ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రాం ఓం శ్రీ రామ్
మనోధైర్యానికి మార్గాలు -1
ప్రతిఒక్కరికి హ్రుదయపూర్వక నమస్కారములు తెలియ పరుస్తున్నాను. మన పూర్వీకులు (ఋషులు, వేద పండితులు, సన్యాసులు, పీఠాది పతులు వ్రాసిన గ్రందాల లో ఉన్న కొన్ని ధర్మ ఆద్యాత్మిక విషయాలను మీకు తెలియపరచాలని ఒక చీన్న ఆశయంతో శ్లోక రహస్యాలు విడమరిచే చెప్పాలని సంకల్పించాను శ్లోకాలు పాతవి, వర్ణన మాత్రము ఆధునికు లందరూ అర్ధం చేసుకోగలరణి నేను అనుకుంటున్నాను. (శ్లోకాలు వివిధ పత్రికల యందు, ఇంటర్నెట్ యందు సేకరించినవి)
ఆ జయాన్ని సాధించాలంటే ఒక సమున్నత లక్ష్యం ఉండాలి
లక్ష్యం స్వార్ధ పూరితం కాకుండా నలుగురికి సహాయపడాలి
ఆత్మవిశ్వాసం, నైపుణ్యం, విజయ సాధనకు ఓర్పు ఉండాలి
రామాయణంలో హనుమంతుడ్ని పాత్రను గుర్తుంచు కోవాలి
అందుకే ముందుగా హనుమంతుడ్ని స్మరిస్తూ ప్రారంభించు చున్నాను
" బుద్ధిర్బలం యశోధైర్యం
నిర్భయత్వం అరోగతా
అజాడ్జం వాక్పటుత్వంచ
హనుమత్ స్మరణాద్భవేత్ "
విజయసాధనలొ పట్టుదల, సడలని ప్రయత్నం, ఏకాగ్రత, బుద్ధి బలం సమర్ధత ఎవరి దగ్గర ఉంటాయో వారికి తప్పక విజయం సిద్ధించును
ఒక్కసారి రామాయణంలో హనుమంతుని ప్రవర్తనను గమనించు కుందాము
హనుమంతుడు వానరులకు సముద్రముమీద ఎంత దూరము పోవలెనో తెలుసు కోకుండా సీత జాడ తెలిపెదనని ఆత్మ విశ్వాసము వానరులకు కల్పించెను (మనమీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సాదిన్చగలమని ఒక నమ్మకము కల్గిన్చటమే ఇందులో భావము )
హనుమంతుడు సముద్రమీద పోవునప్పుడు మైనాకుడు కృతజ్ఞతా భావంతో విశ్రాంతి తీసుకోమన్న రామకార్యము మీద పోవునప్పుడు మద్యలో ఆగనని ప్రతిజ్ఞ చేసి యున్నాను మీ సహకారమే నాకార్యమునకు ఆశీర్వచనులుగా భావిస్తున్నాను. ( మనము ఒక పని మీద పోవునప్పుడు మద్యలో ఆగి ప్రేమ పాశాలకు లొంగ కుండా ముందుకు పోవాలనేది ఇందు భావం )
హనుమంతుని ప్రయాణములో " సురస" హనుమంతునితో నా నోటిలోనికి ప్రవేసించే ముందుకు పోవాలి ఇదే బ్రహ్మ నాకు ఇచ్చి వరమని చెప్పగా , వెంటనే చిన్న రూపము దాల్చి నోటిలోకి ప్రవేశించి బయటకు వచ్చెను.
(మనము అవసరాన్ని బట్టి బలప్రయగము చేయాలి, వీలున్నతవరకు యుక్తితో జయిన్చాలని ఇందు భావము)
హనుమంతుని నీడనె ఆకర్షించిన సింహిక నోటిలోకిదూకి మర్మావయవాలను ఛేదించి బయటకు వచ్చెను. (అవసర మైనప్పుడు స్త్రీని కూడా చంపవచ్చునని, ఆకర్షణకు లొంగకుండా తుద ముట్టించాలని ఇందుభావము)
హనుమంతుడు లంఖినికి బుద్ధిచెప్పి , లంకానమగరంలో ఉన్న సీత జాడ రామునకు తెలిపే కష్టాలు ఎదురైనా భయపడకుండా ఉన్న శక్తితో పోరాడటమే నిజమైన ధర్మం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి