6, అక్టోబర్ 2019, ఆదివారం

ఛందస్సు


[13:13, 17/11/2020] +91 7013 527 083: తోటకము పద్య లక్షణములు:


ఈ పద్య ఛందస్సుకే ఛిత్తక , భ్రమరావళి , నందినీ అనే ఇతర నామములు కూడా కలవు.
వృత్తం రకానికి చెందినది
జగతి ఛందమునకు చెందిన 1756 వ వృత్తము.
12 అక్షరములు ఉండును.
16 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: I I U - I I U - I I U - I I U
చతుర్మాత్రా శ్రేణి: I I U - I I U - I I U - I I U
షణ్మాత్రా శ్రేణి: I I U I I - U I I U - I I U
మిశ్రగతి శ్రేణి (5-3) : I I U I - I U - I I U I - I U
మిశ్రగతి శ్రేణి (4-5) : I I U - I I U I - I U I - I U
మిశ్రగతి శ్రేణి (5-4) : I I U I - I U I - I U I I - U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 9 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు స , స , స , స గణములుండును.
[13:14, 17/11/2020] +91 7013 527 083: భద్రకము పద్య లక్షణములు :

వృత్తం రకానికి చెందినది
ఆకృతి ఛందమునకు చెందిన 1930711 వ వృత్తము.
22 అక్షరములు ఉండును.
30 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: U I I - U I U - I I I - U I U - I I I - U I U - I I I - U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 12 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు భ , ర , న , ర , న , ర , న , గ గణములుండును.
[13:16, 17/11/2020] +91 7013 527 083: ముత్యాల సరము... పద్య లక్షణములు:


జాతి(రగడలు) రకానికి చెందినది.
5 నుండి 14 అక్షరములు ఉండును.
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
గణ లక్షణాలు :
ఒకటవ పాదమునందు ఒక 3 మాత్రలు , ఒక 4 మాత్రలు , ఒక 3 మాత్రలు , ఒక 4 మాత్రలు గణములుండును.
రెండవ పాదమునందు ఒక 3 మాత్రలు , ఒక 4 మాత్రలు , ఒక 3 మాత్రలు , ఒక 4 మాత్రలు గణములుండును.
మూడవ పాదమునందు ఒక 3 మాత్రలు , ఒక 4 మాత్రలు , ఒక 3 మాత్రలు , ఒక 4 మాత్రలు గణములుండును.
నాలుగవ పాదమునందు ఒక 3 మాత్రలు , ఒక 4 మాత్రలు , ఒక 2 మాత్రలు గణములుండును.
[13:18, 17/11/2020] +91 7013 527 083: నానీలు : తెలుగు సాహిత్యంలో నాలుగు ఫంక్తులు మొత్తం 20 నుండి 25 అక్షరాలతో సాగే సూక్ష్మ కవితా పద్ధతిని నానీలు అంటారు. ఈ కవితా ప్రక్రియను ఆచార్య ఎన్. గోపి ప్రవేశపెట్టారు.

ఇందిరాలయ -

తెలుగు భాష నేర్చుకుందాం 

*లోక సూక్తులు 2 (ఛందస్సు )
U U I I I U U - U I I I  I I I U

ధర్మా చరణ మార్గం - శాంతులకు అవసరం 
జ్ఞానామృత సువిద్యా - మార్పులకు అవసరం  
దోషాల పరిహారం - క్రోధాల nu  వదలటం   
మాట్లాడుటలొ శక్తే  - భందాలకు అవసరం  

స్నేహం మనసు కెంతో - మేలు తెలుపుటకునే 
మోసం మనిషి కెంతో - హాని   

పాలల్లొ  జలము కలసిన - గుణాన్నిచ్చున్ 
గంగలో మురుగు జలముకు - గుణాన్నిచ్చున్
దేహంలొ వయసు  మనసుకు - గుణాన్నిచ్చున్    
దుర్మార్గ మరుపుకు సుగుణ - గుణాన్నిచ్చున్

వేకువే క్షణంలొ  -  కదులుతూ వెలుగు 
రాత్రులే స్వప్నాల -  కలలుగా వెలుగు 
స్నేహమే బంధాలు -  వలలుగా వెలుగు     
మాటలే సాహిత్య  - కధలుగా వెలుగు 

కళ్ళల్లో కన్నీరు - చిలకగా విరుగు 
దాహంకీ మున్నీరు - కలపగా కరుగు 
దేహంమ్మే పన్నీరు  -  చిలికిన మెరుగు   
ప్రాణంతో మర్యాద -  వదలక ఎదుగు 

ఆలింగనం లో - అశ్రువులు రావు 
శోకం వరం గా - వచ్చుట సజావు   
గుండే ఫణంగా - పెట్టుట రివాబు 
స్నేహం ఫలం గా - ఉండుట అనాది 

--((*))--


నను నీవు చేకొనుము - నానావ రేవు 
నిను నేను చేరెదను - నీ నావ రేవు 
కనుదోయి వ్రాయు నొక - కవనముల కృతియు 
కనులతోఁ జదువుటకు - కావలయు మతియు 

ఆనంద సంద్రమున - నలలపైఁ దేల 
నేనైతిఁ దూఁగఁగా - నిక్కముగ డోల 
కానదే కన్నులకు - గమ్యమది యెందు 
కాని నే సాఁగెదను - కదలుచును ముందు 

(2) రమణ కవి పద్ధతి - 

మానసము పిల్చె నిను - మన్ననల దేవా 
యాననము సూపగను - నందములఁ దేవా 
వీణియల నాదములఁ - బ్రేమ రవ మీవా 
కానుకల నిచ్చెదను - కావ నను రావా 

(ఇది వనమయూర వృత్తమే) 

వినయం అనురాగం వలపు తమకాన్ని పక్కకు తీసా  
ప్రళయం విధిలాపం తలపు  ప్రళయాన్ని పక్కకు తోసా   
పరువం మదిలాపం కలపు పరువాన్ని  పక్కకు తోసా 
సమయం సమభావం గడిపి సమయాన్ని పక్కకు తోసా 

మదిలో మమకారం మరిగి మకుటాన్ని పక్కకు తీసా   
ఇలలో సహకారం జరిగి శకటాన్ని పక్కకు తీసా  
కలలో సుమబాణం తగిలి వికటాన్ని పక్కకు తీసా  

వలలో కలయానం వగచి సుముఖాన్ని పక్కకు చూపా .....      

తెలుగు భాష నేర్చుకుందాం 
వితాళ చౌపద - సూ/సూ/9 మాత్రలు, యతి తొమ్మిదవ మాత్ర.
I I I U I U - I I U U I

మనసు మాటలే - పరమానంద
వయసు వేటలే - యువకానంద 
సొగసు  ఆశలే  - యువతానంద
తనువు ఆటలే - మనువానంద  

కళలు పొందుటే -  తరుణానంద 
కలలు వచ్చుటే - అనుమానంద 
పరులు మెచ్చుటే - శ్రమదానంద 
సిరులు వచ్చుటే - చదువానంద 
    
కనులలోన నే - కలలో నీకు
మనసులోన నే - మధువో నీకు
వినుము ప్రేమలో - వేయి కలలే
తనువు పొంగులోఁ - దడియ నలలే

  
--((**))--

తెలుగు భాష నేర్చుకుందాం 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

కమనీయ కావ్య మొక - నయనముల కృతియు 
మననీయ శ్రావ్య మొక - సరళముల శ్రుతియు 
కనుదోయి వ్రాయు నొక - కవనముల కృతియు
శుభమాయ తెలివి ఒక - తరుణముల శ్రుతియు 

మనసుతో కలియుటకు - కావలయు సతియు
ఆకలితో అలుగుటకు కావలయు సతియు     
కనులతోఁ జదువుటకు - కావలయు పతియు 

తెలివితో తెలుపుటకు - కావలయు పతియు  

--((**))--

తెలుగు భాష నేర్చుకుందాం 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

మోదమున నిట వచ్చి - ముద్దు లందిమ్మా 
ఖేదమును బాపంగఁ - గృపతోడ రమ్మా 
నాదరియు నీవుండ - నాకేల సొమ్ముల్ 
హ్లాదమున కొక కుండ - యందు క్షీరమ్ముల్ 

కాలమున మది తెల్పి మంచిచేయమ్మా 
వేగిరము  గుణ మిచ్చి భోగమివ్వమ్మా 
సాదరము కళ చూపి ఆదుకోవమ్మా
ఆశయము బతి కించి ప్రేమ పంచమ్మా 

--((**))--

తెలుగు భాష నేర్చుకుందాం 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

త్రిపురసాయకము / మదనశర వృత్తము

గణములు - నల,భ,నల,భ,నల,భ,గ
-------(న,జ,న,స,న,న,భ,న,లగ)
అక్షరసామ్యయతులు - 1,8,15,22

అలుకనుఁ బాపుదు నలరఁగఁ జేయుదు నభినవ వాణిగ,
నవనిపయిన్‌ సలలిత వాక్కులె సతతము పొంగఁగఁ
జకచక యిచ్చెద సరసముగాఁనలిగిన నాపయి
ననుకొను కార్యము లవనికి నందక యటమటమౌపలు కులనాడియుఁ  
బదిపది యేండ్లుగ ఫలమెది రానిచొ వగపె మదిన్‌

తెలిపెదఁ బ్రేమమె దిగులది వీడఁగఁ దియనగు మాటల దినదినమున్‌
గలమున సాగఁగ గలగల యేరుగఁ గవితలవన్నియుఁ గడుసొగసై
పలికెద సత్యమె పదములు నిత్యము ప్రముదము నీయఁగ బహుమతులై
తలపుల నుంచుచుఁ దనయవి పలుకులు తనివినె కూర్చెద దయ మిగులన్‌

కలమును దాయక కనులను మూయక కలతనుఁ బొందుచుఁ గవితలతోఁ
బలుకుల తల్లికిఁ బ్రణుతులె సేయఁగ పరిపరి రీతులఁ బ్రణయముతో
నిలకును హాయిగ నెలమియుఁ బెంపయి హితమును గూర్చఁగ నితరులకున్‌
వెలుఁగిడు తల్లికిఁ బ్రియముగ నుండును విధమది మెచ్చఁగ విధియు మదిన్‌

పలుపలు తీరులఁ బలికెడి కూతుగఁ బలుకుల నల్లుచుఁ బ్రతిదినమున్‌
తెలుపుచు భక్తినిఁ ద్రిభువన పాలిని త్రిపురకుఁ బాడఁగఁ దియ తియగాఁ
గలుగఁగ మోదము గణయుతమైనవి కవితలనానుచు గణనుత గా‌
వెలుఁగుల జిమ్మదె వివిధ గణమ్ములు బృథివిని మెచ్చఁగ విధిజననిన్‌/వినుతన్‌
--((**))--


తెలుగు భాష నేర్చుకుందాం 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
   
U-IIIUIIIU - IIUIUU - విరులకారు

ఉన్నదని చెప్పగలనూ - కనుసైగలొద్దూ 
లెనిదనీ చెప్పవలదే - మనసంత మాయే 
కానిదనీ ఒప్పవలెనా - పలుకంత మాయే 
అన్నదనీ మర్వగలనా - వయసంత మాయే 

ఆలియనీ ఏలగలనూ - బ్రతుకంత భాదే 
జాలివలే సేవచెసెదా - తనువంత భాదే 
పాశమనీ ఆశయములే - కలలంత భాదే 
కాలమునే ఈదగలనూ - వరుసంత బాధే 

మంచిదనీ నమ్మగలనూ - కనుపాప లాగా
చెడ్డదనీ   చెప్పవలదూ - తనువంత పంచే
మంచిచెడే జీవితముగా - కలిసున్న వింతే 
నమ్మకమే రాతబతుకూ - కలిమాయ కాదా                  

--((**))--



telugu భాష నేర్చుకుందాం 
రచయత: మల్లప్రాద్ రామకృష్ణ 
       
U-U-IUIIIU - IIUIU-U - వసంతతిలకము

రా రా సుధామధురిమమే అనురాగమే రా 
రా రా మనోమయములే సుమభావమే రా 
రా రా తమోగుణములే  మనసాయనే రా 
రా రా  ప్రభాభవములే  ప్రతిభాలయే రా     

రా రా మనుష్య మమతే మది దోచగా రా
రా రా అనూహ్య శిఖరం ఇది పొందగా రా 
రా రా  సమత్వ సమతా ఇది ముందుగా రా 
రా రా  పటుత్వ పదిలం ఇది నిత్యమూ రా 

రా రా  పెదాల రుచియే జత చేయగా రా 
రా రా  పదాల సరదా  జత చేసుకో రా         
రా రా  సుఖాల పరదా జత కల్పుకో రా

రా రా  పువ్వులొ మురళీ జత చేయుకై రా 

--((**))-- telugu భాష నేర్చుకుందాం 
రచయత: మల్లప్రాద్ రామకృష్ణ 
సురభి - త/భ/జ/జ/స UUI UIIIU - IIUI IIU

సద్భావమే మనసుకూ  - నవ తేజములులే 
తన్మాయ రోగములకూ - నవ ప్రార్ధనలులే     
విశ్వాస  పాఠములకూ - నవ దీపములులే 
నిత్యానురాగములకూ - నవ హాస్యములులే    


కారుణ్య భావములులే - మన: శాంతి గిరులే  
వేదాంత భావములులే - సుఖ శాంతి లతలే 
చైతన్య గీతములులే  - సమ భావ కళలే 
సాహిత్య పాఠములలే - తెలు గింటి కధలే    


అజ్ఞాన తాపములులే - నరరోగ వెతలే
విజ్ఞాణ దీపములులే  - నరవిద్య కధలే 
జిజ్ఞాస కోరికలులే  -  నర ఆశ కలలే 
ప్రజ్ఞాను ప్రేమయనుచున్ - బ్రణమిల్లెదను నేన్  


ఆయాస మయ్యెఁ గదరా - యచలమ్ము నెగఁగా
నా యేడు కొండలపయిన్ - హరి నిన్ను గనఁగా
నా యాస కొక్క ప్రతియౌ - నగుమోము గనెదన్
సాయమ్ము నియ్యఁగను రా - సరసీజనయనా


ఆశాప్రసూనములతో - నరుదెంచె హృదిలో
నీశీతకాల రజనిన్ - హృదయంగమముగా
వాసమ్ము సేయ నవమై - వరమై సురభియే
హాసమ్ము నిండె నిరులున్ - హరుసంపు వెలుఁగై


కామమ్ము నిండెను గదా - కనులందు దివెగా
నామమ్ము మ్రోఁగెను గదా - నడురాత్రి సెవిలో
నీ మానసమ్మున సదా - నృతి సేసెదవుగా
నీ మాధురీచషకమం - దెపు డాడెదవుగా


అజ్ఞాన రూపమిది నా-దని యెంతు నెపుడున్
విజ్ఞాన దీపములతో - వెలుఁగీయు మమ నా
జిజ్ఞాస పెంపొదవఁగా - సిరియైన చదువున్
బ్రజ్ఞానుఁ జేయుమనుచున్ - బ్రణమిల్లెదను నేన్


--((**) )--


telugu భాష నేర్చుకుందాం
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

బాలకౌముది -

ఆధారము - పొత్తపి వేంకటరమణకవి
గ్రంథము - లక్షణశిరోమణి
వర్గము - స్రగ్విణి
నడక - పంచమాత్రల ఖండగతి
యతి - ఎనిమిదవ అక్షరము, ప్రాస ఉన్నది

బాలకౌముది - స/జ/భ/భ/స IIUI UIU - IIUI IIIU
15 అతిశక్వరి 15788
ప్రాంజలి ప్రభ చైద్తని గీతం (13)

ప్రియమైన మావారు మనసిచ్చి 
మదిలోని మాయను తొలగించే 
ప్రియమైన నాసతి మనసిచ్చి 
మదిలోని మాయను తొలగించే 

ఎదురొచ్చె ప్రేమలే - ఎరుపొచ్చె మనసుకే 
మనసొచ్చె ఆశకే  -  మమతిచ్చె  మగువలే 
మగువచ్చె ఆశతో -  తనువిచ్చె తరుణమే 
మొగుడొచ్చె కోర్కతో - వయసంత సరిగమే 

మనప్రేమ మాత్రమే - బతికించు సమయమే 
మన సేవ లక్ష్యమే - జతపర్చు తరుణమే 
మన సోయ గాలులే - తరునిమ్చు హృదయమే 
మన కళ్ళ  చూపులే - చిగురించు లతలులే 

వెలిగేటి దీపమే - మెరిసేటి మెరుపుయే 
కలిసేటి కవ్వమే - నవనీత  కరుగుటే 
చిగురంత పువ్వునే - నలిపేను పరుగుతో 
వలపంత దోచనే - అలుపంత కరిగినే 

ప్రియమైన మావారు మనసిచ్చి 
మదిలోని మాయను తొలగించే 
ప్రియమైన నాసతి మనసిచ్చి 
మదిలోని మాయను తొలగించే 

--((**))--         
కలలోన నిన్ను నేఁ - గనులార గనఁగ నా
కనులయ్యె నార్ద్రమై - కల మాసిపోవఁగా
మనమెల్ల నీవెగా - మధురంపు రాత్రిలోఁ
గనుమూయు టెట్టులో - కలఁగంగఁ బ్రేమలో

సుమబాల కౌముదిన్ - సుఖమీయఁ బిలిచెరా
కమనీయ గీతులన్ - గలహంస నుడువురా
రమణీయ రాత్రిలో - రసగంగ పరగురా
విమలమ్ము ప్రేమ క్రొ-వ్విరివోలెఁ బొసఁగురా

రణరంగ వీరునిన్ - రఘువంశ తిలకునిన్
ప్రణయేందు కౌముదిన్ - వరపుత్రి రమణునిన్
వనజాక్షు రామునిన్ - వరపుత్రు గుణనిధిన్
ఘననీల దేహునిన్ - గరమోడ్చి గొల్తు నేన్

నడురాత్రి యయ్యె నో - నరనాథ రమ్మురా
కడు డస్సి యుంటివా - కమలాక్ష నీవు నా
యొడిలోన పండుకొ - మ్మొగి లాలిపాట నే
సడిలేక పాడెదన్ - శరదిందు కాంతిలో

బాలకౌముది వృత్తములో చివరి గురువును తొలగిస్తే అది ఒక ద్విపద అవుతుంది. చివరి పద్యము ఆ విషయమును దృష్టిలో నుంచుకొని వ్రాసినది. ఆ పద్యము రెండు ద్విపదలుగా -

నడురాత్రి యయ్యె నో - నరనాథ రమ్ము
కడు డస్సి యుంటివా - కమలాక్ష నీవు
యొడిలోన పండుకొ - మ్మొగి లాలిపాట
సడిలేక పాడెదన్ - శరదిందు కాంతి

బాలకౌముదిలో చివరి ర-గణములో మధ్య లఘువును తొలగిస్తే అది వనమయూర వర్గమునకు చెందుతుంది (పం/పం - పం/చ).

చివరి పద్యమును ఈ విధముగా వ్రాస్తే ఆ లక్షణములకు సరిపోతుంది -

నడురాత్రి యయ్యె నో - నరనాథ రమ్మా
కడు డస్సి యుంటివా - కమలాక్ష నీవీ
యొడిలోన పండుకొ - మ్మొగి లాలిపాటన్
సడిలేక పాడెదన్ - శరదిందు కాంతిన్

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


telugu భాష నేర్చుకుందాం
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
  
రవి (కామినీ, భామినీ, తరంగవతీ)- ర/జ/ర UI UI UI UIU
9 బృహతి 171
వేచి ఉండి వాడి చూపులే 
కొంప కూడు ఆమ్మే ఆటలే  
నమ్మి వమ్ము చేసె మాటలే 
చెప్పు చేత వల్ల  భాదలే 

వద్దు సద్దు పొందు ఆనకే 
ఓర్పు నేర్పు చూపు ఆనకే 
తప్పు కాదు తీర్పు  ఆనకే
ఆట పాట సంత ఆనకే

వంక డొంక సాగి చేరుటే 
విప్పి కప్పి కల్సి పోవుటే    
మత్తు చిత్తు చేయ ఉండుటే
నీవు నేను కల్సి ఆడుటే 
--((**))--

రవి (కామినీ, భామినీ, తరంగవతీ)- ర/జ/ర UI UI UI UIU
9 బృహతి 171

సంకురాత్రి వచ్చెఁ జూడుమా
శంక లేని సమ్ముదమ్ముతో
వంక లేక వర్ధిలంగ ర-
మ్మింక భూమి శోభిలున్ గదా

మారుచుండుఁ గాలమెప్పుడున్
మారుచుండు చంద్రునిన్ రవిన్
ధారుణిన్ గనంగ వచ్చు నిం-
పారు పండుగై ముదమ్ముతో

శాంతి గల్గు గావుతన్ సదా
క్షాంతిపై సుఖమ్ము నిండ సం-
క్రాంతి సంబరమ్ము లెంతయో
కాంతు లిచ్చు వింతవింతగా

భామినుల్ హసంతివద్ద స-
త్కామనల్ మనమ్ము నుండఁగా
బ్రేమతోడ వండి పొంగలిన్
దా మొసంగిరప్డు దేవికిన్

సూర్యు నుత్తరాయణమ్ము నేఁ
డార్య దేశమున్ దొడంగెఁగా
సూర్యదేవుఁ డిచ్చు జీవమున్
సూర్యదేవుఁ డిచ్చు సర్వమున్

సంక్రాంతి శుభాకాంక్షలతో -

- మోహన

ప్రాంజలి ప్రభ తెలుగు భాష నేర్చుకుందాం 
 - ర/జ/ర/జ/న/గ
UI UI UI UI - UI UI III U
16 అష్టి 31403
అమ్మ మాట నిత్య సత్య - వేద మాయె తరణమున్
ఆశ లేని ఓర్పు చూపి - సేవ చేసి బతుకుచున్
అట పాట బత్కు నేర్పి - మంచి చేసి బతుకుచున్ 
ఉన్న నేర్పు అంత పంచి - తీర్పు చెప్పి బతుకుచున్             

మూఁడు పట్టణాల నాశ - మొందఁ జేసి నతని నేన్
మూఁడు కన్ను లుండు వాని - మోక్షదాయి నతని నేన్
మూఁడు ముండ్ల కోల వాని - భూతనాథు నతని నేన్
వేఁడుకొందు భక్తితోడ - విశ్వనాథు నతని నేన్

ఇమ్ము లిచ్చు వాఁడు వాఁడ-హీంద్రుఁ దాల్చి హరవిలా-
సమ్ముఁ జూపు వాఁడు వాఁడు - శారదేందు కళను శీ-
ర్షమ్ము నుంచు వాఁడు వాఁడు - శాశ్వతుండు ముగితి మా-
ర్గమ్ము దెల్పు వాఁడు వానిఁ - గాలు గొల్తు నెపుడు నేన్

పూలు లేక బోసిపోయె - భూమిజమ్ము లెదురుగాఁ
జాల శీతలమ్ము గాలి - సర్వమయ్యె జడముగాఁ
బూలకారు రాదు గాదె - భూమిపైన నెలలకున్
బూలు పూచెఁ గాని నేఁడు - పొంగు నాదు మనసులో

అందమైన చందమామ - యాకసాన వెలిఁగెరా
వంద తీవలందుఁ బూలు - వాయి విప్పి యలరెఁగా
మందమైన మారుతమ్ము - మై రమించఁ గదలెఁగా
నందసూనుఁ డేల రాఁడు - నన్ను జూడ నగవులన్

అందమైన ముందు భామ - కన్ను కొట్టి పిలిచెరా 
వంద చూపులందు మేను - వారి కప్పి తడిపెరా
మందమైన మారుతమ్ము  - వద్దు అన్న నిలిచెరా 
అస్తమాను వచ్చి మేను చూపి ఆశ కుదిపెరా    

నమ్మ బోకు వచ్చి నోడ్ని - ఉన్న వాడ్ని వదలకున్ 
కష్ట మెంత  వచ్చి ఉన్న  - ఓర్పు ఉంచి బతుకుటన్ 
చెట్టు చేమ వద్ద  బత్కి -    మంచి మాట మరవకున్
వద్దు కాదు లేదు బత్కు - నీవు చూపి వదలకున్ 

--((**))--       

ప్రాంజలి ప్రభ 
తెలుగు భాష నేర్చు కుందాం    
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 
U I U I U I I I U  
   
సాటి మేటి ఏంటి దివిటీ 
ఓటు పోటు ఏంటి దివిటీ
లోటు పాటు చెప్పు దివిటీ 
కాటు చేటు ఒప్పు  దివిటీ 

మాట వేట వద్దు దివిటీ 
కాట చేట నమ్ము దివిటీ 
పాట కోట వమ్ము దివిటీ 
నీటి మూట దమ్ము దివిటీ 

పేట ఆట వద్దు దివిటీ 
పీట తీట నమ్ము దివిటీ    
నోటి మాట ఒప్పు దివిటీ 
నాటి నేటి చూపు దివిటీ 

కాట బాట చూపు దివిటీ 
ఆట తోట నిల్పు దివిటీ
అటు ఇటు కమ్ము దివిటీ 
ఆటు పోటు నమ్ము దివిటీ 

తట్ట బుట్ట సద్దు దివిటీ 
కట్టు బొట్టు నమ్ము దివిటీ 
చెట్టు పుట్ట దమ్ము దివిటీ 
అట్ట సొట్ట కప్పు దివిటీ 

--((**))--


ప్రాంజలి ప్రభ 
పిల్లల కోసం (ఆధునికం)
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

1 . సంద్రం 
సకల జలరాసులను తనలో భరిస్తూ 
ఖనిజ సంపదలను గర్భంలో దాస్తూ 
ప్రజా ప్రయాణాలనులు సహకరిస్తూ  
అలల మూటలను ఒడ్డుకు మోస్తూ

2 . పల్లె 
పచ్చని చెలతో శాలువా కప్పిఉంది 
కాలుష్యం లేని పల్లె నిలయంగా ఉంది 
అనురాగ అనుబంధాలతో నిండి ఉంది 
ఆధునిక ఖర్చులకు దూరంగా ఉండేది   

3 . అడవి 
రోజంతా ఎండలో కట్టెలా ఎండుతుంటుంది 
నిత్యం పూలు పళ్లతో ఆకులతో కల్సి ఉంటుంది  
మానవులకు, జంతువులకు జీవనాధారమైనది
సకల ఔషధ ముని వర్యులకు నిలయమైనది  

4 . పగవాళ్ళు 
పగవాళ్లే అయినా ఒకే మట్టిదుప్పటి కప్పు 
పగవాళ్లే మంచి చెడుఏకంలో ఒప్పుకొని కప్పు 
పగవాళ్లే నిత్యం వావి వరుసలు చూడని కప్పు
పగవాళ్లే మనస్సు లేకుండా జీవితముప్పే కప్పు  

--((**))--


ప్రకటన : ఆవేశానికి పోకుండా ఆలోచించి ఓటు వెయ్యండి 

ఇది కూడ లయగ్రాహి వర్గమునకు చెందిన ఒక లయ వృత్తమే, ఇందులోని పంచమాత్రలు ర, సలములు. పాదమునకు 26 అక్షరములు. క్రింద నా ఉదాహరణములు -

ఇందిరాలయ - ర/స/జ/భ/ర/జ/జ/ర/గగ
UIU IIUI - UIU IIUI - UIU IIUI - UIU UU
26 ఉత్కృతి 5680475

భీముఁడే గుణమందు - భీముఁడే రణమందు -
భీముఁడే తనువందు - భీముఁడా ఱేఁడే
రాముఁడే మనమందు - రాముఁడే హృదియందు -
రాముఁడే తలఁపందు - రాముఁడా ఱేఁడే
కాముఁడే పొడయందు - కాముఁడే నడయందు -
కాముఁడే వలఁపందు - కాముఁడా ఱేఁడే
భీముఁడై నను జేరు - రాముఁడై నను బిల్చు -
కాముఁడై నను గూడు - స్వామి నా ఱేఁడే

మెచ్చునో, కలలందు - వచ్చునో, విరిదండఁ -
దెచ్చునో, యనురాగ - మిచ్చునో లేదో
మెచ్చునో, నను జూడ - వచ్చునో, చెలువమ్ముఁ -
దెచ్చునో, యొక ముద్దు - నిచ్చునో లేదో
మెచ్చునో, దరి జేర - వచ్చునో, చిఱునవ్వుఁ -
దెచ్చునో, పరిరంభ - మిచ్చునో లేదో
మెచ్చునో, వనమాలి - వచ్చునో, యొక కాన్కఁ -
దెచ్చునో, పులకింత - లిచ్చునో లేదో

ఇందిరాలయమేమొ - నందనందనుఁ గన్ను
లందమై కదలాడ - డెంద మూఁగెన్గా
మందమందముగాను - గంధవాహుఁడు దెచ్చె -
విందు లీయఁగఁ దావి - డెంద మూఁగెన్గా
చిందుచుండెను వంశి - సుందరమ్మగు గీతి -
బృంద మందెను హాయి - డెంద మూఁగెన్గా
ఇందుకాంతులలోన - నెందుఁ గానఁగ రాస -
మందు నృత్యపు చిందు - డెంద మూఁగెన్గా

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
--((**))--

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

--((*))--

శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:


మధురలయ -ఛందస్సు 

ఆధారము - కల్పితము
వర్గము - లయగ్రాహి
నడక - పంచమాత్రలు
గణములు - త, నలల
యతి - ప్రాసయతి

మధురలయ - త/న/స/భ/న/య/న/న/త/గగ
UUI IIIII - UUI IIIII - UUI IIIII - UUI UU
29 సువః 150797565

మందమ్ము పవన మిట - నందమ్ము సుమము లిట -
గంధమ్ము పరవె నిట - నందాత్మజా రా
మందమ్ము నడక యిట - నందమ్ము కవన మిట -
ఛందమ్ము రవణ మిట - నందాత్మజా రా
మందమ్ము మధురలయ - లందమ్ము స్వర సరిత -
చందమ్ము రవము లిట - నందాత్మజా రా
మందమ్ము పదము లిట - నందమ్ము నటన మిట -
విందైన సొబగు లిట - నందాత్మజా రా

ఏమందు నిను గనఁగ - నేమందు భువిఁ గనఁగ -
నేమందు దివిఁ గనఁగ - నేమందు దేవీ
ఏ మందు తనువునకు - నే మందు మనమునకు -
నే మందు వలపునకు - నే మందు దేవీ
నాముందు హరిణముగ - నాముందు వరటముగ -
నాముందు బహుజముగ - రా ముందు దేవీ
రా ముందు సరసముగ - రా ముందు స్వరనదిగ -
రా ముందు సురనదిగ - సోమాస్య దేవీ

నీ నవ్వు సిరి నెలవు - నీ నవ్వు స్వరసరసి -
నీ నవ్వు వరజలధి - నీ నవ్వు నాకే
నీ నీడ సురతరువు - నీ నీడ యమరపురి -
నీ నీడ యభయమగు - నీ నీడ నుందున్
నీ నాట్య మది మధువు - నీ నాట్య మది సుధయు -
నీ నాట్య మది ముదము - నేనున్ నటింతున్
శ్రీనాథ సిరినొసఁగు - ప్రాణాత్మ యసువొసఁగు -
గానాంశ స్వరమొసఁగు - మీనాఁడు నాకున్

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

-౯౯*))--

==(())--
ఛందస్సు

గొప్పలు చెప్పిన పడుము - గోలలు చేసిన పడుము
కోపము వచ్చిన పడుము - తప్పులు చేసిన పడుము

కాలము మారిన పడుము - దేవుని తిట్టిన పడుము
దేవుని మెచ్చిన పడుము - పేరును మార్చిన పడుము

కూతలు కూసిన పడుము - కూడును తిట్టిన పడుము
కీలును విర్చిన పడుము - ఆలిని తిట్టిన పడుము

మోనము చూపిన పడుము - మోసము చేసిన పడుము
గానము చేసిన పడుము - పాఠము చెప్పిన పడుము

మేళము తప్పిన పడుము - గట్టును కొట్టిన పడుము
కొట్టిన తిట్టిన పడుము - గాళము వేసిన పడుము

శాపము పెట్టిన పడుము - తాపము చూపిన పడుము
పాపము చేసిన పడుము - జాప్యము చేసిన పడుము

వేషము వేసిన పడుము - ద్రోహము చేసిన పడుము
మాయను కమ్మిన పడుము - వెల్గును ఆపిన పడుము

బుగ్గను గిల్లిన పడుము - మగ్గును తోక్కిన పడుము
నుగ్గుగ చిత్పిన పడుము - తక్కువ చేసిన పడుము


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి