5, అక్టోబర్ 2019, శనివారం

నా మొగాడు ఎవరు ? //2020


 నిజమైన మొగుడు  ఎవరు ? షార్ట్ ఫిలిం కధ    
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
నా  మొగాడు ఎవరు 

కాలింగ్ బెల్ శబ్దం విని తలుపు తీసింది ఆ ఇల్లాలు   
ఎవరండీ మీరు 
ఏమిటే నేను నీ భర్తను అప్పుడే మరిచి పోయావా అంటూ తోసుకుంటూ లోపలకువచ్చాడు ఒక తను 
ఏమండి ఎవరో వచ్చారు చూడండి ఏవేవో మాట్లాడుతున్నాడు 
ఎవర్రా నీవు మా ఇంట్లోకొచ్చి  నా పెల్లాన్ని పట్టుకొని ఏవో మాట్లాడుతున్నవుటా 
అసలు నువెవ్వడు రా 
ఇది నా పెళ్ళాం నీకు తెలియక పొతే ఇదిగో ఫోటో చూడు 
అంటూ చేతిలో పెట్టి 
ఏమిటే  అట్లా దేబ్రిమోహం వేసుకొని చూస్తున్నావు, నీ మొగుడ్ని వదలి వేరొకడ్ని  తెచ్చి పెట్టుకున్నావే,  ఎంతకు తెగించావే నేను ఉరికెళ్ళి వచ్చే లోపు 
ఏమండి వీడెవడో పిచ్చిఆసుపత్రి నుండి పారిపోయి వచ్చాడండి, నాకు భయం వేస్తుంది  
అసలు లేరా పైకి నీవు ఎవర్రా అంటూ అరిచాడు అసలు మొగడు      
ఏమిటిరా నన్నే ఎదిరిస్తున్నావు నువ్వే బయటకు పో అంటూ ఒక్క తోపు తోసాడు వచ్చిన వాడు
వీడెవడే అంత గట్టిగా వాదిస్తున్నాడు నీ మాజీ ప్రియుడా, నాకన్నా బలంగా ఉన్నాడే   
ఏవండీ మీ మీద ఒట్టు వీడెవడో నాకు అస్సలు తెలవ దండీ 
ఏమిటే నేనెవరో నీకు తెలియదా 
మనబ్బాయిని ఫిలిప్ వాడే చెపుతాడు నేనెవర్నో 
వీడెవడండి నా మొగుడంటూ వచ్చాడు, నాకు  పిల్లోడంటాడు, పక్కింటి మావయ్యగారిని పిలవండి 
ఉండవే నాకు మతి పోతుంది ఏంచెయ్యాలో తోచటం లేదు 
ఇద్దరం కలసి బయటకు నెట్టుదాం రావే 
వేడడో నాకన్నా బలంగా ఉన్నాడు, నీవు సహకరించవే 
ఆ ఉండండి ఇప్పుడే వస్తా అంటూ లోపలకు వెళ్లి కారం డబ్బా తెచ్చి మొహం మీద కొట్టింది       
 ఓసి ముదనష్టపుదానా నామీద కారం చల్లుతావే అంటూ జుట్టు పట్టుకొని గట్టిగా పీకాడు 
భర్త  పెళ్ళాన్ని పట్టుకొని ఒక్క గుంజు గుంజాడు అంతే ఇద్దరు పక్క ఉన్న సోఫాలో పడ్డారు
ఆ శబ్దానికి పక్కింటి మామయ్య గారు
ఏమిటమ్మా మీ ఇంటిలో శబ్దాలు

హల్లో మావయ్యగారు నన్ను గుర్తు పట్టారా  
అసలు నీవు ఎవర్రా 
నిన్ను ఎప్పుడు నేను చూడలేదే  
అసలు నీవెవరు, ఇక్కడికెందు కొచ్చావ్ 
చూడండి మావయ్యగారు వేడెవడో నామొగుడంటూ వచ్చాడు 
ఉండమ్మా నేను వీడెవడో  నేను కనుక్కుంటా, గాబరా పడకు 
కనుక్కోవటం కాదు వీడిని బయఁటకు తోసేద్దాం పట్టండి 
ఉంఢమ్మా వీడి విషయాలు కనుక్కొని 
ఏమైంది కనుక్కొనేది వీడు  నాపెళ్ళని పట్టుకొని,  రావే నా పెళ్ళామా అంటున్నాడు 
  పోలీసులకు ఫోన్ చేసావా 
చేయలేదండి 
ఇప్పుడు చేస్తాను 
ఏమని చేస్తావ్ 
నా పెళ్ళాం మజిమొగుడు వచ్చాడనా 
మావయ్యగారు మిరే చెప్పండి, ఈ ఫోటో చూసి మరీ చెప్పండి 
ఇది నా పెళ్ళామే కదా 
ఫోటోను బట్టి ఇది కరక్టే 
ఏదయ్యా మీ పెళ్లి ఫోటో తీసుకురండి 
మాకు పెల్లి ఫోటోలేదండి, గుళ్లో పెళ్లి చేసుకున్నాం 
ఏవమ్మా నీవే చెప్పు 
మా ఇద్దరి పెళ్లి, మా ఇద్దరి పెల్లి అంటూ గొణిగింది 
నీవైనా చెప్పు అసలు మీరెవరో చెప్పండి, అసలు నేనే ఫోన్ చేసి మీ అందరి బండారం ఏమిటో నే తెలుస్తాను అన్నాడు 
ఏమిటి మావయ్యగారు 
మేము ఎవరో మీకు తెలియదా 
అవునమ్మా తెలుసు ఎప్పుడ్నించి ఒక నెల నుండి కదా అదికూడా మాఇంటిలో అద్దెకొచ్చినప్పటి  నుండి మాత్రమే కదా 
అంతక ముందు కధ నాకెట్లా తెలుస్తుంది 
మావయ్యగారు  ముందు వీడిని బయఁటకు నట్టేద్దాం, మనం మనం మాట్లాడుకుందాం 
ఏమిటిరా మీరు మాట్లాడుకునేది 
అసలు నువ్వెవరో నాకు చెప్పు , ఎప్పడినించి నా పెళ్ళాన్ని తగులుకున్నావు 
నేనే పోలీసులకు ఫోన్ చేస్తాను, నన్నేమిటిరా మీరు బయటకు నెట్టేది అంటూ ఫోన్ చేసాడు వచ్చినవాడు 
ఉండండి మావయ్యగారు, మీరు కూడ ఒకపెళ్ళాం ఇద్దరు మొగుడ్ల కధలాగున్నది, నాకెందుకు నేను వెళ్తా 
ఆగమనే ఆగవే ఎక్కడికి పోతావ్ , ముందు అక్కడ కూర్చో అంటూ ముసలోడ్ని అరిచాడు వచ్చినవాడు 
ఎరా బ్రదర్ నీకు వేరే చెప్పాలా నీవు కూడా అక్కడ కూర్చో 
ఒసే పెళ్ళామా ఏమిటే అలా చూస్తావ్ పోలీసులొచ్చేదాకా కాఫి కలుపుకురా, నీ చేతుల్లో కాఫీ త్రాగి చాలా రోజులయింది 
తెమ్మంటే తెస్తావా తేవా అంటూ గట్టిగా అరిచాడు 
ఆ అరుపుకు లోపలకు పరుగెత్తింది
పోలీస్  వచ్చి  ఇది ఫామిలీ సంభందించిన విషయం, మేము మీరు చెప్పినవన్నీ వ్రాసుకున్నాం రికార్డ్ చేసాం, మెం పిలిచేదాకా మీరు ఇల్లు దాటి పోకూడదు ముందు వీటిపై సంతకం పెట్టండి అన్నాడు 
అందారూ సంతకం పెట్టారు పోలీస్ వెళ్లి పోయాడు 
అరే  నేను దూరం నుంచి వచ్ఛాగా అంటూ లోపలకు వెళ్ళాడు వచ్చినవాడు
ఏమిటే వీడు నీకు తెలిసినవాడా అంటు నమ్మకంగా మాట్లాడుతున్నాడు 
మీమీద ఒట్టండి వీడెవడో నాకసలు తెలియదండి 
కోర్టులో హాజరు పరిచారు వాద ప్రతివాదనలు  విన్న తర్వాత ఈ స్త్రీ ఒకర్ని పెళ్లి చేసుకొని పిల్లని కని వాళ్ళని వదలి వచ్చి వేరొకరి పంచన చేరినట్లు నిర్ధారణ తేలింది అయినా ఈ స్త్రీ స్వయంగా తన అపరాధము ఒప్పుకొనక పోవటం వళ్ళ  అసలు మొగుడు ఎవరో తేలనందు వళ్ళ అందర్నీ కష్టడీలో తీసుకోని  పూర్తివివరాలు కోర్టులో సమర్పించాలని కోరఢ మైనది, ఈ కేసును వాయిదా వేయటం జరిగినది 
 \
--((***))--           

ఒక చిన్న కధ
నిజమైన మొగుడెవరు ? (2)   
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

కోర్టు హాల్ ఆంతా జన సమూహంతో నిండి పొయిన్ది
ఈరోజు కొత్తరకం కేసని విలేఖరులు కూడా వచ్చి వున్నారు 
పోలీసులు  విధి నిర్వాహణలో చేయవలసిన వన్నీ చేసి సమయం కోసం వేచి ఉన్నారు 
మేజిస్ట్రేట్ గారు వచ్చాక వాది ప్రతి వాదులు, వారి తరుఫున వకీలు గార్లు ఉన్నారా అని అడిగి 
కోర్టు అనుమతిస్తున్నది       
శాంతి శాంతి అని బిల్లజమాన్ పిలవగా 
మీరు ఈ భర్తను,  భర్త కాదని వాదించు తున్నారు కారణాలు వివరించ గలరా అనిమేజిస్ట్రేట అడిగారు                 
ఆతను నా భర్త కాదు నా భర్త రామ్ మూర్తి గారు, ఇతనెవరో నాకు  తెలవదు   
 యువర్ హానర్ ఈమె భార్య అని పూర్తి వివరాలు పొందుపరచాము, భర్తను వదలి, వేరొకరితో కాపురం చేస్తున్నది, ఇది తప్పు భావించి నా క్లైమ్ కు న్యాయం చేయగలరు 
భరణం కోరుతున్నారా అని మేజిస్ట్రేట్ కోరాడు 
అవునండి ఆమె ప్రభుత్వ ఉద్యోగి, మరలా పెళ్లి చేసుకోవటం తప్పు, విడాకులు తీసుకోకుండా మరో నేరం 
మీరేమన్న చెప్పుకుంటారా మీ భర్తల గుర్తించి 
నా కున్నది ఒక్కడే భర్త ఆయన శ్రీరామ్ మూర్తి గారే, ఇతను నాభర్త కాదు 
మీకు ఒక బాబు కుడా ఉన్నారా 
ఉన్నారండి 
ఆ బాబు ఎవరికీ పుట్టారో చెప్పఁగలరా 
ఆబాబు సుబ్బారావుకు పుట్టారని  డాక్టర్ సెర్టిఫికెట్స్ చెపుతున్నాయి మీరేమంటారు 
యువర్ హానర్  మా క్లయింటు బాబు రామ్మూర్తి బిడ్డని  ప్రూ ఫ్ తో సహా మీకు పొందు పరిచాం 
మరి ఇద్దరు ఎట్లా  ఇచ్చారు 
ముందు ఈ బాబు ఎవరికీ పుట్టారో మరలా  డి .ఎన్.ఏ (deoxy   nuclveic  acid  ) ప్రభుత్వ డాక్టర్ ద్వారా తీసుకోని పొందు పరచమని ఈ కేసును వచ్చే వారం ఇదేరోజున మరలా కోర్టు జరుగునని వాయదా వేసి కోర్టు సమయము  మీరినదని తెలియ పరచి లేచారు మేజిస్ట్రేట్               
మేజిస్ట్రేట్  తరువాత ఒకరి తరువాత ఒకరు చొప్పున అందరు బయటకు నడిచారు      

చూడమ్మా  ఈ ఫొటోలో ఉన్నది నీవేనా 
ఆ నేనెన్నది 
మరి ప్రక్కన ఉన్నది  నీ భర్తేనా    
నా భర్త కాదండీ 
యూరానర్, ఆమె భర్త కాదన్నా ఈ  ఫోటో చూస్తే మైక్ తెలుస్తుంది 
ఇక మీరు వెళ్ళచ్చు  అనగా సన్నటి వెళ్లి ప్రేక్షలముందు కూర్చున్నది      
 అప్పుడే గుడి పూజారి అచ్చాడు 
అతనికి ఫోటో చూపించి ఈమె వివాహమేనా మీ గుడిలో జరిగింది  అవునా 
అవునండి 
నేనే దగ్గర ఉండి మంత్రాలు   చదివి  తాళికట్టించాను  నాకు బాగా గుర్తు ఉన్నది అని చెప్పాడు 
ఇక మీరు ఏళ్ళవచ్చు అని పంపారు లాయర్ గారు 
రామ్ మూర్తిని పిలిచి 
మీ పెళ్లి విషయాలు చెప్పగలరా 
ఇదిగో నండీ మా శుభలేఖ 
ఫోటోలు ఏమైనా ఉన్నాయా 
లేవండి  
మీ రిద్దరికి పెళ్లైంది   చెప్పారు ఎవరైనా సాక్షులు ఉన్నారా 
లేరండి    
మరి మీరు   పెళ్లైన దాన్ని పెళ్లి  చేసుకోవటం తప్పనిపించలేదా  
ఆమెకు పెళ్లైనట్లు నాకు తెలియదు       
మా ఇద్దరి మధ్య ఎటువంటి అనుమానాలు    లేవు       
మధ్యలో . ఆధారాలన్నీ చూపాడు  కేవలం భరణం అడుగు తున్నాడు మీరేమంటారు 
అసలు ఆతను భర్తే కాదన్నప్పుడు ఇక భరణం ఎట్లా ఇస్తారు 
సరే మీరు ఇక వెళ్లవచ్చు
డి.ఎం.ఆ రిపోర్టు వచ్చింది పరిశీలించగా కోర్టువారికి కొన్ని వివరాలు కలసి వహ్హ్యినది 
(కారణం ఆ పిల్లవాడు శాంతకు పుటిన బిడ్డ కాదు కనక)
    
వాద ప్రతి వాదనలు జరిగాయి అయినా  కేసు వాయిదా వేశారు. ఎందుకనగా 
1  నా భార్యేనని రామమూర్తిగారు గట్టిగ వెల్లడించటం 
2  నా భార్యేనని ఆధారాలు చూపిస్తున్నాడు సుబ్బారావు  . .
3 . బాబు శాంతి బిడ్డే కాదని డి.ఎన్.ఏ  రిపోర్ట్. తెలపటం వల్లను    

పోలీస్ ఎంక్వరి  చేసి పూర్తి వివరాలు నెల  రోజులలో   ఈ ముగ్గురి  ప్రవర్తన రిపోర్ట్  వ్రాసి  తెలపగలరు  , ముగ్గుర్ని  విడివిడిగా  పరిశీలించి చెప్పఁగలరు మీ అభిప్రాయాలు అన్నీ టైం అయినదని లేచారు మేజిస్ట్రేట్      

 --((***))--       
         
 నిజమైన మొగుడు  ఎవరు ? (3)   
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

పోలీస్ స్టాఫ్ లో దంచుడు దండయ్య అనే పోలీస్ చాలా తెలివిగలవాడు కానీ ఆయనే చేసేవాణ్ణి ఎలివితక్కువపనులే, వాటి ఫలితాలు ముందు కష్టమైనా తరవాత చాలా తేలికగా అర్ధమవుతుంది. 
దండయ్యకు కొంత ఇన్ఫరమేషన్ కనుక్కోమని మన కేసు విషయాలు తెలుసుకొనుటకు కొన్ని అధికారాలు ఇచ్చారు. 
ముందు : ఇంటి ఓఆర్ మామయ్య వద్దకు వచ్చి కొన్ని ప్రశ్నలు వేయం మొదలు  పెట్టాడు  
పోలీస్ : రాత్రి పది తర్వాత ఇంటికి ఎవరు వస్తారు వివరించగలరా  
మా :   నాకెట్లా తెలుసండి 
పో   ఎవరితో మాట్లాడుతున్నావో గమనించారా 
మా : బెదిరిస్తున్నారా 
పో : నిజం చెప్పమని అడుగుతున్నాను 
మా : ఎప్పుడన్నా ఆలస్యంగా రామమూర్తిగారు వాస్తు ఉంటారు 
పో : శాంతి బయటకు పోవటం ఎమన్నా చూసారా 
మా :  ఆవిడ ప్రవర్తనలో నాకు ఎటువంటి అనుమానం లేదు ఆవిడ నన్ను చక్కగా పలకరిస్తుంది, మాటలతో ముచ్చటిస్తుంది 
పో : మీ ఇంట్లో ఉన్నారని చెపుతున్నారా 
మా : అంత లేదండి ఉన్న నిజం చెప్పాను 
పో: మీ ఇంట్లో చేరేటపుడు ఎంతమంది ఉంటామన్నారు 
మా: ఇద్దరు 
పో : ఇంట్లో చేరేటప్పుడు ఇద్దరే లేదా బాబుతో వచ్చారా 
మా: ముందు ఇద్దరే వచ్చారు 
పో: మరి బాబు 
మా : మీకు చెప్పటం మరిచా ఒక రోజు రాత్రి 11  గంటలకు ఒక బాబును తీసుకొచ్చారు 
         అప్పుడే అడిగాను, ఎవరీ బాబుని
పో: వివరాలు చెప్పారా 
మా : ఆ చెప్పారు ఐ బాబు మాబాబే మా అత్తగారివద్ద ఉంచాము ఇప్పుడే తెచ్చామన్నారు 
పో : నమ్మ వచ్చా మీరు చెప్పే మాటలు   
 మా : నమ్మినా నమ్మకపోయినా నాకు తెలిసిన విషయం తెలిపా 
పో : మీకేమన్న కొత్త విషయాలు తెలిస్తే వేనని ఐ ఫోన్ తెలియపరచండి, అవసరమైతే మీరు పోలీస్ స్టేషన్కు రావాల్సి ఉంటుంది  
మా : అట్లాగే 
పో : అన్నట్టు మరిచా ఇంట్లో ఎవ్వరు లేరేంటి 
మా : నా శ్రీమతి ఈ మధ్యలో పరమ పదించింది, నాకు ఇద్దరు మొగపిల్లలు వారు చదువుల నిమిత్తం అమెరికాలో ఉంటున్నారు. నన్ను కూడా రమ్మనమంటున్నారు వెల్దామను కుంటున్నాం 
పో : పాస్ పోర్టు అంత రెడీ చేసారా ఏమిటి ? 
మా : అవును 
పో : అయితే నెలరోజులోపైతే వాయిదా వేసుకోండి, ఎందుకంటే విచారణలో మీరు ఒక ముద్దాయిగా ఉన్నారు అందుకని    
మా నేను మిమ్ము ఒక ప్రాం అడగవచ్చా 
అడగండి 
మూడు జేబుల్లో మూడు సెల్  ఫోన్లు పెట్టుకొని తిరుగుతున్నారు 
పై పోన్ మ్రోగితే గీత ఫోన్ అని  
మధ్యఫోన్ మోగితే రాధ  ఫోన్ అని 
క్రింద ఫోన్ మోగితే  సీత ఫోన్ అని 
నాకు పెళ్ళాల మాటల గుర్తు కోసం నా మాట తప్పకుండా ఉండేందు కోసం అనుకుంటున్నారా 
మరి కాదా 
అదే తప్పు ఒకటి నా ఇంటర్యూ రికార్డింగ్ మా స్టేషన్లో, రెండోది నా సెల్లో , మూడవది నాభార్య నా  ప్రవర్త వినటానికి అన్నాడు 
ఐ ఇంటర్వ్యూలో మీ సహకారం కావాలి 
అంటే అర్ధం కాలేదు 
అర్ధం లోనే ఉంది పరమార్ధం మాటి మాటికీ కోర్టు పోలీస్ స్టేషన్కు రాకుండా ఉండేందుకు 
నా మాటలు మీకు అర్ధం అయి ఉంటాయి 
అర్ధం అయినది మీ సంతోషాన్ని మేము ఎలా పాడుచేస్తాము ఇది ఉంచండి 
వెళ్ళొస్థానండి, ఇక రానండి, మీరే రావాలి 
అంటూ వెనుతిరిగారు దండయ్యా    

--((***))--
         
 దంచుడు దండయ్య శాంతి ని కలిసాడు 
మీ కేసు గురించి కొన్ని ప్రశ్నలు వేయదలిచాను 
అడగండి చెపుతాను 
మీరు వర్కింగ్ ఉమెన్ కదా,  జాబ్ చేస్తున్నప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా 
ఏమి లేవు 
మీ భర్త మీకు సహకరిస్తున్నారా? 
సాహకారించటం అంటారేమిటి,  ఆడ మగా సమానమని వాదిస్తారు, ఏపని చెప్పిన చిటికలో చేస్తాను అంటారు కానీ చేయరా 
ఎసరు రామామూర్తిగారా, సుబ్బారావుగారా    
 సుబ్బారావు ఎవరండీ, మొన్న మీరే పెళ్ళాం అని వచ్చిన వాడే  
వాడెవడండీ నామొగుడే కాదు, నన్ను బ్లాక్మెయిల్ చేసి భరణం పొందాలని ఆశిస్తున్నాడు అప్ప మలేయ్ ేరేడి ఏది లేదు 
మీరే వాడితో కాపురం చేసారా
అరే  నా మొగుడే కాదంటే ఏమిటండి, నేను చెప్పలేక చస్తున్నాను
సరే మీవారు ఇంట్లో ఎమన్నా చేస్తారా 
చెయ్య రండి " వంటకు వంటావిడ, గిన్నెలు తోమే మనిషి, బట్టలు ఉతికే పనిమనిషి, బాబును స్కూలులో దించే మనిషి, కూరలు ఎచ్ఛాలు తెచ్చే మనిషి, ఆఫీసుకు పోయే కిరాయి ఆటో అని ఉన్నాయి 
అవసరానికె మొగుడు కదండి 
ఎవరి అవసరం అండి
మీ అవసరం కాకాపోతే, మీవారి అవసరం కావచ్చు 
మీరు ఎంతమంది 
మానాన్నకు నేను ఒక్కతినే
మరెవ్వరు లేరు 
పోలీస్ వారి మీద నీకు నమ్మకమున్నదా 
నమ్మకం ఉంది 
మొగుడంటూ వచ్చున్నా వాణ్ని ఏవిధంగా ఎదుర్కొంటారు 
అసలే వాడి మీద కేసు పెట్టాం, పరిషారం చూపాల్సినది మిరే 
రామమూర్తిగారు ఎప్పుడు వస్తారు 
వారిని కూడా ప్రశ్నలు వెయ్యాలి 
అది మా డ్యూటీ నండి, నలరోజుల్లో  ఏది నిజమో ఏది అబద్ధమో అంటా వ్రాసి కోర్టులో సబ్మిట్ చెయ్యాలి అది మా డ్యూటీ 
చివరి ప్రశ్న " స్త్రీ " అంటే ఎవరు 
గుమ్మం ముందు నుంచొని కూర్చొని గంటల కొద్ది మాట్లాడుతుంది, కూర్చోమంటే టైం లేదు వెళ్తానంటుంది 
సరే వెళ్తున్నాను మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి 
అదేవిధముగా రామమూర్తిని కూడా ప్రశ్నలకు సమాధానము తీసుకోని చివరగా సుబ్బారావును కలిసాడు వివరాలు తీసు కొని ఒక నోట్సు తయారు చేసాడు దంచుడు దండయ్యా 
కోర్టులో పూర్తిగా తెలిసిన వివరాలు అన్ని సమర్పించారు 
..... 

దంచుడు దండయ్యకు సుబ్బారావు మీద అనుమానం వచ్చింది 
ఏదోవిధంగా అతని నుండి వివరాలు రాబట్టాలని ఆలోచించాడు 
అతని బవలహీనత ఏమిటో గమనించాడు 
వెంటనే బార్  షాపుకు తీసికెళ్ళాడు నెమ్మదిగా మాటల్లో దించాడు 
మీకు వివరాలు ఎలా తెలిసినాయి 
నేను ఒక లారీ డ్రైవెర్నండి 
సరుకుదించి తిరిగివస్త్ ఉంటె  ఒక కారు చెట్టుకు గుద్ది ఉండటం  
దానిలో ఉన్న వారు చనిపొయ్యారు కారులో ఏమైనా దొరుకుతాయా అని వెదికాను 
ఒక డైరీ ఆల్బమ్లు ఫోటోలు ఉన్నాయి, అవి తీసుకొనగా అప్పడు పోలీసులు రావటం వారితో 108  వ్యాను రావటం శవాలను తీసుకెళ్లటం కళ్లారా చూసాను ఆతరువాత వెనక్కు తిరిగాను 

శాంతా నీకెట్లా తెలుసు అని అడిగాడు 
ఆకు అసలు తెలియదు,  ఒకరోజు నేను సెంటర్లో ఆగినప్పుడు ఆమెను చూసాను, ఉద్యోగ వివరాలు తెలుసుకున్నాను  కాస్తబెదిరిస్తే భరణం వస్తుందని అనుకున్నాను 
ఆమె నీ భార్య కాకపోయినా ఎలా వాదించావు వివరాలు ఎలా పొందు పరిచావ్ అని అడిగాడు 
అంతా డైరీలో వివరాలు ఉన్నాయి 
ఎట్లా తెలిసింది 
కారులో చనిపోయినవాని పిల్లవాడు 20  రోజులు ముందే శాంతా రామ్మూర్తిగారు పెంచు కొనేవిధంగా ఏర్పాటు చేసాను. ఆ కారులో చనిపోయినవారు శాంతి అక్క బావ వారి పిల్లవాడే  ఆ విషయం శాంతికి కూడా తెలియదు ఎందుకనగా కమల పిల్లలు పుట్టాక చిన్నపుడు నర్సు డబ్బు ఆశతో వేఱొకరికి అమ్మే వేసినది. శాంతా వాళ్ళ నాన్నకు ఒక్కరే పుట్టారని అబద్ధమాడినది.  అప్పుడే ఆలోచించి  బావ ఫోటోను మార్చి నాఫోటు పెట్టి సాక్షాలు అన్నీ  ఏర్పాటు చేసుకొని ఎలా  ఉండదో ఒక నాటకం ఆడితే ఎవ్వరు కనుక్కోలేకయ్యారు అంటూ త్రాగి త్రాగి క్రింద పడిపయ్యాడు 
మరలా లేపి డైరీ ఎక్కడ ఉన్నది 
నా లారీలో అన్నాడు 
లారీ నెంబరు చెప్పాడు 
పోలీస్ వారు పూర్తీ వివరాలు కోర్టులో చూపారు 

మేజిస్ట్రేట్చూ తీర్పు వెల్లడించారు " సుబ్బారావు అసలైన దోషిగా నిర్ధారించి జీవితా లతో ఆడుకున్న నేరంగా జైలు శిక్ష విధించారు .      
.--((***))--      
  



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి