18, ఆగస్టు 2020, మంగళవారం

*అష్టావక్ర గీత*

చిత్రంలోని అంశాలు: 1 వ్యక్తి

*అష్టావక్ర గీత*
*1.అధ్యాయము*
*(1వ.భాగం)*
🕉🌞🌏🌙🌟🚩
*జనక ఉవాచ:-*
1.1 *కథం జ్ఞానమవాప్నోతి కథం ముక్తిర్భవిష్యతి*
*వైరాగ్యం చ కథం ప్రాప్తం   ఏతద్భుహి మమ ప్రభో*
*హే ప్రభో జ్ఞానమును ఎట్లు పొందవచ్చును? ముక్తి ఎట్లు కలుగును ? వైరాగ్యము ఎట్లు లభించును ? ఈ విషయమును నాకు చెప్పుము.*
*అష్టవక్ర ఉవాచ*
హేప్రభోజ్ఞాన మును ఎట్లు పొంద వచ్చు
ముక్తి ఏఏ వి ధంగా లభించ వచ్చు
వైర ముయును  వైరాగ్య మయును ఎట్లు 
వచ్చు విషయము మాకును తెల్ప గలవు 

*1.2 ముక్తిమిచ్ఛసి చెత్తాత విషయాన్ విషవత్ త్యజ*
*క్షమార్జవదయాతోష  సత్యం పీయూష వత్ భజ*
*నాయనా! ముక్తిని కోరుదువేని విషయములను- విషమువలె విడనాడుము. ఓర్పు నిష్కపట ప్రవర్తన, దయ,సంతోషము,సత్యము అనువానిని- అమృతమువలె సేవింపుము.*

ముక్తి కొరకును కోరిక విడిచి పెట్టు
విషయ వాంఛను కాంక్షను విడిచి పెట్టు
సత్యము, ప్రవర్తన, దయ, అమృతమయమె
సంతసము ఎప్పు డూవద లకయె ఉండు   

*1.3 న పృథ్వీ  న జలం న వాయుర్ద్యౌర్న          వా భవాన్ ఏషాం!* *సాక్షిణమాత్మానం చిద్రూపం విద్దిముక్తయే!*
*నీవు భూమివి కావు.జలము కావు. వాయువు కావు ఆకాశము కావు వీనికి సాక్షి అయిన చిత్ రూపమైన ఆత్మను అని ముక్తి కొరకు తెలుసుకొనుము.*

భూమి వియు కావు జలముయు అంబరమ్ము
కావు కావును సాక్షిగా చేతనమ్ము
నీవు ఆత్మవు వాయువు వలెను కాదు
కలిగి దేహము ముక్తికి  సహన ముంచు     

*1.4 యది దేహం పృథక్-కృత్య చితి విశ్రామ్య తిష్టసి!*
*అదునైవ సుఖీ శాన్తో బంధముక్తో భవిష్యసి!*
*దేహమును వేరు చేసికొని చైతన్యమునందు విశ్రమించి ఉందువేని ఇప్పుడేసుఖివి, శాంతుడవు, బంధములు పోయినవాడవు కాగలవు.*

దేహ మనెటి బ్రాంతిని తొలగించు కొనియు
బంధములను విడిచిపెట్టి శాంతు డవుగ
విశ్రమించగా చతన్య భావ ముంచి
బ్రహ్మ సందేశ ములనువిన గలవులె     

*1.5*న త్వం విప్రాదికో వర్ణో నాశ్రామీ నాక్షగోచరః!*
*అసాంగోఅసి నిరాకారోవిశ్వసాక్షీ సుఖీ భవ!*
*నీవు బ్రాహ్మణమొదలైనకులములు,ఆశ్రమములు కలవాడవు కావు.ఇంద్రియాములకు తెలియబడువాడవు కావు సంగమము లేనివాడవు. ఆకరములేనివాడవు. విశ్వాసాక్షివి. సుఖముగా ఉండుము.*
నీవు బ్రాహ్మణ కులమందు కలిగి ఉన్న
ఆశ్రమమునందు నిత్యమూ పూజ చేసి
ఇంద్రియములను అదుపును చేసి ఉండి
విశ్వ సాక్షిగా సుఖమును పంచు చుండు

*1.6*ధర్మాధర్మౌ సుఖం దుఃఖం మానసాని న తే విభో!*
*న కర్తాసి న భోక్తాసి ముక్త ఏవాసి సర్వదా!*
*హే విభో! ధర్మాధర్మములు,సుఖదుఃఖములు మనస్సుకు సంబంధించినవి. నీవు కావు. నీవు కర్తవును కావు భోక్తవును కావు. ఎల్లప్పుడును ముక్తుడవే.*

మనసుకు అంటిన సుఖములు నీవి కావు
కర్తవును కావు భోక్తవు కానె కావు
దుఃఖ ధర్మాధర్మములను నీతొ రావు
ఎల్ల వేళలలయందు ముక్తు డేగ   
   

*1.7 ఏకో ద్రష్టాఆసి సర్వస్య ముక్తప్రాయోఆసి సర్వదా!*
*అయమేవ హి తే బందో ద్రష్టారం పశ్యసీతరం!*
*సమస్తమునకు ఒకే ద్రష్టగా ఉన్నావు. ఎల్లప్పుడు ముక్తుడవుగానే ఉన్నావు. ద్రష్టను ఇతరముగాచూచుచున్నావు. అదియే నీకు బంధము.*

ద్రష్ట గానున్నావు సమస్తమునకు ఉన్న   
ముక్తుడవు గానె ఉన్నావు లోకములకు 
బంధమునకు సమానము తెల్పు చుండి 
ద్రష్టను ఇతరముగను చూచుచు చున్నావు 
  
*1.8 అహం కర్తేత్యహంమాన మహాకృష్ణాహిదంశితః!*
 *నాహం కర్తేతి విశ్వాసామృతం పేత్వా సుఖీ భవ!*
*నేను కర్తను అను అహంకారము అను పెద్దనల్ల పాముచేత కరువబడితివి. *నేను కర్తను కాను అను అమృతము త్రాగి సుఖముగా ఉండుము.*

కర్త అను నేను పెద్దది  నల్లపాము  
చేత కరవబడి అహము పొంది యున్న 
నేను కర్తను కాను అమృతము త్రాగి 
నిత్య సుఖమును దుఃఖమును పొంది యున్న 
  
*1.9 ఏకో విశుద్ధబోధోఅహం ఇతి నిశ్చయవహ్నినా! ప్రజ్వల్యా జ్ఞానగహనం వీతశోకః సుఖీ భవ!*
*నేను ఒక్కటైన విశుద్ధమైన తెలివి స్వరూపమును అను నిశ్చయము అను అగ్నిచే అజ్ఞానము అను అడవిని తగులబెట్టి సుఖముగా ఉండుము.*

నేను ఒక్కడినే దేహ నిశ్చయమ్ము 
తెలివియు విసుద్ధ మైనను కర్మ బంధ 
నిశ్చయము జ్ఞాన మనగ్ని చేత అడవి 
తగల బెట్టియు అజ్ఞానము తరిమి బతుకు 
     
*1.10*యత్ర విశ్వామిదం భాతి కల్పితం రజ్జుసర్పవత్! ఆనందపరమానందః           స భోదస్త్వం సుఖం చర!*
*ఈ విశ్వము త్రాడుయందు పామువలె దేనియందు కల్పింపబడి తోచుచున్నదో అట్టి ఆనంద పరమానందమైన చైతన్యము నీవు సుఖముగా సాగిపొమ్ము.*
🕉
విశ్వమును తాడువలె పాముచుట్టి యుండు 
సమయమును బట్టి అహమును పెంచు చుండు 
నేను చైతన్య స్వరూప పరమ సుఖము 
పొందుటకు నిత్య భక్తినీ నమ్మి యున్న 


*అష్టావక్ర గీత*
*1.అధ్యాయము*
  *(2వ భాగం)*
🕉🌞🌏🌙🌟🚩
*1.11 ముక్తాభిమానీ ముక్తో హి బద్ధో బద్దాభిమాన్యపి!*
*కింవదంతీహా సత్యేయం యా మతిః సా గతిర్బవేత్!*

*అభిమానమునుండి ముక్తుడైనవాడు ముక్తుడే. అట్లే అభిమానము చేత బద్ధుడైనవాడు బద్ధుడే.*

ఆశయము కొరకు అభిమానమును ఉంచి
ముక్తు డైనట్టి  వాడును ముక్తు డేగ
కొన్ని విషయాల్కు తలవంచి చేసుకుంటు   
పోతె బద్ధుడైన వాడు బద్దుడేగ   ..... ... 11

*1.12 ఆత్మా సాక్షీ విభుః పూర్ణ ఏకో ముక్తశ్చిదక్రియః!*
*అసంగో నిఃస్పృహః శాంతోభ్రమాత్సంసారవానివ!*
*ఆత్మ సాక్షి అంతటా నిండినది ఒక్కటైనది ముక్తము చైతన్యము పనులతో సంబంధములేనిది ఆసక్తి లేనిది శాంతము.*

ఆట సాక్షిగా అంతటా నిండి ఉంది
ముక్త ముగ ఒక్క టైనది ఆత్మసాక్షి
పనుల చైతన్య  సంభంద మన్నదేది
లేనిది ఆసక్తి లేనిది శాంత ముయెను .... .... 12
 
*1.13 కూటస్ధం భోధమద్వైతం ఆత్మానం పరిభావయ! ఆభసోహం భ్రమం ముక్త్వా భావం బాహ్యమదాంతరం!*
*నేను ఆభాసుడను అను భ్రమను బయట వెలుపల తోచు బావములను విడిచి కూటస్ధము ఎరుక ఆత్మను మనసున నిలుపుము.*

నాకు వెలుగుయు లేదను భావమున్ను
బయట వెలుగులు ఉన్నాయ అన్న ఈర్ష్య
ఆత్మ మనసును నిలిపియు కూటస్థమ్ము
వదలి వెలుగుంది భావమ్ము అంత శాంతి  ....13 ....     

*1.14 దేహాభిమానపాశేన చిరం బద్ధోసి పుత్రక బోధోఅహం! జ్ఞానఖడ్గేన తాన్నికృత్య సుఖీ భవ!*
*బిడ్డా!దేహాబీమానము అను త్రాడుచేత చాలా కాలమునుండి కట్టివేయబడితివి తెలివిని నేను అను జ్ఞానఖడ్గముచేత దానిని కోసివేసి సుఖముగా ఉండుము.*

బిడ్డలపైన దేహాభి మానమున్ను
త్రాడు చేతయు ప్రేమను  బందనమ్ము
తెలివి అనుజ్ఞాన ఖడ్గము తో కోసి వేసి
సుఖము అను నావ వళ్ళదొఱుగును శాంతి   .... ...14     


*1.15 నిస్సంగోనిష్ర్కియోఆసి త్వం స్వప్రకాశో నిరంజనః!*
*అయమేవ హి తే బంధః సమాధిమనుతిష్టసి!*
*నీవు సంగమము లేనివాడవు చేతలు లేనివాడవు సహజమైన ఎరుక కలవాడవు మచ్చ లేనివాడవు అయిననూ సమాధిని అభ్యసించుచున్నావు అదియే నీకు బంధము.*

నీవు సంగమా సించక సహజ మైన
ఎరుక కల్గియు మచ్చలు లేక యున్న
దేహము సరిగా ఉన్నను లేక ఉన్న
పుట్టుక సమాధి బంధము వెంట ఉండు    .... 15

*1.16 త్వయా వ్యాప్తమిదం విశ్వాo త్వయి ప్రోతం యథార్థతః!*
*శుద్ధబుద్ధస్వరూపస్త్వం మా గమః క్షుద్రచిత్తతాం!*
*నిజముగా ఈ విశ్వము అంతయు నీచే వ్యా పింపబడిఉన్నది నీయందే నేయబడి ఉన్నది నీవు శుద్ధమైన తెలివి స్వరూపము అల్పమైన చిత్తముతో ఉండకుము.*

విశ్వ మంతయు నిజముయు వ్యాప్తి చెంది
శుద్ద శక్తిగా ప్రాణుల లోన ఉండి
దేహము అల్పము చిత్తముతోను ఉండు
తెలివి అంతయు నీకృప అంత రాత్మ    .... 16   

*1.17 నిరపేక్షో నిర్వికారో నిర్బరః శీతలాశయః!*
*అగాధబుద్ధిరక్షుభ్దో భవ చిన్మాత్రవాసనః!*
*నీవు ఆపేక్ష లేనివాడవు మార్పులు లేనివాడవు పూర్తిగా నిండినవాడవు చల్లని హృదయము కలవాడవు లోతుతెలియని తెలివివి కలత లేనివాడవు చిత్ మాత్ర వాసనతో ఉండుము.*

నీవు అపేక్ష లేకుండ ఉండి యున్న
మార్పు లేకయు పూర్తిగా నిండి యున్న
చల్లని హృదయము కలత లేక ఉండి
వాసనాబల ముమనసు శక్తి నీదె     .... 17
   
*1.18 సాకారమనృతం విద్ది నిరాకారం తు నిశ్చలమ్!*
*ఏతత్తత్వోపదేశేన న పునర్భవసంభవః!*
*ఆకారముకలది ఆబద్దామనియు ఆకారములేనిదైతే నిశ్చలమనియు ఎరుగుము ఇట్టి తత్వోపదేశముచేత మరు జన్మ ఉండదు.*

దేహము అబద్ద మగుటయే అద్ధమాయె 
దేహము నిశ్చల మగుటయే పరుగు లాయె
తత్వ ఉపదేశమును పొంది దైవ భక్తి
జన్మ అనునది లేక యుండుటయు ముక్తి  ....18   


*1.19 యధైవాదర్శమధ్యస్థే రూపేఅన్తః పరితస్తు సః!*
*తథైవాఅస్మిన్ శరీరేఅన్తః పరితః పరమేశ్వరః!*
*అద్దమునందున్న ప్రతిబింబము లోపల వెలుపల అద్దమే ఉండునట్లు ఈ శరీరమునందున్ను లోపల వెలుపల పరమేశ్వరుడే ఉన్నాడు.*

దేహములయందు పరమేశ్వ రడుగ ఉండు
దేహ బయటంత పరమేశ్వ రడుగ ఉండు
అద్దమునలోపలను బింబముండు చుండు
అదియు ఆకర్షణ కలిగి నంత వరకు   ...... ...... 19
     
*1.20 ఏకం సర్వగతం వ్యోమ బహిరంతర్యదా ఘటే!*
*నిత్యం నిరంతరం బ్రహ్మ సర్వభూతగణే తథా!*
*కుండ బయట లోపల ఒక్కటిగా అంతటా ఆకాశము ఉండునట్లు బ్రహ్మము సర్వభూతములయందును నిత్యము నిరంతరము ఉండును.*
🕉

సర్వ భూత హృ దయమందు నిత్య సత్య
భావములు నిరం తరముగా వ్యాప్తి చెంది
కుండ లోపల బ యటకూడ ఆకశమ్ము
ఒకటి మాదిరి గాబ్రహ్మ ముండు చుండు     ... 20

--(())--

*జనక ఉవాచ:-*
*4.1*హంతాత్మజ్ఞానస్య ధీరస్య ఖేలతో భోగలీలయా*|
*న హి సంసారవాహీకైః మూఢైస్సహ సమానతా*||
*అయ్యో ఆత్మజ్ఞానమునందు స్దిరుడై అనుభవములతో వినోదముగా అడుకొనుచున్నవానికి సంసారమును మోయుచున్న మూడూలతో పోలిక లేదు.*

ఆటలతొ  భోగ లీలగా సల్పుచున్న 
మనిషి ఆత్మతొ జ్ఞానాన్ని పంచు చున్న 
మూర్కునితొ పోల్చి తక్కువ చేయు చున్న 
జీవితము ధర్మ సంసార మార్గ ముంచు     

*4.2*యాత్పదం ప్రేప్సవో దీనాః శక్రద్యాః సర్వదేవతాః*|
*ఆహోతత్ర స్థితో యోగీ న హర్షముపగచ్చతి*||
*ఆహా ఏ స్దితిని కోరుచు ఇంద్రాది సర్వదేవతలు దీనులై ఉన్నారో,అట్టి ఆత్మాస్దితి ని పొందిన యోగి విషయములందు సంతోషమును పొందడు.*

యోగి నిత్యమూ ఆనంద సౌఖ్య ముంచు  
ఆత్మ అనుసరణస్థితి కలిగి ఉండు 
సర్వ దేవతలు మనో మయమ్ము గాను 
ఉన్న యోగికి  ధ్యానము నిగ్ర హమ్ము  
  
*4.3*తఙ్ఞ స్య పుణ్యపాపాభ్యo స్పర్శో హ్యంతర్న జాయతే*|
*న హ్యకాశస్య థూమేన దృశ్యమానాపి సంగతిః*||
*ఆత్మను ఎరిగినవానికి పుణ్యపాపముల మరక అంటదు ఎట్లనగా ఆకాశమునకు పొగతో కలయిక కనబడుచున్నను ఉండదు.*

ఆత్మ ఎరిగిన వానికి పుణ్య పాప 
మరక అంటదు ఆకాశ మంత పొగలు 
కలయి క కనబడు చుఉ న్న ఉండలేదు 
సుఖము సంసార మున్నను ధర్మబోధ   

*4.4*ఆత్మేవేదం జగత్సర్వం జ్ఞాతం యేన మహాత్మనా*|
*యాదృచ్చయా వర్తమానం తం నిషేద్దుo క్షమేత కః*||
*ఏ మహాత్మునిచే ఈ జగత్తు సర్వము ఆత్మయే అని తెలియబడినదో అట్టివానిని ఆపుటకుఎవరు సమర్థులు.*

ఆత్మ అను వేదము జగతి యంత ఉండు 
జ్ఞాని అను మనిషి మహాత్మ తెలుపు చుండు  
అనుకొ నని విధ ముజరుగు సంఘటనలు
తెల్పి నట్టి వానిని ఆపుతరము ఎవరు    

*4.5*ఆబ్రహ్మస్తమ్బపర్యంతే భూతగ్రామే చతుర్వథే*|
*విజ్ఞస్యైవ హి సామర్థ్యం ఇచ్చానిచ్చావివర్జనే*||
*బ్రహ్మదేవుని మొదలు గడ్డిపోచవరకు ఉండు నాలుగు విధములైన జీవులయందును జ్ఞానానికి మాత్రమే ఇష్ట అయిష్టములను వదులుకొను శక్తి ఉండును.*

బ్రహ్మ  దేవుడు జ్ఞానాన్ని నిష్ట గాను 
తృణమువరకు ను జ్ఞానాన్ని పంచు చుండు 
మనిషికి ఇష్ట అ యిష్ట ములు కలిగి ఉండు  
జీవులు అనేక విధముల జ్ఞాన మొందు  

*4.6*ఆత్మానమద్వయం కశ్చిత్ జానాతి జగదీశ్వరం*|
*యద్వేత్తి తత్స కురుతే న భయంతస్య కుత్రచిట్*||
*రెండవదిలేని ఆత్మస్వరూపమైన జగదీశ్వరుని ఒకానొకడు ఎరుగుచున్నాడు. అతనికి ఎచటనుండియు భయము ఉండదు.* 

ఆత్మ నెరిగిన పరమేశ్వరుడుయె కాని 
జీవితము ధర్మ మార్గము సల్పు చుండు 
ఎచట నుండియు భయమును చూడ కుండు 
నిత్య శాంతితో ఎదుగు మనిషిలొ ఉండు 

            *4వ    అధ్యాయం సమాప్తం*
    

ఆటలతొ  భోగ లీలగా సల్పు చున్న 
మనిషి ఆత్మతొ జ్ఞానాన్ని పంచు చున్న 
మూర్కునితొ పోల్చి తక్కువ చేయు చున్న 
జీవితము ధర్మ సంసార మార్గ ముంచు     

యోగి నిత్యమూ ఆనంద సౌఖ్య ముంచు  
ఆత్మ అనుసరణ స్థితి కలిగి ఉండు 
సర్వ దేవతలు మనో మయమ్ము గాను 
ఉన్న యోగికి  ధ్యానము నిగ్ర హమ్ము  

ఆత్మ ఎరిగిన వానికి పుణ్య పాప 
మరక అంటదు ఆకాశ మంత పొగలు 
కలయిక కనబడుచు ఉన్న అంట లేదు 
సుఖము సంసార మున్నను ధర్మ బోధ   

ఆత్మ అను వేదము జగతి యంత ఉండు 
జ్ఞాని అను మనిషి మహాత్మ తెలుపు చుండు  
అనుకొనని విధము జరుగు సంఘటనలు
తెల్పి నట్టి వానిని ఆపు తరము ఎవరు    

బ్రహ్మ  దేవుడు జ్ఞానాన్ని నిష్ట గాను 
తృణము వరకును జ్ఞానాన్ని పంచు చుండు 
మనిషికి ఇష్ట అయిష్టములు కలిగి ఉండు  
జీవులు అనేక విధముల జ్ఞాన మొందు  

ఆత్మ నెరిగిన పరమేశ్వరుడుయె కాని 
జీవితము ధర్మ మార్గము సల్పు చుండు 
ఎచట నుండియు భయమును చూడ కుండు 
నిత్య శాంతితో ఎదుగు ప్రాణులలొ నుండు  

--(())--


pranjali prabha -  అంతర్జాల పత్రిక (3)
*అష్టావక్ర గీత* ... ఓం శ్రీ రామ్ .. సి మాత్రేనమ:
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

హేప్రభోజ్ఞాన మును ఎట్లు పొంద వచ్చు
ముక్తి ఏఏ వి ధంగా లభించ వచ్చు
వైర ముయును  వైరాగ్య మయును ఎట్లు 
వచ్చు విషయము మాకును తెల్ప గలవు  ..... 1 

ముక్తి కొరకును కోరిక విడిచి పెట్టు
విషయ వాంఛను కాంక్షను విడిచి పెట్టు
సత్యము, ప్రవర్తన, దయ, అమృతమయమె
సంతసము ఎప్పు డూవద లకయె ఉండు  ... 2
   
భూమి వియు కావు జలముయు అంబరమ్ము
కావు కావును సాక్షిగా చేతనమ్ము
నీవు ఆత్మవు వాయువు వలెను కాదు
కలిగి దేహము ముక్తికి  సహన ముంచు  ... 3
   
దేహ మనెటి బ్రాంతిని తొలగించు కొనియు
బంధములను విడిచిపెట్టి శాంతు డవుగ
విశ్రమించగా చతన్య భావ ముంచి
బ్రహ్మ సందేశ ములనువిన గలవులె  ...... 4     

నీవు బ్రాహ్మణ కులమందు కలిగి ఉన్న
ఆశ్రమమునందు నిత్యమూ పూజ చేసి
ఇంద్రియములను అదుపును చేసి ఉండి
విశ్వ సాక్షిగా సుఖమును పంచు చుండు  5

మనసుకు అంటిన సుఖములు నీవి కావు
కర్తవును కావు భోక్తవు కానె కావు
దుఃఖ ధర్మాధర్మములను నీతొ రావు
ఎల్ల వేళలలయందు ముక్తు డేగ      6

ద్రష్ట గానున్నావు సమస్తమునకు ఉన్న   
ముక్తుడవు గానె ఉన్నావు లోకములకు 
బంధమునకు సమానము తెల్పు చుండి 
ద్రష్టను ఇతరముగను చూచుచు చున్నావు  7
  
కర్త అను నేను పెద్దది  నల్లపాము  
చేత కరవబడి అహము పొంది యున్న 
నేను కర్తను కాను అమృతము త్రాగి 
నిత్య సుఖమును దుఃఖమును పొంది యున్న  8 
  
నేను ఒక్కడినే దేహ నిశ్చయమ్ము 
తెలివియు విసుద్ధ మైనను కర్మ బంధ 
నిశ్చయము జ్ఞాన మనగ్ని చేత అడవి 
తగల బెట్టియు అజ్ఞానము తరిమి బతుకు   9
     
విశ్వమును తాడువలె పాముచుట్టి యుండు 
సమయమును బట్టి అహమును పెంచు చుండు 
నేను చైతన్య స్వరూప పరమ సుఖము 
పొందుటకు నిత్య భక్తినీ నమ్మి యున్న ... 10


ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక (1.)
*అష్టావక్ర గీత* తెలుగులో తేటగీత పద్యాలు
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ఆశయము కొరకు అభిమానమును ఉంచి
ముక్తు డైనట్టి  వాడును ముక్తు డేగ
కొన్ని విషయాల్కు తలవంచి చేసుకుంటు   
పోతె బద్ధుడైన వాడు బద్దుడేగ   ..... ... 11


ఆత్మ సాక్షిగా అంతటా నిండి ఉంది
ముక్త ముగ ఒక్క టైనది ఆత్మసాక్షి
పనుల చైతన్య  సంభంద మన్నదేది
లేనిది ఆసక్తి లేనిది శాంత ముయెను .... .... 12
 
నాకు వెలుగుయు లేదను భావమున్ను
బయట వెలుగులు ఉన్నాయ అన్న ఈర్ష్య
ఆత్మ మనసును నిలిపియు కూటస్థమ్ము
వదలి వెలుగుంది భావమ్ము అంత శాంతి  ....13 ....     

బిడ్డలపైన దేహాభి మానమున్ను
త్రాడు చేతయు ప్రేమను  బందనమ్ము
తెలివి అనుజ్ఞాన ఖడ్గము తో కోసి వేసి
సుఖము అను నావ వళ్ళదొఱుగును శాంతి   .... ...14     

ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక (2.)
*అష్టావక్ర గీత* తెలుగులో తేటగీత పద్యాలు
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

నీవు సంగమా సించక సహజ మైన
ఎరుక కల్గియు మచ్చలు లేక యున్న
దేహము సరిగా ఉన్నను లేక ఉన్న
పుట్టుక సమాధి బంధము వెంట ఉండు    .... 15

విశ్వ మంతయు నిజముయు వ్యాప్తి చెంది
శుద్ద శక్తిగా ప్రాణుల లోన ఉండి
దేహము అల్పము చిత్తముతోను ఉండు
తెలివి అంతయు నీకృప అంత రాత్మ    .... 16   

నీవు అపేక్ష లేకుండ ఉండి యున్న
మార్పు లేకయు పూర్తిగా నిండి యున్న
చల్లని హృదయము కలత లేక ఉండి
వాసనాబల ముమనసు శక్తి నీదె     .... 17

దేహము అబద్ద మగుటయే అద్ధమాయె 
దేహము నిశ్చల మగుటయే పరుగు లాయె
తత్వ ఉపదేశమును పొంది దైవ భక్తి
జన్మ అనునది లేక యుండుటయు ముక్తి  ....18   

దేహములయందు పరమేశ్వ రడుగ ఉండు
దేహ బయటంత పరమేశ్వ రడుగ ఉండు
అద్దమునలోపలను బింబముండు చుండు
అదియు ఆకర్షణ కలిగి నంత వరకు             ...19

సర్వ భూత హృ దయమందు నిత్య సత్య
భావములు నిరం తరముగా వ్యాప్తి చెంది
కుండ లోపల బ యటకూడ ఆకశమ్ము
ఒకటి మాదిరి గాబ్రహ్మ ముండు చుండు  ....   20



అష్టావక్ర గీత*

ధార్మికత ఎక్క డుంటేను అందు దైవ
ముండు, ధర్మకా ర్యాలను గుడుల యందు  
ధర్మ ఆచరణ కొలువు తీ రును మనిషిలొ
హృదయ మేఆలయము అని ధర్మ బుద్ధి  

ఆత్మను ఎవరు ఆపరు తెలియ దనరు  
జగతి చక్రము తిరుగును అనియు ఆపు 
టకు మహాత్ములకుతెలియ దనియు అనరు
సర్వము తెలుసని సమర్థు లెవరు లేరు        

అయ్యో ఆత్మజ్ఞానమునందు లీనమైన 
మనిషిని అనుభవములతో ఆడుచున్న 
నిత్య సంసారమును మోయు కామకునితొ 
మూర్ఖునితొ పోల్చు జ్ఞానికి బంధ మేది      

ఎవరి కైనను కావల సినది శాంతి 
దేవతలు కోరు నిత్యము సంతసమ్ము 
యోగులు ఋషులు జ్ఞానాన్ని కోరుచుండు 
మనిషి నేను కుటుంబము బాగు అనును       

--(())--


ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక (5.)
*అష్టావక్ర గీత* తెలుగులో తేటగీత పద్యాలు


రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ఆటలతొ  భోగ లీలగా సల్పు చున్న 
మనిషి ఆత్మతొ జ్ఞానాన్ని పంచు చున్న 
మూర్కునితొ పోల్చి తక్కువ చేయు చున్న 
జీవితము ధర్మ సంసార మార్గ ముంచు     

యోగి నిత్యమూ ఆనంద సౌఖ్య ముంచు  
ఆత్మ అనుసరణ స్థితి కలిగి ఉండు 
సర్వ దేవతలు మనో మయమ్ము గాను 
ఉన్న యోగికి  ధ్యానము నిగ్ర హమ్ము  

ఆత్మ ఎరిగిన వానికి పుణ్య పాప 
మరక అంటదు ఆకాశ మంత పొగలు 
కలయిక కనబడుచు ఉన్న అంట లేదు 
సుఖము సంసార మున్నను ధర్మ బోధ   

ఆత్మ అను వేదము జగతి యంత ఉండు 
జ్ఞాని అను మనిషి మహాత్మ తెలుపు చుండు  
అనుకొనని విధము జరుగు సంఘటనలు
తెల్పి నట్టి వానిని ఆపు తరము ఎవరు    

బ్రహ్మ  దేవుడు జ్ఞానాన్ని నిష్ట గాను 
తృణము వరకును జ్ఞానాన్ని పంచు చుండు 
మనిషికి ఇష్ట అయిష్టములు కలిగి ఉండు  
జీవులు అనేక విధముల జ్ఞాన మొందు  

ఆత్మ నెరిగిన పరమేశ్వరుడుయె కాని 
జీవితము ధర్మ మార్గము సల్పు చుండు 
ఎచట నుండియు భయమును చూడ కుండు 
నిత్య శాంతితో ఎదుగు ప్రాణులలొ నుండు  

--(())-- .... ... .. 

03)అష్టావక్ర గీత

1-అధ్యాయం - ఆత్మ సాక్షిగా - అందరిలో:-

1-1-శ్లోకం:-

జనక ఉవాచ :-

1) కథం జ్ఞాన మవాప్నోతి కథం ముక్తిర్భవిష్యతి ।

వైరాగ్యం చ కథం ప్రాప్తం ఏతద్ బ్రూహి మమ ప్రభో ॥

जनक उवाच ॥

कथं ज्ञानमवाप्नोति कथं मुक्तिर्भविष्यति ।

वैराग्यं च कथं प्राप्तमेतद् ब्रूहि मम प्रभो ॥ १-१ ॥

janaka uvaacha ॥

katham jnyaanamavaapnoti katham muktirbhavishyati ।

vairaagyam cha katham praaptametad broohi mama prabho ॥ 1-1 ॥


టీకా:-

హే ప్రభో!- సర్వ సమర్థులగునో స్వామీ!,(పురుషః పురుషుడు), కథం=ఎట్లు,జ్ఞానం జ్ఞానమును, అవాప్నోతి పొందుచున్నాడు, ముక్తిః=ముక్తి, కథం= ఎట్లు, భవిష్యతి- కలుగును, చ= మరియు, వైరాగ్యం= వైరాగ్యము, కథం= ఎట్లు,ప్రాప్తం=ప్రాప్తించునదిగా (భవిష్యతి అగును),ఏతత్ = దీనిని,మమ-నాకు, బ్రూహి= చెప్పుము.

వివరణ:-

ప్రభూ! జ్ఞానార్జనకు మార్గం ఏది? ముక్తిని ఎలా సాధించడం?

వైరాగ్యం ఎలా నిలుస్తుంది? నా మీద కరుణించి అనుగ్రహించండి.

తాత్పర్యం:-

రోగి తన రోగనివారణ కోసం వైద్యుని దగ్గరకు వెళ్ళినప్పుడు,తనబాధను వీలైనంత స్పష్టంగా తెలియపరచాలి. ఇలా చెప్పకపోతే, వైద్యుడి రోగ నిర్ధారణ చేసి చికిత్స జరపడానికి కొంతకాల వ్యవధి అవసరం అయి, కాలం అనవసరంగా గడిచిపోయే ప్రమాదం ఉంది.

ఇదే విధంగా జిజ్ఞాసువైన శిష్యుడు గురువును సమీపించినప్పుడు తన సందేహాలను వీలైనంత స్పష్టంగా తెలియజెప్పే ప్రయత్నం చెయ్యాలి. దీనిని వింటూనే శిష్యునిలో ఉండే మానసిక, బుద్ధి పరమైన సమస్యలనూ,ఆధ్యాత్మిక అభివృద్ధిలోగల అవరోధాలను గ్రహించడానికి వీలవుతుంది. గురువుకు తదనుగుణంగా బోధ చేయడానికి వెంటనే వీలు కలుగుతుంది. ఇక్కడ ఈ అష్టావక్రగీత జనకరాజర్షి ప్రశ్నలతో ప్రారంభం అవుతున్నది.

సాయం సంధ్యా సమయంలో, మసక వెలుతురులో ఒక స్థాణువును (స్తంభాన్ని కానీ పాతి వున్న కొయ్యనుగానీ) చూసి భూతంగా భ్రమపడే అవకాశం ఉంది. స్థాణువుని చూసి పొరపడడంలో జనించిన భూతం భయభ్రాంతుడిని చేస్తుంది.

అనేక సాధక బాధకాలకు ఆధారం అవుతుంది. ఆ పొరపాటు పడిన వానిని అధోగతిపాలు జేస్తుంది. ఉన్నది స్థాణువే అని గ్రహించకపోవడం (అగ్రహణం) చేతనూ, ఉన్న  దానిని ఇంకొకలా భావించడం చేతనూ (అన్యధాగ్రహణం), ఈ భూతం ఉనికి సాధ్యం అవుతున్నది. ఉన్నదేదో స్పష్టంగా తెలియని అజ్ఞానమే దీనికి కారణం.

జ్ఞానం అనే వెలుగును సంపాదిస్తే అజ్ఞానాంధకారం పటాపంచలవుతుంది. ఉన్నదేదో నిశ్చయంగా తెలిసినప్పుడు, భ్రమపడడము జరగదు. బాధపడడం అసలే ఉండదు.

ఉన్నది స్థాణువే అని తెలియని వారూ, స్థాణువు అని విన్నాం కానీ భూతం లాగే కనిపిస్తుంది. అనుకునేవారు కూడా. ఎంత కష్టపడి అయినా ఈ జ్ఞానజ్యోతిని సంపాదించి సత్యదర్శనం పొంది తీరాలి.

సత్యం జ్ఞానం అనంతం అని వర్ణింపబడే ఆత్మస్వరూపాన్ని, పరబ్రహ్మతత్త్వాన్ని, సరైన దృష్టితో (వెలుగుతో) చూడకపోవడం వల్ల అనంతనామరూప సమన్వితమైన జగత్ జీవ ఈశ్వర భ్రమను కలిగిస్తూ బాధిస్తోంది. చీకటిలోంచి వెలుగులోకి వస్తే చీకటి మాయం అయిపోతుంది. సరైన జ్ఞానదృష్టిని సాధిస్తే అజ్ఞానం అదృశ్యమై పోతుంది.

చూచే నేనూ, చూడడబడే ప్రపంచమూ, ఈ చూచి చూడబడడం అనే సంబంధం వల్ల సాధ్యం అయే అసంఖ్యాక కష్టసుఖాలు కూడా అజ్ఞానజనితాలే.

 చూచేనేనెవరో,చూడబడేదేమిటో, ఎలా చూడబడుతున్నదో స్పష్టంగా తెలిపే జ్ఞానాన్ని సంపాదిస్తే యదార్థం బోధపడుతుంది, భ్రమనశిస్తుంది. ఈ జ్ఞానం ఎలా వస్తుంది?ఎలా సంపాదించాలి? ఇదీ ఇక్కడ జిజ్ఞాసువైన జనకుని మొదటి ప్రశ్న.

ఈ శరీరంతో, మనోబుద్ధులతో, ఈ ప్రపంచంలోని అనేక వస్తువులనూ,తన ఇష్టాయిష్టాలనూ, వీటి కనుగుణంగా సాధించడానికో వదిలించుకోవడానికి (ప్రవృత్తి మార్గం, నివృత్తి నూర్గం) బుద్ధిలో కదిలే ఆలోచనల అలజడిని చూచే వారంతా ఏదో ఒకనాటికి ఈ నిశ్చయానికి రాక తప్పదు. ఈ ప్రపంచం దుఃఖాలయం, అశాశ్వతం, ఈ జనన మరణాలూ, జీవితమూ, ఇవి అశాశ్వతాలని తెలుస్తున్నప్పటికీ, ఏదో శాశ్వతంగా సాధించాలనే తపనా, పరస్పర విరుద్ధ భావాల సంఘర్షణా, వీటిలో నుండి బయటపడి తీరాలి.

ఈ జీవితం నిజంగా దుర్భరం,దుఃఖమయం, అశాశ్వతం ముక్తిని సాధించడం ఎలా? ఈ మన శరీరాలను చూస్తున్నంత సేపూ, ఇవే నేనని భావిస్తున్నంత సేపూ ఈ బంధం ఉంటూనే ఉంది, ఫలితంగా ముక్తి మార్గాన్ని అన్వేషించక తప్పడమూ లేదు. ఈ మన శరీరాలు నేను కాదని తెలుసుకోవడమే నా నిజస్వరూపాన్ని, సత్ చిత్ ఆనంద రూపాన్ని గుర్తించడం అన్నమాట.

బంధం ఉన్నంత సేపూ, బాధ ఉన్నంతవరకూ ముక్తి కోసం అన్వేషణ తప్పదు కాబట్టి ఇక్కడ రాజర్షి రెండవ ప్రశ్న 'ముక్తిని ఎలా సాధించడం అన్నది చాలా అవసరంగా అర్థవంతంగా కనిపిస్తున్నది.

ముక్తి అంటే బంధం నుండి విడివడడం. పూర్ణంగా ముక్తి కావాలనుకున్నప్పుడు, కొంతవరకైన మనం మన మనుకునే రాగబంధాల నుండి విడివడడానికి ప్రయత్నించాలి. నిశ్శబ్దాన్ని చూడడానికి మనం నిశ్శబ్దంగా ఉండడం అవసరం.

****


06)అష్టావక్ర గీత🧘‍♀️*

ఓంశ్రీమాత్రే నమః🔥

*1-అధ్యాయం - ఆత్మ సాక్షిగా - అందరిలో:-*

*04-శ్లోకము:-*

*యది దేహం పృథక్ కృత్య చితి విశ్రామ్య తిష్ఠసి ।*

*అధునైవ సుఖీ శాంతః బంధముక్తో భవిష్యసి ॥ 1-4 ॥*

*यदि देहं पृथक् कृत्य चिति विश्राम्य तिष्ठसि ।*

*अधुनैव सुखी शान्तो बन्धमुक्तो भविष्यसि ॥ १-४ ॥*

*yadi deham pri’thak kri’tya chiti vishraamya tisht’hasi ।*

*adhunaiva sukhee shaanto bandhamukto bhavishyasi ॥ 1-4 ॥*

*టీకా*

(త్వం = నీవు), దేహం= శరీరమును, పృథక్కృత్య = వేరుచేసి, చితి =చైతన్య రూప ఆత్మయందు. విశ్రామ్య - విశ్రాంతిని బొంది, (మనస్సును ఏకాగ్ర పరచి), తిష్ఠపి  యది = ఉంటున్న వాడవై నట్లయితే, అధునా ఏవ = ఇప్పుడే, సుఖీ = సుఖివిగము, శాంతః = శాంతుడవుగను, బంధముక్తః = బంధము నుండి విడివడిన వాడవుగను, భవిష్యసి=కాగలవు.

*వివరణ:-*

నీ శరీర తాదాత్మ్యము నుండి విడివడి, నీ ఎఱుకలో నిష్ఠలో నిలబడ గలిగిన తక్షణమే నీవు శాంతంగా ఆనందరూపంగా ముక్తుడవుగా నిన్ను నీవు గుర్తిస్తావు. ముక్తిని కాంక్షించేవారు వేటిని విషతుల్యంగా త్యజించాలో, వేటిని అనుృతోపమానంగా భావించి సంపాదించాలో ఇదివరకే చెప్పబడింది. అలా చెయ్యడంలో లాభించే అనంతానంద స్వరూపస్థితి కూడా వర్ణించబడింది. 

             ఈమార్గం నిరపాయమూ చాలా నిర్దుష్టమూ అనీ, లక్ష్యం తప్పకుండా చేరుకోగలరనీ ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. కేవలం మనశ్శరీరాల తాదాత్మ్యము నుండి విడివడి మనస్సును అంతర్ముఖంచేస్తే చాలదు. గాఢనిద్రలో ఎవరికీ కూడా శరీర స్పృహ ఉండదు, అయినప్పటికీ ఆధ్యాత్మికానుభవం రావడం లేదుకదా!

శరీరస్పృహనుండి విడివడుతూ తనదైన స్వరూపస్థితిలో తెలుసుకుంటూ నిలబడడానికి చేసే ప్రయత్నమే ధ్యానము.మన ఆధ్యాత్మిక సాధనలన్నీ కూడా మనస్సును శాంతంగా ఉంచి

ధ్యానానుకూలంగా మలచడానికే నిర్దేశించబడ్డాయి. ప్రగాఢమయిన ధ్యానంలో తన స్వస్థితిలో తాను నిలచిన తక్షణమే, పరిమితమయిన అహంకారం నశిస్తుంది, సహజంగా అనంతానంద రూపమయిన స్వస్థితిలో శాంతంగా బంధరహితంగా కేవలంగా ఉండిపోవడం జరుగుతుంది. అసంతృప్తి, ఆరాటం, బంధం బాధఇవన్నీ పరిమితమయిన అహంకారం మాత్రమే అనుభవిస్తుంది.

 వేదాంత వాజ్మయంలో రెండు రకాలా దృఢాభిప్రాయాలున్నాయి. మరణానంతరం మాత్రమే

ముక్తి సాధ్యమని కొందరి అభిప్రాయము. దేహం నశించేక మాత్రమే ముక్తి లభించడాన్ని విదేహముక్తి అంటారు. అష్టావక్రుడు, ఆచార్య శంకరులు మొదలైన వారు దేహం ఉండగానే కదా మిగతా మనుషులవలె కార్యకలాపాలు చేస్తున్నప్పుడే ముక్త స్థితిని అనుభవించడం సాధ్యమని దృఢంగా చెప్పు తున్నారు. దీనిని జీవన్ముక్తి అంటారు. ఇప్పుడే, ఇక్కడే, జీవించి ఉండగానే ముక్తులవడం

అని అర్థం. ఈ జీవన్ముకస్థితి వర్ణింపబడుతోంది ఈశ్లోకంలో, సరిగా ఇటువంటిదే...

*యోగవాశిష్ఠంలో ఒక శ్లోకం ఉంది.*

*యది సర్వం పరిత్యజ్య తిష్ఠస్యుతాన వాసనః |*

*అమునేవ నిమేషేణ తన్ముక్తోసి న సంశయః ||   (యోగవాశిష్టం..*

సర్వాన్ని త్యజించి, వాసనారహితంగా నీవు నిలవగలిగిన క్షణంలోనే ముక్తి

నందగలవు. ఇందుకు సందేహం ఏమాత్రమూ లేదు.🌈

అనంతమూ ఏకమూ అయిన సత్యమే (ఆత్మే) ఉందనీ, సృష్టి అసలు లేనే లేదనీ బోధించే మాండూక్యకారిక, యోగవాశిష్ఠంవంటి ఉత్తమ గ్రంధాలకు

నిజమైన పునాదులు ఈ అష్టావక్రగీతలో కనిపిస్తాయి. సృష్టి అసలు లేనే లేదని చెప్పే వాదాన్ని "అజాత వాదం' అంటారు.

ఏ వస్తువులయినా కలిగి ఉండడంలో నిజానికి యే బాధాలేదు. బాధ అంతా ఆ వస్తువులు మనమీద ఆధిక్యత చూపిస్తేనే. మనకు బాగా డబ్బుంటే

సమ స్యే లేదు. కాని ఆ డబ్బుకే మనం బానిసలమయితే అన్నీ సమస్యలే. ఆహారం ఎటువంటి దయినా మనం స్వీకరించడంలో దోషం లేదు. ఆ ఆహారమే

మనలను ఆరగిస్తేనే అసలు చిక్కంతా!

ఇది బాగా అర్థం అయితే, ఇదే తర్కంతో మన ఆధ్యాత్మిక జీవిత

విధానాన్ని చూద్దాం. మనశ్శరీరాలు మనకు ఉండడంలోనూ వాటిని ఉపయోగించు కోవడంలోనూ యే దోషమూ లేదు. తెలివైన వారు స్వతంత్రంగా హాయిగా

ఉపయోగించుకో గలుగుతారు. వాటిని అజ్ఞానంలో మనమే మనశ్శరీరాలుగా భ్రమపడి వాటి అనుభవాలే మనవనుకొని, వాటి సుఖం కోసం సదా శ్రమపడుతూ,

బానిసలమై, మన అహంకారాన్ని మనమే సృష్టించుకొని సంసారచక్రంలో నిస్సహాయంగా చిక్కుకుంటున్నాం!

ఈ అహంకారం తనమీద తానే యుద్ధం ప్రకటించుకొని, తానెవరని

ఆలోచించడం మొదలు పెట్టి, తాను చూసేసి తానుకానని తేల్చుకుని, ఏకాగ్ర బుద్ధితో, ధ్యానానుకూల మానసంతో తన స్వస్థితిని చేరుకోవడమే మొత్తం వేదాంతం. సాధన అంతా కూడా, ఈ మనశ్శరీరాలు నేను కాదనీ, సమస్తాన్ని సాక్షిగా చూసే చైతన్యమే తాననీ, తెలిసేలా చేసేదే వేదాంత సాధనా, ధ్యానము ఇదంతా క్లుప్తంగా ఈ శ్లోకంలో సూచింపబడింది.

*****

*🧘‍♂️07)అష్టావక్ర గీత🧘‍♀️*

*1-అధ్యాయం - ఆత్మ సాక్షిగా - అందరిలో:-*

*05-శ్లోకము:-*

*న త్వం విప్రాదికో వర్ణః నాశ్రమీ నాక్షగోచరః ।*

*అసంగోఽసి నిరాకారః విశ్వసాక్షీ సుఖీ భవ ॥ 1-5 ॥*

*न त्वं विप्रादिको वर्णो नाश्रमी नाक्षगोचरः ।*

*असङ्गोऽसि निराकारो विश्वसाक्षी सुखी भव ॥ १-५ ॥*

*na tvam vipraadiko varno naashramee naakshagocharah’ ।*

*asango’si niraakaaro vishvasaakshee sukhee bhava ॥ 1-5 ॥*

*టీకా*

 త్వం = నీవు. ఏ ప్రాదీకః= బ్రాహ్మణుడు మొదలగు, వర్ణః=వర్ణము (జాతి)

గలవాడవు, న= కావు. ఆశ్రమీ =నాలుగు ఆశ్రమములకు చెందిన వాడువు, న - కావు.

అక్షగోచరం = ఇంద్రియ విషయము, న=కావు. పరం తు = అయితే (నీవు), ఆసంగః

= సంగరహితుడు, నిరాకారః = నిరాకారుడవు, విశ్వసాక్షి = విశ్వమునకు సాక్షివి, అసి

= అగుచున్నావు, ఇతి - ఇట్లనీ, మత్వా = తలచి, సుఖీభవ =సుఖివిగమ్ము,

🌈వివరణ:-🌈

*నిజానికి నీవు బ్రాహ్మణ మొదలగు యే వర్గానికి చెందవు. ఏ ఆశ్రమానికి చెందవు. ఇంద్రియాలచే నీవు చూడబడవు. సంగరహితుడవు, నిరాకారుడవు, సర్వసాక్షివి నీవు విచారాన్ని విడనాడి సంతుష్టుడవై జీవించు.*

*తాత్పర్యం:-*

హిందూమతంలో వ్యక్తులందరూ నాలుగు వర్ణాలుగా విభజింపబడ్డారు.

ఈ విభజన ముఖ్యంగా, వ్యక్తులలో అంతర్గతంగా కనుగుణంగా

జరిగింది. వాసనలాధారంగా మనశ్శరీరాలూ, సమస్త బాహ్యసృష్టి ఉన్నట్టుగా గుర్తింపబడుతున్నాయి. చైతన్య ప్రకాశంలో శుద్ధమైన ఆత్మ, వాసనలనుండి స్వతంత్రంగా ఉంది, ఉంటుంది. మానవుల విభజన ఈ విధంగా జరిగిన అనంతరం వారి జీవితాలు నాలుగు దశలుగా విభజింపబడ్డాయి. వాటిని ఆశ్రమా లంటారు.

1) విద్యార్థి దశని బ్రహ్మచర్యమనీ,

2) ధర్మబద్ధంగా వైవాహిక జీవితాన్ని గడపడాన్ని గృహస్థాశ్రమమనీ,

3) ఇలా జీవించడంలోని అనుభవాలతో సత్యాన్వేషణా దృష్టి బయలుదేరి, తత్త్వాన్ని గురుముఖతః తెలుసుకోవడానికి, తపస్సు చేయడానికీ కాలాన్ని వెచ్చించే దశని వానప్రస్థమనీ,

 4) ఈ విచారణా, తపస్సూ ఫలితంగా అహంకార మమకారాలు మిథ్యగా భ్రమగా గుర్తించి, బంధాలనుండి విడివడి స్వతంత్ర జీవితాన్ని గడపడాన్ని సన్యాసాశ్రమమనీ అంటారు.

ఈ విభజన చాలా స్పష్టంగా ఉంది. తనకు ప్రపంచానికి ఉండే సంబంధంపట్ల, తనకుండే దృక్పథంలో మార్పుని బట్టి మానసిక పరిణామంలోని వివిధ దశలనూ, నాలుగు ముఖ్య భాగాలుగా విభజించి, నాలుగు ఆశ్రమాలుగా నిర్దేశించారు. అనంతమైన ఆత్మ,

అఖండంగా, అద్వితీయంగా ఉంది, ఉన్నది ఒకటే, తెలుసుకునేదీ తెలియబడేదీ లేవు, కాబట్టి ధర్మాధర్మాలు, జ్ఞానాజ్ఞానాలు ఉండే ఆస్కారమే లేదు.

ఈ సత్యం

తెలుసుకున్నాక జీవించే జీవితం కాబట్టి సన్యాసాశ్రమానికి ఏ విధిని షేధాలూ, ధర్మాలు లేవు. అయినప్పటికి సమాజ క్షేమం కాంక్షించి, వారివల్ల సమాజానికి

మేలు జరగాలి కాబట్టి వారికీ కూడా కొన్ని బాధ్యతలు కాని బాధ్యతలను

సూచించారు. ఈ నాలుగు ఆశ్రమ ధర్మాలు కూడా ఆత్మకు లేవు, ఆత్మలో లేవు.

వర్ణధర్మాలు, ఆశ్రమధర్మాలు కూడా ప్రాథమిక దశలో సాధకునికి

మానసిక పరిణతి నివ్వడానికి తోడ్పడతాయి.

ఆ దశలో సాధకుడు ఇంకా తన మనశ్శరీరాలతో తాదాత్మ్యం చెంది ఉంటాడు కాబట్టి. ఆ భావం నుండి విడివడ

డానికి ఇవన్నీ సహాయపడతాయి. పరిశుద్ధ ఆత్మస్వరూపాన్ని జ్ఞానేంద్రియాలూ మనస్సూ చూడలేవు. బుద్ధి తెలుసుకోలేదు. వీటన్నిటినీ చూస్తు ఉనికి నిచ్చేదే

ఆత్మ. కాబట్టి క్లుప్తంగా చెప్పాలంటే ఆత్మ యేరకమయిన వస్తువూకాదు, ఇది కేవలం సత్ చిత్ మాత్రమే. సత్ అంటే ఉనికి (ఉన్నట్లుగా తెలియబడేది),చిత్ అంటే ఉన్నదానిని తెలుసుకునే తెలివి. ఉన్నట్లుగా అనిపించడమూ దానిని

తెలుసుకుంటున్నట్టు భావించడమూ - ఇలా పరస్పరాధారంగా, అవినాభావంగా

యేకంగా ఉండేదే సత్ చిత్ రూప ఆత్మ, అదే పరబ్రహ్మం.

సర్వసృష్టినీ చైతన్యవంతంగా ప్రకాశమానంగా చేసే, పరిశుద్ధ

ఆత్మకు, సృష్టితో యే విధమైన సంబంధమూ లేదు, సూర్యకాంతిలో కనబడే సమస్త వస్తువులకు సూర్యునకు ఎలా సంబంధం లేదో, అదేవిధంగా ఆత్మకు ప్రపంచానికి సంబంధమే లేదు. ఏ వస్తువుచేత పరిమితం కాదు, కాబట్టి ఆత్మకు

యే రూపమూ ఉండదు.

మనలో చిత్ రూపంలో ఉండి సర్వరూపాలనీ సాక్షిగా చూస్తూ ఉంటుంది. విశ్వాన్నంతటినీ చూస్తుంది కాబట్టి ఇది విశ్వసాక్షి. సంస్కృతం లో అక్షి అంటే కన్ను అని అర్థం. చూసే ఇంద్రియాన్ని కన్ను అని అన్నప్పటికీ చూడడం తెలియడం అనేది మొత్తం అనుభవాలనందించే అన్ని జ్ఞానేంద్రియాలకూ చెందినటువంటి సమిష్టి క్రియ. అక్షి అనేది ఈ తెలియబడడం అనే సమిష్టి క్రియని సూచిస్తుంది. ఈ అధ్యాయం మొత్తంలో నాలుగయిదుచోట్ల సర్వసాక్షిగా

విశ్వసాక్షిగా ఆత్మ సూచింపబడింది. ఈ సర్వసాక్షి, విశ్వసాక్షి భావాలు శ్వేతాశ్వతరోపనిషత్తు (V|-II) లో వివరింపబడ్డాయి. భగవంతుడు సర్వానికీ సాక్షి అని అక్కడ చెప్పడం ఆత్మను ఉద్దేశించే, మనస్సు లోనూ బుద్ధిలోనూ తెలియబడే సర్వాన్నీ నిరాసక్తంగా అసంగంగా కేవలంగా చూస్తూ ఉంటుంది. ఆత్మ

కైవల్యోపనిషత్తులో కూడా ఇటువంటి ప్రయోగమే ఒకటి ఉంది.

త్రిషుధామసు యద్ భోగ్యం భోక్తా భోగశ్చ యద్ భవేత్!

తేభ్యో విలక్షణ: సాక్షి చిన్మాత్రోకహం సదాశివః  !! (కైవల్యోపనిషత్తు 18)

జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే మూడవస్థలలోనూ, అనుభవింపబడేది, అనుభవించే

వ్యక్తి, అనుభవం అనే వాటన్నిటికంటే విలక్షణంగా ఉండే ఈ సాక్షి, నిత్యమూ కళ్యాణ ప్రదంగా చిద్రూపంగా భాసిస్తూ ఉంటుంది.

నిరాకారమూ సర్వసాక్షి అయిన ఆ ఆత్మవు నీవేననే ధ్యానంలో సదా

సంతోషంగా జీవించు. మన కష్టసుఖాలూ, రాగద్వేషాలూ, వీటి సంఘర్షణా జనిత

మయినవ్యధ, ప్రపంచ సంబంధమయిన సమస్యలూ అన్ని క్రమంగా క్షీణించి నశిస్తాయి.

 ధ్యానములో నిశ్చలత నిష్ఠ వృద్ధి అయిన కొద్దీ సాధకునిలో శాంతమూ, సంతోషమూ, సమత్వమూ వృద్ధి అవుతూనే ఉంటాయి. చివరగా తనదైన

ఆనంద రూపంలో తాను నిలవగలుగుతాడు.

🕉🌞🌏🌙🌟🚩

*🧘‍♂️08)అష్టావక్ర గీత🧘‍♀️*

*1-అధ్యాయం - ఆత్మ సాక్షిగా - అందరిలో:-*

*06-శ్లోకము:-*

*ధర్మాధర్మౌ సుఖం దుఃఖం మానసాని న తే విభో ।*

*న కర్తాసి న భోక్తాసి ముక్త ఏవాసి సర్వదా ॥ 1-6 ॥*

*धर्माधर्मौ सुखं दुःखं मानसानि न ते विभो ।*

*न कर्तासि न भोक्तासि मुक्त एवासि सर्वदा ॥ १-६ ॥*

*dharmaadharmau sukham duh’kham maanasaani na te vibho ।*

*na kartaasi na bhoktaasi mukta evaasi sarvadaa ॥ 1-6 ॥*

*టీకా*

హే =విభో! = ఓ సర్వవ్యాపకుడా!, మానసాని = మనస్సంబంధములైన, ధర్మా

ధర్మౌ = ధర్మాధర్మములున్ను, సుఖం దుఃఖం = సుఖదుఃఖములున్ను, తే = నీకు, న =లేవు, చ = మరియు, త్వం = నీవు, కర్తా = కర్తవుగాని, భోక్తా = భోక్తవుగాని, న అసి =

కావు, సర్వదా = ఎల్లప్పుడు, ముక్త ఏవ అసి = ముక్తుడవే అగుచున్నావు.

*వివరణ:-*

ధర్మం, అధర్మం, సుఖం, దుఃఖం మొదలైనవన్నీ మనస్సుకూ బుద్ధికీ

చెందిన లక్షణాలు. నీకు చెందినవి కావు. ఓ సర్వవ్యాపీ! నవ్వు కర్తవూకావు,భోక్తవూ కావు, నీవు సర్వదా స్వతంత్రుడవు, ముక్తుడవు.

*తాత్పర్యం:-*

అహంకారం ఉన్నంత సేపూ రెండు రకాల భావాలతో కూడి ఉంటుంది.

కర్త తానని అనుకోవడం మొదటిది, అనుభవించేది తానని అనుకోవడం రెండవది బాహ్య ప్రపంచంతో వ్యవహరించేటప్పుడు తానే చేస్తున్నానను కుంటుంది. అంత

రంగ ప్రపంచంలో మానసికంగా అనుభవిస్తున్నాను అని తలపోస్తూ ఉంటుంది. ఈ రెండు భావాలూ కలిసి అహంకారంగా భాసిస్తూ ఉంటాయి.

ఈ అహంకారం ప్రపంచంతో వస్తువులతో వ్యవహరిస్తున్నప్పుడు

మంచిని కోరుతున్నా చెడ్డని చెయ్యవలసి వస్తూనే ఉంటుంది. కర్తగా మంచి పనులనూ, చెడ్డపనులనూ కూడా చెయ్యవలసి ఉంటుంది. భోక్తగా అనుభవాలలో

సుఖదుఃఖాల ననుభవిస్తూనే ఉంటుంది. ఈ విధంగా అహంకారం ద్వంద్వాల ప్రభావం నుండి,వాటి వల్ల ఉదయించే సంఘర్షణల నుండి, కష్టసుఖాల నుండి తప్పించుకోలేక బంధంలో ఉండిపోతుంది.

మంచి చెడుల సంఘర్షణా, బాధలు లేకుండా సుఖాలే ఉండాలని

కోరుకోవడమూ, ఇవన్నీ కూడా మనోధర్మాలనీ, బుద్ధిలక్షణాలనీ, నీకు వీటితో యే మాత్రమూ సంబంధం లేదు.

 కాబట్టి సంతృప్తితో జీవించమనీ శిష్యునికి

తెలియచెప్పుతున్నారిక్కడ గురువర్యులు. నిత్యశుద్ధమైన ఆత్మగా నీకు సంఘర్షణలూ సమస్యలూ యేమీ లేవు. అవన్నీ కేవలం నీ అహంకారానికి చెందినవి

మాత్రమే.

అహంకారం తాను కర్తనని అనుకున్నప్పుడు బుద్ధిలో మంచి చెడ్డలను విమర్శించి నిర్ణయిస్తూ ఉంటుంది. ఈ మంచి చెడ్డలు బుద్ధికి చెందిన విలువలు మాత్రమే. ఇదే విధంగా మనస్సుతో తాదాత్మ్యం చెందిన అహంకారం కష్ట సుఖా

లను అనుభవిస్తూ ఉంటుంది. ఇవి మనోధర్మాలు మాత్రమే.

 మనోబుద్ధులకు చెందిన కర్త, భోక్త, భావాలు సమష్టిగా అహంకారంగా వ్యవహరింపబడుతున్నాయి.

ఈ మనో బుద్ధులతో తాదాత్మ్యం పోగానే, అవే నేననే భావంపోగానే, అహంకారం మాయం అయిపోయి ఆనందస్వరూపమైన ఆత్మమాత్రమే మిగిలి ఉంటుంది.

🕉🌞🌏🌙🌟🚩

*🧘‍♂️10)అష్టావక్ర గీత🧘‍♀️*

1-అధ్యాయం - ఆత్మ సాక్షిగా - అందరిలో:-*

*08-శ్లోకము:-*

*అహం కర్తేత్యహం మాన మహా కృష్ణాహిదంశితః ।*

*నాహం కర్తేతి విశ్వాసామృతం పీత్వా సుఖీ భవ ॥ 1-8 ॥*

*अहं कर्तेत्यहंमानमहाकृष्णाहिदंशितः ।*

*नाहं कर्तेति विश्वासामृतं पीत्वा सुखी भव ॥ १-८ ॥*కూడా

*aham kartetyahammaanamahaakri’shnaahidamshitah’ ।*

*naaham karteti vishvaasaamri’tam peetvaa sukhee bhava ॥ 1-8 ॥*

*టీకా*

 అహం = నేను, కర్తా = కర్తను, ఇతి = ఇట్లనెడి, అహం మాన = అహంకార

మనెడి, మహాకృష్ణా హి = గొప్పకాలసర్పము చేత, దంశితః = కరువబడిన నీవు, నాహం

విశ్వా స్వరూపమైన అమృతమును,

పీత్వా = పానము చేసి, సుఖీ = సుఖివిగా, భవ = అగుము.

*వివరణ:-*

"నేను కర్తను" అనుకునే అహంకారం అనబడే మహాభయంకర కృష్ణ

సర్పంచే కరవబడి విషంతో నిండి యున్నావు నీవు. ఈ అమృతాన్ని త్రాగి సుఖంగా ఉండు, నేను సాక్షిని మాత్రమే "నేను ఏదీ చెయ్యడమూ లేదు, అనుభవించడమూ లేదు," అనే భావనే అమృతంగా పానంచేసి, సుఖంగా ఉండు.

*తాత్పర్యం:-*

నేను చూస్తున్నాను, నేను వింటున్నాను. నేను ఆలోచిస్తున్నాను. మొదలైనవన్నీ వాడడానికి కారణం, మనం మన ఇంద్రియాలతోటే మనోబుద్ధుల

తోటే తాదాత్మ్యం చెందడమే. ఇంద్రియాలూ మనోబుద్ధులూ కలిసి, చూడడం వినడం ఆలోచించడం మొదలయినవన్నీ చేస్తున్నాయి. వాటికి పనిచేసే శక్తినిస్తున్న

నీవే, అవి పనిచేస్తుంటే కర్తగా పొరపడుతున్నావు. ఈ భ్రమాజన్య భావంలో నుండే అహంకారం పుడుతుంది.

ఈ అహంకారం పనిచేస్తుంటే, విషయ భోగాలవైపు బలంగా ఆకర్షింపబడి వాటికి దాసులమై పోతున్నాము. ఈ ఆకర్షణతో, అనుభవించాలనే కోరికతో,

కోరికలను తీర్చుకోవాలనుకునే పట్టుదలలోనుండి జనించే సమస్యా సంఘర్షణ బలంలో నలిగి నశించిపోతూ బంధంలో చిక్కుకుంటున్నాం, ఆధ్యాత్మికాభివృద్ధికి అవకాశమే లేకుండాపోతుంది.

 అహంకారాన్ని కాలసర్పంతోనూ, అహంకారం

పనిచెయ్యడం వల్ల వచ్చే ఫలితాలను ఆవిషసర్పం కరవడం వల్ల వచ్చే విష

పరిణామంగానూ అష్టావక్రులు పోలుస్తున్నారు.

ఈ విషప్రభావం నుండి బయటపడడానికి ఒకే ఒక మార్గం ఉంది.

 ఇంద్రియ మనోబుద్ధులను నీవుగా భ్రమపడడం కారణంగా ఈ విషపరిణామం సంభవం అయింది కాబట్టి, మళ్ళీ తిరిగి ఈ భ్రమను పోగొట్టడానికి "ఇవేవీ నేను కాదు" అని అస్తమానం గుర్తుచేసుకోవడమే ఏకైక మార్గం. అహంకారం అనబడే విషానికి విరుగుడు కాబట్టే ఈ భావనను అమృతంతో పోల్చడం జరిగింది.

🕉

*🧘‍♂️11) అష్టావక్రగీత🧘‍♀️*

🔥ఓంశ్రీమాత్రే నమః

*అధ్యాయం-1*

*ఆత్మ సాక్షిగా - అందరిలో*

*శ్లోకం 09:-*

*ఏకో విశుద్ధబోధోఽహమితి నిశ్చయవహ్నినా ।*

*ప్రజ్వాల్యాజ్ఞానగహనం వీతశోకః సుఖీ భవ ॥ 1-9 ॥*

*एको विशुद्धबोधोऽहमिति निश्चयवह्निना ।*

*प्रज्वाल्याज्ञानगहनं वीतशोकः सुखी भव ॥ १-९ ॥*

*eko vishuddhabodho’hamiti nishchayavahninaa ।*

*prajvaalyaajnyaanagahanam veetashokah’ sukhee bhava ॥ 1-9 ॥*కాగా

*టీకా*

 అహం= నేను, ఏకః = ఒక్కడను, విశుద్ధబోధః = అతిశుద్ధ బోధస్వరూపుడను,

ఇతి = అను, నిశ్చయవహ్నినా = నిశ్చయరూపమగు అగ్నిచేత, అజ్ఞానగహనం = అజ్ఞాన

రూపారణ్యమును, ప్రజ్వాల్య = దహింపజేసి, వీతశోకః = పోగొట్టబడిన దుఃఖముగల

వాడవై, సుఖీభవ = సుఖివికమ్ము.

*వివరణ:-*

అజ్ఞాన మహారణ్యాన్ని, ఏకమయిన శుద్ధ చైతన్యం నేనే అనే

జ్ఞానాగ్నితో (భావనతో ) దగ్ధం చేసి, సమస్త దుఃఖాలనుండి విముక్తుడవై

సంతోషముతో జీవించు.

*తాత్పర్యం:-*

ఆత్మను సరిగా గ్రహించక అన్యధా గ్రహించడాన్ని, భావించడాన్ని

వేదాంత భాషలో అజ్ఞానం అంటారు. ఈ అజ్ఞానం ఇక్కడ మహారణ్యంతో పోల్చబడింది. మహారణ్యంలో చిక్కుకున్నవానికి ఎలా దారితెలియక దట్టమయిన

అడవిలోనికి పోయి పోయి ఆకలిదప్పులతో, రక్షణ లేకుండా ఎలా జీవితం దుర్భరం అవుతోందో అదేవిధంగా అజ్ఞానంలో చిక్కుకున్న వాడు కూడా బయట పడడం దుర్లభం. మహారణ్యంలో క్రూరమృగాలున్నట్లే అజ్ఞానారణ్యంలో అహం

కారమూ రాగద్వేషాలూ మన నావరించి పూర్తిగా కబళించి వేస్తాయి. ఈ ఉపమానం మనశాస్త్రాలలో తరుచూ వాడబడుతూ ఉంటుంది.

దేశకాలావృతమయిన ప్రపంచం గురించి కార్యకారణ సంబంధ

రూపంలో ఉండే జ్ఞానాన్ని మనం ప్రస్తుతం మన బుద్ధి ద్వారా గ్రహిస్తున్నాం. సాధనద్వారా బుద్ధిలో అలజడి తగ్గి, శాంతం వృద్ధి అయినప్పుడు, సహజంగా

బుద్ధి అంతర్ముఖం అయి, నిశ్చలత్వాన్ని పొంది నిశ్శబ్దంగా తన సహజ శాంతస్థితిని గుర్తించడం జరుగుతుంది.

ఈ విధంగా స్థిరమూ శాంతమూ గంభీరమూ అయిన బుద్ధి తన

స్వరూపాన్ని ధ్యానం చేసి, మననం చేసి శుద్ధస్థితినందుతుంది. దీనినే వేదాంత పరిభాషలో అంతఃకరణ శుద్ధి అంటారు. ఇలా శుద్ధి పొందిన అంతఃకరణమాత్రమే సత్యాన్ని గ్రహించగలుగుతుంది, అనంతమైన ఆత్మస్వరూపంగా మిగిలిపోతుంది.

మనలో చైతన్యం ఉంది కాబట్టే, మన జ్ఞానేంద్రియాల ద్వారా, మనో

బుద్ధుల ద్వారా ప్రపంచ జ్ఞానాన్ని పొందగలుగుతున్నాం. రాళ్ళలోనూ కర్రలోనూ చైతన్యం లేదు. కాబట్టి అవి జడం, జడపదార్థానికి జ్ఞానం ఉండదు. చైతన్యం ఉన్నచోట జ్ఞానం ఉంటుంది. వస్తువులను అనుభవాలను చైతన్య

వంతంగా గుర్తించడమే మనకున్న జ్ఞానమంతా. మనలోని చైతన్యం ప్రస్తుతం ఈ జ్ఞాన రూపంలోనే మనకు తెలియబడుతున్నది.

ఈ జ్ఞానంలో నుండి వస్తువులన్నిటినీ తీసివేయగా మిగిలినదే శుద్ధ జ్ఞానము, దీనిని విశుద్ధబోధ అంటారు

సాధకుడు, తన ధ్యానంలో నిష్ఠ పెరిగిన కొద్దీ, మనోబుద్ధుల ప్రభావం

నుండి విడివడి, వాటి పరిధికతీతంగా ఉండే స్వస్థితిలో, ఉన్నది నేనే, నేనే శుద్ధ జ్ఞానాన్ని, విశుద్ధ చైతన్య స్వరూపాన్ని అని గుర్తించగలుగుతాడు. ఈ గుర్తింపులో ఈ విశుద్ధబోధలో, ఈ జ్ఞానాగ్నిలో అజ్ఞానం అనబడే మహారణ్యం దగ్ధం అయిపోతుంది అని అష్టావక్రులు అంటున్నారు.

మనకు యిష్టం అయిన వస్తువు దూరం అయితే బాధకలుగుతుంది.

ఈ బాధ అనేది మనోలక్షణం మాత్రమే సుఖదుఃఖాలు, సంతోష విచారాలు, మొదలయినవన్నీ మానసిక ఉద్రేకాలుగా మనస్సుచేతనే అనుభవింపబడతాయి..

శుద్ధచైతన్య స్వరూపంగా నిలబడినప్పుడు, మనస్సును అధిగమించి, అతీతంగా

ఉంటాం కాబట్టి, మనోలక్షణాలయిన బాధలక్కడ ఉండవు. ఈ ఆత్మస్వరూపాన్ని

నీవుగా గుర్తించి, ఆ స్థితిలో నిష్ఠతో ఆనందంగా జీవించు.

*🧘‍♂️12) అష్టావక్రగీత🧘‍♀️*

*అధ్యాయం-1*

*ఆత్మ సాక్షిగా - అందరిలో*

*శ్లోకం10:-*

*యత్ర విశ్వమిదం భాతి కల్పితం రజ్జుసర్పవత్ ।*

*ఆనందపరమానందః స బోధస్త్వం సుఖం భవ(చర) ॥ 1-10 ॥*

*यत्र विश्वमिदं भाति कल्पितं रज्जुसर्पवत् ।*

*आनन्दपरमानन्दः स बोधस्त्वं सुखं चरा ॥ १-१० ॥*

*yatra vishvamidam bhaati kalpitam rajjusarpavat ।*

*aanandaparamaanandah’ sa bodhastvam sukham chara ॥ 1-10 ॥*

*టీకా*

యత్ర = ఏ యానందస్వరూపమైన ఆత్మయందు, ఇదం = ఈ, విశ్వం =

ప్రపంచము, కల్పితం = కల్పించబడినదై, రజ్జుసర్పవత్ = త్రాటియందు పామువలె,

భాతి = తోచుచున్నదో, సః = ఆ ఆనంద, పరమానన్ద = ఆనందాతీత పరమానంద స్వరూపుడవును, బోధ---జ్ఞాన స్వరూపుడవును, త్వం = నీవు, అసి = అగుచున్నావు,

(అందువలన), సుఖం = సుఖపూర్వకముగా, చర = సంచరింపుము.

*వివరణ:-*

పరమానందపూర్ణ చైతన్యమే నీవు. ఆ చైతన్యంలో ఈ ప్రపంచం,

రజ్జువులో సర్పం వలె గోచరించి భ్రమింపజేస్తుంది. భ్రమను వీడి, ఆనందపూర్ణ చైతన్యంగా హాయిగా జీవించు.

*తాత్పర్యం:-*

పరమార్థతః సాధకుడు, సాధ్యమయిన పరమాత్మకంటే భిన్నం కాదని క్రిందటి శ్లోకంలో చెప్పేరు. మననిత్య జీవితంలో అనుక్షణమూ అనంత వస్తుమయ

మయిన ప్రపంచాన్ని బాహ్యంగా చూస్తున్నాం. అంతర్గతంగా మనస్సు యిష్టా యిష్టాలు, కోరికలు, బుద్ధి ఇంకా అనేకానేక భావాలు ఉండడం గుర్తిస్తున్నాం.

ఇవన్నీ ఎక్కడ నుండి వచ్ఛాయి? ఎలా పుట్టాయి? పరిశుద్ధమయిన ఆత్మ ఏకంగా అద్వయంగా ఉన్నట్టయితే, ఈ చూడబడే ప్రపంచమూ, చూడడానికి ఉపకరణాలుగా

ఉపయోగపడే మనశ్శరీరాలు అసత్యం కావాలి. ఈ అసత్యం ఎక్కడనుండి పుట్టింది?

సత్యంలో నుండి అసత్యం జనించగలదా? జనిస్తే రెండవది ఉన్నట్టే కదా!

నానాత్వ భ్రాంతి కలిగిస్తున్న ఈ మాయా ప్రపంచపు ఉనికి గురించి

వివరించడానికి, వేదాంతంలో ఎంతో అందమయిన ఉపమానం వాడబడింది. సాయం సంధ్యాసమయంలో, మసక చీకటిలో ఒకతాడు పాముగా భావింపబడింది. అది తాడే అన్నజ్ఞానం కలిగిన వెంటనే భ్రాంతసర్పం మాయం అయిపోతుంది. తాడు అని గ్రహించకపోవడమే పాముగా అన్యధా గ్రహింపబడడానికి కారణం

అవుతుంది. ఈ అన్యధా గ్రహణమే మిగిలిన భయానికి బాధలకూ కారణం అవుతున్నది.

ఇదే విధంగా మన స్వస్వరూపమయిన సత్ చిత్ ఆనందాన్ని గుర్తించక పోవడమే (అగ్రహణం), మనస్సు శ్శరీరాహంకారాలతో కూడిన జీవుడూ,అనంత వస్తుమయమయిన ప్రపంచంగా గుర్తింపబడి, భయభ్రాంతులను కలుగజేయడానికి కారణం అవుతున్నది. అధిష్ఠానమయిన ఆత్మను గుర్తించగానే ఆరోపింపబడిన ప్రపంచం మిథ్య అవుతున్నది. అధిష్ఠానమయిన తాడుని గురించి

తెలియగానే ఆరోపింపబడిన పాము అదృశ్యమయినట్టే!

ఈ అనంతానందమే నీవు అని అష్టావక్రులు నిశ్చయంగా చెపుతున్నారు.

ఈ ఆత్మ మీదే ప్రపంచం ఆరోపింపబడింది. తాడు మీద పాము ఆరోపింపబడి నట్టుగా! నీదైన ఆనందములో నిష్ఠతో నిలబడి హాయిగా జీవించు.

ధ్యానాభ్యాసం మొదలు పెట్టిన సాధకునికి ఈ శ్లోకాలన్నీ చాలా ఉపయోగపడతాయి. ఏకాంత స్థలంలో దృష్టిని అంతర్ముఖంచేసి ఈ శ్లోకాలను మందస్వరంతో చదువుకుంటూ, అర్థం చూస్తుంటే, బాగా మననం జరిగి ధ్యాననిష్ఠ కుదురుతుంది.

*🧘‍♂️13) అష్టావక్రగీత🧘‍♀️*

*అధ్యాయం-1*
*ఆత్మ సాక్షిగా - అందరిలో*

*శ్లోకం 11:-*

*ముక్తాభిమానీ ముక్తో హి బద్ధో బద్ధాభిమాన్యపి ।*
*కింవదంతీహ సత్యేయం యా మతిః సా గతిర్భవేత్ ॥ 1-11 ॥*

*मुक्ताभिमानी मुक्तो हि बद्धो बद्धाभिमान्यपि ।*
*किंवदन्तीह सत्येयं या मतिः सा गतिर्भवेत् ॥ १-११ ॥*

*muktaabhimaanee mukto hi baddho baddhaabhimaanyapi ।*
*kimvadanteeha satyeyam yaa matih’ saa gatirbhavet ॥ 1-11 ॥*
*టీకా*

ముక్తాభిమానీ = ముక్తియందు అభిమానముగలవాడు, ముక్తః = ముక్తుడగు చున్నాడు, బద్ధాభిమానీ = బంధమునందు అభిమానము కలవాడు, బద్ధః = బద్ధుడగు
చున్నాడు, మతిః = బుద్ధి, యా = ఎటువంటిదో, గతిః = గతి, సా = అటువంటిది,భత్ = అగును, ఇతి = ఇట్లని, ఇహ = యీ లోకములో, ఇయం = ఈ, కింవదంతి -
లోకప్రవాదము, సత్యా = సత్యమైనది.

*వివరణ:-*

తనను తాను ముక్తునిగా భావించేవాడు ముక్తుడే. బద్ధునిగా
భావించేవాడు బంధంలోనే ఉండిపోతాడు. 'యద్భావం తద్భవతి -- ఎలా భావిస్తాడో అదే అయి తీరతాడు అనేది పరమసత్యం.

*తాత్పర్యం:-*

'యామతిః సా గతిః" మనం ఎలా భావిస్తామో అదే మనం అయిపోతాము. మనలను మనం నిస్సహాయులుగా, పరిమితత్వాలతో మనశ్శరీరాలతో బంధింప బడిన జీవిగా తలపోస్తూ అంటే మనగతి యింతే.

ఇలా కాకుండా శాస్త్రాలు మన
స్వస్వరూపం యేదని చెపుతున్నాయో దానినే అస్తమానమూ ధ్యానిస్తే, మన
స్వస్థితిని తప్పకుండా గుర్తించగలుగుతాము. ఉపనిషత్తులు కూడా దీనినే గట్టిగా
చెపుతున్నాయి. 'మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః -- మన బంధ స్థితికి మోక్షానికి కూడా మన స్సే కారణం.

యోగవాశిష్టంలో కూడా ఇటువంటిదే చెప్పబడింది. "యత్
తన్మయో భవతి పూరుషు మనస్సులో ఉదయించిన ఆలోచన, మానసిక తాదాత్మ్య శక్తితో రూపుదాల్చి నిజంగా కనిపిస్తుంది.

ఆధ్యాత్మిక జీవితంలో, సాధనలో కూడా
ఈ నిజాన్ని చూడవచ్చు.
నిజంగా పామున్నట్టుగా మనం పడిన భ్రమ, తాడును ఏవిధంగానూ మార్చడం లేదు. ఇదే విధంగా నిత్యశుద్ధ అనంత చైతన్యం ఎప్పుడూ కూడా అది గుర్తించే
అనుభవించే జగత్తుగా మారనే లేదు.

ఆత్మను ఆత్మగా గ్రహించని అజ్ఞాంనుండి వాసనలు, వాసనల నుండి కోరికలు, కోరికల నుండి మనోబుద్ధులూ అవి చూపించే
ప్రపంచమూ స్వప్నంలో వలెనే కనిపించి ఆ సమయంలో నిజమనే భ్రమను కల్పించడం జరుగుతున్నది. స్వప్నంలో నుండి మేలుకున్న వానిని బాధించదు, కాని ఆ మాయ ప్రభావంలో ఉన్నంత సేపూ బాధపడక తప్పదు.

ఆత్మను గ్రహించకపోవడం (అగ్రహణం) నుండి, ప్రపంచాన్ని దాని బాధలను
గ్రహించడం (అన్యధాగ్రహణం) అనే భ్రమ ఉదయిస్తున్నది. పొరపాటుగా యేర్పరచుకున్న భావాలను సరైన అవగాహనతో సరైన భావాలతో సరిచెయ్యవచ్చు. మన స్వస్వరూపాన్ని తరుచూ, అస్తమానం గుర్తుచేసుకోవడం (ధ్యానంవలన మనదైన ఆత్మానుభవం పొంది ఆనందంగా జీవించవచ్చు.

🕉🌞🌏🌙🌟🚩
14) అష్టావక్రగీత🧘‍♀️

అధ్యాయం-1
ఆత్మ సాక్షిగా - అందరిలో    శ్లోకం 12:-

ఆత్మా సాక్షీ విభుః పూర్ణ ఏకో ముక్తశ్చిదక్రియః ।
అసంగో నిఃస్పృహః శాంతో భ్రమాత్సం సారవానివ ॥ 1-12 ॥

आत्मा साक्षी विभुः पूर्ण एको मुक्तश्चिदक्रियः ।
असङ्गो निःस्पृहः शान्तो भ्रमात्संसारवानिव ॥ १-१२ ॥

aatmaa saakshee vibhuh’ poorna eko muktashchidakriyah’ ।
asango nih’spri’hah’ shaanto bhramaatsamsaaravaaniva ॥ 1-12 ॥

టీకా

ఆత్మా = ఆత్మ, సాక్షి = సాక్షి, విభుః = వ్యాపకము, పూర్ణః = పూర్ణము, ఏకః = ఏకము, ముక్తః = ముక్తము, చిత్ = చైతన్యరూపము, అక్రియః = క్రియారహితము, అసంగః = సంగరహితము, నిస్స్పృహః = ఇచ్ఛారహితము, శాంతః = శాంతమునై యున్నది, భ్రమాత్ = భ్రాంతివలన, సంసారవాన్ ఇవ = సంసారము కలది వలె తోచుచున్నది.

వివరణ:-

ఆత్మ కేవలము సాక్షి. సర్వవ్యాపి, పూర్ణం. అద్వయం. ముక్తం, చిద్రూపం, అకర్త, అసంగం, శాంతం.
మాయా ప్రభావంతో ప్రపంచంగా సంసారంగా భావించబడుతుంది.

తాత్పర్యం:-

ఆత్మానుభవం పొందిన, బ్రహ్మనిష్ఠులైన అష్టావక్రమునీంద్రులు ఇది వరకు చెప్పినసారాన్నే మరల ఈశ్లోకంలో చెప్పారు. నీవు ఈ శరీరము మనసూ కావు, పరిశుద్ధమైన ఆత్మవే నీవు.

ఆదిమధ్యాంతం శూన్యమైన అపరిమిత సత్యాన్ని పరిమితమయిన మాటలలో వర్ణించడం సాధ్యం కాదు.  అయినప్పటికీ మన మహర్షులు భాషతోనే భాషకతీతమయిన సత్యాన్ని సూచించడానికి ఒక ప్రత్యేక పద్ధతిని రూపొందించారు. ఈ పద్ధతిలో ప్రత్యేక శ్రద్ధతో వాడబడిన మాటల యొక్క బాహ్యార్థం ఎలా ఉన్నా, వాటి లక్ష్యార్థం మాత్రము ధ్యాన నిష్ఠాగరిష్ఠుడయిన సాధకునికి ఆత్మానుభవాన్ని తప్పక అందించి తీరుతుంది. తత్ +త్వం+అసి (తత్త్వమసి) మహావాక్య లక్ష్యార్థ
సారాన్ని ఈ శ్లోకంలో అందిస్తూ క్రిందటి పదకొండు శ్లోకాలలోనూ వివరింపబడిన దానినే సంగ్రహంగా మళ్ళీ చెప్పారు.

ఆత్మను సాక్షి అనడంలో, ఇది సర్వాన్నీ చైతన్యవంతం చేస్తుందనీ, చైతన్యవంతం చెయ్యబడే వాటికంటే ఇది ఎప్పుడూ వేరేననీ స్పష్టంగా చెప్పేరు. ఈ సాక్షి సర్వవ్యాపి విభుః. ఏవిధంగా భ్రమాజన్యమయిన పాము నిండా తాడు ఉందో, అదే విధంగా సర్వప్రపంచంలోనూ అధిష్ఠానమయిన ఆత్మ వ్యాపించే ఉంది. ఆత్మ సర్వగతమనీ, అన్ని ప్రాణులలోనూ ఆత్మే ఉందనీ సూచింపబడుతున్నది. ఇది పూర్ణం, దీనిలో కొత్తగా చేర్చవలసింది ఏదీలేదు, అలాగే తీసివేయ
బడేదికూడా ఉండదు. స్తంభాన్ని భూతంగా భ్రమించడంలో స్తంభానికి క్రొత్తగాయేమీ చేరలేదు. ఆ భ్రమపోయినప్పుడు పోయేదికూడా యేమీ ఉండదు. ఈ కనిపించే సర్వనామ రూపాలకు ఆత్మే అధిష్ఠానంగా ఉంది.

ఈ ఆత్మ ఏకం, ఉన్నది ఒక్కటే కాబట్టి సర్వస్వతంత్రం, 'ముక్తః". ఇది తెలుసుకునే చిత్ కాబట్టి ఇది అకర్త. "అక్రియః'. ఆకాశంలో ఎన్ని కదులుతున్నా ఆకాశానికి ఎలా కదలికలేదో అదేవిధంగా చిత్ లో ఎన్ని తెలియబడుతున్నా యేమీ చెయ్యడం లేదు. అకర్తగా అక్రియగా ఉంది, ఉంటుంది.

ఆకాశంలో ఎన్ని ఉన్నా అవన్నీ ఆకాశానికి ఎలా సంబంధించి లేవో, అదే విధంగా ఆత్మలో (చిత్ లో ) ఎన్ని తెలియబడుతున్నా, ఉన్నట్లు కనిపించినా ఆత్మ అసంగమే 'అసంగః", (నిస్పృహః) ---ఇందులో ఏ కోరికలు లేవు. వాసనలుంటే కోరికలుంటాయి. వాసనలనే ప్రకాశింపజేసే ఈ చైతన్యంలో కోరికలెలా ఉంటాయి? కోరికలే లేవు కాబట్టి ఆలోచనల అలజడులూ, అంతులేని శారీరక శ్రమా ఉండజూలవు. కాబట్టి ఈ పరమ సత్యం--- "శాంతః ---శాంతంగా వర్ణింప బడినది.

అనల్పభావాన్ని అల్పపదాలతో వర్ణించారు. ఈ పది పదాలనీ మననం చెయ్యగలిగిన మనస్సు, మనస్సు కతీతమైన మహత్తర సత్యాన్ని గ్రహించ గలదు, భావనాతీతమైన అనుభవంలో నిలచిపోగలదు. ఈ పరిణామరహితమైన ఆత్మ, అజ్ఞానంవలన, మాయాప్రభావంతో పరిమితమైన అహంకారంగా, జీవుడు గా పరిణామం చెందినట్లు అనిపిస్తోంది. చూస్తున్నాను, ఆలోచిస్తున్నాను, అనుభవిస్తున్నాను అని భావించే వ్యక్తిగత అహంకారం, బాహ్యాభ్యంతరాలలో అనేకానేక ఆకర్షణలకులోనై వాసవ లను సృష్టించుకుంటుంది. ఈ పోగుచేసుకున్న వాసనలను అనుభవించడానికి అనేక దేహాలలో పుడుతూ, మరణిస్తూ కొత్త వాసనలను పోగుచేసుకుంటూ జనన మరణ చక్రంలో చిక్కుకుని దుర్భర వేదన ననుభవిస్తుంది. ఈ పరిభ్రమణమే సంసారం అనబడుతుంది.

నిజానికి ఆత్మ అహంకారంగా జీవుడుగా మారడం లేదు. తాడు పాముగా మారడం లేదు, స్తంభం భూతంగా పరిణామం చెందడం లేదు. అలా మారి అనంతవేదన
అనుభవిస్తున్నట్టుగా భ్రమను మాత్రమే కలుగజేస్తుంది.

*****

15) అష్టావక్రగీత
ఓంశ్రీమాత్రే నమః
అధ్యాయం-1
ఆత్మ సాక్షిగా - అందరిలో

శ్లోకం 13:-

కూటస్థం బోధమద్వైతం ఆత్మానం పరిభావయ ।
ఆభాసోఽహం భ్రమం ముక్త్వా భావం బాహ్య మథాంతరం ॥ 1-13 ॥
कूटस्थं बोधमद्वैतमात्मानं परिभावय ।
आभासोऽहं भ्रमं मुक्त्वा भावं बाह्यमथान्तरम् ॥ १-१३ ॥

koot’astham bodhamadvaitamaatmaanam paribhaavaya ।
aabhaaso’ham bhramam muktvaa bhaavam baahyamathaantaram ॥ 1-13 ॥

టీకా

 అహం = నేను, ఆభాసః = ఆభాసరూప అహంకారి జీవుడను, ఇతి= ఈ ప్రకార మగు, భ్రమం = భ్రాంతిరూపమగు, బాహ్యం = బాహ్యమైనట్టియు, అంతరం = లోపల నున్నట్టియు, భావం = భావమును, ముక్త్వా = విడిచి పెట్టి, కూటస్థం = కూటస్థుడనవి, బోధం = జ్ఞానరూపుడననియు, అద్వైతం = ద్వైత రహితుడనియు, ఆత్మానం = నిన్ను, పరిభావయ = చింతింపుము.

వివరణ:-

బాహ్యాభ్యంతరాలలో అలజడిని సృష్టించే భావాల్ని విడనాడి, నేను అహంకారాన్ని అనే భ్రమని వీడి సత్ చిత్ ఆనందమయమయిన ఆత్మనే నేను అనే ధ్యానంలో సంతోషంగా జీవించు.

తాత్పర్యం:-
ఆత్మ అంటే అర్థం యేమిటో దానికోసం ఎక్కడ అన్వేషించాలో సూచించే బాణం గుర్తులవంటి మాటలను యింతవరకూ వాడి సాధకులను ఆత్మాభిముఖులను చేసేరు అష్టావక్రమునీంద్రులు, ఆ మాటలను చూడడం కాక అవి చూపించే లక్ష్యార్థమయిన ఆత్మను తనలో సర్వసాక్షిగా ఉండడాన్ని గుర్తించమని ఈ శ్లోకం లో గట్టిగా నొక్కి చెపుతున్నారు.

 నిశ్చలమూ శాంతమూ అయిన మనస్సుతో, మనస్సు బుద్ధీ అహంకారమూ నేననే భ్రమనుపీడి, వాటికుండే పరిమితులను తనవిగా పడే బాధను విడచి పెట్టి, వీటన్నిటినీ చూసే సాక్షి వైపు దృష్టి మళ్ళించి, తన్ను తాను సత్ చిత్ రూపంగా ధ్యానించాలి. సదా తెలుకుంటూ ఉండాలి.
ఈ గీత మొత్తంలో ఈ ఒక్క శ్లోకంలో మాత్రమే ధ్యానం చెయ్యమని శిష్యుడిని ఆదేశిస్తున్నారు.

 ఇకముందు ఈ భావాన్ని కూడా అధిగమించి, ధ్యానం చెయ్యడమే తన అసంపూర్ణత్వాన్ని అంగీకరించడంగా తెలుసుకొని ధ్యానాన్ని కూడా విడనాడమని చెప్పబోతున్నారు మునీంద్రులు. ధ్యానం చెయ్యాలి అనే భావం ఉండడమే ఆత్మని తెలుసుకోకుండా, దూరంగా రెండవదిగా ఉన్నానని భ్రమపడడం అవుతుంది, పూర్ణమైనది ఆత్మ అంటూనే అవమానించడం అవుతుంది.

ఆత్మలక్షణాలను మనస్సులో యాంత్రికంగా జపించడం ధ్యానం కానేరాదు. ఇంతవరకూ చెప్పబడిన వాక్యాలను బాగా మననం చేసి,లక్ష్యార్థాన్ని బుద్ధితో చేరుకుని, సందేహ రహిత స్థితిలో నిశ్చలంగా బుద్ధి నిలచిపోవాలి.

 ఇలా నిశ్చలంగా శాంతంగా నిలచిన బుద్ధితో, యే క్షణాన్నయినా సత్యాన్ని దర్శించ బోతున్నానన్న ఎఱుకతో ఏకాగ్రంగా ఉన్న మనస్సుతో సాధకుడు నిలవగలగడమే ధ్యానానికి పరమావధి. భావశూన్యమయినప్పటికీ బహుజాగ్రత్తగా, సర్వవిషయా లనూ విస్మరించి, విషయీ సాక్షీ అయిన ఆత్మమీద దృష్టి నిలపడాన్ని ఇక్కడ 'పరిభావయ' అన్నపదం సూచిస్తుంది.

'కూటస్థ' అన్నపదం ఇందులో వాడబడింది. ఇది చాలా అర్థవంతమైనది. అనేక అర్థాలు కలిగినదీ కూడా.

కూట అంటే 1) పర్వత శిఖరాగ్రం, 2) చిత్రమైన మాయ, (3) కమ్మరి ఇనుప సామానులను వంచడానికి సాగదియ్యడానికి కొట్టేటప్పుడు ఆధారంగా వాడే దిమ్మ వంటిది (దాగిలి) అనే అర్థాలున్నాయి. ఈ అర్థాలన్నీ కూడా ఇక్కడ వాడబడ్డాయి. ఆత్మే అన్నిటికంటే సర్వోన్నతమయినది, శిఖరాగ్రంవంటిది, కనిపించే మాయా ప్రపంచం అంతటికీ అధిష్ఠానం ఆత్మే. దీనిమీద సర్వమూ కనబడి రూపుమార్చుకుంటున్నా ఇది మాత్రమే స్థిరంగా ఉండేది.

సర్వసృష్టికి ఆధారంగా అధిష్ఠానంగా ఉండే సత్యాన్ని, ఆత్మని, వేదాంతభాషలో బ్రహ్మం అంటారు. ఇదే ఆత్మ మనోబుద్ధుల ద్వారా వ్యక్త మయిన గుర్తింపబడడాన్ని 'ఆభాస" అంటారు. ఇదే జీవుడుగా వ్యవహరింప బడుతుంది.

****
🧘‍♂️16) అష్టావక్రగీత🧘‍♀️

అధ్యాయం-1
ఆత్మ సాక్షిగా - అందరిలో

శ్లోకం 14:-
దేహాభిమానపాశేన చిరం బద్ధోఽసి పుత్రక ।
బోధోఽహం జ్ఞానఖడ్గేన తన్నికృత్య సుఖీ భవ ॥ 1-14 ॥

देहाभिमानपाशेन चिरं बद्धोऽसि पुत्रक ।
बोधोऽहं ज्ञानखड्गेन तन्निकृत्य सुखी भव ॥ १-१४ ॥

dehaabhimaanapaashena chiram baddho’si putraka ।
bodho’ham jnyaanakhad’gena tannikri’tya sukhee bhava ॥ 1-14 ॥

టీకా

పుత్రక! = ఓ కుమారా!, (త్వం = నీవు), దేహాభిమానపాశేన = దేహాభిమాన మనెడి త్రాటి చేత, చిరం = చాలాకాలం నుండి, బద్ధః = కట్టుబడినవాడవు, అసి = అగుచున్నావు, అహం = నేను, బోధః = జ్ఞానస్వరూపుడను, ఇత = అనెడి, జ్ఞానఖడేన - జ్ఞానఖడ్గము చేత, తత్ = ఆ పాశమును, నికృత్య = ఛేదించి, సుఖీభవ = సుఖివి కమ్ము.

వివరణ:-

పుత్రా! నీ దేహమే నీవు అనే భావంతో చిరకాలంగా బంధింపబడి ఉన్నావు. సర్వాన్నీ చూస్తున్న సాక్షి చైతన్యమే నీవనే భావమనే జ్ఞానఖడ్గంతో, ఈ బంధాన్ని ఛేదించి సంతోషంతో జీవించు.

తాత్పర్యం:-
ఈ మధ్యనే ఒక క్రిష్టియను మతగురువు గౌ|| జార్జి అనే ఆయనచే హిందూమతం స్వీకరింపబడింది. ఆయనకు జనార్ధనం అనే పేరు పెట్టబడింది. ఈ తతంగమంతా అయిన మరునాడే ఒకాయన చప్పట్లు కొట్టి "జనార్ధనంగారూ' అని పిలిచాడు. ఈ వ్యక్తి పలకకుండా వెళ్ళిపోతున్నాడు. మొదటి వ్యక్తి పరుగెత్తుకుని వెళ్ళి, భుజంతట్టి, 'మీరు జనార్ధనంగారేనా?' అని అడిగాడు.

ఇవతలి వ్యక్తి పొరబడ్డాడన్న భావాన్ని సూచిస్తూ చిరునవ్వుతో 'మీరు పొర పడ్డారు, నేను జార్జిని' అన్నాడట! ఇంత తతంగం జరిగి మతం మార్చుకుని క్రొత్త పేరును జనార్ధనంగా గ్రహించినప్పటికీ, తన పాత పేరుతో చిరకాల సహవాసం కారణంగా కొత్త పేరును మరిచిపోయాడు. ఈ క్రొత్తదృష్టిలో నిలబడడానికి కొంత కాలవ్యవధి అవసరం అన్నమాట.

అనేకవేల జన్మల నుండి శరీరమే నీవనుకుంటూ పరిణామం చెందుతూ, ఈ మానవ దేహం ధరించి, నీ బుద్ధి గొప్పతనాన్ని నువ్వు తెలుసుకుంటూ అభినందించుకుంటూ, మనశ్శరీరాలే నీవనే దృఢభావంలో స్థిరపడి ఉన్నావు. దీనిని కాదని ఒక్కమారు తెలుసుకుంటే సరిపోదు.

కృషితో దీక్షతో సదా ధ్యానించి నీ స్వరూప స్థితిలో నిలనగలగడానికి కాలవ్యవధి అవసరమవుతుంది. ఇదంతా అర్థం చేసుకుని జాలితో ప్రేమతో అష్టావక్రులు చెపుతున్నారు. కాబట్టే 'పుత్రక' అని సంబోధించడం జరిగింది.

ఆత్మతత్త్వాన్ని, సత్యాన్ని బోధించి, దానిని ఎక్కడ ఎలా సాధించాలో వివరించిన గురువర్యులు ఇకమీదట ఏమీ చెయలేరు. భ్రమలో ఉన్న సాధకుడే తన భ్రమను పోగొట్టుకోవాలి. తానే సత్ చిత్ ఆనందాన్ని గ్రహించాలి.

అందుకనే ఎంతో ప్రేమతో మరెంతో ఆతృతతో ఇలా అంటున్నారు- 'ఈ శరీరమే నీవనుకునే అజ్ఞానాన్ని, ఆత్మవే నీవనే నిశ్చయమనే జ్ఞానఖడ్గంతో ఛేదించు' నీ స్వస్థితిని గుర్తించి సంతోషంతో జీవించు.

మనశ్శరీరాలు నీవనుకుని పొరపడడంతో బాధామయమయిన సంసార చక్రంలో చిక్కుకుని దారి తెలియకున్నావు. అజ్ఞానం నశించగానే జ్ఞానం అక్కడే ఉండడాన్ని గుర్తిస్తావు. చైతన్యమయమయిన ఆత్మవు నీవే అని దృఢంగా తెలుసుకుని హాయిగా జీవించు.

🕉🌞🌏🌙🌟🚩
🧘‍♂️17) అష్టావక్రగీత🧘‍♀️
అధ్యాయం-1
ఆత్మ సాక్షిగా - అందరిలో

శ్లోకం 15:-

నిఃసంగో నిష్క్రియోఽసి త్వం స్వప్రకాశో నిరంజనః ।
అయమేవ హి తే బంధః సమాధి మనుతిష్ఠతి ॥ 1-15 ॥

निःसङ्गो निष्क्रियोऽसि त्वं स्वप्रकाशो निरञ्जनः ।
अयमेव हि ते बन्धः समाधिमनुतिष्ठसी॥ १-१५ ॥
 
nih’sango nishkriyo’si tvam svaprakaasho niranjanah’ ।
ayameva hi te bandhah’ samaadhimanutisht’hasi ॥ 1-15 ॥

టీకా

 త్వం = నీవు, నిస్సంగః = సంగరహితుడవు, నిష్క్రియః = క్రియా రహితుడవు, స్వప్రకాశః = స్వయం ప్రకాశరూపుడవు, నిరంజనః దోష రహితుడవు (ఇట్లుండగా), త్వం=నీవు, సమాధిం = చిత్తవృత్తి నిరోధ మాత్రరూప సమాధిని, అనుతిష్ఠ సి=అనుష్ఠించు చున్నావు, (ఇతియత్ = అనునదేదిగలదో), అయమేవ = ఇదియే, తే = నీకు, బంధః = బంధము. 

వివరణ:-

నీవు నిస్సంగుడవు, నిష్క్రియుడవు, స్వయంజ్యోతివి, నీలో ఏ మాలిన్యమూ లేదు, దీనిని ధ్యానించు, ఈ విధంగా నీ బంధాన్ని తొలగించుకో.

తాత్పర్యం:-

నీ మనశ్శరీరాలతోగాని, వానిచే అనుభవింపబడే వస్తువులతోగాని ఆత్మకు ఏ సంబంధమూ లేదు.
స్తంభానికి భూతంతోగాని, దానివల్ల కలిగే కష్టనష్టాలతోగాని ఏ సంబంధమూ లేనట్టే, పరిమితమైనది మాత్రమే అపరిమితం కావాలనే కోరికతో కర్మలను చెయ్యగలదు. ఆత్మ అనంతమూ పూర్ణమూ కావడం వల్ల ఇందులో కోరికలూ లేవు, వాటి ఫలితమయిన కర్మలూ ఉండవు,
ఇది నిష్క్రియం. ఇది స్వయం జ్యోతి. కళంకరహింతగా "నిరంజనః సర్వ వాసనలకు అతీతంగా, నాటిని చైతన్యవంతం చేస్తూ చిత్ రూపంలో మనలో సాక్షిగా ఉండి, స్థూల సూక్ష్మకారణ శరీరాలను చూస్తున్నది.

ఆత్మకు ఏ బంధమూ లేదు. ఇది నిత్యముక్తము. కాబట్టి, దానికి ధ్యానం తో పనిలేదు. ధ్యానం చేస్తున్నామంటే, ధ్యానించే, వేరుగా తలచే అహంకారం కొద్దిగానయినా మిగిలి ఉన్నట్టే. ఈ వేరు భావం పూర్తిగా పోయేదాకా బాగా మననం చెయ్యాలి.

 నిద్ర కోసం ప్రయత్నిస్తున్నంత సేపూ నిద్ర ఉండదు, నిద్ర పోతూ వుంటే నిద్రకోసం ప్రయత్నమే ఉండదు! సర్వాన్నీ చైతన్యవంతం చేస్తూ సర్వానికీ సాక్షిగా ఆత్మే ఉంది, ఆ ఆత్మే నేను అనే భావం దృఢమయే దాకా ఆ మననం చెయ్యాలి. ఈ దృఢజ్ఞానం వచ్చేక "నేను" కాని మనోబుద్ధులతో ధ్యానం ఎందుకు చేస్తాను?

ధ్యానం ద్వైతభావాన్ని బంధస్థితనీ సూచిస్తుందనీ నిత్యముక్తమయిన ఆత్మ అయిన తనకు ధ్యానంతో పని లేదని అనగలిగే అష్టావక్రుని వంటి ఆత్మ నిష్ఠులు చాలా అరుదుగా ఉంటారు. బంధం ఉందన్న భావన ఉంటేనే ముక్తి కోసం ప్రయత్నిస్తారు.

 ధ్యానిస్తున్నామంటే శాస్త్రం చెప్పే దానిని సరిగ్గా అర్థం చేసుకోలేదని అర్థం అవుతున్నది, ఉన్నది ఒకే ఒక ఆత్మ, అదే స్వయం జ్యోతిగా, సర్వసాక్షిగా, సర్వత్రా ఉంది అన్నది సరిగ్గా అర్థం అయితే నేను వేరుగా ఉండే అవకాశమే లేదు. వేరేలేనప్పుడు ధ్యానం ఎందుకు? కాబట్టి శాస్త్రం చెప్పేది అర్థం అయేవరకూ శ్రవణమూ మననమూ చెయ్యడమే మన కర్తవ్యం.
చిత్తశుద్ధితో, నిజాయితీతో సత్యాన్నన్వేషించే సాధకునికి ఈ శ్లోకంలో అత్యంత విలువైన సూచన ఉంది.

 బాహ్యంగా నేను చేస్తున్నాను, చూస్తున్నాను, అనుభవిస్తున్నాను మొదలయిన ఆలోచనలన్నీ అణిగిపోయినప్పటికీ, అంతర్గతంగా అహంకారం నేను ధ్యానిస్తున్నాను అనే ఆలోచనతో అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ విధంగా బీజప్రాయంగానైనా ఆలోచన ఉందంటే, అది ఎప్పుడు మహారణ్యంగా విస్తరిస్తుందో మనకే తెలియదు, ధ్యానం మళ్ళీ గుర్తువచ్చేసరికి మనం ఎక్కడయినా ఉండవచ్చును.

 ధ్యాననిష్ఠలో చివరి దశకు చేరిన వారందరిలోనూ బహుశా, ఈ 'నేను ధ్యానిస్తున్నాను" అన్నభావన ఆటంకంగా ఉంటుంది కాబోలు. ఈ దశను దాటి ధ్యానాన్ని వీడి ధ్యేయ స్థితిలో ఉండడం కష్టమవుతూ ఉంటుంది వీరందరికీ. అందుకే ఈ శ్లోకంలోని సూచన సాధకులకు అత్యంత విలువైనది, తనలో అంతర్గతంగా తెలియకుండా మిగిలి పోయిన కర్తృత్వభావన ధ్యానంగా మిగిలిపోతుంది. అని హెచ్చరిక ఉంది దీనిలో.

యోగవాశిష్టంలో కూడా ఇటువంటి సూచనలనే చూడవచ్చును.

సాధో సమాధిశభ్దేన పరాప్రజ్ఞోచ్యతే బుధైః! అజస్రమంబువహనాద్ యధా నద్యా న రుధ్యతే!!

(అధ్యా. 62-9)

 తధాత్మ జ్ఞాన హీనాత్మా కాలోజ్ఞస్య న లభ్యతే. (ఆధ్యా. 62-19) . )

 ఓ సాధూ అంతటా ఉండే పరమాత్మే నాలో కూడా ఆత్మగా ఉంది అని తెలుసు కోవడమే, ఆ అనుభవంలో ఉండడమే సమాధి అనబడుతుంది. నదిలోని నీరు నిత్యమూ ఎలా ప్రవహిస్తూ ఉంటుందో, అదే విధంగా సమాధి స్థితుడయిన వానిలో ఏకమయిన ఆత్మనే నేను అనే భావం సర్వదా ఉంటుంది.

అటువంటప్పుడు అతడు ధ్యానం ఎలా చేయగలడు? దేన్ని గురించి ధ్యానిస్తాడు? అసలు దేని కోసం ధ్యానించాలి? ఆత్మజ్ఞానాన్ని పొందడాన్ని ప్రజ్ఞ అంటారు. స్థితప్రజ్ఞుడయిన వానిలో ఏకమయిన ఆత్మ చైతన్యమే నేను, ఈ చితే సర్వప్రాణులలోనూ చైతన్యంగా వ్యక్తమవుతుంది అనే జ్ఞానం ఎప్పుడూ ఉంటుంది. అందుకే వశిష్ఠులు ఆశ్చర్యంగా ఇలా అంటున్నారు.

 సర్వగః సర్వదైవాత్మా సర్వమేవ చ సర్వధా

అసమాధి హి కౌసా స్యాత్ సమాధిరపి కః స్మృతః!! (యోగవాశిష్ఠం అధ్యా.62-64)
కానీ
ఆత్మ సర్వవ్యాపిగా, అందరిలోనూ చైతన్యంగా వ్యక్తమవుతూ అంతటా ఎల్లప్పుడూ సమాధిస్థితి లేకపోవడం ఎలా సంభవం? అసలు సమాధిస్థితి వేరే ఉండడం ఏమిటి?
*🧘‍♂️18) అష్టావక్రగీత🧘‍♀️*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩

*అధ్యాయం-1*
*ఆత్మ సాక్షిగా - అందరిలో*

*శ్లోకం 16:-*

*త్వయా వ్యాప్తమిదం విశ్వం త్వయి ప్రోతం యథార్థతః ।*

*శుద్ధబుద్ధస్వరూపస్త్వం మా గమః క్షుద్రచిత్తతాం ॥ 1-16 ॥*

త్వయా వ్యాప్తమిదం విశ్వం త్వయి ప్రోతం యథార్థతః ।

శుద్ధబుద్ధస్వరూపస్త్వం మాగమః క్షుద్రచిత్తతామ్॥ 16 ॥


*त्वया व्याप्तमिदं विश्वं त्वयि प्रोतं यथार्थतः ।*

*शुद्धबुद्धस्वरूपस्त्वं मा गमः क्षुद्रचित्तताम् ॥ १-१६ ॥*


*tvayaa vyaaptamidam vishvam tvayi protam yathaarthatah’ ।*

*shuddhabuddhasvaroopastvam maa gamah’ kshudrachittataam ॥ 1-16 ॥*

*టీకా*

 ఇదం = ఈ, విశ్వం = ప్రపంచము, త్వయా = నీచేత, వ్యాప్తం = వ్యాప్త మైనది, త్వయి = నీయందే, ప్రోతం = కూర్చబడినది, త్వం = నీవు, యథార్థతః = నిజముగా, శుద్ధబుద్ధ స్వరూపః = శుద్ధచైతన్య స్వరూపుడవు, క్షుద్రచిత్తతాం = నీచమైన చిత్తవృత్తిని, మాగమః = పొందకుము.

*వివరణ:-*

నీవు ఈ విశ్వం అంతటా వ్యాపించి ఉన్నావు, ఈ విశ్వం నీలో ఉన్నట్టుగా భాసిస్తుంది. పరిశుద్ధమైన ఆత్మ చైతన్యమే నీవు. క్షుద్రమైన భ్రమాజన్య భావాలకు తావిచ్చి విచారానికి లోనుకావద్దు.


*తాత్పర్యం:-*

ఏ వస్తువయినా ఉన్నదంటే, ఆ వస్తువు తయారుకావడానికి కారణ మయిన పదార్థాన్ని అంతటా పూర్తిగా కలిగి ఉంటుంది.


వస్తువు తయారవడానికి కానలసిన కారణాన్ని ఉపాదానకారణమని అంటారు. కుండ ఉందంటే దాని ఉపాదాన కారణమైన మట్టి కుండ అంతటా పూర్తిగా ఉండి తీరుతుంది. ఏ ఆత్మ చైతన్యం వల్ల ఈ ప్రపంచము ఉన్నట్టుగా తెలియబడుతున్నదో, ఆ చైతన్యం ప్రపంచం అంతటా తప్పకుండా ఉండి తీరాలి.


 మన మనస్సులో కల తెలియబడుతున్నప్పుడు, కలను చూస్తున్నప్పుడు, ఆ స్వప్నం అంతటా మనస్సే నిండి ఉండి అనేకంగా భ్రమ కలిగిస్తూ ఉంటుంది. ఇది మన అందరికీ అనుభవమే. నీవు ఆత్మ, కాబట్టి నీవు ఈ విశ్వమంతటా వ్యాపించే ఉన్నావు.
మనస్సులో పుట్టిన స్వప్నమంతటా మనస్సు ఉంటుంది. అంతే కాదు ఆ స్వప్నం మనస్సులో మాత్రమే ఉనికి కలిగి ఉంది.


 మనస్సులోనే మనస్సు చేతనే నిర్మించబడింది. మనస్సులోనే ఉనికిని కలిగి ఉండి అందులోనే లయమై పోతుంది. మనస్సు నుండి విడిగా స్వప్నం లేదు. మట్టితో కుండ తయారయింది. కుండ అంతా మట్టికుండ మట్టిలోనే ఉనికి కలిగి ఉండి మట్టిలో లయిమైపోతుంది. కుండ ఉన్నా లేకపోయినా మట్టే ఉంది.


ఇదే విధంగా, పరిశుద్ధమైన ఆత్మ చైతన్యమే నీవు, నీలోనే, నీవల్లనే, ఈ వివిధ ప్రత్యేక రూప సమన్వితమైన విశ్వం అంతా ఉనికిని కలిగి ఉంది, నామ రూపాలతో గుర్తింప బడుతుంది.
నీలోనే నీవల్లనే ఈ ప్రపంచం ఉనికిని సంతరించుకున్నప్పటికీ ఇది నిన్నే విధంగానూ బంధించదు, పరిమితం చేయలేదు.


 అద్వయమూ పరిపూర్ణమూ అయిన ఆత్మ చైతన్యంలో విషయాలూ విషయీ కూడా పడుగు పేకలవలె అల్లుకుపోయి ఏకంగానే ఉంటాయి, ఇలా అద్వయంగా ఉంటేనే అనేక భ్రాంతిని కలిగిస్తూ అసాధారణమూ అనిర్వచనీయమూ అయిన జగన్నాటకాన్ని ప్రదర్శించే మహాశక్తివంతమైనది ఈ ఆత్మ చైతన్యం.


ప్రతి వస్తువు కూడా ఏదో ఒక నామం రూపంతోటే గుర్తింపబడతాయి. ఈ ప్రపంచంలో మనకి తెలిసేదేదైనా ఈ నామ రూపాలలోనే ఉంది. ఈ సర్వ రూపాలూ ఉన్నట్టుగా బుద్ధిలో గుర్తింపబడడానికి కారణమయిన సద్వస్తువూ అధిష్ఠానమూ నీవే.


నీ స్వస్థితిని మరిచి, నీచే గుర్తింపబడేవానిని నీవుగా పొరపడి, వాటి లక్షణాలను పరిమితులను నీవిగా భావించి బాధపడడం ఉన్మాద లక్షణం, వివేకవంతులు చేసే పనికాదు. నిన్ను నీవు మనశ్శరీరాహంకారా లతో పరిమితమైన జీవునిగా భావిస్తూ విచారపూర్ణ జీవితాన్ని అనుభవించడం విచారకరం. 'క్షుద్రభావాలకు తావివ్వకు" అని అష్టావక్రులు హెచ్చరిస్తూ, నీకంటే గొప్పయైనది రెండవ దేదీ లేదు అని నిశ్చయంగా బోధిస్తున్నారు.

🕉🌞🌏🌙🌟🚩


*🧘‍♂️19) అష్టావక్రగీత🧘‍♀️*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩

*అధ్యాయం-1*
*ఆత్మ సాక్షిగా - అందరిలో*

*శ్లోకం 17:-*

*నిరపేక్షో నిర్వికారో నిర్భరః శీతలాశయః ।*
*అగాధబుద్ధిరక్షుబ్ధో భవ చిన్మాత్రవాసనః ॥ 1-17 ॥*

నిరపేక్షో నిర్వికారో నిర్భరశ్శీతలాశయః I
అగాధబుద్ధి రక్షుబ్ధొ భవ చిన్మాత్రవాసనః || 17 ॥


*निरपेक्षो निर्विकारो निर्भरः शीतलाशयः ।*
*अगाधबुद्धिरक्षुब्धो भव चिन्मात्रवासनः ॥ १-१७ ॥*


*nirapeksho nirvikaaro nirbharah’ sheetalaashayah’ ।*
*agaadhabuddhirakshubdho bhava chinmaatravaasanah’ ॥ 1-17 ॥*

*టీకా*

త్వం = నీవు, నిరపేక్షః = కోరికలేనివాడవుగను, నిర్వికారః = వికారరహితు డవుగను, నిర్భరః = చిదనరూపుడవుగను, శీతలాశయః = శాంతి ముక్తి స్థానముగను, అగాధబుద్ధిః = అగాధ చైతన్య బుద్ధి రూపుడవుగను, అక్షుబ్దః = అవిద్యా క్షోభరహితు డవుగను, చిన్మాత్రవాసనః = చైతన్యమాత్ర స్వరూపస్థితుడవుగను, భవ = అగుము. 

*వివరణ:-*

నీవు కోరదగినదేదీ లేదు, నీవు పరిణామరహితుడవు, సమదృష్టి కలిగిన సాక్షివి, జ్ఞానస్వరూపమే నీవు, సర్వాన్నీ చైతన్యవంతం చేసే చిన్మాత్ర రూపివి వాసన అంటూ ఉంటే, కేవలం ఆ చైతన్యాన్నే కోరుకో (ఇంక వేరే కోరదగినదేదీలేదు)

*తాత్పర్యం:-*

శుద్ధమూ పూర్ణమూ ఏకమూ అయిన ఆత్మవు నీవే కాబట్టి నీవు దేని మీదా ఆధారపడిలేవు. (నిర పేక్షః). నీకు పరిమితులు లేవు. సర్వత్రా సర్వదా నీవు పూర్ణానివే (నిర్భరః), అహంకారయుక్తమయిన జీవితంలో అసంఖ్యాకంగా కోరికలు అగ్నిజ్వాలల వలె దహించి వేస్తుంటాయి.


ఇందుకు భిన్నంగా ఆత్మవే నీవనే భావంలో నిలువగలిగినప్పుడు అనంత పరిపూర్ణ శాంతమే నీవుగా స్థిరంగా ఉంటావు (శీతలాశయః).


మహనీయమూ, మాననీయమూ అయిన ఈ ఆత్మను, ఈ చిత్ స్థానాన్ని, మహర్షులు వర్ణించేటప్పుడు సాధారణంగా ఆత్మానుభవాని కర్షమయిన స్థితిని సూచిస్తుంటారు.


 ఉపనిషత్తులలో విరివిగా ఈ పద్ధతి వాడబడింది. ఏదో ఒక నామవాచక విశేషణంతో ఆత్మను సూచించి దానిగురించి చర్చిస్తుంటారు. ఇక్కడ ఆత్మ "అగాధబుద్ధిః", "అక్షుణ్ణః" అని చెప్పబడింది.


అగాధబుద్ధి అంటే ఆలోచనారహితంగా స్థిరమూ గంభీరమూ అయిన బుద్ధి అని అర్థం. ఈ బుద్ధిలో చైతన్యాం సహజంగా ఉంటుంది ఇక్కడ స్వరుపానుభవం సాధ్యమవుతుంది. సాదకులందరికి సాధారణంగా ఆచార్యలందరూ ఓకే సలహాని ఇస్తుంటారు.


చైతన్యాన్ని సదా కోరుకో "భవ చిన్మాత్రవాసన! మన కోరికలవల్ల ఆలోచనలు మారుతుంటాయి. ఆలోచనలతో అనుభవాలుద్భవిస్తాయి.


 ప్రాపంచిక వస్తు సంబంధ మయిన కోరికలుంటే, దానికి తగిన ఆలోచనలు రావడం, నానాత్వంగా భాసించే ప్రపంచానుభవం కలగడమూ జరుగుతుంది. ఏదికోరితే అది అనుభవంగా వస్తుంది.


కాబట్టి దీక్షతో నిశ్చలంగా, సదా ఆత్మానుభవాన్నే కోరుకో. నీ ఆలోచనలన్ని ఆత్మమయం అయి, నిత్యమననం జరిగి ఆత్మానుభవంలో సహజంగా ఉండడం జరుగుతుంది.

🕉️🌞🌏🌙⭐🚩


*🧘‍♂️ 20) అష్టావక్రగీత🧘‍♀️*
🕉️🌞🌏🌙🌟🚩
🔥 *ఓంశ్రీమాత్రే నమః* 🔥
*అద్వైతచైతన్యజాగృతి*
🕉🌞🌏🌙🌟🚩

*అధ్యాయం-1*
*ఆత్మ సాక్షిగా - అందరిలో*

*శ్లోకం 18:-*

*సాకారమనృతం విద్ధి నిరాకారం తు నిశ్చలం ।*
*ఏతత్తత్త్వోపదేశేన న పునర్భవసంభవః ॥ 1-18 ॥*

సాకారమనృతం విద్ధి నిరాకారం తు నిశ్చమ్।
ఏతత్తత్త్వోపదేశేన న పునర్భవసంభవః ॥ 18 ॥


*साकारमनृतं विद्धि निराकारं तु निश्चलम् ।*
*एतत्तत्त्वोपदेशेन न पुनर्भवसम्भवः ॥ १-१८ ॥*


*saakaaramanri’tam viddhi niraakaaram tu nishchalam ।*
*etattattvopadeshena na punarbhavasambhavah’ ॥ 1-18 ॥*

*టీకా*

 సాకారం = శరీరాదికములగు దృశ్యములను, అనృతం = మిథ్యగా, విద్ధి = తెలిసికొనుము, నిరాకారం = నిరాకారమగు ఆత్మతత్త్వమును, నిశ్చలం=చలన రహితమై నిశ్చలమైనదానినిగా, విద్ధి ఎఱుగుము, ఏతత్ = ఈ, తత్త్వోపదేశేన = యథార్థోప దేశము చేత, పునః = మఱల, భవసంభవః = సంసారమునందు పుట్టుట, న భవతి = జరుగదు.

*వివరణ:-*

రూపం ఉన్నది నశిస్తుందనీ, రూపరహితమైనది నిత్యమనీ తెలుసుకో. ఈ జ్ఞానం వల్ల పునర్జన్మల నుండి ముక్తిని పొందగలవు.

*తాత్పర్యం:-*

కిందటి శ్లోకంలో అగాధబుద్ధివే నీవు, ఆ బుద్ధిని సాధించు అని చెప్పబడింది. నిజాయితీగా సాధన చెయ్యగోరే సాధకునికి ఇక్కడ ఒక సమస్య ఎదురౌతుంది. ఆలోచనలు లేకుండా చేద్దామని ప్రయత్నించే కొద్దీ, అనంతంగా అవి ఉదయించి దృష్టిని మళ్ళిస్తూనే ఉంటాయి.


గత అనుభవాలాధారంగా మనో బుద్ధులు అనేకానేక రూపాల్ని నామాల్ని ఊహించి రూపించి చూపిస్తూనే ఉంటాయి. మనస్సుని శాంతంగానూ బుద్ధిని నిశ్చలంగానూ ఉంచడాని కనువైన పద్ధతినొకదానిని సూచిస్తు న్నారిక్కడ అష్టావక్రమహర్షి.


సాధకులు తాము సాధించదలుచుకున్న దానిని స్పష్టంగా అర్థం చేసుకుని తీరాలి. ధ్యానంలో సత్యమయిన దానిని సాధించాలనుకుంటున్నాడు. సాధకుడు సత్యం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి.


ఏది సత్యమో అది నిత్యం, భూత భవిష్యద్వర్తమానకాలాలలో ఇది మార్పుచెందదు, ఇది కాలానికతీతం. కాలబద్ధం కాదు. పరిణామరహితమైనది అంటే రూపం లేనిదన్నమాట. రూపం ఉంటే మార్పు ఉండే తీరుతుంది.


 దీనికి భిన్నంగా భూతకాలంలో లేనిదీ, భవిష్యత్తులో ఉండనిదీ, వర్తమానంలో ఉన్నట్టు కనిపిస్తున్నదీ ఆ సత్యం, మిథ్య అన్నమాట. స్తంభం నిజం, భూతం మిథ్య, జాగ్రత్ స్థితి నిజం, స్వప్నం మిథ్య సముద్రం నిజం.


తరంగాలు మిథ్య, అనుక్షణమూ మార్పు చెందుతూ ఉండే నానాత్వ ప్రపంచం మిథ్య, అధిష్ఠానమయిన ఆత్మసత్యం. మనోబుద్ధులతో వాటి ఊహా వ్యూహరచనలమధ్య నిలబడి, అంటే మిథ్యమధ్యలో నిలబడి సత్యాన్ని దర్శించాలనుకుంటున్నాడు సాధకుడు.


శరీరం మనస్సు బుద్ధీ అనుభవాలూ ఉద్రేకాలూ ఆలోచనలూ అన్నీ అనునిత్యం మారుతునే ఉంటాయి. కాబట్టి అవి అసత్యం. ఇవి ఉన్నట్టుగా స్ఫురింప జేస్తూ, గుర్తిస్తూ, లేకపోవడాన్ని (అభావాన్ని)కూడా చూసే ఆత్మ నిత్యమయినది.


ఈ విధంగా ఏది సత్యమో, ఏది అసత్యమో స్పష్టంగా తెలిసిన సాధకుడు అసత్యాన్ని విస్మరిస్తూ, సత్యాన్ని స్మరిస్తూ లక్ష్యాన్ని చేరడం సులభం అవుతుంది. 'రూపం కలది', అనుభవయోగ్యమయినది, అసత్యమని తెలుసుకో, నిరాకారమైనది మార్పు చెందదు, కాబట్టి అది సత్యమని తెలుసుకో.


ఈ సూచనతో, సహజంగా సాధకుని దృష్టి, అనుభవాల నందించే మన శ్శరీరాలనుండి శుద్ధచైతన్య రూపమయిన సాక్షి వేపు మళ్ళుతుంది.


ఈ సత్య స్వరూప జ్ఞానంలో నిష్ఠకలగగానే, అజ్ఞాన జనితమయిన అహంకారమూ, దాని కల్పనా మాత్రమయిన ప్రపంచమూ కూడా మిథ్యగా సాధకునిచే గుర్తింప బడతాయి ఆ తరువాత అవి ఉన్నా లేనట్టే, ఆకాశంలో నీలవర్ణం కనిపిస్తున్నా లేదని తెలిసినట్టే, కనిపిస్తున్నా ప్రపంచం మిథ్య అని తెలుస్తూనే ఉంటుంది. 

🕉🌞🌏🌙🌟🚩

*****
*🧘‍♂️21) అష్టావక్రగీత🧘‍♀️*
🕉🌞🌏🌙🌟🚩
🔥 *ఓంశ్రీమాత్రే నమః* 🔥
*అద్వైతచైతన్యజాగృతి*
🕉🌞🌏🌙🌟🚩

*అధ్యాయం-1*
*ఆత్మ సాక్షిగా - అందరిలో*

*శ్లోకం 19:-*


*యథైవాదర్శమధ్యస్థే రూపేఽన్తః పరితస్తు సః ।*
*తథైవాఽస్మిన్ శరీరేఽన్తః పరితః పరమేశ్వరః ॥ 1-19 ॥*

యథైవాదర్శమధ్యస్థే రూపేఽన్తః పరితస్తు సః ।
తథైవాఽస్మిన్ శరీరేఽన్తః పరితః పరమేశ్వరః ॥ 19 ॥


*यथैवादर्शमध्यस्थे रूपेऽन्तः परितस्तु सः ।*
*तथैवाऽस्मिन् शरीरेऽन्तः परितः परमेश्वरः ॥ १-१९ ॥*


*yathaivaadarshamadhyasthe roope’ntah’ paritastu sah’ ।*
*tathaivaa’smin shareere’ntah’ paritah’ parameshvarah’ ॥ 1-19 ॥*

*టీకా*

యథా ఏవ = ఏ ప్రకారముగానైతే, ఆదర్శమధ్య సే = అద్దము యొక్క మధ్య భాగమునందున్న, రూపే= ప్రతిబింబమునందు, అన్తః పరితః = అంతటా సః = ఆ శరీరం, భాసతే = తోచుచున్నదో, తథైవ=అట్లే, అస్మిన్ శరీరే = ఈ శరీరమునందు, అంత:పరితః = లోపల వెలుపల కూడా, పరమేశ్వరః = పరమేశ్వరుడు, భాసతే = భాసించుచున్నాడు.

*వివరణ:-*

అద్దంలో కనిపించే ప్రతిబింబములోనూ ప్రతిబింబం పైనా కూడా అదేవిధంగా అద్దం వ్యాపించి ఉంటుందో, అదే విధంగా శరీరం లోపలా పైనా కూడా
పరమాత్మ ఆవరించి ఉంటుంది.

*తాత్పర్యం:-*

 ధ్యానించేటప్పుడు సాధకుడు తనలో సాక్షిగా ఉండే చైతన్యాన్నే స్మరించినా, క్రమంగా మనశ్శరీరాల తాదాత్మ్యము నుండి భ్రమాజన్య బాధల నుండీ విడవడిన తరువాత,అనంత చైతన్య స్వరూపంగా తన్ను తాను గుర్తిస్తాడు. అప్పుడతనికి బాహ్యభ్యంతరాలనేవి ఉండవు. ఉన్నదంతా ఎఱుకలోనే చైతన్యములోనే ఉంది. నా ఎఱుకలోనే నా శరీరమూ ప్రపంచమూ కూడా ఉన్నాయి, ఆ ఎఱుకే నేనని తెలిసిన సాధకునికి బాహ్యాభ్యంతరాలెలా ఉంటాయి? ఈ బాహ్యాభ్యంతరాలనేవి కేవలం శరీరానికి చెందినవే కాని ఆత్మకు కాదు.


ఒకగదిని ఒక కుండని చూస్తే వాటి దృష్ట్యా ఆకాశం లోపలా పైనా కూడా ఉంటుంది. గది గోడలని తీసేసినా, కుండ పగిలిపోయినా, ఆకాశం బాహ్యాభ్యంతర శూన్యంగా ఏకంగా మిగిలిపోతుంది. ఇదే విధంగా సాధకుడు మనశ్శరీరాలతో సాధన మొదలు పెట్టి, అవి తాను కానని తెలుసుకుని, తన్ను సర్వగతమూ సర్వ వ్యాప్తమూ అయిన చైతన్యంగా తెలుసుకున్నప్పుడు,అంతవరకూ తనవనుకున్న పరిమితులు కూడా మాయం అయిపోతాయి, అఖండాత్మ స్వరూపంగా మిగిలి పోతాడు.


ఈభావాన్ని బోధించడానికే ఇక్కడ అద్దమూ ప్రతిబింబమూ ఉదాహరణగా చెప్పారు అష్టావక్రులు. అద్దంలో ప్రతిబంబానికి బాహ్యాభ్యంతరాలలో అద్దమే ఉంటుంది.


 ప్రతిబింబం అద్దంలో మాత్రమే ఉనికిని కలిగి ఉంటుంది., ప్రతిబింబం పోయినా అద్దం మామూలుగా మిగిలే ఉంటుంది. అది ఉన్నప్పుడు కూడా అద్దానికి దానితో ఏ విధమయిన సంబంధమూ ఉండదు. ఇదే విధంగా చైతన్యంలో, చైతన్యం వల్లనే, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉన్నట్టుగా, వాసనా బలం కారణంగా స్ఫురిస్తూ నర్తిస్తూ తెలియబడుతున్నాయి. మనలో వీటి ప్రతి బింబమే అహంకారంగా గుర్తింపబడుతుంది.


గతవాసనలు ఆధారంగా ఈ మూడు శరీరాలు కూడా ఉన్నట్టుగా భ్రాంతిని కలిగిస్తున్నాయి. ఆత్మని గుర్తించని అజ్ఞానం కారణంగా ఇవి నిజంగా ఉన్నాయనే భ్రమ కలుగుతుంది. భూతాన్ని చూస్తున్నప్పటికీ స్తంభమే ఉంది, శరీరాన్ని చూస్తున్నప్పటికీ ఆత్మే ఉంది శరీరంగా, చైతన్యంలో ఆత్మలో.


ఏ విధంగా అద్దంలో ఉన్న ప్రతిబింబం అద్దానికి సంబంధించి లేదో, అదే విధంగా ఈ మూడు శరీరాలూ అవి చూస్తున్న ప్రపంచమూ ఉన్నట్టున్నా ఆత్మక సంబంధించి లేవు. ఆత్మ చైతన్యం ఉండడం వల్లే అవి ఉన్నాయి, ఉన్నట్టు తెలియబడాయి. అయినా చైతన్యానికి ఏవిధంగానూ సంబంధించి లేవు. ఆరోపింపబడిన ప్రపంచం ఉన్నప్పుడు లేనప్పుడూ కూడా ఉన్నది ఆత్మే.


ఈ ఉపమానాన్ని వాడుతూ ఇచ్ఛా పూర్వకంగానే అష్టావక్రులు "పరమేశ్వర' అనే మాటను కూడా వాడారు. ఉన్నట్టున్న జీవుడూ, జీవుడున్న ప్రపంచమూ ఆ ప్రపంచ సృష్టికర్త అయిన భగవంతుడూ, మూడు మూడు ముఖ్యభాగాలుగా అజ్ఞానంలోనుండి జనించే భ్రమలో అహంకారంచే గుర్తింప బడుతున్నాయి.


 బాహ్యంగా ఇలా గుర్తింపబడుతున్నట్టే అంతర్గతంగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా అహం-కారంలో గుర్తింపబడుతున్నాయి. ఇలా గుర్తింప బడేదంతా అజ్ఞానం వల్ల ఉదయించిన భ్రమ అనీ, నిత్యమూ అన్నిటికీ అధిష్ఠానంగా ఉండేది ఆత్మ చైతన్యం మాత్రమే అని స్పష్టం చేస్తున్నారు. 

🕉🌞🌏🌙🌟🚩

*🧘‍♂️22) అష్టావక్రగీత🧘‍♀️*
🕉🌞🌏🌙🌟🚩
🔥 *ఓంశ్రీమాత్రే నమః* 🔥
*అద్వైతచైతన్యజాగృతి*
🕉🌞🌏🌙🌟🚩

*అధ్యాయం-1*
*ఆత్మ సాక్షిగా - అందరిలో*

*శ్లోకం 20:-*

*ఏకం సర్వగతం వ్యోమ బహిరంతర్యథా ఘటే ।*
*నిత్యం నిరంతరం బ్రహ్మ సర్వభూతగణే తథా ॥ 1-20 ॥*

ఏకం సర్వగతం వ్యోమ బహిరంతర్యథా ఘటే ।
నిత్యం నిరంతరం బ్రహ్మ సర్వభూతగణే తథా ॥ 20 ॥


*एकं सर्वगतं व्योम बहिरन्तर्यथा घटे ।*
*नित्यं निरन्तरं ब्रह्म सर्वभूतगणे तथा ॥ १-२० ॥*


*ekam sarvagatam vyoma bahirantaryathaa ghat’e ।*
*nityam nirantaram brahma sarvabhootagane tathaa ॥ 1-20 ॥*

*టీకా*

యథా = ఏ ప్రకారంగా, సర్వగతం = సర్వవ్యాపకమైనట్టియు, ఏకం = అద్వి తీయమైనట్టియు, వ్యోమ = ఆకాశము, బహిః = వెలుపల, అంతః = లోపల, ఘటే = ఘటమునందు, అస్తి = ఉంటున్నదో, తథైవ = అట్లే, నిత్యం = నిత్యమైనట్టియు, , నిరంతరం = నిరంతరమైనట్టియు, బ్రహ్మ = బ్రహ్మము, సర్వభూతగణే = సమస్తభూత శరీరములయందును, అస్తి = ఉంటున్నది.

*వివరణ:-*

సర్వవ్యాప్తమయిన ఆకాశం ఏవిధంగా కుండకి పైనా లోపలా ఉంటుందో, అదే విధంగా సర్వవ్యాప్తమూ, అచలమూ అయిన బ్రహ్మతత్త్వం చరాచర జగత్తంతటా నిండి ఉంది.

*తాత్పర్యం:-*

కిందటి శ్లోకంలో అద్దమూ ప్రతిబింబమూ ఉపమానంగా చూపిస్తూ మనోజ్ఞంగా ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వము సూచింపబడి, ఆత్మ యొక్క అసంగత్వం కూడా చెప్పబడింది.


 ఈ అధ్యాయానికి చివరిదైన ఈ శ్లోకంలో, అన్నిటి లోనూ అంతర్లీనంగా ఆత్మే ఉంటుందని చెప్పబడింది. ఈ భావాన్ని అందించడానికి మరొక చక్కని ఉదాహరణని ఉపనిషత్తుల నుండి గ్రహించి మనకందిస్తున్నారు మునీంద్రులు. అకాశంలో ఉండే అన్ని కుండలలోనూ కూడా ఆకాశమే ఉంటుంది. .


 అదే విధంగా ఉన్నట్టుగా గుర్తింపబడే సమస్త వస్తువులలోనూ, సర్వనామరూపాలకును బ్రహ్మతత్వమే నిండి ఉంటుంది. (సర్వ-భూత-గణే). ఘటాకాశం (కుండలోని ఆకాశం). ఆ ఘటం యొక్క పరిమాణంచే పరిమితమైనట్లుగా కనిపిస్తుంది.


అదే ఆకాశం ఆ ఘటం కారణంగానే శుభ్రం ఆ గానూ ఆశుభ్రం గానూ కూడా తోచవచ్చు. కాని నిజానికి అకాశానికి పరిమితి ఎక్కడ? అదేవిధంగా అనంతమైన చైతన్యంలో అన్ని ఉపకరణాలూ ఉపాధులూ ఉన్నట్టనిపిస్తాయి, ఆడుకుంటాయి, అంతమయిపోతాయి. అన్నిటిలోనూ చైతన్యమే పరిమితమయి ఉన్నట్టుగా భ్రమ కూడా కలుగజేస్తుంది.


ఈ ఘటాకాశ ఉదాహరణ వేదాంతంలో తరుచుగా వాడబడుతూ ఉంటుంది. ఆత్మ అన్నిటిలోనూ ఉందని ఈ ఉపమానం ద్వారా చెప్పబడుతున్నది.

*మొదట అధ్యయం సమాప్తం*

🕉🌞🌏🌙🌟🚩

*🧘‍♂️23) అష్టావక్రగీత🧘‍♀️*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩

*ఆత్మ - అత్యద్భుతం*
*అధ్యాయం-2*

మానసాతీతమయిన అనుభవాన్ని మాటలలో వర్ణించడానికి మహర్షులందరూ ప్రయత్నించేటప్పుడు, సరైన మాటలు దొరకక, ఎలా చెప్పాలో తెలియక ఆశ్చర్యానందాల మధ్య అస్పష్ట పదజాలంతో అసంపూర్ణంగా ఆ అనుభవాన్ని అభివర్ణిస్తారు.


బ్రహ్మతత్త్వాన్ని ప్రత్యేక పద్ధతిలో కొన్ని మాటలు వాడి లక్ష్యార్థాలతో సూచిస్తూ తెలియజెప్పగల సమర్థతగల ఉపనిషద్ ఋషులు కూడా చాలాచోట్ల ఎలా చెప్పాలో తెలియని ఆశ్చర్యంతో, ఆశ్చర్యార్థకమయిన వాక్యాలనే వాడుతుంటారు!


ఈ అధ్యాయంలో జనకమహారాజు తన అనుభవాన్ని వర్ణించడానికి ప్రయత్నిస్తూ మాటలు కరువై ఆశ్చర్యంలో తేలిపోతూ వర్ణించ డాన్ని అనేక చోట్ల గమనిస్తాము.


అధికారీ అర్హుడూ అయిన జనకరాజర్షికి బ్రహ్మనిష్ఠుడయిన అష్టావక్ర మునీంద్రుడు బ్రహ్మవిద్యనుపదేశించడం కిందటి అధ్యాయంలో చూచినాము. ఉత్తమాధికారి కాబట్టి ఉపదేశింపబడిన వెంటనే లక్ష్యర్థాన్ని గ్రహించి బ్రహ్మానుభవాన్ని పొందగలిగినాడు.


మనబుద్ధితో అర్థం చేసుకోగలిగి, స్పష్టంగా చూడగలిగిన ఏ అనుభవమూ ఆశ్చర్యం అనడానికి వీలులేదు. ఏ అనుభవం బుద్ధికి ఏ విధంగానూ అందకుండా తార్కికంగా నైనా ఏదీ చెప్పలేని స్థితిలో బుద్ధి నిలబడిపోతుందో, అటువంటి అనుభవాన్ని ఆశ్చర్యం అంటాం.


 ఇటువంటి ఆశ్చర్యకరమయిన అనుభవంలో బుద్ధి ఉన్నప్పుడు సందిగ్ధావస్థలో నిశ్శబ్దంగా ఉండిపోతుంది. బ్రహ్మానుభవం మనో బుద్ధుల కతీతమైనది కాబట్టే తరచుగా 'అత్యద్భుతం ఆశ్చర్యకరం' అని వర్ణింపబడుతూ ఉంటుంది. 'ఆశ్చర్యమయమ్-దేవమ్'. ఈ ఆశ్చర్యం అన్నమాట భగవద్గీతలో ఉపనిషత్తులలోనూ కూడా కనబడుతుంది.


ఈ అధ్యాయంలో ఈ బ్రహ్మానుభవానందం మనోహరంగా వర్ణింపబడింది. ఈ వర్ణనను అర్థం చేసుకుని ధ్యానించే సాధకులకు వెంటనే ధ్యాననిష్ఠ  కుదురుతుంది.


 చైతన్యంలోనే, చైతన్యం వల్లనే ఉనికిని కలిగి, తెలియబడే ప్రపంచ వర్ణన వినగానే మననశీలి అయిన మనీషి, ఈ విశాల విశ్వమంతా తనలో తన చైతన్యంలో, అణుమాత్రంగా భాసించడం స్పష్టంగా చూడగలుగుతాడు.


 సాధారణమయిన అహంకారంతో కూడిన బుద్ధి ఇటువంటి అనుభవం తనలో సాధ్యం అని వింటే, ఆశ్చర్యంలో మౌనంగా నిశ్చలంగా నిలచిపోతుంది.


అష్టావక్రమునీంద్రుని వాక్యామృతంతో జనకరాజర్షి అజ్ఞానం పటాపంచలయింది.
తెలుసుకునేవాడు, తెలుసుకోవడం, తెలియబడేది, ఈ త్రిపుటి ఒక్కటే అనీ, ఎన్ని నామరూపాలతో తెలియబడినా, ఏకంగా అద్వయంగా ఉన్నది చైతన్యమయమయిన ఆత్మే అనీ స్పష్టంగా తెలిసింది.


 శరీరం, మనస్సూ, బుద్ధి, అహంకారం, జీవభావం సర్వమూ కరిగి బ్రహ్మభావంలో ఐక్యమయి పోవడాన్ని అనేక ఉపమానాలతో అనుపమానంగా, అపురూపంగా అద్భుతంగా అందించగలిగిన జనకమహారాజు ధన్యుడు!

🕉️🌞🌏🌙⭐🚩
*🧘‍♂️24)అష్టావక్రగీత🧘‍♀️*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩

*అధ్యాయం-2*
*ఆత్మ - అత్యద్భుతం*

*శ్లోకం 01:-*


*జనక ఉవాచ ॥*

*అహో నిరంజనః శాంతో బోధోఽహం ప్రకృతేః పరః ।*
*ఏతావంతమహం కాలం మోహేనైవ విడంబితః ॥ 2-1 ॥*

జనక ఉవాచ ॥

అహో నిర ఞజనశ్శాన్తః బోధోఽహం ప్రకృతేః పరః ।
ఏతావన్తమహం కాలం మోహేనైవ విడమ్బితః ॥ 1 ॥


*जनक उवाच ॥*

*अहो निरञ्जनः शान्तो बोधोऽहं प्रकृतेः परः ।*
*एतावन्तमहं कालं मोहेनैव विडम्बितः ॥ २-१ ॥*


*janaka uvaacha ॥*
*aho niranjanah’ shaanto bodho’ham prakri’teh’ parah’ ।*
*etaavantamaham kaalam mohenaiva vid’ambitah’ ॥ 2-1 ॥*

*టీకా*

అహం= నేను, నిరంజనః = దోషరహితుడను, శాన్తః = శాంత స్వరూపుడను, బోధ: = జ్ఞానరూపుడను, ప్రకృతేః = ప్రకృతికి, పరః = పరుడను (అయితే), అహో ఆశ్చర్య మేమనగా, ఏతావన్తం = ఇంత, కాలం=కాలపర్యంతము, మోహేనైవ = అజ్ఞానము చేతనే, విడమ్బితః =మోసపోతిని. 

*వివరణ:-*

ఆహా నిష్కళంకమూ, నిత్యశుద్ధమూ అయిన ఆత్మని, చైతన్య ! స్వరూపాన్ని నేనే! సర్వప్రకృతికి అతీతంగా నేను ఉన్నాను. ఇంతకాలమూ అజ్ఞానంతో భ్రమతో ఉన్మాదునివలె జీవించాను.

*తాత్పర్యం:-*

ఇంతకాలమూ ఈ మనశ్శరీరాలే నేననుకుని వాటి అనుభవాలే నావనుకుని బాధామయ, పరిమిత జీవితాన్ని గడిపిన నా అజ్ఞానానికి సిగ్గుపడుతున్నాను" తన అజ్ఞానానికి చింతిస్తూ ఆత్మానుభవం పొందిన సాధకుడు అనుకుంటున్న మాటలివి. వాటి బాధలూ తనవి కావని తెలిసికొని తనదైన శాంత స్థితిని ప్రకృతేః పరః-ప్రకృతికి అతీతంగా తానున్నానని గ్రహించగలిగాడు.


 మనశ్శరీరాలూ వాటి బాధలు తనవికావని తెలిసికొని తనదైన శాంతస్థితిని గుర్తించగలిగాడు. శుద్ధ 
చైతన్యం తానేననీ, తనవల్లె సర్వమూ తెలియబడుతున్నదనీ వాసనలు మనశ్శరీరా లూ కూడా తనలోనే తెలియబడుతున్నాయనీ, తాను నిరంజనంగా సర్వాత్మగా సర్వసాక్షిగా ఉన్నాననీ తెలుసుకున్నాడు.


అనంతకాలం నుండి అనేక జన్మలనెత్తుతూ ఆ శరీరాలతో తాదాత్మ్యం చెందుతూ కష్టసుఖాలను అనుభవిస్తూ వాసనలను పోగుచేసుకుంటూ, జన్మలను పెంచుకుంటూ, సంసారచక్రంలో కేవలం తన భ్రమ కారణంగా చిక్కుకొని బాధపడు తున్నాడు, బంధింపబడి ఉన్నాడు.


సాంఖ్యదర్శనంలో, నామరూపాత్మకమయిన ఈ సర్వజగత్తుకు కారణంగా ప్రకృతి చూపబడింది. జడమయిన ఈ ప్రకృతిని పురుషుడు చైతన్యవంతం చేస్తాడని చెప్పబడింది.


 ఆత్మనిష్ఠుడయిన అష్టావక్రుడు బుద్ధిని సంతృప్తిపరచే ఈ సిద్ధాంతాల జోలికిపోకుండా తనదైన అనుభవాన్ని యథాతథంగా అందించడంలో ఆత్మ చైతన్యమే సర్వాన్నీ చైతన్యవంతం చేస్తున్నదని స్పష్టంగా చెప్పారు. ఆత్మే చైతన్యంగా ప్రకృతీ పురుషులనిద్దరినీ తెలుసుకుంటున్నది అని నిశ్చయంగా చెప్పుచున్నారు.

🕉️🌞🌏🌙⭐🚩


[04/04, 14:22] +91 92915 82862: *🧘‍♂️25) అష్టావక్రగీత🧘‍♀️*
🕉🌞🌏🌙🌟🚩
🔥 *ఓంశ్రీమాత్రే నమః* 🔥
*అద్వైతచైతన్యజాగృతి*
🕉🌞🌏🌙🌟🚩

*అధ్యాయం-2*
*ఆత్మ - అత్యద్భుతం*

*శ్లోకం 02:-*


*యథా ప్రకాశయామ్యేకో దేహమేనం తథా జగత్ ।*
*అతో మమ జగత్సర్వమథవా న చ కించన ॥ 2-2 ॥*

యథా ప్రకాశయామ్యేకః దేహమేనం తథా జగత్ ।
అతో మమ జగత్సర్వం అథవా న చ కింవన ॥ 2 ॥


*यथा प्रकाशयाम्येको देहमेनं तथा जगत् ।*
*अतो मम जगत्सर्वमथवा न च किञ्चन ॥ २-२ ॥*


*yathaa prakaashayaamyeko dehamenam tathaa jagat ।*
*ato mama jagatsarvamathavaa na cha kinchana ॥ 2-2 ॥*

*టీకా*

యథా = ఏప్రకారము, ఏనం = ఈ, దేహం = దేహమును, ఏకః = అద్వితీయు డనై, ప్రకాశయామి = ప్రకాశింపజేయుచున్నానో, తథా = ఆ ప్రకారముగానే, జగత్ = ప్రపంచ మునుగూడా, ప్రకాశయామి = ప్రకాశింపజేయుచున్నాను, అతః = ఈ కారణము వలన, సర్వం = సంపూర్ణమైన, జగత్ = ప్రపంచము, మమ = నా సంబంధమైనదిగా నున్నది, అథవా = లేక, మమ = నాకు, కిఞచన = కొంచెము గూడ, న = లేదు. 

*వివరణ:-*

నేనే ఈ శరీరాన్ని చైతన్యవంతం చేస్తూ జగత్తును చూపిస్తున్నాను. కాబట్టి ఈ ప్రపంచమంతా నాదే, కాని నిజానికి నాలో ఏదీ లేదు.

*తాత్పర్యం:-*

ఆత్మానుభవస్థితుడయిన రాజర్షి తన ప్రస్తుత అనుభవాన్ని వ్యక్తం చేస్తున్నారు. 'నేనే ఈ శరీరాన్ని చైతన్యవంతం చేస్తూ ప్రపంచాన్ని చూపిస్తున్నాను --- జడపదార్థానికి స్వయం ప్రకాశకత్వం లేదు. నా శరీరము మనస్సు బుద్ధీ కూడా జడమయిన పదార్థంతో నిర్మింపబడినవే. ఇవి ప్రకాశింపబడడానికి కారణం వేరుగా ఉండాలి. 


నాలో చైతన్యమే లేకపోతే ఈ విషయి---విషయ సంబంధంగా భాసించే ఈ సర్వప్రపంచమూ ఎలా తెలియబడుతుంది? చైతన్యం వల్లనే ఇంద్రియాలు పని చెయ్యడం, మనస్సులో కలిగే సంచలనాలు, బుద్ధిలోని ఆలోచనలూ కూడా తెలియబడుతున్నాయి. ప్రపంచంలో ఈ చైతన్యమే లేకపోతే జ్ఞానం ఉండే ఆస్కారమే ఉండేది కాదు. ఏదైనా ఉందని తెలియబడడానికి చైతన్యమే కారణం.


తనకు కొత్తగా వచ్చిన అనుభవజ్ఞానంతో జనకుడు, తనలోని భావనా లోకాలు, బాహ్యంగా గుర్తింపబడుతున్న నామరూపాత్మక వస్తుమయ ప్రపంచమూ కూడా తన వల్లనే, చైతన్యం వల్లనే తెలియబడుతున్నాయి అని స్పష్టం చేస్తున్నారు.


 పరస్పరాధారంగా, విషయి-విషయ సంబంధంగా గుర్తింపబడే విశాల విశ్వమంతా ఆత్మ చైతన్యం వల్లనే తెలియబడుతున్నది, ప్రకాశింపబడుతున్నది అని నిశ్చయంగా నిస్సందేహంగా చెప్తున్నారు రాజర్షి.


వెనువెంటనే పవిత్రమూ పూర్ణమూ ఏకమూ అయిన తన స్వస్థితిని గమనిస్తూ ఆ దృష్ట్యా, నేనే ఉన్నాను--నాలో ఏదీ లేదు" అనే సత్యాన్ని నొక్కి చెప్తున్నారు. 


ఆత్మ చిత్ స్వరూపంగా సర్వాన్ని ప్రకాశింపజేస్తుంది, అంటే తెలియబడేటట్టు చేస్తుంది, సత్ రూపంలో సర్వానికీ అధిష్ఠానమయి తానే ఉంటుంది.

🕉🌞🌏🌙🌟🚩
[05/04, 14:22] +91 92915 82862: *🧘‍♂️26) అష్టావక్ర గీత🧘‍♀️*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩

*అధ్యాయం - 2*
*ఆత్మ  - అత్యద్భుతం*

*శ్లోకం 03:-*

*స శరీరమహో విశ్వం పరిత్యజ్య మయాధునా ।*
*కుతశ్చిత్ కౌశలాద్ ఏవ పరమాత్మా విలోక్యతే ॥ 2-3 ॥*

స శరీరమహో! విశ్వం పరిత్యజ్య మయాంధునా ।
కుతశ్చిత్కౌశలాదేవ పరమాత్మా విలోక్యతే ॥ 3 ॥


*स शरीरमहो विश्वं परित्यज्य मयाधुना ।*
*कुतश्चित् कौशलाद् एव परमात्मा विलोक्यते ॥ २-३ ॥*


*sa shareeramaho vishvam parityajya mayaadhunaa ।*
*kutashchit kaushalaad eva paramaatmaa vilokyate ॥ 2-3 ॥*

*టీకా*

 స శరీరం = శరీర సహితమైన, విశ్వం = ప్రపంచమును, పరిత్యజ్య = విడిచి పెట్టి (తననుండి వేరుచేసి), కుతశ్చిత్ = ఎక్కడనో, కౌశలాదేవ = చమత్కారమువలననే (ఉపదేశ మువలననే), మయా = నాచేత, అధునా = ఇప్పుడు, పరమాత్మా = పరమాత్మ, విలోక్యతే = చూడబడుచున్నాడు (అనునది), అహో = ఆశ్చర్యము.

*వివరణ:-*

అహో! నా శరీరాన్ని, శరీరం చూచే ప్రపంచాన్నీ కూడా విస్మరించి, నా గురుకృపచే, పరమాత్మను తెలుసుకుంటున్నాను.

*తాత్పర్యం:-*

క్రిందటి రెండు శ్లోకాలలోనూ ఆశ్చర్యం సందిగ్ధంగా వ్యక్తమయింది. ఇక్కడ నుండి స్పష్టంగా తన ఆశ్చర్యాన్ని వ్యక్తంచేస్తూ, "అహో' అని వాడుతూ తన అనుభవాన్ని వర్ణించడాన్ని గమనిస్తాము.


అహంకారంతో, నేననే భావంతో అన్నిటినీ గుర్తిస్తుంటాము, మనశ్శరీరాలూ అవిచూచే, అనుభవించే విషయాలూ కలిపితే ప్రపంచమనబడుతుంది. ఈ ఉపకరణాల వతంగా నిలచి చూచినప్పుడు వాటి అనుభవాలూ కూడా
లేకుండాపోతాయి.


'శరీరాన్ని, శరీరం చూచే ప్రపంచాన్ని విస్మరించిన సాధకుడు శూన్యంలో ఉండి పోతాడు'. చూడబడే సర్వానికి అధిష్ఠానంగా ఉన్న ఆత్మానుభవంలో ఆనంద స్వరూపంగా నిలచిపోతాడు. అందుకే జనకుడు ఇలా అంటున్నారు. పరమాత్మను ఇప్పుడు తెలుసుకుంటున్నాను.


ఇక్కడ'విలోక్యతే' (తెలుసుకుంటున్నాను), చూస్తున్నాను అనే మాటని అపార్థం చేసుకోకూడదు. ఈ మాట వాడబడినప్పటికీ ఇక్కడ చూచేవాడు--- చూడ బడేది అని రెండు వేరుగా లేవు. అద్వయమయిన ఆత్మలో ద్వంద్వాలకు తావులేదు. అయినప్పటికీ 'దర్శనం' చూడడం అనేమాట వాడడంతో, నిశ్చయంగా చూచాను.


కాబట్టి సందేహం లేదు అని సాధకుడికి గట్టిగా చెప్పడమే కనిపిస్తుంది. స్వయంగా చూచిందే సత్యం అనీ, అక్కడింకేమీ సందేహాలుండవనీ అనుకునే సాధకుని బుద్ధికి అందేటట్టుగా చెప్పడానికే ఈ పదప్రయోగం వాడబడింది.


అయితే సాధకునికి ఈ 'దర్శనం' ఎలా సాధ్యం అయింది? గురుకృప వల్లనా? శ్రవణ మననాల ప్రభావమా? భక్తికి ఫలితమా? శ్రమించి సాధించినదా? ఎలా? ఏవిధంగా ఈ ద్వంద్వాతీత అనుభవం సాధ్యమయింది?


వేదాంతుల దృష్టిలో ఆత్మ ఏ కారణానికి చెందిన 'కార్యం' కాదు, ఏ ప్రత్యేక ప్రయత్నం వల్ల సాధింపబడిన ఫలితమూ కాదు, సాధనవల్ల సాధ్యమయేది కూడా కాదు, ఆత్మ ఉంది, ఉంటుంది, ఇది నిత్యం, సాధింపబడినదేదయినా మార్పుచెంది నశిస్తుంది. నాశరహితమయిన ఆత్మ నిత్యమూ ఉంది, ఉంటుంది. ఇది పరిణామ రహితం.


అయితే ఆధ్యాత్మిక సాధనలన్నీ అర్థరహితమూ నిరుపయోగమూనా? మతం కేవలం నమ్మకమేనా? పలురకాలా యోగసాధనలన్నీ వంచనమాత్రమేనా? కాదు. కానేకాదు. ఇవన్నీ అవసరమే.


 మనం అశాంతితో నిండిన మనస్సునూ, అలజడులతో నిండిన బుద్ధిని శాంతంగా సంతోషంగా ఉండేలా చెయ్యాలంటే వాటి బాధలకు కారణమయిన భ్రమను తొలగించాలి. ఆలోచనా ప్రవాహం ఉధృతి తగ్గి, శాంతినంది క్రమంగా ఆగినప్పుడు మనోబుద్ధులను అధిగమించగలుగుతాం. అప్పుడు మాత్రమే అహంకారం లేకుండా పోతుంది. భ్రమాజనిత అహంకారం నశించగానే సత్యదర్శనం అవుతుంది, అజ్ఞానం నశిస్తే జ్ఞానం కనిపిస్తుంది. చీకటిపోతుంది. వెలుగు అక్కడే ఉంది, ఉంటుంది. సర్పభ్రాంతి నశిస్తే ఎప్పుడూ అక్కడ అలాగే తాడు ఉండడాన్ని గుర్తిస్తాము.


 ఏదో తెలియని అదృశ్యశక్తి వల్ల, ఈ మహత్తరానుభవాన్ని పొందగలిగేనని ఎంతో నిజాయితీతో చెప్తున్నారు రాజర్షి. శ్రవణ మననాల ఫలితమో, ఉపనిషద్ ఋషుల ఆశిః ప్రభావమో, గురు పరంపర కృపా వీక్షణమో, ఏదో తెలియకపోయినా, మొత్తంమీద ఈ అనుభవం వచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు చెప్తున్నారు. 'కుతశ్చిత్ కౌశలాత్ - ఏదో తెలియని సుకృతం కారణంగా- ఆత్మానుభవం లభ్యం అయింది.


నిజాయితీ, చిత్తశుద్ధి కలిగిన ఏ శిష్యుడయినా తన గురువెవరో, ఏ ప్రత్యేక పద్ధతివల్ల, జ్ఞానంవల్ల ఆత్మానుభవం లభ్యమయిందో చెప్పలేడు. ఈ చరాచర జగత్తూ, ప్రతీసంఘటనా కూడా అహంకారాన్ని అనునిత్యమూ తీర్చిదిద్దుతూ ఆత్మానుభవానికి అర్హమయే మార్గం వెంట నడిపిస్తూనే ఉంటాయి.


అటువంటప్పుడు తెలివున్న ఎవరైనా ఏ ఒక్కరినయినా ఏ విధంగా తన గురువని నిర్దేశించి చెప్పగలరు? ఏ ప్రత్యేక పద్ధతిని అవలంబించేనని చెప్పగలరు? ఆశ్చర్యానందాల మధ్య వారు చెప్పగలిగిందల్లా ఒక్కటే----ఆ అనుభవంలో తానున్నాననీ తనకే తెలియని ఏ గురుకృపో అందుకు కారణమనీ మాత్రమే.

🕉️🌞🌏🌙⭐🚩

[06/04, 11:43] +91 92915 82862: *🧘‍♂️27) అష్టావక్ర గీత🧘‍♀️*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩

*అధ్యాయం - 2*
*ఆత్మ  - అత్యద్భుతం*

*శ్లోకం 04:-*

*యథా న తోయతో భిన్నాస్తరంగాః ఫేనబుద్బుదాః ।*
*ఆత్మనో న తథా భిన్నం విశ్వమాత్మవినిర్గతం ॥ 2-4 ॥*

యథా న తోయతోఽభిన్నాః తరంగా ఫేనబుద్బుదాః ।
ఆత్మనో న తథా భిన్నం విశ్వమాత్మ వినిర్గతమ్ ॥ 4 ॥


*यथा न तोयतो भिन्नास्तरङ्गाः फेनबुद्बुदाः ।*
*आत्मनो न तथा भिन्नं विश्वमात्मविनिर्गतम् ॥ २-४ ॥*


*yathaa na toyato bhinnaastarangaah’ phenabudbudaah’ ।*
*aatmano na tathaa bhinnam vishvamaatmavinirgatam ॥ 2-4 ॥*

*టీకా*

యథా= ఎట్లు, తోయతః = జలముకంటే, తరంగాః = అలలు, ఫేన బుద్బుధాః = నుఱుగున్ను, బుడగలున్ను, అభిన్నాః = భిన్న మైనవి (వేరైనవి)కావో, తథా =అట్లే, ఆత్మ వినిర్గతం = ఆత్మనుండి పుట్టిన (ఆత్మ విశిష్టమైన), విశ్వం = ప్రపంచము, ఆత్మనః ఆత్మకంటే, భిన్నం = వేరైనది, న = కాదు. 

*వివరణ:-*

తరంగాలు, నురుగు, బిందువులు, నీటి నుండి ఎలా వేరుకావో, అదే విధంగా ఆత్మలో కనిపించే ఈ ప్రపంచమంతా ఆత్మ నుండి భిన్నం కాదు.


*తాత్పర్యం:-*

అద్భుతమూ మహత్తరమూ అయిన ఆత్మానుభవంలో, పదార్థమూ శక్తి కలిసి నిర్మింపబడినట్లున్న యీ చరాచర జగత్తంతా ఎక్కడ ఉంటుంది? ఎలా ఉంటుంది? ఏమౌతుంది? ఇవన్నీ చైతన్యంలో లయం అయిపోయి ఏకంగా చైతన్యమే ఉంటుందని జనకులు అన్నారు.


 అయితే ఇది తార్కికంగా బుద్ధికి అందుతుందా? బుద్ధికి అందని దానిని ఆమోదించి అందుకు ప్రయత్నం చెయ్యలేము కదా! జనకుని నిజాయితీని శంకించవలసిన అవసరం లేదు.
అయినా మనం అర్థం చేసుకోవడం ఎలా ? బుద్ధి కతీతమయిన ఈ అనుభవాన్ని బుద్ధితో గ్రహించ డానికి వీలుగా జనకులే స్వయంగా ఒక ఉదారహణ ఇచ్ఛారు.


 సృష్టింపబడిన ఏ వస్తువయినా తన ఉపాదాన కారణయిన మూలకారణం కంటే భిన్నంగా ఉండజాలదు. మూలపదార్థం నుండే వస్తువులు తయారవుతాయి. తరంగాలు,నురుగు, బిందువులు మొదలైనవి సముద్రం నుండే పుడుతున్నాయి. ఇవి సముద్రం కంటే, నీటి కంటే, వేరు కావు.


 ఏ కార్యమయినా కారణానికి రూపాంతరం మాత్రమే, ఆత్మ చైతన్యం నుండి ఉద్భవించిన జగత్తంతా ఆత్మ నుండి భిన్నంగా ఉండదు. ఆత్మానుభవంలో ఈ ఏకత్వం స్పష్టంగా తెలియబడుతుంది.


 అపారజలరాశి అయిన సముద్రంలో, తరంగాలు, నురుగు, తుంపరలు పై పైన ఎన్ని పుట్టి, గిట్టినా, సముద్రం మార్పు అసలు పుట్టినట్లుగా కన్పించే తరంగాలు మొదలయినవన్నీ నీరే! నామం, రూపం, మాత్రమే వేరు! ఇదే విధంగా ఈ కనిపించే విశాల విశ్వమంతా ఆత్మ చైతన్యమే దీని నుండి ఏ విధంగానూ ఎప్పుడూ భిన్నం కాదు.

🕉🌞🌏🌙🌟🚩
[07/04, 10:42] +91 92915 82862: *🧘‍♂️28) అష్టావక్ర గీత🧘‍♀️*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩

*అధ్యాయం - 2*
*ఆత్మ  - అత్యద్భుతం*

*శ్లోకం 05:-*

*తంతుమాత్రో భవేద్ ఏవ పటో యద్వద్ విచారితః ।*
*ఆత్మతన్మాత్రమేవేదం తద్వద్ విశ్వం విచారితం ॥ 2-5 ॥*

తంతుమాత్రో భవేదదేవ పటో యద్వద్విచారతః ।
ఆత్మతన్మాత్రమేవేదం తద్వద్విశ్వం విచారితమ్ ॥ 5 ॥

*तन्तुमात्रो भवेद् एव पटो यद्वद् विचारितः ।*
*आत्मतन्मात्रमेवेदं तद्वद् विश्वं विचारितम् ॥ २-५ ॥*


*tantumaatro bhaved eva pat’o yadvad vichaaritah’ ।*
*aatmatanmaatramevedam tadvad vishvam vichaaritam ॥ 2-5 ॥*

 *టీకా*

యద్వత్ = ఏ ప్రకారము, విచారతః = విచారణవలన, పటః = వస్త్రము, తంతుమాత్ర: ఏవ = నూలు మాత్రమే, భవేత్ = అగుచున్నదో, తద్వత్ = అదేవిధముగ, విచారితం =(నిశితంగా) విచారింపబడిన, ఇదం = ఈ, విశ్వం = ప్రపంచము, ఆత్మ తన్మాత్రమేవ = ఆత్మ సత్తా మాత్రమే, (అని తెలియుచున్నది).  

*వివరణ:-*

ఒక వస్త్రాన్ని నిశితంగా పరిశీలిస్తే అది కేవలం దారపు సముదాయం మాత్రమే అని చెప్పవచ్చును. అదే విధంగా నిశితంగా పరిశీలిస్తే ఈ కనబడే ప్రపంచమంతా ఆత్మచైతన్యమే అని ధృవపడుతుంది.


*తాత్పర్యం:-*

శాస్త్రాధ్యయనం చేస్తూ, అర్థం చేసుకోవడానికి సాధన చేస్తూ ఉంటే మొదటి దశలో సత్యాన్వేషికి, మహర్షుల మహత్తరమయిన మహావాక్యాలర్థమవడం అతికష్టం.


ఇది సహజమే. బుద్ధి కతీతమయిన సత్యాన్ని దర్శించి చెప్తున్నవారు ఆచార్యులు, కాని దేహతాదాత్మ్యంతో మనోబుద్ధుల సహాయంతో సత్యాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాడు.


 శిష్యుడు, కాబట్టి బుద్ధి లక్షణాలయిన తర్కం మీమాంస, న్యాయం, తప్పకుండా ఆశ్చర్యంతో ఆశక్తతతోఆగిపోతాయి;మహాత్ముల అనుభవాలు అద్భుతంగా నమ్మంశక్యం కానివిగా అనిపించడం అప్పటికి సహజమే.


అయినప్పటికీ శాస్త్రం ఎంతో శ్రద్ధతో, శిష్యుని తార్కికబుద్ధికి సంభవం అనిపించే విధంగా, సత్యాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంది.


 బుద్ధికతీతమయిన సత్యాన్ని బుద్ధికి అందించడం కోసం, ఏ దేశానికి ఏ మతానికి చెందిన మహాత్ములయినా, అనేకానేక ఉదాహరణలనూ, అద్భుత ప్రక్రియలనూ, అర్థస్పోరకమయిన ఉపమానాలనూ వాడుతూనే ఉన్నారు.


ఉపనిషత్తులలో తరుచుగా కనబడే ఒక ఉదాహరణని అష్టావక్రులు ఇక్కడ ఉపయోగిస్తున్నారు.


మన నిత్యజీవితంలో వస్త్రాలను వాటి ఉపయోగం దృష్ట్యా వస్త్రంగా గుర్తిస్తుంటాము. కాని కొంచెం ఆలోచించి చూస్తే దారాలు దగ్గరగా అల్లబడి ఉన్న దానిని వస్త్రం అంటున్నామని అర్థం అవుతుంది.


అది దారమేకదా అని బట్టల షాపుకి వెళ్ళి ఒక కిలో దారం ఇవ్వమని అడిగితే, అర్థం చేసుకుని ఆ బరువుకి తూగే బట్టని మనకెవ్వరూ ఇవ్వరు! "ఇక్కడ బట్టలే అమ్ముతాం కానీ దారం ఉండదు" అని వెంటనే ఆ షాపు యజమాని అననూవచ్చు.


 వస్త్రం దృష్టితో దారాన్ని చూస్తున్నప్పుడు సహజంగా దారం ఉనికి గుర్తింపబడదు. వస్త్రాన్ని చూస్తూ కూడా అది దారమే అని లోపల గుర్తుంచుకోవడానికి వివేక విచక్షణలతో కూడిన బుద్ధి అవసరం.


నిత్యజీవితంలో అనుక్షణమూ సంఘటనలను గుర్తిస్తూ, అవి కలిగించే కష్టసుఖాలు సంతోష విచారాలతో కొట్టుకుపోతూ మరల సంఘటనలను గుర్తిస్తూ తీరుబడి, విశ్రాంతి, విచక్షణా లేకపోవడంతో మనం చూ సేదేమిటి? అని ఆలోచించం, చూస్తున్నామనుకుంటున్న నానాత్వ ప్రపంచాన్ని సత్యంగా నిశ్చయించుకుంటాం.


 అసత్యమేమో అన్న అనుమానం రావడానికయినా అవకాశమూ తీరుబడి ఉండవు! ఇక్కడ ఆగి విచక్షణతో వివేకంతో చూస్తే ప్రపంచం చైతన్యం నుండి భిన్నంకాదని తెలిసిపోతుంది, అని ఆచార్యులు అంటున్నారు. చైతన్యం వ్యక్త మవుతుంది.


 ఆలోచనగా---సూర్యుడు కాంతిగా వ్యక్తమయినట్టే. ఈ ఆలోచనలు వరుసగా, క్రమబద్ధంగా, ప్రవాహంగా గుర్తింపబడడమే మనస్సు అనబడుతున్నది.


ఈ గుర్తింపబడిన మనస్సు ఎంతో ప్రతిభావంతంగా, బలీయంగా భావింపబడు తున్నది. ఈ మనస్సులోని ఆలోచనలు చైతన్యప్రకాశంతో అనేక నామరూపాలు సంతరించుకుని మనోబుద్ధులతో గుర్తింపబడుతున్నాయి. ఈ విధంగా చూస్తున్నా ననుకునే మనోబుద్ధులూ, చూడ బడ్డాయనుకున్న నామరూపాలూకూడా చైతన్యమే,

 
ఈ విధంగా జగద్భాృంతిని కలిగిస్తూ మాయామోహితులను చేసే ఆలోచనా ప్రవాహం, గంభీరమూ స్థిరమూ అయిన ధ్యానంలో అదృశ్యమయిపోతుంది. ఆలోచనలంతం కావడంతో మనస్సు నశిస్తుంది. మనస్సు లేనప్పుడు మహా అద్భుతమయిన ఈ సృష్టి ఎక్కడ? ఎలా ఉండగలదు? ! ?


వైజ్ఞానిక దృక్పథంతో ఈ ప్రపంచపు 
సత్యత్వాన్ని, అస్తిత్వాన్ని తరచి చూస్తే ఈ విశాల విశ్వమంతా చైతన్యమేననీ కనిపించే నానాత్వం భ్రాంతి అనీ స్పష్టంగా తెలుస్తుంది.

🧘‍♂️29) అష్టావక్ర గీత🧘‍♀️
🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అధ్యాయం - 2
ఆత్మ  - అత్యద్భుతం

శ్లోకం 06:-

యథైవేక్షురసే క్లృప్తా తేన వ్యాప్తైవ శర్కరా ।
తథా విశ్వం మయి క్లృప్తం మయా వ్యాప్తం నిరంతరం ॥ 2-6 ॥

యథైవేక్షురసే క్లుప్తా తేన వ్యాప్తైవ శర్కరా ।
తథా విశ్వం మయి క్లృప్తం మయా వ్యాప్తం నిరంతరం ॥ 2-6 ॥

यथैवेक्षुरसे क्लृप्ता तेन व्याप्तैव शर्करा ।
तथा विश्वं मयि क्लृप्तं मया व्याप्तं निरन्तरम् ॥ २-६ ॥

yathaivekshurase klri’ptaa tena vyaaptaiva sharkaraa ।
tathaa vishvam mayi klri’ptam mayaa vyaaptam nirantaram ॥ 2-6 ॥

టీకా

యథైవ = ఏ ప్రకారమయితే, ఇక్షురసే = చెఱకురసమునందు, క్లుప్తా = ఇమిడి యున్న, శర్కరా = పంచదార, తేనైవ = ఆ యక్షురసము చేతనే, వ్యాప్తా = వ్యాప్తమగు చున్నదో, తథైవ = అట్లే, మయి = నాయందు, క్లుప్తం = ఇమిడియున్న (కల్పితమైన), విశ్వం = ప్రపంచము, మయా = నాచేతనే, వ్యాప్తం = వ్యాప్త మైయున్నది. 

వివరణ:-

చెఱుకురసంతో తయారయిన పంచదార నిండా ఎలా చెఱుకురసం నిండి ఉంటుందో అదే విధంగా నాలో ఉండే ఈ ప్రపంచమంతా నాచే పూర్తిగా ఆవరింపబడి ఉంది.

తాత్పర్యం:-

శిష్యునికి పరిచయమయిన పరిమిత వస్తు ప్రపంచం నుండే ఉపమానాలను గ్రహించి ఉదాహరణగా వాడతారు ఆచార్యులు ఈ పరిమితమైనది అపరిమితమైన సత్యాన్ని పూర్తిగా బోధింపజాలదు, కాని ఏదో ఒక లక్షణాన్ని తెలియ బరచడానికి ఉపయోగిస్తుందని అటువంటి ఉపమానాలను వాడవలసి వస్తూ ఉంటుంది.

కొన్ని సమయాలలో ఇవి విపరీతార్థాన్ని కూడా ఇవ్వవచ్చును. అందుకనే శిష్యుడు ఎలా గ్రహించింది కూడా ఆచార్యులు గమనిస్తూనే ఉంటారు.

వస్త్రపు ఉదాహరణలో వస్త్రం అంతా దారాల సముదాయమే. దారం లేకుండా వస్త్రానికి ఉని కేలేదు. అయినప్పటికీ దారాల పడుగు పేకల అల్లికల మధ్య ఎంతచిన్నవయినప్పటికీ ఖాళీలు ఉండే ఉంటాయి కదా. ఈ ఉదాహరణ ఒక విధంగా అపార్థం కాబడే అవకాశం ఉంది.

 వస్త్రంలోవలెనే, సృష్టిలో కనబడే వస్తువులూ ప్రాణులూ చైతన్యమే అయినప్పటికీ వాటి మధ్య ఖాళీలు ఉంటాయి కదా, అక్కడ చైతన్యం ఉండదన్నమాట! ఇలా అర్థం అయితే చైతన్యం సర్వవ్యాప్తం అన్నమాట అర్థరహితం అయే ప్రమాదం ఉంది. ఇది ఊహించే ఆచార్యులు ఇంకొక ఉపమానాన్ని ఇక్కడ వాడుతున్నారు. ఈ ఉమానంతో ఇదివరకు చెప్పినదే ఇంకా స్పష్టంగా అర్థం అయే అవకాశం ఉంది.

చెఱుకురసంతో తయారయిన పంచదారలో అణువణువునా చెఱుకు రసం ఉంటుంది. పంచదార రేణువు రుచికీ చెఱుకురసం రుచికీ ఏ రకమయిన భేదమూ లేదు. ఇదే విధంగా "నాలో ఉండే ప్రపంచానికి నాకూ ఏ భేదమూ లేదు"

 వివిధ ప్రత్యేకరూప సమన్వితంగా కనిపించే ఈ విశాల విశ్వమంతా చైతన్యమేననీ, రెండవదేదీ లేదనీ, పై మూడు శ్లోకాలలో వాడిన ఉపమానాలతో శిష్యుడికి అర్థం అవుతుంది. నిజానికి ఉన్నదంతా ఆత్మ చైతన్యమే, రెండవదేదీ లేనేలేదు.

అయితే ఈ ప్రాపంచిక అనుభవాలెలా సాధ్యం అవుతున్నాయి? ప్రపంచం ఏ విధంగా కనిపించడం సంభవం అవుతున్నది? దీని సృష్టికర్త ఎవరు? ప్రాథమిక దశలో శ్రవణ మననాలు చేసే సాధకునికి ఇటువంటి సందేహాలు తప్పకుండా వస్తాయి. తరువాత శ్లోకంలో జవాబు ఇవ్వబడుతుంది.

🕉🌞🌏🌙🌟🚩
*🧘‍♂️30) అష్టావక్ర గీత🧘‍♀️*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩

*అధ్యాయం - 2*
*ఆత్మ  - అత్యద్భుతం*

*శ్లోకం 07:-*


*ఆత్మజ్ఞానాజ్జగద్ భాతి ఆత్మజ్ఞానాన్న భాసతే ।*
*రజ్జ్వజ్ఞానాదహిర్భాతి తజ్జ్ఞానాద్ భాసతే న హి ॥ 2-7 ॥*

ఆత్మజ్ఞానాజ్జగద్భాతి ఆత్మజ్ఞానాన్న భాసతే ।
రజ్జ్వజ్ఞానాదహిర్భాతి తద్ జ్ఞాద్భాసతేన హి ॥ 2-7 ॥


*आत्मज्ञानाज्जगद् भाति आत्मज्ञानान्न भासते ।*
*रज्ज्वज्ञानादहिर्भाति तज्ज्ञानाद् भासते न हि ॥ २-७ ॥*


*aatmajnyaanaajjagad bhaati aatmajnyaanaanna bhaasate ।*
*rajjvajnyaanaadahirbhaati tajjnyaanaad bhaasate na hi ॥ 2-7 ॥*

*టీకా*

ఆత్మాజ్ఞానాత్ = ఆత్మను తెలుసుకొనకపోవుటవలన, జగత్ = సంసారము, భతి = తోచుచున్నది, ఆత్మజ్ఞానాత్ = ఆత్మను తెలిసికొనుటవలన, న భాతి = తోచుట లేదు, రజ్జ్వజ్ఞానాత్ = త్రాడు అని తెలిసికొనకపోవుటవలన, అహిః = సర్పము, భాతి = తోచుచున్నది, చ = మరియు, తత్ప్రనాత్ = ఆ రజ్జు జ్ఞానమువలన, న భాసతే హి సర్పము తోచుటలేదుగదా!

*వివరణ:-*

ఆత్మగురించిన అజ్ఞానంతో జగత్తు ఉన్నట్లుగా తోస్తోంది, ఆత్మజ్ఞానం వస్తే ప్రపంచం అదృశ్యం అయిపోతున్నది. తాడును తాడుగా తెలుసుకోక పోవడం చేతనే పాము అనే భ్రమకలగడం సంభవం అవుతున్నది. తాడు అని తెలియగానే పాము భ్రమ నశిస్తుంది.

*తాత్పర్యం:-*

అనంతనామ రూపాలతో అత్యాశ్చర్యకరమయిన ఈ సృష్టి అంతా ఏ విధంగా ఉందో తెలియజెప్పడానికి, వేదాంతంలో తరుచుగా వాడబడే రజ్జు సర్పభ్రాంతి ఉపమానాన్ని తీసుకువచ్ఛారు. అధిష్ఠానంగా ఉన్నది. తాడు అని తెలియనిస్తున్నది. అజ్ఞానం నుండి, ఉన్నది. పామే అనే భ్రాంతి జనిస్తుంది.


 బుద్ధి ఆవరణలో ఉండిపోవడమూ, మనస్సు విక్షేపం చెంది దృశ్యాలను చూస్తూ కష్టసుఖాల ననుభవించడమూ జరుగుతున్నది. ఆ అనుభవాలకు చలిస్తూ ఊహాలోకాలు నిర్మిస్తూ ఈ భ్రాంతిని కొనసాగేటట్టు చేసేది మనస్సే. అనుభవాలకు చలించడంతో రాగద్వేషాలు బయలుదేరుతున్నాయి.


వీటి ఆధారంగా మళ్ళీ అనుభవాలు వస్తూ, వాటికి చలిస్తూ ఈ భ్రాంతి అనంతంగా సాగిపోతూనే ఉంది. అధిష్ఠానం తెలియగానే అజ్ఞానమూ తత్ఫలితమయిన భ్రమ కూడా మాయం అయిపోతాయి, ఉన్నది తాడే అని నిశ్చయంగా తెలియగానే సర్పమూ దానివల్ల కలిగిన భయమూ బాధామయం అయినట్టే!


ఉన్నది ఆత్మ చైతన్యమే అని తెలియని అజ్ఞానంనుండి, అనుభవించేవాడు, అనుభవింపబడేది(విషయి,విషయాలు)గా గోచరించే ప్రపంచం ఉద్భవిస్తూంది. అనుభవిస్తున్నాననుకుంటున్న అహంకారం తనయిష్టా యిష్టాలతో సుఖ దుఃఖాలతో ఈ భ్రమను పెంచి పోషిస్తూ బాధభరించలేనప్పుడు ఈ బంధం నుండి ముక్తి కోరుకుంటున్నది.


ఈ భావన స్థిరపడిన కొద్దీ మనస్సు ఏకాగ్రత చెందుతుంది; ఏకాగ్రత నందిన మనస్సులో ఆలోచనల ఉధృతం క్రమంగా తగ్గి ముక్తి కావాలనే ఈ చివరి ఒక్క కోరిక కూడా క్రమంగా అదృశ్యం అయిపోతుంది.


ఆలోచన నశించగానే అహం-కారము నశిస్తుంది. అహంకారము లేకపోవడమే ఆత్మ చైతన్యం స్వయంగా ప్రకాశించడం ఇక్కడ ఏకంగా అద్వయంగా ఆత్మ మాత్రమే ఉంది.


ఉపనిషత్తులలో వాడిన ఉపమానమే జనకులు కూడా వాడడంతో జనకుని అనుభవం ఉపనిషద్ ఋషుల అనుభవంవంటిదేననీ, ఉపనిషద్ వాక్యాలు సత్య మనీ ఋజువు అవుతున్నది.


ఆత్మగా నా స్వభావమూ లక్షణాలు ఏమిటి? ప్రస్తుతం నాకొక వ్యక్తిత్వం ఉంది. ఆకాశం దృష్ట్యా పరిమిత స్థానం ఉంది, కాలంలో ప్రస్తుతం ఉన్నాను.


అహంకారం నశిస్తే ఇంక నేను అనబడేది ఏదీ ఉండదు కదా? తరువాత నేను ఏ విధంగా ఉంటాను? అప్పుడు నా స్వభావం ఏమిటి? ఈ ప్రశ్నలకు రాబోయే శ్లోకంలో జవాబు చెప్పబోతున్నారు తన అనుభవదృష్టితో జనకరాజర్షి.

🕉️🌞🌏🌙⭐🚩

🧘‍♂️31) అష్టావక్ర గీత🧘‍♀️
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అధ్యాయం - 2
ఆత్మ  - అత్యద్భుతం

శ్లోకం 08:-

ప్రకాశో మే నిజం రూపం నాతిరిక్తోఽస్మ్యహం తతః ।

యదా ప్రకాశతే విశ్వం తదాహం భాస ఏవ హి ॥ 2-8 ॥

ప్రకాశో మే నిజం రూపం నాతిరిక్తోఽస్మ్యహం తతః ।

యదా ప్రకాశతే విశ్వం తదాఽహం భాస ఏవ హి ॥ 8 ॥

प्रकाशो मे निजं रूपं नातिरिक्तोऽस्म्यहं ततः ।
यदा प्रकाशते विश्वं तदाहं भास एव हि ॥ २-८ ॥

prakaasho me nijam roopam naatirikto’smyaham tatah’ ।
yadaa prakaashate vishvam tadaaham bhaasa eva hi ॥ 2-8 ॥

టీకా

ప్రకాశః = ప్రకాశము, మే = నా యొక్క, నిజం = యథార్థమైన, రూపం = రూపముగా నున్నది, తతః = ఆ ప్రకాశ స్వరూపముకంటే, అహం = నేను, అతిరిక్తః = వేరైనన్నాను, న అస్మి = కొను, యదా = ఎప్పుడు, విశ్వం = ప్రపంచము, ప్రకాశతే = ప్రకాశించుచున్నదో, తదా = అప్పుడు, తత్ = ఆ ప్రకాశము, అహం భాస ఏవ హి = నా ప్రకాశమువలననే, ప్రకాశతే = ప్రకాశించుచున్నది.

వివరణ:-

నేను స్వయంజ్యోతిని. నేనూ ప్రకాశమూ వేరుకావు. ప్రపంచం కనిపిస్తుందంటే అందుకు కారణమయిన కాంతిని నేనే. నా వల్లనే ప్రపంచం తెలియబడుతున్నది.

తాత్పర్యం:-

శారీరక మానసిక అనుభవాలన్నీ మనకు తెలియబడడానికి కారణం
మనలోని చైతన్యమే. ఏదైనా వస్తువు కనిపించడానికి కాంతి ఎలా ఉపయోగపడు తున్నదో, అదే విధంగా మన అనుభవాలన్నీ తెలియబడడానికి చైతన్యం సహాయ పడుతున్నది. అందుకే చైతన్యాన్ని జ్యోతితో, ప్రకాశంతో,పోల్చారు. తెలియబడేవి ఆలోచనలైతే, అవి అలా తెలియబడడానికి చైతన్యం ఆధారంగా ఉంటున్నది.

ఈ తెలియబడడం అనేది అర్థం అవడానికి ఉపమానంగా ప్రకాశాన్ని దృశ్యాన్ని పోల్చారు. అంతేకాని, కేవలం వాచ్యార్థం తీసుకుని ఆత్మ అంటే అన్నిటి కంటే ఎక్కువ కాంతి కలది అని భావించరాదు. చాలా మంది ఇలాగే పొరబడి సత్య దర్శనం మీద కోరిక ఎక్కువ కావడంతో తమ ధ్యానంలో సత్యాన్ని తేజోరాశిగా దర్శించామని తలపోస్తూ ఉంటారు.

 ఆత్మజ్యోతి అనేమాట యొక్క వాచ్యార్థం మాత్రం గ్రహించడం చేతనూ, సత్యాన్ని వీలయినంత వేగంగా దర్శించాలనే తహతహతోనూ ఉండడంతో మనస్సు ఇటువంటి భ్రమను కల్పిస్తుంది. నిజంగా అటువంటి కాంతిని చూసి ఉంటే, అది వేరు దృశ్యం అవుతుంది కానీ దృక్ ఎన్నటికీ కాజాలదు. చైతన్యం అనే మాటను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.

 తెలియబడడానికి కారణమైన తెలివే చైతన్యం, వస్తువు తెలియబడడానికి ప్రకాశం ఉపయోగపడినట్టుగా, ఆలోచనలు తెలియబడేట్టు చేస్తుందని మాత్రమే అర్థం. ఈ "జ్యోతి" 'ప్రకాశం' అనే పదాల అర్థాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని లక్ష్యార్థమయిన చైతన్యంగా నిలచిపోవాలి. నిశ్శబ్దం అన్నమాటకు అర్థాన్ని తెలుసుకుని ఆ స్థితిలో ఉండిపోవాలి.

 అంతేకాని నిశ్శబ్దం, నిశ్శబ్దం అంటూ ఉంటే నిశ్శబ్దం ఎక్కడ ఉంటుంది? చైతన్యం అంటే ఏమిటో సూచించడానికి వాడిన పదాలను వదిలేసి లక్ష్యారాన్ని గ్రహించగలగాలి. శ్రీ రామకృష్ణ పరమహంస ఈ కాంతి గురించి చెప్పుతూ 'కాంతి లక్షణాలు లేని కాంతి"గా వర్ణించారు. ప్రాణులు ప్రపంచాన్ని తెలుసుకునే చేస్తున్న కారణంగా చైత్యన్యాన్ని జ్యోతిగా వేదాంతంలో వాడుతున్నారు.

అహంకారం నశించగానే సాధకుడు తన్ను తాను చైతన్య జ్యోతిగా గుర్తిస్తాడు. ఈ చైతన్యమే విషయినీ, విషయాలనూ, అహంకారాన్నీ, అనుభవాలనూ కూడా తెలియబడేలా చేస్తుందని గుర్తిస్తాడు.

భావనాతీతమైన ఈ అనుభవంతో జనకుడు " నేను స్వయంజ్యోతిని నేనూ ప్రకాశమూ వేరు కావు' అంటున్నారు. ఈ చైతన్యం ఎటువంటి జ్యోతో మానవ మేధకు ఎన్నటికీ అందదు, అర్థం చేసుకోవాలనిపించగానే ఆలోచన అయి పోతున్నది.

 ఆలోచనను మనం గుర్తిస్తున్నాం కాబట్టి అది విషయమయి, విషయినైన నాకంటే వేరుగా ఉంటున్నది. ఇంతేకాక ఆలోచనలతో గుర్తింపబడేదంతా మనోబుద్ధుల ప్రభావంతో కల్పింపబడిన ఊహాలోకమే అవుతుంది. చైతన్యాన్ని అర్థం చేసుకోవాలనుకున్న తక్షణమే మనోబుద్ధులు పనిచేసి చైతన్యంతో ప్రకాశించే ఆలోచనలు మాత్రమే గుర్తిస్తాయి.

 చైతన్యం మనోబుద్ధులకు అతీతంగా వాటికి ఆధారంగా ఉంటూ చూడాలనుకుంటున్నంత సేపూ చూస్తున్నంత సేపూ శారీరక అనుభవాలుగా, మనోబుద్ధులు ఉద్రేకాలు భావాలుగా తెలియబడుతున్నది. చైతన్యం అంటే ఏమిటో తెలియక పోవడమే అజ్ఞానం. తెలుసుకోవాలని ప్రయత్నించి చూచినంత సేపూ ప్రపంచమే కనిపిస్తూ ఉంటుంది.

ఆకాశాన్ని ఎంత సేపూ చూచినా ఎంత తార్కికంగా ఆలోచించినా, నీలంగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నిజంగా ఏమీ లేదని తెలుసుకొని, ఆ నీలవర్ణపు ఉనికికి సంబంధించిన సమస్య నుండి బయటపడి శాంతంగా ఉదాసీనంగా హాయిగా ఉండడం సాధ్యమే. ఇదే విధంగా చైతన్యం గురించి అర్థం చేసుకోవాలనుకోవడం అర్థరహితమని గుర్తించి, శాంతంగా ఉదాసీనంగా హాయిగా భావశూన్య స్థితిలో ఉంటే?!-అలా ఉండడమే చైతన్యంగా నిలచిపోవడం.

సినిమాహాలులో ప్రేక్షకులకు వెనుకగా అర్క్ లైట్ ఉంటుంది. కాంతితో ప్రేక్షకుల ముందున్న తెర అంతా కాంతిమయమవుతుంది. మెషిన్ రూములో ఈ లైటుముందుకి ఫిల్మువచ్చినప్పుడు ప్రేక్షకులకు, వారికి ముందుగా దాని
అనేకనామరూపాలతో అద్భుతమైన ప్రదర్శన కనిపిస్తుంది. ఇదే విధంగా మనలో ఉండే చైతన్యానికి దగ్గరగా మన వాసనలు రాగానే, బాహ్యాభ్యంతరాలలో మనశ్శరీరాల ద్వారా జగన్నాటకాన్ని అహంకారం చూస్తున్నానను కుంటుంది, చూస్తుంది.

దృక్ దృశ్య భావమయమయిన ఈ మహావిశ్వమంతా చైతన్యంలో, చైతన్యం వల్ల, చైతన్యంతో కల్పింపబడుతుంది. చూచేవాడు, చూడబడేది, చూడడం ఈ భావాలన్నిటికీ చైతన్యమే ఆధారం, చైతన్యమే ఇవన్నీ, సముద్రంలో తరంగాలు నురుగు, బిందువులు అన్నీ సముద్రమే అయినట్టుగా, భగవద్గీతలో ఒక శ్లోకం ఇక్కడ తప్పకుండా గుర్తుకు వస్తుంది.

యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః!

క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత!!

 (భగవద్గీత-13-33)

 ప్రపంచమంతటికీ ఒకే సూర్యుడు వెలుగునై ఇస్తున్నట్టుగానే, ఓ భారతా, ఒకే పరమాత్మ, ఒకే క్షేత్రజ్ఞుడు ఈ క్షేత్రాన్నంతటినీ ప్రకాశింపజేస్తున్నాడు.

ఉపనిషత్ ఋషులు కూడా దీనినే నొక్కి చెప్తున్నారు. ఉన్నట్టున్నదంతా, ప్రకాశించేదంతా, అనుభవింపబడేదంతా ఆత్మ చైతన్యం యొక్క వ్యక్త రూపమే. సత్ రూపంలో ఉనికి కలిగినట్లుగా అనిపిస్తూ, చిత్ రూపంలో తెలుసు కుంటున్నాననుకుంటుంది. సత్ చిత్ ఆనందమే సర్వానికీ ఆధారం, అధిష్ఠానం, ఇదే సర్వమూ, ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాను అన్నభావం చైతన్యం వల్లనే చైతన్యంలోనే సాధ్యం అవుతుంది.
🧘‍♂️ 32) అష్టావక్ర గీత🧘‍♀️
🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అధ్యాయం - 2
ఆత్మ  - అత్యద్భుతం

శ్లోకం 09:-

అహో వికల్పితం విశ్వమజ్ఞానాన్మయి భాసతే ।
రూప్యం శుక్తౌ ఫణీ రజ్జౌ వారి సూర్యకరే యథా ॥ 2-9 ॥

అహో! వికల్పితం విశ్వం అజ్ఞానాన్మయి భాసతే ।
రూప్యం శుక్తౌ ఫణీ రజ్జౌ వారి సూర్యకరే యథా ॥ 9 ॥*

अहो विकल्पितं विश्वमज्ञानान्मयि भासते ।
रूप्यं शुक्तौ फणी रज्जौ वारि सूर्यकरे यथा ॥ २-९ ॥

aho vikalpitam vishvamajnyaanaanmayi bhaasate ।
roopyam shuktau phanee rajjau vaari sooryakare yathaa ॥ 2-9 ॥

టీకా

యథా= ఏ ప్రకారము, శుక్తౌ= ముత్యపుచిప్పయందు, రూప్యం = వెండియు, రజ్జి = త్రాటియందు, ఫణీ = సర్పమున్ను, సూర్యకరే = సూర్యకిరణములయందు, వారి = జలమున్ను, వికల్పితం = కల్పింపబడి, భాసతే = తోచుచున్నదో, తథైవ = అట్లే, వికల్పితం = విశేష కల్పితమగు, విశ్వం = ప్రపంచము, అజ్ఞానాత్ = అజ్ఞానము వలన, మయి = నాయందు, భాసతే = తోచుచున్నది, అహో = ఆశ్చర్యము. 

వివరణ:-

అహో! అద్భుతం! అజ్ఞాన జనితమయిన భ్రమకారణంగా ప్రపంచం నాలో భాసిస్తున్నది. ముత్యపుచిప్పలో వెండివలె, తాడులో పామువలె, ఎండ మావులలో జలంవలె ప్రపంచం నాలో ఉన్నట్లుగా అనిపిస్తున్నది.

తాత్పర్యం:-

గడచిన అయిదు శ్లోకాలలోనూ వివిధ ఉపమానాల సహాయంతో, ఈ ప్రపంచం ఉన్నట్లుగా కనబడడానికి ఆత్మ చైతన్యమే కారణమని నిరూపింపబడింది. కార్యమయిన ప్రపంచంలో కారణమయిన ఆత్మ సర్వవ్యాప్తంగా ఉందని కూడా నిరూపింపబడింది. మట్టితో తయారయిన కుండలో అంతటా పూర్తిగా మట్టి ఉండి తీరుతుంది. అయితే మట్టి పరిణామం చెందడం వల్ల, రూపాంతరం చెందడంవల్ల ఇది సాధ్యమయింది.

అనంతమయిన ఆత్మ కూటస్థం--పరిణామరహితం, మార్పు చెందనిది, కనబడే ప్రపంచానికి ఆత్మకారణం అంటే ఆత్మలో మార్పు సాధ్యం అని ఒప్పు కున్నట్టే అవుతుంది. మార్పుచెందేది నశించి తీరుతుంది. కాబట్టి ఈ మార్పును ఒప్పుకుంటే, ఇంతవరకూ ఆత్మగురించి చెప్పబడింది అసత్యంగానూ, వేదాంతం తర్క సమ్మతంగాని అసంబద్ధ ప్రలాపంగానూ అనిపించక మానదు!

అందుకనే ఈ శ్లోకంలో జనకుడు వేదాంతంలో తరుచుగా వాడబడే ఇంకొకమూడు ఉపమానాలతో, కనబడే నామరూపాత్మక ప్రపంచం కేవలం మనః కల్పిత భ్రమ అని చెప్పుతున్నారు.

భ్రమ అధిష్ఠానాన్ని ఏ విధంగానూ మార్చదు. అధిష్ఠానాన్ని సరిగ్గా చూడకపోవడంవల్ల మాత్రమే భ్రమ ఉన్నట్టు కనిపిస్తుంది. సత్యాన్ని గ్రహించగానే అసత్యం అదృశ్యమయిపోతుంది.

ముత్యపుచిప్ప వెండివలె కనిపించడం, తాడును చూసి పాముగా' భ్రమ పడడం, సూర్యకాంతిలో ఎండమావిలో నీరున్నట్టు కనబడడమూ మనకు తెలిసినవే.

ఇదే విధంగా ఆత్మలో ప్రపంచం ఊహించబడుతున్నది; కల్పించబడుతున్నది, ఆరోపింపబడింది. ఆత్మను గ్రహించవలసినట్లుగా గ్రహించక పోవడంతో ప్రపంచాన్ని ఊహిస్తున్నాను, మనస్సులో నిర్మిస్తూ చూస్తున్నాను. ఆత్మను ఆత్మగా, సరిగ్గా గుర్తించినప్పుడు భ్రమ తొలగిపోతుంది.


🧘‍♂️ 33) అష్టావక్ర గీత🧘‍♀️
🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అధ్యాయం - 2
ఆత్మ  - అత్యద్భుతం

శ్లోకం 10'-

మత్తో వినిర్గతం విశ్వం మయ్యేవ లయమేష్యతి ।
మృది కుంభో జలే వీచిః కనకే కటకం యథా ॥ 2-10 ॥

మత్తో వినిర్గతం విశ్వం మయ్యేవ లయమేష్యతి । మృది కుంభో జలే వీచిః కనకే కటకం యథా ॥ 10 ॥

मत्तो विनिर्गतं विश्वं मय्येव लयमेष्यति ।
मृदि कुम्भो जले वीचिः कनके कटकं यथा ॥ २-१० ॥

matto vinirgatam vishvam mayyeva layameshyati ।
mri’di kumbho jale veechih’ kanake kat’akam yathaa ॥ 2-10 ॥

టీకా

యథా = ఏ ప్రకారము, మృది = మట్టియందు, కుంభః = కుండయు, జలే = జలమునందు, వీచిః = అలలున్ను, కనకే = సువర్ణమునందు, కటకం = కడియము మొదలగు భూషణములున్ను, లయం = లీనమును, యాన్తీ = పొందుచున్నవో, (తద్వత్ అట్లే), మత్తః = నానుండి, వినిర్గతం = ఉత్పన్నమైన, ఇదం = ఈ, విశ్వం= ప్రపంచం, మయ్యేవ = నాయందే, లయం = లయమును, ఏష్యతి = పొందును. 

వివరణ:-

ఏ విధంగా కుండ నుట్టిలో కలిసిపోతుందో, తరంగం నీటిలో కరిగిపోతుందో, ఆభరణం బంగారంలో ఐక్యమయిపోతుందో, అదే విధంగా నాలో భాసించే ప్రపంచం నాలోనే లయం అయిపోతుంది.

తాత్పర్యం:-

స్తంభంలో భూతం కనిపించినప్పుడు, మాయం అయిపోయినప్పుడు కూడా భూతం ఎక్కడి నుండో అక్కడికి వచ్చిందని కానీ తిరిగి ఎక్కడికో వెళ్ళి పోయిందనికానీ అనలేము.

ఇది కేవలం చూ సేవాని భ్రాంతి మాత్రమే, కాబట్టి చూసే వాని (మనస్సులో) ఊహలో మాత్రమే ఉనికిని కలిగి ఉంటుంది. అయితే ఈ కనిపించిన భూతం స్తంభంలోనే కనిపించి అక్కడే లయం అయిపోయిందని చెప్పితీరాలి.

తన అనుభవంతో నిర్ఘాంతపోయిన జనకుడు, ఈ ప్రపంచం ఏవిధంగా అదృశ్యం అయిపోయిందో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు.

 కార్యం ఏవిధంగా కారణంలో ఐక్యం అయిపోతుందో, అదే విధంగా ఈ విషయి-విషయ సంబంధ మాత్రంగా స్ఫురించే ఈ జగత్ భ్రమ అంతా తనలోనే ఐక్యం అయిపోయిందని స్పష్టం చేస్తున్నారు.

🕉🌞🌏🌙🌟🚩

*🧘‍♂️ 34) అష్టావక్ర గీత🧘‍♀️*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩

*అధ్యాయం - 2*
*ఆత్మ  - అత్యద్భుతం*

*శ్లోకం 11:-*

*అహో అహం నమో మహ్యం వినాశో యస్య నాస్తి మే ।*
*బ్రహ్మాదిస్తంబపర్యంతం జగన్నాశోఽపి తిష్ఠతః ॥ 2-11 ॥*


అహో అహం నమో మహ్యం వినాశో యస్య నాస్తి మే ।
బ్రహ్మాదిస్తంబపర్యన్తం జగన్నాశోఽపి తిష్ఠతః ॥ 2-11 ॥


*अहो अहं नमो मह्यं विनाशो यस्य नास्ति मे ।*
*ब्रह्मादिस्तम्बपर्यन्तं जगन्नाशोऽपि तिष्ठतः ॥ २-११ ॥*


*aho aham namo mahyam vinaasho yasya naasti me ।*
*brahmaadistambaparyantam jagannaasho’pi tisht’hatah’ ॥ 2-11 ॥*

*టీకా*

బ్రహ్మాదిస్తంబపర్యన్త మపి = బ్రహ్మమొదలుకొని తృణము వఱకును, తిష్ఠతః = ఉంటున్నటువంటి, యస్య మే = యే నాకు, జగన్నాశే అపి = జగత్తునశించినదై నప్పటికీ, నాశః = నాశము, న అస్తి = లేదో, అహో = ఆశ్చర్యము, (అత ఏవ = ఈ కారణము వలననే), అహం = నేను, మహ్యం = నాకొఱకు, నమ: నమస్కారమును చేయుచున్నాను

*వివరణ:-*

అహో! నేను అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఉన్నాను. నన్ను నేనే అభినందించుకుంటున్నాను. గడ్డిపోచ మొదలు జగదీశ్వరుని వరకూ గల మొత్తం జగత్తంతా నశించినా నేను శాశ్వతంగా నాశరహితంగా ఉన్నాను.


*తాత్పర్యం:-*

అద్భుతమయిన తన అనుభవాన్ని, ఆశ్చర్యకరమయిన తన అద్వైత స్థితిని ఇక్కడ నుండి నాలుగు శ్లోకాలలో చెప్పుతున్నారు శ్రీ జనకులు. దేశ కాలావృతంగా భాసించే సమస్త జగత్తుకు అధిష్ఠానంగా ఏకంగా అద్వయంగా ఉన్న ఆత్మస్వరూపమే తానని చెప్పుతున్నారు.


'అత్యాశ్చర్యకరం, అత్యద్భుతం అయిన నన్ను నేనే అభినందించు కుంటున్నాను' - అహో, అహం నమామ్యహం" ఇదే గీతం ఈ నాలుగు శ్లోకాల లోనూ ఆలపింపబడుతుంది.


 ఆత్మానుభవం అద్భుతం ఆశ్చర్యకరం మాత్రమే కాదు, అది పవిత్రమూ, దివ్యమూ, అత్యంత ఆహ్లాదకరమూ కూడా. కాబట్టి ఇది గౌరవించదగినది, ఆరాధించదగినది, పూజార్హమైనది.


శుద్ధమయిన చైతన్యం నాశరహితం, అక్షరం, జగదీశుడూ అతని జగత్తూ ఆడే జగన్నాటకానికి రంగస్థలమే ఈ ఆత్మ పాత్రలు వస్తున్నాయి, పోతున్నాయి.


కాని రంగస్థలం మాత్రం ఎప్పుడూ కాంతిమయంగా స్థిరంగా అలాగే ఉంటున్నది (కాంతి అంటే తెలియబడడానికి ఉపయోగపడే తెలివి-చిత్). మిథ్యాత్మకమయిన ఈ ప్రపంచ నాటకం జరుగుతూనే ఉన్నా, ఈ ఆత్మ శాంతంగా, అక్షరంగా, నిత్యంగా ఉంది, ఉంటుంది.


"ఈ అనంతమైన ఆత్మనే నేను"-ఇదే ఆత్మానుభవం. ఈ శ్లోకాలలో ఉత్తమ పురుష ఏకవచన పదప్రయోగం; జనకుడు తన్ను తాను ఆత్మగా గుర్తించడాన్ని ధృవపరుస్తుంది.


 ఉపనిషత్తులన్నీ ముక్తకంఠంతో ఘోషిస్తున్నాయి-'బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి' బ్రహ్మను తెలుసుకున్నవాడు ఆ బ్రహ్మమే, వేరు కాదు.


ఇదే భావం ఇంకా అందంగా వరాహ ఉపనిషత్తులో ఇలా - వర్ణింప బడింది.


సర్వభూతాంతరాస్థాయ నిత్యముక్త చిదాత్మనే!

ప్రత్యక్చైతన్యరూపాయ మహ్యమేవ నమోనమః!!
 (వరాహోపనిషత్తు-11-33)

అన్ని ప్రాణులలోను చిద్రూపంగా నివసిస్తూ, నిత్యముక్తుడనై, చైతన్యరూపంగా ఉన్న నాకు నేను నమస్కరించుకుంటున్నాను. 


సర్వప్రాణులలోనూ ఉన్నటువంటి- (సర్వభూతాంతరస్థాయ)-అన్న బహువచనంలో మొదలు పెట్టి, ఏకవచనంతో ముగించడం ఇక్కడ వ్యాకరణ దోషంగా భావించరాదు. నీలోనూ, నాలోనూ అందరిలోనూ ఉన్న ఆత్మ ఒకటే అని నిశ్చయంగా చెప్పడం కోసం వేదాంతార్థంలో అలా వాడబడింది. 


ఇదే అర్థం వచ్చే శ్లోకం యోగవాశిష్టంలో కూడా ఉంది. దీని భావం ఇలా ఉంది....నీకూ, నాకూ నమస్కారం, ఇద్దరమూ చైతన్యమే, ఉన్నది చైతన్యం ఒక్కటే."

🕉️🌞🌏🌙⭐🚩

[8:06 pm, 15/04/2022] +91 92915 82862: 🧘‍♂️ 35) అష్టావక్ర గీత🧘‍♀️
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩

ఆత్మ  - అత్యద్భుతం

శ్లోకం 12:-

అహో అహం నమో మహ్యమేకోఽహం దేహవానపి ।
క్వచిన్న గంతా నాగంతా వ్యాప్య విశ్వమవస్థితః ॥ 2-12

అహో అహం నమో మహ్యం ఏకోఽహం దేహవానపి ।
క్వచిన్న గంతా నాగంతా వ్యాప్య విశ్వమవస్థితః ॥ 12 ॥ ॥


अहो अहं नमो मह्यमेकोऽहं देहवानपि ।
क्वचिन्न गन्ता नागन्ता व्याप्य विश्वमवस्थितः ॥ २-१२ ॥


aho aham namo mahyameko’ham dehavaanapi ।
kvachinna gantaa naagantaa vyaapya vishvamavasthitah’ ॥ 2-12 ॥

టీకా

అహం =  నేను, అహో = ఆశ్చర్యరూపుడను, మహ్యం = నాకొఱకు, నమః = నమస్కారము, అహం = నేను, దేహవానపి = దేహధారినైనప్పటికినీ, ఏకః = అద్వితీ యుడను, క్వచిత్ = ఎక్కడ నుండీ, గన్తా = పోవువాడను, న = కాను, క్వచిత్ = ఎక్కడికి, న ఆగన్తా = వచ్చువాడనుగాను, విశ్వం ప్రపంచమును, వ్యాప్య = ఆవరించి, అవస్థితః = ఉంటున్నాను.

వివరణ:-

అద్భుతమైన నాకు నమస్కారము, శరీరంతో ఉన్నప్పటికీ నేను ఎక్కడ నుండీ రానూ లేదు; ఎక్కడికీ పోవడమూ లేదు, విశ్వాన్నంతా ఆవరించి ఏకంగా ఉన్నాను.


తాత్పర్యం:-

తన అనుభవంతో దిగ్భ్రాంతి చెందిన జనకుడు తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చెయ్యడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.


నా శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, దేశకాలాలలో పరిభ్రమించడం నాకు స్పష్టంగా తెలుసు.


 పరిమితమయిన జీవిగా శరీరంతో దేశకాలాలకు లోబడి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చరిస్తూనే ఉన్నాను. ఆత్మగా నన్ను నేను తెలుసుకున్న యీ తరుణంలో, అన్ని కదలికలూ నాలో జరగడం చూస్తున్నాను.


 కానీ, నేను ఎక్కడికీ కదలడం లేదన్నది స్పష్టంగా బోధపడింది. నిత్యమూ, చైతన్యంగా నేను సర్వవ్యాప్తంగా ఉన్నాను. నాలోనే ఈ జగన్నాటకమంతా ఒక అంశంగా, అణుమాత్రంగా, కనిపిస్తున్నది!

🕉️🌞🌏🌙⭐🚩
[8:06 pm, 15/04/2022] +91 92915 82862: 🧘‍♂️ 36) అష్టావక్ర గీత🧘‍♀️
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩

అధ్యాయం - 2
ఆత్మ  - అత్యద్భుతం

శ్లోకం 13:-

అహో అహం నమో మహ్యం దక్షో నాస్తీహ మత్సమః ।

అసంస్పృశ్య శరీరేణ యేన విశ్వం చిరం ధృతం ॥ 2-13 ॥

అహో అహం నమో మహ్యం దక్షో నాస్తీహ మత్సమః ।

అసంస్పృశ్య శరీరేణ యేన విశ్వం చిరం ధృతమ్ ॥ 13 ॥


अहो अहं नमो मह्यं दक्षो नास्तीह मत्समः ।  असंस्पृश्य शरीरेण येन विश्वं चिरं धृतम् ॥ २-१३ ॥


aho aham namo mahyam daksho naasteeha matsamah’ ।
asamspri’shya shareerena yena vishvam chiram dhri’tam ॥ 2-13 ॥

టీకా

యేన = ఎందుచేత, శరీ రేణ = శరీరముతో, అసంస్పృశ్య = వేరయి (అంటక), నాచేత, (ఇదం = ఈ), విశ్వం = ప్రపంచము, ధృతం ధరించబడుచున్నదో,(అత: = ఈ కారణమువలన), ఇహ = ఈ ప్రపంచములో, మత్సమః=నాతో సమానమయిన, దక్షః = సమర్థుడు (నేర్పరి), నాస్తి = లేడు, అహో = ఆశ్చర్యరూపుడనైన, అహం = నేను మహ్య = నాకొఱకు,నమః = నమస్కారమును చేయుచున్నాను. 
 
వివరణ:-

అద్భుతమయిన నన్ను నేను అభినందించుకుంటున్నాను! ఈ విశ్వాన్ని స్పృశించకుండానే అనాదిగా ధరిస్తున్నాను. ఈ సత్యం నాకు మత్రమే అర్థం అవుతుంది నాకంటే సమర్థులెవరూ లేరు. 

తాత్పర్యం:-

జీవన చిహ్నాలుగా ప్రతి ప్రాణిలోనూ మనం చూసే నైపుణ్యం, సమర్థత, చైతన్యం యొక్క వ్యక్తరూపాలే. ఉపాధుల ద్వారా వ్యక్తమయే చైతన్యమే జీవన చిహ్నంగా మన చేత గుర్తింపబడుతున్నది. సమస్త ప్రాణులలోనూ వ్యక్తమయ్యే సమిష్టి జీవశక్తిని భగవంతుడని అంటూ అతడిని సర్వశక్తిమయునిగా భావిస్తున్నాము.


ఈ సర్వశక్తిమయుడైన జగదీశుడూ జగత్తూకూడా నాచే ధరింపబడుతున్నాయి. అయినా నాకు వాటితో ఏ సంబంధమూ లేదు. అసత్యమూ భ్రమాజన్యమూ అయిన జగత్తు నాలో లేనేలేదు.


సంబంధం కాని ఈ సంబంధమే సత్యానికీ అసత్యానికీ మధ్య ఉన్నది. భూతం స్తంభంమీద ఆధారపడి ఉన్నది, అయినా స్తంభం భూతాన్ని స్పృశించడం లేదు.


 నాలో ఉండే స్వప్న ద్రష్ట అనేక అనుభవాలు పొందుతూ సుఖదుఃఖాల ననుభవిస్తూ బయటపడలేక విలపిస్తున్నాడు. అయినప్పటికీ జాగ్రదవస్థలో ఉన్న నాకు ఆ స్వప్న ప్రపంచంతోగాని, ద్రష్టతోగాని, కష్టసుఖాలతోగాని ఎటువంటి సంబంధమూ లేదు.


ఈ చిత్రాతి చిత్రమయిన సంబంధాన్ని గమనిస్తే, ఆత్మను ఆరాధించ కుండా ఉండలేము. మనశ్శరీరాలు గత అనుభవాలను స్మరిస్తూ కొత్తవి ఊహిస్తూ వాటితో యిష్టా యిష్టాలను పెంచుకుని చలిస్తూ, తమవైన ప్రత్యేక ప్రపంచాలను నిర్మించు కుంటున్నాయి

 జయాపజయాలను,సుఖదుఃఖాలను,జనన మరణాలను, ఊహించి నిర్మించి అనుభవిస్తున్నాయి. వీటన్నిటి మధ్య నిశ్చలంగా శాంతంగా ఆత్మ ఉంది, ఆ ఆత్మే నేను.


ఈ జగన్నాటకం నానుండే ఉనికిని సంతరించుకొని సాగుతున్నది. ఉన్నవాటన్నిటిలో నిశ్చయంగా నేను గౌరవింపబడాలి. ఆరాధింప బడాలి.

🕉️🌞🌏🌙⭐🚩

🧘‍♂️ 37) అష్టావక్ర గీత🧘‍♀️

అధ్యాయం - 2
ఆత్మ  - అత్యద్భుతం

శ్లోకం 14:-

అహో అహం నమో మహ్యం యస్య మే నాస్తి కించన ।
అథవా యస్య మే సర్వం యద్ వాఙ్మనసగోచరం ॥ 2-14 ॥

అహో అహం నమో మహ్యం యస్య మే నాస్తి కించన ।
అథవా యస్య మే సర్వం యద్వాఙ్మనసగోచరమ్ ॥ 2-14 ॥

अहो अहं नमो मह्यं यस्य मे नास्ति किञ्चन ।
अथवा यस्य मे सर्वं यद् वाङ्मनसगोचरम् ॥ २-१४ ॥

aho aham namo mahyam yasya me naasti kinchana ।
athavaa yasya me sarvam yad vaangmanasagocharam ॥ 2-14 ॥

యస్య మే = యే నాకు, కించన = కొంచెముకూడ, నాస్తి = లేదో, అథవా = లేనిచో, యస్య = యే, మే = నాకు, వాజ్మానసగోచరం = వాక్కులకు మనస్సునకు గోచరమగుచు, యత్ = యే, సర్వం = సమస్తమున్ను, (ఆస్తి = విషయమగుచున్నదో అట్టి), అహో = ఆశ్చర్యరూపుడగు, అహం = నేను, మహ్యం = నా కొఱకు, నమః = నమస్కరించున్నాను.

వివరణ:-

అహా! ఆత్మనైన నాకు నమస్కృతులు, నాలో ఏదీ లేదు, వాక్కుకూ మనస్సుకూ గోచరించేవన్నీ నాలోనే ఉన్నాయి.

తాత్పర్యం:-
ఆత్మస్తుతిలో ఆఖరి శ్లోకం ఇది. అప్రయత్నంగా అతిసహజంగా అభివందనాలు అర్పించడం జరిగింది. ఆత్మ సర్వానికీ అధిష్ఠానం కాబట్టి ప్రపంచంలో ఉండే సర్వాన్ని తనదనవచ్చును.

 తనదైన శుద్ధస్వరూపాన్ని భ్రమాజనితమయిన సృష్టి యొక్క మిథ్యాత్వాన్ని గుర్తించి తనలో ఏమీలేనే లేదని అననూవచ్చు. ఆత్మగా తన్ను తాను గుర్తిస్తూ ఆ అనుభవజ్ఞానంతో రాజర్షి, పరస్పర విరుద్ధంగా ధ్వనిస్తున్నా సత్యాన్నే వచిస్తున్నారు. 'అన్నీ నాలోనే ఉన్నాయి, నాలో ఏవీ లేవు."

ఇదే భావాన్ని రాజర్షి ఇంతకు ముందు శ్లోకాలలో కూడా చెప్పేరు 'ప్రపంచము అంతా నాలో ఉంది, నిశ్చయంగా నాలో ఏదీ లేదు' "అవాజ్మానస గోచరమ్"-అని జనకులు అనడంలో, ఊహించగలిగినదీ, నిర్దేశించి చెప్పగలిగినది. అంటే సర్వమూ అన్న అర్థం ఉంది. అల్పపదాలలో అపారమైన అర్థాన్ని అంది వ్వడంలో సంస్కృతానికి సాటిరాగల భాష మరొకటి లేదు.

🕉🌞🌏🌙🌟🚩*🧘‍♂️ 38) అష్టావక్ర గీత🧘‍♀️*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩

*అధ్యాయం - 2*
*ఆత్మ  - అత్యద్భుతం*

*శ్లోకం 15:-*

*జ్ఞానం జ్ఞేయం తథా జ్ఞాతా త్రితయం నాస్తి వాస్తవం ।*
*అజ్ఞానాద్ భాతి యత్రేదం సోఽహమస్మి నిరంజనః ॥ 2-15 ॥*

జ్ఞానం జ్ఞేయం తథా జ్ఞాతా త్రితయం నాస్తి వాస్తవమ్ ।
అజ్ఞానాద్భాతి యత్రేదం సోఽహమస్మి నిరంజనః ॥ 15 ॥


*ज्ञानं ज्ञेयं तथा ज्ञाता त्रितयं नास्ति वास्तवम् ।*
*अज्ञानाद् भाति यत्रेदं सोऽहमस्मि निरञ्जनः ॥ २-१५ ॥*


*nyaanam jnyeyam tathaa jnyaataa tritayam naasti vaastavam ।*
*ajnyaanaad bhaati yatredam so’hamasmi niranjanah’ ॥ 2-15 ॥*

*టీకా*

యత్ర = ఎచట, జ్ఞానం = జ్ఞానము (తెలివి), జ్ఞేయం =  తెలుసుకొనదగిన వస్తువు, జ్ఞాతా = తెలుసుకొనువాడు (అను), త్రితయం = మూడింటిగుంపు, వాస్తవం = వాస్తవముగ, నాస్తి = లేదో, చ = మఱియు, యత్ర = యెచ్చట, అజ్ఞానాత్ = అజ్ఞానము = ఈ మూడింటిగుంపు, భాతి = తోచుచున్నదో, సః = ఆ, అహం నిరంజనః = నిరంజన రూపుడను, అస్మి = అగుచున్నాను. 

*వివరణ:-*

తెలుసుకునేవాడు, తెలియబడే విషయమూ, తెలుసుకోవడమూ- ఈ త్రిపుటి--ఈ మూడూ నిజానికి నాలో లేవు. శుద్ధమైన ఆత్మ చైతన్యాన్ని నేను నాలో అజ్ఞానం వలన ఈ త్రిపుటి ఉన్నట్టుగా అనిపిస్తున్నది.

*తాత్పర్యం:-*

నానాత్వంతో భాసించే ఈ ప్రపంచంలో అనుభవాలు కలగడానికి ముఖ్యంగా మూడు విషయాలు ఉండి తీరాలి.
1) తెలుసుకునేవాడు, 2) తెలియ బడే వస్తువు,
3) ఈ రెండింటి సంబంధమూ అయిన తెలియబడడం అనే క్రియ, జ్ఞానం ఈ మూడూ లేనిదే ఏ అనుభవమూ సాధ్యం కాదు.


అహంకారం క్షేత్రాన్ని అధిగమించి ఆత్మగా తన్నుతాను తెలుసుకున్నప్పుడు ఈ త్రిపుటి ఆడే మాయా జగన్నాటకం ఉండజాలదు. శుద్ధ మైన ఆత్మలో అజ్ఞానం వలన ఈ త్రిపుటి ఉన్నట్టుగా భావింపబడుతుంది. మూడూ కూడా మనస్సు యొక్క కల్పనలే. ఆత్మను తెలియకపోవడం చేత భ్రమతో జగత్తుగా జీవుడుగా ఈశ్వరుడుగా భావిస్తుంది. సాధకుడు తన్ను తాను శుద్ధ చైతన్యంగా గుర్తించినప్పుడు ఈ భ్రాంతి తొలగిపోతుంది.


మనం కలకంటున్నప్పుడు ఆ స్వప్న లోకమంతా, స్వప్నం చూసే నేనూ స్వప్న ప్రపంచమూ నాకూ ప్రపంచానికి ఉండే సంబంధం-- ఈ మూడింటి మీదే ఆధారపడి ఉంటుంది. ఈ స్వప్న ద్రష్ట (తైజసుడు) మేలుకోగానే ఈ మూడు కూడా ఏకమయిన జాగ్రద్రష్ట (విశ్వుని) యొక్క మనస్సులో లయం అయిపోతాయి. విశ్వుని మనస్సే తన ఊహలతో స్వప్న ప్రపంచాన్ని త్రిపుటినీ కూడా నిర్మిస్తున్నది, కష్టసుఖాలనూ, యిష్టాయిష్టాలను, అన్నిరకాల , అనుభవాలను అనుభవిస్తున్నది.


ఈ త్రిపుటి ఉన్నంత సేపూ స్వప్నలోకం చాలా నిజంగా ఉంటుంది. మేలుకోగానే తన స్వస్థాన మనదగిన మనస్సులో లయం అయిపోతుంది. అహంకారానుభవ క్షేత్రం నుండి సాధకుడు చైతన్యానుభవ స్థితికి రాగానే, అహంకారమూ ప్రపంచమూ అనుభవాలు కూడా చైతన్యంలో లీనం అయిపోతాయి. చైతన్యం ఏకంగా అట్వయంగా శుద్ధంగా ఉంటుంది.


యోగవాశిష్టంలో ఇలా ఉంది...

 39 అష్టావక్ర గీత
***
అధ్యాయం - 2
ఆత్మ  - అత్యద్భుతం

శ్లోకం 16:-

ద్వైతమూలమహో దుఃఖం నాన్యత్తస్యాఽస్తి భేషజం ।
దృశ్యమేతన్ మృషా సర్వమేకోఽహం చిద్రసోమలః ॥ 2-16 ॥

శ్లో|| ద్వైతమూలమహో దుఃఖం నాన్యత్తస్యాస్తి భేషజమ్ | 
దృశ్యమేతన్మృషా సర్వం ఏకోౕఽహం చిద్రసోఽమలః || 16.

द्वैतमूलमहो दुःखं नान्यत्तस्याऽस्ति भेषजम् ।
दृश्यमेतन् मृषा सर्वमेकोऽहं चिद्रसोमलः ॥ २-१६ ॥

dvaitamoolamaho duh’kham naanyattasyaa’sti bheshajam ।
dri’shyametan mri’shaa sarvameko’ham chidrasomalah’ ॥ 2-16 ॥

టీకా

దుఃఖం = దుఃఖము, ద్వైతమూలం=ద్వైతమే కారణముగా గలది, తస్య= ఆ ద్వైత మూలదుఃఖమునకు, అన్యత్ = ఇతరమైన, భేషజం = ఔషధము, నాస్తి = లేదు, ఏతత్ = ఈ, సర్వం = సమస్తమైన, దృశ్యం = దృశ్యము, మృషా= మిథ్య, అహం= నేను, ఏక:= ఒక్కడనే, చిద్రసః = జ్ఞానైకస్వరూపుడను, అమలః = నిర్మలుడను, (అనుజ్ఞానమే ఔషధము)

వివరణ:-

అన్ని దుఃఖాలకు ద్వైతభావమే మూలకారణం. ఈ దుఃఖం నివారింపబడాలంటే, అనుభవయోగ్యంగా కనబడేవన్నీ మిథ్య అనీ, అనుభవించే నేను ఏకంగా అద్వయంగా చైతన్యంగా ఉన్నాననీ తెలుసుకోవడమే మార్గం.

తాత్పర్యం:-

కష్టం, బాధ, విచారం అన్నీ కూడా మనస్సులోని అలజడులు మాత్రమే. మనస్సులో అలజడి ఎక్కువయిన కొద్దీ విచారం కూడా ఎక్కువవుతూ ఉంటుంది. మనస్సు ఎంత శాంతంగా ఉంటే మనిషి అంత హాయిగా ఉంటాడు.

బాహ్యాభ్యంతరాలలో నానాత్వ ప్రపంచాన్ని చూడడమే మనస్సులో అలజడికి కారణం ద్వైతభావాన్ని చూడటమే అన్ని బాధలకు మూలకారణం.

తన్ను తాను ఏకమూ అద్వయమూ అయిన ఆత్మగా గుర్తించిననాడు నానాత్వ ప్రపంచం మిథ్యగా తెలియబడుతుంది.

కాబట్టి ఆత్మజ్ఞానికి ఈ మిథ్యా ప్రపంచం వల్ల ఎటువంటి హానీ ఉండదు. "న అన్యత్ తస్య అస్తి భేషజం"-అహంకారానుభవ క్షేత్రంలోని బాధలు పోవాలంటే సత్యాన్ని తెలుసుకోవడం కంటే వేరే ఏ మార్గమూ లేదు.
***

మృతం చిత్తం గతౌ తృష్ణా ప్రక్షీణే మోహపంజరః! నిరహంకారతా జాతా జాగ్రత్యస్మిన్ ప్రబుద్ధవాన్!! (యోగవాశిష్ఠం-81-9)

మనస్సు నశిస్తే కోరికలు నశిస్తాయి. అహంకారం, పంజరం నుండి బయటపడిన పక్షివలె భ్రాంతిని విడిచి, ఆత్మానుభవంలో స్వేచ్ఛగా ఉంటుంది. శ్రీ అవధూత శ్రీ దత్తాత్రేయస్వామి , అవధూత గీతలో ఈ ఆత్మానుభవాన్ని, ఏకత్వానందాన్ని ఇలా వర్ణించినారు.


ధ్యాతా న తే హి హృదయే న చ తే సమాధి:|

ధ్యానం న తే హి హృదయే న బహిః ప్రదేశః | 

ధ్యేయం న చేతి హృదయే న హి వస్తుకాలో|

జ్ఞానామృతం సమరసం గగనోపమోహమ్ ||

(అవధూత గీత |||-41)

ధ్యానించేవాడు లేడు, హృదయంలో సమాధీ లేదు, ధ్యానమూ లేదు, హృదయానికి బాహ్యంగా దేశమూ లేదు, ధ్యానించదగినదేదీ లేదు, హృదయంలో వస్తువులూ, కాలమూ లేవు,ఆకాశంవలె అసంగం గా , జ్ఞానామృతంలో సమచిత్తంతో నేనే ఉన్నాను.


భావనాతీతమయిన ఇటువంటి అనుభవాలు పరిమితమయిన బుద్ధికి అర్థం కావు. ఈ అనుభవాలకు వ్యాఖ్యను స్థిర గంభీరమయిన ధ్యానంలో ఎవరికి వారే దర్శించి స్వంతం చేసుకోవాలి.

🕉🌞🌏🌙🌟🚩

*🧘‍♂️ 40 అష్టావక్ర గీత🧘‍♀️*


*అధ్యాయం - 2*
*ఆత్మ  - అత్యద్భుతం*

*శ్లోకం 17:-*

*బోధమాత్రోఽహమజ్ఞానాద్ ఉపాధిః కల్పితో మయా ।*
*ఏవం విమృశతో నిత్యం నిర్వికల్పే స్థితిర్మమ ॥ 2-17 ॥*

బోధమాత్రోఽహమజ్ఞానాద్ ఉపాధిః కల్పితో మయా ।
ఏవం విమృశ్యతో నిత్యం నిర్వికల్పే స్థితిర్మమ ॥ 17 ॥


*बोधमात्रोऽहमज्ञानाद् उपाधिः कल्पितो मया ।*
*एवं विमृशतो नित्यं निर्विकल्पे स्थितिर्मम ॥ २-१७ ॥*


*bodhamaatro’hamajnyaanaad upaadhih’ kalpito mayaa ।*
*evam vimri’shato nityam nirvikalpe sthitirmama ॥ 2-17 ॥*

*టీకా*

అహం = నేను, బోధమాత్ర: = జ్ఞానైకస్వరూపుడను, మయా = నా చేతనే, అజ్ఞానాత్ = అవిద్యవలన, ఉపాధి: = ఉపాధి, కల్పితః = కల్పింపబడినది, ఏవం = ఈ ప్రకారము, నిత్యం = ఎల్లప్పుడు, విమృశ్యతః = విచారణ చేయుచున్న, మమ = నాకు, నిర్వికల్పే = నిర్వికల్పసమాధియందు, స్థితిః = స్థితి, భవతి = అగుచున్నది. 

*వివరణ:-*

నేను శుద్ధచైతన్యాన్ని, అజ్ఞానంతో నన్ను నేను శరీరిగా భావిస్తున్నాను.
సకల మానసిక వృత్తులనూ విడనాడి నా స్వరూపాన్ని ధ్యానించి ఆ అనుభవంలో ఉండి పోతాను.

*తాత్పర్యం:-*

"నిర్వికల్ప " అన్నమాట మొదటిసారిగా వాడబడడం చూస్తున్నాము. ఆలోచనలులేని స్థితి అని ఈ మాటకు అర్థం, దీన్ని మొదటిసారిగా అష్టావక్ర మునీంద్రులే వాడారు.

 తరువాత పతంజలి మహర్షి దీన్ని బాగా వ్యాప్తి చేసేరు. శ్రీ శంకరులు ఈ పదాన్ని విరివిగా వాడారు. ముఖ్యమైన ఉపనిషత్తులలోగాని భగవద్గీతలోకాని ఈ పదం వాడబడకపోవడం గమనార్హం.

జాగ్రదవస్థకు చెందిన వ్యక్తిత్వాన్ని మరిచిపోతే స్వప్నం సంభవం అవుతుంది. నేను సాక్షి చైతన్యాన్ని, నేను చూసేవన్నీ మిథ్యగా నాలో ఉన్నట్టు భ్రమకలిగిస్తున్నాయి.

అని తెలుసుకుంటూ మనశ్శరీరాలతో నిత్యమూ వ్యవహరించడమే ఆత్మానుభవాన్ని సాధించే కీలకం. ఇలా నిత్యమూ తెలుసుకుని వ్యవహరించడంతో మనస్సు శాంతంగా ఉంటుంది.

నిర్వికల్పః శరీరం, మనస్సు,. బుద్ధి వాటి వాటి అనుభవ క్షేత్రాలలో విహరించడం వల్ల నష్టం ఏమీలేదు. ఆత్మనే నేను అని స్థిరంగా అర్థం చేసుకున్నప్పుడు బాహ్యప్రపంచం మన అంతరంగాన్ని ఏ విధంగానూ బాధించజాలదు.

ఈ గీతలో ఆలోచనారహితమైన స్థితి. ఈ నిర్వికల్ప అన్న పదంతో సుమారు ఆరుమార్లు సూచింపబడింది. గౌడపాదుని కోరిక ఈ అష్టావక్రగీతచే బాగా ప్రభావితమైనట్లు కనిపిస్తుంది.

అందులో ధ్యానలక్షణమైన సమాధిస్థితిని ఈ 'నిర్వికల్ప" పదంతో అనేకచోట్ల సూచించడం కనిపిస్తుంది. ఈ నిర్వికల్పసమాధి స్థితిలో విషయి, విషయ భేదం పూర్తిగా అంతరించి ఆత్మ కేవలంగా మిగిలిపోతుంది.

🕉️🌞🌏🌙⭐🚩

*🧘‍♂️ 41 అష్టావక్ర గీత🧘‍♀️*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩

*అధ్యాయం - 2*
*ఆత్మ  - అత్యద్భుతం*

*శ్లోకం 18:-*

*న మే బంధోఽస్తి మోక్షో వా భ్రాంతిః శాంతో నిరాశ్రయా ।*
*అహో మయి స్థితం విశ్వం వస్తుతో న మయి స్థితం ॥ 2-18 ॥*

శ్లో|| అహో మయి స్థితం విశ్వం వస్తుతో న మయిస్థితమ్ |
 న మే  బన్ధోఽస్తి మోక్షోవా భ్రాన్తీ శ్శాన్తా నిరాశ్రయా||18.


*न मे बन्धोऽस्ति मोक्षो वा भ्रान्तिः शान्तो निराश्रया ।*
*अहो मयि स्थितं विश्वं वस्तुतो न मयि स्थितम् ॥ २-१८ ॥*


*na me bandho’sti moksho vaa bhraantih’ shaanto niraashrayaa ।*
*aho mayi sthitam vishvam vastuto na mayi sthitam ॥ 2-18 ॥*


*టీకా*

మే=నాకు, బన్ధో = బంధముగాని, మోక్షో వా = మోక్ష ముగాని, నాస్తి= లేదు, ఆశ్చర్యమైన విషయమేమనగా, మయి = నాయందు, స్థితం ఉన్నటువంటి, విశ్వం = జగత్తు, వస్తుతః = వాస్తవముగా, మయి = నాయందు, న స్థితం= ఉండ లేదు (ఇతి విచారతః = ఇట్లు విచారించుటవలన), భ్రన్తీః = భ్రాంతి, నిరాశ్రయా = ఆశ్రయ రహితమైనదై, శాస్త్ర = శాంతిని పొందుచున్నది.  

*వివరణ:-*

నాకు బంధమూ లేదు, ముక్తి లేదు. ఆశ్రయమయిన అజ్ఞానం నశించడంతో భ్రాంతికూడా నశించిది. అహో! ఈ ప్రపంచమంతా నాలో ఉన్నట్లు కనిపిస్తున్నా నిజానికి నాలో ఏమీ లేదు.

*తాత్పర్యం:-*

మనశ్శరీరాలు కోరే కోరికలను బానిసలవలె తీరుస్తూ, తమలోని లోపాలను స్పష్టంగా తెలుసుకుని బయటపడడం అసంభవంగా గుర్తిస్తున్న ప్రారంభదశలోని సాధకులకు, వారి సర్వబంధాల నుండీ ఎలా బయటపడవచ్చో చెబుతున్నారు.

సాధకును ధ్యానబలంతో తన స్వస్థితి అయిన ఆత్మానుభవంలో నిలువగలిగినప్పుడు, అక్కడ బంధం అనే మాటకు అర్థమే లేదు, ఎందుకంటే ఆత్మ నిత్యముక్తం-- ఎప్పుడూ బంధింపబడలేదు.

నా స్వప్నంలో నేను జైలులో బంధింపబడి బాధపడి ఉండవచ్చు, మెలకువ వచ్చాక నాకు విముక్తి లభించిందని సంతోషించాలా? ఇదే విధంగా నాకు బంధమూ లేదు, ముక్తి లేదు అని అంటున్నారు.


ఆత్మానుభవాన్ని పొందిన జనకరాజర్షి, ఆత్మానుభవాన్ని పొందడంతో అజ్ఞానం నశించింది. అజ్ఞానం లేకపోవడంతో భ్రమాజన్యమయిన అహంకారానికి ఉనికి లేదు. అహంకారం లేని స్థితిలో బంధమోక్షాలనే భావాలు ఎవరికి ఉంటాయి? ఉండనే ఉండవు.

నిన్నటిరాత్రి స్వప్నం నన్ను చాలా బాధ పెట్టి ఉండవచ్చు, ప్రస్తుతం మేలుకుని ఉన్న నన్ను ఆ స్వప్న ప్రపంచం ఏమీ చెయ్య లేదు కదా! "ఇదేవిధంగా ప్రపంచం నాలో ఉన్నా, నాలో లేనట్టే" అని జనకుడు చెప్తున్నారు.

ఆత్మజ్ఞుని, యిచ్ఛాధీనంగా మనశ్శరీరాలతో బాహ్యదృష్టితో అతడు ఆత్మలోనే స్థితుడయి ఉంటాడు, ఆ స్థితిలో విషయి-విషయాలు కూడా అతనిలో లేనట్టే.

........

*🧘‍♂️ 42 అష్టావక్ర గీత🧘‍♀️*

🔥ఓంశ్రీమాత్రే నమః🔥


*అధ్యాయం - 2*
*ఆత్మ  - అత్యద్భుతం*

*శ్లోకం 19:-*

*సశరీరమిదం విశ్వం న కించిదితి నిశ్చితం ।*
*శుద్ధచిన్మాత్ర ఆత్మా చ తత్కస్మిన్ కల్పనాధునా ॥ 2-19 ॥*

శ్లో|| సశరీరమిదం విశ్వం న కించిదితి నిశ్చితమ్ ।
శుద్ధచిన్మాత్ర ఆత్మా చ తత్కస్మిన్కల్పనాధునా ॥ 19 ॥


*सशरीरमिदं विश्वं न किञ्चिदिति निश्चितम् ।*
*शुद्धचिन्मात्र आत्मा च तत्कस्मिन् कल्पनाधुना ॥ २-१९ ॥*


*sashareeramidam vishvam na kinchiditi nishchitam ।*
*shuddhachinmaatra aatmaa cha tatkasmin kalpanaadhunaa ॥ 2-19 ॥*

*టీకా*

 స శరీరం = శరీరముతో గూడిన, ఇదం = ఈ, విశ్వం = ప్రపంచము, కించిదపి = కొంచెముగూడ, న = లేదు, చ = మ రేమనగా, ఆత్మా = ఆత్మ, శుద్ధ చిన్మాత్రః = శుద్ధచైతన్య మాత్రము, ఇతి= ఇట్లని, యదా = ఎప్పుడు, నిశ్చితం = నిశ్చయింప బడుచున్నదో, తదా = అప్పుడు, కస్మిన్ ఏ విషయమునందు, అధునా ఇప్పుడు, కల్పనా = విశ్వకల్పన? (కల్పన అనవసరమని భావము). 

*వివరణ:-*

ఈ శరీరమూ, ప్రపంచమూ కూడా మిథ్య అని నాకు నిశ్చయంగా తెలుసు. అధిష్ఠానంగా ఎప్పుడూ ఉండే ఆత్మ శుద్ధమైనది. చైతన్య స్వభావంvకలది అని కూడా తెలుసు. ఇక నేను దేనిని గురించి ఊహిస్తాను? దేనిని కోరుతాను?

*తాత్పర్యం:-*

ప్రస్తుత ఆత్మానుభవ స్థితిలో తానూ శుద్ధ చైతన్యమూ ఒకటే అని నిశ్చయంగా తెలుసుకున్నాడు జనకుడు.

శుద్ధ చిన్మాత్ర! స్వప్నం నుండి మేలుకున్న వానికి తాను మెలుకువగా ఉన్నానన్న జ్ఞానంతో పాటే అంతవరకూ తాను చూసిందంతా భ్రమ, మిథ్య అని కూడా తెలుస్తుంది. ఇదేవిధంగా ఆత్మజ్ఞానం రావడం అంటే, అహంకారమూ జగత్తూ భ్రమ అని తెలిసిందన్నమాటే.

ఉన్నది తాడే, భయంకరసర్పం కాదని నిశ్చయంగా తెలిసినవాడు ఇంకా ఆ సర్పం తన్ను వెంట తరుముతున్నదనీ హాని చేస్తుందనీ భయపడతాడా?

 ఆ భ్రాంత సర్పం కనిపిస్తున్నంత సేపే తత్సంబంధమయిన కల్పనలు ఉంటాయి. ఇదే విధంగా కల్పనా జగతిని చూస్తున్నంత సేపే కాల్పనిక సమస్యలూ ఊహాగానాలూ ఉక్కిరి బిక్కిరి చేస్తాయి.

తనకు కొత్తగా లభించిన అనుభవంతో జనకుడు 'దేనిని గురించి నేను ఊహిస్తాను? కోరుకుంటాను?' అంటున్నారు. ఆత్మజ్ఞాని ప్రపంచంలో వ్యవహరించగలడు కానీ దేనినీ ఊహించడు, కోరుకోడు.

......
 43 అష్టావక్ర గీత

అధ్యాయం - 2
ఆత్మ  - అత్యద్భుతం

శ్లోకం 20:-

శరీరం స్వర్గనరకౌ బంధమోక్షౌ భయం తథా ।
కల్పనామాత్రమేవైతత్ కిం మే కార్యం చిదాత్మనః ॥ 2-20 ॥

శరీరం స్వర్గనరకౌ బంధమోక్షౌ భయం తథా ।
కల్పనా మాత్రమేవైతత్ కిం మే కార్యం చిదాత్మనః ॥ 20 ॥

 शरीरं स्वर्गनरकौ बन्धमोक्षौ भयं तथा ।
कल्पनामात्रमेवैतत् किं मे कार्यं चिदात्मनः ॥ २-२० ॥

shareeram svarganarakau bandhamokshau bhayam tathaa ।
kalpanaamaatramevaitat kim me kaaryam chidaatmanah’ ॥ 2-20 ॥

టీకా

ఏ త్ = ఈ , శరీరం = శరీరమున్ను, స్వర్గనరకౌ = స్వర్గనరకములున్ను, బంధమోక్షా = బంధమోక్షములున్ను, తథా = ఆ ప్రకారమే, భయం = భయమున్ను, కల్పనా మాత్రమేవ = కల్పనా మాత్రమేయైయున్నది, చిదాత్మనః = చిత్స్వరూపుడనగు, మే = నాకు, (ఏతేన = దీనితో), కిం = ఏమి, కార్యం = కార్యము. 

వివరణ:-

శరీరమూ, స్వర్గనరక భావాలూ, బంధమోక్షాలూ, భయమూ ఇవన్నీ కేవలం కల్పనలే, ఊహలే, వీటన్నిటివల్లా నాకు ప్రయోజనం ఏమిటి? వీటన్నిటికి ఆధారమయిన చైతన్యమే నేను.

తాత్పర్యం:-

క్రిందటి శ్లోకంలో జ్ఞాని దేనినీ కోరవలసిన అవసరం లేదనీ దేనినీ ఊహించడనీ స్పష్టం చేసిన జనకుడు ఈ శ్లోకంలో సామాన్యంగా మతపరంగానూ వేదాంతంలోనూ సాధకుడు ఆలోచించే వాటి గురించి చెప్తున్నారు.

మనం నిజంగా ఉన్నాయనుకుంటున్న స్థూల సూక్ష్మ కారణ శరీరాలు కూడా మన ఊహాశక్తి జనితాలే, వాటి క్షేత్రాలలో అవి అనుభవాలనీ ఆందోళనలనీ ఆలోచనలనీ ఊహిస్తూ కల్పిస్తూ ఉంటాయి. ఇవన్నీ కలిసి అహంకారంగా గుర్తింప ఊహలకూ కల్పనలకూ మూలమయిన చైతన్యమే తానైనప్పుడు, ఆ స్థితిలో వీటన్నిటికీ ఉనికి ఉండదు.

వ్యావహారిక జగత్తులో వ్యవహరిస్తున్నంత సేపూ, జీవుడు, తనకు తెలిసిన అనుభవాల దృష్ట్యా ఆనందానుభవ పూర్ణమయినది స్వర్గమనీ, బాధామయమయినది నరకమని ఊహిస్తుంటాడు. తనదైన శరీరంలో తాను బంధింపబడి ఉన్నాననుకుంటాడు.

తను చూసే మనస్సునే తానుగా భావిస్తూ, కష్టసుఖాలనుభవిస్తూ వాటిని వదలించుకోవాలనో, సంపాదించాలనే తాపత్రయ పడుతూ, ఇంకా అనేక ఊహా కల్పనలను చేస్తూనే ఉంటాడు; వీటితో భయపడతాడు, బాధపడతాడు భరించ లేననుకుంటాడు. నిజానికి ఇవన్నీ మనఃకల్పితాలే.

ఈ సర్వకల్పనలకు మూలమయిన చైతన్యమే తానని తెలిసినప్పుడు వాటి గురించి ఎందుకు ఆలోచిస్తాడు? 'స్వప్నజగత్తంతా నా మనస్సులో కల్పింప బడిందని తెలి సేక ఏవిధంగా నేను దాని గురించి ఆలోచించడం మానేస్తానో అదే విధంగా, చైతన్యమే నేనని తెలుసుకొని ఈ చైతన్యంలో మిథ్యగా కనబడే శరీరాన్నీ ప్రపంచాన్నీ పూర్తిగా విస్మరిస్తాను.

ఈ ప్రపంచపు కష్టసుఖాలూ ఆకర్షణలూ నన్ను బాధించవు" అని జ్ఞాని అయిన జనకుడు అంటున్నారు. జ్ఞాని సదా శాంతంగా తన స్వస్థితిలో నిశ్చలంగా ఉంటాడు.
.........
*🧘‍♂️ 44 అష్టావక్ర గీత🧘‍♀️*

*అధ్యాయం - 2*
*ఆత్మ  - అత్యద్భుతం*

*శ్లోకం 21:-*

*అహో జనసమూహేఽపి న ద్వైతం పశ్యతో మమ |*
*అరణ్యమివ సంవృత్తం క్వ రతిం కరవాణ్యహం ॥ 2-21 ॥*

అహో! జనసమూహేఽపి న ద్వైతం పశ్యతో మమ ।
అరణ్యమివ సంవృత్తం క్వ రతిం కరవాణ్యహం ॥ 21 ॥

*अहो जनसमूहेऽपि न द्वैतं पश्यतो मम ।*
*अरण्यमिव संवृत्तं क्व रतिं करवाण्यहम् ॥ २-२१ ॥*

*aho janasamoohe’pi na dvaitam pashyato mama ।*
*aranyamiva samvri’ttam kva ratim karavaanyaham ॥ 2-21 ॥*

*టీకా*

జనసమూహే అపి = జనసమూహము మధ్యమునందును, ద్వైతం = ద్వైతమును, న పశ్యతః = చూడనటువంటి, మమ = నాకు, అరణ్యమివ = అరణ్యము వలె, సంవృత్తం = ఉన్నది (అయినది), తస్మాత్ = ఆ కారణమువలన, అహం = నేను, క్వ = ఎక్కడ, రతిం = (మోహమును)రతిని, కరవాణి = చేయగలను, అహో = ఆశ్చర్యం. 

*వివరణ:-*
అహో అద్భుతం! మహాజన సమూహ మధ్యంలో కూడా నాకు రెండవదేదీ కనిపించడం లేదు. ద్వైతభావమే లేదు. అరణ్యంలో ఉన్నట్టుగానే ఉంది. దేనిమీదనయినా నాకు కోరిక ఎలా ఉంటుంది? 

నామరూపాత్మకమయిన జగత్తంతా ఏ విధంగా మిథ్యగా ధృవపడిందో, ఏ విధంగా తాను అనంతమైన ఆత్మ చైతన్యంగా నిలచి ఉన్నాడో కిందటి శ్లోకాలలో వర్ణించారు జనకుడు.

 శరీరభావనా, మానసిక యిష్టాయిష్టాలూ, బుద్ధి తాలూకు నిశ్చయానిశ్చయాలూ, అన్నీ కూడా తనలో ప్రస్తుతం లేవు. తాను కేవలం చైతన్య రూపాన్నని తెలుసుకున్నాడు.

సహజంగా మనకొక సందేహం రావచ్చు, ఆత్మజ్ఞాని సమాజంలో తిరిగేటప్పుడు ఏమని భావిస్తాడు? ఈ సందేహాన్ని ఇక్కడ జనకులు తీరుస్తున్నారు.

మనోబుద్ధులకు మాత్రమే నానాత్వం గోచరిస్తుంది. వాటిని అధిగమించినప్పుడు నానాత్వాన్ని చూసే అహంకారి ఉండడు. తన స్వస్థితిలో నిలచిన జనకుడు అందుకే ఇలా అంటున్నారు. 'అహో అద్భుతం! ద్వైతమే లేదు"

జనసమూహ మధ్యలో ఉన్నప్పటికీ అంతటా చైతన్యమే భాసించడం చూస్తున్న జనకుడు, అరణ్యమధ్యంలో ఏకాంతంగా శాంతంగా ఎలా ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా ఉందని అంటున్నారు.

ఈ విధంగా సర్వత్రా తన ఆత్మ చైతన్యాన్నే చూస్తున్నప్పుడు, దేని మీదనయినా రాగభావం ఎలా కలుగుతుంది జ్ఞానికి? తన స్వస్థితిలో తాను ఆనందంగా ఉంటాడు, వ్యవహారాలన్నీ సహజంగా వాటంతటవే జరుగుతుంటాయి.

 45 అష్టావక్ర గీత🧘‍♀️

అధ్యాయం - 2
ఆత్మ  - అత్యద్భుతం

శ్లోకం 22:-

నాహం దేహో న మే దేహో జీవో నాహమహం హి చిత్ ।
అయమేవ హి మే బంధ ఆసీద్యా జీవితే స్పృహా ॥ 2-22 ॥

నాహం దేహో న మే దేహో జీవో నాహమహం హి చిత్ ।
అయమేవ హి మే బన్ధ ఆసీద్యా జీవితే స్పృహా ॥ 22 ॥

नाहं देहो न मे देहो जीवो नाहमहं हि चित् ।
अयमेव हि मे बन्ध आसीद्या जीविते स्पृहा ॥ २-२२ ॥

naaham deho na me deho jeevo naahamaham hi chit ।
ayameva hi me bandha aaseedyaa jeevite spri’haa ॥ 2-22 ॥

టీకా

అహం = నేను, దేహః = శరీరము, న = కాను, మే = నాకు, దేహః = దేహము,న = లేదు, అహం = నేను, జీవః = జీవుడను, న = కాను, చిత్ = జ్ఞానస్వరూపుడను (అస్మి= అగుచున్నాను), జీవితే = జీవితమునందు, యా = యే, స్పృహా = ఆశ (యనున దేది గలదో), అయమేవ = ఇదియే, మే = నాకు, బంధః = బంధము. 

వివరణ:-

నేను శరీరం కాదు, నాకు శరీరమూ లేదు. నేను జీవుడిని కాను, నేను చైతన్యాన్ని నేను జీవిస్తున్నానని జీవించాలని అనుకున్నాను-ఇదే నా నిజమైన బంధం.

వివరణ:-

జ్ఞానానుభవ స్థితుడయిన జనకుడు తన ప్రస్తుత స్థితిని, పూర్వపు స్థితిని పోల్చిచూసి చెప్పుతున్నారీశ్లోకంలో.

ఆత్మానుభవంలో తాను శరీరం కాదని తెలుసుకున్నారు. శరీరం అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలూ మనో బుద్ధులూ కలిసిన కూటమి అని ఇక్కడ అర్థం. సర్వవ్యాప్తమూ అనంతమూ అయిన చైతన్యంలో పదార్థపరమయిన పరిమితులు ఉండవు.

"నాకు శరీరమూ లేదు"--- చైతన్యంగా తన్ను తాను తెలుసుకున్న జనకుడు దేనికి సంబంధించి లేనని తెలుసుకున్నారు, అన్ని శరీరాలూ తనలో, ఎఱుకలో, చైతన్యంలోనే ఉన్నాయి,

ఏ శరీరమూ తనది కాదు. ఇటువంటి భావమే భగవద్గీత ( 7-12)లో చక్కగా ఇలా చెప్పబడింది. 'న త్వహం తేషు తే మయి" "నేను నాటిలో లేను, అని నాలో లేవు' భగవాన్ శ్రీ కృష్ణుడు ఇదే భావాన్ని ఇంకొక చోట కూడా ఇలా వ్యక్తం చేసినారు.

మయాతత మిచు సర్వం జగదవ్యక్త మూర్తినా మత్ స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః. (భగవద్గీత-9-4).
ఈ ప్రపంచమంతా నాచేత అవ్యక్తరూపంలో ఆవృతమై ఉంది. అన్ని ప్రాణులూ నాలోనే ఉన్నాయి. నేను మాత్రం వాటిలో లేను.

తాను శరీరంకాననీ, తనకు శరీరం లేదనీ జనకుడు భావిస్తున్నారు, కాబట్టి జనకునికి శారీరక అనుభవాలేవీ లేవు. ఇవి లేని కారణంగా అనుభవించే ఆహంకారమూ జీవభావమూ కూడా లేవు. అతడు కేవలం చైతన్యమే--- "అహం హి చిత్.

'చైతన్యాన్నయిన నేను చైతన్యంగా నన్ను నేను ఇప్పుడు తెలుసు కున్నాను. ఈ మధ్యకాలంలో నా బాధలకూ బంధింపబడిన భావానికి కారణం ఏమిటి" అని జనకులు ఆలోచిస్తున్నారు. జవాబుకూడా తానే చెప్పుతున్నారు.

భ్రమలో, జీవిస్తున్నాననుకున్నప్పుడు ఇంకా జీవించాలనీ, విషయభోగాలను అనుభవించాలని కోరుకోవడమే తన బంధానికి కారణమని చెప్పుతున్నారు. భ్రమ తొలగిపోగానే కోరుకునే అహంకారం నశించింది, ఆత్మ చైతన్యం స్థిరంగా నిలిచి ఉంది.

..........

46 అష్టావక్ర గీత
.........
అధ్యాయం - 2
ఆత్మ  - అత్యద్భుతం
శ్లోకం 23:-

అహో భువనకల్లోలైర్విచిత్రైర్ద్రాక్ సముత్థితం ।
మయ్యనంతమహాంభోధౌ చిత్తవాతే సముద్యతే ॥ 2-23 ॥

అహో! భువనకల్లోలైః విచిత్రైర్ద్రాక్సముత్థితమ్ ।
మయ్యనన్త మహోమమ్బోధౌ చిత్తవాతే సముద్యతే ॥ 23 ॥

अहो भुवनकल्लोलैर्विचित्रैर्द्राक् समुत्थितम् ।
मय्यनन्तमहाम्भोधौ चित्तवाते समुद्यते ॥ २-२३ ॥

aho bhuvanakallolairvichitrairdraak samutthitam ।
mayyanantamahaambhodhau chittavaate samudyate ॥ 2-23 ॥

టీకా

అనన్త మహామ్భోధా = అపారసుఖసముద్రమువలెనున్న, మయి = నాయందు, చిత్తవాతే = చిత్తమనువాయువు, సముద్యతే = వీచినదగుచుండగా, విచిత్త్రెః = విచిత్రము లైన (నానావిధములైన), భువనకల్లోలైః = ప్రపంచ సంబంధములగు తరంగముల చేత, ద్రాక్ = శీఘ్రముగా, సముత్థీతం = పుట్టుట (తరంగములుత్పన్నము లైనవని భావము.) 

వివరణ:-

ఆహా! అద్భుతం! అనంత చైతన్య సాగరమయిన నాలో మానసిక కల్లోలం నుండి అనేకానేక ప్రపంచాలనబడే తరంగాలు క్షణంలో ఉద్భవిస్తున్నాయి.

తాత్పర్యం:-

వాక్చతురత, పదలాలిత్యం, భావగంభీరతలతో నిండిన చివరి ఈ మూడు శ్లోకాలలోనూ అష్టావక్రులు తనకు ఇష్టమయిన సముద్ర ఉపమానాన్ని అర్థవంతంగా సమర్థతతో వాడుతున్నారు.

వాతావరణంలో ఉద్భవించిన పెనుగాలులతో తరంగాలు పైకి లేస్తాయి. తుఫానుగా మారతాయి, సముద్రం అల్లకల్లోలంగా కనిపిస్తుంది. ఈ పెనుగాలులు బలం తగ్గి శాంతించినప్పుడు తరంగాలు కూడా శాంతించి సముద్రంలో లయమైపోతాయి.

మనస్సు సుషుప్తిలోవలె శాంత స్థితిలో ఉన్నప్పుడల్లా ఏ దృశ్యభావాలు తెలియబడవు, మెలకువ వచ్చిన తక్షణమే, కదలిక కలగగానే,మనస్సు పనిచెయ్యడం ప్రారంభిస్తుంది.

అలజడి మొదలవుతుంది. అనేక భావాలు మనచే గుర్తింపబడతాయి. 'అనంత చైతన్య సాగరంలో నా స్వస్థితిలో - జనకులు చెప్పుతున్నారు,

 'మానసిక కల్లోలం చెలరేగినప్పుడు పెనుగాలులవంటి అలజడులూ, పర్వత సమానమయిన తరంగాలవంటి అనుభవాలూ ఉద్భవించి నాచే నాలో, భావాలుగా గుర్తింప బడతాయి' సంగ్రహంగా చెప్పాలంటే, మనస్సు శాంతస్థితిలో ఉంటే జగత్తు ఉండదు.

పరమార్థదృష్ట్యా తెలుసుకునే చైతన్యం తప్ప వేరుగా ప్రపంచం లేనేలేదు. జీవ, వస్తుమయమయిన ఈ ప్రపంచనుంతా, మానసిక కల్లోలజనిత కల్పనారూపాలే భావసారమయిన చైతన్యంలో భావాలు తెలియబడుతున్నాయి.

సత్ లక్షణంతో ఉనికి ఉన్నట్టుగా, అనిపిస్తూ, చిత్ లక్షణంతో తెలుసుకుంటున్నట్టు భావిస్తూ మనస్సు, అహంకారం, ఉనికిని సంతరించుకుంటున్నాయి.

ఆ మనస్సులోని భావాలనే మహాద్భుత సృష్టిగా చూస్తున్నామనుకుంటూనే నిజమని భ్రమపడుతున్నాం. మనస్సు శాంతించగానే భావాల కదలిక ఆగిపోయి భావసారమైన ఆత్మగా సత్ చిత్ ఆనందంగా నిశ్చలంగా నిలచిపోతుంది.

........
 47 అష్టావక్ర గీత

అధ్యాయం - 2
ఆత్మ  - అత్యద్భుతం
శ్లోకం 24:-

మయ్యనంతమహాంభోధౌ చిత్తవాతే ప్రశామ్యతి ।
అభాగ్యాజ్జీవవణిజో జగత్పోతో వినశ్వరః ॥ 2-24 ॥

మయ్యనన్త మహామ్బోధౌ చిత్తవాతే ప్రశామ్యతి ।
అభాగ్యాజ్జీవవణిజో జగత్పోతో వినశ్వరః ॥ 24 ॥

मय्यनन्तमहाम्भोधौ चित्तवाते प्रशाम्यति ।
अभाग्याज्जीववणिजो जगत्पोतो विनश्वरः ॥ २-२४ ॥

mayyanantamahaambhodhau chittavaate prashaamyati ।
abhaagyaajjeevavanijo jagatpoto vinashvarah’ ॥ 2-24 ॥

టీకా

అనన్త మహామ్భోధా = అపారసముద్రరూపుడనగు, మయి = నాయందు, చిత్త వాతే = చిత్తరూపమగు వాయువు, ప్రశామ్యతి = శాంతించినదగుచుండగా, జీవవణిజః = జీవరూపుడగు వ్యాపారి యొక్క, జగత్పోతః = జగద్రూపమైన నౌక (శరీరము), అభాగ్యాత్ = దురదృష్టమువలన, వినశ్వరః = నశించిపోయినది.

వివరణ:-

అనంత చైతన్య సాగరమయిన నాలో మనఃకల్లోలం సమపిపోయినప్పుడు, అభాగ్యుడయిన జీవవ్యాపారి యొక్క జగన్నౌక ఛిన్నాభిన్నమై మునిగిపోతుంది.
తాత్పర్యం:-

సొందర్యభరితమైన సముద్ర ఉపమానాన్ని కొనసాగిస్తూ జనకుడు "మానసిక కల్లోలాలనబడే తుఫానులు అణగిపోగానే ప్రపంచం అనబడే నావకూడా మునిగిపోయి అదృశ్యం అయిపోతుంది. ఆత్మే మిగిలి ఉంటుంది" అంటున్నారు. 

అద్భుత కవితా కల్పనా చాతుర్యంతో జీవుని వ్యాపారితో పోలుస్తున్నారు. జీవుడు తన నాన అయిన దేహంతో ఈ జగత్సంసార సాగరంలో అనేకచోట్ల ఆగుతూ వ్యాపార సంబంధాలు పెంచుకుంటూ అనుభవాలు సంపాదిస్తూ ఆకర్షణల నభివృద్ధి చేసుకుంటూ రాగద్వేషాలను అనంతంగా ప్రోగుచేసుకుంటూ వాసనారూపంలో అనంత ధనరాశిని ప్రారబ్ధ ఆగామి సంచితాలనబడే కర్మలలో నిలవచేసుకుని జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తున్నాడు.

మనస్సు శాంతస్థితిని నొందినప్పుడు ఈ జీవ జగద్భావాలు చైతన్యసాగరంలో లయం అయిపోతున్నాయి. అపారమయిన అనంత చైతన్యసాగరం కల్లోలరహితంగా శాంతంగా స్థిరంగా మిగిలిపోతుంది.

>>>>>

*🧘‍♂️ 48 అష్టావక్ర గీత🧘‍♀️*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩

*అధ్యాయం - 2*
*ఆత్మ  - అత్యద్భుతం*

*శ్లోకం 25:-*

*మయ్యనంతమహాంభోధావాశ్చర్యం జీవవీచయః ।*
*ఉద్యంతి ఘ్నంతి ఖేలంతి ప్రవిశంతి స్వభావతః ॥ 2-25 ॥*

మయ్యనన్త మహామ్బోధావాశ్చర్యం జీవ వీచయః ।
ఉద్యన్తిఘ్నన్తి ఖేలన్తీ ప్రవిశన్తి స్వభావతః ॥ 2-25 ॥


*मय्यनन्तमहाम्भोधावाश्चर्यं जीववीचयः ।*
*उद्यन्ति घ्नन्ति खेलन्ति प्रविशन्ति स्वभावतः ॥ २-२५ ॥*


*mayyanantamahaambhodhaavaashcharyam jeevaveechayah’ ।*
*udyanti ghnanti khelanti pravishanti svabhaavatah’ ॥ 2-25 ॥*

*టీకా*

అనన్తమహామ్భోధా = అపారమహాసముద్ర రూపుడనైన, మయి = నాయందు, జీవవీచయః జీవులను తరంగములు, ఉద్యన్తి = లేచుచున్నవి, ఘ్నని = 'కదానితో నొకటి ఒరుచుకొనుచున్నవి, ఖేలన్తి = ఆడుకొనుచున్నవి, స్వభావతః = స్వభావము గానే, ప్రవిశనీ = లయించుచున్నవి. 

*వివరణ:-*

ఆశ్చర్యకరం! అద్భుతం! నాలో, అనంత చైతన్యసాగరంలో, జీవులంతా తరంగాలవలె ఉద్భవిస్తూ, చరిస్తూ, నర్తిస్తూ, కొంతకాలమునకు కాలగర్భంలో కలసి పోతున్నారు.

*తాత్పర్యం:-*

ఈ పుస్తకాన్ని చదవడం ఆపేసినా, మానేసినా, కూడా చాలా కాలం వరకూ ఈ అధ్యాయానికి చివరిదైన ఈ శ్లోకం యొక్క భావగాంభీర్యమూ కవితా సౌందర్యమూ సాధకుని వెన్నాడుతూనే ఉంటుంది.


శుద్ధచైతన్యమయిన నాలోనుండి జడమయిన ప్రపంచాలేకాక అందులోని సర్వప్రాణులూ జీవకోటి కూడా ఉద్భవిస్తున్నాయి. మన స్వప్నంలో దీనిని స్పష్టంగా చూడగలం.


 మెలకువ రాగానే మనః కల్పితమయిన స్వప్న జగత్తంతా జాగ్రదవస్థలోని మనస్సులో లయం అయిపోవడం మనందరికీ నిత్యమూ అనుభవమే.


స్వప్నంలోవలెనే జీవులు ఉద్భవించి, కష్టసాధ్యమయినా తమ ఉనికిని సుస్థిరం చేసుకునే ప్రయత్నం చేస్తూ, అనుభవాలను అనుభవిస్తూ, రాగద్వేషాలను పెంచుకుంటూ, వాసనలను పోగు చేసుకుంటూ చనిపోతున్నారు-


మరల మరొక తరంగంలా ఉద్భవించడానికి! మనస్సు శాంతస్థితిలో ఉంటే మనస్సుచే గుర్తింపబడే ! సర్వనామరూపాలూ, తమ నామరూపాలను విడనాడి చైతన్యంగా ఉండిపోతాయి.


 కదలిక ఉన్న నీరు తరంగం అనే నామం రూపంతో గుర్తింపబడి, కదలిక ఆగిపోగానే నిశ్చలంగా నీరుగా ఉన్నట్టే.

2వ అధ్యాయం సమాప్తం.

.......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి