20, ఏప్రిల్ 2015, సోమవారం

*Self Confidence-6 ( Sanskrit slokaala telugu vachassu) read and Listen Magazine

ఓం శ్రీ రాం                               ఓం శ్రీ రాం                     ఓం శ్రీ రాం
మనోధైర్యానికి మార్గాలు -6
                                                                              

అర్ధస్య పురుషో దాసో 
దాన స్త్వర్దో న కస్యచిత్ 
ఇతి సత్యం మహారాజా 
బద్దో స్మ్యర్దేనా కొరవై:
(మహాభారతం భీహ్మ -43-35)

ధర్మరాజా మానవుడు ధనానికి దాసుడు. ఇది సత్యం . నేను ధనాశతోనె కౌరవపక్షానికి కట్టు పడ్డాను, అని చెప్పిన మాటలు 

అన్నం పెట్టి ఏమనిషినైన చాలు అని అనిపించవచ్చు 
కట్టుకోవటానికి గుడ్డలిచ్చి మనిషిని తృప్తి పరచవచ్చు
మనిషి ఉండటానికి ఇల్లు ఇచ్చి సంతృప్తి పరచ వచ్చు 
కాని ఎంత డబ్బిచ్చి ఎవరిచాతనైన ఇక చాలు అనిపించవచ్చా? 

ధనం మూలమ్ ఇదం జగత్ 
డబ్బులోకం దాసోహం 
ధనమేరా అన్నిటికీ మూలం
మనిషి అర్ధ కాంక్షతో బ్రతకటం అవసరమా ?

మనిషి ధనాశను అదుపులో ఉంచుకోవటం, ధర్మాన్ని అవలంబించటం,ధర్మ పరులను బలపరచడం,ఉన్నధనముతో తృప్తి పడటం,అవసరమైన మేర అనుభవించటం, దాన గుణాన్ని అలవరుచుకోవటం అన్ని విధాల శ్రేయస్కరం

అంతే కాని, ధనాశను పెంచుకోవటం, అధర్మన్ని అవలంబించటం, అర్జింటాన్ని కూడ బెట్టడాన్ని, వ్యసనాలుగా చేసుకోవటం, దోమ జీవితాన్ని,చీమ జీవితాన్ని గడ పటం మంచిది కాదు
 అందుకే
నిన్నటి విషాదం గురించి ఆలోచించకు 
నేటి సుఖమైన జీవితము కొరకు వెతుకు 
అభివృద్ధి లేదని ఎక్కడఎప్పుడు అనుకోకు
ప్రతివిషయంలో త్యాగానికి రావాలి ముందుకు 

సమస్యలతో ఉండేది జీవతమను కోకు
ప్రశాంత జీవితము కొరకుఎప్పుడు వెతుకు 
నిందా వాక్యాలు, తప్పుడు మాటలునమ్మకు
మంచి పనులకు ఎప్పుడు రావాలిముందుకు 

సాలెపురుగు పట్టు వీడకుండా ఏర్పడుచుకుంటుంది గూడు 
తెనెతీగ పరులకోసం మకరందాన్ని అందించి కొత్తగా కడుతుంది గూడు 
చీమలు అన్ని కలసి కష్టపడి పాములకోసం కడుతూ ఉంటాయి గూడు 
మనుష్యులు ఎన్నిసార్లు వోడిన పట్టుదలతో గెలిచి కట్టుకోవాలి గూడు    
అన్నింటికీ మూలం  ప్రేమ
రెండు చేతులు కలిస్తే చప్పట్లు 
ఇద్దరు యువతులు కలిస్తే ముచ్చట్లు 
యువతి యువకులు కలిస్తే ప్రేమ ముచ్చట్లు 
వ్యాపారులు కలిస్తే అవసరమా ధనం ముచ్చట్లు ?

మీ మనస్సు తెల్ల కాగితం లా ఉంచుకోవాలి 
మీ హృదయం తేటనీరులా స్వచ్చంగా ఉంచుకోవాలి 
మీ అలోచనలు ఎప్పుడు పరులకు సహకరించాలి 
మీ మాటలు ఎప్పుడు అగ్నిలా ఉండకుండా చూసుకోవాలి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి