3, అక్టోబర్ 2019, గురువారం

పెద్దకథలు



Image may contain: 2 people, people standing

రచన.... #జలంధర
#సుధాకర్ కి చిన్నప్పట్నుంచీ కెమేరా అంటే పిచ్చి! కనిపించే అందాలన్నీ కెమేరాలో బంధించాలనీ, ఫోటోగ్రఫీలో మంచి పేరు తెచ్చుకోవాలనీ కోరిక. అయితే పరిస్థితులు అనుకూలించక అతను కెమేరాయే కొనుక్కోలేక పోయాడు. ఇప్పుడు పాతికేళ్ల వాడయ్యాడు. బొంబాయిలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఈమధ్యే మంచి ఖరీదైన కెమేరా ఒకటి కొన్నాడు.
నాలుగు రోజులు సెలవు చూసుకుని బొంబాయి మహానగరం నుంచి తమ ఊరైన సిరిపురం చేరాడు.
ఆరడుగుల అందమైన విగ్రహం, మంచి వర్చస్సు, ఉంగరాల జుట్టుతో ఉన్న సుధాకర్భుజాన కెమేరా తగిలించుకుని సిరిపురంలో దర్జాగా నడుస్తూ అక్కయ్య ఇంటికి నడుస్తున్నాడు. నగర జీవితంతో విసిగిపోయిన అతనికి ఆకుపచ్చ చీరకట్టుకున్న అందగత్తెలాంటి ఆ ఊరిలో పాదం మోపగానే ఏదో తెలియని ఆనందం లోలో ఉరకలు వేసింది. 

తను ఇచ్చిన చిక్కటి కాఫీ తాగుతూండగా , "ఇన్ని వేలు పోసి ఇప్పుడిది కొనకపోతే ఏమిటిరా?" అని మెల్లిగా మందలించింది అక్కయ్య. సుధాకర్ నవ్వుతూ, తనకి చిన్నప్పటినుంచీ ఉన్న కెమేరా, ఫోటోగ్రఫీ పిచ్చి గురించి మరోసారి చెప్పేడు. స్వతంత్రుడు, సంపాదనాపరుడూ అయిన తమ్ముడ్ని మరేమీ అనలేకపోయిందామె. కాసేపయ్యాకా , "సరే…మా ఫోటోలు తీయరా! నాదీ బావగారిదీ కలిపి ఒక్క ఫోటో కూడా లేదు" అంది అక్కయ్య. "తప్పకుండా అక్కయ్యా!" అని అక్కకీ, అలా అడిగిన చాలామందికి ప్రామిస్ లు చేశాడు సుధాకర్. ఇంతలో అతని మామయ్య కూతురు అనూరాధ వచ్చింది. “నీ ఫోటోలు తీద్దామనే తెచ్చాను కెమేరా!” అన్నాడామెతో సుధాకర్... అనూరాధ ఏమీ మాట్లాడకుండా హాయిగా నవ్వేసింది.

నీరెండలో తళుక్కున మెరిసిన ఆ నవ్వు, ఆమె ఎర్రరాయి ముక్కుపుడక అతణ్ణి ముగ్ధుణ్ణి చేశాయి. ‘ ఎలాగైనా ఈ అందం వేరు!’ అనుకున్నాడతను– బొంబాయిలో నీతా మెహతా గుర్తుకొచ్చి. జడలో కనకాంబరాలు, ఏ మాత్రం మాచింగ్ లేకుండా కట్టుకున్న ఆకుపచ్చ పరికిణీ, నీలం రంగు ఓణీ, ఎర్రరంగు జాకెట్టు వేసుకుని నూతి దగ్గర్నుంచి నీళ్లు తీసుకువస్తున్న అనూను అలాగే ఫోటో తీశాడు సుధాకర్. అలా అందంగా కనిపించిన ప్రతి మనిషినీ, దృశ్యాన్నీ ఫోటో తీస్తూ, 'తను ప్రతి ఏడూ చూసే ఈ ఊరిలో ఇన్ని అందాలున్నాయని కెమేరా పట్టుకుంటే కానీ అర్థం కాలేదే!' అనుకున్నాడు. పాలు తీసే పల్లెపడుచులు, రంగవల్లుల మధ్య బంతిపూల గొబ్బెమ్మలు, తాటాకులతో చేసిన దేముడి రథం అన్నీ అందంగానే కనిపించాయి సుధాకర్ కి!
సుధాకర్ ఊరంతా తిరుగుతూ రకరకాల ఫోటోలు తీస్తున్నాడు. కొబ్బరిచెట్ల చాటున సూర్యాస్తమయం దగ్గరనుంచీ, చిన్నారిపాపల బోసినవ్వుల వరకూ ఎన్నో ఫోటోలు తీశాడు. ‘ఫోటోగ్రఫీలో ప్రైజు వచ్చే దృశ్యాలు ఇక్కడెన్నో ఉన్నాయి’ అనుకుంటూ ఇల్లు జేరేసరికి, సగం నెరిసిన జుట్టుతో అడ్డదిడ్డంగా అలంకరించుకు వచ్చిన మునసబుగారి భార్య “నా ఫోటోలు తీయవూ బాబూ!” అని వయ్యారంగా అడిగేసరికి మతిపోయి చూశాడతను. “తప్పదు… మునసబుగారి భార్య!” అన్నట్టు సౌంజ్ఞ చేసిన అక్కయ్యని చూసి , “హతవిధీ” అనుకున్నాడు సుధాకర్.
ఊళ్ళో చాలామంది ఆడపిల్లలు సుధాకర్ ని అడిగి ఫోటోలు తీయించుకున్నారు. కానీ అతన్ని అడక్కుండా అతనిచేత ఫోటో తీయించుకోవాలని, సుధాకర్ కెమేరాతో మేడ మీదకు వచ్చినప్పుడల్లా అలంకరించుకుని, అవతల మేడమీద బట్టలారేసే నెపంతోనో, ఒడియాలు తీసే నెపంతోనో వచ్చి, చూపుల బాణాలు విసిరే కరణంగారి కొత్తకోడల్ని చూస్తే నవ్వొచ్చేది సుధాకర్ కి. “అబ్బ! ఏమిటో ఈ ఆడవాళ్ళు... ” అనుకునేవాడు.
ఆరోజు సాయంత్రం సుధాకర్ ఏదో పనిలో ఉండగా వాకిలికి కట్టిన తెర సందులోంచి తొంగిచూస్తూ , “ఏమండీ?” అంటూ ఓ బొంగురు గొంతు వినపడింది.” ఎవరదీ?” అన్నాడు సుధాకర్ గుమ్మంవైపు చూస్తూ. “నేనేనండి ! శ్యామలని , నా ఫొటో తీస్తారేమో అని అడుగుదామని వచ్చాను…..” అంటూ ఎదురుగా వచ్చి నిలబడింది ఆ వ్యక్తి. ఆ ఆకారాన్ని, ఆ గొంతుకను విని ఉలిక్కిపడ్డాడు సుధాకర్. నల్లటి చాయ, బక్కచిక్కిన శరీరం, లోతు బుగ్గలు, మెల్లకన్ను, బిగించి కట్టిన ఉంగరాల జుట్టు…. కరణంగారి అమ్మాయి శ్యామల. “ఖర్మరా బాబూ!” అనుకున్నాడు సుధాకర్. ఇలాంటి పిల్ల కూడా ఫోటో తీయించుకుంటుందని అతని ఊహకి తట్టలేదు. “మాట్టాడరేమండీ….? నేను ఫోటోకి బావుండననేగా! అందరూ అందంగా ఉంటారా ఎంటీ? నాకెన్నాళ్ళబట్టో ఫోటో తీయించుకోవాలని ఉంది. ‘నీ ముఖానికి అదొకటే తక్కువ’ అంటుంది మా అమ్మ. ఏమండీ నేను బావుండనా?” అంది. వెలిసిపోయిన వాయిలు ఓణీ వేలుకు ముడిపెడుతూ, మెల్లకన్నుతోనూ, భయంకరమైన గొంతుతోనూ మాట్లాడే శ్యామలని చూసి దడుసుకున్నంత పనైంది సుధాకర్ కి. “అబ్బెబ్బే... అదేంలేదు... తప్పకుండా తీస్తాను” అన్నాడతను తడబడుతూ. “ఎప్పుడు తీస్తారూ?” అంది సాగదీస్తూ. “ఎప్పుడేమిటి? ఎప్పుడైనా తీద్దాం…రేపు…లేకపోతే…” ఎవరైనా తనను చూస్తారేమో, నవ్వుతారేమో అనిపించి తత్తరపడ్డాడు సుధాకర్. “అయితే ఎల్లుండి తీయండి. సాయంత్రం వస్తానేం…ఎల్లుండి మంచిరోజు. ఏం?” అని అంటూన్న శ్యామలని చూసి నవ్వాలో ఏడవాలో అర్థంకాక, “అలాగే… అలాగే…” అంటూండగా అతని అక్క లోపలికి వచ్చింది. ‘హమ్మయ్య’ అనుకున్నాడు. “ఏమిటే శ్యామలా ఇలా వచ్చావు?” అంది సుధాకర్ అక్క నవ్వుతూ. ఆ పిల్లని చూడగానే ఎవరికైనా నవ్వూ, వేళాకోళం అన్నీ అనిపిస్తాయి. “ఏంలేదు పిన్నిగారూ! మీ సుధాకర్ ఫొటో తీస్తాడేమోనని..” అంటూ ఆపకుండా ఏదేదో శ్యామల మాట్లాడుతుంటే అక్కడినుంచి సుధాకర్ మెల్లగా దాటుకున్నాడు. 

ఆ రాత్రి భోజనాల దగ్గర మెల్లగా , ” ఏమిటక్కయ్యా ! ఆ అమ్మాయి..?” అన్నాడు సుధాకర్. ఎంత మర్చిపోదామన్నా ఆ అమ్మాయే గుర్తుకొస్తోందతనికి. “అది ముదివయసులో పుట్టిన పిల్లరా! ఎదుగూ బొదుగూ లేదు. పైగా అనాకారి. పోనీ కాస్త శుభ్రంగా ఉంటుందా అంటే…. ఆ తల్లికే లేదు శ్రద్ధ! వచ్చిన కొత్త కోడల్ని చూసి మురిసిపోవడమే సరిపోతుంది. సాయంత్రం అయ్యేసరికి అందరూ శుభ్రంగా తయారవుతారు కానీ ఈ పిల్లకి తలైనా దువ్వరు. పోనీ ఏ టానిక్కన్నా ఇవ్వరాదా వదినా అని చాలాసార్లు చెప్పేను. వినిపించుకోరు. ఆస్తి ఉందిగా చాలు అనుకుంటున్నారు. పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేటట్టుంటుంది. ఏం రాత రాసుందో ఆ పిల్లకి..” అంటూ అక్కయ్య చెప్పిన మాటలకి జాలేసింది సుధాకర్ కి. ఇక శ్యామల ఫోటో కోసం మావయ్య దగ్గరకొచ్చిందని తెలిసికొని అక్కయ్య పిల్లలు ఫకాల్న నవ్వేరు. “ఆ! దాని మొహానికి ఫొటో ఒకటే తక్కువ!” అంది అక్కయ్య కంచాలెత్తుతూ. 

మర్నాడు మామిడితోటలో సుధాకర్ని కలిసిన అనూ , “అయితే బావా! శ్యామల నిన్ను ఫోటో తియ్యమని అడిగిందా?” అంది నవ్వాపుకుంటూ. ఆమె వెనకాలున్న స్నేహ బృందం ఆశ్చర్యం ప్రకటించారు. అంతమంది ఆడపిల్లలు తనని అలా చూసేసరికి సుధాకర్ రెచ్చిపోయి, ఆ సంఘటనని వివరిస్తూ వాళ్ళని తెగ నవ్వించాడు. ఇంక అనూరాధ ఆ మర్నాడు శ్యామలని ప్రత్యేకంగా పిలిచి కూచోబెట్టి, “మా బావ నిన్ను ఫోటో తీస్తానన్నాడటగా…” అంటూ మొదలుపెట్టి, శ్యామలని వాగించి, వాగించి స్నేహితురాళ్ళతో కలిసి ఆనందించింది. ఆ తర్వాత తోటలో సుధాకర్ని కలిసి, “బావోయ్..! నీకో విషయం తెలుసా? నీకొక ఆరాధకురాలుంది ఈ ఊళ్ళో….” అంటూ ఫక్కుమని నవ్వింది. “ఎవరబ్బా..!” అని ఆలోచిస్తూ మెల్లగా ” నువ్వా?” అన్నాడు కొంటెగా సుధాకర్. “ఆశ..! నిన్నెవరు నమ్మార్లే? నవ్వులాట కాదు… నిజం! ఎవరో తెలుసా? ఊర్వశి శ్యామల!” అంది అనూ. ఉలిక్కిపడ్డాడు సుధాకర్. “అవును బావా! మేము నిన్ను గురించి ఉన్నవీ లేనివీ కల్పించి బాగా నమ్మేట్టు చెప్పేశాం. పిచ్చిది కదా..! నిజం అనుకుంది. ఇంక చూడు… నువ్వు రోజూ తననే చూస్తున్నావట! అసలు నువ్వే ఫోటో తీస్తాను శ్యామలా అని అడిగావట. తెగ చెప్పింది. నిజమా బావా?” అంది అనూ కళ్ళు చక్రాల్లా తిప్పుతూ. “ఛా.. నోర్ముయ్. అసలు ఆ అమ్మాయితో నేను..” అని అతను అంటుండగా, “నాకు తెలుసులే బావా..నిన్ను ఆట పట్టిద్దామని అన్నాను. జరిగింది మాకు తెలుసుగా…దాని మాటలు వినివిని ఒళ్ళు మండి, పూజారిగారి రాధ– శ్యామల నిన్ను ఫోటో తీయమని అడిగిన ఫార్సంతా నువ్వు నిన్న వర్ణించిన భాషలోనే దానికి చెప్పాం. ఇంక చూడు….దాని నల్లటి మొహం మరీ మాడిపోయింది! అక్కడినుంచీ పారిపోయిందనుకో!” అంది అనూ.

విషయం విన్న సుధాకర్ మనస్సు ఎందుకో కలుక్కుమంది. ‘పాపం ఏమనుకుందో..? పిచ్చిపిల్ల! తన గొప్ప ఉందని తృప్తి పరచుకోడానికి ఊహించుకున్న ఊహాలన్నీ అమాయకంగా బయటికి చెప్పేసింది కాబోలు ‘ అనుకున్నాడు. “అసలా పిల్లకి ఎన్నెళ్లుంటాయి అనూ…? నాలుగడుగులు కూడా ఉండదు” అన్నాడు సుధాకర్. “నా వయసే బావా…పద్దెనిమిది సంవత్సరాలు” అంది అనూ.
తరువాత రోజు మధ్యాహ్నం భోజనం చేసి, ముందురోజు సగం చదివిన నవల తెచ్చుకుందామని సుధాకర్ మేడ మీదకు వెళ్ళేడు. అవతలి మేడమీద ఎర్రటి ఎండలో, గోడకానుకుని కూర్చుని మోకాళ్ళలో తల దాచుకుని ఏడుస్తోంది శ్యామల. ఆశ్చర్యపోయి , “శ్యామలా!” అని పిలిచాడతను. తలెత్తి చూసి, “మీరా..? పొండి! నాతో మాట్లాడకండి” అంది బెక్కుతూ. “ఏం.. ఎందుకని? ఏమైందీ?” మెల్లిగా అడిగాడు. అతనికి తెలియకుండానే అతని గొంతు మృదువుగా మారిపోయింది. కాసేపు బ్రతిమాలించుకుని అసలు విషయం చెప్పింది శ్యామల. “నిన్న అనూ, దాని స్నేహితురాళ్ళు నన్ను గుళ్ళో ఎలా ఏడిపించారో తెలుసా? మీరు నాగురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేరట కదా! నేను ఫొటో తీయించుకుంటానని దానికెందుకు చెప్పేరు? ఇష్టం లేకపోతే అప్పుడే చెప్పాల్సింది. మా అమ్మ ‘ సిగ్గులేనిదానా….నీ మొహానికి ఫొటో ఒకటే తక్కువ. సిగ్గూ ఎగ్గూ లేకుండా పరాయి మొగాడ్ని అడుగుతావా?’ అని కొట్టింది. నేను ఫోటోకి అంత పనికిరాని దాన్నా?” అంటూ దుఃఖంతో అడుగుతున్న ఆ పిల్లని చూడగానే అతనికి ఆ అమ్మాయి అందవికారం కానీ, బొంగురుగొంతు కానీ కనపడలేదు. గుండె తరుక్కుపోయింది. వెంటనే” ఛీ! ఛీ.. అదేంలేదు శ్యామలా! అలా ఎవరన్నారు? ఇంకా ఇవాళ నువ్వు ఫోటో తీయించుకోడానికి రెడీ అవుతావనుకుంటున్నాను. వాళ్ల మొహం… వాళ్ల మాటలు పట్టించుకోకు. రేపు నీ ఫోటో చూడు…ఎంత బాగుంటుందో” అన్నాడు. శ్యామల నమ్మనట్టుగా తలెత్తి చూసింది. ” నిజం! సాయంత్రం మరి రెడీగా ఉంటావా? పోయి మొహం కడుక్కుని అన్నం తిను.. వెళ్లు” సుధాకర్ మళ్ళీ అన్నాడు అనునయంగా. మెల్లగా లేచి, పరికిణీతో ముఖం తుడుచుకుని వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్ళిపోయింది శ్యామల. ఆమె వెళ్ళిపోయాకా సుధాకర్ మేడదిగి వెళ్తూ , ” అక్కరలేని జంజాటం కానీ పెట్టుకోలేదు కదా” అనుకున్నాడు.
ఆ సాయంత్రం ” ఏవండోయ్..” అంటూ వచ్చింది శ్యామల. ఉలిక్కిపడి లేచాడు సుధాకర్. ” నేనేనండీ! మా ఇంట్లో అందరూ పనుల్లో ఉన్నారు. ఇక్కడ మీ అక్కా వాళ్ళూ మామయ్యగారింటికి వెళ్ళేరు. మరి నేను తయారవ్వనా? నా ఫోటో తీస్తారా?” అంది. ఆ గొంతులో ఆశ, ఆ వికృతమైన ఆకారం చూసి ఏమీ అనలేక “ఊ..” అని ‘ఖర్మరా బాబూ’ అనుకుంటూ కెమేరా తీసుకునిమేడెక్కాడు సుధాకర్. అంత ఖరీదైన కలర్ ఫిల్మ్ శ్యామల మీద దండగ చెయ్యడం అతనికి ఏమాత్రమూ ఇష్టం లేదు. ‘ ఊరికే క్లిక్ మనిపిస్తే సరి! నమ్మేస్తుంది…. పిచ్చిది’ అనుకున్నాడు. ఆ ఫోటో తీసేదాకా అనూ బృందం రాకుండా చూడమని దేముడ్ని ప్రార్థించాడు.

శ్యామల వచ్చింది. ఆమె అలంకరణని చూసి సుధాకర్ అవాక్కయ్యాడు.

ముదురు ఎరుపు రంగు పరికిణీ, కనకాంబరం రంగు ఓణీ, లూజుగా ఉన్న పట్టు జాకెట్టు…. వాళ్ళమ్మది కాబోలు! మెళ్ళో పిచ్చి నగలు, చేతికి నానా రంగుల గాజులు, ముఖానికి అరంగుళం ఎత్తున పౌడరు, కళ్ళు మూసుకుపోయేలా కాటుక. ఎర్రటి అమ్మవారి బొట్టు!” బావున్నానా అండీ?” అంటూ నవ్వేసరికి, సుధాకర్ కి కెమేరా కింద కొట్టి పారిపోవాలనిపించింది. “ఏం… మాట్లాడరేం?… బాగాలేనాండీ…ఫోటో తీయరా?” అంది జాలిగా, సుధాకర్ కి మధ్యాహ్నం ఏడుస్తున్న శ్యామల గుర్తుకొచ్చింది. సుధాకర్ అటూ ఇటూ చూశాడు. “నేనెవరికీ చెప్పను లెండి…ఒట్టు” ఆశగా అంటూన్న శ్యామల గొంతు వినగానే… ” ఛా..ఛా.. అదేంలేదు. అదిగో ఆ పిట్టగోడనానుకుని నించో..” అని తనకి తోచిన ఐడియా చెప్పి ఫోటో తీశాడు సుధాకర్. ఆ తర్వాత కెమేరాలో రీలు తిప్పుతున్న అతన్ని చూస్తూ…”ఏదండీ ఫొటో!” అంది ఆశగా.”ఇప్పుడే రాదు. మా ఊరు వెళ్ళేకా కడిగించి తరవాత పంపుతాలే. సరే.. నువ్వెళ్లు ఇంక..” అన్నాడు వెనక్కి తిరుగుతూ. అంతలో ” ఏమండీ…” అంది శ్యామల. అతను ఏమిటన్నట్టు వెనక్కి చూశాడు. ” అందర్నీ ఫొటో తీస్తారు…మీరు తీయించుకోరా? మీరు ఆ ఫోటోలో ఎంత అందంగా ఉంటారో తెలుసా!” ఆ మాటలకు అదిరిపోయాడు సుధాకర్. ఇంతవరకూ కెమేరా కొన్న తర్వాత ఫోటోలు తీయించుకునే వాళ్ళే కానీ, తన గురించి ఆలోచించిన వాళ్ళు లేరు. ఏదో చెప్పాలనుకున్నాడు. ఇంతలో “శ్యామలా!” అని ఆమె తల్లి పిలవడంతో ఒక్కసారిగా పరుగెత్తింది. ఆమె పట్టీల చప్పుడు వింటూకాసేపు అలాగే నిలబడి, మెల్లగా కిందకు వచ్చేశాడు సుధాకర్. ఆ తరువాత రెండు రోజులు పోయాకా అక్కయ్య వాళ్ళతోటీ, అనూ వాళ్ళతోటీ కలిసి వనభోజనాలూ వగైరా చేస్తూ సరదాగా గడిపేకా, మూడో రోజు బండెక్కి స్టేషనుకి వెడుతున్న సుధాకర్ కి, కరణంగారి వాకిట్లో తారాడుతున్న శ్యామల నీడ స్పష్టంగా కనిపించింది!

సుధాకర్ బొంబాయి వెళ్ళి నెల రోజులు గడిచాయి. ఆరోజే ఫోటోలు ప్రింటయి వచ్చాయి. కవరు తీసి చూద్దామనుకుంటూ, ఆ రోజు వచ్చిన పోస్టు ముందు చూశాడు. అనూ దగ్గరనుంచి ఉత్తరం వచ్చింది..విప్పి చదువుతున్నాడు. ” బావా! నీకీ సంగతి తెలిసిందా..?కరణంగారి శ్యామల చచ్చిపోయింది! ఏదో డిఫ్టీరియాట పాపం! ఇరవై నాలుగు గంటల్లో ప్రాణం పోయింది. అది పోయినందుకు వాళ్ళింట్లో ఎవరికీ విచారం లేదనుకో… అన్నట్టు పోయేముందు నన్ను పిలిచి, ” మీ బావను నా ఫొటో అడుగు” అని రాసి చూపించింది. 

దానికి నువ్వు ఫోటో తీశావా? మాకెవరికీ చెప్పలేదేం బావా? పాపం అమాయకురాలు…” ఇలా సాగిపోయింది ఆ ఉత్తరం. 

ఆ ఉత్తరం చూడగానే అతనికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఫొటోల కవరు విప్పి ఒక్కొక్కటీ చూడసాగాడు. చూస్తూ, శ్యామల ఫోటో దగ్గర ఆగిపోయాడు. చాలా క్లియర్ గా వచ్చింది ఆ ఫోటో. “ఏమండీ..నా ఫొటో బాగుందా?” అని ఎవరో అడిగినట్టు అనిపించిందతనికి. 

అలా ఆ ఫోటో చూస్తూ చాలాసేపు ఉండిపోయాడు.

కొన్నాళ్ళు గడిచాయి. అది ఒక ఫోటో ఎగ్జిబిషన్! 

అక్కడ కొద్ది దూరంలో ఒక స్తంభానికి ఆనుకుని చేతులు కట్టుకుని నిలబడి, అక్కడివాళ్ళ మాటలు వింటున్నాడు సుధాకర్. 

“ఇంత అందవికారమైన అమ్మాయి ఫోటోకి ప్రైజ్ ఎలా వచ్చిందా అని చూస్తున్నావా? 

ఆ ఫోటో పరిశీలించి చూడు. అందులో ఏం కనబడుతోంది?– లైఫ్…. జీవితం! 

జీవితం మీద ఆశ! 

ఆ అలంకరణ, ఆ శ్రద్ధ చూడు….అదొక విచిత్రమైన అనుభూతి. 
ఆ కళ్ళు…..ముఖ్యంగా ఆ కళ్ళు చూడు. ఎంత స్త్రీత్వం? 
వాటి నిండా ఎంత కోరిక? 
ఎంతో ఇష్టమైన వ్యక్తినెవర్నో ఎంత ఆరాధనతో చూస్తోందో చూడు ఆ పిల్ల! అందుకే అన్నారు ‘ కెమేరా ఐ’ అని”. అన్నాడు ఒకాయన. 
”అవును..జీవితంలో మామూలుగా ఉండే వాటిని కెమేరా అద్భుతంగా కనిపెడుతుంది. 
ఏం ఫోటో అండీ! ఊరికే ఇచ్చారుటండీ... బహుమతి?!” అంటూ రెండో అతను వ్యాఖ్యానించాడు, ఆ మాటలు వింటూ, తదేకంగా ఆ శ్యామల ఫోటో వంకే చూస్తూ ఉండిపోయాడు సుధాకర్.

-------------------------------------------------------

మద్రాసులో డాక్టరు గాలి బాల సుందరరావు గారని– ప్రముఖ నటులు, రంగస్థల పోషకులు, రచయిత ఒకాయన ఉండేవారు.

వైద్యులుగా కన్నా నాటక రంగంలో ఆయన సుస్థిరమైన స్థానాన్ని సంపాదించారు. అదిగో….వారి కుమార్తె ఈ *లక్ష్మీ కామేశ్వరీ ‘జలంధర‘*. 

ప్రసిద్ధ నటులు చంద్రమోహన్ ఈమె భర్త. అలాగే తన సాహితీ సృజనతో ‘లత సాహిత్యం‘ అని ముద్ర వేయించుకున్న ప్రఖ్యాత రచయిత్రి తెన్నేటి హేమలత ఈమెకు అత్తయ్య అవుతుంది.

నిజజీవితంలో ఎదురయ్యే అనేక సంఘటనలను కథలుగా మలచి, తారసపడే వ్యక్తులను పాత్రలుగా చేసి ఈమె కథలు రాశారు. శ్రీమతి జలంధర తన రచనలకి అనేక పురస్కారాలు అందుకున్నారు. ఆమె నవల ” పున్నాగ పూలు“ మంచి గుర్తింపు పొందింది. ఇక కథల విషయానికి వస్తే , ‘ అగ్నిపుష్పం‘ , ‘ఉత్తరవాహిని‘ , ‘గడ్డిపూలు‘, ‘ ఎర్ర మందారాలు‘, ‘దీప కళిక‘ , ‘ నర్తకి‘ , ‘ మిథ్యాబింబాలు‘, ‘ నల్ల బట్టలు‘ మొదలైన అనేక కథలు రాశారు.

🙏


(కథ రచనా కాలం 1971)
#పీర్ల కోనేరు ఊరికి నడిబొడ్డులో ఉంది.
రోజు రోజుకీ ఆ కోనేరు గట్టు– మోతుబరుల కార్ఖానాగా మారిపోతోంది. గట్టు దిగువున చెరువులో చేపలూ, గట్టువార పేవుమెంటు మీద తాడూ బొంగరం లేక, దిక్కూమొక్కూ లేని జీవులూ గిలగిల తన్నుకుంటూంటాయి. బికార్లూ, ఫకీర్లూ, అవిటి వాళ్లూ, కుంటీ గుడ్డీ, కుష్ఠు కునిష్టూ– ఇలా అందరూ అక్కడే కాపురం.
*నడివీధిలో గోనె పరదాలు దించుకుని, పురుళ్లూ- పుణ్యాలూ, స్నానాలూ-పానాలూ, జోలలూ-గోలలూ.. అన్నీ ఆ పేవుమెంటు మీదనే! చిలక జోస్యాలూ అక్కడే, ‘చిలక’తో సరసాలూ, విరసాలూ అక్కడే! ప్రణయాలూ, ప్రళయాలూ, కుయుక్తులూ, కుతంత్రాలూ, బతుకూ చిదుగూ…అంతా… అన్నీ అక్కడే!!*
ఆ ఊళ్ళో దేవుడి రథోత్సవం బాగా జరుగుతుంది. తను ముచ్చటగా సృష్టించిన లోకం ఎలా ఉందో చూద్దామని గుడి నుంచి సంచారానికి బయలుదేరిన జగన్నాథుడు రథం మీద పీర్ల కోనేరుకి అవతల ఉన్న గుజ్జనగూళ్లకి చేరుకున్నాడు. అక్కడ కొన్నాళ్ళుంటాడు.
జగ్గడు కూర్చున్న నేలబండిని నాగన్న తోసుకొస్తున్నాడు. 

“తోయ్యవోయన్నా..! తొయ్యి! ఎండ సిరసిరలాడతంది. ఈపు మాడిపోతంది” అంటూ తన మొండి చేతులెత్తి జగ్గడు నాగన్నని తొందర పెట్టాడు. 

“గుమ్మటంనాగ కూకున్నవు….. నీకేటి అలుపా సొలుపా? తోస్తన్నానా? ఎండ మండిపోతంది.. పేనం సాలొస్తంది”. అని ఈసడించుకుంటూ, బండి పక్కకి తోసి, ఆరోజు ముష్టి ఎంత పోగైందా అని మొలలో చిల్లర తీసి లెక్కపెట్టుకుంటున్నాడు నాగన్న. 

“ఇసుగెందుకులే..? సెరువుగట్టుకాడి కెళ్ళి లెక్క సూసుకుందాంలే. సాదువొచ్చి ఎల్లిపోనాడంటే ఇయ్యాలా పస్తే మనకి… పద పద” అన్నాడు జగ్గడు.


నాగన్న బండి లాగుతున్నాడు. బిచ్చగాళ్ళందరూ ఎండ ముదిరేదాకా ఊళ్ళో అడుక్కుని, కోనేటి గట్టు చేరుకుని చెట్టునీడ కోసం కుమ్ములాడుకుంటూంటారు. ఆ పూట పోగేసుకున్న డబ్బులు అన్నం పెడతాయా, పెట్టవా అని దిగాలుపడి లెక్కలు పెట్టుకుంటారు.

గుడి దగ్గర దొరికిన అరటిపళ్ళు ఒకటీ ఒకటీ బండి తోస్తూ మింగుతున్నాడు నాగన్న. కోనేటిగట్టు దగ్గరవుతోంది. సమయం పన్నెండు అయినట్టు పడవల కంపెనీ సైరను మోగింది. ముష్టివాళ్లు తుళ్ళిపడి కుండలట్టుకుని అన్నం కెరడు కోసం చెరువుగట్టు చేరుకుంటున్నారు. 

“నాకూ ఓ పండెట్టన్నా..!” అన్నాడు జగ్గడు నాగన్న వేపు చూస్తూ. 

“ఎన్ని దొరికినాయనీ ఎట్టీడానికి?” అంటూ ఉన్న అరటిపండు గుటుక్కున మింగేసి, తొక్క జగ్గడు మొహాన కొట్టేడు నాగన్న. 

“ఓర్నీ అన్నాయం కాలిపోనూ.! తొక్క పెడతావూ? నన్ను సూసే కదంటయ్యా… ఎవురు దరమం సేసినా? ” అన్నాడు జగ్గడు. 

“ఆ… ఆ…నిన్ను సూసే” అంటూ చెరువుగట్టు వేపు చూశాడు నాగన్న.
గణగణమంటూ గంటల మోత దగ్గరైంది. పాదాల దాకా కాషాయ బట్టలు వేసుకుని, మొహాన విభూతి రేఖలు దిద్దుకుని మెడలో రుద్రాక్షలు సద్దుకుంటూ, తళతళలాడే కాశీ కావిడి భుజాన్నేసుకుని, గిన్నెలనిండా అన్నంతో చెరువుగట్టు మీద ప్రత్యక్షమయ్యేడు సాధువుబాబు! అంతే.. వెంటనే బండిని అడ్డదిడ్డంగా తోసిపారేసి సాధువు దగ్గరకి పరుగెత్తిపోయాడు నాగన్న. నోట మాటరాక బండిమీద కూలబడిపోయాడు జగ్గడు.
కూలీనాలీ చేసుకుని ఉన్న ఊళ్ళో ఒంటిగాడైనా బాగానే బతికాడు జగ్గడు. కానీ ఈ మాయదారి ‘పెద్దరోగం’ వచ్చి మూలబడిపోయాడు. ఊళ్ళో దత్తుడు జాలిపడి నాలుగు చెక్కలూ, చక్రాలూ అతికి ఓ బండి తయారు చేయించి, “ఎల్లరా జగ్గా!…. పట్నం పో….ఇక్కడ నిన్నెవరూ చేరనియ్యరు” అన్నాడు. “పున్నాత్ముడు” అనుకున్నాడు జగ్గడు ఆ పాత రోజులు గుర్తుకొచ్చి. అసలు నిన్న మొన్నటివరకూ సీతాలే తోసేది బండి. ఇద్దరూ కలిసి అడుక్కుంటూ, దారినపోయే వాళ్ల మనసు కరిగించి, పైసలు సంపాదించుకుని హాయిగా గడిపేవారు. ఆ నాగన్నగాడు చేరినతర్వాతే అంతా తారుమారైపోయింది. చెరువుగట్టు మీద సాధువు చుట్టూ గుమిగూడిన గుంపులో సీతాలు ఉందేమోనని మొండి చేతులతో నేలమీద బండి తోసుకుంటూ, మెల్లగా గట్టు చేరుకున్నాడు జగ్గడు. 
“పాత బాకీలన్నీ ముందు తీర్చండి. పావలాకాసెడితేనే ముద్ద సేతికొస్తది. మొండి సేతులతో వస్తే నాబంనేదు”. జగ్గడికేసి ఓరగా చూస్తూ, చుట్టూ జేరిన వాళ్ళని చెదరగొడుతూ అంటున్నాడు సాధువు. 
“బాబూ! నువ్వు దయచూడాలి. నేకపోతే చచ్చూరుకుంతాం. బాబ్బాబు!” అంటూ బతిమాలుకుంటున్నాడు ఓ ముసలాడు. 
“నన్నేటి సెయ్యమంటావయ్యా? ఎంతకని తిరగనూ? ఎక్కే గుమ్మం, దిగే గుమ్మవే గానీ… ఓయమ్మా పిడికెడు మెతుకులు రాల్చదు. పైపెచ్చు నానేదో ముష్టికొచ్చినట్టు కుక్కలా తరిమి, ధడేల్మని తలుపులేసేసుకుంటారు. మా సెడ్డ సిరాగ్గుంది. సీ..! సాదువులంటే బొత్తిగా బయమూ నేదూ… బక్తీ నేదు. మాయిదారి కాలం!” అంటూ కాలాన్నీ, లోకాన్నీ ఇల్లాళ్లనీ దుమ్మెత్తి పోస్తున్నాడు సాధువు– ముసలాడికి అరువు ఇవ్వడం ఇష్టంలేక! 
సీతాలు కోసం చూశాడు జగ్గడు. “సాదువు బాబూ!” అని పిలిచాడు. 
“ఏం జగ్గన్నా!… ఏటిలాగొచ్చినవ్? దారి గానీ తప్పావా?” అప్పుడే జగ్గడ్ని చూసినట్టు మొహంపెట్టి అడిగాడు సాదువు. 
“మా సీతాలగుపడ్డదా?” అన్నాడు జగ్గడు. 
“సంసారాలెట్టినోల్లు…మా కాడికెందుకొస్తారయ్యా?…మీ గెంజి మీరే కాసుకుంటన్నారంటగా? అహ… ఇన్నాన్లే!” ఎత్తిపొడుపుగా అన్నాడు సాదువు. 
“దిక్కుమాలినోల్లం బాబూ..! మాతో ఏటి మీకు? ఉన్నరోజు ఇంత ఉడకేసుకుంటం… లేన్నాడు ముద్దకోసం మీ కాడికే ఎగబడతాం” అన్నాడు చిన్న మొహం చేసుకుని. ‘సీతాలు రానేదా? అయితే గెంజి కాసుంటది.’ అనుకుంటూ నేలమీద చేత్తో తోసుకుంటూ ఎదర పేవ్ మెంటు దగ్గరకి వెళ్ళిపోయాడు జగ్గడు. 
“ఇదిగో జగ్గన్నా… సెబుతున్నానినుకో… పాడైపోతావు. సంసారమేటి నీకు? ఆశ్శరమానికి అడ్డు రామోకు. మాకు కోపం తెప్పించకు. మసైపోతావు. కానీ, అద్దనా సదివించుకుని… అన్నం తిని పున్నెం సేసుకో” అని పాఠం చెప్పాడు సాధువు వెళ్ళిపోతున్న జగ్గడికి.
అనాథల కోసం అంటూ ఊరంతా కాశీ కావిడి తిప్పి, అన్నం సేకరించి అనాథలకే అమ్ముకుంటున్నాడు సాధువు! తన మొండి బతుకునీ, అవుకు తనాన్నీ దారినపోయే నలుగురికీ చూపించి, తన దైన్యాన్ని ఎరబెట్టి, కాళ్ళకి అడ్డుపడి, గుండె కరిగించి, జోలిపట్టి దొరికిందంతా తనకేమీ పెట్టకుండా దిగమింగుతున్నాడు నాగన్న! భగ్గున మండిపోయాడు జగ్గడు. ఏమీ చెయ్యలేక తన నిస్సహాయతను తానే నిందించుకున్నాడు. పేవుమెంటు మీద ఓ వారకి బండి తోసుకుంటూ వచ్చి ఆప్యాయంగా, “సీతాలూ!” అని పిలిచాడు. 
“ఏం?” అంటూ ముటముటలాడుతూ గోనె పరదా ఎత్తుకుని వచ్చింది సీతాలు. 
“గెంజి కాసినావేటే?…నీకోసం ఎయ్యి కల్లెట్టి సూసినాను సాదువుకాడ” అన్నాడు జగ్గడు. 
“ఏటెట్టి కాయనూ?…దొరికిన డబ్బులేయీ? ఒట్టుకురా..” అంది సీతాలు. 
“డబ్బులన్నీ నాగన్న కాడున్నాయి… ముందల గెంజెయ్యే..కడుపు మండిపోతాంది” అన్నాడు జగ్గడు. 
“ఎంతేటి?” అందామె. 
“ఏవో… నాకేటెరిక?… ఆడే ఏరతన్నడు. ఆడే యజిమాని. 
“ఏడాడు? ఎక్కడ పెత్తనాలికెల్లినాడు?” అంటూ విసుగ్గా, ఓ సీనారేకు డబ్బాలో ఇంత గెంజి పోసి, ఇంత ఉప్పుకల్లేసి జగ్గడి చేతిలో ఎత్తి కుదేసింది సీతాలు. 
“కుక్క కడీసినట్టు… ఆ ఈసడింపేటే?… మిరపకాయేనా, ఉల్లిరెక్కేనా అడేయ్యి” అన్నాడు బాధగా జగ్గడు. 
“మా రాజుగోరు కాదూ?.. నంజు కావాలంట… సిప్ప మొకమోడికి..” అంటూ ఓ పచ్చిమిరపకాయ తుంపి పడేసి లోపలికి పోయింది సీతాలు. గుండె కలుక్కుమంది జగ్గడికి. ఉబికిన కన్నీళ్లు జలజల రాలేయి. గంజి గుక్క దిగలేదు…..ఉప్పు కశం!
పదేళ్ల కిందట– ఆ రోజు అడుక్కుని చెరువుగట్టు చేరుకున్నాడు జగ్గడు. అక్కడ దీనాతిదీనంగా ఏడుస్తూ కనిపించింది సీతాలు. వయసులో ఉందని లేవదీసుకొచ్చిన ఒక జేబులు కొట్టే గుంటడు.. మూడు రోజులపాటు సీతాలుతో కాపురంచేసి, తెల్లారేసరికి పక్కనున్న యానాది గుంటతో ఉడాయించేశాడు. రెక్కలు తెగిన పిట్టలా గిలగిలా తన్నుకుంటోంది సీతాలు. జగ్గడు జాలిపడి అన్నం కెరడూ, ఓ అరటిపండు ఇచ్చి వివరాలు కనుక్కున్నాడు. తనది సింహాచలం దగ్గర అడివివరమనీ, అమ్మా నాన్నా చిన్నప్పుడే పోయారనీ, తన గుడ్డి తాత- అప్పన్నబాబు కొండమీద అడుక్కుంటూ తనని పెంచాడనీ చెప్పింది సీతాలు. ఇప్పుడీడు తనని లేవతీసుకొచ్చి దగా చేసేడనీ ఏడిచింది.
“మరయితే… నాతో తోడుండిపోతావేటి?” అని నసిగాడు జగ్గడు. అప్పటికి అతనికి రోగం అంతగా ముదరలేదు. ఇంకా పుష్టిగానే ఉన్నాడు. కాళ్లూ, వేళ్ళూ మొండి పడలేదు. సీతాలు దిక్కులు చూస్తోంది. 
“ఏటంటవూ?” అన్నాడు జగ్గడు. 
‘నన్నెవడు సేరదీస్తడూ?’ అని తనలో అనుకుని, “గెంజోస్తే సాలు… ఎక్కడైనా ఒకటే..” అంది సీతాలు. 
“సెబాసు…నువ్వు నా బండి తొయ్యి…ఇద్దరం కలిసి అడుక్కుందాం. కానీయో, పరకో కూడదీసుకుని గట్టుమీదో, చెట్టు నీడనో పడుందాం” అన్నాడు జగ్గడు.
అలాగే ఇంత కాలం హాయిగా గడిపారు ఇద్దరూ. నడివీధిలో కాపరమైనా కలిసిమెలిసి కమ్మగా, లోకం మాటుమణిగిన వేళ వెచ్చగా కాపురం చేశారు. ఏరోజు డబ్బులు ఆరోజు చూసుకుని మురిసిపోయేది సీతాలు. ఇదిగో ఇప్పుడు నాగన్నగాడు ప్రవేశించాడు. సీతాలు మారిపోయింది. ఇంక ఊరుకోకూడదు అనుకున్నాడు జగ్గడు. 
“సీతాలూ!..” అని గావుకేక పెట్టాడు జగ్గడు. 
“ఎందుకలా బొబ్బలెడతావూ… గొడ్డునాగ?” అంటూ బయటికి వచ్చింది సీతాలు. 
“గొడ్డునాగే అగుపడతానే… నంజా!” అన్నాడు జగ్గడు కళ్లెర్రజేసి. 
“నంజా గింజా అంటన్నవు….కుష్టి సచ్చినోడా! కన్నోడివా, కట్టుకున్నోడివా?” బావురుపిల్లిలా తిరగబడింది సీతాలు. 
“సేర దీసినోడినే…అట్టే పేలమాక… నోరుమూసుకుని ఇను.. ఇయ్యాల్టి నుండి బండి నువ్వే తోయ్యాల!” అన్నాడు జగ్గడు. 
“నాన్తొయ్యలేను….నువ్వే సూసుకో..” అంది సీతాలు. 
“సూసుకుంటాను…సూసుకుంటాను. ముందల ఆ డబ్బుల డబ్బీ ఇక్కడెట్టి మరీ సెప్పు కబుర్లు” అన్నాడు 
“ఏ డబ్బీ?” అంది సీతాలు. 
“పదేళ్లబట్టి నా కడుపు మాడ్చి…. కూడబెడతన్న డబ్బీయే… ఎరగవేటి?” అన్నాడు గట్టిగా. ఇంతలో నాగన్న అక్కడికి వచ్చాడు. 
“తిండో..? ఏటి మిగిలిపోంది?” పేచీలోకి దిగుతూ అంది సీతాలు. 
“నా నెరగననుకోకు….అంతా మిగులే..” అన్నాడు జగ్గడు , నాగన్నకేసి గుర్రుగా చూస్తూ! 
“ఏటి మిగులుద్దయ్యా?..ఆడకూతుర్ని సేసి సతాయిత్తన్నావు?” కలుగచేసుకుంటూ అన్నాడు నాగన్న. 
“మా ఇద్దరి మద్దికీ రాక…మాట దక్కదు” అరిచాడు జగ్గడు. 
ఈ గోలకి చుట్టుపక్కల ముష్టి వాళ్ళంతా చేరి , నాగన్నకి చీవాట్లు పెట్టి, అక్కడినుంచి పొమ్మన్నారు. తెల్లబోయిన నాగన్నకి కళ్ళతోనే సైగ చేసింది సీతాలు. నాగన్న దూరంగా పోయాడు. ‘ఎలాటి సీతాలెలాగైపోనాది? ఆ నాగన్నగాడ్ని సూసుకునే గుంట పెటపెట పేలిపోతాంది’ అనుకున్నాడు జగ్గడు పాతరోజులు గుర్తుకొచ్చి!
కాసేపటికి ఒక చేతిలో ఆకులో అన్నం, మరో చేతిలో ఒక పొట్లం పెట్టుకుని ఆయాసపడుతూ, ” సీతాలూ… సీతాలూ! అన్నం ఒట్టుకొచ్చినా..” అంటూ వచ్చాడు నాగన్న. 
“సేతులో ఆ పొట్లమేటి?” అని ఇంత మొహం చేసుకుని గోనె పక్కకి తీస్తూ బయటికి వచ్చింది సీతాలు. 
“ఒట్టి కూడు ఏటి తింటావని…, సింగు హొటేలు కెళ్ళి ఏడిఏడి పకోడీ కట్టించినా..” అన్నాడు నాగన్న. 
ఓయ్యారంగా మూతి తిప్పుతూ, ” అమ్మ నా రాజే!” అంటూ గభాల్న అందుకుంది సీతాలు. నాగన్నకి రెండు పెట్టి, తనూ అతనితో కలిసి నవ్వుకుంటూ తింటున్నారు. జగ్గడి మనసు చివుక్కుమంది. ఉండబట్టలేక, “సొమ్మొకడిదీ… సోకొకరిదీనంట…నాకూ ఎట్టండి..” అన్నాడు. 
“ఇప్పుడే కదా…డొక్కుడు గెంజి తాగినావు…నాను సరదాగా ఇంత తింటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంతన్నవు…” అంది సీతాలు. 
“నా నెందుకు తినకూడదు?.. డబ్బుల్నాయీ…” అన్నాడు జగ్గడు. 
“అసలే ఒల్లంతా మచ్చలేసి రోజురోజుకీ పొడపామునాగ అయిపోతన్నవు. ఇయన్నీ తింటే… పుచ్చి సత్తవు..” అంది ఉక్రోషంగా సీతాలు. 
“ఒసినీ… ఎంత మాటన్నవూ..? మరయితే నా డబ్బుల్నాకిచ్చీ…” అని తిరగబడి సీతాలు చేతిలో పొట్లం లాక్కోబోయాడు జగ్గడు. 
“ఎవలి డబ్బులయ్యా..? పోనీకదా అని ఊరుకుంటే మితిమీరిపోతన్నవు” అంటూ జగ్గడిని పేవుమెంటు మీదనుండి తోసేశాడు నాగన్న. 
“డబ్బుల్నాయీ…నన్నుసూసే అందరూ దర్మం సేసేరు గానీ నిన్ను సూశా? దుక్కనాగున్నావు” అన్నాడు జగ్గడు గొంతు పెద్దది చేసి, లేవడానికి ప్రయత్నిస్తూ. 
“అరవమాక…నాకూ ఉంది గొంతు! నిన్ను సూసి ఏత్తే మాత్రం..ఊరంతా తిప్పింది ఎవుడూ..? నానేకదా….అట్టే మాట్టాడక..” అన్నాడు నాగన్న. 
“ఊరుకో జగ్గన్నా..! పెద్దపెద్దోల్లంతా దేశాన్ని మింగుతున్నరు.. ఈడు మింగటానికేటి? ఎవుడికి దక్కింది ఆడు మింగుతున్నడు.. మన్లో మనకి తగువులేటి?” అని సముదాయించి లేవదీశాడు పక్కనున్న మరో ముష్టాడు. 
‘ఇస్వాసం లేనోడు…ఏకు మేకై కూచున్నాడు’ అనుకున్నాడు జగ్గడు. మూడ్నెల్ల క్రితం…గట్టుమీద ఎండలో సొమ్మసిల్లి పడుంటే, మొహమ్మీద నీళ్ళు జల్లి, గంజి పట్టేరు… సీతాలూ, జగ్గడూ కలిసి. 
“కండగలోడు మావా…! నీ బండి తొయ్యడానికి పనికొస్తాడు. నాను ఇంటికాడుండి గెంజి కాస్తాను” అంది సీతాలు. సరేనన్నాడు జగ్గడు. అలా ‘సూదిలాగొచ్చి గునపంలా గుండెల్లో దిగిపోయాడు నాగన్న’ అనుకుంటున్నాడు జగ్గడు.
ఆ సాయంకాలం నాగన్న బయటికి పొయాకా, జగ్గడు మెల్లగా సీతాలు పక్కకి చేరేెడు. “ఏటనుకోకే సీతాలూ..కోపంలో ఏటేటో అనేశాను” అని బుజ్జగించాడు. 
“దానికేటిలే, మావా… ఒకటనుకుంటం… పడతాం.. మనం మనం ఒకటీ! మద్దిలో ఆడొచ్చి గొడవ పెట్టాడు.. పోయేడులే.. శని ఇరగడైంది..” అంది సీతాలు జగ్గడి తల నిమురుతూ.. పొంగిపోయాడు జగ్గడు. 
“ఉండు.. పూర్ణా మార్కెట్టు సంతకెల్లి, ఉప్పురవ్వా, ఒంజరం సేపముక్కా అట్టుకొత్తాను. కూకుని తిందాం” అంది..
“అట్టాగే… సాలా కాలమైంది మనం ఇలా ఎచ్చగా తిని..” అన్నాడు జగ్గడు.
సీతాలు వెళ్ళింది. రాత్రంతా జాగరం చేశాడు జగ్గడు. సీతాలు జాడలేదు. 
తెల్లారింది. నాగన్న కూడా చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు. గుడారం లోకి వెళ్ళి చూశాడు. డబ్బీలో డబ్బులు, నోట్లూ మాయమయ్యాయి!
“అమ్మ నాగుపామూ..! కానుకోలేకపోనాను… ఎంతపని సేసినావురా దురమార్గుడా! సీతాలూ! ఆ ఇసం పురుగుతో సేరి, ఎంతపని సేసినావే!”
అని లబోదిబోమని నెత్తీ నోరూ బాదుకుని ఏడ్చాడు జగ్గడు. పది రోజులపాటు చెరువుగట్టు విడిచి బయటకి రాకుండా సీతాలు కోసం ఎదురుచూశాడు. అక్కడే ఉండిపోయి దొరికింది తింటూ సీతాలుని తలుచుకుని కుమిలిపోయాడు జగ్గడు.
ఓరోజు మిట్టమధ్యాహ్నం..”జగ్గన్నా!.. లీలామహలు జంక్సను కాడ సీతాలు కిల్లీ కొట్టెట్టినాది!” అని ఊళ్ళో తిరిగొచ్చిన మరో ముష్టివాడు జగ్గడి చెవిలో ఊదేడు. పక్కవీధిలోనే జంక్షను. ఉండలేక వెంటనే బండి తోసుకుంటూ బయలుదేరేడు జగ్గడు. కాలవ ఒడ్డున బల్లమీద బీడీ కట్టలు, సిగరెట్టు పెట్టెలూ, అరటిపళ్ళగెల, కిళ్ళీ సామాను పెట్టుకుని. వెనక బెంచీమీద బొమ్మలాగ కూచునుంది సీతాలు. బీటు పోలీసుజవాను ఏదో తమాషా కబురు చెప్పి సీతాలుని నవ్విస్తున్నాడు. అప్పుడే సోడాలు మోసుకొస్తున్నాడు నాగన్న. మొండిచేత్తో తోసుకుంటూ అక్కడకి చేరుకున్న జగ్గడు ఈ తతంగమంతా చూశాడు.
“ఇంత మోసం చేస్తావంటే సీతాలూ? ఆ ఎదవతో సేరి నన్ను ఇంత దగా సేత్తావా? నీకు పుట్టగతులుంటయ్యే” అని తిట్లు లంకించుకున్నాడు జగ్గడు. 
“ఎవుడ్రా నువ్వు? బికారి సచ్చినోడా..! ముష్టెత్తుకోక కొట్టుముందుకొచ్చి మరీ తిడతన్నావూ? అని పోలీసుతో…” సూడండి జవానుగోరూ… ఎవడో ముష్టెదవ…ఎలా పేల్తన్నడో ” అంటూ జవాను నోటికి సిగరెట్టు అందించి, అగ్గిపుల్ల వెలిగించింది సీతాలు. 
“ఏట్రా ముష్టెదవా.. ముష్టికొచ్చి డాబు సేస్తన్నవేటి? ఆడకూతుర్ని అదమాయిస్తాన్నవేటీ? ఎల్లెల్లు..ముందు దార్లో బండి తియ్యి” అని కాలితో బండిని ఒక్క తన్ను తన్నేడు పోలీసు జవాను. 
“అదికాదు బాబూ… జవానుగోరూ.. కాసింత నామాటినండి. నా సీమూ రత్తమూ దారపోసి దాసిన డబ్బు ఈ ముండ కాజేసి, నన్నిలా ఈదిన పడేసింది.. నా మాట నమ్మండి” అని గొల్లుమన్నాడు జగ్గడు. 
“నోరుముయ్యరా… బెగ్గరెదవా… కతలు నాకాడ సెప్పకు… లాకప్పులో ఎట్టి కుమ్మీగల్ను” అని, సీతాలుతో. “ఇదిగో సీతాలూ..నువ్వు బేరాలు సూసుకో, నానుండగా నీకు అడ్డునేదు” అని భరోసా ఇచ్చాడు. 
“తమరి దయుండాలిగానీ…నా బిజినెస్సుకేటి బాబూ” అంది ఓరగా జవాను మొహంలోకి చూస్తూ. జగ్గడి కళ్ళల్లోంచి రక్తం చుక్కలు రాలేయి. ఏమీ చెయ్యలేక, కోపం పట్టలేక అందర్నీ తిట్టుకుంటూ, శాపనార్థాలు పెడుతూ చెరువుగట్టు చేరుకున్నాడు జగ్గడు.
గుజ్జనగూళ్ల నుండి గుడివేపు జగన్నాథుని రథం మళ్లీ తిరుగు యాత్ర ప్రారంభించింది. జనం తండోపతండాలుగా తరలి వచ్చారు. ‘గుడికాడి కెళ్తే ఆ దేవుడి గుండేనా కరుగుద్ది. నా బతుకు సూసి పండో, పరకో దొరక్కపోదు.. ఎన్నాళ్ళిలా కూకోడం?’ అనుకుని బండి తోసుకుంటూ బయలుదేరేడు జగ్గడు. ఎటు చూసినా జనం. పోలీసులు లాఠీలతో జనాల్ని అదుపు చేస్తూ, రథానికి దారి చేస్తున్నారు. 
“అవుకు బతుకు నాయిన్లారా!… కాయకష్టం సేసుకుని బతకలేనోణ్ణి… దరమం సెయ్యండి తండ్రీ… మూన్నాళ్ళనుంచి ముద్ద లేదు..” అంటూ కెరటాల్లా వస్తోన్న జనాల్ని ఒడుపుగా తప్పించుకుంటూ, బండి తోసుకుంటూ దీనంగా అడుక్కుంటున్నాడు జగ్గడు. కొంతమంది విసుక్కుంటూ, దూరంగా తప్పుకుంటున్నారు. “మీదమీదకి వస్తున్నావేంట్రా… కుష్టోడా.. ఎదవబండీ నువ్వూను. తప్పుకో.. ఛీ ఛీ..” అని కొందరు కసిరితే, కొందరు పైసలు వేస్తున్నారు. పోలీసులు పొమ్మని బండిని వెనక్కి నెట్టేస్తున్నారు. ఇంతలో గంట వాయిస్తూ, శంఖం పూరిస్తూ అనాథల కోసం కాశీ కావిడి భుజాన వేసుకుని, “దిక్కూ మొక్కూ లేని దీనులు… అనాథలు.. బికార్లకి మీకు తోచింది దానం సేసుకోండి బాబూ! పున్నెం వస్తది” అంటూ.. అన్నమూ, ధనమూ సేకరిస్తూ రథంతో ముందుకి సాగిపోతున్నాడు సాధువు! అతన్ని చూడగానే జగ్గడు.. “సాదువు బాబూ! నువ్వా! సూసినావా..? సీతాలు దగాసేసి ఎగిరిపొనాది” అంటూ అయినవాణ్ణి చూసినట్టు తన కష్టం మొరబెట్టుకున్నాడు.
“నువ్వా… జగ్గన్నా!” అని పైకి చనువుగా నవ్వి, ‘ఇక్కడా దాపురించావా? నీ గోల మండా…నాకు పోటీగా మళ్లీ నువ్వొకడివా?’ అని జగ్గడు కూడా వస్తోన్నందుకు లోపల కుతకుత లాడిపోయి, మొహం జేవురించుకుని, భుజం మీద కావిడి విసురుగా తిప్పి గిరుక్కున తిరిగిపోయాడు సాధువు. దిమిశాగుండులా బరువైన కావిడిలోని ఇత్తడి గుండిగ గిర్రున తిరిగి విసురుగా ఫెడీల్మని పిడుగులా జగ్గడి తలమీద మోదుకుని వెళ్లిపోయింది. ఆ దెబ్బకి గిలగిలలాడి, కళ్ళు చీకట్లుకమ్మి బండిమీద నుండి రోడ్డు మీదకి తుప్పున తూలిపోయాడు జగ్గడు. రోడ్డుకి అడ్డదిడ్డంగా పడిపోయింది బండి.
“అరెరే.. ముష్టోడు.. కుష్టోడు.. పడిపోయేడు.. అయ్యో.. రథం.. రథం” ఆ గందరగోళంలో ప్రజలు నిర్ఘాంతపోయి, చూస్తూ నిలబడిపోయారు. వేగం పుంజుకున్న జగన్నాథ రథం మొండి జగ్గడి మొండెం తుంపిపారేసి ముందుకు సాగిపోయింది. “అమ్మో” అని వెయ్యి గొంతుకలెత్తి నింగీ నేలా కంపించేలా ఆఖరి అరుపు అరిచాడు జగ్గడు! అయితే జగ్గడి మరణరోదన గానీ, అనాథ జీవుడి ఆర్తనాదంగానీ ఆ సంబరం సందడిలో జగజ్జనులు పట్టించుకోలేదు. తరలివస్తోన్న జనాలు మాత్రం ఒక్కసారి నోటమాట రాక ఒకరిమొహం ఒకరు చూసుకున్నారు. 
“ఎంత పుణ్యాత్ముడో!.. ముష్టి వెధవకి ఇంత భాగ్యం పట్టింది….అందరికీ రాదు ఇలాంటి చావు!” ఇలా రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. 
“నరకమంతా ఇక్కడే అనుభవించేసేడు.. కర్మ పరిపక్వమైంది.. మరిహ జన్మ లేదు.. వైకుంఠద్వారాలు వాడికోసం తెరుచుకుంటాయి.” అని చదువుకున్న పండితులూ తీర్మానం చేశారు. 
“పండుగనాడు కూడా శవం కాపలా తప్పలేదురా నాయనా.., ఈ ముష్టి గాడిదకొడుకు ఇవాళే చచ్చాడు. ఛ…పోలీసు బతుకూ ఒక బతుకే..?” అంటూ జగ్గడి శవానికి కాపలా కాస్తున్న పోలీసులు అనుకుంటున్నారు. 
“దరిద్రం వదిలిపోయింది… శని ఇరగడై పోయింది” అని సీతాలు నాగన్న చెవిలో గుసగుసలాడింది. అవిటి బతుకు నలిగింది! బడుగుబండి విరిగింది!! గాలి మోసుకెళ్ళిన ఈ కబురు విని పీర్ల కోనేటిలో చేపలు గిలగిల తన్నుకున్నాయి. లోకం మామూలుగా నడుస్తోంది. సాధువు అన్నం అమ్ముకుంటున్నాడు. బీటు పోలీసుల దయవల్ల సీతాలు కిళ్ళీకొట్టు పెద్ద బడ్డీగా ఎదిగిపోయింది.

--((**))--




ప్రభారాధన----39 నిముషముల లఘుచిత్రం -సంక్షిప్త కధ-----
-----------------------------------------------
భోగరాజు ప్రొడక్షన్స్--------ప్రభారాధన

నిర్మాత----భోగరాజు సత్యనారాయణ B Sc.,M I E ( India)
(సూర్యప్రభాపతి)

నేపథ్య సంగీతం-శ్రీమతి భోగరాజు సూర్యప్రభ B A సకలకళానిధి

కధ,మాటలు- కొవ్వలి నాగేశ్వరరావు( వేయి నవలల రచయిత కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారి ప్రధమ పుత్రుడు)

సంక్షిప్త కధ-----
---------

చక్రి ,శ్యామల లు సాఫ్ట్ వేర్ఇంజనీర్లుఒకేఆఫీసులోపనిచేస్తున్నారు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు వివాహం చేసుకోవాలని అనుకున్నారు. కానీ వారి తల్లితండ్రులు వారి వివాహానికి అంగీకరించ లేదు .కారణం, ముఖ్యంగా వారు వేరు వేరు కులములు కావటమే . వారిద్దరికీ వారి తల్లితండ్రులు వేరే వేరే సంబంధాలు చూశారు .కానీ అవి చక్రి, శ్యామల లకు ఇష్టం లేదు . రిజిస్టర్ మ్యారేజీ చేసుకోవటానికి నిర్ణయించు కున్నారు . వారి వారి తల్లి తండ్రులను ధిక్కరించి వారినుండి సంక్రమించే ఆస్తిపాస్తులను కాలదన్ని ఒకరోజు రిజిస్టర్ మ్యారేజ్ చేసేసి కున్నారు .అప్పుడు శ్యామల స్నేహితురాలు మాలతి పెదనాన్నగారు కూడా వచ్చి ఆదంపతులను ఆశీర్వదించి ఒక గిఫ్ట్ ప్యాక్ కూడా ఇచ్చారు 

ఇప్పుడే అసలు కధ మొదలైంది . చూస్తూ చూస్తూండగనే రెండేళ్ళు గడిచాయి . చక్రి కి శ్యామలమీద మొదట్లో ఉన్న ప్రేమ తగ్గటం మొదలైంది ఆఫీసులో ఇంకో అమ్మాయితో తిరగటం మొదలు పెట్టాడు. శ్యామలను ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోమన్నాడు . తాను సాయంత్రం ఆఫీసునుండి అలసిపోయి వస్తే ఇంటిదగ్గర తన భార్య తనకు కాఫీ తో స్వాగతం పలకాలని కోరిక అదీ కాకుండా వారికి పుట్టబోయే సంతానాన్ని ఇంట్లో తనభార్య ప్రేమతో పెంచాలని కోరిక . ఈ కోరికను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోకముందు చెప్ప లేదు . ఇప్పుడేంచేయాలి? కానీ శ్యామలకు తాను చాలా కాలంనుండీ చేస్తున్న ఉద్యోగం మానటం ఇష్టంలేదుచివరకుచక్రి శ్యామల మీద కోపం వచ్చి విడాకులు ఇవ్వటానికే నిర్ణయించుకున్నాడు.

ఈ పరిస్తితిలో శ్యామల చక్రి కి ఒక ఆదర్శ దంపతుల కధను చెప్పటం మొదలపెట్టింది . వారి రిజిస్టర్ మ్యారేజ్ లోఒకరిచ్చిన గిఫ్ట్ ప్యాక్ లో "కర్తవ్యం " "సకలకళానిధి " అనే రెండు గ్రంథాలు ఉన్నాయి శ్యామల స్నేహితురాలు మాలతి యొక్క పెదనాన్నగారే ఆ గిఫ్ట్ ఇచ్చారు మాలతికి వారిపెదనాన్నగారి కుటుంబవిషయాలన్నీ బాగా తెలుసునట
ఆగ్రంధాలను ఆ దంపతులే వ్రాశారువాటిలోచాలా ముఖ్యవిషయాలున్నై ఆ దంపతులు చాలా ప్రేమ మూర్తులు ఆదంపతులిరువురూ కలసి చేసిన యాత్రవిశేషాలు , పుష్కర స్నానాలు,పూజలూ నోములూ వ్రతాలు దానధర్మాలు, మొదలగు పుణ్యకార్యాలు. వారు చేసిన యోగసాధన ప్రత్యేకంగా ఆవిడ శ్రీ రామకోటి రెండు సార్లు వ్రాయటం,వందలాది పాటలు పాడటం మొదలగు విషయాలు చెపుతూ భార్య పోయి మూడు సంవత్సరా లయినా ఆవిడనే ఆరాధిస్తూ సర్వ కాల సర్వావస్తలయందూ ఆవిడ స్మరణే చేస్తూ కాలం గడపుతున్నాడు భార్యను చేరటానికి ఎదురు తీస్తున్నాడు అట్లాగుండాలి దంపతులంటే--అని చెప్పింది శ్యామల చక్రి కి. చక్రి ఇదంతా పిచ్చిపని. చేతగానివాళ్ళు చేసే పని అని
ఆ సకలకళానిధి పుస్తకాన్ని దూరంగా విసిరి పారేశాడు .శ్యామల చాలా బాధపడింది.

చక్రి శ్యామలకు విడాకులనోటీస్ ఇవ్వటానికి ప్రయత్నాలు ప్రారంభించాడు స్కూటర్ మీద వెడుతూ అడ్వకేట్ తో సెల్ ఫోన్ లో మాట్లాడుతూండగా ఏక్సిడెంటు జరిగింది కాలికి ఫ్రాక్చర్ అయింది హాస్పటల్ లో ఎడ్మిట్ అయ్యాడు ఏక్సిడెంట్ విషయం తెలిసిన వెంటనే శ్యామలహాస్పటల్ కువెళ్ళి నెలరోజులు వైద్యం చేయించి ఇంటికి తెచ్చుకుంది చక్రి కి సపర్యలు చేస్తుంది.చక్రి ప్రేమించిన రెండవ అమ్మాయి కనీసం తనను చూడకైనా రాలేదు చక్రి ఫ్రాక్చర్ తో మంచంమీద శ్యామల చేత సపర్యలు చేయించుకొంటూ బాధపడుతూ ఉన్నాడు .

అట్లాగుండగా ఒకరోజు రాత్రి ఒక దేవత (పూర్వజన్మ లో సూర్యప్రభ) చక్రి కలలోకి వచ్చి --బాహ్యసౌందర్యము నకు ఆకర్షితులపై నేటి  యువతి యువకులు ఏవిధంగా మోసపోతున్నారో, అంటూ చెపుతూ " హితబోధ" చేస్తుంది. వెంటనే నిద్రలేచి తాను చేసిన పనులకు పశ్చాత్తాపం చెందుతాడు తన భార్య శ్యామలకు ఈ కల విషయం చెప్పి
తనను క్షమించమంటాడు సూర్యప్రభ తనకు జ్ఞానోపదేశం చేసిందన్నాడు సూర్యప్రభ మూలంగా మన కాపురం నిలబడినందుకు కృతజ్ఞతగా మనకు కలిగే ఆడపిల్లకు
"సూర్యప్రభ "పేరుపెట్టుకుందామనుకున్నారు ఈ విధంగా సూర్యప్రభ తినకున్న దివ్య శక్తులతో ఇంకెన్ని కుటుంబాలు బాగుచేస్తుందో నని అనుకుంటున్నారు మన చక్రి , శ్యామల జంట 

ఇదీ సంక్షిప్తంగా "ప్రభారాధన "అనే 39 ని॥ల లఘు చిత్రం కధ

--((**))--
త్యద్భుతము తప్పక చదవండి పోస్టు పూర్తిగా చదవకపోతే చాల కొల్పొతాం అంత బాగ నచ్చుతుంది. 


ఇవాళ సైన్స్ పురోగతి సాధిస్తున్న అంశాల్లో బాగా ప్రాచుర్యం పొందుతోంది నానో టెక్నాలజీ. దీని మీద పాశ్చాత్య దేశాలు బిలియన్ల కోట్లు పెట్టి పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. దురదృష్టం ఏమిటీ అంటే ఈ నానో టెక్నాలజీ కొన్ని వేల సంవత్సరాలనాడే మన దేశంలో వుంది. ఇప్పటికీ వుంది. హిమాలయాల్లో సజీవంగా వుంది. వివరాల్లోకి వెళ్తే.... 

మన ఋషులు,యోగులు, సాధువులు కొన్ని వేల ఏళ్ళ క్రితమే సూక్ష్మ శరీరయానం గురించి చెప్పారు. మనం పుస్తకాల్లో చదువుకున్న తపస్సునే ఇప్పుడు ధ్యానం అంటున్నారు. ఈ ధ్యానం ద్వారా అమోఘమైన సిద్ధులు సంప్రాప్తిస్తాయి. అందులో ఒకటి సూక్ష్మ శరీరయానం. దీన్ని నానో టెక్నాలజీలో అడ్వాన్స్డ్ స్టేజ్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చేస్తున్న పరిశోధనల లక్ష్యం కూడా అదే. మన ఋషులు, యోగులు కోరుకున్నదే తడవుగా కోరుకున్న చోటికి ప్రయాణం చేసేవారు. కానీ ఇప్పటి హేతువాదులు దాన్ని నమ్మటానికి సిద్ధంగాలేరు. 

మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం సన్నివేశం గుర్తుంది కదా. దుశ్శాసనుడు ద్రౌపది చీరను లాగినప్పుడు ,మాన సంరక్షణ కోసం తను శ్రీ కృష్ణుడిని ప్రార్ధిస్తుంది. ఎక్కడో ద్వారకలో వున్న కృష్ణుడు తక్షణం అక్కడ ప్రత్యక్షమై ద్రౌపది శీలాన్ని కాపాడుతాడు. దానికి ఆటను ఎంచుకున్న ప్రయాణ సాధనం నానో టేక్నాలజీయే. త్రిలోక సంచారి ఐన నారదుడు నిత్యం నానో టెక్నాలజీ ద్వారానే ప్రయాణించే వాడు. ఇదంతా చదివి నాకు మతి భ్రమించి రాస్తున్నాను అని మిత్రులు భ్రమపడే అవకాశం వుంది. అందుకే ,ఇక్కడ ఒక సజీవ ఉదాహరణ ఇస్తున్నాను. 

హరిద్వార్ లోనూ, త్రివేణి సంగమం లోనూ జరిగే కుంభమేళా లు గుర్తున్నాయి కదా. అక్కడికి లక్షలాది మంది నాగసాదువులు రావటం మనం టీవీల్లో,పేపర్ లలో చూశాం. నాగసాదువులు దిగంబరంగా వుంటారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో హిమాలయ గుహలలో, కొండల్లో,నదీ తీరాల్లో వుంటారు.మామూలు రోజుల్లో వారు ఎవరికీ కనిపించరు. హిమాలయాల నుంచి కుంభమేళా జరిగే ప్రదేశాలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో వుంటాయి. 

ఇక్కడ మనకు మనమే ఒక ప్రశ్న వేసుకుందాం.కొన్ని లక్షల మంది దిగంబరులు ఒకేసారి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ,వాళ్ళు ప్రయాణం చేసిన మార్గం అంతా ట్రాఫిక్ జామ్ అవ్వాలి కదా. ఇప్పటి దాకా ఎక్కడైనా అలాంటి సంఘటన రికార్డ్ అయ్యిందా? ప్రయాణ మార్గంలో ఎన్నో పల్లెలు, పట్టణాలు, నగరాలు వుంటాయి. ఎక్కడైనా,ఏ ఫోటోగ్రాఫర్ కు అయినా ఇన్ని లక్షల మంది దిగంబరులు కన్పించారా? ఎక్కడైనా ఇంతమంది ప్రత్యెక విమానాల్లో ,ఇతర రవాణా సాధనాల్లో ప్రయాణం చేసిన దాఖలాలు కన్పించాయా?లేదే? సరిగ్గా అందరూ ఒకేసారి, కుంభమేళా జరిగే ప్రదేశంలో ఎలా ప్రత్యక్ష మవుతారు? కుంభ మేలా ముగిశాక ,తిరుగు ప్రయాణంలో ఒక కిలోమీటర్ దూరం వరకే కన్పించి హటాత్తుగా ఎలా మాయమైపోతారు? ఆ ప్రాంతంలో తప్ప మరెక్కడా వారి జాడ ఎందుకు కన్పించదు? 
వీటన్నింటికీ సమాధానం ఒకటే అదే సూక్ష్మ శరీర యానం .అదే నానో టెక్నాలజీ.నాగసాదువులు తమ సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగించే ప్రయాణ సాధనం.ఎన్నో ఏళ్ళుగా మన కళ్ళ ముందు ఇంత సజీవ సాక్ష్యం కన్పిస్తుంటే దాన్ని మనం నమ్మం. అమెరికా వాడు, రష్యా వాడు, చైనా వాడు, జపాన్ వాడు,జర్మనీ వాడు చెప్పే సోళ్లు అంతా విని చంకలు ఎగరేస్తుంటాం. ఒక్కసారి మనసు పెట్టి మన శాస్త్రాలు చదవండి. వాటిని అనుసరించి,అమలు చేసే ప్రయత్నం చెయ్యండి. ప్రపంచానికి మళ్ళీ మనం పాఠాలు చెప్పొచ్చు.
కినాడ కథలు :: #ఋణానుబంధరూపేణా
#కాకినాడలోని జగన్నాథపురం బ్రిడ్జి దిగి ఎడమచేతి వైపు వెళ్తుంటే వేంకటేశ్వరస్వామి గుడికి ఎదురుకుండా కనబడుతూ ఉంటుంది బోర్డు మీద తెలుగులో వ్రాసిన రాజస్థానీ మిఠాయి దుకాణం అని. మిఠాయి దుకాణం అన్నాము కదా అక్కడ బోల్డు మిఠాయిలు ఏమీ ఉండవు. దొరికేది వేడి వేడి బెల్లంజిలేబి మాత్రమే. ఆ ఒక్క వెరైయిటీకే అక్కడ ఇసకేస్తే రాలనంత మంది జనం.
***
ఆ దుకాణం యజమాని పేరు ధరమ్ వీర్ సింగ్. 1971లో తన ముప్ఫై ఏళ్ళ వయస్సులో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో రెండు కాళ్ళను మోకాళ్ళవరకూ దేశానికి ఇచ్చేసి... ఓ సైనికుడిగా గర్వంగా తిరిగిన ఊర్లో, సానుభూతిగా బతకడం ఇష్టంలేక... తల్లిని, భార్యను, పదేళ్ల కొడుకు మహావీర్ సింగ్ ని తీసుకుని మా కాకినాడకు వచ్చేశారు.
కాకినాడకు వచ్చిన మూడేళ్లకు చిన్న కొడుకు ఓంవీర్ సింగ్ పుట్టాడు.
***
మన కాళ్ళ మీద మనం నిలబడాలి అంటే మనకు ఉండవలసింది పట్టుదలే అని నిరూపిస్తూ తన భార్య, తల్లితో కలిసి మిఠాయి దుకాణం మొదలుపెట్టారు.
బంగారు రంగులో, బెల్లం పాకంతో... వేడి వేడిగా... కరకరలాడుతూ అమృతానికి సరిజోడులా ఉండే ఆ జిలేబి రుచి గుర్తుకు వస్తే చాలు మా కాకినాడ జనాలు ఆ దుకాణం దగ్గర జేరిపోయేవారు.
***
ప్రతీ ఆగష్టు పదిహేనుకి, జనవరి ఇరవై ఆరుకి తన దుకాణం దగ్గర జండా ఎగురవేసి అక్కడికి వచ్చే జనాలకు ఉచితంగా జిలేబి పంచేవారు.
సినిమా రోడ్డులో ఉండే కోకనాడ అన్నదాన సమాజంలో జరిగే నిత్యాన్నదానానికి ప్రతీ ఆదివారం తన వంతుగా పదికిలోల జిలేజీ ఇచ్చేవారు.
ఆయన గొప్పదనం.... చేతి రుచి రెండూ తెలిసిన మా కాకినాడ జనాలు ఆయన్ని ముద్దుగా జిలేబి సింగోరు అని పిలిచే వాళ్ళు.
***
అప్పుడెప్పుడో మల్లాడి సత్యలింగ నాయకర్ గారు కట్టించిన స్కూల్లో చేరి, బాగా చదివే పెద్ద కొడుకు మహావీర్ సింగుని ఎలాగైనా పూణే దగ్గర ఉన్న నేషనల్ డిఫెన్స్ అకాడిమీలో చేర్చి, మహా వీరుడులా చూడాలి అనుకునే వారు.
మనం అనుకున్నవి అన్నీ జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది. బాగా చదివే మహావీర్ తాను డాక్టర్ కావాలని కోరుకున్నాడు.
తన ఇష్టాన్ని తనలోనే ఉంచేసుకుని మహావీర్ ని అతను చదవాలి అనుకునే మెడిసిన్ లోనే చేర్చారు ధరమ్ వీర్ గారు.
***
అలుపన్నది తెలియని సూర్యుడు ఉదయిస్తూ... అస్తమిస్తూనే ఉన్నాడు. అతనితో కలిసి కాలం పరిగెడుతూనే ఉంది.
***
చదువులో అన్నకు తగ్గ తమ్ముడిగా ఉండేవాడు ఓంవీర్. చిన్నప్పటి నుండి లెక్కల్లో ఎంతో ముందు ఉండేవాడు. ఖాళీ దొరికినప్పుడల్లా కొట్లో ఉండి... అక్కడికి వచ్చే మనుషుల మనసులను చడవడం అలవాటు చేసుకోసాగాడు.
***
ఓరోజు ధరమ్ వీర్ గారి తల్లికి బాగా సుస్తి చేసింది. వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకెళ్ళారు. కానీ అక్కడ డాక్టర్లు ఏదో స్ట్రైక్ లో ఉండటంతో సమయానికి సరైన వైద్యం దొరకక ఆవిడ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది.
జరిగిన సంఘటన ఆ తండ్రీ కొడుకుల మీద చాలా ప్రభావాన్నే చూపించింది.
***
మెడిసిన్ ఐన తర్వాత ఆ మిఠాయి దుకాణం దగ్గరే కేవలం ఐదు రూపాయల ఫీజుతో ఆసుపత్రిని మొదలుపెట్టారు మహావీర్ సింగ్. హస్తవాసి అంటారు చూడండి... అది నిజం అన్నట్లు ఎంతటి రోగమైనా సరే ఆయన చెయ్యి పడగానే తగ్గిపోయేది. అసలు ఆయన మన చేయి పట్టుకుంటే చాలు... మన రోగం సగం తగ్గిపోతుంది అనే నమ్మకం కలిగింది మా అందరికీ. నెమ్మదిగా ఆయన్ను మా కాకినాడ జనాలు ఐదు రూపాయల డాక్టరుగోరు అనడం మొదలుపెట్టారు.
తనకు మందుల కంపెనీలు శాంపిల్స్ గా ఇచ్చే మందులనే రోగులకు ఇచ్చేవారు. ఓ పాతిక రూపాయలు ఉంటేచాలు... ఆపరేషన్ కాని, ఎంత పెద్ద రోగానికైనా ఆయనతో వైద్యం చేయించుకోవచ్చు అనుకునేవాళ్ళు మావాళ్ళు.
***
దుకాణం పెట్టిన కొత్తలో రోజుకి పాతిక ముప్పై కిలోలు అమ్మే వ్యాపారం... ప్రస్తుతం రోజుకి మూడు వందల కిలోలకు పైగానే పెరిగింది.
దుకాణం నుంచి వచ్చే లాభాలలో చాలామటుకు ఆసుపత్రి నిర్వహణకే ఖర్చు పెట్టేవారు ఆ కుటుంబం.
***
ఆ రోజు రాత్రి కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తున్న వేళ మహావీర్ గారు తమ్ముడు ఓంవీర్ కూడా తనలాగే డాక్టర్ చదివితే ప్రజలకు ఇంకా సేవ చెయ్యొచ్చు అన్నారు. అది విన్న ధరమ్ వీర్ గారు ఉబ్బితబ్బిబ్బైపోయి చిన్న కొడుకు వైపు చూశారు.
తనకు తినడానికి రొట్టెలు పెడుతున్న అమ్మకు, నమస్కరించి తండ్రి వైపు తిరిగి నేను డాక్టర్ అవ్వాలని అనుకోవడం లేదు అని ఓంవీర్ అనేసరికి అందరూ ఆశ్చర్యపోయారు.
అన్నయ్యా మీరు చేస్తున్న సేవ నిరాకాటంగా సాగాలి అంటే మన మిఠాయి దుకాణం కూడా కొనసాగుతూనే ఉండాలి. నేనూ చదువుకోసం దుకాణం వదిలేస్తే... నాన్నగారి తర్వాత మనం ఆ దుకాణాన్ని వదిలేసుకోవాలి. అలా చేస్తే ఇప్పుడు ఆసుపత్రి ద్వారా మీరు చేస్తున్న పనులు ఏమీ చేయలేము. మన ఆసుపత్రి ద్వారా మీరు చేసే సేవ ఎల్లకాలం జరగాలి అంటే... మన మిఠాయి దుకాణం కూడా ఎల్లకాలం నడవాలి. అందుకని నేను మిఠాయి దుకాణం బాధ్యతలు తీసుకుందాం అనుకుంటున్నా అన్నాడు.
చిన్నవాడైనా ఎంతో ముందు చూపుతో అతను చెప్పిన మాటలు వింటూ అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు.
***
ఆ సంవత్సరం సంక్రాంతికి మా కాకినాడ ముస్తాబు అవుతోంది.
కాకినాడలోని జగన్నాథపురం బ్రిడ్జి దిగి ఎడమచేతి వైపు వెళ్తుంటే వేంకటేశ్వరస్వామి గుడికి ఎదురుకుండా కనబడుతూ ఉండే ఆ మిఠాయి దుకాణం, పక్కనే ఉన్న ఆసుపత్రి కొత్త రంగులు దిద్దుకుంటుంన్నాయి.
ఏ జన్మలోని ఋణానుబంధమో... ఊరు కాని ఊరు వచ్చి ఇక్కడి జనాల కోసం తపనపడే... జిలేబి సింగోరు, ఐదు రూపాయల డాక్టరు గార్ల ఋణం మా కాకినాడ జనాలు ఎప్పటికీ తీర్చుకోలేరు.

గురు శిష్యుల లడాయి!
------------------------------------

పండిత లోకంలో " శిష్యాదిచ్ఛేత్పరాజయం"- అనే ఆభాణకం ప్రచారంలో ఉంది. అంటే  శిష్యుని చేతిలో గురువు పరాజయాన్ని కోరుకుంటాడని. ఉత్తమ గురువు విద్యలో తనకన్నా తన శిష్యుని గొప్పవానిగా, సమున్నతునిగా , చూడగోరుతాడని,
దీనిభావం. శిష్యుడు అల్పుడై యెదిరిస్తేమాత్రం చీల్చి చెండాడుతాడు.

గురువుగా చెళ్ళపిళ్ళవారి పరిస్థితిమాత్రం చిత్రాతి చిత్రమైనది.ఈవిషయంలో ఆయనకన్నా అదృష్టవంతుడూ లేడు, ఆయనకన్నా దురదృష్టవంతుడూ కనిపించడు.

తెలుగు వారికి మాత్రమే స్వంతమైన అవధాన కళకు అత్యద్భుతమైన జనాకర్షణ కలిగించిన జంటకవులు
తిరుపతి వేంకట కవులు వారిలో చెళ్ళపిళ్ళవేంకటశాస్త్రి యొకరు. వారిశిష్యులలో ప్రముఖుడు విశ్వనాథ సత్యనారాయణ. ఆయన తమ గురువుగారిని
గురించి మహోన్నతంగా సంభావిస్తూ యిలాచెప్పుకున్నారు.

" అల నన్నయ్యకు లేదు తిక్రనకు లేదాభోగ మస్మాదృశుం

డలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దో

హల బ్రాహ్మీమయ మూర్తి శిష్యుడైనాడట్టి దావ్యోమ పే

శల చాంద్రీమృదుకీర్తి చెళ్ళపిళ వంశస్వామి కున్నట్లుగన్;

ఇందులో స్వోత్కర్ష ఉన్నప్పటికీ

. తనవంటి శిష్యుడుండేభాగ్యం నాడు నన్నయకూ, తిక్కనకూ
కలుగలేదు చెళ్ళపిళ్ళ వారికి మాత్రమే దక్కిందంటాడు విశ్వనాధ! ఇలా ఒకవంక తనగొప్పతనం చాటుకుంటూనే గురువుగారి గౌరవాన్ని ఆకాశమంత యెత్తు కుపేంచేశాడు. మాగురువుగారు నన్నయ తిక్కనకన్న గొప్పవాడని సాటుకున్నాడు. అటువంటి శిష్యుడు దొరికితే గురువు కింకేమి కావాలి? అనిపించాడు. ఇది మొదటి కోణం!

ఇక రెండో కోణంతోనే ఉంది సమస్యంతా !

చెళ్ళపిళ్ళ వారికి 'ఓలేటి వేంకట రామ శాస్త్రి' అనే శిష్యుడుండేవాడు. ఎందుకో ఆయనకూ చెళ్ళపిళ్ళ వారికి చెడింది.
"నీవునాగురువువు కానేకాదు పొమ్మన్నాడు ఓలేటి. చెళ్ళపిళ్ళవారికి మండింది. కాదంటే  ఊరుకుంటాడా ? అద్యతనాంధ్రకవిత్వ ప్రపంచ
నిర్మాతగదా! వారికి కోపమొచ్చినా తాపమొచ్చినా 'పద్యాలలోనేకదా! ఒకసీసాన్ని గుప్పించి తనదగ్గర గలసాక్ష్యాలన్నీ యేకరువు పెట్టారిలా పద్యంమాట యెటున్నా చూచేవారికది వినోదంగా మారింది.

సీ: ఇంజరం బొకసాక్షి- యేనాము తా సాక్షి

పల్లె పాలెంబు తానెల్ల సాక్షి!

ఇపుడు నీవున్నట్టి- యీపిఠాపురిసాక్షి

ఏలూరుసాక్షి నీయిల్లు సాక్షి

వల్లూరు నృపతి శ్రీ- భాష్య కారులు సాక్షి

నూజివీడ్రామచంద్రుండు సాక్షి

మంజువాణీప్రెస్సు- మానేజరొక సాక్షి

శంకరుండాతని సాని సాక్షి

తే: మధున పంతుల సూరయ బుధుడు సాక్షి

యయ్యనఘు, నన్నసాక్షి సుబ్బయ్యగారు

సాక్షులున్నారు పద్యంబు చాలదింక

వేంకటేశ్వరు శిష్యుడవే! నిజమ్ము !


చిత్ర మైన విషయమేమిటంటే యీవిషయంలో అటూ ఇటూ మధ్యవర్తు లుండటం. చెళ్ళపిళ్ళవారి తరపున వారి సోదర కవులు దివాకర్ల తిరుపతి శాస్త్రిగారు ఓలేటిని గట్టిగా మందలించారు.

" వ్యాకరణంబుఁ జెప్పె , నది యంటక పోయిన పోవుగాక , నీ

కీ' కవి'నామ మయ్యనఘుఁడే కద పెట్టిన దంతఁ బోక తా

నే కడ కేగె , నిన్ను గొనియే చనె నచ్చటి , కట్టివాని , సు

శ్లోకు , సభాస్థలిన్విడచి చోరుగతి న్మెలగంగ నేమొకో?

" వేంకటేశ్వరు పాదంబు వీడి పిదప

నెవని సేవించితివి? చెప్పు మింత యేల?

యే విషయమీవు సాధించినావొ పిదప?

వ్రాయుమా వేంకటేశ్వరు పదము లాన !

అంటూ హితవు చెప్పారు. అయినా ఇతరుల దుర్బోధలకు లోగిన ఓలేటి యామాటలను లేక్క సేయలేదు.
వారి మనసు మారలేదు. ఓలేటి వారికి వేదుల రామకృష్ణ శాస్త్రి యను మిత్రుడున్నాడు. అతడే ఓలేటివారికి వెనుక నున్నదన్ను.
" పాఠంచెప్పేవాడు గురువైతే, గుణపాఠం చెప్పేవాడే శిష్యుడనే" వాదాన్ని నమ్మేవ్యక్తి రామకృష్ణశాస్త్రి. చెళ్ళపిళ్ళవారికి తమకు మధ్యగల వైరానికి ఓలేటినొక అస్త్రంలా వాడుకోదలచారు. అందుకే ఓలేటివారి పక్షాన చెళ్ళపిళ్ళపై వారోపద్యాస్త్రాన్ని సంధించారు.

" ఎట్టొ చదివితి మూనాళ్ళ పట్ట పగలు,

పట్టుమని రెండు ముక్కలు పలుక కున్న,

తిరుగడిక నెన్ని చెప్పిన గురుడ ననుచు,

తగులు కొన్నాడు , నిన్ను 'సైతాను' లాగు;

"- అనేశాడు.చూశారా ! యెంత నీచంగా వ్రాశాడో! చెళ్ళఫిళ్ళవారిగురించి ఇంతనీచంగామాట్లాడినా

వారిని గురువుగా తానేయొప్పుకున్నాడు.

పాపం చెళ్ళపిళ్ళవారికి శిష్యులతోనేకాదు.గురువుగారు చర్లబ్రహ్మయ్యశాస్త్రిగారితో గూడా గొడవ తప్పలేదు. ఒకసారి గురువుగారిమీద ఒళ్ళుమండి"గురుడైనన్ హరుడైననేమి?"- అంటూ పద్యంచెప్పారట! కొంతకాలానికి అదే తనకూప్రాప్తించింది. ఆయన శిష్యుడు ఓలేటి గట్టిగానే యిచ్చుకున్నాడు "శ్రుత పాండిత్యము దక్క లేనిగురుడు"- అంటూ చెళ్ళపిళ్ళవారిపాండిత్యాన్ని వేళాకోళమాడాడు. చెళ్ళపిళ్ళ యేదో అక్కడాయిక్కడా విని నేర్చుకున్నదే తప్ప డొక్క శుధ్ధిగా చదువుకొన్నవాడు కాదని దాని సారాంశం!

ఏది యేమైనా " వరంవిరోధోపి సమం మహాత్మనామ్" (మహాత్ములతో విరోధంకూడా మంచిదే) అనే' భారవి'
వాక్యం మరువరాదు.

స్వస్తి!
 
--((***))--
 .
అమీర్ మాటలు భాదిస్తున్నాయ్! భారత దేశం అంటే అంత చులకన మీకు?        
                                        నేడు మనం ఎక్కడవున్నామో , ఎం చేస్తున్నామో తెలియని పరిస్థితి. ఎవ్వరికి వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతే దేశం ఎక్కడకు వెళ్తుంది, కన్నా తల్లిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతే మనం తల్లి కన్నా బిడ్డలమా? పక్కింటి వారమా అనే సందేశం వ్యక్తం అవుతుంది. తిన్నింటి  వాసాలు లెక్క పెట్టడం అవసరమా? మీకు ఇష్టం లేకపోతే మీకు నచ్చిన దగ్గరకు వెళ్ళు, కాని కొన్ని కోట్ల మంది పుణ్య భూమిగా భావిస్తున్న దేశం పట్ల అంతచులకన భావన అనసరమా అమీర్!ఈ దేశం లో పుట్టి, ఈ దేశం లో పెరిగి, ఈదేశం లో జనం ఆదరిస్తే పెద్ద స్టార్ గా ఎదిగి, దేశం మీద విషం కక్కడానికి నువ్వు అసలు మనిషివేనా? యువతను బ్రస్టు పట్టించే సినిమాలు తీస్తూ , ప్రజల్లో లేని పోనీ అపోహలకు తావిస్తున్న నీకు ఈదేశం లో మీకు భద్రతా లేదా? హిందూ దేవతలని, బాబాలని అవహేళన చేస్తూ నువ్వు pk సినిమా చేసినా నీ మీద ఈగ వాలిందా? నువ్వు pk తీసింది నరేంద్ర మోది పాలన లోనే కదా, సెన్సార్ బోర్డ్ నీ సినిమాని ఆపిందా? దీనికి మన దేశం ఇచ్చిన స్వేచ్చ మూకు అర్ధం కావటం లేదా!  బాలివుడ్ ను ఏలుతున్న ముగ్గురూ ముస్లిం లే కదా, అలాగని దేశం ఎప్పుడైనా వ్యతిరేక ధోరణితో వుందా?  మీ సినిమాలకి, మీ వ్యాపారాలకి ఎప్పుడన్నా ఇబ్బంది కలిగిందా?మరి ఎందుకంత భయం మీకు?  ఒక టెర్రరిస్ట్ అంత్యక్రియలకి వేలమంది హాజరయితే, ఇదేంటి అని ప్రశ్నించకుండా మూసుకుని కూర్చున్న నీకు, నేడు ప్రపంచ దేశాలు మన విలువలు గురించి చర్చిస్తుంటే మీరు మన భారత దేశం గురించి మాట్లాడే అర్హత ఎక్కడ నుంచి వచ్చింది ఈ అర్హత మీకు  ఉందా? దేశం మొత్తం మీద నాలుగు సంఘటనలు జరిగితే, వాటిని భూతద్దం లో చూపించి ఇంత రాద్దాంతం చేస్తారా? దేశం పరువు తీస్తారా? ఏం ఫోర్బ్స్ ఫౌండేషన్ ని నిషేధించినందుకు నీకు భయం వేస్తోందా?  పర్యావరణం ముసుగులో దేశ ఆర్ధిక అభివృద్ధిని అడ్డుకుంటున్న గ్రీన్ పీస్ ని నిషేధిస్తే నీకు నొప్పి అనిపించిందా? ఏం జరిగింది ఈ ఆరునెలల్లో. దేశం లో ఉండటానికి భయపడేంత ఘోరం ఏం జరిగింది? ఒక పక్క ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం తో ప్రపంచం పోరాడుతుంటే, ఈ దేశం లో ముస్లిం లలో అభద్రతా భావాన్ని పెంచి దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నావ్? ఇది ఖచ్చితంగా వళ్ళు బలిసిన స్టేట్ మెంట్ ప్రజల్లో చర్చలు జరుగుతున్నాయి.. ఏంటి, ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోదామని మీ అర్ధాంగి  చెప్పిందా? వెళ్ళిపోండి, ఈదేశాన్ని వదిలి. ఎవ్వరు  ఉండమని బతిమలాడాడు మిమ్మల్ని?.  ఈదేశం గాలి పీల్చి, ఈ దేశం మీద విషం చల్లే నీలాంటి చీడపురుగులు  దేశాన్ని వదిలిపోతే నష్టం ఏమీ లేదు. ఇంతకీ ఎప్పుడు వెళుతున్నావ్ ఆమిర్? మీ వాఖ్యలు మమ్ములను ఎంతో భాదిస్తున్నాయి,  సినీ స్టార్ గా పదిమందికి సందేశాత్మక పద్దతుల్లో అవగాహన చెయ్యాలికాని, ఇటువంటి ప్రకటనలు అవసమా? ఈ దేశం లో పుట్టడం ఒక వరమని, ఇక్కడ ఉన్న ఇక్యమత్యం ప్రపంచం లో ఎక్కడ లేదని ఎందరో ముస్లిం సోదర్లు ఎన్నో సందర్భాలలో పేర్కొన్నారు. నీ  మాటలను వెనక్కి తీసుకొని దేశానికి క్షమాపన  చెప్పండి. వ్యక్తిగత స్వేచ్చ మనకు ఉన్నప్పటికీ ఇతరుల మనో భావాలు దెబ్బ తీసే స్థితికి రాకూడదు. ఒక్కసారి ఆలోచించండి , మంచిహనాన్ని చేతకాని తనం  గా దయచేసి అర్ధం చేసుకోవద్దు. మన మంచిని ప్రపంచం అంత పంచి శాంతి సందేశం అందిద్దాం.  -
 మీ పుట్టా రామకృష్ణ , సోషల్ వర్కర్,
శిరోముండనం(కథ)
సాహితీమిత్రులారా!
అమ్మకి సీరియస్‌గా ఉందని ఫోన్ రావడంతో హుటాహుటిన ఇండియాకి బయల్దేరాను. అమ్మ నన్ను కలవరిస్తోందని మా చెల్లెలు కాచి చెప్పింది. మూణ్ణెల్ల క్రితమే కుటుంబసమేతంగా అనాతవరం వెళ్ళి రావడంతో ఒక్కణ్ణే బయల్దేరాను.

“ఏజ్ కదా! డాక్టర్లు వారం కంటే బ్రతకడం కష్టం అంటున్నారు. నువ్వు వస్తే పొలాల పేపర్లమీద సంతకాలు పెట్టే పని కూడా వుంది,” అని అన్నయ్య చెప్పాడు.
క్రితం సారి వెళ్ళినప్పుడు పొలాల లావాదేవీల మధ్య మా ఇంట్లో పెద్ద గొడవే జరిగింది. మా అమ్మ పేరునున్న పొలం మా చెల్లెలు కాచి పేరున రాయిద్దామని అమ్మ కోరిక. అన్నయ్యకి మాత్రం సుతరామూ ఇష్టం లేదు. డబ్బు అవసరం నాకు అంతగా లేదు కాబట్టి అమ్మ ఇష్టం అని చెప్పాను. కాచి పేరునున్న ఆ అయిదెకరాలూ తనకే చెందాలన్నది అన్నయ్య వాదన.
నిజానికి అది అమ్మ పుట్టింటి ఆస్తి. మా అమ్మమ్మ పేర ఆ పొలాలున్నాయి. ఆవిడ పోతూ పోతూ ఎవరికీ తెలియకుండా అమ్మ పేర రాయించింది. అప్పట్లో మా నాన్నకది కంటగింపుగా ఉండేది. బ్రతికున్నన్నాళ్ళూ ఆ పొలం అమ్మేయాలని నాన్న చాలా ప్రయత్నాలు చేశాడు. అమ్మ మొండిగా ఇవ్వలేదు. హఠాత్తుగా నాన్న పోవడంతో ఆ పొలాల గురించి గొడవలు పోయాయి. ఏటా వచ్చే శిస్తుతో రోజులు సాఫీగానే పోతున్నాయి.
అన్నయ్య పేరున అనాతవరంలో పెద్దిల్లు, నాన్న సంపాదించిన ఏడెకరాల కొబ్బరితోట రాస్తానంది. నాకయితే చిల్లి గవ్వ కూడా అవసరం లేదన్నాను. అమ్మమ్మ పేరింటిదని ఆ పొలం కాచికే చెందాలని అమ్మకి బలంగా వుంది. మా అమ్మమ్మ పేరు కామేశ్వరి. అదే పేరు మా చెల్లెలికి పెట్టారు. ఇంట్లో అందరమూ కాచి అనే పిలుస్తాం. అమ్మమ్మ పోయి పాతికేళ్ళు దాటినా మా ఇంట్లో ఆవిడ పేరు నిత్యమూ ఏదో రకంగా మాటల్లో వస్తూనే ఉంటుంది. మా అమ్మమ్మకి అతి శుభ్రం. దానికితోడు చచ్చేటంత చాదస్తం. ఈ రెంటితో ఆవిడ అందర్నీ చంపుకుతినేది.
మా చెల్లెలు కాచికయితే అమ్మమ్మ పేరంటనే చికాకు. అది ఏం చేసినా, మాట్లాడినా – ‘పేరు పెట్టినందుకు అమ్మమ్మ పోలికలు బానే వచ్చాయని,’ అందరూ వేళాకోళం చెయ్యడంతో మరింత ఉడుక్కునేది. మా అమ్మమ్మకి కొడుకులు లేరు. ఇద్దరు కూతుళ్ళలో మా అమ్మ చిన్నది. అమ్మ పెళ్ళవగానే మా తాత పోవడంతో మా పంచన చేరింది. పెద్ద కూతురు ఢిల్లీలో ఉండేది. ఆవిడ అంతగా పట్టించుకోలేదు. మా అమ్మమ్మ పేరున్న పొలం మా అమ్మ పేరున రాయడంతో వాళ్ళకి కోపాలొచ్చి రాకపోకలు పూర్తిగా పోయాయి.
విమానం బొంబాయిలో దిగింది.
కస్టమ్స్ నుండి బయటకొస్తూండగా — “ఏయ్! రామం!” అంటూ ఎవరో పిలవడంతో వెనక్కి తిరిగి చూశాను. ఒకావిడ నాదగ్గరకొచ్చి, “నువ్వు కామేశ్వరిగారి మనవడు రామానివి కదూ? మీది అనాతవరం…” అంటూ ఆవిడ నా మొహంలోకి చూస్తూ అంటే చప్పున ఆవిణ్ణి గుర్తుపట్టాను. “మీరు చంద్రమతి కదూ?”
ఆవిడ నవ్వుతూ – “ఎన్నాళ్ళయ్యిందో మిమ్మల్ని చూసి. నువ్వు రామానివా, కాదా అన్న అనుమానం వచ్చింది. సరేలే కనుక్కుంటే పోలా అని కేకేశాను. నా ఊహ కరక్టే అయ్యింది. నువ్వు చిన్నప్పుడెలా వున్నావో అచ్చం అలాగే ఉన్నావు. ఏ మాత్రం మార్పు లేదు…” అంటూ నన్నొక్క మాటా మాట్లడనివ్వకుండా చెప్పుకుపోతోంది.
చంద్రమతిని చూసి పాతికేళ్ళు పైనే అయ్యింది. నాకంటే పదేళ్ళు పెద్ద. అప్పట్లో వాళ్ళు అనాతవరంలో మా ఇంట్లో అద్దెకుండేవారు. చంద్రమతి నాన్న అమలాపురం కోర్టులో ప్లీడరు గుమాస్తాగా పని చేసేవాడు. అప్పట్లో మా వూరు చుట్టుపక్కల చంద్రమతి గురించి తెలియని వాళ్ళు లేరు. ఎందుకంటే అమలాపురంలో ఉండే ఒక మెడికల్ రిప్రజెంటేటివుతో లేచిపోయింది. చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో ఇలాంటి సంఘటనలు అరుదుగా జరిగేవి. ఎంతో నెమ్మదిగా నోరు మెదపలేని చంద్రమతి అలా చేసిందన్నది అందరికీ ఆశ్చర్యమే! కొంతమంది ఆత్మహత్య చేసుకు చచ్చిపోయిందనీ, అది పైకి చెప్పడం ఇష్టంలేక లేచిపోయిందనే పుకారు లేవదీశారని అనుకునే వారు. చంద్రమతి ఇన్నాళ్ళూ ఏమయ్యిందని అడుగుదామనుకొని ఆగిపోయాను.
చంద్రమతి మా కుటుంబం గురించి పేరుపేరునా అడిగింది. చెప్పాను. అమ్మకి బావోలేదన్న విషయం కూడా చెప్పాను.
“ఇప్పుడెక్కడుంటున్నావు? ఎంతమంది పిల్లలు?” అని అడిగింది.
“నేనా, బెహ్రైన్ ఆయిల్ కంపెనీలో ప్రోజెక్ట్ మేనేజర్ని. ఇద్దరబ్బాయిలు. గత పదేళ్ళుగా అక్కడే ఉంటున్నాం. ఏటా వచ్చి పోతూంటాం,” అని చెప్పి, తన గురించీ అడిగాను. చంద్రమతి ప్రస్తుతం బొంబాయిలో ఉంటున్నానని చెప్పి, అడ్రసిచ్చింది.
“చంద్రా, నువ్వు ఈ మధ్యలో అనాతవరం వెళ్ళేవా?” ఉండబట్టలేక అడిగాను. లేదన్నట్లు తలూపింది. అమ్మా నాన్నా పోయి చాలా కాలమయ్యిందని మాత్రం చెప్పింది. నేను వివరాల కోసం రెట్టించలేదు.
“అవును. మీ చెల్లెలు కాచి ఎక్కడుంది? చిన్నప్పుడు భలే ముద్దుగా ఉండేది!”
“పెళ్ళయిన అయిదేళ్ళకే భర్త పోవడంతో అనాతవరంలోనే ప్రస్తుతం అమ్మ దగ్గర ఉంటోంది, చిన్న బిడ్డతో,” అని కాచి గురించి చెప్పాను.
“అయ్యో! అంత చిన్న వయసులో భర్త పోవడం అన్యాయం. మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చు కదా?”
“మా అమ్మకీ దాని గురించే బెంగ. పెళ్ళి చేసుకోమని అందరమూ పదే పదే పోరుతున్నాం. నాకు తెలుసున్న ఒకాయన చేసుకోవడానికి రెడీ. మా చెల్లెలొక మూర్ఖురాలు. మాట వినదు. పేరు పెట్టినందుకు అంతా మా అమ్మమ్మ పోలికలే!”
“తప్పు రామం. పోయినవాళ్ళని నిందించడం మంచిది కాదు. నువ్వే మీ చెల్లికి నచ్చ చెప్పి చూడు,” అన్నది చంద్రమతి. మేము గత పదేళ్ళుగా కాచిని రెండో పెళ్ళి విషయమై ఎంత పోరుతున్నామో చెప్పాను.
నా హైదరాబాదు ఫ్లయిటుకి ఇంకా రెండు గంటలుంది. ఇద్దరం పాత జ్ఞాపకాలు బాగానే నెమరువేసుకున్నాం. చంద్రమతికి ఇద్దరు పిల్లలనీ, భర్త ఒక చిన్న ఫార్మాసూటికల్ కంపెనీ నడుపుతున్నాడనీ చెప్పింది. నేను చంద్రమతి గతం గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉన్నా, ప్రశ్నించలేదు. నా ఫోన్ నంబరూ, అడ్రసూ తీసుకుంది. తిరిగెళ్ళేటప్పుడు వాళ్ళింటికి రమ్మనమని పిలిచింది. తప్పకుండా వస్తానని చెప్పాను. చంద్రమతి మద్రాసు ఫ్లయిటుకి టయిమవ్వడంతో బయల్దేరడానికి లేచింది.
“వస్తా రామం. నిన్ను కలవడం ఎంతో ఆనందంగా ఉంది. మీ వాళ్లని అడిగానని చెప్పు,” అంటూండగా ఆమె కళ్ళల్లో సన్నటి నీటిపొర స్పష్టంగా కనిపించింది. వెళుతూ వెళుతూ వెనక్కి తిరిగి వచ్చింది.
“రామం! నిన్నొకటి అడగచ్చా?” తటపటాయిస్తూ అంది.
“ఏవిటి? చెప్పు చంద్రమతీ!”
“నాకు మీ అమ్మమ్మగారి ఫోటో ఉంటే ఇవ్వగలవా? ప్రతీరోజూ సంగీత సాధన చేసేటప్పుడు ఆవిణ్ణే తలచుకుంటాను,” అంటూంటే ఆమె కళ్ళనుండి నీళ్ళు జలజలా రాలాయి.
“తప్పకుండా!” అని చెప్పి శలవు తీసుకున్నాను.
చంద్రమతి మా అమ్మమ్మ దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వచ్చేది. మా అమ్మమ్మకి సంగీతం బాగా వచ్చు. చాలా బాగా పాడేది. కాచికి అంతా అమ్మమ్మ పోలికలే, రూపం, తీరూ, మాటతో సహా. ఈ ఒక్క సంగీతం తప్ప.
చంద్రమతిని కలిశాక హైదరాబాదు ఫ్లయిటులో అనాలోచితంగా నా ఆలోచనలన్నీ మా అమ్మమ్మ చుట్టూనే తిరిగాయి. నేను తొమ్మిదో తరగతిలో ఉండగా అమ్మమ్మ పోయింది. మా అమ్మమ్మకీ, నాకు అంతగా పడేది కాదు. మా ఇంట్లో ఒక చెక్క బీరువా ఉండేది. అందులో పైన రెండు అరలూ అమ్మమ్మవి. క్రింద రెండరల్లో నా బట్టలుండేవి. ఆవిడ అరలో తెల్ల బట్టలూ, కాసిని సామాన్లూ ఉండేవి. నేనేదో ఆవిడ వస్తువులు కెలికేస్తానని ఆవిడకి చచ్చేటంత అనుమానం. చిన్న గుడ్డసంచీలో డబ్బు దాచుకునేది. అది ఎప్పుడూ నడుం దగ్గర దోపుకునేది. ఆవిడకి అతి శుభ్రం. నేనొక ఎడ్డి మనిషిలా ఉండేవాణ్ణి. ఇద్దరం చచ్చేట్టు కొట్టుకునేవాళ్ళం. ఆవిణ్ణి తిట్టాల్సి వస్తే కాచి పేరు వంకపెట్టి చెల్లెల్ని తిట్టేవాణ్ణి. ఎన్ని విసుక్కున్నా ఎంతైనా మనవణ్ణి కదా, ఆవిడే సద్దుకునేది. మిగతా విషయాల్లో ఎలా వున్నా రెణ్ణెల్లకోసారి మంగలాడ్ని పిలిచే సమయానికి మాత్రం బాగానే కాకా పట్టేది.
అమ్మమ్మకి మొగుడు పోయాక శిరోముండనం చేయించారు. అందువల్ల నెత్తి మీద ముసుగేసుకొనేది. చూడ్డానికి పచ్చగా దబ్బపండులా ఉన్న అమ్మమ్మ మొహమ్మీద తెల్ల ముసుగు మాత్రం ఆవిడ జీవితంలో నల్లమచ్చే! మొగుడు పోయాక ఆడపడుచూ, అత్తగారూ దగ్గరుండి శిరోముండనం చేయించారని వాళ్ళని రోజూ తెగ తిట్టుకునేది. మగపిల్లలు లేకపోవడం వల్ల కూతురు పంచన చేరానన్న అసంతృప్తి ఆవిడ మాటల్లో కనిపించేది. దానికి తోడు మా నాన్నకి అమ్మమ్మంటే గిట్టేది కాదు. మొగుడు పోయాక ఆవిడ ఆస్తిని తన పేర రాయమని నాన్న అడిగితే రాయను పొమ్మంది. నాన్న గయ్యిమని లేచాడు. అమ్మ మాట కాదనలేక ఆవిణ్ణి చూడక తప్పలేదు. నాన్న మాత్రం ఆవిణ్ణి చాలా విసుక్కునేవాడు. లోపల ఏం బాధపడిందో తెలీదు, ఎప్పుడూ నాన్నని ఒక్క మాటనేది కాదు.
మా బాబయ్యకి పిల్లలు లేకపోతే నన్ను దత్తత తీసుకుందామని మాటలొచ్చాయి. మా నాన్న సరేనన్నాడు. అమ్మకిష్టం లేదు. ఆ విషయమై అమ్మని ఒప్పించడానికి మా ఇంటికొచ్చినప్పుడు మా బాబయ్యని దులిప్పడేసింది మా అమ్మమ్మ.
“నిజంగా పిల్లలంటే మమకారం ఉంటే బీదవాళ్ళ పిల్లల్ని పెంచుకో! అయినా రామం గాడే కావాలా? కాచిని ఎందుకు దత్తు తీసుకోవు? ఏం? ఆడపిల్ల పనికిరాదా?” అంటూ బాబయ్యని చీల్చి చండాడేసరికి బాబయ్య మరలా మా గుమ్మం తొక్కితే ఓట్టు.
చిన్నప్పటి సంఘటన నాకింకా గుర్తు. ప్రతీసారి మంగలాడ్ని పిలిచినప్పుడు మాత్రం అమ్మమ్మ ఆ రోజంతా ఏడుస్తూనే ఉండేది. మంగలాడు పెరటి సందు వైపు వచ్చేవాడు. దూరం నుండి గుండు గీయించడం చూస్తూండేవాణ్ణి. చేస్తున్నంత సేపూ ఆవిడ కళ్ళల్లో నీళ్ళు జల జలా రాలేవి.
ఓ సారి ఎందుకేడుస్తోందోనని తెలుసుకోవాలని అడిగాను.
“ఎందుకమ్మమ్మా ఏడుస్తావు? మంగలాడు గుండు గీస్తే నొప్పి పెడుతోందా?”
“లేదురా! నొప్పి గుండుక్కాదు!” అంటూ ఏడుస్తూ గుండె మీద చెయ్యేసుకుని జవాబిచ్చింది.
“జుట్టు పోయిందనా? మళ్ళీ వచ్చేస్తుంది కదా?” ఆవిడ జవాబు అర్థంకాక అమాయకంగా అడిగేవాణ్ణి. ఎంత తిట్టుకున్నా అమ్మమ్మ ఏడవడం మాత్రం నేను తట్టుకోలేకపోయేవాణ్ణి. చిన్నతనంలో బాధ అంటే తెలిసేది కాదు.
నాకప్పుడు ఆవిడేం చెబుతోందో అర్థం కాలేదు. ఇప్పుడవన్నీ తలచుకుంటే బాధ కలుగుతుంది. అమ్మమ్మ శిరోముండనం సంఘటన తలుచుకున్నప్పుడల్లా బాధేస్తుంది. దారీ, గతీ లేక మా పంచన చేరిన ఆవిడ ఎంత నరకం అనుభవించుంటుందో కదా అనిపిస్తుంది. ఒక పక్క నాన్న చికాకు, మరో పక్క అన్నయ్యా నేనూ విసుగులు, తిట్లూ. వీటికి తోడు పక్కింటి వాళ్ళ వెటకారాలు, పనిమనుషుల ఈసడింపులూ. పైకి మాత్రం ఏమీ అనేది కాదు. ఏ త్యాగరాజ కృతో, రామదాసు భజనో పాడుకుంటూ కూర్చునేది. ఒక్కోసారి అది కూడా చేసుకోనిచ్చే వాళ్ళం కాదు.
“అబ్బా! ఆపవే ఆ కాకి సంగీతం. కావాలంటే పెరట్లో బాదం చెట్టుక్రింద కూర్చుని పాడుకో!” అని అందరూ విసుక్కునేవాళ్ళు. అలాగే చేసేదావిడ.
చంద్రమతికి అమ్మమ్మ సంగీతం నేర్పేది. చంద్రమతికి పదహారో ఏటే పెళ్ళి చేసి అత్తారింటికి పంపారు. ఒకమ్మాయి పుట్టింది కానీ అనారోగ్యంతో ఏడాదికే పోయింది. పెళ్ళయిన అయిదేళ్ళకే మొగుడు పోతే అత్తగారి వాళ్ళ బాధలు పడలేక పుట్టింటికొచ్చేసింది. కుట్ట్లూ, అల్లికలూ వచ్చు. ఊళ్ళో వాళ్ళకి బట్టలు కుట్టేది. వాళ్ళ పిన్ని వాళ్ళింటికి తరచు అమలాపురం వెళ్ళొచ్చేది. వెళ్ళినప్పుడల్లా అమ్మమ్మకి పటిక బెల్లం, ఆల్బకరా పళ్ళూ పట్టుకొచ్చేది.
అమ్మమ్మ పోయే రోజు నాకింకా గుర్తుంది. బీపీ పెరగడంతో ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ లాభంలేదంటే ఇంటికి తీసుకొచ్చేశారు. ఇహ చివరి దశలో పెరట్లో బాదంచెట్టు క్రింద ఒక చిన్న పందిరి వేసి పడుకోపెట్టారు. శీతాకాలం చలి తట్టుకోలేక మేం లోపలకి వచ్చేసేవాళ్ళం. అమ్మ మాత్రం రాత్రి చాలా సేపటివరకూ అక్కడే ఉండేది. వెచ్చదనం కోసం కుంపట్లో బొగ్గులు వేసి అమ్మ మంచం క్రింద పెట్టేది. బాదంచెట్టు క్రింద పెట్టిన రోజు బీరువాలో ఉన్న చిన్న సంచీ తెచ్చిచ్చే వరకూ అమ్మని పోరుతూనే ఉంది. అమ్మ ఆవిడ మీద జాలిపడి తెచ్చిచ్చింది. పోయేటప్పుడు కూడా ఇంకా ఈ మమకారమేనా అని అందరూ విసుక్కున్నారు. ఓ నాలుగు రోజుల తరువాత అమ్మమ్మ పోయింది.
ఆవిడ పోయాక తలగడ క్రింద చిన్న చేతి సంచీ. నాన్న విప్పి చూశాడు. అందులో ఒక చిన్న పొట్లం ఉంది. డబ్బేమోననుకొని చూస్తే ఒక చిన్న పిన్నీసుకు చుట్టి పొడవాటి వెంట్రుకలున్నాయి. అమ్మమ్మ అందంగా ఉండేదనీ, పొడవాటి జుట్టుండేదనీ అమ్మ తరచు చెప్పే మాటలు గుర్తొకొచ్చాయి నాకు. అప్పుడర్థమయ్యింది అమ్మమ్మ శిరోముండన సమయంలో ఎందుకు ఏడ్చేదో? అప్పట్లో అర్థం కాకపోయినా ఆవిడ మాటలు ఇప్పటికీ నా చెవిలో మారు మ్రోగుతూనే ఉంటాయి.
“పోయింది జుట్టు కాదురా! స్వేచ్ఛ!”
ఇప్పుడీ మాటలకి అర్థం తెలుసు. దాని వెనుక బాధ కూడా తెలుసు.
అనాతవరం వెళ్ళకుండా సరాసరి అమలాపురం హాస్పటల్కి వెళ్ళాను. నేను వెళ్ళిన రోజు అమ్మ నన్ను చూసింది. అతి కష్టమ్మీద మాట్లాడింది. కాచి పెళ్ళి అంటూ మగతగా ముద్దగా మాట్లాడింది. చూడు అంటే కాచిని అందేమోననుకొని అలాగేనని చేతిలో చెయ్యి వేశాను. ఆ మర్నాడు అమ్మ కోమాలోకి వెళ్ళిపోయింది. రెండ్రోజుల తరువాత పోయింది.
పదోరోజు కార్యక్రమాలు పూర్తయ్యాక అన్నయ్య అమ్మ పేరు మీదున్న బ్యాంక్ లాకరు తెరిపించాడు. అమ్మ పేరు మీదున్న నాలుగెకరాల పొలమూ కాచి పేర రాసిన పత్రాలు చూసి అన్నయ్య అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. నేనూ దెబ్బలాడేను. కాచికి బ్రతకడానికి ఆసరా కావాలని. అమ్మ బంగారం మనవరాళ్ళకివ్వాలనీ, వంశపారంపర్యంగా వచ్చిన అమ్మమ్మ గాజు మాత్రం కాచికి చెందాలని రాసింది.
అసలు అమ్మమ్మతో నాకు మాటలు పోవడానికి కారణం కూడా ఈ గాజే. ఆవిడ పోయేవరకూ మాట్లాడనంత ద్వేషం నాలో పెరిగిపోయింది. నేను తొమ్మిదో తరగతిలో ఉండగా మా ఇంట్లో అమ్మమ్మ మీద యుద్ధమే జరిగింది. ఎందుకంటే అమ్మమ్మ చేతికి కంకణాల్లాంటి నాలుగు గాజులుండేవి. ఎవరికీ ఇచ్చేది కాదు, మా అమ్మక్కూడా. అలాంటిది ఆ రెండుజతల గాజుల్లో మూడు పోయాయి. ఒకటే ఉంది. శిరోముండనం సమయంలో చేతి గాజులు తీసేసి బీరువాలో పెట్టేది. వచ్చి చూస్తే అందులో ఒకటే ఉంది. మిగతా మూడూ మాయమయ్యాయి. ఆవిణ్ణి ఆట పట్టించడానికి నేనూ, అన్నయ్య దాచామని అనుకున్నారు. అందరూ నన్నూ, అన్నయ్యనే అనుమానించారు. మాకేం తెలియదు మొర్రో అన్నా నాన్న వినిపించుకోలేదు. మామూలు దెబ్బలు కాదు. నాన్న చచ్చేట్లా కొట్టారు. మేం తీయలేదని తెలిశాక నాన్న అమ్మమ్మని గట్టిగా తిట్టాడు. ఆ గాజులు తనకిస్తే బ్యాంకులో పెట్టేవాణ్ణి కదాని కసురుకున్నాడు. అమ్మ కూడా అమ్మమ్మ మీద ఎగిరింది. ఉత్తప్పుడయితే మాటకి మాట చెప్పే అమ్మమ్మ ఆ క్షణంలో నోరు విప్పితే ఒట్టు. ఎవరు తీశారో తెలీదు. ఆవిడ గాజులు మాత్రం పోయాయి. ఆ తరువాత ఆవిడ పోయేవరకూ నేను మాట్లాడితే ఒట్టు. ఆవిడంటే నాకు విపరీతమైన కోపం. ఇప్పటికీ నాన్న కొట్టిన దెబ్బలు నేను మర్చిపోలేదు. ఆవిడ పోయింది. కానీ ఇంకా ఆవిడ మా మధ్య తగాదాలకి కారణం అవుతూనే ఉంది.
కాచి పేరునే ఎక్కువ వాటా వెళ్ళడం అన్నయ్యకీ, వదినకీ మింగుడు పడలేదు. ముఖ్యంగా అమ్మమ్మ గాజు మీద వదిన కన్నుపడింది. మంచి నగిషీతో ఉన్న కంకణం లాంటి గాజు కనీసం నాలుగైదు తులాలుంటుంది. ఈ విషయంలో కాచికీ, వదినకీ మధ్య గొడవ జరిగింది. అత్తగారి గుర్తంటూ వదిన ఏడుస్తూ చాలా ఓవరాక్షన్ చేసింది. సెంటిమెట్లకిచ్చే విలువ మనుషులకుండదనుకొని వెనక్కి వచ్చేశాను. ఈ గొడవంతా చూసి కాచి తనపేర రాసింది కాబట్టి తనకే చెందాలని పట్టు పట్టింది. అన్నయ్యా వదినా కొంత గొడవ చేశారు. కాచిని ఎదిరించలేక ఊరుకున్నారు. అన్నయ్య మాత్రం కాచి మీద గుర్రుగానే ఉన్నాడు. ఇదంతా అమ్మమ్మ వల్లే వచ్చిందనుకుంటూ గట్టిగా పైకి తిట్టాను.
“మధ్యలో అమ్మమ్మేం చేసిందట? వీళ్ళని అనలేక ఆవిణ్ణెందుకు తిట్టుకోవడం? అయినా ఆవిడంటే నీకెప్పుడూ పడదు. పోయినవాళ్ళని తిట్టుకోకూడదని…” కాచి అలా అనేసరికి కాస్త వెనక్కి తగ్గాను.
అన్నయ్యా వదినల తీరు చూస్తే కాచికి ఆసరాగా ఉంటారన్న నమ్మకం పోయింది. వాళ్ళ ప్రవర్తన చూసి చికాకేసింది. ఈ రాద్ధాంతం చూసాక కాచితో ఒంటరిగా మాట్లాడలని అమలాపురం వెళ్ళే వంకన బయటకి వచ్చాం.
“కాచీ, ఇప్పటికయినా నా మాట విను. నువ్వు పెళ్ళి చేసుకో! ఇలా అన్నయ్య పంచన ఎన్నాళ్ళుంటావు? నీ కోసం కాకపోయినా ఆ పిల్లాడి కోసమయినా…” అని మరోసారి అమ్మ మాటగా చెప్పాను.
“నువ్వు చెప్పినంత ఈజీ కాదురా అన్నాయ్యా! నాక్కొంచెం టైమియ్యి,” అంది.
బయల్దేరుతుండగా చంద్రమతి అమ్మమ్మ ఫొటో అడిగిన సంగతి గుర్తుకొచ్చింది. పాత ఫొటో ఆల్బమ్స్ అన్నీ తిరగేశాను. చిత్రం అమ్మమ్మది విడిగా ఒక్క ఫొటో లేదు. తాతయ్యా, అమ్మమ్మా ఉన్న ఒక్క ఫోటో ఉంది. గబగబా తీసి బ్యాగులో పెట్టుకుని తిరుగు ప్రయాణం కట్టాను.
“నీకేం కావాలన్నా నేనున్నాను, మర్చిపోకు!” అని కాచి చెయ్యి పట్టుకొని చెప్పాను.
హైదరాబాదు వచ్చాక చంద్రమతికి ఫోను చేసి అమ్మ పోయిన సంగతి చెప్పాను. వాళ్ళింటికి వస్తానని చెబితే తనే కారు తీసుకొస్తానని చెప్పింది. బొంబాయి చేరగానే ఎయిర్పోర్టుకొచ్చింది. కారులో వాళ్ళింటికి బయల్దేరాము. అనాతవరం విశేషాలు చెప్పాను. అమ్మమ్మ ఫోటో సంగతి గుర్తొచ్చి బ్యాగులోంచి తీసి చంద్రమతికిచ్చాను. దానికేసి చూస్తూ కంట నీరు పెట్టుకుంది.
“ఈ ఫోటో మీ అమ్మమ్మగారిదే? నా వరకూ ఆవిడ నెత్తిమీద ముసుగేసుకున్న రూపమే గుర్తుంది. వయసులో ఎంత అందంగా ఉందో ఆవిడ. ముఖ్యంగా ఆ పొడవాటి జడ!”
“ప్రయాణం హడావిడిలో ఆల్బంలో చేతికందిన ఫొటో తీసుకొచ్చాను. ముసుగుతో ఆవిడ ఫొటో ఉంటే పంపమని కాచికి చెబుతాను.”
అమ్మమ్మ పోయిన సంగతీ పోయినప్పుడు సంచీలో ఉన్న జుట్టు గురించీ చెప్పాను. వింటూ ఏడ్చింది.
“రామం! నిన్ను కలుస్తానని కల్లో కూడా ఊహించలేదు. మీ అమ్మమ్మ ఫొటో చూస్తే ఏడుపొచ్చేస్తోంది. ఇన్నాళ్ళూ నాలో దాచుకున్న నిప్పు నీతో చెప్పుకుంటే కానీ చల్లారదు,” అంటూ బిగ్గరగా ఏడ్చింది. ఏం మాట్లాడాలో తెలీలేదు. మౌనంగా ఉండిపోయాను.
“…మీ అందరికీ తెలుసు. నేను ఒక మెడికల్ రిప్రజెంటేటివుతో లేచిపోయానని. నిజానికి నాకంత ధైర్యమూ, తెగువా లేవు. పిన్నీ వాళ్ళింటికి అమలాపురం వెళ్ళేదాన్ని. వాళ్ళ పక్కవాటాలో ఆయన ఉండేవారు. నన్ను చూసి పెళ్ళి చేసుకుంటానని చెప్పారు. అమ్మా, నాన్నా ఒప్పుకోలేదు. పైగా ఆయనది కాపు కులం. ఆయన ఒప్పించడానికి ప్రయత్నించారు. ఈ పెళ్ళి జరిగితే నాన్న చస్తానని బెదిరించారు. సరిగ్గా ఆ సమయంలో ఈ విషయం మీ అమ్మమ్మ గారికి చెప్పాను. ఆవిడ ప్రేరణ వల్లే…” అంటూ ఆగిపోయింది.
“పారిపో! ఇంతకంటే మంచి అవకాశం నీకు జన్మలో రాదు. నిర్భయంగా వెళ్ళి పెళ్ళి చేసుకో! ఏ కులమయితేనేంటి? మగాడేగా? మనిషేగా? అమ్మా నాన్న ఎల్లకాలం ఉండరు. ఈ కూపస్థమండూకాల మధ్య నీకు స్వేచ్ఛ ఉండదు – అంటూ నాకు లేని తెగువా, ధైర్యమూ నూరిపోసింది మీ అమ్మమ్మగారే!”
ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను. మెల్లగా లేచి బీరువాలోంచి ఒక చిన్న పేకట్టు తీసుకొచ్చి విప్పింది. వాటిని క్షణంలో గుర్తుపట్టాను.
“ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి చూడొద్దని నాకు అవసరానికుంటుందని నాకిచ్చారు. ఇన్నేళ్ళూ పదిలంగా దాచుకున్నాను. నువ్వు కనిపించావు. నా భారం తీరింది. ఇవి మీకు చెందాల్సినివి. తీసుకో!” అంటూ నా చేతిలో పెట్టింది.
ఈసారి నాకళ్ళ నీళ్ళొచ్చాయి. శిరోముండన సమయంలో అన్న అమ్మమ్మ మాటలు గుర్తుకొచ్చాయి.
“పోయింది జుట్టు కాదురా! స్వేచ్ఛ!”
----------------------------------------------------------
రచన: సాయి బ్రహ్మానందం గొర్తి, కోనసీమకథలు, ఈమాట సౌజన్యంతో
-----------------------------------------------------------
- ఏ.వి.రమణరాజు

(4)
వసంతునితో వెన్నెలఱేడు పోటీ!

సాహితీమిత్రులారా!
చం. క్షితిపయి వట్టి మ్రాకులు జిగిర్ప వసంతుడు దా రసోపగుం
భిత పద వాసనల్ నెఱప, మెచ్చక చంద్రుడు మిన్నునం బ్రస
న్నతయును సౌకుమార్యము గనంబడ ఱాల్ గరగంగజేసె;

ప్రతి సంవత్సరం లాగానే ఆ ఏడు కూడా మధుమాసం వచ్చింది. వసంత ఋతువుని వసంతునిగా సంభావించడం కవిసమయం. అతను మన్మథుని చెలికాడు కదా. వసంతుడు వస్తూనే చక్కగా భూమిపై మోడువారిన చెట్లనన్నింటినీ చిగురింపజేశాడు. మామూలుగా చిగురించాయా అవి! రస ఉపగుంభిత పద వాసనల్ నెఱప – చిగురించాయి. రసవంతమైన (ఫలపుష్పాల వంటి) సామగ్రితో, వాటినుండి వచ్చే సుగంధాలు నలువైపులా వ్యాపించేట్టుగా చిగురించాయి. అలా చిగురింపజేశాడు వసంతుడు. వసంతుడు అంతటి ఘనకార్యాన్ని చేసినా పైనుండి చూస్తున్న చంద్రుడు మెచ్చుకోలేదు. సరికదా, అతనితో స్పర్థ బూనాడు. అతని కంటే ఘనుడనని నిరూపించుకోడానికి ప్రసన్నమైన, సుకుమారమైన తన వెన్నెలజల్లు కురిపించి రాళ్ళను సైతం కరగింపజేశాడు! శరత్తులాగే వసంతంలో కూడా వెన్నెల విరగకాస్తుంది, ఆకాశం నిర్మలంగా ఉంటుంది కాబట్టి. పైగా వేడెక్కే పొద్దులనుండి చల్లని ఉపశమనాన్ని కూడా యిస్తుంది. అంచేత మధుమాసం కూడా వెన్నెల మాసమే. ఈ రెండంశాలనూ కలపోస్తూ, వసంతునికీ చంద్రునికీ మధ్య స్పర్థనొక దాన్ని కల్పించాడు కవి. కవి చమత్కారానికి హద్దేముంది! పైగా ‘ప్రతి పద్యమునందు జమత్కృతి గలుగన్ జెప్పనేర్తు’నని ప్రతినబూనిన కవి కూడాను.

ఈపాటికే ప్రాజ్ఞులయిన పాఠకులకి ఈ కవి ఎవరో ఎరుకలోకి వచ్చే ఉంటుంది. ఇది చేమకూర వేంకటకవి రచించిన విజయవిలాసములోని పద్యం. నేను పైన యివ్వడం మానేసిన చివరి పాదం కూడా ఈపాటికే చాలామంది గుర్తించి ఉంటారు.

ఏ గతి రచియించిరేని సమకాలమువారలు మెచ్చరే కదా!

పద్యం తెలియని చాలామందికి కూడా తెలిసే వాక్యం ఇది. తెలుగు సాహిత్యంలో అంతగా ప్రసిద్ధికెక్కింది. వసంత వర్ణనలో విశేషమైన కల్పన చేయడమే కాకుండా దానిని ఉదాహరణగా తీసుకొని, సామాన్యంగా మనుషులలో ప్రత్యేకించి కవులు కళాకారులలో, కనిపించే ఒకానొక లక్షణాన్ని ఎత్తిచూపిస్తున్నాడు చేమకూర కవి. ఈ కవి ప్రతి పద్యం లోనే కాదు ప్రతి పదంలో కూడా చమత్కారం గుప్పించగల దిట్ట. చివరి పాదం చదివిన తర్వాత మళ్ళీ పద్యమంతా తిరిగి చదివితే, చివరి పాదం హఠాత్తుగా ఊడిపడింది కాదని, పద్యం మొదటినుంచీ కవి ఆ విషయాన్ని తాను ప్రయోగించిన పదాల ద్వారా స్ఫురింపజేశాడనీ అర్థమవుతుంది. ‘రసోపగుంభిత పదవాసనలు’ అంటే నవరసాలతో శోభిల్లే పదభావాలు. అలాంటి శబ్దార్థాలు కూడిన కవిత్వాన్ని రచించి, ఒక కవి మోడువారిన హృదయాలను చిగురింపజేశాడు. మరొక కవి దానిని మెచ్చకుండా పంతంతో తను కూడా కావ్యరచన చేశాడు. ప్రసాదము, సౌకుమార్యము అనే గుణాలతో ప్రకాశిస్తూ, రాతి గుండెలను సైతం కరిగించే కావ్యం అది. ప్రసాదము, సౌకుమార్యము అనేవి కావ్యగుణాలు. ఆలంకారికులు మొత్తం పది కావ్యగుణాలను చెప్పారు – శ్లేషము, ప్రసాదము, మాధుర్యము, సౌకుమార్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజస్సు, సమాధి. ప్రసాదము అంటే అందరికీ అర్థమయ్యే పదాలతో సులువుగా సాగిపోయే గుణం. సౌకుమార్యం అంటే అక్షరరమ్యతతో చెవికి ఇంపుగా ఉండే లక్షణం. ఇలా ఒకవైపు వసంతాన్ని వర్ణిస్తూనే మరొకవైపు ఒకానొక లోకస్వభావాన్ని స్ఫురింపజేయడం కవి ప్రతిభ. రసోపగుంభిత పదవాసనలు, ప్రసన్నత, సౌకుమార్యము మొదలైన పదాలలో శ్లేష ద్వారా దీన్ని సాధించాడు వేంకటకవి. అయితే పద్యం మొత్తం మీద ఉన్న అలంకారం శ్లేష కాదు. ఎందుకంటే ఈ పద్యంలో ఉన్నది వసంతుడూ చంద్రుడే కాని కవులు కాదు. కవుల మధ్యనున్న స్పర్థ కేవలం పాఠకులకు స్ఫురించే అంశమే తప్ప నేరుగా కవి చెప్పింది కాదు. ఇటువంటి అలంకారాన్ని సమాసోక్తి అంటారు. శ్లేష ఎక్కువగా శబ్దప్రధానమైనది. సమాసోక్తి అర్థప్రధానమైనది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, భావప్రధానమైనది. అది మనసుని మరింతగా హత్తుకుంటుంది.

ఏదయితేనేమి, ఆ యిరువురి స్పర్థ, వారి రచనలను అనుభవించేవారికి గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది! అది కవుల విషయమైనా సరే, చంద్రవసంతుల విషయమైనా సరే. స్పర్థయా వర్ధతే విద్య అని అన్నారు కదా. అయినా ఒక కవిగా, ఎంత గొప్ప కవిత్వాన్ని రచించినా సమకాలము వారలు మెచ్చకపోవడాన్ని గూర్చి వాపోయాడు వేంకటకవి. మెచ్చకపోవడమే కాదు, ఏ రకంగా తక్కువ చేసి చిన్నబుచ్చుతారో కూడా మనకీ పద్యంలో చూచాయగా తెలియజెప్పాడు. పద్యాన్ని మరొకసారి జాగ్రత్తగా చదివితే, చంద్రుడు వసంతుడిని తక్కువ చేయడం మనకి కనిపిస్తుంది. ‘వట్టి మ్రాకులు చిగిర్ప’ అన్న పదబంధంలో ‘వట్టి’ అనే పదం మోడువారిన అనే అర్థంతో పాటు, విడిగా చదివితే ‘కేవలం’ అనే హేళన భావం కూడా ధ్వనిస్తుంది. కేవలం చెట్లని మాత్రం చిగురింపజేయడమే వసంతుడు చేసే పని అని, తాను మాత్రం రాళ్ళను సైతం కరిగించగలడనీ- చంద్రుని పరంగా అన్వయించుకోవచ్చును. అలాగే వసంతుడు తన కార్యాన్ని సాధించడానికి ‘క్షితిపయి’కి వెళ్ళవలసి వచ్చింది. మరి తానో, ఆకాశంలో ఉండే తన కార్యాన్ని సాధిస్తాడు. ఇలా ప్రతి పదాన్ని సార్థకంగా ప్రయోగించడం చేమకూర ప్రత్యేకత. తాపీ ధర్మారావుగారు విజయవిలాసానికి చేసిన హృదయోల్లాస వ్యాఖ్యలో ఈ ప్రత్యేకతను అద్భుతంగా పట్టి మనకందించారు. వేంకటకవి పద్యాలలో అధికాధికం శబ్దచమత్కార బంధురమైనవి. అర్థచమత్కారంతో సున్నిత భావాన్ని స్ఫురింపజేయడం ఈ పద్యంలో నన్ను ఆకట్టుకొన్న అంశం. సాధారణంగా కవుల కావ్యాలలో ఋతువర్ణనలు విస్తారంగా సాగుతాయి. అయితే వేంకటకవి విడిగా ఋతువర్ణన చేయలేదు. సాయంకాల వర్ణనతో కలిపి వసంతాన్ని వర్ణించడం ఇక్కడున్న విశేషం. పై పద్యంలో చంద్రుని ప్రసన్నతకూ సౌకుమార్యానికీ కారణం వసంతకాలం ఒక్కటే కాదు. అది పున్నమిరేయి కూడానూ. దీని ముందరి పద్యాలను చదివితే ఆ విషయం బోధపడుతుంది. అది కూడా కవి నేరుగా చెప్పడు, సాయంకాల దృశ్యాన్ని చిత్రించడం ద్వారా మనకి ప్రత్యక్షం చేస్తాడు. ఆ పద్యాన్ని కూడా ఆస్వాదించి వసంతుని ఆగమనాన్ని స్వాగతిద్దాం.

అంగజరాజు పాంథ నిచయంబులపై విజయం బొనర్ప నే
గంగ దలంచునంత మునుగల్గగ దాసులు పట్టు జాళువా
బంగరు టాలవట్టముల భంగి గనంబడె బూర్వ పశ్చిమో
త్తుంగ మహీధరాగ్రముల దోయజశాత్రవమిత్ర బింబముల్

వసంతుడు మన్మథుని చెలికాడే కాదు, సేనాపతి కూడా. అందువల్ల వసంతమాసం అంటే మన్మథుడు జైత్రయాత్ర చేసే సమయం అన్నమాట. మన్మథరాజు జైత్రయాత్రకి సన్నద్ధమైన సమయాన్ని వర్ణిస్తున్న పద్యమిది.

ఇక్కడొక చిన్న పిట్టకథ చెప్పుకోవాలి. ఒకసారి భవభూతి, దండి, కాళిదాసులతో కలిసి భోజరాజు సముద్రపుటొడ్డుకు విహారానికి వెళ్ళాడట. అక్కడ అస్తమిస్తున్న సూర్యుడిని చూసి ‘పరిపతతి పయోనిధౌ పతంగః’ అన్నాడట. అంటే సూర్యుడు సముద్రంలో పడిపోతున్నాడు అని. మిగిలినవారు ఒకొక్క పాదంతో ఆ పద్యాన్ని పూరించాలి. వెంటనే దండి ‘సరసిరుహా ముదరేషు మత్తభృంగః’ అన్నాడట. అంటే పద్మాల కడుపుల్లో మత్తిల్లిన తేనెటీగలున్నాయి అని. తేనె తాగేందుకు వాలిన భ్రమరాలు పద్మ మరందాన్ని త్రాగి మత్తెక్కి ఉన్నాయి. ఇంతలో సూర్యాస్తమయం అయింది. పద్మాలు ముడుచుకుపోయాయి. అలా ముడుచుకుపోయిన పద్మాల కడుపుల్లో మత్తిల్లిన భృంగాలు ఉండిపోయాయి! ఆ తర్వాత భవభూతి ‘ఉపవనతరుకోటరే విహంగః’ అన్నాడు. ప్రక్కనే ఉద్యానవనాలున్నాయి. ఆ తోటల్లో చెట్లున్నాయి. ఆ చెట్ల తొర్రలలోకి పక్షులు చేరుకున్నాయి అని అర్థం. ఇక చివరగా కాళిదాసు వంతు. అతను ‘యువతి జనేషు శనై శ్శనై రనంగః’ అని పూరించాడు. అంటే యౌవనవతులైన స్త్రీలలోకి మెల్లమెల్లగా మన్మథుడు ప్రవేశిస్తున్నాడు అని.

అంచేత మన్మథుని దండయాత్రకు అనువైన సమయం సాయంత్రమే. ఇక్కడ జైత్రయాత్ర ఎవరిపైన అంటే, పాంథనిచయంబులపైన. అంటే ప్రయాణంలో ఉన్నవాళ్ళపైన. తమ ప్రియతములకు దూరమై విరహంతో వేగుతూ ఉండే వాళ్ళపైనన్న మాట! రాజు ఎక్కడికైనా బయలుదేరాడనగానే పెద్ద సన్నాహమే కదా. అతని ఠీవికి తగ్గట్టుగా ముందు కొంతమంది రాజోచిత లాంఛనాలను పట్టుకొని నడుస్తారు. అలాంటి రాజచిహ్నాలలో సూర్యచంద్రుల బొమ్మలున్న పలకలు అమర్చిన పొడుగాటి కర్రలను సూర్యపాను చంద్రపాను అంటారు. వాటినే ఆలావర్తములని (ఆలవట్టములు) కూడా అంటారు. ఇక్కడ యాత్రకి సన్నద్ధమయినది మామూలు రాజు కాదు కదా! జగజ్జేత అయిన మన్మథుడు. అతనికి బొమ్మలతో పని లేదు. అచ్చంగా చంద్రసూర్య బింబాలే మేలిమి (జాళువా) బంగారు ఆలవట్టములయ్యాయి అన్నట్టుగా అటూ యిటూ, తూర్పుపడమటి కొండలపై (పూర్వ పశ్చిమ ఉత్తుంగ మహీధరాగ్రముల) ప్రకాశించాయి. తోయజశాత్రవుడు అంటే పద్మాలకు శత్రువు – చంద్రుడు. తోయజమిత్రుడు సూర్యుడు. చంద్రబింబం తూర్పుకొండపైన, సూర్యబింబం పడమటికొండపైన వెలుగుతోంది. అందుకే అది సాయంసమయం. సూర్యాస్తమయమూ చంద్రోదయమూ ఒకేసారి అవుతున్నాయంటే అది పున్నమి అన్నమాట. అది మధుమాసమనీ పున్నమినాటి సాయంసంధ్యా సమయమనీ ఎక్కడా నేరుగా చెప్పకుండా కేవలం దృశ్యచిత్రీకరణ ద్వారా తెలియజేయడం కవి రచనలోని చమత్కారం! అంగజరాజు అనే పదానికి కూడా గొప్ప సార్థకత ఉందని వివరించారు తాపీవారు. దీనికి అంగదేశంలో పుట్టిన రాజు అనే అర్థం కూడా వస్తుంది. అంగదేశం భరతఖండంలో ఉత్తరాన ఉంది. అందువల్ల అంగజరాజు ఉత్తరదిక్కు నుండి బయలుదేరుతున్నాడని ఊహించవచ్చు. అప్పుడు సరిగ్గా అతని కుడిపక్క (అంటే పడమట) సూర్యపాను, ఎడమపక్క (అంటే తూర్పున) చంద్రపానూ ఉన్న దృశ్యం మనకి చక్కగా సాక్షాత్కరిస్తుంది.
-----------------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు,
ఈమాట అంతర్జాల మాసపత్రిక సౌజన్యంతో
----------------------------------------------------------




- ఏ.వి.రమణరాజు

(3)
మహారాజుగారి రయిలుబండి(అనువాదకథ)


సాహితీమిత్రులారా!

అనుకోకుండా జరిగిందది.

సెల్వనాయగం సర్ ఇంట్లో ఉండాల్సిన నేను కొన్ని ఇబ్బందుల వల్ల జార్జ్ సర్ ఇంట్లో ఉండవలసి వచ్చింది. నాకు ఆయనతో పరిచయం లేదు. ఆ రెండు రాత్రులు, ఒక పగలూ నా జీవితంలో ముఖ్యమైనవిగా మారబోతున్నాయి. అప్పటికి నా పద్నాలుగేళ్ళ జీవితంలో నేను కనీవినీ ఎరగని కొన్ని విషయాలు నాకు తెలియబోతున్నాయి. ఇంకొన్ని ఆశ్చర్యాలకూ నేను సిద్ధం కావలసి ఉండింది.

జార్జ్ సర్ మలయాళీలు. ఆయన మూడు పెద్ద గుండీలున్న పొడవు చేతుల జుబ్బా ఒకటి వేసుకునున్నారు. ముఖం బడిపంతులుకు ఉండాల్సినట్టు లేదు. నోరు పైకి వంగి ఎప్పుడూ నవ్వుతున్నట్టే కనిపిస్తారు.

మిసెస్ జార్జ్‌ని చూడగానే కాస్త పొంకంగా అనిపించారు. బొట్టులేని తెల్లని నుదురు. ఆమె నడత చూస్తే వయసులో ఉండే అహం ఇంకా తగ్గినట్టులేదు. నల్లంచున్న తెల్లచీర కట్టుకునున్నారు. చీర కుచ్చిళ్ళు బహు చక్కగా కాగితపు మడతల్లా చెదరకుండా ఉన్నాయి. నేను అక్కడికెళ్ళినప్పుడు ఇద్దరూ కూతురి రాకకోసం చూస్తూ గుమ్మంలో నిల్చోనున్నారు. నేనూ వారితో గుమ్మం దగ్గరే నిలబడ్డాను.

దూరంగా ముగ్గురమ్మాయిలు వస్తూ కనిపించారు. అందరూ ఒకేలాంటి బట్టలు వేసుకునున్నప్పటికీ ఒకమ్మాయి పొడవుగా ఉండటం వల్ల దూరం నుండే తెలిసిపోతోంది. నడిచే వైనంలో మధ్యమధ్యన తన నడుము కనబడుతోంది. దగ్గరికి వచ్చినాక మెరుస్తున్న ఆ అమ్మాయి కళ్ళు చూశాను. ఒలిచిన ఇప్పగింజల్లా రెండు వైపులా వాడిగల కన్నులు. మెడలో చైన్ గాని, చెవులకు కమ్మలు గాని, ఒంటిమీద ఇంకేమీ ఆభరణాల్లాంటివి లేవు. అయితే పైపెదవి మీద ఒక పుట్టుమచ్చ ఉంది. అది తన పెదవులు కదిలినప్పుడల్లా కదిలి నా చూపుని అటే తిప్పుకుంటోంది. చూడకుండా ఉందామన్నా ఉండలేకపోయాను. ఇదొక పన్నాగమేమో అబ్బాయిలను ఆకట్టుకోటానికి అనుకున్నాను.

జార్జ్ సర్ తనను రోసలిన్ అని నాకు పరిచయం చేశారు. తను నన్ను కళ్ళెత్తి ఓమాదిరిగా చూసింది. ఆ ముఖం చూస్తే పదమూడేళ్ళుండచ్చు అనిపించింది. కాని ఆ అమ్మాయి శరీరం ఇంకా ఎక్కువ వయసునే చెప్తున్నట్టుండింది.

ఎన్నో ఆశ్చర్యాలు కలగబోతున్నాయని చెప్పాను కదూ. మొదటి ఆశ్చర్యం వారి ఇల్లు. నేను అంతవరకు ఎక్కడా చూడనన్ని సౌకర్యాలున్నాయి ఆ ఇంట్లో. నాకంటే పొడవైన నిలువెత్తు గడియారం గంటగంటకీ మోగుతుంటుంది, నేనిక్కడున్నాను అని గుర్తు చేస్తూ. హాల్‌లో రిఫ్రిజిరేటర్ ఉంది. అది ఉండుండి గుయ్యని శబ్దం చేస్తుంటుంది. ఎప్పుడూ తాకలేదు నేను అప్పటిదాకా, ఎలా ఉంటుందో ఆ ఫ్రిజ్ తలుపు ఒక్కసారి తీసి చూద్దామనిపించింది. వేలాడే గొలుసుని లాగితే పెద్దగా చప్పుడు చేస్తూ ఫ్లష్ చేసే కమోడ్. ఎన్నో మొక్కలను కుండీల్లో పెట్టి పెంచుతున్నారు. అవేవీ జీవితంలో ఒక్క పూవు కూడా పూసేవిలాగా లేవు.

నాకు కేటాయించిన గది అప్పటికప్పుడు సర్దించినట్టున్నారు. అలమర, టేబులు ఒక పక్క అంతా ఆక్రమించుకున్నాయి. తాళం వేసి వున్న ఆ గాజు తలుపుల అలమరాలో చాలా పుస్తకాలున్నాయి. పక్కన ఒకదానిపై ఒకటి సర్దిపెట్టిన ఖాళీ పెట్టెలు. అలమరలో చోటు లేకో, అవసరం లేకో బైటే పడేసి వున్న ఇంకాసిని పుస్తకాలు, ఇంకేవో వస్తువులూ. పరుపుపై అప్పుడే ఉతికిన వాసనతో తెల్లటి బెడ్‌షీట్. తేలికైన రెండు మెత్తటి దిండ్లు. అటాచ్డ్ బాత్రూమ్. అయితే దీనికి మూడు తలుపులున్నాయి, మూడు గదులనుండీ వాడుకోడానికి వీలుగా. లోపలికి వెళ్ళగానే మూడిటికీ లోగడియలు పెట్టుకోవాలి, తర్వాత మరిచిపోకుండా లోపలి గడియలన్నీ తీసి రావాలి. బాత్‌టబ్ తెల్లటి రంగునుండి గోధుమరంగులోకి మారుతోందా లేక గోధుమరంగునుండి తెల్లగా అవుతుందా అని చెప్పలేనట్టుంది. దాని గోడకంటుకుని పాములా ఒంపులు తిరిగిపోయున్న ఒక పొడవైన వెంట్రుక. ఇంకా ఆడవాళ్ళున్నారని చెప్పే కొన్ని వస్తువులు. లోదుస్తులు దాపరికం లేకుండా దండెం పైన వేలాడుతున్నాయి.

రెండో ఆశ్చర్యం, ముద్దులు పెట్టడం! ఆ అమ్మాయి పద్దాక ముద్దులు పెడుతోంది. ఊరకనే అటు వెళ్ళే తల్లిని వాటేసుకుని బుగ్గమీద ముద్దిచ్చింది. ఒక్కోసారి వెనకనుండి వచ్చి ఆమెను హత్తుకుని ఆశ్చర్యం కలిగించింది. ఒక్కోసారి బుగ్గమీద, ఒక్కోసారి నుదుట. తల్లికూడా అలానే చేసింది. కొన్నిసార్లు అలా ముద్దుపెట్టేప్పుడు వాలుకళ్ళతో నన్ను చూస్తోంది. అలాంటప్పుడు నేను ఏం చెయ్యాలన్నది నాకు తెలియలేదు. జీవితంలో మొట్టమొదటిసారి పరాయివాళ్ళింట్లో ఉంటున్నాను. అందునా వాళ్ళు కేథలిక్స్. వాళ్ళ అలవాట్లు అలా ఉంటాయేమో అనుకున్నాను. అయినా ఏదో మొహమాటంగానే ఉంది. ఇది వీళ్ళకి సహజమైన చర్య అని మనసులో అనుకున్నాను.

భోజనాల బల్ల దగ్గర వడ్డించగానే నేను తొందరపడి కంచంలో చేయి పెట్టబోయాను. ప్రార్థన మొదలవ్వగానే చేయి వెనక్కి లాక్కున్నాను. చివర్లో ఆమెన్‌ చెప్పినప్పుడు నేను శ్రుతి కలపాలని నాకు తెలియలేదు. అలా చెయ్యనందుకే అనుకుంటా ఆ అమ్మాయి నన్నదోలా చూసింది.

ఆ రాత్రి జరిగినదీ ఒక వింత సంఘటనే! అలవాటు లేని గది, అలవాటు లేని మంచం, మునుపెన్నడూ వినని శబ్దాలు. అసలు నిద్ర పట్టలేదు.

చిన్నగా నా గది తలుపు తెరిచిన అలికిడి. కొవ్వొత్తిని పట్టుకుని రోసలిన్ మెల్లగా నడిచి వచ్చింది. నావైపైనా చూడకుండా నేరుగా పెట్టెలు పేర్చిన వైపుకెళ్ళి నిల్చుని అమెరికాలో ఉండే లిబర్టీ స్టాచ్యూలా కొవ్వొత్తిని పైకెత్తింది. నేను అదాటున లేచి కూర్చున్నాను.

“భయపడ్డావా?” ఇదే తను నాతో మాట్లాడిన మొదటి మాట. నేను లేచెళ్ళి తన పక్కన నిలబడి ఏంటా అని చూశాను. ఆ కర్రపెట్టెలో ఐదు పిల్లి పిల్లలు ఒకదానినొకటి ఒరుసుకుని మెత్తగా కళ్ళు మూసుకుని ఉన్నాయి. పూలగుత్తిని తీసుకున్నట్టు ఒక్కొక్కదాన్నీ చేతిలోకి తీసుకుని చూసింది. తన చేతి వెచ్చదనం ఆరిపోయేలోపు నేనూ ఆ పిల్లిపిల్లలను తాకి చూశాను. కొత్త అనుభవంలా ఉంది.

“మూడు రోజులే అయింది ఈని. రెండు చోట్లకి మార్చింది. తల్లి పిల్లి ఈ కిటికీ గుండానే వస్తుంది, పోతుంది. చూసుకో,” అంది.

నేనేం మాట్లాడలేదు. కారణం, నేనింకా అప్పటికి ఆ అమ్మాయి మొదటి ప్రశ్నకే జవాబు వెతుక్కుంటున్నాను అక్షరాలు కూడబలుక్కుంటూ. కాసేపు నాకేసి చూసింది. నాకు బాగా పరిచయమున్న వ్యక్తిలాగా రహస్యం చెప్పే గొంతుతో, “ఈ తల్లి పిల్లిపిల్లగా ఉన్నప్పుడు మగపిల్లిగా ఉండేది. ఉన్నట్టుండి ఒకరోజు ఆడపిల్లయ్యి పిల్లలు పెట్టేసింది‌!” అంది. గొంతు ఇంకా సన్నగా చేసుకుని, “ఈ నల్లపిల్లికి మాత్రం నేను పేరు పెట్టేశాను. అరిస్టాటిల్‌!” అంది.

ఇప్పుడు మాత్రం “అరిస్టాటిల్ ఎందుకు?” అని అడగాలనుకున్నాను.

నా మనసు చదివినదానిలా, “చూడటానికి అచ్చం అరిస్టాటిల్‌లా ఉంది కదా?” అంది.

ఇంతసేపూ నా పక్కన తను నన్ను ఆనుకునే ఉంది. తన నైట్‌డ్రెస్ ఆ చిన్న వెలుతురులో మరింత పలచగా ఉన్నట్టు కనిపించింది. విరబోసుకున్న తన జుట్టు నుండి వెచ్చదనం, వొంటి నుండి వస్తున్న వాసన నాకు కొత్తగా ఉండింది. నా వేళ్ళు తనలోని ఏదో ఒక భాగాన్ని తాకగలిగేంత దగ్గరగా నిల్చునుండింది. తననే చూస్తున్న నన్ను చూసి చూపుడు వేలు పెదవులపై శిలువలా పెట్టి సైగ చేస్తూ మెల్లగా నడిచి తలుపు తీసుకుని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వెళ్ళిన దిక్కుకి మెడ తిప్పి పడుకుని కాసేపు చూస్తూ ఉండిపోయాను. అది ఒక కొత్త అనుభవం.

ఉదయం అల్పాహారం తొందరగానే ఐపోయింది. వాళ్ళందరూ మంచి ఖరీదయిన బట్టలు కట్టుకునున్నారు. మిసెస్ జార్జ్ దగ్గరనుండి లీలగా హాయిగా పర్ఫ్యూమ్ వాసన వస్తోంది. రాత్రి అసలేమీ జరగనట్టే పిల్లిపిల్లలా కూర్చుని ఉంది రోసలిన్. నెమలి పింఛంలాంటి డ్రెస్సు, నల్లటి షూస్, పొడవైన తెల్లటి సాక్స్ వేసుకునుంది. తను కావాలనే మెల్లగా తింటున్నట్టనిపించింది. భోజనాల బల్ల దగ్గర మేమిద్దరమే మిగిలాం. ఎవరూలేని ఆ సమయం కోసమే చూస్తున్నట్టు నా వైపుకి తిరిగి, గొంతు సవరించుకొని రహస్యం చెప్తున్నట్టుగా “మా నాన్నదగ్గరొక రయిలు బండి ఉంది‌.” అంది లోగొంతుకతో.

“రయిలా?” అన్నాను.

“అవును రయిలే. పద్నాలుగు పెట్టెలు!”

“పద్నాలుగు పెట్టెలా!”

“ఆ బండే తిరువనంతపురానికీ కన్యాకుమారికీ మధ్య తిరిగే రయిలు బండి. పొద్దున ఆరుగంటలకు బయల్దేరి మళ్ళీ రాత్రికి వచ్చేస్తుంది‌.”

“రయిలు బండిని మీ నాన్నెందుకు కొన్నారు?”

“కొనలేదు, స్టుపిడ్. తిరువనంతపురం మహారాజా ఈ లైనుని మా తాతయ్యకు అతని సేవకు మెచ్చుకుని కానుకగా ఇచ్చారట. ఆయన తర్వాత అది మా నాన్నకు వచ్చింది. ఆయన తర్వాత అది నాకే!”

తన తర్వాత అది ఎవరికి సొంతమవుతుందని తేలేలోపు మిసెస్ జార్జ్ వచ్చేశారు. గబగబమని వాళ్ళందరూ మేరీమాత గుడికి బయల్దేరడంతో ఆ సంభాషణ అర్ధాంతరంగా ఆగిపోయింది.

పద్నాలుగేళ్ళ పిల్లాడిని ఎంతసేపని నాకిచ్చిన గదిలో ముడుక్కుని, చదవడానికేమీ లేకుండా ఎవడో బ్రిటీష్‌వాడు, జో డేవిస్ అట, రాసిన Heat అన్న పుస్తకాన్ని ఎంతసేపని తిరగేయను? కానీ ఏంచేయను. వాళ్ళు తిరిగొచ్చిన అలికిడి వినిపించి చాలాసేపైంది. ఇక తప్పక నా గది తలుపు కొంచం తీసి బయటకి తొంగి చూశాను. ఎవరూ కనిపించలేదు.

వరండాలోకి వచ్చాను. అడుగున నూనె మరకలున్న పొడవైన పేపర్ బేగులో చేయిపెట్టి ఏదో తీసి నోట్లో వేసుకొని నములుతూ ఉండింది తను. ఆ చేయి బేగులోకి పోయిరావడం పుట్టలోకి పాము వెళ్ళడం, రావడంలా కనిపించింది నాకు. పేరు తెలీని ఉండలాంటిదాన్ని అందులోనుండి తీసి నోట్లో వేసుకుంటోండింది. ఆ కవర్ నాకేసి చాపింది. తన మణికట్టు గెణుపు నా ముఖానికి దగ్గరగా నున్నగా కనిపించింది. పేరు తెలియని పదార్థాలు నేను తినను. వద్దని తలూపాను.

“ఐస్ ముక్కలు కావాలా?” అని అడిగింది.

నా జవాబు కోసం చూడకుండనే వెళ్ళి ఫ్రిడ్జ్ తీసి నీలం రంగు ప్లాస్టిక్ ట్రే పట్టుకొచ్చింది. రెండంచులూ పట్టుకొని దాన్ని విల్లులా వంచి ఐసు ముక్కలు పైకెగురుతుంటే పట్టుకుని నోట్లో వేసుకుంది. మరొక ముక్కని పట్టి నీటిబొట్లు కారుతుండగా నాకందించింది. తను ఒకటి తీసుకుని పటుక్కుమని కొరికి తింది.

అటూ ఇటూ తిరిగి చూసి, ఫ్రిడ్జ్‌కి వినపడనంత దూరంలో ఉన్నట్టు నిశ్చయించుకుని, రహస్యంగా చెప్పింది, “ఈ నీళ్ళు కేరళనుండి తెచ్చినవి. అర్ధగంటలో గడ్డకట్టి ఐస్ ఐపోతుంది. ఇక్కడి నీళ్ళు చాలా స్లో! రెండు రోజులు పడుతుంది గడ్డకట్టడానికి‌!” అంది.

నేనూ ఆమెలా పటుక్కుమని కొరికాను. పళ్ళు జివ్వుమన్నాయి. తలలో ఏదో జరిగినట్టనిపించింది. కొరికిన వేగానికి ఐసుముక్క నీళ్ళయి నా నోటి చివరలనుంచి కారాయి. రోసలిన్ నన్ను చూసి గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. “నీకు ఐసు ముక్కలు తినడం చేతకాదు‌” అంది.

తనను పరీక్షగా చూశాను. హాఫ్ స్కర్ట్, కాలర్‌బోన్‌నీ భుజాలనీ దాచని షర్టు వేసుకునుంది.

అప్పుడే రయ్యిమని ఒక జోరీగ తన చుట్టు ఎగరడం మొదలుపెట్టింది. అది తన భుజంమీద వాలబోతుంటే విదిలించింది. నేను కంగారుగా తోలబోతే నా చేయి ఆ అమ్మాయి భుజానికి తగిలి, త్రాసు ఒక వైపు కిందకు వాలినట్టు పక్కకు వంగింది.

ఇప్పుడు రోసలిన్ కాళ్ళ దగ్గర ఎగురుతోంది ఆ జోరీగ. మళ్ళీ నేను తోలే ప్రయత్నంగా చేయి విసిరాను. తను నవ్వడం మొదలుపెట్టింది. ఈ ఆట ఆగకుండా సాగింది కాసేపు. ఆ ఆట ఆపేస్తాడేమో అనే భయంతో నేను మనసులో దేవుడికి దణ్ణం పెట్టుకున్నాను. కాని, అదే అయింది. పనిమనిషి వచ్చి రోసలిన్‌తో అమ్మ పిలుస్తున్నారని చెప్పింది.

ఆ ఆదివారం సాయంత్రపు టీ కార్యక్రమం కూడా మరిచిపోలేనిదే. ఇంటి బయట తోటలో మొదలైందది. పసుప్పచ్చగా పండి మెరుస్తున్న పెద్దపెద్ద పళ్ళున్న బొప్పాయి చెట్టు కింద ఇది జరిగింది. దూరంగా రెండు తాడిచెట్లకు కట్టిన పొడవైన వెదురు కర్రలననుండి కిందకి దిగిన వైరొకటి జార్జ్ సర్ మ్యూజిక్ రూమ్‌లో ఉన్న రేడియో ఆంటెనాకి వెళ్తోంది. ఆ రేడియోనుంచి ఒక ఆలాపన వినిపిస్తూ ఉండింది.

మిసెస్ జార్జ్ అందరికీ కప్పులో టీ పోసి ఇచ్చారు. పింగాణీ ప్లేట్‌లో బిస్కట్స్ పెట్టి ఇచ్చారు. నలుపలకలుగా ఉండి పైన సన్నని చక్కర పలుకులు చల్లి ఉన్నాయవి. ప్రతీ బిస్కట్‌కీ తొమ్మిది బెజ్జాలున్నాయి. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయాయవి. అంత రుచికరమైన తొమ్మిది బెజ్జాల బిస్కట్లు తినడం అదే మొదటిసారి!

ఉన్నట్టుండి జార్జ్ సర్ తన కూతురిని గిటార్ వాయించమని ఆజ్ఞాపించారు. ‘ఓ డాడీ…’ అని అయిష్టంగా, వెళ్ళి గిటార్ పట్టుకొచ్చింది. కాలిమీద కాలేసుకుని, ఒత్తుకునే పేము కుర్చీలో ఇబ్బందిపడుతూ కూర్చుని వాయించుతూ పాడటం మొదలుపెట్టింది. ఆమె స్కర్ట్ పైకి జరిగి ఎండపొడ తగలని తెల్లని తొడలు కనిపించాయి. Don’t let the stars get in your eyes అని మొదలైంది ఆ పొడవైన పాట. Love blooms at night, in daylight it dies అన్న లైను నాకోసమే రాయబడినట్టు అనిపించింది. శ్రుతి లేకుండా, స్వరం కలవకుండా పావురపు గొంతేసుకుని పాడినప్పటికీ ఆ పాట నాకు చాలా బాగా నచ్చేసింది.

ఇలాంటొక అన్యోన్యమైన కుటుంబాన్ని నేనెప్పుడూ అప్పటిదాకా చూసెరగను. మిసెస్ జార్జ్ భుజంపైకి వేసుకున్న పైటలో మడతలు విచ్చుకున్న విసనకర్రలా క్రమంగా ఉన్నాయి. వాటిని జాకెట్‌లోకి వెండి పిన్నుతో బిగించారు. రోసలిన్ కళ్ళు మునుపటి కంటే ఇంకా పొడవుగా చెవులను తాకుతున్నాయా అన్నట్టు అనిపించాయి. ముఖంలో మెరుగు. జార్జ్ సర్ చేతులు రుద్దుకుంటూ భోజనాల బల్ల దగ్గర కూర్చుని ఉత్సాహంగా మాట్లాడుతున్నారు. వాళ్ళతోబాటు నేనూ కూర్చున్నాను. ‘జపం చేద్దాం!’ అని ఆయన ప్రారంభించారు.

‘మా దేవుడవయిన యేసు ప్రభువా! ఎల్లలులేని నీ కృపచేత నిన్నటిలాగే ఈ రోజూ మాకు లభించిన ఈ రొట్టె కోసం ఇక్కడ కూడివున్న మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ రొట్టె కూడా దొరకనివారికి దారి చూపించుము. భారం మోసేవారికి ఉపశమనం కలిగించే రక్షకుడా! మా భారములను తేలిక పరుచుము. మాతో కొత్తగా చేరిన ఈ స్నేహితుడిని రక్షించుము. ఆతని ఆశయాలన్నిటినీ నెరవేర్చుము. నీ మహిమను చాటిచెప్పేందుకు మమ్ములను ఆశీర్వదించు ప్రభువా! ఆమెన్‌.’

ఈ సారి సరైన చోట సరైన సమయానికి ఆమెన్ చెప్పేశాను. నన్నుకూడా వారి ప్రార్థనలో కలుపుకున్నందుకు సంతోషం కలిగింది. నేను ఆమెన్ అన్నప్పుడు నావైపు కొంటెగా చూసి, తన కళ్ళను పక్కకు తిప్పుకోకుండా అలానే చూస్తూ ఉండిపోయింది.

అయితే ఇంత ఆహ్లాదకరంగా మొదలైన రాత్రి చివరికొచ్చేసరికి చెత్తగా ముగిసింది.

భోజనాల బల్ల దగ్గర వున్నంతసేపు సంభాషణ చాలా ముఖ్యం. అది శుభ్రంగా ఇంగ్లీషులోనే సాగింది. ఒక తమిళ మాటో, మలయాళమో మచ్చుక్కూడా లేదు. ఆ అమ్మాయి నదికంటే వేగంగా మాట్లాడగలుగుతోంది. నా ఇంగ్లీషు చీకట్లో నడిచినట్టు ఉంటుంది. కాబట్టి మాటల పొదుపు పాటింపు చాలా అవసరం అనిపించింది. ఆ పొదుపు మాటలక్కూడా సగం సమయం గాలే వదిలాను.

తినే పింగాణీ ప్లేట్‌ని చూస్తూ తినడం నిషేధించినట్టు, బల్లపై పరచివున్న పదార్థాలను ‘దయచేసి ఇది అటివ్వండి…’. ‘ఆ రొట్టెలను ఇటు జరపండి‌…’ అని ఒకరిని ఒకరు అడుగుతూ అందించుకుంటూ తింటారు. ఇది కూడా నాకు కొత్తే.

అవియల్‌ అనే కొత్త వంటకం రుచిలో నేను ముణిగిపోయి వున్నాను. అప్పుడు జార్జ్ సర్ ఇంగ్లీషులో ఏదో అడిగారు. ఏమడిగారో నాకు తెలియదు గనుక వినిపించుకోలేదు. రోసలిన్ సన్నని స్వరంతో జావాబిచ్చింది. హఠాత్తుగా పైకప్పు అదిరిపోయేలా జార్జ్ సర్ అరిచారు. నేను వణికిపోయాను. గ్లాసులో నీళ్ళమీద వలయాలు కనిపించాయి. ఆ అమ్మాయి అంతవరకూ చూస్తున్న కొంటె చూపును నా మీదినుండి లాక్కుని ప్లేటుని చూస్తూ తినసాగింది. తన కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

మిసెస్ జార్జ్ వాతావరణాన్ని తేలికపరచాలని కళ్ళతో సైగలు చేశారు. అప్పటికీ జార్జ్ సర్ ముఖంలో కోపం తగ్గలేదు. ఆయన శాంతించడానికి చాలా సమయం పట్టింది.

ఆ రాత్రి చాలాసేపు నిద్రపట్టక అటూ ఇటూ పొర్లుతున్నాను. గాలి సవ్వడి చేసినప్పుడెల్లా తలుపు తెరచుకుంటుందా అని దీక్షగా చూస్తూ ఉన్నాను. అసలు తెరుచుకోనేలేదు.

ఎలానో ఒకలా నిద్రపోయాను. నడిజాము దాటాకేమో ఏదో చప్పుడుకి మెలుకువ వచ్చింది. చీకటి తప్ప మరేం కనిపించలేదు గానీ ఏవో మాటల్లాంటివి వినిపించాయి. గుసుగుసగా ఆడ గొంతు, ‘కాస్త ట్రై చెయ్యండి, ప్లీజ్!’ అని. మగ గొంతులో ఏవో మూలుగులు. మళ్ళీ నిశ్శబ్దం. కాసేపటికీ మళ్ళీ అదే ఆడగొంతు, ‘సరే, పోన్లెండి‌.’ అని చిరాగ్గా. తర్వాత చాలా సేపు మేలుకునే ఉన్నాగానీ ఏమీ వినిపించలేదు.

చెప్పినట్టే సెల్వనాయగం సర్ తెల్లవారుజామునే వచ్చేశారు. రిజిస్ట్రేషన్ పనులన్నీ పూర్తిచేసి నాకు సెబరపట్నం హాస్టల్‌లో సీటు ఇప్పించేశారు. అందరూ అది చాలా మంచి హాస్టల్ అని సర్టిఫికేట్ ఇచ్చారు. నాకిచ్చిన గదికి మరో ఇద్దరు స్టూడెంట్లొస్తారనగానే శత్రుదేశపు సైన్యం వస్తుందన్నంత ఆత్రంగా నా సరిహద్దులను ఆక్రమించుకున్నాను.

నేను నా పెట్టె, సామాన్లు తీసుకోడానికి వచ్చినప్పుడు ఇల్లు తెరచే ఉంది. పనిమనిషి ఒక చేపని బండమీద కడుగుతూ ఉంది. ఆ చేప కళ్ళు పెద్దగా ఒక వైపుకు తెరచుకుని నన్నే చూస్తోంది. అయితే ఆమె మాత్రం నా వైపుకి తిరిగి చూడలేదు.

గది తలుపు జారుగా తెరిచివుంది. అయినా అక్కడి అలవాటుని ఆచరిస్తూ తలుపుని రెండు సార్లు కొట్టాకే లోపలికెళ్ళాను. నా పెట్టె, సంచీ పెట్టినచోటే ఉన్నాయి. అవి అందుకున్నాక గదంతా ఓసారి చూశాను. నా జీవితంలో మరోసారి ఇక్కడ ఉండే అవకాశం రాదని తెలిసిపోయింది.

ఏదో గుర్తొచ్చిన వాడిలా కర్రపెట్టె దగ్గరకెళ్ళి తొంగి చూశాను. నాలుగు పిల్లలే ఉన్నాయి. తల్లి పిల్లి మళ్ళీ పిల్లల్ని చోటు మారుస్తున్నట్టుంది. నల్ల పిల్లిపిల్ల లేదు. మిగిలిన నాలుగు పిల్లలూ తమ వంతు కోసం చూస్తున్నట్టున్నాయి. అవి మెత్తగా, వెచ్చగా ఉన్నాయి. రో-స-లి-న్ అని చెప్పుకుంటూ ఒక్కో అక్షరానికీ ఒక్కో పిల్లని తాకాను.

తిరిగొచ్చే దారిలో తను మాట్లాడిన మొదటి మాట గుర్తొచ్చింది. ‘భయపడ్డావా?’ ఎంత ఆలోచించినా చివరి మాట ఏంటో గుర్తుకు రాలేదు.

బ్రహ్మాండమైన పిల్లర్లతో కట్టబడిన ఆ బడి, కేంపస్‌లో ఉన్న చెట్లూ నన్ను ఆకట్టుకున్నాయి. ఇంత పెద్ద స్కూల్లోనూ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోనూ దానికవతలున్న నగరాల్లోనూ జీవించే ఏ ఒక్కరికీ తెలీని ఒక విషయం నాకు మాత్రమే తెలుసు. ఆ నల్ల పిల్లిపిల్ల పేరు అరిస్టాటిల్. ఆ ఆలోచనే ఎంతో సంతోషాన్నిచ్చింది.

తన గురించి తెలుసుకోవాలని ఉన్నా, ఎలా తెలుసుకోవాలో అర్థంకాక ఏ ప్రయత్నమూ చెయ్యలేదు. ఎవరిని అడగాలో కూడా తెలియదు. నేను ఎంతో శ్రమపడి సీటు సంపాయించుకున్న ఈ అమెరికన్ మిషన్ స్కూల్లో ఆ అమ్మాయి చదవటం లేదని కొన్నాళ్ళకే తెలిసిపోయింది. రోసలిన్ అన్న ఆమె అందమైన పేరుని Rosalin అని రాయాలా లేక Rosalyn అని రాయాలా అన్న ఈ చిన్న విషయంకూడా కనుక్కోలేదే అని చాలా బాధపడ్డాను.

చాలా కాలం తర్వాత తను కేరళనుండి వేసవి సెలవులకి వచ్చుంటుందనీ మళ్ళీ చదువులు కొనసాగించడానికి వెళ్ళిపోయుంటుందనీ ఊహించుకున్నాను. ఎప్పట్లాగే ఆ ఊహకి కూడా చాలా ఆలస్యంగానే వచ్చాను.

ఈ కొత్త బళ్ళో కెమిస్ట్రీ సర్ విలియమ్స్ ఒకటే కర్రపెత్తనం చలాయించేవాడు. మెండలీవ్ అన్న రష్యా శాస్త్రవేత్త చేసిన కుట్ర కారణంగా మేము పీరియాడిక్ టేబిల్స్‌ని కంఠస్థం చెయ్యాలని అజ్ఞాపించాడు. అప్పుడు 112 ఎలిమెంట్స్ లేవు; తొంబైరెండే ఉన్నాయి. ఎంత చదివినా వాటిని కంఠతా పట్టలేకపోయాను. బరువు తక్కువైనది హైడ్రోజన్ అనో, బరువైనది యురేనియం అనో ఆ వివరాలు నా జ్ఞాపకాల బండల మీదనుంచి జారిపోతూనే ఉన్నాయి. ముందు పేరు పెట్టాక తర్వాత కనుక్కున్న ఎలిమెంట్ జెర్మేనియం అన్నది నాకెప్పుడూ గుర్తుండేది కాదు అప్పట్లో. కాబట్టి ఆ రెండేళ్ళు విలియమ్స్ సర్ నా పట్ల అసంతృప్తితోనే ఉన్నాడు కానీ జాలిపడో పెద్దరికంతోనో పొరపాటునకూడా నాకు E కంటే ఒక గ్రేడు ఎక్కువివ్వాలని ప్రయత్నించలేదు. ఇతని హింసకు గురై నేను నిద్రపోయే ముందు రోసలిన్‌ని తలచుకోలేకపోవడం అన్న దారుణం కూడా రెండుమూడు సార్లు జరిగింది!

ఇది జరిగి ఇప్పటికి చాలా ఏళ్ళు దాటింది. ఎన్నో దేశాలు తిరిగాను. ఎన్నో దేశాల వీధులూ రహదార్లూ గుర్తుండిపోయాయి. ఎందరి ముఖాలనో ఆకర్షించాను. ఎన్నో గాలుల్ని పీల్చాను… ఎన్నో తలుపులనూ తెరిచాను. ఎన్నో మంచాలలో నిద్రపోయాను. ఇంకెన్నో రకరకాల ఆహారాలు తిన్నాను.

అయితే కొరకగానే కరిగిపోయే సన్నని చక్కెర పలుకులు చల్లిన తొమ్మిది బెజ్జాల బిస్కట్లు తిన్న ప్రతిసారీ రోసలిన్ వాసన, ఒక గిటార్ నోటూ నా మనసులోకి రావడం మాత్రం ఇప్పటికీ ఆగలేదు!
----------------------------------------------------------
(మూలం: మహారాజావిన్ రయిల్ వండి (2001) (మహారాజుగారి రయిలుబండి) కథల సంపుటినుండి.)
రచన: అవినేని భాస్కర్ (మూలం: ఎ. ముత్తులింగం)
ఈమాట సౌజన్యంతో
---------------------------------------------------------


- ఏ.వి.రమణరాజు

(2)ఎక్కడ నుంచి…? 



సాహితీమిత్రులారా! 



”ఎక్కడి నుంచి?” 



నమస్కారం. బాగున్నారా అన్న తరువాత, ఓ అపరిచిత వ్యక్తి దగ్గర నుంచి వచ్చిన రెండో ప్రశ్న ఇది. 



వరుసగా బారులు దీరి ఉన్న కార్ల మధ్యన స్థలం కనపితే, కారు పార్క్‌ చేసి తాళం చెవితోపాటు ఉన్న రిమోట్‌ని నొక్కి, ఆ కారును లాక్‌ చేసి, ఇటు తిరిగానో లేదో, ఈ ఆగంతకుడు ప్రశ్నలతో ప్రత్యక్షం. వెంట్రుకలు పూర్తిగా రాలిపోయాయి. ముఖంలో ముడుతలు ఉన్న, జీవితంలో తిన్న డక్కామొక్కీలతో సంపాదించిన ఓ అనిర్వచనీయమైన ప్రశాంతత. ఓ చిరునవ్వు, కొద్దిగా వంగిన శరీరం, వేసుకున్నది పసిఫిక్‌ ట్రైల్‌ కోటు. డాకర్స్‌ పాంటు, నైకీ బూట్లు అయినా, ఎందుకో ఓ తెల్ల జుబ్బా, పంచ, చెప్పులు వేసుకున్నట్లనిపించింది. పడమట అస్తమిస్తున్న సూర్యుడు, అరుణ వర్ణాలను కలిపిన తెరను అతని వెనుక దించడానికి ప్రయత్నిస్తున్నాడు. కొద్ది దూరంలో లాండ్స్కేప్‌ కని నిర్మించిన సరస్సులో బాతులు చేస్తున్న చప్పుడు విని, ఆకాశంలో ఎగురుతున్న మరో గుంపు బాతులు, పలుకరించి పోదామనో ఏమో, పొలోమని గుంపుగా నీళ్ళలోకి దిగాయి. 

”సీర్‌ రాప్స్‌ి నుంచి వస్తున్నానండి” అన్నాను బదులుగ. 



”అబ్బే అది కాదండి. ఆంధ్రలో ఎక్కడి నుంచి” అని మళ్ళీ ప్రశ్నించాడు ఆ ముసలతను చిరునవ్వుతోనే. 



”తిరుపతి దగ్గర ఓ పల్లెనండి” అన్నాను. 



సరస్సు దగ్గర నిలబడి ప్రశ్నలేసే యక్షుడిలాగ అతను మరో ప్రశ్న వేయబోయే ముందే, అతని కుటుంబ జనమనుకుంటా అప్పటికే ఓ వంద అడుగులు ముందుకు నడిచిన వారు, వెనక్కు వచ్చి ముఖాలు ఇబ్బందిగా పెట్టి, ”హలో, హాయ్‌ు” అంటూ నన్ను పలకరించి, ఇంకా నాతో మాట్లా లని ప్రయత్నిస్తున్న ఆ ముసలతనికి నచ్చచెప్పి, తీసుకెళ్ళడనికి ప్రయత్నం చేయసాగారు. మార్చి కాబట్టి, ఇంకా చిరు చలి వేస్తున్న, అప్పుడే నిక్కరు, షర్టు వేసుకున్న ఓ మధ్య వయస్కురాలు, ”ఈ ముసలాయనతో ఇదో పోరైపోయింది. కనబడిన ప్రతి మనిషితో కబుర్లేసుకోవాలనుకుంటాడు” అని తన భారీ శరీరాన్ని ఓ వందుగులు నడిపించం వల్ల కలిగిన గసల మధ్య విసుక్కోవడం వినిపించింది. అలా ఆ ముసలతనిని తీసుకొని ఆ కుటుంబం ముందు పోతుంటే కొద్దిగా వెనుక వారిని అనుసరించం మొదలెట్టాను. ఎదురుగా తెల్లటి గుడి గోపురం, అస్తమిస్తున్న సూర్యుని కాంతులకు కొత్త వర్ణాలను సంతరించుకొని కొత్తగా కనిపిస్తున్నది. జనాల రాకపోకలతో హడవిడిగానే ఉంది. 



చికాగో ఆరోరాలో కట్టించిన బాలాజి గుడిని అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాను. అక్కడికి వెళ్ళితే మనస్సులో ఓ ప్రశాంతత. డువాన్‌ వీధిలో షాపింగుకని, ఓహేర్‌ ఏర్‌పోర్టులో రిసీవ్‌ లేక సెండ్‌ ఆఫ్‌ కనో చికాగోకు వచ్చి దారిలో గుడి సందర్శనానికని వచ్చిన జనాలతో గుడి సందిగా ఉంది. నేను గుడికి రావడనికి కారణం విస్సు. వాడిని చూసి ఓ ఆరేళ్ళపైనే అయ్యింది అనుకుంటాను. ఫోన్‌లో తరచు మాట్లా ుకున్నా, వాడిని ఇన్ని రోజుల తరువాత కలుస్తున్నామని ఆనందంగానే ఉంది. వాడు ఈ మధ్యనే చికాగోకి తూర్పున ఓ వంద మైళ్ళ దూరంలో ఉన్న వూరికి రిలొకేట్‌ అయ్యాడు. నేను చికాగోకి పమట ఓ రెండొందల మైళ్ళ దూరంలో ఉన్నాను. నేను చికాగోకు పనిమీద వస్తున్నానని విని, వాడు నన్ను కలుద్దామని చికాగో వస్తానన్నాడు. గుడిలో కలుద్దామని ప్లాన్‌ వేసుకున్నాము. పార్కింగ్‌ లాట్‌ నుంచి గుడికి వెళ్తా విస్సు జాడ కనిపిస్తుందేమోనని చుట్టూ 

చూసాను. వచ్చినట్లు లేదు. 



గుడిలో అడుగుపెట్టి, అర్చనకని డబ్బులు కట్టి, ఓ బ్రవును బేగ్‌లో అరటిపళ్ళు తీసుకొని, మెట్లెక్కి ఎడమ వైపున్న వినాయకునికి, వళ్ళి, నాయకి సమేతంగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామికి, కుడివైపున్న మల్లికార్జున 

స్వామి, భ్రమరాంభలకు మ్రొక్కి, నవగ్రహాలను శాంతింపజేయడనికి ప్రదక్షిణలు చేసి వెంకటేశ్వర గుడి ఆవరణలో ప్రవేశించాను. బంగారు నగలు, పట్టుబట్టలు, కార్నేషన్‌, చేమంతి, రోజా పూల అలంకరణలు ఓ ఎన్నారై టచ్‌ ఇవ్వగా దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు దేవుడు. అప్రయత్నంగా కళ్ళు మూసుకుని చేతులెత్తి నమస్కరించాను. అలా దేవుని చూస్తుంటే ఎదో ఓ ప్రశాంతత. దేవుడు 
కనపేటట్లు హాల్లోనే ఒకచోట పద్మాసనం వేసుకొని కూర్చుని విస్సు కోసం వేచి ఉన్నాను. ఆ ఆవరణలోనే ఓ మూల ప్రొద్దున సత్యనారాయణ వ్రతం చేసిన గుర్తులు కనిపిస్తున్నాయి. గర్భగుడికిరువైపుల శ్రీదేవి, 
భూదేవిలకి దర్శనాలు, ప్రదిక్షిణలు జనం అవిరామంగా చేస్తూనే ఉన్నారు. అక్కడక్కడ మన సంస్క ృతిని పిల్లలకి పరిచయం చేయాలనే తపనలో ఉన్న తల్లిదండ్రులు కనిపిస్తున్నారు. యాంకీ యాసతో పద్యాలు, శ్లోకాలు మురిపంతో చూస్తున్న వారి ముందు వల్లె వేస్తున్నారు చిన్నారులు. మరోవైపు పెళ్ళి చేసుకొని కొత్తగా ఈ దేశంలో అడుగు పెట్టిన యువతీ యువకులు స్వెట్‌ షర్ట్‌, షార్ట్‌లతో కనిపిస్తున్నారు. ఇండియా నుంచి రాగానే ఇక్కడి జనాలతో కలిసి పోయేలా మాటా, యాస, నడక, దుస్తులు మార్చే యువతరం, పిల్లలు పుట్టే సరికి పంచా, జుబ్బాలు, పట్టుచీరలు కట్టుకొని గుడికి రావాలనుకోవడం, పిల్లలను మన సంప్రదాయంలో పెంచాలనుకోవడం ఎన్ని సార్లు చూసిన అచ్చెరువు గొల్పుతూనే ఉంటుంది. 



విస్సు నేను తరచుగా ఫోన్‌లో మాట్లాుకుంటూనే ఉంటాము. మా అబ్బాయి, అమ్మాయి చదువులు ముగించి ఉద్యోగరీత్యా టెక్సాస్‌ ఒకరు, వర్జీనియా ఒకరు మూవ్‌ అయ్యిపోయి, మా ఇంటిని కూడ ఓ ఖాళి గూడును చేసారు. విస్సుకు ఆలస్యంగా ఓ అబ్బాయి పుట్టాు. మొన్నీమధ్యనే కాలేజీలో చేరాడనుకుంటా. వాడిని చూసి ఓ ఆరేళ్లపైనే అయ్యి ఉంటుంది. తరచుగా కొడుకుని పెంచంలో తన బాధలు చెప్పుకొని నా సలహాలు విస్సు అడుగుతుండే వాడు. కొడుకు దేవుని మీద ఏ మాత్రం భక్తి లేకుండ ఓ నాస్తికునిలాగా తయారయ్యాడని విస్సు బాధ. 

#### 
గుడిలో ఓ మూల ఫోల్డింగ్‌ కుర్చీలో ఓ ముసలమ్మ కూర్చుని ఉంది. ఆవిడ దరిదాపుల కూర్చున్న వారిని ఉద్దేశించి బోసుబాబుతో పాటు తను ఈ దేశం ఎలా వలస వచ్చి ఎలా గ్రీన్‌ కార్డ్‌ సంపాదించింది, బోసుబాబు తన కుటుంబంలోని వారినందరిని ఇక్కడికి తెచ్చే ప్రయత్నాలని గురించి ఓ మెగా సీరియల్‌ లాగా బ్రాడ్కస్ట్‌ చేయసాగింది. భరించలేక లేచే జనాలతో, తెలియక ట్రాప్‌ అవుతున్న కొత్త జనాలతో ఆ మూల ఓ వింత సందిని జోడించుకుంది. విస్సు కోసం ఎదురుచూస్తు, జనాలను, అక్కడ జరిగే దృశ్యాలను చూస్తు కాలం గపసాగాను. అలా జనసందోహం చూడటంలో అదో ఆనందం. విస్సు ఇంకా రాలేదమబ్బా అనుకుంటుండగానే భుజం మీద ఆప్యాయంగా చేయి పటం, తిరిగి చూస్తే నవ్వుతూ విస్సు ప్రత్యక్షం. 



”ఏరా విస్సు ఎలా ఉన్నావు – చాలకాలం అయ్యింది నిన్ను చూసి. 



ఎందుకింత ఆలశ్యం అయ్యింది?” అన్నాను నేను. 



”180 మీద ఒకటే ట్రాఫిక్‌ జాం బ్రదర్‌. నీకెలా అయ్యింది ప్రయాణం” అని తిరిగి విచారించాడు. 



విస్సు నన్ను బ్రదర్‌ అనే పిలుస్తాు. బంధువర్గాలకి సుదూరంగా వుండటం వల్ల స్నేహితులలోనే బంధువులను వెదుక్కుంటామేమో! అలా పల్కరింపుల తరువాత గర్భగుడిలోకి వెళ్ళి అర్చనలు చేయించి, పూజారి 

ఇచ్చిన తీర్థం, శగోపురం, ప్రసాదాలని స్వీకరించి, ప్రసాదంగా ఇచ్చిన ఆల్మండ్‌ పలుకులని నముల్తూ క్రిందనున్న కెఫెటేరియాకి దారి తీసాం. వీకెండ్‌ కాబట్టి బాగా రష్‌గా వుంది. టోకెన్‌లు కొనడనికి ఓ 
క్యూ, కొన్న టోకెన్‌లు మార్చి తిండి తెచ్చుకోవడనికి మరో క్యూ. రెండింటిలోను ఓ పాతిక దాకా మనుష్యులున్నారు. సీరియల్‌, మఫ్పిùన్‌లు, కేక్లు, పిజ్జాలు రెడుగా వంట చేయకుండ తినడనికి అలవాటు 
పి, ఇడ్లు, దోశె అంటే చికాగో గుడిలోనో, దీవాన్‌ వీధిలోనో దొరికే ఎక్సోటిక్‌ డిష్‌లుగా మారింతరువాత, ఇలాంటి రద్ది సహజమే. దైవదర్శనంతో పాటు ఈ ‘వింతైన’ వంట కాలు భుజించ ం కూడ 
చికాగో రావడనికి ఓ ముఖ్య కారణమేమో. ఇడ్లు, వడ, మసాలా చాయ్‌ు నేను తీసుకున్నాను. విస్సు దోశ, మసాల చాయి తీసుకున్నాడు. ఓ మూల టేబుల్‌ ఖాళీగా కనపడితే కొన్న టిఫిన్‌లు అక్కడ పెట్టి, స్ష్టెరో 
ఫోం గ్లాసులలో నీరు తెచ్చుకొని కూర్చున్నాము. 



విస్సు మనస్సులో ఏదో మధనప ుతున్నట్లు తెలుస్తూనే వుంది. మళ్ళీ వాళ్ళబ్బాయి చంటి గురించే అని ఊహించాను. టీనేజర్లని పెంచ ం తల్లిదండ్రులకి ఓ ఛాలెంజే. నేను, మా ఆవిడ, మా పిల్లలిద్దరిని ఆ స్టేజిలో భరించం కష్టమే అయ్యింది. తెలిసీ తెలియని తనం, తా పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న వితండ వాదం, అవివేకం వల్ల ఉండే ఓవర్‌ కాన్‌ఫి ెంసులు సురేకారం, గంధకం, బొగ్గులలాగ మిళితమైపోయి, తల్లిదండ్రులను చూస్తునే అగ్గిలా అంటుకొని భగ్గున రోజుకో గొడవ లేందే టేనేజి వారి రోజులు గ వవనుకుంటాను. 



”ఏరా విస్సు, అదోలా ఉన్నావు” అన్నాను, ఇడ్లు ముక్క తుంచుతూ. 



”పాత పాటే బ్రదర్‌. చంటి గురించే, వాడు టేనేజిలో అడుగు పెట్టినప్పటినుంచి శాంతి లేకుండ పోయింది. చెప్పిన మాట ఒకటీ వినడు.” 



”మళ్ళీ ఏమైంది?” అన్నాను నేను. 



”వాడు నేను ఇచ్చే సలహాలు ఒకటీ పాటించు. వాడి మంకుతనం వాడిదే. పొద్దున లేచి పేపర్‌ చదువురా అంటాను. ఊప˙, వాడు వింటే కదా. ఆ పేపర్‌ ముట్టు. మనమంతా ‘హిందూ’ పేపర్‌ చదివే 

ఈ స్థితికి ఎదిగామా. దేశంలోను, ప్రపంచంలోను జరుగుతున్న విషయాలను గురించి సరి అయిన అవగాహన లేకపోతే ఎలా” అని విస్సు వాపోయాడు. 



”పోనీ, వాడికి పేపర్‌ చదవడం వల్ల కలిగే లాభాలని గురించి వివరించావా?” అన్నాను నేను. 



”చెప్పి చెప్పి నోరు పిపోయిందనుకో. వాడు వింటే కదా, అలానే పొద్దునే పూజ చేసి దేవుణ్ణి కూడ మ్రొక్కి మరీ సర్కార్‌కు పోరా అంటాను. వాడు ఆ పూజ గది వైపే పోడు. పూజకని ఎంత శ్రమపి, ఇంట్లోనే 

విడిగా ఓ రూమును మందిరంగా ప్లాన్‌ చేసి కట్టించాను. ఇండియాలో నుంచి, పెద్ద మండపము, దేవుని విగ్రహాలు, పూజ సామానులు తెప్పించి పెట్టి, ఇంట్లోనే ఓ గుడి కట్టగలిగాను. ఆ పూజ గదిలో 
కూర్చుంటూనే నా మనస్సు శాంతిగా ఉంటుంది. వాడికివేం పట్టవేంటి? ఆ గదిలోకి మేం బలవంతం చేస్తే కాని అడుగు పెట్టు”, విస్సు అలా చంటి గురించి చెప్పుతూనే ఉన్నాడు. 



”పోనీలేరా. టీనేజి తరువాత వాడు మారుతాడేమో. మా పిల్లల లోను టేనేజి దాటిం తరువాత మంచి మార్పు వచ్చింది. వారిది తెలిసీ తెలియనితనం. మనం మన తరంలోనూ మన తల్లిదండ్రులు వద్దన్నా జుట్లు పెంచేసి, ‘దం మారో దం’ అంటూ హేపీగా దినాలు గ ిపేయలేదు. అప్పుడు మనల్ని చూసి మనవారూ జులాయిలా తిరుగుతున్నారని బాధపి వుండచ్చు కదా” 



”మంచి అలవాట్లు ఒకటీ రాకపోతే ఎలారా బ్రదర్‌” 



”పిల్లలన్న తరువాత, ఈ బాధలు పక తప్పదు. నీ శాయశక్తులా చంటిని మంచివాడిగా ్వ్చదిద్ద నికి ప్రయత్నించు.” 



”ఇక చంటి గురించి చాల్లే కాని, మీ పేరెంట్స్‌ గురించి చెప్పు. ఎలా వున్నారు వారు. వారి ఆరోగ్యం బాగుందా?” – మాట మార్చాను నేను. 



”నాన్న గురించి గుర్తుచేసావా? అదో తీరని సమస్యే!” అన్నాడు విస్సు. 



విస్సు వాళ్ళమ్మా, నాన్నలకి ఒక ే కొడుకు. ఇద్దరికి బాగా వయస్సయ్యింది. వయస్సులో ఉన్నప్పుడు సంతోషంగానే విస్సును విదేశాలకి పంపించినా, వయస్సు మళ్ళడంతో చూసుకోవడనికి, కొడుకు కోడలు ఉండలనుకోవడం సహజమే. అందుకే వారు విస్సును రమ్మని పోరుతూ ఉన్నారని విన్నాను. ”మామూలే. ఇవ్వాళ పొద్దునే మాట్లా ను. ఆరోగ్యమా ఇద్దరికి తగ్గిపోతున్నదని, ఇండియాకి వచ్చేయమని ఒకటే గొడవ. పోయిన ఏడదో ఓ పదివేలు ఖర్చుపెట్టుకుని ఇంటిల్లిపాది వెళ్ళి ఓ నెల ఉండి వచ్చాము. ఉద్యోగాలు, ఇల్లు అన్ని ఇక్కడ సంపాదించి, పిల్లవాడికి ఓ మంచి చదువు చెప్పిస్తూ స్థిరప ిన తరువాత, అక్కడికి వెళ్ళి మళ్ళీ మొదటి నుంచి కెరీర్‌ అదీ మొదలెట్టాలంటే ఎలా” అని వాపోయాడు. 



”కాని వారి పరిస్థితి కూడ కష్టంగానే ఉంది కదా. ఏమి చేయాలనుకుంటున్నావు” అన్నాను నేను. 



”బ్రదర్‌, మా కాలనీ పోయినసారి వెళ్ళినప్పుడు చూసాను. ప్రతీ ఇంట్లోను ఓ వయస్సు మళ్ళిన జంటనే. పిల్లలందరిలో సగం మంది పైగా విదేశాలకు, మరో సగం మంది ఇండియాలోనే మరో సిటీలకు 

బ్రతుకు తెరువు కోసం వెళ్ళిపోయారు. అమ్మాయి, అబ్బాయిలను కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, అమెరికా పంప నికి చదవమని ప్రోత్సహించిన వాళ్ళు, ఇప్పుడు వంటరితనం అంటే ఎలా? అంతెందుకు. మా నాన్నల కాలంలో వారూ పల్లెలు వదిలేసి హైదరాబాదు రాలా? ఇదీ అంతే. ఇలా వారు వంటరిగా ఉన్నారు అని గుర్తుకు వస్తే కొంచెం చివుక్కుమంటుంది. వారితో మాట్లాిన రోజు మనస్సు శాంతికి దూరం అవుతుంది” 



నేనా విషయం ఎత్తింది విస్సుకు నచ్చినట్లు లేదు. ఆస్ట్రిచ్‌ పక్షిలాగా ఇసుకలో తల పెట్టుకుంటే సరిపోతుందన్నదే ఈ సమస్యకి పరిష్కారం అని ఇక్కడున్న చాలామంది అభిప్రాయం అనుకుంటా. డబ్బులు పంపించి, సహాయంగా పనిమనిషినో ఎవరినో పెట్టుకొని కాలం గ పమని ఈ సమస్యను కార్పెట్‌ క్రింద త్రోసేసినా, అసలు తల్లిదండ్రులు ఎదురు చూసేది పిల్లల సాంగత్యం అన్న విషయం చెప్పకనే మనస్సులో తొలిచేస్తూ ఉంటుంది. విస్సు కూడ అందరిలా ఈ బాధను భరిస్తూనే వుండచ్చు. ఈ దేశంలో ముసలితనం కంటే భయంకరమైనది ఏదీ లేదు. ముసలివారికి అవసరమైన పని సహాయం, డక్టర్లు, మందులూ ఏవీ అందుబాటులో ఉండవు. జీవితమంటే ఇల్లు, యూనివర్శిటీ డర్మ్‌, అపార్ట్‌మెంట్‌, ఇల్లు, కాండో, ఓల్డ్‌ ఏజ్‌ హోం – ఇదో లైఫ్‌ సైకిల్‌ ఇక్కడ. బహుశ విస్సు గ్లోబలైజేషన్‌తో అక్కడ మనుష్యుల జీవితానికి నిర్వచనం కూడ అంతేనని నిర్ణయించుకొని మనస్సును కుదుటపెట్టేసుకున్నాడేమో. 



నా ఆలోచనలు ఊహించినట్లుగా విస్సు, ”బ్రదర్‌, ముందు చూడటమే మన కర్తవ్యం. పిల్లల్ని బాగా పెంచి మంచి భవిష్యత్తు ఇవ్వడమే మనకు ముఖ్యమైన జీవితాశయం. దానికోసం బాగా సంపాదించాలి. అలాగని మనం సుదూర తీరాలకు వెళ్ళవలసి వస్తే వెళ్ళాల్సిందే. ఇక పేరంట్స్‌ అంటావా, నాకు కూడ గిల్టీగానే ఉంటుంది. మరీ గిల్టీ అనిపించినప్పుడు, మా తాతలను వదిలి మా అమ్మా, నాన్నలు రాలేదా అని సరి పెట్టుకుంటాను” – ఖచ్చితమైన తన అభిప్రాయాలు చెప్పాడు. 



సంభాషణ ఇక ఆ విషయంపైన పొడిగించం కష్టమనిపించి మాట మార్చాను. అలా మరో అరగంట అవీ, ఇవీ కబుర్లు చెప్పుకొని విస్సు దగ్గర వీడ్కోలు తీసుకున్నాను. పార్క్‌ చేస్తున్న కార్‌ వైపు వెళ్ళి డోర్‌ తెరుస్తుండగా కార్‌ హార్న్‌ వినపింది. ఏదో తప్పో, యాక్సిడెంట్‌ అయ్యితే కాని హార్న్‌ కొట్టరు కాబట్టి, ఏమైందో చూద్దామని, అప్రయత్నంగా తల తిప్పాను. ఎవరో గుడి ఆవరణలో ఉన్న దారిలో ఓ స్టాప్‌ సైను 

చూడకుండ కారును ఆపకుండ అలానే ముందుకు నడిపించినట్లున్నాడు. ఆక్సిడెంట్‌ అయ్యి ఉండేదేమో, హస్తవాసిలో తప్పింది. హార్న్‌ శబ్దానికి పొలోమంటూ సరస్సులో ఈదుతున్న బాతులు కొన్ని 
లేచి ఆకాశంలోకి ఎగిరిపోయాయి. ఇందాక అక్కడే పలకరించిన ముసలతను కనిపించినట్ల్షెనది. అంతా నా భ్రమనే. అక్కడెవరూ లేరు, సూర్యుడు కూడ. చీకట్లు మెల్లగా, పూర్తిగా చుట్టుకుంటున్నాయి. 






”ఎక్కడి నుంచి?” 



సిండి నా కొలీగ్‌ లిండ ఫ్రెండ్‌. లిండకు ్వకవేళలలో సమాజసేవ చేయడం ఇష్టం. ఈ మధ్యన హాస్పిస్‌కు ఎక్కువగా పనిచేస్తున్నట్లు చెప్పింది. దాని గురించి పెద్దగా తెలియపోవడంతో లిండను ప్రశ్నలేస్తూ 

ఉండేవాడిని. 



”వీకెండ్స్‌ నీవేం చేస్తూ వుంటావు. ఆ లాన్‌ కేర్‌ అని గ ి్డ పీకుకోవడం కొంచెం తగ్గిస్తే మా హాస్పిస్‌కు కూడ కొంత సహాయంగా ఉంటుంది కదా” అని నాతో నవ్వుతూ టీజ్‌ చేసేది. నేను హాస్పిస్‌ గురించి వేస్తున్న ప్రశ్నలకు, నా సందేహాలను తీర్చడనికి సిండుతో పరిచయం చేసింది. సిండు హాస్సిస్‌ వలంటీర్‌ రిక్రూట్మెంట్‌ కోఆర్డినేటర్‌. నా ప్రశ్నలు చూసి, నన్నూ ఓ వలంటీర్‌గా మార్చవచ్చు అనుకున్నారేమో. తను హాఫ్‌ ఐరిష్‌. క్వాటర్‌ ఆంగ్లో సాక్సన్‌, క్వాటర్‌ పోలిష్‌గా పరిచయం చేసుకొని సిండి నన్నడిగిన ప్రశ్న అది. 



”ఇండియా నుంచి” అని చెప్పి ‘నా రక్తాలు ఇంకా అలా అంతర్జాతీయ వన్నెలు సంతరించుకోలేదు తల్లీ’ అని మనసులో అనుకొని, ఆంధ్రలోనే ఓ పల్లెల గుంపులో మా కుటుంబాన్ని ఓ పది తరాల వరకు వెనక్కుపోవచ్చు అనుకున్నాను. ఇంకో మూడు తరాల తరువాత ఎవరు చూసొచ్చారు. నా మునిమనవడో మనుమరాలో ”ఐ ఆం హాఫ్‌ ఇండియన్‌” అనినా అనవచ్చును. 



”ఇండియా అంటే నీకు పెద్దగా వివరించాల్సిన పని లేదు. ఇది మధర్‌ తెరెసా అంతిమ దినాలు సమీపించిన ముసలివారికి చేసిన సేవ వంటిదే. ఇక్కడ కూడ, పేషంట్‌ కేన్సరో, మరో వ్యాధి వల్లనో టెర్మినాల్లి ఇల్‌ అని నిర్ధారించిన తరువాత, పేషంట్‌కు హాస్పిస్‌ ఓ మార్గంగా చూపెడతారు. హాస్పిస్‌ ఎంచుకుంటే, అతని రోగ నివారణకు చేయవలసిన ప్రయత్నాలన్నీ మానేస్తారు. ఉదాహరణకు కేన్సర్‌కు పెద్ద ఆపరేషనో, లేక, కీమొ తెరాపీ జరుగవలసి వుంటే హాస్పిస్‌ ఎన్నుకున్న తరువాత ఆ ప్రయత్నాలని మానుకుంటారు. దాని బదులుగా ఆ పేషంట్‌ చివరి క్షణాలు సుఖంగా గిచిపోయేటట్లు, అతనికి ఇంట్లోనే నర్సింగ్‌ సర్వీస్‌, పేయిన్‌ మేనేజిమెంట్‌, వాలంటీర్ల ద్వారా కంపానియన్‌షిప్‌ సదుపాయాలు అందచేస్తారు. నీవు వలంటీర్‌గా ఏ పనైన చేయవచ్చును. పేషెంట్‌తో సమయం గపవచ్చు. నా లాగా హాస్పిస్‌ గురించి మిగిలిన వారికి వివరించవచ్చును. డొనేషన్‌లకని ప్రజంటేషన్లు చేయవచ్చును. అది నీ చాయిస్‌” అని చెప్పింది. 



”కొద్ది రోజులలోనే చనిపోతారని తెలిసి, వారితో సమయం గిపి అనుబంధం పెంచుకోవడం కష్టమనిపిస్తుంది” అన్నాను. 



”నిన్ను వలంటీర్‌గా తీసుకొనే ముందే సైకలాజికల్‌గా ఈవల్యుయేట్‌ చేస్తారు, ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనడనికి ఓ ట్రైనింగ్‌ కూడ ఉంటుంది. మా దగ్గర వలంటీర్లుగా పెద్ద చిన్న అందరూ ఉన్నారు. ఈమధ్యనే ఓ కాలేజీ కుర్రాడు కూడ మా దగ్గర చేరాడు. హీ ఈజ్‌ డూయింగ్‌ ఏ గ్రేట్‌ జాబ్‌. యు షుడ్‌ మీట్‌ హిం” అంది సిండి. 



”కుర్రవాడికి ఇంత వైరాగ్యం ఎలా అబ్బింది, ఆ అబ్బాయి కధేంటి?”అన్నాను. 



”ఆ అబ్బాయి, మొదట్లో ప్రజెంటేషన్‌లకని, చందాలు ప్రోగు చేయడనికి చేరాడు. కాని హాస్పిస్‌ గురించి మాట్లా ేటప్పుడు ఆ అనుభవం ఉంటే కాని అది కన్విన్సింగ్‌ గా ఉండదనీ, తనే ఓ పేషెంట్‌ దగ్గర పనిచేయడనికి ఒప్పుకున్నాడు. నేనూ మొదట్లో ఈ అబ్బాయి ఆ పని సరిగ్గా చేస్తా ో లేదో అని అనుమానపడిన విషయం నిజమే. ఆశ్చర్యంగా, ఆ అబ్బాయి ఆ పనిని చాలా బాగ చేస్తున్నాడు. పేషంట్‌, పేషంట్‌ 

బంధువుల దగ్గరి నుంచి ఫ్బీేక్‌ అద్భుతంగా ఉంది” అంది. 



”ఏమి చేసాడేంటి?” అన్నాను. 



”పేషంట్‌ ఈ అబ్బాయి రాకకు వారం మొత్తం ఎదురు చూస్తుంటాడట. ఈ అబ్బాయి వచ్చే ఆదివారం ఆ పేషంట్‌కు ఓ హైలైట్‌ అయిపోతుంది. ఈ అబ్బాయి లైబ్రరీ నుంచి ఆ పేషంటుకు నచ్చిన విషయం పైనున్న పుస్తకాలు తీసుకెళ్


...



--((**))--





జాక్ దె రాండల్ 
జాక్ దె రాండల్ ఒంటరిగా భోజనం ముగించాడు. బయటికి వెళ్ళాలనుకుంటే వెళ్ళమని కారు డ్రైవర్ కి చెప్పాడు. ఆ తరువాత కొన్ని వుత్తరాలు రాయాలన్న ఆలోచన రావడంతో తన టేబుల్ దగ్గర కూర్చున్నాడు.
అతను ప్రతి సంవత్సరంలోని ఆఖరు రోజున ఇలాగే రాసుకుంటూ, కలలు కంటూ గడుపుతుంటాడు. నిర్జీవమైపోయిన గత సంవత్సరం మొత్తాన్ని ఓసారి సింహావలోకనం చేసుకుంటాడు. ఆ జ్ఞాపకాలలో కనిపించిన మిత్రులకు కొన్ని వాక్యాలు రాయడం అతని అలవాటు. ఆ వుత్తరాలని మర్నాడు కొత్త సంవత్సం రోజున వాళ్ళకి అందించేవాడు.
ఇప్పుడు కూడా అలాగే చేద్దామని టేబుల్ ముందు కూర్చోని, సొరుగును బయటకు లాగి, అందులోనుంచి ఓ స్త్రీ ఫొటో బయటికి తీశాడు. ఆ ఫొటో వైపే కొద్ది క్షణాలు చూపు నిలిపి ఆపైన దానికి ముద్దుపెట్టాడు. దాన్ని అక్కడే వున్న పేపర్ల దొంతర పక్కన పెట్టి రాయటం ఆరంభించాడు.
"ప్రియమైన ఐరీన్: నేను మీ పనెమ్మాయి పేరు మీద పంపిన చిరు కానుక ఈ పాటికి నీకు అందే వుంటుంది. నీతో ఓ విషయం చెప్పాలని తలుపులన్నీ బంధించుకోని కూర్చున్నాను.."
ఆ తరువాత రాయడానికి అతని కలం నిరాకరించింది. జాక్యుయస్ లేచి గదిలో అటూ ఇటూ పచార్లు చేయడం మొదలుపెట్టాడు.
గత పది నెలలుగా అతని మనసుని ఓ ప్రియురాలు ఆక్రమించింది. నాటకప్రదర్శనకు తోడుగా వస్తూ, ఏదో కాలక్షేపం కబుర్లు చెప్తూ వుండే అందరమ్మాయిల్లాంటి అమ్మాయి కాదు. అతను ప్రేమించి సాధించుకున్న అమ్మాయి. నిజానికి అతనేమీ కుర్రవాడు కాదు. వయసుకూడా ఏం మించిపోలేదు. జీవితాన్ని కేవలం ఆశావాదంతోనే కాకుండా కొంత వాస్తవికంగా కూడా చూడగలిగిన వయసు అతనిది.
అందుచేత, ప్రతి సంవత్సరం చివర్లో అతను, తన జీవితంలోకి వచ్చిన ప్రేమలకీ, కొత్తగా కలిసిన స్నేహాలకీ, ముగిసిపోయిన బంధాలకీ, అలాంటి పరిస్థితులకీ అన్నింటికీ కలిపి ఒక బాలన్స్ షీట్ లాంటి బేరీజు పట్టిక వేసుకుంటాడు.
ఆ క్రమంలో తన ప్రియురాలి మీద వున్న ప్రేమ తాలూకు ఉద్రేకం కాస్త చల్లబడ్డాక, ఈ ప్రేమ ఎక్కడికి దారితీస్తుందో అని అతని మనసు శంకించింది. తులాలతో తూకం వేసే వ్యాపారిలా ఆమె పట్ల అతని మనసులో వున్న భావనలనీ, ఆమెతో అతని భవిష్యత్తు గురించి క్షుణ్ణంగా అంచనా వేయడం మొదలుపెట్టాడు.
ఆ ప్రయత్నంలో అతని మనసులో వున్న బలమైన భావాన్ని అతను గుర్తించాడు. అతి సున్నితమైన భావాలు నిండిన బలమైన అనుబంధమేదో అప్పటికే పుట్టిందన్న సంగతి గమనించాడు.
ఉన్నట్టుండి మోగిన కాలింగ్ బెల్ అతణ్ణి ఉలిక్కిపడేలా చేసింది. తలుపు తీయాలా వద్దా అని కాస్త తర్జనభర్జన పడ్డాడు. కొత్త సంవత్సరం ముందురోజు ఏ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తలుపుకొట్టినా తప్పకుండా తీయాలని తనకి తానే నచ్చజెప్పుకున్నాడు.
చేతిలో కొవ్వొత్తి పట్టుకోని ముందుగది దాటుకోని తలుపుల బోల్టు తెరిచి, నాబ్ తిప్పి, వెనక్కి తెరిచాడు. ఎదురుగా అతని ప్రియురాలు. జీవం లేనిదానిలా పాలిపోయిన ముఖంతో గోడకి జారిగిల పడి వుంది.
అతను తడబడ్డాడు.
"ఏంటి? ఏమైంది?"
"ఒక్కడివే వున్నావా?" ఆమె అడిగింది.
"అవును"
"పనివాళ్ళు కూడా లేరా?"
"లేరు"
"నువ్వు బయటికి ఎక్కడికీ వెళ్ళటంలేదా?"
"లేదు"
ఆ ఇంటిని పూర్తిగా తెలిసినదానిలా ఆ అమ్మాయి లోపలికి చొరబడింది. డ్రాయింగ్ రూంలోకి అడుగుపెట్టగానే అక్కడే వున్న సోఫాలో కూలబడి ముఖాన్ని చేతుల్లో దాచేసుకోని గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది.
అతను ఆమె కాళ్ళదగ్గర మోకాళ్ళమీద కూర్చోని ఆమె చేతుల్ని తొలగించే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం సఫలమయ్యాక ఆమె ముఖాన్ని చూసి అవాక్కయ్యాడు.
"ఐరీన్..? ఐరీన్ ఏమైంది నీకు? ఎందుకలా ఏడుస్తున్నావు? అసలేం జరిగిందో నాకు చెప్పనిదే వూరుకోను." అన్నాడు.
అప్పుడా అమ్మాయి వెక్కిళ్ళు పెడుతూ చిన్నగా గొణిగింది - "ఇంక ఇలా బతకటం నా వల్ల కాదు"
"ఇలా బతకడం అంటే? ఏం చెప్తున్నావు?"
"అవును ఇలా బతకడం నా వల్ల కదు. చాలా సహించాను. ఈ రోజు మధ్యాన్నం కొట్టాడు"
"ఎవరు? నీ మొగుడా?"
"అవును, నా మొగుడే."
"ఓహ్"
అతను విస్తుపోయాడు. ఆమె భర్త అంత క్రూరంగా ప్రవర్తిస్తాడని అతను కలలో కూడా ఊహించలేదు. ఎలా ఊహిస్తాడు. అతని గురించి వూరందరికీ తెలుసు. బయటికి పెద్దమనిషిలా వుంటాడు, గుర్రాలను ఇష్టపడతాడు, నాటకాల ప్రదర్శనకి తప్పక వెళ్ళేవాడు, కత్తి యుద్ధంలో నిష్ణాణుతుడు... అందరూ అతన్ని అభినందించేవాళ్ళే. మర్యాద కలిగిన ప్రవర్తన, కాస్తో కూస్తో తెలివితేటలు, చదువు అంతగా లేకపోయినా మేధావుల్లా ఆలోచించగల నేర్పు వున్నవాడు. అతని నడత, సంప్రదాయం చూసే అందరూ గౌరవిస్తారు.
బాగా కలిగిన కుటుంబాలలో లాగే అతను కూడా భార్యకి విధేయుడుగానే వున్నటు కనిపించేవాడు. ఆమెకు సంబంధించిన కోరికలు, ఆరోగ్యం, ఆఖరుకు ఆమె బట్టల విషయంలో కూడా అతను ఆందళన ప్రదర్శించేవాడు. అన్నింటినీ మించి ఆమెకు పూర్తి స్వతంత్రం ఇచ్చాడు.
ఐరీన్ స్నేహితుడిగా జాక్ కి పది మందిలో కూడా ఆమె చేతిని పట్టుకునేంత చనువుంది. మర్యాదస్తుడైన ప్రతి భర్త లాగే ఆమె భర్త కూడా దగ్గరి స్నేహితుడు అలా మెలగడంలో తప్పేమీ లేదనే భావించాడు. అయితే జాక్ కొంతకాలం స్నేహితుడిగా వుండి ఆ తరువాత ప్రేమికుడిగా మారాడు. ఆమె భర్తతో కూడా అనుకూలమైన స్నేహాన్ని కొనసాగించాడు.
ఆ ఇంట్లో తుఫాన్ లాంటి వాతావరణం వుందన్న సంగతి జాక్ ఊహించలేదు. అనుకోని కొత్త విషయం తెలిసి విస్తుపోయాడు.
“అసలు ఎలా జరిగింది? చెప్పు” అడిగాడు.
ఆమె చెప్పడం మొదలుపెట్టింది. పెళ్ళైన నాటి నుంఛి ఆమె జీవితంలో జరిగినవన్నీ పూసగుచ్చినట్లు చెప్పింది. తొలిసారి అకారణంగా మొదలైన అభిప్రాయభేదం నుంచి అది క్రమ క్రమంగా పెరుగుతూ పోయి చివరికి రెండు పరస్పర విరుద్ధమైన స్వభావల మధ్య మిగిలిపోయిన విబేధం దాకా అంతా విషయం చెప్పింది.
ఇక ఆ తరువాక జరిగిన కొట్లాటలు, పైకి కనపడకుండా లోపల లోపలే ఏర్పడ్డ అగాధాలు ఇవన్నీ చెప్పింది. ఆ తరువాత ఆమె భర్త గొడవలు పెట్టుకోవడం మొదలుపెట్టాడట. అనుమానించడం మొదలుపెట్టాడట. చివరికి ఆమెను గాయపరచడానికి కూడా వెనుకాడని స్థితికి వచ్చాడు. ఇప్పుడు అతనికి ఈర్ష. జాక్ అంటే ఈర్ష.
ఇలాంటి విషయమై ఈ రోజు జరిగిన ఓ గొడవ తరువాత అతను ఆమెను కొట్టాడు.
“నేను తిరిగి అతని దగ్గరకు వెళ్ళను. నీతోనే వుంటాను. నువ్వు ఏం చేసినా సరే.. అక్కడికి మాత్రం వెళ్ళను” అంది స్థిరంగా.
జాక్ ఆమె ముందు ఇద్దరి మోకాళ్ళు తగిలేలా దగ్గరగా కూర్చున్నాడు. ఆమె చేతుల్ని అందుకున్నాడు –
“మై డియర్... నువ్వు ఎంట పెద్ద తప్పు చేస్తున్నావో తెలుసా? మళ్ళీ సరిదిద్దుకునే అవకాశం కూడా వుండదు. నువ్వు నీ భర్తని వదిలి వచ్చేయాలనుకుంటే, అందుకు కారణం అతని తప్పు అయ్యుండాలి. అప్పుడు ఒక స్త్రీగా నీకు ఈ ప్రపంచంలో గౌరవం వుంటుంది”
ఆమె అతని వైపు అసహనంగా చూసింది
“అయితే నన్నేం చెయ్యమంటావు చెప్పు?”
“ఇంటికి తిరిగి వెళ్ళిపో... అతని దగ్గర్నుంచి విడాకులు తీసుకునేదాకా సర్దుకోని వుండు. అది నీకు మర్యాదగా వుంటుంది.”
“నువ్వు నాకు పిరికితనాన్ని సలహాగా ఇస్తున్నావు”
“కాదు.. కాదు.. ఇది తెలివైన సలహా. అందరూ ఒప్పుకునే సలహా. నీకంటూ ఓ పరపతి వుంది. పరువు మర్యాదలు వున్నాయి. స్నేహితులు, బంధువులు... వీరందరితో నువ్వు కాపాడుకోవాల్సిన బాంధవ్యం వుంది. ఆలోచన లేని ఒక్క పనితో వీటన్నింటినీ పోగొట్టుకుంటావా? చెప్పు?”
ఆ మాటలు వింటూనే ఆమె కోపంగా లేచి నిలబడింది.
“నో... నా వల్ల కాదు. ఇక భరించలేను! అంతే.. ఇక ఇంతటితో అంతా అయిపోయింది. అంతే!!” అని ఆమె తన చేతుల్ని ఎదురుగా వున్న ప్రేమికుడి భుజాలపైన వేసింది. అతని ముఖంలోకి సూటిగా చూస్తూ – “నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా”
“ప్రేమిస్తున్నాను”
“నిజంగా.. ఒట్టు?”
“ఒట్టు”
“అయితే నేను నీతోనే వుంటాను”
అతను ఆశ్చర్యపోయడు.
“నాతో వుంటావా? ఈ ఇంట్లో? ఇక్కడ? నీకేమైనా పిచ్చి పట్టిందా. అలా చేస్తే ఇక ఎప్పటికీ మనం ఒకటి కాలేము. ఇక నిన్ను జ్ఞాపకలలో నుంచి కూడా తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. పిచ్చిగా మాట్లాడకు!”
ఆమె నెమ్మదిగా, నింపాదిగా, సూటిగా మాట్లాడింది. తను మాట్లాడుతున్న మాటల బరువు తెలిసినదానిలా పలికింది.
“చూడు జాక్, వాడు ఇక నిన్ను చూడటానికి వీల్లేదని చెప్పాడు. ఇలా దొంగచాటుగా వచ్చి నిన్ను కలుసుకోవడం నాకేం నచ్చడంలేదు. నా వల్ల కాదు కూడా. రెండే మార్గాలు – నన్ను అందుకుంటావా? వదులుకుంటావా?”
“అలాగైతే డియర్.. ముందు నువ్వు విడాకులు తీసుకో.. నేను నిన్ను పెళ్ళి చేసుకోడానికి సిద్ధమే.”
“అవును సిద్ధమే పెద్ద... ఎప్పడు? ఇంకో రెండు సంవత్సరాలకా? ఎంతో ఓర్పు నిండిన ప్రేమ కదా నీది”
“కొంచెం ఆలోచించు ఐరీన్... నువ్వు ఇక్కడే వుంటే రేపు పొద్దున్నే అతను వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతాడు. అతని నీ భర్త. అలా చేసేందుకు అతనికి హక్కు వుంది, అధికారం వుంది. చట్టం అతని వైపు వుంటుంది.”
“నన్ను ఇదే ఇంట్లో వుంచుకోమని చెప్పడంలేదు జాక్. ఇంకెక్కడికైనా తీసుకెళ్ళిపో... అంతమాత్రం ధైర్యం చేసే ప్రేమ కూడా లేదా నా మీద? అయితే నాదే పొరపాటు అనుకుంటాను.. గుడ్ బై!”
ఆమె వెంటనే వెనక్కి తిరిగి తలుపు దగ్గరకు వెళ్ళింది. ఆ వేగానికి తేరుకొని ఆమెను అందుకొనే సరికే ఆమె గది బయట వుంది.
“నేను చెప్పేది విను ఐరీన్”
ఆమె వినిపించుకునే ప్రయత్నం చెయ్యకపోగా విడిపించుకునే ప్రయత్నం చేసింది. కళ్ళలో నీళ్ళు ఉబికి వచ్చాయి. తడబడుతూ అరిచింది.
“వదిలేయ్... వద్దు.. నన్ను వదిలేయ్... ఒంటరిగా వదిలేయ్..”
అతను వదల్లేదు. ఆమెను బలవంతంగా కూర్చోబెట్టి, మళ్ళీ మోకాళ్ళమీద ఆమె ముందు కూర్చున్నాడు. ఆమె చెయ్యదల్చుకున్న పనిలో వున్న తప్పొప్పులనూ, అలా చెయ్యడం వల్ల జరిగే అనర్థాలను అర్థం అయ్యేలా నింపాదిగా వివరించాడు. ఒప్పించాలని విశ్వప్రయత్నం చేశాడు. ఆమెను ఒప్పించేందుకు అవసరమైనా ఏ చిన్న విషయాన్ని కూడా అతను వదిలిపెట్టలేదు. తన ప్రేమని సైతం ఒక ప్రోత్సాహకంలా చూపించి ఒప్పించాలనుకున్నాడు.
ఆమె స్థిరంగా చడీ చప్పుడు చెయ్యని మంచుగడ్డలా వుండిపోయింది. అతను ఆమెను మాట వినిపించుకోమని, తనని నమ్మమనీ, తాను చెప్పే సలహా పాటించామనీ ప్రాధేయపడ్డాడు.
అతను చెప్పడం పూర్తైన తరువాత ఆమె కేవలం ఒకటే మాట అడిగింది -
“అయిపోయిందా? ఇకనైనా నన్ను వెళ్ళనిస్తావా? నీ చేతులు నా మీద నుంచి తీసేస్తే నేను లేస్తాను”
“ఏంటిది.. ఐరీన్”
“వెళ్ళనిస్తావా లేదా?”
“నీ నిర్ణయంలో ఏ మార్పు లేదా?”
“వెళ్ళనిస్తావా లేదా?”
“ముందు అడిగినదానికి సమాధానం చెప్పు. నువ్వు తీసుకున్న నిర్ణయం... నీ పిచ్చి నిర్ణయం.. నువ్వు తరువాత తరువాత బాధపడటానికి తీసుకున్న ఈ నిర్ణయం... మార్చుకోవా?”
“మార్చుకోను... ఇక వెళ్ళనిస్తావా?”
“అయితే వుండు. నీకు ఈ ఇల్లేమీ కొత్తకాదు. హాయిగా వుండు. రేపు ఉదయం ఎటైనా వెళ్ళిపోదాం”
అయినా ఆమె వినిపించుకోనట్లే లేచి నిలబడి, కరకుగా సమాధానం చెప్పింది –
“వద్దు... ఆ అవకాశం లేదు. నాకు నీ త్యాగాలూ వద్దు, నేనేదో దేవతలాగా నువ్వు భక్తిగా నేను చెప్పింది వినాల్సిన పనిలేదు”
“ఆగు! నేను ఏం చెయ్యాలో అది చేశాను. ఏం చెప్పాలో అది చెప్పాను. ఇక జరిగబోయే పరిణామాలకు నాకు ఎలాంటి బాధ్యత వుండదు. తరువాతెప్పుడో నేను పశ్చాత్తాపపడాల్సిన పనిలేదు. అయిపోయింది. ఇక నువ్వే చెప్పు. ఏం చెయ్యమంటే అది చేస్తాను.”
ఆమె స్థిమితపడి కూర్చుంది. అతని వైపు చాలా సేపు చూసి ఆ తరువాత శాంతంగా అడగింది –
“అయితే వివరంగా చెప్పు”
“వివరంగా చెప్పాలా? ఏం చెప్పాలి?”
“మొత్తం చెప్పు. నువ్వు నీ నిర్ణయం మార్చుకోడానికి ముందు ఏమేమి ఆలోచించావో అదంతా చెప్పు. అప్పుడు నేను ఏం చెయ్యాలో నిర్ణయం తీసుకుంటాను.”
“నేనేమీ ఆలోచించలేదే.. నువ్వు చేస్తున్నది తప్పని హెచ్చరించాలనుకున్నాను. నువ్వు చెయ్యక తప్పదన్నావు. తప్పనప్పుడు నేను కూడా నీతో కలుస్తానని అన్నాను. ఇప్పుడు కూడా అదే అంటున్నాను..”
“అంత త్వరగా ఎవరూ నిర్ణయాలు మార్చుకోరు”
“చూడు డియర్, ఇదేదో త్యాగమో, నువ్వంటే భయతోనో భక్తితోనో తీసుకున్న నిర్ణయం కాదు. ఎప్పుడైతే నిన్ను ప్రేమించానో ఆ రోజే నేను ఓ నిర్ణయం తీసుకున్నాను. ప్రతి ప్రేమికుడూ తీసుకోవాల్సిన నిర్ణయం అది. ఏమిటో తెలుసా? ఒక మగవాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తే, ప్రయత్నపూర్వకంగా ప్రేమని గెలుచుకున్నట్లైతే, ఆమెను అందుకున్న క్షణంలో ఓ పవిత్రమైన ఒప్పందం చేసుకున్నట్లుగా భావించాలి. అది అతను తనతోనే చేసుకున్న ఒప్పందం. తన ప్రియురాలితో చేసుకున్న ఒప్పందం. పెళ్ళి కన్నా గొప్పదైన ఒప్పందం.
“పెళ్ళికి సామాజికంగా, చట్టపరంగా ఎంతో విలువ వుండచ్చు. కానీ నా దృష్టిలో దానికి నైతికవిలువేమీ లేదు. ముఖ్యంగా పెళ్ళిళ్లు జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే ఆ విలువకి బద్ధులం కావాల్సిన అవసరం లేదనిపిస్తుంది.”
కాబట్టి కేవలం చట్టపరమైన ఒక బంధంలో మాత్రమే వున్న ఓ స్త్రీకి ఆమె భర్తతో ఏ అనుబంధం లేకుండా, అతన్ని ప్రేమించలేని స్థితిలో వుండే అవకాశం వుంది. అప్పుడు స్వేఛ్ఛగా వున్న ఆ హృదయంతో మరో మనిషి తారసపడవచ్చు. అతనికి కూడా మరే స్త్రీతో బంధం లేని పక్షంలో, వాళ్ళిద్దరూ ఒకరికరుగా వుంటామని నమ్మకంగా చెప్పుకునే మాట, స్వచ్చమైనది అవుతుంది. ఆ మాట చట్టప్రతినిధులముందు జరిగే పెళ్ళిలో పలికే అంగీకారం కన్నా గొప్పదని నా అభిప్రాయం. నా దృష్టిలో వాళ్ళిద్దరూ మర్యాదస్తులే అయితే వారి సమాగమం, కేవలం మతం ఆమోదించి పవిత్రమైనదిగా భావించే పెళ్ళికన్నా ఎంతో అన్యోన్యమైనది, పరిపూర్ణమైందీ అవుతుంది.
నా ఎదురుగా వున్న ఈ అమ్మాయి అన్నీ వదులుకోడానికి సిద్ధపడుతోంది. ఆమెకు అన్నీ తెలుసు. ఆమె తన సర్వస్వాన్నీ ఇవ్వడానికి సిద్ధపడుతోంది. తన హృదయం, శరీరం, ఆత్మ, గౌరవం చివరికి జీవితాన్ని కూడా. ఎందుకంటే ఆమె రాబోయే దురవస్థను ముందే ఊహించింది. రాబోయే అన్ని ప్రమాదాలను, విపత్తులను పసిగట్టింది. అందుకే ఒక సాహసం చెయ్యడానికి పూనుకుంది. నిర్భయంగా నిలబడింది. ఎవరినైనా ఎదిరించడానికి సిద్ధపడింది. అది తనని చంపాలని చూసే భర్తనైనా సరే, వెలి వేయడానికి సిద్ధపడే సమాజాన్నైనా సరే. అందుకే ఆమె చేసేది దాంపత్యానికి ద్రోహమైనా సరే గౌరవించాలని అనిపించింది. అయినా ఆమె ప్రేమికుడిగా ఆమెను స్వీకరించే ముందు జరగబోయేది ఊహించాల్సిన అవసరం వుందని కూడా అనిపించింది. ఏ అనర్థం జరిగినా అందుకు సిద్ధపడే ధైర్యాన్ని ఆమె ఇవ్వాల్సిన అవసరం వుందని అనిపించింది.
ఇక ఇంతకన్నా నేను చెప్పాల్సిందేమీ లేదు. నేను ముందు బాధ్యతగా ఆలోచించి, ఒక వివేకమున్న వ్యక్తిగా నిన్ను హెచ్చరించాను. ఇప్పుడు నేను మామూలువాడిని. నిన్ను ప్రేమించేవాడిని. నువ్వు ఎలా చెప్తే అలా.. ఆదేశించు, పాటిస్తాను..”
మెరుపులా అతని మాటల్ని ముద్దుతో ఆపేసిందామె. లో గొంతులో పలికింది.
"అదంతా నిజం కాదు డార్లింగ్. అలాంటిదేమీ లేదు. నా భర్తకు ఎలాంటి అనుమానం లేదు. నువ్వు నాకు పంపిన నక్లెస్ కాకుండా మరో బహుమతి కావాలనిపించింది. నీ హృదయాన్నే బహుమతిగా కోరాలనిపించింది. ఇలా అడిగితే నువ్వేమంటావో తెలుసుకోవాలనిపించింది. ఇలా నిన్ను చూడాలనిపించింది. నువ్వు నేను కోరుకున్న బహుమతి ఇచ్చావు. థాంక్స్.. థాంక్స్. నువ్విప్పుడు నాకిచ్చిన ఆనందానికి ఆ భగవంతుడికి కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి."
***
By....Aripirala Satyaprasad


(1)
#సాలభంజికలు

#రచన ..... #సలీం

‘#మనం షాపింగ్ చేయాలి, మర్చిపోయారా?’ అంది గీత.
ఆఫీస్ నించి రాగానే ఫ్రెషప్ అయి, ఉదయం సగం చదివి వదిలేసిన దినపత్రికని చేతిలోకి తీసుకుని, తను చేసిచ్చిన కాఫీని చప్పరిస్తూ కూచున్నా.

‘ఆడాళ్ల షాపింగ్‌కి నేనెందుకు? నువ్వెళ్లిరా. నా డెబిట్ కార్డ్ తీస్కెళ్లు’ అన్నాను పేపర్లోంచి తల యెత్తకుండానే.

‘షాపింగ్ నా కోసం కాదు. మీ కోసమే. ప్రసాద్ గారి కూతురి పెళ్లి రేపేగా. గిఫ్ట్ కొనొద్దా? ఉత్తచేతుల్తో వెళ్తే బావుంటుందా ఏమైనా’ అంది.

నిజమే... మర్చిపోయాను. వారం క్రితం బ్యాంక్‌కి వచ్చి అందరికీ శుభలేఖలు పంచి, తప్పకుండా రావాలని మరీ మరీ చెప్పి వెళ్లారు ప్రసాద్‌గారు. ఈ ఊళ్లోకెల్లా పేరు మోసిన బిల్డర్ ఆయన. అవర్ హోం కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్. ఈ ఊళ్లో ఉన్న సగానికి పైగా అపార్ట్‌మెంట్లు వారు నిర్మించినవే. మా బ్యాంక్‌లోనే సేవింగ్స్ ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. కాబోయే అల్లుడు ఐయేయెస్‌కి సెలక్టయి ట్రెయినింగ్లో ఉన్నాడని చెప్పేటప్పుడు గర్వంతో ఆయన ఛాతీ పొంగడం నాతోపాటు మా బ్యాంక్ సిబ్బంది కూడా గమనించారు.
‘చాలా గ్రాండ్‌గా పెళ్లి జరిపించాలని మా వియ్యంకుడి కోరిక. కనీసం మూడు వేల మంది వరకు రావొచ్చనుకుంటున్నాం. ముఖ్యమంత్రిగారు కూడా వస్తున్నారు. డైమండ్ ఫంక్షన్ హాల్లో పెళ్లి’ అని చెప్పారు.
పోయిన ఎలక్షన్లల్లో రూలింగ్ పార్టీ టికెట్ మీద పోటీ చేసి ఓడిపోయారు. టికెట్ కోసం పార్టీ ఫండ్ కింద భారీగానే ముట్టచెప్పారని ఆయన్ని ఎరిగిన వాళ్లు అనుకుంటూ వుంటారు. వచ్చే ఎలక్షన్లలో పోటీ చేయడం కోసం ఇప్పటి నుంచే ముఖ్యమంత్రిగారితో సత్సంబంధాలు కలిగి ఉండటం అవసరం కాబట్టి వారిని పెళ్లి పెద్దగా ఆహ్వానించి ఉంటారు.
పేపర్ని పక్కన పడేసి, ఖాళీ కప్పుని టీపాయ్ మీద పెడ్తూ ‘ఏం కొంటే బావుంటుందంటావు?’ అన్నాను.

‘వెయ్యి రూపాయల లోపల మాంచి ఫొటోఫ్రేం కొని అందంగా ప్యాక్ చేయించి ఇద్దాం. పెళ్లి తర్వాత హనీమూన్‌కి ఏ ఊటికో డార్జిలింగ్‌కో వెళ్తారుగా. అందులోంచి మాంచి ఫొటో ఒకటి తీసి ఫ్రేంలో పెట్టుకుంటారు’ అంది ఉత్సాహంగా.
మా పెళ్లయి పాతికేళ్లు దాటిపోయాయి. ఇద్దరాడపిల్లల పెళ్లిళ్లు కూడా అయ్యాయి. ఐనా పెళ్లయిన కొత్తలో గీత దుమికే జలపాతంలా ఎంత చలాకీగా ఉండేదో ఇప్పటికీ అలానే ఉంది. ఏమీ మారలేదు. తన ఊతపదం ‘మాంచి’తో సహా.

‘అంత పెద్దాయన కూతురి పెళ్లి కదా. దానికి తోడు ఓ ఐయేయస్ ఆఫీసర్కి కాబోయే భార్య. వాళ్ల తాహతుకి తగ్గట్టు ఇవ్వకపోతే ఏం బావుంటుంది చెప్పు. నేనేమైనా బ్యాంక్లో క్లర్క్‌ని అనుకుంటున్నావా? మేనేజర్ని. మనమిచ్చే గిఫ్ట్ నా హోదాకు తగ్గట్టుగా ఉండాలి కదా. లేకపోతే అది మనకే అవమానం’ అన్నాను.

‘మీరు మేనేజర్ అన్న విషయం మర్చిపోలేదు మహానుభావా. పొరపాటున నేను మర్చిపోయినా మీరు మర్చిపోనివ్వరుగా. గుర్తు చేయటంలో మాంచి దిట్ట’ అంది నవ్వుతూ.
తన విసురుని పట్టించుకోకుండా ‘వెండి వస్తువులు ఏమైనా ఇస్తే బావుంటుంది. వెండి కంచమో, నాలుగు వెండి క్లాసులో, పెద్దవి రెండు వెండి కుందులో.. రేపు ఎమ్మెల్లే అయితే దేనికైనా పనికొస్తాడు’ అన్నాను.
‘బంగారు నెక్లెస్ ఇస్తే ఇంకా బావుంటుంది కదండీ. ప్రసాద్ గారు కూడా సంతోషిస్తారు. ఐనా వారి తాహతుకి అది కూడా తక్కువనుకుంటారేమో. వజ్రాల నెక్లెస్ కొందామా? ఐనా ఇదేం చోద్యం... బహుమానం ఇచ్చేది ఆ వ్యక్తి మీద ఉన్న ప్రేమాభిమానాల్ని దృష్టిలో పెట్టుకుని కదా. మీరు చెప్పేది వ్యాపారం’
‘చాల్లే వెటకారం. ఇప్పటి లోకరీతి ఇదే. గిఫ్ట్ గురించి ఆలోచించు మొదట. కనీసం పాతిక ముప్పయ్ వేలయినా లేకపోతే ఎలా? మాంఛి గిఫ్ట్ కావాలంటే ఆ మాత్రం పెట్టాలి కదా’ తన ఊతపదాన్ని నొక్కి పలుకుతూ అన్నాను.
‘డబ్బున్న వాళ్ల దగ్గరకే మరింత డబ్బు చేరుతుంది గమనించారా? కానీ డబ్బు చేరాల్సింది అవసరమైన వాళ్ల వద్దకు కదా. అదే మీ బ్యాంక్‌లో ప్యూన్ పెళ్లికయితే ఏం చేస్తారు?’

‘వెయ్యి లోపలే కొంటాను. సహజమే కదా. ఎంత చెట్టుకు అంత గాలి. ఇంతకూ ఏం గిఫ్ట్ కొందామంటావు?’
తను సమాధానం చెప్పబోయి ఆగిపోయింది. ఎదురుగా మా పనిమనిషి ఐలమ్మ నిలబడి ఉంది. ఉదయం ఆరింటికొచ్చి అంట్లు తోమి ఇల్లంతా శుభ్రం చేసి, బట్టలుతికి వెళ్లిపోతుంది. మళ్లా సాయంత్రం వచ్చి పని చేసుకుంటుంది.
‘పనంతా సేశానమ్మా’ అని ఇంకా అక్కడే నిలబడింది.
‘ఏమైనా చెప్పాలా? ఏంటో చెప్పు? అడ్వాన్స్ ఏమైనా కావాలా?’ అంది గీత.
‘వద్దమ్మా. వచ్చే శనోరమే నా రెండో బిడ్డ లగ్గం. మీకు తోసిన ఇనాం ఇప్పించండమ్మా’
‘అంతే తప్ప మమ్మల్ని పెళ్లికి మాత్రం రమ్మని పిలవ్వు. ఏం మేము నీ కూతురి పెళ్లికి రాకూడదా?’ అంటూ నవ్వింది గీత.
‘మీ అసుంటోల్లని పిలిసే పెల్లి కాదులెమ్మా. ఏదో నా తాహతుకి తగ్గట్టు తూతూ మంత్రంగా కానించేస్తున్న పెల్లి. మిమ్మల్ని పిలిసి కట్టపెట్టలేనమ్మా’ అందామె సిగ్గుపడిపోతూ.

‘సరదాగా అన్నాలే. దాని సంసారానికి పనికొచ్చేదేదైనా కొనిస్తాలే’ అంది గీత.
‘వద్దమ్మా. మీరెంత ఇయ్యాలనుకున్నారో అంత డబ్బులియ్యండమ్మా. మగదిక్కు లేని సంసారం. కర్సులకు పనికొస్తాయి’ అందామె.
‘సర్లే. అలాగే ఇస్తానే్ల. ఇంకో వారం టైం ఉందిగా’ అంది గీత.
ఐలమ్మ వెళ్లిపోయాక ‘ఏం చేద్దామంటారు?’ అన్నట్టు నా వైపు చూసింది.
‘ఇందాకే చెప్పాగా ప్యూన్ కయితే వెయ్యి రూపాయలకు మించకుండా ఇస్తానని. ఐలమ్మకు కూడా వెయ్యి రూపాయలిద్దాం’
‘అదేంటండీ. నాకు పెళ్లయి కాపురానికొచ్చినప్పటి నుండీ ఐలమ్మ మనింట్లో పని చేస్తుంది. ఏం చేసినా చాలా శుభ్రంగా చేస్తుంది. నమ్మకంగా ఉంటుంది. అసలే ఆడపిల్ల పెళ్లి. పాపం ఖర్చులుంటాయిగా’
‘అలాగని పెళ్లి ఖర్చంతా మనమే పెట్టుకుందామంటావా ఏమిటి? ఇక్కడేమీ డబ్బులు రాశులు పోసి లేవు. వెయ్యి రూపాయలు చాల్లే. ఇంతకూ రేపటి పెళ్లికి ఏం కొనాలో ఆలోచించు. షాపింగ్‌కి వెళ్దాం’ అన్నాను.
నా మాటల్లో పదును అర్థమై తను ఐలమ్మ విషయం ఎత్తకుండా ‘ప్రసాద్‌గారి కూతురి పెళ్లికి కొన్ని వేల మంది వస్తారు. ఎన్నో రకాల బహుమతులిస్తారు. అందులో చాలా గిఫ్ట్‌లు వాళ్లు వాడుకోను కూడా వాడుకోరు. ఇప్పుడంతా కవర్లలో డబ్బులు పెట్టి ఇస్తున్నారుగా. మనమూ అలానే చేద్దాం’ అంది.
‘పాతికవేల ఒక్క రూపాయి ఇద్దాం. గౌరవంగానూ, శుభప్రదంగానూ ఉంటుంది’ అన్నాను.
* * *
మరునాడు సాయంత్రం బ్యాంక్ నుంచి రాగానే ఇద్దరం ముస్తాబయి ఎనిమిదింటికి కల్యాణ మంటపానికి బయల్దేరాం. ఉదయం మూడు నలభై రెండు నిమిషాలకి ముహూర్తం. అందుకే మొదట రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మేము వెళ్లేప్పటికే ఫర్లాంగు దూరం వరకు కార్లు నిలబడి ఉన్నాయి. ఎటు చూసినా పోలీసులే... గుంపులు గుంపులుగా నిలబడి ఉన్నారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతూ అడుగడుగునా పోస్టర్లు వేలాడదీసి ఉన్నాయి. తిరునాళ్లలోలా జనం... ఆ మానవ సముద్రాన్ని ఈదుకుంటూ లోపలికెళ్లాం. వెనక సీట్లు కొన్ని ఖాళీగా కన్పిస్తే వాటిలో కూచున్నాం.
ఓ వైపు డీ.జె.తో ఆర్కెస్ట్రా... హోరుమంటూ మ్యూజిక్.. ప్రముఖ సినీ గాయకులతో స్టేజీ మీద పాటలు... ఎటు చూసినా కోలాహలమే. అందంగా అలంకరించుకున్న యువతీ యువకులు స్నాక్స్‌తో పాటు మంచినీళ్లు, శీతల పానీయాలు అందిస్తున్నారు. మరోవైపున్న విశాల మైదానంలో డిన్నర్ ఏర్పాటు చేశారు. కొంతమంది వెళ్లి తినడంలో నిమగ్నమై ఉన్నారు.
ఈ లోపల గాల్లో గబ్బిలాల్లా ఎగురుతూ ఏవో వచ్చి కిందివరకూ దిగి మళ్లా ఎగిరి వెళ్తున్నాయి.
‘ఏంటవి? బుల్లి బుల్లి విమానాల్లా భలే తమాషాగా ఉన్నాయి’ అంది గీత.
‘వాటిని డ్రోన్లంటారు. సర్వేయలెన్స్‌కి వాడుతున్నారు. ముఖ్యమంత్రిగారు వచ్చే ముందు ఈ పరిసర ప్రాంతాలు సురక్షితమో కాదో డ్రోన్ల సాయంతో పరిశీలిస్తున్నారు’
వేదిక వరకూ వెళ్లే దోవలో ఇరువైపులా పొడవాటి నాలుగు స్కూళ్లని ఎడం ఎడంగా అటు రెండు ఇటు రెండు అమర్చి వెళ్లారు పనివాళ్లు. ఒక్కో స్టూల్ ఆరడుగుల ఎత్తులో, ఒక్క మనిషి నిలబడగలిగేంత వెడల్పుతో ఉంది.
‘ఎందుకండీ అవి?’ అని అడిగింది గీత.

‘ఏమో నాకేం తెలుసు? చూద్దాం ఏం చేస్తారో’ అన్నాను.
పాతికేళ్లలోపు వయసున్న నలుగురు అమ్మాయిలు.. వాళ్ల వెనక ఒకడు చిన్న అల్యూమినియం నిచ్చెన పట్టుకుని వచ్చారు. ఆ అమ్మాయిలు చాలా అందంగా, పొడవుగా, నాజూగ్గా ఉన్నారు. పొడవాటి తమ గౌన్లని ఎత్తి పట్టుకుని నిచ్చెన సాయంతో స్టూల్ మీద నిలబడి గౌన్‌ని కిందికి వదిలేశారు. ఇప్పుడు స్టూల్ కన్పించడం లేదు. దాదాపు పనె్నండడుగుల ఎత్తున్న అమ్మాయిలే కన్పిస్తున్నారు. వాళ్లు ముకుళిత హస్తాల్తో ఆ స్టూల్ మీద బ్యాలన్స్ చేసుకుని నిలబడ్డారు.
‘ఇదేమిటి? ఎప్పుడూ చూళ్లేదే... బ్యాలన్స్ తప్పితే పడిపోతారు కదా. ఇలా ఎందుకు నిలబెట్టారు? ఎంతసేపు నిలబెడ్తారు?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది గీత.
నాకూ ఇది కొత్తగానే ఉంది. ఇప్పటివరకు ఏ పెళ్లిలోనూ ఇలాంటిది చూసి ఉండకపోవటం వల్ల నేనూ ఆశ్చర్యపోతూ పొడవాటి సాలభంజికల్లా నిలబడి ఉన్న వాళ్ల వైపు చూశాను. వాళ్ల పెదవుల మీద చిర్నవ్వు. అంత కష్టంలోనూ ఎలా నవ్వగలుగుతున్నారో నాకర్థం కాలేదు. పడిపోతామేమోనన్న భయాన్ని లోపల దాచుకుని, కాళ్లు పీకుతున్నా కూచోడానికి అవకాశం లేనందువల్ల కలుగుతున్న బాధని కన్పించనీయకుండా నవ్వుని పెదవుల మీద లిప్‌స్టిక్‌లా అతికించుకున్నారేమో...
‘మన వైపు మొహం తిప్పి నిలబడిన ఆ అమ్మాయిని చూశారా? నాకు తెల్సిన మొహంలా ఉంది. బాగా పరిచయమున్న మొహమే. ఎక్కడ చూశానో గుర్తుకు రావడంలేదు’ అంది గీత.

కొద్దిసేపటి తర్వాత ‘గుర్తొచ్చింది. మన రెండో అమ్మాయి మధూకి ఇంటర్లో క్లాస్‌మేట్. మనింటికి రెండు మూడుసార్లు వచ్చింది. కానీ చదువు మధ్యలోనే మానేసిందని మధు చెప్పినట్టు గుర్తు. చూసి చాలా ఏళ్లయిందిగా. అందుకే వెంటనే గుర్తుకు రాలేదు. రండి. మాట్లాడి వద్దాం’ అంటూ ముందుకు నడిచింది. నాకు తనని అనుసరించక తప్పలేదు.
పైకి తలయెత్తి ఆ అమ్మాయికి విన్పించేలా ‘నీ పేరు భావన కదూ’ అంది. అన్ని రకాల ధ్వనుల మధ్య గీత గొంతు ఆ అమ్మాయికి విన్పించలేదు. చేతులు జోడించి చిర్నవ్వుతో మైనపు బొమ్మలా నిలబడి ఉంది. చూపు సమాంతరంగా ఉంది. కిందికి చూస్తే కళ్లు తిరుగుతాయని కాబోలు చూపుని కిందికి మరల్చటంలేదు. ఒకేసారి పదీ పనె్నండు మంది గుంపు వేదిక వైపు వెళ్తూ ఉండటంతో నేనూ గీతా పక్కకు జరిగాం. వాళ్లలో ఒకడి కాలు స్టూల్‌ని కప్పేసి ఉన్న ఆమె గౌనుకు తగిలి అతను పడబోయి నిలదొక్కుకున్నాడు. ఆ ఊపునకు స్టూల్ కదిలి ఆ అమ్మాయి కూడా పడబోయింది. భయంతో కేక పెడ్తూ ‘ఏయ్.. చూస్కొని నడువ్’ అంటూ కిందకి చూసింది.

ఆ అవకాశాన్ని జారవిడుచుకోకుండా ‘నువ్వు భావన కదూ. నేను ఇంటర్లో నీ క్లాస్‌మేట్ మధూ వాళ్లమ్మని. నా పేరు గీత. గుర్తున్నానా?’ అంది గీత.
ఆ అమ్మాయి కదలకుండానే చూపుని కిందకి దించి గీతని కొన్ని క్షణాలసేపు చూసి ‘ఆ గుర్తొచ్చారు ఆంటీ. సారీ.. వెంటనే గుర్తుపట్టలేక పోయాను’ అంది. తనున్న పరిస్థితుల్లో తన క్లాస్‌మేట్ వాళ్లమ్మనంటూ ఎవరో పల్కరించడం ఆ అమ్మాయికి నచ్చలేదని ఇబ్బందిగా నవ్విన నవ్వు చూస్తే అర్థమైంది.
‘నువ్వు కిందికొచ్చి ఓ రెణ్నిమిషాలు మాట్లాడటానికి లేదా?’ అని అడిగింది గీత.
‘ముఖ్యమంత్రిగారు వచ్చి వెళ్లేవరకు కిందికి దిగడానికి వీల్లేదు ఆంటీ’ అంది భావన.
‘ఆయనగారు వస్తారని గ్యారంటీ ఏముంది? ఆయనకు సవాలక్ష పన్లుంటాయి కదా. అప్పుడేంటి మీ పరిస్థితి?’
‘తప్పదు. ఎన్ని గంటలైనా ఇలా నిలబడాల్సిందే’ భావన గౌన్ని సవరించుకుని స్టూల్ మీదే మునిగాళ్ల మీద కూచుని మాట్లాడింది.
‘ఎందుకిలాంటి పనికి ఒప్పుకున్నావు? అందరూ నీ వైపు వింతగా చూస్తున్నారు గమనించావా? దానికి తోడు ఇలా కదలకుండా బొమ్మలా నిలబడటం ఎంత కష్టం?’
‘ఏం చేయమంటారు? ఇంటర్లో నాన్నగారు గుండెనొప్పితో హఠాత్తుగా చనిపోయారు. ఇంటర్ పూర్తి చేయకుండానే చదువాగిపోయింది. ఆ చదువుకి ఏం ఉద్యోగాలు దొరుకుతాయి? బట్టల షాపుల్లో సేల్స్ గర్ల్‌గా కొన్నాళ్లు పని చేశాను. ఏడాది నుంచి ఈ పని చేస్తున్నా. దీనికి క్వాలిఫికేషన్ అందంగా ఉండటమే. దేవుడిచ్చిన అందం ఈ రకంగానైనా మా ఇంటిల్లిపాది కడుపు నింపుతోంది. ఇక అభిమానం, సిగ్గు, లజ్జా అంటారా? ఆకలి ముందు అవేవీ గుర్తుకు రావు ఆంటీ’ అంటూ బాధగా నవ్వింది.
ఎవరో మినిస్టర్ వస్తున్నాడని పోలీసులు హడావిడి చేస్తుండటంతో భావన లేచి నిలబడబోతూ ‘మధు ఎలా ఉంది ఆంటీ’ అంది.
‘అది అమెరికాలో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తోంది. పెళ్లయింది. ఏడాది బాబున్నాడు’ అంది గీత. ఆ అమ్మాయి కళ్లలో చప్పున దిగులేదో తొంగి చూసింది.
తిరిగి మా సీట్ల వైపు వెళ్లబోతూ చాలామంది ఒకచోట గుమిగూడి ఉండటంతో ‘ఆ వింతేదో చూద్దాం రండి’ అంది గీత.
అక్కడ ఒక పాలరాతి దిమ్మ మీద అందమైన అమ్మాయి పాలరాతి శిల్పంలానే నిలబడి ఉంది. ఆమె చేతివేళ్లలోంచి నీళ్లు ఫౌంటెన్లా చిమ్ముతున్నాయి. ‘మానవ ఫౌంటేన్’ అంటున్నారెవరో. చుట్టూ చేరిన వారు తమ ఫోన్లకు పని చెప్తున్నారు. ఆమెకు సమీపంగా నిలబడి రకరకాల భంగిమల్లో ఫొటోలు దిగుతున్నారు.

‘ఇదేం చోద్యమండీ. మనుషుల్ని రాతి బొమ్మల్లా నిలబెట్టడం ఏమిటి? కావాలంటే నిజమైన ఫౌంటెనే పెట్టుకోవచ్చుగా’ అంది గీత.
పెళ్లికొడుకు వస్తున్నాడనీ దార్లో నిలబడి ఉండకూడదని మైక్‌లో ఎనౌన్స్ చేయటంతో మేమిద్దరం వెళ్లి మా కుర్చీల్లో కూచున్నాం. ఓ పెద్ద గాజు గోళంలాంటి దాన్లో ఉన్నాడు పెళ్లికొడుకు. అతను నడుస్తుంటే అది ముందుకు దొర్లుకుంటూ వస్తోంది. అలా వింత గ్రహం నించి వచ్చిన వ్యోమగామిలా పెళ్లికొడుకు వేదిక మీద ఉన్న ఉచితాసనం మీద కూచున్నాడు. పెళ్లికూతుర్ని తీసుకొచ్చి అతని పక్కనున్న ఆసనం మీద కూచోబెట్టారు.
వాళ్లకి అక్షింతలు వేయడానికి ఒక్కసారిగా మనుషులు తోసుకున్నారు. ఎలా జరిగిందో ఏమో పెద్దగా అరుస్తూ భావన ఓ టవర్ కూలినట్టు కింద పడిపోయింది. నేనూ గీతా మరి కొంతమందితో కలిసి ఆ అమ్మాయి దగ్గరకి పరుగెత్తాం. కాలు బెణికినట్టుంది. నొప్పితో మెలికలు తిరుగుతోంది. కళ్లనుంచి నీళ్లు బొటబొటా కారుతున్నాయి.

‘ఆస్పత్రికెళ్దాం పద’ అంది గీత. పొడవాటి గౌన్ని సవరించి ఆ అమ్మాయి నుజాల చుట్టూ చేతులేసి లేపి నిల్చోబెట్టింది.
‘పర్లేదాంటి. నిలబడగలను’ అంది భావన.
‘ఇంత నొప్పితో ఎంతసేపని నిలబడ్తావు?’ అంది గీత.
‘మధ్యలో ఆపి వెళ్లిపోతే డబ్బులివ్వరు ఆంటీ’ అంటూ కన్నీళ్లు తుడుచుకుని, స్టూల్ని నిల్చోబెట్టాక నిచ్చెన సాయంతో మళ్లా దాని మీద నిలబడింది. మా కుర్చీల్లో కెళ్లి కూచున్నాక కూడా గీత భావన వైపు పదేపదే చూస్తూనే ఉంది. పళ్ల బిగువున బాధను భరిస్తూ చేతులు జోడించి చిర్నవ్వుని అద్దుకుని నిలబడిన ఆ అమ్మాయిని గమనించి గీత చాలా బాధపడింది.
ఒక్కొక్కరూ వేదిక మీదికెళ్లి అక్షింతలు చల్లి గిఫ్ట్‌లు ఇచ్చి వాళ్లతో ఓ ఫొటో దిగుతున్నారు. పది నిముషాల్లోనే వేదిక ముందు చాంతాడంత క్యూ ఏర్పడింది.
‘మనమూ వెళ్లి నిలబడ్దాం పద. లేకపోతే రాత్రి పనె్నండయినా మన వంతు రాదు’ అన్నాను లేచి నిలబడ్తూ.

‘నేను రాను. ఆ పెళ్లికొడుకు మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది’ అంది.
నేను వేదిక వైపు తలతిప్పి పెళ్లికొడుకు వైపు చూసి ‘తెల్లగా పొడవుగా బాగానే ఉన్నాడే. మహేష్‌బాబులా ఉన్న పెళ్లికొడుకు మొహం చూడాలంటే అసహ్యం అన్నావంటే కళ్లకేమైనా జబ్బొచ్చిందేమో అనుకుంటారు’

‘జబ్బు నా కళ్లకు కాదు. వాడి బుద్ధికి. రేపు ఏ జిల్లాకో కలెక్టర్‌గా పేదల సంక్షేమం కోసం పాటు పడాల్సిన వాడు, అక్రమ సంపాదనలకు అడ్డుకట్ట వేసి స్వచ్ఛ భారత్ నినాదంతో దేశాభివృద్ధికి తోడ్పడాల్సిన వాడు తన పెళ్లిని ఇంత ఆర్భాటంగా చేసుకుంటున్నందుకు అతనంటే అసహ్యం వేస్తోంది. అతనికి అభినందనలు తెల్పను. నేనక్కడికి రాను’ అంది.
కొన్ని క్షణాల విరామం తర్వాత ‘ఇదంతా నా సెల్‌ఫోన్లో రికార్డ్ చేస్తున్నాం. ఇన్‌కంటాక్స్ వాళ్లకూ, మన ప్రధానమంత్రి మోదీగారికి పంపిస్తా. నోట్ల రద్దు తర్వాత ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో అవి తెలుపో నలుపో వాళ్లే తేల్చుకుంటారు’ అంది.
గీత ఎంత మొండిదో నాకు తెలుసు. తనకు నచ్చని పని దేవుడు దిగొచ్చి చెప్పినా చేయదు. అందుకే బతిమాలడం వృధా ప్రయాస అనుకుని ‘సరే. నువ్వు కూచుని ఉండు. నేను వెళ్లి క్యూలో నిలబడ్తాను’ అన్నాను.

‘ఇక్కడ ఇంకో క్షణం కూడా కూచోలేను. అందమైన ఆడపిల్లల్ని మైనపు బొమ్మల్లా నిలబెట్టినందుకు సాటి మనిషిగా సిగ్గుతో తలదించుకుంటున్నా. మనుషుల్ని మనుషుల్లా కాకుండా రాతి విగ్రహాల్లా, నీళ్లు చిమ్మే ఫౌంటెన్లలా మారుస్తున్న ఈ వ్యవస్థను అసహ్యించుకుంటున్నా. నేను వెళ్తున్నా. మీరు ఉంటారో వస్తారో మీ ఇష్టం’ విసురుగా లేచి నిలబడ్తూ అంది గీత.

‘క్యాష్ గిఫ్ట్ పెట్టిన కవరు నీ దగ్గరే ఉందిగా. నాకివ్వు. వెళ్లి నాలుగక్షింతలు వేసి, కవర్ ఇచ్చేసి వస్తాను’ అన్నాను.
‘ఇవ్వను. ఈ పెళ్లి చేయడానికి కోట్లు ఖర్చు చేసిన ప్రసాద్‌గారికి మన పాతిక వేలు పంటికిందికి కూడా ఆనవు. సముద్రంలో పడిన నీటిబొట్టులా నిరర్థకమై పోతాయి. ఈ డబ్బుల్ని ఐలమ్మ కూతురి పెళ్లికి బహుమతిగా ఇస్తా. చాలా సంతోషపడ్తుంది. మన డబ్బుకి ఓ గౌరవం దక్కుతుంది. మన బహుమతికి ఓ సార్థకత ఏర్పడుతుంది’ అంది.

నాకూ గీత ఆవేదనలో ఆలోచనలో అర్థముందనిపించింది.
గీత వెనకే బైటికి వెళ్తూ వెనక్కి తిరిగి ఓసారి చూశా. పనె్నండడుగుల పాలరాతి శిల్పాల్లా ఆ నలుగురూ కదలకుండా నిలబడి ఉన్నారు. వాళ్లను వినోద వస్తువుల్లా చూస్తున్న వేలాది మందికి మానవ ఫౌంటెన్ వేళ్లలోంచి ధారాపాతంగా చిమ్ముతోన్న నీరు కన్పిస్తోంది కానీ ఆ ఐదుగురి కళ్లలోంచి చిమ్ముతున్న కన్నీరు మాత్రం కన్పించడం లేదు... ఎవరు రాతి విగ్రహాలు?

(మీ అభిప్రాయాన్ని తెలియజేయండి)
ధన్యవాదాలు,
శుభదినం.
**********@@@******

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి