ప్రాంజలి ప్రభ (చిన్న కధ -౩)
రచయత : మల్లాప్రగడ రామ కృష్ణ
ఆశ్రమంలో గురువుగారు శిష్యులకు ధర్మ భోధ చేస్తున్నారు, అక్కడకు ఒక స్త్రీ వచ్చి నమస్కరించి మాబాబు నేను ఎంత చెప్పినా నామాట వినుటలేదు, మీరు మార్చే ఉపాయం చెప్పండి అని అడిగింది. అమ్మా రేపు వచ్చి కలవు, మీ సమస్యకు పరిష్కారం నేను చెప్పగలను అన్నాడు, అదే విధముగా రోజు రావడం, ఇదే మాట వినడం అలవాటు అయినది. ఒక రోజు గురువు గారు ఆ స్త్రీని, ఆ బాబుని పిలిచి, "అమ్మ మాట వినాలి అదే నీకు ఆరోగ్యదాయకం అన్నాడు", అట్లాగే గురువుగారు అన్నాడు బాబు, కాని ఆ స్త్రీకి కోపం వచ్చింది ఈ మాట చెప్పటానికి ఇన్ని సార్లు తిప్పించాలా అన్నది. చూడమ్మా నేను కూడా మీ పిల్లవాని అలవాట్లు ఉన్న వాడ్ని " మట్టి గడ్డలు నలిపె వాడ్ని, గడ్డి పరకలు తెంపేవాడ్ని, గోళ్ళు కోరికే వాడ్ని, నిందలు చెప్పువాడ్ని, శుభ్రత, పరిశుద్దత లేనివాడ్ని"
అవి మార్చు కోవటానికి నాకు ఇంత సమయం పట్టింది. కుండలోని మజ్జిగను ఎక్కువ సేపు చిలికితె గాని వెన్న పుట్టదు, తేనెటీగలు ఎక్కువసేపు కష్టపడితేగాని తేన తుట్టె రాదు, ఓర్పుతో మంచి మాటలు చేపితె కాని బుద్ధి మారదు, అతి ప్రేమ చూపిన, భయం తో మార్చాలని ప్రయత్నించిన పిల్లల మారారు, వారిది కల్లాకపటం లేని మనసు వారి ముందు మీ ప్రవర్తన మార్చుకుంటే పిల్లలు వృద్ధిలోకి వస్తారు. అంటూ ఈ శ్లోకం తెలియపరిచారు
శ్లో === లోష్టమర్ధీ తృణ చ్చెదీ నఖఖాదీ చ యోనరః |
సవినాశం వ్రాజత్యాషు సూచకో శుచిరేవ చ ||
భావము === మట్టి గడ్డలు నలిపెవాడు , గడ్డి పరకలు తెంపేవాడు, గోళ్ళు కోరికే వాడు, నిందలు చెప్పువాడు, శుభ్రత, పరిశుద్దత లేనివాడు శీఘ్రమ్గా నశించి పోవుదురు.
--((**))--
ప్రాంజలి ప్రభ
రచయిత: నేటి తీరు (1)
"ప్రవ చనాలు"
రచయిత: నేటి తీరు (1)
"ప్రవ చనాలు"
"పెళ్లి కాక ముందు నువ్వు ....
ఏదైనా సాధిస్తే ....
అది "విక్టరీ"
పెళ్లి అయ్యాకా నువ్వు.....
ఏదైనా సాధిస్తే ....
అది..."హిస్టరీ"
జీవితంలో అన్నీ
ఉంటాయి మిస్టరి .......
వృద్ధాప్యం లో ప్రతిఒక్కరు
చదువు తారు డిస్ట్రనరి ......
--((**))--
--((***))-- Swami Vivekananda's Wisdom for Daily Inspiration - Sept 18.
స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - సెప్టెంబర్ 18.
The national ideals of India are renunciation and service. Intensify her in those channels, and the rest will take care of itself.
భారతదేశ జాతీయ ఆదర్శాలు త్యాగం, సేవ. దేశాన్ని వీటి ఒరవడిలో మరింత తీవ్రంగా ముందుకు సాగనివ్వండి. మిగిలినవన్నీ వాటికవే సర్దుకుంటాయి.
🕉🌞🌎🌙🌟🚩
--((***))--
*భగవద్గీత అంటే ఏమిటి?*
– జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా?
– రిటైర్‌మెంట్ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమతా?
– ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా?
– అది కేవలం హిందువులదా?
– పనీపాటా వదిలేసి సన్యసించమని చెబుతుందా అది?
*కాదు*
అవన్నీ అపోహలు. ఒక్కముక్కలో చెప్పాలంటే *భగవద్గీత ‘డైనమిక్ ప్రిస్కిప్షన్ ఫర్ లైఫ్’*
సంతృప్తిసంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి
*☆సంతోషంగా ఉండాలి అని ఏవేవో చేస్తుంటాం. గీత చెప్పేదీ నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు అని.*
*☆ సన్యాసం అనేది కాషాయదుస్తులతో రాదు. అదొక మానసిక స్థితి. వందమంది మధ్యన ఉన్నా, వంద పనులున్నా కూడా తామరాకు మీద నీటిబొట్టు మాదిరిగా ఉండటమే సన్యాసమంటే.*
*☆ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే దానర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కానేకాదు. ప్రపంచ ం అందిస్తున్న అన్నిటినీ ఇంద్రియాల సాయంతో, తెలివిగా వాడుకోమని. అలా వాడుకుంటే ప్రశాంతత, తద్వారా విజయం లభిస్తాయి.*
ఏ పనిలోనైనా మీకు బాధ్యత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. భగవద్గీత చెప్పేది అదే.*
*☆అసలు భగవద్గీత ఏం చెబుతుంది?*
👉-ధర్మాధర్మాల గురించి చెబుతుంది.
👉-కర్తవ్యం గురించి చెబుతుంది.
👉-నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు… అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది.
👉 ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది.
👉సుఖం… శాంతి… త్యాగం… యోగం… అంటే ఏమిటో చెబుతుంది.
👉ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది.
పాప పుణ్యాల వివరణ ఇస్తుంది.
👉ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది. స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది.
👉-జ్ఞానం… మోక్షం… బ్రహ్మం… ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది.
👉-ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది.
👉-ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది.
👉-మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.
👉పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది.
👉కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది.
👉నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.
*అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం.*
అర్థం చేసుకున్నవారు ధన్యులు.నిన్ను నన్ను మన అందరి గురించి మాట్లాడుతుంది భగవద్గీత. మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది.
గీత చదువుకో.....
నీ రాత మార్చుకో.....
🕉🌹🙏
నేటి కవిత
నిశ్శబ్ద ప్రళయం
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
నిశ్శబ్దం కాల ప్రయాణం
నిశ్శబ్దం దేశ ప్రగతి
నిశ్శబ్దం కాల సమయం
నిశ్శబ్దం మనిషి బతుకు
నింగిలో నీటి కుండలు
గాలిలో కదిలే నీటి బుడగలు
మనిషిలో కదిలే ఆశలు
గాలిలో కదిలే మబ్బులు
పక్షులకు చెట్లే గూడు
మనుష్యులకు చెట్లుకూలిస్తే గూడు
పువ్వు రాలితే కన్నీరు
మనిషి మాట తూలితే కన్నీరు
మనిషి పుట్టుకకు సంబరం
పెళ్ళికి సమరోత్సాహం
సంసారానికి విజయోత్సాహం
అదే నిశ్శబ్ద ప్రళయం
చాప క్రింద నీరు
మనిషిని వెంటాడి ఆశ
నిత్యం పొందే జ్ఞానబోధ
మనిషిని వెంటాడే అహం
కాలుష్యానికి మూగప్రాణులు హతం
మనుష్యుల్లో చేరినన నిశ్శబ్ద రోగం
మంచు కరిగి ఏరై పారు
గుండె బరువై ఏలు
గాలి కుత్రిమం
నీరు కుత్రిమం
కాంతి కుత్రిమం
నింగి నిశ్శబ్దం
పృద్వి ప్రళయం
కాలుష్యం మధ్య మనిషి యాంత్రికం
నిశ్శబ్దం అంతా నిశబ్దం
కమ్ముకొస్తున్నది నిశ్శబ్ద ప్రళయం
ఇది నిజం ఇది సత్యం ఇదేమాయ
--((***))--
--((***))--
*అక్షర సత్యాలు* 🌾
🌾🌾🌾🍂🍂🌾🌾🌾
🍂 మాటల్లో మెత్త దనం ఉండాలని నాలుక, ప్రవర్తనలో సున్ని తత్వం ఉండాలని... హృదయం ఎముకలు లే కుండా సృష్టించ బడ్డాయి..!!
🍂 కావున నాలుకతో కఠిన మైన మాటలు మాట్లాడి...
సున్నిత మైన హృదయాన్ని... బాధ పెట్ట రాదు..!!
🍂 నమ్మకం... నీ మీద ఉంచు కుంటే అది నీ బలం అవుతుంది...
వేరొకరి పై ఉంచితే... అది... నీ బల హీనత... అవు తుంది..!!
🍂 మంచి తనం అనేది. మహా వృక్షం లాంటిది...
ఎవ రెంత నరికినా మళ్లీ మళ్లీ... చిగురిస్తూనే... ఉంటుంది....
గుండె లోతు ల్లోంచి జీవం పోసు కుంటూనే ఉంటుంది..!!
🍂 జీవితం లో నియమాలు ఎక్కువైతే... మీ ముఖం లో నవ్వు తగ్గి పోతుంది..
ఎక్కువ కావలసింది. జ్ఞానం కానీ.. నియమాలు కాదు... అర్థం చేసు కోండి..!!
🍂 మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి ...మనిషి... ఇచ్చే...నమ్మకం చాలా.. గొప్పది..!!
🍂 ఎంత ఎత్తు లో ఉన్నప్పటికీ... దాన్ని చేరుకునే మార్గం మాత్రం...
నీ కాళ్ళ క్రింది నుండే మొదలవు తుంది..!!
🍂 కాలికి తగిలే ఎదురు దెబ్బలు నడవడం నేర్పిస్తాయి.
మనసుకి తగిలిన ఎదురు దెబ్బలు బ్రతకడం నేర్పిస్తాయి..!!
🙏👌👍👏👌👍👏🙏
--((***))--
🌸 *చాలా మంది బతికేస్తుంటారు , కొందరే జీవిస్తుంటారు* 🌸
*'' ఈ వాన లో ఎక్కడికెళతారు ? మా ఇంట్లోనే వుండండి , '' అని ఆ నిరుపేద ఒడిషా కూలీ అన్నపుడు సుధా మూర్తి గారు ఆగారు.*
ఆమె పేద పిల్లలకు ఉచిత బడి స్థాపించే పని మీద అక్కడికెళ్ళారు. *'ఆమె మన అతిథి . ఆమె టీ , కాఫీ తాగరట. పాలు ఇవ్వు ,'* అని ఆ కూలీ అంటే *'మన పాప కు ఆ ఒక్క గ్లాసు పాలే వున్నాయి. వాన పడుతోంది. ఆ పాలు ఆమెకిస్తే రాత్రంతా పాప ఏడుస్తుంటుంది ,'* అంది ఆమె. *'అయినా పరవాలేదు , సగం పాలకు సగం నీళ్ళు కలిపి , చక్కెరతో ఇవ్వు,* 'అన్నాడు ఆయన. ఒరియా తెలిసిన సుధామూర్తి కి అది వినపడింది. *'ఈ రోజు బుధవారం , నేను ఉపవాసం. ఏమీ తీసుకోను ,'* అంది ఆమె. *"అందరూ సోమ , గురు , శుక్ర , శని వారాలు ఉపవాసం చేస్తారు. మీరు బుధవారం వుంటున్నారే ?"* అని అతనంటే *'అవును. నేను గౌతం బుద్ధుడి కోసం వుంటాను ,'* అన్నారు ఆమె.
ఆ రాత్రే ఆమె నిర్ణయం తీసుకొన్నారు. గుక్కెడు పాలు తాగలేని పసిపిల్లలు లక్షలమంది నాదేశం లో వుండగా , నేను పాలు తాగడమా ? వద్దు అని ఆనాటి నుండి ఆమె పాలు తాగడం మానేసారు.
TATA వారి TELCO లో భారతదేసపు మొట్టమొదటి మహిళా ఇంజినీర్ గా ఆమె ప్రవేశించినా , 2 , 21 , 501 మంది employees తో ఏటా 2.48 బిలియన్ US Dollars ఆదాయం కలిగిన Infosys నడిపే Infosys Foundation కు Chair Person అయినా , సుధా మూర్తి simplicity కి మారుపేరులా వుంటారు. అమె దగ్గర వున్నది కేవలం 8 చీరలు మాత్రమే అంటే మనలో చాలా మంది ఆశ్చర్యపోతారు. చివరగా ఆమె చీర కొన్నది 1998 లోనే. ఒక మారు ప్రపంచ ప్రసిద్ధ London Heathrow Airport లో అక్కడి ఇంగ్లీష్ ఆమె సాధారణ దుస్తుల్లో వున్న సుధా మూర్తి ని చూసి *"ఇది ధనవంతులు ప్రయాణించే Business class నీలాంటి వారు అదిగో అక్కడ మామూలు ప్రజలు వెళ్ళే Economy class వుంది వెళ్ళు"* అంటే , చిన్నగా నవ్వుతూ వెళ్ళిపోయింది సుధా ముర్తి.
కానీ అదే రోజు 24 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఒక UNO సదస్సులో President హోదాలో అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే అవాక్కయింది ఆ ఇంగ్లీష్ వనిత.
*''నిజంగా గొప్పవారికి తాము గొప్పవారనే విషయమే గుర్తుండదు , అదే వారి గొప్పతనం,'' అంటాడు చైనా కు చెందిన లా తజు అనే ఒక ఫిలాసఫర్.*
కేవలం 8 చీరలే కలిగిన సుధామూర్తి తన ఇంట్లో మాత్రం 20 000 పుస్తకాలు కలిగివున్నారు. తన ఆదాయాన్ని పేదల చదువుకు , అనాథలకు , ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు ఆమె.
*ఖర్చు పెట్టడం వేరు, సరిగ్గా ఖర్చు పెట్టడం వేరు.*
బతకడం వేరు, జీవించడం వేరు.
--((***))--
*నేటి - నీతి కథ*
ఒక గ్రామంలో ఐదుగురు మిత్రులు ఉండేవారు. వారు భిక్షువులుగా జీవించాలని నిర్ణయించుకొని, భిక్షా దీక్ష తీసుకున్నారు. ఇంద్రియాల్ని జయించిన వాడే గొప్ప భిక్షువు కాబట్టి ఐదుగురూ ఇంద్రియాల్ని జయించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు.
ఒకరోజున ఐదుగురూ ఒకచోట సమావేశమై జితేంద్రియులు కావడానికి చేయాల్సిన కృషి గురించి మాట్లాడుకుంటున్నారు. వారిలో మొదటివాడు -
మిత్రులారా! పంచేంద్రియాల్లో మనం ఎక్కువ జ్ఞానం పొందేది కన్ను ద్వారానే. రంగూ, ఆకారాలను చూసి అది మనల్ని కోర్కెల వెంట పరుగులు తీయిస్తుంది. కాబట్టి ముందుగా మనం దృష్టి జ్ఞానాన్ని అదుపు చేసుకునే పనితో మన శిక్షణ ప్రారంభిద్దాం అన్నాడు.
లేదు మిత్రమా! కంటి కంటే చెవి ప్రమాదకరం. తీయని మాటలు విని మనల్ని మోసపుచ్చుతుంది. కాబట్టి శ్రవణేంద్రియ నియంత్రణతో ప్రారంభిద్దాం అన్నాడు రెండోవాడు.
కన్నూ, చెవి కంటే ముక్కు వల్ల కలిగే వాసనలు ప్రమాదకరం. సువాసనలు మత్తెక్కించి మన మనస్సుకి మైమరపు కలిగిస్తాయి. మనల్ని ఇంద్రియ లోలత్వాన్ని కలిగిస్తాయి. కాబట్టి వాసనల్ని దూరం చేసుకొనే విధంగా మన ఇంద్రియ నియంత్రణ శిక్షణ మొదలెడదాం అన్నాడు మూడోవాడు.
దానికి నాలుగోవాడు నవ్వి -
మిత్రులారా! రసతృష్ణకు మించిన తృష్ణ లేదు. నాలుక అదుపులో ఉంటే అన్నీ అదుపులో ఉంటాయి. రుచుల వెంట పడిపోయి, భ్రష్టులై, భంగపడినవారు ఎందరో...కాబట్టి రసతృష్ణను అదుపు చేసుకోవడంతో మన పని ప్రారంభిద్దాం! తేలిగ్గా జితేంద్రియులం అవుదాం అన్నాడు.
మీరు నలుగురూ చెప్పింది బాగానే ఉంది. కానీ శరీరం మొత్తం ఆవరించిన ఇంద్రియం స్పర్శ జ్ఞానాన్ని కలిగించే చర్మం. స్పర్శసుఖం అలవికాని ఆనందాన్ని రేకెత్తించి, మనల్ని త్వరగా పెడమార్గంలో పడేస్తుంది. కాబట్టి ముందు స్పర్శానుభూతులకు లోనుకాకుండా మన చిత్తాన్ని దృఢతరం చేసుకోవడం మేలు అన్నాడు ఐదోవాడు.
వారికి చిత్త ఏకాగ్రత కోసం, ఇంద్రియాల్ని అదుపు చేయడం కోసం సాధన ఎక్కడి నుండి మొదలుపెట్టాలో తేలలేదు. ఎవరి వాదాలు వారికి. ఎవరి ప్రాధాన్యాలు వారివి. కొన్నిరోజులు గడిచిపోయాయి. కానీ సాధన ఆగలేదు. ఈ సమస్య తేల్చుకోవాలని బుద్ధుని దగ్గరకు వచ్చారు. నమస్కరించి, తమ సాధన విషయం చెప్పారు. ఏ ఇంద్రియాన్ని మొదటగా అదుపుచేయాలో సెలవియ్యండి అని విన్నవించుకున్నారు.
భిక్షువులారా! ఏ ఇంద్రి నిగ్రహమైనా మంచిదే. మీకు ఏది ప్రాధాన్యం అనిపిస్తే ఆ ఇంద్రియ నిగ్రహంతోనే మొదలుపెట్టండి. ఒక ఇంద్రియాన్ని నిగ్రహించాక మిగిలిన ఇంద్రియ నిగ్రహాలు నెమ్మదిగా సాధించగలుగుతారు. ఎక్కడ మొదలుపెట్టాలంటూ తర్జన భర్జనల కంటే ఒక సాధనని ఎక్కడో ఒకచోట మొదలుపెట్టడం మేలు. ఒక ఇంద్రియ నిగ్రహం మంచిదే. అన్ని ఇంద్రియ నిగ్రహాలు మరీ మంచిది.
చక్కునా సంవరో సాధు, సాధు సోతేన సంవరో
ఘాణీన సంవరో సాధు, సాధు జివ్హాయ సంవరో..
కాయేన సంవరో, సాధు వాచాయ సంవరో
మనసా సంవరో సాధు, సాధు సబ్బత్థ సంవరో
చూపులు, శబ్దాలు, వాసనలు, రుచులు, వాక్కులు, స్పర్శలపై, మనస్సుపై - వీటిలో దేనిపై అదుపు ఉన్నా మంచిదే. అంతేకాదు, అన్నింటిపై అదుపు ఉండడం మరీ మేలు అని చెప్పాడు.
వారు వారికి నచ్చిన విధంగా సాధన మొదలుపెట్టారు. చివరికి జితేంద్రియులయ్యారు.
--((**))--
స్కూళ్ల నిర్వాకం...
ఒక ప్రైవేట్ స్కూల్ కి DEO lnspection ki వెళ్లి,
ఒక పిల్లాడిని లేపి అడిగారు
DEO: శివ ధనుస్సు విరిచినది ఎవరు ప్రశ్నించారు?
స్టూడెంట్: సార్...నేను కాదు అని ఏడుస్తూ బదులిచ్చాడు.
అది విని DEO క్లాస్ టీచర్ ని కోపంగా ఏంటి ఇది అని అడిగారు.
క్లాస్ టీచర్ : "చ..చ వీడు అలాంటి వాడు కాదు సర్.... నాకు వీడి గురించి బాగా తెలుసు" అని బదులిచ్చాడు.
కోపంతో DEO, HM ని పిలిపించి.. శివ ధనుస్సు విరిచింది ఎవరు అని అడిగితే పిల్లలకి తెలియకపోతే కనీసం క్లాస్ టీచర్ కి అయినా తెలియాలి కదా..అని అన్నారు.
వెంటనే HM: సార్ ఈ క్లాసు పిల్లలు అలాంటి వారు కాదు..6 వ క్లాస్ పిల్లలు చేసి ఉండవచ్చు.... అని అన్నారు.
కోపంతో DEO: స్కూల్ బంద్ చేయండి అని ఆర్డర్ వేసారు.
HM: వెంటనే స్కూల్ కరస్పాండెంట్ ని పిలిపించాడు.
కరస్పాండెంట్: సార్...స్కూల్ మూసేయకండి..కావాలంటే విల్లు ఖరీదు ఎంతైనా నేను ఇస్తాను....అని అన్నాడు.
కోపంతో DEO....విద్యా శాఖ మంత్రి దగ్గరికి వెళ్లి జరిగింది మొర పెట్టుకున్నాడు....
విద్యా శాఖ మంత్రి: ఏయ్.. ఏయ్ పిల్లలు అన్న తర్వాత అల్లరి చేస్తారు, ఏమైనా విరగకొడతారు. అయినా తెలిసి కూడా అక్కడ విల్లుని ఎందుకు వదిలేశారు అని అన్నారు....
DEO...తల పట్టుకుని CM దగ్గరికి వెళ్ళాడు..
CM: దీని గురించి నాకు తెలియదు.ఊరికే నేను ఏమీ చెప్పను..ఇదంతా ప్రతిపక్ష పార్టీల వాళ్ళు చేస్తున్న కుట్ర....
విల్లును ఎవరూ విరగ్గొట్టలేదు....
ఒకవేళ విరగ్గొడితే దీని పైన CBI enquiry వేయిస్తాం.
దీని వెనుక ఎంత పెద్ద వారు ఉన్నా సరే వదలం.
చట్టం ముందు దోషిగా నిలబెడతాం అని చెప్పారు.
DEO గారిని ఎర్రగడ్డ ఆసుపత్రిలో జాయిన్ చేశారు......
అసలు ప్రశ్నను అర్ధం చేసుకోలేనివారిని ఎక్కడ చేర్చాలో మీరేచెప్పండి
😃 ఇది మన చదువుల పరిస్థితి దుస్థితి
🤣🤣🤣🤣🤣🤣
ఒక్కరే నువ్వు కోకండి పక్క వారికి కూడా పంపండి.

మంచి కధ.
🙂ఒక చిన్న నీతి కథ🙂
ఊరి బయట పొలం దగ్గర ఇద్దరబ్బాయిలు👦👶 పరుగులు పెట్టి అడుకుంటున్నారు.
ఒకడు పదేళ్ల వాడు.
ఇంకొకడు ఆరేళ్ల వాడు.
చిన్నోడు ముట్టుకునేందుకు వస్తున్నాడు.
పెద్దోడు వాడికందకుండా వెనక్కి చూస్తూ వేగంగా పరుగెడుతున్నాడు.
ముందు పెద్ద బావి 🏟 ఉంది.
ఒకడు పదేళ్ల వాడు.
ఇంకొకడు ఆరేళ్ల వాడు.
చిన్నోడు ముట్టుకునేందుకు వస్తున్నాడు.
పెద్దోడు వాడికందకుండా వెనక్కి చూస్తూ వేగంగా పరుగెడుతున్నాడు.
ముందు పెద్ద బావి 🏟 ఉంది.
పెద్దోడు చూసుకోలేదు.
అందులో పడిపోయాడు.
వాడికి ఈత రాదు.
బావి చాలా లోతు.
చుట్టుపక్కల ఎవరూ లేదు.
అరిచినా 😮😩 సాయానికి వచ్చేందుకు నరప్రాణి లేదు.
చిన్నోడికి ఒక తాడు కట్టిన బొక్కెన కనిపించింది. తాడును పట్టుకుని బొక్కెనను బావిలోకి విసిరాడు.
"అన్నా... దీన్ని పట్టుకో" అన్నాడు.
నీట మునిగి తేలుతూ🏊🏻 కేకలేస్తున్న పెద్దవాడు తాడును పట్టుకున్నాడు.
"అన్నా... దీన్ని పట్టుకో" అన్నాడు.
నీట మునిగి తేలుతూ🏊🏻 కేకలేస్తున్న పెద్దవాడు తాడును పట్టుకున్నాడు.
చిన్నోడు తన శక్తినంతా కూడగట్టుకుని తాడును పైకి లాగడం మొదలు పెట్టాడు.
"అన్నా ... భయపడకు..!
జాగ్రత్తగా పట్టుకో..!
పడిపోకుండా చూసుకో" అని అరిచాడు.
తాడు చివరను ఒక చెట్టుకి కట్టాడు. నెమ్మదిగా లాగుతూనే ఉన్నాడు.
"అన్నా ... భయపడకు..!
జాగ్రత్తగా పట్టుకో..!
పడిపోకుండా చూసుకో" అని అరిచాడు.
తాడు చివరను ఒక చెట్టుకి కట్టాడు. నెమ్మదిగా లాగుతూనే ఉన్నాడు.
ఒక అరగంట పెనుగులాడిన తరువాత పెద్దోడు సురక్షితంగా బయటకి వచ్చాడు.
ఆ తరువాత పెద్దోడు చిన్నోడు ఊళ్లోకి పరుగెత్తారు. ఊళ్లో వాళ్లకి జరిగింది చెప్పారు. చిన్నోడు పెద్దోడిని ఎలా కాపాడాడో చెప్పారు.
ఊళ్లో ఎవరూ నమ్మలేదు.
ఆ తరువాత పెద్దోడు చిన్నోడు ఊళ్లోకి పరుగెత్తారు. ఊళ్లో వాళ్లకి జరిగింది చెప్పారు. చిన్నోడు పెద్దోడిని ఎలా కాపాడాడో చెప్పారు.
ఊళ్లో ఎవరూ నమ్మలేదు.
ఆరేళ్ల వాడేమిటి...
పదేళ్ల వాడిని లాగడమేమిటి?
అందునా బావి నుంచి లాగడమేమిటి?
అసాధ్యం..!
వాడు చేయలేడు అని అన్నారు.
ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు.
ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు.
సంగతి ఆ నోటా ఈ నోటా పాకింది.
ఆ ఊరు పెద్దమనిషికి విషయం తెలిసింది.
"మీరు నమ్ముతారా అని అడిగారు
"నమ్ముతాను" అన్నాడు.
"ఎలా?"
"చిన్నోడు లాగి పెద్దోడిని బావి నుంచి బయటకి తీసి రక్షించాడు."
"అదెలా సాధ్యం...
అంత చిన్నోడు ఎలా చేయగలడు?"
ఆ ఊరు పెద్దమనిషికి విషయం తెలిసింది.
"మీరు నమ్ముతారా అని అడిగారు
"నమ్ముతాను" అన్నాడు.
"ఎలా?"
"చిన్నోడు లాగి పెద్దోడిని బావి నుంచి బయటకి తీసి రక్షించాడు."
"అదెలా సాధ్యం...
అంత చిన్నోడు ఎలా చేయగలడు?"
"తనకి అంత బలం లేదన్న సంగతి, వాడు పెద్దోడిని బావినుంచి లాగలేడన్న సంగతి చిన్నోడికి తెలియదు.
"ఒరేయ్..! నీకంత బలం లేదురా,
నువ్వు చేయలేవురా,
అది నీవల్ల సాధ్యం కాదురా.
అని చెప్పేవారెవరూ కూడా...
ఆ పరిసరాల్లో లేరు, కాబట్టి వాడు చేయగలిగాడు."
ఆ పరిసరాల్లో లేరు, కాబట్టి వాడు చేయగలిగాడు."
"నీవల్ల కాదని చెప్పే వాళ్లుంటే వాడు ప్రయత్నించేవాడే కాదు. ఏడుస్తూ ఊళ్లోకి పరిగెత్తుకు వచ్చేవాడు. మనం బావి దగ్గరికి వెళ్లే సరికి పెద్దోడు శవమై తేలి ఉండేవాడు. "
ప్రశ్నవేసిన వాడు మాట్లాడలేకపోయాడు.
"నీవల్ల కాదు అని చెప్పేవాడు లేకుంటే మనిషి ఎంత పనైనా చేస్తాడు. అది బావైనా, బతుకైనా అంతే..." అన్నాడు పెద్దమనిషి.
--((***))--
--((***))--
మంచినీ, సంకల్పాన్నీ తట్టిలేపే కథ!"
ఒకానొక చిన్న పల్లెటూరు. అందులో చాలా పేరుగాంచిన జ్యోతిష పండితుడు నివసించేవాడు.
ఆయన చెప్పిన మాట పొల్లుపోదనీ చెప్పిన జ్యోస్యం తప్పుకాదనీ ఆ ఊరి ప్రజల విశ్వాసం.
ఆ నోటా ఈ నోటా విన్న ఓ పేదరైతు పక్కనున్న గ్రామం నుంచి జ్యోతిషుని దగ్గరకు వచ్చి తనకు జోస్యం చెప్పమని తన జాతకాన్ని అతనికి ఇస్తాడు.
తనపై నమ్మకముంచి వచ్చినందుకు ఆ పేదరైతును కూర్చోమని సైగచేసి అతని జాతకాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి చూస్తాడు.
ఎటువంటి జాతకాలను చూసినా చలించని ఆ జ్యోతిషుడు పేదరైతు జాతకం చూస్తూనే కంగారు పడతాడు.
ఎందుకంటే ఆ జాతకం ప్రకారం పేదరైతుకు ఆనాటి రాత్రి ప్రాణ గండం కనిపించడం వల్లనే!
ఎంతటి నిజాన్నైనా చెప్పగలను కానీ రైతుతో సూటిగా ‘నీకు ప్రాణగండం ఉందని’ ఎలా చెప్పనని చింతించి ఎలాగోలా తనను తాను తమాయించుకొని రైతుకు ఏమాత్రం సందేహం రాకుండా ‘ఇవాళ నాకు చాలా పనిఉంది. మీ జాతకం నా దగ్గరే ఉంచి వెళ్ళండి. రేపు మీరు మళ్ళీ రాగలిగితే
నేను నిశితంగా పరిశీలించి చెబుతాను’
అని అంటాడు.
జ్యోతిషునిపై మర్యాదతో ఆ పేదరైతు సరేనని కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతాడు.
రైతు వెళ్ళగానే జ్యోతిషుడు తన భార్యతో
ఈ విషయం చెబుతాడు.
కానీ మనసులో ‘పాపం పేదరైతు నేడు మరణిస్తాడే. నేను రేపు రమ్మన్నాననే తలంపుతో వెళ్ళిపోయాడే’నని చింతిస్తాడు జ్యోతిషుడు.
పేదరైతు జ్యోతిషుని ఇంటినుండి బయలుదేరి తన గ్రామానికి నడిచి వెళుతున్నాడు. దారిలోనే చీకటి పడటంతో తలదాచుకోవడానికి స్థలాన్ని వెదకడం మొదలుపెట్టాడు.
ఇంతలో కుండపోతగా వర్షం కురవసాగింది. కాస్త దూరంలో శిథిలావస్థలో శివుని ఆలయం కనిపించిందతనికి. అక్కడికి చేరుకొని ఆలయం ముందున్న మండపంలో నిలబడి ఆలయ స్థితిని చూసి ఎంతో బాధపడ్డాడు.
ప్రజలకు మనఃశ్శాంతినీ, భక్తి భావాలనూ పెంపొందించే ఆలయం నేడు ఈ దుస్థితికి చేరిందే. నా దగ్గర డబ్బుండుంటే నేను ఈ శివాలయాన్ని పునరుద్ధరించే ప్రయత్నాన్ని చేసేవాణ్ణని మనసులో అనుకుంటాడు.
మానసికంగానే ఎలా గోపురాన్ని నిర్మించాలి. రాజగోపురం ఎంత ఎత్తుగా ఉండాలి.
మండపాలు ఎలాకడితే బాగుంటుంది.
అలా పూర్తిగా కట్టబడిన శివాలయంలో అభిషేకాలూ, పూజలూ నిర్విఘ్నంగా జరుగుతుంటే ఎంత బాగుంటుందనీ శివుని ఆన ఉంటే తప్పక అది జరుగుతుందనీ అనుకుంటుండగానే మండపం పైభాగంలోంచి నల్లని త్రాచుపాము అతనిని కాటు వేయడానికి అతనిపై దూకపోతుంటే తప్పించుకొని ఆ ఆలయం నుండి బయటకు వచ్చేస్తాడు.
మండపంతో సహా ఆ పాడుబడిన గుడి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది.
అమ్మయ్య! బతికి పోయాననుకొని ఇంటికి చేరుకుంటాడా పేదరైతు.
మరునాడు తన జాతకాన్ని గురించి తెలుసుకోవాలనుకొని జ్యోతిషుని దగ్గరకు వెళతాడు పేదరైతు.
అతణ్ని చూసి ఆశ్చర్యపోయిన జ్యోతిషుడు నా గణనలో తప్పు జరిగి ఉంటుందని చాలా శాస్ర్తాలను తిరగేసి మళ్ళీ మళ్ళీ అతని జాతకాన్ని పరిశీలిస్తాడు.
కానీ గణింపులో ఎక్కడా తేడాలేదు. అంతా సరిగ్గానే ఉంది. ఇక తప్పదన్నట్లు విషయం పేదరైతుకు వివరించి జ్యోతిషుడు నిన్న ఏం జరిగిందో ఏదీ మర్చిపోక తెలియజేయమని రైతుకు చెబుతాడు.
జరిగిందంతా వివరిస్తాడు పేదరైతు.
మంచి చేయాలనే కేవలం తలంపు మాత్రంగా అనుకున్నందుకే ఇంత గొప్ప ఫలితం చేకూరితే మనకు చేతనైనంత మంచి చేస్తే ఎటువంటి జీవితం లభిస్తుందో రైతుకు జరిగిన సంఘటనే నిదర్శనం!
మనం బాగుండాలంటే మన ఆలోచనలు బాగుండాలి.
మన ఆలోచనలు సత్సంకల్పాలయితే మన చుట్టూ ఉన్న ప్రపంచం బాగుంటుంది.
ప్రపంచం బాగుంటే అందులోని మనం కూడా బాగుంటాం!
అందుకే......
అందరూ బాగుండాలి - !
...అందులో మనముండాలి !
--(())--
--((***))--
అష్టావక్రగీత'
18వ ప్రకరణ నుండి (431)*_
🕉🌞🌎🌙🌟🚩
_*మనసుకు అందించే ఏ భావం అయినా అనుభవంగా ఉండేది ఒక్క క్షణమే !*_
_*కర్మజన్య దుఃఖ రూప సూర్య కిరణజ్వాలల వలన దహింపబడుచున్న మనస్సు గలవానికి సంకల్ప వికల్ప ప్రశమరూప అమృత వర్షము లేక సుఖము ఎక్కడిది ?*_
_*తామరాకుపై నీటి బొట్టులా మనం ప్రయత్నంతో ఉండటం కాదు.. కోరికలు లేని మనసు సహజంగానే కర్మలవల్ల కలిగే ఫలాలకు, సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటుంది. సత్యం అర్ధమైన మనసు ఈ ప్రపంచంతో చరిస్తూ కూడా దేనితో బంధం లేకుండా తామరాకు మీద నీటి బొట్టులా మారుతుంది. మనసు కోరే కోర్కెలు, వాటిని మనం తీర్చడం రెండూ నీటి మీద రాతల్లాంటివే. ఎందుకంటే కోరిక తీర్చడం ద్వారా మనసుకు అందించే ఏ భావం అయినా అనుభవంగా ఉండేది ఒక్క క్షణమే. ఆ తర్వాత అది జ్ఞాపకంగా ఉండాల్సిందే కానీ అనుభవంగా అక్కడే నిలిచి ఉండదు కాబట్టి !*_
🕉🌞🌎🌙🌟🚩
రమణీయం* *-(302)*_
🕉🌞🌎🌙🌟🚩
_*"మంచి గుణాలు పాటించటం కష్టంగా ఉన్నప్పుడు ఎలా ?"*_
_*సుఖశాంతులతో జీవించాలంటే మనసుకు మంచి విషయాల్లో శిక్షణ ఇవ్వాలి. భగవంతుడు ప్రతి ఒక్కరికి తెల్లటి వస్త్రం లాంటి స్వచ్ఛమైన మనసును ఇచ్చి పంపాడు. దానికి ఏ రంగు అయినా అద్దుకోవచ్చు. మన మనసుకు దేన్నైనా అలవాటు చేయవచ్చు. చిన్నపిల్లలు నోట్లో వేలేసుకోవటం దగ్గర నుండి ప్రతీది వచ్చిన అలవాటేగానీ మనసు సహజ లక్షణం కాదు. విద్యార్థికి ఏ సబ్జెక్టు కష్టంగా ఉందో దాన్నే ఎక్కువసేపు చదివిస్తారు. అలాగే మనకు ఏ మంచి గుణాలు పాటించటం కష్టంగా ఉంటే దానిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. రాత్రంతా స్నేహితులతో ముచ్చట్లు చెప్తే రాని విసుగు, నిద్ర భజనలో కూర్చుంటే వస్తాయి. మనసుకున్న గుణాలు ఏమిటో మనకు తెలిస్తే వాటిని మార్చుకోవడం సాధ్యమవుతుంది. అందుకే ముందుగా మనసును అర్థం చేసుకోకుండా ఆధ్యాత్మిక సాధన సాధ్యంకాదు. మనసుకు సద్గుణాలు అలవర్చటమే సాధన !*_
_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_
_*'మనసుకు సద్గుణాలు అలవర్చటమే సాధన !'*-
🕉
--((***))--
మాయలో అంతస్తులున్నవా ?
మాయయే మాయామయము. మాయకు అతీతమయినవాడే మాయను చూడవలయును. అట్టి ద్రష్ట మాయకు లోబడగలడా? అట్టి యెడల ఆయన మాయలోని అంతస్తులను గూర్చి మాట్లాడగలడా? చలనచిత్రప్రదర్శనములో తెరమీద దృశ్యములను తేలుచుండును. అగ్ని భవనములను బూడిద చేయుచున్నట్లు కనిపించును. నీరు నౌకలను భగ్నము గావించునట్లు కనిపించును. కానీ యీ చిత్రములను ప్రతిఫలింపజేయుచున్న తెర దగ్ధము కాకుండా పొడిగా ఉండును. ఎందుకు? ఎందుకనగా? చిత్రములు అసత్యములు, తెర సత్యము గనుక. మరియు అద్దము ద్వారా ప్రతిబింబములు పోవుచుండును; కానీ అద్దము మీది ప్రతిబింబముల యొక్క గుణము గానీ పరిమాణముగానీ ఆ అద్దమును ఏవిధముగాను బాధింపదు. కావున ప్రపంచము ఏకైకసత్త మీద ఒక దృశ్యము. ఆ సత్త ఏవిధముగాను ప్రభావితము కాదు. సత్త ఏకము మాత్రమే. మాయను గూర్చిన చర్చకు కారణము దృష్టికోణములోని భేదమే. నీ దృష్టి కోణమును జ్ఞానమయముగా మార్చుము. పిదప ప్రపంచమును బ్రహ్మముగానే దర్శింపుము. ఇపుడు ప్రపంచములో ఉండుట వలన నీవు ప్రపంచమును ప్రపంచముగా జూచుచున్నావు. ప్రపంచమునకు అతీతుడవగుము, ఈ ప్రపంచము అదృశ్యమగును. సత్తామాత్రమే భాసించును.
--(())--
ఒక ఊరిలో ఒక శిల్పాలు చెక్కే అతను ఉండేవాడు అతనికి ఒకరోజు మంచి దేవుని శిల్పం చెక్కాలి అనే ఆలోచన వచ్చింది..
ఇక విగ్రహానికి కావలిసిన మంచి ఆకారం కలిగిన రాయినీ వెతుకుతూ దగ్గరలో ఉన్న ఒక ఆడవికి వెళ్లాడు..
అలా నడుస్తూ ఉన్నాడు మధ్యాహ్నం అయిపోయింది బాగా బాగా మండుతున్న సూర్యుడు వేడిని అతను తట్టుకోలేని పరిస్థితి..
అయినా సరే తన ఆలోచనని మార్చుకోలేదు..
శిలా కోసం వెతుకుతూనే ఉన్నాడు..
ఇంతలోనే ఓ ఈ శిలా ఆకారం బాగుంది దీన్ని చెక్కితే అద్భుతమైన దేవుడి ప్రతిమ అవుతుంది అని అనుకుంటూ..
అవధులు లేని ఆనందంతో ఆ శిలా వద్దకు చేరుకొని ఓ శిలా నువ్వు నాకు అనుమతిస్తే నిన్ను ఒక అందమైన దేవుని విగ్రహం లాగా చెక్కుతాను..
అప్పుడు నువ్వు దైవం రూపం లో అందరి చేత పూజలు అందుకుంటావు..
అప్పుడు నీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి నీ జీవితమే మారిపోతుంది అనుకో అన్నాడు..
అతని మాటలు విని ఆశ్చర్య పోయిన రాయి ఏంటి నన్ను విగ్రహంగా మార్చేస్తావా..
నేను ఎందుకు పనికి రాని రాయినీ ఒక మాములు రాయినీ నన్నేలా దైవంగా మార్చగలవు అని ప్రశ్నించింది.? అయ్యో నా మాట నమ్ము నిన్ను ఖచ్చితంగా అమ్మోరి ప్రతిమా లాగా మార్చగలను..
కాకపోతే అని తన మాటలను నెమ్మది చేసిన అతనితో..
హ.. ఊ.. కాకపోతే ఏంటి ఆగిపోయావు చెప్పు అంది..
నిన్ను దేవుని ప్రతిమలా మార్చే ప్రయత్నం లో నేను కొట్టే ఉరి దెబ్బలకు నువ్వు తట్టుకోవాలి..
అప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది అన్నాడు..
దాంతో ఏంటి నీ పదునైన ఉళీ దెబ్బలను నేను తట్టుకోవాలి..
ఓహో అయ్యా నాకు ఈ పూజలు పునష్కారాలు అవసరం లేదు నువ్వు ఇక వెళ్లవచ్చు..
అని ఆ శిలా మొహం తిప్పుకుంది..
ఆ శిల్పి మరో మాట చెప్పు ఒప్పించే ప్రయత్నం చేసినా ఆ శిల మాత్రం అయ్యా నీకో నమస్కారం🙏 నన్ను ఇలా వదిలిపెట్టు నీ మాటలు ఇక నేను వినదలుచుకోలేనదు.. సారీ
అని నిర్మొహమాటంగా చెప్పేసింది..
ఇక నిరాశ తోనే అక్కడినుండి ఇంకాస్త ముందుకు వెళ్లిన ఆ శిల్పికి మరొక శిల కనపడింది..
ఇంతకు ముందు చూసిన శిలా కంటే గొప్ప ఆకారం కాదు కానీ పర్వాలేదు..
అని ఆ శిలకు తన ఉద్దేశాన్ని వివరించాడు శిల్పి..
మాటలు విన్న ఆ శిల్పం అయ్యా ఎవరి ప్రేమకు నోచుకోని నాకు రూపం ఇస్తాను అంటున్నావు మీరు చేయబోయే గొప్ప కార్యానికి నేను అడ్డు చెప్పాను..
మీ ఉల్లి దెబ్బలను తట్టుకొని నిలబడే శక్తిని ఇవ్వమని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తాను..
ఇక ఆ మాటలకు సంతోషించినా ఆ శిల్పి తన చేతికి పని పెట్టాడు..
ఉళీ దెబ్బలను తట్టుకొని నిలబడిన ఆ శిల అంత కాలం దేనికి పనికి రాకుండా ప్రకృతిలో ఉన్న ఆ శిల ఒంపులు తిరిగిన అందమైన దేవతా శిల్పంలా మారిపోయింది..
ఇక శిల్పి ఆ శిల్పాన్ని అడవిలో అక్కడే ప్రతిష్టించు వెళ్ళిపోయాడు..
అయితే అటు వైపుగా తిరిగే బాటసారులు దేవుని రూపం లో ఉన్న ఆ శిల్పాన్ని గమనించి పూజలు ప్రార్థనలు చేయడం మొదలు పెట్టారు..
కొన్నాళ్లాకజ అక్కడ విపరీతమైన రద్దీ ఏర్పడింది..
గుడిని కూడా నిర్మించారు మరి గుడికి వచ్చిన భక్తులు కొబ్బరి కాయలు కొట్టడానికి ఒక రాయి కావాల్సి వస్తే..
అక్కడికి కొద్ది దూరంలో ఉన్న ఆ రాయిని..
అదే ఉళీ దెబ్బలకు నేను తట్టుకోలేను అని జారుకున్న ఆ రాయిని తెచ్చి దాని నెత్తిన నిత్యం కొబ్బరికాయ లు కొట్టడం చేసారు..
ఉళీ దెబ్బలు అనే కష్టాన్ని భరించిన రాయి రోజు పూజలు అందుకుంటుంటే అదే దెబ్బలకు కుదరదు అన్నా ఆ రాయికి ప్రతిరోజు కొబ్బరికాయల దెబ్బలు తప్పలేదు.. 😢😢
ఇలాగే ఈరోజు కష్టమైన సరే ఓర్పుతో వ్యవహరించే వారికి సంతోషం సొంతమవుతుంది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్..
om
రిప్లయితొలగించండి