అన్నమయ్య సంకీర్తన
ఇతరములన్నియు నడమంత్రములే యెంచిచూచినను యింతాను
హితవగుబంధువుడు ఈశ్వరుడొక్కడే ఈతనిమరువకుమీ జీవాత్మ ||
భవకూపంబుల బడలెడినాడు పాయని బంధువుడు ఇతడొకడే
దివిస్వర్గంబున తేలెడినాడు తిరుగబాయకెపు డితడొకడే
నవనరకంబుల నలగెడినాదు నటనల బాయడితడొకడే
యివలనవల హృదయేశుడు విష్ణుడు ఈతని మరువకుమీ జీవాత్మా ||
పశుమృగాదుల వొడలెత్తినప్పుడు పాయని బందుగు డితడొకడే
విశదపు దుఃఖపువేళలనైనా విడువని బంధువుడితడొకడే
శిశువైనప్పుడు వృద్ధైనప్పుడు చిత్తపుబందుగుడితడొకడే
దశావతారపు విష్ణుడొక్కడే ఈతని తలచుమీ జీవాత్మా ||
భావజకేలిని జొక్కినప్పుడును ప్రాణబంధువుడు ఇతడొకడే
యీవల నావల యిహపరములలో నిన్నిటి బంధువుడితడొకడే
దైవము తానని శరణనీయెడు నను దగ్గరికాచెను ఇతడొకడే
శ్రీవేంకటగిరి నాయకుడితడే చేరి భజించుము జీవాత్మా ||
🕉🌞🌎🌙🌟🚩
*134. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు*
*ॐॐॐॐॐॐॐॐॐॐ*
సప్తమ ప్రపాఠకం ప్రధమ ఖండం:
ఈ అధ్యాయం లో నారదుడు సనత్కుమారుని దగ్గరకు వచ్చి తనకు బ్రహ్మవిద్యా జ్ఞానాన్ని అర్ధిస్తాడు.
పరమ పవిత్రులు, సత్త్వగరిష్ఠులు, ధీరోజనోత్తములు అయిన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు అనే నలుగురు మహామునులు బ్రహ్మ యొక్క మానసం నుండి జన్మించారు.
అమృతత్వపు ఆలోచనలను పుణికి పుచ్చుకొని పుట్టిన ఈ నలుగురు శుద్ధ మనస్కులై నిరంతరం దైవ చింతనమే ధ్యేయంగా ఉండేవారు.
వారిని ఉద్దేశించి బ్రహ్మ సృష్టికార్యం లో తనకు తోడ్పడమని అడుగగా, వారు తిరస్కరిస్తూ “అపురూపమైన బ్రహ్మమయ భావంతో నీవు మమ్ములను సృష్టించావు. అందుచేత మాకు ధ్యానము మీద తప్ప ఇతర విషయాలమీద ధ్యాస మళ్ళదు. భగవద్భక్తినే మేము రూపము గా దాల్చి ఉన్నాము.
మేము జనోలోకం లో కామరూపులమై ఉంటూ అవసరమని పించినప్పుడు సహాయం చేస్తాము” అన్నారు. నివృత్తి మార్గానికి ఈ నలుగురిని మూలపురుషులు అని చెప్పాలి. వీరు చూడడానికి అయిదేళ్ళ బాలురవలె కనిపిస్తారు.
నారదుడు కూడా బ్రహ్మ మానస పుత్రుడే. ఈ నలుగురిలో సనత్కుమారుని సమీపించి తనకు జ్ఞానోపదేశం చేయమని ప్రార్ధించాడు.
సనత్కుమారుడు నారదుడితో నీకు తెలిసినదంతా చెబితే అప్పుడు జ్ఞానోపదేశం చేస్తాను అన్నాడు.
అప్పుడు నారదుడు, “భగవన్! ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఐదవ వేదమని చెప్పబడే ఇతిహాస పురాణములు, మరియు వ్యాకరణము, శ్రాద్థకల్పము, గణిత శాస్త్రము, సిద్ధాంతము, మహాకాలాది ధూమకేతీత్పాతములను చెప్పు శాస్త్రము, తర్కము, ఏకాయనము (నీతి శాస్త్రము), దేవ విద్య, నిరుక్తము, బ్రహ్మ విద్య, శిక్షాకల్పాదులు, భూతవిద్య, ధనుర్వేదము, జ్యోతిషం,సర్పవిద్య, నృత్యగీతాది లలిత కళలు మున్నగు విద్యలన్నీ నాకు తెలుసు.” అన్నాడు.
తిరిగి
“మహాత్మా! నేను మంత్రవేత్తగానే ఉన్నాను. ఆత్మవేత్తను కాలేదు. ఒక్క ఆత్మ వేత్తయే శోకమునుండి బయటపడి ముక్తుడౌతాడని విన్నాను. నేను శోకములోఉన్నాను. నన్ను శోకసముద్రం నుంచి దరిజేర్చమని నా ప్రార్ధన.” అని నారదుడు సనత్కుమారుని ప్రార్ధించాడు.
నీవు చదివిన చదువులన్నీ భౌతికమైనవి మాత్రమే. కనుక నామము లో బ్రహ్మ బుద్ధి నుంచి ఈ నామమును బ్రహ్మము గా ఉపాసన చేయి.
నామము బ్రహ్మమని ఉపాసించేవాడు నామ విషయమైన జ్ఞానము పొంది దానిలో యథేచ్ఛగా విహరిస్తూ నామమెంత వరకూ వ్యాపించి ఉందో అంతవరకూ వ్యాప్తి కలిగినవాడై పూర్ణ ఫలితాన్ని పొందుతాడు.
దానికి నారదుడు, “భగవన్! నామము కన్నా గొప్పదైన జ్ఞానం ఉందా” అని అడుగగా
సనత్కుమారుడు “దాని కంటే గొప్పది వాక్కు ఉంది” అన్నాడు.
🕉🌞🌎
కరోనాలో ఉపిరిపోసుకోని ఏమి చిత్రములు
నాడు కుబేరులే నేడు జీరోలు హీరోలు
చేతకాక ఉన్న చేయలేక దేశీ, పరదేశీయులు
కరోనాతో నటులకు అంతా డబ్బింగులు
అర్దాలులేని, సాహిత్యములేని గీతాలు
చెవిపోటు తో హోరెత్తే సంగీత శబ్దాలు
ఉపయోగంలేని, కానరాని సందేశాలు
నోటితో సెహెప్పలేని ద్వందార్ధములు
హీరోలే గుర్తులేని గాలిలో పోట్లాటాలు
ఉర్రుతలూగించే చిన్నపిల్లల ప్రేమలు
నోరువిప్పని పెద్దలకు తప్పఁని భాధలు
వద్దనకు గత్యంతరం లేనట్టి స్థితిగతులు
గొప్పకోసం దండగ మారి ఖర్చులు
ప్రత్యేకత కోసం భయానక దృశ్యాలు
యువకుల ఆకర్షణ అసభ్య నృత్యాలు
పచ్చి బూతుల తాగుబోతు దుర్భాలు
కళ్లవెంట నీళ్లు రాని కుళ్లిపోయిన నవ్వులు
కాకుల అరుపులు కమ్మని కవిత్వ పాటలు
పికమ్ముల కఠోర అర్ధంలేని పిచ్చ మాటలు
అన్నీ విచిత్రములు చెప్పుకునే చిత్రాలు
చిత్ర విచిత్రాలు చూసేది నేత్రాలు
ఇప్పుడు నోరుఎత్తలేని పరిస్థితులు
అందుకే మూగ పోయిన చిత్రాలు
కుబేరులు గరీబులైన చిత్రాలు
--(())--
కామెం
పంజలి ప్రభ అంతర్జాల పత్రిక కధలు ... 23
ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక
రచయత" శ్రీదేవి రామకృష్ణ మల్లాప్రగడ
నేటి కవిత ..... వేరు
జీవమ్ ఒక్కటే - జీవితమ్ వేరు
రూపమ్ ఒక్కటే - గుణం వేరు
కాలం ఒక్కటే - గమ్యం వేరు
వనం ఒక్కటే - ఔషదాలు వేరు..... .... ..
ఆశ ఒక్కటే - ఆశయం వేరు
ఆకలి ఒక్కటే - రుచులు వేరు
ఆరాటం ఒక్కటే - ఆదరణ వేరు
కలం ఒక్కటే - కావ్యాలు వేరు .... ... ...
కత్తి ఒక్కటే - ఉపయోగం వేరు
ఖంఠం ఒక్కటే - గాత్రాలు వేరు
భాష ఒక్కటే - భావాలు వేరు
బంధం ఒక్కటే - బాధ్యతలు వేరు ..... ..
తపస్సు ఒక్కటే - కోరిక వేరు
తేజస్సు ఒక్కటే - విస్తరణ వేరు
బలం ఒక్కటే - ఉపయోగం వేరు
మనస్సు ఒక్కటే - ఆలోచన వేరు .... ....
తరుణం ఒక్కటే - తమకం వేరు
చరణం ఒక్కటే - చరిత్ర వేరు
ప్రయాణం ఒక్కటే - దూరాలు వేరు
ప్రాణం ఒక్కటే - మరణం వేరు .... ....
నవ్వులు ఒక్కటే - ఫలితం వేరు
ఏడుపు ఒక్కటే -- రోగాలు వేరు
తుమ్ములు ఒక్కటే -- కష్టాలు వేరు
తుమ్ములు ఒక్కటే -- ఫలితాలు వేరు
--((*))--
అంతర్జాల పత్రిక - ఛందస్సు ప్రభ
నందా - త/య/స/భ/స/గ UUII UUII - UUII IIUU
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
గోపాలుని ఆరాధన - తృప్తే సమయము అంతా
సంతృప్తియు కల్గేనులె - భావామృతమును పొందే
మాకే సహనమ్మే కలి గించే విధ మును చూపూ
కాలాన్ని సమానమ్ముగ - చూసే విదముగ కృష్ణా
ఆనందపు టాకాశము - నందుంటిని వెలుఁగై నే
కాలాన్ని స సంపోషణ - చీకట్లను తరిమేలే
నానందపు టంభోనిధి - యందుంటిని మణియై నే
శ్రీకారము సంమోహము - సౌందర్యము సహామాయే
నానందపు టారామము - నందుంటిని విరియై నే
లాలిత్వపు కారుణ్యము - లావణ్యపు లయమేలే
నానందపు టాకారము - నందుంటిని లలియై నేన్
సాకారము సాధుత్వము - సందేహపు సహనమ్మే
నీవే గద నా పున్నెము - నీవెగద సిరి లాలీ
నీవే గద నా శక్తికి - నీవె గద మది హా ఈ
నీవేగద నా తారక - నీవేగద శశి లాలీ
నీవే గద నా మానసి - నీవేగద చిరుహాసి
నీవేగద నా డెందము - నీవేగద లలి లాలీ
వివేగద నా పందెము - నీవేగద సుమ మాలి
నీవేగద నా సర్వము - నీవెగద వనమాలీ
నీవే గద నా గానము - నీవెగద వనవాసి
ఏమో మది నీకై యిట - నిట్టుల్ బ్రియ తలపోసెన్
కాదే ఇది సవై నది - అట్టు ల్ క్రియ తలపోసిన్
ఏమో హృది నీకై యిట - నిట్టుల్ బ్రియ చలియించెన్
బ్రేమమ్మన నిట్లుండునె - ప్రీతించఁగ నిటులౌనే
రా ముందుగ నా మానస - రాసమ్మున నటియించన్
--(())--
గజల్ 2504.
ఏం వ్రాసినా అదేంటో ప్రేమలేఖే అవుతోంది..!
ఏం పాడినా అదేంటో విరహగీతే అవుతోంది..!
దిక్కుతోచని పరిస్థితే..అందంగా నడిపిస్తుంది..
ఏం త్రాగినా అదేంటో ఓ మధువే అవుతోంది..!
నా బావే నాకు సర్వస్వం..హాయిగా ఉంటుంది..
ఏం తాకినా అదేంటో ఈశ్వరమే అవుతోంది..!
లేమిని మించిన సంపదేమి ఉంది దోచలేనిది..
ఏం పట్టినా అదేంటో బంగారమే అవుతోంది..!
దాచుకోను మరేదో దొరకటంలేదు ఏమైందో..
ఏం అందిన అదేంటో మాయమే అవుతోంది..!
మాధవుడా ఎవర్రా నీ సొద వినాల్సి ఉందింకా..
ఏం చెప్పినా అదేంటో మౌనమే అవుతోంది..!
మూడవ ఉదాహరణమును క్రింది విధముగా వ్రాస్తే అది ఇంద్రవజ్ర లయతో ఉండే నా కల్పన "శివరంజని" (స/య/త/గ - IIUI UU - UUI UU 11 త్రిష్టుప్పు 268) వృత్తము అవుతుంది -
IIUI UU - UUI UU
కనులన్ని తెర్చీ - సౌఖ్యమ్ము పెంచే
వినయాన్ని చూపీ - ప్రేమమ్ము పంచే
విషయాన్ని తెల్పీ - స్నేహమ్ము పంచే
సమయాన్ని పంచీ - భాంధవ్య ముంచే
విధిపత్ని నన్నున్ - బ్రేమమ్ముతోడన్
జదివించు తల్లీ - చైతన్యరూపీ
హృదయమ్ములోనన్ - నృత్యమ్ము లాడన్
సదయాంతరంగా - సత్యార్థి రావా
కళలన్ని తెల్పెన్ - సేవల్ ను చేసెన్
కధలన్ని చెప్పెన్ - కావ్యమ్ము రాసెన్
సెగలన్ని చూపెన్ - ఊరించి వేసెన్
పనులన్ని చేసెన్ - ప్రేమమ్ము పంచెన్
--(())--
ప్రాంజలి ప్రభ - అంతార్జాల పత్రిక - ఛందస్సు
IIII UIUI - IIUI UIII - UIU IIIU
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
సుఖమును కార్య సాధనము
అంతయూ సమము సాహసమ్ము పలుకే
వినయము సాహచర్య కలలన్ని
తేల్చునది సమ్మతమ్ము పలుకే
సహనము కాల మాయలను
సేవ భావములు వల్లనే తొలగుటే
కధలను చెప్పుటే మనసు శాంతి
కల్గునని నమ్మకమ్ము కలిగే
తపముల తోడ రావణుడు
శక్తి వీరుడుగ భక్తితత్వ పలుకే
సకలము భాద పెట్టదలిచే
సదా మునులు విష్ణునామ పలికే
మధనము తోను మాయలను చూపి
రామ సతితో బలంతొ పలికే
భయముతొ వన్కె సీత నెత్తుకొని
రావణాసురుడు భీకరమ్ముగళమై
తపములతోడ నద్రి తనయా
మహేశ్వరుని దారయైతివిగదా
యపరిమితమ్ముగాను హరుసమ్ము
నింపుమమ హారిణీ హరసతీ
కృప నిటఁ జూపు కాంతి కిరణాళిఁ
జల్లుమమ గేల నిచ్చి త్వరగా
యెపుడును నన్ను గావు మిలపైనఁ
దీర్చుమమ యీప్సితమ్ముల సదా
--(())--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి