23, అక్టోబర్ 2019, బుధవారం


🕉🌞🌎🌙🌟🚩

*_Swami Vivekananda's wisdom for daily inspiration - Oct 22._*

*_స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - అక్టోబరు 22._*

*The main cause of all bondage is ignorance. Man is not wicked by his own nature-not at all. His nature is pure, perfectly holy. Each man is divine. Each man that you see is a God by his very nature.*

*సమస్త దౌర్బల్యం, సమస్త బంధం కేవలం మనోకల్పనయే. ఒక్క మాటతో అది అదృశ్యమై తీరాలి. దౌర్బల్యాన్ని విడనాడు. లే! ధృడంగా ఉండు. నాకు తెలిసిన మతం ఇదే. అదే దైవం.*

🕉🌞🌎🌙🌟🚩

♻ *ఇదొక ఆరోగ్య సలహా.* ♻

*1. ఈ రెంటిని అప్పుడప్పుడు పరీక్ష చేయించండి.*

1. బి.పి.
2. షుగరు

*2. ఈ నాలుగింటిని సాధ్యమైనంత తగ్గించండి.*

1. ఉప్పు
2. చక్కెర
3. డైరీ తయారీలు
4. పిండిపదార్థాలు

*3. ఈ నాలుగింటిని ఎక్కువ తీసుకోండి.*

1. ఆకుకూరలు
2. కూరగాయలు
3. పండ్లు
4. గింజలు

*4. ఈ మూడింటిని మరచిపొండి.*

1. మీ వయస్సు
2. గడిచిపోయిన రోజులు
3. కోపతాపాలు

*5. ఈ మూడింటినీ పొందుటకు చూడండి.*

1. ప్రాణ ‌స్నేహితులు
2. ప్రేమించే కుటుంబం
3. ఉన్నతమైన ఆలోచనలు

*6. ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఈ క్రింది వాటిని పాటించండి.*

1. నియమిత ఉపవాసం
2. నవ్వడం
3. వ్యాయామం
4. బరువు తగ్గుట

*7. ఈ నాలుగు విషయాలకై ఎదురు చూడకండి.*

1. నిద్ర పోవడానికై  నిద్ర వచ్చేవరకు కాచుకొని ఉండకండి.
2. విశ్రాంతి తీసుకోవడానికై అలసిపోయే వరకు ఉండకండి.
3. స్నేహితుడిని కలవడానికై అతను ఎదురుచూడడం మానేసేంత ఆలస్యం చేయకండి.
4. దేవుడిని ప్రార్థించడానికై కష్టాలు వచ్చేంతవరకు ఆగకండి.

♻ *మీ ఆరోగ్యం కాపాడుకోండి.* ♻
🕉🌞🌎🌙🌟🚩

*_Swami Vivekananda's wisdom for daily inspiration - Oct 23._*

*_స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి -

అక్టోబరు 23._*

  *What is the use of living a day or two more in this transitory world? It is better to wear out than to rust out - specially for the sake of doing the least good to others.*

  *ఈ అశాశ్వతమైన ప్రపంచంలో ఇంకా ఒకటి రెండు రోజులు ఎక్కువ బ్రతికి ప్రయోజనమేముంది? తుప్పు పట్టేకన్నా, ఏ కొంచమైనా పరులకు మేలు చేయడంలో అరిగిపోవడమే మంచిది.*

🕉🌞🌎🌙🌟🚩

చెట్టంతమనిషిని పక్షవాతం నిట్టనిలువునా కూల్చేస్తుంది. సమయానికి చికిత్స అందకపోతే మంచానికే పరిమితం చేయొచ్చు. అందువల్ల పక్షవాతం వచ్చాక బాధపడేకన్నా అది రాకుండా చూసుకోవటమే మేలు. ఇందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వీటిల్లో చాలావరకు మనకు సాధ్యమైనవే కావటం మన అదృష్టం.
రక్తపోటు అదుపు
అధిక రక్తపోటుతో పక్షవాతం ముప్పు పెరుగుతుంది. అందువల్ల రక్తపోటు 120/80 మించకుండా చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువుంటే ఆహార, వ్యాయామ నియమాలతో తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అప్పటికీ అదుపులోకి రాకపోతే మందులు వేసుకోవాలి.
గుండెలయను కనిపెట్టండి
గుండెలయ అస్తవ్యస్తమయ్యే సమస్య(ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌)తో పక్షవాతం వచ్చే అవకాశం 5 రెట్లు ఎక్కువ. ఒకవేళ గుండె వేగంగా, అస్తవ్యస్తంగా కొట్టుకుంటుంటే డాక్టర్‌ను సంప్రదించి కారణమేంటో తెలుసుకోవటం మంచిది. ఒకవేళ ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌ సమస్య ఉన్నట్టయితే గుండె వేగాన్ని, రక్తం గడ్డలు ఏర్పడటాన్ని తగ్గించే మందులు సూచిస్తారు.
ఒత్తిడికి కళ్లెం
ఒత్తిడి మూలంగా ఒంట్లో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) తలెత్తుతుంది. ఇది పక్షవాతం ముప్పు పెరగటానికి దోహదం చేస్తుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. తీరికలేని పనులతో ఆఫీసులో ఒత్తిడికి గురవుతుంటే మధ్యమధ్యలో కుర్చీలోంచి లేచి కాసేపు పచార్లు చేయండి. గాఢంగా శ్వాస తీసుకోండి. ఒకేసారి బోలెడన్ని పనులు ముందేసుకోకుండా ఒక పని పూర్తయ్యాక మరో పని ఆరంభించండి. పని చేసే వాతావరణం ప్రశాంతంగా ఉంచుకోవటం ఉత్తమం. వీలైతే చిన్న చిన్న మొక్కలు పెంచుకోవచ్చు. ఆఫీసు పనులను ఇంటిదాకా తెచ్చుకోకుండా కుటుంబ సభ్యులతో హాయిగా గడపటం అలవాటు చేసుకోండి.
మధుమేహం నియంత్రణ
మధుమేహంతో బాధపడేవారికి పక్షవాతం ముప్పు 1.5 రెట్లు ఎక్కువ. దీనికి ప్రధాన కారణం గ్లూకోజు స్థాయులు అధికంగా ఉండటం వల్ల ర�

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి