ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్
మనోధైర్యానికి మార్గాలు -11
విఘ్నేశ్వరుడు : నారదా, నారాద, మంచు పర్వతము కదులు తున్నది
ఏమిటి
నారదుడు : మహాప్రభు 25-04-2015 ఈరోజు నేపాల్ రాజదాని నగరమైన
ఖాట్మాండ్ లో, భారత దేశంతో పాటు అనేక దేశాలలో కూడా
భూమి ప్రకంపించి, భూకంపం వచ్చింది, దాని ప్రబావం అయి
ఉంటుంది.
విఘ్నేశ్వరుడు : నామనసు తొలిచి వేస్తుంది నారదా, వెంటనే వెళ్లి రక్షణ
కల్పించాలని ఆశగా ఉన్నది నారదా.
నారదా : మన సహచరులు అక్కడ రక్షిమ్చుతున్నారు మహాప్రభు,
విఘ్నేశ్వరుడు
:అట్లాకాదు నారదా, తక్షణమే మనలోకంలో ఉన్న సకల సదుపాయాలు అక్కడ కుడా
కల్పించాలి, వెంటనే మన పుష్పక విమానము మీద, ఆహార పదార్దములు, మందులు,
వస్త్రములు కొంత ధనమును, వాటితో పాటు మనగణాలు అన్ని అక్కడ ఉన్న వారికి
సేవచేసి తరించాలి , ఇది నా ఆజ్ఞగా భావించి వెంటనే ఏర్పాట్లు
చేయి.
నారదుడు : అటులనే ఇప్పుడే మెసేజ్ వెళ్ళింది, బయలు దేరింది పుష్పక విమానము, ఇక మనము బయలు దేరుదామా భూలోకానికి.
విఘ్నేశ్వరుడు : అటులనే నారదా, తల్లి తండ్రులకు నమస్కరించి, అనుమతిని తీసుకొని పోయదము అయిన ఒక్కసారి నీదగ్గర ఉన్న ల్యాబ్ టాప్ తీయుము, అక్కడ పరిస్తితి ఎట్లా ఉన్నదో చూద్దాము.
భూకంపంలొ చనిపోయిన ప్రతి ఒక్కరికి నివాళి అరిపిస్తున్నాను
అందమైన నేపాల్ కళలన్ని ఒక్కసారి నేల కూలినాయి
ఖాట్మండ్ లో అనేక భవనాలు చిగురుటాకులవలె కూలినాయి
వైద్య సిబ్బంది, సహాయ రక్షణ దళాలు పనిచేస్తున్నాయి
శిధిలాలక్రింద ఉన్నవారిని రక్షించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి
విఘ్నేశ్వరుడు
: నారదా అన్ని దేశాల ఏకమై భూకమ్ప భాధితులను రక్షిమ్చుతారు నీవు భాధపడకు.
అందులో గూగుల్ పర్సన్ ఫైండర్ సేవలు అందించడం మెదలు పెట్టాయి. మనం కూడా
పంపినాము.
అక్కడ పిల్లలు పెద్దలు వారి ఆర్తనాదమునకు నా మనసు భాదలో మునుగి పోతున్నది. అక్కడ చూడు ఎలా విలపిస్తున్నారో
నారదుడు : అవును మహప్రభు, వారు మిమ్మల్నే తలుస్తున్నారు
విఘ్నేశ్వరుడు : అందుకే నారదా విను
భూమాత మా బ్రతుకు బుగ్గి పాలు చేసింది విఘ్నేశ్వరా
రాలిపడిన చినుకులా ఇగిరి పోయింది
రాలిన ఎండు టాకులా ఎగిరి పోయింది
గాలికి కదిలే మేఘంలా కదిలిపోయింది
గాలికి నిప్పురగిలి కారుచిచ్చులా మారింది
వేడి ఎడారిలో నడవలేకుండా చేసింది
రాక్షసి లా మాయను కమ్మి ముంచేసింది
దీపం చుట్టు తిరిగే పురుగులా మార్చింది
విలపించే ఆర్తనాదాల మద్య బ్రతుకైంది
మేము తప్పేమీ చేసాము విఘ్నేశ్వరా
మాకు శిక్ష వేసావు ఎందుకు విఘ్నేశ్వరా
భూమి ప్రకంపించింది, సమస్తము ముంచేసింది
నీడలావచ్చి మాయమైనది, లేత ఆకులనే రాల్చింది
అగ్నిని రగిల్చింది, మంచినీరు బురదనీరుగా మార్చింది
మా భాద ఎవరికీ చెప్పేది, ప్రగతి అంతా నేల పాలైనది
కట్టుకోవటానికి బట్టలేదు, ఉండటానికి ఇల్లు లేదు
తినటానికి తిండి లేదు, సేద తీర్చటానికి మందిరం లేదు
శవాలను తీసె దిక్కు లేదు, రోగులను రక్షించే మార్గం లేదు
మా భాద ఎవరికీ చెప్పేది, ప్రగతి అంతా నేలపాలైనది
తల్లి తండ్రులు కానరాక విలించే పిల్లలు కొందరు
భర్త పిల్లలు కానరాక విలపించే తల్లులు కొందరు
కుటుంబమే కానరాక బ్రతికిన ముదుసలులు కొందరు
మా భాద ఎవరికీ చెప్పేది, ప్రగతి అంతా నేలపాలైనది
మేము తప్పేమీ చేసాము విఘ్నేశ్వరా
మాకు శిక్ష వేసావు ఎందుకు విఘ్నేశ్వరా
నారద ఇక చూడ లేక పోతున్నాను, అక్కడ ఎవరో పాడుతున్నారు ఏమిటి నారదా
ఆమె మనసు చలించింది పాడు కుంటుంది వినండి
రావోయి రావోయిరావోయిరావోయి రావోయి మాయింటికి
మీకు చేస్తాము మర్యాదలు ఈపూటకి
భయపడవద్దు వకిటముందు ఉంది వాటర్ సంపు
ముంగిట మురికి కాలువ మరిగిన వాసన కంపు
చీకటైన కలకలమంటూ వేలువచ్చు దోమల గుంపు
కరంటుపోతుంది, కిటికీ తెరిచినా పోదు చవట కంపు
రావోయి రావోయిరావోయిరావోయి రావోయి మాయింటికి
మీకు చేస్తాము మర్యాదలు ఈపూటకి
మెత్తటి ఇడ్లి పెడతాము, పళ్ళు కదిలితే అడగద్దోయి
కమ్మని కాఫీ ఇస్తాము, నోరు చెడితే మాత్రము తిట్టద్దోయియి
పడ్లు పెడతాము, వాసనచూడకుండా తప్పకతినాలోయి
పంచభక్షములు పెడతాము, పురుగులు ఉంటె అనకూడదోయి
రావోయి రావోయి మాయింటికి
మీకు చేస్తాము మర్యాదలు ఈపూటకి
మంచంలేదను కోకోయి.అందుబాటులో వీది అరుగున్దోయి
వక్కడినే అను కోకోయి, నీకుతోడుగా పక్షిరెట్టలు ఉంటాయి
దుప్పటి లేదనుకోకోయి, కోకోయి, చెట్లఆకులు నిన్నుకప్పివేవెస్తాయి
కబురులు లెవనుకోకోయి, నీకు తోడుగా కుక్కలుంటాయి
రావోయి రావోయి మాయింటికి
మీకు చేస్తాము మర్యాదలు ఈపూటకి
సెల్ ప్రక్కన పెట్టుకోవోయి, భయమేస్తే ఎవరినైనా పిలవాలోయి
టి. వి. ప్రక్కన ఉంచుకోవోయి, నీవు కాలక్షేపానికి చూడచ్చోయి
చంబుదగ్గర ఉంచుకోవోయి, దాహానికి,మరోరకానికి పనికొస్తుందోయి
బైక్ దగ్గర ఉంచుకోవోయి, నిద్ర రాకపోతే మీ యింటికి పోవచ్చోయి
రావోయి రావోయి మాయింటికి
మీకు చేస్తాము మర్యాదలు ఈపూటకి
విఘ్నేశ్వరుడు : నారద్ ఆమె పిచ్చి మాయం చేద్దాం తక్షణం, ఆమె ఇంటికి పోయి ఆతిద్యం తీసు కుందామా నారదా
మహాప్రభు నేను ఆ అరుగు మీద పడుకోలేను, నన్నువదిలేయండి , భూలోకానికి తర్వాత పోదాం
అటులనే నారదా
అనుభ వించే వారికి తెలుస్తుంది భాద -
కాలక్షేపం మాట్లాడే వారికి ఎం తెలుస్తుంది భాద
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి