16, ఆగస్టు 2020, ఆదివారం

( పుణ్య క్షేత్రాలు) (1.)





ప్రాంజలి ప్రభ ( పుణ్య క్షేత్రాలు) (1.) 
 సేకరణ > మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

శ్రీ నేట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయం
        
        అనంతపురం జిల్లా గుంతకల్ జంక్షన్ దగ్గరలో ఉన్న ఈక్షేత్రం క్రీ.శ. 1,521 సంవత్సరం లో శ్రీవ్యాసరయల వారు (తదనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి, మంత్రాలయం) హంపి క్షేత్రంలో తుంగభద్రా నదితీరం లో కర్మనుష్టానం చేస్తూ తను ధరించే గంధంతో తన ఎదురుగా ఉన్న శీలా పైన ఆంజనేయ స్వామి రూపం చిత్రించాడు. అది నిజరూపం దరించి వెళ్తూ ఉంది. ఈ విధంగా 5 సార్లు  చిత్రించగా అదే విదంగా జరిగింది. చివరికి శ్రీవ్యాసరయల వారు అంజనేయ స్వామి వారి ద్వాదశనామ  బీజాక్షరంతో యంత్రం రాసి దానిలో శ్రీ స్వామి వారి నిజరూపం చిత్రించగా స్వామి వారు ఆ యంత్రంలో బందిన్చ బడినారు .

       అప్పుడు స్వామి వారు శ్రీవ్యాసరయల వారి స్వప్నంలో కనిపించి నేను ఈ క్షేత్రం లో ఉన్నాను, నన్ను తీసి ప్రతిస్టించమని చెప్పగా వ్యాసరయల వారు ఈ ప్రాంతాన 732 ఆంజనేయస్వామి విగ్రహాలు ప్రతిస్తించాడట. చిప్పగిరి గ్రామం లోని శ్రీ భోగేశ్వర స్వామి గుడిలో వ్యాసరయల వారు నిద్రిస్తుండగా నేను ఇక్కడ నుండి దక్షిణ దిక్కుగా కొద్దిరుపం లో భూమిలో ఉన్నాను నన్ను తిరిగి ప్రతిస్టించమని పలికారు. వ్యాసరయల వారు దారి చూపించమని అడగగా స్వామివారు (ఆంజనేయుడు) ప్రస్తుతం నా పైన ఎండిన వేపచెట్టు ఉంది అది నువ్వు రాగానే పచ్చగా చిగురిస్తుంది అని మార్గం సూచించారు .
        
                  వ్యాసరాయల వారు కసపురానికి విచ్చేసి శ్రీ స్వామి వారి మిద ఉండే వేపవృక్షానికి  సమీపించగానే అది పచ్చగా చిగురించింది. అప్పుడు వ్యాసుల వారు ఆ ప్రాంతాన్ని తవ్వించి ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ప్రతిస్టించాడు అని స్థలపురాణం చెబుతుంది. కసాపురం గ్రామానికి దగ్గరగా ఉండటం వలన కసాపురం ఆంజనేయ స్వామి అని కూడా పిలుస్తారు. నెట్టికల్లు (మంచి రాయి) లో అవిర్బవిన్చినందున శ్రీ స్వామి వారికి నేట్టికంటి ఆంజనేయ స్వామి  అనే పేరు ప్రసిద్దమైనది.

           నేట్టికంటి అనగా ఒక కన్ను కలవాడని అర్థం. విగ్రహం లో స్వామి కుడి కంటి తో భక్తులను చూస్తూ వారి మనోభిస్టాలను నెరవేరుస్తున్నారు. స్వామి వారు కోరిన కోరికలు, వారి భాదలను తీర్చే కొంగు బంగారం .
ఆంజనేయుని  ఆరాదిద్దాం - ధైర్యంగా, మన:శాంతిగా బ్రతుకుదాం  
--(())--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి