7, మే 2015, గురువారం

Self confidence-19 (Family-comedy- Sanskrit slokaala telugu vachassu))



ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం
 మనోధైర్యానికి మార్గాలు 19


ఈశ్వర: సర్వ భూతానాం హృద్దేశే  అర్జున తిష్ఠతి:
భ్రామయన్ సర్వభూతాని యంత్రారూధాని మాయయా 
(గీత -18-61)
(అర్జునా! భగవంతుడు సర్వ ప్రాణుల హృదయాలలో ఉన్నాడు. తన మాయ లేదా శక్తి ద్వారా ఈ యంత్రాలలో ఉంటూ వాటిని నడిపిస్తున్నాడు )

తల్లి తండ్రుల సంభాషణ, తల్లితో కూతురు కొడుకు సంభాషణ 

కూతురు : అమ్మా నేను ఫ్రెండ్స్ తో సినమాకు వెళ్తాను 
మంచిదమ్మా : సినమాహాల్లో వేనకున్నవారు చేసే గొడవలు పట్టించుకోకమ్మా, అసలే జిప్పు  జాకెట్టు వేసు కుంటావు వళ్ళంతా పవిట  కప్పుకొని కూర్చో
కూతురు : అమ్మా బాయ్ ఫ్రెండ్స్ పబ్బుకు రమ్మంటున్నారు వెళ్ళ మంటావా 
మంచిదమ్మా : డబ్బున్న వాడితో స్నేహంచేసి, అవసరమైతే వాడితో డ్రింక్  త్రాగి, నీచుట్టు తిరిగేటట్టు చేసుకొని , అల్లుడుగా తీసుకురామ్మా 

కొడుకు : అమ్మా నేను ఫ్రెండ్స్ తో సినమాకు వెళ్తాను 
మంచిదిబాబు : అక్కడ గొడవ పెట్టుకో, నలుగురిలో మంచి వాడని పించుకో, డబ్బు మాత్రం ఖర్చు చేయకు 
కొడుకు : అమ్మా గర్ల్స్  ఫ్రెండ్స్ పబ్బుకు రమ్మంటున్నారు వెళ్ళ మంటావా   
మంచిది బాబు : అమ్మాయిలు నిన్ను లొంగతీసు కోవటానికి ప్రయత్నిస్తారు, చూడ కూడని అందాలూ చూపిస్తారు, 
లొంగి పోయి, ఇదే నా పెల్లాం అన్నావనుకో మా మాటలు ఎట్లా ఉంటాయో మాకే తెలియదు

భార్య:  భర్త గారు  నేను మా  ఫ్రెండ్స్ తో సినమాకు వెళ్తాను
మంచిది శ్రీమతిగారు : ఒక్క మాట కుర్తుంచుకో అక్కడ ఆడవారు నిన్ను ములగ చెట్టు ఎక్కించిన మన ఇంటి రహస్యాలు చెప్పకు, అసలే నీకు నోటి దురద ఎక్కువ 
భార్య : భార్తగారు నేను గర్ల్స్  ఫ్రెండ్స్ క్లబ్బుకు రమ్మంటున్నారు వెళ్ళ మంటావా 
మంచిది శ్రీమతిగారు : ఊరికె దొరికింది కదా అని త్రాగావనుకో వంటి మీద గుడ్డ వుందో కుడా చూసుకోలేవు, అక్కడ కుర్రవాళ్ళు చేసి కోతివేషాలకు నీవు భాద పడక తప్పదు 

భర్తః    భార్య  గారు  నేను మా  ఫ్రెండ్స్ తో సినమాకు వెళ్తాను
మంచిది శ్రీ వారు : వేల్తే వేల్లండి, మీ స్నేహితులు చెప్పే మాటలకు నన్ను అనుమానించ కుండా ఉంటెచాలు, అసలే మీరు నమ్మలేని పక్షి
భర్త : భార్యగారు పక్కింటావిడ భర్త ఊరుకెళ్ళాడుట ఆమెకు తోడుగా క్లబ్బుకు రమ్మంటుంది  వెళ్ళ మంటావా
ఏమిటండి మీరు వాగుతున్నది :  మన కొంప కొల్లేరవుతుంది, ఎవరిదారి వారు ఇష్టం వచ్చినట్లు తిరిగితే ఇది సంసారం గల ఇల్లనుకోరు, మీరు కుడా ముర్ఖుడుగా మారితే, నన్ను కూడా  అమ్మేసారనుకో, నా బతుకు నా పిల్లల  బ్రతుకు ఏమవ్యాలి. 

ఉండండి మీరు ఎక్కడకు పోవద్దు, పిల్లలను పిలుస్తా, ఇప్పుడే అంటూ 

పిలిచింది భార్య : మనలో కోరికలే పుట్ట కూడదు, పుట్టిన తాహతుకు మించిన కోర్కల జోలుకు పొకూడదు, పిల్లలూ బుద్ధిగా చదువుకొని, ఒక ఇంటివారిగా మారి అప్పుడు కోరికలు తీర్చు కోవటాని ప్రయత్నించండి, అప్పటిదాకా మమ్మల్ని తల్లి తండ్రులుగా గుర్తించి మా మాటలు విని బుద్ధి మంతులుగా ఉండండి. మీరు స్థిరపడండి. 

 ఆ తరువాత  మాకు మీరు స్వేచ్చ ఇస్తే ప్రపంచము అంతా తిరిగి మీ పిల్లలకు కధలు చెప్పు కుంటూ బ్రతుకుతాం. 

ఏమండోయో శ్రీమతిగారు కాఫీ కలుపుకు వచ్చా త్రాగండి, కళ్ళు తుడుచుకుంటూ ఇప్పటిదాకా నేను చూసింది " కలా "

" అందరం - ధర్మ మార్గాన్నే ఎల్లప్పుడూ అవలంబించుదాం, సత్పురులను సేవించుదాం, అత్యాశలను విడనాడుదాం, 
పరులగుణ దోషలను ఎంచక జీవించుదాం, భగవత్సేవ గావించుదాం,
మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని అందరికి సహాయ పడదాం "      



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి