ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక
ఆటవెలది పధ్యాలు... శారీరక సూక్తి ప్రభ
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
అవయవాలకెల్ల గాలియే పోషక
ద్రవ్యహార్మోనులను రక్త ప్లాస్మ
ఎఱ్ఱ తెల్లకణము లిచ్చిను క్రమరీతి
గాలి లేక బతుకు ఏల అనను .... .... 1
దేహ నీతి ఎరిగి బుద్దితో గమనించు
మనసు మమత జాలి కరుణ జూపు
నరుల మార్పు నంది నారాయణలు కార
సిద్ది బుద్ధి కలుగు దైవ లీల ..... ....... 2
ఎవరి కైన వలయు ఆరోగ్య భాగ్యమ్ము
ధనము కన్న మిన్న దండి ధనము
సరయు అదియె గూర్చు ఐహిక భోగాలు
ధనము లేని వాడు కూడుకు కరువాయె .. 3
సంద్రమంత చిలికె వచ్చె ధన్వంతరీ
చేరె దివికి ఔషదమ్ము పంచె
వ్యాధులెల్లగూర్చు వైధ్యుడౌ విష్ణుండు
సకల జనుల రోగ రక్ష చేసె ... ...... 4
పెరిగె ద్వాపరాన భరద్వాజ వలన
ఆయుర్వేద వృత్తి ఆయు వృద్ధి
చూర్ణ లేహ్య ద్రావ చోష్య సంకలితమై
సకల రోగ ఆయుధమ్ము ఇదియె ... ... 5
మొక్కలిచ్చు తిండి మొక్కెడి వరములు
చక్క గుండు మొక్క ఇచ్చు మందు
తిండి దినుసు లన్ని ఆరోగ్య మిచ్చును
మందు లనెడి అవసరమ్ము లేదు .. .. 6
ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక (2)
ఆటవెలది పధ్యాలు... శారీరక సూక్తి ప్రభ
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
సర్వ రోగములకు శమన మిచ్చు
తులసి తీర్థమందు కలవెన్నొ సుగుణాలు
అందు వళ్ళ దేశ మంత ఉండు ... .. 7
ఉల్లి తల్లి వోలె ఊరట కల్గించు
రక్త సిద్ధి నిచ్చి రక్తి గూర్చు
ఎర్ర తెల ఉల్లి ఏదైనా బేషురా
తెల్పు రామకృష్ణ మల్లాప్రగడ మది .... .. 8
మంచి తేనే యందు మదుర్యమే కాక
రక్త శ్రావ మాపు శక్తి కలదు
తేనే మునగ రసము ఆనెల నాపును
నిత్య శుద్ధి చేయు తేనెరక్తమును .... .... 9
పోవు గర్భ మండ్రు బొప్పాయి తిన్నచో
పండ్లు దొరుకు నపుడు దాని నొదలు
వైట్ల మినుల పంట వాడరు బొప్పాయి
గురువు చెప్పు మాట నమ్మి తినుట ..... 10
అశ్వ గంధ పాలు అక్రోటు పన్నీరు
నెల గుమ్మి గడ్డ నేయి తేనె
శ్రీసుఘంధపాలు శృంగారహేతువుల్
నిత్య మావు పాలు బలము నిచ్చు ...... 11
మునగ వేరు ఉసిరి ధనియాలు మిరియాలు
మద్ది శిలలు చిత్తు మంచి పెరుగు
కుట్రకోస రాళ్ళ ముప్పును రానీదు
సర్వ రక్షా చేయు ఆకు పసరు .... ...... ..12
--(())--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి