ప్రాంజలి ప్రభ కధలు 22032021
రచయిత /సేకరణ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఆర్యా.....
బ్రాహ్మణులుగా పూజించబడి .... ఈరోజుకీ పూజింపబడుతూ ........ యజ్ఞయాగాలలో నేటికీ హవిర్భాగములు కూడా అందుకుంటున్న బ్రాహ్మణేతరులు ..
( వజ్రసూచికోపనిషత్తు ప్రకారం ..)
1. ఋష్యశృంగుడు .. జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు.
2. కౌశికుడు .. గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు.
3. జంబూక మహర్షి .. నక్కలు పట్టుకునే జాతివారు
4. వాల్మీకి .. ఓ కిరాతకుల జాతికి చెందిన వాడు. ఈతను రచించిన రామాయణం .. హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం. ఈయన్ని ఆదికవిని చేసి పూజిస్తారు.
5. వ్యాసుడు .. ఓ చేపలుపట్టే బెస్తజాతికి చెందినవాడు. హిందువులకు పరమ పవిత్రమైన వేదములు .. ఈయన చేత విభజన చేయబడ్డవే. అందుకే ఇతణ్ణి వేదవ్యాసుడు .. అని పూజిస్తారు.
6. గౌతముడు .. కుందేళ్లు పట్టేజాతికి చెందినవాడు.
7. వశిష్టుడు .. ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఈతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుంధతీదేవి. ఈరోజుకు కూడా నూతన దంపతులచేత అరుంధతీ వశిష్టులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తు న్నారు. ప్రతి పూజలోనూ హిందువుల చేత .. అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః .. అని పూజలందు కుంటున్నారు.
వీరి కుమారుడు శక్తి. ఇతని భార్య ఓ మాదిగ వనిత .. ఛండాలాంగని. వీరికుమారుడే పరాశరుడు. ఈతను ఓ బెస్తవనిత మత్స్యగంధిని వివాహమాడి వ్యాసుణ్ణి కన్నారు.
8. అగస్త్యుడు .. మట్టి కుండల్లో పుట్టినవాడు.
9. మతంగ మహర్షి.. ఒక మాదిగవాని కుమారుడు. బ్రాహ్మణుడయ్యాడు. ఈతని కూతురే .. మాతంగకన్య .. ఓ శక్తి దేవత. కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసించారు. ఉపాసిస్తూ ఉన్నారు. ఈమే శ్యామలాదేవి.
ఇంకా.... ..
1. ఐతరేయ మహర్షి ఒక దస్యుడి మరియు కిరాతకుడి కుమారుడు .. అంటే నేటి లెక్కల ప్రకారం SC or ST. జన్మ బ్రాహ్మణుడు కాదు. కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు. అతను వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐతరేయోపనిషత్తు. ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైనది. ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు
2. ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు. అతను ఋగ్వేదంమీద రిసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు. అతన్ని ఋషులందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుణ్ణి చేసుకున్నారు ( ఐతరేయ. బ్రా. 2.19)
3. సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరే కాదు.. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడు అయ్యాడు.
ఉన్నతవంశాలలో పుట్టిన వారిని కూడా వారిధర్మం నిర్వర్తించకపోతే .. వారిని నిర్మొహమాటంగా బహిష్క రించారు ... వారిలో కొందరు:
1. భూదేవి కుమారుడు .. క్షత్రియుడైన నరకుడు .. రాక్షసుడైనాడు.
2. బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు, హిరణ్య కశిపుడు, రావణుడు,.. బ్రాహ్మణులైనా .. రాక్షసులయ్యారు ..
3. రఘువంశ మూల పురుషుడైన రఘు మహారాజు కుమారులలో ఒకడు అయిన ప్రవిద్ధుడు .. రాక్షసుడైనాడు
4. త్రిశంకుడు క్షత్రియుడు. కానీ చండాలడు అయ్యాడు.
5. విశ్వామిత్రుడు క్షత్రియుడు. బ్రాహ్మణుడైనాడు .. వీరి వంశస్తులే .. కౌశికస గోత్ర బ్రాహ్మణులయ్యారు. విశ్వామిత్రుని కుమారులు కొందరు శూద్రులయ్యారు.
6. నవ బ్రహ్మలలో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు పృషధుడు. బ్రహ్మ జ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారిపోయాడు ( విష్ణు పురాణం 4.1.14)
7. నేదిష్టుడు అనే మహరాజు కుమారుడు .. నాభుడు. ఇతనికి క్షాత్ర జ్ఞానం లేని కారణాన, వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది ( విష్ణుపురాణం 4.1.13).
8. క్షత్రియులైన రథోతరుడు, అగ్నివేశ్యుడు, హరితుడు .. బ్రహ్మ జ్ఞానం వలన బ్రాహ్మణులైనారు. హరితుని పేరుమీదే .. ఇతని వంశ బ్రాహ్మణులకు హరితస గోత్రం వచ్చింది (విష్ణు పురాణం 4.3.5).
9. శౌనక మహర్షి కుమారులు .. 4 వర్ణాలకు చెందినవారుగా మారారు (విష్ణుపురాణం 4.8.1).
10. అలాగే గృత్సమదుడు, వీతవ్యుడు, వృత్సమతి ... వీరి కుమారులు కూడా నాలుగు వర్ణాలకు చెందినవారు అయ్యారు.
వీరిలో చాలామంది .. వేదమంత్రాలు కూడా రచించినవారు ఉన్నారు.
హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడి నది కానీ, జన్మం మీద కాదు.
ఇప్పుడు వీళ్ళు జ్ఞానాన్ని విడిచి పెట్టి, జననం ను అనుసరించి పదవులు సంప్రాప్తిoప జేయి చున్నారు. అదే దేశ అధోగతి కి దోహదం చేయుచున్నది.
ఇది వాట్సాపు లోని వేరే గ్రూపు నుండి సంగ్రహించినది...
ఈ సమాచార కర్తల సౌజన్యంతో...
__(())--
(ఇది వేరే grp నుంచీ సేకరించినదే...)
ఓం శ్రీ రామ్ - శ్రీ మా త్రేనమ:ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక కధలు (10) సంసారంలో సమస్యలు-2
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
డిడెక్టివ్ రామకృష్ణ బయలు దేరాడు, ఏమైనా సరే ఈ కేసు విషయంలో
కొన్ని విషయాలు, రహస్యాలు తెలుసుకొని నిజాన్ని బయట పెట్టాలి అని అనుకున్నాడు.
మొదట చనిపోయిన వ్యక్తి యొక్క ,వృత్తి, గుణము, అలవాట్లు తెలుసుకొని రమ్మనమని అసిస్టెంట్ బ్రహ్మానందాన్ని పంపాడు.
బ్రహ్మా నందం వస్తూనే కొన్ని విషయాలు డైరీలో వ్రాసుకొని చూపించాడు
ఇక మనం పిల్లవాని తల్లి తండ్రుల వద్దకు వెళుతున్నాం అన్నాడు
వాళ్ళు ఏమ్ చెపుతారు, కొడుకు పోయాడని భోరుమని ఏడుపు తప్ప అన్నాడు బ్రహ్మానందం.
అవును ఆ ఏడుపుతో కూడా మనం కొన్ని విషయాలు కనుక్కోవచ్చు పద పోదాం
చెలపతి రావుగారి ఇంటికి వెళ్లారు. మీ అబ్బాయి ( రవి ) చనిపోక ముందు ఏమి చేశాడో, ఎవరితో మాట్లాడా, ఎవరు కలిసారో, అతని కేమన్న విరోధు లు ఉన్నారా, ప్రేమలో బడ్డాడా, ఉన్నది ఉన్నట్లుగా అన్ని వివరంగా మాకు చెపుతారా అని అడిగారు.
మా అబ్బాయి ఎవరి జోలికి పోడు, స్నేహితులతో తిరుగాడు తప్పా, ఎక్కవ ఆటలు ఆడడు మోటార్ రేస్ లు తప్పా, ఏ అమ్మాయిని కన్నెత్తి చూడడు క్లబ్బులో ఆడటం తప్పా, మా అబ్బాయికి భయమనేది లేదు ఎందు కంటే రెండు మూడు సార్లు పోలీసులకు చిక్కి బయట కొచ్చాడు కాబట్టి అన్నాడు తండ్రి.
ఒక్కసారి ఇంట్లో వాళ్ళను పిలుస్తారా
శ్రీమతి సౌభాగ్య వచ్చి నిలబడింది.
మీ అబ్బాయి మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు రామకృష్ణ
మేము ఎన్నోసార్లు మొత్తుకున్నాం చెడు సావాసం వద్దురా అన్న వినక తిరిగాడు, ఆత్మ హత్య చేసుకొనే శక్తి హీనుడు మాత్రం కాదు, ఇక్కడ ఎటువంటి సమస్యలు లేవు, మా అబ్బాయి తిరుగులకు మేము ఏనాడూ అడ్డు చెప్పలేదు, ఎంత కావాలంటే అంత డబ్బు ఇచ్చాము ఇంతకన్నా నేను ఏమి చెప్పలేను అన్నది భాదతో .
ఇంట్లో ఇంకా ఎవరన్నా ఉన్నారా
ఉన్నారు మా వంట మనిషి, వాచ్ మెన్, డ్రైవర్
పిలుస్తారా అనగా అందర్నీ కొన్ని ప్రశ్నలు వేసి వ్రాసుకొన్నారు
సరే మేము పరిశీలిస్తున్నాము మా అబ్బాయిది హత్య, ఆత్మ హత్య ఎదో త్వరగా తేల్చండి మీరుకోరిన పైకము సర్దు తాను అన్నాడు.
ఒక్కసారి మీ అబ్బాయి సెల్ ఇవ్వండి అన్నాడు రామకృష్ణ
సెల్లు లో స్నేహితుల ఫోటోలు అన్నీ డౌన్ లౌడ్ చేసి తన సెల్లు లోకి మార్చుకున్నాడు.
ఆ ఇంటి చివర ఉన్న షాప్ వద్దకు చేరి ఫోటో చూపించాడు వివరాలు సేకరించాడు,
అప్పుడే అక్కడకు ఒక పిచ్చి ఆమ్మాయి షాప్ వానితో బతిమ లాడు తున్నది, రొట్టె పెట్టమని అడుగు తున్నది, పో బయటికి పో, అని అరిచాడు షాప్ వాడు.
ఎందుకు ఆ ఆమ్మాయిని కసురు కుంటావ్, పెడితే నీ సొమ్మేం పోయింది అన్నాడు కోపంగా బ్రహ్మా నందం, అయినా ఇదిగో ఈ డబ్బు తీసుకోని ఆమెకు ఇచ్చేయ్ రొట్టెల ప్యాకెట్టు. షాపు వాడు ఇచ్చిన రొట్టెల ప్యాకెట్టు తీసుకోని గబగబా చింపి కుక్కలకు వేసింది, ఒకటి చేత పట్టుకొని పరుగెత్తింది.
ఎవరు ఈ అమ్మాయి అని అడిగాడు షాప్ వాణ్ని
ఇందాక చూపించిన ఫోటో లో ఉన్నతనే ప్రే మించి మోసం చేసాడు, వాడి స్నేహితులు ఈ అమ్మాయిని పాడు చేసి పరారు అయ్యారు, అప్పటి నుండి పిచ్చిదానిలా తయారయింది
అని చెప్పాడు.
బ్రహ్మానందం రామకృష్ణ కలసి కారులో బయలు దేరారు, కారు నడుపుతూ రామకృష్ణ ఎం బ్రహ్మనందం ఎవరో పిచ్చి మ్మాయితో మాట్లాడావు అక్కడ అని అడిగాడు.
అవును అక్కడ పిచ్చమ్మాయిగా మారుటకు కారణం ఈ ఫొటోలో ఉన్న అబ్బాయే అన్నాడు.
షడన్ బ్రేక్ వేసి ఏమిటి మనం వెతికే కేసు తాలూకు మనిషా
అవునూ
అంత నిదానంగా చెపుతావే, మరలా పోదాం పదా ఆ కొట్టు వద్దకు పోయి మనకేమన్న ఆధారాలు దొరుకుతాయో కనుక్కుందాం అంటూ కారు వెనక్కు తిప్పాడు.
షాప్ వాణ్ని కలసి అడుగగా ఈవిధముగా చెప్పాడు.
ఆ అమ్మాయి పేరు శ్రావ్య, చలపతిరావు గారి ఇంటిలో ఉన్న పనిపనిషి కూతురు, ఒకరోజు చాలాపతిరావు గారి ఇంటికి వచ్చింది తల్లిని కలవటానికి అప్పుడే కొందరు ఆ ఇంటిలో ఎదో గుస గుస లాడుతున్నారు, అవి ఏమిటా అని ఆలోచించిచగా వారు ఏ విధముగా నయినా ఇక్కడ ఎవ్వరికీ తెలియకుండా ధనమంతా దోచుకోవాలి, ఎలాగయినా ఈరోజు చలపతిరావు గారిని హతం చేయాలి, మనపని పూర్తి చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు అప్పుడే ఆమాటలు కొంతవరకు అర్ధం చేసుకొన్న శ్రావ్య. వెంటనే అయ్యగారి ధనాన్ని రక్షించాలని ఆలోచనతో పైన ఉన్న గదిలోకి వెళ్ళింది. దొంగలు దొంగలు అని అరిచింది, వెంటనే లేచాడు రవి. ఆమె రూపాన్ని చూసి తన్మయత్వం చెందాడు. ఏమి రూపము ఇది ఈమెను మనం లోబరుచుకోవాలి అని తలచాడు లోపలకు వచ్చిన దొంగలను చూసి అవాక్కయ్యాడు. వాళ్ళను పట్టుకోవటానికి ఎంతో ప్రయత్నిమ్చాడు ఫలితము లేదు. శ్రావ్య రవి కలసి పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి జరిగిన విషయమ్ చెప్పి వారి పోలికలను తెలియపరిచి తిరిగి వచ్చారు.
అప్పడే తల్లి వచ్చి ఎందుకమ్మా నీవు ఇక్కడకు వచ్చావు ఇక్కడ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మ కూడదో తెలియ దు.
అయ్యగారి అబ్బాయ్ చాలా మంచి వారుగా ఉన్నారు గదమ్మా .
అందరూ మంచి వారమ్మా కానీ వారి బుద్ధులు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరు చెప్పలేరు,
ఇలాంటి వారు మనకు ఎలాంటి హాని కలిగించకున్నా వారి వల్ల మనకు ఒక్కోసారి నష్టం కలిగే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. వీరు మన ప్రేమను చూసి ఓర్వలేరు. ఆ క్రమంలో మనకు ఏదైనా నష్టం తలపెట్టవచ్చు. ఇలాంటి వారు ఎక్కువగా తాము చేసే తప్పులను అంత సులభంగా అంగీకరించరు. వీరికి కూడా దూరంగానే ఉండాలి.
ఎందుకంటే ఇటువంటి వారు ఇతరులు బాధపడుతుంటే లోలోపల ఆనందిస్తారు. కొన్ని సార్లయితే వారి ఆనందం బయటక్కూడా కనిపిస్తుంది. ఇక ఇందులోనే మహా క్రూయల్ నేచుర్ కొందరుంటారు. వీరైతే చుట్టుపక్కల వారికి ఎప్పుడూ కష్టాలు, నష్టాలు కలిగిస్తూ వారు బాధపడుతుంటే రాక్షసానందం పొందుతారు. కాబట్టి ఇలాంటి వారికి ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలి.
వీళ్లకు డబ్బుందని అహం ఉంటుంది, ఎల్లప్పుడూ స్త్రీలవెంట తిరగుతారు, స్త్రీలోలుర నుంచి దూరంగానే ఉండాలి. వారితో ఎప్పటికైనా ప్రమాదమే. అలాంటి వారికి "మహిళ" తన, పరాయి అనే భేదం ఉండదు. దీంతో వారు హాని కూడా కలిగించొచ్చు.
కొన్ని విలక్షణమైన వ్యక్తిత్వాలు, మనస్తత్వం కలిగిన వ్యక్తులతో ఎప్పటికీ జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వీలైతే వారి నుంచి సాధ్యమైనంత దూరంగానూ ఉండాలి. దీనిని గనుక విస్మరిస్తే వారినుంచి మనకు కష్టాలు, నష్టాలు కలిగే ప్రమాదాలే ఎక్కువ. దీంతో మన జీవితంలో ఉన్న కొద్దిపాటి సంతోషం ఆవిరై పోతుంది.
అమ్మా ఇవి అన్నియు నాకు తెలిసిన వేనమ్మా, నీకు తెలిసిన నేను చెప్పటం ఒక తల్లిగా నాకు భాద్యత అన్నది
సరే నమ్మా
సరే జాగర్తగా ఇంటికి వేళ్ళు నేను ఇప్పుడే పని పూర్తి చేసుకొని వస్తాను.
శ్రావ్య నెమ్మదిగా నడుస్తున్నది, అప్పుడే కొందరు వచ్చి బలవంతాన వ్యాన్ ఎక్కించారు, అది చూసి రవి కుడా వెంబడించాడు, వారు పాడు పడ్డ భవనంలోకి తీసుకెల్లఁటం గమనించాడు. వారితో ముష్టి యుద్దానికి తల పడ్డాడు, కర్రతో తలమీద కొట్టి శ్రావ్యను తీసుకొని పారిపోయారు.
అప్పుడే బ్రహ్మానందం శ్రావ్యకు పిచ్చి ఎలా వచ్చిందో చెప్పవేమి, ఎదో కల్పించిన కధలా చెపుతున్నావు ఆన్నాడు
తర్వాత రవి లేవటం వాళ్ళను వెంబడించటం శ్రావ్యను రక్షించటం, వచ్చిన వారు పారిపోవటం అంటా సినిమా కధలా జరిగింది.
బ్రహానందం నీవు చెప్పినదంతా సినిమా కధే
ఎదో మేము అడిగామని ఉన్నది లేనిది కల్పించి మరీ మాకు చెపుతున్నావు, మమ్మల్ని చూస్తే ఎదో పని పాట లేని వార్లగా కనిపిస్తున్నామా
అంతమాట నేను ఎందుకు అంటానండి అన్నాడు.
రామకిష్ణ ప్రక్కన ఉండి బ్రహానందం తో అసలు రహస్యం రాబట్టవయ్యా ఈ సోది కబుర్లెందుకూ అన్నాడు
వస్తున్నా అక్కడకే వస్తున్నా అన్నాడు.
తరువాత శ్రావ్య రవి ఒకరికొకరు ప్రేమించుకున్నారు, వివాహము చేసుకోవాలని కున్నారు,ఆవిషయం అందరికి చెప్పాడు రవి.
చూడు బాబు నీవు ప్రేమించటం తప్పు కాదు, పెళ్లి చేసు కోవటం తప్పు కాదు, మనకు తగ్గ పిల్ల అవునా కదా, ఆమెను పెళ్లి చేసుకుంటే సుఖము ఉంటుందా లేదా అలోచించి ముందుకు అడుగు వేయి అన్నాడు తండ్రి.
మీ నమ్మకాన్ని వమ్ము చేయదునాన్న, మా ప్రేమ అంత బలీయమైనది నాన్న అన్నాడు.
అయితే ఒక్క నెల ఆమెకు దూరంగా ఉండు ఆతర్వాత వచ్చాక ఆమె నిన్నే ప్రేమిస్తే నీవు పెళ్లి చేసుకోవచ్చు అన్నాడు.
నాన్న నీ మాటకు కట్టు బడి ఉన్నాను, ఈరోజే మన కంపెనీల ఆడిట్ చేస్తాను, నెలరోజులు అర్వాత తిరిగి వస్తాను అన్నాడు.
బాబు ఈవిషయమే నీవు ప్రేమించిన అమ్మాయితో చెప్పి వేళ్ళు అన్నాడు.
ఆవిషయమే చెప్పి వేలి పోయాడు రవి.
తర్వాత ఎం జరిగిందో అంతా మీకే వదిలేస్తున్నా అని అంటారనుకున్నారా ఆ కాదు కాదు.
ఒక సారి రవి వచ్చాడని తెలుసుకొని చెలపతిరావు ఇంటి కొచ్చింది "అప్పుడే వయసును చూడకుండా వచ్చిన అమ్మాయిని బలవంతం చేయబోయాడు చలపతిరావు అప్పుడే కొడుకు వచ్చాడు ఇద్దరి మధ్య ఘర్షణ ఏర్పడింది, మాట మాట పెరిగింది ఆ కోపంలో చెలపతిరావు వచ్చిన శ్రావ్యను గట్టిగా తోసేసాడు గోడకు తగిలి క్రింద పడింది, పిచ్చి చూపులుచూస్తూ అక్కడే ఉండి పోయ్యింది. రవి తట్టు కోలేక తండ్రిఅని చూడకుండా తండ్రిని చాకుతో పొడవ బొయ్యాడు కొడుకును గట్టిగా కోపంతో అదేకత్తితో పొడిచేసాడు తండ్రి తెలియని ఆవేశంతో .
డబ్బుతో కొడుకుని బతికించుకోలేక ఆత్మ హత్యచేసుకున్నాడని కేసులేకుండా జాగర్త పడ్డాడు.
అయిపోయిందా నీ సినిమా కధా.
మరి జైల్లో ఉన్నాడు చలపతిరావు ఎందుకు
ఆ వస్తున్నా అక్కడకే వస్తున్నా
కొడుకు చనిపోయాడని చలపతిరావు భార్య కోపంతో నువ్వు జైలు శిక్ష అనుభవించాలి అని పోలీస్ కేస్ పెట్టింది.
అదే మనం కనుక్కోవాలి
నేను చెప్పమంటారా బ్రహ్మానంద అన్నాడు
చెప్పు
కోపంతో భార్యను చమ్పేసి ఎంచక్కా జైలు వెళ్లి ఉంటాడు.
మీరేమి ఆలోచిస్తున్నారో చెప్పు
అదే ఆలోచిస్తూన్నా ఆలోచిస్తూన్నా ఆలోచిస్తూన్నా
--(())--

ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక కధలు (10)
పంచాంగ ఫలం (చిన్న కధ)
చాలా మంది అడుగుతున్న చక్కటి ప్రశ్నకు సమాధానమిది.
!!తిథిః వారంచ నక్షత్రం యోగః కరణమేవ చ
పంచాంగమితి విఖ్యాతం కాలోయం కర్మసాధకః!!
తిథి వార నక్షత్ర, యోగ కరణములనునవి పంచాంగములు.
ఈ పంచాంగములు మానవులకు వారి వారి జాతకరీత్యా ఫలితాలను తెలుపుతూ ఉంటాయి... [నిత్యకర్మలలో ఉపయుక్తమైనాయి] ఈ పంచాంగాల ఫలం కూడా ఇలా చెప్పబడింది .!!!
తిథిశ్చశ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం
నక్షత్రాత్హరతే పాపం యోగాద్రోగ నివారణం
కరణాత్కార్య సిద్ధిస్తు పంచాంగఫల ముత్తమం
కాలవిత్కర్మకృద్ధీమాన్ దేవతానుగ్రహం లభేత్!!
తిథి సంపదలను, వారం ఆయుష్షును ఇస్తాయి.
నక్షత్రం పాపాన్ని హరిస్తుంది.
యోగం రోగనివారకం. కరణం కార్యసిద్ధిని కలుగజేస్తుంది.
ఇదే..
ఉత్తమమైన పంచాంగ ఫలం, కాలాన్ని ఎరిగి కర్మనాచరించే బుద్ధిమంతుడు దేవతానుగ్రహాన్ని పొందుతాడు.!!

ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక కధలు (9)
ఉప్మా గురించి కొంత ?
ఉప్మా పై నాకు ఒక మిత్రుడు పంపిన *రుచి కరమైన సందేశం!! ఉత్తి పుణ్యానికి ఉప్మా మీద పడి ఏడుస్తుంటారు కానీ జనాలు అసలూ ....ఎంత బావుంటుందో తెల్సా ..
మండించే ఎండల్లో వండివార్చలేనిపూట ఆకలితో మాడకుండా ఆదుకునే అమృతమేరా ఉప్మా అంటే ..
అన్నం పప్పూకూరలకి ఇప్పుడేం చేస్తామని బద్ధకించిన ప్రాణానికి ..
అప్పటికప్పుడు దొరికే అన్నపూర్ణేరా ఉప్మా అంటే ..
ముగ్గురికి సరిపోయే రవ్వకి ఓ గ్లాసుడెక్కువ నీళ్లు పోస్తే ఐదుగురికి సరిపోయే అద్భుతమేరా ఉప్మా అంటే ..
కూరముక్కలేసినా పొంగిపోక ..వేయకపోతే కుంగిపోక ..స్ధితప్రజ్ఞతతో మన కడుపులో సర్దుకుపోయేదేరా ఉప్మా అంటే ...
ఎర్రరవ్వైనా ఏడిపించక ..
తెల్లరవ్వైనా పోజుకొట్టక ...
చిటికెలో తయారై చింత తీర్చేదేరా ఉప్మా అంటే ...
సేమ్యాతో చేస్తే సూపర్ హిట్ గా
బియ్యపురవ్వతో చేస్తే బ్లాక్ బస్టర్ గా నిలిచే
మినిమం గ్యారంటీ వున్న ఏకైక డిష్ రా ఉప్మా అంటే ..
నేతితో చేసినా ..నూనెతో చేసినా ...
రుచిలో మాత్రం సాటిరాదు దీనికేదైనా ...
చట్నీలేకపోయినా చింతించక ఆవకాయతో అమాంతం జతకట్టేస్తుంది ..
ఊరగాయ అందుబాటులో లేపోయినా ..నిమ్మచెక్క పిండితే చాలు ..నోరూరించేలా సిద్ధమైపోతుంది ..
జీడిపప్పులేయకున్నా ఏమనుకోదు ..కర్వేపాకు వేయకున్నా కలవరపడదు ...
కొత్తిమీర చల్లితేనే పొంగిపోయి ఘుమఘుమలాడే ఆత్మీయ నేస్తంరా ఉప్మా అంటే ...
అకాల క్షుద్బాధకు చెక్ మేట్ చెప్తూ ..
సకాలంలో తయారైపోయే డిష్ ఆఫ్ ఆల్ టైం పర్ఫెక్ట్ ..
ఉదయమైనా సాయంత్రమైనా ఉన్నట్టుండి రిలేటివ్సొస్తే ..
ఏ అర్ధరాత్రైనా ..
ఉప్మారవ్వుంటే ఇంట్లో కొండంత నిశ్చింత ,,
ఉన్నమాటొప్పుకోవాలి మరి తప్పదెప్పుడో ఒకసారైనా మనమంతా ..
అందుకే మరి చెప్పేదేంటంటే .,,
అమ్మాయిలమీద ..పెళ్లాలమీద ..అవసరానికి ఆదుకునే ఆపద్భాంధవి ఉప్మా మీద జోకులేయక ...
అమ్మాయిల్ని గౌరవిస్తూ ..
పెళ్లాన్ని ప్రేమిస్తూ ..
ఉప్మాని ఆరగిస్తూ వుంటే మీకు అన్నీ ఇట్టే కలిసొచ్చేస్తాయని ఉపమానాలంకారాన్ని ఉపయోగిస్తూ ..కాళిదాసు మహాకవి అప్పుడప్పుడెప్పుడో నొక్కివక్కాణించిన విషయాన్ని మరొక్కసారి గుర్తు చేస్తూ ...జై ఉప్మా ..జై సేమ్యా ఉప్మా ..😘😘
సేకరణ రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
rtd. అకౌంట్స్ ఆఫీసర్

ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక (8. )
నీతి కథ "జటాయువు"
తన చివరి శ్వాసను విడుస్తున్న , జటాయువు నేను రావణుడితో గెలవలేనని నాకు తెలుసు, అయినా కానీ నేను పోరాడాను. నేను పోరాడకపోతే, రాబోయే తరాలవారు నన్ను పిరికి వాడు అని అనుకుంటారు.
రావణుడు జటాయువు రెండు రెక్కలను తెంచినప్పుడు. అప్పుడు మృత్యువు వచ్చింది. అపుడు జటాయువు మృత్యువుకు సవాలు విసిరాడు.
"జాగ్రత్త! ఓ మృత్యువా ! ముందుకు రావడానికి సాహసం చేయద్దు. నేను ఎప్పటివరుకు మరణాన్ని అంగీకరించనో, అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు. నేను సీతామాత యొక్క సమాచారం "ప్రభు శ్రీరాముడి" కి చెప్పనంత వరకు నా వద్దకు రావద్దు అన్నాడు! మరణం జటాయువును తాకలేకపోతోంది, అది నిలబడి వణుకుతూనే ఉంది. మరణం అప్పటివరకు కదలకుండా నిల్చునే వుంది, వణుకుతూనే ఉంది. తాను కోరుకోగానే చనిపోయే వరం జటాయువుకి వచ్చింది.
కానీ మహాభారతానికి చెందిన భీష్మ పితామహుడు ఆరు నెలలు బాణాల అంపశయ్య మీద పడుకుని మరణం కోసం ఎదురు చూశాడు. అతని కళ్ళలో కన్నీళ్ళు. ఏడుస్తూవున్నాడు. కానీ భగవంతుడు మనస్సులో తనకి తాను చిరునవ్వు నవ్వుతున్నారు!
ఈ దృశ్యం చాలా అలౌకికమైనది.
రామాయణంలో జటాయువు శ్రీరాముడి ఒడిలో పడుకున్నాడు. ప్రభు "శ్రీరామ్" ఏడుస్తున్నాడు మరియు జటాయువు చిరునవ్వు నవ్వుతున్నాడు.
అక్కడ మహాభారతంలో,
భీష్మ పితామహుడు ఏడుస్తున్నాడు మరియు "శ్రీ కృష్ణుడు" చిరునవ్వు నవ్వుతున్నాడు. తేడా ఉందా లేదా?
అదే సమయంలో , జటాయువుకు ప్రభువు "శ్రీరాముడి" ఒడి పాన్పుగా అయింది. కాని భీష్మపితామహుడు చనిపోయేటప్పుడు బాణం పాన్పుగా అయింది!
జటాయువు తన కర్మ బలం ద్వారా ప్రభు "శ్రీరాముడి" యొక్క ఒడిలో ప్రాణ త్యాగం చేసాడు. జటాయువు ప్రభు శ్రీరాముడి శరణులోకి చేరాడు. మరియు బాణాలపై భీష్మపితామహుడు ఏడుస్తున్నాడు.
ఇంత తేడా ఎందుకు?
ఇంతటి తేడా ఏమిటంటే,
ద్రౌపది ప్రతిష్టను నిండు సభలో పరువు తీస్తున్నా భీష్మ పితామహుడు చూశాడు. అడ్డుకోలేకపోయాడు!
దుశ్శాసనునికి ధైర్యం ఇచ్చారు. దుర్యోధనుడికి అవకాశం ఇచ్చాడు. కాని ద్రౌపది ఏడుస్తూనే ఉంది. ఏడుస్తూ, అరుస్తూ,అరుస్తూ వున్నా సరే భీష్మ పితామహుడు తల వంచుకునే వున్నాడు. ద్రౌపదిని రక్షించలేదు.
దీని ఫలితం ఏమిటంటే, మరణం కోరుకున్నప్పుడే వరం వచ్చిన తరువాత కూడా, బాణాల అంపశయ్య దొరికింది.
జటాయువు స్త్రీని కాపాడటానికి ప్రయత్నము చేసే. తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, కాబట్టి చనిపోతున్నప్పుడు, అతనికి ప్రభు “శ్రీరాముడి” ఒడి అనే పాన్పు లభించింది!
ఇతరులుకు తప్పు జరిగిందని చూసి కూడా ఎవరు కళ్ళు తిప్పు కుంటారో, వారి గతి భీష్ముడిలా అవుతుంది. ఎవరైతే ఫలితం తెలిసినప్పటికీ, ఇతరుల కోసం పోరాడుతారో వారు, మహాత్మ జటాయువులా కీర్తి సంపాదిస్తారు.
"నిజం అనేది కలత చెందుతుంది, కానీ ఓడిపోదు."
" సత్యమేవ జయతే "
--(())--
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక (7. )
క్వారంటైను సెంటరు కెళ్ళటం మేలు (నవ్వుల స్టోరీ)
సేకరణ / రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
అయ్యవార్లంగారు ఏం చేస్తున్నారూ ..అంటే ...చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు. అని సామెత. అలాగే ఉంది ప్రస్తుతం అందరి పరిస్థితి.
కూరలు కడగటం, పళ్ళు కడగటం , పూలుకడగటం, పనిమనిషిరాక అంట్లు కడగటం, చేతులేమో పదే పదే కడగటం.
ఈ కడగటాలతో విసుగెత్తి ఇంట్లో పలకరించినవాళ్ళనికూడా విసుగుతో కడిగిపారెయ్యటం.
ఈ విధం గా కడుగుళ్ళతో కడగండ్లు పడుతూ జీవుతాన్ని కడవరకూ గడపాల్సొచ్చేలా ఉంది.
మొదటగా రెణ్ణెల్లు అన్నారు. ఆనక ఆర్నెల్లన్నారు. ఇప్పడేమో సహజీవనమంటున్నారు.
ఈ విధంగా చుట్టమైవచ్చి దయ్యమై పట్టుకున్న కోవిడ్ ని కడతేర్చే ఉపాయాలు ఆలోచిస్తుంటే అదేమో, మీవూరుకొచ్చా ...మీ వీధికొచ్చా ...మీ పక్కింటికొచ్చా ..అని భయపెడుతోంది.
శానిటైజరంటే అపర సంజీవినిలా అనిపిస్తోంది. మాస్కుకీ ,మందిరానికీ గొడవలుపోయి మాస్కే మన జీవితమైపోయింది.
ఈవిధంగా నానా రగడగానూ గడబిడగానూ తయారైపోయిన జీవితాన్ని నెట్టుకురాలేక కొట్టుకు ఛస్తుంటే ...
తిప్పుకుంటూ వచ్చింది పంకజం , "ఏంటిసంగతులూ ..."అనుకుంటూ. "ఏముందీ ...నిన్నమిగిలిన దోసెపిండీ, మొన్నమిగిలిన ఇడ్లీపిండీ కలిపి ,రాత్రిమిగిలిన ఉప్మా ఉండలు ముంచి బోండాలేస్తున్నా "అన్నాను చిరాగ్గా.
కాస్త అయోమయం గా మొహం పెట్టి " తింటానికేనా ???"అనడిగింది. "మరేం చెయ్యమంటావు చెప్పూ ... ఇవ్వడానికి పనిమనిషిలేదు. కంటైన్మెంట్ జోనని మున్సిపాలిటీ చెత్తవాళ్ళు కూడా రోజుమార్చి రోజు వస్తున్నారు " అన్నాను.
"అందుకని చెత్తలో వెయ్యాల్సినవన్నీ పొట్టలో వేస్తే ...ఇంకేమన్నాఉందా ..."అంది. "ఏంచెయ్యమంటావ్ చెప్పు ...కాలేకడుపుకు మండే గంజి అనీ ...బతకాలి గాబట్టి బతికేస్తున్నాం తినాలి గాబట్టి తినేస్తున్నాం ఏదోవొకటి" అన్నాను విరక్తిగా ...
"ఇంకలాభం లేదు ...పీకల్లోతు డిప్రెషన్లో పడిపోయావ్. దీన్లోనించి బైటికిరావాలంటే అర్జెంటుగా అద్భుతమేదో జరగాల్సిందే" అంది పంకజం.
"అద్భుతమా ...! అసలు అలాంటిది ఈ జీవితంలో జరుగుందంటావా ...కరోనా పోతుందన్నది ఎంతనిజమో అద్భుతాలేవో జరుగుతాయన్నది అంతనిజం ..."అన్నాను. దువ్వుకోటానికి కూడా తీరికా, ఆసక్తీ లేక మూడురోజులనుండీ ముడిపెట్టుకుని తిరుగుతున్న జుట్టుని సవరించుకుంటూ.
"కళ్యాణానికి రావే కాంతమ్మా అంటే ...కోవిడమ్మా కుదరదు" అంటావేం. మంచిరోజులు రాకపోవా ...మనుషులంతా కలిసిపోరా ..."అని పంకజం ఏదో చెబుతుండగానే సెల్లు మోగింది.
"చూసావా శుభం. గంటమోగింది ఏదో శుభవార్తేమో చూడు " అంది పంకజం.
"అసలు సెల్లు తీయాలంటే గుండెలు ఝల్లు మంటున్నాయి ఏమి వార్త వినాల్సొస్తుందో అని ..."అంటూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాను.
మా చెల్లి ...అంటే నాకు పినపిన్నికూతురు. ఊళ్ళో ఉంటున్నా నాలుగు నెల్లుగా రాకపోకలు లేవు. శ్రావణ మాసం నోములకూ కూడా ఒకరికొకరం ఈసారి పిల్చుకోలేదు. మొన్న దాని కూతురి ఏంగేజుమెంటుకు కూడా పదిమందికే పర్మిషన్ అని , ఫంక్షన్ అయిపోయాక ఫొటోలు షేర్ చేసింది. ఇంకో నాల్రోజుల్లో పిల్లపెళ్ళి. అసలే బిజీ డాక్టర్ మా మరిదిగారు. ఈ కరోనా టైం లో ఎలా పెళ్ళి చేస్తాడో అనుకుంటుంటే , ఇప్పుడీ ఫోనూ ..
సందేహంగా ఫోన్ తీసాను. అటుపక్కనుంచి "హాల్లో అక్కయ్య " అంది అది హుషారుగా ..."ఏంటే సంగతులూ కొంపదీసి పెళ్ళికి పిలుస్తున్నావాయేం ..."అన్నాను. అది నిజంగానే "అవును అక్కయ్యా ..పెళ్ళికే పిలుస్తున్నా అమ్మాయి పెళ్ళికి నువ్వు తప్పకుండా రావాలి అంది !!!!"
నేను బోలెడు ఆశ్చర్యంతో నోరుతెరిచి "హౌ ! ఎలా ! నన్ను రమ్మంటున్నావా ..యే ..."అని వసంతకోకిలలో కమలహాసన్లా ...తెరపట్టనంత ఎమోషన్ గుమ్మరించేసా.
"ఏంలేదు అక్కయ్యా మా పెద్దాడబడుచు ముంబాయ్ నుండి రావలసింది. వాళ్ళ అత్తగారికి కరోనా ...వీళ్ళు క్వారంటైన్ అందుకే రావటం లేదు. ఆప్లేస్ లో నువ్వు రావొచ్చుకదా అందుకే ఫోన్ చేసా "అంది.
" ఒకే ...ఒకే రాత్రికి పెళ్ళికదా ...బావగారూ నేనూ స్నాతకానికి మధ్యాహ్నం నుండే అక్కడుంటాం నువ్వేం కంగారుపడకు "అని మామూలుగా మాట్లాడుతున్నా ...అది వెంటనే "సారీ అక్కయ్యా మధ్యాన్నం కుదరదు ఈయన హాస్పటలో డాక్టర్లలో ముఖ్యమైన ఒక పదిమందికి భోజనాలు. రాత్రికి వచ్చెయ్యి నువ్వు మాత్రమే ...బావగారు కూడావస్తే సంఖ్య పెరుగుతుంది. పెళ్ళివారొక ముప్ఫై మంది. మనవైపు ఇరవై మంది మాత్రమే రావాలి. మొత్తం యాభై మందికే పర్మిషన్ నీకు కుదరకపోతే చెప్పు ఇంకొకరిని పిలుస్తా " అని నిర్మొహమాటం గా చెప్పి ఫోన్ పెట్టేసింది.
ఒక్కసారి పాలపొంగుమీద నీళ్ళు చిలకరించినట్లైంది. తనురాకుండా నేనొక్కదాన్నేనా ...ఎలా అనుకున్నాను. ఈయన మాత్రం "దాందేవుందోయ్ ...హ్యప్పీగా వెళ్ళిరా ..మండపం దాకా దించొస్తా. రిటన్ అయ్యేటప్పుడు ఫోన్ చెయ్యి మళ్ళీ వచ్చేస్తా " అని క్రిష్ణపరమాత్మలా అభయమిచ్చేశారు.
ఇంకేం దాదాపు నాలుగైదు నెలలతరువాత వెళ్ళబోయే ఫంక్షన్ !అదేవిటో కంగారుగానూ ...విపరీతమైన ఉత్సాహంతోనూ కాళ్ళూ చేతులూ ఆడలేదు.
ఇన్నాళ్ళూ అద్దంలోకూడా చూసుకోవటానికి ఉత్సాహపడని మొహాన్ని ఆనాల్రోజులూ పదే పదే తోమి మెరుగుపెట్టాను. మావార్ని బ్రతిమాలి లాకర్లో నగలు తెప్పంచుకున్నాను.
ఆరోజు పంకజం సెలక్షన్ తో బంతిపువ్వురంగుకి రాణీ కలర్ పట్టుచీర కట్టుకుని , నగలు సింగారించి చివరిగా మొన్నచేయించుకున్న గోల్డ్ మాస్కు కూడా ధరించి కారెక్కి పెళ్ళికి బయలుదేరాను.
మావారు నన్ను మండపం వాకిట్లో దించి వెళ్ళిపోయారు. అందంగా తెరలు వేసినగది ముందున్న అమ్మాయి "వెల్కం " అని సానిటైజరు జల్లిన గులాబీ చేతికిచ్చి లోపలికి ఆహ్వానం పలికింది. లోపలికి వెళ్ళగానే సెంటుకలిపిన సానిటైజర్ జల్లుకురిసింది. తడిసిన చీరెతో బిత్తరపోయి బైటపడి పెళ్ళి మండపం లోకి వెళ్ళాను.
అది పెళ్ళి మండపం లాగా లేదు నాసా అంతరిక్ష కేంద్రం లా ఉంది. పూల మండపం కనపడింది కనుక పెళ్ళి మండపమేనన్న నమ్మకం కుదిరింది. అందరూ పీ. పీ యీ కిట్లతో హడావుడిగా తిరుగుతున్నారు. కొందరేమో బహుశా మగపెళ్ళివారనుకుంటా అదేకిట్లతో శిలా విగ్రహాల్లా దూరదూరంగా వేసిన కుర్చీల్లో కూర్చున్నారు.
ఇంతలో ఒక ఆకారం హడావుడిగా వచ్చి "రా అక్కయ్యా ...ఇదేనా రావటం" అంది. నేను నోరుతెరిచేలోపు ఒక కవర్ నా చేతికిచ్చి , "త్వరగా వేసుకుని రా "అని హడావిడి పెట్టింది. గదిలోకి వెళ్ళి చూస్తే ...నాకూ ఒక కిట్ ఇచ్చారు వేసుకోవడానికి ...ఆలోచిస్తూ నిలబడితే మళ్ళీవొచ్చి "కానీ కానీ "అని తొందరపెట్టింది.
నా పచ్చ పట్టుచీరా నగలూ ఒక్కసారి నన్నుచూచి నవ్వినట్లు అనిపించి బాధేసింది సరే !ఏంచేస్తాం అనుకుంటూ వాటిని కప్పెట్టి కిట్టేసుకుని బయట కొచ్చాను. అప్పట్నించీ మొదలయ్యింది అసలు గొడవ.
ఎవరు ఎవరో అసలు ఆడోమొగో అర్ధమై చావటం లేదు. కాస్త పొట్టిగా లావుగా ఒక ఆకారం కనబడితే మా చెల్లేమో అనుకుని "ఏవిటే ఫొటోల్లో చూసా పిల్లాడు మరీ నలుపూ ...ఇంతలో పిల్లకేం వయసైందని కాస్త ఈడూ జోడూ చూడొద్దూ " అన్నాను.
ఆ మనిషి ముసుగు కాస్త తొలగించి "నేను పిల్లవాడి తల్లిని ఇంతకూ మీరెవరు "అని గట్టిగా గద్దించింది. దెబ్బకు ముసుగు మూసేసి పక్కకు పారిపోయాను. "ఇదుగో మిమ్మల్నే " అని వెనకనుండి పిలుస్తున్నా వినిపించుకోకుండా.
కాసేపటికి నాభుజం మ్మీద చేయిపడింది "ఏమేవ్ మీ అన్నయ్య కొడుకు పెళ్ళిలో గోల చెయ్యాలి, గొడవ పెట్టాలి అన్నావు గా ...ఎక్కణ్ణించి మొదలెడదాం. భోజనాలు బాగులేవనా ...మర్యాదలు చాల్లేదనా" అంది ఒక మగ కంఠం ఠక్కున ముసుగుతీసి సీరియస్ గా చూసేసరికి " సారీ మా ఆవిడనుకునీ ...."ఖంగారుగా అంటూ అక్కణ్ణించి వెళ్ళిపోయాడతను .
అప్పటికి అర్ధమైంది నాకు అందరూ ఎందుకని అలా శిలావిగ్రహాల్లా కూచున్నారో ..నేనూ ఒక కుర్చీ చూసుకుని మెదలకుండా కూర్చున్నాను. పంకజం నా పక్కనే సెటిలయ్యింది.
ఒక ఆకారం నా పక్కనొచ్చి కూచొని "చూసావా వొదినా దీని గొప్ప ...పెళ్ళికొడుక్కీ ,తల్లికీ, చెల్లికీ విడిదింట్లో వెండి శానిటైజరు బాటిల్స్ పెట్టించిందట.డాక్టరు కదూ కరోనా కాలంలో కావలసినంత సంపాయిచ్చాడ్లే ...వెండివేం ఖర్మ బంగారపవైనా పెడతాడు. ప్రైవేటు క్వారంటైను సెంటర్ పెట్టారట తెలుసానీకూ ..." ముసుగుతియ్యటానిక్కూడా భయపడి నోరు మూసుక్కూచున్నాను.
పెళ్ళి పీటల మీద ఉన్నారు కనుక పెళ్ళి కూతురూ పెళ్ళి కొడుకుని గుర్తుపట్టాను. వాళ్ళకి కొంచెం పక్కగా బ్రహ్మగారు కుర్చున్నారు. పండపమంతా సెంట్లూ శానిటైజర్లూ కలిసిన వింత వాసన.
గణపతి పూజ కంటే ముందు "అపవిత్ర పవిత్రోవా "అంటూ చేతిలో శానిటైజర్ వేసి పెళ్ళి తంతు మొదలెట్టేడు బ్రహ్మగారు. డెట్టాల్ కలిపిన నీళ్ళతో కాళ్ళు కడిగాడు మా మరిదిగారు అసలే డాక్టరు కదా ఇంకొంచెం జాగ్రత్త తీసుకొంటున్నాడు.
మద్య మధ్యలో చేతిలో సానిటైజరు చల్లి తాగటానికి వేన్నిళ్ళూ, కాసిని డ్రై ఫ్రూట్స్ ఉన్న పాకెట్లూ అందిచ్చారు. తాగాలనుకున్నవారికి కాఫీ టీలతో పాటు పసుపువెసిన పాలు కూడా అందించారు.
ఆవిధంగా సానిటైజ్ చేసిన తాళిబొట్లూ , తలంబ్రాలతో పెళ్ళి తంతు ముగిసింది. పట్టు చీరెల గలగలలూ, అయినవాళ్ళ హాస్యోక్తులూ, సరదాల బంతిభోజనాలూ లేకుండా ఏదో చూసాం , తిన్నాం అంతే ...ఆ భోజనం తినడానికి కూడా భయమే ...
ఈయనకు ఫోన్ చేసి మండపం బయటికి వచ్చాను. వెళ్ళొస్తానని కూడా చెల్లికి చెప్పలేదు.కట్టుకున్న పట్టుచీర , పెట్టుకున్న నగలూ చిరాగ్గ అనిపిస్తున్నాయి. మావారు కారాపి ఎదురుచూస్తున్నారు. ఈ గ్రహాంతరవాసి అవతారంలో గుర్తుపట్టలేదనుకుంటా
కారుదగ్గరికి వెళ్ళి "ఏమండీ" అన్నా ...అనుమానం గా చూస్తుంటే ముసుగు తీసా. నవ్వేసి తలుపు తీసారు. పంకజం వెనక సీటులో సెటిలైంది.
"పెళ్ళి బాగా జరిగిందా ..."అన్నారు అలవాటుగా. "అది మాత్రం అడక్కండి కరోనాలో పెళ్ళి కెళ్ళటం కంటే క్వారంటైను సెంటరు కెళ్ళటం మేలు " అన్నాను విసుగ్గా. వెనక సీట్లో పంకజం మాత్రం నా స్థితిచూసి చెంగు అడ్డం పెట్టుకుని కిసుక్కుమని నవ్వుతూనే ఉంది.

ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక (6. )
సేకరణ /రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఈ పాపం ఎవరిది?
''ఒట్టేసి సెబుతున్నాను. ఈ పొద్దు అయ్యను సంపేత్తున్నాను'' అన్నాడు కొడుకు. ''అమ్మ ఏమన్నాసరే, యీడ్ని మాత్రం వదలకు, సంపెయ్యి'' అంది కూతురు.
సహనం కోల్పోయినప్పుడు నీటి చుక్క నిప్పవుతుంది. పువ్వు రెక్క పడగవుతుంది.
''అమ్మా..! అదేదో కిరానానో కిరోనోనో అంతన్నారు. అది మనూరేగాదు పెపంచకం మొత్తం సుట్టేసినాదంట టీవీలో సూపెడుతున్నారు. వొవురైనా బయటకొత్తే అది మీదడిపోయి పుటుక్కున పేనాలు తీసేద్దంటున్నారు. ఓపాలిటొచ్చి టీవీ సూడవే'' అని తల్లి సత్తెమ్మను పిలిచింది వరాలు.
''రేపట్నుంచి లాకుడౌనంట. ఒవురూ ఇల్లల్లోంచి బయటకు రాకూడదంట. దుకానాలు, ఆపీసులు, బడులు, గుడులు అన్నీ మూసేత్తారంట. ఇళ్లల్లోంచి ఒవులైనా బయటికొత్తే పోలీసోల్లు యీపులు సీరేత్తారంట. అలా ఎన్ని రోజులో సెప్పలేవంట. నెలుండొచ్చు, రొండు నెల్లుండొచ్చు అంతన్నారు'' అంటూ చెప్పుకొంటూ పోతోంది వరాలు.
''పన్లుంటేనే మన బతుకులు అంతంతమాత్రం గందా! పన్లు లేకుండా ఎలా బతకాల? మనకేవయినా ఆస్తులా పాస్తులా కట్టం సెబితే యినేవోలెవ్వరు, ఆకలమ్మా అంటే పలికేవోలెవ్వరు? ఇండ్లల్ల ఉంటే గడిసిపోడానికి మనకాడేటుందే కారిపోయే కొంప, చివికిపోయిన గుడ్డలు.. మండిపోయే కడుపులు తప్ప...'' అనుకొంటూ నెత్తిన చేతులు పెట్టుకొని, దిగాలుగా మోకాళ్లపై కూలబడిపోయింది సత్తెమ్మ.
అప్పల్రాజు ఒంటిపై ఈగలు దాడి చేస్తున్నాయి. పిచ్చి కూతలు కూస్తున్నాడు. అసహ్యంగా నోటి నుంచి చొంగ కారుస్తున్నాడు. బురదలో పొర్లిన పందిలా చీదరగా ఉన్నాడు. ఇంత మత్తులో జోగుతున్న తన మొగుణ్ణి చూసి ''ఈ మడిసికి నోకం ఏటైపొయ్యినా పట్టదు గందా!... ఛీఛీ యీడి బతుకుస్సెడ'' అంటూ నెత్తిని మోదుకుంది సత్తెమ్మ.
సత్తెమ్మ సత్తెకాలం నాటిది. నిస్సత్తువగా ఉన్నా నిక్కచ్చిగా బతకాలంటుంది. సత్తెమ్మ మొగుడు అప్పల్రాజు. వీళ్ళ పెళ్ళికి ఇరవై సంవత్సరాలు. వీళ్ళకు ఇద్దరు పిల్లలు. పద్దెనిమిదేళ్ళ కూతురు వరాలు, పదహారేళ్ళ కొడుకు నూకరాజు. పిల్లలిద్దరూ తల్లిలా కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్నారు.
ఇంటెజమాని ప్రతిరోజూ ఇంటికి ఎప్పుడొస్తాడో, ఎలా వస్తాడో ఆ సింహాద్రప్పడికీ తెలీదు. ఒక్కోసారి ఎక్కడున్నాడో కూడా తెలీదు. సత్తెమ్మ తన పిల్లలతో కలిసి నాలుగు దిక్కులూ తిరగడం ప్రతి తుప్పా, గొయ్యీ, నుయ్యీ, డ్రైనేజీలన్నీ వెతకడం.. దొరికితే ఇంటికి తోడుకొని రావడం.. దొరకలేదంటే ఆ రాత్రంతా బెంగగా ఏడ్చుకోవడం. ఎన్నో ఏళ్ళుగా ప్రతిరోజూ, ప్రతిరాత్రీ ఇదే తంతైపోయింది ఆ తల్లీ బిడ్డలకి.
అప్పల్రాజు శత్రువులాగ, నమ్మకద్రోహిలాగ, భరించలేనంత అవమానంలాగ కనిపించాడేగానీ ఏనాడూ మొగుడులా కనిపించలేదు సత్తెమ్మకు.
''తిండా, గుడ్డా, సుకమా, శాంతా... యీడ్ని కట్టుకొని నేనేం బాంకున్నాను. తన్నులు, పిడిగుద్దులు, వాతలు, బూతులు తప్ప. ఎంతసేపూ ఆడి గోల, ఆడి తాగుడు ఇంకేం పట్టినాది గనక. తాగుడు కోసమే కట్టపడతాడు. నేదంటే డబ్బుకోసం మమ్మల్ని పీక్కుతింతడు. లేదా నన్ను, నా పిల్లని తార్చయినా, సివరాకరికి మమ్మల్ని సంపైనా డబ్బు తీస్కుపోతాడేగానీ.. తాగడం మాన్డు.''
''యీడు నన్నెంతగా సెమటలు పట్టించినాడో, యెన్ని నిప్పులల్ల నడిపించినాడో, యెంత నెత్తురు కార్పించినాడో, యెన్ని రంపపు కోతలు కోసినాడో, గుండెలవిసేలా యెంత ఏడిపించినాడో యేమీ సేయలేక అలా సూత్తూ ఉండిపోయిన ఆ దేవదేవుడు యెంకన్నబాబుకే తెలుసు. నా బాధ పడనేక, నా యేడుపు సూన్నేక పిల్లలు యీడ్ని యింటికి తోల్కొత్తన్నారేగానీ నేకపోతె యీడికి ఏనాడో పిండం పెట్టేద్దురు. నాకేనాడో తెల్లకోక సుట్టేద్దురు'' అని ప్రతిసారీ తనలో తాను అనుకొంటూనే ఉంటుంది సత్తెమ్మ.
సత్తెమ్మ నాలుగిళ్ళల్లో పాచిపనులు చేసుకుంటుంది. తాను పనిచేస్తున్న అమ్మగార్లల్లో అన్నపూర్ణమ్మ గారంటే సత్తెమ్మకు ఎంతో ఇష్టం. ఆమె సత్తెమ్మను సాటి మనిషిలా తప్ప పనిమనిషిలా ఏనాడూ చూడలేదు. తనకేదైనా కష్టం వచ్చి దేవుణ్ణి తలుచుకున్నప్పుడల్లా ఆయమ్మే దేవుడిలా ఆదుకుంటాదనేది సత్తెమ్మ. వరాలు పెద్దమడిసైనప్పుడు ఆ తల్లే సాయం చేసింది. పిల్లకి తానే బట్టలు కొనిచ్చింది. ఒకటేమిటి చాలా చేసింది. పండక్కీ పబ్బాలకే కాదు ఇంట్లో ఏమి చేసుకున్నా ం తన పిల్లల కోసం దాసుంచేదా తల్లి. పెద్దింటోళ్ళు తినే రుచులన్నీ ఆమే మాకు చూపించింది. ఆ అమ్మ దగ్గర నేను, నా పిల్లలు జీవితాంతం పనిచేసినా ఋణం తీరదంటుంది సత్తెమ్మ.
అన్నపూర్ణమ్మగారు నవ్వుతున్నట్టుగా పైకి కనబడుతున్నా ఆమె ఏదో తెలియని బాధని గుండెల్లో దాచుకున్నట్టుగా కనిపించేది. తనకు కనిపించకూడదని తల తిప్పి, కళ్ళు తుడుచుకొంటూ ఉండేది. ఇంత మంచి మనిషిని ఏ కష్టం తినేస్తుందో కదా అనుకునేది. అడుగుదామంటే ఏమంటారోననే భయంతో అడగలేకపోయేది సత్తెమ్మ.
ఒకరోజు పనికని అన్నపూర్ణమ్మగారి ఇంటికి వెళ్ళింది. అక్కడ అమ్మగారి ముఖం ఏడ్చి ఏడ్చి పొంగిపోయి ఉంది. ఆమె కుడిచెయ్యిని అసలు కదప లేకపోతోంది. అది చూసిన సత్తెమ్మ కంగారుపడిపోతూ ''అమ్మా!.. ఏటైనాదమ్మా? సెప్పండమ్మా...'' అంటూ దగ్గరగా వెళ్ళిన సత్తెమ్మను పట్టుకొని, చిన్నపిల్లలా ఏడ్చేసింది అన్నపూర్ణమ్మ.
అయ్యగారు పచ్చి తాగుబోతని, అమ్మగార్ని ఏనాడూ మనిషిగా చూడడని, గొడ్డును బాదినట్టు బాదుతాడని.. ఆయనగారికి వేరే ఆడోళ్ళతో చాలా ఖాతాలున్నాయని సత్తెమ్మకు అప్పుడే తెలిసింది.
''ఊరంత కొంపల్లో ఉండేవాళ్ళక్కూడా బాధలుంటాయా? వాళ్ళకేంటి ఏది కోరుకుంటే అది కొనుక్కుంతరు. నచ్చింది తింతరు. కార్లల్లో సికారులు తిరుగుతుంతరు. మెరుపు గుడ్డలేసుకుంతరు. బంగారాలు దిగేసుకుంతరు. పొగడర్లు రాసుకుంతరు. అత్తర్లు పూసుకుంతరు. ఇలాంటి దరిజా బతుకులక్కూడా కట్టాలుంటాయా?'' అని ఆశ్చర్యపోయింది సత్తెమ్మ.
''ఇన్నాళ్లూ సదువు సెంజా లేని మా యెధవలే ఆడోళ్ళను కుమ్మేత్తారనుకొన్నాను. పెద్దోళ్ళు, సదుంకున్నోళ్ళు, పెద్ద ఉజ్జోగాలు యెలగబెడుతున్నోళ్ళు తమ పెతాపాలన్నీ ఆడోళ్ళపైనే సూపెడుతుంటే ఇంక మంచేటి సెడ్డేటి, సిన్నేటి పెద్దేటి'' అనుకుంటూ ఒక్కసారిగా ఆలోచన నుంచి బయటపడి ''ఊరుకోండమ్మా... ఓర్చు కోండమ్మా..'' అంటూ అమ్మగారితో పాటు తానూ ఏడ్చేసింది సత్తెమ్మ.
సత్తెమ్మ ఉండే వాడలోని చాలా ఇళ్ళకి గోనెపట్టాలే తలుపులు. అందుకే వాళ్ళకు మరుగుండదు. అక్కడ చీమ చిటుక్కుమంటే ఊరూ వాడా దండోరా. పెద్దింటోళ్ళ ఇళ్ళు పెద్దవి, దళసరి గోడలు, దుక్కల్లాంటి తలుపులుంటాయి. అవి మూసేసామా లోనేం జరిగినా అది గుట్టే.
వాడలోని ఆడోళ్ళందరి నోర్లూ పెద్దవి కాబట్టి వంటి మీద దెబ్బపడగానే తిట్టుకొంటూ రోడ్డెక్కిపోతారు. చదువుకున్న అమ్మగార్లందరూ పైటకొంగును నోట్లో కుక్కుకొని, గుట్టుగా ఉంటారని ఇప్పుడే తెలిసింది.
ఇందుమూలంగా తెలిసిందేటంటే ''సిన్నసిన్న వయసోళ్లు, నేలబారోళ్లు, మద్దెతరగతోళ్లు, పెద్దింటోళ్లు ఇలా ఒకటేటి పెతీమగాడూ తాగేటోడే. దీనొల్లా అదేపనిగా తాగేటోళ్లు, తాగుడే పనిగా పెట్టుకొన్నోళ్లు. ఆరారా తాగేటోళ్లు, అడపాదడపా తాగేటోళ్లు, పుట్టినరోజని, తద్దినమని, మంచికి సెడ్డకి దేనికైనా తాగుడే పెదానమైపోనాది. ఆ మందేమైనా గేనమా? బలమా? అది మడిసిని పసువును జేసి కుమ్మేయమంటది. నమ్ముకున్నోందర్ని బలిసేయమంటది. సివరాకరికి తాగేటోళ్ళందర్నీ బలి తీసుకొంటది. ఇదేం పాడలవాటో గందా!'' అనుకొంటూ కళ్లు తుడుచుకొంది సత్తెమ్మ.
అప్పుడెప్పుడో ఎన్నో యేళ్ళ కిందట మనువైన కొత్తల్లో తన పెనిమిటిని ప్రేమగా చూసుకొంది సత్తెమ్మ. అదంతా కొన్ని నెలల ప్రేమ. ఎన్నో ఏళ్ళ తరవాత సత్తెమ్మకు అప్పల్రాజు కొత్తగా కనిపించాడు. ముదరగా ఉన్నా ముద్దుగానే ఉన్నాడనిపిం చింది. వాళ్ళాయనపై మళ్ళీ ప్రేమ పుట్టుకొచ్చింది సత్తెమ్మకు. ఆవేలప్పుడు గుమ్మం ముందు కలుపు మొక్కలన్నీ పూల మొక్కలుగా మారిపోయినట్టు, వేప పళ్లన్నీ తీయని పళ్ళయినట్టు తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు మాయగా తోచింది సత్తెమ్మకు.
ఈ ప్రేమకు ఈ ఆనందానికి కారణం లేకపోలేదు. మూడ్రోజుల నుంచి తన పెనిమిటి మందు తాక్కుండా ఉన్నాడు. యీడ్ని ఇలా ఎప్పుడైనా చూసానా? అందుకే ఈ ఆనందం. ''అమ్మా! కిరోనో తల్లీ నువ్వు దయ్యానివి కావమ్మా. మా పాలిటి అమ్మోరు తల్లివ''ంటూ చేతులు జోడించి దండాలు పెట్టింది సత్తెమ్మ. తన సంతోషాన్ని అన్నపూర్ణమ్మగారితో పంచుకోవాలనుకొంది. ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. అమ్మగారిని కలవకపోతే తిండి గడిచేదెలా అనుకొంది. పవిటకొంగును మూతికి కట్టుకొంది. ఎవరికీ కనబడకుండా సందుల్లోంచి అమ్మగారింటికి చేరుకొంది.
'అమ్మగోరూ... అమ్మగోరూ...' అంటూ కేకలేసుకొంటూ సత్తెమ్మ వంటింటి గుమ్మం దగ్గర నిలబడి చూసింది. గదంతా ఘుమఘుమలతో నిండిపోయింది. అన్నపూర్ణమ్మగారూ వాళ్ళాయన ఇద్దరూ కలిసి ఏవేవో ఊసులాడుకుంటున్నారు. నవ్వుకుంటున్నారు. సత్తెమ్మను వాళ్ళు గమనించలేదు. వాళ్ళ లోకంలో వాళ్ళున్నారు. అక్కడ నుంచి వచ్చేసి, చాలాసేపు బయటే ఎదురుచూస్తూ ఉండిపోయింది. అమ్మగారిని ఇంతానందంగా తానెప్పుడూ సూడలేదనుకొంది. కారణం ఏమై ఉంటుందో సత్తెమ్మకు అంతుపట్టలేదు. అమ్మగారు బయటకు వచ్చీ రాగానే ''సత్తెమ్మ నువ్వా! ఎప్పుడొచ్చావే?'' అని అడిగింది.''ఇప్పుడేనమ్మా'' అంది సత్తెమ్మ. ''ఇంత సంతోషంగా ఉన్నారు. ఏంటమ్మా ఇసయం'' అని ధైర్యంగా అడిగేసింది సత్తెమ్మ.
''మీకో ఇసయం చెప్పాలమ్మగారూ. మా ఆయన మూడ్రోజుల నుంచి మందు ముట్టలేదమ్మా. తానం చేసి, ఉతికిన గుడ్డలేసుకొని, గుళ్లో దేవుల్లాగున్నాడమ్మా. మందు సాపు మూసేసినారమ్మా. బయటికెలితే మక్కిలిరిసేత్తున్నారమ్మా. సిగరెట్టుల్లేవు, కయినీల్లేవు, పాన్‌పరాగ్గుల్లేవు. దరిద్రాలన్నీ ఒకేసారి ఒగ్గేసాయమ్మా. అందుకే నాకీ సంతోసం. మరి మీ సంగతో?...'' అని అడిగింది సత్తెమ్మ.
''మీ ఆయనలాగే మావారూ మూడ్రోజుల నుంచి మందు తాగలేదు'' అంది అన్నపూర్ణమ్మ.
''అమ్మగోరూ! మందు నేకపోతే ఇళ్లల్లో ఇంత ఆనందం ఉంటదా?'' అని ఆశ్చర్యంగా అడిగింది సత్తెమ్మ.
''లాక్‌డౌన్ కనీసం రెండు నెలలైనా ఉంటుందంటున్నారు. ఎలా బతుకుతారే?'' అంటూ సత్తెమ్మను వంటగదిలోకి పిలిచి, వారానికి సరిపడా బియ్యం, సరుకులు, కూరలు అన్నీ సంచుల్లోకి సర్దింది అన్నపూర్ణమ్మ. ఇవి తీసుకొని ఎవరికీ కనిపించకుండా ముఖానికి గుడ్డ కట్టుకుని, ఈ దొడ్డిదారిని వెళ్ళిపొమ్మంది. ఏది కావాలన్నా వచ్చి తీసుకెళ్ళమని భరోసా ఇచ్చింది అన్నపూర్ణమ్మ. ఆదుకున్న అమ్మగారి పాదాలను కళ్ళకద్దుకుంది. చిన్నా, పెద్దా మూడు మూటలను ముగ్గురు బిడ్డల్లా ఆప్యాయంగా నెత్తినెత్తుకొని, ఇంటికి చేరుకుంది సత్తెమ్మ.
భర్తకు, పిల్లలకు అన్నం వడ్డించి, తనూ తింది సత్తెమ్మ. కలిసి తిన్నది చారన్నమయినా అది విందు భోజనంలా అనిపించిందామెకు. ఎన్నో ఏళ్ళ తరవాత నలుగురూ మనస్సులు విప్పి మాట్లాడుకున్నారు. కలిసి నవ్వుకున్నారు. ఉన్నదేదో పంచుకు తిన్నారు. ''ఒరేరు నూకరాజా! నీకు తెలిసినోళ్ళల్లో మాంచి కుర్రాడుంటే సూడ్రా. మంచి సమ్మందం కుదిరితే యీ ఏడాదే వరాలకు పెళ్ళి చేసేద్దాం'' అన్నాడు. ''ఒలే సత్తెమ్మా! నీకు తెలిసినోళ్ళకి నువ్వూ చెప్పవే. నాకు తెలిసినోళ్ళకి నానూ సెబుతాను'' అన్నాడు అప్పల్రాజు. ఇంటెజమాని బాధ్యతపడి మాట్లాడుతుంటే పొంగిపోయింది సత్తెమ్మ. పెళ్ళి మాట వినగానే కూతురి ముఖం సిగ్గుతో ముద్దులొలికింది. అయ్య మాటలు విన్న నూకరాజు తాను అక్కా బావలతో కలిసి అరుకు వెళ్ళిపోయినట్టు ఊహల్లో తేలిపోయాడు.
ఊరూ వాడా ఇంత ప్రశాంతంగా ఏనాడూ లేదు. బూతుల్లేవు. తన్నుకోడాల్లేవు, ఏడుపుల్లేవు, సిగరెట్టు పొగల్లేవు, పాన్‌పరాగ్ ఉమ్ముల్లేవు. ఊరంతా ఎంతో నిర్మలంగా ఉంది.
రేపట్నుంచి అన్ని రాష్ట్రాల్లోను మద్యం అమ్మకాలు జరుగుతాయని, మందుషాపులన్నీ తెరుస్తారని టీవిలో చూడంగానే ఉండేలు దెబ్బతిన్న కాకిలా కూలబడిపోయింది సత్తెమ్మ.
రోజూలాగే ఈరోజూ తెల్లారింది. కానీ వెనకటి నలభై రోజుల్లా ఈరోజు లేదు. మసకబారిపోయింది.
''ఏవయ్యా! ఏవయ్యా!!'' అంటూ ఇంటి చుట్టూ కేకలేసుకుంటూ తిరిగింది సత్తెమ్మ.
''ఇంకెక్కడ మీ ఆయన, మీ ఆయనే కాదు ఊర్లోని మగాళ్లంతా తెల్లారకముందే వెళ్ళిపోయారే. ఈరోజు మందుషాపు తెరుస్తారట. నీకు తెలీదా'' అంది పక్కింటి కొండమ్మత్త. యీడి దగ్గర డబ్బుల్లేవు గందా ఎలా తాగుతాడని ఆలోచించి ఒక్కసారిగా ఇంట్లోకి పరుగెత్తింది. ఇంకేముంది, ఇంట్లో టీవి లేదు. గుండెలు బాదుకొంది.
''అది నా రెక్కల కట్టం'' అంటూ లబోదిబోమన్నాడు కొడుకు నూకరాజు.
ఇక నుంచి పాత కథే. షరా మామూలే! ఆ రాత్రి సత్తెమ్మ పిల్లలతో కలిసి ఇంటాయిన్ని వెతకడానికి వెళ్ళింది. రోడ్డు పక్క డ్రైనేజీలో ఒంటిపై గాయాలతో ఉన్నాడు. తెలివి లేకుండా శవంలా పడి ఉన్నాడు. అక్కడక్కడ చర్మం చీరుకుపోయి రక్తం కారిపోతూ ఉన్నాడు. ఎలాగైతేనేం, అప్పల్రాజుని ఈడ్చుకొంటూ వచ్చి ఇంట్లో పడేసారు.
ఆ రాత్రి మత్తులో పశువాంఛతో మతి తప్పిన మృగంలా కూతురు వరాలపై అఘాయిత్యం చేయబోయాడు తండ్రి అప్పల్రాజు. అది చూసిన నూకరాజు తండ్రిని చావచితకబాదాడు. ''అమ్మా...! అమ్మోరు... ఈరోజు ఏమైనా సరే, నేనేమైనా సరే, నువ్వేమన్నా సరే, మనమేమైనా సరే, సిచ్చపడినా సరే, సత్తెపెమానకంగా ఈరోజు యీడ్ని సంపే తీరతాను'' అంటూ కత్తి తీసాడు. ఎంతో బలవంతాన కొడుకుని ఆపి ఒక్క జెల్ల కొట్టింది సత్తెమ్మ. నిస్సహాయురాలైన సత్తెమ్మ బిడ్డలను పట్టుకొని కుండపోతగా భోరుభోరున ఏడ్చేసింది.
మర్నాడు లేచేసరికి మూతిని కట్టేసిన పందిలా మూలుగుతున్నాడు అప్పల్రాజు. ఒల్లంతా వాచిపోయి ఉంది. ఒళ్లు కాలిపోతోంది. జ్వరంతో వణికిపోతున్నాడు. ఏదైనా మాత్రలు గాని, ఆయింటుమెంటు గాని ఉంటే ఇస్తారనె నమ్మకంతో అన్నపూర్ణమ్మగారింటికి పరుగెత్తింది సత్తెమ్మ.
అక్కడకు వెళ్ళి చూస్తే అమ్మగారి ముఖమంతా చేతివేళ్ళ దెబ్బలతో తట్టులు తేలి ఉంది. ముఖమంతా వాచిపోయి అక్కడక్కడ రక్తం చిందుతూ ఉంది. సత్తెమ్మను చూడగానే అన్నపూర్ణమ్మ దుఖంతో కుమిలిపోయింది.
మగాళ్ళంతా మంచోళ్ళు కాకపోవచ్చు. దుర్మార్గులు మాత్రం కాదన్న విషయం మొన్నటి నలబై రోజుల్లో బోధపడింది. ఈ మహమ్మారి మందే వీళ్ళని పశువులుగా మారుస్తుంది అనే సత్యాన్ని తెలుసుకుంది సత్తెమ్మ.
''మొన్నొచ్చిన కిరోనా నిన్నుంది. ఈరోజుంది. రేపు కచ్చితంగా చచ్చే తీరుతుంది ఇది నిజం. కాని ఈ మద్యం మహమ్మారి జనమ జనమకి మనందరినీ సంపుతుందేగాని అది సవ్వదు గాక సవ్వదు. యిది ముమ్మాటికి పచ్చి నిజం' ' అనుకొంటూ
''అమ్మగోరూ! ఈ మందును తరిమికొట్టాలంటే సంపేసి భూములల్ల పాతియ్యాలంటె ఏం సెయ్యాలమ్మా? సెప్పమ్మా... సదుంకున్నదానివి ఏం సేత్తే మందును సేస్వతంగా తీసేత్తారో మీకు తెలిసే ఉంటది. సెప్పమ్మా ఏం సెయ్యాలో సెప్పండమ్మా'' అంటూ ఆవేశంతో అన్నపూర్ణమ్మగార్ని చెట్టును కుదిపినట్టు కుదిపేసింది సత్తెమ్మ.
షుగరే తగ్గిందో, బీపీయే పెరిగిందో, అలసిన గుండె అలిగిందో గాని ఆవేదనతో సత్తెమ్మ కుదిపి అడుగుతుండగానే.. అన్నపూర్ణమ్మ నిలువునా కుప్పకూలిపోయింది.
జరిగిన ఘోరానికి గుండెలు బాదుకొంటూ బిక్కచచ్చిపోయింది సత్తెమ్మ. ''ఈ మందును తీసినోడికే ఓటేయాలి.. అలాంటి గోవర్నమెంటొత్తేనే మా ఆడోళ్ళ బతుకులు బాగుండేది..'' అనుకుంటున్న సత్తెమ్మ కన్నీళ్లు వాననీటిలో కలిసిపోయాయి.
- కె.వి.యస్. ప్రసాద్
94410 24054

ప్రాంజలి ప్రభ .. అంతర్జాల కధలు (5 )
దేశం కోసం " సైనికుడు "
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
దేశం కోసము చివరి వరకు పోరాడు, శత్రు శైనికులపై కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు…
అదీ చేతకాకపోతే, పాకుతూ పో…
అంతేకానీ, అలా కదలకుండా ఉండిపోకు ప్రాణాలర్పించైనా గెలుపుకు సహకరించుటకు నీకర్తవ్యం.
దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే…
నీలో పౌరుషం ఉప్పొంగి కెరటంలా ఎగసినే పడు. నీ ధర్మ దక్షత ఏక కాల దీక్ష, నిన్ను నడిపించు వెనకడుగు వేయకు సైనికా.
ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడొకడు మోసం చేశాడని,
ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారనీ ఆ పనికిరాని కబుర్లు మనసులో నుంచి తరిమి నిగ్రహశక్తి తో కదులు మందికి సాగిపో సైనికా .
తలుచుకుంటే, నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది సైనికా
జాతీయపతాకాన్ని చేత ధరించి భారత మాత జిందాబాద్, అంటూ ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టాన్ని భరించి మాతృభూమి ఋణము తీర్చుకో. సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు…
పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా – ఒకవీర సైనికుడుగా ఆగిపోడానికి వీల్లేదు!
లే… బయలుదేరు సైనికా
…
నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ సంకెళ్ళను తెంచేసుకో, పరుగు మొదలుపెట్టు!నీ శక్తి ని ఉపయోగించి రక్షణకు ఆయుధము చేతపట్టు. నువ్వు పడుకునే పరుపు, నిన్ను చీదరించు కోకముందే బద్దకాన్ని వదిలేయ్!
నీ అద్దం, నిన్ను ప్రశ్నించి ముందే తల్లి తండ్రుల దీవెన తో పుణ్య భూమికి సమాదానం కాదు జయమే ముఖ్యం. నీ నీడ, నిన్ను వదిలేయక ముందే వెలుగులోకి వచ్చి సోదరులతో చలించు సైనికా .
మళ్ళీ చెప్తున్నా…
కన్నీళ్ళు కారిస్తే కాదు, రక్తాన్ని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో…
నిన్ను నీవు నమ్ముకో దేశమే నిన్ను నడిపిస్తుంది
సత్య మేవ జయతే
--(())--
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక నేటి కధ
శిష్య సందేహాలు-
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ :
శిష్య సందేహాలు-
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ :
గురువుగారు వానలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకని అని అడిగారు శిష్యులు.
వినండి కాల చక్రం ఎప్పుడు ఒకే విధముగా, ఒకేవేగముగా తిరుగుతూ ఉంటుంది. ఇపుడు మనం తయారు చేసిన గడియారం చూడండి అది ఒకే వేగముగా కదులుతుంది. అంటే దానిలో దానిలో సెకనుల ముళ్ళు, నిముషాల ముళ్ల, ఘంటల ముళ్ళు కదులుతాయి. అనే ఒకదాని కొకటి అవినాభావ సంభందం ఉంటుంది. రుతువులు మారుతాయి ఇప్పుడు వర్ష ఋతువు అందుకే వర్షాలు.
అలాగే భూమి గుడ్రముగా తిరుగుతుంది, అంటే భూమిలో పర్వతాలు, నదులు, ప్రాణులు ఒకరు తర్వాత ఒకరు కదులుతూ ఉంటారు అని మనకు తెళుస్తున్నది కదా. అనే ఏప్రాంతము క్షేమమము, ఏప్రాంతము క్షామము ఎవరు చెప్పఁగలరు ఎలా ఉన్న ప్రాణులు భరించక తప్పదు.
ఇప్పుడు మానవులు భూమిని నమ్ముకున్నారు, భూమి ద్వారా పంటలు పండించి ఆహారాన్ని తయ్యారు చేసి తిని శక్తి వచ్చే విధముగా తయారవుతున్నారు. అంటే ప్రతి ప్రాణికి ప్రకృతి సహకరిసున్నది. గాలి, నీరు, వెలుతురూ అందిస్తున్నదని అని తెలుస్తున్నది.
ఎండా కాలంలో కోయల కూయటం, వానాకాలంలో కుక్కలు కలవటం, చలికాలంలో నక్కలు మోర గటం జరుగు తాయా ? ఆ కాలాలు బట్టి అవి ప్రవర్తిస్తాయి అంతే . ఎక్కడ ఏ విధముగా జరుగుతున్నదో ఆప్రాంతము వరకు కొంత అనర్ధ, ఎండాకాలంలో తుఫాన్లు, మేఘం లేకుండా పిడుగులు పడుట జరగవచ్చు మిగతా ప్రాంతము క్షేమంగా ఉండవచ్చు.
కృత్రిమంగా మేఘం తయారవుతుంది, అది తాత్కాలికంగా సూర్యుడు నుంచి వచ్చే కిరణాలను చంద్రుని నుండి వచ్చే వెన్నెలను ఆపగలుగు తున్నది. దానివలన ఎవరికీ ఇబ్బంది ఉండదు.
ఎండాకాలం వచ్చిం దంటే నీడ కోసం పరిగెడతాం. కానీ చెట్లు ఎండని భరించి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. చీకటిలో వెన్నెల మనస్సుకు ప్రసన్నత కల్పిస్తుంది, కాస్త ఓదార్పు అని గమనించ వచ్చు, మరునాడు మరో విధముగా ఉంతుంది.
వానాకాలం వచ్చిందంటే వరదలు వస్తాయి, వద్దనలేము, ఆనీరును వాడుకోలేము, నదులన్నీ సంధానము చేయలేము, వ్యర్ధ సంభాషణలతో కాలం వెళ్లబుచ్చి జీవితము సాగిస్తాము
అందుకే ఏ ఎండకు ఆగొడుగు పట్టండి అన్నారు. నదులు వెళ్లి సముద్రములో కలవక తప్పఁ దు, నీటిని కలవద్దని చెప్పలేము, సముద్రపు నీటిలో మంచి నీరును కనుగొనలేము. అందుకే అందు బాటులో ఉన్న వనరుల సహకారముతో, శక్తికి తగ్గ విధముగా సేకరణ ద్వారా, సహకారముద్వారా, పొంది ఆరోగ్యాన్ని జాగర్త చేసుకుంటూ, వయసును బట్టి కాలాలను బట్టి జీవితము సాగిస్తూ ఉండటమే.
నీడను నేను పట్టు కోగలను అంటే ఎవరు నమ్ముతారు, గాలిని చూసాను, చేతుల్లో బంధించాను అంటే ఎవరు నమ్ముతారు, నా వీపు పై ఎన్ని మచ్చలున్నాయో నాకు తెలుసు అని వాదించే వాడిని ఎవరు నమ్ముతారు. మనుష్యుల్లో ఉన్న తరతమ్యాన్ని గమనించి ఎలా బ్రతుకుతామో అలాగే ప్రకృతి జరిగే మార్పులను భరించి బ్రతకాలని గమనించండి అన్నారు గురువు గారు.
మనిషి సంపద సృష్టిస్తాడు. సంపద సంపదను పెంచుతుంది. సంపద పెరిగిన కొద్దీ నిద్రా ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
సంపదపై అతిగా ఆశకు పోకుండా ఉన్నదానితో నలుగురికి పంచి సంతృప్తిగా జీవతాన్ని సాగించాలి. కడుపులో ఉన్న చల్ల కదలకుండా జివిఆన్ని వెళ్లబుచ్చాలి.
ఎవరకు ఎవరు ఏమి చేయరు, మనం చేసిన పుణ్య ప్రభావమే మనకు మన:శాంతి కలిగిస్తూ ప్రాశాంత త కల్పిస్తుంది
సంతాన అవసరాలను తల్లి ఎలా తీరుస్తుందో, అలాగే సకల ప్రాణుల అవసరాలను ప్రకృతి మాత తీరుస్తుంది. అది తెలుసుకొని జీవనమార్గాన్ని సుఖ ప్రదం చేసుకోవటమే మానవుల లక్ష్యంగా జీవించాలి. సత్య, ధర్మం, న్యాయం వదలకుండా, ఓర్పు వహించి నేర్పుతో, మాట పొల్లు పోకుండా జీవితము గడిపేవానికి కాలము ప్రకృతి అనుకూలముగా ఉంటుంది అని నేను చెప్పుటలేదు మనఋషులు చెప్పినవే నేను చెపుతున్నాను.
ఎవరు ఎన్ని చెప్పిన అనుభవం వచ్చేదాకా ఎవ్వరు నమ్మరు, అదే దేవుడు సృష్టించిన మాయ. ఆమాయ చేధించాలంటే భగవంతుని ప్రార్ధనలే మనకు ఆధారాలు, సంస్కార వంతులైన భారతీయుల ఆలోచనా విధానాన్ని అర్ధం చేసుకోవాలంటే , ప్రాచీన కాలం మొదలు ఆధునిక కాలం వరకు జీవన సరళిలో కలిగిన మార్పుల బట్టి జీవించటానికి ప్రతి ఒక్కరు కృషి చేయటయే, " అర్థంబె కీర్తియు, అర్థంబె నేర్పు, అర్థంబె కులము, అర్థంబె గుణము, అర్థంబె శుచియు " అని భ్రమించి అర్ధం కొరకు జీవితాన్ని ముందుతరాల వారి కొరకు శ్రమించుట అవసరమా అని ఒక్కసారి ఆలోచించి జీవితం సాగించుటే జన్మ పరిపక్వత అని నేను భావిస్తాను అని చెప్పారు గురువుగారు.
అందరూ లేచి ఆ ఆదిపరాశక్తి నమస్కరించి, గురువుకు నమస్కరించి కదిలారు.
సర్వే జనా సుఖినోభవంతు .. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి
ప్రాంజలి ప్రభ- అంతర్జాల పత్రిక (2 )
రచయత: మల్లాప్రగ్గడ శ్రీదేవి రామకృష్ణ
చిన్న కధ "కరోనా "
కరోనా గురించి అదేపనిగా ఆలోచించకకండి
కళ్ళు తెరవండి - నిజం తెలుసుకోండి - ఆరోగ్యంగా జీవించండి
ఎలా ఉన్నవురా అని మాటా అడక్కు ? బాయఁట ప్రపంచమ్ అస్సలు తెలియదు, టివిలో విన్న సమాచారం తప్ప అది కూడ అన్ని తప్పులే
ఇంట్లో ఉండి రోజు రెండు సార్లు కషాయం తీసు కుంటున్నాను
అన్నీ మంచి అలవాట్లే… ఐనాకరోనా ….?
ఏజ్ - 30…
నో సిగరెట్…
నో మందు…
నో గుట్కా….
అసలే చెడు అలవాట్లు లేవు…,,,,,,,,,,,,,,,,,,,
పైగా రోజూ ఎక్సర్ సైజ్…
అప్పుడప్పుడు యోగా…
అయినా…
ఏం జరిగిందో తెలుసా….?
తుమ్ములు వచ్చి దగ్గు వచ్చితే ,
ఏదో చిన్న సమస్యతో టెస్ట్ లు చేయించుకుంటే కరోనా ఉందంటూ…
షాకింగ్ న్యూస్….!!!!!!!
ఇదెలా..
ఎలా..
ఎలా..?
ఆ యువకుడు తలలు బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు…
ఇలా మన దేశంలో ….
మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎందరో…?
ఇంతకీ అన్నీ మంచి అలవాట్లే ఉన్నా…
ఆరోగ్యంగా ఉన్న నాకేంటి అంటు బయట మాస్కు లేకుండా సేన్హితుల వెంట తిరిగాను,
స్నేహితుని పెళ్ళికి వెళ్లి వచ్చాను అంతే
చిన్న ఏజ్ లోనే కరోనా ఎందుకు వస్తోంది…?
డాక్టర్లు చెపుతున్నారు గ్యాస్ గొంతులోకి పొతే రోగం, గొంతునుండి బయటకొస్తే రోగం, ఊపిరాడక పొతే రోగం, ఊపిరున్న భయంతో ఉన్న అనుమాన రోగం అంత రోగాలమయమేనా ?
అసలు కారణమేంటి…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,?
మన తండ్రులు, తాతలు ఇప్పటికీ అరవైలు, ఎనభైల్లోనూ ఉల్లాసంగా ఉంటే..,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,
పాపమ్ వారికీ వదలకుండా వెంబ డిస్తున్నది "కుళ్ళు కరోనా "బాగుంటే చూడ లేదు ఇందుకో ?
మన తరానికే ఏంటీ మాయరోగాలు…,,,,,,,,,,,,,,,,,,,,,,?
వెరీ సింపుల్…
పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా…
మనం తినే తిండీ, తాగే నీరు, పీల్చేగాలి అన్నీ కాలుష్యమయం, సాయనాలమయం …,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
పొద్దున్నే ప్లాస్టిక్ బ్రష్, బ్రిస్టల్స్…
దాని మీద కృత్రిమ రసాయనాలు..
ఇంకా వీలైతే బొమికల పొడి, రసాయనాలు కలిపిన పేస్టులు…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఇక అలా మొదలైతే..
ప్లాస్టిక్ ప్లేట్లలో వేడి వేడి టిఫిన్లు,,,,,,,,,,,,,
తాగే నీళ్ల బాటిల్ నుంచి నిల్వ ఉంచే ప్రతి ఆహార పదార్థాలు ప్లాస్టిక్…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
అలా 24 గంటలూ..
365 రోజులు ప్లాస్టిక్ జీవితం గడుపుతున్నాం…
బై వన్ …
గెట్ వన్ లాగా…
ఒక దరిద్రానికి …
మరో దౌర్భాగ్యం ఫ్రీ అన్నట్టు…,
పాలప్యాకెట్లు , పండ్లు, కూరగాయలు నీళ్లల్లో కడిగి తింటున్నాము …
పురుగుల మందులు ఎక్స్ ట్రావాడుతున్నాము, ఇల్లంతా డేటా తొ శుభ్రం చేస్తున్నాము …
ఇప్పుడే అందిన వార్త నా స్నేహితుడు బలంగా ఉన్నాడు కరోనా అని హాస్పటల్లో చేర్చారు
చూడటానికి ఎవరిని రానియ్యలేదు, డబ్బులు కటించుకొని ఇక పొమ్మన్నారు. నెగిటివ్ వస్తే మల్లి డబ్బుకు పిలుస్తాం, ఇక ఆశలన్నీ మా పెట్టి అ దేవుణ్ణి ప్రార్ధించండి అన్న పిలుపే ...
ఎవ్వరు చూసే దిక్కు లేక అనాది శవంలా మిగిలిందని తెలిసింది అందుకే అందరు జాగర్తగా ఉండండి ప్రాహుత్వాలు డాక్ట్రలు చెప్పిన సూచనలు పాటించండి ఈ రోగానికి వయసుతో నిమిత్తము లేదు అత్యవసరము ఉన్న ప్పుడే బయటకు రండి
ఇంక ఎంత చెప్పిన నేను డాక్టర్ను కాదు, డాక్టర్ కొడుకును మాత్రమే
ఇలా కూడా కరోనా కారకాలు అనుకునేవాళ్లు,,,,,,,,,,, భయము వద్దండి, దేశం ఇంకా బాగున్నది, మందు కూడ వస్తున్నది. కొండత ధైర్యంతో ఇంటిలో ఉంటటమే
పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్ లు… ఇది మరచి పొంది
ఇప్పుడు చెప్పండి…
30 ఏళ్లకే క్యాన్సర్ ఎందుకు రాకూడదో….,,,,,,,,,,,,,,,,,?
- మరి.. అప్పటివాళ్లు ఎందుకు గట్టిగా ఉన్నారు….?
ఒక్కసారి చిన్నప్పటి రోజులు గుర్తు తెచ్చుకోండి..,,,,,,,,,,,,,,,,,,
అమ్మమ్మ ఇంట్లోనో..
నానమ్మ ఇంట్లోనో మీ బాల్యం ఎలా గడిచేది…?
వేపపుల్లతో తోముకున్నాం..
లేదంటే…
పళ్లపొడి చేతిలో వేసుకుని వేలితో శుభ్రంగా పళ్లుతోముకోవటం…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఈనాడు "పేస్ట్' వాడుట వళ్ళ ......
తర్వాత…
నూనె వ్రాసుకొని సున్నిపిండితో రుద్దుకొని కుంకుడుకాయ రసంతో తలమీద స్నానం…
ఈ నాడు కెమికల్స్తో తయారైన షాంపూలు వాడుట .....
వెండి కంచాల్లో భోజనం, రాగి గ్లాసులు, చెంబుల్లో నీళ్లు..,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఈనాడు నుంచొని ' బఫె ' అంటూ తినుట వల్ల .......
ఒకాటేమిటి అన్నీ రోగానికి కారకాలే ?
ఇంటి పెరట్లోనే ఉన్న గేదెల నుంచి ఆరోగ్యకరమైన పాలు ఏవి ?
ఈనాడు నిలువనున్న పాలు ప్యాకెట్ల వళ్ళ ?...
ఏ కాలుష్యం లేని వేపచెట్టు గాలి…ఏది ?
ఈనాడు ఎక్కడ చూసిన కాలుష్యమే కదా.? వానొస్తే డ్రైనేజ్ నీళ్లు ఇంట్లోకే ?
ఇంకా ఆటలు,ఈతలు… ? చదువు చదువు అంటు పిల్లలని అడిగేవారు ,సెల్లు ఇచ్చి ఏడుపు మాన్పించేవారు ఎక్కువైనారు కూడా ?
ఇత్తడి గంగాళాలు, నీళ్లు కాచుకోవటానికి రాగి బాయిలర్ లు…ఏవి ?
ఇంట్లో లేదా పొలం నుంచి వచ్చిన తాజా కూరగాయలు…,,,,,,,,
బాగా ఆడిపాడి…పుష్టికరమైన ఆహారం తిని. ఆరుబయట గాలిలో…నులకమంచం లేదా నవారు మంచం మీద నిద్ర…నో ఏసీ…నో …కూలర్….
ఇలా ఒకటా రెండా…
అన్నీ ఆరోగ్యకరమైన అలవాట్లే..
సో…
మరి వందేళ్లు బతకమంటే ఎందుకు బతకరు మరి…
మరి ఇప్పుడు అలవాట్లు అటు ఇటు మార్చుకున్న ఫలితము లేని స్థితి వస్తున్నది అయినా జాగరతగా ఉండటామే ఇంటి యందు, ఆరోగ్యకరమైన ఆహారము తినటమే
ఆధునికత మంచిదే….,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కానీ…
అది మరీ మనల్ని మనమే చంపుకునేంత గొప్పది కానంత వరకే…!
ఏది ఏమైనా ఇప్పటి స్థితి బట్టి పిల్లల్ని ఇంట్లో ఉంచి పాట కధలు చెప్పండి, వాల్లతో ఆదుకోండి ఇంటిలో, అలాగే ఫోన్ ద్వారా అందరిని సంప్రదించండి విషయాలు తెలుసుసుకోండి, ఇంటిలో ఉన్నా ఆరోగ్యం జాగర్త ఇంతకన్నా ఏమి చెప్పలేను "తస్మాత్ జాగర్త "
--(())--
om
రిప్లయితొలగించండి