ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
మనోధైర్యానికి మార్గాలు -14
విఘ్నేశ్వరుడు : ఏమిటి నారదా ఉదయమే నాదగ్గరకు వచ్చావు, ఇప్పుడు భూలోకంలోకి వెళ్దామని అడుగకు, మరి ఏమైనా అడుగు సమాధానము చెపుతాను.
నారదుడు : నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి నాకు మీరు అవి తీర్చగలరు.
విఘ్నేశ్వరుడు : నారదా నీకు కూడా సందేహాల, నీవు లోక సంచారుడవు, అన్ని విషయాలు నీకు బాగా తెలుసు, ఆయినప్పటికి నీకు మాట ఇచ్చాను, అడుగు నాకు తెలిసినవి నీకు తెలియపరుస్తాను, తెలియనివి మాతా పితలను అడిగి తెలుసుకుందాం, దానికైతేనే నేను చెప్పగలను.
నారదుడు: మహాప్రభు మీకు తెలియని విషయాలు ఉంటాయా, నేను భూలోకంలో మానవుల గురించి ప్రశ్నలు వేద్దామని అనుకుంటున్నాను.
విఘ్నేశ్వరుడు : అడుగు నారదా, ప్రతి వినాయక చవితికి వారి భాదలు నాకు వ్యక్తం చేస్తారు, అవి అన్ని నేను తీరుస్తున్నాను అయినా నీవు అడుగు.
(1). మానవులు ఆలోచించాల్సిన ముఖ్యమైన మూడు అంశాలు ఏవి?
ఒకటి : మనకు కనిపించే ఈ ప్రపంచం
రెండు : మనకు కనిపించని దేవుడు
మూడు: ఈ రెంటితో సంభంధం పెట్టుకొనే మనం
(2). విత్తు ముందా చెట్టు ముందా అని ఎప్పుడు వాదనకు దిగుతారు మానవులు ఎందుకు, ఏది ముందు. ?
అదేమిటి నారద పాలసముద్రం లో పుట్టినది వృక్షం కదా, అదేముందు.
(3). పరుగెత్తి పట్టుకోనేదేది, పరుగెత్తి పట్టుకోలేనిది ఏది ?
పరుగెత్తి పట్టు కొనేది బంతి, పట్టు కోలేనిది బంతి ఆకారములో ఉన్న నీటి బిందువు.
(4). పసి పిల్లలకు కావలసినది ఏది ? అక్కర్లేనిది ఏది ?
కావలసినది రొమ్ము పాలు, అక్కర్లేనిది పాలు లేని రొమ్ము.
(5). పసి పిల్లలు ఇష్టపడేది ఏది ? ఇష్టం కానిది ఏది ?
ఇష్టపడేది "నిద్ర" , ఇష్టం కానిది చీమలు కుట్టే నిద్ర
(6). పసిపిల్లలను కొందరు ప్రేమిస్తారు, కొందరు ద్వేషిస్తారు ఎందుకు ?
ప్రేమిస్తారు అందరు, నాకు పుట్టలేదే అని ద్వేషిస్తారు కొందరు.
(7). పసి పిల్లలు ముందు ఆకర్షించేది ఎవ్వరిని, తరువాత ఎవ్వరిని ?
ముందు "తల్లిని" తర్వాత తండ్రిని, బొమ్మలను
(8). పసి పిల్లలు వెలుతురు చూసి ఏడుస్తారు ఎందుకు ?
సూర్యకిరణాల వేడిని తట్టు కోలేని పసిహృదయాలు, భూలోకంలో పుట్టాను నేను ఏంచేయాలో తెలియక ఏడుస్తారు.
(9). పసిపిల్లలను జాగర్తగా చూడాలి ఎందుకు ?
కొందరి కళ్ళు పాపిష్టివి, దిష్టి తగలుతుంది, కొన్ని జంతువులు అతి ప్రేమ చూపించి తింటాయి.
(10). పావురాల్లను చూసి పిల్లలు సంతోష పడతారు ఎందుకు ?
అవి ఎవ్వరికి ఏమి హాని చేయవు, పిల్లలు సంతోష పడతారు, కాని పెద్దలే వాటిని వండుకొని తింటారు
(11) వయసులో ఉన్నవారికి నచ్చేది ఏది, నచ్చనిది ఏది?
నచ్చేది " ప్రేమ " నచ్చనిది "సలహా" "
(12.) వయసులో ఉన్నవారికి కావలసినది ఏది, అక్కరలేనిది ఏది ?
కావలసినది "ఉద్యోగము మరియు పెళ్లి " ,
అక్కరలేనిది "చెడు అలవాటు "
(13) ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కలసి వెళ్తుంటే మంచిమాట,
చెడు మాట ఏది ?
మంచిమాట: "అన్నా చెల్లెలు అని " లేదా ప్రేమికులని,
చెడు మాట లేచి పోయేవారని.
(14) పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు తెలుసుకోవలసినవి ఏవి ?
ఒకరి కొకరు మనసు విప్పి మాట్లాడుకొని, కష్ట సుఖాలు అనుభవించి మనస్సు ప్రశాంత పరుచు కోవటమే జీవితం
నారద ఈరోజుకు నీవు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చాలు , రే పు మరికొన్ని విషయాలు తెలుసుకుందువు, పూజా వేలైనది, తల్లి తండ్రులకు పాద పూజ చేయవలెను.
నారదుడు : అటులనే మహాప్రభు నేను ఒక్కసారి భూలోక సంచారం చేసి వస్తాను.
తెలియనివి తెలుసు కోవటం మంచిది .
మంచిని ఆదరించటం అందరికి మంచిది
మంచిని ఆదరించటం అందరికి మంచిది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి