25, ఏప్రిల్ 2015, శనివారం

Self Confidence-10 ( comedy children small story )

ఓం శ్రీ రాం                     ఓం శ్రీ రాం                     ఓం శ్రీ రాం 
మనోధైర్యానికి మార్గాలు -10

                                                                              


చిన్న కధ 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 
విఘ్నేశ్వరుడు : ఈరోజు భారత భూమిని చూసి వద్దామని 
        అనుకుంటున్నాను నీవు కూడా నాకు తోడుగా వస్తావా 

నారదుడు : మహాప్రభు మీరడిగితే నేను రాకుండా ఉంటానా
    
విఘ్నేశ్వరుడు :అటులనే తల్లి తండ్రులకు పాదాభివందనం చేసి  వెళ్ళెదము

నారదుడు : అటులనే 
విఘ్నేశ్వరుడు : అయ్యో, తల్లి తండ్రులో జ్ఞాణముద్రలో ఉన్నారు, వారి  అనుమతి లేనిదే మనము ఇక్కడ నుండి కదల కూడదు    కదా నారద.

నారదుడు : అటులనే  

విఘ్నేశ్వరుడు :మరియొక మార్గం య్యేదైనా ఉంటే తెలుపు నారదా  

నారదుడు : అటులనే 

విఘ్నేశ్వరుడు : అటులనే అంటావు తప్ప ఎ మార్గం చూపవు 

నారదుడు : ఒకటే మార్గం ఉన్నది, మనం కంప్యూటర్లో ఒక్కసారి   భూలోక ప్రజలు ఎలాఉన్నరో చూడండి అప్పుడు మీ       ప్రయాణము ఆలోచించుకోవచ్చు 

విఘ్నేశ్వరుడు : ఏమిటి నారద మనుష్యులను చూప మంటే జంతువులను చూపుతున్నావు 
నారదుడు : వారందరు జంతు లక్షణాలు కలిగి యున్నారు అందుకే   మీకు అట్లా కనబడు తున్నారు. 

విఘ్నేశ్వరుడు : అవును నారదా అక్కడ కొందరు మనష్యులు  కనబడుతున్నారు, వారుచాల వినయ విధేయతులు   చూపుతున్నారు.   

నారదుడు : మహాప్రభు వారు "నక్క వినయం " ప్ర్రవర్తిస్తున్నారు   ధూర్తుల  లక్షణం , అటువంటివారిని నమ్మిన వారికీ కూడా  ముప్పుకల్పిస్తారు.
     
విఘ్నేశ్వరుడు : నారదా ఇటు చూడు రక రాకల దుస్తులలో ఉన్నవారు  మంచివారే కదా 

నారదుడు : మహాప్రభు వారు " ఊసరవెళ్లి " లాంటి వారు ధనాశ  పరులు రంగులు మార్చే రాజకీయ నాయకులు వారికి పదవి    పిచ్చి తప్ప వేరొకటి ఉండదు, పదవికోసం పెళ్ళాన్ని కుడా   తాకట్టు పెట్టెవారు. 

విఘ్నేశ్వరుడు : ఏమిటి నారద అక్కడ నాట్యం చేస్తూ  ఎగురుతున్నారు  వారు మంచి వారే కదా

నారదుడు : మహాప్రభు అందరూ మంచివారే, కాని వీరు నెమ్మళ్ళ లా   నాట్యం చేసేవారు, వీరికి కోరిక కలిగిందంటే చాలు ఎవ్వరి మాట వినరు, వీరిని అదుపులో చేయటం కష్టం, అల్లాంటి వారిని   మనసు మార్చటం, నాయకులు కూడ  మార్చలేరు 

విఘ్నేశ్వరుడు : నారదా అక్కడ చాల చక్కగా మాట్లాడు తున్నారు  అక్కడకు వెల్లెదమా 

నారదుడు : మహాప్రభువారు చిలక పలుకులు పలుకుతారు, పైకి   చక్కగా పలుకుతారు, లోపల కొంపలు కూర్చేవారు,  ఒకరికొకరు    దగాదాలు పెట్టి సంబర పడతారు వారు 

విఘ్నేశ్వరుడు : చూడు నారద వారు చాల మంచి వారు లాగున్నారు  కదా       

నారదుడు : మహాప్రభువారు డేగల్లాంటి వారు, పైకి క్రింద కోడిపిల్లలను  డేగలు తిన్నట్లు వీరు మనుష్యులను నరికేవారు, అందరికన్నా  కడుదుర్మార్గులు వీరిని శిక్షించటం ఎవరి వళ్ళ కాదు. 

విఘ్నేశ్వరుడు : ఏమిటి నారదా ఆపావు,

నారదుడు : నేను ఆపలేదు మహాప్రబు గూగుల్ ఇంటర్నెట్ కట్టైనది. 
  
విఘ్నేశ్వరుడు : నారద ఇక్కడ కూడా కనక్షన్సు రావా,

నారదుడు : ఇప్పటిదాకా కమ్పూటర్ లో మనుష్యులను చూసారు కదా, 

 విఘ్నేశ్వరుడు : నారద ఈరొజుకు ఇక చాలు, నాకళ్ళు గుంజేస్తున్నా యి 
నారదుడు : మరలా రేపు ఆలోచిద్దాము, ఈ కుడుములు తినండి, భూలోకంలో మీకు పూజలు బాగా జరుగు తున్నాయి. ప్రసాదాలు ఇక్కడదాక వస్తూన్నాయి. 

విఘ్నేశ్వరుడు : అటులనే నారద తల్లి తండ్రులకు నమస్కరించి వచ్చి తింటాను నారదా 

పెద్దలను గౌరవించాలి, మనుష్యుల లక్షణాలు తెలుసుకొని జీవించాలి  *
   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి