7, ఆగస్టు 2020, శుక్రవారం

భావ రస మంజరి స్వేదం





ఆత్మ సౌందర్యం 
ఆరోగ్యం సంతసం తో కలిసె కలయకే ప్రాభవం శాంతి తీరం
కారుణ్యం విస్మయం తో సవినయముతొ చేసే లక్ష్యసిధ్ధె
వైరాగ్యం నిర్ణయం తో సహనము దయతో ఉండుటే నీతి మార్గం
ధారుడ్యం నిర్మలం తో చెలిమి కరుణతో ప్రేమతో ధర్మతేజం

ప్రాంజలి ప్రభ పద్య పుష్పం 

రవి కాంచెన్ మదిలోన భావమును,  వెల్గున్ పంచు నాప్రేమకై
కవి తెల్పైన్ హృదయమ్ము తాపము ను, నిత్యానంద నాప్రేమకై
నవవాదమ్ములు కమ్మెనే మనసు ఆరోగ్యము నా ప్రేమకై
జవనాశ్వంబున సమ్మోహమ్మునను రానాప్రియ నాప్రేమకై


ప్రాంజలి ప్రభ 
నేటి ప్రణయ గీతం 
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

ఊహకందని వయ్యార వంపుల వనమాలి 
గాలి వీచిన మాధుర్య మయ్యె టి రసకేళి  
అంబరమ్మున మేఘమ్ము జల్లుల విరజాజి 
వచ్చాను మెచ్చాను మగువా అందుకో చెక్కరకేళి 

వేసవి మల్లెలా శీతల  వెన్నెలా వేసారి పోతున్నా మదనా 
హేమంత మంచులా ఏకాంత మంచంలో  వేటాడుకుంటున్నా మదనా 
రగలే సెగలు తగులే వగలు వణకే చలిలో పెరిగే పొదలో
మనువాడ కోరి వేయి కళ్ళతో వేచివున్నా మదనా  

ఊహకందని వయ్యార వంపుల వనమాలి 
గాలివీచిన మాధుర్య మయ్యె టి రసకేళి  
 
లేలేత నీ అందం నా మనసంతా  గోవిందం
నా రాధ నీవే నావయసు దోచే గోవిందం 
నీ గిల్లికజ్జాలు జాబిల్లి పయనాలు గోవిందం 

ఊహకందని వయ్యార వంపుల వనమాలి 
గాలివీచిన మాధుర్య మయ్యె టి రసకేళి  

నా కళ్ళల్లో చూచి రావా రావా 
వయసు తెలిసె ఒడిలో రావా 
యద కరిగి తపన పెరుగు తడిలో రావా 
మనువు కుదిరె మదిలో రావా 
చనువు ముదురు గదిలోకి రావా 

ఊహకందని వయ్యార వంపుల వనమాలి 
గాలివీచిన మాధుర్య మయ్యె టి రసకేళి  
--(())--

భావ రస మంజరి స్వేదం
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

తేటగీతి 
నిత్య భక్తితొ బ్రాహ్మణ దైవ పూజ
గురువు మాటల్లొ మంచిని తెల్పు చుండు
మనిషి నీతిగా బ్రతికించి బతుకు వాడు
సర్వ రోగుల్ని రక్షించు దైల లీల

సుందరమ్ముయు సమధురమ్మేగ నీకు
హృదయ తాపము తీర్చుకో అంద గాడ 
ప్రేమ భుక్తి కి ఎవ్వరు అడ్డు రారు
రేయి సొంతమ్ము చేసుకో తొంద రొద్దు 

హత్తు కన్నను ఆవిరి చల్ల బడదు 
మత్తు ఎక్కిన మతియు ను మార కుండు
వత్తు లున్నను వనికియు ఉండ రాదు
చిత్తు కాగిత మనకున్న జీవి ఉండు

ఇంక ఇంకను కావాలి తృప్తి రాల  
అందు కున్నంత జుర్రుకో మదన కర్త 
ఆద మరచియు అందిస్తు ఉన్న నీకు 
ఇష్ట పడితిని తృప్తియు నీకు నాకు   

గాలి లాకమ్మి మనసును దోచి యున్న  
జలము లావచ్చి చల్లగా జారు చున్న 
నిప్పు అనుకున్న నీకును భాధ యున్న
పృద్వి లానిన్ను భరిస్తూ చదువు తున్న
      
తాటి చెట్టున తన్మయి నీడ గుండె 
ఆట పాటయు పొందియు లేక ఉండె 
నిద్ర వచ్చిన బండనే కౌగి లించె     
స్త్రీకి సౌందర్యం అడవికి వెన్నె లాయె   

తాగితే తప్పు కాదన్న మనసు నీడ 
మాటల విలువ తాగిన తెలియు చుండు 
ప్రేమ ఉచ్చులొ చిక్కిన తాగు చుండు 
జిహ్వ చాపల్యం రోగము మనియు తెలుసు



మేఘ మాలిక నుదుటి మీద మెరిసె 
ఫెళ్ళు ఫెళ్ళని ఒళ్లంత విరిచి చూపె
జల్లు జల్లుగ తడిసెను పుడమి తల్లి 
మనిషి గుండె గుండెనుతాకె హాయి నొందె  .... 1

పృద్వి గుండెలొ విత్తనం పైకి విచ్చె 
మంట పెట్టిన మానసం భగ్గు మన్నె 
జంట కట్టిన ఆసనం చిందు లేసె  
కంట నీటిని  హాసనం హాయి నింపు    .. 2

పసిడి ఛాయలతో మేను మెరుపు గాను  
మగువ కోర్కలతో ఆశ పరుగు గాను  
తెగువ భావముతో కొంత ధైర్య మొచ్చె  
వరుడు హాసముతో కొంత తెలివి వచ్చె  ... 3

పరుగు తీసెడి వయసుకు భాద కల్గు  
కరుడు కట్టిన మనసుకు తెలియ కుండు
వినయ వాదన జయముకు తోడు నీడ 
మనిషి వేదపఠనము శాంతి నిచ్చు   ... 4

నిత్య పరువాల సొగసుణ కురులు విప్పె 
సత్య వినయాలమనసుణ కవిత లల్లె   
స్వేశ్చ గమకాల గణమున కధలు చెప్పె  
న్యాయ సుమశీల నడకలు తగ్గు చుండె ... 5

కొమ్మ,రెమ్మ, ఆకు,  కంకులుగా మారి
అమ్మ కమ్మ నైన మాట మార్చి 
నమ్మ కమ్ము తోనె అమ్మి బతుకు చుండు 
చెమ్మ గిల్లె కళ్ళు కష్ట మంత          .... 6

గుట్టు చెప్పి మనసు గుభాలింపగ చేసి 
ఒట్టు, గట్టు, పెట్టె పుత్ర బలిమి  
అమ్మ,నాన్న.ముద్దు ఆశలు అడియాస 
చేసి భార్య వెంట పుత్రు డెల్లె         ... 7

మెరుపు తీగలా మిలమిలా మెరిసె వనిత 
కరువు డేగలా గలగలా కమ్ము కుంది 
పరువు పోయినా సుఖమిచ్చు తరుణ మంది
ఒడుపు ఊయలా ధగదగా మరుపు నిచ్చె ... 8   

కులుకు నవ్వుల ముచ్చట్లు మనసు దోచె 
కలువ ఆకర్ష చెప్పఁట్లు చరిచి పిలిచె
కన్య కామ్యపు చూపులు జలధి రించె    
సుఖపు జల్లులు సంతృప్తి కలగ చేసి .... .. 9   
--(())--

భావ రస మంజరి స్వేదం (2)
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

చిలుక అందాన్ని ముద్దాడి కొరికి పలికె  
మగువ పందాన్ని గెలిసియు ముద్దు నిచ్చె  
జిలెబి చుట్టల్ని చూపియు నోరు తడిపె   
జిగురు వాదాన్ని ముద్దాడి ఘనత కూర్చె .... 10  

గుంపు కంకులు మధ్యన ముచ్చటించి 
ఆర్చు కాకుల మధ్యన మనసు పంచి 
నెమలి ఆటలా పురివిప్పి మెచ్చి కయ్యె
మోపు ఆకుల పాన్పుపై హాయి గొలిపె  ...... ... 11 

రాత్రి కడురమ్య మయ్యెను పృథ్వి తడిసె  
నేత్రములు నిన్ను గననెంతొ సద్దు చేసె  
యాత్రముగ వీచె తరుణము సుఖము గాలి 
శత్రు వైనను సుఖమిచ్చు మదన వీణ ....... 12  

చేను కోకిల గొంతుతో  కదిలి ఊగె  
మేను ఆకలి ఆశతో  కదిలి వచ్చె 
మాను దాహపు నీడలో తడిసి మురిసె 
దేహ మంత స్వేదములు కరిగి వచ్చె  .... .... 13   

తీర్చె రైతన్న ఆకలి  ముచ్చ టించె 
తీర్చె ప్రాయమ్ము ఆకలి సంబ రమ్ము  
తీర్చె స్నేహమ్ము ఆకలి  తృప్తి పరచె 
తీర్చె కాలమ్ము ఆకలి మాయ నంత    .... .... 14 

అలుపు ఎరగని సంద్రపు వనిత నీవు        
కెరట ములువలెను మగని మనసు  
చేరి శాంతిని కల్పించు గురువు నీవు  
రచయతవు కలతీర్చు శుభము రోజు   ... ..  15  

పేగు బంధాన్ని జటిలము చేసి నావు 
రాగ బంధాన్ని ఆవిరి చేసి నావు  
ఆర్దిక పునాది గట్టిగ మార్చి నావు 
పృద్విని ప్రమాదమునుండి మాపి నావు ... 16 

గాలి తిత్తుల బతుకును మార్చి నావు 
దృశ్య సంఘట ణ విశద పరిచి నావు 
తేరు కొనేటి ధైర్యము చూపి నావు 
ధాత్రి జీవన్మరణసమస్యలకు హృదయి  ... 17

నేను దూది పింజాన్నిగ ఎగిరి ఎగిరి  
తడిసి బరువెక్కి బాధలు కొత్త కాదు  
అడుగడుక్కిఆపదలున్న రాసె రాత 
నడిచె నడకలు ప్రీతితో సంబరమ్ము ....  .. 18

ప్రాంజలి  ప్రభ ....  భావ రస మంజరి స్వేదం (2)
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ఏది నన్ను వెంటాడిన మనసు రాత
అనియు కలల చరితయు యండ మావి       
బతక నేర్చిన భవితను తీర్చి దిద్ది 
భావ కవులనుద్దరించు శక్తి చాలు     .... ... 19 

 వచ్చి వెల్లేది మంచి చేసియు ను సూర్య 
ఉదయ కిరణాలు సూర్యుడు అస్త మించి
చంద్రు నాహ్వాన  చీకటి వెన్నలంత
స్వార్ధ మన్నది లేనట్టి చెలిమి బలిమి ... .. 20 

వాగి నంత మాత్రాన ఉదయము రాదు 
వద్దు అన్న ఆగక రాత్రి  వచ్చు చుండు
తప్పు చేసిన అపజయం ఎదురు అయిన
జీవి తముముగిసినది అగుటయు గాదు ... .. 21

పలికి బొంకని వాడుగ బతుకు గడిపి 
పాటి దప్పని వాడుగ కొలువు చేసి  .
సూర్య వేలుగా పరుగులు తీయు చుండి 
మిధ్య పంచియు  త్యాగపు బుద్ధి కలిగె ... .. 22 

ఆట పాటలు కలసిమె లసియు ఆడు 
వినయ వినమ్రత కలిగియు ఒప్పు వాడు.
తల్లి దండ్రుల మాటలు  దప్పకుండు
అహము లేనట్టి కారుణ్య ధార్మికుడుగ  ..... 23 

అన్న తమ్ముల బ్రేమించు ధార్మికుండు
గురువు బూజించు సహనంతొ ఎవ చేసి 
సర్వ శక్తులు ధారపో సిఆనాడు కొనియు 
హృదయ  సుమతులన్ రక్షించు శక్తి కలిగి ... 24  

స్నేహ సింధువు  ప్రేమలన్ జిల్కు చూపి 
మనసు టధరాల భార్యకు నగవు చూసి 
మనిషి హృదయాన నిలిచేటి వెలుగు లిచ్చి 
సకల తెలివిని పంచియు బతుకు చుండె  ... 25  

కాని మనిషి లేడును దేహ మంత ఉడుకు     
వావి వరుస లేదును  కాలమంత మడుగు  
కాల కరుణ లేదును కానిదంటు లేదు 
దేశ పలుకు లేదును రాజ కీయ మయ్యె  ... 26

చక్కని స్వాతి మెరుపుకు స్వర మేళ   
చిక్కి చక్కెర మోవికి వినయ వాణి 
సళుపుఁ జూపుల కువినయ విరహగీత    
మది చలములయల కులకు కలల తీర్చు   .. 27


ప్రాంజలి  ప్రభ ....  భావ రస మంజరి స్వేదం (4)
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

చన్ను మెఱఁగుల థళకుకు తలను వాల్చి 
మేను చందన గంధితొ పూత పూసి 
సన్నపు నడిమికి గొలుసు చుట్టి చుట్టి 
మూడు ముళ్ళతో దండల మేలు కలలు  ... 28

తనువు కులికేటి మురిపెపు గుమ్మరింపుఁ
కలల పలుకుల సొలపులఁ ఒక్క టవ్వు 
నగవు కిన్నెరతోఁ బతి కెలన నిలుచుఁ 
కళల ఉన్నతిఁ మలుపులు నొరగి నిలుచుఁ .. 29 

జన్మ భూమి యందు ఆలయనిర్మాణ   
జనులు ప్రధాని ఆశ యమ్ము రామ
సీత రామ చంద్ర మూర్తిప్రతిష్ఠకు  
భరత కీర్తి నిలిపె మందిరమ్ము      ....  .... 30 

ఒక్క మాట చాలు ధర్మము బతుకును 
ఒక్క పత్ని చాలు సుఖము కొరకు 
ఒక్క బాణ మంటె ఓర్పుతో ధైర్యమే    
దుష్టసంహ రమ్ము చేసె రామ    ... //// 31 

తండ్రి మాట బట్టి విశ్వమిత్రునివెంట 
వెడలి దుష్ట రాక్షసమ్ము చంపి 
యాగ రక్ష కుండు గాను ఉండి
బలఅతిబల విద్య నభ్య సించె   .... ... 32

నిశ్చ యమునీలొ లేదులె కాల మందు
ఉండు అనిశ్చిత మార్పుకు సమయ ముంది  
అందుకే సృజ నాత్మక ముండి తరుణ 
ధైర్య మనునది జీవికి పగలు రాత్రి    .... .. 33 

మనిషికి అపరిమిత అహములేదు పరిమి 
తము, పరిమిత మనసు లేదు కళలు  
మాత్రము పరిమితము మన్నది లేదులే     
సార్వ భౌమ మన్న ఆశ లేదు          .... ... 34

భయము లేనట్టి దేశమే నీకు రక్ష 
జ్ణాన సంపద ఉంటేను ధైర్య ముండు
స్వేఛ్చ ఉంటేనె మనసుకు శాంతి పొంది 
విపుల సత్యాన్ని వశ్వాన్ని. నమ్మి బతుకు ... 35 
--(())--


ప్రాంజలి  ప్రభ ....  భావ రస మంజరి స్వేదం (5)
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

పడతి పవలింపు కోరితే ఆశ పడకు  
పద్మము ముఖార విందము అండ మిచ్చు 
పద్మముఖిగుభా ళింపుకు లొంగ వచ్చు 
లొంగ నట్టివారెవ్వరు లేరు లేరు      ... ... 36 

సర్వ ముఖి గగుర్పాటుకు లొంగీ పోవు 
పల్ల వాధర ఆదర ణమున పరుగు 
పల్ల వోష్ఠికి సంభాష ణలకు చెల్లు  
లొంగ నట్టివారెవ్వరు లేరు లేరు   ... ... 37 

పాట లనుగంధి పాటల కులకు వళ్ళ  
పుత్తడి మెరుపులకు బొమ్మ కూడ కరుగు  
పువ్వ రునబోడి చతురత గెలుపు నిచ్చు 
లొంగ నట్టివారెవ్వరు లేరు లేరు    ... ... 38

పచ్చ డిక పుకా రులకును రుచిగ ఉండు 
పుష్క రాక్షి వి రహమున కల్కి  ఉండు 
సాటు పిలుపు కొంపలు ముంచ వచ్చు 
లొంగ నట్టివారెవ్వరు లేరు లేరు   ... .. 39 

దర్శినికి లొంగి ఆకర్ష ణలకు చిక్కు 
ప్రియ వాక్కుల వళ్ళను మనసు లొంగు  
ప్రౌఢ ప్రోత్సాహ మెపుడు సుఖము గుండు   
లొంగ నట్టివారెవ్వరు లేరు లేరు .... ... 40

కోడి గంతులు బంగారు మల్లె ముండు  
బాగు లాడిలొ  బాగోగు లుండ కుండు 
బావ గారికి గుర్తింపు చక్కఁ గుండు 
లొంగ నట్టివారెవ్వరు లేరు లేరు  ... ... 41

బింబ అధరము లకు లొంగి ఉండు  
నవల నవభావ నటనకు నాంది పలుకు  
దివ్య నళినాక్షి మెరుపులు మనసు చేరు 
లొంగ నట్టివారెవ్వరు లేరు లేరు   ... ... 42 

--(())--


Radhakrishna Love 1, Painting by Sanjay Tandekar


ప్రాంజలి  ప్రభ ....  భావ రస మంజరి స్వేదం (6)
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

వికట రూపసి శృంగార చేష్ట లుడుకు  
మగువ మోమును పొందుట ఆశక చిందు  
మదిరి నయన వే దింపుకు తప్ప కుండు  
లొంగ నట్టివారెవ్వరు లేరు లేరు   ... ... 43 

రోగ రూపలావణ్యము ఎంత వరకు  
రూప పవళింపు పిలుపుకు ఎంత వరకు
మత్తు చూపులు కనబడు ఎంత వరకు  
లొంగ నట్టివారెవ్వరు లేరు లేరు  ... ... 44 

మేలి కౌగలి పిలుపుకు ఎంత వరకు
మంద మతితీర్పు ముద్దులు ఎంత వరకు
మొదటి పెట్టెటి పేచీలు ఎంత వరకు
లొంగ నట్టివారెవ్వరు లేరు లేరు   ...  ... 45 

రాగ రశికల స్వేదము ఎంత వరకు
మడతు పేచీలు నిలబడు ఎంత వరకు 
రమణి రంజిల్లు చూపులు  ఎంత వరకు
లొంగ నట్టివారెవ్వరు లేరు లేరు   ...  .. 46 

కమ్మ నైనట్టి మాటలు వినగ మనసు   
పువ్వు విరబూసి నట్లుగా విరిసి ఉండు , 
నమ్మ కమ్ముయె కమ్మని మనసు మాట 
తృప్తి ఎప్పుడు చేయూత నిచ్చు చుండు .47 

అర్ధ మంతయు ఆత్మీయ తమ్ము యందు
స్వశ్చ మైనట్టి బతుకుకు ఓర్పు మాట  
నవ్వు లన్నియు రక్తాన్ని కుదిపి వేయు   
మౌన చూపులొ ప్రశాంతి కలిగి ఉంచు   .. 48  

నలుగు రుంటేను మాటలు పెరుగు చుండు   
ధర్మ నడకయె మనస్సుకు శాంతి ముక్తి 
పెదవి విరుపులు గర్వపు దేహ ముండు  
అదుపు లేనట్టి ఆవేశం నష్ట పరుచు     .. 49 

నమ్మి బతకులో అపశృతి చెల్లు బాటు  
నారి నడుమన మాటలు చెల్ల నెరవు 
చురుకు తనముకు హద్దులు అడ్డు పడును  
పనిలొ కవ్వి0పు చేష్టలు సహజ సిద్ధి  ... 50 

నీల మేఘ కృష్ణ అల్లరి చేష్టలు 
అద్భుతమ్ము అమోఘమ్ము యేగ 
కనుల చూపు కరుణ మనసున రంజిల్లు 
హాయి గొల్పి సౌఖ్య మిచ్చు చుండు  .. 51 

ఊహల కలలు రోగమ్ము భయ్య మాయె
గబ్బి లమ్ముల మార్చారు బతుకు తెరువు
ఇంటి కెవ్వరు రాకండి దుఃఖ మంటు
ముక్కు గుడ్డలు కట్టండి ఇంట్లొ ఉన్న ... 52


Amazing Canvas Paintings available at best price with IndianArtZone. Select from wide range of curated Abstract Art, Contemporary Art , Modern Art & Indian Paintings and many other wall paintings for living room.

ప్రాంజలి  ప్రభ ....  భావ రస మంజరి స్వేదం (7)
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

అన్ని ఉన్నను ఆరోగ్య ముసరి లేదు
ఊపి రాడని స్థితికి వచ్చు చున్న
ముందు లేదంటు రోగిగా బయట పెట్టు
ఇంటి వారును కూడాను దూర ముంచు .. 53 

జ్ఞాత సాక్షిగా జీవిత రక్ష పలుకు
కర్మ సాక్షిగా మాలిన్య మంత తొలుచు
శాంతి సమరస సహజము తెల్పి బతుకు
 ఆత్మ శక్తికి అర్హత జ్ఞాన దీప్తి      

దేహ మెంతకు నీసొత్తు కానె కాదు
కాల  నిర్ణయాల ప్రశ్న వద్దు నీకు 
ఉన్న దానిలో తృప్తిని వెతుకు జీవి
మార్పు ననుసరించి పలుకు మార్చు జీవి  


కారు చీకట్లో కాంతిపుం జాలు పుట్టి 
మనసు చీకట్లు తరిమియు సుఖము నిచ్చె  
స్త్రీల మూలము శృంగార వంట బట్టె    
చిత్రము విచిత్ర మయ్యెను విదిత వళ్ళ 

జాతి సంస్కార తలపులు మనసు వెంట 
నిజము తెలిపేటి శక్తిని  వశము పొంది      
అతివ ఆర్తనా దములకు రక్ష కుడుగ    
ప్రాణ నాదముకు తోడుగా కలసియున్న   

తప్ప టడుగులు పడకయు ఓర్పు ఉంచి   
చేయి పట్టియు నడిపించు తండ్రి ఋణము  
గోరు ముద్దలు తినిపించు తల్లి ఋణము 
మరచి పోకుండ తోడుగ ఋణము తీర్చె   
   
పొత్త పొత్తిళ్ళ మురిపాలు ఆశ ఉన్న 
కనక సొత్తుకు వేటకు చేర కుండ 
రాళ్లు ముళ్ళులొ నడకను అమలు పరచి   
బతుకు బతికుంచు అనుటయే లక్ష్య సిద్ధి   


చెప్పెది వినుట మనిషిగా ధర్మ సూక్తి    
విన్న మాటలు అనుకర ణముగ ఉంటె   
ఆచరణమయ్యె విధముగా నడుచుకొనుట  
ఏమి వితండ వాదము చేయ కుండు        

ఒప్పు కోవుట సాధన సాధ్య మవ్వు 
ఒకరి సొత్తుకు ఆశకు లొబడ కుండు 
తెలివి అనునది ఒక్కరి సొత్తు కాదు 
గమ్య మన్నది ఎవ్వరూ తెలుసు కోరు 

చదువు నిర్లక్ష్య మనునది చెప్పి రాదు  
నిద్ర కోరిక ఉన్నంత వరకు రాదు  
ఆడు కోరాదు బలహీన పరుల నీడ   
ఆడ మొగలతో ఆడుట వద్దు నీకు 

వయసొచ్చి నాకోరి కలకు లొంగి   
నేను అనుకున్న దానికోస మందు పరుగు  
అప్పు చేసినా జీవిగా ఎదుగు చున్న   
ఎదురు చూడక సహకార మిచ్చు మనసు  



మనసు మోహము వ్యాకులత్వమును పొంది
పిరికి తనముయు శోకము మావరించి 
మనసు మలినము చెందినా గజిబిజి యును 
అహము తోడుగా పాపము చేయు బుధ్ధి

 శ్లేష్మలోపడ్డఈగలా మనిషి బతుకు 
ధనము దేహపు బంధము చిక్కి ఉంటే
సవ్యధర్మాన్ని అనుకున్నతెల్ప లేవు 
స్వేచ్ఛ గాలికి రూపము ఆశ పెట్టు 

కలము ఆగదు ఊపిరి ఉన్న వరకు ,
గళము మారదు లోకము ఉన్న వరకు  
పదము తప్పదు స్వరము ఉన్న వరకు , 
వాణి బాణీణి సేవిస్తు ఉన్న వరకు   

కోడి కూత కన్న ముందుగా లేచియు 
విన్న దంత చెప్ప దల్చి  నమ్మ  
మాట కమ్మ గున్న మనసును పంచియు 
మమత మార కుండ హృదయ మిమ్ము    

చిత్త మంటారు గోతులు తీసి నమ్మి
నమ్మ కమ్మున సమకాలి వద్ద ఉన్న 
వర్త మానాన్ని తెల్పేటి నిజము అంటు 
ఉండె వారిని జాగ్రత్త గాను మార్చు

స్వర్గమనినను వైభవం నుండి జారు 
ప్రజ్ణ తెల్పియు ఒక్కర్ని మార్చి చూడు
మనసు అప్పుడు స్వర్గము తలపు చుండు
మనసు అర్ధము గ్రహించి ఆదు కొనుట 
నిజమైన స్వర్గం

ఆత్మ సౌందర్యం 
తేటగీతి 
ఇంక ఇంకను కావాలి తృప్తి రాల  
అందు కున్నంత జుర్రుకో మదన కర్త 
ఆద మరచియు అందిస్తు ఉన్న నీకు 
ఇష్ట పడితిని తృప్తియు నీకు నాకు   

గాలి లాకమ్మి మనసును దోచి యున్న  
జలము లావచ్చి చల్లగా జారు చున్న 
నిప్పు అనుకున్న నీకును భాధ యున్న
పృద్వి లానిన్ను భరిస్తూ చదువు తున్న      

తాటి చెట్టున తన్మయి నీడ గుండె 
ఆట పాటయు పొందియు లేక ఉండె 
నిద్ర వచ్చిన బండనే కౌగి లించె     
స్త్రీకి సౌందర్యం అడవికి వెన్నె లాయె   

తాగితే తప్పు కాదన్న మనసు నీడ 
మాటల విలువ తాగిన తెలియు చుండు 
ప్రేమ ఉచ్చులొ చిక్కిన తాగు చుండు 

జిహ్వ చాపల్యం రోగము మనియు తెలుసు  
Lotus-Eyed Sri Krishna : Photo

ఆత్మ సౌందర్యం -2 ప్రాంజలి ప్రభ : అంతర్జాల పత్రిక  
తేటగీతి పద్యాలు : రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
  
పృద్విని వెలుగే నింపేటి వెన్నె లమ్మ  
నింగిలొ మేఘాన్ని తరిమేటి గాలి లమ్మ   
ఎండ కురిపించి తిరుగాడె సూర్య లమ్మ   
చల్ల చల్లని చీకటి మబ్బు లమ్మ  

కళ్ళ భాష్యాలేందుకులే తొంద రొద్దు 
చెక్కి లాలాపై చూపుకు తొంద రొద్దు
గుళ్ళ పైమక్కు వెందుకు తొంద రొద్దు 
ముళ్ళపైనిద్ర యందుకు తొంద రొద్దు

గల్ల మునుఇచ్చుటెందుకు తొంద రొద్దు
వల్లు అప్ప గిన్చుటెందుకు తొంద రొద్దు
కళ్లు కపటాన్ని చూసాక తొంద రొద్దు 
కళ్ళు మైకంలో ఉన్నాక తొంద రొద్దు 

తల్లి చేసేది పెళ్ళాన్ని చేయ మంటె 
భార్య చేసేది తల్లిని  చేయ మంటె 
అమ్మ ఆహారం అడగటం తప్పులేదు
భార్య కొడితేను  తప్పనక  తప్ప లేదు 

నెత్తు టిమరక ఎత్తులు చిత్తు చేయి 
మెత్త టి కురుల వత్తును మత్తు చేయి  
కత్తి పదునులా మాటలు  చిత్తు చేయి 
ఎంత పలుకైన ఓర్పును చూపి చేయి     

నడక చూడగా రైలులా కదులు చుండు  
ముఖము చూడగా హృయమంత కదులు చుండు 
పిరుదులను చూస్తె కళ్ళుయే కదులు చుండు  
యదను చూసేను ఎర్రెక్కి కదులు చుండు
  
చిన్న నాటి జ్ఞా పకములు మర్వ లేను  
తీపి గుర్తులు మరచియు ఉండ లేను 
కన్న కలలను వదలియుఁ బతక లేను   
తీర్చ వలసిన కోరిక వదల లేను  

అన్న మాటలు ఎప్పుడూ అమృత పల్కు - 
అమ్మ ఆచర ణములకు మార్గ పల్కు   
నాన్న కట్టుకున్న వారికో రికలు తీర్చు  
నిత్య  దాంపత్య ధర్మాలు అచ రించు  

ఎంకి ఇటు రావె ఆటుపోవె  మాట వద్దు   
రాము నిగుడికి  ఎల్లోద్దాం మాట వద్దు
ఆప నియని ఈ పనినువ్వు మార్చ వద్దు  
అత్త గారికి చెప్పియు వేళ్ళ వచ్చు 

ఆత్మ సౌందర్యం -3 ప్రాంజలి ప్రభ : అంతర్జాల పత్రిక  
తేటగీతి పద్యాలు : రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

వెలుగు చూసియు మోసము చేయ వద్దు 
పరుగు యంత్రము సహజము అనుట వద్దు  
కరుగు మంచులా హృదయాన్ని ఉంచు బతుకు 
మురుగు నీటిలా బతుకును ఉంచా వద్దు 

ముళ్ళు అనునవి ఊహల్లో తేలు చుండు 
జల్లు అనునది మనసును తాకు చుండు  
వళ్ళు అనునది కలియుట కుండు చుండు  
కళ్ళు చూసియు చూడక ఉండు చుండు  

ఆశ అనునది ఉండును మార్పు కొరకు 
తలపు అనునది పెరుగును ప్రేమ కొరకు
కధలు అనునవి పుట్టును జీవితమ్ము
తనువు లనునది కలబడే జీవితమ్ము     

ప్రేమ అనునది ఇక్కడే ఉండు ననుట   
ప్రేమ అనునది అక్కడే ఆగ దనుట 
ప్రేమ అనునది తక్కెడ అనియు అనకు  
ప్రేమ అనునది వాక్కును బట్టి ఉండు 

హోద అనునది తెలిపేటి పనులు కావు 
చేసె పనులకు ప్రాధాన్యం ఇవ్వ వచ్చు  
చేయ లేనట్టి వాటికి గొప్ప లొద్దు 
చేత నయనట్టి సహనము చూపి బతుకు   

సంకలు వలన ఒరిగేది ఏమి లేదు 
పావులు కదిలే చదరంగ అట వద్దు  
రాజ కీయపు మాటలను పలక వద్దు 
తల్లి తండ్రుల్ని ఎదిరించి నటన వద్దు 

 --((*))--


స్వాతంత్ర దినోత్సవ శుభా కాంక్షలు
     
దేశమంటే పాడి పంటల వృద్ధియే
స్నేహభా వాలతో ధర్మ నిరతి   
పుడమిలొ నిరతము సత్యము తెలిపేటి
భారత దేశము శక్తి యుక్తి
మనిషిలో ధైర్యాన్ని కల్పించి సాంఘిక
ఉత్తేజ;లక్ష్యాన్ని నేర్పి తెలిపి
నిర్మాణ కార్యదక్షతతొ దేశాన్కి 
సహకార భావ సకల దీక్ష

నిత్య ధర్మాలు తెలిపేటి ధర్మ భూమి
ప్రేత కర్మలు చేసేటి కర్మ భూమి
పుడమి తల్లిని ప్రార్ధించె మాతృ భూమి     
సర్వమత ఆదరణ గల భరత భూమి
--(())--


సీసము.
కైలాస గిరితతుల్-కరిగె వేదాల నా
       దాలతో,పులకించ-ధరణి మాత..!
గంగానదీ తరం-గమ్ములు పొరలెత్తి
       ఉపనిషద్ధారలై -ఉబికి వచ్చె..!
వింధ్యాటవీ మధ్య-వినిపించె సుస్వర
       ధార్మిక గానము-ధర్మ నీతి..!
గోదావరీ నది-కూర్మితో గడిగె య
    గస్త్యుని పాదాలు -గౌరవించి..!
తే.గీ॥
వేద మంత్రాలు వెలసిన- వేదభూమి..!
ధర్మ సూత్రాలు నడయాడు-ధర్మభూమి..!
కర్మ వీరులు నడచిన-కర్మభూమి..!
వన్నె తరగని కీర్తి..నా-భరతభూమి..!
2.
తే.గీ.
గంగ యమున గోదావరి తుంగభద్ర ,
పుణ్యనదులెన్నొ వాసిగ పుట్టెనిచట.!
బాదరాయణ వాల్మీకి- పరమ రుషుల
పాదుపమ్మిదియె పవిత్ర -భరతభూమి.!


 లోక సూక్తులు (ఛందస్సు)
UUII - UIUI - UIIU - IIUU
నేటి పద్యాలు ... విశ్వాసం 
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

విజ్ఞానము వింత శోభ అర్ధముచే కనుగోటం  
అజ్ఞానము తన్ను తాను అల్పుడనే అనుకోటం
సామర్ధ్యము నాది నాకే తెల్సుననేదియు గర్వం
వాచాలత తోడు నీడగా కలవా లని సత్యం

సంకల్పము ఉంటె ఎంతొ దివ్య బలం మనవెంటే
ఆకర్ష ణ ఉంటె ఏం తొ  ప్రేమ బలం మనసంతా
సంఘర్షణ ఉంటె కల్లోలం మమతే మనచుట్టూ
వికర్షణ ఉంటె శాంతి లేక ఉండే భ్రమ సృష్టే   

దివ్యత్వము సామ దాన భేదములే నవజీవం
సాకారము  ప్రేమ శక్తి కామములే  నవరూపం
ప్రామాణిక సేవా భావ తత్వములే నవదీపం
జ్ఞానం మన ప్రేమ తత్వ నిర్మలమే నవదీక్ష

సందేహము ఎప్పుడూ మనస్సు వేధించుట కాదా
ఆనందము ఎప్పుడూ మనస్సు కేశాంతము కాదా
దేవాలయ ప్రాంగణం మనస్సుకే వేదము కాదా
సాహిత్యము ప్రాణ భాష ప్రేరణగా కధ  కాదా   

అమ్మా అని పిల్పు శాంతి నిచ్చునులే మనసంతా 
నాన్నా అని పిల్పు ధైర్య మిచ్చునులే మనసంతా 
తాతా అని పిల్పు భాగ్య మిచ్చునులే  పలుకంతా 
బామ్మా అనిపిల్పు హాయి గొల్పునులే తరుణమ్మే 

మేధస్సుయు లెనినట్టి మానవుడే బతికేనే 
మేథా బల ముండి లేనివానివలే బతికేనే
కాలం మన సొంత దవ్వటానికియే బతికేనే
విశ్వాసము చూపి ఖర్చుచేయుటయే బతుకంతా     

ఐశ్వర్యమధా౦దు డిష్ట వాక్యములే వినకుండే 
కారుణ్యముతో మనోబలాన్ని సకార్యముగ ఉండే 
దేహమ్మున ఆశపాశ మంతయులే కలిగుండే 
రూపాన్ని గుణాన్ని సమాజ సేవలుగా ఉపయోగం 
    
--((*))-- 

3.
సీసము.
ప్రాణంబు వోయినన్- పాడియే దప్పని
        త్యాగమూర్తుల గన్న- ధన్య భూమి.!
బడుగుల కన్నంబు- కడుపార నందించు
      బంగరు పంటల- భాగ్యభూమి!
నీతి నిజాయితీ- నిండుగ గల్గిన
      బుత్రులన్ గన్నట్టి- పుణ్యభూమి.!
పలికి బొంకని సత్య- వాక్పరిపాలక
       మణులను గన్నట్టి- మహిత భూమి.!
తే.గీ.
సహన మంత్రంబు నొసగిన-శాంతిభూమి.!
వేద మంత్రాలు నినదించు- వేదభూమి.!
కర్మ యోగంబు దెలిపిన- కర్మ భూమి.!
దైన్య జీవుల రక్షించు- ధర్మ భూమి.!
4.
సీసము.
ధగధగ మెరుపుల- ధవళ హిమగిరుల
        శోభిల్లె నాతల్లి- సుధలు జింది.!
వాల్మీకి సప్తర్ష-వ్యాసుడగస్త్యాది,
         ఋషివర్య తపముల- రుచిరమయ్యె!
వేదఘోషల యజ్ఞ- వేదికలుత్కృష్ఠ
         భారత సంస్కృతి- పరిఢవిల్లె.!
బుద్ధ దేవుని శాంతి- వచనాలలో సత్య
         పవనముల్ స్వేచ్ఛగ- వ్యాప్తమయ్యె!
తే.గీ.
ఆర్య భట్ట, చరక, శుశ్రు- తాది, శాస్త్ర
వేత్త లెందరో పుణ్యమై- వెలిసిరిచట.!
భరత దేశమ్ము నాతల్లి- భాగ్యభూమి.!
వందనములమ్మ! నీకివే- వందనములు.!
జనార్దనా చారి గుగ్గిళ్ళు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి