7, అక్టోబర్ 2019, సోమవారం

కధలు

  


"  ఋషులు చూపిన  భక్తి మార్గాలు

 1.  వేదా ధ్యయనం చేసిన పండితులు, జ్ఞానులు పరబ్రహ్మమును  ఉపాసించడమే " పర భక్తి". 
 2.  ఇష్ట దేవతలను ఉపాసించడం " అపర భక్తి " . 
 3.  యాత్రలు చేసి, దేవతా స్వరూపాలను ఆరాధించటం " భయ  భక్తి "
 4.  ఇష్ట దేవుని ప్రతిరూపాన్ని ఆరాధించడం " అన్వయ భక్తి "
 5.  ఎల్లాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా దేవుని ప్రేమించడం   "ఏకాంత భక్తి "
 6.  ఎల్లాంటి ఉద్వేగాలకు పోకుండా ప్రశాంతమైన ప్రార్ధన  "  శాంత భావ భక్తి " 
 7.  నేను నీకు దాసుడను అనే  చేసే ప్రార్ధనను  " దాస్య  భావ భక్తి "
 8.  దేవుణ్ణి ప్రియమిత్రునిగా భావించి చేసే  ప్రార్ధనను  " సఖ్య  భావ భక్తి "
 9.  భక్తులు భగవంతున్ని బిడ్డలుగా భావించి చేసే  ప్రార్ధనను  " వాత్సల్య భావ భక్తి "
 10.  భర్తే దేవునిగా భావించి  చేసే  ప్రార్ధనను  " కాంత  భావ భక్తి "
 11.  మనస్సును పూర్తిగా అర్పించి చేసే  ప్రార్ధనను  " మాధుర్య  భావ భక్తి "
 12.  భగవన్నామస్మరణను నిరంతరం ఒక పద్దతి ప్రకారం చేయడం" అబ్యాస భక్తి"
 13.  మంచి చెడులు వ్యత్యాసాలను గమనించి చేసే  ప్రార్ధనను  "వివేక భక్తి"
 14.  భగవంతుని దూషింస్తూ చేసే స్మరణను " విముఖ భక్తి "
 15.  ఎల్లప్పుడూ సత్యమార్గాన్న చేసే ప్రార్ధనను " సత్య  భక్తి "
 16.  దేవుని కళ్యాణాలు చేస్తూ ప్రార్దిమ్చడమే  " కల్యాణ భక్తి "
 17.  ప్రాణుల పట్ల అహింసను ప్రదర్సిస్తూ పరమను చూపే భక్తిని " అహింస భక్తి " 
 18.  సమాజానికి  చేతనైనంత దానం చేయటమే "దాన భక్తి "
             
  ప్రతి ఒక్కరు భక్తి  మార్గములో నడుస్తూ సమాజానికి, దేశానికి భారం కాకుండ, మనుష్యులు  " బ్రతికి- బ్రతికించుకుంటు" జీవించడమే  " నిజమైన భక్తి "

--((**))--

ప్రాంజలి ప్రభ. ఈ వారం కధ కాదు నిజం(1)
సేకరణ: మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

*ఇండియాలో ఎవ్వరికైనా తెలుసా :*

 *లిఫ్ట్ ఇవ్వటం నేరం.. ఫైన్ కట్టాల్సిందే*

 టైటిల్ చూసి షాక్ అయ్యారా.. నిజమే.. రాసే ముందే కూడా మేం షాక్ అయ్యాం. రాత్రి సమయంలో.. వర్షంలో.. లిఫ్ట్ అడిగిన వ్యక్తులను తన కారులో ఎక్కించుకున్న పాపానికి ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు.. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని చేతిలో చలానా పెట్టి.. కోర్టు మెట్లు ఎక్కించారు ఖాకీలు. అంతేనా.. మరోసారి ఇలా చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చారు.. ఎవరో అల్లాటప్పా వ్యక్తులకు.. కేసులు లేక పెట్టింది కాదు ఇది.. ఓ ఐటీ కంపెనీ ఓనర్ కు ఎదురైనా చేదు అనుభవం.. ఇప్పటి వరకు బైక్, కారు నడిపే వాహనదారుల్లో 99శాతం మందికి లిఫ్ట్ ఇవ్వటం నేరం అన్న సంగతి ఇండియాలో తెలియకపోవటం మరో విచిత్రం.. విశేషం… పూర్తి వివరాల్లోకి వెళితే.. నితిన్ నాయర్. ముంబైలో ఉంటాడు. ఐటీ కంపెనీలో పని చేస్తూ ఇటీవలే ఓ కొత్త కంపెనీ పెట్టుకున్నాడు. రోజూ మాదిరిగానే తన ఆఫీస్ నుంచి జూన్ 18వ తేదీ సాయంత్రం ఇంటికి వెళుతున్నాడు. ముంబైలోని ఐరోలి సర్కిల్ దగ్గరకు వచ్చాడు. అప్పటికే జోరు వాన.. ట్రాఫిక్ జామ్.. రోడ్లపై నీళ్లు.. ఇలాంటి సమయంలో డ్రైవింగ్ చేస్తున్న నితిన్ నాయర్ కు రోడ్డు పక్కన వర్షంలో ఇబ్బంది పడుతున్న ముగ్గురు వ్యక్తులు కంటపడ్డారు. వారు లిఫ్ట్ కోసం చూస్తున్నారు. వారి బాధను అర్ధం చేసుకున్న నితిన్ కారును ఆపాడు. ఎక్కడికి వెళ్లాలో తెలుసుకుని.. కారులో ఎక్కించుకున్నాడు. ఇదంతా కొంచెం దూరంలో చూస్తూ ఉన్న ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ గమనిస్తున్నాడు. లిఫ్ట్ అడిగిన వారిని నితిన్ కారులో ఎక్కించుకున్న వెంటనే కారు దగ్గరకు వచ్చేశాడు పోలీస్.

విషయం ఏంటని ట్రాఫిక్ పోలీస్ నితిన్ ను ప్రశ్నించారు. విషయం చెప్పాడు. అంతే చేతిలో రూ.1,500 చలానా పెట్టాడు. మైండ్ బ్లాంక్. ఎందుకు అన్నాడు. లిఫ్ట్ ఇస్తున్నందుకు అన్నాడు. లిఫ్ట్ ఇవ్వటం నేరం అన్న సంగతే తెలియని నితిన్.. ట్రాఫిక్ పోలీస్ ను మరోసారి గట్టిగా ప్రశ్నించాడు. సెక్షన్ 66/192 రూల్ ప్రకారం అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వటం నేరం.. రూ.1,500 చలానా కోర్టులో కట్టి.. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్లు అని వార్నింగ్ ఇచ్చి.. చేతిలో చలానా పెట్టి మరీ వెళ్లాడు. కారులో ఎక్కించుకున్న వారిని వారి వారి ప్రదేశాల్లో దింపి.. ఇంటికి వెళ్లాడు నితిన్. ఆ తర్వాత కోర్టుకి వెళ్లి జరిమానా కట్టాడు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకున్నాడు. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఓ రోజు అంతా టైం వేస్ట్ అయ్యింది అంటున్నాడు. అంతే కాదు.. తన 12 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవంలో ఇప్పటి వరకు ఇలాంటి రూల్ ఇందన్న సంగతి తెలియదని.. లిఫ్ట్ ఇచ్చేది అపరిచితులకే కదా అని అంటున్నాడు.
తనకు ఎదురైన అనుభవాన్ని ఫేస్ బుక్ ద్వారా తెలియజేసిన నితిన్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేపారు. లిఫ్ట్ ఇవ్వటం నేరమా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అతి చలానా చూసి అవాక్కవుతున్నారు. అవునా.. అవునా అని అందరూ చర్చించుకోవటం కనిపించింది.



--((***))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి