17, ఏప్రిల్ 2015, శుక్రవారం

Self Confidence-3 ( Sanskrit slokaala telugu vachassu)

ఓం శ్రీ రాం                           ఓం శ్రీ రాం                                 ఓం శ్రీ రాం 
 మనోధైర్యానికి మార్గాలు -3                                                            


సూర్యస్యాపి భవేత్ సూర్యోహ్యగ్నేరగ్ని: ప్రభో: పభు:!
శ్రియ: శ్రీశ్చ భావేదగ్య్రా కీర్తి: కీర్త్యా: క్షమ క్షమా !!
(రామాయణం అయోధ్యా 44-15)

పై శ్లోకభావం తెలుసుకోనేముందు మనము రామాయణంలో ఉన్న సుమిత్ర పాత్ర గురించి క్లుప్తముగా తెలుసుకుందాం. మహిళ లందరు సుమిత్ర జీవితమ్ ఆదర్శం గైకొని ప్రవర్తిస్తూ ఉంటే  భూలోకం  అంతా స్వర్గ  తుల్యం అవుతుంది. ఎందుకనగా  శ్రీరాముడు తండ్రిని సత్యవాక్కు ప్రతిజ్ఞాపాలకుడుగా చేయుటకు, కౌసల్య ప్రియపుత్రుడు శ్రీరాముడు అరణ్యాలకు వెళ్ళడం చూచి, పరమ దు:ఖతయై సుమిత్ర కడుపార కన్నకోడుకైన లక్ష్మణున్ని అన్నతో పంపిన ఘట్టం అపూర్వమ్

నాయనా లక్ష్మనకుమారా రాముడు ధనవంతుడుగా ఉన్నా, రాజ్యము లేకపోయినా,అతడే నీకు శరణం ఎందుచేతననగా అన్నను అనుసరించటం లోకంలో సనాతన ధర్మం (ఈ సయోధ్య -వాలి సుగ్రీవులకు, రావణ విభీషణులకు లేక పోవడం - ప్రతియోగం)

జ్జ్యేష్టుడు తండ్రితో సమానుడు. పెద్దవానిని అనుసరించడం,దానం చేయడం,యాగదీక్ష పొందడం, యుద్దంలో దేహత్యాగం - చేయటం తమ్ముడుగా సహకరించటం సనాతన ధర్మం
     
రామం దశరధమ్ విద్ధి మాం విద్ధి జనకాత్మజాం 
అయోద్యా మతవ్వీమ్ విద్ధి గచ్చ తాత యథాసుఖం

శ్రీరామున్ని తండ్రిగా భావించి,సీతను తల్లిగా భావించి అడవిని అయోద్యగా భావించి ఏమరపాటు లేకుండా అనుసరించటమే ధర్మం

"శ్రీ రాముడు సూర్యునికి సూర్యుడు, అగ్నికి అగ్ని, నియంతకు నియంత, సంపదకు సంపద, కీర్తికి కీర్తి, ఓర్పునకు ఓర్పు అట్టి పరమాత్మకు ఎవ్వరువిరోధం చేయలేరు "

అందుకే ఈలోకంలో ప్రతి ఇంట శ్రీ సీత రామ లక్ష్మణ ఆంజనేయస్వామిని పూజించటం లోకధర్మంగా ఉన్నది 
మాతృదేవోభవ, పితృదేవోభవ,ఆచార్యదేవోభవ, అతిధిదేవోభవ  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి