3, అక్టోబర్ 2019, గురువారం

(చిన్నకధలు )


ప్లాట్ నెంబరు -32  ఇంటి నెంబరు . 8 -48, రఘురాంనగర్కాలని, దోమలగూడ, 
హైదరాబాద్- 83 , వాట్సప్ నెంబరు . 9849617392      . 

          నిన్ననే సాహితీ కిరణం లో మీ ప్రకటన చూసాను నా శ్రీమతి కోరిక మీర ఈరోజు వ్రాసిన కథను మీ వాడ్సప్  నెంబరుకు పంపుతున్నాను, ముద్రణకు పనికి వస్తే నాకు తెలపండి పనికి రాదనుకుంటే నాకథను తొలగించండి నేనొక బ్లాగ్ రచయితను . 
                                                                   ఇట్లు విధేయుడు 
                                                                  మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
                                                                  వాట్సప్ నెంబరు . 9849164250                 
  
                                          --((***))--   
    .  

అఘాసుర వధ
ఒకనాడు కృష్ణపరమాత్మ పిల్లలందరితో కలిసి వెనక్కి యింటికి వెళ్ళిపోతున్నాడు.అపుడు ఆయనకు ఒక ఊహ వచ్చింది. ‘రేపటి దినమున మనం అందరం కలిసి వనభోజనములకు వెడదాము. కాబట్టి పిల్లలారా రేపు పొద్దున్న మీరందరూ బయలు దేరేటప్పుడు చక్కగా చిక్కములు పట్టుకొని, అందులో మీకిష్టమయిన మధుర మధురమయిన పదార్థములు పట్టుకొని రండి. మనందరం కలిసి వెడదాము. అరణ్యంలో మనందరం కలిసి కూర్చుని తెచ్చుకున్న చల్దులు ఆరగిద్దాము’ అన్నాడు. కృష్ణుడు పిల్లలకు ఎంత చెపితే అంత. మరునాడు వాళ్ళందరూ వనభోజనములకు బయలుదేరారు. వారు వివిధరకముల ఆటలకు సంబంధించిన పందెములు వేసుకుంటూ, హాస్యమునకు ఒకరితో ఒకరు దెబ్బలాడుకుంటూ పశువుల వెంట సంతోషంగా అడవిలోకి వెళ్ళారు. అకక్డ కొలనులలో నీళ్ళల్లో పడి చేపల్లా ఈదేవారు. కృష్ణునితో ఆడుకునే వారు. కోతులతో సమానంగా చెట్లు ఎక్కేవారు. అక్కడ వాళ్ళు ఆడని ఆటలు లేవు. పరమాత్మతో కలిసి ఆడుకుంటున్నారు. ఇలా ఆడుకుంటుంటే అక్కడికి దేవతలను కూడా భయపెట్టగలిగిన రక్కసుడు ఒకడు వచ్చాడు. వానిపేరు అఘాసురుడు. అఘము అనగా పాపము. అతను బకాసురుని సోదరుడు. ‘నా సోదరుడైన బకాసురుని కృష్ణుడు నిర్జించాడు. గోపాల బాలురందరికి ప్రాణ సమానమయిన వాడు కృష్ణుడు. కాబట్టి ఈ కృష్ణుని చంపి తినేస్తాను’ అనుకున్నాడు.
వాడు వచ్చి కొండచిలువ రూపంలో దారికి అడ్డంగా పడుకున్నాడు. కొండచిలువ వెంటాడి ఏ ప్రాణినీ చంపదు. అది పట్టింది అంటే మ్రింగి వేయడమే. అది ఏ చెట్టుకో చుట్టుకున్నప్పుడు లోపల ఉన్న ప్రాణి విరిగిపోతుంది. దానిని అలాగే జీర్ణం చేసేసుకుంటుంది. ఇప్పుడు అఘాసురుడు అనే కొండచిలువ మార్గమునకు అడ్డంగా పడుకుని ఉంది. దాని నోటి పైదవడ ఆకాశమునకు పెట్టింది. క్రింద దవడ భూమిమీదకి పెట్టింది. ఈ పిల్లలు అక్కడికి వచ్చారు. దారికి అడ్డంగా పడివున్న దానిని గుర్తించి దానిని కొండచిలువగా నిర్ధారించుకున్నారు. ఏమి చేయాలా అని వారు వెనక్కి తిరిగిచూశారు. వెనక చిన్నికృష్ణుడు నవ్వుతూ కనపడ్డాడు. వీళ్ళు అన్నారు ‘బకాసురుని చంపిన కృష్ణుడు మన వెనకాతల ఉన్నాడు. ఎదురు కొండచిలువ వుంటే మనకేమిటి భయం! మనం వెళ్ళిపోదాం’ అని వారు నవ్వుకుంటూ, వారి చిక్కములు పట్టుకొని ఆవుల్ని, దూడలని, ఎద్దులని, అన్నింటిని ఆ కొండచిలువ నోట్లోకి తోలేసి వారు కూడా అందులో ప్రవేశించారు. ఆ కొండచిలువ అఘాసురుడు అని కృష్ణుడికి తెలుసు. ‘దూర్త అఘాసురుడు అడ్డంగా పడుకున్నాడు. గోపబాలురందరూ నేనున్నాని గోసంపదతో సహా అఘాసురుని నోటిలోపలికి వెళ్ళిపోయారు. అది నా కోసమే యింకా దవడలను మూయలేదు. ఇపుడు వారినందరినీ బ్రతికించడానికి నేను వెళ్ళాలి’ అని కృష్ణుడు అనుకుని దాని నోటి దగ్గరకు వెళ్లేసరికి, వీరందరూ దాని కంఠం దగ్గరకు వెళ్ళిపోయారు. అది నాలుకను చుట్టి గబుక్కున మ్రింగేసింది. వాళ్ళు కడుపులోకి వెళ్ళిపోయారు. లోపల వున్నా విషజ్వాలలకి వారు మరణించారు.
కృష్ణుడు దాని కంఠం దగ్గరకి వెళ్ళగా కృష్ణుని కూడా మ్రింగబోయింది. పైనున్న దవడను నొక్కింది. నొక్కేసరికి స్వామీ నిటారుగా పెద్ద స్తంభంలా అయిపోయారు. అది నోటిని నొక్కేసరికి స్తంభం లాంటి పరమాత్మ శిరస్సు దాని దవడను పొడుచుకుని పైకి వచ్చింది. ఈయన తన శరీరమును పెంచాడు. డానికి లోపలికి ఊపిరి పీలిస్తే వెళ్ళడం లేదు. గిలగిల కొట్టుకుంది. అటు తిరిగింది. ఇటు తిరిగింది. తిరుగుడు పడిపోయి గిలగిల కొట్టుకుంటోంది. ఆ సమయంలో దాని కడుపులో ఉన్న మరణించిన వారినందరినీ కృష్ణుడు చూశాడు. అసురసంధ్యవేళ అవుతుండగా నక్షత్రములతో కలిసి ఆకాశామునందు ప్రకాశిస్తున్న చంద్రబిమ్బములా కేవలము తన కన్నులనుండి కారుణ్యామృతదృష్టిని చిన్ని కృష్ణుడు వాళ్ళమీద ప్రసరింప జేశాడు. ఆయన కారుణ్యామృతదృష్టి పడగానే మరణించిన పిల్లలందరూ ఒక్కసారిగా జీవించారు. ఆవులు, దూడలు, ఎద్దులు, అన్నీ జీవించాయి. అందరూ ఆ కొండచిలువ నోట్లోంచి ఇవతలికి వచ్చేశారు. బయరకు రాగానే వారొక అద్భుతమును చూశారు. ఆ పాము కొనప్రాణంతో కొట్టుకుంటోంది. చివరకు దాని ప్రాణం పోయింది. దానిలోంచి ఒక దివ్యమయిన వెలుగు వెలువడి పైకిలేచి చిన్నికృష్ణుడి లోకి వెళ్ళిపోయింది. దీనితో ఇంత పాపపు రక్కసుడు మోక్షమును పొందేశాడు. కృష్ణుడి స్పర్శ చేత అతనికి ఉన్న పాపములన్నీ విరిగిపోయాయి.
ఈ లీలలోని అంతరార్థం మనం తెలుసుకోవాలి. అఘాసురుడు ఒక పాపపు రక్కసుడు. పాపము అనగానేమి? పాపము అంటే దుష్కర్మ. పాపకర్మనుండి దుఃఖము వస్తుంది. పాపకర్మ కొండచిలువలా నోరు తెరుచుకుని మనదారిలోనే పడుకుంటుంది. పాపకర్మ మనమే దానిలోకి నడిచేటట్లుగా చేస్తుంది. అది ఎప్పుడూ తనంత తానుగా వచ్చి మింగదు. పాపకర్మ మిమ్ములను మింగలేదు. ‘నేను పాపము చేయను’ అని మీరు అనుకుంటే పాపము మీచేత చెడ్డపనిని చేయించలేదు. కానీ మనలో మోహ బుద్ధి బయలుదేరుతుంది. ఏదో అప్పటికి ఒక సుఖమును కోరి ఫరవాలేదులే చేసేద్దాం అనుకుని పాపపు పనిని చేస్తాడు. అందుకని కొండచిలువ నోట్లోకి వీళ్ళే వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళకి పాపకర్మ, పుణ్య కర్మ అంటే ఏమిటో తెలియాలంటే సత్కర్మకీ, దుష్కర్మకీ భేదం తెలియాలంటే వేదం తెలియాలి. అందులో ధర్మమునకు సంబంధించిన భాగములను చదవాలి. పెద్దల దగ్గర శ్రవణం చేయాలి. గోపాల బాలురకి అవన్నీ తెలియవు. పాపకర్మకి దేవతలు కూడా భయపడతారు. అటువంటి పాపకర్మ యందు వీళ్ళు లోపలికి వెళ్ళారు. కానీ వెడుతున్నప్పుడు ఒకపని చేశారు. ‘వెనక కృష్ణుడు ఉన్నాడు’ అని కృష్ణ భగవానుని మీద పూర్తీ నమ్మకం కలిగి వుండి దాని నోటిలోకి ప్రవేశించారు. అలా చేయడం పాపమా, పుణ్యమా అనేది వారికి తెలియదు. పాపపు పనిని చేసి ఈశ్వరుడు చేయిస్తున్నాడని మాత్రం అనకూడదు. తెలిసి నీవు పాపమును చేస్తే ఆ పాపఫలితమును నీవే అనుభవించవలసి ఉంటుంది. అందుకే శాస్త్రము మరణము పాపము వలన వస్తుంది అని చెపుతోంది. పాపమే మరణమును ఇస్తుంది. చేసిన పాపము భయంకరమైనది అయితే అకాల మృత్యువు ఇవ్వబడుతుంది. పుణ్య చేసిన వాడికి కూడా మృత్యువు వస్తుంది కానీ అనాయాస మరణం వస్తుంది. మనం పూజ చేసినప్పుడు, దేవాలయమునకు వెళ్ళినప్పుడు, పుణ్య నదీస్నానం చేసినప్పుడు ‘అనాయాసేన మరణం – వినా దైన్యేన జీవితం’ ఈ రెండింటినీ అడగాలి. చేసిన పాపమును అనుభవములోనికి ఈశ్వరుడు వృద్ధాప్యము నందు తెస్తాడు. ప్రతిజీవికీ మరణం తథ్యం. కానీ చనిపోయేటప్పుడు పువ్వులా వెళ్ళిపోవాలి. అందుకే చేసిన పాపపుణ్యములు మృత్యు సమయమునందు తెలుస్తాయి’ అని పెద్దలు అంటారు. ‘అనాయాసేన మరణం – వినా దైన్యేన జీవితం’ – ఈ రెండు ఎప్పుడు వస్తాయి? మీ వెనకాల ఈశ్వరుడు ఉన్నాడని నమ్మి మీరు ప్రవరించగలిగితే చాలు. మీరు చేస్తున్న ప్రతి సత్కర్మ ఈశ్వరుడు చేయిస్తున్నాడు అనుకోవాలి. ఒకవేళ ఎప్పుడయినా తప్పు చేస్తే దేవుడి ముందు అంగీకరించి ఆ తప్పునకు భగవంతుని క్షమాపణ అడగాలి. అప్పుడు తప్పులు చేయడం అనేదే ఉండదు. దీనికి ముందు భగవంతుడి పట్ల విశ్వాసం ఉండాలి. ఆయన చూస్తున్నాడన్న భయం మనసులో ఉండిపోతుంది.
అఘాసుర వధ ఘట్టంలో గోపబాలురను ఈశ్వరుడు రక్షించగలిగాడు. ఇది పరమాత్కృష్టమయిన కథ ఇది మనకందరికీ చిరస్మరణీయమై, నిత్య స్మరణీయమై, ప్రతిరోజూ భగవంతుని యందు పూనికను పెంచి, ఈశ్వరుడు మనలను అనుగ్రహించగలిగిన స్థితిని ఆవిష్కరిస్తుంది.
బ్రహ్మ గోవత్సములను, గోప బాలకులను అంతర్దానంబు చేయుట
ఇక్కడ శుకుడు పరీక్షిత్తుకు ఈ కథను చెపుతూ చిన్న మెలిక పెట్టారు. దీనిని ‘కౌమార పౌగండ లీల’ అంటారు అని చెప్పారు. మొదటి అయిదేళ్ళ వయస్సును కౌమారము అంటారు. తరువాతి అయిదేళ్ళను పౌగండము అంటారు. మరి పిల్లలు కౌమారములో జరిగినది పౌగండములో ఎలా చెప్పారు? పిల్లలందరికీ ఈ కథ అయిదవ ఏట జరిగింది. ఏడాది పాటు ఈ పిల్లలు యింటికి వెళ్ళలేదు. అందుకని ఈ లీలను శుకుడు ‘కౌమారపౌగండలీల’ అని చెప్పారు. అపుడు పరీక్షిత్తు ఈ లీల చాలా ఆశ్చర్యంగా ఉన్నది. కౌమారంలో జరిగిన విషయం పౌగండంలో ఎందుకు చెప్పారు? ఏడాది పాటు పిల్లలు యింటికి ఎందుకు వెళ్ళలేదు? నాకీ కథ దయచేసి వివరంగా చెప్పవలసింది’ అని శుకమహర్షిని ప్రార్థించాడు.
ఆర్తి కలిగిన శిష్యుడు ఉంటే గురువుకి ఉత్సాహంగా ఉంటుంది. అపుడు శుకమహర్షి నీ ఆనందమును చూస్తే నాకు తప్పకుండా చెప్పాలనిపిస్తోంది. వినవలసింది’ అని డానికి సంబంధించిన కథను చెప్పడం ప్రారంభించారు. ఈ పిల్లలను బ్రతికించిన తరువాత కృష్ణ పరమాత్మ వీరినందరినీ తీసుకొని బృందావనం లోపలి వెళ్ళాడు. బాగా ఎండగా ఉంది. అపుడు కృష్ణుడు గోపబాలురతో
‘ఎండన్ మ్రగ్గితి రాఁకటం బడితి రింకేలా విలంబింపఁగా
రండో బాలకులార! చల్ది గుడువన్ రమ్యస్థలం బిక్క డీ
దండన్ లేఁగలు నీరు ద్రావి యిరవందం బచ్చికల్ మేయుచుం
దండంబై విహరించుచుండఁగ నమందప్రీతి భక్షింతమే?”
మీరు ఇప్పటివరకు ఎండలో తిరిగారు. బాగా ఆకలివేస్తోంది. దాహం వేస్తోంది. మనం చల్దులు తెచ్చుకున్నాం కదా! నీడలో కూర్చుని వాటిని తిందాము’ అన్నాడు.
జలజాంతస్థిత కర్ణికం దిరిగిరా సంఘంబులై యున్న ఱే
కుల చందంబునఁ గృష్ణునిం దిరిగిరాఁ గూర్చుండి వీక్షించుచున్
శిలలుం బల్లవముల్దృణంబులు లతల్ చిక్కంబులుం బువ్వు లా
కులు కంచంబులుగా భుజించి రచటన్ గోపార్భకుల్ భూవరా!
గోపాల బాలురికి తాము ఎందులో తింటున్నాము, ఏమిటి తింటున్నాము అనేది లెక్కలేదు. తామరపువ్వు బాగా విచ్చుకుంటే దాని రెక్కలనీ ఒకదానిమీద ఒకటి వుండి మధ్యలో కర్ణిక ఉంటుంది. కర్ణికకు చుట్టూ రేకులన్నీ విచ్చుకుని ఉంటాయి. అలా కృష్ణుడిని వారందరి మధ్యలో కూర్చుండ జేశారు. వీళ్ళందరూ కృష్ణుని చుట్టూ కూర్చున్నారు. వాళ్ళు గోపబాలురు. వారికి శౌచము అంతగా తెలియదు. ఒకడు రాయి తెచ్చుకుని, తను తినే ఆహార పదార్ధమును ఆ రాతిమీద పెట్టుకున్నాడు. ఒకడు నాలుగు చిగురుటాకులు కోసుకు తెచ్చుకుని తను తినే ఆహారం దానిమీద పెట్టుకున్నాడు. ఒకడు కొద్ది గడ్డికోసి తెచ్చుకుని ఆ గడ్డిని కంచంలా అమర్చి, దానిమీద తను తెచ్చుకున్న చల్దిమూటను పెట్టుకున్నాడు. ఒకడు తాను తెచ్చుకున్న చిక్కమును పరుచుకుని ఆ చిక్కంమీద తినేస్తున్నాడు. ఒకడు చెట్లకు అల్లుకొనిన పెద్ద పెద్ద తీగలలో ఒక తీగ కోసి దానిమీద పెట్టుకుని తింటున్నాడు. ఒకడు ఒక పెద్ద అడివి పువ్వును కోసితెచ్చి ఆ పువ్వులో పెట్టుకుని తింటున్నాడు.
మాటిమాటికి వ్రేలు మడిఁచి యూరించుచు; నూరుఁగాయలు దినుచుండు నొక్క;
డొకని కంచములోని దొడిసి చయ్యన మ్రింగి; చూడు లేదని నోరు చూపునొక్కఁ;
డేగు రార్గురి చల్దు లెలమిఁ బన్నిదమాడి; కూర్కొనికూర్కొని కుడుచు నొక్కఁ;
డిన్నియుండఁగఁ బంచి యిడుట నెచ్చలితన; మనుచు బంతెనగుండు లాడు నొకఁడు;
కృష్ణుఁ జూడు మనుచుఁ గికురించి వడి మ్రోల,మేలి భక్ష్యరాశి మెసఁగు నొకఁడు;
నవ్వు నొకఁడు; సఖుల నవ్వించు నొక్కఁడు; ముచ్చటాడు నొకఁడు; మురియు నొకఁడు.
ఒకడు వాని యింటినుంచి ఊరగాయలు తెచ్చాడు. ఎడమచెయ్యి పూజయందు గాని, భోజనమునందు కానీ దూష్యము. కానీ వాడు చల్దిముద్ద ఎడమచేతిలో పెట్టుకున్నాడు. ఊరగాయ అన్నం తింటూ పక్కవాడికి వాడి ఊరగాయలను చూపించి ఊరించేవాడు. ఒకడు పక్కవాని చల్దిమూట నుంచి ఊరగాయను తీసి అవతలి వానికి తెలియకుండా గుటుక్కున మ్రింగి, పక్కవాడు అడిగితె నోరు చూపించి ‘నేనెక్కడ తిన్నాను?’ అనేవాడు. ఒకడు పక్కవాళ్ళు విస్తళ్ళకు ఆకులు తెచ్చుకుందామని పక్కకి వెడితే వాళ్ళ చల్ది మూటలలోని కొన్ని ఆహార పదార్థములను తీసేసుకొని గబగబా అయిదారుగురి చల్ది తననోట్లో కుక్కేసుకునేవాడు. ఒకడు తాను బంతెనగుండ్లు తింటాననే వాడు. బంతెన గుండ్లు అంటే అందరి విస్తళ్ళ నుండి కొంచెం కొంచెం తీసుకుని నోట్లో పడేసుకుంటూ ఉండడం. ఒకడు కృష్ణుని చూపించి ‘ఆ ఆవకాయ ముక్కలు పట్టుకుని కృష్ణుడు ఎలా ఉన్నాడో చూడరా’ అనేవాడు పక్కవాడు కృష్ణుడి వంక చూసేసరికి వాడి విస్తరిలోని ఆవకాయ ముక్కను వీడు తినేవాడు. ఒకడు నవ్వుకుంటూ, ఒకడు తాను నవ్వకుండా తన మాటలచేత పక్కవాళ్ళని నవ్విస్తున్నాడు. ఇన్ని రకములుగా వీరందరూ అక్కడ అన్నం తింటున్నారు. కృష్ణుడు వీరందరి మధ్యలో కూర్చున్నాడు. వీళ్ళు కృష్ణుణ్ణి చూస్తూ తింటున్నారు. వాళ్ళకి కృష్ణుణ్ణి చూస్తూ తినడంలో కడుపు నిండుతుంది. వీళ్ళకి అదొక గమ్మత్తు.

చిత్రంలోని అంశాలు: 4 మంది వ్యక్తులు



(11))


*సాలగ్రామం ఎలా పుట్టింది.............?* 

గండకీ సరసస్తీరే చంద్ర తీర్థేన శోభితే| 
సాలగ్రామ పురశ్రేష్ఠ కనకాఖ్య విమానగ:|| 
శ్రీ మూర్తిదేవ శ్శ్రీ దేవ్యా కుబేరోముఖ సంస్థిత:| 
గండకీ గణికా రుద్ర బ్రహ్మణా మక్షిగోచర: 
శ్రీవిష్ణుచిత్త కలిజిత్ స్తుతి భూషిత నిగ్రహ:|| 

సాలిగ్రామం అంటే తెలుసా.......? విష్ణు చిహ్నంగల శిలనే సాలిగ్రామం అంటారు. 
అలాంటి సాలిగ్రామాలు ఒకటి కాదు రెండు కాదు వందలూ వేలు కాదు, లెక్కకు మిక్కిలిగా ఆ ఒక్క నదిలోనే పుడతాయి. మరెక్కడా దొరకవవి. 
ఆనది పేరు గండకీ. 
చిన్నగా పెద్దగా రకరకాల పరిమాణాల్లో ఉంటాయి. గండకీ నదిలోనే దొరుకుతాయి. గుండ్రని రాళ్ళలా ఉన్నా – తాబేలు నోరు తెరచుకున్నట్టు ఉండి లోపల శ్రీ మహా విష్ణువే శేషసాయిగా ఉండి దర్శన మిస్తాడంటారు. పూజిస్తుంటారు. మరి గండకీ నదిలోనే ఈ సాలిగ్రామాలు పుట్టడానికి వెనుక ఒక కథ ఉంది! 

గండకీ నది నదిగా మారడానికి ముందు ఒక స్త్రీ, గండకీ పేరుతోనే శ్రావస్తి నగరంలో ఉండేది. 
ఆమె అందాల వేశ్య. ఆమె అనుగ్రహం కోరి ధనవంతులు కూడా పరితపిస్తూవుండేవారు. 

గండకీ అందరినీ అంగీకరించేది కాదు. ప్రతి రోజూ ముందొచ్చిన బేరం ఒప్పుకొనేది. 
ఆరోజుకి అతనే భర్త. రెండో మనిషికీ రెండో బేరానికి ఒప్పుకొనేది కాదు. 
ధనం ఆశ చూపినా దరి చేరనిచ్చేది కాదు. ఆమె తల్లి గండ్రకి మార్చాలని ఎన్నోవిధాల ప్రయత్నించి విఫలమైంది. సాక్షాత్తూ నారాయణుడికే గండకిని పరీక్షించాలని కోరిక పుట్టింది. 

ఒక రోజు పరివారంతో పొద్దున్నే వచ్చిన ధనవంతుడు బేరం చేసుకొని కానుకలు ఇచ్చాడు. 
అలవాటుగా గండ్రకి అతనికి స్నానం చేయించాలని దుస్తులు తీస్తే దుర్వాసన… 
ఒళ్ళంతా పుండ్లు. ఈగల ముసిరాయి. కుష్టు వ్యాధి ఉందని కూడా గ్రహించింది. తల్లి తిట్టి పొమ్మనబోతే గండ్రకి ఆమెనే తరిమేసింది. 
సంపంగి తైలం పూసింది. గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేయించింది. చేనేత వస్త్రాలు చుట్టింది. చక్కని భోజనం పెట్టింది. అతడు తినబోతే పుచ్చిన చేతులు. వేళ్లూడి పడితే పక్కన తీసి పెట్టింది. తినిపించింది. 
అదే కంచంలో తానూ తిన్నది. పక్కమీదకు చేర్చింది. విసురుతూ కూర్చుంది. జ్వరంతో అతడు ఆ రాత్రే ప్రాణాలు వదిలాడు. అప్పటి ఆచారం ప్రకారం సహగమనానికి పూనుకుంది. తల్లీ బంధువులూ తల్లడిల్లినా ఆగలేదు. తాళి కట్టని భార్యలా తల్లడిల్లింది. తనువుని చాలించదలచింది. ఉన్న ధనమంతా బీదసాదాలకు పంచి పెట్టింది. ధాన ధర్మాలు చేసి దహన కార్యక్రమానికి శవం వెంట మేళ తాళాలతో వెళ్ళింది. శ్మశాసనంలో చితి పేర్చింది. తనే నిప్పంటించింది. తనూ చితిలోకి దూకింది. చిత్రంగా ఎగిసిన మంటలు మల్లెలయ్యాయి. కాలిన కట్టెలు పువ్వులయ్యాయి. లక్ష్మి సమేతంగా విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. 
గండకి చూస్తూనే ముగ్దురాలైంది. చేతులు జోడించింది. 
కన్నీళ్ళతో కీర్తించింది. కీర్తిస్తూ కాళ్ళు కడిగింది. శరీరమూ మనసూ స్వచ్ఛంగా నిలిపింది. 

గండకి పవిత్రతకు నారాయణుడు పరవశించిపోయాడు. ఆమె నియమ నిబంధనలకు నిర్ఘాంతపోయాడు. ఆమె నిశ్చలతకు చలించిపోయాడు. నిష్టకు ఇష్టపడ్డాడు. 

ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. గండకి డబ్బూ ధనం కోరలేదు. మోక్షమూ కోరలేదు. మాతృత్వాన్ని వరంగా కోరింది. మహా విష్ణువుని తన కడుపున కొడుకుగా పుట్టాలని కోరింది. ఫలితమే. 

మరు జన్మలో గండకీ నదిగా పుట్టింది. నది కడుపులో సాలిగ్రామాల రూపంలో విష్ణుమూర్తి పుట్టి పూజలందుకున్నాడు. 

గండకి ఏకులంలో పుట్టినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనసు మలినం కాలేదు. 
ఆ విధంగా పవిత్రురాలైంది. విష్ణుమూర్తిని తన గర్భంలో దాచుకొని తల్లయింది. కృతయుగాన జరిగినా ఈయుగానికీ గండకీ కథ నిలిచిపోయింది!.
 --((**))--

10. చిన్న కధ 

చెవుడు ఎవరికీ 

ఒక ఊళ్ళో ఓ భార్యా భర్త ఉన్నారు. ఒకసారి భర్తకి తన భార్యకి చెవుడు వచ్చిందేమో అని అనుమానం వచ్చింది. అది ఆమెతో నేరుగా మాట్లాడటం ఇష్టం లేక సలహా కోసం ఓ వైద్యుడి దగ్గరికెళ్ళాడు.
“దానికో చిన్న పరీక్ష ఉంది. దాన్ని ప్రయాగిస్తే మీ ఆవిడకు చెవుడు ఏ మాత్రం ఉందో తెలుస్తుంది” అన్నాడా డాక్టర్.
“నేను చెప్పినట్లు చేయండి. మొదట 40 అడుగుల దూరంలో నిల్చుని మీరు మామూలుగా మాట్లాడుతున్నట్లు మాట్లాడండి. వినిపిస్తుందేమో చూడండి. ఒకవేళ వినిపించకపోతే పది అడుగులు దగ్గరకు వెళ్ళి అదే విధంగా చేసి చూడండి. అలా ఆమెకు వినిపించేదాకా చేసి ఈ పరీక్ష ద్వారా మీరేం గమనించారో నాకొచ్చి చెబితే నేను దానికి తగ్గట్లు వైద్యం సిఫారసు చేస్తాను” అన్నాడు.
ఆ రోజు సాయంత్రం అతను ఇంటికెళ్ళేసరికి భార్య వంట చేస్తూ ఉంది. అతను వైద్యుడు చెప్పినట్లుగా ముందుగా 40 అడుగుల దూరంలో నిలబడి “ఏఁవోయ్ ఈ రోజు ఏం కూర చేశావ్?” అని అడిగాడు. ఏం సమాధానం వినిపించలేదు.
మళ్ళీ కొంచెం దగ్గరకొచ్చి అదే ప్రశ్న అడిగాడు. ఉఁహూ సమాధానం లేదు.
అలాగే వంటగదిలోకి వెళ్ళి “ఏఁవోయ్! ఇవాళ ఏం కూర చేశావ్?” అడిగాడు గట్టిగా మళ్ళీ. లాభం లేదు.
ఈ సారి సరాసరి ఆమె వెనకాలే వెళ్ళి నిల్చుని “ఏఁవోయ్ ఇవాళ ఏం కూర చేశావని అడిగితే సమాధానం చెప్పవేఁ!!” అన్నాడు విసుగ్గా…
ఆమె కోపంగా “మీకిది ఐదోసారి చెప్పడం, వంకాయ కూర చేశాననీ!!!” అనింది.

--((*))--


(9)


(8) *

ప్రాంజలి ప్రభ 

"మీరు ఏం కావాలనుకుంటున్నారు" (చిన్న కధ ) 


రాత్రి భోజనాల తర్వాత ఒక టీచర్ ఆమె విద్యార్థులు రాసిన వ్యాసరచన పేపర్లను దిద్దడం ప్రారంభించింది.


ఆమె పిల్లలు పడుకున్నారు!


భర్త కుర్చీలో కూర్చొని తన స్మార్ట్ ఫోన్లో అభిమాన *క్యాండీక్రష్ సాగా* ఆటలో లీనమై ఆసక్తిగా ఆడుతున్నాడు.


చివరి పేపర్ దిద్దాడానికి తీసి చదివిన ఆ టీచర్ శ్వేత గారు నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంది.


ఆ ఏడుపు..వెక్కిళ్ళ శబ్దానికి గేమ్ ఆడుతున్న భర్త తలతిప్పి చూసి ఆశ్చర్యపోయాడు!


"ఓయ్ ! ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? చాలా రోజుల్నిండి నేను నిన్నేమి అనటం లేదుగా!!" అడిగాడు టెన్షన్ తో


"నిన్న నా సెకండ్ క్లాస్ విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చాను!" "మీరు ఏం కావాలనుకుంటున్నారు" అనే అంశంపై ఏదైనా రాసుకుని రండీ!! " అని చెప్పాను!!


శ్వేత అనే అమ్మాయి విద్యుత్తులా ఉండాలని ఉన్నది ..

డేటాగో కురుతుందో చెప్పండి  

"సరేగానీ!! నీవ్వెందుకు ఏడుస్తున్నావు?" ప్రశ్నించాడతను.


"ఇదిగో! ఈ చివరి పేపర్ దిద్దుదామని చదువుతుంటే ఏడుపును ఆపుకోవడం నా తరం కావడంలేదు!!"


భర్త ఆసక్తిగా...."అంత ఏడిపించే విధంగా ఏం రాశాడా బాబు?"


"వినండి చదువుతాను"


హెడ్డింగ్ ఇలా పెట్టాడు


నేను_స్మార్ట్_ఫోన్ అవ్వాలని నా కోరిక."


అమ్మానాన్నలు స్మార్ట్ ఫోన్ను చాలా ప్రేమిస్తారు!


వాళ్ళు స్మార్ట్ ఫోనును చాలా కేర్ గా..శ్రద్ధగా ..ఇష్టంగా చూసుకుంటారు...చాలా సార్లు నా కన్నా ఎక్కువగా కూడా!!


నాన్న ఆఫీసు నుండి అలసటతో వచ్చినప్పుడు, అతనికి స్మార్ట్ ఫోన్ రిలాక్స్ ను ఇస్తుంది.. నాన్నకి స్మార్ట్ ఫోన్ కోసం సమయముంది.. కానీ, నా కోసం లేదు! ఎందుకంటే నాతో ఆడుకోవడం మా నాన్నకు రిలాక్స్ ను ఇవ్వడంలేదు!


అమ్మానాన్నలు.. ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు కూడా స్మార్ట్ ఫోన్ రింగౌతుంటే... ఒకటి రెండు రింగులు వచ్చే లోపే వాళ్ళు.. ఫోన్ చేతిలోకి తీసుకుని జవాబిస్తారు!

కానీ.. నేను ఎన్నిసార్లు పిలిచినా దానికిచ్చే ప్రిఫరెన్స్ నాకివ్వరు!! ...

ఒకవేళ నేను అప్పుడప్పుడు ఏడుస్తూ వుంటే కూడా!!....


చివరికి అప్పుడు కూడా వాళ్ళు నాతో కాకుండా స్మార్ట్ ఫోన్లతో గడుపుతుంటారు!

వాళ్ళు నాతో కన్నా స్మార్ట్ ఫోన్లతో ఆడు కోవడానికే ఎక్కువ ఇష్టపడుతారు!

వాళ్ళు తమ స్మార్ట్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్పినా వినిపించుకోరు!

అది నాకు ముఖ్యమైన విషయమైనా సరే!! కానీ వాళ్ళకి అది ముఖ్యం కాదు!

అదే ఒకవేళ నాతో మాట్లాడుతున్నప్పుడు రింగ్ వస్తే మాత్రం వెంటనే ఫోన్ కి జవాబిస్తారు!


అమ్మానాన్నలు

స్మార్ట్ ఫోన్ని కేర్ గా చూసుకుంటారు!
ఎప్పుడూ తనలోనే ఉంచుకుంటారు!!
దానికి చాలా ప్రాధాన్యతనిస్తారు!
దాన్ని చాలా ఇష్టపడుతారు!!
దానితో రిలాక్స్ అవుతుంటారు!!
దానికి తమ ఖాళీ సమయాన్ని కేటాయిస్తారు!!
దానితో ముచ్చట్లు పెడుతారు!
దాన్ని చూస్తూ ముసి ముసి నవ్వులు నవ్వుతారు!
పడుకుంటునప్పుడు కూడా తనప్రక్కనే ఉంచుకుంటారు!!
ఉదయం లేవగానే దాన్నే చేతిలోకి తీసుకుంటారు!!
దానితో చాలా ఆనందంగా ఆడుకుంటారు!!
దాన్ని ప్రేమిస్తారు!!

కాబట్టి! నా కోరిక ఏమిటంటే..నేను అమ్మానాన్న చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నాను!!


శ్వేత చదువుతుంటే..విన్న మంకువారి అబ్బాయి కి కూడా మనసంతా పిండేసినట్లైంది!! ఉద్వేగభరితుడయ్యాడు..అతని కళ్ళలో కూడా కొంచెం తడి వస్తుండగా...


"ఎవరు రాశారది? " అడిగాడు భార్యని..గొంతు గద్గదమౌతుండగా...


"మన కొడుకు" అంది భార్య కన్నీరు కారుతుండగా!!!


✴✴✴✴✴

sekarana mallapragada raamkrishna 



(7)

అంగజరాజు పాంథ నిచయంబులపై విజయం బొనర్ప నే
గంగ దలంచునంత మునుగల్గగ దాసులు పట్టు జాళువా
బంగరు టాలవట్టముల భంగి గనంబడె బూర్వ పశ్చిమో
త్తుంగ మహీధరాగ్రముల దోయజశాత్రవమిత్ర బింబముల్

వసంతుడు మన్మథుని చెలికాడే కాదు, సేనాపతి కూడా. అందువల్ల వసంతమాసం అంటే మన్మథుడు జైత్రయాత్ర చేసే సమయం అన్నమాట. మన్మథరాజు జైత్రయాత్రకి సన్నద్ధమైన సమయాన్ని వర్ణిస్తున్న పద్యమిది.

ఇక్కడొక చిన్న పిట్టకథ చెప్పుకోవాలి. ఒకసారి భవభూతి, దండి, కాళిదాసులతో కలిసి భోజరాజు సముద్రపుటొడ్డుకు విహారానికి వెళ్ళాడట. అక్కడ అస్తమిస్తున్న సూర్యుడిని చూసి ‘పరిపతతి పయోనిధౌ పతంగః’ అన్నాడట. అంటే సూర్యుడు సముద్రంలో పడిపోతున్నాడు అని. మిగిలినవారు ఒకొక్క పాదంతో ఆ పద్యాన్ని పూరించాలి. వెంటనే దండి ‘సరసిరుహా ముదరేషు మత్తభృంగః’ అన్నాడట. అంటే పద్మాల కడుపుల్లో మత్తిల్లిన తేనెటీగలున్నాయి అని. తేనె తాగేందుకు వాలిన భ్రమరాలు పద్మ మరందాన్ని త్రాగి మత్తెక్కి ఉన్నాయి. ఇంతలో సూర్యాస్తమయం అయింది. పద్మాలు ముడుచుకుపోయాయి. అలా ముడుచుకుపోయిన పద్మాల కడుపుల్లో మత్తిల్లిన భృంగాలు ఉండిపోయాయి! ఆ తర్వాత భవభూతి ‘ఉపవనతరుకోటరే విహంగః’ అన్నాడు. ప్రక్కనే ఉద్యానవనాలున్నాయి. ఆ తోటల్లో చెట్లున్నాయి. ఆ చెట్ల తొర్రలలోకి పక్షులు చేరుకున్నాయి అని అర్థం. ఇక చివరగా కాళిదాసు వంతు. అతను ‘యువతి జనేషు శనై శ్శనై రనంగః’ అని పూరించాడు. అంటే యౌవనవతులైన స్త్రీలలోకి మెల్లమెల్లగా మన్మథుడు ప్రవేశిస్తున్నాడు అని.


--((**))--

(6)

ఆయుర్వేదం అప్పటికాలంలో ఎనిమిది అంగాలను కలిగి ఉండేది. అందుకు అమరంలోని ఈ శ్లోకమే సాక్ష్యం. 

కాయబాలగ్రహోర్ధ్వాంగ శల్యదంష్ట్రా జరావృషాన్ 

అష్టావంగాని తస్యాహు శ్చికిత్సా యేషు సంశ్రితాః ! 

కాయచికిత్స అంటే జ్వరము, రక్తస్రావము, అతిసారము వంటి శారీరక సంబంధమైన వ్యాధులకు చేసేటువంటి చికిత్స. 

బాలచికిత్స అంటే.... 

పిల్లలకు పెద్దలకు (కూడా) ఆహారాదుల వ్యత్యాసం వలన కలిగే వ్యాధులు. 

గ్రహచికిత్స అంటే.... 

బాలగ్రహములు, క్షుద్రగ్రహములచే పీడింపబడేవారికి మంత్రప్రయోగాది చికిత్స. 

ఊర్ధ్వాంగచికిత్స అంటే..... 

మెడనరాలు, కండ్లు, నాసిక, నోరు, శిరస్సు భాగాలకు కలిగే వ్యాధులకు చేసే చికిత్స. ( ఇప్పటి మన న్యూరాలజీ, ఇఎన్టీ వంటివి అన్నమాట ). 

శల్యచికిత్స అంటే...... 

కత్తి బాణము వంటి పదునైన ఆయుధములు గుచ్చుకొని వ్రణాలేర్పడితే చేసే చికిత్స. 

దంష్ట్రాచికిత్స అంటే.... 

తేలు పామువంటి విషప్రాణులవల్ల శరీరాంగములకు సోకిన విషానికి విరుగుడు చికిత్స. 

జరాచికిత్స అంటే..... 

విషప్రయోగమువలన అకాల వార్దక్యం సంభవించి దుర్బలురైనవారికి చేసే రసాయన చికిత్స. 

వృషచికిత్స అంటే..... 

ఇంద్రియములు చెడి సంభోగశక్తి నశించి, తృప్తి, స్వాస్థ్యము వృద్ధి చేసేందుకు జరిపే చికిత్స. 

చూశారా ! పై వ్యాధులలో కొన్ని కేవలం రాజులు సంపన్నులు వంటి వారికి సంబంధించినవయితే మరికొన్ని ఎవరికైనా వచ్చే వ్యాధులు. పూర్వం విద్యలన్నీ రాజాదరణతోనే సాగేవి. ( నేటి మన ప్రభుత్వ గుర్తింపు లాగా ). ఇవికాక మరికొన్ని వ్యాధులకు ప్రత్యేక చికిత్స చేసేవంటి నిపుణులు ( నేటి మన స్పెషలిస్ట్ లు ) ఉండేవారట. 



--((**))--

@@@@@@@
(5)
" చంద్రుని(శశి)లో మచ్చ ఉన్నది.
కొందరు ,దానిని 'లాంఛనము 'అనియునూ,
కొంత మంది సముద్రములోని బురద (=పంకం) అనీ,
కొందరు 'లేడి 'అని,
మరి కొందరు అద్దానిని "భూమి యొక్క నీడ "అనిన్నీ భావిస్తున్నారు.
అది 'ఇంద్ర నీల మణి' అంత నల్లగా 'దృశ్య మాన మౌతూన్నది.
కానీ,,,నేను మాత్రం , "ఆ మచ్చను , ఇన బింబము(=చంద్రుడు),
ఈ రేయి అంతా దిట్టంగా త్రాగి,
తన పొట్టలో దాచుకున్న గాఢ అంధకారము "
అని తలుస్తాను।"
అని కవి నుడివెను.

వరాహమిహిరుడు!
.
దైవజ్ఞ వరాహమిహిర Daivajna Varāhamihira (సంస్కృతం : वराहमिहिर;
505 – 587), లేదా వరాహమిహిరుడు, లేదా వరాహ, లేదా మిహిర.
భారత ఖగోళ శాస్త్రజ్ఞుడు, గణిత శాస్త్రజ్ఞుడు, మరియు జ్యోతిష్య శాస్త్రవేత్త.
ఉజ్జయిని లో ఒక విశ్వకర్మ బ్రాహ్మణ వంశం లో జన్మించాడు.
చంద్రగుప్త విక్రమాదిత్య ఆస్థానములోని 'నవరత్నాల'లో ఒకడు.
.
ఉజ్జయిని నగరానికి సమీపంలో క్రీ.శ 4 వ శతాబ్దంలో ఆదిత్యదాసుడనే జ్యోతిశ్శాస్త్ర పండితునకు జన్మించాడు మిహిరుడు. తండ్రి వద్ద గణిత జ్యోతిశ్శాస్త్రములు నేర్చుకున్న మిహిరుడు పాట్నా లో నాటి సుప్రసిద్ధ గణీత శాస్త్రవేత్త ఆర్యభట్టు ను కలుసుకొని ఆయనతో శాస్త్ర చర్చ జేశాడు. అనంతరము ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాలను అధ్యయనం జేయాలని నిర్ణయించుకొని అసాధారణ కృషి సలిపారు. ఆయన నిరంతర అధ్యయన ఫలితాలు అతని గ్రంథాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
అనతి కాలంలో ఉజ్జయిని గొప్ప విద్యా కేంద్రము, అక్కడ కళలు, సంస్కృతి, విజ్ఞాన శాస్త్రము అనే అంశాలలో ప్రసిద్ధులైన ఎందరో పండితులు సుదూరాల నుంచి వచ్చేవారు. పరస్పర భావ వినిమయం వుండేది. అచ్చటి శాస్త్ర చర్చలలో మిగిరుని శాస్త్ర పటిమ తెలియ వచ్చిన రెండవ విక్రమాదిత్య చంద్ర గుప్తుడు తన ఆస్థాన మండలి నవరత్నములలో నొకనిగా ఆయనకు గౌరవించాడు.
దీనికి సంబంధించిన ఒక సంఘటన చెప్తారు. విక్రమాదిత్యుని కుమారుడు వరాహము కారనంగా మరణిస్తాడని మిహిరుడు జ్యోతిషము చెప్పగా రాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతో కట్టుదిట్టము చేసినా శాస్త్ర ప్రకారము చెప్పిన సమయానికి, చెప్పిన కారనముగానే రాకుమారుడు మరణిస్తే విక్రమాదిత్యుడు తన కుమారుని గతికి విలపించినా మిహిరుని ప్రతిభను శ్లాఘించి మగధ సామ్రాజ్య గౌరవ చిహ్నము వరహముద్రాంకితముతో సత్కరించాడు.
నాటి నుంచి ఆ జ్యోతిః శాస్త్ర వేత్త వరాహమిహిరుడుగా పిలువబడ్డాడు. వేదాలన్నీ చదివి ఎంతో పండితుడైనా మానవాతీత శక్తులను గ్రుడ్డిగా నమ్మేవాడు కాడు. అతనొక అద్భుత శాస్త్రవేత్త!
.
చంద్ర,సూర్య గ్రహణాలు రాహు,కేతువుల వల్ల కాదని భూమి మీద నీడ పడటం చేత చంద్ర గ్రహణం, చంద్రుని నీడ పడటం చేత సూర్య గ్రహణము కలుగుతున్నాయని పూర్వ ఋషులు చెప్పిన సత్యాన్ని వివరించాడు. తోకచుక్కలు వాని రకాలు గురించి తెలిపాడు.
అనేక సందర్భాలలో వరాహమిహిరుడు గర్గ,పరాశర, అసిత దేవతల, కశ్యప, బృగు, వసిష్ట, మను, మయ వంటి ప్రాచీన ఋషుల మతము ప్రకారము అని విడి విడిగా ప్రస్తావించటం, అంతే కాక ఇంకా ఎంతో మందిని అనుసరించి (అన్యాన్ బహున్) అని చెప్పడం వలన ఆయన పరిశీలనాత్మక దృష్టి, వినయ సంపత్తి ద్యోతకమవుటయే కాక ఆ కాలములో అవన్నియు లభించి ఉండేవని తెలుస్తుంది.
ఆయన ఒక జ్యోతిష శాస్త్రవేత్త. ఆయన జ్యోతిష శాస్త్రంలో మూడు ముఖ్యమైన విభాగాలను వ్రాసారు.
బృహత్ జాతక - హిందూ ఖగోళ శాస్త్రం మరియు జాతక గ్రంథం లో గల ఐదు ముఖ్య గ్రంథములలో ఒకటి.
లఘు జాతక - దీనిని స్వల్ప జాతక అనికూడా పిలుస్తారు.
సమస సంహిత - దీనిని "లఘు సంహిత" లేదా "స్వల్ప సంహిత" అని కూడా పిలుస్తారు.
బృహత్ యోగ యాత్ర - ఇది "మహా యాత్ర" లేదా " యక్షస్వమెధియ యాత్ర" అని పిలువబడుతుంది.
యోగ యాత్ర - ఇది "స్వల్ప యాత్ర" గా పిలువబడుతుంది.
టిక్కని యాత్ర
బృహత్ వివాహ పటాల్
లఘ వివాహ పటాల్ - ఇది స్వల్ప వివాహ పటాల్ గా పిలువబడుతోంది.'
లఘ్న వరాహి
కుతూహల మంజరి
వైవజ్ఞ వల్లభ
ఆయన కుమారుడు ప్రితుయాసాస్ కూడా ఖగోళ శాస్త్రంలో మంచి రచనలు చేశారు. ఆయన "హోర సార" అనె ప్రసిద్ధ రచన జ్యోతిష శాస్త్రం పై రాశాడు.
.
గణాంక శాస్త్రంలో[మార్చు]
ఆయన చేసిన పరిశోధన మూలంగా ప్రాచుర్యం పొందిన ఈ క్రింది త్రికోణమితి సూత్రాలు కనిపెట్టబడ్డాయి.
\sin ^{2}x+\cos ^{2}x=1\;\!} {\displaystyle \sin ^{2}x+\cos ^{2}x=1\;\!}
{1-\cos 2x}{2}}=\sin ^{2}x} {\displaystyle {\frac {1-\cos 2x}{2}}=\sin ^{2}x}
.
అదేకాక ఆయన ఆర్యభట్టు కనిపెట్టిన సైన్ టేబుల్ యొక్క విలువలని మరింత నిరుష్టంగా చేసారు.
అంక గణితం (Arithmetic) లో సున్నా మరియు అభావిక సంఖ్యల (Negative Numbers)గుణాలని వివరించాడు.


(4)

జీవన సూత్రాలు (2)
సత్సాంగత్యం:

*** మనిషి జీవితానికి ఆలంబనగా నిలిచే స్నేహితులు ముగ్గురు ,,
1. సంపద: అదృష్టం ఉన్నంతవరకు తోడుగా ఉంటుంది. 
2. బంధువులు: శ్మశానం వరకు తోడుగా ఉండి, అక్కడ వదిలేస్తారు. 
3. మనం చేసిన పుణ్యం: మనం చేసిన పుణ్యం, శ్మశానాన్ని దాటిన తరువాత కూడా మనని అనుసరిస్తుంది.

*** సజ్జన సాంగత్యం, సత్సంభాషణం, సత్కర్మాచరణం. 
ఇవే మనలోని దార్మిక ప్రవుత్తీ దృఢంగా తయారు చేసేవి.

*** మంచి స్నేహితులు ఉంటే, ఎంతటి సుదీర్ఘ ప్రయాణమైనా సరే, సుదూరం అనిపించదు.

*** సజ్జన సాంగత్యం , పరిమళ ద్రవ్యాల దుకాణాన్ని సందర్శించడం లాంటిది. మనం వాటిని కొన్నా కొనకపోయినా మనకు సువాసన అంటుకునే తీరుతుంది.

--((**))--


(3)

*ఆదివారం* 

ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు తమలపాకు నమలడం లేదా ఆకులు జేబులో ఉంచుకోవడం చేస్తే అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. 

*సోమవారం* 

సోమవారం మీ ముఖాన్ని అద్దంలో ఒక సారి చూసుకుని ఇంట్లో నుండి బయటకు రావాలి. వీలైతే కోడి గుడ్డు ఆకారంలో ఉండే అద్దాన్ని ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర అమర్చుకోవాలి. 

*మంగళవారం* 

హనుమంతుడికి ఇష్టమైన మంగళవారం ఉదయం స్నానం చేసి, హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నోరు తీపి చేసుకోవాలి. బెల్లం తింటే మరీ మంచిది. 

*బుధవారం* 

బుధవారం బయటకు వెళ్లేప్పుడు పుదీనా లేదా కరివేపాకు ఆకులు నోట్లో వేసుకోవాలి. ప్రతి బుధవారం ఇలా చేస్తే ఆరోగ్యంగానూ చాలా ప్రయోజనం ఉంటుంది. 

*గురువారం* 

గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు కొద్దిగా జిలకర లేదా ఆవాలు నోట్లో వేసుకోవడం మంచిది. వాటిని నమల కుండా అలానే నోట్లో ఉంచుకోవాలి. గుమ్మం దాటి బయటకు వెళ్లే వరకూ అలాగే ఉంచాలి. 

*శుక్రవారం* 

ముఖ్యమైన పనిమీద శుక్రవారం వెళ్లాల్సి వస్తే పెరుగు తిని బయలుదేరాలని హిందూ ధర్మశాస్త్రం చెబుతోంది. అలాగే ప్రతి శుక్రవారం కనీసం రెండు టేబుల్ స్పూన్ల పెరుగు ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు తీసుకోవాలి. 

*శనివారం* 

అల్లంతో కలిగే ప్రయోజనాలు అందరికీ తెలుసు. ప్రతి శనివారం కొద్దిగా అ్లలం తురుము నేతితో కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల సిరిసంపదలు మీ దరిచేరతాయి.

(2)
శిష్యులు పాటించగలిగినదీ, గురువు పాటించలేకపోయినదీ!

ఒక “పాత చందమామ కథ” (సుమారు 50 సంవత్సరాల వెనుక)

అనగా అనగా ఒక పురాణశాస్త్రులు ఉండేవాడు. సాయంసమయాలలో ఆయన ప్రవచనాలను చెప్తో ఉండేవాడు. ప్రక్క ఊళ్ళనుంచి పెరుగు అమ్ముకునే కొందరు స్త్రీలు ఒకరోజున ఈయన మంచి మాటలను విన్నారు వాటి సారాంశం - 'భగవంతుడిని నమ్ముకుంటే నీళ్ళమీద నడిచేయగలం' అని! ఈ మాట వాళ్ళకి బాగా పట్టింది; ఆ రోజునుండి వాళ్ళు దేవుణ్ణి తలచుకుంటూ, ఆయనమీదే భారంవేసి నడిచేయగలిగారు. ఇలా కొన్నాళ్ళు గడిచాక, వాళ్ళలో ఒకామె అంది కదా - ' ఈ పంతులుగారు మనకి పడవ ప్రయాణం ఖర్చు తగ్గించాడు కాబట్టి ఒక పంచెల జత ఇచ్చి గౌరవించుదాం' - అని; సరే అన్నారు మిగిలినవాళ్ళు. మరుసటిరోజున శాస్త్రులవారిని వాళ్ళ ఊరికి పిలిచారు. ఈయనా సరేనన్నాడు. తీరా నది దగ్గరకొచ్చాక, 'పడవేది?" - అని అడిగాడీయన. 'అదేంటయ్యవారూ! మీరే కదా అన్నారు - దేవుణ్ణి నమ్మితే పడవ అక్కర్లేకుండానే నదులను దాటేయవచ్చు- అని!' అన్నారు వాళ్ళు. అయినా, ఈయనకేమో నమ్మకం కలగలేదు అప్పటికీ! ' ఏదీ! నడిచి చూపించండి?' అనడిగాడు. వాళ్ళు నిస్సంకోచంగా నడిచి అటువైపుకి వెళ్ళిపోయారు, ఈయనేమో తటపటాయిస్తూ మొదటి అడుగు వేశాడు గానీ నీళ్ళలోకి పడిపోయాడు!

దీనినుండి మనం తెలుసుకోదగ్గ విషయాలేమిటంటే (నాకు తోచినవి) -

1) నమ్మకం మనలను చాలా దూరం తీసుకెళ్తుంది.
ఏ మతంలోనైనా ముఖ్యమైనవి - పవిత్రమైన ఆలోచనలు, క్రమశిక్షణ, సర్వాత్మభావం, వేరే మనుషులను ఇబ్బంది/బాధపెట్టకుండా మన పనులను మనం చేసుకుపోతూండడం, “అంతా దేవుడి అధీనంలో ఉంది, ఆయనే అధికారి కాబట్టి మనకు ఏయే ఫలాలనివ్వాలో ఆయనకే బాగా తెలుసు..” అనే నమ్మకం. ఇవి చాలు. ఆర్భాటం, హడావుడి, దంభం అక్కర్లేదు.
ఆడుతూ, పాడుతూ, అట్టహాసంలేకుండా మన ధర్మాన్ని మనం నిర్వర్తించుకోవచ్చు.

2) చెప్పింది చేయలేనివాడికి/చెప్తున్నదాంట్లో నమ్మకం లేనివాడికి మహా వస్తే ‘భుక్తి వస్తుంది కానీ ముక్తి రాదు.’

3) ఇంకా ముఖ్యమైనది: 'ఎంతోమంది స్వాములు, దేవదూతలు, భూతవైద్యుల్లాగ మేకప్పులు చేసుకుని మాట్లాడే పరాన్నభుక్కులు' - ఎన్నెన్నో అంటూంటారు/బోధిస్తూంటారు. వాళ్ళు చెప్పేదాంట్లో మనకి పనికొచ్చేవి కూడా చాలా ఉంటాయి. వాటిని మాత్రమే మనం స్వీకరించి లాభం పొందచ్చు. వాళ్ళలో మాత్రం చాలామందికి ఆ ప్రయోజనం కలగకపోవచ్చు. అలాంటివాళ్ళను మూర్ఖంగా ఆరాధించక్కర్లేదు - జాలిపడి వదిలేద్దాం.

4) అయితే, వికటంగా ప్రవర్తిస్తూ, “నేను తప్ప ఈ భూమిమీద సిద్ధ(!)గురువులెవరూ లేరు” వంటి సందేశాలతో, రణగొణధ్వనులతో శబ్దకాలుష్యాన్ని పెంచేవారిపట్ల, ఆర్షధర్మాన్ని భ్రష్టుపట్టించే విధంగా రాజకీయనాయకులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ, (ఆ నాయకుల మతం ఒప్పుకోకపోయినా, వారు మనతో ‘మనసారా’ కలిసిపోతున్నారని భ్రమింపజేయడానికి) వారి ముఖాలపైన బొట్లు కూడా పెడుతూ (తద్వారా మనకు పంగనామాలు పెడుతూ), వారి కనుసన్నల్లో బ్రతికేవారిపట్ల, నిత్యానిత్యవస్తువివేక-వైరాగ్యాలపైనే “విరక్తి” కలిగినట్లు ప్రవర్తించే ‘మిథ్యాచారులైన’ ‘స్వాముల’, ‘దైవదూతల’వంటివాళ్ళపట్ల మాత్రం ఉపేక్షవహించనక్కరలేదు! వారు నిజానికి చేస్తున్నది దేవుడికి ఉపచారం కాదు, అపచారం! దీనిని బాధ్యతతో కడిగిపడేయడం కూడా మన ధర్మమే! ఎందుకంటే అట్టివారు మన ధర్మానికున్న పరువును మంటకలుపుతున్నారు. వాళ్ళందరూ మన ధర్మానికి గుదిబండల్లాంటివారే నిస్సందేహంగా!



సమయం, సందర్భం చూచుకుని “కీలెరిగి వాతపెట్టినట్లు”గా నలుగురికీ ఈ విషయాలను తగిన విధంగా తెలియజేయడం కూడా అవసరమే, మన కర్తవ్యమే! చెడును శాయశక్తులా అడ్డుకోవడం కూడా మన విధ్యుక్తధర్మమే అవుతుంది.

--((**))--

(1)

*సన్యాసులు భిక్షకు వెళ్లడం సంప్రదాయం . అలా నలుగురు శిష్యులతో కలకత్తాలో ఒక వీధిలో వివేకానందుడు భిక్షకు బయలుదేరాడు .

మరీ పెద్ద చప్పుడు కాకుండా ఒక మోస్తరు ధ్వనితో గంట కొడుతూ -భవతి భిక్షామ్ దేహి - అని అడుగుతున్నారు . ఒక ఇంట్లో నుండి - చేయి ఖాళీ లేదు పొమ్మని సమాధానం వచ్చింది . ఒకామె సగం పాడయిపోయిన అరటిపండు వేసింది .

ఒకామె ఒంటికాలిమీద లేచి తిట్టింది . శాపనార్థాలు పెట్టింది . ఊగిపోయింది . ఒకరిద్దరు భిక్షాపాత్రల్లో బియ్యం పోశారు .

పాడయిపోయిన అరటిపండు భాగాన్ని తొలిగించి - బాగున్నంతవరకు దారిలో కనపడిన ఆవుకు పెట్టి మఠం చేరుకున్నారు . వారివారి పనుల్లో మునిగిపోయారు .

మధ్యాహ్నం భోజనానంతరం ఒక శిష్యుడు చాలా దిగాలుగా గుమ్మానికి ఆనుకుని కుమిలిపోతుండడాన్ని వివేకానందుడు గమనించాడు . నెమ్మదిగా అతడిదగ్గరికి వెళ్లి కారణం కోసం ఆరా తీశాడు .

పొద్దున్న భిక్షకు వెళ్ళినప్పుడు ఆమె తిట్టిన తిట్లు , శాపనార్థాలు , ప్రదర్శించిన కోపం చాలా బాధపెడుతోంది . వికారంగా ఉంది . తట్టుకోలేకపోతున్నాను - అన్నాడు .

వివేకానందుడు సమాధానం అతడిచేతే చెప్పించి ఓదార్చాడు .

ప్రశ్న - సమాధానం

----------------

ప్ర : మనకు భిక్షలో ఈ రోజు ఏమేమి వచ్చాయి ?

స : సగం పాడయిపోయిన అరటి పండు , కొద్దిగా బియ్యం .

ప్ర : మనం మఠానికి ఏమి తెచ్చుకున్నాం ?

స : కొంచెం అరటిపండు అవుకు పెట్టేసి , బియ్యాన్ని మాత్రం తెచ్చుకున్నాం .

ప్ర : మరి తెచ్చుకున్నవాటిలో తిట్లే లేనప్పుడు , అవి నీవి కావు . నీతో రాలేదు . మనం తీసుకున్నది అరటిపండు , బియ్యమే కానీ , తిట్లను తీసుకోలేదు - ఇక్కడికి మోసుకురాలేదు . రానిదానికి - లేనిదానికి అకారణంగా బాధపడుతున్నావు .

స : నిజమే స్వామీ !

-----------------

*మనమూ అంతే . తలుచుకుని తలుచుకుని ఆనందించాల్సిన , పొంగిపోవాల్సిన ఎన్నింటినో వదిలేసి ఎవెరెవరివో - ఎప్పటెప్పటివో - అన్నవారికే గుర్తుకూడా ఉండని తిట్లను , కోపాలను , అవమానాలను తలుచుకుని తలుచుకుని బాధపడుతూ ఉంటాం .

ఏ వివేక వాణి వచ్చి చెప్పాలి - మనది అకారణ బాధ అని .


--((**))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి