17, ఆగస్టు 2020, సోమవారం

అంతర్జాల పత్రిక కధలు -2





చిత్రంలోని అంశాలు: 1 వ్యక్తి, 'ఇంతింతై వటుడింతై శుభదినం' అని చెప్తున్న వచనం

ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక నేటి సమాచారం 
 

 బిగ్ బాస్ షో -- రాబోవు తరాల సహజీవనం
***

ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, పెళ్లి కాని
ఓ పదిమంది అబ్బాయిల్ని, అమ్మాయిల్ని ఆ ఇంట్లో రోజుల తరబడి ఉంచితే ఏమవుతుంది?

ఏదో ఒక రోజు పోలీసులు తలుపుకొడతారు, ఆ మరుసటి రోజు పేపర్లో "వ్యభిచార ముఠా గుట్టు రట్టు" అని వార్త వస్తుంది.

కానీ ఆ ఇంటికి బిగ్ బాస్ హౌస్ అని పేరుపెట్టి పెళ్లి కానీ అమ్మాయిల్ని, అబ్బాయిల్ని ఆ ఇంట్లో పెట్టి, సమాజానికి ఎందుకు పనికి రాని వాళ్ళు చేసే పనుల్ని రోజుకు రెండు గంటల చొప్పున టీవీల్లో  ప్రసారం చేస్తే దాన్ని బిగ్ బాస్ షో అంటున్నారు.

రాబోవు తరాలని సహజీవనం అనే విష సంస్కృతి వైపు ఈడ్చుకెళ్లి, ఈ దేశ కుటుంబ వ్యవస్థల్ని బజారున పడేసే ఇట్లాంటి పనికి మాలిన "షో" ల నుండి మన పిల్లల్ని దూరంగా ఉంచుదాం

BIG BOSS. BIG BOSS

ఎవడీ BIG BOSS ?
ఎక్కడ నుండి వచ్చాడు ఈ BIG BOSS ?
ఎందుకు వచ్చాడు ఈ BIG BOSS ?
ఎవరి కోసం వచ్చాడు ఈ  BIG BOSS ?
మన ఇంటికే  ఎందుకు  వచ్చాడు ఈ  BIG BOSS ?
వీడి విష సంస్కృతి ఏమిటి ?

  ప్రపంచంలోనే అద్భుతమైన , పటిష్టమైన కుటుంబ వ్వవస్ద కలిగిన వారు భారతీయులు .
విదేశీయులు సైతం మన కుటుంబ వ్వవస్ద ని ఆచరిస్తున్నారు / ఆచరించడానికి ప్రయత్నిస్తున్నారు .

ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన మన భారతీయ కుటుంబ వ్వవస్దని సర్వనానం చేయడానికి వచ్చాడు ఈ *BIG BOSS .

బారత దేశంలో అన్ని మతాలవారు , అన్ని కులాల వారు సనాతనమైన , సమ్మతమైన , ఉత్తమమైన , పటిష్ట మైన మన కుటంబమైన వ్వవస్దని ఆచరిస్తున్నారు .

మీరందరూ మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ  Big Boss ని సుమారుగా రెండు గంటలు కలిసి చూసి , ఆనందిస్తున్నారు .
మరి
మీరు ఏ నాడైన ఆలోచించినారా?
మీ రెండు తరాలు సర్వనాశనం అయిపోతున్నాయి .

ఈ BIG BOSS లో
పైళ్ళైయిన వారు / పెళ్ళికానివారు కొన్ని రోజులో ఒకే HOUSE లో కలిసి మెలసి , సహజీవనం చేస్తున్నారు .
ఈ సహజీవనం లో వీరు చేస్తున్న వెకిలి పనులు, అసహ్యకరంగా దుస్తులు , భంగిమలతో మనకు దర్సనమిస్తున్నారు .
మరి
పెళ్ళయైన స్త్రీ / పురుషులు , పరాయి వాళ్ళతో ఎలా సహజీవనం చేస్తారు . ?
ఇదేనా మన భారతీయ సంస్కృతి , సాంప్రదాయం ?
ప్రతి రోజు ఎవరో ఒకరు ఘర్షణ పడటం , తర్వాత గట్టిగా కౌగలించు కోవడం , ఇదేనా మన సంస్కృతి ?
ఎంత అసహ్యకరమైన వెకిలి చేష్టలు , వెర్రి పోకడలు .
ఇవన్నియు మనము మన కుటుంబ సభ్యులతో కలిసి చూస్తున్నాం .
మరి
భవిష్యత్తులో
మీ భార్య లేక మీ భర్త  పరాయి వాళ్ళతో సహజీవనం చేస్తే భరిస్తారా / ఒప్పుకుంటారా ?
మీ కొడుకు , కోడలు , బిడ్డ , అల్లుడు మొదలగు వారు పరాయి వాళ్ళతో కొన్ని రోజులు , కొన్ని నెలలు , కొన్ని సంవత్సరాలు సహజీవనం చేస్తామంటారు , అనుమతిస్తారా ?
యుక్త వయసులో వుండే మీ బిడ్డల మాటేంటి ?
మీతో కలిసి చూస్తున్న మీ పిల్లలు కూడా భవిష్యత్తులో ఇతరులతో సహజీవనానికి ఒప్పుకుంటారా?
ఎలా చూస్తారండి ఈ దరిద్రపు  Big Boss ని .
కాస్త ఆలోచించడి .
అందరూ చదువుకున్న వారే ,కాని కాస్త ఇంగిత జ్ఞానం కోల్పోయినారు .
మీరు చేస్తున్న తప్పుని తెలుసుకొండి .
మేలుకోండి
మీ కుటుంబాలని కాపాడుకోండి .
గత కొన్ని సంవత్సరాలుగా మన T. V.  తెలుగు సీరియల్స్ మన కుటుంబ వ్వవస్దని చీల్చి చెండాడి నాయి / చెండాడు తున్నాయి . కుటుంబ సభ్యుల మధ్యలో ప్రేమ , అనురాగాలు , అభిమానం , కరుణ మొదలగు నవి పూర్తిగా తగ్గిపోయినాయి .
విదేశి విష సంస్కృతి ని వెదజల్లే ఈ BIG BOSS ని చూస్తారా ?
BIG BOSS .హింసించడం లేదు ,మన కుటుంబాలను నిట్ట నిలువునా , అతి కిరాతకంగా గొడ్డలితో నరుకుతున్నాడు .

చూస్తారా ?  చూస్తారా ?

🚩👨‍👨‍👦‍👦సగటు భారతీయుడు బాధతో..👨‍👨‍👦‍👦🚩.


--(())--

ప్రాంజలి ప్రభ అంతర్జాల  కధలు

హృదయానికి హృదయం 

 
ఓ వ్యక్తి దగ్గరకు ఒక ఆమె వచ్చి  సర్ నా భర్త చనిపోయాడు
నాకు ఇద్దరు  పిల్లలు
ఇన్నిరోజులు నేను నాలుగిళ్ళల్లో పనిచేస్తూ నా జీవనం సాగించాను
ఇప్పుడు కరోనా కాలం కావడంతో నన్ను పని మాన్పించారు
నాకు జీవనం పోయింది
ఎలాగైనా నాకు ఒక కుట్టుమిషన్ ఇప్పించగలిగితే నేను నా జీవనం సాగిస్తానని చెప్పింది 
అతను అదే విషయాన్నీ సోషమీడియా లో పోస్ట్ చేయగా
ఒక వ్యక్తి నుండి ఫోన్ వచ్చింది
వారు నిజంగానే సహాయం పొందడానికి అర్హులేనా అని అడిగారు
అవునండి అని సమాధానం చెప్పడంతో సరే నేను కుట్టుమిషన్ తీసిస్తాను మీ నెంబర్ కు డబ్బులు పంపిస్తాను అని చెప్పాడు

వద్దు సర్ మీరు ఆ కుట్టుమిషన్ ఉన్న షాప్ యజమానికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి అని అతని నెంబర్ ఇచ్చాడు

చిన్న ఆటో మాట్లాడుకుని వెళ్ళి కుట్టుమిషన్ తీసుకుని వారికి ఆ మిషన్ కు సంబంధించి దారాలు సూది ఇతర అవసరమైన వస్తువులతో పాటు నెలకు సరిపడే సరుకులు తీసుకుని వెళ్ళి ఆమె ఇంటి ముందు ఆగగా ఆమె ఆశ్చర్యపోయి కనీళ్ళు పెట్టుకుంది

ఆమెకు సాయం చేసిన వ్యక్తిని చూపించడం కోసం వాట్సాప్ వీడియో కాల్ చేయగా అవతలి వ్యక్తిని చూసి ఆశ్చర్యం
ఒక ప్రభుత్వ ఉద్యోగి లేదా బాగా సెటిల్ అయిన వ్యక్తి అయిఉంటాడని అనుకున్న అందరికి ఆశ్చర్యం

అతను 25 ఏళ్ళ పిల్లాడు ఒక సైకిల్ పైన వీధి వీధి తిరుగుతూ టీ అమ్ముతున్నాడు
అతని యజమాని ఎవరైనా సాయం చేస్తున్నారేమో అని వెతికాడు ఎవరూ లేరు

ఇప్పుడు అతడి గురించి ఆరా తీయాలనే ఆలోచన పెరిగింది

చిన్న తనంలోనే తల్లితండ్రిని పోగొట్టుకుని ఆకలి బాధను అనుభవించాడు
పుట్టిన ఊరు వదిలి వచ్చాడు నా అనేవాళ్ళు లేకపోవడంతో
ఇలా కష్టపడి పనిచేస్తూ వచ్చాడు ప్రతిరోజు అతను 20 మందికి ఆకలి తీర్చడం మొదలుపెట్టాడు
ఇతడి గురించి తెలుసుకున్న ఎంతోమంది సహాయం చేయ ముందుకు వచ్చి డబ్బులు ఇస్తామని చెప్పినా సున్నితంగా తిరస్కరించి ఆ సహాయాలను నిజంగా అర్హులైన వారికి వారిచేత ఇప్పిస్తుంటాడు

అతడి  ఆలోచనకు సలాం
అతడి నిస్వార్థపు సేవకు నమస్కరిస్తున్న

కష్టం తెలిసినవాడు ఆ కష్టాన్ని తీర్చాలని ముందుకు వచ్చాడు నిజంగా నిజాయితీగా కష్టపడేవాళ్ళకు దేవుడు ఎప్పుడూ తోడు ఉంటాడు

🌹నా హృదయం 🌹


sekaarana panjali prabha stories

పిల్లల చదువు గురించి ఆందోళన చెందకండి .. ఒక సంవత్సరం చదువు పొతే నష్టం ఏమీ లేదు . ఇంత వయసుకు ఈ క్లాస్ అని ఏమైనా రూలా ? పిల్లలు బతికి ఉండడం ముఖ్యం   . వాక్సిన్  వచ్చాక చక్కగా బడికి వెళ్లి చదువు కుంటారు .. "   ఈ రోజు మెజారిటీ తల్లితండ్రుల అభిప్రాయం ఇదే  .

 దీనికి  నా సమాధానం :

బయపడాల్సింది చదువు గురించి కాదండీ! సంవత్సరం  రోజులు   పిల్లలు ,   స్నేహితుల్ని కలవక ఇంట్లో కూర్చొని ఉంటే అది వారి పై చూపించే శారీరక మానసిక ప్రభావం పట్ల ! ఉమ్మడి కుటుంబాలు లేవు .. కేంద్రక కుటుంబాల్లో తల్లితండ్రులు బిజీ .. ఎంత బిజీ అంటే ఆరు నెలలుగా పిల్లలు ఇంట్లో ఉంటే అది వారి పై ఎలాంటి ప్రభావం చూపిందో తెలుసుకోలేనంత బిజీ .. రోగం కన్నా చికిత్స వంద రెట్లు ఎక్కువ హాని చేస్తుందని గ్రహించే రోజు వస్తుంది .. అంత డామేజ్ జరగకూడదనే నా తాపత్రయం . అందుకే మీరు హర్ట్ అయినా ఫరవాలేదని ఈ సమాధానం !

చదువంటే పాఠ్యపుస్తకాల్లోని చాప్టర్ లు పూర్తి చెయ్యడం , పరీక్ష రాయడం , మార్కు లు సాధించి పై తరగతి కి ఉతీర్ణత సాధించడం .. అనే అభిప్రాయాన్ని మీ లో నూరి పోసిన విద్యా విధానానిది తప్పు . నిజమే .. పది చాప్టర్ లు వదిలేసినా .. ఒక సంవత్సరం వెనక చదివినా పెద్దగా నష్టం ఏమీ లేదు . అసలు చదువంటే అది కాదు .. కాసేపు చదువు విషయం పక్కన పెడుదాం  .

పిల్లల శారీరిక మానసిక ఎదుగుదలలో 1 . ఎగరడం .. దూకడం .. ఆడడం .. పాడడం.. గాయ పడడం.. నయం కావడం  .. 2 . తోటి పిలల్లతో కలవడం .. స్నేహం చెయ్యడం .. ఈర్ష పడడం.. కొట్లాడడం .. రాజీ పడడం .. 3 . టీచర్ ను లేదా పెద్ద వారిని చూసి అనుకరించడం , నేర్చుకోవడం .. 4 . గాలి .. ఆకాశం .. భూమి .. మట్టి .. నీరు .. ఇలా పంచభూతాలను చూడడం .. వాటితో మమేకమై కావడం .. ఇలా ఎన్నెన్నో .. వారు ఎదిగే క్రమం లో ఇవన్నీ అత్యవసరం .. సహజం ..

తీవ్రమైన నేరం చేసిన వాడికి జైలు శిక్ష పడుతుంది . బయటి వారిని కలిసే అవకాశం ఉండదు . బయటకు వెళ్లే స్వేచ్ఛ ఉండదు . నేటి పిల్లలకు తల్లితండ్రుల  ప్రేమే శిక్ష గా మారుతోంది . ఆరు నెలలుగా వారు ఇంట్లో బందీలు .. చేయని నేరానికి వారికి ఎందుకీ  శిక్ష ?

నేనేదో త్వరగా స్కూల్స్ తెరచుకోవాలని ఇలా పోస్ట్ పెడుతున్నాను అనుకొనే వారికి కోటి దండాలు . స్కూల్ తెరిస్తే చుట్టూరా కరోనా మానసిక రోగులు .. ఒక డ్రైవర్ కో  ఒక టీచర్ కో ఎక్కడో కరోనా సోకినా అది స్కూల్ లోనే సోకింది అని వివాదం సృష్టించడానికి  కొంత మంది   రెడీ గా వుంటారు . అదేదో స్కూల్ నడిపే వాడే కరోనా సృష్టి కర్తగా వాడి అసమర్థ వల్లే కరోనా వ్యాపించినట్టుగా టీవీ ల లో బ్రేకింగ్ న్యూస్ లు .. అవసరమా ? కలియుగాంతం వరకు పాఠశాలలు తెరుచుకోక పోయినా నేనేమీ చచ్చి పోను .. అడుక్కోవడం .. దొంగతనం చెయ్యడం మినహా ఏ  వృత్తి అయినా  చేపట్టి నా పొట్ట పోషించుకొంటాను . అసలు ఇక్కడ సమస్య స్కూల్ నడపడం/  నడపలేక పోవడం కానే కాదు .

  పిల్లల ప్రపంచాన్ని పూర్తిగా అర్థం చేసుకొన్నవాడిని . నేడు వారి పరిస్థితి  ఏంటో ఇంకా చాల మందికి కనీసం అర్థం కాక పోవడం చూసి బాధ కలిగి ఈ పోస్ట్ పెడుతున్నా! 

 మొన్నటి ఉమ్మడి కుటుంబాలు వేరు .. అదో మినీ సమాజం .. ఇంట్లో పిలల్లకు తమతోటి వయసు వారి కంపెనీ  దొరికేది .. గ్రామాల్లో ప్రకృతి తో మమేకం అయ్యి ఎన్నో విషయాలు నేర్చుకొనే అవకాశం ఉండేది .. ఇంట్లో అవ్వ,  తాత,  మేనత్త,  పిన్ని .. ఇలా పిల్లలకు నైతిక ప్రవర్తన నేర్పటానికి వారి కలిసి ఆడడానికి,  పాడడానికి,  వారికి కథలు చెప్పడానికి గోరు ముద్దలు తినిపించడానికి ఎంతో మంది .

మరి నేటి పట్టణాల్లో .. ఇంట్లో ఒంటరిగా పిల్లలు .. అమ్మ నాన్న తమ పనిలో బిజీ .. కాసేపు పిల్లల తో సమయం గడిపినా .. నిన్నటి దాక ఇద్దరికీ  అలవాటు లేని వ్యవహారం .. ఎవరి లోకం వారిది .. పిల్లలకు తమ ఈడు వారి కంపెనీ లేదు .. ఆటలు లేవు .. పాటలు లేవు.. ఉన్నదల్లా సెల్ ఫోన్ .. ఆన్ లైన్ క్లాస్ ల పుణ్యమా అంటూ అది ఇప్పుడు అధికారికం అయి పోయింది . వారెక్కడికి పోతున్నారో .. ఏమై పోతున్నారో చూసి కనీసం అవగాహాన చేసుకొనే   అవకాశం   తలితండ్రులకు లేకుండా పోతోంది

చేయని పాపానికి పసి వారికి ఎందుకీ శిక్ష ?  ఒక తరం పిల్లల బాల్యం బలై పోతుంటే .. స్కూల్స్ తెరవడం అంటే అదేదో స్కూల్ యాజమాన్యాల అలాగే ప్రైవేట్ టీచర్ ల బతుకు తెరువు కోసమే అన్నట్టుగా  గా ప్రచారం జరిగిపోతుంటే .. అయ్యా బాబు .. పాఠశాలలు ఎక్కడైనా చావనీ .. సమస్య పిలల్ల బాల్యం .. వారి సామాజీకరణ .. అది లేని పక్షం లో వారికి కలిగే తీవ్ర శారీరిక/ మానసిక సమస్యలు ..  అని చెప్పాలని నా ప్రయత్నం !
 
    కనీసం ఇదో సమస్యగా నైనా గుర్తించారా ? అయ్యా ఆధునిక తల్లీతండ్రీ ! మీ ప్రేమ బంగారం కాను ! మీ బంగారు  పంజరం లో మీ పిల్లలు ఎలా వున్నారో రోజూ చూసే మీకు అర్థం కాక పొతే ఒక ఉపాద్యాయుడు .. ఒక మానసిక శాస్త్రవేత్త .. అదీ వద్దు .. వూళ్ళో ఉన్న వారి అవ్వ .. తాత కు చూపండి . ఆరు నెలల్లో వారిలో వచ్చిన మార్పు ఏమిటో వారే చెబుతారు . ఇది ఇంకా ఎంత కాలమో అటు పై మీరే నిర్ణయిద్దురు గానీ !

----------
రాసినది Amarnath Vasireddy గారు ప్రముఖ విద్యావేత్త , మాజీ సివిల్స్ కోచింగ్ మెంటర్, ఆంత్రోపాలజీ సబిజెక్టు నిపుణులు.
స్లెట్ స్కూల్ చైర్మన్


రామాయణం_గుండ్రాయి🌷🌷

ఒక ఊరిలో ఎవరో రామాయణ ప్రవచనం చెప్తున్నారు. బండోడు శ్రద్ధగా విని అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు.

"రామాయణం నీకేం అర్ధమైంది" అని అడిగింది భార్య.... "నాకేం అర్ధం కాలేదు" అన్నాడు బండోడు

 ప్రవచనం జరిగిన పది రోజులూ ఇదే తంతు. ప్రవచనం నుండి రాగానే నీకేమర్ధమయింది అని భార్య అడగడం, నాకేం అర్ధం కాలేదని బండోడు చెప్పడం. భార్యకి కోపం నషాళానికి అంటింది.

"ఇదిగో ఆ గుండ్రాయి తీసుకు పోయి దాన్తో నీళ్ళు పట్రా" అంది. .  బండోడు వెళ్ళి గుండ్రాయిని నీళ్ళల్లో ముంచాడు. గుండ్రాయి లో నీళ్ళు నిలబడవు కదా. అలాగే తీసుకొచ్చాడు... భార్య మళ్ళీ తెమ్మంది.... మళ్ళీ వెళ్ళాడు.... అలా పది సార్లు తిప్పింది.
"చూసావా.. ఆ గుండ్రాయితో నీళ్ళు తేలేకపోయావు..... అలాగే పది రోజులు రామాయణం విన్నా నీకు ఏమీ అర్ధం కాలేదు.
నువ్వా గుండ్రాయితో సమానం" అని ఈసడించింది.

అప్పుడు బండోడు అన్నాడు, ".గుండ్రాయి నీళ్ళు తేలేక పోయిన మాట నిజమే కానీ పదిసార్లు నీళ్ళల్లో మునగడం వల్ల మాలిన్యం అంతా పోయి అది శుభ్రపడింది కదా.....  అలాగే రామాయణం నాకేమీ అర్ధం కాకపోయినా పది రోజుల్నుండీ వినడం వల్ల మనసు తేలిక పడ్డట్టు హాయిగా వుంది. మనసు ప్రశాంతంగా వుంది" అన్నాడు.

భర్తకి అర్ధం కావల్సిన దానికన్నా ఎక్కువే అర్ధం అయిందని భార్యకి అర్ధం అయింది !

*నవ విధ భక్తి మార్గాల్లో #శ్రవణం ఒకటి... విన్నా చాలు!

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🙏🏻🕉️




ఈ సాల్ట్ వాటర్ గార్గ్లింగ్ అదీ నువ్వెలా చేస్తావసలు? నాకు ఎన్నేళ్లయినా రాదు. ప్రతిసారీ గొంతులోకెళిపోవడమే!’ అంది ఉప్పునీళ్ల గ్లాసుతో సహా గదిలోకొచ్చి.

ఉత్సాహంగా మంచం దిగుదామని అనుకున్నవాణ్ణే, చరణ్ రాజ్ వయసులో రామ్ చరణ్ లా అటువంటి ఫీట్సవీ అనవసరమని భావించి, ‘రామచంద్రా, రాఘవేంద్రా, ఎన్ని ఇక్కట్లు పెడుతున్నావయ్యా!’ అని మూలుగుతూ కిందకి దిగి, కళ్లజోడు తీసి, సుతారంగా తుడుస్తూ చెప్పడం మొదలెట్టాను..

‘ఏంలేదు బన్నీ! కాసిని ఉప్పునీళ్లు నోట్లో పోసుకుని, ఇలా తల పైకెత్తి, ‘నిళల్గళ్ రవి’ అనే యాక్టర్ పేరు పదిపదిహేను సార్లు పలికితే అవే నిలబడతాయి నీళ్లు’ అన్నాను.

‘అదేంటది?’ అంది అసహనాన్ని ఔటర్లో ఆపి.

‘ఒక మనిషి పేరులో అన్ని ‘ల’లు, ‘ళ’లు ఉండడం వేరెవరికీ అసాధ్యం. అతనొక్కడికే ఉన్నాయి. మనం పుక్కిలించేటప్పుడు ళొళొళొ.. అంటాం కదా? అందుకని ఇది ఈజీ పద్ధతన్నమాట!’

‘ఒక్కమాట తిన్నగా మాట్లాడవు కదా! నిన్నడిగాను చూడూ? సర్లే, కాఫీయా, గ్రీన్‌టీయా? ఏం కలపను?’ అంది గదిలోంచి బయల్దేరుతూ.

కాఫీ అనేది మనీబ్యాక్ పాలసీ లాంటిది. తాగిన వెంటనే ఉత్సాహంగా అనిపిస్తుంది.

గ్రీన్‌టీ ఎండోమెంట్ పాలసీ లాంటిది. తాగిన చాన్నాళ్ల తరవాత గుణం కనిపిస్తుంది.

ఏది తాగుదాం?

ఈ విధంగా ప్రతిరోజూ నాలోని కస్ప్ బోర్న్ డైలమా బయటికొస్తుంది. ఇలా అయితే కష్టం సుమీ?

...రాత్రికి అన్నవాఁ, చపాతీయా?

...సాయంకాలం కాఫీయా, టీయా?

...ఉదయాన్నే ఇడ్లీలు తినెయ్యడమా, లేదంటే కాసేపు గొడవపడి, ఆనక చేసేదేంలేక, నోరుమూసుకుని తినడమా?

...జీవితం మీద విరక్తొస్తే చూడాల్సింది అజ్ఞాతవాసా, బ్రహ్మోత్సవమా?

...గెడ్డం పెరగాలా, గొరగాలా?

అన్నీ డోలాయానుమానాలే!

నేనింకా మన రాష్ట్రప్రజల్లా ఏది రాజధానో నిర్ణయించుకోక ముందే తను గ్రీన్‌టీ తెచ్చి ముందు పెట్టేసింది.

‘నేనేదీ చెప్పకుండానే తెచ్చేశావేం?’ అని కోప్పడదామనుకున్నవాణ్ణే మళ్లీ మానేశాను. అసలే తన పేరు కె.కె.డి. భవాని. అంటే ‘కొచ్చెర్లకోట కనకదుర్గా భవాని’.... అనుకున్నారా? నిజమే! కానీ ‘కయ్యానికి కాలు దువ్వే భవాని’ అనికూడా ఇంకొక లోకోక్తిని ప్రచారంలోకి తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాను.

సరే, కప్పు తీసుకుని టీ తాగుతోంటే ఒక్కొక్క గుక్కకీ ఒక్కో టైరూ కరిగిపోతున్నట్టు ఫీలైపోతూ, ఈ గ్రీన్‌టీ మహత్యం గురించి ఎఫ్.బీ.లో స్టేటస్ పెడదామని ఫోన్ ఓపెన్ చేశాను...

‘రుచికూడా, ఆరోగ్యం కూడా, #గ్రీన్‌టీ’ అని!

‘టీ తాగే కాసేపైనా ఫోన్ పక్కనపెట్టొచ్చు కదా?’ అని యశోదకృష్ణ సినిమాలో కంసుడికి ఆకాశవాణి వినబడినట్టు ఎక్కణ్ణుంచో వినిపించింది. నిజానికి తనసలు అక్కడ లేనే లేదు. అదంతే! అదొక మైండ్ హంట్! వెంటనే ఆ ప్రయత్నం విరమించుకున్నాను.

అసలు ఉప్పంటే గుర్తొచ్చింది.. దీనికొక కథుంది..!

ఓరోజిలాగే డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని దోశలు తింటూ లోపలికొక కేకపెట్టాను..

‘ఇదిగో ఈ టమాటా పచ్చట్లో ఉప్పెక్కువైంది. దీన్ని కాస్త రిపేరేదైనా చెయ్యి. లేకపోతే తిన్న తరవాత బీపీలు పెరిగిపోయి, కోపాలొచ్చి కొట్టుకున్నా కొట్టుకుంటాం!’

మా వంటావిడకి ఓ కూతురుంది. ఆ పిల్లకి పెళ్లి చెయ్యకముందు మా ఇంట్లో వంటలవీ బావుండేవి. పెళ్లి చేసిన మూడునెలల తరవాత ఆ దంపతులిద్దరికీ ఏవో చిన్న చిన్న తగాదాలవీ రావడం, వెంటనే ఆ పిల్ల ఫోనందుకుని తల్లికి చెయ్యడం.. కాసేపటికి అదే విషయాన్ని ఫ్లిప్ వెర్షన్లో అల్లుడు ఫోన్ చేసి చెప్పడం. ఇదొక ఆటగా మారింది.

దురదృష్టం ఏవిఁటంటే, ఆవిడ సరిగ్గా ఉప్పేసే టైములోనే ఫోనొస్తుంది. దాంతో కూతుర్ని కోప్పడుతూ ఒక చెంచా, అల్లుణ్ణి అదిలిస్తూ రెండు చెంచాలూ వేసేస్తోంది. దాంతో నేను డాక్టర్ లవణం అని పేరు మార్చుకోవలసిన అవసరం వచ్చేలా ఉందని ఆవిడకి కాస్త కఠినమైన హెచ్చరికలు జారీచేశాను.

‘మీరు మా ఉప్పుతిని బతుకుతున్నారో, మేం మీ ఉప్పుతిని బతుకుతున్నామో అర్ధంకావట్లేదు. కాస్త వంటదీ చేసేటప్పుడు ఫోనదీ మాటాడకండీ!’ అంటూ వేడుకున్నాను.

అప్పట్నుంచీ కాస్త నయం. కానీ మధ్యమధ్య మళ్లీ ఏదో ఫోను రావడం, ఇలాంటి ఉప్పుద్రవం సంభవించడం జరుగుతుంది. వాళ్లిద్దరికీ బొత్తిగా ఉప్పూ నిప్పూ అయిపోయింది. తద్వారా మా అల్మారాలన్నీ టెల్మా బిళ్లలతో నిండిపోయాయి.

ఈ కరోనా గురించి అనునిత్యం వచ్చే సూచనలూ, సలహాల్లో అతి ముఖ్యమైనది.. ఉప్పునీళ్లు పుక్కిలించడం. అందులో నేను పరమశివుణ్ణి. అలా.. గొంతులో ఎంతసేపైనా పట్టుంచగలను. తనకదొక విడ్డూరం.

నా ఆలోచనల్లో నేనుండగా నా కొడుకులిద్దరూ కలిసి గదిలోకొచ్చారు. ఈ లాక్‌డౌన్ పెట్టినప్పటి నుంచీ వాళ్లు డైనోసార్లలా జంటగా తిరుగుతున్నారు. భోజనానికి కూడా అంతే! కలిసే వస్తారు, మళ్లీ చిలకజోస్యం వాడి చిలకల్లా భోజనం అవ్వగానే బోన్లోకెళిపోతారు. మధ్యలో మా చిలకమ్మ జామకాయలో, యాపిల్సో ముక్కలు కోసి, బోన్లోకే పట్టుకెళ్లి ఇద్దరికీ మేపేసి వస్తూ ఉంటుంది.

వాళ్లిద్దర్నీ చూసి ముఖేషూ, అనిలూ అందామంటే వాళ్లకుమల్లే ఆస్తులూ లేవు, తగాదాలూ లేవు

మంచు విష్ణు, మంచు మనోజ్ అని ఒకసారి అన్నానని చాలా గట్టిగా వార్నింగిచ్చారిద్దరూ.

‘పెంచడం ఇష్టంలేకపోతే రోడ్డుమీద వదిలెయ్ నాన్నా, అంతేగానీ ఇలా మనసు గాయపరచకు!’ అని కళ్లనీళ్లెట్టుకున్నారు.

అఖిలూ, నాగచైతన్యా అందామంటే ఒకతల్లి పిల్లలేనాయె!

ఇంకెందుకని వాళ్లని వాళ్ల పేర్లతోనే పిలుస్తున్నాను.

‘ఏంట్రా? ఏంచేస్తున్నారిద్దరూ? కొంపదీసి చదువుకుంటున్నారా ఏవిఁటి?’ అన్నాను నవ్వుతూ.

‘ఇప్పటివరకూ చదువుకుని, మరీ ఎక్కువ చదివేసినట్టనిపించి బయటికొచ్చాం!’ అన్నాడు పెద్దాడు.

చిన్నాడు కంప్యూటర్లో ఏవో కోడింగులవీ చేస్తూ వుంటాడు. వాణ్ణి నేను ‘కోడ్’పుంజని పిలుస్తాను. ఈ కోడింగ్ పాఠాలంటూ యూట్యూబ్  కోసం చాలా తాపత్రయ పడి వీడియోలవీ రికార్డ్ చేస్తూంటాడు. అందులో భాగంగా నాల్రోజులకొకసారి ఇంట్లో అందరికీ వార్నింగొకటి ఇస్తూంటాడు.

‘ఇవాళ నేను రికార్డింగ్ చేసుకోవాలి. ఆ గదిలో కూచుంటా! అక్కడికి ఏ సౌండూ వినబడకూడదు నాకు. ఒరేయ్, నువ్వా జాన్ విలియమ్స్ బీజీఎమ్స్ అవీ ఆ మార్షల్ స్పీకర్లో పెట్టకు. చెవుల్లో ఏ ఎయిర్‌పాడ్సో పెట్టుకుని వినేడు! నాగ్గనక బయటికి వినబడిందంటే మర్యాద దక్కదు!

అమ్మా, అమ్మమ్మా! మీరివాళ యూట్యూబులో శోభన్‌బాబు సినిమా చూడకపోతే వచ్చిన నష్టమేవీఁ లేదుగానీ, హాయిగా రామకోటి రాసుకోండిద్దరూ! నాన్నెలాగూ ఇంట్లో ఉండరు. సో, అదీ విషయం!’ అంటూ మోనోఏక్షన్ చేస్తాడు కాసేపు.

ఆమధ్య ఈ లేడీసిద్దరూ ‘రాముని మించిన రాముడ’నే సినిమా ఒకటి పెట్టుకు చూస్తున్నార్ట! పొరపాట్న మా పెద్దాడూ కాసేపు చూడ్డం తటస్థించింది. అందులో వాణిశ్రీ ఒరిజినల్ రామారావే అనుకుని ఎంతసేపూ డూప్లికేట్ రామారావు వెంటపడుతూ వేధిస్తోందిట. పాపం, చిత్తశుద్ధిగల ఎన్టీవోడేమో, ‘నీ ‘ఇలాకా’ నేనుకాదూ, అతను యుద్ధంలో పోయాడూ!’ అని చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటాట్ట. చూసిచూసి మావాడికి చిరాకేసి ‘ఏవిఁటో, ఇందాకట్నుంచీ శోభనం శోభనం అని చచ్చిపోతోంది ! ఎలా చూసేవారమ్మా, ఇలాంటి సినిమాలన్నీ?’ అనేసి కోపంతో లేచెళిపోయాట్ట! ఇక వాళ్లిద్దరూ కిందపడి దొర్లుతూ నవ్వులే నవ్వులు.

చిన్నాడు కాస్త పాత సినిమాలవీ బానే చూస్తాడు. వాళ్ల రుచులూ, అభిరుచులూ మన దేశానికి చెందినవి కావు.

ఈ లాక్‌డౌన్లవీ మొదలైన కొన్నాళ్లపాటు మా లేడీస్ ఇంట్లో రకరకాల వంటలవీ ప్రయోగాత్మకంగా చేశారు. మళ్లీ బోరనిపించిందో ఏమో, గత నెలరోజులనుంచి పాటల మీద పడ్డారు. రోజంతా హాస్పిటల్లో ఆపరేషన్లు చేసి, ఇంటికొచ్చి భోజనం చేసీ చెయ్యంగానే ‘ఇవాళేం పాట పాడతావు?’ అని తనడగడం, నేను కాదనలేక పాడ్డానికి సిద్ధపడిపోవడం అలవాటైపోయింది.

అందుకే ఈమధ్య వరసగా పాటలవీ పాడేసి పెట్టేశాను. అవన్నీ విన్న మన మిత్రులు నా గళాన్ని అంచనా వెయ్యడంలో ‌పదిపదిహేను వర్గాలుగా విడిపోయారు. అపరిచితుడు సినిమాలో విక్రముడికి మల్లే నా గొంతులో ఉన్న అన్నిరకాల షేడ్స్ ఎవరికీ అర్ధంకాలేదు. ఎందుకంటే అంతకుముందు నాకీ ‘పాడ’లవాటు లేదు.

ఒకరేమో ‘బాలూని కొట్టేస్తావు!’ అనేశారు.

ఇంకొకరెవరో ఆనంద్ పాట పాడితే ‘అచ్చం రామకృష్ణ పాడినట్టే పాడారు!’ అన్నారు

ఒకావిడేమో ‘బయట మీగొంతు ఇలా లేదండీ? ఫాల్స్ వాయిస్సా?’ అనే ధైర్యం చేసేశారు.

మరొహాయన మరికాస్త ముందుకెళ్ళి ‘ఎందుకొచ్చిన పాటల్లెద్దురూ, ఏదోవొకటి రాసుకోక?’ అంటూ తీసిపడేశారు.

మిరియాల కషాయం తాగమని ఒకరంటే, కషాయాలవల్ల ‘రాగ’నిరోధక శక్తి పెరిగిందని ఒకరన్నారు.

ఇదంతా వాళ్ల తప్పుకాదు. సర్జన్లు అనస్తీషియా ఇచ్చినా, అనెస్తీటిస్టులు సర్జరీలు చేసినా ఇలానే అంటారు.

ఏదైతేనేం, కషాయాలు తాగో, కరక్కయాయలవీ నవిలో మళ్లీ మాంఛి పాటొకటి పాడాలన్న తపనే నా దగ్గరున్న వెపను. రెడీగా ఉండండందరూ!

మేం ముగ్గురం కబుర్లు చెప్పుకుంటూ ఉండగా.. ‘అమ్మబాబోయ్! నావల్ల కాదు!’ అంటూ మళ్లీ ఉప్పునీళ్ల గ్లాసుతో ప్రవేశించింది తను.

‘మళ్లీ మింగేశావా?’ అన్నాను నవ్వుతూ.

‘అంతే! అదొక బ్రహ్మవిద్య. అలా గొంతులోనే ఆపడమనేది జగదీశ్వరునికే సాధ్యం!’ అంటూ కాలరూ, భుజాలూ ఎగరేశాను.

కాసేపలా నవ్వొస్తే నవ్వుకోండి.
చిత్రంలోని అంశాలు: 2 మంది వ్యక్తులు, వ్యక్తులు నిలబడి ఉన్నారు



ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక కధలు (19)

సేకరణ రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

సత్య ప్రసాద్

“#ఇప్పుడు నీకు దేవుడి కనపడి ఏదైనా కోరుకోమంటే ఏం కోరుకుంటావు?” అడిగాడు ఆయన. 
ఆమె అతని వైపు ఆశ్చర్యంగా చూసింది.

దాదాపు యాభై ఏళ్ళ సంసార సాంగత్యం. దేవుడి విషయంలో వాదన జరగని రోజు లేదు.

“చివర్రోజుల్లో చాదస్తం వస్తుందంటారు. మీరు దేవుడి గురించి మాట్లాడటమేమిటి? పడుకోండి” అంటూ అప్పుడే ఆయనకు వేసిన మందుసీసా మూత పెట్టిందామె.

“ఇప్పుడు మాత్రం నేను దేవుడున్నాడన్నానా? నీకు నమ్మకం కాబట్టి నీకు కనిపిస్తే ఏం అడుగుతావనే కదా అడిగాను” తల తిప్పి తన వైపు చూస్తున్న అతని తలని నేరుగా పెట్టింది ఆమె.

“ఎప్పుడూ ఆ సీలింగ్ నే చూడమంటే ఎలాగ పద్దూ... వుండే నాలుగు రోజులు నీ ముఖం చూడనీ” అన్నాడాయన మళ్ళీ ముఖం ఆమె వైపు తిప్పి.

ఆమె కిసుక్కున నవ్వింది.

పద్దు ఆమె పేరు కాదు. పెళ్ళైన కొత్తల్లో పిలిచేవాడలా... ప్రతి ఖర్చుకీ లెక్కలు రాస్తోందని.
“ఆ పేరు గుర్తొచ్చిందే?”
“జ్ఞాపకాన్ని మించిన ఆనందం ఏముటుంది ఈ వయసులో? సరే విషయం దారిమళ్లుతోంది. దేవుణ్ణి ఏం కోరుకుంటావ్?”

ఆమె అతని దగ్గరగా వచ్చి మంచం మీద ఒక పట్టీ చివర కూర్చుంది.

“ఏం కోరుకుంటాను. మా ఆయన ఆరోగ్యం బాగుపడీ..” మురిపెంగా తల మీద చెయ్యి వేస్తుంటే వద్దన్నట్లు పట్టుకున్నాడు.
“వీటినే గొంతెమ్మ కోరికలంటారే గొంతెమ్మా... డాక్టర్ చెప్పలేదూ? వారమేనని. అందులో మూడు రోజులు అయిపోయాయి... ఇంకో నాలుగో అయిదో..”
“చాల్లే ఆపండి. ఏం కాదు. వాళ్ళకు తెలిసి ఏడ్చి...”
“వాళ్ళకి తెలియకపోయినా నాకు తెలుస్తోంది కదా... నీకు మాత్రం తెలియట్లేదూ?”
“కనీసం మనవడి ముద్దు ముచ్చట చూసేదాకైనా...”
“ఆ తరువాత? వాడి పెళ్ళి. మునిమనవడు. వాడి బారసాల... అంతం వుందంటావా?” గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడాయన.
“జరిగేదేదో జరుగుతుంది, మీరు మాట్లాడకుండా పడుకోండి. ఆ భగవంతుడు తల్చుకుంటే ఏ అద్భుతమైనా జరగచ్చు”
“పిచ్చిదానా నిజంగా నీ భగవంతుడు చేసే అద్భుతాలేమైనా వున్నాయంటే అవి రెండే - పుట్టుక, మరణం. నువ్వన్నట్లు అద్భుతమే జరగబోతోంది.” ఆమె అతని పదవుల మీద కుడి చేతి చూపుడు వేలు పెట్టి అతని మాటలు ఆపేసింది.
అతను కళ్ళు మూసుకోని ఇబ్బందిగా కదిలి బాధగా మూలిగాడు. అంతలోనే కళ్ళు గట్టిగా బిగించేసి బిగుసుకుపోయి నిద్రపోయినట్లు నటించాడు.
ఆమె నవ్వుకుంది. “అన్నీ దొంగ వేషాలే” అనుకుంది మనసులో. బయట వర్షం మొదలైంది.
“నిద్రపోతున్నావా? లే… వర్షం చూద్దువుగాని లే…” పెళ్ళైన కొత్తల్లో ఓ సాయంత్రం నిద్రలేపుతూ అతనన్న మాటలు గుర్తుకొచ్చాయామెకి.
“పడుకోనివ్వండి. అయినా వర్షం చూసేదేంటి?”
“చూసేదేంటి అంటే ఏం చెప్పేది? చూస్తే తెలుస్తుంది”
“వర్షం అంటే గుర్తొచ్చింది. బట్టలు ఆరేసాను..” గబగబా లేచి పరుగెత్తిందామె.
“వర్షం అంటే గుర్తుకొచ్చేది ఆరేసిన బట్టలా? బాల్యం గుర్తుకురావాలి. కాగితప్పడవలు గుర్తుకురావాలి.” కిటికీ దగ్గర స్టూల్ వేసుకోని కూర్చున్నాడతను. దండెం మీద బట్టలను గబగబా లాగుతూ కనిపిస్తోంది. తడుస్తూనే ఎడమ భుజం మీద బట్టలన్నీ మోపులా వేసుకుంటూ వుందామె.
“అలా కిటికీలోంచి చూస్తూ కూర్చోకపోతే వచ్చి నాలుగు బట్టలు అందుకోవచ్చు కదా…”
“నేను సహాయం చేస్తే నీకు బాగుంటుందేమో. నిన్ను అలా చూస్తుంటే నాకు ఆనందంగా వుంటుంది” నవ్వాడతను.
లోపలికి వచ్చాక తడిసిన బట్టలను దులుపుకుంటూ అతన్ని ఫెళఫెళలాడించింది.
“నానా చాకిరీ చేస్తుంటే మీరు మాత్రం చూస్తూ కూర్చోండి. ఒక్క పనికి సాయం లేదు కదా” అంది
“నేను చూస్తోంది నీ అందం కాదు దేవీ. నువ్వు నన్నూ, మన సంసారాన్ని బాధ్యతగా తీసుకున్నావన్న సంతోషం కోసం చూస్తుంటాను.” ఆమె పేరు దేవి కూడా కాదు. అదో నాటకీయ ఫక్కీ.
“బద్దకానికి పది రకాల అబద్దాలు” నవ్వేసి వచ్చి అతని పక్కనే కిటికీలోంచి చూస్తూ కూర్చుంది.
ఆయన మాటలతో మళ్ళీ ఈరోజులోకి వచ్చిపడింది.
“ఏం చేస్తున్నావు కిటికీ పక్కన?” తల మళ్ళీ తిప్పాడాయన.
“నిద్రపొమ్మన్నానా?”
“ఒకేసారి పోతాలే. నిన్ను కాస్సేపు చూద్దామనిపించింది” చిలిపి నవ్వు కళ్ళలో కనిపించింది.
ఆమె అతని దగ్గరకు వచ్చింది. అతను కదలడానికి ఇబ్బందిపడుతూ కొద్దిగా తిరిగాడు.
“పిల్లలకి విషయం చెప్తే మంచిదేమో అనుకుంటున్నా” ముఖం రాయిలా పెట్టి అన్నది.
“చెప్తావు. రమ్మంటావామ్మా అంటారు. వీకెండ్ కి వస్తాం అంటారు. నా ఎండ్ వీక్ లోనో వీకెండ్ లోనో తెలియదు కదా?”
“చాల్లేండి. పిల్లలు మరీ అంత చెడ్డవాళ్ళేం కాదు”
“కాదులే. ఇప్పటి పిల్లల్తో పోలిస్తే మనవాళ్ళు కాస్త నయమే అనిపిస్తుంది. అయినా నువ్వు మరీ అంత గుడ్డిగా సర్టిఫికెట్లు ఇచ్చేయకు. జాగ్రత్త”
అతను జాగ్రత్త అని ఎందుకన్నాడో ఆమెకు తెలుసు. అయినా భవిష్యత్తుకు లోటు లేకుండా చూశాడాయన. కొడుకు కోడళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం వుండదు.
“పిల్లలు వస్తే ఈ ప్రైవసీ కూడా వుండదు” అన్నాడు.
నిజమే పెళ్ళైన దగ్గర్నుంచి ఇద్దరూ కలిసి ఏకాంతంగా వున్న రోజులు చాలా తక్కువ. పెళ్ళైసరికే ఇంటి నిండా జనం. మామగారు, అత్తగారు, ఆడపడుచులు వీళ్ళు కాక చదువుకోడానికని వచ్చిన మామగారి తరఫు బంధువుల పిల్లలు ఇద్దరు. ఆ పిల్లలు చదువులు అయిపోయి, ఆడపడుచుల పెళ్ళిలైపోయి, మామగారు కాలం చేసే సరికి తనకే  ఇద్దరు పిల్లలు. మధ్య మధ్యలో ఆడపడుచుల కాన్పులు. అత్తగారు కూడా వెళ్ళిపోయి పిల్లలు చదువులు పూర్తై పెళ్ళిళ్ళు అయ్యి హమ్మయ్య అనుకునేసరికి అరవైల్లో పడ్డారు. ఈ మధ్యే కాస్తంత ఏకాంతం. ఎంత అపురూపమో ఆయనకి ఆ ఏకాంతమంటే.
“మళ్ళీ ఆలోచిస్తున్నావు. ఏం గుర్తుకొచ్చింది?” చిలిపిగా కన్నుకొట్టాడతను.
“మీరేం అనుకుంటున్నారు?”
“మన మొదటి రాత్రి ఏమైనా గుర్తుకొచ్చిందేమో అని” నవ్వబోయి గట్టిగా దగ్గి “అమ్మా” అన్నాడు బాధగా.
“చాల్లేండి సంబడం. ఆ రోజు భయం తప్ప మరో ఆలోచన కూడా లేదు”
“ఏం? నేను అంత భయంకరంగా వున్నానా?”
“ఊహూ. మీరు చాలా బాగున్నారు. పంచె కట్టుకోని. మీ కట్టు చాలా బాగుంటుంది.”
“ఎప్పుడూ చెప్పనేలేదు? నేను ఎన్నిసార్లు నీ చీర కట్టుని మెచ్చుకోలేదు”
“ఏమిటి చెప్పేది. మీరు ఒకటి ఒప్పుకున్నారా. పూజలన్నా వ్రతాలన్నా అసలు దేవుడే లేడని కదా గొడవ”
“దణ్ణం పెట్టుకున్నానుగా చివరికి. గుళ్ళకి గోపురాలకి కూడా వచ్చాను”
“ఎందుకొచ్చారు? వదిలేయాల్సింది.”
“దేవుడి భక్తి అని కాదులే. నీకు నేను అలా వుంటే ఇష్టం అని వచ్చాను. పూజలు వ్రతాలంటావా? నిన్ను ఎప్పుడైనా కాదన్నానా? నీకు నీ దేవుడికి మధ్యలో నేనెప్పుడూ రాలేదమ్మా సోమిదేవమ్మా” మళ్ళీ మరో పేరు కలిపాడు.

“సర్లే ఇంక పడుకోండి. మాట్లాడితే అలిసిపోతున్నారు మీరు.” మంచం పక్కనే బొంత పరుస్తూ చెప్పిందామె. ఆయన అలాగే చూస్తూ వుండిపోయాడు.

ఆమె దిండుకి బదులు పాత దుప్పటి పెట్టుకోని పక్కకి తిరిగి పడుకోని కళ్ళు మూసుకుంది.
“ఏమైనా కావాలంటే నాకు చెప్పండి” అంది కళ్ళు మూసుకోనే,
“చెప్పనా?” కళ్ళు మెరిసాయి.
“ఏమిటి” కళ్ళు తెరవలేదు.
“చెప్తే నిజంగా చేస్తావా?” ఆమె కళ్ళు తెరిచి కాస్త కోపం కలిపి చూసిందతని వైపు. “నాకు పంచె కట్టగలవా?”
“ఇప్పుడా? ఈ పరిస్థితిలో...”
“ఏం ఫర్లేదు. నేను లేస్తానుగా. కడతావా?”
“ఏమిటీ చాదస్తం? మళ్ళీ పెళ్ళికొడుకు అవదామనా?” అనటానికి అంటూనే వుంది కాని లేచి నిలబడింది.
“ఏం తప్పేంటి?” అని ఆయన అనే లోగా ఆమె బీరువా తెరిచి పంచె తీసింది. దగ్గరగా వచ్చి ఆయన వీపు మీద చెయ్యి వేసి, పెదాలను బిగపట్టి పైకి లేపింది. ఆయన బరువుకి ఆమె అలిసిపోయింది. ఆ కాస్త శ్రమకి ఆయన కూడా అలిసిపోయాడు. ఆమె రొప్పుతుంటే ఎగిరిపడుతున్న గుండె మీద ఆయన తెలపెట్టి రొప్పుతున్నాడు. అరనిముషం తరువాత ఇద్దరూ ఒకరినొకరు చూసుకోని చిరునవ్వు నవ్వుకున్నారు. ఆమె కంటితో సైగ చేసి, రెండు చేతులతో భుజాలను పట్టుకోని “హుప్” అంటూ నిలబెట్టింది. ఆమెని కౌగిలించుకోని బరువు ఆమె భుజాల మీద వేసి నిలబడ్డాడతను.
పంచె తీసిందామె. బెత్తెడు అంచు వున్న తెల్లటి పంచె. ఆయన తెల్లబట్టలు ఎప్పుడూ తన చేతులతోనే ఉతికేది. గంజి పెట్టి మరీ. మడత విప్పి నడుము చుట్టూ తిప్పింది. ముందు కుచ్చిళ్ళు పెట్టి బెత్తడంచూ కనపడేలా దోపింది. ఆమెనే చూస్తూ వున్నాడతను.

ఆమె నవ్వుతూ అతని వెనక్కి వెళ్ళి గోచీ తీసి దానికి కుచ్చిళ్ళు పెట్టింది. పెడుతున్నంత సేపు విశాలమైన ఆయన వీపు వంకే చూస్తూ వుండిపోయింది.
మంచానపడ్డ తరువాత వీపంతా కురుపులు లేచాయి. కళ్ళలో నీళ్ళు వచ్చాయి కానీ రెప్పలని దాటలేదు. గోచీ దోపి ముందుకొచ్చి, ఆయన ముఖంలోకి చూస్తే కన్నీళ్ళు జారతాయని పంచె వంకే చూస్తూ “బాగానే కుదిరిందండీ” అంది.
ఆయన ఆమె తల పైకెత్తాడు. ఆయన నవ్వుతున్నాడు. ఆమె నవ్వినట్లే వుంది కానీ కన్నీళ్ళు కారాయి.
మంచం మీద కూర్చోపెట్టింది. నెమ్మదిగా ఒరిగి, చిన్నగా సర్దుకుంటూ వెల్లకిలా పడుకున్నాడు. ఆమె మళ్ళీ బొంత మీదకు వెళ్ళబోయింది. చెయ్యిపట్టుకోని లాగాడు... రెండో చేతితో తన గుండెమీద కొట్టి చూపించాడు.
“వద్దండి” అందామె... ఆయన పరిస్థితి గమనించి. ఒప్పుకోలేదతను. మంచం చివర కూర్చోని బరువు ఎక్కువ పడకుండా తలని ఆయన గుండె మీద వాల్చింది. గుండె చప్పుడు కొంచెం నెమ్మదించింది. గాలి ఆడటంలో వున్న ఇబ్బంది గుర్రుమంటూ వినపడుతోంది.
“ఇంతకన్నా ఇబ్బంది పడకుండా ఇంతే ప్రశాంతంగా ఈయన వెళ్ళిపోతే బాగుండు” అనుకుంది ఆమె. ఆమె నమ్ముకున్న దేవుడో, ఆయన నమ్మని దేవుడో ఆమె మాట విన్నాడు. 
అద్భుతం జరిగిపోయింది.

ఆఫీసుకెళ్ళే ప్రతిసారి ఆమెను దగ్గరగా హత్తుకోని “వస్తాను” అని చెప్పకుండా వెళ్ళిన రోజు లేదు.

ఒకసారి శ్రావణ శుక్రవారం. 
ఆమె హడావిడిలో ఆమె వుంది. ఆఫీసులో ఆడిట్ అంటూ ఆయన హడావిడి ఆయనది. వెళ్ళిపోయాడు... 
చెప్పకుండా వెళ్ళాడే... అని ఆమెకి గిలిగా అనిపించింది. అరగంటలో నాలుగుసార్లు గుమ్మానికి ఇంట్లోకి మధ్య నడిచింది.

అరగంట తరువాత వచ్చాడాయన.
“హడావిడిలో మర్చిపోయాను” అంటూ హత్తుకున్నాడు. “వస్తాను” అని వెళ్ళబోతూ, “ఇంకెప్పుడూ మర్చిపోను” అన్నాడు. 
ఆయన కంట్లో నీటి పొర.
ఇదంతా గుర్తుకు వచ్చి ఆమె కంట్లో కన్నీటి వరద... 
కట్టలు తెంచుకుంది.

(మీ అభిప్రాయాన్ని తెలియజేయండి)
ధన్యవాదాలు
శుభదినం.
--((**))--



ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:- శ్రీ కృష్ణాయనమ:
అంతర్జాల పత్రిక సమాచారం చదవండి (18)
సేకరణ రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

ప్రాచీన భారతీయ మహర్షులు రచించిన రహస్య గ్రంథాలు - వాటి గురించి విశేషాలు .
మన ప్రాచీన మహర్షులు మహా తపస్సంపన్నులు మరియు గొప్ప విజ్ఞానులు . వీరు తమయొక్క విజ్ఞానాన్ని గ్రంధరూపంలో భద్రపరిచారు. ప్రస్తుతం ఆయా గ్రంథాలు మనకి దొరకటం లేదు . నాకున్న పరిఙ్ఞానం మరియు కొన్ని పురాతన గ్రంధాలను పరిశోధించి వారు రాసిన గ్రంథాలు వేటికి సంభంధించినవో వాటిలో ఉన్న కొన్ని విషయాలు మీకు తెలియచేస్తున్నాను . 
* బృహద్యంత్ర సర్వస్వము - 
ఈ గ్రంథమును భరద్వాజ మహర్షి రచించెను . ఈ గ్రంధము నందు అనేక యంత్రాల గురించి వివరంగా ఇచ్చాడు. ముఖ్యంగా " విమానాధికారణము" అను ఒక అధ్యాయం కలదు. ఇందు అనేక విమానాలు మరియు విచిత్రంగా మెలికలు తిరుగుతూ ప్రయాణించే విమానాల గురించి వివరించారు . ఈ విమానాలు ఆకాశంలో ఎగురునప్పుడు విమానాన్ని నాశనం చేసే వివిధ రకాల సూర్యకిరణాల గురించి , భయంకర వాయుగుండాల గురించి , అమిత విద్యుత్ శక్తి నుండి , అత్యుష్ణము , అతి శీతలం నుండి విమానం మరియు అందులో ప్రయాణించే వారిని రక్షించేందుకు పదమూడు రకాల దర్పణములు ( అద్దములు ) గురించి వివరించారు 
ఇందు దుష్టశక్తులను నిరోధించి ఉత్తమ శక్తులను ఆకర్షించు దర్పణములు ఆరున్నూ , సూర్యుని నుండి రకరకాల సూర్యకిరణములు ఆకర్షించి అక్కరలేని వాటిని నిరోధించే దర్పణములు ఆరున్నూ కలవు. పదమూడొవది వివిధరకాల పొగను సృష్టించును. విచిత్రకార్యములకు ఉపయోగపడును.
ఇప్పుడు మనం తయారుచేసే అద్దాలలో ప్రధానంగా సోడియమ్ గ్లాసులు , పొటాషియం గ్లాసులు మాత్రమే . కాని మన ప్రాచీనులు అద్దం తయారుచేసేప్పుడు సువర్ణం , పాదరసం , అయస్కాంతం , ముత్యములు మొదలగునవి కలిపెదరు . అంతే కాకుండా కొన్నిరకాల దివ్యోషదాలు కూడా అద్దం తయారీలో కలిపేవారు. 
అనేక రకాల విచిత్ర వస్తువుల గురించి కూడా ఈ గ్రంథంలో విపులంగా ఉంది.
* ఆగతత్వలహరీ - 
ఇందు వ్యవసాయం , అనేక వృక్షాల వర్ణనలు , వాటి చికిత్సా పద్దతులు కలవు. ఈ గ్రంథం అశ్వలాయన మహర్షి రచించెను .
* అవతత్వ ప్రకరణం - 
ఈ గ్రంథాన్ని కూడా అశ్వలాయన మహర్షి రచించారు . దీనిలో స్నానఫలాలు జలాల్లో రకాల గురించి వివరించారు . 
* అండ కౌస్తభం - 
ఇది పరాశర కృతం . బ్రహ్మాండ చరిత్ర 
జీవకోటి విమర్శ మొదలగునవి వివరించబడినవి.
* అంశు బోధిని - 
ఇది భరద్వాజ మహర్షి రాశారు. ఇందు గ్రహములు వేధించు పద్దతులు , ప్రకాశం ( light ) , ఉష్ణం ( heat ) , ధ్వని ( sound ) , తంత్రీ వార్తావిధి ( టెలిఫోనీ ) , విమాన నిర్మాణ విధి ,విద్యుతశక్తి ప్రయోగాలు కలవు.
* ఆకాశ తంత్రం - 
ఇది భరద్వాజ మహర్షి రచించారు . ఇందు ఆకాశం యొక్క 7 విధములు , ఆకాశక్షేత్ర విభాగములు , ఆకాశంలోని శక్తి సంయోగ విధములు , ఆకాశం నందలి అగ్ని, కాంతి, గ్రహ కక్ష్యలు , భూములు , నదులు మొదలగు వాటి వివరణలు కలవు.
* ఋక్ హృదయ తంత్రం - 
ఇది అత్రి మహర్షి కృతం . ఇందు రోగములు , చికిత్సలు విశేషముగా వివరించబడి ఉన్నాయి.
* ఔషధీ కల్పం - 
ఇది అత్రి మహర్షి కృతం . ఇందు ఔషధముల ప్రభావములు . చిరకాలం జీవించుటకు యోగాలు , గుళికా యోగములు, ఆయుర్వృద్ది మొదలగునవి కలవు.
* కరక ప్రకరణము - 
ఇది అంగీరస మహాముని రచించెను . ఇందు మేఘములలొని మార్పులు , జీవరాశుల ఉత్పతి విధానం , సూర్యరశ్మిలోని మార్పులు మేఘములకు సంబంధము , నవరత్నములు పుట్టుటకు సంబందించిన సూర్యరశ్మి విభాగాలు కలవు.
* కర్మాబ్దిసారము - 
ఇది ఆపస్తంబ మహర్షిచే రచించబడెను . ఇందు కర్మలు , చేయవలసిన విధులు , వాటి ప్రాముఖ్యత , వాటి ఫలములు , శారీరక , మానసిక ఫలములు మొదలైనవి కలవు.
* కౌముదీ - 
ఇది సోమనాథ కృతం ఇందు బ్రహ్మాండం గురించి విపులంగా రాసి ఉన్నది.
* ఖేట సర్వస్వము - 
ఇది జైమినీ మహర్షి చే రచించబడెను . ఇందు ఆకాశ విభాగములు , అందలి గ్రహకక్షలు మొదలగునవి కలవు.
* ధాతు సర్వస్వము - 
ఇది బోధాయన మహర్షిచే రచించబడెను . ఇందు ధాతువులు , వాటి ఉత్పత్తులు , గనులు , గనుల నుండి
లోహములు తీయు పద్దతి , విషములు , విషహరణోపాయములు , భస్మములు , గంధకం , పాదరసం మొదలగువాటి వర్ణన కలదు . 
* ధూమ ప్రకరణం - 
ఇది నారద మహర్షి కృతం . ఇందు వివిద ధూమములు , వాటిని కొన్ని రకాల అద్దములచే పట్టుట వాటిని కొన్నిరకాల ఆమ్లములచే పరిశోధించుట . ఆ ధూమం మంచిదో కాదో తెలుసుకొనుట అనగా ఆయాపదార్థాలలోని విషగుణములను తెలుసుకొనుట తద్వారా శరీరాన్ని , బుద్ధిని పోషించుకొనుట ఈ విషయాలన్నీ కలవు.
* నామార్థ కల్పం - 
ఇది అత్రి మహర్షిచే రచించబడెను. ఇందు 84 లక్షల శక్తులు వాటి నామాలు , నామార్థాలు కలవు.
* ప్రపంచ లహరీ - 
ఇది వశిష్ట మహర్షి చే రచించబడెను . ఇందు అణువుల వలన బ్రహ్మండా నిర్మాణమా లేక బ్రహ్మతత్వం వలనా ? అని చర్చ కలదు. అణువు ల విమర్శ కూడా కలదు.
* బ్రహ్మాండ సారం - 
ఇది వ్యాస మహర్షిచే రచించబడెను . ఇందు బ్రహ్మాండ చరిత్ర కలదు.
* మేఘోత్పత్తి ప్రకరణం - 
ఇది అంగీరస మహర్షి కృతం . ఇందు మేఘములు , మెరుపులు , పిడుగులు మొదలగు వాటి ఉత్పత్తి వర్ణణలు కలవు.
* లోక సంగ్రహము - 
ఇది వివరణాచార్య కృతం . ఇందు 1714 భాషలు , జీవజాతులు , వాటి పుట్టుక , ఆహార నియమాలు , మతములు మొదలగు వివరములు కలవు. మొత్తం ప్రపంచం యొక్క సంగ్రహం కలదు.
* లోహ తంత్రము - 
ఇది శాక్త్యాయన మహార్షి చే రచించబడెను . ఇందులో లోహోత్పత్తి మొదలగు విషయాలు కలవు.
* వాయుతత్వ ప్రకరణము - 
ఇది శాక్త్యాయన మహర్షి కృతం . ఇందులో 84 వేల రకాల వాయువులు , వాటి పొరలు , భూమి మీద ఆయా వాయువుల యొక్క ప్రభావములు , అవి వృక్ష సంపద పైన ఎట్లు పనిచేయుచున్నవి ? ఈ వాయువులను కనిపెట్టుటకు తగిన యంత్ర సాధనాలు మొదలగునవి కలవు. 
* వైశ్వనర తంత్రము - 
ఇది నారద మహర్షి కృతం . ఇందు 128 రకాల అగ్నులు , వాటి రంగులు , గుణములు , ఉపయోగములు , కొలతలు తరతమ బేధములు కలవు.
* శక్తి తంత్రము - 
ఇది అగస్త్య మహార్షి చే రచించబడినది. ఇందు విద్యుత్ శక్తి యొక్క సర్వాకర్షణ సామర్ధ్యము , రూపాకర్షని , రసాకర్షిణి , గంధాకర్షిణి , స్పర్శాకర్షిణి , శబ్దాకర్షిణి , ధైర్యాకర్షిణి , శరీరాకర్షిణి , ప్రాణా కర్షిణీ మొదలగు ముఖ్యమైన పదహారు శక్తుల వర్ణనం , సెకనుకు 1 , 86 ,000 మైళ్ళ వేగముతో ఇప్పుడు టెలివిజన్ , రేడియో ప్రసారాలు ఎలా పోవుచున్నవో అదే విధముగా విధ్యుత్ శక్తి సహాయముతో రసము , గంధకం , స్పర్శము చివరికి శరీరం కూడా అంతే వేగముతో ప్రయాణించగల విధివిధానాలు చెప్పెను . బహుశా వాయువేగంతో మనిషి ఎలా ప్రయాణించాలో తెలియచేశారు అనుకుంటా . 
* శుద్ద విద్యాకల్పం - 
ఇది అశ్వలాయన మహర్షి కృతం . ఇందు ప్రపంచోత్పత్తి నిర్ణయము కలదు.
* సమరాంగణ సూత్రధారము - 
ఇది భోజమహారాజుచే రాయబడినది. ఇందు అనేక యంత్రములు కలవు. ఈ యంత్రములు యందు ఉపయోగించు పంచభూత బీజముల విధానములు , విమాన నిర్మాణ విధానములు , ద్వని ( సైరన్ ) యంత్రము చేయు పద్ధతులు , బొమ్మలచే యుద్ధము , నాట్యము , సంగీతము , ద్వార రక్షణము మొదలగు విచిత్రములు కలవు.
పైన చెప్పినవే కాకుండా భరద్వాజ మహర్షి రచించిన బృహద్విమాన శాస్త్రంలో అశని కల్పం , అంశుమ తంత్రం , ఉద్బిజ్జతత్వ సారాయణము , దర్పణకల్పము , దర్పణశాస్త్రం , దర్పణ ప్రకరణం , ద్రావక ప్రకరణం , మణికల్ప ప్రదీపిక , మణి ప్రకరణము , మణి రత్నాకరం , ముకుర కల్పము , యంత్ర కల్పము , యంత్ర కల్పతరువు , లోహతత్వ ప్రకరణం , లోహ ప్రకరణం , లోహ రత్నాకరం , లోహ రహస్యము , లోహ శాస్త్రం , విమాన చంద్రిక , విష నిర్ణయాధికారం , వ్యోమయాన తంత్రం , శక్తి తంత్రము , శక్తి బీజము , శక్తి కౌస్తుభం , సమ్మోహన క్రియాకాండం , సౌదామినీకలా మొదలగు 150 గ్రంథాలు కలవు. అదియే కాక అగస్త్య, అత్రి , అంగీర, ఆపస్తంబ , ఈశ్వర , కపర్ది , గర్గ, గాలవ, గోభిల , గౌతమ, నారద , పరాశర, భరద్వాజ , వశిష్ట , వాల్మీకి , వ్యాస , శౌనక , సిద్ధనాధ మొదలగు 140 మంది గ్రంథకర్తలు కలరు. ఋషులు అంటే ముక్కులు మూసుకుని మూలన కూర్చుని తపస్సు చేసుకునే వారు కాదు. వీరు గొప్ప వైజ్ఞానికులు .భారతదేశంలో అధికారంలో ఉన్న వారు వీటిపైన సరైన దృష్టి పెట్టకపోవడం వలన ఎంతో విజ్ఞానాన్ని కోల్పోయాము. కాని మన ప్రాచీన విఙ్ఞానం పైన విదేశీయులు అమిత మక్కువ చూపిస్తారు. దీనిపై మీకో ఉదాహరణ చెప్తాను. 1936 వ సంవత్సరం లో 1936 వ సంవత్సరం వరకు ముద్రించబడిన గ్రంథాల జాబితా ని "రసరత్న సముచ్ఛయ" అనే పేరుతో ముద్రించారు . ఒక కేటలాగ్ లాగా అది మనదేశంలో దాని విలువ 1 రూపాయి . జర్మనీ దేశంలో మన భారతీయ గ్రంథాల గురించి ఇచ్చిన కేటలాగ్ 5000 రూపాయిల చొప్పున అమ్ముడు అయినది. ఇది మన భారతీయ వైఙ్ఞానిక విలువ కాని అది మరుగున పడుతుంది. మనం అయినా కాపాడుకొని మన తరవాతి తరాలకు ఆ విజ్ఞానాన్ని అందించాలి.
--(())--

ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక కధలు (17)
సేకరణ రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
*కామాక్షీ వైభవం*
0®®®®®®®®®®®0
➡️ ఒకప్పుడు పరమశివుడు కైలాసపర్వతం మీద కూర్చుని ఉన్న సమయంలో, అమ్మవారు లీలావినోదంగా ఆయనతో సంతోషంగా కాలం గడుపుతూ, ఆయన రెండు కళ్ళూ మూసింది. ఆయన రెండు కళ్ళు 'సూర్యచంద్రౌ చ నేత్రే' ఆయన ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు. అగ్నిహోత్రం మూడవ కన్ను. ఆ కారణం చేత ఆవిడ ఆయన రెండు కన్నులూ మూస్తే లోకమంతా చీకటియిపోయింది. సూర్యచంద్రుల గమనం లేకపోతే వచ్చే పెద్ద ప్రమాదం ధర్మచక్రం ఆగిపోతుంది. ఏది లుప్తమైనా పరవాలేదు గాని ధర్మచక్రం ఆగిపోకూడదు. 
➡️ ఏ పని చేసినా ఆయా కాలాలలో చేయాలి తప్ప, ఏ కాలంలో ఏది చెయ్యాలో అది చేయకుండా వేరొక పని చెయ్యకూడదు. సూర్యచంద్రులు కదలిక లేక ఆగిపోవడంతో లోకమంతా చీకట్లు కమ్మి కాలం తెలియలేదు కాబట్టి చేయవలసిన అనుష్టానాలు జరగక ధర్మానికి గ్లాని ఏర్పడింది. ఇది జరిగినది ప్రమశివునకు లిప్తకాలమైనా భూలోకంలో దాని ప్రభావం చాలా ఉంటుంది. లోకులు ఖేదపడ్డారు. ఈశ్వరునిలో ఉన్న గొప్పదనం ఏమిటంటే అమ్మవారికి పాపపుణ్యాలు ఉండవు. 
➡️ కానీ ఒక పని చేసినప్పుడు ఇతరులు బాధ పడేటట్లు చేస్తే అది దోషమవుతుంది. అలా ఎప్పుడూ చెయ్యకూడదు. సూర్యచంద్రుల ప్రకాశం లేక లోకులు బాధ పడ్డారు. పార్వతీ దేవి కదా అని ఉపేక్షిస్తే లోకంలో మిగిలిన వాళ్ళు ఇతరులను బాధపెట్టి మేం మాత్రం ఎందుకు ఉపేక్షించ కూడదు అంటారు. అందుకని ఆయన భూలోకానికి వెళ్ళి తపస్సు చేయి అంటే ఆవిడ భూలోకానికి వచ్చి తపస్సు చేసింది. 
➡️ ఆ తల్లి ఉత్తరభారతంలో హిమాలయాల మీద ఎప్పటి నుండో తనని కుమార్తెగా పొందడానికి ప్రయత్నిస్తూ తపస్సు చేసుకుంటున్న కాత్యాయన మహర్షి కుమార్తె అయి, కాత్యాయనుని కూతురు కాబట్టి కాత్యాయిని అని పేరుపొందింది. ఆ తల్లి యుక్త వయస్సు పొందిన తరువాత ఆమెకి వివాహం చేయవలసివచ్చింది. అమ్మవారు ఎంతమందికైనా కూతురవుతుంది కాని పరమేశ్వరునికే ఇల్లాలు. ఆయనని భర్తగా తేవడం ఆమెకే సాద్యం తప్ప ఇతరులకు సాధ్యం కాదు. 
➡️ కాత్యాయనమహర్షి కొన్ని వస్తువులిచ్చి అమా! ఇవి పట్టుకుని బయలుదేరు. నువ్వు ఏ ప్రాతాంనికి వెళ్ళినప్పుడు ఈ వస్తువులు మార్పు చెందుతాయో అక్కడ తపస్సు చేయి ఈశ్వరుడు స్వీకరించి భార్యాస్థానంలో కూర్చోపెట్టుకుంటాడు. 
➡️ ఆమె బయలుదేరి దక్షిణదేశం వస్తుండగా, కాంచీపురానికి వస్తున్నప్పుడు ఆమెకి ఇచ్చిన వస్తువులు మార్పు చెందాయి. ఆ పట్టణంలోనే తపస్సు చేయాలని అమ్మవారు అక్కడ తపస్సు ప్రారంభించింది. పరమశివుడు ఆమెకి తన పట్ల ఉన్న ప్రేమ ఎటువంటిదో ఎంతటి మహాపతివ్రతో లోకానికి చాటి చెప్పాలనుకున్నాడు. ఆయన తన జటాజూటంలోని గంగపాయను ఒకదానిని విడచి పెట్టాడు. విశేషమైన ప్రవాహంతో విచ్చేస్తున్నది. ఆవిడ ఇసుక లింగాన్ని చేసి ఆరాధన చేస్తున్నది. 
➡️ ఆమెకి తాను కొట్టుకుపోతానని బెంగ కాదు, సైకత లింగం కొట్టుకొనిపోతుందేమో అని బెంగ కలిగి దుర్గమ్మ ఆవిర్భవించేటట్లుగా ధ్యానం చేసి ఆ నీటినంతటినీ త్రాగేయమంది. ప్రళయకాల బంధిని అయిన గంగా ప్రవాహాన్ని పుక్కిట పట్టి దుర్గమ్మ తాగేసింది. శివుడు చూసి ఏం చేస్తుందో చూద్దామని అంతకన్నా అధృతమైన ప్రవాహాన్ని విడిచి పెట్టాడు. 
➡️ బ్రహ్మాండమైన ప్రవాహం కాంచీపురం వైపు వస్తుంటే, పార్వతీదేవి కంప కంప అన్నది. అంటే భయం భయం అని అర్థం. అమ్మవారే భయం పోగొట్టగలిగిన ఆదిశక్తి. ఆవిడకు భయం లేదు. సైకత లింగం వెళ్ళిపోతుందని ఆవిడకు భయం. ఆ శివలింగం పోవడానికి వీలు లేదు. లింగానికి నీళ్ళు తగిలేముందు నేనే వెళ్ళీపోవాలని, తన పతిభక్తిని చాటి చెప్పడానికి, సైకత లింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నది. అప్పుడు అమ్మవారి కుచములు, కంకణాల ముద్రలు శివలింగం మీద పడ్డాయి. 
➡️ పరమశివుడు చూసి అమ్మవారి పతిభక్తికి మెచ్చి, ప్రవాహాన్ని ఉపసంహారం చేసి అమ్మవారిని తాను స్వీకరించాడు.
🙏 *ఓం శ్రీమాత
--(())--


Pranjali Prabha stories (16)
రెండు ఇడ్లిలు
వేదవతి  ప్రతిరోజు  తన ఇంటి పిట్టగోడపై ఆకులో రెండు ఇడ్లిలు పెడుతూ  వచ్చేది  
ఆకలితో ఉన్నవాళ్లు  ఎవరైనా  తింటారు  అని
ఆ దారివెంట  వెళ్ళే ఒక ముసలాయన ఆ ఇడ్లిలు తీసుకోవడం ఏదో  చిన్నగా  గొణుక్కుంటూ  వెళ్లడం  జరిగేది  
ఒకరోజు వేదవతి గోడ  పక్కనే  నిలబడి  అతను  ఏమి అంటున్నాడో  వినాలని  అనుకున్నది  
అతను చెప్తున్న మాటలు  
నువ్వు చేసిన  పాపం నీ దగ్గరే ఉంటుంది 
నువ్వు చేసే పుణ్యం  వచ్చి నిన్నే  చేరుతుంది  
ప్రతిరోజు అతను ఈ మాటలే చెప్తున్నాడు  
రోజు ఇడ్లి  పెడుతున్నాను  తీసుకు  పోతున్నాడు 
నువ్వు మహాలక్ష్మివి  చల్లగా ఉండమ్మా అని చేతులెత్తి మొక్కక పొయినా పర్లేదు
ఇడ్లిలు బావున్నాయని  చెప్పకపోయినా  పర్లేదు 
ధన్యవాదాలు అమ్మ అని చెప్పడం  కూడా  తెలియలేదా  ఇతనికి  
ఏదో ఆ చెత్త వాగుడు  వాగిపోతున్నాడు  అని చాల కోపంతో  రగిలిపోయింది  అయినా ఇడ్లిలు పెట్టడం మరిచిపోలేదు 
రోజురోజుకి అతనిపై  పెరుగుతున్న  కోపం  అతనిని  చంపేయాలి  అనేంతగా  మారిపోయింది  
ఒకరోజు ఆ ఇడ్లిలపై  కాస్త విషం  చల్లి పెట్టబోయింది 
కానీ మనసు ఒప్పుకోలేదు 
చేతులు వణకడం  మొదలెట్టింది  
ఆలోచన మొదలయింది  
చ వద్దు  అతను అలాఉంటే  నేను ఎందుకు  ఇలా మారిపోయాను  అని ఆ ఇడ్లిలు పడేసి  మంచి ఇడ్లిలు పెట్టింది  
ఆ వ్యక్తి  ఇడ్లిలు తీసుకుని  మళ్ళీ అవే మాటలు చెప్తూ  వెళ్ళాడు  
కొట్టాలన్న కోపం  వచ్చినా తనను  తాను  సమాధాన  పరుచుకుంది  
ఆ రోజు మిట్ట మధ్యాహానం  ఎవరో తలుపు కొట్టినట్టు   ఉంటె వెళ్లి  తలుపు తీసింది  
ఎదురుగా మురికి  బట్టలతో ఓ యువకుడు 
అతను ఎవరో కాదు సొంతంగా ఉద్యోగం  చేసుకుంటానని ఇల్లు వదిలి  అలిగి  వెళ్లిన తన కొడుకు 
అమ్మా
ఇంటికి వస్తుంటే ఎవరో నా పర్సు దొంగలించేసారు  
చేతిలో చిల్లి గవ్వ లేదు 
బాగా ఆకలి కళ్ళు తిరిగి పడిపోయాను  
ఎవరో ఓ ముసలాయన రెండు ఇడ్లిలు ఇచ్చి  నా ఆకలి తీర్చాడు  నా ప్రాణాలు  కాపాడాడు  అని చెప్పాడు  
ఆ మాటలు వినగానే  ఆమెకు  వణుకు  పుట్టేసింది  
విషం కలిపిన ఇడ్లిలు పెట్టుంటే నా కొడుకుకి  నేనే  యముడినై  ఉండిఉంటానే  అని కంటతడి  పెట్టుకుంది   
ఇప్పుడు ఆమెకు  ఆ ముసలాయన మాటలు అర్థం  అయింది  
నువ్వు చేసిన పాపం నీతోనే  ఉంటుంది 
నువ్వు చేసే మంచి నిన్ను  వెతుకుని  వచ్చి చేరుతుంది
అందరికి అన్ని అర్థం అవ్వవు  
అర్థం అయ్యేంతవరకు  ఎవరూ  ఎదురుచూడము  
*చేసిన ధర్మం  ఎప్పుడూ   ఏదో ఒక రూపంలో  మనకు  వచ్చిచేరుతుంది*
*ఏదో ఒక ధర్మం చేయడం అలవాటు చేసుకోండి*
*మనం తెలియక చేసే తప్పులనుండి  బయట పడే  మార్గం  మంచి చేయడం మాత్రమే*
*ధర్మాన్ని కాపాడండి అది నిన్ను కాపాడుతుంది*

--(())--


ప్రాంజలి ప్రభ ..అంతర్జాల పత్రిక కధలు .. 15
ఇంటింటి రామాయణం కథ ( 2. )
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  
ఆ నవ్వు దేనికి లక్ష్మణా ? 

 *ఒకనాడు మహారాజు నిండు సభను కొలువు దీర్చి ఉన్నాడు.* 
 *ఆ సందర్భంగా ఆయన* *సత్యానికి అసత్యానికి మధ్య గల తేడాను రెండు మూడు పదాల్లో ఎవరైనా చెప్పగలరా?*  అని ప్రశ్నించాడు.

 *సభలోని వారెవ్వరూ రాజుగారు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు ముందుకు రాలేదు.* 
 *ఏమి సమాధానం చెప్తే పీకల మీదకు ఏమి ముంచుకొస్తుందో అని నిమ్మకు నీరేత్తినట్లు సభికులు కూర్చుండిపోయారు.* 

 *అపారమైన తెలివితేటలున్న ఆ దేశపు మంత్రి గారు ...అదెంత మహారాజా* 
*సత్యo -అసత్యాల మధ్య చేతికున్న నాలుగు వేళ్లే అంతరం !* అన్నాడు.
మహారాజు తో పాటు సభలోనివారందరికీ మంత్రిగారి  సమాధానం వెనుక అంతరార్ధం బోధపడలేదు.

దయచేసి మీ  సమాధానాన్ని మరింతగా వివరించండి అంటూ కోరారు ..రాజుగారు.
తప్పకుండా  మహారాజా.. *కంటికి, చెవికి మధ్య దూరం నాలుగు వేళ్లేనన్నది అందరికి తెలిసిందే.* చెవితో వినే మాటలు అసత్యమైతే, కంటి ద్వారా చూసేది సత్యమవుతుంది. అలాగే కంటి ద్వారా చూసేది అసత్యమైతే, చెవితో వినే మాటలు సత్యమవుతుంది.
ఇందుకు ఓక మంచి ఉదాహరణ చెబుతాను వినండి అంటు మంత్రి గారు ఇవిదంగా మెదలుపెట్టారు.

రావణుడు మరణించిన తరవాత కపి సైన్యంతో విభీషణ, అంగద,సుగ్రీవులతో, సీతా లక్ష్మణులతో అయోధ్య చేరి పట్టాభిషేకం చేసుకుంటూ ఉన్న సందర్భం.
పట్టాభిషేకం అట్టహాసంగా జరుతోంది. రాముని పక్కనే సింహాసనానికి దగ్గరగా నిలబడి ఉన్నాడు లక్ష్మణుడు. *ఆ పరిస్థితులలో లక్ష్మణుడు ఒక సారి చిరునవ్వు దీర్ఘంగా నవ్వేడు. లక్ష్మణుడు నవ్వినది అందరూ చూశారు.* ఆ సందర్భంగా సభలో ఉన్న ఒక్కొకరు ఒకలా అనుకున్నారు ఆనవ్వును చూసి.

ఆనాడు రాముని అడవులపాలు చేసి, భర్తను చంపుకుని, నేడు ఆహ్వానం పలుకుతోందని, నా గురించే నవ్వేడా? అనుకుందిట కైక.
అన్నను చంపించి రాజ్యాన్ని సంపాదించాడు అని నన్ను
చూసినవ్వేడేమో అనుకున్నాడట సుగ్రీవుడు.

తండ్రిని చంపించిన పిన తండ్రి పంచ చేరినందుకు ఆక్షేపిస్తున్నాడా అనుకున్నాడట అంగదుడు.

 ఇంటి గుట్టు చెప్పి అన్నను చంపుకుని రాజ్యం సంపాదించుకున్నానని ఎగతాళీగా నన్ను చూసినవ్వేడా అనుకున్నాడట విభీషణుడు.
రాముడి బాణాలను తండ్రి వాయుదేవుని అనుగ్రహంతో వక్ష మార్గాన నడిపించానని పరిహాసం చేస్తున్నాడా అని హనుమ అనుకున్నాడట. 
బంగారు లేడిని తెమ్మన్ని కోరినందుకు నవ్వుకుంటున్నాడేమో అనుకుందిట సీత. 
బంగారు లేడి ఉండదని తెలిసీ భార్య కోరిక తీర్చడానికి బయలుదేరి వెళ్ళి చిక్కులలో పడినందుకు నవ్వుతున్నాడా అని శ్రీరాముడు అనుకున్నాడట.
అందరి మనసుల్లోనూ ఉన్న అనుమానాలను గ్రహించిన రాముడు, తమ్ముడి నవ్వు విశేషార్ధాలకు దారి తీస్తుందని లక్ష్మణుని *ఏందుకు నవ్వేవు సోదరా?* అని అడిగాడు.

 *దానికి లక్ష్మణదేవర..
"అన్నా!' సీతా రాముల సేవలో ఏమరు పాటు లేకుండేందుకుగాను నిద్రాదేవిని ఒక వరం అడిగాను. నన్ను వనవాస సమయం లో పదునాల్గు సంవత్సరాలూ ఆవహించవద్దని.' దానికి నిద్రాదేవి అనుగ్రహిస్తూ 'పదునాలుగేళ్ళయిన తరవాత నిన్ను ఆవహిస్తానని'
వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆవహించని నిద్రాదేవి ఇప్పుడు ఈ సంతోష సమయంలో నన్ను ఆవహిస్తానని వచ్చింది. నిలబడే ఒక చిన్నకునుకు తీశానన్నయ్యా! నిద్రా దేవి మరచిపోకుండా వచ్చి నన్ను ఆవహించినందుకు నవ్వేను, మరేమీ కాదు" అన్నాడు.

*దానితో అందరూ తమతమ మనసులలో అనుకున్నది నిజం కాదని అనవసరంగా గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నామనుకుని నవ్వుకున్నారట.అందరి మనసులూ తేలికపడ్డాయి* . 
 *చూసింది ఓకటి కానీ విన్నది మరొకటి* 
 *అలాగే సత్యం ఆసత్యం కూడా నాలుగు వేళ్ళు దూరమే కానీ,* 
 *చూడకుండా వినకుండా లేదా ఏదో ఓకదాని అధారం గా నిరదరించినది సత్యం అని పూర్తి నమకం తో చేప్పడానికి విలు లేదు.* 
 *మంత్రి గారి వివరణకు రాజుగారితో  పాటు సభికులు సైతం హర్షధ్వానాలు ప్రకటించారు.* 


--(())--


Lord Rama Sita and Lakshmana Riding on a Boat - Folk Art Paintings (Phad Painting on Cloth - Unframed)

ప్రాంజలి ప్రభ ..అంతర్జాల పత్రిక కధలు .. 14
ఇంటింటి రామాయణం కథ ( 1. )
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

" శిరీ ..! ఒక సారి ఇలా రా" వేడి నీటి స్నానంతో సేదతీరి , పెర్ఫ్యూమ్ వేసుకుంటున్న శిరీష ని పిలిచాడు కుమార్ లాప్ టాప్ లో పని చేసుకుంటూ ..!

"ఒక్క నిమిషం" జడలో మల్లెపూదండ తురుముకుంటూ వచ్చింది .

"అబ్బబ్బ! ఈ పిల్లలు ఒకపట్టాన పడుకోరు కదా! పెద్దవాడిి కి కథలు కావాలి. చిన్నోడు  అయితే నా వొళ్ళో పడుకోబెట్టుకొని జోకొట్ట మంటాడు. ఇద్దరూ పడుకునే సరికి ఇంత లేట్ అయింది. ఎప్పటి కి పెద్ద వాళ్ళు అవుతారో ఏమో"!  

పిల్లలు ఇద్దరినీ వాళ్ళ రూం లో నిద్రపుచ్చి, తలుపులు వేసి వచ్చెసరికి రోజూ ఇదే టైమ్ అవుతుంది.

"ఆ..చెప్పండి. ఏంటో పిలిచారు కదా! వచ్చి పక్కనే.కూర్చుంది.

ఏమీ మాట్లాడకుండా ఆమె చెయ్యి పట్టుకుని తీసుకుని వచ్చి,హాల్ కి మరో పక్కగా.ఉన్న బెడ్రూం దగ్గర  ఆగాడు.

దగ్గరగా వేసి ఉన్న తలుపులు మెల్లగా తెరిచాడు. పక్క పక్కనే ఉన్న రెండు బెడ్స్ మీద. ఆదమరిచి నిద్రపోతున్నారు వయసు మళ్ళిన దంపతులు ఒకరి.చేతిలో మరొకరు చెయ్యి వేసుకుని...

ఏదో అనబోతున్న శిరీష ని హుష్ అంటూ సైగ చేసి, నిశబ్దం గా తలుపులు మూశాడు కుమార్ .

విషయం ఏమిటో అర్థం కాక మౌనంగా భర్తతో కలిసి తమ బెడ్రూంలో కి వచ్చింది.

"చూసావుగా శిరీ! వాళ్ళు ఎలా పడుకున్నారో వొళ్ళు తెలియకుండా! ...కాంఫుసింగ్  గా చూసింది అతనివైపు.

"మీ తమ్ముడు ఎప్పుడు వస్తాడట? ఎక్కడ ఉంటాడట. మీ అమ్మగారు ఏమంటున్నారు?". ఏ భావం మొహం లో కనబడ నీయకుండా అడిగాడు.

ఉలిక్కి పడింది శిరీష, 'తాను పిల్లల రూంలో కూర్చుని, అమ్మతో ఫోన్లో మాట్లాడింది  విన్నాడన్నమాట..

"అమ్మ తమ్ముడు కి ఇక్కడే ఇంజనీరింగ్ కాలేజీలో సీటు దొరికిందని, వాడిని ఎక్కడ ఉంచాలా అని ఆలోచిస్తూ ఉన్నామని చెప్పింది. అప్పుడు తాను ఏమన్నదీ?!

"మా ఇంట్లోనే ఉంటాడు లేమ్మా! రూం అడ్జస్ట్ చేస్తాలే!  మా ఇంటి కొత్త దంపతుల్ని హాల్ లో కి షిఫ్ట్ చెస్తాలే! అయినా ఇంత వయసు వచ్చినా ఒకరి మీద ఇంకోళ్లు చేయ్యేసుకొని పడుకుంటారు. చూడటానికి మాకే సిగ్గు వేస్తుంది. హాల్ లో అలా పడుకుంటే అసహ్యం గా ఉంటుందని ఆలోచిస్తున్నా! సరే ..ఏదో చెప్పి వాళ్ళని హల్ లో పడుకో బెడితే వాళ్ళే సర్దుకుంటారు. సర్దు కోక ఏమి చేస్తారు? ఎక్కడికీ పోతారు? అలా ఉండలేమంటే ఇక వాళ్ళ ఇష్టం. ఎక్కడికైనా పోనీ"

తను మాట్లాడింది అంతా అతను విన్నాడని అర్ధం కాగానే కొంచెం గాభరాగా అనిపించినా, మాట్లాడకుండా తల దించుకుంది.

"శిరీ! ఎక్కడో మా వూళ్ళోఉన్న తాతల నాటి ఇల్లు అమ్మించి, ఇక్కడ మూడు బెడ్రూం ల ఫ్లాట్ కొనుక్కునే దాకా సతాయించావు.  సరే! వాళ్ళు ఎలాగూ మన దగ్గర ఉండవలసిన వారే కదా, అని వాళ్లకి ఇష్టం లేకున్నా అక్కడ ఇల్లు అమించి ఇక్కడికి తీసుకు వచ్చాను."

" మనం ఇక్కడ అద్దెలు కట్టుకొలేమని, సొంత ఇంట్లో ఉంటే మనకి ఖర్చు కలిసివస్తుంది అని వాళ్లు వొప్పుకున్నారు. వచ్చినప్పటి నుండి మనకు చాకిరీ చేయటం లోనే మునిగిపోయారు వోపిక లేకున్నా!

నువ్వు, నేను పొద్దున్నే.ఆఫీస్ కి వెళ్లి ఏ రాత్రో వచ్చేదాకా, పిల్లలని కంటికి రెప్పలా కాచుకుని ఉంటారు.

వాళ్ళ కి వేరేగా వండి, తినిపించి,ఆడించి, పగలంతా వాళ్ళ, అల్లరి భరించి, సాయంత్రం మనం వచ్చే సరికి పులుకడిగిన ముత్యాల్లా తయారు చేసి మనకు అందించాలంటే వాళ్ళు శ్రమపడుతున్నరో గమనించావా ఎప్పుడైనా! ఒక్క రోజైనా హాస్పిటల్ కి తీసుకెళ్లే  అవసరం. రానీయకుండా అమ్మ వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతూ ఉందో తెలుసుకున్నావా?

పూట పూట కీ రుచిగా , వేడిగా వండి అమ్మ వడ్డిస్తుంటే, కడుపు నిండా తినటమే తప్ప ఒక్క రోజైనా ఆమెకి సహాయం చేసావా?

నాన్న ఈ వయసు లో కూడా ఇల్లు శుభ్రం గా ఉంచటానికి, పిల్లల్ని శుభ్రం గా ఉంచటానికి ఎంత సహాయం చేస్తున్నారో తెలుసా!?

ఆదివారం రాగానే , నీకు ఏవో ప్రోగ్రామ్స్ అంటావు. ఒక వారం ఛారిటీ కలెక్షన్స్, ఇంకో సారి కిట్టిపార్టీ, ఒకవారం పిల్లలతో outing, ఒక వారం రెస్ట్..... అయినా అమ్మ ఒక్క రోజు కూడా విసుక్కొలేదు. పైగా"పోనీలే! వారమంతా ఆఫీస్ పని కదా! ఒక్కరోజు దానికి ఇష్టం అయినట్టు ఉండనీ"! అంటుంది.

తెల్లవారుజామున లేచి ,అన్ని పనులు చేసి అలిసి పోయిన అమ్మకి రెస్ట్ తీసుకో వాలనీ, పడుకోవాలని అనిపించదా చెప్పు!

ఈ వయసులో కూడా కష్టం అనుకోకుండా ఇంత పని చేసే అమ్మకి, రాత్రి అయ్యేసరికి విపరీతమైన కాళ్లనొప్పి, నడుం నొప్పితో బాధ పడుతుంటే నాన్న ఆమె  కి ఆయిట్మెంట్ రాసి కాపడం పెడితే, పాదాలకు మసాజ్ చేస్తుంటే, అది నీకు వేరే విధంగా అనిపించిందా?

80 ఏళ్ల నాన్నకి రాత్రి పూట చాలా సార్లు బాత్రూమ్ కి వెళ్ళవలసి వస్తుంది. నిద్ర మత్తులో ఒక్కోసారి తూలి పడిపోతుంటారు. అమ్మకి ఆయన గురించే భయం. తను నిద్రలో ఉండి ఆయన్ని సరిగా చూసుకోలేక పోతానని అనుమానం. అందుకే ఆయన చెయ్యి పట్టుకుని పడుకుంటుంది. ఆయన తో పాటు మెళకువ రావటానికి. అది నీకు శృంగారం గా కనిపిస్తున్నదా?

వయసు మళ్ళిన ఇద్దరికీ ఎవరు ముందు తమను విడిచి వెళ్లి పోతారో అని లోలోపల భయం.  దానికి తోడు మనకి కూడా మాటడటానికే time ఉండదు. అందుకే వాళ్ళిద్దరూ అలా ఒకరికి ఒకరు నీడగా ఉంటారు. అది కూడా నీకు తప్పు గా ఉంది.

మీ తమ్ముడికి రూం ఇవ్వడం కోసం వారిని ఇబ్బంది పెట్టవద్దు. అతడి హాస్టల్ ఖర్చు మనం ఇద్దాము.

మనం కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసుకు వస్తాము. మనకు కూడా అలాంటి స్థితి వస్తె ఎలా ఉంటుందో వూహించుకో!

"వార్థక్యం తప్పేది కాదు, తప్పూ కాదు. వాళ్ళ అవసరాలు వేరేగా ఉంటాయి. అవి తీర్చక పోతే నేను ఉన్నది ఎందుకు? దండగ కదా!"

"ఇంకోసారి వాళ్ళని అవమానించేలా మాట్లాడితే నేను వోప్పు కోను. "  ఖచ్చితం గా.చెప్పి బెడ్ మీదికి చేరుకున్నాడు కుమార్ .

ఎంత చెప్పినా భార్య తమ్ముడ్ని తేవడం, అమ్మ నాన్నలను వరండాలో పడుకోబెట్టటమే అని కలవరింపు విన్నది భార్య.
ఈరోజు టిఫెన్ నేనే చేశా ఎలావుందీ అని అడిగింది భర్తతో .. చాల చాలా బాగున్నది రోజు ఇట్లా చేష్ట అమ్మ కష్ట పడదుగా
అవునండి రాత్రి ఆలోచించాను మా తమ్ముడ్ని హాస్టల్లో జేర్పిస్తాను ఇపుడే నాన్న కు ఫోన్ చేస్తున్నాను అన్నది.
నెన్ననాని కాదు నీవు ఆలోచించు అన్నాడు భర్త
అనుకుంటుంటేనే నాన్న నుండి ఫోన్ "కరోనా కాలంలో క్లాసులు లేవట అన్ని ఆన్లైన్లో నేట  
కనుక అక్కడకు రావటంలేదు ఇక్కడే లాబ ట్యాబు కొని పెడతామని నిర్ధారిన్చుకొని నీకు చెపుతున్నాను. కొన్నాక ఫోన్ చేస్తాను అళుడి గారిని అక్కడవున్న అందరిని అడిగినట్లు చెప్పు    . 
అట్లాగే నాన్న
ఇదిగో నండి మధ్యాన్నపు భోజనమ్ బాక్సు
నువ్వే చేసావా .... ఆ ఇక నుండి నేనే చేస్తాను
ఈరోజు ఆఫీసుకు వేళ్ళ బుద్ధి కావటం లేదే .. ఆమ్మో పగలే కోరికన్నా రంటే కష్టం అంటూ చిన్న ముద్దు నుదుట పెట్టి పంపించింది భర్తను ...     
           
--9900--

Flower Prayer Girl Digital Art

ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక కధలు 13
ఆనంద యోగం

సంతోషం మానసిక ఉద్వేగం. అది మనిషికి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది. మనిషికి కావాల్సింది సంతోషం కాదు... ఆనందం. కొంతకాలం మనిషికి హాయి చేకూర్చే సంతోషంకన్నా ఎప్పటికీ తరగని ఆనందం ప్రశాంతతనిస్తుంది.

ఏదైనా కొత్త వస్తువు కొన్నప్పుడు, చాలాకాలం తరవాత బంధుమిత్రులు కలిసినప్పుడు, కోరినది లభించినప్పుడు సంతోషం తాండవిస్తుంది. ఒక సమయంలో అత్యంత సంతోషాన్ని కలిగించినవే మరొకప్పుడు విసుగు, చిరాకు, ఆందోళనలకు గురిచేస్తాయి. సంతోషం సగం బలం. ఆనందం పూర్తి అభయం.

సంతోషం వస్తుంది, పోతుంది. ఆనందం వస్తుంది, పెరుగుతుంది. శాశ్వతంగా నిలుస్తుంది. ఆనందం మాటలతో వర్ణించలేనిది. హృదయాన్ని పరవశింపజేసే దివ్య వరం. పరమాత్మ ఆనందస్వరూపుడు. భగవంతుడితో సాంగత్యమే ఆనందపు హరివిల్లు. మనిషికి ఈ లోకంలో ఆనందం పంచేందుకు అమ్మను, ప్రకృతిని సృష్టించి దాన్ని అందుకునే ప్రేమ హృదయాన్ని అందించాడు. బృందావనంలో గోప, గోపికల ఆనంద పారవశ్యం శ్రీకృష్ణుడి సాహచర్యఫలమే.

రాసక్రీడల ఆంతర్యం భగవంతుడితో కలిగే ఆనందానికి ప్రతిరూపం.

భృగుమహర్షి బాల్యంలో భగవంతుణ్ని తెలుసుకోవాలని తపస్సు ప్రారంభించాడు. మొదట అన్నం పరబ్రహ్మస్వరూపంగా, ప్రాణం భగవన్మయంగా, ప్రకృతినే పరమేశ్వర రూపంగా భావించాడు. చివరకు భగవంతుడే ఆనందంగా గుర్తించాడని భృగువల్లి పేర్కొంది.

తైత్తిరీయోపనిషత్తులో ఆనందవల్లి ఆనంద స్వరూపాన్ని మూడు విధాలుగా వివరించింది. మనుష్యానందం, గంధర్వానందం, బ్రహ్మానందంగా గుర్తించింది. లోకంలోని అనేక ఆకర్షణలు, అనురాగాలు, బాంధవ్యాలు మనుష్యానందానికి చెందినవి. దేవతారాధన, పూజలు, దానాలు, వ్రతాలు... వీటి వల్ల లభించే ఆనందం గంధర్వానందం.

నిజమైన ఆనందం పరమాత్మ సాంగత్యంలో లభిస్తుంది. ప్రకృతిలో, పంచభూతాల్లో, సూర్యచంద్రుల్లో నిండి భూమిపై గల సర్వప్రాణులకు జీవనాధారాన్ని ప్రసాదించే పరమాత్మ అనుగ్రహ వీక్షణమే బ్రహ్మానందం. సృష్టి సమస్తం బ్రహ్మమయం. దాని ప్రాణాధారమే బ్రహ్మానంద స్థితి. మనిషి సంతోషం నుంచి ప్రయాణం సాగించి బ్రహ్మానందస్థితికి చేరాలని ఆనందవల్లి బోధించింది.

పరమాత్మను హృదయంలో అంతర్యామిగా దర్శించాలి. దానికి సాధనామార్గాలు- ధ్యానం, జపం, పూజ, తపస్సు, యజ్ఞయాగాది క్రతువులు. సామాన్యులకు అవి అందని ద్రాక్షలు. నిరంతరం జీవనపోరాటంలో అలసిపోయే సంసారులకు యోగమార్గాలు ఆకాశదీపాలే.

సామాన్యుల కోసం అయిదు మానవతా విలువలను ఆచరణ మార్గాలుగా వేదం ప్రకటించింది. అవే- సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస. వాటిని నిత్యజీవితంలో అనుసరించి ప్రతి పనినీ భగవంతుడి ప్రీత్యర్థం కావిస్తే ఆనందానికి మనిషి సులువుగా చేరుకుంటాడు.

మంచినే చూడు, మంచినే విను, మంచినే మాట్లాడు అని మూడు కోతి బొమ్మలతో ఆనందరసానుభూతిని చూపు, శ్రవణం, మాటతో పొందవచ్చనే సందేశాన్ని గాంధీ మహాత్ముడు అందించాడు. మనిషి తన జీవితపరమపద సోపానం సంతోషం అనే మొదటి గడి నుం
చి ప్రారంభించాలి. ఆరు దుర్గుణాలనే పాములను తప్పించుకోవాలి. మానవతావిలువలు అనే అయిదు నిచ్చెనలను అధిరోహించాలి. చివరకు బ్రహ్మానంద స్థాయి అయిన చివరి గడిని చేరాలి. అదే పరిపూర్ణ ఆనందజీవితం!
--(())--

ఫోటో వివరణ అందుబాటులో లేదు.

ప్రాంజలి ప్రభ - అంతర్జాల కధలు (12. )
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:
అతిథిదేవో భావ (చిన్న కద)

ఆతిథ్యం అంటే భోజనం పెట్టడం మాత్రమే కాదు. అతిథిదేవో భవా అని పూజించాలి
ఆత్మీయంగా ఆదరించడం ఆతిథ్యంలోని ప్రధానాంశం. ఇంటి ముందుకొచ్చి అర్థించిన ముష్టివాళ్ళక్కూడా ఆహారం పెడతాం. కానీ, అది ఆతిథ్యం కాదు.

ఈ ప్రపంచంలో మనదంటూ ఏమీ లేదంటుంది యోగవాసిష్ఠం. సకలమూ బ్రహ్మస్వరూపమే. ఇచ్చేవాడు, పుచ్చుకొనేవాడు... రూపంలో భేదాలే తప్ప ఇద్దరిలోనూ ఒకే అంతర్యామి కొలువున్నాడు కదా! కనుక భేదం లేదు. అందరి రక్తం ఒక్కటే కానీ బుద్దులు లక్ష్యాలు భాష వేరు
ఐన ఒకరికొకరు ప్రేమ పూర్వకముగా కలుసుకొని జీవించటమే సంతోషం అదే వసుదేక కుటుంబం. శక్తి వంచన లేకుండా ఉన్నదానితో సహాయము చేయటం అతిదులను గౌరవించటం మంచిది.

ప్రపంచంలో చెట్ల కన్నా మించిన ఆతిథ్య ధర్మం చూపగలవారు ఉండరు. ఎవరో నాటుతారు. ఇంకెవరో నీరు పోస్తారు. అవి కాలంతోపాటు చెలిమి చేస్తూ ఎదిగి వృక్షాలవుతాయి. పువ్వులు పూస్తాయి. కాయలు కాస్తాయి. పక్షులకు ఆశ్రయం, ఆహారం సమకూరుస్తాయి. బాటసారులకు నీడనిస్తాయి. చివరకు కట్టెలుగా మారి మనిషికి అక్కరకొస్తాయి.

ఇంతటి సేవాధర్మం నిర్వర్తిస్తూ, మౌనంగా జీవితం ప్రారంభించి, మౌనంగానే నిష్క్రమిస్తాయి. దత్తాత్రేయ గురుచరిత్రలో ఒక అవధూత, ప్రకృతిలో ఎందరో తనకు గురువులుగా చెబుతాడు. ప్రతి ప్రాణీ జీవితంలో ఉండే మౌన సందేశాలను అవధూత ఆకళింపు చేసుకుంటాడు. అంతకంటే గొప్ప ఆధ్యాత్మిక పరిపక్వత చూడలేం. ప్రాపంచిక దృష్టితో చూస్తే ఏదీ గొప్పగా అనిపించదు. వస్తువుల్ని, వ్యక్తుల్ని మన కొలబద్దతోనే కొలుస్తాం. మన దృష్టిని బట్టే అంచనాలు వేస్తాం.
శిలను శిల్పంగా మార్చినప్పుడు విలువ పెరుగుతుంది. బంగారం నగగా రూపొందినప్పుడూ అంతే. కొందరు సామాన్యులుగానే కనిపిస్తారు. కానీ, వారిలో అసమాన ప్రజ్ఞ దాగి ఉంటుంది.

వివేకానందుడు అమెరికా వెళ్లినప్పుడు ఆయన రూపం, వేషంకేసి అందరూ చులకనగా చూశారట. ఒక మహిళ ఆయనకు ఆతిథ్యం ఇచ్చింది. వివేకానందుడి తొలి సంబోధనతోనే సభ హర్షధ్వానాలతో దద్దరిల్లి పోయిందని చెబుతారు.ఆయన జ్ఞాన జ్యోతి. కొన్ని తరాలకు సరిపడా జ్ఞాన సంపదను ఆయన జిజ్ఞాసువులకు వదిలి వెళ్ళాడు.
ప్రపంచంలో జీవితావసరాలు లభిస్తాయి. కానీ, జ్ఞానం అంత సులువుగా లభించదు. 
నచికేతుడి కథలో యముడు ఎన్ని విధాల ప్రలోభపెట్టినా, పట్టుదలగా అతడు జ్ఞానభిక్షనే కోరుకున్నాడు. అంతవరకు నిరాహారంగా, అతిథి మర్యాదలను తిరస్కరించాడు.
ప్రాణాధారమైన అన్నపానాలను గృహస్థు అతిథికి భక్తిశ్రద్ధలతో సమర్పించడాన్నే అతిథి యజ్ఞం అంటారు. అంటే, అతిథిని సంతృప్తిపరిస్తే యజ్ఞఫలం దక్కుతుందని అర్థం చేసుకోవాలి. అతిథి రూపంలో ఇంద్రుడు వచ్చి బీదగృహస్థు రంతిదేవుణ్ని పరీక్షించిన కథ సుప్రసిద్ధం. కుచేలుడికి కృష్ణుడు కేవలం స్నేహ వాత్సల్యమే చూపలేదు. అనితర సాధ్యంగా ఆతిథ్యమిచ్చాడు. స్వయంగా పాదాలు కడిగాడు. తన అష్టదేవేరుల చేత సేవలు చేయించాడు. అష్టైశ్వర్యాలూ అనుగ్రహించాడు.
ఇక్కడ మనం గమనించాల్సింది- ఆతిథ్యంలోని ఆత్మీయ భావనకున్న విలువ. ఆదిశంకరులకు గృహిణి ఒక్క ఉసిరికాయను భక్తితో సమర్పించి, కనకధారా స్తోత్రానికి ప్రేరణనిచ్చింది. అదే ప్రపంచానికి కల్పవృక్షమైంది.
అతిథి తృప్తిపడినప్పుడు ‘అన్నదాతా సుఖీభవ’ అన్న ఒక్క మాటకున్న విలువ అమూల్యం. ఆ మాటను అంతర్యామి ఆశీస్సుగానే భావించాలి.
అతిథికి ఆకలి, దాహం తీర్చగల ఆహార పానీయాలు సమకూర్చగలిగితే చాలు. అవి ఖరీదైనవా, సామాన్యమైనవా అనే ప్రసక్తి తలెత్తదు. సర్వదేవతా స్వరూపిణిగా గోమాతను భావించినట్లే అతిథిని దైవ స్వరూపంగా భావించి ఆదరించడమే భారతీయ సంప్రదాయం. అతిథికి కులమతాలతో, జాతితో ఎలాంటి దుర్విచక్షణా చూపకూడదు. అప్పుడే అది అసలైన ఆతిథ్యం అవుతుంది............ - -

4 కామెంట్‌లు: