17, ఆగస్టు 2020, సోమవారం

గొలుసు పద్యాలు





గొలుసు పద్యాలు

స్ధిర మన్నది బతుకే
బతుకన్నది కోరికే
కోరికన్నది నడకే
నడకన్నది కలయకే

జీవితం అన్నది జవాబు 
జవాబు అన్నది ఆకలి 
ఆకలి అన్నది దాహము 
దాహము అన్నది ఓపిక 

ఓపిక అన్నది మనసు 
మనసు అన్నది మాయ 
మాయ అన్నది ఆశ 
ఆశ అన్నది  ఆలోచన 

ఆలోచన అన్నది కళలు 
కళలు అన్నది కలలు
కలలు అన్నది సెగలు 
సెగలు అన్నది వెతలు 

వెతలు అన్నది కోరికలు 
కోరికలు అన్నది గుర్రాలు 
గుర్రాలు అన్నది దౌడులు 

దౌడులు అన్నది కోపాలు     


నేటి కవిత .. అనాది (4 )  
ప్రాంజలి ప్రభ . అంతర్జాల పత్రిక 
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

భవిషత్తుకు  - వేయు పునాది  
సంపదకు  - వేయు పునాది 
ప్రకృతితో  -వేయు పునాది 

సహనం నీది - సాహిత్యం నాది 
సందడి నీది - సౌందర్యం నాది 
బాధ్యత నీది - భాగ్యమ్ము నాది 

కవిత్వంతో  - వేయు పునాది 
కర్తవ్యంతో  - వేయు పూనాది  
కలమ్ము  నీది - గతమ్ము  నాది  

భాగం నీది - బంధం నాది
గమ్యం నీది - లక్ష్యం నాది
స్నేహం నీది - ప్రేమమ్ నాది 
కాలం నీది - జీతం నాది 

సమ్మోహంతో  - వేయు పునాది 
మన:శాంతికి  - వేయు పునాది 
సమ్మేళనంతో  - వేయు పునాది 
బాంధవ్యంతో  - వేయు పునాది 

లాభం  నీది - నష్టం నాది
పుణ్యం నీది - పాపం నాది 
మోక్షం నీది - శాపం నాది  
హాస్యంనీది - కోపం నాది 

వెలుతురు నీది - చీకటి నాది
పలుకులు నీవి - ఆలయ నాది 
కులుకులు నీవి - ఆకలి నాది 
చిలకులు నీవి - చిగ్గురు నాది 

మనస్సుతో - వేయు పునాది
వయస్సుతో - చేయు షికారు                  
ఉషస్సుతో  -  చేయు పుకారు 
యశస్సుతొ - చేయు గలాభ       

   --((*))--


నేటి కవిత ... శుభ వేళ .. 3 
ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక 
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


కారు చీకటి కమ్ముకున్న వేళ  
కాంతి పుంజంలా నేత్రాలుంటే చాలు  
నింగిన మబ్బులు కమ్ముకున్న వేళ  
మెరుపు వెలుగు చూపితే చాలు

సుఖము కొరకు వేచి ఉన్న వేళ 
ఓదార్పు తలపు చూపితే చాలు 
మోము గాంచాలని ఆశ ఉన్న వేళ 
క్షణం వలపు చూపితే చాలు 

కౌగలింత కోసం ఉన్న వేళ 
కనికరించి తనువు అర్పిస్తే చాలు 
వెతలు నన్ను కమ్మిన వేళ  
కధలు చెప్పి నిదురపుచ్చితే చాలు 

విజ్ఞాన కవిత్వం వ్రాస్తున్న వేళ  
కల గుర్తుచేసి ఆశ చూపకుంటే చాలు 
చల్లగాలి తో మంచు కురిసిన వేళ   
ఏకంకోసం తొందర పడకుంటే చాలు 

మల్లెపువ్వు ఘుమఘుమ లందించే వేళ 
మమతానురాగం అందిస్తే చాలు  
సంపెంగ పరిమళాలు కమ్ముకున్న వేళ 
మనసును రంజిల్ల చేస్తే చాలు  


--((*))--


నేటి కావిత - అర్ధం --2
ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక 
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


కెవ్వుమని కేక వినబడిం దంటే
వంటి మీద బల్లి పడిందని అర్ధం
అమ్మా అని అరిచిందంటే
ఎక్కడో తెలుకుట్టిందని అర్ధం

అమ్మో నెప్పి అని మూలిగిందంటే
ఎదో కోరిక ఉన్నదని  అర్ధం
కనబడగానే రుసరుస లాడిందంటే
ఎదో తప్పు జరిగిందని అర్ధం

అందరూ కలసి అరుచుకున్నారంటే
ఎదో తక్కువ చేశారని అర్ధం
అందరూ చప్పట్లు కొడుతున్నారంటే
తెలిపే ఆనందం అని అర్ధం

నగల షాపులో గణ మ్రోగిందంటే
దొంగ ప్రవేసించాడని అర్ధం
రైల్వే స్టేషన్లో గంట మొగిందంటే
రైలు రాబోతున్నాదని అర్ధం 

గుడి గంట మ్రోగిందంటే
హరతి ఇస్తున్నారని అర్ధం
బడి గంట మ్రోగిందంటే
బడి గేటు తెరిచారని అర్ధం 

ఎవరో ఏడుస్తున్నారంటే
చెడు వార్త విన్నారని ఆర్ధం
శోకాలు పెడుతున్నారంటే
ఎవరో గతించారని అర్ధం

ధియటర్ లైటు వెలిగిందంటే
సినమా వస్తుందని అర్ధం   
జడ్జి సుత్తితో బల్ల బాదాడంటే
నిశ్శబ్దముగా ఉండమని అర్ధం

రేష్టారెంటులో చీకటి కల్పించారంటే 
మొఖాలు చూడ కూడదని ఆర్ధం
కళ్యాణ మండపంలో మేళం మ్రోగిందంటే
చదివింపులకు పిలుస్తున్నారని ఆర్ధం

భర్త చుట్టూ తిరుగుతూ నసిగాడంటే  
ఆరోజు భార్యకు నిద్రఉండదని అర్ధం
భార్య అతి ప్రేమ చూపించిందంటే 
ఆరోజు జేబుకు చిల్లు పడుతుందని అర్ధం 

అర్ధం అర్ధం కలిస్తే అర్ధాంగి 
అర్ధం అర్ధం కలవక పొతే అనర్ధం 
అర్ధాన్ని ఆలోచిస్తే స్వార్ధం 
అర్ధాన్ని ఉపయోగిస్తే నిస్వార్ధం 

అర్ధానికి అర్ధాంగికి ఉండు బంధం 
దారిద్రానికి అర్ధానికి ఉండదు బంధం 
అర్ధం సద్వినియోగం ఆరోగ్యం  
అర్ధం దుర్వినియోగం అనారోగ్యం 
   
అర్ధమే పరమార్ధం 
పరమార్ధం అర్ధమైతే జీవితం సుఖాంతం 

--(())--


5D DIY Diamond Painting Animal Diamond Mosaic Cross Stitch Full Square Diamond Embroidery

ప్రాంజలి ప్రభ ఛందస్సు కవితలు (1 .) * 
*పుష్ప వనం (ఛందస్సు)  
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

సుఖాలల్లొ సేవ  ప్రీతి పూల వనం 
నవా భ్యుద యాల వెల్గు పూల వనం 
సుసం గీత శ్రావ్య  రాగ పూల వనం 
శశీ వెన్నెల కారుణ్య పూల వనం )

గుబాళించి  ప్రతి  గుండె పూల వనం 
చమత్కార  చారు హాస మాల వనం 
 సునామీగ  చేటు చేయ లేని వనం 
సమారాధ చేసె సామరస్య వనం    

సమాధాన పర్చి శాంతి సౌఖ్య వనం 
సురక్షాల వల్ల శోభ భావ వనం 
సుహాసంతొ సేవ తత్ప రాల వనం 
దయామూర్తి రేఖ శాఖ వాల  వనం      

సమా నంద గాలి తెల్పె పూల  వనం 
సదా వెల్గు పంచె సూర్య పూల వనం 
జలా లన్ని మంచి నీటి పూల వనం  
సెగా మంట నవ్వు పంచె పుష్ప వనం   

--((*))--

1 కామెంట్‌: