ఓం నమః శివాయ:
శ్రీ ఆది శంకరాచార్య విరచితం
గురు అష్టకము
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
“నిజమైన గురువుకి సమానమైనదానిని మూడులోకాలలోను చెప్పలేము. పరుసవేది దేన్నైనా బంగారంగా మార్చుతుందేమో కాని ఇంకొక పరుసవేదిగా మార్చదు. కాని ఒక గురువు తన్ను నమ్మి శరణుజొచ్చిన శిష్యుడిని తనంతటివాడిని చేస్తాడు. కాబట్టి గురువు అసమానుడు. అల్ప బుద్ధి కలవాణ్ణి కూడా పండితుణ్ణి చెయ్యగలడు గురువు.
జగద్గురువులైన ఆదిశంకరులు గురువు గురించి చాలా గొప్పగా చెబుతారు. వారు ఒకచోట అడుగుతారు,“ఎన్ని ఉన్నా, మనస్సు గురు పాదములను పట్టుకోకపోతే ఏమిటి దాని ఉపయోగం?”అని. వారి రచించిన ‘గురు అష్టకం’లో ప్రతి చోట అడుగుతారు. ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? అని. ఎనిమిది శ్లోకములలోను దీన్ని మకుటంగా ఉంచి మనల్ని ప్రశ్నిస్తున్నారు.
శ్రీశంకర భగవత్పాదులు రచించిన గురు అష్టకం శిష్యునికి ఉండాల్సిన ముఖ్యమైన విషయాన్ని ప్రతిపాదిస్తుంది. శిష్యుడికి ఉండాల్సింది గురువు మీద నమ్మకం, విశ్వాసం. మనకు ఎవరిమీద ఐతే గురి కలుగుతుందో వారే గురువు.
శ్రీ శంకరాచార్య విరచిత గురు అష్టకం:-
ॐॐॐॐॐॐॐॐ
1) శరీరం సురూపం తథా వా కళత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్॥
మంచి దేహధారుడ్యము, అందమైన భార్య, పేరు ప్రతిష్టలు, మేరు సమానమైన ధనం ఉన్నా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
2)కళత్రం ధనం పుత్రపౌత్రాది సర్వం గృహం బాంధవాః సర్వ మేతద్ద్విజాతం!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥
భార్య, ధనము, పిల్లలు, వారి పిల్లలు, ఇళ్ళు, బంధువులు, గొప్ప వంశంలో జన్మ ఉన్నప్పటికి గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
3) షడంగాదివేదో ముఖే శాస్త్రవిద్యా కవిత్వాది గద్యం సుపద్యం కరోతి!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥
ఆరు వేదాంగములు (శిక్ష, చందస్సు, వ్యాకరణం, నిరుక్త, కల్ప, జ్యోతిష్య), నాలుగు వేదాలు, గద్య పద్య రాయగల జ్ఞానం ఉన్నా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
4) విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః సదాచారవృత్తేషు మత్తో న చాన్యః!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥
విదేశాలలో మంచి పేరు, స్వదేశంలో హోదా పలుకుబడి, అందరూ మెచ్చే గుణము, మంచి జీవితం ఉన్నా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
5) క్షమామండలే భూపభూపాలవృందౌసదా సేవితం యస్య పాదారవిందమ్!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥
గొప్ప రాజ్యానికి చక్రవర్తివైనా, రాజులు మహారాజుల చేత సేవింపబడుతున్నా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
6) యశో మే గతం దిక్షు దానప్రతాపాత్ జగద్వస్తు సర్వం కరే సత్ప్రసాదాత్!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥
నీ ఖ్యాతి నలుదెశలా వ్యాపించి ప్రపంచమంతా నీ దయాగుణాన్ని ప్రశంచించినా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
7) న భోగే న యోగే న వా వాజిరాజౌ న కాన్తాసుఖే నైవ విత్తేషు చిత్తం!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥
భోగము, యోగము, ఇష్టము, అగ్నికార్యము, విషయ సుఖము, విత్తములపై నీ మనస్సు విరక్తి పొందినా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
8) అరణ్యే న వా స్వస్య గేహే న కార్యే న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యే!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥
నీ మనస్సు అరణ్యమున ఉన్నా, ఇంట్లో ఉన్న, సమాన్య విషయములపై తిరుగుతూ ఉన్నా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
9) అనర్ఘ్యాణి రత్నాది ముక్తాని సమ్యక్ సమాలింగితా కామినీ యామినీషు!
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥
వెలకట్టలేని మణులు, రత్నాలు, వజ్రవైఢూర్యాలు సదా నిన్ను అనిగమించే అంటిపెట్టుకునే భార్య ఉన్నా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
10) గురోరష్టకం యః పఠేత్పుణ్యదేహీ యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహీ !
లభేత్ వాంఛితార్థ పదం బ్రహ్మసంజ్ఞం గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నం ॥
ఫలశ్రుతి:-
ఎవరైతే ఈ గుర్వాష్టకాన్ని చెదువుతారో,నేర్చుకుంటారో, మననం చేస్తారో, గురువు చెప్పిన విషయాలను నిత్యం స్మరిస్తూ గురు పాదపద్మములపై మనస్సు లగ్నం చేస్తారో,అటువంటివారు యోగి అయినా, సన్యాసి అయినా, రాజు అయినా, బ్రహ్మచారి అయినా, గృహస్
తు అయినా తనికి శాశ్వత పరతత్వమగు పరబ్రహ్మం సిద్ధిస్తుంది.
సదాశివ సమారంభాం, శంకరాచార్య మధ్యమాం!
అస్మదాచార్య పర్యంతం, వందే గురు పరంపరాం!!
🕉🌞🌎🌙🌟🚩
మంచి దేహధారుడ్యము, అందమైన భార్య, పేరు ప్రతిష్టలు, మేరు సమానమైన ధనం ఉన్నా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
భార్య, ధనము, పిల్లలు, వారి పిల్లలు, ఇళ్ళు, బంధువులు, గొప్ప వంశంలో జన్మ ఉన్నప్పటికి గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
ఆరు వేదాంగములు (శిక్ష, చందస్సు, వ్యాకరణం, నిరుక్త, కల్ప, జ్యోతిష్య), నాలుగు వేదాలు, గద్య పద్య రాయగల జ్ఞానం ఉన్నా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
విదేశాలలో మంచి పేరు, స్వదేశంలో హోదా పలుకుబడి, అందరూ మెచ్చే గుణము, మంచి జీవితం ఉన్నా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
గొప్ప రాజ్యానికి చక్రవర్తివైనా, రాజులు మహారాజుల చేత సేవింపబడుతున్నా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
నీ ఖ్యాతి నలుదెశలా వ్యాపించి ప్రపంచమంతా నీ దయాగుణాన్ని ప్రశంచించినా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
భోగము, యోగము, ఇష్టము, అగ్నికార్యము, విషయ సుఖము, విత్తములపై నీ మనస్సు విరక్తి పొందినా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
నీ మనస్సు అరణ్యమున ఉన్నా, ఇంట్లో ఉన్న, సమాన్య విషయములపై తిరుగుతూ ఉన్నా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
వెలకట్టలేని మణులు, రత్నాలు, వజ్రవైఢూర్యాలు సదా నిన్ను అనిగమించే అంటిపెట్టుకునే భార్య ఉన్నా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
ఎవరైతే ఈ గుర్వాష్టకాన్ని చెదువుతారో,నేర్చుకుంటారో, మననం చేస్తారో, గురువు చెప్పిన విషయాలను నిత్యం స్మరిస్తూ గురు పాదపద్మములపై మనస్సు లగ్నం చేస్తారో,అటువంటివారు యోగి అయినా, సన్యాసి అయినా, రాజు అయినా, బ్రహ్మచారి అయినా, గృహస్
తు అయినా తనికి శాశ్వత పరతత్వమగు పరబ్రహ్మం సిద్ధిస్తుంది.
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 2 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
🌻 1. “శ్రీ మాతా 🌻
“శ్రీ” యనగా లక్షి, సరస్వతి, భూమి, భాగ్యము, సంపద, జయము, కాంతి, జ్ఞానము అను అర్ధములు కలవు.
'శ్రీమాత అనగా వరికి తల్లి అని అర్ధము. అనగా లలితాదెవి లక్ష్మి, సరస్వతి, రుద్రాణిలకు కూడా తల్లియై పరమశివుని పత్నియైన పరాశక్తి, పరాభట్టారిక అని తెలుపబడుచున్నది. అంతటికి అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అట్టి మాతృదెవి మోక్షార్ధులచె కూడ స్తుతింప దగినది. ఈమె వెదములకు, (బ్రహ్మకు కూడ ముందుగ నున్నది.
శ్రీ యన విషము అను అర్ధము కూడ కలదు. మాత యన కంఠమున నుంచుకొనినది. అనగా ఈమె సృష్టి సంహారకారిణి కూడ.
లలితాదేవి సర్వజనయిత్రి. సమస్త భూతములు ఆమె నుండి పుట్టుచున్నవి. సర్వసృష్టికి మూలకారణము. లోకమున బాధ కలిగినపుడు తల్లిని స్మరించుట కద్దు. లోకములోని తల్లులు తాపత్రయములను పోగొట్టు సమర్ధురాండ్రు కారు. సంసార సాగరమందు పడి అన్య రక్షణ లేక భయగ్రస్తులైనవారు దురంత దుఃఖములను పొందుతారు జగన్మాతయగు శ్రీమాతను తలచినచో అభయము కలుగును.
దయావతిగాన మాతృమూర్తిగా స్తుతింప దగినది. సృష్టి మొత్తమును మూలాధారశక్తియె సకల బ్రహ్మాండములు ఈమె యందుండుటచె శ్రీమాతయైనది.
జనులచే ఆశయింపబడిన దగుటచే కూడ శ్రీ మాత అగుచున్నది. నిర్దుణ పరబ్రహ్మమె సృవ్యాదుల నొనర్ప సగుణ బ్రహ్మముగా వచ్చినపుడు శ్రీమాత యగుచున్నది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక
సహస్ర నామముల తత్వ తేటగీతి పద్యాల వివరణ
రఛయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
1. “శ్రీ మాతా
శ్రీ య నేది సరస్వతి, లక్ష్మి, అవని,
జయము, సంపద, జ్ఞానము, భాగ్య, మిచ్చు
తల్లియై పరమశివుని పత్నియైన ,
సకల బ్రహ్మాండములు ఈమెయందు ఉండు
సృష్టి సంహార కారిణి కూడ, అమ్మ
సర్వ జనయిత్రి, దేవతా ధ్యాన శక్తి
అన్య రక్షణ లేనట్టి వారి కిచ్చు
అభయ హస్తమ్ము ఇచ్చు శ్రీమాత గారు
జనులచే ఆశయింప బడిన దగుటచె
సగుణ బ్రహ్మస్వ రూపిణి మాతృ దేవి
లోకములలోని తల్లుల కోర్క తీర్చె
తల్లి పూజ్య భావమ్ముతొ వంద నమ్ము
--(())--
🌻 2. “శీ మహారాజ్ణీ 🌻
సమస్త ప్రపంచముల గుంపును పాలించు అధికారము గలది అని అర్ధము. రాజ శబ్దమునకు పాలించువాడు అని, రాజ్ఞి అను శబ్దమునకు వాలించునది అను అర్ధములు గలవు. ఎవరిచే సమస్త ప్రపంచము పుట్టింపబడి పాలింపబడుచున్నదో ఆ మహాశక్తిని ఇచ్చట స్మరించుట జరుగుచున్నది.
శ్రీ మహారాజ్ఞి పదమును, శ్రీం, అ, హ, రాజ్ఞి అని గ్రహించిన, శ్రీం-షోడశకళగను, అ-పరతత్త్వముగను, హ-అందుండి వెలువడిన వెలుగుగను, రాజ్ఞా-మాయకు అధిదెవతగను తెలియదగును. శ్రీ, శ్రీవిదధ్యలో పరమ రహస్యమైన షోడశాక్షరీ మంత్రము నందు మొదటి అక్షరము.
సద్దురువు నందు పూర్ణభక్తి విశ్వాసములు గల శిష్యునకు మాత్రము ఉపదేశింపదగిన అక్షరము. గురూపదేశము ననే ఈ అక్షరము పదహారు కళలను అంతర్ముఖముగ వికసింప చేయును. చతుర్లక్ష్మి మంత్రములలో కూడ శ్రీ మొదటి వర్ణముగ లల్లుడు వ్యాఖ్యానించెను. అకారము పరతత్త్వమే.
అక్షరములలో అకారము నేనని భగవంతుడు నుడివియున్నాడు కదా! (భగవద్దిత 10వ అధ్యాయము). అకారము శక్తి అని ఇచ్చట సంకేత పద్ధతిలో చెప్పబడినది. అనగా పరతత్త్వము వెలుగు, వెలుగు యొక్క షోడశ కళలుగ ఏర్పడు సృష్టి. దానిని ఆవరించియుండు మాయ ఈ నామమున కీర్తింపబడుచున్నది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక
సహస్ర నామముల తత్వ తేటగీతి పద్యాల వివరణ
రఛయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
3. "శ్రీమత్సింహాసనేశ్వరి"
సింహ పీఠమ్ము నధిష్టించి రాక్ష సులను
హింస జరిపియు జగతి శమింప జేయు
ధర్మ రక్షణ శిక్ష అధర్మ పరులు కిచ్చి
సింహ శబ్ధము తో అమ్మ లోక రక్ష
జ్ణాన మార్గము తొఅజ్ణా నమును నిలిపి
జీవి ధర్మాధర్మఘర్షణ యందు ఉన్న
హింస జరపకుం డక కాపు కాయు సర్వ
లోక మాతకు హృద్యమ్మ వందనమ్మ
స్థితికి పరిణతి వవెకియై చెందు చుండు
మానవడు కొంత హింసకు లోను అయ్యె
బాహ్య జగతియు సంగము ప్రశ్న అయ్యె
హృదయ నందుఉండియు యోగ మివ్వు తల్లి
--(())--
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక
సహస్ర నామముల తత్వ తేటగీతి పద్యాల వివరణ
రఛయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
🌻 4. “చిదగ్నికుండ సంభూతా” 🌻
యజ్ఞ కుండము నుండియే సృష్టి పుట్టి
సృష్టి చైతన్య సంకల్పమేర్పడియును
కోటి సూర్యల మించిన అగ్ని పుట్టె
దేవి సంకల్ప నుద్భవించినదె సృష్టి
నరుల చైతన్య నిద్రలో అగ్ని పుట్టి
మేల్కొ నేటిత త్వపు శక్తి అగ్నిగాను
ప్రేరణయె సత్య వంతుని సృష్టి కలుగు
మరల చైతన్య సంకల్ప మృద్ధి జరుగు
చీకటిహరింప బడుకాంతి గుణము పుట్టి
కాల గతియుయె మడగల శక్తి పుట్టి
సత్వ గుణములు ఉద్భవించి మరల అవి
చేతన అగ్నియు యజ్ఞార్థ మైన సృష్టి
అగ్నిగుండం నుంచి ఉద్భవించే సృష్టి
సృష్టికి మూలం అమ్మలగన్న అమ్మాయే
--(())--
చిదగ్ని యను కుండము నుండి పుట్టినది అని అర్ధము. పరతత్త్వము నుండి ఏర్పడిన మొదటి సంకల్పమే యజ్ఞకుండము. అందుండియే సమస్త సృష్టి ఏర్పడును. సంకల్ప మెర్పడగానె చైతన్యము కూడ ఏర్పడును. ఆ చైతన్యము కోటి సూర్యులను మించిన అగ్నిగా వ్యక్తమగును.
సృష్టి యజ్ఞకుండమున చైతన్యాగ్ని ఈ విధముగ ఉదృవించును. అందుండి సమస్త లోకములు, ఆ లోకములందుండు జీవులు ఉద్భవింతురు. ఉధృవించిన సమస్త లోకములయందు, లోకుల యందు కూడ చైతన్యమను అగ్ని అంతర్హితముగ నున్నది. ఏ అగ్ని నుండి ఈ సమస్తము ఉద్భభవించినదో ఆ చైతన్యాగ్ని కూడ పరబ్రహ్మ స్వరూపిణియైన దేవి నుండి సంకల్పమాత్రముగ ఉద్బవించినదని భావన.
మానవుడు నిద్ర నుండి మెల్కాంచుట ప్రతినిత్యము జరుగు చున్నది. స్థితి లేక సత్యము నందున్నటువంటి తత్త్వము చైతన్యముగ మెల్మాంచుచున్నది. ఈ మెల్కొనుటకు వలసిన సంకల్పము మానవుని ఎరుకలో లేదు. అంతర్హితముగ నున్న తత్త్వము నుండి ప్రేరణ (సంకల్పము) కలిగి, చైతన్యవంతుడుగ మెల్కాంచుచున్నాడు. ఇట్లు సత్యవంతుడు చైతన్యవంతుడగు చున్నాడు. అట్లే పెంజీకటి కవ్వలనున్న తత్త్వము (తమనః వరస్తాత) ఈ మొదటి సంకల్పమును వ్యక్తముజేసి, దాని నాధారముగ గొని చైతన్వాగ్నిగ వ్యక్తమగును.
మెల్మాంచిన మానవుని నుండి మరల సంకల్పములు కలిగి, తన చుట్టును తన జీవితమను సృష్టి నేర్చరచుకొనుచున్నాడు.
అట్లే పరతత్త్వము నుండి సంభవించిన చైతన్యమను అగ్నికూడ మెల్మొనబడినదై సృష్టి కార్యమునకు పూనుకొనును. చైతన్యాగ్ని సంభవించగనే తమస్సను చీకటి హరింపబడి, వెలుగు వ్యాపించును. సత్యవంతుడు చైతన్యవంతుడగుట కూడ తమస్సు (నిద్ర) నుండి పరతత్త్వము చైతన్యముగా మెల్కాంచుటయె. ఇట్లు మెల్మ్కాంచిన తత్త్వము మరల పరతత్త్వములోనికి కాలగతిని యిమడగలదు. అనగా మరల తమోగుణము ఆవరింపగలదు. రాత్రి ఏర్పడగనే జీవులన్నియు నిద్ర యను తమస్సులోనికి తీసుకొనబడి పోవుచున్నవి కదా! కావున యజ్ఞార్థమై
సృష్టి నిర్మాణము చేయుటకు చైతన్వాగ్నిగ సంకల్పము నుండి వ్యక్తమగుట, మరల తిరోధానము చెందుట అనునవి పరతత్త్వ మాధారముగ జరుగుచున్నవి.
తమస్సు కవ్వలనుండు తత్త్వము తమస్సును భేదించు కొని రజస్సుగ నుదృవించును. తిరోధానమున మరల రజస్సును తమస్సు హరించుకొనును. ఆ తమస్సున కవ్వల స్టితి యున్నది. ఆ తమస్సున కివ్వల కూడ స్థితి యున్నది. తమస్సున కివలి స్ధితి సత్త్వగుణము నాశ్రయించి యుందును. తమస్సున కవ్వలిస్థితి త్రిగుణ ములకును ఆశయము.
ఈ చిదగ్ని శోక మోహములను దహింపగలదు. ఇది సమస్త ధర్మములను ధరించియుండును. దీనిని చెరుటయే దేవిని చేరుట. సంభూత అని చెప్పుటలో ఉన్నదే వ్యక్తమైనదని అవగాహన సమ్యక్+భూతు. చైతన్యాగ్ని రూపముగ వ్యక్తమగుటకు పూర్వము ధర్మముగ పరతత్త్వమున నున్నదియె కాని, పుట్టినదని అర్ధము కాదు.
అనగా దేవి యొక్క శాశ్వతత్త్వము సంభూతా అను పదముతో అద్భుతముగ ప్రతిపాదింపబడినది. భూతమనగా ఉన్నది వ్యక్తమైనదని అర్ధము. అనగా గుణాతీత తత్త్వము సగుణమైనదని గ్రహింపవలెను. ఈ నామము అష్టాక్షరీ నామము కనుక ఏడు లోకములకు ఆశ్రయము నిచ్చు ఎనిమిదవది అని కూడ గ్రహింపవలెను.
సశేషం...
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక
సహస్ర నామముల తత్వ తేటగీతి పద్యాల వివరణ
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
5. 'దేవకార్య సముద్యతా'"
దేవి ఉద్యుక్తురాలగ మారకుండి
గాని విశ్రాంతి గొనుటయు లేకవుండు
నరుల మేల్కొల్పి తొలగించు బద్ధకమ్ము
కార్య ములయందు ఉద్యుక్తు మవ్వకుండు
ఈశ్వరార్చనముగ చేయ వలసినపని
తనను తానుగా చైతన్య పరచి యుండు
దేవ కార్యము సిద్దించుట కొరకు తను
అప్రమత్తురాలుగను ఉండకయు ఉండె
ప్రేమ తెలుపు స్వరూపిణి సర్వ శక్తి
తోను, మహిషాసురునిసంహ రించి యుండె
ఆమె దేవ రక్షణ సృష్టి సలిపి యుండి
అవస రమునుబట్టియురూపు శక్తి వమ్మ
సృష్టి యజ్ఞార్ధ కర్మగా జరుగు చుండు
సురులుగాను, వెలుగుల జ్ఞాన పరులు
అసురుల వెలుగున తమస్సు వంటి వారు
సర్వ రక్షగా దేవకార్యముకు రక్ష
దేవి సుర పక్షవాతి యని అనతగదు
సృష్టి నిర్మాణ మునమూడు గుణములుంచు
సృష్టి కాలమున లయను స్థితిని ఇచ్చె
దేవి లోకము లోనిజీ వులను రక్ష
--(())--
🌻 5. 'దేవకార్య సముద్యతా' 🌻
ఈ నామము కూడ అష్టాక్షరియే. దేవతల కార్యమును నిర్వర్తించుటకై వ్యక్తమైనదని అర్ధము. సమస్త దేవతలు వచైతన్యాగ్ని నుండియె వెలువడి, సృష్టి సిర్మాణము చేయుచున్నారు. (బ్రహ్మాది దేవతలందరు కూడ ఈ చైతన్యమనెడి అగ్నికుండము నుండి పుట్టిన వారే.
చైతన్యాగ్నిగ యజ్ఞకుండమున ఆవిర్భవించగనె దేవతా కార్యము నకు దేవి ఉద్యుక్తురాలగును గాని, విశ్రాంతి గొనుట యుండదు. మానవుడు కూడ మెల్కాంచగనే కార్యములందు ఉద్యుక్తు డగుచున్నాడు కదా! ఈ ఉద్యుక్తత మానవులయందు గల దేవీ లక్షణమే. మెల్మాంచి బద్ధకముగ నుండుట, మరల పండుకొనుట తమోగుణ లక్షణము.
దేవి భక్తు డట్లుండడు, మేల్కాంచగనె ఈశ్వరార్చనముగ చేయవలసిన పనులయందు తనను తాను నియమించుకొనును. ఇది చైతన్యవంతుని లక్షణము. దేవి చైతన్యాగ్నిగ వ్యక్తమవగనె దేవకార్యము సిద్దించుటకై తనను తాను నియమించుకొనునని, ఆ విధముగ అత్యంత అప్రమత్తురా లని తెలియవలెను. పిలిచిన వెంటనె ఆలస్యము చెయక ప్రతిస్పందించు ప్రేమ స్వరూపిణియని గమనించవలెను.
సృష్టి అరంభమున వ్యక్తమై త్రిగుణాత్మకముగ తనను తాను విభజించుకొన్నప్పటికీ దేవతల ప్రార్ధనకు ప్రతిస్పందించి తానావిర్భవించి మహిషాసుర, భండాసురాదులను వధించినది.
దేవి ఒక్కరే అయినను ముగ్గురుగ కూడ గోచరించుచుండును. ఆమె నిత్యురాలు. దేవ సృష్టికి, దేవ రక్షణకు, ఏర్పడుట ఆమె 'సి రూప స్థితి. ఆమె అరూప అని కూడ తెలియవలెను. అరూపయె సరూప అగుచుండును. అట్లగుట అవసరమునుబట్ట జరుగును.
సృష్టి అంతయు దేవి నుండి దిగివచ్చిన దేవతలయొక్క యజ్ఞార్ధ కర్మగా జరుగుచూ ఉండును.
అట్లు జరుగు దేవతా యజ్ఞమున అసురులు కూడ ఉద్భవించు చుందురు. సురలనగా వెలుగు ప్రజ్ఞలు. వారి వలననే సృష్టియజ్ఞము జరుగుచుండును. అసురులనగా ఆ వెలుగులను ఆవరించి కమ్ముకొను చీకటి లేక తమస్సు. అట్లు జరిగినప్పుడెల్ల దెవి ఆవిర్భవించుటయు, ఆమె ఆవిర్భావ కారణముగ కమ్మిన చీకట్లు (తమస్సు) హరింబడుటయు జరుగుచుండును.
ఇదియే దేవి యొక్క దేవతారక్షణ స్వభావము. అంతమాత్రము చెత దేవి సుర పక్షవాతి యని అనతగదు. సృష్టి నిర్మాణమున, సృష్టి స్థితి కాలమున ఇట్లు రక్షించినను, తిరోధాన సమయమున తమోగుణమును లెక అసురమును అనుమతించును కదా! అందుచె సృష్టికార్యము జరుగు నపుడు దేవతలను రక్షించుచుండును. ప్రళయ కాలమున తమమును అనుమతించును.
అట్లనుమతించినచో మెల్కాంచిన జీవునకు నిదుర యుండదు. ఈ విధముగ దేవి జీవులను, లోకములను అనురక్షణము చేయుచుండును.
సశేషం...
-(())--
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక
సహస్ర నామముల తత్వ తేటగీతి పద్యాల వివరణ
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత
రాగాస్వరుప పాశాడ్యా క్రోధా కారంకుశోజ్జ్వల
🌻 6. 'ఉద్యద్భాను సహస్రాభా' 🌻
వేయి సూర్యుల కాంతితో ఉండు తల్లి
ఎర్రని వెలుగు కలిగియు మెరయు తల్లి
ఉదయ కాంతులు పంచేటి మనసు తల్లి
కుసుమ భాసురా అనిపిల్చు జపత తల్లి
అరుణము రజస్సు కనులలో చూపు తల్లి
అమ్మ సంకల్ప బలమును ఎరుపు చూపు
వాక్కునకు అందనిది ఎరుపు కాంతి
లోకములలోన తేజస్సు అరుణ కాంతి
శక్తి చిహ్నము మెరుపులా అగ్ని కాంతి
విప్లవముకు సాంకేతము ఎర్ర కాంతి
జీవకోటికి రక్తము ఎరుపుకాంతి
రక్తముకు రక్ష ఉద్యద్భాను సహస్రాభా
--(())--
ఉదయించుచున్న వేయి సూర్యుల కాంతి గలది అని అర్థము. ఉదయించుచున్న సూర్యుడు ఎర్రని కాంతి కలవాడై ఉండును. వేయి సూర్యు లొక్కమారు ఉదయించినచో ఏర్పడు ఎర్రని కాంతిని దేవి
కలిగియున్నదని తెలియవలెను. అనగా మిక్కిలి ఎర్రని దేహచ్ఛాయ గలదై దేవి ఉద్భవించుచున్నదని, అట్లే ఉపాసించ తగినదని ఈ నామము తెలుపుచున్నది. '
జపా కుసుమ భాసురా' అని కూడ దేవికి నామము కలదు. అనగా ఆమె శరీర కాంతి దాసానిపూవు వంటి ఎరుపుదనము కలిగినదని అర్థము. అరుణత్వము అమ్మ ఉద్భవించునప్పటి కాంతి. అరుణము రజస్సునకు, సంకల్పబలమునకు సంకేతము. దేవి అరుణత్వము కనులకు అగపడునది కాదు. వాక్కునకు అందునది కాదు.
బ్రహ్మాండమంతయు వ్యాపించియుండు తేజస్సే ఈ అరుణత్వము. అవ్యక్తమగు తత్త్వము నందు మొట్టమొదట వ్యక్తమగు కాంతి కూడ ఎరుపే నని
తెలియవలెను. ఈ ఎర్రదనము దేవి పరాక్రమమునకు, శక్తికి కూడ చిహ్నము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌻 7. 'చతుర్బాహుసమన్వితా 🌻
నాలుగు బాహువులు కలది, నాలుగు బాహువులుగా ఏర్పడినది లేక నాలుగు బాహువులతో కూడినది అని అర్థము.
బ్రహ్మ జన్మ పద్మ దళములుగను నాల్గు
బ్రహ్మ వేదములు వ్రాసి నవిగ నాల్గు
బ్రహ్మ ముఖములు నాల్గు దిక్కుల లొనాల్గు
అమ్మ నాల్గు బాహువులు కలిగి ఉంది
నాల్గు స్థితులు పరా, పశ్యంతి, మధ్యమా , వైఖరి
నాల్గు శాక్తేయులు ఆదిశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి
నాల్గు వాసుదేవ, సంకర్షణ , ప్రద్యుమ్న, అనిరుద్ధు
అమ్మ నాల్గు బాహువులు కలిగి ఉంది
కృత, త్రేతా, ద్వాపర, కలియుగము
తత్త్వము, శబ్దము, వర్ణము, రూపము
ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, అర్థరాత్రి)
అమ్మ నాల్గు బాహువులు కలిగి ఉంది
శుక్లాష్టమి, పౌర్ణమి, బహుళాష్టమి, అమావాస్య
మకర, వసంత, కర్కాటక, శరత్ సంక్రమణము
అహంకారము, బుద్ధి, చిత్తము, మనస్సు
అమ్మ నాల్గు బాహువులు కలిగి ఉంది
భావించి, ధ్యానించి, దర్శించి, సాధనా
బాల్య, యౌవన, కౌమార, వార్థక్యములు
బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాస
అమ్మ నాల్గు బాహువులు కలిగి ఉంది
జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయావస్థలు
మేల్కొనినపుడు, స్వప్నమునందును,
నిద్రయందును, తానున్నానని తెలిపి
అమ్మ నాల్గు బాహువు లతొ రక్ష చేయు
--(())--
సంకల్పము నుండి ఏర్పడిన చేతనాగ్ని ఉద్భవించు సమయమున వేయి సూర్యుల అరుణకాంతిగా ఇంతకు ముందటి నామమున చెప్పబడినది.
అచటి నుండి క్రమశః నాలుగు బాహువులు పొందినదిగా ఈ నామము తెలుపుచున్నది. ఈ నాలుగు బాహువులే బ్రహ్మ జనించు నాలుగు దళముల పద్మముగను, అటుపై బ్రహ్మకేర్పడు నాలుగు ముఖములుగను, బ్రహ్మ ధరించు నాలుగు వేదములుగను తెలియవలెను.
అటులే దేవి ఉద్భవించినదై, సృష్టియందు నాలుగు స్థితుల యందున్నదని కూడ తెలియవలెను. ఈ నాలుగు స్థితులను పరా, పశ్యంతి, మధ్యమా , వైఖరి అని యందురు.
వైష్ణవ సంప్రదాయమున వాసుదేవ, సంకర్షణ , ప్రద్యుమ్న, అనిరుద్ధులుగా పేర్కొందురు. శాక్తేయులు ఆదిశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులుగ పేర్కొందురు. నాలుగు కాలముల యందు నిండియున్న శక్తి స్వరూపిణిగ కూడ దేవిని గ్రహింపవచ్చును.
అనగా కృత, త్రేతా, ద్వాపర, కలియుగములలో వ్యాపించిన శక్తిగా భావన చేయవచ్చును. సృష్టి సమస్తము చతురస్రమే అని వేదము ఘోషించుచున్నది. విష్ణునామ సహస్రమునందు కూడ 'చతురస్రో' అను నామము కలదు. ఉద్భవించిన దేవి చతురస్రముగ రూపుగొనునని దీని భావము.
ఎర్రని కాంతితో కూడిన దేవి నాలుగు బాహువులు కలదిగ ధ్యానింపవలెనని కూడ ఇందలి సూచన. సృష్టి సమస్తము నందును ఈ నాలుగు బాహువులను దర్శింపవచ్చును. ప్రతి వస్తువునకును రూపముండును. ఆ రూపమునకు ఆధారముగ వర్ణముండును.
ఆ వర్ణమున కాధారముగ శబ్దముండును. శబ్దమున కాధారముగ తత్త్వముండును. తత్త్వము, శబ్దము, వర్ణము, రూపము అను నాలుగు స్థితులను ఒక వస్తువునందు దర్శించుటయే చతుర్బాహు దర్శనము.
కనబడు ప్రతి వస్తువు నందును కనపడక మూడు స్థితులు ఇమిడి యున్నవని తెలియవలెను. పురుష సూక్తమున ఈ ధర్మమునే “కనపడు విశ్వము, దానియందలి జీవులు ఒక పాదమని, కనపడక యున్న పాదములు మూడు అని, మొత్తము నాలుగు పాదములు పురుషునకు కలవని” వివరింపబడినది.
అటులనే గుణాతీతమైన తత్త్వము మూడు గుణములుగ ఏర్పడుట యందు కూడ ఈ చతుర్భాహువులను దర్శింపవచ్చును. దినము నందలి నాలుగు భాగములు (ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, అర్థరాత్రి); మాసము నందలి నాలుగు భాగములు (శుక్లాష్టమి, పౌర్ణమి, కృష్ణాష్టమి లేక బహుళాష్టమి, అమావాస్య), సంవత్సరమందలి నాలుగు భాగములు (మకర సంక్రమణము, వసంత సంక్రమణము (ఉత్తర), కర్కాటక సంక్రమణము, శరత్ సంక్రమణము (దక్షిణ) కూడ దేవి నాలుగు బాహువులేనని భావన చేయవలెను.
మానవులందు కూడ దేవి నాలుగు బాహువులు - అహంకారము, బుద్ధి, చిత్తము, మనస్సు అను అంతఃకరణ చతుష్టయముగ పనిచేయు చుండును. అహంకార మనగా తానున్నానని తెలివి. ఇట్లు తన యందును, తన చుట్టును ఉన్న సృష్టియందును ఈ నాలుగు స్థితులను భావించి, ధ్యానించి, దర్శించుట ఒక చక్కని సాధనా మార్గము. ఈ దర్శనమున దేవి ఎంత అద్భుతముగ నాలుగు బాహువులతో కూడి యున్నదో తెలియగలదు.
బాల్య, యౌవన, కౌమార, వార్థక్యములు, బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాస ఆశ్రమములను కూడ ఈ సందర్భముగా దేవి చతుర్బాహువులుగ గమనింప వచ్చును. జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయావస్థల యందు కూడ ఈ చతుర్బాహువులను దర్శింపవచ్చును. తురీయము దేవి సహజస్థితి. సిద్ధుని సహజస్థితి కూడ ఇదియే.
తురీయమను తెరపై సుషుప్తి, స్వప్న, జాగ్రదవస్థలు వచ్చి పోవుచునుండును. మేల్కొనినపుడు, స్వప్నమునందును, నిద్రయందును, తానున్నానని తెలిసి యుండుటయే తురీయ స్థితి. దేవి సృష్టియందును , ప్రళయము నందును, వానికతీతముగను గోచరించును.
ఇట్లు శాశ్వతత్త్వము ఆధారముగ త్రిగుణాత్మకముగ సృష్టి స్థితి లయాదులు జరుగునని తెలుపుటయే నాలుగు బాహువుల సంకేతము. భారతీయ సంస్కృతి యందు దేవతల కిట్లు నాలుగు బాహువులను రూపించుట కిదియే రహస్యార్థము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక
సహస్ర నామముల తత్వ తేటగీతి పద్యాల వివరణ
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
🌻. 8. 'రాగస్వరూపపాశాఢ్యా' 🌻
సృష్టి కధకు మూలము పాశ బంధమున్ను
నడుపు ఇచ్ఛా శక్తి యు కీల కముగ నుండు
జీవులలొ శక్తి అత్యంత యోగ శక్తి
కార్య ములొ అనురాగపు శక్తి యుండు
వ్యక్తి గతమైన కోరిక సంభవమ్ము
మూల మేమన ఆరాధ మనెడి శక్తి
ఇచ్ఛా అనునది ధర్మము తోను కలిసి
సహజ నిర్మాణ సౌందర్య మిచ్చు శక్తి
ధనము ఉన్నను వైభవ ములుగ మారు
స్వేశ్చ అనుభూతి పొందియు బుద్ది మారు
ధనము లేకయున్న తృప్తియు కలిగి మారు
ధనము కొరకును దైవము పూజ చేయు
సత్యమును కోరి తపనతో కృషియు చేసి
తీవ్ర మైనట్టి నిష్ఠతో భజన చేసి
రాగ స్వరూప పాశము బంధ ముగను
స్థితి హెచ్చుతగ్గులున్నను పాశ మవ్వు
--(())--
అమ్మవారి సృష్టి నిర్మాణ కార్యక్రమమున అత్యంత ప్రతిభావంతమైనది అనురాగ మను పాశము. ఈ పాశమే లేకున్నచో సృష్టి కథయే లేదు. దేవి నుండి ఈ అనురాగ పాశమే ఇచ్ఛాశక్తిగా స్రవించి సృ ష్టి కథను నడుపును.
జీవునియందు కూడ ఈ శక్తి కోరికగా పనిచేసి, తనదైన జీవితమును అల్లుకొనుచుండును. సమస్త ప్రపంచమును దేవి ఇచ్ఛాశక్తిచే నడుపబడుచున్నది. ప్రతి జీవియును తన వ్యక్తిగతమైన కోరికలచే నడుప బడుచున్నాడు కదా! కోరిక తనదని అనుకొనుచు సృష్టి కార్యమును చేయుచున్నాడు కదా! నిజమునకు తన కోరికగా వ్యక్తమగుచున్నది దేవి ఇచ్ఛాశక్తియే.
ఇచ్ఛ సృష్టి నిర్మాణమునకు గాని, వ్యక్తిగత జీవన నిర్మాణమునకు గాని పునాదిరాయియై నిలచును.
ఇచ్ఛ యుండరాదను కొనుట మెట్ట వేదాంతమగును. ఇచ్ఛను సృష్టి యందు ధర్మముతో జతపరచుట వలన జీవనము ప్రశాంతముగ జరుగగలదు. కోరికయే చెడ్డది
అనుకొనరాదు. ఎట్లు కోరుకొనవలెనో తెలియవలెను.
డబ్బు పాపిష్ఠిది అందురు. ఇది చేతకానివాడు పలుకు మాట. డబ్బు నెట్లు వినియోగ పరచవలెనో తెలిసినవాని చేతిలో అదే ధనము శోభను, వైభవమును కూర్చును. చేతకాని వానిని భ్రష్టుని చేయును.
అట్లే కోరిక కూడ. కోరికయే లేనిచో భగవంతునితో యోగము చెందుట కూడ ఉండదు కదా! సత్యమును కోరి దానికి సంబంధించిన మార్గమును తపనతో అన్వేషించి, మార్గమున అందింపబడిన నియమములను తీవ్రమైన నిష్ఠతో నిర్వర్తించినగాని, దైవమును పొందలేడు కదా
దైవమును పొందు తీవ్రమైన కోరికనే తపస్సందురు. తపన లేని వానికి ఏదియును అందదు. పదార్థము వైపునకుగానీ, పరమార్థము వైపునకు గాని పయనించుటకు వానియందనురాగ ముండవలెను. అనురాగ మనగా ఎడతెరిపిలేని రాగము. ప్రియునికి ప్రేయసిపై ఎట్లహర్నిశలు ఉండునో, అట్లు తాను పొందదలచిన విషయమున రాగ ముండవలెను.
రాగమను పాశమును దేనిపై ప్రయోగింతుమో అది మనకు దక్కగలదు. అట్టి అనురాగము ధర్మబద్ధము కానిచో బంధనమునకు కారణమగును.
బంధకారణమైన అనురాగము పాశమువలె పనిచేయును. బంధ కారణము కాని అనురాగము ఉపకరణమై నిలచును. జీవుల పై మహాత్ముల అనురాగము ఉపకరణముగ కన్పట్టుచున్నది కదా! సంసార జీవుల యొక్క అనురాగము ఎడతెగని బంధములుగ ఏర్పడుచున్నవి కదా! జ్ఞానము నందలి తారతమ్యములే ఇట్టి స్థితులను కలిగించును.
దేవి యొక్క రాగ స్వరూప పాశము బంధస్థితిని హెచ్చరించుచున్నది, మోక్షస్థితిని సూచించుచున్నది అని తెలియవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక
సహస్ర నామముల తత్వ తేటగీతి పద్యాల వివరణ
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
🌻 9. 'క్రోధాకారాంకుశోజ్జ్వలా' 🌻
క్రోధ మనెడు గుణమునకు అంకుశమ్ము
ఉజ్వల స్వభావానికి అంకుశమ్ము
మదపు టేనుగులకు సైత అంకుశమ్ము
కరుడు అజ్ఞానములపైన అంకుశమ్ము
లోక ధర్మప్పిదములపై అంకుశమ్ము
యముని రూపముననె దేవి అంకుశమ్ము
కాల రూప దుష్టులపై అంకుశమ్ము
వేద పురుషుల రక్షగ అంకుశమ్ము
జీవ అనుకర తృప్తిగా అంకుశమ్ము
సహజ కాలరూపముననే అంకుశమ్ము
కీర్తి అపకీర్తి మధ్యన అంకుశమ్ము
సంది యమునకు క్రోధము అంకుశమ్ము
ధర్మ మార్గము నిలబెట్టు అంకుశమ్ము
కర్మ ఫలముల ననుభవం అంకుశమ్ము
ఆమె ఆజ్ఞకు లోబడి అంకుశమ్ము
జ్ఞాన మనె టి జ్వాలల అంకుశమ్ము
ఇష్ట కాలము తెచ్చేది అంకుశమ్ము
మౌనమున జీవి బతుకుకు అంకుశమ్ము
రాగ అనురాగ సమ్మోహ అంకుశమ్ము
వాంఛ నిస్పృహల నిరాశ అంకుశమ్ము
--(())--
🌻 9. 'క్రోధాకారాంకుశోజ్జ్వలా' 🌻
క్రోధమనెడు గుణమునకు ఆకారము దాల్చినదిగా దేవి అంకుశమును తెలియవలెను. అట్టి అంకుశమును ధరించిన ఉజ్జ్వల మూర్తిగా ఈ నామము దీనిని ప్రస్తుతి చేయుచున్నది. మదించిన ఏనుగు వంటి స్వభావమును కూడ నియమింపగలనని అంకుశము
తెలుపును. మదించిన వారికి భయము లేదు. భక్తి ఉండదు. అట్టి వారిని సైతము ఉజ్జ్వలమైన తన క్రోధమను అంకుశముతో సర్వశక్తిమయి అయిన దేవి శిక్షించి, రక్షించగలదు.
మదము కరుడుగట్టిన అజ్ఞానము. దానిని పటాపంచలు చేయగల ఆయుధముగ దేవి అంకుశమును భావింపవలెను. యమించునది అంకుశమను సత్యము తెలియవలెను. అంకుశాకారము జ్యోతిషమున శనిగ్రహమునకు వినియోగింతురు. లోకమున ధర్మము తప్పి వర్తించు వారిని యముని రూపమున దేవియే శాసించు చుండును.
కాలక్రమమున ఎంతటి మొనగాడినైనను శనిగ్రహ చారము దేవి బలహీన పరచగలదు. ఏనుగైనను కాలవశమున పీనుగ కాగలదు కదా! కాల రూపమున సమస్త జీవులను నిష్కర్షగా నియమించు శనిగ్రహ తత్త్వమును అంకుశముగా వేదఋషులు సంకేతించిరి. ధర్మమున దేవి జీవులను నియమించునని సందేశ మిచ్చుటకే క్రోధమే ఆకారముగా గల అంకుశమును ధరించినట్లుగా తెలియవలెను. సామాన్యులను కాలము రూపమున దేవి నియమించును.
కొందరిని కష్టముల ద్వారా, మరికొందరిని నష్టముల ద్వారా, ఇంకొందరిని అజపయము, అపకీర్తి రోగముల ద్వారా మరియు పీడల ద్వారా కర్మఫలముల ననుభవింపజేసి, ధర్మమార్గమున నిలబెట్టును. అన్నిటికీ మించి, మృత్యువు రూపమున జీవుల సమస్త సంపాదనములను హరించి, జీవనము పునః ప్రారంభమగునట్లు చేయును.
విశేష ప్రజ్ఞకలిగి అధర్మము నాచరించువారిని తానే అవతారమూర్తిగ దిగివచ్చి శిక్షించును. అతి విశేష శక్తులతో విజృంభించిన మహిష, భండాసురాదులను తానే స్వయముగ దిగివచ్చి శిక్షించును.
ఎవనికి ఏ శిక్ష విధించిన రక్షింపబడునో అట్టి శిక్షను సమతూకముగ అందించగల శక్తియే అంకుశమను దేవి ఆయుధము. త్రిమూర్తులు సైతము ఆమె ఆజ్ఞకు లోబడి సృష్టి నిర్వహణము గావించుచున్నారు.
వారికి సృష్టియం దవరోధము లేర్పడినచో తానే స్వయముగ చక్కదిద్దగలదు.
అజ్ఞానాంధకారమును తగు విధముగ శిక్షించి జీవప్రజ్ఞను జ్ఞానమునందు నిలుపు ఉపకరణముగ అంకుశము వినియోగపడుచున్నది. కావున దేవి భక్తులు క్రోధముతో కూడిన ఈ అంకుశమును జ్ఞాన ప్రదమని భావించి, నమస్కరించి స్తుతింతురు. రాగమను పాశము ఒక హస్తమున ధరించిన దేవి, మరియొక హస్తమున క్రోధమను అంకుశమును ధరించి, సృష్టి జీవుల యందు రాగము మితిమీర కుండునట్లుగ చక్కబెట్టుకొనుచున్నది.
సృష్టియందు ఈ విధముగ రాగమును పెంచునది, మితిమీరినపుడు త్రుంచునది కూడ దేవియే. సత్సాధకుడు వీనిని గమనించి, కష్టనష్టములు, అపజయము కలిగినపుడు దేవియే కాలరూపమున త్రుంచుచున్నదని భావించి, ప్రతీకార వాంఛ లేక, నిరాశా నిస్పృహలు చెందక, దేవిని శరణు పొంది ధర్మమున తనను తాను నియమించుకొనును.
ఇష్టకాలము వచ్చువరకు తలదాచుకొని మౌనముగ జీవించును. నలుడు, ధర్మరాజు, హరిశ్చంద్రుడు వంటి మహాత్ముల జీవితములయందు ఈ సత్యమును గమనింపవచ్చును.
సశేషం...
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక
సహస్ర నామముల తత్వ తేటగీతి పద్యాల వివరణ
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
🌻 10. 'మనోరూపేక్షుకోదండా' 🌻
యిచట సంకల్ప ము వికల్పము లను కలుగ
చేసి, విశ్వాత్మ చైతన్య మే సహజము
గాను, జీవుల మనసులో వ్యక్త మయ్యె
మనసు చిత్తము ప్రవృత్తి యు మాత శక్తి
చక్రము వలెను వేడిసెగలు మహాగ్ని
తిరిగి, పాదాల నుండియు తల వరకుయు
కాంతులు విరజిమ్మియు, లంబ మార్గ మయ్యె
పుత్తడి మెరుపు, సర్వము వ్యాప్తి చెందె
జీవి తమ్ముసారములను రుచిని చూపి
తల్లి ఆధీన ములలోన మనసు తృప్తి
పరచి, లేనట్టిది వికార చేదు చుండు
తల్లి సాన్నిధ్యమున ఉండు మనసు శాంతి
అలసట పడిన మనసుకు కష్ట పడక
ఇక్షు దండము రక్షగా అమ్మ ఉంచి
సకల భయమును పోగొట్టు అంకుశమ్ము
ఉంచి మనసుతేలిక పర్చు మాత శక్తి
--(())_-
ఇక్షు కోదండమనగా చెఱకువిల్లు. జీవుని మనస్సు రూపమున దేవియే ఈ విల్లును ధరించియున్నది. చేతన దేవియైనపుడు అందుండి వ్యక్తమైన మనస్సు ధరించు కోరిక కూడ ఆమె ఆధారముగ నున్నదియే
కదా! జీవి మనసుయందు ఏర్పడు వేలాది సంకల్ప వికల్పములు యిచట సూచింపబడుచున్నవి.
మనసునకు కలుగు ఈ సంకల్ప వికల్పములకు చైతన్యమే ఆధారము. దేవి విశ్వాత్మ చైతన్యమే. ఆ
చైతన్యమే ప్రతి జీవియందును జీవచైతన్యముగ భాసించుచుండును. దాని ఆధారమున జీవుల మనస్సుల నుండి చిత్తప్రవృత్తులు వ్యక్తమగు చుండును.
దేవి హస్తమందలి చెఱకు విల్లు, భక్తుడు తన మనస్సుగా భావింపవలెను. తన మనస్సు అనెడి విల్లు దేవి అధీనమున నున్నదని ధ్యానింపవలెను. దేవికి సమర్పణ చేయబడిన మనస్సుగా తన మనస్సును మలచుకొనవలెను. ఆమె అధీనముననున్న తన మనస్సు చెఱకు రసము వలె జీవిత సారమును రుచి చూపించగలదు. ఆమె అధీనమున నిలువని మనస్సు వివిధములైన వికారములను పొందుచుండును.
చెఱకు తీపి తెలిసిన మానవుడు దానినే మరల మరల పొందుటకు ప్రయత్నించునట్లే దేవి అధీనమున చేరిన మనస్సు అదే విధముగ ఆమె సాన్నిధ్యమందు చేరుటకు ప్రయత్నించగలదు. ఒకవైపు పాశము, మరియొకవైపు అంకుశము.
డోలాయమానముగ జీవిని త్రిప్పలు పెట్టుచుండగా అలసట చెందిన మనస్సునకు ఇక్షుదండము ఉపాయమును సూచించు చున్నట్లు దేవి రూపమును ఇచట ప్రస్తుత పరచబడినది.
“నా వలెనే నీ మనస్సు కూడ దేవుని అధీనమున నిలుపుము. అప్పుడు పాశము, అంకుశము బారినుండి నీవు రక్షింపబడుదువు”
హస్తమునందలి ఇక్షుదండము బోధించుచున్నదని
గ్రహింపవలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక
సహస్ర నామముల తత్వ తేటగీతి పద్యాల వివరణ
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
* 11. 'పంచతన్మాత్రసాయకా' *
పంచతన్మాత్రలు బాణములుగా గలది. దేవి నాలుగవ హస్తమున పంచతన్మాత్రలు అను ఐదు బాణములు ధరించి యున్నదని అర్థము.
హస్తమున ఐదు బాణము లుండి సర్వ
సృష్టి కర్తగా రూపము, రసమును, పంచి
స్పర్స, శబ్దము, గంధము, మనసు కిచ్చి
సర్వ గుణములు నందించె మాతృ మూర్తి
అంబరము శబ్ద తత్వము గాను ఉంచి
స్పర్శ వాయు లక్షణము గా హృదయ మిచ్చి
రూపము వెలుగు లక్షణ మునియు కాంతి
నిచ్చి, రుచి జల లక్షణము అనియు తెల్పె
వాసన పృథివీ లక్షణము అనియు తల్లి
పంచభూతము లును తెల్పె మాతృమూర్తి
పంచ తన్మాత్ర లకు ఇట్టి బంధ ముండె
చెవులు శబ్దము వినుటకు, అమ్మ కృపయు
వాయువు, వలన స్పర్శయు చర్మ మందు
వెలుగు వలన రూపము కన్ను చూచు చుండు
జలము వలన రుచి తెలుపు నాలు కుండె
పృథివి వలన గంధపు వాస నిచ్చు ముక్కు
అంతరంగము దివ్యంగ ఉన్న యడల
బాహ్య ఆకర్షణలు తగ్గి భక్తి పెరుగు
పరమ పురుషుని కర్మేంద్రియముల యందు
పంచతన్మాత్ర లందును అమ్మ దయయు
అంతరంగమున మొసళ్ళు రెండు ఉండు
విజ్ఞాన మనేటి మొసలి మనసు చేరి
గర్వమును తెచ్చి దంభము వచ్చి చేరు
తెలియ నట్టి వారిని అవ హేళనమ్ము
పరులు నింద ఆత్మస్తుతి దినము చర్య
చదివి పట్టుబడియు మొస లికిని చిక్కు
అహమనునదియు చేరియు త్రిప్పు చుండు
సూక్ష్మతరమైన పంచార మమ్మ కృపయు
పంచ భూతములతొ ను జ్ఞానేంద్రియమ్ము
సర్వ సంకల్ప ములనుఅందించు తల్లి
ఉద్భ వించెను నాలుగు చేతు లల్తొ
సర్వ లోకాల్ని రక్షణ చేయు తల్లి
--(())--
🌻 11. 'పంచతన్మాత్రసాయకా' 🌻
3. మనోరూపేక్షు కోదండా పంచ తన్మాత్ర సాయకా నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మండమండల
పంచతన్మాత్రలు బాణములుగా గలది. దేవి నాలుగవ
హస్తమున పంచతన్మాత్రలు అను ఐదు బాణములు ధరించి యున్నదని అర్థము.
రాగమను పాశము, క్రోధమను అంకుశము, మనోరూపమైన ఇక్షు దండము మూడు బాహువులలో ధరించి యున్నట్లుగా ముందు తెలుపబడినది.
నాలుగవ బాహువునందు సృష్టి నిర్మాణ కారకులైన శబ్దము స్పర్శ రూపము రసము (రుచి) గంధములు ఈ ఐదు బాణములు- శబ్దము ఆకాశగుణము. స్పర్శ వాయు లక్షణము. రూపము వెలుగు లక్షణము. రుచి జల లక్షణము. గంధము లేక వాసన పృథివీ
లక్షణము.
పంచభూతములకు, పంచతన్మాత్రలకు ఇట్టి అనుబంధము కలదు. అటులనే శబ్దము వలన వినుట, అది వినుటకు చెవి; వాయువు వలన స్పర్శ, అది గ్రహించుటకు చర్మము; వెలుగు వలన రూప దర్శనము, అది చూచుటకు కన్ను, జలము వలన రుచి, రుచి చూచుటకు నాలుక; పృథివి వలన గంధము, అది వాసన చూచుటకు ముక్కు ఐదు జ్ఞానేంద్రియములుగ ఏర్పరుపబడును. ఇట్లు పంచతన్మాత్రలు, పంచభూతములు, పంచజ్ఞానేంద్రియములు వెరసి పదిహేను తత్త్వములుగా ఏర్పడుచున్నవి.
ఇవి నిజమునకు అయిదే, ఒక్కొక్కటి త్రివిధముగ విభజివింపబడి పదిహేనుగ గోచరించుచున్నవి. ఇందు ఒక్కొక్క త్రిభుజమున ఒకదానికన్న నొకటి సూక్ష్మముగ నుండును. ఇంద్రియము స్థూలము. అందు పని చేయు తన్మాత్ర సూక్ష్మము. ఆ తన్మాత్రకు ఆధారముగ నున్న ఆకాశాది భూతములు సూక్ష్మతరములు. “పరతత్త్వమును పంచీకరణము చేయుచున్నాను” అని ఈ హస్తము నందలి ఐదు బాణముల ద్వారా దేవి సూచించుచున్నది.
ఈ పంచీకరణమే లేకుండినచో సృష్టి కేవలము త్రిగుణాత్మకముగ, సూక్ష్మముగ నుండెడిది.
"పంచభూతాత్మకమైన సృష్టి నిర్మాణము చేయుచున్నాను" అని తెలుపుటకే పంచ బాణములు.
పంచభూతములు, పంచతన్మాత్రలు, పంచేంద్రియములతోపాటు పంచ కర్మేంద్రియములను కూడ ఏర్పరచుటచే అందు పరతత్త్వము నాలుగు స్థితులలో వర్తించగలదు (వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ స్థితులు), ఇట్లు నాలుగు వ్యూహములు, నాలుగు పంచారములను అధిష్ఠించి యుండినట్లు దేవి ఇరువది నాలుగు తత్త్వములుగ (గాయత్రీ ఛందస్సుగ) సృష్టి నిర్మాణము చేయుచున్నదని గ్రహించవలెను. పై తెలుపబడిన పంచారములే పంచముఖిగను, పంచభుజిగను లేక మకరముగను పెద్దలు పేర్కొందురు.
'మ' అను అక్షరమునకు సంఖ్యా శాస్త్రమున విలువ '5'. ఈ సందర్భమున మకరమును గూర్చి కొంత గ్రహించుట ఆవశ్యకము.
మకరమనగా మొసలియని కూడ అర్థము కలదు. అనగా పట్టి యుంచునది అని అర్థము. నాలుగు మకరములు పరతత్త్వమును నాలుగు స్థితులలో పట్టియుంచినవని గ్రహింపవలెను.
“పరమ పురుషుని కర్మేంద్రియముల యందును, జ్ఞానేంద్రియముల యందును, పంచతన్మాత్రల యందును, పంచభూతముల యందును ఇమిడ్చి యుంచు చున్నాను. అట్టీముడ్చుట అతని సంకల్పము. ఆ సంకల్పమును నిర్వర్తించుటకే నేను చిదగ్నికుండము నుండి చతుర్భాహువులతో ఉద్భవించితిని అని దేవి సందేశ మిచ్చుచున్నది.
దేహముయొక్క పట్టు, ఇంద్రియముల యొక్క పట్టు, జీవునకు బంధహేతువు లగుచున్నవి. బహిరంగమున కల వైభవమునకు ఆకర్షింపబడుట వలన ఈ పట్టు ఏర్పడుచున్నది. అంతరంగ మందలి దివ్యత్త్వము నందు ఆకర్షణము కలిగి, పెరిగినచో బహిరంగ ఆకర్షణలు తగ్గును.
భాగవతమందలి గజేంద్ర మోక్షణము ఈ ధర్మమునే తెలుపుచున్నది. సరస్సునందలి జలముల యందు అత్యాసక్తి (నీరాశ) కలిగి, గజేంద్రుడు ప్రవర్తించుటచే పట్టుబడెను. అంతర్యామి యగు భగవంతుని శరణు
కోరి మోక్షణము పొందెను.
అంతరంగమున కూడ సూక్ష్మముగ, సూక్ష్మతరముగ మరి రెండు మొసళ్ళు గలవు. అందు మొదటిది విజ్ఞానమునకు లోబడుట. మానవుడు తనకు తెలిసిన విషయములతో ఆనందించుటతో పాటు గర్వపడు చుండును కూడ. గర్వము దంభమునకు దారితీయును.
దంభము ఆడంబరమునకు దారితీయును. అది కారణముగ తెలియని వారిని అవహేళన చేయుచుండును. ఆత్మస్తుతి, పరనింద దినచర్య యందు భాగమగును. చదివినవార మనుకొను వారందరు ఈ మొసలికి పట్టుబడి యుందురు.
సూక్ష్మతరమైన పంచారము తానొకడున్నాడను భావము. దీనినే అహంకార భావ మనిరి. పరతత్త్వమే తానుగా ఉన్నడనియు, తనకు ప్రత్యేక అస్తిత్వము లేదనియు తెలియువరకు ఈ మొసలి పట్టు యుండును. అది తెలుపుటకే ' సోహ మస్మి' అను మహా మంత్రము.
సశేషం....
🌹🌹🌹🌹🌹
12. 'నిజారుణ ప్రభాపూర మజ్జద్ర్బహ్మాండ మండలా'
తన ఎఱ్ఱని కాంతి ప్రవాహము నందు మునిగిన బ్రహ్మాండ మండలములు గలది అని భావము.
ఎర్రని ప్రవాహపు కాంతి ఉద్భ వించు
సృష్టి ఎర్రని కాంతిగా ఉద్భ వించు
సూర్య వెలుగుకు ముందుగా ఉద్భ విందు
కాంతి యే బ్రహ్మ మండలం వ్యాప్తి చెందు
ఎర్రని కాంతియే సౌభాగ్య మిచ్చు చుండు
దివ్య సంకల్ప సంకేత మగుచు ఉండు
నుదుట కన్నుగా ఎర్రని తిలక ముండు
భారతీయుల ముత్తైదువులకు గుర్తు
కాంతిలో సాదు దర్శనం పుణ్య మొచ్చు ,
కాంతిలో స్పర్శయె పాపనాశనము అవ్వు
కాంతిలో సంభాషణము కోటి తీర్థ మవ్వు ,
ఎర్రని కాంతికి వందనం మోక్ష మిచ్చు
దైవ శక్తికి ఎఱ్ఱని తిలక బొట్టు
ఎఱ్ఱని కాంతి ఇచ్ఛాలక్ష్మి వచ్చి చేరు
సత్య అంతర్య మున ప్రజ్ఞ ఎఱుపు గుండు
మానవు ని తెల్వి ప్రతిబింబ మెఱ్ఱ గుండు
మాత అగ్నివర్ణమును కలిగి ఉండు
మాత ఆదిత్య వర్ణము కలిగి ఉండు
మాత దుష్టుల్పై కన్నెఱ్ఱ చేయు చుండు
శృతులు ఎఱుపు శుభము తెలుపు చుండు
--(())--
🌻 12. 'నిజారుణ ప్రభాపూర మజ్జద్ర్బహ్మాండ మండలా' 🌻
తన ఎఱ్ఱని కాంతి ప్రవాహము నందు మునిగిన బ్రహ్మాండ మండలములు గలది అని భావము. సృష్టి ఉదయము, సూర్యుని ఉదయమునకు ముందు ఉద్భవించు కాంతి, ఎఱ్ఱని కాంతి. ఈ కాంతి నుండియే సమస్త బ్రహ్మాండ మండలము ఉద్భవించు చుండును.
ఈ ఎఱ్ఱని కాంతి యందే బ్రహ్మాండము మునిగి యుండును. ఈ ఎఱ్ఱని కాంతి సౌభాగ్య ప్రదము. దివ్య సంకల్ప అవతరణమునకు సంకేతము. భ్రూమధ్యమున భారతీయులు ఈ ఎఱ్ఱని కాంతి ప్రచోదనమునకే తిలకమును దిద్దుకొనుచుందురు.
భగవంతుని ఇచ్ఛాశక్తిగ శ్రీదేవి ఎల్లని కాంతి ప్రవాహముగ మేల్కొనును. సత్సాధకులు ఈ కాంతి ప్రచోదనము కొఱుకే తిలకమును ధరించవలెను. ఇట్లు ధరించుట యాంత్రికముగ కాక ఒక క్రతువుగ నిర్వర్తించవలెను. అట్లు నిర్వర్తించినచో మానవుని యందలి అంతర్యామి ప్రజ్ఞనుండి సంకల్ప ముద్భవించి మానవ మేధస్సుపై ప్రతిబింబిత మగును.
సత్సంకల్పము ననుసరించి జీవించు టయే సౌభాగ్యము. అదియే సంపద. ఎఱ్ఱని కాంతి ప్రవాహముగ దేవిని ఆరాధించుట, ఎఱ్ఱని రూపముగ ధ్యానించుట ఈ నామమందించు సందేశము. అమ్మ అగ్ని వర్ణమని, ఆదిత్య వర్ణమని శ్రుతులు పేర్కొనుచున్నవి.
సశేషం...
__(())--
🌻 13. 'చంపకాశోకపున్నాగ సౌగంధిక లసత్కచా' 🌻
శ్రీదేవి కేశ పాశములు సహజ గంధము గలవి. కావున అవి తమ వాసనను చంపకాది పుష్పముల కొసంగినవనియు, ఆ పుష్పములనామె ధరించుటచే వానికి శోభ కలిగెననియు భావము.
కేశ పాశములకు చంప కాది సహజ
పుష్ప ములు కొసంగినవని శోభ కలిగి
వాసనను అంత కమ్మియు భావ మంత
తెల్పి నవి అన్ని శ్రీదేవి గంధ మయ్యె
ఆమె పుట్టుకలో శిరస్సుయును ముందు
పురుష సూక్తమున పురుషుస్తుతి ని కూడ
శిరము నుండి పాదముల వరకును పూజ
చెందు దివ్యత్వము అవతరణము అయ్యె
చంపక, అశోక, పున్నాగములు సుగంధ
పుష్పముల పరిళము చెందు అమ్మ రూపు
పుష్ప వాసన వల్లనే వెల్గు చున్న
కేశములు కల శ్రీమాత యేను రక్ష
దేవి ఆశపాశ ములనేటి గంధ మున్ను
మనసు ననుభూతి పొంది సంతృప్తి పరుడు
సర్వసుమ గంధ ములు అమ్మ కృపవలన
భక్తు లలొఅమ్మ యందును ప్రేమ ఉండు
--(())--
అగ్నికుండము నుండి దేవి ఉద్భవించుటచే శిరస్సు మొదట కనిపించును. సాధారణముగ దైవ వర్ణనము పాదమునుండి శిఖాంతము వరకు చేయుట పరిపాటి. కాని ఆమె పుట్టుకలో శిరస్సు ముందు కనిపించుటచే శిరస్సు వర్ణన ఆరంభమాయెను. పురుష సూక్తమున పురుషుని కూడ "సహస్రశీర్షా పురుషః” అని స్తుతించు సంప్రదాయము కన్పట్టును.
అవతరణము చెందు దివ్యత్వము శిరస్సు నుండి పాదముల వరకు వర్ణించుట వేద సంప్రదాయమని ఎరుగవలెను. చంపక, అశోక, పున్నాగములు సుగంధము పరిమళించు పుష్పములు. అమ్మ రూపముయొక్క వర్ణనము పుష్ప వర్ణనముతో ప్రారంభింపబడినది. "సర్వము పుష్పార్థము" అని అగ్నిపురాణము తెలుపుచున్నది.
పై తెలిపిన పుష్ప వాసనలతో ప్రకాశించుచున్న కేశములు కలది అని శీరోదయ సమయమున ధ్యానింపవలెను. పుష్పములకు పరిమళము అందించునది శ్రీమాతయే.
అనగా పుష్పము యొక్క సుందర రూపము, సౌకుమార్యము అమ్మ రూపముకాగ అందలి సుగంధము అమ్మ సాన్నిధ్యమే అని తెలియవలెను. మానవులు పుష్పములను ధరించి శరీరమునకు సుగంధము నందింతురు. పుష్పములకే సుగంధము లందించినవి అమ్మ శిరస్సు నందలి కేశపాశములు.
వికసించునది పుష్పము కనుక సృష్టి పుష్పములందుగల సర్వసుగంధము అమ్మ అందించుచున్న సాన్నిధ్యమని తెలియపవలెను. దీని నారాధించుట కారణముగ భక్తుని యందుకూడ అమ్మ సాన్నిధ్య మేర్పడి అతని నుండి సుగంధ వాసనలు వ్యాప్తి చెందుచున్నవి.
మహాత్ము లున్నచోట ఇట్టి సుగంధవ్యాప్తి విదితమే. ఆరాధనమున పుష్పమునకు, సుగంధములకు ఇట్టి ప్రత్యేక స్థానము కలదని తెలియవలెను.
దేవి ఆశపాశముల సుగంధము ననుభూతి పొందినవాడు అదృష్టవంతుడు. ఆ కేశ సమూహమందలి సువాసనతో ఏ పుష్ప సుగంధము సాటిరాదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌻 14. 'కురువిందమణిశ్రేణీ కనత్కోటీరమండితా' 🌻
పద్మరాగ మణులతో గూడి ప్రకాశించు కిరీటముచే నొప్పునది శ్రీ లలిత- అని భావము. ఈ మణుల కాంతి భక్తుల భక్తిప్రపత్తులను వృద్ధి గావించునని తెలియవలెను. గాయత్రి ప్రార్థనమున కూడ ఇట్టి మణుల కాంతిని ఆరాధించు సంప్రదాయము కలదు. గాయత్రి జపము చేయుటకు ముందు
“ముక్తా, విద్రుమ, హేమ, నీల, ధవళ, ఛాయ” వర్ణములను ధ్యానించుట ఇందులకే. ఇట్లు ధ్యానించుటచే భక్తి ప్రపత్తులు వృద్ధిపొంది, మంత్ర జపమున మనస్సు కాంతుల కాకర్షింపబడి రక్తి చెందును.
కురవింద శిలలనుండి పద్మరాగ మణులు పుట్టును. కురువింద స్ఫటికములు నది లోపలనుండు శిలలు. ఆ శిలల గర్భమునుండి మణులుద్భవించును. ఈ మణుల కాంతి సూర్యకాంతి వలెను,
చంద్రకాంతి వలెను, కెంపు, నీలము, పచ్చల కాంతుల వలెను మెరయు చుండును.
ఈ కాంతి అనురాగప్రదము. మనస్సున కాహ్లాదము కలిగించి బుద్ధి యనెడి వెలుగు లోకములలోకి అవి మనస్సు నాకర్షింప గలవు. ఇది కారణముగ దేవతా శిరస్సులను అలంకరించు మణిమయ కిరీటములను ధ్యానించు సత్సాంప్రదాయ మేర్పడినది. మణుల కాంతి స్ఫటిక శిలలనుండి పుట్టుటచే శుభమైన అనురాగము కలిగించును.
కామగుణము వానికి లేదు. వానిని స్మరించుట వలన భక్తి వృద్ధియగును. ఇట్టి మణుల పంక్తిచే ప్రకాశించు కిరీటముతో శ్రీదేవి అలంకరింపబడి యున్నదని ఈ నామము తెలుపుచున్నది.
శుద్ధమైన స్పటికముల నుండి వ్యక్తమగునది సప్త వర్ణములు కలిగిన సూర్యకాంతియే. స్ఫటికమునకు గల స్పష్టత వలన వాని నుండి కాంతి ప్రకాశము కలుగుచున్నది. సాధకుడు నిర్మలమైన మనస్సుతో కాంతిని ధ్యానము చేయుటచే తన నుండి కూడ అట్టి కాంతులు ప్రకాశితము లగును. సూర్యుడు ఆత్మకు ప్రతీక.
ఆత్మ శుద్ధమగు మనసేంద్రియ శరీరముల నుండి ప్రకాశించుటయే స్ఫటిక శిలల నుండి వికసించు కాంతులుగ తెలియవలెను. ఈ నామమున వర్ణముల (రంగుల) ధ్యానము ప్రత్యేకముగ ప్రతిపాదింపబడినది. ఈ ధ్యానము మనస్సును భక్తియందుంచి రక్తి కలిగించును.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌻 15. 'అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితా' 🌻
. అష్టమి చంద్రుడు అర్ధచంద్రుడు. సగము దృశ్యముగను, సగము అదృశ్యముగను, అష్టమినాడు చంద్రుడు గోచరించును.
అఫ్టమికళను ఆరాధనలుగ అమ్మ
అర్ధ చంద్రుని బింబపు కళలు అయ్య
ధ్యాన మార్గమ్ము ఒక్కటే ఇరువురి కళ
గోచరింప బడిన బ్రహ్మ వెలుగు కళలు
ఆయన కనబడు టయును ఆమె వలన
అయ్య వారి శోభనమూర్తి గోచ రించి
పూజల వలన రుచులను చూడ వచ్చు
ఆయన కనపడుట ఆమె వెలుగు మధ్య
జరుగు చున్నకొలది పదార్ధము పెరుగుట
పెరుగుచున్న కొలది పరమార్ధ మవ్వు
దృశ్య అదృశ్యము సమతూక మగుచు ఉండు
స్థితిని పూర్ణయోగముగను తత్వ మవ్వు
సగము అదృశ్యము అష్టమి చంద్రుడుగను
అష్టమిన సగముగ చంద్ర గోచరమగు
సృష్టి యందు ప్రకృతి పురుషులు గ యిట్లె
కనబడు నది అసంపూర్ణ దృష్టి ఇదియె
కనబడునది ఆధారము గ కనబడును
సగము కనబడి సగమ గుపడక ఉండు
శుక్ల అష్టమి కనబడు కృష్ణ అష్ట
మిన కనబడదు రెండును తత్వ ములగు
--(())--
అష్టమి చంద్రుడు అర్ధచంద్రుడు. సగము దృశ్యముగను, సగము అదృశ్యముగను, అష్టమినాడు చంద్రుడు గోచరించును. సృష్టి యందు ప్రకృతి పురుషులు యిట్లే యుందురు. కనపడునది మాత్రమే చూచుట అసంపూర్ణ దృష్టి.
కనపడునది ఆధారముగ కనపడనిది ఊహించవలెను, భావించవలెను. పూర్ణమైన చంద్రబింబము సగము భాగము కనుపించనపుడు ఆ మిగిలిన భాగము లేకుండునా? ఉన్నది. అగుపడక ఉన్నది.
అటులనే సృష్టియందు దివ్యమైనది అగుపడక ఉన్నది. లేదు అనుకొనుట అల్పత్వము. అర్ధ చంద్రబింబము దీనినే సంకేతించుచున్నదా అన్నట్లు ఉండును. శుక్లాష్టమినాడు కనపడిన భాగము కృష్ణాష్టమినా డగుపడదు.
అటులనే కృష్ణాష్టమి నాడు అగుపడు భాగము శుక్లాష్టమినాడగు పడదు.
రెండును అర్ధచంద్రాకారములే అయినను, ఒకటి కాదు. రెండు తత్త్వములు సృష్టిలో ఒకదానికొకటి ఆలంబనములు. ఒకటి పెరుగుచున్న, రెండవది తరుగుచుండును.
పదార్థము పెరుగుట జరుగుచున్న కొలది, పరమార్థము అదృశ్య మగుచుండును. అటులనే పరమార్ధము పెరుగుచున్న కొలది పదార్థము అదృశ్య మగుచుండును. రెండునూ సమతూకముగా నున్న స్థితిని పూర్ణయోగ మందురు. అష్టమి అట్టి యోగమునకు సంకేతము. అర్ధనారీశ్వరుని తత్త్వము దీనినే బోధించును.
గోచరింపనివాడు అవ్యక్త బ్రహ్మము. గోచరింపబడునది అతని వెలుగు. అదియే అమ్మవారు. తాను గోచరించి, గోచరింపని వానిని తెలియబరచు చుండును. అమ్మవారు, అయ్యవారి శోభనమూర్తి. ఆమెను పూజించుట ద్వారా ఆయనను రుచి చూడవచ్చును. ఆయన కనపడుట ఎపుడును ఆమెగనే యుండును. కేనోపనిషత్తు ఈ విషయమును ప్రతిపాదించు చున్నది.
అష్టమి కళను అమ్మవారిగ ఆరాధించుచు, మిగిలిన కనబడని అర్ధచంద్ర బింబమును అయ్యవారిగ ఊహించుచు ధ్యానము చేయు మార్గ మిచట తెలుపబడుచున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌻 16. 'ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా' 🌻
చంద్రుని వంటి అందమైన ముఖము నందు చంద్రుని లోని మచ్చవలె కస్తూరి బొట్టును దాల్చినది అని అర్థము. వేదకాలము నుండి భారతీయ సంప్రదాయమున ఫాలభాగమున కస్తూరి బొట్టును అలంకరించుకొనుట కలదు. చాక్షుష మన్వంతరమున మానవు లందరికి నీ మూడవ కన్నుకూడ పనిచేయు చుండెడిది. కాలక్రమమున కామము పెరుగుటచే కాంతులీను దేహములు మరుగుపడి స్థూల దేహము లేర్పడుచు మూడవ కన్నును కప్పివేయుట జరిగినది. మూడవ కన్ను ఆజ్ఞా కేంద్రము.
దైవము యొక్క ఆజ్ఞ లేక సంకల్పము జీవునకు తెలియు స్థానము. మానవుల కత్యున్నత ప్రజాస్థానము. ఆ స్థానమును స్పృశించుచు, కస్తూరితో అలంకరించుకొనుచు అచటి ప్రజ్ఞను మేల్కాంచునట్లు చేయు విధానమొకటి ఉండెడిది. దానికి సంబంధించిన క్రతువును ప్రతిదినము, స్నానమాచరించిన పిదప స్త్రీలు, పురుషులు కూడ నిర్వర్తించుకొను చుండెడివారు. దైవాజ్ఞ తనయందు భాసింప, దానిని దినమంతయు అనుసరించుటకు ఉద్యుక్తులగుటకే ఈ క్రతువు.
కాలక్రమమున అంతర్షితమైన అర్థము మరుగై అలంకారప్రాయముగ మిగిలినది. అటుపై మ్లేచ్ఛుల సంపర్కమున భారతీయ పురుషులీ సంప్రదాయమును వదలినారు. ఉత్తర భారతమున స్త్రీలు కూడ వదలినారు. శ్రీవిద్యా ఉపాసకులు నేటికిని ఈ సంప్రదాయమును అనుసరించు చుందురు.
ఇతరులు వారి వారి భక్తిశ్రద్ధలను బట్టి అనుసరించుదురు. అమ్మవారు ముఖమున గల కస్తూరి బొట్టు మన యందలి ఆజ్ఞ యను ప్రజ్ఞను గుర్తు చేయునదిగ గోచరించును.
చంద్రబింబమందలి మచ్చతో ఫాలభాగమందలి బొట్టును పోల్చుటలో కూడ అంతరార్థ మిమిడి యున్నది. మృగనాభి యనగా చంచలమగు బిందుస్థానము. బిందుస్థానము అంతర్యామి ప్రజ్ఞలకు, అహంకార ప్రజ్ఞకు నడుమ ముఖద్వారము. అంతర్యామి ప్రజ్ఞ బిందువాధారముగ ప్రత్యగాత్మ లేక అహంకార ప్రజ్ఞయందు భాసించును.
కాని, అహంకార ప్రజ్ఞను మాయ ఆవరించినపుడు ఈ బిందువు మాయమగును. అనగా, అంతర్యామి ప్రజ్ఞనుండి వేర్పాటు కలుగును. అహంకార ప్రజ్ఞ స్మరించినప్పుడే అంతర్యామి ప్రజ్ఞ సాన్నిధ్యము నిచ్చును. స్మరింపనపుడు మాటుగ నుండును. అందువలన బిందువును చంచలాత్మకమగు మృగము(లేడి)తో పోల్చిరి. చంద్రుని యందలి మచ్చను కూడ అంతర్యామి ప్రజ్ఞకు అనగా మొత్తము వెలుగునకు, బింబాకారముగ ఏర్పడిన వెలుగునకు అనుసంధానము నేర్పరచు బిందువు భావించవలెను.
పూర్ణచంద్రుని యందలి మచ్చ “ఈ కాంతి నాది కాదు, నా నుండి వెలువడుచున్నది” అని తెలుపుచున్నది. అటులనే అమ్మవారి ముఖమందలి కాంతి పరతత్త్వము యొక్క ప్రతిబింబమే అని తెలుపుచున్నది.
ఫాలభాగమున తిలకమును దిద్దుకొను వ్యక్తి కూడ అంతర్యామి ప్రజ్ఞయే తన నుండి భాసించు చున్నదని భావన చేయవలెను. ఈ బొట్టు దివ్య సంకల్పములకు ద్వారమై వ్యక్తులను నడిపించగలదని మూల భావము. “Father thy will be done, not mine" అని తెలుపుటకే ఫాలభాగమందలి తిలకము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
17*వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా' 🌻
మన్మథుని గృహముతో సాటివచ్చు అందముగల ముఖము శ్రీదేవి ముఖమై యుండగా ఆ గృహమున కేర్పరచిన అందమైన తోరణములవలె ఆమె కనుబొమలు ప్రకాశించుచున్నవని భావము.
ముఖము శ్రీదేవి ముఖమై కళలను కల్గి
సాటి వచ్చు మన్మధునిగృహముగ కల్గి
ఆమె కనుబొమలు ప్రకా శించు చుండి
అందమైన తోరణములవలెను వెల్గు
తోరణములు గృహమునకు పావన మగు
అశుభ ములుఉండక శుభము కలుగు చుండు
నమ్మ కమ్ముతో దివ్య జీవన ము సాగు
మకర తోరణముగ జ్యోతి వెలుగు పంచు
ఆరు నెలలును దక్షిణాయనపు వెల్గు
జీవుల ప్రజ్ఞ ఊర్ధ్వముఖముగ వెల్గు
కాలమునకు పరాకాష్ట మగుట వెల్గు
శిఖర ము వసంత నవరాత్రు లకును వెల్గు
పర్వదినములలొ తోరణముల వెల్గు
చైత్ర మకరము కర్కాట కముల వెల్గు
సృష్టి కామేశ్వరీ మహేశ్వరుల వెల్గు
సృష్టి మన్మధుని గృహము వల్లె వెల్గు
--(())--
మన్మథుని గృహముతో సాటివచ్చు అందముగల ముఖము శ్రీదేవి ముఖమై యుండగా ఆ గృహమున కేర్పరచిన అందమైన తోరణములవలె ఆమె కనుబొమలు ప్రకాశించుచున్నవని భావము.
తోరణములు గృహమునకు శుభప్రదములు. ఏ గృహమునకైనను మకర తోరణము లేర్పరచినపుడు ఆ గృహము పావనమగును. అశుభము లుండవు. ఇది భారతీయుల నమ్మకము. మకర తోరణము దివ్య జీవనమునకు సంకేతము. సంవత్సర చక్రమందలి ఉత్తరాయణ కాలమైన ఆరు నెలలు, మకర తోరణమని జ్యోతిషము ఘోషించుచున్నది.
దక్షిణాయనము ఆరునెలలు రాజ తోరణమని తెలుపుచున్నది. మకర తోరణము జీవుల ప్రజ్ఞను ఊర్థ్వ ముఖముగ గొనిపోవును. వసంత నవరాత్రి కాలమునకు పరాకాష్ఠకు చేరును. మకర మాసము నుండి కర్కాటక మాసము వరకు గల ఆరు నెలలలో వసంత నవరాత్రులు
శిఖరముగ ఏర్పడును. సమస్త సృష్టి కామేశ్వరీ - కామేశ్వరుల కామము నుండి ఏర్పడినదే! సృష్టి మన్మథ గృహము.
అందు అధో ముఖమునకు ఊర్థ్వముఖమున జీవులు ప్రయాణించు దారులు, మెట్లు కలవు. శ్రీదేవి కనుబొమలు జీవుల ప్రజ్ఞను ఊర్ధ్వముఖమునకు ఆకర్షించు తోరణములుగా వర్ణింపబడినవి. గృహతోరణములు కూడా దివ్యజీవనమునకు పునరంకిత మగుటకై ఏర్పరచుకొనవలెను గాని, కేవల మలంకారప్రాయముగ కాదు.
పర్వదినమునందు తోరణములు కట్టుకొనుటలో ఇంతటి గంభీరమైన భావము కలదని గుర్తింపవలెను. శ్రీదేవి అనుగ్రహము లేక ఊర్థ్వముఖముగ ఎవరు చనగలరు? ఆమె కనుబొమలు ఉత్తమ లోకముల ప్రవేశమునకై అనుమతి నిచ్చునట్లుగ ప్రార్థింపవలెను. చైత్రము మకరము కర్కాటకము.
సశేషం....
*****
🌻 19. 'నవచంపకపుష్పాభ నాసాదండ విరాజితా' 🌻
చంపక పుష్పమనగా సంపెంగ పువ్వు. సంపెంగ పువ్వు వంటి అందమైన నాసికతో అమ్మవారు విరాజిల్లుతూ యున్నది అని భావము.
అపుడె వికసించె సంపెంగ పువ్వు అమ్మ
కాంతి వంతముగను ఉండు నవ్వు మోము
అద్భుతమ్ముగ పరిమళ ములను జల్లు
మృదువు గానుండి ఆద్యంత మూను రక్ష
అమ్మ నాసిక పరిమళ మిచ్చు చుండు
ఇంద్రియము నాసిక పరిమళములు చూపు
భక్తునకు అమ్మ సంపెంగ వాసనిచ్చి
తన్మయపరచి ఆనంద పరుచు అమ్మ
సత్వగుణ భక్తి తెల్పియు ఆదు కొనెటి
అమ్మ నిత్యము తాదాత్మ్య స్థితి పెంచు
భక్తునకు సత్య మార్గము చూపు తల్లి
జీవి నాసికా ఘంధము అమ్మ కృపయె
--(())--
అది కూడా నవచంపక మగుటచే అనగా అప్పుడే వికసించిన సంపెంగ పువ్వని విశేషార్థము. అప్పుడే వికసించిన సంపెంగ పువ్వు ఎట్లుండును? అను విషయముపైన భక్తుడు లోతుగ భావన చేయవలెను. అట్టి పువ్వు అత్యంత మృదువుగ నుండును. కాంతివంతముగ నుండును. అద్భుతమైన పరిమళములను వెదజల్లుతూ యుండును.
పరిమళము నామ్రాణించు ఇంద్రియము నాసిక. అమ్మ నాసిక పరిమళ స్వరూపమేయని తెలియవలెను. అంతియే కాదు, పరిమళ పూరితమగు సంపెంగ పువ్వును చూచినప్పుడు నిజమైన భక్తునకు అమ్మ నాసిక దర్శనమీయ వలెను.
అమ్మ నాసికను చూచుటకు వెట్టి ఆవేశమును పొందుటకన్నా- సంపెంగ పువ్వును చూసినపుడు అమ్మ నాసికను దర్శించుట సత్వగుణ భక్తి.
ఈ భావముచే ఋషి మనకు నాసికా దర్శనము చేయించు చున్నాడు. అట్టి భావన ప్రాతిపదికగా సంపెంగపువ్వు పరిమళమును ఆమ్రా ణించు భక్తునకు తాదాత్మ్య స్థితి అప్రయత్నముగ కలుగును.
సృష్టియందలి సుగంధమును ఆస్వాదించు స్వభావము గల భక్తునకుప్రతిష్ఠితయై యున్నది అని కూడ భావన చేయవచ్చును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
35. 'లక్ష్యరోమ లతాధారత సమున్నేయ మధ్యమ' 🌻
కంటిచే చూడదగిన నూగారు తీగకు ఆధార మగుటచే ఊహింపదగిన నడుము కలది. అనగా నడుము వున్నదా? లేదా? అను సందేహము కలిగి, అచట పుట్టిన నూగారుచే నడుము కలదని ఊహింపబడు చున్నది.
సమ్మోహనాల కవిత.. ఈశ్వరా
కంటిచే చూడదగి
చూచు నడుమును కలిగి
కలిగి వున్న దా సందేహముల ఈశ్వరా
నూగారు చే నడుము
నడుము ఇక చూడుము
చూడుము ఇక ఊహలు ఊసు లే ఈశ్వరా
సూక్ష్మ మైన దే ఇక
ఇక చక్షువు లకు ఇక
ఇక గోచరము కారణముగా నె ఈశ్వరా
మాయా తీత మైన
యైన ట్టి నడుము కన
కనపడని సృష్టి కిని మూల మే ఈశ్వరా
సూక్ష్మ లోకములోని
లోన అగు పడని వాణి
వాణి సృష్టికి మూలమైన ట్టి ఈశ్వరా
నడుము పై భాగమే
భాగము అ దృశ్యమే
దృశ్యమే దివ్య అమృత మయ మగు ఈశ్వరా
సూక్ష్మ బుధ్ధి కే ఇక
ఇక శక్తి చూపు ఇక
ఇక తెలిసి నది తెలుపు మనసు యే ఈశ్వరా
నూగా రు లత తీగ
తీగ నడుము ఊగ
ఊగ ఊయల తలుపులు సంతృప్తి ఈశ్వరా
పరిమిత మైన వయసు
వయసు మిత మై సొగసు
సొగసు తగ్గ నడుము యు క్రమము గ ఈశ్వరా
"కనఁగనె భయము తొలగెను
తొలగేను, వినగలను
వినగలను నామము మనసు తృప్తి ఈశ్వరా
మనమున వేడ్కయె ఇక
ఇక సునయన ము పలుక
పలుకు సత్యమ్ము నిత్యముగా ఈశ్వరా
--(())--
[20:50, 30/09/2020] Mallapragada Sridevi: దుష్ట దానవ భంజ ని మాత లలిత
శిష్ట నరులను పోషిణి మాత లలిత
అష్ట ఐశ్వర్య దాయిని మాత లలిత
ఇష్ట మిచ్చుప్రదాయిని మాత లలిత
[21:02, 30/09/2020] Mallapragada Sridevi: ధర్మ రక్ష విచక్షణి మాత లలిత
బ్రహ్మ సృష్టిని శ్రీకరి మాత లలిత
కర్మ నిర్మూల కాలిని మాత లలిత
మర్మ మెరిగి యు రక్షణి మాత లలిత
[21:22, 30/09/2020] Mallapragada Sridevi: కంటి వెలుగులో కారుణ్య మాత లలిత
వంటి ధారుడ్య సర్వశ్రీ మాత లలిత
ఇంటి లక్ష్మిగ సంతోషి మాత లలిత
పంటి బాధను తొలగించు మాత లలిత
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి