25, ఆగస్టు 2020, మంగళవారం








ఆటవెలది లలితా సహస్ర నామ పద్యాలు 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

పెద్ధ హృదయ మున్న ఆరాధ్య దేవతయు
వేద పఠన మన్న ఆల కించు   
శ్లోకము లనిన గాత్ర మన్నను ఇష్టమే 
మంచి చేసి మనసు పంచు అమ్మ   ......   172

విశ్వ మంత ఉండి కన్నుల తోచూస్తు   
మనసు గమన ముంచి ధైర్య మిచ్చు 
గొప్ప మహిమ గలిగి నిర్మల హృదయము 
పంచి అసువు బాసి నట్టి తల్లి   ...... ..... 173

ఎడమ మార్గ దారి చూపెట్టు దేవత  
అంబరమ్ము కురులు  తాకు చుండు   
ఐదు శవము ల పాన్పు పైనను నిద్రించు 
త్యాగ ములను ఇష్ట పడునట్టి తల్లివి   ,,,  .... 174    

పంచ బ్రహ్మ లందరిలొ ఐదవది అమ్మ 
నింగి నేల  అగ్ని గాలి నీరు
శివుని మంత్ర ముగ్ధునిగ చేసి ఆనంద 
మోసగి ఇష్ట ముండు ధనము ఇచ్చు     ....175 




ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 85 / Sri Lalita Sahasranamavali - Meaning - 85 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 163.

త్రయీ త్రివర్గ నిలయా త్రిస్థా త్రిపురమాలినీ
నిరామయా నిరాలంబా స్వాత్మారామా సుధాసృతి:

869. త్రయీ : వేదస్వరూపిణి
870. త్రివర్గ నిలయా : ధర్మార్ధ కామములకు నిలయం ఐయ్నది
871. త్రిస్థా : మూడు విధములుగా ఉండునది
872. త్రిపురమాలినీ : త్రిపురములను మాలికగా ధరించినది
873. నిరామయా : ఏ బాధలూ లేనిది
874. నిరాలంబా : ఆలంబనము అవసరము లేనిది
875. స్వాత్మారామా : తన ఆత్మయందే ఆనందించునది
876. సుధాసృతి: : అమృతమును కురిపించునది 

🌻. శ్లోకం 164.

సంసారపంకనిర్మగ్న సముద్ధరణ పండితా
యఙ్ఞప్రియా యఙ్ఞకర్త్రీ యజమాన స్వరూపిణి

877. సంసారపంకనిర్మగ్న : సముద్ధరణపండితా సంసారము అను ఊబిలో కూరుకొనిపొయిన జనలను ఉద్ధరించుటకు సామర్ధ్యము కలిగినది. 
878. యఙ్ఞప్రియా : యఙ్ఞములయందు ప్రీతి కలిగినది
879. యఙ్ఞకర్త్రీ : యఙ్ఞము చేయునది
880. యజమానస్వరూపిణి  : యఙ్ఞము చేయువారి స్వరూపం తానై ఉన్నది. 

సశేషం... 

 🌹 🌹 🌹 🌹 :



లలితా సహస్త్ర నామాలు

స్తోత్రప్రియా, స్తుతిమతీ, శ్రుతిసంస్తుత వైభవా |
మనస్వినీ, మానవతీ, మహేశీ, మంగళాకృతిః || 172 ||

* స్తోత్ర ప్రియా - శ్లోకాలను ఇష్టపడే ఆమె,   * స్తుతిమతి - ఆమె శ్లోకాలు పాడేవారికి వరం ఇచ్చేది
 *   శ్రుతిసంస్తుత వైభవా  - వేదాలచే ఆరాధించబడే ఆమె,  * మనస్విని - స్థిరమైన మనస్సు ఉన్న ఆమె,  * మానవతి - పెద్ద హృదయం ఉన్న ఆమె,  * మహేశీ  - గొప్ప దేవత అయిన ఆమె
* మంగళా కృతి - మంచి మాత్రమే చేసే ఆమె

ఆటవెలది
పెద్ధ హృదయ మున్న ఆరాధ్య దేవతయు
వేద పఠన మున్న ఆల కించు  
శ్లోకము లనిన గాత్ర మన్నను ఇష్టమే
మంచి చేసి మనసు పంచు అమ్మ



వ్యోమకేశీ, విమానస్థా, వజ్రిణీ, వామకేశ్వరీ |
పంచయఙ్ఞప్రియా, పంచప్రేత మంచాధిశాయినీ || 174 ||

* వ్యోమకేశి - శివుడి భార్య అయిన ఆమె జుట్టుకు ఆకాశం ఉంది,  * విమానస్థా - అగ్రస్థానంలో ఉన్న ఆమె,   * వజ్రిణి- ఇంద్రుడి భార్యను ఒక భాగంగా కలిగి ఉన్న ఆమె,   * వామకేశ్వరీ - ఎడమ మార్గాన్ని అనుసరించే ప్రజల దేవత,   * పంచ యజ్ఞ ప్రియా - ఐదు త్యాగాలను ఇష్టపడే ఆమె
 * పంచప్రేత మంచాధిశాయిని - ఐదు శవాలతో చేసిన మంచం మీద నిద్రిస్తున్న ఆమె

ఆటవెలది
ఎడమ మార్గ దారి చూపెట్టు దేవత
అంబరమ్ము కురులు  తాకు చుండు 
ఐదు శవము ల పాన్పు పైనను నిద్రించు
త్యాగ ములను ఇష్ట పడునట్టి తల్లివి   

పంచమీ, పంచభూతేశీ, పంచ సంఖ్యోపచారిణీ |
శాశ్వతీ, శాశ్వతైశ్వర్యా, శర్మదా, శంభుమోహినీ || 175 ||

* పంచమి - సదాశివ భార్య అయిన ఆమె - పంచ బ్రహ్మాలలో ఐదవది,  * పంచ భూతేశి  - "భూమి, ఆకాశం, అగ్ని, గాలి, మరియు నీరు, పంచ భూతాలకు అధిపతి అయిన ఆమె." ,  *పంచ సంఖ్యోపచారిణీ- ఐదు ఉపచారములు ఇష్టపడే ఆమె,   * శాశ్వతి- శాశ్వత ఆమె
  * శాస్వతైశ్వర్య - శాశ్వత సంపదను ఇచ్చేది,  * శర్మదా - ఆనందం ఇచ్చే ఆమె
 * శంభుమోహిని - శివుడిని మంత్రముగ్ధులను చేసేది, మంత్రం ముగ్డు లుగను

పంచ బ్రహ్మ లందరిలొ ఐదవది అమ్మ
నింగి నేల  అగ్ని గాలి నీరు
శివుని మంత్ర ముగ్ధునిగ చేసి ఆనంద
మోసగి ఇష్ట ముండు ధనము ఇచ్చు     ....

🌼🌿శ్రీ మాత్రే నమః🌼🌿*
--(())--


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 93 / Sri Lalita Sahasranamavali - Meaning - 93 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 179.

దశముద్రాసమారాధ్యా త్రిపురా శ్రీవశంకరీ
ఙ్ఞానముద్రా ఙ్ఞానగమ్యా ఙ్ఞానఙ్ఞేయస్వరూపిణీ

977. దశముద్రాసమారాధ్యా : 
10 రకముల ముద్రలచే ఆరాధింపబదునది

978. త్రిపురా : 
త్రిపురసుందరీ

979. శ్రీవశంకరీ : 
సంపదలను వశము చేయునది

980. ఙ్ఞానముద్రా : 
బొతనవ్రేలును చూపుడు వ్రేలితో కలిపి మిగిలిన 3వ్రేళ్ళను నిటారుగా ఉంచుట

981. ఙ్ఞానగమ్యా : 
ఙ్ఞానము చే చేరదగినది

982. ఙ్ఞానఙ్ఞేయస్వరూపిణీ : 
ఙ్ఞాన చే తెలియబడు స్వరూపము కలిగినది

🌻. శ్లోకం 180.

యోనిముద్రా త్రికండేశీ త్రిగుణాంబా త్రికోణగా
అనఘాద్భుత చారిత్రా వాంఛితార్ధప్రదాయినీ

983. యోనిముద్రా : 
యోగముద్రలలో ఓకటి

984. త్రికండేశీ :
 3 ఖండములకు అధికారిణి

985. త్రిగుణా : 
3 గుణములు కలిగినది

986. అంబా : 
అమ్మ

987. త్రికోణగా : 
త్రికోణమునందు ఉండునది

988. అనఘాద్భుత చారిత్రా : 
పవిత్రమైన అద్భుత చరిత్ర కలిగినది

989.  వాంఛితార్ధప్రదాయినీ :
 కోరిన కోర్కెలు ఇచ్చునది. 


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 94 🌻. మంత్రము - అర్ధం - పద్యము 🌻
చివరి భాగము
🌻. శ్లోకం 181.

అభ్యాసాతియఙ్ఞాతా షడధ్వాతీతరూపిణీ
అందః కారముఅవ్యాజకరుణామూర్తి రఙ్ఞానధ్వాంతదీపికా

990. అభ్యాసాతియఙ్ఞాతా : అభ్యాసము చేసిన కొలది బొధపడును
991. షడధ్వాతీతరూపిణీ :  6 మార్గములకు అతీతమైన రూపము కలిగినది
992. అవ్యాజకరుణామూర్తి : ప్రతిఫలాపేక్షలేని కరుణ కలిగినది
993. రఙ్ఞానధ్వాంతదీపికా : అఙ్ఞానమును అంధకారమునకు దీపము వంటిది

అంధ కారమునకు దీపము వంటిది 
ప్రతి ఫలము లేని కరుణ కలిగె
శిక్షణల ను పొంది కొలది భోధపడును  
6 మార్గ ములకుఇంచి రూప మున్న .... .....౧౮౧
    
🌻. శ్లోకం 182.

ఆబాలగోపవిదితా సర్వానుల్లంఘ్యశాసనా
శ్రీచక్రరాజనిలయా శ్రీమత్ త్రిపురసుందరీ

994. ఆబాలగోపవిదితా : సర్వజనులచే తెలిసినది
995. సర్వానుల్లంఘ్యశాసనా : ఎవరునూ అతిక్రమించుటకు వెల్లులేని శసనము కలిగినది
996. శ్రీచక్రరాజనిలయా : శ్రీ చక్రము నివాసముగా కలిగినది
996. శ్రీమత్ త్రిపురసుందరీ : మహా త్రిపుర సుందరి

సర్వజనులచే తెలిసిన మాత ఆమె 
మహా త్రిపుర సుందరి ఎవరునూ అ
తిక్ర మించుట కు దరని శాసనమ్ము 
కలిగి న నివాస ముగ శ్రీచక్ర ముండె ..... .... 182     

🌻. శ్లోకం 183.

శ్రీశివా శివశక్తైక్యరూపిణీ లలితాంబికా 

998. శ్రీశివా : సుభములను కల్గినది
999. శివశక్తైక్యరూపిణీ : శివశక్తులకు ఏకమైన రూపము కలిగినది
1000. లలితాంబికా : లలితానామమునా ప్రసిద్ధమైన జగన్మాత 


ఏవం శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్రం సంపూర్ణం .

సమాప్తం... 
🌹 🌹 🌹 🌹

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి