5, మే 2015, మంగళవారం

Self confidence-17 (Family-comedy- Sanskrit slokaala telugu vachassu))

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం
 మనోధైర్యానికి మార్గాలు 17


ఏకేనాపి కృవృ క్షేణ
కోటరస్థిత వహ్నినా !
దహ్యతే తద్వనం సర్వం  
కుపుత్రేనా కులం యథా !!


వనంలో ఉన్న చెట్లలో ఒకచెట్టు తొర్రలో నిప్పు పుట్టిందే అనుకోండి, అవృక్షాన్నే కాల్చుతుందని  అనుకోకండి.  మొత్తం వృక్షాల్ని కాల్చి బూడిద చేస్తుంది. 

అలాగే ఒక కులంలో ఒక దుర్మార్గుడు పుట్టాడనుకోండి, వాడు చేసే చేష్టలవల్ల, దుర్మార్గపు పనులవల్ల  తను నాశనమై పోతాడు. అట్లాగా వాని ప్రభావము వళ్ళ  వంశ మంతా నాశనమై  పోతుందట. 

అలాగే ఒక కులంలో పుట్టి, మనసులో ప్రేమ అనే అగ్ని పుట్టి , వయసు ఉరకలతో పరుగు పెట్టి, ప్రేమికులుగా మారి ఒకరి కొకరు ఎకమై, జీవిత సాగరం ఈదాలి. మానవులలో పుట్టే ప్రేమ అనే అగ్ని కుటుంబాన్ని కలవర పెడుతుంది కాని ప్రేమికుల్ని కలుపుతుంది. ప్రేమ గెలుచుటకు ఇరువురిలో ఉండే కొన్ని భావాలు ఇందు పొందు పరచు చున్నాను  


కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటలేం 
కళ్ళు తడవ కుండా జీవితాన్ని దాటలేం
వళ్ళు తడవ కుండా సంసారం చేయలేం  
ముళ్ళు గుచ్చుకోకుండా జీవితాన్ని ఈదలేం 

కష్టాల్లో  కన్నీరు ఉప్పదనం 
సుఖాల్లో పన్నీరు కమ్మదనం 
అందరు తెలుసు కున్న  నిజం
తెలుసు కోక పోతే ఎడారి జీవితం 

వయసు ఉంటె  కోరిక   పుడుతుంది 
కోరిక ఉంటె సంపాదన పెరుగుతుంది
సంపాదన ఉంటె ప్రేమ పుడుతుంది 
ప్రేమ వళ్ళ ఇద్దరు ఒకటవ్వాలని ఉంటుంది

మీ పక్షాన నా పక్షాన అడ్డు లేదు 
మీఇబ్బంది నాఇబ్బంది అసలే లేదు
మీ గోత్రం  నాగోత్రం  ఒకటి కాదు
ఇక మనసులు కలియుటకు అడ్డు లేదు

నామనసుకు నీ మనసు తోడవ్వాలి 
నా వయసుకు నీ సొగసు తోడవ్వాలి 
నా పరువానికి నీ కోరిక తీరాలి 
నా ధీర్ఘానికి నీ ముడి కలుసుకోవాలి

పరిమితిలో పరువాన్ని బద్రపరుస్తూ 
కోరికల గుర్రాన్ని కళ్ళాలతో బిగిస్తూ 
గడసరి సొగసుల అందాన్ని భరిస్తూ 
నీ ప్రేమ కొరకు ఉన్నాను విలపిస్తూ 

చేతులు చేతులు కలవాలి 
మీరు నేను ఒకటై పోవాలి  
కలసి మెలిసి ఒకరిగా బ్రతకాలి 
ఆధరాలు అందుకొని ఆనందించాలి

నిప్పురవ్వ వనాన్ని కాలుస్తుంది 
చెడ్డవాడు  వంశాన్ని కాలుస్తాడు 
కాని ప్రేమ పుడితే మనసులో రగులుతుంది 
ప్రేమ ఎకమతె జీవితం సుఖమవుతుంది

                                 ప్రేమికులారా తెలుసుకోండి 
నరస్యాభరణం రూపం 
రూపస్యాభరణం గుణం
గుణస్యాభరణం జ్ఞానం 
జ్ఞానస్యాభరణం క్షమ

మానవుడికి రూపం ఆభరణం లాంటిది
రూపానికి గుణమే ఆభరణం లాంటిది 
గుణానికి జ్ఞానం ఆభరణం లాంటిది
ఆ జ్ఞానానికి క్షమే (ఓర్పే ) ఆభరణం 

కేవలం రూపం ఉపయోగపడదు. దానికి తగిన గుణం ఉండాలి.  రూపం, గుణం ఉన్నా  బుద్ధిహీనుడైతె ప్రయోజనం ఏమిటి? 
జ్ఞానం ఉండాలి, జ్ఞానం ఉన్న ఓర్పు లేకపోతె ఉపయోగం లేదు

ప్రేమించేటప్పుడు ఎంత ఓర్పు వహిస్తారో, జీవించెటప్పుడు కూడా అంతే ఓర్పు వహించాలి 
చెట్టుకు మరణం, మూర్ఖునకు మరణం ఉన్నది కాని ప్రేమకు మరణం లేదు