21, ఆగస్టు 2020, శుక్రవారం

పాక శాస్త్ర ప్రభ


ఓం  రామ్ ... శ్రీ మాత్రేనమ: . . శ్రీ కృష్ణాయనమ:  
పాక శాస్త్ర ప్రభ 

ఆరోగ్య పరం గా " తమలపాకు " ఉపయోగాలు  (1) 

తమలపాకులను పూజ చేయునప్పుడు దేవునిముందు వుంచు కలశములో ఉంచుతారు.

తాంబూలములో ఉపయోగిస్తారు. భోజనానంతరం తాంబూల సేవనము మన సంప్రదాయం.

తమలపాకుల రసమును గొంతునొప్పి నివారణకు ఉపయోగిస్తారు.

శ్వాసకోశ వ్యాధుల నివారణకై ఈ ఆకులను నూనె రాసి కొద్దిగా వేడిచేసి ఛాతీపై ఉంచుతారు.

తమలపాకులకు నేయి రాసి గాయాలకు కట్టుకడతారు.

తమలపాకుల రసమును చెవిలో పిండిన చెవినొప్పి తగ్గిపోవును.
అపస్మారకమును నివారించుటకు తమలపాకుల రసమును పాలతో కలిపి త్రాగించెదరు.
ఆరోగ్యపరమైనవి

ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను పక్కన పెడితే, శరీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగకరమైనది. ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్. సి.విటమిన్ లు తమలపాకులో పుష్కలంగా వున్నాయి. తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఫైబర్ - అంటే పీచు పదార్ధం తమలపాకులో చాలా ఎక్కువగా వుంటుంది. ఆకుకూరలు ఏవిధంగా అయితే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు కూడా అలాగే, అంతకంటే ఎక్కువగా పని చేస్తాయి. సున్నం, వాక్క తదితర కృత్రిమ పదార్థాలను చేరిస్తే మాత్రం తమలపాకు శరీరానికి హానికరంగా మారుతుందని గ్రహించాలి.

తమలపాకు యాంటాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అంటే ముసలితనపు మార్పులను కట్టడి చేస్తుందన్నమాట.

నూనెలూ ఇతర తైల పదార్థాలూ ఆక్సీకరణానికి గురై చెడిపోవడాన్ని ‘ర్యాన్సిడిటి’ అంటారు. తమలపాకు ఈ ప్రక్రియను అడ్డుకుంటుంది- తైల పదార్థాలు చెడిపోవడానికి గురికాకుండా ఉంచుతుంది. నువ్వుల నూనె, ఆవనూనె, పొద్దుతిరుగుడు నూనె, వేరుశనగ నూనె... ఇలాంటి నూనెలు చెడిపోకుండా వుండాలంటే వాటిల్లో తమలపాకులను వేసి నిల్వచేయండి.

తమలపాకులో ‘చెవికాల్’ అనే పదార్థం ఉంటుంది. ఇది బ్యాక్టీరియా పెరుగుదలను కట్టడి చేస్తుందని పరిశోధన.

తమలపాకులో ఉండే స్థిర తైలం (ఎసెంషియల్ ఆయిల్) ఫంగస్ మీద వ్యతిరేకంగా పనిచేసి, అదుపులో ఉంచినట్లు పరిశోధనల్లో తేలింది.

ఒక ముఖ్య విషయం. తమలపాకును తొడిమతో సహా తింటే మహిళల్లో వంధ్యత్వం వచ్చే అవకాశం ఉంటుందని పరిశోధకులు గమనించారు. కాబట్టి సంతానంకోసం ప్రయత్నించేవారు తమలపాకును తొడిమ తొలగించి వాడుకోవాలి.

తమలపాకు ఔషధం లాంటిది. ఔషధాల మాదిరిగానే దీనినీ పరిమితంగానే వాడుకోవాలి. ఈ సందర్భంగా తమలపాకు నేపథ్యంగా జరిగిన ఒక అధ్యయనం గురించి ప్రస్తావించాలి. రోజుకు 5-10 తమలపాకులను 2 ఏళ్లపాటు తినేవారు తమలపాకులకు డ్రగ్స్ మాదిరిగా బానిసలవుతారని ఇటీవల జరిగిన తాజా అధ్యయనంలో తేలింది.

అధిక రక్తపోటు కలిగినవారు తాంబూలాన్ని యధేచ్ఛగా వాడకూడదు- తాంబూలాన్ని తయారుచేసేటప్పుడు సున్నం కలుపుతారు కాబట్టి ఈ పదార్థం రక్తనాళాల మీద, రక్తసరఫరామీద వ్యతిరేక ప్రభావం చూపుతుంది.

తాంబూలానికి పొగాకును కలిపి తింటే ‘సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్’ వంటి ప్రమాదకరమైన నోటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్ అనేది నోటి క్యాన్సర్‌కి ముందు స్థితి.

తమలపాకు, సున్నం, వక్క... ఇవి మూడూ చక్కని కాంబినేషన్. సున్నంవల్ల ఆస్టియోపోరోసిస్ (ఎముకలు గుల్లబారటం) రాకుండా ఉంటుంది; తమలపాకు రసం సున్నంలోని క్యాల్షియంను శరీరాంతర్గత భాగాల్లోకి చేరవేస్తే తమలపాకుకు చేర్చి వక్కపొడి లాలాజలాన్ని విడుదలయ్యేలా చేసి అరుగుదలకు సహాయపడుతుంది.

ఔషధంగా తమలపాకుని వాడుకోదలిస్తే, రసం పిండి 1-2 చెంచాల మోతాదులో తీసుకోవాలి.

ప్రతిరోజూ 7 తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్దగా నూరి వేడి నీళ్లతో తీసుకుంటే బోధ వ్యాధిలో చక్కని ఫలితం కనిపిస్తుంది.

ప్రతిరోజూ రెండు నెలలపాటు ఒక తమలపాకును పది గ్రాముల మిరియం గింజలను కలిపి తిని వెంటనే చన్నీళ్లు తాగుతుంటే స్థూలకాయులు సన్నగా నాజూగ్గా తయారవుతారు.

స్వర్ణక్షీరి, విడంగాలు, ఇంగిలీకం, గంధకం, చక్రమర్ధ, చెంగల్వకోష్టు, సింధూరం వీటిని ఉమ్మెత్త ఆకులతోనూ, వేప చెట్టు బెరడుతోనూ, తమలపాకుతోనూ కలిపి ముద్దగా నూరి చర్మంమీద లేపనం చేస్తే ఎగ్జిమా, తామర, దురదలు వంటి చర్మవ్యాధుల్లో ఉపశమనం లభిస్తుంది.

తమలపాకు రసం, తేనె సమపాళ్లలో కలిపి కళ్లలో డ్రాప్స్‌గా వేసుకోవాలి. (వైద్య పర్యవేక్షణ అవసరం)

తమలపాకు రసం, తులసి రసం, అల్లం రసం, మిరియాలు పొడి, తేనెలను కలిపి నాకిస్తే పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గుతాయి.

చెవుల మీద తమలపాకులను వేసి కట్టుకుంటే తలలో చేరిన వాతం శాంతించి తల నొప్పి తగ్గుతుంది.

తమలపాకు రసాన్ని పాలతో కలిపి తీసుకుంటే మహిళల్లో కనిపించే పిశాచ బాధలు, క్షణికావేశాలు తగ్గుతాయి.

తమలపాకు రసాన్ని రెండు కళ్లల్లోనూ చుక్కలుగా వేస్తే రేచీకటి సమస్య తగ్గుతుంది. (వైద్య పర్యవేక్షణ అవసరం)

గుండె అపసవ్యంగా, అపక్రమంగా కొట్టుకుంటున్నప్పుడు తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదుగా తాగుతుంటే హితకరంగా ఉంటుంది.

తమలపాకు షర్బత్‌ని తాగితే గుండె బలహీనత తగ్గుతుంది. కఫం, మందాగ్ని దూరమవుతాయి.

ఏ కారణం చేతనైనా పసిపాపాయికి పాలివ్వలేకపోతే రొమ్ముల్లో పాలు నిలిచిపోయి గడ్డలుగా తయారై నొప్పిని కలిగిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో తమలపాకు కొద్దిగా వేడిచేసి స్తనాలమీద కట్టుకుంటే వాపు తగ్గి ఉపశమనం లభిస్తుంది.

చిన్న పిల్లలకు చీటికిమాటికి జలుబు చేసి ఇబ్బంది పెడుతున్నప్పుడు తమలపాకును వేడిచేసి, కొద్దిగా ఆముదాన్ని రాసి, ఛాతిమీద వేసి కడితే హితకరంగా ఉంటుంది.

తమలపాకు కాండంను (కులంజన్), అతిమధురం చెక్కను నూరి తేనెతో కలిపి తీసుకుంటే ఇన్‌ఫెక్షన్‌తో కూడిన జలుబు (దుష్టప్రతిస్యాయం) తగ్గుతుంది.

పాటలు పాడేవారు, ఉపన్యాసాలను ఇచ్చేవారు తమలపాకు చెట్టు కాండాన్ని చిన్న ముక్క తీసుకొని బుగ్గనుంచుకొని చప్పరిస్తుంటే అమితమైన ప్రయోజనం కనిపిస్తుంది. చక్కని శ్రావ్యమైన కంఠం వస్తుంది.

హిస్టీరియాలో కంఠం పూడుకుపోయి మాట పెగలకపోతే తమలపాకు రసం తీసుకుంటే కంఠం పెగులుతుంది. మాట స్పష్టతను సంతరించుకుంటుంది. కఫం తెగి వెలుపలకు వచ్చేస్తుంది. 2-5 తమలపాకులను వేడి నీళ్లకు కలిపి మరిగించి పుక్కిటపడితే కూడా హితకరంగా ఉంటుంది.

తమలపాకును తింటే శ్లేష్మం కరిగి పెద్ద మొత్తాల్లో స్రవిస్తుంది. దీంతో అరుగుదల తేలికగా జరుగుతుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. తిన్న వెంటనే ఆయాసం రాకుండా ఉంటుంది. మాటలో స్పష్టత వస్తుంది. అలాగే చెడు వానలు కురిసే రోజుల్లో, జలవాయు కాలుష్యాలవల్ల చెడిపోయిన ఆహారాన్ని ఇది శుద్ధపరుస్తుంది.

తమలపాకును తినడంవల్ల లాలాజలం విడుదలై దప్పిక తీవ్రత తగ్గుతుంది.

తమలపాకు తొడిమకు ఆముదం రాసి చిన్న పిల్లల్లో మల ద్వారంలోనికి చొప్పిస్తే మలనిర్హరణ జరుగుతుంది. (వైద్య పర్యవేక్షణ అవసరం)

తమలపాకును కడుపులోపలకు తీసుకుంటుంటే ఎరక్టైల్ డిస్‌ఫంక్షన్ (అంగ స్థంభన ) ఇబ్బంది పెట్టదు. తమలపాకు రసాన్ని బాహ్యంగా కూడాప్రయోగించవచ్చు.

తమలపాకు షర్బత్‌ని తీసుకుంటే బలహీనత దూరమవుతుంది.

తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదులో మూడుపూటలా మిరియం పొడి కలిపి తీసుకుంటుంటే జ్వరం తగ్గుతుంది.

తమలపాకును వేడిచేసి వాపు, నొప్పి కలిగిన కీలు మీద కడితే నొప్పి తగ్గుతుంది.

మొండి వ్రణం త్వరితగతిన మానాలంటే వ్రణంమీద తమలపాకును అమర్చి కట్టుకట్టుకోవాలి.

తమలపాకు రసాన్ని ముక్కులో డ్రాప్స్‌గా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.

తమలపాకు ముద్దను తలకు పట్టించి గంటసేపు ఆగి తల స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.
--(())--

*వెన్ పొంగల్*  (2) 

తమిళియన్స్ చేస్తారట.పదేళ్ళక్రితం మా పక్కావిడ చెప్తే,అప్పట్నించీ నేనూ చేస్తుంటా.మీకుకూడా తెలిసేఉంటుంది.

సులువుగా ,తక్కువ సమయంలో తయారయేది,రుచిగా , అరుగుదలకూ తేలికగా..

పూజలప్పుడు చిత్రాన్నాలలో ఒకటిగా, వారం,పదిరోజులకు చేస్తుంటా.


ఒకగ్లాసు బియ్యానికి .ముప్పావుగ్లాసు(సగంపైగా) పెసరపప్పు ,,సన్నసెగమీద వేపి ఉంచుకోవాలి.


కాస్త చల్లారాక కడిగి కుక్కర్ లో చెమ్చాడు జీలకర్ర , ఏడెనిమిది మిరియాలు ,కాస్త పసుపు.రుచిప్రకారం ఉప్పు వేసి ఉడికించుకోవాలి.

నాలుగైదుగ్లాసుల నీరుపోసి.నాలుగు విజిల్స్ వేయిస్తే.,ముద్దగా ఉడికి,బాగుంటుంది.

కుక్కర్ చల్లారాక కాస్త పెద్దమూకుట్లో నెయ్యివేసి.. జీడిపప్పు, అల్లం.పచ్చిమిర్చి ముక్కలు ,అల్లం, కరివేపాకు పోపు వేసి...వేగాక ఈ పొంగలి పోసి..బాగా కలిపి..ఉప్పు సారిచూసి,సర్వ్ చెయ్యడమే.

పొద్దున్న టిఫిన్ కి.మధ్యాహ్నానికి భోజనంలోకి కూడా బాగుంటుంది.వేడివేడిగా ..మరికాస్త నెయ్యి వేసుకుని తింటే స్వర్గమే..

--(())--

• పనస బిర్యానీ ... 3 

* కావలసిన పదార్థాలు

పండని పనసకాయ ముక్కలు- 6 కప్పులు, బాస్మతి బియ్యం- 4 కప్పులు, లవంగాలు- 5, యాలకులు- 3, దాల్చిన చెక్క- 1 (పెద్దది), బిర్యానీ ఆకులు- 3, ఉల్లిపాయ తరుగు- 1/2 కప్పు, కొత్తిమీర తరుగు- 2 టేబుల్‌ స్పూన్లు, పుదీనా తరుగు- 2 టేబుల్‌ స్పూన్లు, నెయ్యి- 1 టేబుల్‌ స్పూను, నూనె- 4 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు- రుచికి సరిపడా, నీళ్ళు- 12 కప్పులు, పెరుగు- 1/2 కప్పు, పచ్చి మిర్చి పేస్ట్‌- 1 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్‌- 1 టేబుల్‌ స్పూను, పసుపు- 1 టీ స్పూను, దనియాల పొడి- 1 టీ స్పూను, నిమ్మ రసం- 1 టేబుల్‌ స్పూన్‌, బిర్యానీ మసాలా- ఒకటిన్నర టీ స్పూను

* తయారీ విధానం

ఆరు కప్పుల నీళ్ళు మరిగించి, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, బియ్యం వేసి ఉడికించి కాస్త పలుకుగా ఉన్నప్పుడే దింపేసి నీళ్ళు వార్చేయాలి. మరో ఆరు కప్పుల నీళ్ళలో పనస ముక్కలు, 1/2 టీ స్పూను పసుపు, ఒక టీ స్పూను ఉప్పు వేసి పదినిమిషాలు ఉడికించాలి. నీళ్ళు వంపేసి ముక్కలకు పెరుగు, నిమ్మరసం, పచ్చిమిర్చి పేస్టు, దనియాల పొడి, పసుపు, టీ స్పూను ఉప్పు, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ మసాలా పట్టించి అరగంట నానబెట్టాలి. ఒక గిన్నెలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలను వేగించి తీసి పక్కన పెట్టాలి. ఆ నూనెలోనే అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేగించి పనస ముక్కల మిశ్రమాన్ని కూడా వేసి రెండు నిమిషాలు వేగించాలి. తరువాత ఒక మందపాటి పాత్రలో ఒక పొర అన్నం, ఒక పొర పనస ముక్కలు వేస్తూ మొత్తం సర్ధి ఆవిరి పోకుండా మూత పెట్టి, అరగంట సిమ్‌లో ఉడికించాలి. చివర్లో, వేగించిన ఉల్లిపాయ ముక్కల్ని జల్లాలి.

" రామాఫలం , సీతాఫలం , లక్ష్మణఫలం " (4)

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది. సీజన్‌ వస్తోందంటే చాలు... కొన్ని పండ్ల రుచి పదే పదే గుర్తొచ్చేస్తుంటుంది. మార్కెట్లో అవి ఎప్పుడెప్పుడు కనిపిస్తాయా అన్నట్లు ఎదురుచూసేలా చేస్తుంది.

 ఆ కోవకే చెందుతాయి సీతాఫలం, రామాఫలం, లక్ష్మణఫలాలు. ఈపేర్లు చూస్తే మన పురాణ పురుషులకు ఇష్టమైన పండ్లేవో అనిపించకమానదు. అంతేకాదు, ఇవి అచ్చంగా మనకి మాత్రమే ప్రత్యేకమైన పండ్లేనేవో అనిపిస్తుంది. కానీ వీటి స్వస్థలం మనదేశం కాదు. దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికన్‌ దేశాల్లో పెరిగే ఈ వెుక్కల్ని మనదేశానికి తొలిసారిగా పోర్చుగీసువాళ్లు పదహారో శతాబ్దంలో తీసుకొచ్చారట. ఆ తరవాత వీటికా పేర్లు ఎవరు పెట్టారో తెలియదుకానీ మనందరికీ ఇష్టమైన రాముడు, సీత, లక్ష్మణ పేర్లు పెట్టేసి తమ భక్తిని చాటుకున్నారు. మనరాష్ట్రంలో ఎక్కువగా పండే సీతాఫలాలతోనే మనకి అనుబంధం ఎక్కువ. కానీ ఉత్తరాంధ్ర, కొన్ని తెలంగాణా జిల్లాల్లోనూ కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోనూ రామాఫలాలు, లక్ష్మణఫలాలు ఎక్కువగా పండుతాయి. సూపర్‌మార్కెట్ల పుణ్యమా అని ఇప్పుడిప్పుడు ఇవి అన్ని మార్కెట్లిలోనూ కనిపిస్తున్నాయి. రామాఫలం : గుండ్రంగా హృదయాకారంలో ఎరుపురంగులో ఉండే ఈ పండ్ల తొక్క సీతాఫలంకన్నా నునుపుగా ఉంటుంది. దీన్ని నెట్టెడ్‌ కస్టర్డ్‌ యాపిల్‌, బుల్లక్‌ హార్ట్‌, బుల్‌ హార్ట్‌ అని కూడా పిలుస్తారు. తియ్యని వాసనతో మధురమైన రుచిని కలిగి ఉండే ఈ పండు మధ్య అమెరికా, ఐరోపా దేశాల్లో ఎక్కువగా పండుతుంది. సీతాఫలంతో పోలిస్తే ఇందులో గింజలు తక్కువ. అలసిన శరీరాన్ని ఉత్తేజితం చేస్తుంది ఈ జ్యూస్‌. మిగిలినవాటితో పోలిస్తే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. మలేరియా, క్యాన్సర్‌ వ్యాధులకు కారణమైన కణాలను నివారించే గుణం కూడా ఈ పండుకి ఎక్కువే. పోషకాలు: వంద గ్రా. రామాఫలం నుంచి 75 క్యాలరీల శక్తి, 17.7గ్రా. కార్బొహైడ్రేట్లు, 1.5గ్రా. ప్రొటీన్లు, 3గ్రా. పీచూ లభ్యమవుతాయి. మిగిలినవాటితో పోలిస్తే ఇందులో విటమిన్ల శాతం ఎక్కువ. సి- విటమిన్‌తో పాటు బి-కాంప్లెక్స్‌లోని పైరిడాక్సిన్‌ ఇందులో సమృద్ధిగా ఉంటుంది. ఈ పైరిడాక్సిన్‌ మెదడు కణాలకు అవసరమైన రసాయనాల్ని స్థిరంగా ఉంచేందుకు దోహదపడుతుంది. నరాల వ్యాధులు, తలనొప్పి వంటివి రాకుండా కాపాడేందుకు తోడ్పడుతుంది. 

--((**))--

" దబ్బ పండు " (5) 

దబ్బపండుని చూడక్కరలేదు... ఆ పేరు వింటేనే నాలుక పులుపెక్కుతుంది. అందుకే దాన్ని మనం పచ్చడికే పరిమితం చేసేశాం. లేదంటే పులిహోర చేస్తాం. 

పంపర పనస, నారింజ పండ్ల మధ్య సహజంగా జరిగిన సంకరీకరణ ద్వారా పుట్టినదే దబ్బపండు. అందుకేనేమో... ఇది ఒకలాంటి వగరుతో కూడిన తీపీ పులుపూ రుచులతో ఉంటుంది. 

లాభాలు :

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ. అందుకే ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణుల అంటారు .

* వందగ్రాముల గుజ్జులో 42 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కానీ పీచు శాతం మాత్రం చాలా ఎక్కువ. ఈ పీచు క్యాన్సర్‌కు కారణమైన రసాయనాల్ని పీల్చేస్తుంది. ఇంకా కొలెస్ట్రాల్‌ తగ్గేందుకూ సహకరిస్తుంది.

* ఇందులో విటమిన్‌-ఎ సమృద్ధిగా దొరుకుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే నారింజనిన్‌, నారింజిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి వూపిరితిత్తుల క్యాన్సర్‌, నోటి క్యాన్సర్లు రాకుండా కాపాడతాయి. వీటితోపాటు, లైకోపిన్‌, బీటా కెరోటిన్‌, క్సాంథిన్‌, ల్యూటిన్‌... వంటి ఫ్లేవొనాయిడ్‌లూ ఎక్కువే. అందుకే దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటిచూపూ మెరుగుపడుతుంది.

*సి-విటమిన్‌ కూడా పుష్కలంగా ఉంటుంది. సహజమైన ఈ యాంటీ ఆక్సిడెంట్‌ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

* ఎరుపురంగులో ఉండే గ్రేప్‌ ఫ్రూట్‌లో లైకోపిన్‌ ఉండటంవల్ల ఇది చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడటంతోబాటు ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ నుంచీ రక్షిస్తుంది. ఇతర కెరోటినాయిడ్లతో పోలిస్తే క్యాన్సర్‌ కారక ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తి లైకోపీన్‌కే ఎక్కువ.

* లిమోనాయిడ్లూ గ్లూకారేట్లూ కూడా ఇందులో ఎక్కువ. ఇవి రొమ్ముక్యాన్సర్లూ ట్యూమర్లూ రాకుండా కాపాడతాయి.

* ఇందులోని నారింజనిన్‌ అనే ఫ్లేవొనాయిడ్‌ దెబ్బతిన్న డి.ఎన్‌.ఎ.ను సైతం బాగుచేస్తుందట.

* ఇందులో కాల్షియం, ఐరన్‌, కాపర్‌, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజాలతోపాటు కొద్దిపాళ్లలో బి-కాంప్లెక్స్‌ విటమిన్లు కూడా ఉంటాయి. ఇది వూబకాయాన్ని నివారించేందుకు దోహదపడుతుందని పరిశోధకులు నిర్ధరించారు.
--(())--

" నేరేడు పండ్లు " (6) 

సంపూర్ణ ఆరోగ్యం కోసం.. ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారపదార్థాలు ఎంచుకుంటే చాలు. అలాంటి పండ్లలో నేరేడు ఒకటి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని.. అనారోగ్యాల నివారణి. నేరేడు శక్తి నందించి.. ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు.. కొన్నిరకాల రోగాలనూ నియంత్రించే శక్తి నేరేడు సొంతం. ఒక్క పండే కాదు.. ఆకులు.. బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆక్సాలిక్‌ టాన్మిక్‌ ఆమ్లం, విటమిన్లు, క్రోమియం.. వంటివి నేరేడులో పుష్కలం. సిజిజియం క్యుమిన్‌ దీని శాస్త్రీయ నామము . 

జిగట విరేచనాలతో బాధపడే వారికి నేరేడు పండ్ల రసాన్ని రెండు నుంచి మూడు చెంచాల చొప్పున ఇవ్వాలి. రోగికి శక్తితోపాటు పేగుల కదలికలు నియంత్రణలో ఉంటాయి. 

కాలేయం పనితీరు క్రమబద్ధీకరించడానికి లేదా శుభ్రపరచడానికి నేరేడు దివ్యౌషధంలా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. 

ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి. 

జ్వరంగా ఉన్నపుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే.. శరీర తాపం తగ్గుతుంది. 

పిండి పదార్థాలు, కొవ్వు భయం ఉండదు కాబట్టి.. అధిక బరువు ఉన్నవారు.. మధుమేహ రోగులు సైతం వీటిని రోజుకు ఆరు నుంచి ఎనిమిది దాకా తినవచ్చు. 

బ్యాక్టీరియల్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. ఆకుల్ని దంచి కషాయంగా కాచి పుక్కిలిస్తే దంతాలు కదలడం.. చిగుళ్ల వాపులు, పుండ్లు వంటివి త్వరగా తగ్గుతాయి. ఆకులను నమిలి నీళ్లతో పుక్కిలించి ఉమ్మి వేస్తుంటే.. నోటి దుర్వాసన తగ్గుతుంది. నేరేడు అరగడానికి ఎక్కువసమయం పడుతుంది కాబట్టి.. ఉప్పు వేసి అప్పుడప్పుడు తీసుకోవాలి. భోజనమైన గంట తరవాత ఈ పండ్లు తీసుకుంటే.. ఆహారం జీర్ణమవుతుంది. అధికంగా తీసుకుంటే.. మలబద్ధకం సమస్యతోపాటు.. నోట్లో వెగటుగా ఉంటుంది. విరుగుడు: ఉప్పు, వేడినీరు. పోషకాలు (వందగ్రాముల్లో) 

వేడి ప్రభావానికి కడుపులో గ్యాస్‌ చేరి ఏం తిన్నా అరగనట్లుగా అనిపిస్తుంది. ఒక్కోసారి వాంతి చేసుకోవాలన్న భావన కూడా కలుగుతుంది. ఇలాంటప్పుడు నాలుగైదు నేరేడు పళ్లను తింటే ఉపశమనం కలుగుతుంది. జీర్ణశక్తిని పెంపొందించడమే కాకుండా ఒంట్లోని వేడినీ తగ్గిస్తుంది. 

నేరేడు పండ్లలో అధికమోతాదులో సోడియ, పొటాషియం, క్యాల్షియం, ఫాస్ఫరస్‌, మంగనీస్‌, జింక్‌, ఇరన్‌, విటమిన్‌, సీ, ఎ రైబోప్లెవిన్‌, నికోటిన్‌ ఆమ్లం, కొలైన్‌, ఫోలిక్‌, మాలిక్‌ యాసిడ్లు తగిన లభిస్తాయి. దానిలోని ఇనుము శరీరంలో ఎర్ర రక్తకణాలను వృద్ధి చేస్తుంది. 
--((**))--
పాలకూర - 7 

పక్షవాతం వచ్చే రిస్క్ ను నివారించే విషయం లో పాలకూర సమర్ధవంతం గా పనిచేస్తుందని చైనీస్ శాస్త్రవేత్తలు నిరూపించారు.పాలకూర లోని ఫోలిక్ యాసిడ్ వల్ల ఈ ప్రయోజనం జరుగుతుందని శాస్త్రజ్ఞులు తెలిపారు.మరీ ముఖ్యం గా హైపర్ టెన్షన్స్ వల్ల పక్షవాతం వచ్చే అవకాశాలను ఫోలిక్ యాసిడ్ నివారిస్తుందని ,పాలకూర లో ఇది పుష్కలం గా ఉంటుందని వారు పేర్కుంటున్నారు. హైబీపి ఉన్న 20702 మంది ఫై నిర్వహించిన ఆదధ్యయనం లో తేలింది.వీళ్ళంతా హైబీపి ని తగ్గించే ఎనాల్రపిల్ అనే మందును వాడుతున్న వారే.వీరికి మందు తో పాటు ఫోలిక్ యాసిడ్ ఎక్కువుగా ఉండే పాలకూరలు, ఇతర ఆకుకూరల కాంబినేషన్ ల లో ఆహారాన్ని అందించారు.అయితే క్రమం తప్పకుండా ఫోలిక్ యాసిడ్ ను తీసుకుంటున్న వారిలో స్ట్రోక్ వచ్చేందుకు అన్ని విధాల రిస్క్ ఉన్న వారే అయినప్పటికీ అవి వచ్చే అవకాశాలు 21 శాతం పడిపోయాయని అధ్యయన వేత్తలు గుర్తించారు.పైగా దీనితో పాటు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా గణనీయం గా తగ్గాయి.ఈ పరిశోధన ఫలితాలను . ద జర్నల్ ఆఫ్ ది అమెరికన్ అసోసియేషన్ ‘ అనే మెడికల్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి 
--((**))--

" అరటి పండును తినడం వలన కలిగే లాభాలు " (8)  

అరటిపండు . ఇది ఒక పేదవాడి ఆపిల్ అని చెప్పుకోవచ్చు. రేటు తక్కువ , పోషక విలువలు ఎక్కువ. ఈ పండు తినడం వలన తక్షణం శక్తి వస్తుంది. 

అన్ని కాలాలలో లభిస్తుంది. దీనిని మన జీవన విధానంలో చేర్చడం ద్వారా జీవక్రియలకు కావాల్సిన ఆంటి యాక్సిడెంట్స్, విటమిన్స్, 

మినరల్స్ పొందవచ్చు. 100 గ్రాముల అరటి పండులో... 90కాలరీల శక్తి, 10 గ్రాముల ఫైబర్, 12 గ్రాముల షుగర్ ఉంటాయి. జీవక్రియలకు ఉపయోగపడే పోషకాలు దీనిలో మెండుగా ఉంటాయి. అరటి పిల్లల ఎదుగుదలకు చక్కగా ఉపయోగపడుతుంది. దీనిలో విటమిన్ ఎ,బి, సి 

లు అత్యధికంగా ఉంటాయి. ఇందులో శరీరానికి హాని చేసే కొవ్వు ఉండదు.. పైగా అరటి నుంచి కావాల్సినంత కాల్షియం, ఐరన్ లభిస్తుంది. రక్త పోటును తగ్గించడంలో, గుండె పనితీరును మెరుగు చేయడంలో ఉపయోగపడే మూలకాలలో ఒకటైన పొటాషియం ఈ అరటి పండులో అత్యధికంగా ఉంటుంది. 

అరటి పండును తినడం వలన మన శరీరానికి క్రింది లాభాలు 

1. పొటాషియం: పొటాషియం అధికంగా లబించే వనరులలో అరటిపండును ప్రముఖంగా చెప్పవచ్చు. దీని వలన గుండె పని తీరు సక్రమంగా జరుగు తుంది. రక్త పోటును అదుపులో ఉంచుతుంది. అంటే కాకుండా దీని వలన కిడ్నీలు ఆరోగ్యం గా ఉంది కిడ్నీ లలో రాళ్ళు రాకుండా కాపాడుతుంది. 

2. అధిక శక్తి: అరటి పండును తినటం వలన తక్షణం అధిక శక్తి లబిస్తుంది. టెన్నిస్ ప్లేయర్స్, ఇతర క్రీడా కారులు ఆట ఆరంభానికి ముందు గాని, ఆట మధ్యలో గాని అరటి పండును తింటున్న దృశ్యాల్ని కొన్ని సందర్భాలలో మనం గమనించ వచ్చు. 

౩. జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది: రోజు వారి ఆహారం లో అరటి పండును తీసుకున్నచో జీర్ణ వ్యవస్థ సాఫీగా పని చేయును. పొట్టలో ఆల్సర్ వచ్చే అవకాశం ను తగ్గిస్తుంది. జీర్ణాశయం లో ఒక ప్రత్యేక మైన పొరను పెంపొందింప చేయుటకు అరటి తోడ్పడుతుంది. 

4, బి 6 విటమిన్ అధికం: అరటిలో బి విటమిన్ కూడా అధికంగా ఉంటుంది . ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తి చేయుటలో తోడ్పడుతుంది. రక్తంలో చక్కర నిల్వల స్థాయి నిర్వహణలో ఉపయోగ పడును. వ్యాది నిరోధక శక్తి పెరిగేట్లు చేయును. 

5, విటమిన్లు & ఖనిజాలు: .అరటిలో పొటాషియం తో అంతే కాకుండా విటమిన్ సి, మాంగనీస్ మరియు మెగ్నీషియం లు అధిక పాళ్ళలో ఉంటాయి. కొంత మొత్తం లో ఐరన్ , అయోడిన్, జింక్ లు కూడా ఉంటాయి. 

6. చర్మ సంరక్షణ: అరటి పండుతో పాటుగా తొక్క కూడా చర్మ సంరక్షణకు ఎంతో ఉపయోగ పడును. ముఖ్యంగా మంగు, సోరయాసిస్ వ్యాదుల తగ్గించుటకు పై పూతగా వాడవచ్చు. కొద్దిరోజులు నిత్యము వాడిన సోరయాసిస్ తగ్గు ముఖం పట్టే విషయంను మనం గమనించవచ్చును. 

7. క్యాన్సర్ పై యుద్ధం: అరటి పండు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఆ మధ్య కాలంలో జంతువులపై జరిపిన పరీక్షలలో ఈ విషయం జపాన్ లో నిరూపిoచబడినది. 

8. ఒత్తిడిని పోగొడుతుంది: ఒత్తిడిలో ఉన్నప్పుడు అరటిని తీసుకుంటే ఒత్తిడి మటుమాయం అవుతుంది. ఒత్తిడి ఉన్నటువంటి సమయాలలో దీన్ని మించిన అల్పాహారం లేదు. 

( చక్కర వ్యాది గ్రస్తులు " మధుమేహం " ఈ అరటిపండు తినరాదు అని డాక్టర్లు సలహా యివ్వటం జరిగింది ) 
--(())--

కీర దోసకాయ (9) 

ాగడంవల్ల మరింత ఎక్కువ పౌండ్ల బరువును తగ్గిస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గించడంకంటే ఆరోగ్యపరంగా కీర దోసకాయ యొక్క ప్రయోజనాలు ఎక్కువ. క్లియర్‌ స్కిన్‌, జీర్ణ సమస్యలను నివారించడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది. కాబట్టి మీరు హెల్దీగా, ఫిట్‌గా జీవించాలని కోరుకుంటున్నట్లయితే… కీరదోసకాయ వాటర్‌ తాగడంవల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఈ విషయం గురించి తెలుసుకోవాల్సిందే. ముందుగా కీరదోసకాయ పొట్టు తీసి, ముక్కలుగా కట్‌చేసి మిక్సిలోవేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. తరువాత ఒక పెద్ద బౌల్‌లో కీరదోసకాయ గుజ్జువేసి అందులో అరగ్లాసు నీళ్లుపోసి బాగామిక్స్‌ చేయాలి. కాగా రుచికోసం చిటికెడు ఉప్పును మిక్స్‌చేయాలి. ఇంకా ఉప్పుకు బదులుగా తేనె మిక్స్‌ చేసి ఉదయం పరగడుపున తీసుకోవాలి. శరీరాన్ని హైడ్రేషన్‌లో ఉంచుకుంది, కీరదోసకాయలో 90 శాతం నీరు ఉంటుంది. రోజంతా మీకు అవసరమయ్యే ఎనర్జీని ఈ జ్యూస్‌ అందిస్తుంది. కీరదోసకాయ శరీరాన్ని డిహైడ్రేషన్‌ చేస్తుంది. తగినంత నీరు తీసుకోలే నపుడు 90 శాతం నీరు ఉన్న ఒక చల్లటి కీరదోస కాయ తినండి. ఎక్కువ విటమిన్స్‌ అందిస్తుంది. శరీరానికి అవసరమయ్యే విటమిన్స్‌ను అందిస్తుంది. కీరదోసకాయ రోజువారీ కావాల్సిన విటమిన్లను తిరిగి నింపుతుంది. కుకుంబర్‌ రోజులో శరీరానికి కావాల్సిన చాలా విటమిన్లు ఉన్నాయి. మీ వ్యాధి నిరోధక వ్యవస్థను చురుకుగా ఉంచేందుకు, మీకు శక్తిని పెంచడానికి తోడ్పడే విటమిన్లు ఎ, బి, సి, డి పుష్కలంగా ఉన్నాయి. దోసకాయ రసంతో పాల కూర, క్యారట్‌ కలిపితే చాలా శక్తివంతంగా పని చేస్తుంది. కీరదోసకాయ జ్యూస్‌లో అత్యధికంగా మినరల్స్‌ ఉన్నాయి. ఈ మినరల్స్‌మీ శరీరం ఫిట్‌గా ఉండేందుకు సహాయపడతాయి. కాగా కీరదోస హైబిపిని కంట్రోల్‌ చేయగలదు.

ద్రాక్ష పండ్లు .. 10 

ద్రాక్ష పండ్లను ఎండబెట్టినప్పుడు, ఎండు ద్రాక్ష తయారవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తిఅయ్యే ద్రాక్షలో 80 శాతం పంటను వైన్ తయారీలో వాడుతారు. ఏడు శాతాన్ని ఎండు ద్రాక్షగా మలుస్తారు. మిగిలిన, శాతాన్ని మాత్రమే తాజాగా తినడానికి గాని జ్యూస్ తీసి వాడుకోవటానికి గాని వాడుతారు. మంచి పోషకాహర విలువలు కలిగి ఉం టాయి. కొన్ని రకాల వ్యాధులు సోకినప్పుడు ఇవి ఉత్తమ ఆహారంగా ఉపయోగ పడుతాయి సంతానం లేని స్త్రీలు కిస్‌మిస్ పండ్లు తింటే అండాశయములోని లోపాలు తొలగి సంతానము కలుగుతుంది. మహిళలు ప్రతిరోజూ కిస్‌మిస్ పండ్లు తినుటవలన యూరినల్‌లో ఆమోనియా పెరగకుండా రాళ్ళు చేరకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కిస్‌మిస్ పండ్లను తరుచుగా తినడం వలన శరీరములో పులుపును స్వీకరించే శక్తిగల ఆమ్లాలను సమానం చేసి జ్వరము రానీయకుండా చేస్తుంది. 200 మిల్లిగ్రాముల పాలతో 50 గ్రాముల కిస్‌మిస్ పండ్లు తినడం వలన నరాల నిస్సత్తువ, రక్తపోటు దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి. అలాగే రక్తం శుభ్రపడటానికి నరాలకు బలము చేకూరటానికి పది కిస్‌మిస్ పండ్లను నీళ్ళలోవేసి బాగా వుడకబెట్టి గుజ్జుగా వేసి తాగడం చేయాలని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. పిల్లలు రాత్రిపూట పక్క తడుపుతుంటే వారికి వారంపాటు ప్రతిరోజూ రాత్రిపూట రెండు ఎండు ద్రాక్ష పొలుకులను ఇవ్వండి. ఈ వారంలో వారికి చలవచేసే వస్తువులు, పెరుగు, మజ్జిగలాంటి పదార్థాలను ఇవ్వకండి. దీంతో పక్క తడిపే అలవాటునుంచి ఉపశమనం కలుగుతుంది గొంతు వ్యాధితో బాధపడేవారు ఎండు ద్రాక్షను తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది . ఎందుకంటే ఈ ఎండు ద్రాక్ష శరీరంలోని శ్వాసనాళికలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది. దీంతో ఉపశనం కలుగుతుంది మలబద్దకంతో బాధపడేవారు ప్రతిరోజూ రాత్రిపూట పడుకునేముందు ఎండుద్రాక్షతోబాటు సోంపును కలిపి తీసుకుంటే మలబద్దకంనుంచి ఉపశమనం కలుగుతుంది. ఎండు ద్రాక్షను బాగా వేడి చేసిన నీళ్ళలో నానబెట్టి తర్వాత పిల్లలకు ఇస్తే వారిలో జీర్ణశక్తి బాగా వృద్ధి అవుతుంది. కాకపోతే నానబెట్టే ముందు వీటిని పొడిగా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పండ్లలోని రసం నీటిలో బాగా కలిసి పోయి పిల్లలకు పోషకాలు అందుతా యి. వీటిల్లో ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తం లోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా చేరుతుంది. ఇవి రక్త హీనతకు మంచి మందుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా స్ర్తీల కు ఇది ఎంతో ఉపయోగం.



--(())--

1 కామెంట్‌: