7, మే 2015, గురువారం

Self confidence-18 (Family-comedy- Sanskrit slokaala telugu vachassu))


ఓం శ్రీ రాం                     ఓం శ్రీ రాం                    ఓం శ్రీ రాం 
మనోధైర్యానికి మార్గాలు -18
ద్వివిధో వ్యాధి రస్తేహ సామాన్య: సార ఏవచ !
వ్యవహారస్తు సామాన్య: సారో జన్మమయ: స్మ్రుత:
(వసిష్టరామాయణం లో వసిష్ఠ మహర్షి రాముడితో అన్న మాటలు )

వ్యాధులు రెండు రకాలు. గాలి, ప్రకృతి మార్పులద్వారా కలిగే వ్యాధులు సామాన్యమైనవి. రెండవది జన్మతోనే వచ్చేవ్యాదులు 

 ప్రపంచము మొత్తము మానవులు అనేక వ్యాధులకు  లోనవుతున్నారు, వ్యాధులకు  తగిన మందులు వాడి ఆరోగ్యవంతులగుతున్నారు. ఆర్ధిక పరిస్థితులు బాగోలేక రోగాలతో చనిపోతున్నారు,  సరియైన వైద్యులు లేక చనిపోతున్నారు.
  
 మానవులు ఆకర్షణ వికర్షణకు లోనవుతున్నారు, నేను దీనిని సాధించాను, నేను ఇంకా సాధించాల్సించి ఉన్నది  అని పదే పదే అనుకుంటారు. నిరంతరం మదన పడు తుంటారు, భోజన శయనాది క్రియలు వేళ  ప్రకారముగా చేయరు, అనారోగ్య కరమైన ఆలోచనలు వెంబడించే మనుష్యులే  రోగులుగా మారుతున్నారు. 

ఇంకా దురలవాట్లు, దుష్ట ఆలోచనలు, చెడు సహవాసాలు ఉన్న మనుష్యులే  అనారోగ్యులుగా మారుతున్నారు. ఇవి అన్ని శారీరక రోగాలు, రెండవ రకం మానసిక రోగాలు పుట్టుకతో కలగినవి దీర్ఘకాలిక రోగాలు, మద్యలో మానసిక వత్తిడి జరిగి శారీరకముగా ఉన్నా ఎ పని చేయలేరు, వారు జీవితాంతము మందులు వాడు తుంటారు. భయం, వత్తిడి, ఆందోళన, తాపత్రయం, ఆలోచనలు, అపనమ్మకము తో బలహీనులవుతారు. వైకల్యాన్ని భగవంతుడు కల్పించాడని అనుకోని దేవున్ని తిట్టుకుంటూ  ప్రార్ధణలు చేస్తారు.  
      
ఓ అభాగ్యురాలు భాదతో భర్తకు లేఖవ్రాసిన విధానము

నీకోసం ఈ రెండు కళ్ళతో, ఎదురు చూపులు
రొమ్ములు ఎండమావులు  గా మారుతున్నాయని, తెలియదా
నీకోసం ఈ శరీరం నెత్తురు, కదలికలు
నీళ్ళు  త్రాగుతున్న నోటి నుండి నెత్తురు కారుతుందని, తెలియదా
 
నీకోసం ఉన్నా వెంబడిస్తున్నాయి కొందరి చూపులు
చూపుల కే  కళ్ళు  కాయలు అవుతాయని  తెలియదా
నీకోసం ఉన్నా ఇబ్బంది పెడుతున్నాయి పెద్దల మాటలు
మనసు ఇబ్బంది చెప్పటానికి వీలు లేదని తెలియదా  

నీకోసం ఉన్నా వెంబడిస్తున్నారు, ఉగ్రవాదులు
నేను రహస్యాలు తెలుపనని, తెలియదా 
నీకోసం ఉన్నా నా, నెత్తురు గడ్డలు
నీ ప్రేమ కోసం ఉన్నానని పిల్లలకు, తెలియదా 

నీకోసం ఉన్నా భయ పెడుతున్నారు, విరోధులు
నన్ను ప్రేమ  చేయాలని చూస్తున్నారని, తెలియదా
నీకోసం ఉన్నా ఆశగా పిలుస్తున్నారు, నాయకులు
ఆశకు చిక్క కుండా జీవితం,  కత్తెర లా మారుతుందని, తెలియదా 

నీకోసం ఉన్నా కలవర పెడుతున్నాయి, మధురానుభూతులు
కలలు కంటూ ఉన్నాను,  ఎన్నో రాత్రులు, నీకు తెలియదా
నీకోసం ఉన్నా కొందరు పడుతున్నారు, ఆయుధాలు
నేను అందంగా ఉన్నా,  విడిపోయే గులాబి అని, తెలియదా  

నీకోసం ఉన్నా మారవు ఈ సముద్ర కెరటాలు
వేదనలో ఉన్నా నీకోసం ఈ ఎదురు చూపులు
నీకోసం చదువుతున్నాను మనో నిగ్రహ మార్గాలు
నీకోసం  ఈ చూపులు, నీకోసం ఈ  ప్రేమ లేఖ

 దగ్గరగా ఉన్నప్పుడు  విలువ తెలియదు -
 దూరంగా ఉన్నప్పుడు దాని విలువ  తెలుస్తుంది      

ఆవేశానికి పోయి, అనవసర తాపత్రయాన్ని పెంచుకొని మానసిక రోగులుగా మారకూడదు, ప్రకృతి ననుసరించి, భోజనము, నిద్ర, మైధునం ఉన్నవారికి ఎటువంటి రోగాలు ఉండనే ఉండవు