ఓం శ్రీరామ్ ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్
మనోధైర్యానికి మార్గాలు -16
హరినాపి హరేనాపి
బ్రహ్మానాపి సురైరపి!
లలాట లిఖితారేఖా
పరిమాష్టుం నశక్యతే !!
(బ్రహ్మ విష్ణు మహేశ్వరులకైనా, దేవతా శ్రేష్ఠుల కైనా నుదుట వ్రాయబడిన వ్రాతను చెరిపి వేయుట అసాధ్యమైన విషయం )
లోకంలో ప్రతి ప్రాణి ప్రకృతి ననుసరించి నడుస్తారని, సూర్య భగవానుణ్ణి ప్రత్యక్ష దైవంగా కోలుస్తారని,నక్షత్రాల బట్టి గ్రహాల బట్టి జాతక చేక్రాలు వేసి మనుష్యుల జీనణ గమనాన్ని తెలియ పరుస్తారని కొందరి నమ్మకము.
మరికొందరి
నమ్మకం బ్రహ్మా దేవుడు మనం చేసిన కర్మల ననుసరించి భూలోకంలో పుట్టుట
జరిగిందని, మనం పుట్టిన కుటుంబమే ఉన్నతమైనదని వాదించు కుంటారు. మానవుల జీవన
గమనానికి శ్రీ మన్నారాయణుడు సహకరిస్తాడని, అదిశంకరుడు (హనుమంతుడు)
మనోనిగ్రహ శక్తిని పెంచుతారని మానవుల నమ్మకం.
మానవులు
చిట్ట చివరిలో చేసే పనికి వయసు సహకరించక, ఓపికలేక , భాధలు భరిస్తూ
ఉన్నవారికి మరణ విధానాన్ని శంకరుడు అమలు పరుస్తున్నాడని ఆద్యాత్మిక పరులు
గ్రందాల ద్వారా తెలియ పరుస్తున్నారు.
లోకం తీరు
ఒకరి మాటలు ఒకరికి నచ్చటం
సామాణ్య మైన విషయం కాదు
చెప్పిన సలహాలను ఆచరించటం
అను కున్నంత సులభం కాదు
ప్రేమికులు విజయం పొందడం
మామూలు విషయం కానే కాదు
ఒకరి కొకరు దూరముగా ఉండటం
నిరీక్షన అంత తేలిక పని కాదు
అజ్ఞాతంలో ఉన్న వారు రావడం
ఆనందం కోసం వచ్చారనక తప్పదు
ఒంటరితనం నుండి జంటగా మారడం
దేవుని లీల అని అనుకోక తప్పదు
ఒక్కడు నలుగురిలో ఒక్కడవటం
గుణాన్ని బట్టి అనుకోక తప్పదు
స్పర్శిమ్చుకున్న కళ్ళు ఎకమవ్వడం
సాశ్వితమని అను కోక తప్పదు
అతిగొప్ప పూవు పూయడం
చెట్టు చేసుకున్న పుణ్యమని అనుకోక తప్పదు
నట్టింట్లో ప్రేమ ఊయల కట్టడం
యిరువురి ఆనంద హొళీ అనుకోక తప్పదు
గగనంలో హరివిల్లు చూసి ఆహా అనుకోవడం
అది స్థిరంగా ఉండదని తెలుసుకోక తప్పదు
మైదానంలో పిల్లలు ఆడుకోవడం
కొంతవరకు వ్యాయామమని అనుకోక తప్పదు
జంక్షన్లో రెడ్ లైట్ పడటం
ఎంతటి వారికైనా ఆగక తప్పదు
జంక్షన్లో గ్రీన్ లైట్ పడటం
ఎంతటి వారికైన పరుగులేయక తప్పదు
వసంతం వచ్చిందని సంబరపడటం
వేసవి వేడిని భరించక తప్పదు
తప్పతడుగుల ముద్దు మాటలు వినడం
పిల్లల్ని ప్రేమతో కొట్టక తప్పదు
బ్రహ్మా లేఖినిని ఉల్లంఘించే శక్తి బ్రహ్మా, విష్ణు, మహెశ్వరులకు కూడా
లేదని ఈ శ్లోకం ద్వారా తెలుస్తున్నది
సత్యం- ధర్మం- న్యాయం విడువకుండా ప్రకృతి ననుసరించి జీవించడం
మానవులకు తప్పదు
బ్రహ్మా లేఖినిని ఉల్లంఘించే శక్తి బ్రహ్మా, విష్ణు, మహెశ్వరులకు కూడా
లేదని ఈ శ్లోకం ద్వారా తెలుస్తున్నది
సత్యం- ధర్మం- న్యాయం విడువకుండా ప్రకృతి ననుసరించి జీవించడం
మానవులకు తప్పదు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి