2, మే 2015, శనివారం

Selfconfidence-15 (Family - Comedy - Question & Answers)


ఓం శ్రీ రాం                               ఓం శ్రీ రాం                              ఓం శ్రీ రాం   
మనోధైర్యానికి మార్గాలు - 15
                                     

http://vocaroo.com/i/s1zZvh0orliZ (    )ఇది టిక్  చేసి కధ  వినండి

నారదా శీతల ప్రాంతమునకు వెళ్లి కాస్త విశ్రాంతి తీసుకుంటే  బాగుంటుందనిపిస్తుంది,  ప్రకృతి చల్లని వాతా వరణములో అలా అలా  సంచారము చేస్తే మనసుకు ఏంతో  ఉల్లాసముగా, ఉస్చాహంగా  ఉంటుంది కదా నారదా  అన్న విఘ్నేశ్వరుని మాటలకు అవునవును అని నిద్రనుండి లేచినట్లు పలికాడు నారదుడు.
 .
నారదా నీవు ఈలోకంలో  ఉన్నట్లు లేవు ఎక్కడో  విహరిస్తున్నావు, ఏమిటి విశేషము అని  అన్నాడు విఘ్నేశ్వరుడు.
నేను కొన్ని ప్రశ్నలకు   మీనుండి  సమాదానుములు తెలుసుకోవాలని అనుకుంటున్నాను మీరు చెపితే సంతృప్తి పడగలను  

అడుగు నారదా నాకు తెలిసినవి చెప్పగలను , తెలియనివి తల్లి తండ్రులనడిగి చెపుతాను, మరి అడగటమే ఆలస్యము, కాస్త ఈ లడ్డులు తినవచ్చా  మీ ప్రశ్నల కేమన్న అడ్డమా.

నారదుడు: మహాప్రభు ఎంతమాట, మీరు తినేటప్పుడు వచ్చానని అనుకోకండి

విఘ్నేశ్వరుడు : అడుగుమరి ఆలస్యమెందుకు     


నారదుడు :(1) ఆనందం అంటే ఏమిటి ?
విఘ్నేశ్వరుడు : కామానికి మించిన వ్యాధి లేదు ,మొహానికి మించిన  
         శత్రువు లేదు, క్రోదానికి మించిన అగ్ని లేదు, ఆత్మజ్ఞాన్నానికి 
         మించిన సుఖం లేదు, ఆద్యాత్మికతకు మించిన ఆనందం లేదు. 

          ప్రవహించిన నది సముద్రములో కలసినట్లు, సంసారం కష్ట 
          సుఖాలు పోవటానికి నవ్వుతూ బ్రతకటమే నిజమైన ఆనందం. 

నారదుడు: (2) భార్య భర్త లమధ్య ఉండాల్సినదేది ?. 
విఘ్నేశ్వరుడు: నవ్వు, ఏడుపు మరియు తృప్తి 

నారదుడు : (3) నిరాశవాదులు ఎవరు ?
విఘ్నేశ్వరుడు : చాలామంది ఆశావాదులకు అప్పులిచ్చి తాము నిరాశా 
          వాదులవుతారు. అటువంటి వారే

నారదుడు : (4) తల్లితండ్రుల వ్యత్యాసం ఏమిటి ?
విఘ్నేశ్వరుడు : తల్లి జీవితాంతము తల్లిగా ఉంటుంది, కాని తండ్రి కొత్త  
           భార్యను తెచ్చుకొనే వరకు తండ్రిగా ఉంటాడు.

నారదుడు :(5) సారధ్యం, ప్రేరణ, దృక్పధం గురించి వివరిస్తారా?
విఘ్నేశ్వరుడు : నీవు ఏమి చేయ గలవో చెప్పేది సామర్ద్యం  
            నీవు ఏమి చేయాలో నిర్ణయించేది  ప్రేరణ 
            నీవు ఎంత నైపుణ్యంతో ఆపని చేయగలవో నిర్ణయించేది  
            దృక్పదం. 

నారదుడు :(6)  ప్రామానికియా గ్రంధం అంటే ఏమిటి ?
విఘ్నేశ్వరుడు: ప్రామాణిక గ్రంధం అంటే ప్రజలు కొనియడేది, కాని 
            చదవనిది

నారదుడు: (7) పిల్లలలో ఎ భావం ఉంటుంది ?
విఘ్నేశ్వరుడు: ప్రేమభావము, మధురభావము, హాస్య భావము 
            మరియు కఠోరభావము.

నారదుడు:(8) వివాహ కలయిక అంటే ఏమిటి ?
విఘ్నేశ్వరుడు : సంతోష దాయక మైన వివాహము, క్షమ (ఓర్పు ) 
             గుణమున్న ఇద్దరి కలయక.     

నారదుడు :(9) పిల్లలు ఎవరి మాట వింటారు ? 
విఘ్నేశ్వరుడు : పిల్లలు తల్లి, తండ్రి, గురువు మరియు ధనం మాట 
             వింటారు

నారదుడు : (10) టి.వి చూస్తె లాభమా, నష్టమా ?
విఘ్నేశ్వరుడు : లాభం మెదడుకు మించిన మేత, నష్టం:కళ్ళ జోడుకు 
              ఖర్చు 

ఆనందం ఆద్యాత్మిక మైతె చచ్చిదానందం 
ఆనందం పరిమిత మైతే సంసారమే ఆనందం
ఆనందం ప్రకృతి అయితే శరీరమునకు ఆనందం
ఆనందమే వికృతి అయితే వైద్యులకు ఆనందం 

నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేక పోవడం రోగం 
నవ్వుల దినోస్చవానికి అందరికి శుభాకాంక్షలు 
  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి