ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్
మనోధైర్యానికి మార్గాలు -7
మాతా శత్రు: పితా వైరీ యేన బాలో న పాటిత:
నశోభతె సభా మధ్యే హంస మధ్యే బకో యదా
"పిల్లల
చదువు సంధ్యలను పట్టించుకోని తల్లి తండ్రులు వారి పాలిటి శత్రువులు.
అలాంటి తల్లి తండ్రుల వల్ల పిల్లలు హంసల మద్య కొంగల్లాగా నలుగురిలో
అపహాస్యం పాలవుతారు.
(మనశాస్త్రాలు తల్లి తండ్రుల భాద్యతను గుర్తు చేస్తున్నాయి )
తల్లితండ్రులకు
చెప్పే అంత వాడిని కాను, కాని పిల్లల మనస్సును అర్ధం చేసుకోవాలి, వారు
చెప్పే మాటలు ఓపికతో వినాలి, చెడు మాటలు చెపుతున్నప్పుడు బాల్యంలోనే
ఖండించాలి, మాపిల్లవాడు చక్కగా మాట్లాడుతున్నాడు పెద్ద పెద్ద మాటలు
మాట్లాడుతున్నాడు అని గొప్పగా చెప్పుకొనే తల్లితండ్రులు ఉన్నారు. దాని వలన
పిల్లలను గారాబం చేసినవారవుతారు, పిల్లలు వట్టి మరమనుషులుగా మారకుండా,
మనసున్న మనుషులుగా ఎదగడానికి తోడ్పడాలి.
తల్లి
తండ్రులు పిల్లలతో వేగలేక పోతున్నాం, వేసవి శిబిరాలలో పడేస్తే మాకు కాస్త
మనస్సాంతి దొరకుతుంది అని అనుకుంటున్నారు. కాని తల్లి తండ్రులు వారి చెడు
అలవాట్లను మార్చుకోకుండా పిల్లలను అదేపనిగా చేతకానివాడి వని తిట్టడం కొందరు
చేస్తారు అదిఅవసరమా?
పిల్లలు ఎమాటలు చెప్పిన ఒపికతో విని, తగు సమాధానము చెప్పే విధముగా పిల్లలను పెంచుటకు సహకరించాలి.
అమ్మా నేను కవితను వ్రాసాను చూడమ్మా అని అంటే ఏది ఆ కవిత ఇలా తీసుకురా
నేను చదివిచేపుతా తప్పులేమన్న ఉంటె సరి దిద్దుతా అని పిల్లల మనస్సులో
తల్లి తండ్రుల ప్రేమను చూపించలి
ఇది మన భాషకాదు, పిచ్చిపిచ్చిరాతలు మానుకో అని అనకూడదు, ఎ అలవాటైన మంచిని ప్రోస్చహించాలి, చెడుని తిరస్కరించాలి
గజ గజవనికితిమి గజాసురుని చూసి మాత
పద పద మనుచు భయముతో పరుగెడితిమి మాత
కదల లేక కదులుతూ మా వెంట పరుగెత్తాడు మాత
రక్కసునుడినుందిడి రక్షించమని వేడుకున్నాము మాత
అమ్మా మాయమ్మ జగదాంబ ఆది మాత
ఇమ్మా సుఖమ్ములు ఈశ్వరిని కన్నమాత
ఉన్న కష్టమ్ములు తొలగించే ఊర్ద్వలోకమాత
ఋగ్మతలను తొలగించి రూపు మాపే మాత
ఎన్నిసార్లు వేడుకున్న మాకు శక్తినిచ్చిఏలే మాత
ఐ శ్చి కంబులు నీడేర్చి ఒదార్చావు మాత
ఒంకారాన్ని అందించి మనస్సుకు ప్రశాంతి కల్పించావు మాత
అందరిని ఆదుకొని మాలో అహంకారాన్ని తొలగించావు మాత
కమలము వంటి కళ్ళతో ఖడ్గము ధరించావు మాత
గరళం మ్రింగమని శివునికే చెప్పావు మాత
చపల చిత్తులను చక్రముతో సంహరించావు మాత
జప హోమాలు చేసేవారికి రక్షగా ఉన్నావు మాత
శీల సౌధానికి శిల్పులు తల్లి తండ్రులే
ఛత్రపతి శివాజికి వ్యక్తిత్వాన్ని పటిష్టపరిచిండేవారు? ..
అయన తల్లి జిజియాబాయి
వివేకానందునికి సత్యపదాన్ని విడనాదవద్దని చెప్పినదెవరు ? .. అయన తల్లి భువనేశ్వరీ దేవి
గాంధిజికి మద్యం, మగువ, వ్యామోహలో పడవద్దని చెప్పినదెవరు ?
ఆయన తల్లి పుతలీబాయి
అల్లురిసీతారామరాజుకు ఆంగ్లేయుల ఆకృత్యాలను అరికట్టాలన్నదెవరు? . అయన తండ్రి రామరాజు
నా
తండ్రి నాకు చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి శక్తికి మించి నిన్ను
చదివించాను నీవు బ్రతికి నలుగురికి బ్రతికించే మార్గచూపు. (మానాన్నగారు
హస్తసాముద్రికము, అంజనం, మీద ప్రశ్నలు చెప్పి, డ్రైవర్ గా, పనిచేసి నన్ను
చదివించారు నేను ఎప్పటికి మరువలేను)
పిల్లలను తల్లితండ్రులు భావిపౌరులుగా తీర్చిదిద్దే భాగ్యదాతలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి