ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్
మనోధైర్యానికి మార్గాలు -8
వరం దారిద్ర మన్యాయ ప్రభవా ద్విభవా దపి !
కృశతాభిమతా దేహే పీనతా న తు శోఫత:
"అన్యాయంగా అడ్డ దారిల్లో సంపాదించిన వైభవం కన్నా,
దారిద్ర్యమే మేలు.
వాపు వళ్ళ వచ్చే బలుపు కన్నా, సన్నగా ఉండటమే మేలు "
ఎంత అసమర్ధుడైన ఒకానొక పరిస్థితిలో అందలం ఎక్కించవచ్చు, లోకుల దృష్టిలో చాలా గొప్ప వాడుగా కనబడవచ్చు, ఇది అంతా నాగొప్ప అని పెద్దలను, పండితులను, దూషించవచ్చు, తను ఒక గురిగింజ అని తెలుసుకోలేక పోవచ్చు, అడ్డదారిలో వచ్చిన అధికారాలు, హోదాలు, గొప్పవని భావించి, నేలమీద నిలబడక, ఎగిరెగిరి పడతారు వారు, నీటి మీద గాలి బుడగలని తెలుసుకోరు, తన కష్టానికి తగినదని ఎప్పుడూ అనుకోలేరు, అట్టివారు ఎగరవేసే దీపావళి తారా జువ్వ వెలుగు లాంటి వారని తెలుసు కోలేరు, వారు వెలుగును పంచె వారనుకుంటారు కాని వారు ఒక మిణుగురు పురుగు లాంటి వారని అనుకోలేరు. మిడి మిడి జ్ఞానంతో బ్రతికేవారు గొప్పగా చెప్పుకొని లోపల కుటుంబమంతా వేదనకు గురిచేసే వారుగా కనిపిస్తున్నారు ఇది అవసరమా ?
నీళ్ళలో ఉన్న ముసలి స్థానబలంతో ఏనుగుని కూడా లోపలకు లాగేస్తుంది, అదే ముసలి ఒడ్డుకు వచ్చి నప్పుడు కుక్కతో కూడా భంగ పడుతుంది. అంటే స్థానబలం కాని తనబలం కాదు సుమా ! అని యోగి వేమన అంటారు
ఆకాసంలో ఎగిరే గాలిపటం ఎగేరేగిరి పటుతుంది, నేను విమానంతో సమాన మానుకుంటుంది, కాని గాలి లేనప్పుడు నిలబడ లేక కూలి పోతుంది, పేక మేడలు ఎన్ని కట్టిన అవి నిలబడవని తెలుసుకోవాలి,
కాయ కష్టం చేసి గంజి త్రాగి సంతోషంగా ఉండ గలగాలి, ఎ కష్టం చేయకుండా మృష్టాన్న భోజనం చేస్తే అరగక దొర్లుతూ కూర్చోవాలి
తెలియని అనారోగ్యంతో ఉన్న మనిషి పైకి మాత్రం శరీరమ్ నిగనిగ లాడి నంత మాత్రాన సంసారానికి పనికిరాని జీవితం, ఒక జివితమేనా, ఆశలకు పోయి రోగాలు తెచ్చుకోవటం అవసరమా!
అన్ని మనమంచికే అనుకుంటాడు ఆశావాది
అన్ని మన చెడుకే అనుకుంటాడు నిరాశావాది
అవకాశాలన్నీ అంది పుచ్చుకుంటాడు ఆశావాది
అదృష్టం పైనే ఆధార పడతాడు నిరాశావాది
ప్రతి కష్టంలోనూ ఓ అవకాశాన్ని చూస్తాడు ఆశావాది
ప్రతి అవకాశంలోనూ కష్టాన్ని చూస్తాడు నిరాశావాది
భాదను మరచి పోవటానికి నవ్వుతాడు ఆశావాది
నవ్వటమే మరచి పోతాడు నిరాశావాది
ప్రతి అవకాశంలోనూ కష్టాన్ని చూస్తాడు నిరాశావాది
భాదను మరచి పోవటానికి నవ్వుతాడు ఆశావాది
నవ్వటమే మరచి పోతాడు నిరాశావాది
అందుకే నేను ఒక్కమాటే చేపుదామను కున్నాను " ప్రతిఒక్కరు ప్రభావాల వత్తిడికి లొంగి, అహంభావం పెంచు కోకుండా, అనారోగ్యులుగా మారకుండా,. అత్యాసకు పోయి అప్పులు పాలు కాకుండా, మన హోదాల పరదాలను దాటుకొని బయటకు వచ్చి, మనల్ని మనం చూసుకోవాలి, ప్రకృతి ననుసరించి ప్రవర్తించాలి, అడిగినదానికి మాత్రమె సమాధానము చెప్పి మౌన ప్రార్ధనే అన్నింటికీ శ్రేయస్కరం.
జ్ఞానులతో పోల్చుకుంటే మనజ్ఞాన మెంతా అని ఒక్కసారి ఆలోచించుకో
ఏది వాపో , ఏది బలమో నిర్ధారించుకొని ముందుకు సాగి పో
స్త్రీలముందు, పెద్దలముందు, గురువులముందు అపహాస్యం పాలుకాకు
నీచాశ్రయాన్మత్సరేణ ద్వేషిణీ గుణి నామపి ... భీష్ము డన్న మాటలు
సుగుణవంతుల బుద్ధి కూడా నీచులను ఆశ్రయించడం వలన మాత్సర్యం చేత ద్వేషభావంతో నిండి ఉంటుంది, వైరంతో రగిలి పోతుంది
దిగులుగా ఉన్నామంటే, గతంలో ఉన్నట్లు
ఆత్రంగా ఉన్నామంటే, భవిష్యత్తులో విహరించినట్లు
శాంతంగా ఉన్నామంటే, వర్తమానంలో జీవిస్తునట్లు
ఉల్లాసంగా ఉన్నామంటే, కోర్కలు తీరినట్లు
దిగులుగా ఉన్నామంటే, గతంలో ఉన్నట్లు
ఆత్రంగా ఉన్నామంటే, భవిష్యత్తులో విహరించినట్లు
శాంతంగా ఉన్నామంటే, వర్తమానంలో జీవిస్తునట్లు
ఉల్లాసంగా ఉన్నామంటే, కోర్కలు తీరినట్లు
మన జాగార్తలో మనం ఉండి అందరిని నమ్మి మోసపోకుండా జాగర్త పడాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి