16, ఆగస్టు 2020, ఆదివారం

ఙివిత నౌక


చిత్రంలోని అంశాలు: 'TXN gotirupati.com' అని చెప్తున్న వచనం

నేటి జీవిత నౌక - ఆదర్శం 
ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక 
రచయత: మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ  

చుక్క చుక్క కలిపితే చెరువు - అక్షరం అక్షరం కలిపితే పదం 
చెరువు చెరువు కలిపితే సెలయేరు - పదం పదం కలిపితే వాక్యం 
యేరు పొంగి ప్రవహిస్తే నది - వాక్యం వాక్యం కలిపితే కధ 
నదులు సంధానమే సముద్రం - కధల సంధానమే కావ్యం  

మొలకెత్తు మొక్క విత్తు నుండి - మనసులో అక్షరభావం మొలకెత్తు 
కొమ్మ రెమ్మ ఆకులు పువ్వులగును - ఆలోచనామెలికల భావాలు కధలు అగును 
ఆకులు పువ్వులు విచ్చుకొని ఉండును - ఊహలు విచ్చుకొని కావ్యాల మాల అగును  
అందరికి ఉపయోగపడే చెట్టు అగును - చదువుకోతగ్గ సాహిత్యంగా మారును 
చెట్టు ఎంతవరకు ఉపయోగపడునో  -  అట్లే సాహిత్యం మనసుకు ఉపయోగపడును 

ప్రకృతి అందాలు వర్ణ మాల అగును - కవిత్వ అందాలు మనసు మల అగును 
సుఘందాలు పంచు పువ్వులగును   మనోఫలకంపై అక్షర సాహిత్యం మగును 
కళ్ళు చూసిన చిత్రాలు నచ్చవచ్చు - మనసున చేరిన భావాలు నచ్చవచ్చు 
చెప్పలేంటి ప్రకృతి అందాలు - విప్పలేనట్టి మేధస్సు ఆలోచనలు 
మొక్కలు ఎండినా మరలా చిగురిస్తాయి - సాహిత్యం పాతధైన మల్ల చిగురిస్తుంది 

రాయాలనుకుంటున్నాను నిత్యం -  మేధస్సు చెప్పింది తెలపాలనేది సత్యం 
సర్వం మంగళకరంగా ఉండాలని ఆశ - అందరికి చెపుతున్న తెలిసిన ధర్మం 
ధర్మం ఆచరిస్తే అందరికి సుఖం -  అదే నేను కోరుకొనే నిత్యా న్యాయం 
ఫలితం ఆశించకుండా కృషిచేయి - దైవం నీలోఉన్నాడు మరచిపోకు 

ప్రేమించి ప్రేమను పొందటానికి బతుకు - దేశ ప్రతిష్ట కోసం సహనంతో బతుకు 
సర్వే జానా సుఖినోభవంతు - ఓం శాంతి: ఓం శాంతి: ఓం శాంతి: 

--(())-- 

నేటి కవిత - జీవిత నౌక... నిత్యకల్యాణం - పత్స తోరణం  
పంజలి ప్రభ - అంతర్జాల పత్రిక
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

సూర్యుని ఒక్క  ధర్మం తాపం,
 జలము ఒక్క ధర్మం రసం !
అగ్ని ఒక్క ధర్మం దహనం,
 జీవుని ఒక్క దర్మం ఆత్మజ్ఞానం !

కుటుంబములో  సత్యం,న్యాయం,
 ధర్మం, మార్గమే సంసారం !
మతములో ఉన్న సమస్త ధర్మాలకు 
అందరం భద్దులం !

ఎక్కడ ధర్మం ఉంటుందో,
 అక్కడ తేజస్సు విస్తారం !
ఎక్కడ  తేజస్సు విస్తారంగా ఉంటుందో,
 అక్కడ భక్తి మయం !

ఎక్కడ భక్తి ఉంటుందో,  
అక్కడ లక్ష్మి దేవి స్థిరనివాసం !
ఎక్కడ సత్సాంగత్యమ్ ఉంటుందో, 
అక్కడ ఉత్తమ గుణం !

ఎక్కడ ఉత్తమ గుణం ఉంటుందో
 అక్కడ భగవంతుని సాక్షాత్కారం !
ఎక్కడ భగవంతుని సాక్షాత్కారం ఉంటుందో,
 అక్కడ బ్రహ్మా జ్ఞానం !

ఎక్కడ బ్రహ్మా జ్ఞానం పంచ బడుతుందో,
 అక్కడ నిత్య కళ్యాణం !
ఎక్కడ నిత్య కళ్యాణం  ఉంటుందో,
  అక్కడ పత్స తోరణం !

Variety Images of Hindu Gods | Hindu Devotional Blog

నేటి కవిత - జీవిత నౌక 
పంజలి ప్రభ - అంతర్జాల పత్రిక
రచయత: మల్లాప్రగడ సాద్వి రామకృష్ణ  

పువ్వుల దండలో దారం - గుణకారం
బహుమతిని దేశానికి ఇవ్వలేను  - తిరస్కారం
చెప్పిన మాట వినకపోతే  - ధిక్కారం
మనిషికి ప్రభుత్వం ఇచ్చేది - పురస్కారం

కేశాలల్లో పువ్వులు ఉండటం - గుణకారం
గర్వంతో ఎక్కువగా ఊహించి -  తిరస్కారం
ధర్మం తెలిసిన వాదిస్తే  - ధిక్కారం 
ఆశయాలు కలగా గుర్తుండేది   - పురస్కారం 

చెప్పుల కాళ్లతో నడవటం - గుణకారం
ఇది పేదలకు దక్కాలసినదని  - తిరస్కారం
మాటకు మాట చెపితే  - ధిక్కారం
అనుభవాల పంటగా ఉండేది - పురస్కారం

రెండు రెండు హెచ్చవేస్తే వచ్చేది -గుణకారం
ఎవరో ఏదో అను కున్నారని - తిరస్కారం
చూపిన పని చేయకపోతే  - ధిక్కారం
చేసిన మంచికి పొందేది - పురస్కారం
--(())--

చిత్రంలోని అంశాలు: 1 వ్యక్తి

నేటి జీవితనౌక  ... నీది ... నాది 
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక 
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

నా మనసు నీది నీ వయసు నాది
నా వయసు నీది నీ సొగసు నాది
నా సొగసు నీది నీ తనువు నాది
నా తనువు నీది నీ సిగ్గులు నావి

నా తప్పులు నీవి నీ ఒప్పులు నావి
నా ఒప్పులు నీవి నీ మాటలు నావి
నా మాటలు నీవి నీ గొప్పలు నావి
నా గొప్పలు నీవి నీ ఆటలు నావి 

నా చూపు నీ కొరకు నీ ఊఁపు నా కొరకు
నా శ్వాస నీ కొరకు నీ ధ్యాస నా  కొరకు
నా చొరవు నీ కొరకు నీ వొరపు నాకొరకు
నా నేర్పు నీ కొరకు నీ ఓర్పు నా కొరకు

నా మార్పు నీ కొరకు నీ నేర్పు నా కొరకు
నా తీర్పు నీ కొరకు నీ కూర్పు నా కొరకు
నీ జ్ఞాన శక్తి నాకు నా జ్ఞాన యుక్తి నీకు
నీ క్రియ శక్తి నాకు నా శృతి శక్తి నీకు

నీ ఇచ్చా శక్తి నాకు నా క్రియ శక్తి నీకు
నీ లక్షణాలు నాకు నా లక్షణాలు నీకు
నీ పెదవి నాకు నా పెదవి నీకు
నా సలహా నీకు నీ సలహా నాకు

నీవు తార వైతే నేను జాబిల్లిని
నీవు పువ్వు వైతే నేను తుమ్మేదను
నీవు ఆకు వైతే నేను బిందువును
నీవు నది వైతే నేను సముద్రాన్ని

నీవు బిమ్బ మైతే నేను ప్రతిబింబాన్ని
నీవు కాగిత మైతే నేను కాలాన్ని
నీవు రాగ మైతే నేను అక్షరాన్ని
నీవు నేత్ర మైతె నేను రెప్పను

నీవు కాలమైతే నేను ప్రకృతిని
నీవు గిన్నె ఐతే నేను గరిటను
నీవు కొబ్బరి వైతే నేను టెంకను
నీవు టివి ఐతే నేను రిమోటును
నీవు చక్లే టైతే నేను పై కవరును

--(())---


అర్ధం

అర్ధం లోనే ఉన్నది అందరికి పరమార్ధం
అర్ధం చేనే అన్నది కొందరికి సమ స్వార్ధం  
అర్ధం వల్లే విన్నది చెప్పకయు చెయు వ్యర్ధం
అర్ధం నిత్యా యుక్తము తెల్పకయును అనర్ధం 

అర్ధం తెలియక పోయిన విచారించొద్దు
అర్ధం మెలికలు ఉన్నను చర్చి0ప వద్దు  
అర్ధం అదె పని గా నువు ఆలోచించవద్దు 
అర్ధం వలనను సౌఖ్యము పొందుటముందు 



నేటి జీవితనౌక ...  (ఒంటరితనం) (8)
 ప్రాంజలి ప్రభ .... అంతర్జాల  పత్రిక  
రచయత:మల్లప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

ఒంటరితనంలో నాకు తోడుగా 
పంఖా కదలిక శబ్దం నన్ను ఓదార్చింది 
గది మూలలో నన్ను వెక్కిరిస్తుసి 
చీపురు తలక్రిందులగా పిలుస్తున్నట్టుంది 

హృదయంలో ముద్రితమైన పాద ముద్రల 
చిహ్నాలు శబ్దం చేయవద్దని శాసిస్తున్నట్లున్నది  
నాకు దోస్తుగా కన్నీటి సరస్సు లో మునిగి 
కష్టాలన్నీ చెప్పుకొని విశ్రాంతి తీసుకోమన్నది 

నిశ్శబ్ధంలో గది బయటకు వచ్చి చూస్తే 
ఆకాశంలో పక్షి రెక్కలు కొట్టుకుంటూ 
నీకన్నా నేనే మేలని ఎక్కిరిస్తున్నది 
ఆకాశం బూడిదరంగుగా మారి కదిలే 

మేఘం నీపని నీవు చేసుకోమంటున్నది 
నెలవంక ఇంటి కప్పుపై వెన్నెల కురిపించి 
నవ్వుతు నన్ను కలవరింప చేస్తున్నది   

సూర్యోదయం పట్టరని కోపంతో
నన్ను నిద్ర లేపుతుంది 
పాదరక్షలు నీవు ఒంటరివి
నేను జంటగా నీకు సహకరిసున్నట్లు 
రమ్మని పిలుస్తున్నటున్నది  

జ్ఞాపకాలు ఒంటరిగా ఉండనీయక 
మెదడులో చేరి నిద్రకూడా 
రానీయకుండా భయపెడుతున్నది 
ఈ ఒంటరితనానికి విముక్తి ఎప్పుడో  
నా సన్నిహిత్వాన్ని కోరే వారు ఎప్పుడో  

--((**))--



This is beautiful Pichwai Paintings on wooden plates handpainted Kamal talai with cows. #Pichwaifactory #Pichwai #painting #Paintings #decorations #handpainted #homedecor #indianart #woodenplate #plates #decoraddict #cows #pichvai #traditional

నేటి కవిత .. ఙివిత నౌక ... 7
రచయిత. మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక

కంటికి కనురెప్పల కాచే మనస్సు
జగతికి సహాయం చేసే యశస్సు
ధర్మ ప్రబోధాలను పంచే తేజస్సు
తెలుగువారు ప్రేమనందించే ఉషస్సు 

తెలుగు భాషే మా మనస్సు
అది మా అమ్మ పాల యశస్సు
అది మాకు పంచును తేజస్సు
అందుకే మాకు నిత్య ఉషస్సు

కాలంతో మారదు ఈ మనస్సు
అనురాగంతో పంచును యశస్సు
విద్యా భోధతో పెరుగును తేజస్సు
ఆంధ్రమే మాకు అక్షయ ఉషస్సు

నవశకానికి నాంది విజ్ఞాన చంద్రిక
హృదయాంతరంలో ఉండే వేగు చుక్క
జ్ఞాన ఉపదేశాల సంక్షేమ సత్య దూత
తెలుగు కవుల విజ్ఞాన ప్రాంజలి ప్రభ   

--((*))--


"Yellow Rosellas" by Lyn Cooke. Paintings for Sale. Bluethumb - Online Art Gallery

నేటి కవిత .. ఙివిత నౌక ... 6
రచయిత. మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక

గుండె గూటి దివ్య మాట 
గునపంలా గుచ్చిందా  
మండె మంట గుడ్డి దీప   
వెలుగంతా కమ్మిందా
  
పెదవిచాటు మౌనమేదో  
వెలిగిందా దీపంలా  
కనులమాటు కాంతియేదో 
మిగిలిందా వేదంలా 

మండె మాట మబ్బు మాటు 
చినుకుల్లా వచ్చిందా
ఆశ యందు సేద తీర్చి 
బతు కంతా విచ్చిందీ

పొదలమాటు ప్రేమయేదో 
నలిగిందా కోపంలా  
మరులు గొల్పు ప్రేమ సల్పే 
వినయంగా సాగిందా 

ఉండె ఘాటు ప్రేమ తోటి 
మనసుల్లా తాకిందా
కారు మబ్బు ప్రేమ పట్టి 
వయసంతా పాకిందా 

వెసులుబాటు చెప్పుకోక 
మిగిలిందా తాపంలా 
కరుణమాయ ఒప్పుకోక 
మనసంతా పాపంలా

తిండి దక్కె ఆశ తీరె 
తనువుల్లా ఔనందా
కురులు మాటు ఒప్పుకోక 
వణికిందా కామంతో   

ఒక ఘాటు సరసం  
అర్ధమైతే వర్షం - 
అర్ధం కాకపొతే నీరసం 
అందుకే హర్షం -


--(())--


నేటి కవిత .. ఙివిత నౌక ... 6
రచయిత. మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక




కరోనాలో ఉపిరిపోసుకోని ఏమి చిత్రములు 
నాడు కుబేరులే నేడు జీరోలు హీరోలు 
చేతకాక ఉన్న చేయలేక దేశీ, పరదేశీయులు
కరోనాతో నటులకు అంతా డబ్బింగులు
  
అర్దాలులేని, సాహిత్యములేని గీతాలు 
చెవిపోటు తో హోరెత్తే సంగీత శబ్దాలు 
ఉపయోగంలేని, కానరాని సందేశాలు 
నోటితో సెహెప్పలేని ద్వందార్ధములు
   
హీరోలే గుర్తులేని గాలిలో పోట్లాటాలు 
ఉర్రుతలూగించే చిన్నపిల్లల ప్రేమలు 
నోరువిప్పని పెద్దలకు తప్పఁని భాధలు   
వద్దనకు గత్యంతరం లేనట్టి స్థితిగతులు

గొప్పకోసం దండగ మారి ఖర్చులు 
ప్రత్యేకత కోసం భయానక దృశ్యాలు 
యువకుల ఆకర్షణ అసభ్య నృత్యాలు 
పచ్చి బూతుల తాగుబోతు దుర్భాలు 

కళ్లవెంట నీళ్లు రాని కుళ్లిపోయిన నవ్వులు 
కాకుల అరుపులు  కమ్మని కవిత్వ  పాటలు 
పికమ్ముల కఠోర అర్ధంలేని పిచ్చ  మాటలు    
అన్నీ విచిత్రములు చెప్పుకునే  చిత్రాలు 

చిత్ర విచిత్రాలు చూసేది నేత్రాలు 
ఇప్పుడు నోరుఎత్తలేని పరిస్థితులు 
అందుకే  మూగ పోయిన చిత్రాలు 
కుబేరులు గరీబులైన చిత్రాలు 

--(())--


నేటి కవిత .. ఙివిత నౌక ... 5
రచయిత. మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
  


మనసు సంద్రము మీద పడవే నంటూ  
కదులు తూ ఎదో ఒకటి కావా లంటూ 
ఉప్పు నీటిపై తెలుస్తూ కదలి కంటూ 
గమ్యాన్ని చేర్చే మనసు ఎదోకోరాలంది   

నాకు నీవు, నీకు నేను పెన వేసుకుంటూ 
కెరటాల ఊపును మనసు తట్టు కుంటూ 
నిన్ను చూస్తే ఏదో మరచి నీతో ఉంటూ 
క్షణం వేధిస్తున్న మనసు నీదే నంది   

నీలో ఎదో స్వార్ధం ప్రవేసించి దాటుకుంటూ 
నన్ను వదలి దిగులుతూ నలిగి పోతుంటూ
మానసిక ప్రశాంతతను  దూరం చేసుకుంటూ      
నవ్వుతూ గాయంచేస్తూ ఓర్పుతో కలుసుకుంది  
  
గుండె సవ్వడికి ఓర్పు సడలి నీది నాది ప్రేమంటూ 
పరవళ్ళు త్రొక్కుతూ ఉప్పులో కలసిమాయమైనట్టు 
తనను తానూ మరచి పోయి తన్మయం చెంది నట్టు 
ప్రేమ కానరానీయ కుండా ఏకమై కలసిపోయి నట్టే  

 ఇదే ప్రేమ తత్వం అన్నట్టే 

__((*))__





నేటి కవిత .. ఙివిత నౌక ... 5
రచయిత. మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక

తనివి తీర తనువు అర్పించి 
మనసు తీర మలుపు తిప్పించి
శుభము చేర మరులు గొల్పించి
అభయ హస్త కరుణ శోభించే

మమత మీర మగువ ఆశించి
కళలు తీర నగువు చూపించి
మరులు గొల్పు మమత పండించి
లతల మెర్పు పరిమ ళాలుంచే

సిరులు పంచె వరుడు ఊహించి
కలలు తీర్చె సమయ మాసించి
గళము విప్పి సరుకు చూపించి
సకల శోభ తరిమి విప్పారే

వయసు కోర్క వలపు అందించి
సొగసు చూడ మనిన ఒప్పించి
తరుణ మాయ తమక మందించి
ఒకరి కొక్కరు ఒక టే శోభా

--(())--

WORLDSELFIEPAGE: God loves art painting

నేటి కవిత .. ఙివిత నౌక ... 4
రచయిత. మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక

ఇ‌ష్టం అయిష్టం అనకు
ఇష్టపడే రీతిలో బుద్ధిని మార్చు కో
ఆదరణ అనాదరణ అనకు
ఆలోచించే శక్తి తెలిసి ఆదుకో

నిన్నటి అనుభవము నేటి
ప్రగతికి మెట్లుగా మసలు కో
రేపటి పౌరుల దృష్టి లో
ఉంచి ప్రవర్తన మార్చుకో

ప్రణాలికలతో జీవితంలో
విజ్ణత చూపితే  
శాంతి దొరుకునని తెలుసుకో

వర్తమానాన్ని వివేకంతో 
సుగమం మార్చుకో
నిర్ధిష్ట క్రియాశీలక పాత్ర పోషించి 
మెప్పు అందుకో

ప్రేమించటం శ్రేయోదాయకమని 
విధికి మూలమని తెలుసుకో
గతించిన కాలం తిరిగి రాదు 
కాలాన్ని ఉపయుక్తంగా మార్చుకో

అపజయాలు అవమానాలు 
అదేపనిగా ఆలోచించకు
అందులో అపశ్రుతులు వదిలి 
మనసు ను శాంతి పర్చుకో
--(())


నేటి తేట గీతి పద్యాలు .. ఙివిత నౌక ... 5
రచయిత. మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక

పొరుగు వారితొ తోడఁగా  బొత్తు లేదు 
ఇరుగు వారితొ  గూర్చియు  యెఱుక లేదు 
నిరత మమ్మను  తోడుగా నెయ్యమొనరఁ 
గరము లోనివీ  కలములు  గదలు చుండ  .....  

బంధు మిత్రుల భావమ్ము తెల్సు కొనకు  
మంది తోడఁను  గలియుచు  మనము గాదు 
సంది యమ్ము లే దునులేదు  సాధుగుణమె 
అంద మైనట్టి  కవితలు  లల్లు పనియె ..... 

యోగ మన్నది జన్మయు పైన కలుగు  
రాగర హితమ కలుగుట వ్రాసె విధియె 
సాగి పోవును  బాటగా  శక్తి పథము 
త్యాగ బుద్ధితొ  మిన్నను  తల్లి మెచ్చ ...... 

ఆరు నెలల లోననె నందుకొనును 
శారదాంబగ  యిడఁగను  శక్తి దీక్ష 
చీరి దీవనిచ్చుటయె సిద్ధ గురుఁడు 
ధారుణి హితము మెంచియును ధైర్యమొసఁగి ....  

చెప్పలేనట్టి పుణ్యపు శీలి యామె 
యొప్పుకోదును గానట్టి యొజ్జమాట 
గొప్ప పనులఁను  జేయఁను  గువలయాన 
నప్ప జెప్పిన బరువును  నంబ పనిచె ...... 

తెలియకుంటగ  తనకుఁను  గలుగు శక్తి 
పలుకుచుండుట నేదియో కలిగి శంక 
తెలియ వచ్చును ముందు దేవి సుతగ 
నిలను సలుపుయు పనులన వలన నిజము .....  

వినయశీలివీ యగునునె  విద్యయున్న 
తనకుఁ గానట్టి పనికిఁనీ  దలఁపదెపుడు 
మునుల వోలెగ నుండును  బుద్ధి తనది 
మనము నందును నెపుడును మాత యూసె .... 

చిక్కు లెన్నియు యున్నఁను  జెలిమి విడదు 
అక్కజమ్మును  గలుగును నమ్మ కైన 
టెక్కు సూపకు దెపుడును నిక్కి నీల్గి 
మ్రొక్కు కొనుటయె తలకిన ముదము మీఱ ..... 

అమ్మ పలుకును చుండుటే నామెతోడ 
గమ్మ నైనట్టి  పద్యము  కవిత లందు 
నమ్మ కున్నట్టి గానినీ  నాతి పలుకు 
నమ్మ యిచ్చును నుడులెను  యతివ యల్లు .... 

చెప్పు కోదును బయటకు చిక్కులున్న 
నొప్పు కొనునులె దప్పును చితమనుచు 
పప్పులుడకవు ఇక్కడ వద్ద నేవి 
చెప్పు ఖండిత ముగ పల్కు  నప్పకైన ...... 

సూటి గా పల్కు జెప్పియు సుఖమునెంచి 
మాట దప్పకు సేవతొ మాతనైన 
కోటి కొక్కరై మృదులేత గొమ్మ వోలె 
జాట లేరిక తలివిని మేటి భక్తిఁ   ..... .... 

ముందుముందుఁన  దెలియును  నిందు నిజము 
వంద నాలను తెలుపును భూరి కృపకు 
విందులలొ తేలి పలుకులు  లందఁ జేసి 
యందు కున్నతట్టి  దీక్షను నతిశయించి ....  

మంది కొఱకుయు కళలను మహినిఁ బనుల 
సందియమ్మును  వలదులె  సాధులార 
పొందఁబోకయు యలుకఁల  బొల్లటంచు 
నందు కొనుడనీ దీనినీ నంబ కృతిగ /నుడిగ ....  

--(())--

  

ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక  -3

నేటి కవిత:  పునరపి జననం!

ఇప్పుడే వచ్చానీ లోకానికి,
ఇక్కడ నాకంతా కొత్తగా ఉంది!

ఊపిరాడక ఉక్కిరిబిక్కిరౌతుంటే,
ఉశ్వస నిశ్వాసలౌతానంది గాలి!

చీకటిలో చిందులేస్తూ అలమటిస్తుంటే,
కనుపాపలో కాపురముంటానంది కాంతి!

ఆకలితో నకనకలాడి పోతూంటే,
కాయలూ పండ్లూ రాల్చింది చెట్టు!

దప్పికై నాలిక పిడచకడుతూంటే
దబ్బున చిరుజల్లు కురిపించింది మబ్బు!

మాటలు తెలియక తడబడుతుంటే,
పాటలు పాడి నేర్పించింది కోయిల!

అంతా బాగానే అనిపించింది,
అలా కాలం గడిచి పోతూనే ఉంది!

అందుకు ప్రత్యుపకారం చేయాలనిపించింది,
అడిగాను ధీమాగా ఏం కావాలని!

ముక్త కంఠంతో గాలి, కాంతి, చెట్టు, మబ్బు, కోకిల
అందరూ నాకు చేసింది ఒకటే అభ్యర్ధన!

తెలుసుకునే ఉంటావు దేవుడు ఎక్కడ ఉంటాడో,
మర్మం మాకు కూడ చెప్పి పుణ్యం కట్టుకోమని!

నాలిక కరుచుకున్నాను నా అవివేకానికి,
గుర్తొచ్చింది వచ్చిన పని మర్చిపోయానని!

కాళ్ళూ చేతులూ వణుకుతున్నాయి,
కళ్లు బైర్లు కమ్ముతున్నాయి,
చెవులు గింగురుమంటున్నాయి,
నాలిక బయటకొచ్చేస్తోంది,
చర్మం బిగుసుకు పోతోంది,
మనసు, బుద్ది, చిత్తం
యుద్దానికి తలపడుతున్నాయి,
తప్పు నీదంటే నీదని!

కాలం గావు కేక వేసింది,
కదిలి పోదాం వచ్చేయమని!
అన్వేషణ అలాగే మిగిలి పోయింది!,
అప్పుడు నాకు జ్ఞానోదయమైంది!

మళ్ళీ పుట్టక తప్పదని!
--(())--




Dinanath Dalal - Untitled @ Mumbai: Nexus of the Gods | StoryLTD
ఓం శ్రీ రామ్ ... శ్రీ మాత్రే నమ:
ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక
నేటి కవిత - సరస సంతోషము.. 2. 
రచయిత :మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

కనువిందౌతున్నావు
కళ్ళ చూపులకు మత్తెక్కి పోతున్నా
కాళ్లకు సంకెళ్లు వేసావు
కన్ను తిప్పనీయకుండా చేస్తావు దేనికి    

ఆచూపుకు అర్ధం ఏమిటి
ఆరాధనతో నన్నే మింగేస్తున్నావు
అదుపులేని బతుకేమిటి   
ఆరాటం అదుపు తప్ప నీకుండా దానికి 

ఉబలాటం ఊపిరి పోస్తుంది 
ఉర్రుతలూగించి ఉడికిస్తుంది
ఉట్టి కొట్టి గెలవాలనిపిస్తుంది
ఉన్నదంత పంచాలని పిస్తుంది దేనికి

మాటలిక చాలిక వచ్చి ముంగిట్లో ఉండి
మాటలతో మచ్చిక చేసి మదనుడిలా
పోటీ పడక చల్ల చల్లని కబుర్లతో
కాలాన్ని వ్యర్ధ పరుచుటెందుకు దానికి

ఆ ... ఆ ... అంత తొందరెందుకు 
ఇష్ట మొచ్చిన ముచ్చట్లతో
సరస మాడితే అందులో ఉన్న మజా
అర్ధం చేసుకోవాలని కోరుతున్న దేనికి

అబ్బా అబ్బా నాకు నిద్ద రొస్తున్నది 
ఆవిరి కాకముందే ఆరగించు ఆనందంగా
అసలుకన్నా వడ్డీని అందుకో ముందుగా
ముద్దులతో సరిపెట్టుకో ఎవరన్నా చూస్తారు దానిని

మనిద్దరి మధ్య దాపరికాలు వద్దులే
ఎంచక్కా మకరందాన్ని దోచే తుమ్మెదగా నీవు
మకరందాన్ని అందించే పువ్వుగా నేను
ప్రకృతి ఒడిలో సంతసించి ఉందామా దానికి  
ప్రకృతి ఒడిలో సంతసించి ఉందామా ఆ ఆ దానికి

మరి దేనికి అబ్బా అబ్బా దానికి 
 మరొక్క సారి చెప్పు దేనికి
దానికి .....   దానికి ..... దానికి ఆ ఆ దానికే

అలా సాగిపోతుంది నవ్వులతో ప్రేమ
--(())--


Best 50  Lord Ganesha Images - Vedic Sources

ఓం శ్రీ రామ్ ... శ్రీ మాత్రే నమ:
ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక
నేటి కవితలు .. " ఉండు "   (1)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   

తేనె లొలుకు భాష - తేట తెల్లగా నుండు 
లేత చిగురు ఆకు - తినగ తీపిగా ఉండు 
లేత పెదవి రుచి - మధురాతి మధురంగావుండు 
మరవ బోకు, మారబోకు - ఆశకు చిక్కక ఉండు 

మంచి మాట తలకెక్కదు - అది చేదుగ ఉండు 
కొందరి మాట వినబుద్ది కాదు - అది కోపం తెస్తూ ఉండు  
విలువైన మాట విడువరాదు - అది నిన్నే బ్రతికేస్తూ ఉండు 
మరవ బోకు, మారబోకు - ఆశకు చిక్కక ఉండు 

వయసు ఉడుకు తప్పదు - మనసును త్రిప్పు చుండు 
చదువు చదవక తప్పదు - అది నీకు దారి చూపు చుండు 
పెళ్లి చేసుకోక తప్పదు  - అది బుద్ధిని మారుస్తూ ఉండు 
మరవ బోకు, మారబోకు - ఆశకు చిక్కక ఉండు

పగటి వెలుగు మారదు - శ్రమించమను చుండు 
రాత్రి వెన్నెల మారదు - విశ్రాంతికి దోహద పడుచుండు 
తరువుల గాలి మారదు - ప్రాణులను బ్రతికిస్తూ ఉండు 
మరవ బోకు, మారబోకు - ఆశకు చిక్కక ఉండు
--((*))--


2 కామెంట్‌లు: