28, ఆగస్టు 2020, శుక్రవారం

గీతోపనిషత్తు



Home / Twitter


గీతోపనిషత్తు - సాంఖ్య యోగము  - 30 📚

దేహీ నిత్య మవధ్యో-యం దేహే సర్వస్య భారత |
తస్మా త్సర్వాణి భూతాని న త్వం శోచితు మర్హసి || 30 


గీతోపనిషత్తు (తేటగీతి పద్యాలు )
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

సృష్టి అంతయు ఒక దిశ చందమామ  
మరియొక దిశన అవ్యక్త ముగట మామ  
వ్యక్త మైననుఁ రూపమ్ము వీధి మామ   
వ్యక్త అవ్యక్త జననము వ్యాధి మామ  

నీరు వర్షమైనప్పుడు నిలకడగను  
చలికి  కఠినమై మంచుగా తలగడగను 
సూర్య రశ్మిచే మనసున చరిత మగును 
వ్యక్త అవ్యక్త జననము వ్యాధి మామ

సృష్టి ఒక దృశ్యము బ్రమించు చునె చుండు 
క్షణమగుట దృశ్య ముగుటయే  కావ్యమగును      
చక్ర వలె తిరుగుచు నుండు జగతి యంత 
స్థిర అస్థిర ములచుట్టు తత్వ మగును 

సంతసము యంత వ్యక్తము చేయు చుండు 
దుఃఖమును యంత అవ్యక్త  దరిగ యుండు  
వర్ణ వివరణ వ్యక్తము  వ్యాధి గుండు  
సూక్ష్మ గ్రాహ్యము మనిషిని స్థితిని మార్చు 

చక్ర లగుచువస్తువలన్ని చెదలు పట్టు  
ధర్మ చక్రము మనుషుల దారి మార్చు  
దాన ధర్మాలు చేయుట ధర్మమవ్వు  
పుట్టు టయుగిట్టుటయు కోర్క పుడమి తల్లి  

--(())--

గీతోపనిషత్తు (తేట గీతి పధ్యాలు)
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

ఎవరి ధర్మము వారిని రక్షా చేయు 
నాయకత్వము ధర్మము నడచి యున్న 
సంఘ మంతయు ధర్మము నడుచు చుండు 
అందు వలననే దేశసుభిక్షమగును  

ఎవరు ఏపని అయినను చేయు చుండు 
ఏపని సుగమము కాకయు ధనము చేర్చు 
వృత్తి పనులన్ని అటకను చేరి యుండె 
డబ్బు ఉంటె కలిప్రభావమ్ము చూపు  

వరుస మారిన ఎవరుచే సేటి పనిని 
వారు చేసిన మంచిది కుక్క చేయు 
పనిని గాడిద గుఱ్ఱము చేయు పనిని 
ఏనుగు అన్నియు గుణమును బట్టి చేయు  

వేదము బ్రాహ్మ ణుడు చదువు గాత్రముగను 
అన్య కులములు చదువుట జరుగుచుండు 
అందరు కలగాపులకము గాను పనులు 
చేయు ధర్మము వెక్కిరించుటయు జరుగు   

క్షత్రియుడు ధర్మ రక్షణ చేయ వలెను 
బ్రాహ్మణుడు ధర్మ బోధను చేయవలెను 
తత్వ మును పలుకుట మిడి జ్ఞానమేను 
ఒక్క దానిని నమ్మిన విద్య బతుకు  

చేత కాని పనిని చేయు కాల మంత 
వ్యర్ధ పరుచుట అవమాన పొంది నష్ట 
పరుచు పాపపు మూటను కట్టు చుండు 
తనది కాని పనిలొ తల దూర్చ వలదు   

కాల మాయయు వాయువు నందు ఉన్న
ఆయువు ఇపుడు ప్రాణుల్లొ  హాని కలుగు
మనసు పెట్టిన నిడియంత విష్ణు మాయ
నేను అనునది వదిలిన మోక్ష మేగ ? 

కాల మాగదు పరుగున చలన మందు
ఆయు వాగదునేకొంచ మలుపు తీర
వెతకి జూడగ నిదియంత విష్ణు మాయ
నేను గాకమిగిలినది నిలచునేమి?





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి