దుర్గా సూక్తం
42.జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతి వేదః |
స నః పర్ షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితా త్యగ్నిః ||
తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టామ్ |
దుర్గాం దేవీగ్ం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః ||
అగ్నే త్వం పారయా నవ్యో అస్మాంథ్స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా |
పూశ్చ పృథ్వీ బహులా న ఉర్వీ భవా తోకాయ తనయాయ శంయోః ||
విశ్వాని నో దుర్గహా జాతవేదః సింధున్న నావా దురితా తిపర్ షి |
అగ్నే అత్రివన్మనసా గృణానో స్మాకం బోధ్యవితా తనూనామ్ ||
పృతనా జితగ్ం సహమానముగ్రమగ్నిగ్ం హువేమ పరమాథ్సధస్థా”త్ |
స నః పర్ షదతి దుర్గాణి విశ్వా క్షామద్దేవో అతి దురితా త్యగ్నిః ||
ప్రత్నోషి కమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్యశ్చ సత్సి’ |
స్వాంచా” గ్నే తనువం పిప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ ||
గోభిర్జుష్టమయుజో నిషిక్తం తవేoద్ర విష్ణోరనుసంచరేమ |
నాకస్య పృష్ఠమభి సంవసానో వైష్ణవీం లోక ఇహ మాదయంతామ్ ||
ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి |
తన్నో దుర్గిః ప్రచోదయాత్ ||
ఓం శాంతిః శాంతిః శాంతిః ||
విభూషణం శీలసమంచ నాణ్యత్
సంతోష తుల్యధనమస్తి నాణ్యత్
భావం : మానవులకు ఉత్తమ శీలంతో సమానమైన మరో ఆభారణం కాని, సంతోషంతో సమానమయిన మరొక ధనము కాని జగత్తులో లేదు.
ప్రాంజలి ప్రభ:
వికృతం, నైవ గచ్ఛంతి, సంగదోషేణ సాధన:!
అవేష్టితం మహాసర్పే: చందనం న విషాయతే !!
తా:: సత్పురుషులు (సజ్జనులు) చెడ్డ వస్తువలులతో తమకు సంబంధం ఉన్నాను ఆ వస్తువుల చెడ్డ తనం మంచి వారిలో ఏవిధమైన మార్పు ను లేక వికారములు కలిగించ జాలదు. ఎట్లనగా మంచిగంధపు చెట్టును విషముగల సర్పములు చుట్టుకొని ఉండును.
ఐనను వాటి విషము ఆ గంధపు చెట్టుకు ఎట్టి మార్పును కలిగించ లేదు.
నేటి శ్లోకాలు
న తథేచ్ఛంతి కళ్యాణాన్ పరేషామ్ వేదితుం గుణాన్
యథైషా౦ జ్ఞాతు మిచ్ఛంతి నిర్గుణ్యం పాపచేతనః
పాపబుద్ధికలవారు యితరుల దోషములను తెలిసి కొనుటకు నిరంతరం ఆసక్తి చూపుతుంటారు.కానీ వారి మంచి గుణములను తెలిసి కొనుటకు అంతగా ఆసక్తి చూపరు.
నేటి శ్లోకాలు
ఆత్మీయమిత్రులందరికి శుభోదయం
తెనాలి రామకృష్ణుడు
(క్రీ.శ.16వశతాబ్ది)
పాండురంగ మహాత్మ్యం
ఒకనాడు దీర్ఘోపయోగిగాని శఠుండు నౌఁదల ధరియించు నభ్రగంగ నాప్రొద్దు పొయిరాఁజనట్టి నిర్పేదయు భోగించు నైశ్వర్యములెనిమిదియుఁ
బుష్కరాక్షుల పొంతఁబోని వర్షవరుండు దేహార్థమునఁదాల్చుఁ తీగఁ బోఁడి
నాయుధ ప్రభఁగాంచి యలఁగు భీరువుఁ బూను వాఁడి మమ్మోముల వేఁడి యలుగు మలిన వర్తనుఁడును సుధాలలితమూర్తి మించి వర్తించు, మతిలేని మేదకుండు మౌనివర్యులఁ జదివించు మఱ్ఱినీడఁ బంచముఖువీట మేనోసరించెనేని. కాశీ పుణ్యక్షేత్ర మహిమ.పంచముఖుడు అంటే శివుడు. సద్యోజాత, వాసుదేవ,అఘోర,తత్పురుష , ఈ శానములనే ఐదూ శివునిముఖాలు. పంచముఖుని వీట (పురములో) - అంటే కాశీలో మరణిస్తే (మేనోసరి స్తే) - ఒక్కరోజు కూడా ఏ తీర్థమూ సేవించని మూఢుడు కూడా నెత్తిమీద గంగని ధరిస్తాడట. కాశీలో మరణించగానే శివుడైపోతాడుగా మరి! ఆ ప్రొద్దు పొయ్యిరాజనట్టి కటిక పేదవాడు కూడా కాశీలో మరణిస్తే అ
ష్టైశ్వర్యాలూ అనుభవిస్తాడట.పుష్కర+అక్షులు -తామరపువ్వువంటి కన్నులుకలవారు - స్త్రీలు; ఏనాడూస్త్రీలవద్దకు వెళ్ళని నపుంసకుడు (వర్షవరుడు)కూడా శివునిలాగా అర్థనారీశ్వరుడౌతాడు.ఆయుధముల
కాంతిని చూస్తేనే భయపడిపోయే పిరికివాడుకూడా కాశీలో మరణించినంతమాత్రాన వాడియైనమూడు మొనలుగల తీక్షణమగు ఆయుధము (త్రిశూలము) ను చేబూనుతాడట. చెడునడత గలవాడు కూడా (మలినవర్తనుడు) కాశీలో మరణిస్తే అమృతమువలె స్వచ్ఛమైన దేహ
ముకల చంద్రుని (సుధాలలితమూర్తి) మించి ప్రకాశి స్తాడట.మతిలేని స్థబ్దుడు కూడా కాశీలో మరణిస్తే మర్రి చెట్టునీడన మౌనివర్యులకే విద్యాబోధ చేస్తాడట. (కైలాసంలో ఒక పురాతనమైన మర్రిచెట్టు నీడలో పర
మశివుడు మునిగణానికి ఆధ్యాత్మికోపన్యాసాలిస్తూ ఉంటాడని ప్రతీతి)
ఇక కాశీలో ఉన్న వారకాంతల సౌందర్యాన్ని రా మకృష్ణుడు ఇలా వర్ణిస్తున్నాడు వివరణ శ్రీ బాలాంత్రపు వేంకటరమణ గారు
-((*))--
*తమాషా ప్రశ్నలు - వెరైటీ సమాధానాలు*
1. పగలు కూడా కనపడే నైట్ ఏమిటి?
జ. *గ్రానైట్*
2. ఎగ్జామినర్ దిద్దని పేపర్ ఏమిటి?
జ. *న్యూస్ పేపర్.*
3. వేలికి పెట్టుకోలేని రింగ్ ఏమిటి?
జ. *ఫైరింగ్*
4. అందరూ భయపడే బడి ఏమిటి?
జ. *చేతబడి.*
5. అందరూ నమస్కరించే కాలు ఏమిటి?
జ. *పుస్తకాలు*
6. వీసా అడగని దేశమేమిటి?
జ. *సందేశం.*
7. ఆయుధంలేని పోరాటమేమిటి?
జ. *మౌనపోరాటం.*
8. గుడ్డు పెట్టలేని కోడి ఏమిటి?
జ. *పకోడి*
9. కనిపించని వనం ఏమిటి?
జ. *పవనం.*
10. నీరు లేని వెల్ ఏమిటి?
జ. *ట్రావెల్*
11. నారి లేని విల్లు ఏమిటి?
జ. *హరివిల్లు*
12. డబ్బులుండని బ్యాంక్ ఏమిటి?
జ. *బ్లడ్ బ్యాంక్*
13. వేసుకోలేని గొడుగు ఏమిటి?
జ. *పుట్టగొడుగు.*
14. చీమలు కనిపెట్టలేని షుగర్ ఏమిటి?
జ. *బ్రౌన్ షుగర్*
15. వేయలేని టెంట్ ఏమిటి?
జ. *మిలిటెంట్*
16. మొక్కకు పూయని రోజాలు ఏమిటి?
జ. *శిరోజాలు.*
17. రుచి లేని కారం ఏమిటి?
జ. *ఆకారం*
18. చారలు లేని జీబ్రా ఏమిటి?
జ. *ఆల్జీబ్రా*
19. అందరూ కోరుకునే సతి ఏమిటి?
జ. *వసతి.*
20. అందరికి నచ్చే బడి ఏమిటి?
జ. *రాబడి.*
21. తాజ్ మహల్ ఎక్కడుంది?
జ. *భూమ్మీద.*
22. ఇంటికి పెట్టలేని గేట్ ఏమిటి?
జ. *ఇంటరాగేట్*
23. అంకెల్లో లేని పది?
జ. *ద్రౌపది.*
24. చేపల్ని తినే రాయి ఏమిటి?
జ. *కొక్కిరాయి.*
25. వాహనాలకు ఉండని టైర్లు ఏమిటి?
జ. *సెటైర్లు*
26. భార్య లేని పతి ఎవరు?
జ. *అల్లోపతి*
27. అన్నం తినకపోతే ఏమవుతుంది?
జ. *మిగిలిపోతుంది.*
28. కూర్చోలేని హాలు ఏమిటి?
జ. *వరహాలు.*
29. వాహనాలకు ఉండని టైర్ ఏమిటి?
జ. *రిటైర్*
30. తినలేని కాయ ఏమిటి?
జ. *లెంపకాయ*
31. అందరికీ ఇష్టమైన కారం ఏమిటి?
జ. *ఉపకారం.*
32. కరవలేని పాము?
జ. *వెన్నుపాము.*
33. కొట్టకుండా తగిగే దెబ్బ ఏమిటి?
జ. *వడదెబ్బ*
34. తాగలేని పాలు ఏమిటి?
జ. *పాపాలు.*
35. పూజకు పనికిరాని పత్రి ఏమిటి?
జ. *ఆసుపత్రి*
36.గీయలేని కోణం ఏమిటి?
జ. *కుంభకోణం.*
37. చెట్లు లేని వనం?
జ. *భవనం.*
38.వెలిగించలేని క్యాండిల్?
జ. *ఫిల్డర్ క్యాండిల్.*
39. కోడి వేడినీళ్లు తాగితే ఏం చేస్తుంది?
జ. *ఉడకబెట్టిన గుడ్డు పెడుతుంది.*
40. స్కూల్ బ్యాగులో ఉండని స్కేలు
జ. *రిక్టర్ స్కేలు*
41. తాగలేని రసం ఏమిటి?
జ. *పాదరసం.*
42. పిల్లలు ఉండని స్కూల్ ఏమిటి?
జ. *డ్రైవింగ్ స్కూల్*
43. నడవలేని కాలు ఏమిటి?
జ. *పంపకాలు*
44. ఆడలేని బ్యాట్ ఏమిటి?
జ. *దోమల బ్యాట్*
45.. కనిపించని గ్రహం ఏమిటి?
జ. *నిగ్రహం*.
46.. భోజనంలో పనికి రాని రసం ఏమిటి?
జ. *పాదరసం.*
47. తాగలేని రమ్ ఏమిటి?
జ. *తగరం.*
48. దేవుడు లేని మతం ఏమిటి?
జ. *కమతం*
49. దున్నలేని హలం?
జ. *కుతూహలం.*
50. రాజులు నివశించని కోట ఏమిటి?
జ. *తులసి కోట*
51. వైద్యులు ఆపరేషన్ చేస్తున్నప్పడు ముఖానికి గుడ్డ ఎందుకు కట్టుకుంటారు?
జ. *ఎవరు చేశారో తెలియకూడదని*
52. నోరు లేకపోయినా కరిచేవి?
జ. *చెప్పులు*
53. చేయడానికి ఇష్టపడానికి ధర్మం
జ. *కాలధర్మం*
54. డబ్బులు ఉండని బ్యాంకు
జ. *బ్లడ్ బ్యాంక్*
55. ఓకే చోదకుడితో నడిచే బస్సు
జ. *డబుల్ డెక్కర్ బస్సు
*56. ఎంత విసిరినా చేతిలో ఉండే కర్ర
జ. *విసనకర్ర*
57. ఉత్తరానికి, దక్షిణానికి తేడా?
జ. *ఉత్తరం పోస్టు డబ్బాలో వేయగలం. దక్షిణాన్నిo వేయలేం.*
om sri ram
11. పంచకన్యలు తెలుపుము?
1.అహల్య
2.ద్రౌపతి
3.తార
4.మడోదరి
5.కుంతి
12. పంచ పాతకములు తెలుపుము?
1. స్త్రీ హత్య - స్త్రీని చంపడం
2. శిశు హత్య - చిన్నపిల్లలను చంపడం
3. గో హత్య - ఆవును చంపడం
4. బ్రహ్మ హత్య - బ్రాహ్మణున్ని చంపడం
5. గురు హత్య - చదుఫు నేర్పిన గురువుని చంపడం
13. పంచకన్యలు పేర్లు వ్రాయుము ?
1.అహల్య
2.ద్రౌపతి
3.తార
4.మడోదరి
5.కుంతి
14. పంచపాండవులు పేర్లు తెలుపుము?
1.ధర్మరాజు - అజాత శత్రువైన ధర్మరాజు పాండవులలో పెద్దవాడు.ధర్మరాజు యముడు వరం కారణంగా జన్మిస్తాడు.
2.భీమసేనుడు - అతిబలశాలి అయిన భీముడు వయిదేవుడు వరప్రభావం చేత జన్మిస్తాడు.
3.అర్జునుడు - ఇంద్రుడు వలన విలువిద్యాపారంగతుడైన అర్జునుడు జన్మిస్తాడు
4.నకులుడు
5.సహదేవుడు - అశ్వనీదేవతల వర ప్రభావం చేత మాద్రికి వీరిరువురూ జన్మిస్తారు.
15. ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ శైవక్షేత్రాలను తెలుపుము ?
ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ శైవక్షేత్రాలను పంచారామాలు అని పిలుస్తారు. పంచారామాలు ఏర్పడుటకు స్కంద పురాణంలో వాటి స్ధల పురాణం ఇలా వివరించబడినది.పూర్వం తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి శివుని ఆత్మలింగము సంపాదిస్తాడు.దీనితో వర గర్వముతో దేవతలను అనేక రకాలుగా హింసలు గురిచేయగా దీనితో దేవతలు విష్ణుమూర్తిని ప్రార్ధించగా శివపార్వతుల వల్ల కలిగిన కుమారుడు వల్లనే తారకాసురునిపై యుద్ధానికి పంపుతారు.యుద్ధమునందు కుమారస్వామి తారకాసురుని కంఠంలో గల ఆత్మలింగమును చేదిస్తేనే మరణము కలుగునని గ్రహించి ఆ లింగమును చేదిస్తాడు.దీనితో తారకాసురుడు మరణిస్తాడు.చేదించగా ఆ ఆత్మలింగము వేరై ఐదు ప్రదేశములలో పడుతుంది. తరువాత వాటిని ఆఅ ప్రదేశాలలో దేవతలు ప్రతిష్ఠ ఛేస్తారు. ఇవే పంచారామాలు.
1.దాక్షారామము -
పంచరామాల్లో మొదటిదైన దాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది. ఇక్కడ స్వామిని భీమేశ్వరుడు అని పిలుస్తారు.స్వామి లింగాకారం 60 అడుగులు ఎత్తులో ఉంటుంది. పైఅంతస్తు నుండి పూజలు నిర్వహించాలి.ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగం భాగం తెలుపు సగభాగం నలుపుతో ఉంటుంది.
ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు. కనుక ఈ ప్రాంతానికి దాక్షారామము అని పేరు వచ్చిందంటారు. ఈ ఆలయం చాళుక్యరాజయిన భీముడు నిర్మించాడని తెలుస్తుంది.అనేక పురాణాల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది. పూర్వకాలంలో ఎంతోమంది దేవతలు,రాజులు స్వామి వారిని దర్శించి తరించారని తన భీమేశ్వర పురాణంలో రాసాడు.ఈ ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది.ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.
2.అమరారామము -
పంచారామల్లో రెండవదైన అమరారామము గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణా తీరమునందు కలదు.ఇక్కడ స్వామిని అమరేశ్వరుడు అని పిలుస్తారు.గర్భగుడిలో స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తులో తెల్లగా మెరుస్తూ ఉంటుంది.ఈ ఆలయం 20 అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపైన నిర్మించబడింది.
గర్భగుడిలోని విగ్రహాన్ని తారకాసురుని సమ్హారం అనంతరం కంఠంలోని శివుని ఆత్మలింగం చెల్లాచెదురు అవ్వగా దానిలోని ఒభాగాన్ని అమరేశ్వరుడైన ఇంద్రుడు ఇక్కడ ప్రతిష్టించి తన నగరమైన అమరావతినే దీనికి పెట్టాడంటారు.
3.క్షీరారామము -
క్షీరారామము పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో కలదు. ఇక్కడ శివుని మూర్తిని శ్రీ క్షీరారామ లింగేశ్వర స్వామి అని పిలుస్తారు.
ఇక్కడ స్వామి వారిని త్రేతాయుగ కాలంలో సీతారాములు ఇద్దరూ ప్రతిష్ఠించారట.ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా ఒక కధ ఉంది. శివుడు తన బాణమును భూమిలోనికి వెయ్యగానే భూమినుండి పాలదార ఒకటి వచ్చిందట క్షీరం అనగా పాలు దీనిమూలంగా క్షీరపురి అనే పేరు వచ్చింది.క్రమంగా క్షీరపురి కాస్తా పాలకొల్లుగా మార్పు చెందింది. స్వామి వారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు.ఆలయం 125 అడుగుల ఎత్తులో 9 గోపురాలుతో కట్టబడింది.
4.సోమారామము -
పంచరామాల్లో నాల్గవదైన సోమారామము పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమిటర్లు దూరంలో గల గునిపూడిలో కలదు. ఇక్కడ స్వామి వారిని సోమేశ్వరుడు అని పిలుస్తారు.ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది.మాములు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోనికి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యధాస్ధానానికి చేరుతుంది.
ఇక్కడ స్వామిని చంద్రుడు ప్రతిష్టించాడు.చంద్రునిచే ప్రతిష్ఠించ బడినది కావున దీనికి సోమారామము అని పేరు వచ్చింది.
5.కుమార భీమారామము -
పంచారామాల్లో చివరిదైన కుమారభీమారామము తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమిటరు దూరంలో కలదు.ఇక్కడ స్వామిని కాల బైరవుడు అని పిలుస్తారు.
ఈ ఆలయాన్ని దాక్షారామాన్ని నిర్మించిన చాళుక్య రాజయిన భీముచే ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు. ఇక్కడి శివలింగం సున్నపురాయితో చెయ్యబడింది.ఈ ఆలయంలో మహశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
16. పంచభక్ష్యాలు తెలుపుము?
పంచభక్ష్యాలు అనగా ఐదు రకాలైన ఆహార పదార్ధాలు.
ఎవరైనా మంచి భొజనం పెడితే పంచభక్ష్యపరవాన్నాలతో భొజనం పెట్టాడనడం పరిపాటి.
అవి
1. భక్ష్యము - భక్ష్యము అనగా నమిలితినే పదార్ధము
2. భొజ్యము - భొజ్యము అనగా చప్పరిస్తూ తినేది
3. చోప్యము - చోప్యము అనగా జుర్రుకునేది
4. లేహ్యము - లేహ్యము అనగా నాకబడేది
5. పానియము - పానియము అనగా త్రాగేది
17. పంచ భూతాలు తెలుపుము ?
ప్రకృతిలో మనకు కనిపించే భూమి,నీరు,ఆకాశము,అగ్ని,గాలులని పంచభూతాలు అని అంటారు.
అవి .
1. భూమి
2. నీరు
3. అగ్ని
4. ఆకాశము
5. గాలి
18. పంచఋషులు పేర్లు తెలుపుము ?
1. కౌశికుడు
2. కాశ్యపుడు
3. భరద్వాజ
4. అత్రి
5. గౌతముడు
19. పంచాంగం అనగా ఏమి
1. తిథి
2. వారం
3. నక్షత్రం
4. యోగం
5. కరణం
ఈ ఐదు ఉన్న పుస్తకం.
20. పంచజ్ఞానేంద్రియములు అనగా ఐదు ఇంద్రియాలు
అవి
1. ముక్కు - ఘ్రాణేంద్రియం (వాసల చూడటానికి)
2. నాలుక - రసనేంద్రియం (రుచి చూడటానికి)
3. కన్ను - చక్షురింద్రియం (చూడటానికి)
4. చెవి - శ్రోత్రేంద్రియం (వినడానికి)
5. చర్మం - త్వగింద్రియం (మన శరీరంలోని అవయవాలను కప్పి ఉంచడానికి)
21. అయిదవతనము అనగానేమి ?
అయిదవతనం అంటే అయిదు వన్నెలు కలిగి ఉండడం.
ఇక్కడ “వన్నెలు” అంటే సుమంగళి యొక్క అలంకారాలు
ఆ అలంకారాలు ఏమనగా
1. మంగళసూత్రం
2. పసుపు
3. కుంకుమ
4. గాజులు
5. చెవ్వాకు
22. పంచగంగలు తెలుపుము ?
1. గంగ
2. కృష్ణ
3. గోదావరి
4. తుంగభద్ర
5. కావేరి
23. పంచ గుణాలు తెలుపుము ?
హిందూ సాంప్రదాయం ప్రకారం మనలోని 6 గుణాలుంటాయి.
అవి.
1. కామం
2. క్రోధం
3. లోభం
4. మోహం
5. మదం
6. మత్సరం
24. మాయావునిలో ఎన్ని చెక్రాలు ఉంటాయి ?
మానవుని శరీరం లోని వెన్నుపూసలో ఉండే , దిగువ చెప్పిన ఆరు సూక్ష్మ స్థానాలను షట్చక్రాలు అంటారు
1. మూలాధార చక్రము
2. స్వాధిష్ఠాన చక్రము
3. మణిపూరక చక్రము
4. అనాహత చక్రము
5. విశుద్ధ చక్రము
6. ఆజ్ఞా చక్రము
25. షడ్విధ రసములు తెలుపుము ?
షడ్విధ రసములు
1. ఉప్పు
2. పులుపు
3. కారం
4. తీపి
5. చేదు
6. వగరు
26. షడృతువుల పేర్లు తెలుపుము ?
షడృతువులు - ఋతువులు 6
అవి
1. వసంత ఋతువు
2. గ్రీష్మ ఋతువు
3. వర్ష ఋతువు
4. శరదృతువు
5. హేమంత ఋతువు
6. శిశిర ఋతువు
27. తిరుపతిలో ఉన్న ఏడుకొండల పేర్లు తెలుపుము?
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటెశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో ఏడు కొండలు కలవు.
వీటినే సప్త గిరులు అని అంటారు.
అవి.
1 శేషాద్రి
2 నీలాద్రి
3 గరుడాద్రి
4 అంజనాద్రి
5 వృషభాద్రి
6 నారాయణాద్రి
7 వేంకటాద్రి
28. సప్తాశ్వారాలు తెలుపుము?
సప్త స్వరాలు - మన భారతీయ సంగీతంలో 7 స్వరాలు కలవు.
వీటినే సప్త స్వరాలు అని పిలుస్తారు.
అవి.
1. స = షడ్జమం (నెమలి క్రేంకారం)
2. రి = రిషభం (ఎద్దు రంకె)
3. గ = గాంధర్వం (మేక అరుపు)
4. మ = మధ్యమం (క్రౌంచపక్షి కూత)
5. ప = పంచమం (కోయిల కూత)
6. ధ = ధైవతం (గుర్రం సకిలింత)
7. ని = నిషాదం (ఏనుగు ఘీంకారం)
29. సప్తద్విపాలు తెలుపుము?
బ్రహ్మాండ పురాణములోను, మహాభారతంలోను, భాగవతం సప్త ద్వీపాలగురించి ప్రస్తావన ఉంది.
అవి .
1. జంబూద్వీపం - అగ్నీంద్రుడు
2. ప్లక్షద్వీపం - మేధాతిథి
3. శాల్మలీద్వీపం - వపుష్మంతుడు
4. కుశద్వీపం - జ్యోతిష్మంతుడు
5. క్రౌంచద్వీపం - ద్యుతిమంతుడు
6. శాకద్వీపం - హవ్యుడు
7. పుష్కరద్వీపం - సేవనుడు.
30. సప్తనదుల పేర్లు తెలుపుము?
సప్త నదులు
1. గంగ
2. యమున
3. సరస్వతి
4. గోదావరి
5. సింధు
6. నర్మద
7. కావేరి
31. సప్తల్కాలు తెలుపుము?
సప్త అధొలోకములు
1. అతలము
2. వితలము
3. సుతలము
4. తలాతలము
5. రసాతలము
6. మహాతలము
7. పాతాళము
32. సప్త యూషుల పేర్లు వ్రాయుము ?
సప్త ఋషులు
1.వశిష్టుడు
2.ఆత్రి
3.గౌతముడు
4.కశ్యపుడు
5.భరద్వాజుడు
6.జమదగ్ని
7.విశ్వామిత్రుడు
33. అష్టదిగ్గజాలను వీటి నండూరు?
పురాణాలలో అష్టదిగ్గజాలు
1. ఐరావతం
2. పుండరీకం
3. వామనం
4. కుముదం
5. అంజనం
6. పుష్పదంతం
7. సార్వభౌమం
8. సుప్రతీకం
34. అష్ట జన్మలు ఏవి ?
అష్ట జన్మలు
1.దేవ జన్మ
2. మనుష్య జన్మ
3. రాక్షస జన్మ
4. పిచాచ జన్మ
5. పశు జన్మ
6. పక్షి జన్మ
7. జలజీవ జన్మ
8. కీటక జన్మ
--((**))--
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (వివరాలు ) -7
న్యూడిల్లీ: ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్‌కు అరుదైన గౌరవం దక్కింది. తనదైన శైలిలో చిత్రాలను తెరకెక్కించి తెలుగుతెరపై తిరుగులేని ముద్రవేసిన ఆయన కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. 2016 సంవత్సరానికి గానూ విశ్వనాథ్‌కు ఈ పురస్కారాన్ని అందించనున్నారు. 1957లో ‘తోడికోడలు’ చిత్రంతో సౌండ్ విభాగంలో సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ‘ఆత్మగౌరవం’ చిత్రం ద్వారా తొలిసారి మెగాఫోన్ పట్టి దర్శకుడయ్యారు.N.T.R తో జీవిత చక్రం, చిన్న నాటి స్నేహితులు, ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ‘సిరి సిరిమువ్వ’ చిత్రంతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విశ్వనాథ్ చిత్రాల్లో ‘శంకరాభరణం’ ఓ కలికితురాయి అని చెప్పాలి. ఏకంగా జాతీయ అవార్డును అందుకుంది ఆ చిత్రం. "సప్తపది' ‘సాగర సంగమం’, ‘శృతిలయలు’, ‘సిరివెన్నెల’, ‘స్వర్ణకమలం’, ‘స్వాతికిరణం’ ప్రతిదీ ఆణిముత్యమే.
‘స్వాతిముత్యం’ సినిమా ఆస్కార్ అవార్డుకు అధికారిక ప్రవేశం పొందడం విశేషం. భారతీయ సినిమాకు విశ్వనాథ్ చేసిన కృషికిగాను భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన విశ్వనాథ్ నటుడిగానూ తనదైన ముద్రవేశారు. మే 2న రాష్ట్రపతి చేతుల మీదుగా విశ్వనాథ్ ఈ పురస్కారానికి అందు కున్నారు. విశ్వనాథ్ గారి సినిమాలు రష్యన్ భాషలో అనువదించి
విడుదల చేయగా హిట్ అయ్యాయి.
దాదా సాహెబ్‌ఫాల్కే పురస్కారానికి ఎంపిక కావడం తాను అదృష్టంగా భావిస్తున్నానని కె.విశ్వనాథ్ అన్నారు. తన తల్లిదండ్రుల దీవెనలు ఫలించాయని, తనని ఆదరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
విడుదల చేయగా హిట్ అయ్యాయి.
దాదా సాహెబ్‌ఫాల్కే పురస్కారానికి ఎంపిక కావడం తాను అదృష్టంగా భావిస్తున్నానని కె.విశ్వనాథ్ అన్నారు. తన తల్లిదండ్రుల దీవెనలు ఫలించాయని, తనని ఆదరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
గతంలో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న తెలుగు సినీ దిగ్గజాలు
* బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి(1974)
* పైడి జయరాజు(1980)
* ఎల్.వి.ప్రసాద్(1982)
* బి.నాగిరెడ్డి(1986)
* అక్కినేని నాగేశ్వరరావు(1990)
* డి.రామానాయుడు(2009)
* కె.బాలచందర్(2010)
* కె.విశ్వనాథ్(2016)
* బి.నాగిరెడ్డి(1986)
* అక్కినేని నాగేశ్వరరావు(1990)
* డి.రామానాయుడు(2009)
* కె.బాలచందర్(2010)
* కె.విశ్వనాథ్(2016)
*🙏పాఠశాల అసెంబ్లీ కోసం*🙏
*---12.12.2017---*
*▪సుభాషిత వాక్కు*
*"చచ్చాక వినపడని డప్పు ఎంత గొప్పగా వుంటే ఏంటి.?*
*బతికుండగా వినియోగించని డబ్బు ఎంత కుప్పగా ఉంటే ఏంటి.?"*
*"Like success, failure is many things to many people. With positive mental attitude, failure is a learning experience, a rung on the ladder, and a plateau at which to get your thoughts in order to prepare to try. again.”*
*🔹మంచి పద్యం*
*మనము నందు ఇరులు మట్టు బెట్టు కొనుము*
*విద్య నేర్చి మనము విజ్ఞతెరిగి*
*స్వస్తి పలుక వలము సర్వమూఢ ములను*
*వాస్తవంబు వేము వారి మాట*
*❗భావం*:-
*విద్య నేర్చిన యెడల విజ్ఞత పెరిగి అజ్ఞానాందకసరం తొలగును. మూఢాచారాలకు స్వస్తి పలుకును.*
*జనరల్ నాలెడ్జ్ *
*1) ప్రపంచం లోనే తొలి తేలియాడే పవన విద్యుత్ వ్యవస్థ ఎక్కడ ఉంది?*
జ) *స్కాట్లాండ్*
*2) ప్రస్తుత ఇరాన్ అధ్యక్షుడు ఎవరు?*
జ) *హాసన్ రోహనీ( వరసగా 2వ సారి)*
3) *అలుపెరగని గళం- విరామమెరగనీ పయనం ఎవరి పై రాసిన పుస్తకం?*
జ) *వెంకయ్యనాయుడు*
4) *మహిళల కోసం 181 హెల్ప్ లైన్ ను ప్రారంభించిన రాష్ట్రం ఏది?*
జ) *మణిపూర్*
5) *న్యాయమూర్తుల జీతభత్యాల తెలిపే ప్రకరణ ఏది?*
జ) *125వ*
రామాయణం
:::::::::::::::::::::::::::::::::::::
1. భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం - గంగోత్రి, ఉత్తరాఖండ్
2. కపిల మహర్షి ఆశ్రమం,(శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం.గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది) - గంగాసాగర్, వెస్ట్ బెంగాల్
3. కాంభోజ రాజ్యం - ఇరాన్ ( శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది).
4. రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివున్ని పూజించి వరాలు పొందిన చోటు)- లాంగకో, టిబెట్, చైనా
5. పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చొటు - గోకర్ణ, కర్ణాటక
6. సీతాదేవి భూమిలో లభించిన చోటు - సీతామర్హి, బీహార్
7. మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) - జనక్ పూర్, నేపాల్
8. కోసలదేశం - రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం
9. దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం - ఫైజాబాద్,ఉత్తర్ ప్రదేశ్.
10. సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) - ఘాఘర నది.
11. ఆయోధ్య / సాకేతపురం (శ్రీరాముని జన్మస్థలం,బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం,సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం) - అయోధ్య,ఉత్తర్ ప్రదేశ్.
12. తాటక వధ జరిగిన ప్రదేశం - బక్సర్, బీహార్
13. అహల్య శాపవిమోచన స్థలం - అహిరౌలి,బీహార్
14. కుశనాథపురం (విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం) - సుల్తాన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్
15. గుహుడు సీతారామలక్ష్మణులను కలిసిన చోటు - శృంగబేరిపురం, అలహాబాద్ దగ్గర
16 దండకారణ్యం - చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు.
17. చిత్రకూటం (సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు) - సాత్న జిల్లా, మధ్యప్రదేశ్.
18. పంచవటి (శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం) - నాసిక్, మహరాష్ట్ర.
19. కబంధాశ్రమం - కర్దిగుడ్, బెల్గావి, కర్ణాటక.
20. శబరి ఆశ్రమం - సర్బన్, బెల్గావి, కర్ణాటక.
21. హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం - హనుమాన్ హళ్ళి, కొప్పాళ, కర్ణాటక.
22. ఆంజనేయ పర్వతం (హనుమంతుడి జన్మస్థలం), కిష్కింద (సుగ్రీవుని రాజ్యం), ఋష్యమూక పర్వతం -తుంగభద్ర నదీతీర ప్రాంతం, హంపి దగ్గర,కర్ణాటక
23. విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం - ధనుష్కొటి, తమిళనాడు.
24. శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు- రామేశ్వరం,తమిళనాడు
25. రత్నద్వీపం / సింహళం / లంక - శ్రీలంక.
26. అశోకవనం (సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం) - కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక
27. శ్రీరాముడు రావణుని వధించిన చోటు - దునువిల్ల, శ్రీలంక
28. సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం - దివిరుంపోల, శ్రీలంక.
29. వాల్మీకి ఆశ్రమం / సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం / భూదేవిలో ఐక్యమైన స్థలం - ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలోని బితూర్.
30. కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్, పాకిస్తాన్.
31. లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) - లాహోర్, పాకిస్తాన్
32. తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్
33. పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి