8, ఆగస్టు 2020, శనివారం

సీస పద్యములు - సౌందర్య లహరి (1)




ఓం శ్రీ రామ్ ... శ్రీ మాత్రే నమ: -
శ్రీ కృష్ణాష్టమి సందర్బముగా శుభాకాంక్షలు 
అమ్మ వారి కృపకు అందరూ పాత్రు లవ్వాలని చిన్న ఆశతో 
  
సీస పద్యములు  - సౌందర్య లహరి - (1 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

అమ్మలు గన్నమ్మ తలచుతూ సౌందర్య
లహరిని వివరించ శక్తి నివ్వు
నీతోడు శక్తిని యుక్తి ని శివునికి
పంచుటే లోకాన్ని యేలు చుండు
నీ శక్తి లేకున్న కశలత కోల్పోయి
చైతన్య రహితుడు అగును అమ్మ
పుణ్యమ్ము వలననే నిన్ను వర్ణనలను
భక్తితో పూజించు భాగ్య మిమ్ము

తేటగీతి
అమ్మ నిలకడ శక్తి ని మాకు ఇచ్చి
పుణ్య మువలన వ్రాసేటి శక్తి నిచ్చి
ఆర్య శంకరా చార్యుల సంస్కృతమ్ము
తెలుగు అనువాద సౌందర్య లహరి నీతి

--(())--
Image may contain: 1 person
ఓం శ్రీ రామ్ ... శ్రీ మాత్రే నమ: -
శ్రీ కృష్ణాష్టమి సందర్బముగా శుభాకాంక్షలు 
అమ్మ వారి కృపకు అందరూ పాత్రు లవ్వాలని చిన్న ఆశతో 
  
సీస పద్యములు  - సౌందర్య లహరి - (2 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ


నీపాద ధూళిని గ్రహించి లోకాల్ని 
సృష్టించు నలువకు నీవె కర్త 
 ధూళి తలదాల్చి హరిమోయు భువనాలు
ఆయాస పడకుండ  నీవె కర్త
 ధూళి హరుడుయే ఒడలెల్ల పూసియు
నిను భక్తి తొ కొలుచు నీవె కర్త
త్రిముర్తి లీలల చేసేటి పనులకు
ప్రతిసృష్టి తరుణము నీవె కర్త

  
ఆట వెలది 

సృష్టి స్థితి లయకు మూలపు తల్లివి     
నిత్య ధర్మ మార్గ కళల కర్త
బ్రహ్మ విష్ణు ఈశ్వర పూజింప దానవు 
కరుణ తోను తెల్పు తున్న దేవి 

--(())--.... ... ... 

Kalamkari

సీస పద్యములు  - సౌందర్య లహరి - (3 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

అజ్ఞాన హృదయాల తీమిరాలు తొలగించి 
తేజమ్ము నందించి శక్తి వమ్మ 
జెడులను పరిశుద్ధ పరిచియు మకరంద 
మాధుర్య మందిచు జ్ఞాని వమ్మ   
నిరుపేద బాధల న్నింటిని అరికట్టి  
చింతలు తొలగించె  దీప్తి వమ్మ   
సాంగత్య సంసార సాగర ముద్ధరించి 
పుడమిని కాపాడె దంష్ట్ర వమ్మ      

ఆటవెలది 
అమ్మ ఆగ లేక  అడుగుతూ ఉన్నాను   
తోడు నీడ నీవె మాకు ఇపుడు 
అవని నాదు కొన్న తీరున మదిలోన 
తప్ప టడుగు పడక చూడు వమ్మ 

--(())--... ... ... 


bhuvaneswa_enyzhma2

ప్రాంజలి ప్రభ - ఓం శ్రీరామ - శ్రీమాత్రేనమ:
సీస పద్యములు  - సౌందర్య లహరి - (4 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ఇతరదేవతలందరు అభయ హస్తమ్ము 
లిచ్చియు ముద్రలు తెల్పు చుండె   
అతి సహన సహజ రూపము వరదాది 
ముద్రలు ఉన్నను లోక రక్ష 
చేయవు, ఆడంబరము చూపవు, భయము 
పోగొట్టి వుండవు దేని కమ్మ
లోకైక శరణము నీపాద చతురము 
ధూళి మహిమలులే అధిక ఫలము 

ఆట వెలది 
పాద ధూళి కేను సమస్త లోకము
విలయ తాండ వించు చుండు కాద
అభయ హస్త మహిమ ఎంతని చెప్పేది 
ఈప్సి తమ్ము లిచ్చు దైవ మాత 

--(())--... ... ... 


Bhuvaneshvari | Goddess Bhuvaneshvari | Bhuvaneshvari Mahavidya  

సీస పద్యములు  - సౌందర్య లహరి - (5 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

శోభాగ్య సంపదలు సమకూర్చు చున్నావు 
ఓయమ్మ పూజించు వార లకును   
నిను గొల్చి హరినాడు మోహినీ రూపియై  
శివునికి కూడాను మోహ పరిచి 
కనిపించు సొగసుతో రతియందు మన్మధ 
కామ లీల సలుపుట చిక్క కుండ 
సర్వ లోక జనులందు మునులందు మోహము 
తాండవ తన్మాయ నీద యేగ 

ఏమి అనలేను జగములు లేలు తల్లి 
మనిషిగా నేను మనుగడ తప్ప యేమి  
అఖిల మాయకు మూలము నీవె నమ్మ
జనుల కోరిక తీర్చేటి మధుర వమ్మ 


--(())--  ..... ... ... 

  

సీస పద్యములు  - సౌందర్య లహరి - (6 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

కమలాది కుసుమంబు ఐదుబాణ ములుఆయె 
బ్రమరమ్ము గుణమయ్యె   వింటినారి     
మలయ మారుతము మన్మధ రణముకు  
యుద్ధరధ మాయెనూ వీక్షణమ్ము      
నీదివ్య కటాక్ష విక్షణ ప్రభవమ్ము 
జగములు లేలు మన్మ దుడు నిరతము   
నీకడ కంటి చూపు జాలిగా లోకమంత 
శక్తిగా వ్యాపించి ఉండు తల్లి  

అమ్మ రాపిడి లోనగు మమ్ము చూడు 
హృదయ కీర్తనా ఆలాపనలను చూడు 
మాటలతొ మంత్రవిద్యను నేర్చు చుండి 
ఘనత గల తల్లి మాయొక్క మనసు చూడు 

--(())--  .... .... ...

Arulmighu Mariamman, Kadamboor
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక  
సీస పద్యములు  - సౌందర్య లహరి - (7 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

గల గల ఆపరంజి గజ్జల శబ్దాల 
మొలనూలు మెరుపులు వ్యాప్తి చెందె
సన్నగా నున్నట్టి నడుముతో స్థనములు 
భారము తోవంగి పూర్ణ చంద్ర 
బింబము వళ్లెను వెలుగొందు మొముతోను          
చేతుల్లో చెరుకు వింటినితొ, ధనువు 
పాశము, అంకుశం, ధరించి, మాకును   
రక్షగా యున్నావు రేయి పగలు 

తేటగీతి 
తల్లి పరమ శివుని భర్త గాను పొంది 
తల్లి సుసుకోప విష్టయై ప్రేమ పంచి  
తల్లి దయయుంచి చూడ్కుల విందు గాను
తల్లి అహమును తున్చేటి శక్తి నిచ్చు 

--(())--..... .... ... 

Do you know this lady? You should. She is Saraswati, the Hindu goddess of art and music — and therefore, in a way, the female Apollo. She is also the spirit of the invisible river which enter…

ప్రాంజలి ప్రభ - ఓం శ్రీరామ - శ్రీమాత్రేనమ:
సీస పద్యములు  - సౌందర్య లహరి - (8 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

 అమృతమయ సముద్ర మధ్యన కల్పవృక్ష  
పరివేష్టి తంబైన రత్న దీవి  
కడిమిచె ట్ల వరుస  వనసమూ హమ్మున
చింతామణి భవన మందు ఉన్న 
శివరూప మంచము నందున పర్యంక 
నిలయవై అలరారు స్త్రీగ జ్ఞాని   
నీదివ్య దర్శనం లభియించు నరుదుగా
కొందరు మాత్రమే ధన్యు లౌను 

తేటగీతి 
తల్లి గాచూపు జగతికి తండ్రి తాను
చిన్న పెద్ద భేధములను చూప కుండు 
పిల్ల వానిలొ అందరి లోను ఉండి  
మనసునందున నిలిచియు మాయ తొలగ

--(())--....    ... .... 

Divine Cosmos Light  Beings Starseed Readings               

ప్రాంజలి ప్రభ - ఓం శ్రీరామ - శ్రీమాత్రేనమ:
సీస పద్యములు  - సౌందర్య లహరి - (9 )

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
విశ్వము భూతత్వ చక్రమ్ము ములాధా 
రముగాను సమస్త కిరణ శక్తి    
జలవాస మైనట్టి మణిపూర చక్రమ్ము 
విశుదాఖ్య, సుషుష్మ మార్గ చీల్చి     
వాయు నిలయమైన ఆకాశ చక్రమ్ము  
అనాహత చక్రమ్ము లన్ని చీల్చి  
అగ్నిని లయమైన స్వాధిష్టాన చక్రమ్ము
సహస్ర దళ పద్మ ఏక మార్గ  

తేటగీత 
అమ్మ ఏకాంతమున పతి సేవ చేసి
తత్వ భోధగా విహరించె విశ్వ శక్తి 
సర్వ మయమైన సహస్ర పద్మ మందు 
ఈశ్వరుని కల్సెటి రహస్య తత్వ శక్తి    .... .... 9   

--(())-- .... ... .... 

Ketut Liyer :: Drawings


ప్రాంజలి ప్రభ - ఓం శ్రీరామ - శ్రీమాత్రేనమ:
సీస పద్యములు  - సౌందర్య లహరి - (10 )

ఓంకార రూపము కల్గియు సర్వము 
గ్రహించు చున్నట్టి చరణ యుగళి
నీచర ణములలొ ప్రవహించు అమృతర 
సము జీవ లోకాల్ని తడిపి వేయు 
రసరూప తేజము అలరారు చున్నట్టి 
చంద్రుని నెలవైన నింగి యందు          
కుండలి కలిగిన కులకుండ గుహయందు 
ఆధార చక్రంలో శయని తల్లి 

తేటగీతి  
అమ్మ అమృతర సముతోను జీవ కోటి 
నంత రక్షించి తేజము తోను నీవు 
మాకు భద్రస్వ రూపిణీ వమ్మ నిత్య 
పూజ లందుకో రక్షించు తల్లి శయని  .... ... .. 10       

--(())--... ... ...          

Radharani

ప్రాంజలి ప్రభ - ఓం శ్రీరామ - శ్రీమాత్రేనమ:
సీస పద్యములు  - సౌందర్య లహరి - (11 )

శివచక్రములు నాల్గు, శక్తి చక్రములు యైదు,     
ప్రకృతికి మూలమైన విశ్వ శక్తి
నవకోణ నములతొ మూడురే ఖలుకల్గి   
దివ్య వృత్తములగా విశ్వ శక్తి  
అష్టమూ షోడశ పత్రము లతొ  పద్మ
ములతోను అమరియు నిలయ మైన      
నలుబది నాల్గన్చు లనుగల పరిణతి 
శ్రీచక్ర మలరారు చున్న దమ్మ

అమ్మ నిలయంబై ఉన్నట్టి మహిమ శక్తి 
అన్ని లోకాలను కలయ చూస్తు శక్తి     
సర్వ శక్తులను తెలిపే సర్వ జనని 
సద్ది శక్తులకు నిలయ మైన తల్లి  ... ... 11 

--(())-- ..... .... ...



ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక - శ్రీమాత్రేనమ:  
సీస పద్యములు  - సౌందర్య లహరి - ( 12. )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ఓ హిమాచల పుత్రి కల్యాణి సుభగాత్రి 
ఆత్యంతం శ్రామిక శక్తి దీప్తి
బ్రహ్మాది దేవతా సౌందర్య సామాన్య
కల్పన చేస్తున్న కొంత తెలివి
నీ రూప లావణ్య వెలుగును గనలేక     
దేవతా స్త్రీలందరూ మనసుతొ
జపతపంబులు చేసి శ౦బుసానిత్యము
పదవిని పొందుతూ నిన్ను మఱచె 

అమ్మ లీల లన్న ఇంకితంబున్నట్టి
ప్రాఙ్ఞలుండి రిచట జగతి చూపు
విభవ మిచ్చు నిధులు విజ్ఞాన సదనాలు
మనుసు భావ మంత జనుల తల్లి   .... .... . 12         

--(())-- .... ... .... 


Durga, identified as Adi Parashakti, is a principal and popular form of the Hindu Goddess.

ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక. శ్రీ మాత్రేనమ:  
సీస పద్యములు  - సౌందర్య లహరి - ( 13 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

అమ్మానీ చల్లని చూపులు మాపైన
ఉంచుము అమృతమ్ము పంచి నట్లు 
అఖిలవిశ్వమున ఆనందము పంచగా 
అత్యంత వృద్ధు౦డు కాంక్ష పెరుగు
బలహీన రూపుండు శృంగార రసభావ
మరువక మూడుడై  పరుగు లెత్తు
సౌందర్య వతులెల్ల వడలిపై వస్త్రము
ముడతలూడి పడియు పడక పిలుపు

తేట గీతి
అమ్మ నీదృష్టి మనుషుల పైన పడియు
కామ కళను జరుపుటకు పయన మించె
మోహమును చేరి కట్టుకున్న వస్త్ర మంత
ఊడి విగళిత మనిషిగా అమ్మ చూపు         ....   13


--(())--
               
Google+

ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక. శ్రీ మాత్రేనమ:  
సీస పద్యములు  - సౌందర్య లహరి - (14 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

పృధ్వీ తత్వము నుండి యేబది ఆరు, 
జల తత్వము నుండి యేబది రెండు       
అగ్ని తత్వము నుండి అరువది రెండు 
వాయు తత్వము నుండి యేబది నాలుగు 
ఆకాశ తత్వము నుండి  డెబ్బది రెండు 
హృదయ తత్వము నుండి అరువది నాలుగు 
ప్రకాశాలు తేజరిల్లి స్థానోపరి భాగములో 
నీ చరణ కమలాలు రంజిల్లు చుండు  

అమ్మ మన్నించు సీసప ద్యమును తెల్ప          
లేక యుంటిని భావాన్ని మాత్ర మంత 
తెలియ పరిచితి, క్షమ చూపి, కరుణ చూపు, 
మాకు అందించు, చరణాలు పట్టి యున్న 

--(())--                                                    ......   14.... ... ...

Saraswati is the Hindu goddess of wisdom, learning, art, music, and science. She is always pictured with a swan and/or lotus, and she is usually playing a sitar with 2 of her four, awesome arms. She is my spirit animal.

ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక. శ్రీ మాత్రేనమ:  
సీస పద్యములు  - సౌందర్య లహరి - (15 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

శరదిందు చంద్రికా  పరిశుద్ధ దేహవై 
శిగపైన నెలవంక వెన్నెలమ్మ   
వరదాభయ కరములను నలరారుచు
పుస్తక జపమాల తోను వెలుగు 
చుండేటి అమ్మను ఒకసారి మనసార
తలచినంతగ మాకు తేన పాలు
ద్రాక్ష ఫలరసములను బోలు వసుధలో 
యశమిచ్చు వచనాలు కవులకు సిద్ధి 
  
తేటగీతి  

విమల వినయంతొ నమ్రత కలిగి ఉన్న    
జ్ఞాన యోగము క్రియలు కలిగి ఉన్న  
సత్య ఈశాన ఉత్కర్షి కలిగి ఉన్న 
దీవెన లుఇచ్చె సుమవల్లి అమ్మ నీవె

--(())--                                  .... /////.. 15..... .... .... 



ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక. శ్రీ మాత్రేనమ:  
సీస పద్యములు  - సౌందర్య లహరి - (16 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

కవి యొక్క హృదయము కమలాల వనముగా 
వికసింప జేయుట కాంతి గాను  
బ్రహ్మ తేజపు వాక్పటిమ గరిమ రసలహరి 
ఉర్ఱుత లూగంగ కవుల తృప్తి 
సత్పురు షుల ధ్యాన ఇచ్ఛాశక్తి కలుగ 
చేయు మనోరంజ కమ్ము గాను  
భాభాస్కర సదృశ అరుణ గౌరి గాను 
అలరారు వాగ్దేవి బుద్ధి నిచ్చి  

అరుణ వర్ణము అలరారు అంబికమ్మ 
కవుల కావ్యమ్ము వ్రాతలు మనసు చేరి 
సజ్జనులు నిత్య పలుకులు ధర్మ బోధ 
బ్రహ్మ తేజము బ్రాహ్మణు కిచ్చి నావు 

--(())--                                .... .... 16
MAHALKSHMI GLOBAL - are Creating The Internet Community Adherents of The Goddess of Good Luck & Prosperity - LAKSHMI. Follow on patreon.com/mahalakshmiglobal

ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక. శ్రీ మాత్రేనమ:  
సీస పద్యములు  - సౌందర్య లహరి - (17 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

సర్వము గ్రహించ గలశక్తులు గలిగి  
చంద్రకాంత మణిగా కాంత మహిత
సృష్టికి కర్తలై ఎలరెడి దేవత 
లతొ వశిన్యాదులై నట్టి శక్తి 
నిచ్చిన కవులలో వాగ్దేవ ముఖ కమ 
లము యొక్క ఆమోద పూర్ణమయిన
మాధుర్యం శక్తిగా కవులలో ప్రభవించి 
కావ్యావ తరనము శోభ అమ్మ 

ప్రేమ పుట్టాలన్న నీతోడు అవసరమమ్మ 
కవుల కావ్యరచన లన్ని అమ్మ కృపయె యే 
జ్ఞాన శక్తిధ్యానంగాను మార్చు శక్తి 
సుందర కవిత్వ పటుత్వ శక్తి మహిత ... .. 17                 

--(())--


Maa Kali is kala shakti or the power of time. She indicates the impermanence of all things, which is why she wears a garland of skulls. Yet…

 ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక. శ్రీ మాత్రేనమ:  
సీస పద్యములు  - సౌందర్య లహరి - (18 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
        
ఉదయ భానుని కాంతి పుంజాలు వెదజల్లు 
నీమేని వెలుగుచే మమ్ము చేరె   
ఆకాశ భూమియున్ వింతగా కాంతల  
వర్ణము ఎర్రగా కలిగి ఉంచు   
అట్టినీ రూపము ధ్యానించు పురుషులు 
స్త్రీలు సర్వ దే వతలను ప్రేమించి        
ఊర్వశి మేనకా అప్సర రంభగా 
వస్యులై పోవునీ శక్తి చేత       

తేటగీతి 
అమ్మ శాంభవి నీశక్తి ఇదియు అనిన 
అడవి జింకల కన్నుల గలగలవియు 
నీకు సుమ నయ నాలన్ని కాపు కాసి
మమ్ము రక్షించు దేవతా మూర్తివమ్మ  .... ... 18       

--(())--.....  ..... ....


MAHALKSHMI GLOBAL - are Creating The Internet Community Adherents of The Goddess of Good Luck & Prosperity - LAKSHMI. Follow on patreon.com/mahalakshmiglobal

ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక. శ్రీ మాత్రేనమ:  
సీస పద్యములు  - సౌందర్య లహరి - (19 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
        
వదనమ్ము ముఖమును బిందువు గాచేసి 
క్రిందభా గమ్ములో  సూర్య చంద్ర 
వక్షోజములు మరి క్రింది భాగములోను         
హరునికి సగమిచ్చి కామ కళను 
ధ్యానించే వానికి స్త్రీవశీ కరణమ్ము 
అతిలోక అంగన సుంద రాంగు
లందరు మూడు లోకాలను మోహింప 
చిత్రాతి చిత్రమ్ము అమ్మ దయయె  

సహజ పడచుల అందాలు మెరుపు లన్ని 
అల్ప విషయము అని తెల్ప లేను నేను        
అమ్మ నీకామ కళలను ఈశ్వ రుండె  
వర్ణనను చేయ గలదు మెవరు కాదు 


--(())--  .......   ...... ......  19 

Tanjore painting, Tanjavore painting, Gajalakshmi, devi Lakshmi, Adi Lakshmi, Alamelu, Ambuja, Anisha, Chanda, Devika, Dhanalakshmi, Dhan Lakshmi, Mahalakshmi, Padmasundari, Rukmini, Satyabhama, Shivakari, Lakshmi, Gajalakshmi
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక. శ్రీ మాత్రేనమ:  
సీస పద్యములు  - సౌందర్య లహరి - (20 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ఓపర మేశ్వరి నీ దివ్య అంగాల 
నుండియు వెదజల్లు  కిరణ ములను 
హృదయంతొ ధ్యానించ గలవాడు, నీ చంద్ర 
కాంతులు మణివలె చూపు లన్ని 
శిలవలె మనసుతో ప్రార్ధించు వానికి 
భవరోగ పీడిత లేక ఉంచి      
అమృతము కురిపించి సుఖాన్ని చేకూర్చి  
ఆనంద మును పంచు తల్లివియును    

సర్పముల మదము అణచి వేసె గరుడు 
దృష్టి మాత్రంచె జ్వరాన్ని తరిమి వేయు
ధ్యానమును చేయు వానినీ రక్ష చేయు 
అమ్మ యోభక్త రంజని   సుఖము నిమ్ము        


--(())--


2 కామెంట్‌లు: