(ఆరోగ్యం - ఆనందం - ఆధ్యాత్మికం )
ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక
నేటి కవిత .. జీవిత నౌక (22) పరిమితం
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఏ నాడు ఈ నాడు మారదురా
ఏ తప్పు ఈ తప్పు చెప్పుదురా
అది ఒక్కటి అమ్మ ప్రేమ ఏరా
ఏ అసత్యం ఏనాడు ఒప్పదురా
ఏ అన్యాయం ఏనాడు చేయదురా
ఏ అధర్మం ఏనాడు తల్వదురా
అది ఒక్కటి అమ్మ ప్రేమ ఏరా
ఏ పాపం తెల్సి చేయదురా
ఏ శాపం తెల్సి పెట్టదురా
ఏ కోపం తెల్సి తిట్టదురా
అది ఒక్కటి అమ్మ ప్రేమ ఏరా
ఏ లక్ష్యం లేకుండా ఉండదురా
ఏ గమ్యం చూపకుండా ఉండదురా
ఏ సాక్ష్యం లేకుండా అర్వదురా
అది ఒక్కటి అమ్మ ప్రేమ ఏరా
ఏ మార్పు తేకుండా ఉండదురా
ఏ నేర్పు చూపకుండా ఉండదురా
ఏ తీర్పు చెప్పకుండా ఉండదురా
అది ఒక్కటి అమ్మ ప్రేమ ఏరా
--((*))--
ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక
నేటి కవిత .. జీవిత నౌక (22) పరిమితం
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు
వల్లమాలిన భక్తి వళ్లు దాచుకోవద్దంటూ
వయ్యారాల తనువంతా కృష్ణకే పరిమితం
చెప్పిచెప్పని ఆశనంత తీర్చుకోవచ్చంటూ
శృంగారాల చిగురంతా కృష్ణకే పరిమితం
అందచందము అంత చూసి ఆరగించుకోవా
ఇంద్రయాల వయసంతా కృష్ణకే పరిమితం
ఆశపాశము కొంత ఉంది తీర్చుటేప్రబోధం
మోనమేల మనసంతా కృష్ణకే పరిమితం
వంటవార్పు అంతనీకె ఆరగించరావా
అర్ధరాత్రి అణువంతా కృష్ణకే పరిమితం
సిగ్గుఎగ్గు లేకచెప్పు తున్నవచ్చిపోవా
నిత్యసత్య హృద్యవాక్కు కృష్ణ కేపరిమితం
--(())--
నేటి కవిత .. జీవిత నౌక (22)
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక
నీళ్లంటే వెయ్యేళ్ళ వంట అన్నారు
పెదవి విప్పి చెప్పలేరు కక్కలేరు
మనసు చెప్పి ఉండ లేరు అక్క లేరు
ప్రేముంటే వెయ్యెళ్ళ పంట అన్నారు
ఓర్పుంటే నూరేళ్లు మంట అన్నారు
మనసు విప్పి వప్పలేరు వదలలేరు
వయసు చెప్పి తెల్పలేరు కదల లేరు
రేపంటే ఈరోజే పంట అన్నారు
ఉందంటే పొందాలే కంట అన్నారు
వయసు చూపి నప్పలేరు వప్పలేరు
సొగసు చూపి నవ్వ లేరు ఏడ్వ లేరు
వాపుంటే ఆశుంటే నిప్పే అన్నారు
కామించే ఖైపుంటే చిప్పే అన్నారు
వధువు చూసి మనలేరు కనలేరు
వరుని చూసి వద్దన్నారు పొమ్మనరు
--(())--
నేటి కవిత .. జీవిత నౌక (21)నాటకమోరన్నా
తెలుగు భాష దినోత్సవం సందర్భముగా అందరికీ శుభాకాంక్షలు
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి