25, జులై 2020, శనివారం

ప్రాంజలి ప్రభ - అంతార్జాల పత్రిక పచ్చళ్ళు


ప్రాంజలి ప్రభ - అంతార్జాల పత్రిక పచ్చళ్ళు 
సేకరణ/ చ్చాయట: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

కొబ్బరి పచ్చడి వాన పడుతుంది హడావుడిగా చేశాను వీడియెూలేదు మామూలుగానే
కొబ్బరి
పచ్చిమిర్చి
ఉప్పు
పసుపు
మెంతిపిండి 
బెల్లం
తాలింపులో
పచ్చి పప్పు
చాయపప్పు
ఆవాలు
జీలకర్ర
ఇంగువ
నూనె
కరేపాకు
కొతిమీర
ఈపదార్ధాలనుపయెూగించాను
మీ అందరికీ తెలిసిందే

వాము ఆకుతో  రోటి పచ్చడి .
వాము ఆకు అప్పుడప్పుడు  వాడితే ఆరోగ్యానికి  చాలా మంచిది .
కనీసం మూడు నెలలకు ఒక్కసారి  అయినా  వాము పొడి  కాని  వాము ఆకు కాని  వాడితే  ఉదరం శుభ్ర పడుతుంది .
ఈ వాము ఆకుతో చాలా మంది బజ్జీలు వేసుకుంటారు .
వాము ఆకుతో పచ్చడి కూడా చేసుకోవచ్చు .
కావలసినవి .
వాము ఆకులు  --  షుమారు 35 
చింతపండు  --  నిమ్మకాయంత. విడదీసి ఉంచుకోవాలి .
నూనె --  మూడు  స్పూన్లు 
ఎండుమిరపకాయలు  -  10
మెంతులు --  అర స్పూను 
ఆవాలు  --  అర స్పూను 
పసుపు  --  కొద్దిగా 
ఇంగువ --  కొద్దిగా 
ఉప్పు  --  తగినంత
తయారీ విధానము .
నువ్వుపప్పు  - 50 గ్రాములు .
నూనె వేయకుండా కమ్మని వాసన వచ్చే వరకు వేయించి చల్లారిన తర్వాత రోటిలో పొడి కొట్టుకుని  విడిగా  వేరే ప్లేటు లోకి తీసుకుని  ఉంచుకోవాలి .
ముందుగా  వాము  ఆకులను  కడిగి  శుభ్రం చేసుకోవాలి .
స్టౌ మీద బాండీ పెట్టి  స్పూనున్నర  నూనె వేసి నూనె బాగా కాగగానే  ముందుగా  మెంతులు తర్వాత  ఎండుమిరపకాయలు ,  ఆవాలు మరియు  ఇంగువ  వేసి పోపు వేయించుకొని  వేరే ప్లేటులోకి  విడిగా  తీసుకోవాలి .
తర్వాత తిరిగి  స్టౌ మీద బాండీ పెట్టి  మిగిలిన నూనె వేసి నూనె బాగా కాగగానే  వాము ఆకులు  మరియు కొద్దిగా  పసుపు వేసి  ఒక అయిదు నిముషాలు  ఆకును బాగా మగ్గనివ్వాలి.
తర్వాత  రోటి లో  వేయించి సిద్ధంగా  ఉంచుకున్న పోపు, చింతపండు  మరియు తగినంత  ఉప్పువేసి  మెత్తగా  పచ్చడి బండతో దంపుకోవాలి .
తర్వాత  మగ్గిన  వాము ఆకును కూడా వేసి పచ్చడి బండతో మెత్తగా  దంపుకోవాలి.
ఆ తర్వాత వేయించి సిద్ధంగా  ఉంచుకున్న  నువ్వుల పొడి కూడా వేసి , బండతో మెత్తగా  నూరుకోవాలి .
తర్వాత  వేరే గిన్నె లోకి తీసుకోవాలి .
అంతే ఎంతో రుచికరమైన  వాము ఆకు  రోటి పచ్చడి  సర్వింగ్  కు సిద్ధం.
ఈ పచ్చడి మొదటగా  వేడి వేడి అన్నంలో  నెయ్యి వేసుకుని  తింటే  చాలా రుచిగా  ఉంటుంది.


రోటిపచ్చళ్ళు .
పాత చింతకాయ పచ్చడితో తీపి రోటి పచ్చడి .
మా చిన్నతనంలో  అమ్మమ్మ గారు , ఆ రోజుల్లో  పాత  చింతకాయ తో  తీపి  రోటి పచ్చడి  చేసే వారు.
ఈ విధముగా  చేసిన పచ్చడి  చాలా రుచిగా ఉండేది.
వేడి వేడి అన్నంలో  నెయ్యి  వేసుకుని  తినడానికి  మరియు దోశెలు  గారెల లోకి  కూడా  ఈ పచ్చడి  చాలా రుచిగా  ఉంటుంది .
తయారీ విధానము .
స్టౌ  మీద  బాండీ  పెట్టి  అయిదు  స్పూన్లు   నూనె  వేసి  నూనె బాగా కాగగానే  పది ఎండు మిరపకాయలు ,  అర స్పూను  మెంతులు ,  స్పూనున్నర  మినపప్పు ,  అర స్పూను  ఆవాలు, కొద్దిగా  ఇంగువ  వేసి  పోపు వేయించుకోండి .
ఒక  కప్పు  పాత  చింతకాయ  పచ్చడి  తీసుకోండి .
 ఒక  40  గ్రా. బెల్లం  తీసుకోండి .
పచ్చడి లో  ఉప్పు లోగడే వేసి ఉంటుంది 
 కనుక   కొద్దిగా  ఉప్పు వేసుకుంటే  సరిపోతుంది .
ఇప్పుడు రోటిలో పోపునంతా వేసి   పచ్చడి  బండతో  ముందుగా మెత్తగా   దంపుకోవాలి .
పోపు  మెత్తగా  నలిగాక  ఉప్పు  బెల్లం వేసి  మెత్తగా  దంపి  తర్వాత  పాత చింతకాయ  పచ్చడి  వేసి  పొత్రము  తో  చాలా కొంచెం   నీళ్ళు  చిలకరించుకుంటూ  పచ్చడి మెత్తగా  కాటుకలా  రుబ్బు కోవాలి .
పాత చింతకాయ పచ్చడి వృధా కాకుండా ఈ పద్దతిలో  చేసుకునే వాళ్ళము .
ఇది మేము రోటిలో  చేసుకునే  పాత  చింతకాయ పచ్చడి .
తీపి  ఇష్టమైతే  ఇలా  చేసుకుని చూడండి .
పచ్చడి  బాగా ఊరి పుల్లపడి ఉంటుంది కనుక  తీపి వేసుకుంటేనే  పచ్చడి  రుచిగా ఉంటుంది .
 వేడి వేడి అన్నంలో  మరి కాస్త నెయ్యి  వేసుకుని  తింటే  చింతపండు  పచ్చడిలా చాలా బాగుంటుంది .
వెల్లుల్లి  ఇష్టమైనవారు  పది పన్నెండు వెల్లుల్లి  రెబ్బలు  పై పొట్టు ఒలుచుకుని , మూడు స్పూనుల నూనె లో ఆవాలు , కరివేపాకు మరియు ఒలిచిన వెల్లుల్లి  రెబ్బలు తో పోపు వేయించుకుని  పచ్చడిలో  వేసుకుంటే  పచ్చడి  మరింత రుచిగా ఉంటుంది .
దోశెలలోకి , గారెలలోకి , చపాతీలలోకి  కూడా బాగుంటుంది .

--(())--


మామిడి కాయతో ముక్కల పచ్చడి .( మెంతి బద్దలు  )

కావలసినవి .
పుల్లని పచ్చి మామిడి కాయ  --  ఒకటి .
పై చెక్కు తీసుకుని  చిన్న చిన్న ముక్కలుగా తరుగు కోవాలి .
ముక్కలను విడిగా ప్లేటులోకి తీసుకుని  పైన  కొద్దిగా పసుపు వేసుకోవాలి .

నూనె  --  ఆరు  స్పూన్లు 
ఎండుమిరపకాయలు  - 12  
మెంతులు --    స్పూను 
ఆవాలు --   స్పూనున్నర  
ఇంగువ --   కొద్దిగా 
ఉప్పు  --  తగినంత 
పసుపు --  కొద్దిగా

తయారీ విధానము .
స్టౌ మీద బాండీ పెట్టుకొని  నాలుగు స్పూన్లు   నూనె పోసి, నూనె బాగా కాగగానే   ముందుగా మెంతులు మరియు ఎండుమిరపకాయలు వేసి బాగా వేగనివ్వాలి . తర్వాత అందులోనే ఆవాలు  మరియు ఇంగువ వేసి పోపు వేయించుకోవాలి.

పోపు చల్లారగానే   రోటిలో వేయించిన పోపు  మరియు తగినంత  ఉప్పు వేసి  పచ్చడి బండతో మెత్తగా  దంపు కోవాలి .

తీపి ఇష్టమైన వారు చిన్న బెల్లం ముక్క రోటిలో  వేసుకుని  దంపు కోవచ్చును. 

ఆ తర్వాత  మామిడి కాయ ముక్కలు కూడా రోటిలో వేసుకుని , మిగిలిన  రెండు స్పూన్లు  పచ్చి నూనెను  వేసుకుని , ఒకసారి ముక్కలు  చేతితో బాగా కలుపుకుని ,  వేరే గిన్నెలోకి తీసుకోవాలి .

ఒక గంట సేపు మూతపెట్టి  ఉంచితే  ముక్కల పులుపు  కారానికి  పట్టి , ముక్కలు  ఊరి ,  బద్దలు మంచి రుచిగా ఉంటాయి.

అప్పుడే  పునాస కాపు కాయలు మార్కెట్లో కి వస్తున్నాయి. పునాసకాపు కాయలు  మంచి పులుపు  ఉండి , మెంతి  బద్దలకు  చాలా రుచిగా  ఉంటాయి.
అంతే. భోజనము లోకి , చపాతీల లోకి , రోటీల లోకి మరియు దోశెల లోకి ఎంతో రుచిగా  ఉండే మామిడి  కాయ ముక్కల పచ్చడి సర్వింగ్  కు సిద్ధం.
ఈ ముక్కల పచ్చడినే  మెంతి బద్దలు అని కూడా అంటారు .
బెల్లం  వేయకపోతే ఒక  వారం , బెల్లం  వేస్తే నాలుగు రోజులు  ఈ ముక్కల పచ్చడి నిల్వ ఉంటుంది .

--(())--

దోసకాయ ముక్కల  పచ్చడి .

కావలసినవి .
పసుపు రంగు గట్టి  దోసకాయ  ---  ఒకటి.
పై  చెక్కు   తీసి  చిన్న  చిన్న  ముక్కలుగా  తరుగు కోవాలి .
చిన్న నిమ్మకాయంత  చింతపండు   విడదీసి  కొద్దిగా నీళ్ళతో  తడిపి  ఉంచుకోవాలి ..
పచ్చిమిరపకాయలు  --  10
కొత్తి మీర   ---  రెండు కట్టలు .
మరి కాస్త  వేసుకున్నా  చాలా  రుచిగా  ఉంటుంది . కట్టలు  విడదీసి  కాడలు  తీసేసి  కొత్తిమీర   శుభ్రం  చేసుకోవాలి .
ఉప్పు   ---   తగినంత 
పసుపు  ---  కొద్దిగా .
పోపుకు  .
ఎండుమిరపకాయలు  --  6
మినపప్పు   ---  స్పూను 
మెంతులు  ---   పావు  స్పూను 
ఆవాలు  ---   అర  స్పూను  
ఇంగువ  ---  కొద్దిగా 
నూనె  ---   50  గ్రాములు 

తయారీ  విధానము  .
ముందుగా  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మొత్తం  నూనె  పోయాలి.
నూనె  బాగా  కాగనివ్వాలి  .
నూనె బాగా కాగగానే   మెంతులు , ఎండుమిరపకాయలు  ,  మినపప్పు , ఆవాలు  మరియు  ఇంగువ  వేసి  పోపు  బాగా  వేగనివ్వాలి .

ఎక్కువ   నూనె  ఉంటే  ఆఖరున  పచ్చడిలో  కలుపుకోవచ్చు.
బాండీ లోనే  ఉంచేయండి 

పోపు  చల్లారగానే  ముందుగా   రోటి లో  ఎండుమిరపకాయలు , తగినంత  ఉప్పు  మరియు  పసుపు వేసి పచ్చడి బండతో   మెత్తగా   దంపుకోవాలి .
తరువాత  పచ్చిమిర్చి  , తడిపిన  చింతపండు   మరియు  పోపు  వేసి బండతో  మెత్తగా దంపుకోవాలి. 

చివరగా  దోసకాయ  ముక్కలు  మరియు కొత్తిమీర  వేసి   ఒకే  ఒక్కసారి  దోసకాయ  ముక్కలు  నలగ  కుండా  పైపైన బండతో నూరుకోవాలి .
రోటిలో నుండి నూరిన పచ్చడి  ఒక  గిన్నెలోకి  తీసుకుని  బాండీలో  కాగిన  మిగిలిన  నూనె  అందులో పోసి   గరిటతో  ముక్కలు  పచ్చడి  బాగా కలిసేటట్లు  కలుపుకోవాలి .
అంతే  ఎంతో  రుచిగా   ఉండే  దోసకాయముక్కలు  పచ్చడి  సర్వింగ్   కు  సిద్ధం .

--(())--

ముందు గా గోంగూర పచ్చి మిర్చి కొంచెం నూనె వేసి ఉడికించాలి తర్వాత బాణాలి కొంచెం నూనె వెసి ఎండుమిర్చి ధనియాలు అవాలు మెంతులు  జీలకర్ర ఇంగవ వేసి వేయించాలి తర్వాత రోటీ లో వేసి పొడి చేసి ఉప్పు గోంగూర వెసి దంచి ఉల్లి వెసి దంచాలి

ఈ రోజు spécial‘ కీరదోసకాయ పచ్చడి’. బాగా కుదిరందంన్నారు మా ఇంట్లో.
చేసే విధానం.:
ఒక కీరదోసకాయ చెక్కుతూసి చిన్న ముక్కలుగ కోసి పెట్టుకోండి. కొతిమేర తరుగు 1/4 కప్పు రెడీ చేసుకోండి.
ఒకమూకుడులో 2 చెంచాల నూనేవేసి వేడిఅవగానే 10 బుల్లిటమోటాలు10 పచ్చిమిరపకాయలు. 4 వెల్లుల్లి రెబ్బలు మగ్గించి, చిన్న నిమ్మకాయంత
చింతపండు కూడా మగ్గించి పక్కన పెట్టుకోండి. 
చిన్నతావాలో 2 చంచాలు నూనె వేసి వేడిఅయ్యాక....2 చంచాలు మినపప్పు, శనగపప్పు, ధనియాలు,
1 చంచా మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ , 5 ఎండు మిరపకాయలు వేసి  
వేయించి దించి సరిపడ వుప్పువేసి దంచి పొడి చేసుకోండి.
ఇప్పుడు రోట్లో మొదటవేయించిన టమేటా, మిర్చి, వెల్లుల్లి వేసి తగినవుప్పువేసి కచ్చపచ్చగా దంచి, దానిలో దంచినపొడి వేసి కలియతిప్పి
కీరదోసకాయముక్కలు,కొతిమేర , పసుపు ,
ఉసిరికాయంత చింతకాయపచ్చడి వేసి ముక్క  నలగకుండా పచ్చడి నూరి  తీసి 
పొడి గాజుసీసాలో పెట్టుకోవాలి. ఇది ఒకరోజు మాత్రమే బావుంటుంది. మిగిలితే ఫ్రిజ్ లో దాచుకోవలసిందే.

రోటి పచ్చళ్ళు గ్రూప్  సభ్యులందరికీ నమస్కారం . ఈరోజు నేను పచ్చికొబ్బరి ఉల్లిగడ్డ పచ్చడి చేశాను. ఎలా చేశానో చెప్తాను .పచ్చి కొబ్బెర, ఉల్లిగడ్డ, కొంచెం జీలకర్ర, కారం, ఉప్పు ,పల్లీలు ,కొంచెం బెల్లం ,వెల్లుల్లిపాయలు, పసుపు అన్ని రోట్లో వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి.  తర్వాత పోపు వేసుకోవాలి అది 5నిముషాలు స్టవ్వు సిమ్ లో పెట్టి మగ్గనివ్వాలి. ఇది  అన్నంలోకి ,చపాతి లోకి, దోశ పైన రుద్దుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే వారం రోజులైనా ఉంటుంది.

--(())--

దోసకాయ పచ్చి టొమాటో పచ్చడి చేశానండీ.. ఇవి మా అత్తమ్మ మిద్దె తోటలో కాయించినవి.. 
ఒక చిన్న దోసకాయ
చిన్ని చిన్ని టోమాటోలు కొన్ని
పచ్చిమిర్చి
ధనియాలు
జీలకర్ర
శనక్కాయపప్పులు (పల్లీలు)
ఇవన్నీ వేయించాను.. రోట్లో దంచాను
2 వెల్లుల్లి పాయలు
కొంచెం నానబెట్టిన చింతపండు
కొంచెం ఉల్లిపాయ 
కలిపి మరి కొంచెం దంచి తీశాను.. నాకు మరీ ఎక్కువ ముక్కలు గా ఉంటే నచ్చదు.. 😊.. అందుకే కొంచెం మెత్తగా దంచుకన్నా.. నా చేతిలో పనేకదా.

' బీట్రూట్ పచ్చడి '
సీజన్ కదా,బీట్రూట్ కాస్త తక్కువ ధరలోనే దొరుకుతుంది.ఇంటి ముందుకు బీట్రూట్,కారెట్ అమ్మకానికి వచ్చింది. రెండూ.తీసుకున్నాను.
ఇక పచ్చడి.ఈ పచ్చడి అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం.ముందుగా బీట్రూట్,కారట్ పై తొక్క గిరేసి,ముక్కలు కోసాను.సరిపడా పచ్చి మిరపకాయలు,కొద్దిగా చింతపండు తీసుకుని, వీటి నన్నిటిని బాండీలో వేసి,కొద్దిగా నూనె వేసి బాగా మగ్గనిచ్చాను.
తర్వాత రోట్లో వేసి కొద్దిగా  ఉప్పు వేసి మెత్తగా నూరాను.
తర్వాత తాలింపు పెట్టాను. అంతే...తినటానికి కమ్మటి రుచి,చూడటానికి ఇంపైన రంగు. ఆహా..!! ఏమి రుచి..తినరా మైమరచి..!!
ఇంత పచ్చడి ఎందుకు టీచర్..? ప్రీజ్ లో పెట్టుకుని ఒక వారం తింటారా,ఏమిటి..?
అని మీరు అడుగుతారని  తెలుసు.. అబ్బే,,కాదు అదంతా ఒక్క రోజుకే.వుండేది ఇద్దరు.అంతనా..?మరో ప్రశ్న వస్తుందని తెలుసు..
    మా చిన్నప్పుడు నానమ్మ,అమ్మమ్మ,అమ్మలు ఏ రోటి పచ్చడి, నూరినా,ఏదన్నా కొత్త వంటకం చేసినా అది సగం వూర్లోకి,సగమే ఇంట్లోకి వచ్చేది.
పచ్చడి నూరిన రోలు దగ్గరే,సగం చిన్నచిన్న గిన్నెల్లో కి,తోడి ముందుగా వూర్లో కడుపుతో ఉన్న ఆడవాళ్ళకి,మా మేనత్తకూ,ఇంకా ఒకరిద్దరి ఇళ్లకు నేనూ,మా అక్కల్లోం వెళ్లి ఇచ్చి వచ్చేవాల్లం.
   మా పెద్దలు ఏదైనా పంచుకుని తింటే,వుండే ఆనందం మన ఇంట్లో మనమే కడుపు నిండా మెక్కితే వుండదు..కొంచెమైనా పక్క ఇళ్ళవాల్లకు రుచి చూపించాలి అని చెప్పేవాళ్ళు.
పెద్దలు చెప్పిన పద్ధతే నాది..ఆ పచ్చడి సగం బయటకు,సగం ఇంట్లోకి.😀😀ఈ పచ్చడిలో టమోటా కానీ, కొతిమీర లాంటి ఆకు గానీ వేయో ద్దు.. అలా వేస్తే అసలు రుచి పోతుంది. మీరూ చేసి చూడండి..
పూదోట.శౌరీ లు.. టీచర్.బోధన్.

చింతతొక్కు, దోసకాయ రోటి పచ్చడి.
తయారుచేయు విధానం..
చింత తొక్కు పిలుపుకు తగ్గ పచ్చి మిర్చి, కొద్దిగా జీలకర్ర,దనియలను నూనెలో వాడ్చి, దోసముక్కలు చింత తొక్కు తో దంచి , ఇంగువతో పోపు పెట్టాలి.
ఇం

కొబ్బరి పచ్చడి   ---  రోటి పచ్చడి .
కావలసినవి .
కొబ్బరి కాయ  -  1 .
 కాయను  పగుల గొట్టి  రెండు  చిప్పలు  పచ్చి  కొబ్బరి  కోరాముతో  తురుము కోవలెను .
ఎండుమిరపకాయలు  --  8
పచ్చిమిరపకాయలు  --   5
చింతపండు   --  ఉసిరి కాయంత .  విడదీసుకుని  నీటితో  తడిపి  ఉంచుకోవలెను. 
పసుపు  --  కొద్దిగా 
ఉప్పు  --  తగినంత 
బెల్లం  --  చిన్న  ముక్క .  ఇష్టం  లేని వారు  మానేయ వచ్చును .
పోపునకు  --  
నూనె  --   మూడు స్పూన్లు 
మినపప్పు  --  స్పూను 
మెంతులు  --  పావు  స్పూను 
ఆవాలు  --  అర స్పూను  
ఇంగువ  --  కొద్దిగా .
తయారీ   విధానము .
కొబ్బరిచిప్పలను  పచ్చి కొబ్బరి    కోరాముతో  కోరుకుని  సిద్ధంగా   ఉంచుకోవాలి .
దాని పైన  కొద్దిగా  పసుపు  వేయండి .
ఇప్పుడు  స్టౌ మీద బాండీ పెట్టి  మూడు స్పూన్లు   నూనె వేసి  నూనె  బాగా కాగగానే   వరుసగా  ఎండుమిరపకాయలు , మెంతులు , మినపప్పు , ఆవాలు , ఇంగువ  వేసి  పోపు  వేగగానే  తొడిమలు  తీసిన  పచ్చిమిర్చి  కూడా వేసి  ఒక  నిముషం  ఉంచి   దింపుకోవాలి .
ఇప్పుడు  రోటిలో ఎండుమిర్చి ,  పచ్చిమిర్చి  , తడిపిన చింతపండు  , చిన్న బెల్లం  ముక్క మరియు తగినంత  ఉప్పు వేసి  మెత్తగా పచ్చడి బండతో  దంపుకోవాలి .  
తర్వాత  పచ్చి  కొబ్బరి తురుము కూడా  రోటిలో వేసుకుని   పొత్రముతో  నీళ్ళతో తడి  చెయ్యి చేసుకుంటూ మెత్తగా  రుబ్బుకోవాలి .
చివరగా  పోపు కూడా  పచ్చడిలో  వేసుకుని   పోపు  మరీ  నలగకుండా  ఒకసారి  పప్పులుగా  తగిలే విధముగా  పొత్రముతో  రుబ్బు కోవాలి .
తర్వాత  వేరే  గిన్నెలో కి  తీసుకోవాలి .
అంతే  ఎంతో  రుచిగా  ఉండే  కొబ్బరి  పచ్చడి  భోజనము   లోకే  కాకుండా  దోశెలు , పూరీలు  మరియు  చపాతీలలోకి  కూడా  చాలా బాగుంటుంది .

 .
క్యారెట్  పచ్చడి .
ఆలూరుకృష్ణప్రసాదు .
క్యారెట్  పచ్చడి .
కావలసినవి .
క్యారెట్లు  -  4 . షుమారుగా  పావు కిలో.
పీలర్  తో  పై చెక్కు తీసుకుని  ఎండు కొబ్బరి కోరాముతో  తురుము కోవాలి.
ఎండుమిరపకాయలు  -- అయిదు
పచ్చిమిరపకాయలు   -  నాలుగు
చింతపండు   --  చిన్న నిమ్మ కాయంత .  విడదీసుకుని  నీటితో  తడిపి  ఉంచుకోవలెను. 
పసుపు  --  కొద్దిగా 
ఉప్పు  --  తగినంత 
పోపునకు  --  
నూనె  --   ఐదు  స్పూన్లు 
మినపప్పు  --  స్పూను 
మెంతులు  --  పావు  స్పూనులో సగం 
ఆవాలు  --  అర స్పూను  
ఇంగువ  --  కొద్దిగా .
తయారీ   విధానము .
క్యారట్  ఎండు కొబ్బరి  కోరాముతో  కోరుకుని  సిద్ధంగా   ఉంచుకోవాలి .
స్టౌ మీద బాండీ పెట్టి  రెండు స్పూన్లు  నూనె వేసి , నూనె బాగా కాగగానే  క్యారట్  తురుమును మరియు కొద్దిగా  పసుపును  వేసి , మూడు  నిముషాలు  క్యారెట్  పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.
తర్వాత  విడిగా  పళ్ళెం లోకి  తీసుకోవాలి .
ఇప్పుడు మరల స్టౌ మీద బాండీ పెట్టి  మూడు స్పూన్లు   నూనె వేసి  నూనె  బాగా కాగగానే   వరుసగా  ఎండుమిరపకాయలు , మెంతులు , మినపప్పు , ఆవాలు , ఇంగువ వేసి  పోపు  వేయించుకోవాలి. తర్వాత  పోపులో  పచ్చిమిర్చి ని కూడా  వేసి  మగ్గ  నివ్వాలి.
ఇప్పుడు ముందుగా రోటి లో  ఎండుమిర్చి ,  తడిపిన చింతపండు  మరియు తగినంత  ఉప్పు వేసి  మెత్తగా పచ్చడి బండతో దంపుకోవాలి .
తర్వాత  క్యారెట్  తురుమును మరియు పచ్చిమిర్చి ని   కూడా   వేసుకుని  మరీ  మెత్తగా కాకుండా  పచ్చడి బండతో నూరుకోవాలి .
చివరగా  పోపు కూడా  పచ్చడిలో  వేసుకుని   పోపు  మరీ  నలగకుండా  ఒకసారి  పచ్చడి బండతో  నూరుకుని  తర్వాత  వేరే  గిన్నెలోకి  తీసుకోవాలి .
క్యారెట్  లో సహజంగా  తీపి  ఉంటుంది  కనుక   తీపి  ఇష్ట పడని వారికి  నచ్చుతుందో  లేదో  ఆలోచించి  చేసుకోండి.
అంతే  ఎంతో  రుచిగా  ఉండే  క్యారెట్  పచ్చడి  భోజనము   లోకే  కాకుండా  దోశెలు , పూరీలు  మరియు  చపాతీలలోకి  కూడా  చాలా బాగుంటుంది .
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ మేము తయారు చేయు విధానము  మరియు ఫోటో తయారు చేయు సమయమున తీసినది.

చింతపండు   పచ్చడి  .
సాధారణంగా   పెసరట్లు , దోశెలు ,  ఇడ్లీలు , గారెలు  మరియు  అన్నం లోకి  అందరం  అల్లం   పచ్చడి  చేసుకుంటాము .
అలాగే   ఇప్పుడు  మామిడి  అల్లం  కూడ   ఇప్పుడు  బాగా  దొరుకుతోంది  కాబట్టి   చాలామంది  మామిడి  అల్లం  పచ్చడి  కూడా  చేస్తారు .
ఈ  రెండింటికన్నా  ప్రాచీనమైన   పచ్చడి  చింతపండు   పచ్చడి .
లోగడ  పెద్ద వాళ్ళందరూ   చింతపండు   పచ్చడినే  అన్ని సందర్భాలలోనూ చేసేవారు .
ఈ  చింతపండు  పచ్చడి  ఫ్రిజ్ లో  పెట్టక పోయినా  ఐదు  రోజులు  నిల్వ  ఉంటుంది .
చింతపండు   పచ్చడి.
కావలసినవి .
చింతపండు   ---    50  గ్రాములు.  
పసుపు  --  కొద్దిగా .
ఉప్పు ---  తగినంత 
బెల్లం  --  చిన్న ముక్క 
పోపునకు .
ఎండుమిరపకాయలు   ---  15
మెంతులు  ---   పావు స్పూను  
ఆవాలు  ---   ముప్పావు  స్పూను 
ఇంగువ   ---   కొద్దిగా 
నూనె  ---   నాలుగు   స్పూన్లు 
తయారీ  విధానము  .
ముందుగా   చింతపండు  రెబ్బలుగా  విడదీసి  పావు  గ్లాసు  వేడి  వేడి  నీటిలో  తడిపి  ఉంచుకోవాలి .  రసం  తీయనవసరం  లేదు .
ఆ  తర్వాత స్టౌ మీద బాండి  పెట్టి   మొత్తము నాలుగు స్పూన్లు   నూనెను వేసి , నూనె   బాగా  కాగగానే  వరుసగా  మెంతులు , ఎండుమిరపకాయలు వేయాలి . మెంతులు  వేగగానే  ఆవాలు  మరియు  ఇంగువ  వేసి  పోపు వేగగానే  స్టౌ  ఆపివేయాలి .
పోపు  చల్లారగానే  రోటి  లో  ముందుగా  ఎండుమిరపకాయలు , పసుపు మరియు తగినంత  ఉప్పువేసి   పచ్చడి బండతో మెత్తగా    దంపుకోవాలి.
ఆ తర్వాత  తడిపిన  చింతపండు  కొద్ది నీళ్ళతో సహా , వేగిన  పోపు  మరియు  చిన్న   బెల్లం  ముక్కతో   సహా  రోటి లో వేసి  మెత్తగా పచ్చడి బండతో  నూరుకోవాలి. 
నీళ్ళు  పోయకుండా  గట్టిగా    విడిగా గిన్నెలోకి తీసుకోవాలి  .
అంతే  ఇడ్లీ  , దోశెలు , పెసరట్లు , గారెలు  మరియు  అన్నం లోకి  కూడా  ఎంతో  రుచిగా   ఉండే   చింతపండు  పచ్చడి  సర్వింగ్  కు  సిద్ధం .

వంకాయ రోటిపచ్చడి హడావిడి వాన బాగా పడింది చిరుజల్లు లో చేశాతగ్గాక ఏమిటో ఇద్దరు మనుషుల మైనా పనివొగతెగదు చేసిచేసివిసుగొచ్చేస్తుంది మీతో నే చేసిన పచ్చడి చూసి మీరులైకుచేస్తే ఆవిసుగు తొలగి పోతుంది ఈఆషాఢంలో ఎంతమంది ఆడపిల్లలునేర్చుకున్నారో కదా
ఇంకశ్రావణమాసహడావిడి 

అల్లం పచ్చడి .
కావలసినవి .
అల్లం  ---  50  గ్రాములు .
చింతపండు  --  75  గ్రాములు 
పసుపు  --  పావు  స్పూను. 
పచ్చిమిరపకాయలు  --  8
ఉప్పు --  తగినంత 
బెల్లం  -  చిన్న ముక్క . *
* తీపి  ఇష్టం  లేని వారు  మానేయవచ్చును.
పోపుకు .
నూనె  --  నాలుగు  స్పూన్లు
ఎండుమిరపకాయలు  - 15
మెంతులు  -  పావు  స్పూను   
ఆవాలు  --   స్పూను 
ఇంగువ  --  కొద్దిగా 
తయారీ విధానము .
అల్లం  పై చెక్కు తీసుకుని  ముక్కలుగా  తరుగుకొని  ఉంచుకోవాలి 
చింతపండు   విడదీసి గింజలను  తీసి  కొద్దిగా వేడి నీళ్ళు  పోసి   తడిపి  ఉంచుకోవాలి .
ఇప్పుడు  స్టౌ మీద  బాండీ  పెట్టి  నాలుగు స్పూన్లు నూనె వేసి , నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయలు ,  మెంతులు ఆవాలు  మరియు ఇంగువ  వేసి  పోపు వేయించుకోవాలి .   అందులోనే   పచ్చి మిరపకాయలు  కూడా  వేసి మూడు నిముషాలు  మగ్గ పెట్టుకోవాలి .
పోపు  చల్లారగానే  రోటిలో  ముందుగా  ఎండుమిరపకాయలు ,తగినంత  ఉప్పు మరియు   పసుపు  వేసి  పచ్చడి  బండతో  మెత్తగా దంపుకోవాలి . 
తర్వాత  తడిపి ఉంచుకున్న  చింతపండు , బెల్లం  ముక్క , అల్లం  ముక్కలు , పచ్చిమిరపకాయలు మరియు మిగిలిన  పోపు  వేసి  మెత్తగా  పచ్చడి  బండతో  నూరుకోవాలి . 
అంతే  ఇడ్లీ , దోశెలు , గారెలు , చపాతీలు మరియు భోజనము లోనికి ఎంతో  రుచిగా ఉండే  అల్లం  పచ్చడి  సర్వింగ్  కు  సిద్ధం .

మామిడి   అల్లం   రోటి పచ్చడి .
తయారీ  విధానము  .
స్టౌ  మీద  బాండీ  పెట్టి  మూడు  స్పూన్లు  నూనె  వేసి   ఎనిమిది   ఎండుమిరపకాయలు  ,  పావు  స్పూను  మెంతులు ,  స్పూను  మినపప్పు  ,  అర స్పూను  ఆవాలు ,  కొద్దిగా  ఇంగువ ,రెండు  రెమ్మలు  కరివేపాకు మరియు  అయిదు  పచ్చి  మిరపకాయలు   వేసి పోపు వేయించుకోవాలి .
నిమ్మ కాయంత  చింతపండు   చాలా  కొద్ది  నీళ్ళలో   తడిపి  ఉంచుకోవాలి  .
ఒక  75  గ్రాముల  మామిడి  అల్లం  పై  చెక్కు  తీసుకుని  ముక్కలుగా  చేసుకుని  సిద్ధం  చేసి  ఉంచుకోవాలి
ఇప్పుడు  రోటిలో వేయించిన   ఎండుమిరపకాయలు   ,  కొద్దిగా  పసుపు , తగినంత  ఉప్పు వేసి మెత్తగా   ఫచ్చడి బండతో  దంపుకోవాలి .
తర్వాత  మిగిలిన  పోపు  , చిన్న ముక్కలు గా తరిగిన  మామిడి  అల్లం  , చింతపండు తడిపిన నీళ్ళతో  ,  తీపి ఇష్టమైన వారు   కొంచెం   బెల్లం   వేసి  మెత్తగా  పచ్చడి బండతో  నూరుకోవాలి  .
ఆ తర్వాత  వేరే  గిన్నెలోకి    తీసుకోవాలి .
ఈ  పచ్చడి  ఇడ్లీ  , దోశెలు  ,  చపాతీలు  మరియు  అన్నం  లోకి  అన్నిటిలోకి  కూడా  చాలా రుచిగా  ఉంటుంది .
ఆలూరుకృష్ణప్రసాదు 

రోటి పచ్చడి సభ్యులకి నమస్కారం. ఈరోజు నేను కాకరకాయ పచ్చడి చేశాను. ఇది అన్నం లోకి చాలా బాగుంటుంది . కావలసిన పదార్థాలు - కాకరకాయలు ముక్కలుగా కోసుకొని, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు, సరిపడా ఉప్పు, పసుపు, వెల్లుల్లి ,కొంచెం బెల్లం, జీలకర్ర .
తయారీ విధానం - ముందుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఉప్పు రోట్లో వేసి బాగా దంచుకోవాలి.  తర్వాత అవి తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుని కాకరకాయ ముక్కలు కొంచెం ఉప్పు వేసి ఇ దంచుకోవాలి. కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి అది పిండి కోండి ఆ నీరు పోయాక ఆ పిండిని మిశ్రమాన్ని రోట్లో వేసి ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని కలిపి దంచుకోవాలి. తర్వాత తాలింపు వేసుకోవాలి.ఇది ఐదు నుంచి పది నిమిషాలు మగ్గనివ్వాలి ఎందుకంటే ఆ చెడు వాసన పోవాలి కాబట్టి. ఇది అన్నంలోకి చపాతీల్లోకి తినొచ్చు. షుగర్ పేషెంట్లకు చాలా మంచిదండి 

రోటి పచ్చడి సభ్యులకు నమస్కారం. ఈరోజు నేను గోంగూర సొరకాయ పచ్చడి చేశాను. ఎలా చేసానో చెప్తాను. సొరకాయ, పచ్చిమిర్చి ,ఒక ఉల్లిపాయ, టమాట ఆయిల్ లో వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. తర్వాత గోంగూర వేసి మగ్గనివ్వాలి. అంతా బాగా మగ్గిన తర్వాత వెల్లుల్లిపాయ, చింతపండు ,ఉప్పు, పసుపు, చింతపండు వేసి దంచుకోవాలి. పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి దంచుకోవాలి. బండ పచ్చడి  తాలింపు అవసరం లేదు. ఆయిల్ ఎక్కువగానే ఏసి వేయించుకుంటారు కాబట్టి.

దోసకాయ చింతకాయ రోటి పచ్చడి .
కావలసినవి .
పసుపు రంగు గట్టి  దోసకాయ  ---  ఒకటి.
పై  చెక్కు   తీసి  చిన్న  చిన్న  ముక్కలుగా  తరుగు కోవాలి .
చిన్న చింతకాయలు -- 150 గ్రాములు .
శుభ్రంగా  కడిగి  తగినంత ఉప్పు పసుపు వేసుకుని  రోటిలో పచ్చడి బండతో మెత్తగా  దంపుకుని  విడిగా  ఒక ప్లేటులోకి తీసుకోవాలి .
పచ్చిమిరపకాయలు  --  12
కొత్తి మీర   ---  రెండు కట్టలు .
మరి కాస్త  వేసుకున్నా  చాలా  రుచిగా  ఉంటుంది .
కట్టలు  విడదీసి  కాడలు  తీసేసి  కొత్తిమీర   శుభ్రం  చేసుకోవాలి .
ఉప్పు   ---   తగినంత 
పసుపు  ---  కొద్దిగా .
పోపుకు  .
ఎండుమిరపకాయలు  --  8
మినపప్పు   ---  స్పూనున్నర  
మెంతులు  ---   పావు  స్పూను 
ఆవాలు  ---   అర  స్పూను  
ఇంగువ  ---  కొద్దిగా 
నూనె  ---   50  గ్రాములు 
తయారీ  విధానము  .
ముందుగా  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మొత్తం  నూనె  పోయాలి.
నూనె  బాగా  కాగనివ్వాలి  .
నూనె బాగా కాగగానే ముందుగా   మెంతులు వేసి బాగా వేగాక ఎండుమిరపకాయలు  ,  మినపప్పు , ఆవాలు  మరియు  ఇంగువ  వేసి  పోపు  బాగా  వేగనివ్వాలి .
ఎక్కువ   నూనె బాండీలో మిగిలి  ఉంటే  ఆఖరున  పచ్చడిలో  కలుపుకోవచ్చు.
బాండీ లోనే  ఉంచేయండి 
పోపు  చల్లారగానే  ముందుగా   రోటిలో    ఎండుమిరపకాయలు , తగినంత  ఉప్పు  మరియు  పసుపు వేసి మెత్తగా  పచ్చడి బండతో దంపుకోవాలి .
తరువాత  పచ్చిమిర్చి  , రోటిలో తొక్కి సిద్ధంగా  ఉంచుకున్న  చింతకాయ తొక్కు    మరియు  పోపు వేసి  మెత్తగా  బండతో నూరుకోవాలి .
చివరగా  దోసకాయ  ముక్కలు  మరియు కొత్తిమీర  వేసి   దోసకాయ  ముక్కలు  నలగ  కుండా ఒకే ఒక్కసారి రోటిలో బండతో నూరుకోవాలి .
తర్వాత ఈ పచ్చడి  ఒక  గిన్నెలోకి  తీసుకుని  బాండీలో  కాగిన  మిగిలిన  నూనె  అందులో పోసి   గరిటతో  ముక్కలు  పచ్చడి  బాగా కలిసేటట్లు  కలుపుకోవాలి .
అంతే  ఎంతో  రుచిగా   ఉండే  దోసకాయ మరియు చింతకాయతో రోటి పచ్చడి  సర్వింగ్ కు  సిద్ధం .
చింతకాయలు  సంవత్సరం  అంతా దొరకవు కనుక , చింతకాయలు  దొరకని  పక్షంలో  ఒక  75 గ్రాములు  లేదా ఒక ముప్పావు  కప్పు  నూరని  చింతకాయ  పచ్చడి  తీసుకుని  పై తెలిపిన పద్ధతిలో  చేసుకొనవచ్చును .
ఆలూరుకృష్ణప్రసాదు .

రోటిపచ్చళ్ళ సమూహ సభ్యులకు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
ఎలా వున్నారు?  
ఆలుబుఖారా పచ్చడి.  ఆశ్చర్య  పోకండి .  ఇంటి ముందుకు ఆలుబుఖారా పళ్ళు అమ్మొస్తే కొన్నాను. రుచి చూస్తే తియ్యగా లేవు.  పుల్లగా వున్నాయి.  కరోనా కరువు అధిక ధరలతో కొని యేంచేయాలా అని పచ్చడి చేశాను.  
విధానము:- మామూలే మిర్చి , కావల్సిన పోపు దినుసులు (మినప్పప్పు, మెంతులు, ధనియాలు జీలకర్ర, యింగువ) వేయించుకొని, వుప్పు, పసుపు, చింతపండు, వెల్లుల్లి , కొంచెం బెల్లం తో ఆలుబుఖారా పళ్ళు 

హాయ్ ఫ్రెండ్స్  కొబ్బరి పచ్చడి చేశాను. తయారి విధానం, ఎండుమిరపకాయలు 6, పచిమిర్చి 5, మెంతులు ఆవాలు మినప్పప్పు ఇంగువ పసుపు  వేసి అన్నీ ఆయిల్ లో  ఫ్రై చేసి ఉప్పు, చింతపండు తగినంత వేసి రోలు  లో వేసి దంచటమే. తర్వాత తాలింపు అంతే  పచ్చడి రెడీ.


🤔🤔రోటిపచ్చళ్ళ ఉద్యమం(2016)🤔🤔
రోటి పచ్చడి.. పెళ్ళిలో ఎన్ని వందల రకాల వంటలు వడ్డించినా రోటిపచ్చడి లేకపోతే అది విందే కాదు. గోంగూర, దోసకాయ, దొండకాయ ఇలా ఏదో ఒక రోటి పచ్చడి ఉండాల్సిందే. రోటి పచ్చడి అంటే అంత ఇష్టం ఉన్నా, ఇప్పుడు మనం తింటున్నది  మిక్సీలో వేసిన రోటి పచ్చడి మాత్రమె. అంటే మైసూరు పాక్ లో మైసూర్ ఎలా ఉండదో, రోటి పచ్చళ్లలో రోలు కూడా లేకుండా పోయింది.
జనం అంతా మిక్సీ పచ్చళ్లనే రోటి పచ్చళ్ళు గా భావించి, తృప్తి పడుతున్న వేళ, ఒక వ్యక్తి విప్లవశంఖం పూరించాడు. “మిక్సీ పచ్చళ్ళ ఆధిపత్యం నశించాలి, రోళ్ళు, పచ్చడిబండలతో ప్రతి ఇల్లు కళకళ లాడాలి” అంటూ నినదించాడు. రోలు, పచ్చడిబండ(పచ్చడి నూరుకునే కర్ర) చేతబట్టి ఫేస్ బుక్ లో చెలరేగిపోయారు. మిక్సీలో వేసే పచ్చడీ ఒక పచ్చడేనా, చక్కగా ఒక రోలు కొనుక్కుని మన పచ్చడి మనం నూరుకోలేమా, మన చేతల్లో సత్తువలేదా, మన ఇళ్ళలో రోళ్ళు లేవా అని ప్రశ్నించిన ఆ విప్లవకారుడి పేరు వాసిరెడ్డి వేణుగోపాల్. రచయిత, జర్నలిస్ట్ కం పబ్లిషర్ అయిన  వేణుగోపాల్ పెన్ను పక్కనబెట్టి రోకలి చేతబట్టి, రోజుకో పచ్చడి నూరుతూ, ఆ ఫోటోలు ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తూ , చదివేవాళ్ళ నోళ్ళలో నీళ్ళూరేలా వర్ణిస్తూ, ఒక అలజడి సృష్టించారు. దీనితో రోటిపచ్చళ్ళ గతవైభవాన్ని తలచుకుంటూ, మిక్సీల డామినేషన్ ని తిట్టుకుంటున్న భోజనప్రియులకి ఆకలి రెట్టింపు అయ్యింది. కిచెన్ లో మూలకి వెళ్ళిపోయిన రోళ్ళు , మళ్ళీ దర్జాగా బయటకి వచ్చాయి. రోజుకో పచ్చడిని రుచిచూస్తూ, చూపిస్తూ రోళ్ళు మళ్ళీ వంటింటి మహారాణులు అయ్యాయి. చరిత్రకారులు రోటిపచ్చళ్ళ చరిత్ర ని పరిశోధించడం మొదలు పెట్టారు. ఆరోగ్య నిపుణులు, రోటి పచ్చళ్ళు కమ్మగా ఉండడమే కాదు, ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయో వివరించడం మొదలు పెట్టారు. సోషల్ మీడియా లో మొదలైన రోటిపచ్చళ్ళ ఉద్యమాన్నిసామాన్య ప్రజలోకి తీసుకెళ్లేందుకు ఇప్పుడు ఒక పుస్తకం మార్కెట్లోకి రాబోతోంది.
పచ్చళ్లలో రోటి పచ్చళ్ళు వేరు అని మాత్రమే అని తెలిసిన మనకు ఆ రోటి పచ్చళ్లలో 14 రకాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. త్వరలో రాబోతున్న ‘రోటి పచ్చళ్ళు’ పుస్తకం కోసం ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా. పూర్ణచంద్ గారు రాసిన ముందుమాటలో ఈ 14 రకాల పచ్చళ్ళను వివరించారు. అవేమిటంటే..
పచ్చళ్లు.. పధ్నాలుగు రకాలు..
….
1. తొక్కు: గోంగూర తొక్కు, చింతకాయ తొక్కు, ఉసిరికాయ తొక్కు, ఇవన్నీ నిలవ ఉండేలా తయారు చేసిన పచ్చళ్ళు. ఉప్పు కలిపి ఊరబెడతారు.
2. తురుము పచ్చడి: మామిడి, కేరెట్, బీట్రూట్, క్యాబేజీ వీటిని తురిమి తాలింపు పెట్టింది తురుము పచ్చడి. తురుముగా కనిపించటం కోసం దీన్ని రోట్లో నూరకుండానే పచ్చడి చేస్తారు.
3. ముక్కలపచ్చడి: తాలింపుగింజలు, ఉప్పు, కొత్తిమీర వీటిని రోట్లో మెత్తగా నూరి, దోసకాయ, మామిడి, దొండ ఇలాంటి కాయల్ని చిన్నముక్కలుగా తరిగి కలిపి తాలింపు పెడతారు.
4. పప్పుల పచ్చడి: కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, ఉలవలు ఇలాంటి పప్పుల్ని దోరగా వేయించి రోట్లో నూరి (లేదా రుబ్బి) చేసిన పచ్చడి. కందిపచ్చడిని పచ్చిపులుసుతోనూ, ఉలవపచ్చడిని మీగడతోనూ, తినాలని ఆయుర్వేద శాస్త్రం చెప్పింది. పెసరపచ్చడిని పెనం మీద చేత్తో వత్తి అట్టులా కాల్చి అన్నంలో ఆమ్లేట్‘ లాగా తింటారు.
5. ఆవపచ్చడి: రోట్లో నూరిన ఆవపిండిని పెరుగులో కలిపి తాలింపు పెట్టేది ఆవపచ్చడి.
6. పెరుగుపచ్చడి: కూరగాయల్ని నిప్పులమీద కాల్చిన బజ్జీపచ్చడిలో పెరుగు కలిపితే అది పెరుగుపచ్చడి. అరటి ఊచ(దూట)ను ఉడికించి రోట్లో నూరి చేసిన పెరుగుపచ్చడి చాలా రుచిగా ఉంటుంది.
7. ఊర్బిండి: రుబ్బిన పదార్ధాన్ని ఊరుపిండి అంటారు. ముక్కలకు ఉప్పు రాసి, కొంతసేపు ఊరిన తరువాత రోట్లో వేసి నూరి తయారు చేసే పచ్చడిని ఊరుపిండి లేదా ఊర్బిండి అంటారు.
8. ఊరు పచ్చడి: దీన్ని రోటి పచ్చడి అంటున్నాం. పప్పుదినుసులు, కూరగాయ ముక్కలు వేయించి, మిరపకాయలు కలిపి రుబ్బిన పచ్చడి ఊరుపచ్చడి.
9. బజ్జీ పచ్చడి: శ్రీనాథుడు బజ్జులు అనే వంటకం గురించి ప్రస్తావించాడు. ఏదైనా కూరగాయని నిప్పులమీద కాల్చి, రోట్లో వేసి మూరి, పప్పుదినుసులతో తాలింపు పెట్టిన పచ్చడినే ఆయన ‘బజ్జు’ అన్నాడు. అంటే,బజ్జీ పచ్చడి!
10. ఊరగాయ పచ్చడి: కూరగాయని ముక్కలుగా తరిగి, ఉప్పు కలిపి ఉంచడాన్ని ఊరబెట్టడం అంటారు. నిమ్మ, టొమోటో మామిడి, చింతకాయ, కంద, పెండలం, గోంగూర వీటితో ఎక్కువగా ఊరగాయ పచ్చళ్ళు పెడుతున్నాం.
11. ఊరుపిండి పచ్చడి: నువ్వులు, వేరుశెనగ గింజలు, ఆవాలు, కొబ్బరి ఇలాంటి వాటిలోని నూనెని తీసేసిన తర్వాత మిగిలే పిండిని తెలికిపిండి అంటారు. దాన్ని నీళ్ళలో గాని, మజ్జిగలో గాని నాలుగైదు రోజులు నానబెడితే పులుస్తుంది. దానికి అల్లం, పచ్చిమిర్చి వగైరా చేర్చి రుబ్బి, తాలింపు పెట్టిన పచ్చడిని “ఊరుపిండి పచ్చడి” అంటారు.
12. కూరపచ్చడి: కూరగాయని మగ్గబట్టిన తరువాత కూరగానూ చేసుకోవచ్చు. పచ్చడిగానూ చేసుకోవచ్చు. కూరవండాక కూడా దాన్ని రోట్లో వేసి నూరితే కూరపచ్చడి అవుతుంది.
13. ఆక్కూర పచ్చడి: గోంగూరతో మాత్రమే కాదు, తోటకూర, పాలకూర, మెంతికూర, చుక్కకూర, గుంటగలగరాకు, లేత పారిజాతం ఆకులు, లేత సొర ఆకులు, లేత తమలపాకులు, కరివేపాకు, కొత్తిమీర, పొదీనా…ఇలా ఆక్కూరలన్నింటి తోనూ రోటి పచ్చళ్ళు చేసుకోవచ్చు.
14. పూలపచ్చడి: మునగపూలు, అవిశపూలు, వేపపూలు మామిడి పూలు, క్యాలీఫ్లవర్ పూలు, గోంగూర పూలు ఇవి.
సో, అది ఫ్రెండ్స్, ఇన్ని రకాల రోటిపచ్చళ్ళు ఉన్నాయన్న మాట. వాసిరెడ్డి వారి కృషితో, తెలుగు వాకిళ్ళలో మళ్ళీ రోళ్ళ చప్పుడు మొదలవబోతోంది. శభాష్ ‘రోలురత్న’  వాసిరెడ్డి వేణుగోపాల్ గారు.
–నరేష్ శిరమని

ఆలూరుకృష్ణప్రసాదు .
నిమ్మకాయ  కారం .  (  పాత తరం పద్థతిలో  రోటిలో  చేసిన  కారము. )
**************************
ప్రియమిత్రులందరికీ 
ఈ  రోజున  మీ  అందరికీ   నోట్లో  నీరు  ఊరించే  నిమ్మకాయ  కారం గురించి తెలియ చేస్తాను .
ఈ  నిమ్మకాయ  కారం  చేయడానికి  కావలసిన  పదార్ధములు .
పసుపు  రంగు  వచ్చిన  నిమ్మకాయలు  -   నాలుగు. ( 4 )
ఎండు మిర్చి   ---   15
నూనె  --  మూడు  స్పూన్లు 
పసుపు  --  పావు స్పూనులో సగం
ఉప్పు   ---  తగినంత 
పోపుకు  కావలసినవి .
పొట్టు మినపప్పు   అయితే పచ్చడి మంచి రుచిగా  ఉంటుంది  .
దొరకని పక్షంలో  చాయమినపప్పు   వాడండి.
మినపప్పు  ---  మూడు స్పూన్లు 
ఆవాలు  --     స్పూనున్నర 
మెంతులు  --  ఒక  స్పూను
ఇంగువ  --  తగినంత  (  కాస్త ఎక్కువ  )
ఈ  నిమ్మకాయ కారం  రోట్లో పచ్చడి బండతో  నూరుకుంటేనే  తినేటప్పుడు  పప్పులు  తగులుతూ  చాలా  రుచిగా  ఉంటుంది.
నిమ్మ కాయ  కారం  తయారీ  విధానము .
ముందుగా  నాలుగు  నిమ్మకాయలు  చేదు  దిగకుండా  రసం  తీసుకొని  వేరే  చిన్న గిన్నె లోకి  తీసుకోండి.
ఆ  తర్వాత  స్టౌ  వెలిగించి   బాండి పెట్టి  అందులో  మూడు  స్పూన్లు  నూనె వేసి , నూనె బాగా  కాగగానే  , ముందుగా  మెంతులు  నల్లగా  కాకుండా  పచ్చి వాసన  పోయి  కమ్మని  వాసన  వచ్చే వరకు  వేయించుకోవాలి. తర్వాత   అందులోనే  ఎండు మిర్చి , పొట్టు మినపప్పు , ఆవాలు , మరి కాస్త  ఇంగువ  వేసి పోపు  మాడకుండా  వేయించుకోవాలి. 
ఇప్పుడు  రోట్లో  ముందుగా  ఎండు మిర్చి , పావు  స్పూన్ పసుపు , సరిపడా  ఉప్పు వేసి పచ్చడి  బండతో మెత్తగా  దంచు కోవాలి. 
 ఆ  తర్వాత  మిగిలిన  పొపు  వేసి  మరీ  మెత్తగా   కాకుండా  పప్పులు  తగిలేటట్లుగా  దంపుకోవాలి.
చివరగా  తీసి  ఉంచుకున్న   నిమ్మరసం  కూడా రోటిలో వేసి పచ్చడి బండతో   నూరు కోవాలి.
ఆ తర్వాత నూరిన పచ్చడి   ఒక  గిన్నె లోకి  తీసుకోవాలి.
అంతే.  కమ్మని  మెంతులు  మరియు  ఇంగువల  వాసలతో  ఘమ  ఘమ  లాడే  నిమ్మకాయల రసం  సర్వింగ్  కు  సిద్ధం.
ఈ  నిమ్మకాయల  రసం  అన్నం లోకి, వేడి  వేడి  ఇడ్లీల లోకి మరియు దోశెలలోకి  కూడా చాలా  బాగుంటుంది .
పప్పులు   నిమ్మరసం లో  ఊరి  తినడానికి   చాలా చాలా  రుచిగా  ఉండటమే గాక , ఫ్రిజ్  లో  ఉంచక పోయినా  ఐదారు  రోజులు  నిల్వ ఉంటుంది.
రంగు  చాలా  బాగా  వచ్చింది   కదండీ .
ఇది పొట్టు మినపప్పు తో రోట్లో చేసిన నిమ్మకాయ కారం.
పుల్ల పుల్లగా  నోట్లో  నీరు  తెప్పిస్తూ  భలే   రుచిగా  ఉంటుంది.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ మేము తయారు చేసిన విధానము  మరియు ఫోటో తయారుచేయు  సమయమున తీసినది
వొక టమాటావాడ్చాను
వొకవంకాయ వాడ్చాను
నాలుగు పచ్చిమిర్చివాడ్చాను
పసుపు
ఉప్పు
చింతపండు రసం
మెంతిపిండి
కొతిమీర
ఇంగువతాలింపు
రోటిపచ్చడి 👌👌🍅🍆
వంకాయ  కాల్చిన  రోటి పచ్చడి .  (  వంకాయ బజ్జీ  రోటి పచ్చడి )
కావలసినవి .
గుండ్రని వంకాయలు  --  మూడు. 
పచ్చిమిర్చి  --  8
కొత్తిమీర  --  ఒక చిన్న  కట్ట 
చింతపండు  --  నాలుగు రెబ్బలు
పసుపు  --  కొద్దిగా 
ఉప్పు  --  తగినంత .
పోపునకు .
నూనె  --  మూడు  స్పూన్లు 
ఎండుమిరపకాయలు  --- 6
మినపప్పు  --  స్పూను 
ఆవాలు  --   అర స్పూను 
జీలకర్ర  --  పావు స్పూను 
ఇంగువ  --  కొద్దిగా 
తయారీ విధానము .
ముందుగా  వంకాయలు పైన  నూనె రాసి  స్టౌ  సిమ్ లో  పెట్టి  అన్ని  వైపులా  కాల్చుకుని  చల్లారగానే  తడి చేతితో  పై తొక్క మరియు  తొడిమ  తీసుకుని  వేరే  ప్లేటులో పెట్టు కోవాలి .
వీటి పైన  కొద్దిగా  పసుపు వేసుకోవాలి .
చింతపండు  విడదీసి  నీళ్ళలో తడుపు కోవాలి .
ఇప్పుడు   స్టౌ  మీద  బాండీ  పెట్టి  మొత్తం నూనె  వేసి , నూనె బాగా  కాగగానే   వరుసగా ఎండుమిర్చి   ముక్కలు , మినపప్పు  , ఆవాలు , జీలకర్ర ,  ఇంగువ  వేసి  పోపు  వేయించుకోవాలి .
పోపు  చల్లారగానే  ముందుగా  రోటి లో  ఎండుమిరపకాయలు , చింతపండు , ఉప్పు వేసి  మెత్తగా  పచ్చడి బండతో దంపుకోవాలి.
తర్వాత పచ్చిమిరపకాయలు   వేసి మెత్తగా పచ్చడి బండతో దంపుకోవాలి .
తర్వాత  కాలిన  వంకాయలు , మిగిలిన  పోపు  మరియు కొత్తిమీర కూడా వేసి  ఒకసారి  బండతో  నూరుకోవాలి  .
అంతే .  దోశెలు , చపాతీలు  మరియు  భోజనము  లోకి  వంకాయ  కాల్చిన   బజ్జీ  రోటి పచ్చడి  సిద్ధం.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము తయారుచేయు  విధానము  మరియు ఫోటో  తయారుచేయు  సమయమున  తీసినది.

🤔🤔🤔 సొరకాయ సొగసులు 🤔🤔🤔
వేయించిన వేరుశెనగకాయలు వెంటరాగా
సోయగాల సొరకాయకు జీలకర్ర సాయం కాగా 
ఒళ్ళంతా వేడినూనె రాసుకొని
ఒయ్యారంగా కడాయిలో తిరిగి రంగు తెచ్చుకొని 
కారంగా పచ్చని పచ్చి మిరపకాయలతో 
కాస్త ఘాటుగా తెల్లని వెలుల్లిపాయలతో 
చిటికెడు ఉప్పు, చింతలేని చింతపండు తో
చిద్విలాసంగా చిందులేస్తూ మిగితా అన్నిటీతో 
రోటిలో లో గెంతి గిఱ్ఱుగిఱ్ఱున తిరిగి 
ఘుమఘుమల తాళింపుతో కలిసి 
సొగసుగా తయ్యరైంది ఈ సొరకాయ పచ్చడి
సుందరంగా అలంకరించమని చేసింది అలజడి 
ఉయ్యాలలూగాలని ఉబలాటపడింది 
ఉరవడిగా సృజనాత్మకత ఉట్టి పడింది
                 

ఆలూరుకృష్ణప్రసాదు .
కరివేపాకు రోటి పచ్చడి .
తయారీ  విధానము  .
ముందుగా  స్టౌ మీద బాండీ పెట్టుకుని నాలుగు స్పూన్లు  నూనె  వేసుకుని నూనె బాగాకాగగానే  , రెండు కప్పుల కరివేపాకు  , 50  గ్రాముల  పొట్టు  మినపప్పు  ,  పన్నెండు  ఎండుమిరపకాయలు  , అర స్పూను   ఆవాలు ,  ఇంగువ  కొద్దిగా వేసుకుని పోపు వేయించుకోవాలి.  
నిమ్మకాయంత  చింతపండు   వేడి నీళ్ళలో  పావు గంట సేపు   నాన బెట్టు కొని    చిక్కగా  రసం  తీసుకోండి .
పోపు చల్లారగానే  రోటి లో  ముందు  వేగిన  ఎండుమిరపకాయలు ,  తగినంత ఉప్పు మరియు కొద్దిగా  పసుపును వేసుకుని   పచ్చడి బండతో దంపుకోవాలి .  
ఆ  తర్వాత  వేయించి  సిద్ధంగా  ఉంచుకున్న పొట్టు మినపప్పు   కరివేపాకు   మిశ్రమం , చింతపండు  రసం మరియు తీపి  ఇష్టమైన వారు  కొద్దిగా  బెల్లం  వేసుకుని  కొంచెం కొంచెం   నీరు    చల్లుకుంటూ  పప్పులు పప్పులుగా   పొత్రముతో రుబ్బు కోవాలి.  ఈ విధముగా  రుబ్బితే  కరివేపాకు   పచ్చడి  రుచిగా బాగుంటుంది .
పొట్టు  మినపప్పు తో  అయితే  పచ్చడి చాలా రుచిగా  ఉంటుంది  . 
పొట్టు మినపప్పు  లేని పక్షంలో చాయమినపప్పు  వేసుకుని  పచ్చడి  చేసుకొనవచ్చును .
ఈ పచ్చడి  ఐదు రోజులు  నిల్వ ఉంటుంది.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసీపీ  మేము  తయారుచేయు  విధానము  మరియు ఫోటో  తయారుచేయు  సమయమున  తీసినది
ఆలూరుకృష్ణప్రసాదు . 
ప్రియమిత్రులందరికీ 
ఈ  రోజు  స్పెషల్  అరటి కాయ పచ్చడి .
అరటి  కాయ  తో  పచ్చడా  !
అని  ఆశ్చర్య  పోకండి.
ఒకసారి  చేసి  చూడండి .
అరటి కాయ పచ్చడి  తయారు  చేయు  విధానము .
కాలసిన  వస్తువులు .
అరటి కాయలు       --   2
పెద్ద ఉల్లిపాయలు    --     2 
పచ్చిమిరపకాయలు   ---  4
కరివేపాకు     -----   3   రెమ్మలు
కొత్తిమీర     -----   ఒక చిన్న కట్ట .
పోపు  వేయుటకు.
నూనె  --  మూడు స్పూన్లు .
ఎండు  మిరపకాయలు  ---  5
చాయ మినపప్పు  ---  స్పూనున్నర  
ఆవాలు   ----  ముప్పావు   స్పూన్ 
ఇంగువ   ---  తగినంత 
పసుపు   ---  కొద్దిగా  
ఉప్పు   ----  తగినంత .
అరటి కాయ  పచ్చడి  తయారు చేయు విధానము .
ముందు  ఉల్లిపాయలు  పై  పొట్టు  తీసి  చాలా  సన్నగా  చిన్న  చిన్న  ముక్కలుగా  తరుగు కోవాలి.
(  ఎలాగంటే  దోశెలలోకి  మరియు మిర్చి  బజ్జీలలోకి  సన్నగా  తరుగుతాము  కదా .  ఆ  విధంగా )
ఇప్పుడు  అరటికాయలు  శుభ్రంగా  కడిగి  పొడి  గుడ్డ పెట్టి  తుడవండి. 
అరటి కాయల  చెక్కు తీయవద్దు.
ఇప్పుడు  స్టౌ  వెలిగించి  సెగ  సిమ్  లో  పెట్టండి.
అరటికాయలు మీద  నూనె రాయనక్కరలేదు . 
ఆ  రెండు  అరటి కాయలు  వంకాయలు  బజ్జీ  పచ్చడికి  కాల్చినట్లు  కాల్చండి .
పై  చెక్కు  నల్లగా  అయి  చేతితో  పట్టుకొని   చూస్తే  లోపల  మెత్తగా  అవుతుంది .
గిన్నెలో  నీళ్ళు  పెట్టుకుని  చేతులు  తడి చేసుకుంటూ  ఆ కాయల  పై చెక్కు తీసేయండి .
ప్లేటులో చెక్కు వలిచిన  అరటి  కాయలు  ఉంచుకోండి.
ఇప్పుడు  స్టౌ  మళ్ళీ  వెలిగించి  మూడు  స్పూన్లు   నూనె  వేసి  నూనె  బాగా  కాగాక  అందులో  చాయ మినపప్పు , ఆవాలు , ఎండు మిరపకాయలు మరియు  ఇంగువ  వేసి  పోపు  బాగా  వేగాక  అందులో  కరివేపాకు , పచ్చిమిరపకాయలు   వేసి  రెండు  నిముషాలు  ఉంచి  స్టౌ  ఆపేయండి .
సన్నగా   తరిగిన  ఉల్లిపాయ ముక్కలు  వేయించవద్దు .
పోపు  చల్లారాక  ముందుగా   రోటిలో  ఎండుమిరపకాయలు , తగినంత  ఉప్పు , పసుపు కొద్దిగా వేసి  మెత్తగా పచ్చడి బండతో  దంపుకోవాలి.
మిగిలిన  పోపు  ఇప్పుడే  వేయవద్దు.
తర్వాత  రోటిలో   మనం స్టౌ మీద కాల్చిన  అరటి కాయలు  , పచ్చి మిరపకాయలు  వేసి  పచ్చడి  బండతో  దంపుకోవాలి .
అరటికాయలు  బాగా  కాలి ఉంటాయి  కాబట్టి  దంపిన వెంటనే  మెత్త పడుతుంది .
ఇప్పుడు దంపిన మిశ్రమమును  ఒక  పళ్ళెంలోకి  తీసుకొని  సన్నగా  తరిగి ఉంచుకున్న  ఉల్లిపాయ ముక్కలు , మిగిలిన  పోపు , కొత్తిమీర   సన్నగా   తరిగి  చేత్తోనే  బాగా కలుపుకుని  ఒక  Bowl  లోకి  తీసుకోండి.
అంతే  రుచికరమైన  అరటి కాయ  పచ్చడి  భోజనం  లోకి  సిద్ధం.
ఇందులో  ఉల్లిపాయలు  పచ్చివి  వేసుకుంటేనే  చాలా రుచిగా  ఉంటుంది .
వేగిన  మినపప్పు పంటి కింద   తగులుతూ  చక్కని  రుచితో  ఉండే  ఈ  అరటి కాయ  పచ్చడి  తప్పక   try  చెయ్యండి.
మీ  అందరికీ   నచ్చుతుంది .
ఈ  పచ్చడికి  పండిన , ఓ  మాదిరిగా   పండిన  అరటి కాయలు మాత్రం   వాడవద్దు .
పచ్చడి  తీపి  వచ్చి  రుచి  పాడవుతుంది . పచ్చి  కాయలే  వాడండి .
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము  తయారుచేయు  విధానము  మరియు ఫోటో  తయారు చేయు  సమయమున  తీసినది 
అందరికీ 🙏
బాదంగింజల పచ్చడి
విధానము
వేయించిన ఎండు మిర్చి , పోపుగింజలు తో పచ్చిమిర్చి, నానబెట్టి పొట్టు తీసిన బాదంగింజలు, వుప్పు, పసుపు రోటిలో వేసి నీళ్ళు చల్లుతూ రోకలి బండ తో , బాగా మెత్తగా నూరి గిన్నె లోకి తీసుకుంటే ; అన్నం , లేదా టిఫెన్ల లోకి రుచికరమైన బాదంగింజల పచ్చడి సిద్ధం 

ఆలూరుకృష్ణప్రసాదు .
కొండ గోంగూర  ఆకుతో  పచ్చడి .
కొండ  గోంగూర  అంటే  పుల్ల గోంగూర.
ఈ  కూర  సంవత్సరం  మొత్తం  మనకి దొరుకుతుంది  .
రెండు  కట్టలు  తెచ్చుకుని   ఆకును  వలుచుకుని  కాసేపు  నీడన ఆర  బెట్టు కోవాలి  .
ఒక  ఆరు  పచ్చి మిరపకాయలు  తొడిమలు తీసుకుని  ఉంచుకోవాలి.
స్టౌ  మీద  బాండీ  పెట్టి  ఒక  మూడు  స్పూన్లు   నూనె  వేసి, నూనె బాగా కాగగానే   గోంగూర  ఆకును మరియు  పచ్చిమిర్చి   కొద్దిగా  ఉప్పు మరియు  కొద్దిగా  పసుపును  వేసి  మూత  పెట్టి  మెత్తగా మగ్గ నివ్వాలి .
మగ్గిన తర్వాత  వేరే  ప్లేటు లోకి  తీసుకోవాలి  .
తిరిగి  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మరో మూడు  స్పూన్లు   నూనె  వేసి  నూనె  బాగా  కాగగానే ,   పది   ఎండుమిరపకాయలు , పావు స్పూను  మెంతులు , స్పూను  మినపప్పు  ,  ముప్పావు  స్పూను   ఆవాలు  , కొద్దిగా   ఇంగువ   వేసి  పోపు  వేయించుకోవాలి .
ఆ  తర్వాత  రోటిలో   ముందుగా   ఎండుమిరపకాయలు మరియు  తగినంత   ఉప్పును  వేసుకుని మెత్తగా పచ్చడి బండతో   దంపుకోవాలి ..
ఆ తర్వాత  వేయించిన  గోంగూర  పచ్చి మిర్చి మిశ్రమము రోటిలో వేసుకుని  మెత్తగా   పచ్చడి  బండతో  నూరుకోవాలి .
చివరగా  మిగిలిన  పోపు  వేసుకుని   ఒకసారి బండతో  నూరుకుని   వేరే  గిన్నెలోకి  తీసుకోవాలి  . 
అంతే . ఎంతో  రుచిగా  పుల్ల పుల్లగా  నోరూరించే  కొండ  గోంగూర  పచ్చడి  భోజనము  లోకి   సర్వింగ్  కు  సిద్ధం .
ఈ గోంగూర  ఆకుతో  పచ్చడి  నాలుగు  రోజులు  నిల్వ ఉంటుంది .
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము  తయారు చేయు  విధానము  మరియు  ఫోటో  తయారుచేయు  సమయమున తీసినది.

రోకలి దొరికిందోచ్ !! 
మొన్న  దిల్ సుఖ్ నగర్ వైపు వెళ్ళినపుడు.. ఎల్ బి నగర్లో రోళ్లు దొరుకుతాయని చెప్పంది విని... అటువైపు వెళ్లాను.  ఎల్ బీ నగర్ దాటి  వనస్థలి పురం రొడ్డున వెళ్తుంటే రోడ్డుకిరువైపులా    బంగారంలాంటి రోళ్ళు దర్శనమిచ్చాయు. వాటితో పాటూ ఏవేవో వస్తువులు. చేత్తో చేసినవి..కాస్త చవక రకాలు.  టెంపరరీ నివాసాల్లో బతుకులు సాగదీసే సంచారులు ఇలాంటివన్నీ చేస్తూ  పొట్ట పోసుకుంటూంటారు.  నిజానికి వీళ్ళే భారతీయ సంస్కృతీ సంప్రదాయాలని కాపాడే వాళ్ళు..కదా !! 
 టివీల్లో అడ్వర్టైజ్ మెంట్లు చూసి వాటికోసం ఎగబడి, సూపర్ మార్కెట్లో, కార్పొరేట్ షోరూముల్లోనూ  బ్రాండ్, లేబుల్సూ చూసి అంతర్జాతీయ సరుకులు కొనుక్కు బతికే మనం  నిజానికి సంతొషకర  జీవిత శైలిని ఎప్పుడో మరిచామేమో. చదువు, మల్టీ నేషనల్ ఉద్యోగాల వేట,  అమెరికాలాంటి దేశాలని ఎగిరిపోవాలనే  కాంక్ష తప్ప ... ఉన్నంతలో ఆరోగ్యంగా..ఆనందగా బతకాలని ఆలోచించలేము. కాలచక్రంలో .. జీవిత పోరాటంలో  మనకే తెలియని గమ్యాలకోసం పరుగు.  !! 
ఇహ విషయానికొస్తే.. రోలు దొరికింది. రాతి రోకలి ఉంది. కానీ నాకు రోకలి కావాలని అడిగాను. అది రైతు బజార్లో దొరుకుతుంది సర్ అన్నది. సరే  ఎస్సార్ నగర్లో రైతు బజార్ దగ్గరవుతుంది. అక్కడ కొందాం అనుకున్నాను. కానీ ఈ పదిరోజుల్లో వెళ్లలేకపోయా. రోలు ని చూసి  ఆగలేక ఇంట్లో ఉన్న ఒక గుండు రాయితో మొన్న టమాటో పచ్చడి చేసుకుతిన్నా.. రాయి చిన్నగా ఉండటం తో నూరటం సరిగ్గా కుదరటం లేదు.  సో రోకలి కావాల్సిందే అనుకుని.. ఇవ్వాళ సాయంత్ర  అదే పనిగా  ఎస్సార్ నగర్ రైతు బజార్ బయలుదేరా..  లోపలికి వెళ్ళి చూస్తే... అన్నీ కూరగాయలే తప్ప .. ఒక్క చోటా రోళ్ళూ, రోకలో దర్శనమిచ్చింది కావు.  డిస్సప్పాయింట్ మెంటుతో వెనుదిరుగుతూ.. అనిపించింది. ఇలాంటి వస్తువులన్నీ కాస్త  దిగువతరగతి మార్కెట్టులో ఉంటాయి. అక్కడ ప్రయత్నిద్దాం.  అని సనత్ నగర్ వైపు బయలుదేరాను. అనుకున్నట్టుగానే.....  మూసపేట్ బ్రిడ్జీ ఎక్కే ముందు.. బస్ స్టాపువద్ద.. చిత్ర విచిత్ర దుకాణాలు దర్శనమిచ్చాయి.  ఇనుప పెట్టెలూ,  మడుచుకోగల ఇనుప మంచాలు, నవారు మంచాలూ  మొదలైనవి. ఇక్కడ ఖచ్చితంగా దొరికితీరాలి అనుకుంటుండగానే....ఒక షాప్ లో ఇదుగో ఇక్కడున్నాం అని దర్శనమిచ్చాయ్ రోకళ్ళు !! 
ఇంకేమి....దిగి  నూటయాభై చెపితే వందరూపాయలకి బేరమాడుకొని తెచ్చుకున్నాను.  ఇహ సమయం ఉన్నప్పుడల్లా పచ్చళ్ళ ప్రయోగాలు చేయాలి. 
రోకలి కావాలనుకునేవాళ్ళకోసం అడ్రసు ఇస్తున్నాను. తెచ్చుకోండీ.. దంచుకోండీ !! 😛 

రోలున రుబ్బెడి పచ్చడీ
చాలా రుచిరంబు తినగ చవు లూరించన్
కాలంబుయె మారెను గద
రోలుయె యే యింటనైన రూఢిగ గలదా?
రోటి చట్ని యన్న లొట్ట లేయును జిహ్వ
మిద్దె నుంచి దించు మేటి మగడ!
పాటు యేమి లేదు పాడు "కరోన" తో
రుబ్బి నీవు నీయ రుచిగ నుండు.
ఓహో! కరోన! పాట్లివి,
యాహా! నా భార్య యాజ్ఞ యమలే జేస్తిన్.
సాహో! రోటీ చట్నిని
బాహువులే నొప్పి పుట్ట బఱబఱ రుబ్బన్.
గరగర మిక్సీ కంటెను
బరబర రుబ్బంగ రోటి పచ్చడి రుచియే
చురచుర కమ్మగ నుండును
బిరబిర లొట్టల తిననిదె ప్రియ భక్షణమే!
****** శిష్ట్లా తమ్మిరాజు ******
Comm

🌻🌹నా కొత్తరోలు- రోటి పచ్చళ్లు🌹🌻 
                       దొండకాయ పచ్చడి   
        (2011 పోస్ట్ సేకరణ) రచయిత నేను కాదు..
హమ్మయ్య! ఇన్నాళ్ళకి మళ్ళా మీ ముందుకొస్తున్నా! చాలా కూసింత బిజీగా ఉండటంవల్ల అప్పుడెప్పుడో మీకు చెబ్దామనుకున్న నా "కొత్తరోలు కథలు" చెప్పటానికి, ఇవ్వాళ్టికి కాస్త తీరిక దొరికింది. ఇప్పుడు కూడా ఇంకా చాలా కూసింత బిజీనేకాని, మరీ నా బ్లాగు "ఆకలో రామచంద్రా! రోటి పచ్చడో రామచంద్రా!" అని తెగ గొడవెట్టేస్తుంటేనూ ఇక ఉగ్గబట్టుకోలేక వచ్చేశానన్నమాట! ఇక మొదలెట్టేద్దామా నా రోటిపచ్చళ్ళ పురాణం..😉! ఇది కొన్ని భాగాలుగా రాస్తానన్నమాట! ఒక్కోభాగంలో కొన్ని కొన్ని టిప్స్ అలా ఫ్లోలో చెప్పేస్తానేం.......
మీకందరికీ బాగా తెలుసుకదా, నాకున్న రోటి పచ్చళ్ళ పిచ్చి! మిక్సీలు, గ్రైండర్లూ మనకి పడవు, కాబట్టి రోలు కొనుక్కోవాలని తీవ్ర ప్రయత్నాలు చేసి ఒక బుజ్జి రోలు తెచ్చుకున్నా... మరేం! పెద్దది చాలా రేటు చెప్పాడు, మనం పప్పులూ,గట్రా రుబ్బంకదా, పచ్చడికే కదా అని చిన్నదే తెచ్చుకున్నా... మాకు ఇక్కడ చిన్నపాటి రోళ్ళపరిశ్రమ ఉందిలెండి! ఈ రోజుల్లో ఎవరు కొంటున్నారబ్బా అనుకున్నా! నాలాంటి పిచ్చ ఉన్నోళ్ళు చాలామందే ఉన్నారనిపించింది,అక్కడ వాళ్ళు తయారు చేసే రోళ్ళు చూస్తే....
ఇక ఎలాంటి రోలు మంచిది, మన్నిక ఉండాలంటే ఎలాంటిది తెచ్చుకోవాలి? అన్నది పెద్ద ప్రశ్న... రోళ్ళు కొండరాయితో చేసినవి, నాపరాయితో చేసినవి రెండు రకాలుంటాయి. కొండరాయితో చేసింది కాస్త ధర ఎక్కువగాని, వందల ఏళ్ళున్నా ఏమీకాదు. అదే నాపరాయితో చేసిందైతే ధర తక్కువైనా నాలుగైదేళ్ళకే పగిలిపోతుంది. కాబట్టి, కొండరాయిదే తెచ్చుకున్నా నేను. మా ఊళ్ళో మా ఇళ్ళ ముందు ఒక పెద్ద రోలుండేది. కొండరాయిదే, కాని ఎఱ్ఱ్రరాయిది...నేలబారున ఉండేది. అప్పట్లో పల్లెటూళ్ళల్లో ఇలాంటి రోళ్ళు ఊరి మధ్యలో, లేకపోతే ఇరవై ముఫ్ఫై ఇళ్ళకి కలిపి ఒకటి ఖచ్చితంగా ఉండేవి..వడ్లు దంచుకోటానికీ, చింతకాయ పచ్చడి తొక్కుకోనూ అందరూ ఇదే వాడుకునేవాళ్ళట! అటెళ్ళేవాళ్ళూ,ఇటెళ్ళేవాళ్ళూ కాసేపు రోకలి తీసుకుని నాలుగుపోట్లు వేసివెళ్ళేవాళ్ళు.. అలా అందరం ఒక కుటుంబం అన్న భావాన్ని పెంపొందించడానికి ఈ రోళ్ళు బాగానే ఉపయోగపడేవి... ఆ రోళ్ళూ పోయాయి, ఆ కలివిడి బతుకులూ పోయాయి..ప్చ్!
నేను కొన్న రోలు చిన్నది కాబట్టి అంతగా పట్టించుకోవాల్సిన పన్లేదు. గుంట కాస్త లోతు ఎక్కువ ఉన్నదే తీసుకున్నా. అదే, పెద్ద రోలు కొనే పనైతే గట్టు బాగా వెడల్పు ఉన్నది, గుంట తక్కువ ఉన్నది తీసుకుంటే మంచిది, రుబ్బుకోటానికి అప్పుడే అనువుగా ఉంటుంది. లోతు ఎక్కువ ఉంటే పొత్రం కిందకి వెళ్ళిపోయి పచ్చడిగాని,పిండిగాని సరిగ్గా మెదగదు. గట్టు లేకపోతే పక్కకి పడిపోతుంది. పొత్రం కూడా సరైన సైజు చూసి సరిగ్గా వేయించుకోవాలి.
పెద్దరోళ్ళలో రెండు రకాలుంటాయి. ఒకటి మామూలుగా పచ్చళ్ళు,పిండ్లు రుబ్బుకోటానికి. రెండోది గింజలు దంచుకోటానికి, పొడిపిండి కొట్టుకోటానికి, ఎక్కువ మోతాదు పచ్చళ్ళు(చింతకాయ,ఉప్పుగోంగూర,కొరివికారం) తొక్కటానికి. మొదటిది ఒకటే రోలు, నాలుగు పలకలుగా ఉంటుంది. రెండోది రెండు భాగాలుగా ఉంటుంది. కింద చిన్నగుంటతో ఉన్న గుండ్రటి కుంది ఉంటుంది.దానిపైన ఇంకాస్త వెడల్పున్న గుండ్రటి చట్రాన్ని ఎక్కిస్తారు.రెండూ కలిసి లోతు ఎక్కువ వస్తాయి. పై చట్రంగట్టు, కింద కుందికన్నా బాగా వెడల్పుంటుంది.
ఈ రోట్లో అరిసెల పిండి కొట్టేప్పుడు, చింతకాయ పచ్చడి తిరగ తొక్కేటప్పుడు, జొన్నలు తొక్కేటప్పుడు భలే సరదాగా ఉండేది. రెండు రోకళ్ళపోటు,మూడు రోకళ్ళపోటు,నాలుగు రోకళ్ళపోటు ఇలా పందేలు కట్టి వేసేవాళ్ళు. నాలుగురోకళ్ళపోటు వెయ్యగలిగితే మొనగాడి లెఖ్ఖ! ఒక రోకలికి ఒకటి తగలకుండా, రోలు అంచుకి తగలకుండా పోటు వెయ్యటమంటే, అబ్బో! పెద్ద ఆర్టు అది... మనకి మూడు రోకళ్ళపోటే గగనంగా ఉండేది..😉 లయబధ్ధంగా పోటు వేస్తూంటే ఆ రోకళ్ళ చప్పుడు వింటానికి ఎంత బాగుండేదో! అసలు మాకు పొద్దున్నే ఈ రోకళ్ళపోటుతోనే తెల్లారేది...పొద్దున్నే కళ్ళు నులుముకుంటూ వెళ్ళి అన్నయ్యా, నేనూ జొన్నలు తొక్కేవాళ్ళం..మా పక్కింటోళ్ళకీ, మాకూ పోటీ! ఎవరు వేగంగా పోటేస్తున్నారా అని. అన్నయ్య బాగా ఆవేశపడిపోయేవాడు. మనమేమో మహా నిమ్మది, రిజల్టు! నాలుగైదు పోట్లకొకసారైనా రెండు రోకళ్ళూ ఢీకొనేవి... నాన్న వచ్చి డిప్పమీద ఒకటిచ్చేవాడు, సరిగ్గా వెయ్యి అని....హ్మ్! ఆ రోజులే వేరు.........
ఇక రోలు ఎంచుకునేప్పుడు "కక్కు" బాగా కొట్టింది తీసుకోండి, అంటే లోపలవైపున గరుగ్గా గుంటలు,గుంటలుగా ఉంటుంది కదా, అది! అప్పుడు బాగా మెదుగుతుంది, పచ్చడైనా, పిండైనా....{దీన్నే గంట్లు కొట్టటం అని కూడా అంటారని గోదారోళ్ళ ఉవాచ!...😉..😉..}... పాతరోళ్ళకి కూడా మళ్ళా మళ్ళా "కక్కు" కొట్టిస్తూనే ఉండాలి...
ఇక రోలు సెలెక్షను అయిపోయింది కదా! అందులోకి వాడే రోకళ్ళూ,పచ్చడిబండలూ, పొత్రాల గురించి తరువాయి భాగంలో చెప్తానేం! అలా తెచ్చుకున్న కొత్తరోలుని "అలవాటు" చెయ్యాలి! అంటే కొత్తగా చెక్కిన రోలు కదా, ఇసుక వచ్చిద్ది అలానే వాడేస్తే. అందుకని ఆ ఇసక పోయేట్టు చెయ్యటాన్ని అలవాటు చెయ్యటం అంటారు... మామూలుగా అందరూ ఊకపోసి దంచుతారు ఏడెనిమిదిసార్లు...అప్పుడు లోపలున్న ఇసకంతా పోయి పచ్చడి తొక్కుకోటానికి వీలుగా తయారైద్ది. ఐతే నాకిక్కడ ఊక ఎక్కడ దొరికిద్ది? అందుకే జ్యోతిగార్ని అడిగా.... భలే అవిడియా చెప్పారు జ్యోతిగారు. గోధుమపిండి కలిపి, ఆ ముద్దని వేసి బాగా గుంటలో అంతా నాలుగైదు సార్లు రుద్ది, తర్వాత శుభ్రంగా కడిగేస్తే ఇసక ఒక్క పిసరకూడా లేకుండా పోయింది...
తర్వాత కొత్తరోలు మొదలెట్టాలంటే ఉండ్రాళ్ళు పొయ్యాలంట, తాంబూలాలివ్వాలంట! ఇవన్నీ మన బ్రహ్మచారి జీవితానికి ఎక్కడ కుదురుతాయి. అందుకని కాస్త పసుప్పూసి, కుంకవెఁట్టి, ఓ పసుపుకొమ్ము తాడు కట్టి మొదలెట్టేశా....😉 పైగా ఎప్పుడెప్పుడు రోట్లో పచ్చడి తొక్కుకు తిందామని ఆత్రం..😉! ఇక నా రోట్లో తొక్కిన మొదటి పచ్చడి చుక్కకూరపచ్చడి. దాని ఫొటో తియ్యలేదు ఆరోజు హడావుడిలో... తర్వాత దొండకాయ పచ్చడి చేశా! అది చెప్పుకుందామేం ఇవ్వాళ!
అసలు దొండకాయలంటే పచ్చడే!వాడ్చి పచ్చడి తొక్కితే ఎంత కమ్మగా ఉంటదో! వేపుడు,ఇగురూ మనకి అంత ఎక్కవు..... అది కూడా మా ఇళ్ళల్లో అంత రెగ్యులర్గా అలవాటు లేదు. దొండపందిరి ఉన్నా, ఇక ఏ కూరగాయలూ లేకపోతే దొండకాయ పచ్చడి అన్నమాట! "పిచ్చి దొండకాయలు" అంటుంటారు, మరి తింటే పిచ్చెక్కిద్దనో లేక పాపం!నీళ్ళు పోసినా, పొయ్యకపోయినా సంవత్సరాల తరబడి అలానే పిచ్చిపిచ్చిగా కాస్తుంటాయనో...😉
బాగా పచ్చిగా ఉన్న దొండకాయలే బాగుంటాయి పచ్చడికైనా, వేపుడు కైనా... కాస్తంత దోరబడి, లోపల ఎఱ్ఱగా ఉన్నా పచ్చడికి పనికొస్తాయి కాని వేపుడుకి పనికి రావు...ఇక పూర్తిగా పండిపోయాయనుకోండి! చూసుకోటానికీ,నోట్టో వేసుకు చప్పరించటానికీ,అదీ కాకపోతే అందమైన అమ్మాయి పెదవులతో పోల్చి వర్ణించుకోటానికీ తప్ప పచ్చడికి పనికి రావు..😉
అలా పచ్చగా నవనవలాడుతున్న దొండకాయలు ఒక పావుకేజీ(నలుగురికి రెండు పూటలకీ వచ్చిద్ది) తీసుకోండి. వాటిని శుభ్రంగా కడిగి అడ్డంగా, చక్రాల్లా సన్నగా తరుక్కోండి...తొడెం, చివరి ముట్టె తీసేయండి. అవి పడితే సరిగ్గా మెదగవు. పంటికింద పడితే బాగోవు.
ఇప్పుడు బాండీ పొయ్యిమీదెట్టి, ఓ పెద్ద గెంటెడు నూనేసి, అది కాగంగనే, పైన తరుక్కున్న దొండకాయ ముక్కల్ని, ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయల్నీ వేసి వాడ్చాలి, అదేనండీ వేయించాలి ..😉..... అన్నీ బాగా వేగాయనుకోగానే చివర్లో కాస్త జీలకఱ్ఱా,నాలుగు మెంతులూ,కాసిన్ని ధనియాలూ వేసి వేగనివ్వాలి....
పచ్చిమిరపకాయల్తో తొక్కితే ఒకలా ఉంటుంది. ఎండు మిరపకాయలేసి తొక్కినా బాగుంటుంది. ఎండు మిరపకాయలైతే వేయించాల్సిన పన్లేదు. ముందు రోట్లో ఎండు మిరపకాయలేసి, కాసిన్ని నీళ్ళు పోసి తొక్కాలి, అది మెదిగాక దొండకాయ ముక్కలు, మిగతావి వేసి తొక్కా లి.
పైన వేయించిన సంభారాలన్నీ బాండీలోంచి డవిరెక్టుగా రోట్టోకి మార్చి, కుంకుడుగాయంత చింతపండూ,నాలుగు వెల్లుల్లి రెబ్బలూ, ఒక చిన్నస్పూను ఉప్పూ వేసి ఇక రోకలిబండ తీసుకుని తొక్కటమే.
ఒక చేత్తో ఎగదోసుకుంటూ మరో చేత్తో నూరాలి.దీనికి కొంచెం ఒడుపు కావాలి. అలవాటుమీద అదే వస్తుందనుకోండి.పైగా చేతి కండరాలకి భలే వ్యాయామంలే!..😉..పచ్చడి కొంచెమే అయితే, రెండు చేతులతో రోకలిబండ చివర్న పట్టుకుని నూరితే తొందరగా మెదిగిపోద్ది...
అలా రోట్లో పచ్చడి తొక్కుతూ ఉంటే, నాలుగైదు పోట్లు పడగానే కమ్మటి వాసన ముక్కుపుటాలకంటి ఉక్కిరిబిక్కిరి ఐపోతాం.... కాస్త తీసుకుని నాలిక్కి రాసుకోందే ప్రాణం ఊరుకోదు. కాని, రోటి దగ్గర నాకితే పెళ్ళికి వానపడిద్దని ఇంట్లో కట్టడి! ఇక్కడ మనకి స్వతంత్రం కదా! "పడితే పడింది వెధవవాన, పేద్ద కళ్యాణమండపం తీసుకుని చేసుకుందాంలే" అని సర్ది చెప్పుకుని చక్కగా రోకలికి అంటింది వేలితో తీసి చివర్లో నాకేస్తుంటా..😉
కొంచెం మెదిగింతర్వాత మరికాస్త కొత్తిమీర వేసి తొక్కండి. పచ్చడి మరీ లేహ్యంలా తొక్కొద్దు. కచ్చాపచ్చాగా తొక్కితేనే బాగుంటుంది. అమ్మ చెప్తూ ఉంటుంది,నెల్లూరులో ఉన్నప్పుడు ఇంటి ఓనర్లు అమ్మ పచ్చడి తొక్కుతుంటే,"పచ్చడిబండ అరిగిపోద్ది" అని హాస్యమాడేవాళ్ళంట! వాళ్ళు మరీ ఊరకే అలా, అలా ముక్కలు చితగ్గొట్టి తినేస్తారు...
ఇప్పుడు ఈ పచ్చడిని రోట్లోంచి గిన్నెలోకి తోడుకొని, కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు... ఎక్కువ పచ్చడి, అంటే ఒక కేజీ తొక్కి, నాలుగైదు రోజులు నిలవుంచాలనుకుంటే తాలింపు పెట్టుకుంటే నిలవుంటుంది.
ముక్కలు వేయించేప్పుడు కాసిన్ని దోసిత్తనాలు వేసి వేయించి పచ్చట్లో వేసి నూరితే పచ్చడి ఘుమఘుమలాడిపోద్ది.... చింతపండు బదులు ముడిచింతకాయ పచ్చడి కూడా వేసుకోవచ్చు,బాగుంటుంది. కొంతమంది ఇందులో పచ్చికొబ్బరివేసి నూరతారు, మనకి నచ్చదు.
పచ్చడి చేసుకున్న ఆనందంలో రోలు కడగటం మర్చిపోవద్దండోయ్! రోలూ,రోకలిబండా శుభ్రంగా కడిగి, రోకలిబండ ఎండ తగలని చోట జాగ్రత్త చేసుకోవాలి.
ఇప్పుడు చక్కగా అన్నం వండుకుని, వేడివేడన్నంలో ఈ పచ్చడేసుకుని, మరికాస్త నెయ్యివేసుకు తింటుంటే అబ్బబ్బ! ఆ వాసనకే ఆకలి చచ్చిపోయిన రోగికి కూడా ప్రాణంలేచొచ్చి ఓ ముద్ద నోట్లో వేసుకుని తరిస్తాడు...
Comments

ఆలూరుకృష్ణప్రసాదు .
మరో  వెరైటీ  రోటి వెల్లుల్లి  కారప్పొడి .
కావలసినవి.
ఎండుమిరపకాయలు  - 15.
చాయ మినపప్పు  -  రెండు  స్పూన్లు .
ఆవాలు - స్పూను
జీలకర్ర  - అర  స్పూను 
వెల్లుల్లి  రెబ్బలు  - 35
రెబ్బలపై  పై పొట్టు  వలుచుకోవాలి.
కరివేపాకు  - ఒకటిన్నర  కప్పు.
చింతపండు  - చిన్న నిమ్మకాయంత . విడదీసి ఉంచుకోవాలి.
పసుపు -  పావు స్పూను.
నూనె -  ఆరు  స్పూన్లు .
ఉప్పు -  తగినంత .
తయారీ విధానము .
ముందుగా  స్టౌ మీద బాండీ పెట్టి  మూడు  స్పూన్లు  నూనె వేసుకుని , నూనె బాగా కాగగానే  వెల్లుల్లి  రెబ్బలు  వేసి  వేయించు కోవాలి. మరీ  వేగకూడదు. మరీ ఎర్రగా  అవకూడదు.
వేగగానే  వేరే ప్లేటులోకి  తీసుకోవాలి.
మళ్ళీ  స్టౌ మీద బాండీ పెట్టి  మిగిలిన మూడు  స్పూన్లు  నూనె వేసుకుని  నూనె బాగా కాగగానే , వరుసగా  ఎండుమిరపకాయలు  , చాయమినపప్పు , ఆవాలు  , జీలకర్ర , పసుపు మరియు కరివేపాకును వేసుకుని పోపు వేయించుకోవాలి.
పోపు చల్లారగానే  ముందుగా  రోటిలో ఎండుమిరపకాయలు , చింతపండు  మరియు తగినంత  ఉప్పును వేసి మెత్తగా పచ్చడి  బండతో  దంపుకోవాలి.
తర్వాత  వేయించుకుని  సిద్ధంగా  ఉంచుకున్న  మిగిలిన పోపును వేసుకుని  మరీ మెత్తగా  కాకుండా పచ్చడి బండతో దంపుకోవాలి.
చివరగా  వేయించుకుని  సిద్ధంగా  ఉంచుకున్న వెల్లుల్లి  రెబ్బలు కూడా వేసుకుని  మరొక సారి  పచ్చడి  బండతో  దంపుకోవాలి.
తర్వాత  ఈ మిశ్రమమును రోటిలో నుండి   విడిగా ఓ  పళ్ళెంలోకి  తీసుకుని  , చేతితో బాగా కలుపుకుని విడిగా  ఒక  సీసాలోకి  భద్ర పరచుకోవాలి .
మామూలుగా  చేసుకునే కారప్పొడి లో  ధనియాలు వేసుకుంటారు. ఈ కారప్పొడి లో ధనియాలు  వేయరు.
వెల్లుల్లి  అసలు వాడని  వారు వెల్లుల్లి  బదులుగా   ఒక పావు కప్పు ధనియాలు  ఎండుమిరపకాయలు తో పాటుగా  పోపులో  వేసుకుని వేయించుకుని ఈ కారప్పొడి కొట్టుకోవచ్చును.
ముఖ్యంగా భోజనము లో  ముందుగా  వేడి  వేడి అన్నంలో  నెయ్యి వేసుకుని  ఈ కారప్పొడి  కలుపుకుని  తింటే అద్భుతమైన  రుచిగా ఉంటుంది.
అంతే గాక ఇడ్లీ , దోశెలు మరియు చపాతీల లోకి చాలా రుచిగా  ఉంటుంది .
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ మేము తయారుచేయు  విధానము  మరియు ఫోటో తయారుచేయు  సమయమున  తీసినది.

పచ్చిమిరప కాయల పెరుగు పచ్చడి (నేను తరచుగా చేస్తుంటాను)
విధానము
 1. కొంచెం లావుగా తాజాగా వున్న పచ్చిమిరప కాయలు మీ అలవాటు ప్రకారము శుభ్రంగా కడిగి తుడిచి చాకుతో సన్నగా గాట్లు పెట్టి సిద్ధము చేసుకోవాలి. 
 2. మూకుడులో మినప్పప్పు, ధనియాలు, రెండు లేక మూడు మెంతి గింజలు, పావు స్పూను కు తక్కువ గా ఆవాలు, వొక్క జీడిపప్పు , యింగువ వేసి దోరగా  (dry roast ) వేయించుకోవాలి.  ఆ తరువాత మూడు స్పూన్ల తెల్ల నువ్వులు దోరగా (మాడకుండా) వేయించాలి.  వీటిని వొక పళ్ళెం లో తీసిపెట్టుకోవాలి. 
 3. అదే మూకుడులో కొంచెం నెయ్యి వేసి పచ్చి మిరపకాయలు వేసి గరిట తో  తిప్పుతూ అన్ని వైపులా దోరగా కాలేలా వేయించి, మిర్చికి సరిపోయేంత మాత్రమే, వుప్పు , పసుపు వేసి కలియబెట్టి వుంచాలి .  
 4. ముందుగా వేయించి బెట్టుకున్న నువ్వులు వగైరాలను, వీటికి మాత్రమే సరిపోయేంత వుప్పు వేసి రవంత బెల్లం కలిపి రోటిలో , రోకలి బండ తో నూరి, దంచి పొడి చేయాలి.  
 5. చివరగా వేయించి పెట్టుకున్న మిర్చి, రోటిలో దంచిన నువ్వుల పొడి అన్ని పెరుగు లో వేసి బాగా కలుపుకోవాలి.  మిర్చి విరిగి పోకుండా చూడండి .  కారంగా, ఘాటుగా వుండాలంటే వొకటి రెండు వేయించిన మిరపకాయలు కూడా రోటిలో నూరి కలపండి.  పోపు అవసరం లేదు.  మీకు కావాలంటే మీ యిష్టం కానీ నేతితో మాత్రమే .
 6. అన్నం తో మాత్రమే కాదు, చపాతీ, పుల్కా, అట్లు మొదలగు టిఫెన్లకు కూడా బాగుంటుంది 

కంది పచ్చడి రోటి లో తయారు చేసే విధానము:-
కావలసిన పదార్థములు:
కందిపప్పు 100 గ్రాములు, చింతపండు కుంకుడు గింజంత, ఉప్పు రుచికి సరిపడా, జీలకర్ర పావు టీ స్పూన్, వెల్లుల్లి 3 రెబ్బలు, నూనె ఒక టీ స్పూన్, పోపు దినుసులు (ఆప్షనల్).
తయారు చేయు విధానము:
ముందుగా దోరగా కందిపప్పు వేయించుకోవాలి, తరువాత ఎండు మిరపకాయలు వేయించుకోవాలి కొద్దిగా నూనె వేసి, రోటిలో వేయించిన కందిపప్పు వేసుకుని మెత్తగా దంచుకోవాలి, ఉప్పు, చింతపండు, వేయించిన ఎండు మిరపకాయలు, వేసుకొని మెత్తగా దంచుకోవాలి కొద్ది కొద్దిగా నీరు పోస్తూ నూరుకోవాలి మెత్తగా పచ్చడిలా వచ్చేవరకు.
తరువాత దానిని ఒక గిన్నెలోకి తీసుకొని పోపు వేసుకోవాలి, ఇంగువ పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది.
కంది పచ్చడి, పచ్చి పులుసు, పిండి వడియాలు కు కాంబినేషన్ బాగుంటుంది.
మీరు ట్రై చేయండి.
Com

రోటి పచ్చడి సభ్యులకి నమస్కారం. ఈరోజు నేను దోసకాయ బజ్జి చేశాను .ఎలా చేశానో చెప్తాను. ఒక రెండు చిన్న దోసకాయలు తీసుకుని రౌండ్ గా  ముక్కలు కట్ చేసుకోవాలి. తొక్క తీయనవసరం లేదు.  దానికి సరిపడా పచ్చిమిర్చి, పసుపు, కొంచెం మజ్జిగ వేసి ఉడికించుకోవాలి .ఉడికించిన తర్వాత తీసి వాటిని రోట్లో వేసి   చింతపండు ,జిలకర ,వెల్లుల్లి, ఉప్పు, కొత్తిమీర,  వేసి బాగా దంచుకోవాలి. తర్వాత ఇంగువతో తరలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది  అన్నంలోకి కానీ దోసెల్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇది పాత కాలం పచ్చడి మా అత్తమ్మ వాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు నేను చేస్తున్నాను. ఆయిల్ తక్కువగా పట్టిద్ది చాలా టేస్ట్ గా ఉంటుంది.


కాల్చిన దొండకాయలతో చింతకాయ (తొక్కు) పచ్చడి.  
పొయ్యి  మీద దొండ కాయలు కాల్చి వుంచుకోవాలి.  పోపుగింజలు, వేరుశనగ (పల్లీ) లు, యెండు , పచ్చి మిర్చి వేయించు కొని, రోటిలో దంచుకోవాలి.  కాల్చిన దొండకాయ లు కూడ రోటిలో  వేసి దంచి వుప్పు చింతకాయ కూడా వేసి నూరుకోవాలి.  చింతకాయ పచ్చడి లో వుప్పు చాలదనుకుంటే కొంచెం వేసుకోవచ్చు.  ఈ పచ్చడి చాలా రుచి గా వుంది.  మీరు కూడా చేసి , రుచి చూసి చెప్పండి .

రోటిలో దోసకాయ కాల్చిన పచ్చడి తయారు చేసే విధానం:-
కావలసిన పదార్థములు:
దోసకాయ -1, టమాటోలు -2 ఉప్పు రుచికి సరిపడా, పసుపు చిటికెడు, వేయించిన ఎండు మిరపకాయలు -8, వెల్లుల్లి  రెబ్బలు-2, తగినన్ని పోపుదినుసులు 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేయించండి.
దోసకాయ కాల్చిన పచ్చడి తయారు చేయు విధానము:
ముందుగా దోసకాయ పొయ్యి మీద పెట్టి కాల్చుకోవాలి, బాండి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ఎండు మిరపకాయలను వేయించుకోవాలి,  పోపుదినుసులు వేయించుకోవాలి,  పావు టీ స్పూన్ మెంతులు వేసి వేయించుకొని అందులో టమాటో ముక్కలు వేయించుకోవాలి బాగా మగ్గనివ్వాలి. ఎండుమిర్చి రోటిలో వేసుకుని దంచుకోవాలి, పసుపు వెల్లుల్లి వేసి బాగా నూరి, టమాటో ముక్కలువేసి దోసకాయ ని వేసి బాగా నూరుకోవాలి. ఒక గిన్నెలో కి ఆ పచ్చడిని తీసుకోవాలి. పోపు దినుసులు వేసుకుంటే పచ్చడి రెడీ.
ఇది అన్నంలో కి దోసెలలో కి చపాతీలోకి బాగుంటుంది.
మా నానమ్మ గారు చేశారు.
మీరు ప్రయత్నించండి.

బీరకాయ  రోటి పచ్చడి .
మేము  బీరకాయ పచ్చడి  బీరకాయల  పై  చెక్కు  తీసి చేసుకున్నాము .
ఇష్టమైన వారు  పై  చెక్కుతోనే  ముక్కలుగా  తరిగి పచ్చడి  చేసుకోవచ్చును .
కావలసినవి . 
లేత  బీరకాయలు  --  3  పై  చెక్కు  తీసుకుని   ముక్కలుగా  తరుగు కోవాలి .
పచ్చి మిర్చి  --  ఎనిమిది .
చింతపండు  --  మూడు  రెబ్బలు . విడదీసి  కొద్దిగా  నీళ్ళతో  తడిపి  ఉంచుకోవాలి .
పసుపు  --  కొద్దిగా 
ఉప్పు  --  తగినంత 
కొత్తిమీర  --  ఒక చిన్న కట్ట 
పోపునకు .
ఎండుమిర్చి   --  5
మినపప్పు  --  స్పూను 
ఆవాలు  --  అర  స్పూను 
మెంతులు  --  కొద్దిగా 
జీలకర్ర   --  పావు స్పూను 
ఇంగువ  --  కొద్దిగా 
నూనె  --  నాలుగు  స్పూన్లు 
తయారీ  విధానము .
ముందుగా  స్టౌ మీద  బాండీ  పెట్టి  రెండు  స్పూన్లు   నూనె  వేసి  నూనె  బాగా  కాగగానే  బీరకాయ  ముక్కలు , పచ్చిమిర్చి , కొద్దిగా  పసుపు మరియు  తగినంత   ఉప్పు వేసి  మూత పెట్టి  ఓ  అయిదు  నిముషాల  పాటు  ముక్కలను  బాగా  మగ్గ నివ్వాలి .
తర్వాత మగ్గిన  ముక్కలను  విడిగా   ప్లేటులోకి తీసుకోవాలి .
స్టౌ  మీద  తిరిగి   బాండీ  పెట్టి  మిగిలిన  నూనె  వేసి  నూనె  బాగా  కాగగానే   వరుసగా  ఎండుమిరపకాయలు , మెంతులు, మినపప్పు , జీలకర్ర  , ఆవాలు  మరియు  ఇంగువ  వేసుకుని   పోపు  వేయించుకోవాలి .
చల్లారగానే  ముందుగా  రోటి లో  ఎండుమిరపకాయలు , కొద్దిగా  ఉప్పు , తడిపిన చింతపండు  వేసి పచ్చడి బండతో మెత్తగా  దంపుకోవాలి .
తర్వాత   మగ్గిన  బీరకాయ  ముక్కలు,  పచ్చిమిర్చి , మిగిలిన పోపు మరియు  కొత్తిమీర  వేసి  ఒకసారి  కచ్చాపచ్చాగా  పచ్చడి బండతో  నూరుకుని  వేరే  గిన్నెలో కి  తీసుకోవాలి .
అంతే  ఎంతో  రుచిగా  ఉండే  బీరకాయ  పచ్చడి  అన్నం లోకి  సర్వింగ్  కు  సిద్ధం .
ఈ పచ్చడి  వేడి  వేడి  దోశెలలోకి  కూడా  బాగుంటుంది .
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము తయారుచేయు  విధానము మరియు ఫోటో  మేము తయారు చేయు సమయమున  తీసినది.

పండుమిరపకారం
ఉప్పు
పసుపు
మెంతిపిండి
గోంగూర బాండీలో వేయించాను
రోట్లోనూరాను పండ్ల గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది

రోటిలో కొత్తిమీర పచ్చడి తయారు చేసే విధానం:-
కొత్తిమీర పచ్చడి కి కావలసిన పదార్థములు:
కొత్తిమీర -1కట్ట, ఎండు మిర్చి -15 కాయలు, శెనగపప్పు -1టేబుల్ స్పూన్, మినపప్పు -1 టేబుల్ స్పూన్, ఆవాలు పావు టీ స్పూన్, మెంతులు పావు టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్, బెల్లం ముక్క చిన్నది, ఉప్పు రుచికి సరిపడా, పసుపు చిటికెడు, చింతపండు ఉసిరికాయంత, పచ్చిమిర్చి -6 కాయలు, జీలకర్ర పావు టీ స్పూన్.
తయారు చేసే విధానం:
ముందుగా పొయ్యిమీద బాండీ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి శెనగపప్పు, మినప్పప్పు,ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర ,మెంతులు అన్ని వేయించుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇంకో టేబుల్ స్పూన్ నూనె వేసి పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. రోటిలో ఎండుమిర్చి పోపు దినుసులు వేసి దంచుకోవాలి, బెల్లం ముక్క, ఉప్పు ,చింతపండు వేసి దంపుకోవాలి. కొత్తిమీర ,పచ్చిమిర్చి వేసుకుని నూరుకోవాలి కొద్దికొద్దిగా నీరు పోసుకుంటూ కోవాలి.
ఒక గిన్నెలోకి తీసుకున్నట్లయితే పచ్చడి రెడీ.
ఇది ఇడ్లీలలోకి,దోశలోకి,అన్నంలోకి బాగుంటుంది.
మీరు ప్రయత్నించండి
ఆలూరుకృష్ణప్రసాదు .
పొట్టు  మినపప్పు  తో  రోటిపచ్చడి.
ఇటీవల కాలంలో  మినపగుళ్ళు  మరియు  చాయమినపప్పు  వచ్చాయి కాని  పాత కాలంలో  వంటల లోకి  పోపులలోకి పొట్టు మినపప్పు నే వాడే వారు .
గారెలు  వేయడానికి  కూడా  పొట్టు మినపప్పునే  ఉపయోగించేవారు .
మినపసున్ని ఉండలు  తయారు చేయడానికి  కూడా  ఈ  పొట్టు మినపప్పు నే  ఉపయోగించేవారు .
అలా కట్టెల పొయ్యి మీద  బాండిలో  నూనె వేయకుండా  వేయించి  తిరగలిలో  విసిరిన  మినపగుళ్ళు ,  మినపసున్ని  విసిరేటప్పుడే  ఇల్లంతా  ఘమ ఘమ లాడి పోయేది .
పొట్టు మినపప్పు  ఉపయోగించడం  వలన  శరీరానికి అవసరమైన ఐరన్ ధాతువు  సమకూరుతుంది .
ఇప్పుడు  పొట్టు మినపప్పు  తో  రోటిపచ్చడి  ఎలా చేయాలో  తెలుసుకుందాం .
కావలసినవి .
పొట్టు మినపప్పు  --  75  గ్రాములు .
ఎండుమిరపకాయలు  --  15  
జీలకర్ర  --  స్పూనున్నర 
చింతపండు  --  నిమ్మకాయంత . ( విడదీసి పావు గ్లాసు నీళ్ళలో  పావు గంట ముందు తడిపి  ఉంచుకోవాలి .)
నెయ్యి  లేదా  నూనె  --  మూడు స్పూన్లు 
ఇంగువ --  కొద్దిగా 
ఉప్పు  --  తగినంత 
బెల్లం  --  చిన్న ముక్క 
(  ఇష్టం లేని వారు  మానేయవచ్చును )
తయారీ విధానము .
ముందుగా  స్టౌ  మీద బాండి పెట్టి  మూడు స్పూన్లు  నెయ్యి  వేసి , నెయ్యి బాగా కాగగానే  పొట్టు మినపప్పు , ఎండుమిరపకాయలు , జీలకర్ర  మరియు  ఇంగువ వేసి  కమ్మని  వాసన  వచ్చే వరకు  వేయించుకోవాలి .
చల్లారగానే  రోటిలో  ఈ మిశ్రమమును వేసుకుని , చింతపండును తడిపిన  నీళ్ళతో సహా , తగినంత  ఉప్పు మరియు చిన్న బెల్లం  ముక్కను వేసి  పొత్రముతో  కొద్దిగా  నీళ్ళు చిలకరిస్తూ   మరీ  మెత్తగా  కాకుండా  కొంచెం  పప్పులు తగిలే విధముగా  రుబ్బుకోవాలి .
తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలి .
ఈ పచ్చడి  నాలుగు రోజులు  నిల్వ ఉంటుంది .
అంతే  ఎంతో  రుచిగా  ఉండి ఆరోగ్యకరమైన  పొట్టు మినపప్పుతో  పచ్చడి  సర్వింగ్  కు  సిద్ధం.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము తయారుచేయు  విధానము  మరియు  ఫోటో  తయారుచేయు  సమయమున  తీసినది.

రోటిలో లో బీరపొట్టు పచ్చడి తయారు చేసే విధానం:-
కావలసిన పదార్థములు:
బీరపొట్టు (బీరకాయ చెక్కు) -1పెద్ద కప్పు, పచ్చిమిర్చి -15 కాయలు, కొత్తిమీర కొద్దిగా, చింతపండు ఉసిరికాయంత, ఉప్పు రుచికి సరిపడా, వెల్లుల్లి -2 రెబ్బలు, పసుపు చిటికెడు, నూనె-2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు కొద్దిగా.
తయారు చేసే విధానం:
ముందుగా బాండీలో నూనె వేసి,పచ్చిమిర్చి, బీరపొట్టు  వేయించుకోవాలి, వేగిన తరువాత ఆ నూనెలో పోపు వేసి వేయించుకోవాలి. రోటిలో బీరపొట్టు వేసి  మెత్తగా దంచుకోవాలి, చింతపండు, ఉప్పు, వెల్లుల్లి, పసుపు ఒక్కొక్కటిగా వేసుకుని నూరుకోవాలి. తర్వాత దానిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దానిలో పోపు వేసుకుంటే పచ్చడి రెడీ.
మా నానమ్మ గారు మా చెల్లి తో చేయించారు.
ఇది అన్నంలోకి బాగుంటుంది.
మీరు ప్రయత్నించండి
ఆలూరుకృష్ణప్రసాదు .
రోటిపచ్చళ్ళు .
పాత చింతకాయ పచ్చడితో తీపి రోటి పచ్చడి .
మా చిన్నతనంలో మా అమ్మమ్మ గారు  పాత  చింతకాయ తో  తీపి  రోటి పచ్చడి  చేసే వారు.
ఈ విధముగా  చేసిన పచ్చడి  చాలా రుచిగా ఉండేది.
వేడి వేడి అన్నంలో  నెయ్యి  వేసుకుని  తినడానికి  మరియు దోశెలు  గారెల లోకి  కూడా  ఈ పచ్చడి  చాలా రుచిగా  ఉంటుంది .
తయారీ విధానము .
స్టౌ  మీద  బాండీ  పెట్టి  అయిదు  స్పూన్లు   నూనె  వేసి  నూనె బాగా కాగగానే  పది ఎండు మిరపకాయలు ,  పావు స్పూను  మెంతులు ,  స్పూనున్నర  మినపప్పు ,  ముప్పావు  స్పూను  ఆవాలు, కొద్దిగా  ఇంగువ  వేసి  పోపు వేయించుకోవాలి. .
ఒక  కప్పు  పాత  చింతకాయ  పచ్చడి  తీసుకోవాలి .
 ఒక  40  గ్రా. బెల్లం  తీసుకోండి .
పచ్చడి లో  ఉప్పు లోగడే వేసి ఉంటుంది 
కనుక  నూర బోయే పచ్చడిలో  కొద్దిగా  ఉప్పు వేసుకుంటే  సరిపోతుంది .
ఇప్పుడు రోటిలో పోపునంతా వేసి   పచ్చడి  బండతో  ముందుగా మెత్తగా   దంపుకోవాలి .
పోపు  మెత్తగా  నలిగాక  ఉప్పు  బెల్లం వేసి  మెత్తగా  దంపి  తర్వాత  పాత చింతకాయ  పచ్చడి  వేసి  పొత్రము  తో  చాలా కొంచెం   నీళ్ళు  చిలకరించుకుంటూ  పచ్చడి మెత్తగా  కాటుకలా  రుబ్బు కోవాలి .
పాత చింతకాయ పచ్చడి వృధా కాకుండా ఈ పద్దతిలో  చేసుకునే వాళ్ళము .
ఈ విధముగా మేము రోటిలో   పాత  చింతకాయతో  తీపి  పచ్చడి చేసుకుంటాము. మీకు తీపి  ఇష్టమైతే  ఇలా  చేసుకుని చూడండి .
పచ్చడి  బాగా ఊరి పుల్లపడి ఉంటుంది కనుక  తీపి వేసుకుంటేనే  పచ్చడి  రుచిగా ఉంటుంది .
 వేడి వేడి అన్నంలో  మరి కాస్త నెయ్యి  వేసుకుని  తింటే  చింతపండు  పచ్చడిలా చాలా బాగుంటుంది .
వెల్లుల్లి  ఇష్టమైనవారు  పది పన్నెండు వెల్లుల్లి  రెబ్బలు  పై పొట్టు ఒలుచుకుని , మూడు స్పూనుల నూనె లో ఆవాలు , కరివేపాకు మరియు ఒలిచిన వెల్లుల్లి  రెబ్బలు తో పోపు వేయించుకుని  పచ్చడిలో  వేసుకుంటే  పచ్చడి  మరింత రుచిగా ఉంటుంది .
దోశెలలోకి , గారెలలోకి , చపాతీలలోకి  కూడా బాగుంటుంది .
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపి  మా అమ్మమ్మ గారు  తయారు చేసిన విధానము  మరియు ఫోటో  తయారుచేయు  సమయమున తీసినది 

ప్రియమైన   మిత్రులారా !
పునాస కాపు  మామిడి కాయలు  ఇప్పుడు  మార్కెట్లో  విరివిగా  వస్తున్నాయి .
ఈ  రోజు  మీకు  వంకాయ , మామిడి కాయ , పచ్చి కొబ్బరి కలిపిన రోటి పచ్చడి  గురించి  తెలియ చేస్తాను .
కావలసినవి ---
గుండ్రని  వంకాయలు  --  రెండు 
పుల్లని  పచ్చి మామిడికాయ -- ఒకటి 
పై  చెక్కు  తీసి  ముక్కలుగా  తరిగినవి  ఒక  కప్పు .
పచ్చి  కొబ్బరి కోరు  --  అర కప్పు 
కరివేపాకు  --  మూడు  రెమ్మలు
కొత్తిమీర   --   ఒక  కట్ట 
పచ్చి  మిర్చి  -   6
పసుపు  --  కొద్దిగా .
పోపు నకు  ---
ఎండు మిరపకాయలు  --  ఆరు  
ఆవాలు  ---  ఒక  స్పూను 
మినపప్పు  --  రెండు స్పూన్లు 
ఇంగువ  --  కొద్దిగా 
నూనె  ---  రెండు  స్పూన్లు 
ఉప్పు  --  తగినంత .
తయారు  చేయు  విధానము ----------------------------
ముందుగా  వంకాయలు  తడి లేకుండా  తుడుచుకుని  కాయ  పైన  కొద్దిగా  నూనె  రాసుకుని  స్టౌ  మీద  సన్నని  మంటలో  కాల్చి ,నీళ్ళ చేతితో  పై  తొక్కు  తీసుకోవాలి .
విడిగా  ప్లేటులో పెట్టుకోవాలి .
స్టౌ  మీద  బాండి  పెట్టి  రెండు  స్పూన్లు   నూనె  వేసి  నూనె  కాగాక  ఎండు మిర్చి  మినపప్పు  ఆవాలు  జీలకర్ర   ఇంగువ  మరియు కరివేపాకు  వేసి  పోపు  వేయించుకోవాలి .
పోపు  చల్లారగానే  రోటిలో  ముందుగా ఎండు మిరపకాయలు , పసుపు , ఉప్పు వేసి  పచ్చడి బండతో మెత్తగా  దంపుకోవాలి .
తర్వాత  మామిడి కాయ  ముక్కలు ,  పచ్చిమిర్చి   మరియు పచ్చి కొబ్బరి తురుము రోటిలో  వేసి పచ్చడి బండతో మరీ మెత్తగా  కాకుండా  దంపుకోవాలి .
చివరగా  స్టౌ  మీద  కాల్చి  పై  తొక్క  తొడిమ  తీసిన  వంకాయలు .  కొత్తిమీర , మిగిలిన పోపు  అంతా రోటిలో  వేసి  ఒకసారి  బండతో నూరుకోవాలి .
తర్వాత  నూరిన పచ్చడిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి .
అంతే  కరివేపాకు  , కొత్తిమీర  , మరియు  ఇంగువ  సువాసనలతో  ఘమ ఘమ లాడుతున్న  వంకాయ , మామిడి  కాయ , పచ్చి కొబ్బరి  కలిపిన   రోటి పచ్చడి  సర్వింగ్ కు  సిద్ధం.
ఈ పచ్చడి  అన్నంలోకి , దోశెల లోకి మరియు  చపాతీల లోకి  కూడా  బాగుంటుంది .
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ మేము తయారు చేయు  విధానము  మరియు ఫోటో తయారు చేయు సమయమున తీసినది.

కలగలపు రోటి పచ్చడి : 
బీరకాయ తొక్కలు వేస్ట్ చెయ్డం ఇష్టం లేక ఇలా చేసాను రుచి మాత్రం మహా బాగా ఉంది.
బీరకాయ తొక్కు, ఒక నాఅలుగు బీరకాయ ముక్కలు, వంకాయ, కేరట్ , కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి రేకులు వేసి మగ్గబెట్టుకుని , పోపు దినుసులు, యెండుమిర్చి , ఇంకో నాలుగు వెల్లుల్లి రేకులు , ఇంగువ కూడ దట్టించి తిర్గమోత పెట్టుకుని,  కాస్త ఉప్పు , పసుపు, చింతపండు బదులుగా కస్త పచ్చి చింత తొక్కు అన్నీ వేసి రొటిలొ వేసి కచ్చ పిచ్చా దంచుకోవడమే. 
యెలా ఉందీ చెప్పండి మరి

రోటిలో చుక్కకూర పచ్చడి తయారు చేసే విధానం:-
కావలసిన పదార్థములు:
చుక్కకూర -1 కట్ట, ఎండు మిరపకాయలు-15, చింతపండు ఉసిరి కాయంత, పచ్చిమిర్చి -6 కాయలు, ఉప్పు రుచికి సరిపడా, పసుపు చిటికెడు, నూనె -2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు కొద్దిగా, ఇంగువ చిటికెడు.
తయారు చేసే విధానం:
పొయ్యిమీద బాండీ పెట్టి అందులో నూనె వేసి ఎండుమిర్చి, పోపు దినుసులు వేయించుకొని అది ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మిగిలిన నూనెలో పచ్చిమిర్చి, చుక్కకూర వేసి వేయించుకోవాలి. రోటిలో ఎండుమిర్చి, చింతపండు, పోపు దినుసులు, ఉప్పు, పసుపు ఒక్కొక్కటిగా వేసి దంచుకోవాలి, తర్వాత పచ్చిమిర్చి, చుక్కకూర వేసి నూరుకోవాలి.
ఒక గిన్నెలోకి తీసుకుంటే పచ్చడి రెడీ.
ఇది గోంగూర పచ్చడి లాగా ఉంటుంది, గోంగూర పచ్చడి పడని వాళ్ళకి ఇది చక్కగా పనిచేస్తుంది.
ఇది అన్నిటిలోకీ బాగుంటుంది.
మీరూ ప్రయత్నించండి.
Co

రోటిలో దోసకాయ ముక్కల పచ్చడి తయారు చేసే విధానం:-
కావలసిన పదార్థములు:
దోసకాయ-1, టమాటోలు-2, చింతపండు ఉసిరికాయంత, పచ్చిమిర్చి-5, కొత్తిమీర-4 రెబ్బలు, ఎండుమిర్చి -10 కాయలు, పసుపు చిటికెడు.
పోపు దినుసులు:
మినప్పప్పు-1 టేబుల్ స్పూన్, శనగపప్పు-1 టేబుల్ స్పూన్, ఆవాలు పావు టీ స్పూన్, జీలకర్ర పావు టీ స్పూన్, మెంతులు పావు టీ స్పూన్, ఇంగువ చిటికెడు.
తయారు చేసే విధానం:
ముందుగా దోసకాయ ముక్కలు చిన్నగా తరుక్కోవాలి, పొయ్యిమీద  బాండీ పెట్టి ఎండుమిర్చి, పోపు దినుసులు వేసి వేయించుకొని, ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఆ బాండిలో టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి. రోటిలో   ఎండుమిర్చి, పోపు దినుసులు వేసి మెత్తగా దంచుకోవాలి, పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు, ఉప్పు ,పసుపు వేసుకుని మెత్తగా దంచుకోవాలి. తరువాత దోసకాయ ముక్కలు వేసి  కచ్చాపచ్చాగా నూరుకోవాలి.
నూరుకున్న పచ్చడి మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పచ్చడి రెడీ.
ఇది అన్నంలోకి బాగుంటుంది.
మీరు ప్రయత్నించండి.


పులిహారగోంగూర 2కట్టలువడలినతరవాత బాండీలో నూనెవేసివేయించానుఅందులోనేపదార్ధాలనువేసిరోట్లోనూరానండి
తగినంతఉప్పు
తగినంత కారం
మెంతిపిండి
పసుపు
చింతపండు
చాయమినపప్పు
జీలకర్ర
ఆవాలు
ఇంగువ
తాలింపుతో
నూనె మాత్రం ఎక్కువపడుతుంది


#మునగాకు టొమాటో పచ్చడి#
కావలసిన పదార్ధాలు 
మునగాకు 
టొమాటో 
పచిమిర్చి 
నువ్వులు 
జీలకర్ర 
ఉప్పు 
వెల్లుల్లి 
చింతపండు
Co

ఆలూరుకృష్ణప్రసాదు .
ఆవతో  రోటి పెరుగు పచ్చడి.
లోగడ  పాత తరం పెద్ద వాళ్ళు  గారెలతో  అల్లం  పచ్చడితో పాటుగా  పెరుగుతో  ఆవ పచ్చడి కూడా చేసే వారు.
కొంతమందికి  ఈ ఆవతో పెరుగు పచ్చడి  కేవలం  పితృ కార్యముల  సమయముల లోనే  చేస్తారనే  అభిప్రాయం  ఉంది.
కాని  ఈ ఆవతో పెరుగు పచ్చడి  ఎప్పుడైనా  చేసుకొనవచ్చును .
బహుశ  గారెలు  శరీరానికి  మందం చేస్తాయనే  ఉద్దేశ్యంతో లోగడ  మన పెద్ద వారు  ఇలా  ఆవతో పెరుగు పచ్చడి మరియు అల్లం  పచ్చడి  వంటివి  గారెలతో పాటుగా  చేసే వారు.
ఈ ఆవ పచ్చడి  మరియు  అల్లం  పచ్చడి మనం  తీసుకుంటే  మనకు జీర్ణశక్తి  బాగా ఉంటుందని పెద్దలు ఈ రెండు  పచ్చళ్ళూ చేసే వారు.
గారెలతోనే  కాకుండా  విడిగా  పెరుగు పచ్చడి  మాదిరిగా  ఈ ఆవ పెరుగు పచ్చడి భోజనము  లోకి  తీసుకొనవచ్చును.
ఎందుకంటే  ఆ తరం వారు  పనస పొట్టు కూర , అరటి కాయ ముద్ద కూర , కంద ముద్ద కూర  మరియు  పెసర పప్పుతో తోటకూర  పులుసు కూర వంటి వాటిల్లో  తప్ఫని సరిగా  ఆవపెట్టి  కూరలు చేసేవారు.
వారు చేసిన రుచి  మనకు  రాలేక పోయినా , ఆ తరం వంటలు  మనం మర్చి పోకూడదు కదా. ప్రతి వారు ఆ తరం వారి ప్రాచీన వంటలను  మర్చిపోకుండా తప్పకుండా   చేసుకోవాలి. కారణం వారు చేసిన ప్రతి వంటలలో కూడా  ఆరోగ్యపరమైన  ప్రయోజనం  ఉంటుంది .
ఇక ఆవ పెరుగు పచ్చడి తయారీ విధానము గురించి తెలుసుకుందాము.
ముందుగా  ఆవ ఎలా  తయారు చేసుకోవాలి ?
ముందుగా  రోటిలో  లో  స్పూను  ఆవాలు వేసుకుని పచ్చడి  బండతో మెత్తగా నూరుకోవాలి.  తర్వాత అందులో పావు స్పూను  పసుపు  మరియు  రెండు  ఎండుమిర్చి  రోటిలో  వేసుకుని  మెత్తగా  పచ్చడి బండతో నూరుకోవాలి.  తర్వాత  అందులో రెండు పచ్చిమిర్చి  మరియు  చాలా చాలా కొంచెం  నీళ్ళు పోసి మెత్తగా బండతో నూరు కోవాలి. ఆవ వేరే ప్లేటులోకి తీసుకోవాలి .
ఇప్పుడు  మనకు  ఆవ  సిద్ధం అయ్యింది.
ఇప్పుడు  ఒక  గిన్నెలో ఒక కప్పున్నర  గట్టి  పెరుగు  తీసుకోవాలి .
అందులో  తగినంత  ఉప్పు మరియు  తయారుచేసి  సిద్ధంగా  ఉన్న  ఆవ  వేసుకుని  గరిటెతో  బాగా  కలుపు కోవాలి.
తర్వాత  స్టౌ మీద పోపు గరిటె పెట్టి  రెండు స్పూన్లు  నెయ్యి  వేసుకుని  నెయ్యి  బాగా కాగగానే  రెండు ఎండు మిర్చి  ముక్కలుగా చేసుకొని , అర స్పూను ఆవాలు  మరియు  రెండు రెమ్మలు కరివేపాకు పోపు వేసుకుని , ఆ పోపును   ఆవ పచ్చడి లో  కలుపుకోవాలి.  అప్పుడు  ఈ ఆవ పచ్చడి మరింత రుచిగా  ఉంటుంది .
 పోపు  వేసిన  తర్వాత పచ్చడి  పైన సన్నగా  తరిగిన  కొత్తిమీరను వేసుకోవాలి .
అంతే  ఎంతో  రుచిగా  ఉండే ఆవతో  పెరుగు పచ్చడి  సర్వింగ్  కు  సిద్ధం.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము తయారుచేయు  విధానము   మరియు  ఫోటో  తయారుచేయు  సమయమున తీసినది.

రోటిలో కరివేపాకు పచ్చడి తయారు చేసే విధానం:-
కావలసిన పదార్థములు:
కరివేపాకు-1 కప్పు, ఎండుమిర్చి -20 కాయలు, పచ్చిశనగపప్పు -1 టేబుల్ స్పూన్, మినప్పప్పు -1 టేబుల్ స్పూన్, ఆవాలు పావు టీ స్పూన్, జీలకర్ర పావు టీ స్పూన్, మెంతులు పావు టీ స్పూన్, చింతపండు ఉసిరికాయంత, బెల్లం -1చిన్నది, ఉప్పు రుచికి సరిపడా, పసుపు చిటికెడు.
తయారు చేసే విధానం:
బాండీలో ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించుకోవాలి, కరివేపాకు కూడా అందులో వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న వన్నీ రోటిలో వేసి దంచుకోవాలి. చింతపండు బెల్లం ఉప్పు వేసి దంచుకోవాలి, కొద్దికొద్దిగా నీరు పోసుకుంటూ బండతో నూరుకోవాలి,మరీ మెత్తగా నూరి కోకూడదు.
అది ఒక గిన్నెలోకి తీసుకుంటే పచ్చడి రెడీ.
ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.  ఇది అన్నంలోకి,ఇడ్లీలోకి,దోసెల్లోకి బాగుంటుంది.
మీరు ప్రయత్నించండి.
బెండకాయ  పచ్చడి .
కూరకు  అంతగా పనికి రాని  ఓ మాదిరి  బెండ కాయలను  ఇలా  పచ్చడి  చేసుకోండి .
మరీ  ముదురు కాయలు  పచ్చడికి  పనికిరావు.
కావలసినవి.
బెండకాయలు  --  250 గ్రాములు.
ఎండుమిరపకాయలు  --  ఎనిమిది 
నూనె  --  నాలుగు స్పూన్లు 
మినపప్పు  --  స్పూనున్నర 
ఆవాలు  --  అర  స్పూను 
ఇంగువ  --  కొద్దిగా   
కొత్తిమీర   --  ఒక కట్ట 
ఉప్పు  --  తగినంత 
పసుపు  --  కొద్దిగా 
చింతపండు  -- మూడు  రెబ్బలు . 
తయారీ  విధానము .
ముందుగా  బెండకాయలు  ముచికలను తీసి కాస్త పెద్ద ముక్కలుగా తరుగు కొవాలి .
బాండీలో  రెండు స్పూన్లు  నూనె వేసి  నూనె  బాగా  కాగగానే  ఈ బెండకాయ ముక్కలను  వేసి , ముక్కలపై  కొద్దిగా  పసుపు వేసి  ముక్కల పైన  మూత పెట్టి మగ్గనిచ్చి  తర్వాత  వేరే ప్లేటులో  తీసుకోవాలి .
తర్వాత  తిరిగి  స్టౌ  మీద  బాండీ పెట్టి  మరో  రెండు  స్పూన్లు  నూనె వేసి , నూనె బాగా కాగగానే  వరుసగా  ఎండుమిరపకాయలు , మినపప్పు , ఆవాలు మరియు  ఇంగువ  వేసి  పోపు  వేయించుకోవాలి .
తర్వాత  రోటిలో  వేగిన ఎండుమిరపకాయలు  చింతపండు రెబ్బలు మరియు సరిపడా ఉప్పు వేసి పచ్చడి బండతో  మెత్తగా  దంపు కోవాలి .
తర్వాత  వేయించిన  బెండ కాయ ముక్కలు ,  మిగిలిన  పోపు మరియు కొత్తిమీర   కూడా  వేసి బండతో మెత్తగా  నూరుకుని  వేరే  గిన్నెలో  తీసుకోవాలి .
అంతే  ఎంతో రుచిగా  ఉండే  బెండకాయ  పచ్చడి   భోజనము లోకి సర్వింగ్ కు సిద్ధం.
ఈ పచ్చడిలో  పచ్చి మిరపకాయలు  మేము వేయలేదు.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము  తయారుచేయు  విధానము  మరియు  ఫోటో  తయారు చేయు సమయమున  తీసినది.
ఆలూరుకృష్ణప్రసాదు .
వెలక్కాయ  రోటి పచ్చడి.
ఇప్పుడిప్పుడే  మార్కెట్లోకి  వెలగ కాయలు  వస్తున్నాయి.
చాలామందికి  ఈ  వెలక్కాయ పచ్చడంటే  చాలా ఇష్టం . కొంతమంది  వెలక్కాయ పండాక   పచ్చడి  చేసుకుంటారు. కొంతమందికి   ఈ పండు వాసన ఇష్ట పడరు. కాయ వాసన రాకుండా, కాయ తయారవ్వగానే  చేసుకుంటారు. కొంతమంది  ఈ పచ్చడిలో  బెల్లం  వేసుకుంటారు. ఇక ఈ వెలగ కాయ పచ్చడి తయారీ విధానము .
తయారీ  విధానము .
 ముందుగా  ఒక వెలక్కాయ తీసుకుని , కాయను   కొంచెం   బీటు  ఇచ్చేటట్లుగా  కొట్టు  కోవాలి . 
రెండు  ముక్కలుగా   చేయకూడదు.  
తయారైన   వెలగపండునే  తీసుకోవాలి .
తయారుకాని  వెలక్కాయ పచ్చడి చేస్తే పచ్చడి  వగరుగా ఉంటుంది .
బాగా  తయారైన  పండు  పచ్చడి  చేస్తే పచ్చడి  మగ్గిన  వాసన వస్తుంది. అలా  కాయ పండినా  వాసన ఇష్టమైన వారికి 
పచ్చడికి  బాగానే  ఉంటుంది .
బాగా తయారై పండిన వెలగపండుతో అయితే  కొద్దిగా  బెల్లం వేసి చేసుకుంటారు .
పండని   వెలక్కాయకు అయితే   బెల్లం  వేయనవసరం లేదు .
ఇప్పుడు  స్టౌ  వెలిగించి  సెగ  సిమ్ లో పెట్టి  కాయను  అన్ని  వైపులా  కాల్చు  కోవాలి .
బీటివ్వకుండా  డైరెక్టుగా  స్టౌ  మీద  పెడితే  కాయ  పగిలి పోయే  ప్రమాదం  ఉంది . మాకు లోగడ అలా జరిగింది .
కాయ చల్లారగానే  రెండు  ముక్కలు గా  చేసుకుని   స్పూను తో  అందులోని  గుజ్జునంతా  తీసుకుని  కాస్త పసుపు  గుజ్జు  పై  వేసి   వేరే  పళ్ళెంలో విడిగా  పెట్టు కోవాలి .
ఇప్పుడు  స్టౌ  వెలిగించి బాండి పెట్టి   మూడు  స్పూన్లు   నూనె వేసి , నూనె  బాగా  కాగాక  నాలుగు  ఎండు మిరపకాయలు  , పావు స్పూనులో సగం  మెంతులు ,  స్పూను  మినపప్పు  , పావు స్పూను  ఆవాలు ,  కొంచెం   ఇంగువ  వేసి  పోపు  వేయించుకోవాలి .
పోపు  చల్లారగానే  ఈ పోపు సామగ్రి   మరియు  తగినంత  ఉప్పును  రోటిలో వేసి , పచ్చడి  బండతో  మెత్తగా  దంపు కోవాలి.  తదుపరి అదే  రోటిలో  ఐదు పచ్చిమిరపకాయలు  వేసుకుని  పచ్చడి బండతో  దంపుకోవాలి .
ఆ తర్వాత  వెలగపండు  గుజ్జు  , మరి  కాస్త ఎక్కువగా   కొత్తిమీర   వేసి  మెత్తగా   బండతో  నూరుకుని ,  పచ్చడిని  వేరే  బౌల్  లోకి  తీసుకోవాలి .
తీపి ఇష్టమైనవారు  పచ్చడిని  నూరే  సమయంలో  కొద్దిగా  బెల్లం  వేసుకోండి .
అంతే  అందరూ  ఎంతగానో   ఇష్టపడే  వెలక్కాయ  పచ్చడి  భోజనము లోకి  సర్వింగ్  కు  సిద్ధం.
వినాయకచవితి రోజున అందరూ  తప్పనిసరిగా  పాలవెల్లికి  వెలక్కాయలు  కడతారు. మరుసటి రోజున స్వామి వారికి  ఉద్వాసన చెప్పినప్పుడు , ఈ వెలగ కాయలతో  పచ్చడి చేసుకొనవచ్చును . వెలక్కాయలు  వృధా చేయకుండా ఈ విధముగా  వెలక్కాయ పచ్చడి  చేసుకొనండి.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము తయారు చేయు విధానము  మరియు ఫోటో తయారు చేయు సమయమున తీసినది.


🌹🌻🌹🌻వాక్కాయ పచ్చడి🌻🌹🌻🌹
               🌻 కావలసిన పదార్థాలు🌻
వాక్కాయలు - పావుకిలో, 
పల్లీలు - 100 గ్రాములు, 
ఎండు మిరపకాయలు - 10, 
వెల్లుల్లి రేకలు - ఆరు, 
కొత్తిమీర కట్ట - ఒకటి, 
కరివేపాకు - ఒక రెబ్బ,
జీలకర్ర - ఒక టీ స్పూను,
ఉప్పు - తగినంత, 
నూనె - సరిపడా,
ఇంగువ - చిటికెడు, 
తాలింపు కోసం- పోపు దినుసులు.
            🌹 తయారుచేయు విధానం🌹
వాక్కాయల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టౌ మీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి బాగా వేడెక్కాక జీలకర్ర, వెల్లుల్లి రేకలు, కరివేపాకు, పల్లీలు, ఎండుమిరపకాయలు వేసి వేగించుకుని తీసెయ్యాలి. తరువాత మళ్లీ కొద్దిగా నూనె పోసి వేడెక్కాక వాక్కాయలు వేసి వేగించాలి. బాగా వేగాక కొత్తిమీర తురుము, ఉప్పు వేసి బాగా కలిపి దించేయాలి. చల్లారాక వీటన్నింటినీ రోట్లో వేసి మరీ మెత్తగా కాకుండా నూరుకోడం గాని రుబ్బుకోవడం గాని చేసుకొని తరువాత పచ్చడి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు లోనే కొద్దిగా ఇంగువ వేసుకోవాలి.వేడివేడిఅన్నంలోనెయ్యివేసుకుని ఈ పచ్చడిని కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.
   - సేకరణ

ఆలూరుకృష్ణప్రసాదు .
ప్రియమైన   మిత్రులారా !
ఇప్పుడు  పునాసకాపు  మామిడి కాయలు మార్కెట్లో  విరివిగా  వస్తున్నాయి. 
ఈ  రోజు  మీకు  మామిడి కాయ , పచ్చి కొబ్బరితో రోటి పచ్చడి  గురించి  తెలియ చేస్తాను .
కావలసినవి ---
పుల్లని  పచ్చి మామిడికాయ -- ఒకటి
పై  చెక్కు  తీసి  ముక్కలుగా  తరుగు కోవాలి.
పచ్చి  కొబ్బరి చిప్ప --  ఒకటి .
చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి.
కరివేపాకు  --  మూడు  రెమ్మలు
కొత్తిమీర   --   ఒక  కట్ట 
పచ్చి  మిర్చి  -   6
పసుపు  --  కొద్దిగా .
పోపునకు  ---
ఎండు మిరపకాయలు  --  ఆరు  
ఆవాలు  ---  ఒక  స్పూను 
మెంతులు   -- పావు స్పూను
మినపప్పు  --  స్పూనున్నర  
ఇంగువ  --  కొద్దిగా 
నూనె  ---  మూడు  స్పూన్లు 
ఉప్పు  --  తగినంత .
తయారు  చేయు  విధానము --
ముందుగా స్టౌ  మీద  బాండి  పెట్టి  మూడు  స్పూన్లు   నూనె  వేసి  నూనె బాగా కాగాక  ముందుగా  మెంతులు వేసుకోవాలి. మెంతులు వేగగానే  తర్వాత వరుసగా ఎండు మిర్చి ,  మినపప్పు , ఆవాలు ,  ఇంగువ మరియు  కరివేపాకు  వేసి  పోపు  వేయించుకోవాలి .
పోపు  చల్లారగానే  రోటిలో ముందుగా   ఎండు మిరపకాయలు , పసుపు , ఉప్పు వేసి  పచ్చడి బండతో దంపుకోవాలి .
తర్వాత  మామిడి కాయ  ముక్కలు     పచ్చి కొబ్బరిముక్కలు మరియు పచ్చిమిర్చి  రోటిలో వేసి బండతో   మరి  మెత్తగా  కాకుండా  కొంచెం  కచ్చాపచ్చాగా  తొక్కు కోవాలి.
చివరగా   కొత్తిమీర , మిగిలిన పోపు  అంతా  వేసి  ఒకసారి పచ్చడి  బండతో  నూరుకుని  వేరే  గిన్నెలోకి  తీసుకోవాలి .
అంతే  కరివేపాకు  , కొత్తిమీర  , మరియు  ఇంగువ  సువాసనలతో  ఘమ ఘమ లాడుతున్న   మామిడి  కాయ ముక్కలు  , పచ్చి కొబ్బరి ముక్కలు కలిపిన  పచ్చడి  సర్వింగ్ కు  సిద్ధం.
ఈ పచ్చడి  అన్నంలోకి ,  దోశెలలోకి మరియు  చపాతీల లోకి  కూడా  బాగుంటుంది .
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము తయారుచేయు  విధానము  మరియు ఫోటో  తయారుచేయు  సమయమున తీసినది.

అరటి దూట పచ్చడి 2రకాలు.
ముందుగా అరటి దూటని చక్రాలుగా తరగాలి. తరిగిన చక్రాలను నీటిలో చిటికెడు పసుపు, చెంచా మజ్జిగ ,కొద్దిగా ఉప్పు వేసుకున్న నీటిలో వేసుకోవాలి.
ఇప్పుడు చక్రలను3  చొప్పున తీసుకుని చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
కొంచెం చింతపండు నానబెట్టి 3 చెంచాలు గట్టి పులుసు తీసుకోవాలి.
పోపుదినుసులు 1చెంచా ఆవాలు, అరచెంచా మెంతులు 4 ఎండుమిర్చి ముక్కలు దోరగా తగినంత నూనెలో వేయించుకోవాలి.
2లేక 3 పచ్చిమిర్చి ముక్కలుగా చేసుకోవాలి.
రోలులో ముందుగా పోపు దంచుకోవాలి, మద్యలో పచ్చిమిర్చముక్కలు కూడా వేసుకుని మెత్తగా కాకుండా బరకగా దంచు కుంటూ దూట ముక్కలను ,చింతపండు గుజ్జు, తగినంత ఉప్పు వేసుకుని ముక్కలు నలగకుండా బాగా కలిసినట్లుగా దంచుకుని గిన్నెలోకి తీసుకోండి.
ఇష్టమైన వారు పోపులో ఇంగువ వేసుకోవచ్చు లేదా 2చెంచాలు ఆవాలు నూరి కలుపుకోవచ్చును.
పెరుగు పచ్చడి.
ముక్కలు తరగడం వరకు అదే విదానం.
ఒక కప్పు పులుపులేని పెరుగు తీసుకుని తగినృత ఉప్పు, చిటికెడు పసుపు కలుపుకోండి తరిగిన దూట ముక్కలు కలపండి.
పోపు దినుసులు.....1 చెంచా ఆవాలు, అరచెంచా జీలకర్ర,4 ఎండుమిర్చి ముక్కలు తగినంత నేయి వేసుకుని దోరగా వేయించి పెరుగు లో కలుపు కోవాలి.
ఇష్టంఉన్న వారు 2చెంచాలు ఆవాలు నూరి కలుపు కోవచ్చు లేదా పోపులో ఇంగువ వేసుకోవచ్చు.
2 పచ్చళ్ళు అన్నంలోకి చాలా బాగుంటాయి.
ఈ 2 విధానాలు నా భార్య మాణిక్యకుమారి చేస్తూ చెప్పగా వ్రాసినాను.
Comments



రోటిలో చింతచిగురు పచ్చడి తయారు చేసే విధానం:-
కావలిసిన పదార్థములు:
చింత చిగురు-1కప్పు, ఎండుమిర్చి -10 కాయలు, పోపు దినుసులు కొద్దిగా, పసుపు చిటికెడు,ఇంగువ చిటికెడు, ఉల్లిపాయ-1, పచ్చిమిర్చి -2, నూనె రెండు టేబుల్ స్పూన్లు.
తయారు చేసే విధానం:
ముందుగా బాండీలో నూనె వేసి ఎండుమిర్చి,పోపు దినుసులు,ఇంగువ వేసి వేయించుకోవాలి, వేయించిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత బాండీలో చింత చిగురు వేయించాలి. రోలు తీసుకుని ఒక్కొక్కటిగా వేసుకుని దంచుకోవాలి, ఆకు నలగకపోతే కొద్దిగా కొద్దిగా నీరు పోసుకుంటూ నూరుకోవాలి.
ఒక గిన్నెలోకి తీసుకుంటే పచ్చడి రెడీ.
ఇది భోజనంలోకి, చపాతీలోకి బాగుంటుంది.



ఆలూరుకృష్ణప్రసాదు .
కందిపప్పు  రోటి  పచ్చడి .
(  రెగ్యులర్ గా చేసుకునే పచ్చడి కొద్దిగా  మార్చాను . )
కావలసినవి .
కందిపప్పు  --  ఒక కప్పు
ఎండుమిరపకాయలు  --  పది 
జీలకర్ర  --  స్పూనున్నర 
చింతపండు  --   ఉసిరి కాయంత. కొద్ది  నీళ్ళలో  తడిపి  ఉంచుకోవాలి.
ఉప్పు  --  తగినంత 
ఇంగువ -- కొద్దిగా 
పోపునకు .
ఎండుమిర్చి  --  మూడు .
ముక్కలుగా  చేసుకోవాలి 
మినపప్పు  --  స్పూను 
ఆవాలు  --  అర  స్పూను 
కరివేపాకు  --  రెండు  రెమ్మలు
నెయ్యి  --  నాలుగు  స్పూన్లు 
తయారీ విధానము .
ముందుగా  స్టౌ  మీద బాండీ   పెట్టి  రెండు స్పూన్లు  నెయ్యి వేసుకుని ,  నెయ్యి  బాగా  కాగగానే  కందిపప్పు , ఎండుమిర్చి , జీలకర్ర మరియు ఇంగువ వేసి  కందిపప్పు  కమ్మని  వేగిన వాసన వచ్చే వరకు  వేయించుకోవాలి. 
పోపు  చల్లారగానే   ముందుగా  రోటి లో  ఎండుమిరపకాయలు , చింతపండు మరియు తగినంత ఉప్పు వేసి  మెత్తగా  పచ్చడి బండతో  దంపుకోవాలి .
తర్వాత  వేగిన కందిపప్పు కూడా రోటిలో  వేసుకుని  , కొద్ది కొద్దిగా  నీళ్ళు  చిలకరించు కుంటూ   పొత్రముతో  మెత్తగా  రుబ్బు కోవాలి.
తర్వాత రుబ్బిన  పచ్చడి వేరే గిన్నెలో కి తీసుకోవాలి .
ఇప్పుడు  స్టౌ మీద బాండీ పెట్టి  మిగిలిన రెండు స్పూన్లు  నెయ్యి వేసి  నెయ్యి బాగా కాగగానే  ఎండుమిర్చి  ముక్కలు , మినపప్పు , ఆవాలు మరియు కరివేపాకు  వేసి  పైన పోపు  పెట్టుకోవాలి .
అంతే .   భోజనము  లోకి  ఎంతో రుచిగా  ఉండే  కందిపప్పు రోటి పచ్చడి  సర్వింగ్  కు సిద్ధం.
ఆలూరుకృష్ణప్రసాదు .

సంబంధించిన  రెసిపీ  మేము  తయారుచేయు  విధానము  మరియు  ఫోటో  తయారుచేయు  సమయమున  తీసినది.

పంజలి ప్రభ - అంతర్జాల పత్రిక 

1. కందిపప్పు  రోటి  పచ్చడి .
(  రెగ్యులర్ గా చేసుకునే పచ్చడి కొద్దిగా  మార్చాను . )

కావలసినవి .
కందిపప్పు  --  ఒక కప్పు
ఎండుమిరపకాయలు  --  పది 
జీలకర్ర  --  స్పూనున్నర 
చింతపండు  --   ఉసిరి కాయంత. కొద్ది  నీళ్ళలో  తడిపి  ఉంచుకోవాలి.
ఉప్పు  --  తగినంత 
చిన్న ఉల్లి .. కొంత 
ఇంగువ -- కొద్దిగా 

పోపునకు .
ఎండుమిర్చి  --  మూడు  ముక్కలుగా  చేసుకోవాలి 
మినపప్పు  --  స్పూను 
ఆవాలు  --  అర  స్పూను 
కరివేపాకు  --  రెండు  రెమ్మలు
నెయ్యి  --  నాలుగు  స్పూన్లు 

తయారీ విధానము .
ముందుగా  స్టౌ  మీద బాండీ   పెట్టి  రెండు స్పూన్లు  నెయ్యి వేసుకుని ,  నెయ్యి  బాగా  కాగగానే  కందిపప్పు , ఎండుమిర్చి , జీలకర్ర మరియు ఇంగువ వేసి  కందిపప్పు  కమ్మని  వేగిన వాసన వచ్చే వరకు  వేయించుకోవాలి. 

పోపు  చల్లారగానే   ముందుగా  రోటి లో  ఎండుమిరపకాయలు , చింతపండు మరియు తగినంత ఉప్పు వేసి  మెత్తగా  పచ్చడి బండతో  దంపుకోవాలి .
తర్వాత  వేగిన కందిపప్పు కూడా రోటిలో  వేసుకుని  , కొద్ది కొద్దిగా  నీళ్ళు  చిలకరించు కుంటూ   పొత్రముతో  మెత్తగా  రుబ్బు కోవాలి. తర్వాత రుబ్బిన  పచ్చడి వేరే గిన్నెలో కి తీసుకోవాలి .
ఇప్పుడు  స్టౌ మీద బాండీ పెట్టి  మిగిలిన రెండు స్పూన్లు  నెయ్యి వేసి  నెయ్యి బాగా కాగగానే  ఎండుమిర్చి  ముక్కలు , మినపప్పు , ఆవాలు మరియు కరివేపాకు  వేసి  పైన పోపు  పెట్టుకోవాలి .
అంతే .   భోజనము  లోకి  ఎంతో రుచిగా  ఉండే  కందిపప్పు రోటి పచ్చడి  సర్వింగ్  కు సిద్ధం.







శ్రీ రవి సప్తతి రహస్యనామ స్తోత్రం  ...  ....  9
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
🕉🌞🌏🌙🌟🚩

1) హంసో భానుః సహస్రాంశుః తపనస్తాపనో రవిః |


వికర్తనో వివస్వాంశ్చ విశ్వకర్మా విభావసుః ||



2) విశ్వరూపో విశ్వకర్తా మార్తాండో మిహిరోఽంశుమాన్ |


ఆదిత్యశ్చోష్ణగుః సూర్యోఽర్యమా బ్రధ్నో దివాకరః ||



3) ద్వాదశాత్మా సప్తహయో భాస్కరో హస్కరో ఖగః |


సూరః ప్రభాకరః శ్రీమాన్ లోకచక్షుః గ్రహేశ్వరః ||



4) త్రిలోకేశో లోకసాక్షీ తమోఽరిః శాశ్వతః శుచిః |


గభస్తిహస్తః తీవ్రాంశుః తరణిః సుమహోరణిః ||



5) ద్యుమణిః హరిదశ్వోఽర్కో భానుమాన్ భయనాశనః |


ఛందోశ్వో వేదవేద్యశ్చ భాస్వాన్ పూషా వృషాకపిః ||



6) ఏకచక్రరథో మిత్రో మందేహారిః తమిస్రహా |


దైత్యహా పాపహర్తా చ ధర్మో ధర్మప్రకాశకః ||



7) దోషఘ్నః చిత్రభానుశ్చ కలిఘ్నః తార్క్ష్యవాహనః |


దిక్పతిః పద్మనీనాథః కుశేశయకరో హరిః |


ఘర్మరశ్మిః దుర్నిరీక్ష్యః చండాంశుః కశ్యపాత్మజః ||



ఇతి శ్రీ రవి సప్తతి రహస్యనామ స్తోత్రం ||



🕉🌞🌏🌙🌟🚩

అమృత సంజీవన ధన్వంతరి స్తోత్రం ... 8 

🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥

🕉🌞🌏🌙🌟🚩

1) మృత్యుర్దూరాత్పలాయతే ||


2) అసాధ్యాః కష్టసాధ్యాశ్చ మహారోగా భయంకరాః |


శీఘ్రం నశ్యంతి పఠనాదస్యాయుశ్చ ప్రవర్ధతే ||


3) శాకినీ డాకినీ దోషాః కుదృష్టిర్గ్రహ శతృజాః |

ప్రేత వేతాళ యక్షోత్తా బాధా నశ్యంతి చాఽఖిలాః ||


4)దురితాని సమస్తాని నానా జన్మోద్భవాని చ |

సంసర్గజ వికారాణి వినీయంతేఽస్య పాఠతః ||


5) సర్వోపద్రవ నాశాయ సర్వబాధా ప్రశాంతయే |

ఆయుః ప్రవర్ధయే చైతత్ స్తోత్రం పరమమద్భుతమ్ ||


6) బాలగ్రహాభి భూతానాం బాలానాం సుఖదాయకమ్ |

సర్వారిష్టహరం చైతద్బలపుష్టికరం పరమ్ ||


7) బాలానాం జీవనాయైతత్ స్తోత్రం దివ్యం సుధోపమమ్ |

మృతవత్సత్వహరణం చిరంజీవిత్వ కారకమ్ ||


8) మహారోగాభి భూతానాం భయ వ్యాకులితాత్మనామ్ |

సర్వాధి వ్యాధి హరణం భయఘ్నమమృతోపమమ్ ||


9) అల్పమృత్యు శ్చాపమృత్యుః పాఠాదస్యః ప్రణశ్యతి |

జలాఽగ్ని విష శస్త్రాది న హి శృంగి భయం తథా ||


10) గర్భరక్షాకరం స్త్రీణాం బాలానాం జీవనప్రదమ్ |

మహారోగహరం నౄణామల్పమృత్యుహరం పదమ్ |


11) బాలా వృద్ధాశ్చదరుణా నరా నార్యశ్చ దుఃఖితాః |

భవంతి సుఖినః పాఠాదస్యలోకే చిరాయుషః ||


12) అస్మాత్పర తరం నాస్తి జీవనోపాయ కేహి కః |

తస్మాత్సర్వప్రయత్నేన పాఠమస్య సమాచరేత్ ||


13) మయుతా వృత్తికం వా చ సహస్రావృత్తికం తథా |

వదర్థం వా తదర్థం వా పఠేదేతచ్చ భక్తితః ||


14) కలశే విష్ణుమారాధ్య దీపం ప్రజ్వాల్య యత్నతః |

సాయం ప్రాతశ్చ విధివత్ స్తోత్రమే తత్పఠేత్సుధీః ||


15) సర్పిషా హవిషా వాఽభి సమ్యాగేనాఽథ భక్తితః |

దశాంశ మానదో హోమం కుర్యాత్సర్వార్థ సిద్ధయే ||

ॐॐॐॐॐॐॐ

స్తోత్రమ్ :--

ॐॐॐॐॐॐॐ


శ్రీ దత్తాష్టకము  ...  ... ... 7
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
🕉🌞🌏🌙🌟🚩

(1)గురుమూర్తిం చిదాకాశం సచ్చిదానంద విగ్రహం |

నిర్వికల్పం నిరాబాధం దత్తమానంద మాశ్రయే ||


(2)యోగాతీతం గుణాతీతం సర్వరక్షాకరం విభుం |

సర్వదుఃఖహరం దేవం దత్తమానంద మాశ్రయే ||


(3)అవధూతం సదాధ్యానం ఔదుంబర సుశోభితం |

అనఘాప్రియా విభుం దేవం దత్తమానంద మాశ్రయే ||


(4)నిరాకారం నిరాభాసం బ్రహ్మవిష్ణు శివాత్మకం |

నిర్గుణం నిష్కళం శాంతం దత్తమానంద మాశ్రయే ||


(5)అనసూయా సుతం దేవం అత్రివంశ కులోద్భవం |

దిగంబరం మహాతేజం దత్తమానంద మాశ్రయే ||


(6)సహ్యాద్రివాసినం దత్తం ఆత్మజ్ఞాన ప్రదాయకం |

అఖండమండలాకారం దత్తమానంద మాశ్రయే ||


(7)పంచయజ్ఞప్రియం దేవం పంచరూప సుశోభితం |

గురుపరంపరం వందే దత్తమానంద మాశ్రయే ||


(8)దత్తమానందాష్టకం యః పఠేత్ సర్వవిద్యా జయం లభేత్ |

దత్తానుగ్రహఫలం ప్రాప్తం దత్తమానంద మాశ్రయే ||


ఫలశ్రుతి:–

ఏకకాలం ద్వికాలం వా త్రికాలం యః పఠేన్నరః!

సర్వసిద్ధిమవాప్నోతి శ్రీదత్తశ్శరణం మమ ||


శ్రీ దత్తాష్టకమును పఠించిన ఎడల సర్వ ఆరోగ్య సిధ్ధి,సర్వ కార్యములు నెరవేరును.

🕉🌞🌏🌙🌟🚩

శ్రీ గణ నాయకాష్టకమ్  (6) 

🕉🌞🌏🌙🌟🚩
ఓం శ్రీ రామ్ 🔥ఓంశ్రీమాత్రే నమః🔥
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక  
🕉🌞🌏🌙🌟🚩

1)ఏక దంతం మహాకాయం - తప్త కాంచనసన్నిభమ్!!

లంబోదరం విశాలాక్షం - వందేహం గణనాయకమ్ !!


2)మౌంజీకృష్ణాజిన ధరం - నాగ యజ్ఞో పవీతినమ్ !!

బాలేందు శకలం మౌళం- వందేహం గణనాయకమ్ !! 


3)చిత్ర రత్నవిచిత్రాంగం - చిత్రమాలా విభూషితం!!

కామరూపధరం దేవం -వందేహం గణనాయకమ్ !!

4)గజవక్త్రం సురశ్రేష్టం - కర్ణ చామర భూషితమ్!!


పాశాంకుశధరం దేవం - వందేహం గణనాయకమ్ !! 


5)మూషకోత్తమ మారుహ్య -దేవాసుర మహాహవే!!

యోద్దుకామం మహావీర్యం - వందేహం గణనాయకమ్ !!  

6)యక్ష కిన్నెర గంధర్వ -సిద్దవిద్యా ధరైస్సదా!!


స్తూయమానం మహాబాహుం -వందేహం గణనాయకమ్ !!


7)అంబికా హృదయానందం - మాతృభిః పరివేష్టితం !!

భక్తి ప్రియం మదోన్మత్తం - వందేహం గణనాయకమ్ !!


8)సర్వవిఘ్న హరం దేవం -సర్వవిఘ్న వివర్జితం!!

సర్వసిద్ది ప్రదాతారం - వందేహం గణనాయకమ్ !!


9)గణాష్టకం మిదం పుణ్యం - యః పఠే త్సతతం నరః !!

సిద్ద్యంతి సర్వకార్యాణి -విద్యావాన్ ధనవాన్ భవత్ !!

!!! ఇతి శ్రీ గణనాయకాష్టకమ్ !!!

🕉🌞🌎🌙🌟🚩


సేకరణ  ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక (5)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   
శ్రీ యంత్రోధారక హనుమత్ (ప్రాణదేవర) స్తోత్రం
🕉🌞🌏🌙🌟🚩
ఓం శ్రీ  రామ్ 🔥ఓంశ్రీమాత్రే నమః🔥
🕉🌞🌏🌙🌟🚩

1) నమామి దూతం రామస్య సుఖదం చ సురద్రుమమ్ |

శ్రీ మారుతాత్మ సంభూతం విద్యుత్కాంచన సన్నిభమ్ ||


2) పీనవృత్తం మహాబాహుం సర్వశత్రునివారణమ్ |

రామప్రియతమం దేవం భక్తాభీష్టప్రదాయకమ్ ||


3) నానారత్న సమాయుక్త-కుండలాదివిరాజితమ్ |

ద్వాత్రింశల్లక్షణోపేతం స్వర్ణపీఠ విరాజితమ్ || 


4) త్రింశత్కోటి బీజసంయుక్తం ద్వాదశావర్తి ప్రతిష్ఠితమ్ |

పద్మాసనస్థితం దేవం షట్కోణ మండలమధ్యగమ్ ||


5) చతుర్భుజం మహాకాయం సర్వవైష్ణవశేఖరమ్ |

గదాఽభయకరం హస్తౌ హృదిస్థో సుకృతాంజలిమ్ ||


6) హంసమంత్ర ప్రవక్తారం సర్వజీవ నియామకమ్ |

ప్రభంజనశబ్ద వాచ్యేణ సర్వదుర్మత భంజకమ్ ||


7) సర్వదాఽభీష్ట దాతారం సతాం వై దృఢమహవే |

అంజనాగర్భ సంభూతం సర్వశాస్త్ర విశారదమ్ ||


8) కపీనాం ప్రాణదాతారం సీతాన్వేషణ తత్పరమ్ |

అక్షాదిప్రాణహంతారం లంకాదహన తత్పరమ్ ||


9) లక్ష్మణప్రాణ దాతారం సర్వ వానరయూథపమ్ |

కింకరాః శర్వదేవాద్యాః జానకీనాథస్య కింకరమ్ ||


10) వాసినం చక్రతీర్థస్య దక్షిణస్థ గిరౌ సదా |

తుంగాంభోది తరంగస్య వాతేన పరిశోభితే ||


12) నానాదేశగతైః సద్భిః సేవ్యమానం నృపోత్తమైః |

ధూపదీపాది నైవేద్యైః పంచఖాద్యైశ్చ శక్తితః ||


12) భజామి శ్రీహనూమంతం హేమకాంతి సమప్రభమ్ |

వ్యాసతీర్థ యతీంద్రేణ పూజితం చ విధానతః ||


13) త్రివారం యః పఠేన్నిత్యం స్తోత్రం భక్త్యా ద్విజోత్తమః |

వాంఛితం లభతేఽభీష్టం షణ్మాసాభ్యంతరం ఖలు ||


14) పుత్రార్థీ లభతే పుత్రం యశోఽర్థీ లభతే యశః |

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ ||


15) సర్వ థామాఽస్తు సందేహో హరిః సాక్షీ జగత్పతిః |

యః కరోత్యత్ర సందేహం స యాతి నరకం ధ్రువమ్ ||


16) యంత్రోధారక స్తోత్రం షోడశ శ్లోక సంయుతమ్ |

శ్రవణం కీర్తనం వా సర్వపాపైః ప్రముచ్యతే ||


|| ఇతి శ్రీ వ్యాసరాజకృత యంత్రోధారక హనుమత్ స్తోత్రమ్ ||

🕉🌞🌏🌙🌟🚩

ఓం నమఃశివాయ. శుభోదయవందనాలు.
పాల్కురికి సోమన్న కూడా అద్భుతంగా వ్రాశారు.
సేకరణ ప్రాంజలి ప్రభ . అంతర్జాల పత్రిక  (4)
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
మీ అందరికోసం ఈ శుభదినాన చదవండి.

'అ'ఖిల లోకాధార
'ఆ'నంద పూర
'ఇ'న చంద్ర శిఖి నేత్ర 
'ఈ'డితామల గాత్ర

'ఉ'రు లింగ నిజరూప
'ఊ'ర్జితా జలచాప
'ఌ'లిత తాండవకాండ
'ౡ'నికృతా జాండ

'ఏ'కైక వర్యేశ
'ఐ'క్య సౌఖ్యా వేశ
'ఓం' కార దివ్యాంగ 
'ఔ'న్నత్య గుణ సంగ

'అం'బికా హృదయేశ
'అః'స్తోక కలనాశ

'క'నద హీనాభరణ
'ఖ'ల జలంధర హరణ
'గ'ల నాయక విధేయ
'ఘ'న భక్తి విజేయ

'జ'శ్చూల కాలధర
'చ'రిత త్రిశూల ధర
'ఛ'ర్మ యాధ్వస్త
'ఞ'న గుణ ధళ ధీర

'ట' త్రయాది విదూర
'ఠ' ప్రభావాకార
'డ'మరుకాది విహార
'ఢ' వ్రాత పరిహార

'ణ' ప్రవాగార
'త'త్త్వ జోనేత
'థ'వి దూర జవ పక్ష
'ద'వన పాలన దీక్ష

'ధ'రణీ థవోల్లీడ
'నంది కేశారూఢ
'ప'ర్వతీశ్వర లింగ
'బ'హుళ భూత విలాస

'భ'క్త్వ హృద్వ నహన
'మం'త్రస్తుతోధార
'య'క్ష రుద్రాకార
'ర'తిరాజ బిన హంస

'ల'లిత గంగోత్తంస
'ళ'మా విదవ్రంశ
'వ'రద శైల విహార
'శ'ర సంభ వాస్ఫార

'ష'ట్తింశ తత్త్వగత 
'స'కల సురముని వినుత
'హ'రి నేత్ర పదపద్మ- అంశిత భూధరపద్మ
'క్ష'ర రహిత చరిత్ర - అక్షరాంక స్తోత్ర
శ్రీ పర్వత లింగ
నమస్తే నమస్తే నమస్తే నమః.



--(())--
అఘనాశక గాయత్రీ స్తోత్రమ్ (3)
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక 
సేకరణ : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
🕉🌞🌏🌙🌟🚩
నారద ఉవాచ:-

 1) భక్తానుకమ్పిన్సర్వజ్ఞ హృదయం పాపనాశనమ్ ।

 గాయత్ర్యాః కథితం తస్మాద్గాయత్ర్యాః స్తోత్రమీరయ ॥


 2) ఆదిశక్తే జగన్మాతర్భక్తానుగ్రహకారిణి ।

 సర్వత్ర వ్యాపికేఽనన్తే శ్రీసన్ధ్యే తే నమోఽస్తు తే ॥


 3)త్వమేవ సన్ధ్యా గాయత్రీ సావిత్రీ చ సరస్వతీ ।

 బ్రాహ్మీ చ వైష్ణవీ రౌద్రీ రక్తా శ్వేతా సితేతరా ॥


 4) ప్రాతర్బాలా చ మధ్యాహ్నే యౌవనస్థా భవేత్పునః ।

 బ్రహ్మా సాయం భగవతీ చిన్త్యతే మునిభిః సదా ॥ 


5) వృద్ధా సాయం హంసస్థా గరుడారూఢా తథా వృషభవాహినీ ।

 ఋగ్వేదాధ్యాయినీ భూమౌ దృశ్యతే యా తపస్విభిః ॥


 6) యజుర్వేదం పఠన్తీ చ అన్తరిక్షే విరాజతే ।

 సా సామగాపి సర్వేషు భ్రామ్యమాణా తథా భువి ॥


7) రుద్రలోకం గతా త్వం హి విష్ణులోక నివాసినీ ।

 త్వమేవ బ్రహ్మణో లోకేఽమర్త్యానుగ్రహకారిణీ ॥


 8) సప్తర్షిప్రీతిజననీ మాయా బహువరప్రదా ।

 శివయోః కరనేత్రోత్థా హ్యశ్రుస్వేదసముద్భవా ॥ 


9) ఆనన్దజననీ దుర్గా దశధా పరిపఠ్యతే ।

 వరేణ్యా వరదా చైవ వరిష్ఠా వరవర్ణినీ ॥ 


10) గరిష్ఠా చ వరార్హా చ వరారోహా చ సప్తమీ ।

 నీలగఙ్గా తథా సన్ధ్యా సర్వదా భోగమోక్షదా ॥


 11) భాగీరథీ మర్త్యలోకే పాతాలే భోగవత్యపి ।

 త్రిలోకవాహినీ దేవీ స్థానత్రయనివాసినీ ॥ 


12) భూర్లోకస్థా త్వమేవాసి ధరిత్రీ లోకధారిణీ ।

 భువో లోకే వాయుశక్తిః స్వర్లోకే తేజసాం నిధిః ॥  


13) మహర్లోకే మహాసిద్ధిర్జనలోకే జనేత్యపి ।

 తపస్వినీ తపోలోకే సత్యలోకే తు సత్యవాక్ ॥


 14) కమలా విష్ణులోకే చ గాయత్రీ బ్రహ్మలోకగా ।

 బ్రహ్మలోకదా రుద్రలోకే స్థితా గౌరీ హరార్ధాఙ్గనివాసినీ ॥


15) అహమో మహతశ్చైవ ప్రకృతిస్త్వం హి గీయసే ।

 సామ్యావస్థాత్మికా త్వం హి శబల బ్రహ్మ రూపిణీ ॥ 


 16) తతః పరాపరా శక్తిః పరమా త్వం హి గీయసే ।

 ఇచ్ఛాశక్తిః క్రియాశక్తిర్జ్ఞానశక్తిస్త్రిశక్తిదా ॥ 


14) గఙ్గా చ యమునా చైవ విపాశా చ సరస్వతీ ।

 సరయూర్దేవికా సిన్ధుర్నర్మదేరావతీ తథా ॥ 


15) గోదావరీ శతద్రుశ్చ కావేరీ దేవలోకగా ।

 కౌశికీ చన్ద్రభాగా చ వితస్తా చ సరస్వతీ ॥


 16) గణ్డకీ తాపినీ తోయా గోమతీ వేత్రవత్యపి ।

 ఇడా చ పిఙ్గలా చైవ సుషుమ్ణా చ తృతీయకా ॥


 17) గాన్ధారీ హస్తిజిహ్వా చ పూషాపూషా తథైవ చ ।

 అలమ్బుషా కుహూశ్చైవ శఙ్ఖినీ ప్రాణవాహినీ ॥


 18) నాడీ చ త్వం శరీరస్థా గీయసే ప్రాక్తనైర్బుధైః ।

 హృతపద్మస్థా ప్రాణశక్తిః కణ్ఠస్థా స్వప్ననాయికా ॥ 


19) తాలుస్థా త్వం సదాధారా బిన్దుస్థా బిన్దుమాలినీ ।

 మూలే తు కుణ్డలీ శక్తిర్వ్యాపినీ కేశమూలగా ॥


 20) శిఖామధ్యాసనా త్వం హి శిఖాగ్రే తు మనోన్మనీ ।

 కిమన్యద్ బహునోక్తేన యత్కిఞ్చిజ్జగతీత్రయే ॥


21) తత్సర్వం త్వం మహాదేవి శ్రియే సన్ధ్యే నమోఽస్తు తే ।

ఇతీదం కీర్తితం స్తోత్రం సన్ధ్యాయాం బహుపుణ్యదమ్ ॥ 


 22) మహాపాపప్రశమనం మహాసిద్ధివిధాయకమ్ ।

 య ఇదం కీర్తయేత్ స్తోత్రం సన్ధ్యాకాలే సమాహితః ॥


 23) అపుత్రః ప్రాప్నుయాత్ పుత్రం ధనార్థీ ధనమాప్ను యాత్ ।

 సర్వతీర్థతపోదానయజ్ఞయోగఫలం లభేత్ ॥ 


24) భోగాన్ భుక్త్వా చిరం కాలమన్తే మోక్షమవాప్నుయాత్ ।

 తపస్విభిః కృతం స్తోత్రం స్నానకాలే తు యః పఠేత్ ॥


 25) యత్ర కుత్ర జలే మగ్నః సన్ధ్యామజ్జనజం ఫలమ్ ।

 లభతే నాత్ర సన్దేహః సత్యం చ నారద ॥ 


 26) శృణుయాద్యోఽపి తద్భక్త్యా స తు పాపాత్ ప్రముచ్యతే ।

 పీయూషసదృశం వాక్యం సన్ధ్యోక్తం నారదేరితమ్ ॥

॥ ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణే ద్వాదశస్కన్ధే పఞ్చమోఽధ్యాయే శ్రీఅఘనాశకగాయత్రీస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

🕉🌞🌏🌙🌟🚩

ఈశ్వర దండకం (2)
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
 ప్రాంజలి ప్రభ 
🕉🌞🌏🌙🌟🚩

శ్రీ కంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారకారీ ! మురారి! 
ప్రియ చంద్రధారీ !
మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్య స్వరూపా !
విరూపాక్ష దక్షాధ్వర ధ్వంసకా ! 
దేవ నీదైన తత్వంబు ! 
భావించి బుద్ధిం బ్రధానంబు కర్మంబు!
విజ్ఞాన ఆధ్యాత్మ యెాగంబు ! 
సర్వ క్రియా కారణంబంచు నానా ప్రకారంబులం బుద్ధిమంతుల్ !
విచారించుచో నిన్ను భావింతు రీశాన సర్వేశ్వరా ! 
సర్వ సర్వజ్ఞ సర్వాత్మకా !నిర్వికల్ప ప్రభావా !
భవానీ పతీ ! 
నీవు లోక త్రయీ వర్తనంబుల్ మహీవాయుఖాత్వగ్ని సోమార్క తోయంబు లం జేసి కావించి సంసార చక్రక్రియా యంత్ర వాహుండవై ఆది దేవా! మహాదేవ నిత్యంబు నత్యంత యెాగస్థితి న్నిర్మల జ్ఞాన దీప ప్రభా జాల ! 
విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ ! 
జితక్రోధరోగాది దోషుల్ ! 
యతీంద్రుల్ ! 
యతాత్ముల్ ! 
భవత్పాద పంకేరుహ ధ్యాన పీయూష ధారానుభూతిన్ సదాతృప్తులైరి అవ్యయా! 
భవ్య సేవ్యా! భవా భర్గ భట్టారకా !
భార్గవాగస్థ్య కుత్సాది నానా ముని స్తోత్ర దత్తవధానా !
లలాటేక్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ ! 
భస్మానులిప్తాంగ ! 
గంగాధరా ! 
నీ ప్రసాదంబునన్ ! 
సర్వ గీర్వాణ గంధర్వులున్ !సిద్ధసాధ్యోరగేంద్రామరేంద్రాదులున్ ! 
శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వరా !!
సురాభ్యర్చితా !!నాకున్ అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తీ !!త్రిలోకైకనాథా !మహా దేవ దేవా !!నమస్తే నమస్తే నమస్తే నమః !!*

 “మహా భారత అరణ్య పర్వంలోనిది !!అర్జునుడు ఈశ్వరుని మెప్పించి పాశుపతాది దివ్యాస్త్రములు పొంది ఈ ‘దండకం’తో శివుని సంతోష పరిచాడు!!

(కవి త్రయంలో ఒకరైన నన్నయ భట్టు వ్రాసినది)

🕉🌞🌏🌙🌟🚩
శ్రీ సూర్య పంజర స్తోత్రం (1)
ఓం శ్రీ రామ్  🔥ఓంశ్రీమాత్రే నమః🔥
 ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక 
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
🕉🌞🌏🌙🌟🚩

1)ఓం ఉదయగిరిముపేతం భాస్కరం పద్మహస్తం|
సకలభువననేత్రం రత్నరజ్జూపమేయమ్ |  
తిమిరకరిమృగేంద్రం బోధకం పద్మినీనాం|
సురవరమభివంద్యం సుందరం విశ్వదీపమ్ ||


2)ఓం శిఖాయాం భాస్కరాయ నమః |
లలాటే సూర్యాయ నమః |   
భ్రూమధ్యే భానవే నమః |
కర్ణయోః దివాకరాయ నమః |  
నాసికాయాం భానవే నమః |
నేత్రయోః సవిత్రే నమః |  
ముఖే భాస్కరాయ నమః |
ఓష్ఠయోః పర్జన్యాయ నమః | 
పాదయోః ప్రభాకరాయ నమః ||


3)ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః |                       
ఓం హంసాం హంసీం హంసూం హంసైం హంసౌం హంసః || 


4)ఓం సత్యతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా |          
ఓం స్థితిరూపకకారణాయ పూర్వాదిగ్భాగే మాం రక్షతు || 


5)ఓం బ్రహ్మతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా |          
ఓం తారకబ్రహ్మరూపాయపరయంత్ర-పరతంత్ర-పరమంత్ర-సర్వోపద్రవనాశనార్థం దక్షిణదిగ్భాగే మాం రక్షతు ||


6)ఓం విష్ణుతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా |          
ఓం ప్రచండమార్తాండ ఉగ్రతేజోరూపిణే ముకురవర్ణాయ తేజోవర్ణాయ మమ సర్వరాజస్త్రీపురుష-వశీకరణార్థం పశ్చిమదిగ్భాగే మాం రక్షతు ||


6)ఓం రుద్రతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా |          
ఓం భవాయ రుద్రరూపిణే ఉత్తరదిగ్భాగే సర్వమృత్యోపశమనార్థం మాం రక్షతు || 


7)ఓం అగ్నితేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా |          
ఓం తిమిరతేజసే సర్వరోగనివారణాయ ఊర్ధ్వదిగ్భాగే మాం రక్షతు || 


8)ఓం సర్వతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా |          
ఓం నమస్కారప్రియాయ శ్రీసూర్యనారాయణాయ అధోదిగ్భాగే సర్వాభీష్టసిద్ధ్యర్థం మాం రక్షతు ||


9)మార్తాండాయ నమః భానవే నమః హంసాయ నమః 
సూర్యాయ నమః దివాకరాయ నమః తపనాయ నమః భాస్కరాయ నమః మాం రక్షతు || 


10)మిత్ర-రవి-సూర్య-భాను-ఖగపూష-హిరణ్యగర్భ- మరీచ్యాదిత్య-సవిత్రర్క-భాస్కరేభ్యో నమః శిరస్థానే మాం రక్షతు ||  
సూర్యాది నవగ్రహేభ్యో నమః లలాటస్థానే మాం రక్షతు ||


11)ధరాయ నమః ధృవాయ నమః సోమాయ నమః అథర్వాయ నమః అనిలాయ నమః అనలాయ నమః ప్రత్యూషాయ నమః ప్రతాపాయ నమః మూర్ధ్నిస్థానే మాం రక్షతు || 


12)వీరభద్రాయ నమః గిరీశాయ నమః
శంభవే నమః అజైకపదే నమః అహిర్బుధ్నే నమః పినాకినే నమః భువనాధీశ్వరాయ నమః దిశాంతపతయే నమః పశుపతయే నమః స్థాణవే నమః భవాయ నమః లలాటస్థానే మాం రక్షతు || 


13)ధాత్రే నమః అంశుమతే నమః పూష్ణే నమః పర్జన్యాయ నమః విష్ణవే నమః నేత్రస్థానే మాం రక్షతు || 


14)అరుణాయ నమః సూర్యాయ నమః ఇంద్రాయ నమః రవయే నమః సువర్ణరేతసే నమః యమాయ నమః దివాకరాయ నమః కర్ణస్థానే మాం రక్షతు || 


15)అసితాంగభైరవాయ నమః రురుభైరవాయ నమః  చండభైరవాయ నమః క్రోధభైరవాయ నమః  ఉన్మత్తభైరవాయ నమః భీషణభైరవాయ నమః కాలభైరవాయ నమః సంహారభైరవాయ నమః  ముఖస్థానే మాం రక్షతు ||


16)బ్రాహ్మ్యై నమః మహేశ్వర్యై నమః కౌమార్యై నమః వైష్ణవ్యై నమః వరాహ్యై నమః ఇంద్రాణ్యై నమః చాముండాయై నమః కంఠస్థానే మాం రక్షతు ||


17)ఇంద్రాయ నమః అగ్నయే నమః|యమాయ నమః నిర్‍ఋతయే నమః|వరుణాయ నమః వాయవే నమః|కుబేరాయ నమః ఈశానాయ నమః|బాహుస్థానే మాం రక్షతు || 


17)మేషాదిద్వాదశరాశిభ్యో నమః| హృదయస్థానే మాం రక్షతు ||


18)వజ్రాయుధాయ నమః శక్త్యాయుధాయ నమః|దండాయుధాయ నమః ఖడ్గాయుధాయ నమః|పాశాయుధాయ నమః|అంకుశాయుధాయ నమః|గదాయుధాయ నమః త్రిశూలాయుధాయ నమః|పద్మాయుధాయ నమః చక్రాయుధాయ నమః|   కటిస్థానే మాం రక్షతు ||


19)మిత్రాయ నమః దక్షిణహస్తే మాం రక్షతు |  
రవయే నమః వామహస్తే మాం రక్షతు |
సూర్యాయ నమః హృదయే మాం రక్షతు |  
భానవే నమః మూర్ధ్నిస్థానే మాం రక్షతు |  
ఖగాయ నమః దక్షిణపాదే మాం రక్షతు |  
పూష్ణే నమః వామపాదే మాం రక్షతు |
హిరణ్యగర్భాయ నమః నాభిస్థానే మాం రక్షతు |
మరీచయే నమః కంఠస్థానే మాం రక్షతు |  
ఆదిత్యాయ నమః దక్షిణచక్షూషి మాం రక్షతు |  
సవిత్రే నమః వామచక్షుషి మాం రక్షతు |
భాస్కరాయ నమః హస్తే మాం రక్షతు |
అర్కాయ నమః కవచే మాం రక్షతు ||


20)ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతి కరాయ ధీమహి | 
తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ ||

 || ఇతి శ్రీ సూర్య పంజర స్తోత్రమ్ ||

🕉🌞🌎🌙🌟🚩

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి