16, ఏప్రిల్ 2015, గురువారం

Self Confidence-2 ( Sanskrit slokaala telugu vachassu)

మనోధైర్యానికి మార్గాలు -2

ఓం శ్రీ రాం                   ఓం శ్రీ రామ్                ఓం శ్రీ రామ్
                                         
                                               అకరుణత్వమకారణ విగ్రహ
                                             పరధనే పరయోషితచ స్పృహా 1
                                            సుజన బంధుజనేషు సాహిష్ణుతా
                                          పకృతి సిద్దమిదం హిదురాత్మనం !!
దయలేక పోవుట, అకారణ విరోధము, పరుల ధనమునందు, పరాయి స్త్రీల యందును కోరిక కలిగి ఉండటం, సజ్జనుల బంధువుల యెడల కుడా ఓర్పు లేకుండటం  - అనేది దుర్జులైన వారికి స్వభావసిద్ధమైన గుణములు. 

                              అజ్ఞాని మనస్సు  అతని నాలుకలో ఉంటుంది
                                    జ్ఞాని మనస్సు అతని హృదయంలో ఉంటుంది
                               అజ్ఞాని అర్ధం కోసం వెంపర్లాడటం జరుగుతుంది
              జ్ఞాని అర్ధాన్ని పరమార్ధ కొరకు ఉపయోగించటం జరుగుతుంది

                                    అజ్ఞాని యద నుండి పగల సమాహారం
                                     జ్ఞాని మనసు నిండా ప్రేమ సామాహారం
                                           అజ్ఞాని దొబూచులా డె నీడ స్వరం
                                       జ్ఞాని నిశ్చలంగా సాగే జలపాతరాగం

                                        అజ్ఞాని బ్రమలు కల్పించి వేదించడం
                                               జ్ఞాని చెరగని స్వప్న కాసారం
                                      అజ్ఞాని నీటిపై తేలి పడవ లాంటి వాడు
                                     జ్ఞాని నీటిలొ ఉన్న ముత్యం లాంటి వాడు
  
నేను ఒక రోజు రైలు ప్రయాణం లో ఇద్దరు ఆడపిల్లలు పది సంవస్చరాలు కుడా ఉండవు, వారిని చూస్తె నాకు ఒక వేపు జాలి మరోవేపు వారిని అడుక్కోవటానికి ప్రోస్చహించిన తల్లి తండ్రుల బలహీనతను తలుచుకొని చాల భాధపడటం తప్ప ఏమి చేయ లేక పోయినాను, వారు అడిగినదానికాన్న ఎక్కువే దానం చేసాను, కాని నా ప్రక్కన ఒకాయన నన్ను వాదించాడు మీరెందు కండి  ఆ పిల్లలకు దానం చేస్తారు, వారికి ఇది ఒక అలవాటవుతుంది అన్నడు అప్పుడే నేను అన్నాను,  మీరు ఆ అమ్మాయిలను   పెంచుకుటారా అంటే నాకేం పని మీరు చేయగలరా అన్నాడు, అప్పుడు నాకు అనిపించింది ఒకరిని ఒక మాట అనేటప్పుడు మన పరిస్తితి ఏమిటో చూసుకోవాలి. అంటునే స్టేషన్ వచ్చింది పిల్లలు దిగిపోయారు
అప్పుడు ఏమిచేయ లేక పోయాను, కొందరిని ఆదుకోవాలన్న మన మనసు సక్రమముగా ఉంచాలని ఆ దేవున్ని ప్రార్దింటం తప్ప ఏమి చేయ లేక పోయాను.

 దిగాక తెలిసింది ఆపిల్లల మీద కొందరు పొలిసు స్టేషన్లో రిపోర్ట్ చేసారు, వారి నగ ఏదో పోయిందని అవి ఈ పిల్లలుతోచారని అవెసముగా చెప్పారు, ఆ పిల్లలును పొలీసులు పట్టుకొచ్చి చితక బాదారు   వారు ఏడుపు తప్ప తీయలేదని చెప్పారు. (దగ్గరే నాగ పెట్టుకొని పిల్లలను హింస  పెట్టిన వారు ఎమోతారు)
ఎదే లోకం  
కొందరికి కష్టమైనా పరిస్తితులలో ఉన్న వారిని చూసిన కొంతమందికి దయ అనేది కలుగదు, కాని దూషి మ్చుతారు అది సమమజసమా,  చేతినిండా డబ్బులున్నవారు ఖర్చుచేయకుండా దాచి కొడుకులు కిచ్చి త్రాగుటకు, వ్యసనాలకు  బానిసలు చేయుట సమంజసమా,   కొందరు చీటి మాటికి స్త్రీలపై విరుచుకి పడి  తర్వాత ప్రాధేయ పడుతా సమంజసమా,  రంభ లాంటి భార్య ప్రక్కన పెట్టుకొని వేరొక  స్త్రీ కోసం వెంపర్లాడటం సమంజసమా,  కొందరు భందువుల వద్ద  పెద్దల వద్ద ఓర్పు లేకుండా గత విషయాలు గుర్తు చేసి భాద పెట్టడం సమంజసమా.

ఏవిషయం సమంజసమో, ఏది అసమంజసమో  మనుష్యులకు ఆ భగవంతుడు జ్ఞానం ఇచ్చాడు మంఛి  గుణాలు ఇచ్చాడు.  మన పూర్వీకు వ్రాసిన శ్లోకం ద్వారా నా భావం తెలియపరచాలని నేను వ్రాసిన దానిలో మంచి గ్రహించి జ్ఞాన వంతులగుదురని ఇందు పొందు పరిచాను.                


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి