17, ఆగస్టు 2020, సోమవారం





ప్రాంజలి ప్రభ  - అంతర్జాల పత్రిక - శ్రీ మాత్రేనమ: 
బావా మరదలి సరస పద్యాలు (1 ) 
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

వెన్నె లంతయు నీపైన కమ్మి ఉంది
నవ్వుల బావగా జోడుకు పిలుచు తున్న  
కన్నులు విప్పాను చూపులు మార్చ వద్దు  
నీకు తోడుగా మరదలా నేను ఉన్న   
       
కన్ను లలొ నన్ను కలకాల ముంచు కొమ్ము 
వగలు వయ్యారం చూపకు మనసు  నాది  
కలలు పండించు కరుణతో కాపు కాసి
వదలక నిను తలచిఉన్న చిరుత బావ   
  
నడకలో వయ్యా రమ్మును చూపు చున్న
పెదవి లో మంద హాసాన్ని చిందు చున్న 
పిరుదుల కదలిక మతియే పోవు చున్న      
నిన్ను వదలక మరదలా వెనక ఉన్న 

మనసు ఊరించు మధురమై నదియు వేణు 
గానముతొ పరవశమును పొందు చున్న 
ఊహ లన్నియు నిజమయ్యె తొందరొద్దు 
ముద్దు లన్నియు దాచాను చిరుత బావ
    
నిర్మల హృదయముతోను నిష్కల్ము షమ్ము    
గాను అలుపెర గని ఉదార స్వభావ
తోను చెరగని ఔనత్య తోను నీతొ  
కలసి బతుకుకు మరదలా  వేచి ఉన్న

********
          
చల్ల గాలులు మత్తును పెంచు చుండె 
మధుర గానము మొనము వీడు చుండె 
అధర ముతొ అనుభూతిని పొందు కాల
మిదియు కౌగిలి కొరకుయు రమ్ము బావ

పరువము పదిలముగను దాచితిని మేను 
పైన పవళింపు హాయిని కాపు తాను
అంత నీదేను దోచుకో సొగసు అంత 
వయసు ఉడుకును మరదలా చల్ల పర్చు             
  
దేవి ఈహాయి కలకాల ముండు, ఆశ 
లన్ని నాపైన పెట్టుకో, నిన్ను నేను 
ఘాఢ సుఖమునే నీకును పంచు తాను      
నీకు చుక్కాని లాఉండ గలను బావ 

ధ్యాస నంతయు నీపైన ఉంచి, నిన్నె
తలచి ఈనాటి పుణ్యమో అనియు వగచి 
బెలవు అనుకున్న మరదలా గడసరి 
వైన నొదలను ప్రేమను పంచు నాకు 

కలవ వలెనని కలవర పాటు నాది 
కలువ పువ్వుల మోమును కల్గి ఉన్న 
కధలు ఆనుకొని మనసును పంచ కుండ 
ఉన్న నాకు నీ ప్రేమను పంచ మన్న      

--(())--           

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి