో* మీరు ఇతరుల ఆనందాన్ని కోరుకోవచ్చు .. ఇతరుల భావోద్వేగాలను అనుభూతి చెందవచ్చు.. వారి జీవితాలను తాకవచ్చు..
మీరు కలిగి ఉన్న చివరి సంపద మీ శరీరం ..🏋♀ *ఈ శరీరంతో మీరు ఇతరులకు అనేక మంచి పనులు చేయగలరు* ..👍అవసరమైనవారికి సహాయం చేయగలరు ..
సహాయం చెయ్యడానికి డబ్బు అవసరం లేదు ..
*ఒక చిన్న శ్రద్ధ ,సంజ్ఞలు జీవితాలను వెలిగించగలవు*.
భగవంతుడు మనకిచ్చిన జీవితం..
కలకానిదీ ! విలువైనదీ ! *సర్వోత్తమమైనదీ !*
ప్రతిక్షణం ఆనందంగా ఉంటూ, *పదిమందికి సహాయపడుతూ, జన్మను చరితార్థం చేసుకుందాం.*
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి