28, ఏప్రిల్ 2015, మంగళవారం

Self Confidence -12 (comedy children small story)

ఓం శ్రీ రామ్                    ఓం శ్రీ రామ్                         ఓం శ్రీ రామ్
 మనోధైర్యానికి మార్గాలు -12

విఘ్నేశ్వరుడు : ఏమిటి నారదా ఇల్లాంటి బస్సు ఎక్కిన్చావు 

నారదా :  మీరే స్వయంగా ప్రజల కష్టాలు తెలుసు కుంటారని ఇది ఎక్కించాను. 

విఘ్నేశ్వరుడు : మరి ఇంత ఘోరంగా ఉంటారా మానవులు

నారదుడు :  ఇప్పుడే కదా మీరు ఎక్కింది ఇంకా ముందు తెలుసుకో గలుగుతారు 
విఘ్నేశ్వరుడు : సరే నారద ఇంకా బస్సు కదలదే  , ఏమిటి నారద ఇంత  మంది ఎక్కారు ఇది పుష్పక విమానము లాగున్నది. ఇంత  మందిని తీసు కెల్తుందా, ఒక వైపు చవట కంపు వస్తున్నది,  మరోవైపు ఆడవారు,  మొగవారు  మద్యలో వేలాడుతున్నారు, ఒకరి కొకరు రాసుకొని ముందుకు పోతున్నారు, ఇది తప్పు కదా నారదా, చూడు  అక్కడ, ఎట్లా ఉమ్మి వెస్తూన్నదో అక్కదో ఒక స్త్రీ, ఆ ప్రక్కన ఉన్న స్త్రీ పై చేతులు వేసి ఏదో చెస్తున్నాడు, ఇదేమి లోకం నారదా, ఇటు చూస్తె కోళ్ళ గంపలు ఎక్కించారు, అటు చూస్తె పళ్ళ బుట్టలు, పూల బుట్టలు, వాటి ప్రక్కనే చేపల బుట్టలు అన్ని ఇందులోనే పోవాలా నారదా, నన్ను చూసి ఆ " స్త్రీ "  ఏదో అంటుంది నారద నాకేం అర్ధం కావటం లేదు నారదా  ఒక్క సారి విడమరిచి చెప్పు నారదా!
నారదుడు : ఐరవతములాగున్నావు,  రెండు సీట్లు కలసి కూర్చున్నావు,  నాకేం సిగ్గు లేదు,  నేను నీ వళ్ళో కూర్చోనా అని అడుగు తుంది. 

విఘ్నేశ్వరుడు : అదికాదు నారద ఇంకా ఏదో అడుగు తున్నది

నారదుడు :     ఆవిషయం చెప్పనా,

విఘ్నేశ్వరుడు :  చేపమనే కదా నిన్ను అడిగింది

నారదుడు : కొండంత నాకు నీవు అండగా ఉంటె నా వ్యాపారం జోరుగా సాగుతుంది,  ఉంటావా అని అడుగుతుంది, పూటకో  అమ్మాయిని నీకు. 

విఘ్నేశ్వరుడు : ఈ మానవులు ఎప్పుడు మారుతారు, సెల్ లేకుండా డ్రైవింగ్ చేయమంటే చేయరు, జంతువులను ఎక్కించుకో కూడదంటే  ఎక్కిన్చుకుంటారు,  ఇంత వరకు టికెట్టు కొట్టినవారు లేరు, చేయ్ చూపిన చోట బస్సు ఆపుతున్నారు, చేతులు బయట పెట్ట కూడదంటే  పెట్టుతున్నారు,  ఆలస్యంగా బయలు దేరుతారు, తొందరగా పోవాలని వేగం పెంచుతున్నారు ఈ లోకం ఎప్పుడు మారుతుంది నారదా, అన్ని బస్సులు ఇదే రకమా?

నారదుడు :  ఇవి ఒక రకం ప్రజల కష్టాలు, డబ్బు మనది కాదనుకుంటే సుఖాలు వచ్చే బస్సులు కూడా ఉన్నాయి దానికి పోదామా  

విఘ్నేశ్వ రుడు : ఆ బస్సు కుడా ఎక్కి చూద్దామ్ 

 నారదుడు: ఆదిగో అదే బస్సు "గరుడ " ఎక్కుదాం పదా 

విఘ్నేశ్వ రుడు : ఏమిటి ఎంతకు కదలదు

నారదుడు : పూర్తిగా నిండాకా, ఏ. సీ.  వేస్తారు, అప్పుడు  బయలు దేరుతుంది బస్సు . 

విఘ్నేశ్వ రుడు : కనీసము ఆ టి. వి.  పెడితే  బాగుండును కదా
నారదుడు : ఏమిటి టి .వి. చూస్తారా

విఘ్నేశ్వరుడు : కలియుగ భామలు ఎలా ఉంటారో చూద్దామని 

నారదుడు : అదిగో నేనే ఆన్ చేసాను మీ కొసమ్ చూడండి

విఘ్నేశ్వరుడు : ఏమిటి ఆ ముద్దులు ఆ నాయకా నాయకుల పాటలు 

నారదుడు : మొత్తం పాట  వినండి మహాప్రభు  

విఘ్నేశ్వరుడు : అట్లాగే
 

"మారక మారక అని మదిని తోలచకు మదనా 
మత్తు మత్తుగా మైమరిపించి వేళ్ళకు మదనా
మరుమల్లెల వాసన చూసి ఎత్తులు వత్తవా మదనా 
మనసు మనసు కలవక మతి పోగొడతావా మదనా

గాలిలా వెంబడించి మనసు దోచావే మాధురి 
గాళంవెసి గలగలా మనసును మర్చావే మాదరి
సవ్వడి చేసి సర్దుకొని, దోచుకొని  పొంమంటావా  మాధురి
మనసు కలవక ముందే మతి పోగోడుతున్నావు మాధురి 

వరుస వరుస అని ఒకటే వరసగా వేదించకు మదనా 
వలపులన్ని వయ్యారంగా వడుపుగా ఉంచాను మదనా
  వద్దు వద్దు అనక వచ్చి వలపును జుర్రుకోవే మదనా 
వడిసిపట్టు వదలక వలపు ముద్దు తీసుకోవేమి మదనా

జల జల జారే నదిలా జాలువారే కొంగు జార్చవే మాధురి
జవసత్వాలు ఉడి కించి నన్ను ఉల్లాస పరచవే మాధురి
జయాప జయాలు ఉండవే ఉండవు దీనికి మాధురి
జల్లు పడుతుంది జలదరింపు తగ్గించి పోవే మాధురి"
  
విఘ్నేశ్వరుడు:  బాగుంది నారదా పాట, బస్సు చాలా వేగంగా పోతున్నది నారదా 

నారదుడు : ఒక్కసారి బ్రేక్ వేస్తాడు మత్తులో ఉన్నాడు జాగర్త 

విఘ్నేశ్వరుడు: : అమ్మ , నాన్న అని కెవ్వు మని కాక పెడుతూ దొర్లి  పడ్డాడు

పర్వతీ పరమేశ్వరులు : ఏమైంది తండ్రి,  అంత  గావు కేక పెట్టావు, 

విఘ్నేశ్వరుడు: : నేను ,నారదుడు కలసి భూలోకంలో వెళ్ళినట్లు కలవచ్చింది, గరుడ బస్సు ఎక్కి నట్లు, బ్రేక్ వేయటం వల్ల పడ్డట్టు కల వచ్చింది. 

పార్వతీ పరమేశ్వరులు : బాబు నీకు  అంత  తొందరెందుకు, భూలోకం వెళ్లాలని ఆశ ఎందుకు, మేము చెపుతాము అప్పుడు వెళ్ళవచ్చు 
   
విఘ్నేశ్వరుడు: : మాతా.   పితలార నేను ఆవిషయమే నారదునికి చెపుతున్నాను అమ్మానాన్నల అనుమతి తీసుకొని భూలోకం  పోదామని అన్నాను. 

పార్వతీ పరమేశ్వరులు: "  బాబు జాగర్త, మేము లోకాలన్నిటిని జాగర్తగా గమనించాలి", నారదా నీ గాణామృతముతో మా బాబుకు జోల పాడు నిద్ర పోతాడు. భూలోకాన్ని చూసి భయపడి నట్టున్నాడు   

నారదుడు :  అటులనే 
కలలు నిజము కావు- కలలు భయ పెడతాయి -
 కష్టపడే వారికి కలలే రావు - దిగులు పడేవారికి కళలు వస్తాయి  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి