18, ఏప్రిల్ 2015, శనివారం

Self Confidence-4 ( Sanskrit slokaala telugu vachassu)

ఓం శ్రీ రాం                  ఓం శ్రీ రాం                                         ఓం శ్రీ రాం
 మనో ధైర్యానికి మార్గాలు -4
                                                                          


ఉదయంతు శత మాదిత్య
ఉదయంతు శత మిందన:
న వినా విదుషా వాక్యై:
నాశ్య  త్యాభ్యంతరం తమ:
 ఇది పండితవాక్యాని కున్న ప్రాధాన్యాన్ని చెప్పే శ్లోకం 
మనలో ఉన్న అంతరాత్మ పలు ఆకర్షణకు వైపుకు నెట్టి  ఆడిస్తుంది 
హ్రుదయంతరం లో ఆశలు రేపి అలల కల్లోలం చేస్తుంది 
బంగారు భవిషత్తు చూపక భాద పెడుతుంది 
పండిత వాక్యాన్ని విని మనస్సు శాంత పరుచుకోవటం మంచిది

 వంటరి  తనంలో ఆమని కోకిల పాట నచ్చదు
భవభందాలు తెంచుకొని ఒంటరిగా ఉండనివ్వదు
జీవమున్న మనం, వెచ్చదనాన్ని వదలి ఉండనివ్వదు
ప్రకృతికి ఎదిరించి జీవించటం ఎవ్వరికి కుదరదు

వెదచెందిన మనసుకు పరిష్కారం దొరకదు
నా మేధస్సు లక్ష్య సాదనకు సరిపోదు 
త్యాగధనులు నడిచిన దారిలో నడవనీయదు 
మనసు అర్ధం చేసుకొనేవారు లేక భాదపడక తప్పదు

మల్లెపువ్వు మనస్సును ఉద్రేక పరచదు
మనసున్న మనిషికి మనసు రానివ్వదు
రాగాలు అనురాగాలు మనసుకు తెలియదు 
ఒంటరితనంతో మనసు నిల్వనీయదు

అందుకే
అజ్ఞానం అనేచీకటిని తొలగించుకోవాలి
విజ్ఞాణ మనే వెలుగును పొందాలి
మంచి అలోచనలతో సుఖంగా జీవించాలి 
సమాజ సుఖశాంతులకు దోహద పడాలి

" వందమంది సూర్యులు  ఉదయిస్తే ఉదయింతురు గాక
వందమంది చంద్రులు  ఉదయిస్తే ఉదయింతురు గాక
మనిషిలోని చీకటి మాత్రమే విద్వాంసుల వాక్యాలవల్ల 
తప్ప వేరే విదంగా తొలగిపోదు "

మానవజన్మ కోక సార్ధకత - పండితవాక్యాలు వినుటంవల్ల మనస్సుకు ఉంటుంది పశాంతత   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి