ప్రాంజలి ప్రభ - ఓం శ్రీరామ - శ్రీమాత్రేనమ:
సీస పద్యములు - సౌందర్య లహరి - (21 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
సీస పద్యాలు
సూర్యచంద్రుల వలె --సర్వవ్యాప్తి వెలుగు
తామర పువ్వుల -- తళుకు మెఱుపు
పద్మాల రేకులు -- పుడమిన విప్పారే
మేనితో వెలుగొందు -- మోహ కాంతి
భవదీయ కళలను --- మాయయు మొహమై
మనసుకు విపరీత -- మాయ చేరు
మహనీయ లందరు --- ఆనంద లహరిలో
ఓల లాడుచురమ్మ -- ఓర్పు తోను
తేటగీతి
అమ్మ కనులప్రేమ ఇపుడు ఆశ పెంచు
పిల్ల పాపలు ప్రీతిని పలక రింపు
ఇంటి దీపము వెలుగులు ఈశ్వరేశ్చ
అమ్మ ఆనంద ముందరి అభయ మొవ్వు
--(())--
ప్రాంజలి ప్రభ - ఓం శ్రీరామ - శ్రీమాత్రేనమ:
సీస పద్యములు -
తారక రాముని -- తెలిపేది మనసు
కోర్కల పుట్టయు -- కరగ గుండు
భజియించు దాసాను బద్ధుడై ఉన్నాను
నాపైన దయజూపు నయన రామ
నీపాద సాయుధ్య నియమాల ముక్తిగా
క్షణమున క్షణరక్ష కొరకు రామ
ఎన్నెన్నొ జబ్బులు నన్నువేధించినన్
మనసున నమ్మిన మేలు తెలిపె
తేట గీత
కనుము నేనిపుడే వేడు కొనుచు ఉన్న
నన్ను నీపాద సేవ అనుమతి ఇవ్వు
సర్వ ము ను నీకు తెల్పుచు సంబరమ్ము
పంజలిఘటించి వేడుక పలుక లిచ్చె
--(())--..
............. ............... ............ప్రాంజలి ప్రభ - ఓం శ్రీరామ - శ్రీమాత్రేనమ:
సీస పద్యములు - సౌందర్య లహరి - (23 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మెరుపుల మేనితో అరుణ కాంతి
మూడుకన్నుల గల శిగపైన మకుటము
నెలవంక ధరియించి యున్న మాత
వక్షోజ భారము తోవంగే తనువంతా
నీదివ్య దేహము శివునికిచ్చి
వలచియు వామభా గముపొంది వినయంతొ
శేషార్ధమునుగూడ అపహ రించె
ఆటవెలది
దర్శ నమ్ము యిచ్చి దక్షిణంగాన్ని పొంది
ఊహ లోన నిలిచె గౌరి దేవి
సంది యమ్ము లన్ని తీర్చియు సంతస
మంత సకల నరుల రక్ష చేయు
--(())--
ప్రాంజలి ప్రభ - ఓం శ్రీరామ - శ్రీమాత్రేనమ:
సీస పద్యములు - సౌందర్య లహరి - (24 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
సీస పద్యములు - సౌందర్య లహరి - (24 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఓ పరమేశ్వరి హరి హర హిరణ్య
గర్భులు సృష్టి స్థితులను చూపి
లోకాల పోషించుచున్నాడు రుద్రుండు
తనలోన లీనమ్ము చేసి కొనియు
ఈశ్వరా ఈశ్వరి కనుబొమలు కదలి
క్షణమట్లు నదియేను ఆజ్ఞ నెంచి
సృష్ట్యాది కార్యాలు జరిపించు చున్నాడు
శంభుడు సమముగా చేయు చుండె
తేటగీత
శంకరుడు నాల్గు తత్వాలు తెల్పు చుండె
అమ్మ కదలకి శివునకు సహకరించు
గౌరి శంకర్లు సృష్ట్యాది కార్యు లయ్యె
రుద్ర డెపుట్టుక గిట్టుట సరిగ చేయు
--(())-- ..... ..... ....
ప్రాంజలి ప్రభ - ఓం శ్రీరామ - శ్రీమాత్రేనమ:
సీస పద్యములు - సౌందర్య లహరి - (25 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
సీస పద్యములు - సౌందర్య లహరి - (25 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
లోగల త్రిగుణముల్ నుండి పుట్టె
బ్రహ్మాండ నాయకీ త్రిమూర్తులకు మూల
మై యుండ నీపాద ములను నెవరు
పూజించు టవలన ఆమువ్వురికి కూడ
నవరత్న ఖచితమగు మణి మయము
భవదీయ పాదపీఠ సన్నిధి మ్రొక్కుచు
వారెల్ల వేళల యందు తల్లి
ఆటవెలది
బ్రహ్మ హరియు శంక రుడు నీ త్రి గుణముల
నుండి పుట్టె పాద పూజ చేసె
విశ్వ శాంతి గోరు సఫల మనో రధుల్
ఆత్మ సుద్ధి పెంచు భద్ర కాళి
--(())--
సీస పద్యములు - సౌందర్య లహరి - (26 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
లయముచెందును తాను పంచ భూత
ములయందు కలసియు విష్ణువు కనుమాయ
కాలండు నాశనము ఆయిపోవు
ధనదుండు ధీనుడై ప్రాభవమును వీడు
ఇంద్రాదు లు మనుఁవు లందరున్ను
నాశన మైనను నీ పతి దేవుడు
హరుడొక్క డే యాడు హాస్యముగను
తేటగీత
భువని సకలమ్ము చరితమ్ము కలిగి యుండి
వినయ విధిరాత అనుకోని సర్వ మాయ
అమ్మ దయయని భావించి విశ్వ మంత
ఈశ్వరడె శక్తి యునిలిపి కాల మేలు
--(())--
ప్రాంజలి ప్రభ - ఓం శ్రీరామ - శ్రీమాత్రేనమ:
సీస పద్యములు - సౌందర్య లహరి - (27 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
సలుపు పనులు అన్ని సంత రించి
పూజకు పువ్వులుగా నాగమన మంత
నీప్రద క్షణముగ చేయు చుంటి
నాదు ఆహారము నీదుఆహుతి విధీ
నాశయ న క్రియ లెల్ల నీప్ర
ణతులుగు సుఖవిలా సములన్ని
పరిచర్య లగునీకు తెలివి నివ్వు
అమ్మ పూజ లన్ని చేసితి నీకునూ
భాగ్య మివ్వు అన్ని వేళ లందు
సర్వ సుఖము నీకు ఆత్మార్పణ మొనర్తు
జ్ఞాన గుణము శక్తి నివ్వు తల్లి
--(())--....................... ౨౭
ప్రాంజలి ప్రభ - ఓం శ్రీరామ - శ్రీమాత్రేనమ:
సీస పద్యములు - సౌందర్య లహరి - (28 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
వార్ధక్యమును మృత్యువుని దరి రానీని
అమృతము గ్రోలియు బ్రహ్మ విష్ణు
సర్వదే వతులు సు రులును ప్రళయమందు
మరణించు చున్నారు అమ్మ చలవ
గరళము త్రావిన శివునికి మాత్రము
మరణ భయము లేక సంచ రించు
దివ్యము కలిగిన చెవికమ్ము లమహిమ
అపమృత్యు వారిణీ నీవు మాత
ఆటవెలది
నీకు శక్తి ఇదియు అనునది అనలేను
సర్వ మంత నీది అడ్డు లేదు
నిన్నే మోము కొలుచు చున్నాము అమ్మగా
శివుని వల్లె మాకు రక్ష సల్పు
__(())-- .... 28
ప్రాంజలి ప్రభ - ఓం శ్రీరామ - శ్రీమాత్రేనమ:
సీస పద్యములు - సౌందర్య లహరి - (29 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
నీమంది రమునకు ఈశ్వరుడు డెతెంచు
సమయము స్వాగత ములను బలుక
అతి శీఘ్రముగ లేచి నీవేగు చుండగా
పరివార జనులిట్లు బలుకు చుండె
పాదాలకు ప్రణమిల్లు చున్నను తప్పుకో
బ్రహ్మాది దేవతలు నిను కోరి
బ్రహ్మమకుటమ్మిది పరిహరింపుము దీని
విష్ణుని మకుటము జార్చె దవును
తేటగీత
ఇంద్ర మకుటము అనిపల్కె సహచరులను
విజయ నాదముల ప్రబలము మారు పలికె
తల్లి జాగ్రత్త గారమ్ము మనసు లోకి
విధియు అంతయు ఆడుట నీక రుణయె
--(())-- ...... ౨౯
ప్రాంజలి ప్రభ - ఓం శ్రీరామ - శ్రీమాత్రేనమ:
సీస పద్యములు - సౌందర్య లహరి - (30 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఆద్యంతములు లేని ఆనంద మయి వమ్మ
అణిమాదులొ అష్ట సిద్ధు లన్ని
ప్రసరించు నీదివ్య రూపము లన్నిట్టి
ధ్యానించు చున్నట్టి భక్తులకును
నీపైన భక్తిక లిగినట్టి వారికి
ఈశ్వర విభవము పొందగలుగు
ఈశ్వర ఐశ్వర్య మంతయు ప్రళయమ్ము
లోపుట్టి పెరిగిన అగ్ని జ్వాల
నిత్య అఖిలాండ నాయకీ పూజ సల్పి
సాధ కునకెపు డుమనసు శాంతి సల్పి
జ్వాల నీరాజనముగాను చేసె భక్తి
నిర్వి మాశ్చ ర్య భక్తితో ప్రేమ పంచు
--(())-- ...... ..... 30
ప్రాంజలి ప్రభ - ఓం శ్రీరామ - శ్రీమాత్రేనమ:
సీస పద్యములు - సౌందర్య లహరి - (31 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
వివిధ సిద్ధులను గూర్చు అరవై నాలుగు
తంత్రాలు సంధించు జగతి నంత
మోహింప గను జేసె పరమేశ్వ రుడు సర్వ
పురుషార్థ ములసృష్టి సమము చేసి
విధిలేక మిన్నకుండిన శివ నీతీవ్ర
కాంక్షనే శ్రీవిద్య నీదు శక్తి
పుడమిపై అవతరింపగ జేసె పార్వతి
పరమేశ్వరుడు మిత్ర పలుకు వోలె
ఆటవెలది
పృథ్వి పైన చెలిమి ధనము ధాన్యము
వ్యాప్తి పరచి ఘనము దినము తీర్చి
దిద్ది సర్వ సమము చేసె ఈశ్వర శక్తి
సకల లోకములలొ కరుణ జూపె
--(())--
ప్రాంజలి ప్రభ - ఓం శ్రీరామ - శ్రీమాత్రేనమ:
సీస పద్యములు - సౌందర్య లహరి - (32 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మంగళ ప్రదమైన శివశక్తి ప్రచ్యుమ్న
క్షితి కూట ము " క" వర్ణ మొకటి గాను
"ఏ" వర్ణ శక్తిని భోదపరిచియు. ఈ
వర్ణము కామాన్ని వ్యక్త పరిచి,
పృథ్విని చే కూర్చేటి " ల" వర్ణ మూ తేజ
స్సుతొ కూడిన " హ" వర్ణ తెలియపరచి
శీతలత్వమును చెకూర్చు "స" వర్ణ
సూర్యబో ధితము " హ " వర్ణ మున్ను
తేటగీతి
పంచ సాయకా హరిబృంద మొకటి గాను
ఈత్రి కూటా0త మున* హ్రీ౦" గళమును గలుప
నవియె అవయవములుగాను మంత్రం శక్తి
పంచ దశవర్ణ చిత్కళా రూపి వమ్మ
--(())--..... ,,... 32
ప్రాంజలి ప్రభ - ఓం శ్రీరామ - శ్రీమాత్రేనమ:
సీస పద్యములు - సౌందర్య లహరి - (33 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
అంబికా దేవి నీ మంత్రమ్ము నకు ముందు
కామ యోనీ రమా బీజములుగ
హ్రీ0కార ఓంకార శ్రీకార ములుజేర్చి
చింతా మణుల అక్షమాల బట్టి
యు, శివాగ్ని లోనను కామధే నువు ఘృత
ధారలన్ హోమమ్ము లన్ని జేసి
నినువేడు కొనెటి వారి మనసు భోగర
సికతను పొందియు సుఖము గుండు
ఆటవెలది
అమ్మ నీరసికత వర్ణించు శక్తి లేదు
నిన్ను చేరి భోగ లాల సమ్ము
కొరకు హోమములను చేసెను బతుకుట
కొరకు ఏమి లోక మాయ తల్లి
--(())--
ప్రాంజలి ప్రభ - ఓం శ్రీరామ - శ్రీమాత్రేనమ:
సీస పద్యములు - సౌందర్య లహరి - (34 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఓ దేవి భగవతీ రవిచంద్ర పాలిండ్లు
గలనీవు పరమేశ్వ రునిలొ కలసె
దేహము ఆకారణము చేత పరమ పా
వనమగు రూపాన్ని కొలుచు చున్న
కావున సమరసుల పరమ ఆనంద
దివ్యస్వరూపులు అయిన మిమ్ము
ప్రార్ధించు చుంటిని శేషశేషీ భావ
సంబంధమే మీది లొక్కటేను
తేటగీతి
సూర్య చంద్ర వక్షొ జములచే మమ్మును
సర్వ లోకము లను శివ శక్తి పంచి
భార్య భర్తల సంబంధ మంత సుఖము
అనియు కాపాడె ఆత్మయే జనని శక్తి
--(())--
ప్రాంజలి ప్రభ - ఓం శ్రీరామ - శ్రీమాత్రేనమ:
సీస పద్యములు - సౌందర్య లహరి - (35 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
అమ్మలు కన్నమ్మవు మము చల్లగ చూచు
హృద యతత్వమునీవు, అంబరమ్ము
అధినేత్రి, గాలి అగ్నియు నీరు ఈ భూమి
యును నీవె, కరుణామ యివును నీవు,
పంచభూతాలుగా పరిణమిం తువునీవు,
వేరేమియును లేని జగతి నీవు,
విశ్వమంతా నీవు వ్యాపించి ఉన్నావు
చిన్ముదాకారము లోన ఉండు.
ఆటవెలది
భావ స్వేఛ్ఛ మరియు భావణాస్వేఛ్ఛయు
వ్యక్తి మనసు స్వేచ్ఛ వ్యక్తి స్వేచ్ఛ
సమతా మమత శాంతి సర్వుల ఆకాంక్ష
అమ్మ ఆశ యంత ధర్మ నీతి
--(())--
ప్రాంజలి ప్రభ - ఓం శ్రీరామ - శ్రీమాత్రేనమ:
సీస పద్యములు - సౌందర్య లహరి - (36 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
నీ మనసు లో నుండి నీలోనే సగమౌచు
నిన్నె ఆ రాధిస్తూ నె ఉన్న
కోటి దినకర తేజముతోను వెలుగుల
చైతన్య శీలునికి పర శంభు
నకు నాదు వందనములను తెలిపుచుంటి
ఆశివ నామమే మాకు రక్ష
నినుపూజ చేసిన సూర్యచంద్రాగ్నులన్
మించి వెలుగులను పంచు తల్లి
కాల మాయ కమ్మి ఉండెను అంతటా
ఏమి చేయ లేక నిన్ను చేరి
నీదు జపము చేయు చుంటిని ఇప్పుడే
తప్పు లున్న ఒప్పు చేయు తల్లి
--(())-- ..... ...... 36
ప్రాంజలి ప్రభ - ఓం శ్రీరామ - శ్రీమాత్రేనమ:
సీస పద్యములు - సౌందర్య లహరి - (37 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
పరమేశ్వరీ నీ విశుద్ధ చక్రము నందు
శుద్ధ స్ఫటిక సదృ శముగ వెలుగు
స్వచ్ఛమైనట్టి ఆ వ్యోమ జనకుడగు
చంద్రశేకరునితో సుఖము పొందు
సరితూగు దేవేరి వైనట్టి నిన్నుపా
సించెద నిరతమ్ము భక్తి తోను
మీ యిరువురి చంద్ర కిరణాల వెలుగులు
అంధకారము దూర మవ్వు చుండు
ఆచకోరము లట్లునె లోక మంత
కారు చీకట్లు తరిమియు వెలుగు పంచు
ఇద్ద రేకము తేజస్సు సర్వ మయము
లోక సంతృప్తి పరిచేటి ఈశ్వరమ్మ
--(())--
ప్రాంజలి ప్రభ - ఓం శ్రీరామ - శ్రీమాత్రేనమ:
సీస పద్యములు - సౌందర్య లహరి - (38 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
పరమేశ్వరీ హృద్యమ్మున విక సిత మైన
జ్ఞాన కమలము లోన మకరంద
మును పొందు నాశక్తి మహనీయ హృదయమ్ము
నందున విహరించె రసికులైరి
పాలనుండి జలమ్ము వేరుచేసినయట్లు
దోసముల దొలఁగించి గుణము లన్ని
గ్రహియించి తమ వాక్సుధలచేత సకల వి
ద్యలయందు పరిణతిని గలిగించు
తేటగీతి
అమ్మ పరిణత చెందేటి మార్గమివ్వు
పాలు జలమును వేరుచే సేటి గుణము
నిచ్చి దోసములు తొలగించి తృప్తి నిచ్చి
వాక్సుధలచేత సకలము రక్ష చేయు
--(())--
ప్రాంజలి ప్రభ - ఓం శ్రీరామ - శ్రీమాత్రేనమ:
సీస పద్యములు - సౌందర్య లహరి - (39 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఓయమ్మ నీదు స్వాదిష్టాన చక్రము
లో అగ్ని తత్వమ్ము తోన తేజ
రిల్లు సంవర్తుడు కాలాగ్ని రుద్రుండు
తనకోప దృష్టిచే ప్రళయమును సృ
ష్టించి లోకాల్ని దగ్ధపరిచిన, కరుణా
ర్ధ హృదయ చల్లఁన చూపులన్ని
నరులపై ప్రసరింప జేసియు సమయవై
ముందుండి ఉపచారములను చేయు
తేటగీతి
అమ్మవియునెల్ల నాహృదయంబు నందు
సర్వ కాలంబు మెలఁగుచు స్వస్తి గూర్చి
మాకు శుభములు జేకూరు గాకయంచు
బ్రార్ధనము సేతు శ్రీమాత భక్తి తోడ
--(())--
ప్రాంజలి ప్రభ - ఓం శ్రీరామ - శ్రీమాత్రేనమ:
సీస పద్యములు - సౌందర్య లహరి - (40 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
సీస పద్యములు - సౌందర్య లహరి - (40 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
అమ్మ ఈ మణిపూర చక్రమ్ము మూలమై
వెలుగొందు నీ నాభి లోన ఉన్న
చీకట్లు పోగొట్టి మెరుపు తీగల బోలు
వేయి రకముల రత్నాలుగ విల
సిల్లిన హరివిళ్లు వెలయంగ ధరి ఇంచు
భాస్కరు డై శివ వెలుగు పంచు
లోకాలపై మేఘములవర్ష ము కురిపించు
సూర్యాగ్ని సంతృప్తి చల్ల బరుచు
మంద బుద్దు లరసి యందుకోలేరు నీ
శ్రీ విలాస మహిమ చిత్ర మౌర
ముందు కాంతి నొసగి ముదము చేకూర్చెను
నీదు మహిమ తెలియ రాదు తల్లి
--(())-- .... ౪౦
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి