ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
మనో ధైర్యానికి మార్గాలు -5
అనిత్యాని శరీరాని
విభావో వైవశాశ్వతా:
నిత్యం సన్నిహితో మృత్యు:
కర్తవ్యోధర్మ సంగ్రహ:
వినుటకు ఏర్పాటు చేసినాను ఈ క్రింద వికారోను టికే చేయండి, వినండి వినమని చెప్పండి(3. 20)
http://vocaroo.com/i/s0g4XucYRQwQ
http://vocaroo.com/i/s0g4XucYRQwQ
మన
శరీరము కొన్ని పరిస్థితులల్లో మన అధీనంలో ఉండదు, వయస్సుపెరుగుతున్న
కొద్ది శక్తి తగ్గు తుంటుంది, మనము ఏమి సంపాదించిన వయసులో ఉన్నప్పుడు
సంపాదించు కోవాలి, వయసులో ఉన్నపుడు వివాహము చేసుకోవాలి, సంసార సుఖములు అను
భవించాలి, పిలలక్లు తగు విద్య నేర్పించి, ఉద్యోగాలు కల్పించి వారిని ఒకింటి
వారిగా చేసి భాద్యతులు వారికి తెలుసు కొనే విధముగా ప్రవరించాలి, వయసు
పెరిగిన కొద్ది వ్యాదులు రాక మానవు, వయసులో సంపాదించని సంపాదన వయసు
ఉడికినప్పుడు ఉపయోగ పడును.
హృదయవేదన చెంద కుండా ఆరోగ్యంగా
ఉన్నప్పుడే దానధర్మాలు చేస్తూ మరణాన్ని కూడా జయించే శక్తి ప్రతి హృదయంలో
ఉండాలని నా ఆకాంక్ష, సంపాదన ముఖ్యముకాదు, మనసుకు తృప్తినిచ్చే సంపాదన చాలని
నా ఆకాంక్ష, ఎట్టి పరిస్తితుల్లో హృదయ స్పందన చెంద కుండా జాగర్త పడాలి
హృదయం సంతృప్తి పడితేనే
విశ్వమంతా ప్రేమమయం
హృదయ దీపం వెలిగితేనే
పృథ్విఅంతా వెలుగుమయం
హృదయవీణ నడిస్తేనే
ప్రపంచమంతా ఆనందమయం
హృదయ కావ్యం శ్రవిస్తేనే
లోకమంతా స్పందన మయం
హృదయక్షేత్రం ప్రజ్వలిస్తేనే
ప్రక్రుతి శశ్య శ్యామలం
హృదయం రసమన్యమైతేనే
ప్రేమకు తార్కాణం
హృదయ దేవత ఉంటేనే
హృదయవేదన మాయం
గుండె స్పందన పెరుగకుండా ఉంటేనే
జీవిత సాఫల్యం
"శరీరము
శాశ్వతమైనది కాదు. అలాగే ఐశ్వర్యమూ నిత్యమైనది కాదు. మరణమనేది నిత్యమూ
వెంటాడుతూనే ఉంటుంది. కనుక ధర్మ గుణాలను సంపాదించుకోని వాటి కనుగుణంగా
నడుచుకోవటమే ప్రతిఒక్కరు చేయవలసిన పని
శాశ్వతము కాని శరీరముకోసం, ఐస్వర్యం కోసం, వెంపర్లాడటం ఎందుకు - ప్రతివ్యక్తి కుడా ధర్మప్రవర్తనలో ఉండి
దానధర్మాలు చేస్తు మనస్సు ప్రశాంతముగా ఉంచుకోవటమే లోక ధర్మం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి