30, ఆగస్టు 2020, ఆదివారం

మనసును ఊరించిన మగువ

ప్రాంజలి ప్రభ - సీస పద్యం .అంతర్జాల పత్రిక
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ




మనసును ఊరించిన మగువ (1 )

కనులలో కదలిక కరువాయె నిదురలే
కలలను కనలేను కథలతో చరిత 
ఒకరోజు రాత్రిన ఓర్పున కలగన్న 
ఇరువుర ము ఒకటై ఇచ్ఛా చరిత 
మనమున నిలిచిన మగువ రూపమదియు
ఎంత మరువకున్న ఏమైన చరిత   
చెణుకులు విసురుచూ చిలిపిగా చూపులు
ముఖకవళికలును ముడుపు చరిత 

నరుని దేహమందున శుభ నటన కనుట
నిద్ర భంగ మవుట ఏను నియమ మేను 
ప్రేమ విజయమే అవకాశ ప్రీతి యగును 
అప్ర మేయ శక్తిమనసు  అవగతమగు

--(())--  
MiniPinGridLego

ప్రాంజలి ప్రభ - సీస పద్యం .అంతర్జాల పత్రిక 

రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
మనసును ఊరించిన మగువ (2 )


కురులలో జాజుల కులుకుల మాలలు 
మనసుకు హాయిగా మధురిమా నిచ్చు  
పెదాలు కదలిక పెరిగిన నవ్వుల  
జాబిలి వెన్నెల జాగృతి నీడ  
తాపము రేపెడి తారక వెలుగులు 
నాపైన చూపితి నానుడి వెలుగు  
ప్రేమకు అనుమతి ప్రేయసి కోరితి  
అనుకువ మదిలోన అనుట తెల్పె 

ఆటవెలది 
ఆ:: ప్రేమ జంట కలుపుచుండు ప్రేమబతుకు   
మంచి చెడ్డల మాన్యత మలుపు లన్ని    
మనసు వేట పరుగులన్ని మానసమ్ము  
జీవితమ్ము సుఖమనేది జీవనమగు  

--(())--

Quất không chàng hỡi :3 | Mong Chuyen | Flickr
ప్రాంజలి ప్రభ - సీస పద్యం .అంతర్జాల పత్రిక 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
మనసును ఊరించిన మగువ (3 )


కోపపు పలుకుల కోకిల కూతలు 
ఒకవైపు ఆనంద ఒకటి పరుగు  
ఆశల చిరుజల్లు ఆదరణ పరుగు  
మగువపలుకు లన్ని మాయ చేరు   
పాటలా హృదయము పాఠము తెలుపుటే   
పెంచేటి వయసుకు ప్రేమ తళుకు
మందార మకరంద మాధురీ ఘురి నీవు 
ఉజ్వల కాంతితో ఉన్నత పిలుపు  

ఆటవెలది 
నవరసాలు ఉన్న నవరత్నములు యున్న
నవనిధివనరున్న నరుని కెపుడు 
ప్రేమ పొందు కోరుట పేరు ధనములకు 
కన్న మిన్న మనసు కాన రాదు   
   
Indian Actress Rakul Preet Singh Beautiful Funny Face Closeup Stills - Tollywood Stars
ప్రాంజలి ప్రభ - సీస పద్యం .అంతర్జాల పత్రిక 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
మనసును ఊరించిన మగువ (4 )


వలపు వాగుల పర వశముతో ఉరవడి 
ఎగసి పడియు దేహముఇది ఎగసి పడుట  
పలుకులే మల్లెలు పదనిస తీర్పులు  
రూపము మారెను రూపు చరిత  
నెమలి నాట్యము నమ్మకము తెలుపు  
పింఛము ఎత్తియు ఎగురు చుండె 
ప్రకృతి ఆందమగుట ప్రతిభకు మూలము  
మెరుపుగా మార్చెను మోక్ష చరిత  

ఆ:: పడచు అంద  మంత పగలరాతిరికేను    
హృద్య మైన రీతి హాయి గొలుపు  
తీర్చెను సుఖ మంత త్రికరణ సిద్ధిగా 
ఇంత కన్న పొంద ఇంతి చరిత  
--
(())--  


african queen • Millions of unique designs by independent artists. Find your thing.

ప్రాంజలి ప్రభ - సీస పద్యం .అంతర్జాల పత్రిక 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
మనసును ఊరించిన మగువ (5 )


మగువ కళ్ళు విరిసే మనసున పువ్వులు 
ఎగసి పడిన చూపు మనసు ఎదను  దోచె 
తలపులు వీడవు తగువులు తీరవు     
చిరుహాస పిలుపుకు చింత వాల్చె 
మదిలో కలవరింత మనుగడ కొరకునే  
అనుచు జడలు యూపి  ఆశ చూపు 
ఎంతవారు అయిన ఏదిఅనక నుండు 
లోకముననె తీరు లొలకమ్ము      

ఆశ గమన మందు ఆరాధన గమన  
శక్తి యుక్తి పడచు శ్రద్ధ ఉండు
నడుము ఊపు జడల నడక కదలికలు  
మతియు పోయి వెంట మనసు నిజము 

--(())--
 




ప్రాంజలి ప్రభ - సీస పద్యం .అంతర్జాల పత్రిక 

రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
మనసును ఊరించిన మగువ (6 )


పలకుల  తేనెలు పరవశ మొసగును      
కళలన్ని చూపుల కనుల బట్టి  
కలయుట మెరుపులు కనుసైగ మాయలు  
ఆత్మ వంచన తృప్తిగా అలుక సాగు 
అధరమ్ము మధురిమ ఆనతి రుచియున్న 
మధనము కావ్యము మాయ చుండు 
ఊరువు చిక్కని ఊపుల వారును 
లేరని చెప్పుట లేని పలుకు 
 
ఆ:: మంచి మనసు తోటి మనముచేసినవన్ని
ప్రేమ విత్తు ఎదుగు ప్రేమ మన్యతలతొ 
పెరిగి పెన్నిధౌను ప్రియముగా మురిపించు  
అలక తీర్చ నిజము ఆదు కొనుట 

--(())--



ప్రాంజలి ప్రభ - సీస పద్యం .అంతర్జాల పత్రిక 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
మనసును ఊరించిన మగువ (7 )

   
చేతితో జడకుప్పె ఊపులు పెదవుల 
విరుపుల పావడా కదలికఁగను 
మగవారి గుండెలో మ్రోగును గంటలు 
ఉడుకుచు రక్తము ఎగసి పడును 
కాళ్లకు గజ్జల పట్టాలు చాపుతూ 
పరికిణీ పైపైకి కులుకు లాగు 
కల్లప్ప గించియు చూసియు పెదవుల 
తడిని తుడుపుటకు ఊట ఊరె 

చిరునగవుతొ పిలుపు మనసున చేరియు 

కల్సి కల్వ నీక కధలు చెప్పి 
తరుణ మంత కాల యాపన చేసియు 
ఉద్ద రించు ననుట శుద్ధ నిజము 

--(())--


Mona Biswarupa Mohanty (@monnerisms) • Instagram photos and videos

ప్రాంజలి ప్రభ - సీస పద్యం .అంతర్జాల పత్రిక 

రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
మనసును ఊరించిన మగువ (9 )

ఆమె పలుకులు స్వరార్చన లాగున

తాళము వేసియు మనసు దోచె
ఆమెతడి సుగంధము హృదయము తాకింది
గొంతులో  తడిఊరి తపన పెరిగె
హద్దులు చెరిపియు తమకము పెరిగియు
చిరు నవ్వు తో మది దోచె సృతియు
ఆరని పెదవుల తహతహ వెంటాడి 
విరిసిన కమలమై వలపు చూపె


ఆటవెలది 

విశ్వ తరుణి అయిన మగవాని మహిమయే
సుఖము సౌఖ్య మిచ్చు మగని రూపు
తరుణి మనసు పొందు ఆబ్రహ్మ తరముయే
కాదు ఓర్పు కలిగి సేవ చేయు

--(())--



ప్రాంజలి ప్రభ - సీస పద్యం .అంతర్జాల పత్రిక 

రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
మనసును ఊరించిన మగువ (10 )

నెచ్చెలి నగవులు నిదురను నీయవు 
మచ్చిక చేయుట మగని మదియు 
వచ్చిన మగువను తక్కువ చేయక 
ఇష్టము తీర్చియు వినయ పలుకు 
పచ్చని చేనుకు పండగే వర్షము
కురిసియు పుత్తడి నేలపైన 
వెచ్చని కౌగిలి వేకువ జామున 
సంబర మనుచు మరులను గొలుపు   

అంతయును తొందరను చూపి చివర మునక 

వేయ మనిన భయమనుచు అనుట ఏల
కలువ పువ్వు అందమును పొందుటయు తెలివి 
ముసుగు తన్నియు కళలున్న  లాభ మేమి 

--(())--


Indian girl.

ప్రాంజలి ప్రభ - సీస పద్యం .అంతర్జాల పత్రిక 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
మనసును ఊరించిన మగువ (11 )

రాసిన వన్ని అదేంటో మధు కబుర్లు  
లేఖగా తెలిపాను బతుకు కొరకు 
పాడిన వన్ని అదేంటో విరహ గీత  
మవు తున్న పట్టించు కోరు వారు 
దిక్కుతో చని పరిస్థితి నందు నీవుయే 
నాకుదిక్కు అనియు తలచి చేరు 
యే౦త్రాగిన మనసు అదేంటో అటుగానె 
మధువుగా మారింది ఎవరి కొరకు 

ప్రేమ పిచ్చిది ఒకసారి నిన్ను చేరి 
జీవి తాంతము మనసును మధన పరచు 
కధలు తెలిపియు ఆశయ మంత తెలుపు
ఒట్టు గట్టుమీదను పెట్టి బతుకు ఆట 

--(())--



Radha is the daughter of Maharaja Vrishabhanu. She is very peaceful and lovely…

ప్రాంజలి ప్రభ - సీస పద్యం .అంతర్జాల పత్రిక 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
మనసును ఊరించిన మగువ (12 )

నెచ్చెలి నగవులు నిదుర నీయవుగాని  
నచ్చిన ప్రేమను వదలలేను  
పచ్చని జంటగ మారుట ఓర్పుతో 
సమయమంతను వేచె నీపలుకుకు         
ఐచ్ఛిక సుఖములు వెంటను పడకయు 
మచ్చిక చేయుట యేను మలుపు 
విచ్చిన పున్నమి వెన్నెల ఇకనాకు 
మనసును చేరియు మగువ పంచు 

   

ఆటవెలది
ప్రేమ ఎంత ఘాటు పొందుటే ముందుగా 
విస్వ మంత ప్రేమ మయము కలుగు 
అక్క చెల్లి అన్న తమ్ముల ప్రేమయు 
కట్టు కున్న భార్య ప్రేమ మిన్న   


--(())--


Shg
ప్రాంజలి ప్రభ - సీస పద్యం .అంతర్జాల పత్రిక 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
మనసును ఊరించిన మగువ (11 )

చెణుకులు విసరుచు చిలిపిగ జూచేటి 
మగువమా యలకును చిక్క కుండ 
కనగ లేనేలనో కలనొక టయినను 
పడుచు అందమును నే పాలక కుండ 
మనమున నిలిచిన మగువ రూ పమదిన 
మొకసారి అయినను తలప కుండ  
కనుల నే మూసినా తెరిచినా పడతియే 
మదనాన్ని పెంచుట ఎందు కయ్య  
                                                                     

"తేటగీతి" మాకు  చెప్పవయ్యా గోపాల కృష్ణ 


కళలు తీర్చేటి కరుణ చూ పేటి కృష్ణ

కనులు మూయకు లొంగాము బాల కృష్ణ 
చెలిమి చూపుచు, ఆదుకో, ముద్దు కృష్ణ  
కలువ పువ్వుల కళ్ళతో మమ్ము చూడు

హి కృష్ణ, ముకుంద, గోపాల, గోవిందా. 
శరణు ... శరణు   ... శరణు 

--(())--

సూర్య  తాపమొంది సుడిగాలు లేర్పడు 
ధరణి పైని గాలి తరాల పైకి 
భూమి కంప మందు భూకంపమై పోల్చు 

ప్రేమ శక్తి తరుణి సహకరమ్ము 

ప్రాంజలి ప్రభ అంర్జాల పత్రికను ఆదరిస్తున్న అందరికి కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలియపరుస్తున్నాను " మనసును ఊరించిన మగువ " లలిత్ శృంగారం అనే అంశంతో సీస పధ్యాలు పొందు పరిచాను ... ఎందరో మహాను బావులు అందరికీ వందనమ్ములు ... 
 తప్పులు ఉంటే క్షమించ గలరు ...  మీ అభిమానమే.. నాకు కాలము ... మీ ప్రోత్సాహమే  నాకు ఉత్సాహము ....  చదవండి .... చదవమని చెప్పండి 

ఇట్లు మీ విధేయుడు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ, విశ్రాంతి అకౌంట్స్ ఆఫీసర్
    
.... ... ...

 


ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
సీసా పద్యము... నవ్వులు

నువ్వుల హృదయము నవనీత మయము గా
మారియు ప్రేరణతో ను ఉండు

నవ్వుల వల్లనే ఆరోగ్య మంతయు
మార్పులు చేర్పులు జరుగు చుండు
సంభాషణల మధ్య జరిగే టి విషయము
విన్నను నవ్వులు వచ్చి తీరు
వింత వేషము చూసి మనసును ఉంచక
వేంటనే తెల్పి యు నవ్వు చుండు

ఆటవెలది
చెప్పి నంత మాట నవ్వులు విరజిమ్మి
హాయి బతుకు వెల్ల బుచ్చు చుండు
చెప్ప లేని మాట విన్న ను చెప్పుతూ
హాస్య మంత కుమ్మరించి ఉండే
.../...


ప్రాంజలి ప్రభ సీస పధ్యాలు
అందాన్ని వర్ణించు శక్తియు బ్రహ్మకు
కష్టము వచ్చిన వివర ణిచ్చె
మానవ మాతృల కు స్త్రీని హావభా
వములను అవయవ సౌష్టు వమ్ము
విన్యాస వాక్చాతుర్యమును శీలమూ
మనసును వయసును తెల్ప లేము
మూర్తీభ వించిన తరుణిని పొందుట
మగవాని గౌరవ సంపదయును
తేటగీతి
జీవి తంలొ ప్రేమ ను పొంది పంచు శక్తి
మాన వులకును గుణమును ఇచ్చు ఏలు
సంప దను అంద చేసియు మనసు పంచు
వనిత ధైర్యము బలము తెల్వి పంచు
***(())***





Ramachandra Rao Ponnam, Subbarao Venkata Kuncham మరియు మరో 1 వ్యక్తి

అందరికీ శుభాకాంక్షలు ... గురుతుల్యులందరికీ  నమస్తే నమో నమ:

--(())--
Looking for blouse designs to wear with your plain sarees? Here are 30 creative designer blouse models you can wear with your plain sarees!

ప్రాంజలి ప్రభ - సీస పద్యం .అంతర్జాల పత్రిక 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
మనసును ఊరించిన మగువ (13 )

చెప్పను చెప్పుటకు అవకాశమును నే 
ఇవ్వక హృదయము మూగ పోయె 
చెప్పినా కోపము వచ్చియు మాటలు 
లేనట్టి మౌనము కమ్ము చుండు 
ఒప్పిన నచ్చక చేదుగా ఉండుట 
సహజము అప్పుడు భాద తప్ప 
ప్రేమను తెలిపియు మృదువుగా తెల్పినా 
స్నేహము చెడునేమో ఏమి చేసె 

ఉన్న విషయము ప్రేయసికియును చెప్ప 
లేక మొనము వెంటను ఉండు చున్న 
ఏది ఏమైన బతుకుట కొరకు చెప్ప 
వలెను గుండెలో ఉన్నట్టి ప్రేమ నంత 

--(())--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి