సౌం
దర్యలహరి ... 41
ప్రాంజలిప్రభ ... అంతర్జాల పత్రిక
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
సీస పద్యము
అమ్మా త్వదీయ మూలాధార చక్రము
న విమల లాస్యము చేయు సమయ
తో కూడి నవరస పూర్ణమై తాండవ
నృత్యము చేసేటి ఈశ్వరుడిని
ధ్యానించెదను నేను ఇరువురి కలయిక
కరుణాక టాక్షవీ క్షణపు సృష్టి
పాత్రులు కావటం వల్లనే జగతిన
సకలశుభములు కలుగుచు ఉండె
తేటగీతి
క్రీడ సల్పునట్టి పరమేస్వర నృట్య
హావ భావ విన్యాస ము జగతి కొరకు
భక్తి తోడ దలచెదను మమ్ము నేలు
మీకు జోహారు సల్పెద ప్రీతి తోను
--(())--
హిమశైల పుత్రికా గగనాన వెలుగొందు
ద్వాదశార్యుల యొక్క మణికిరణ ద్యు
తులతో వెలుగులు చూపుచు ఉన్న నీస్వర్ణ
మకుటము వర్ణించ దలఁచు వారి
హృదయము అంతయు కరుణ వలననులే
భవదీయ శీర్షము నఅల రారు
నెలవంక సోయగమును జూచి ఇంద్రధ
నస్సుగా భ్రమియించి సందియములె
తేటగీత
ఓ హిమగిరి సుతా నిను వర్ణనమ్ము
చేయ, శక్తియు ఎవరితరమును కాదు
మకుటము విచిత్ర చిత్రము గాను, కాన
వచ్చి, పక్షిగూడు వలే మెరియును తల్లి .......... 42
--(())--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి