ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్
మనోధైర్యానికి మార్గాలు -25
యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మత్రుప్తశ్చమానవ: !
ఆత్మన్యేవ చ సంతుష్ట: తస్య క్రార్యం న విద్యతే !!
ఎవడైతే ఆత్మ యందె ప్రీతి కలిగి, ఆత్మయందే సంతృప్తి చెందుతూ, అత్మయందే ఆనందాన్ని పొందుతాడో అల్లాంటి వాణికి చేయాల్సిన కార్యం ఏది ఉండదు (గీత 3. 7)
మనసు ఒక కోరికల పుట్ట. ఆ కోర్కలను తీర్చుకొవడానికి ఎన్నో కర్మలు చెస్తూ ఉంటాం "మనం కర్మలు చేస్తున్నంత వరకూ మనస్సులో చింతలు దూరమవుతాయి "
సంసారంలో కర్మలు నిర్వర్తిస్తున్నంత వరకు మనస్సు అల్లకల్లోలంగా ఉంటుంది. సాంసారిక చింతల నుండి శాంతిని పొందాలంటే మొదట సత్సాంగత్యం చెయాలి. దాని ద్వారా భవత్ కథా శ్మరవణం పట్ల ఆసక్తి ఎర్పడు తుంది. ఆ తరువాత భగవన్నామంపై అబిరుచి కలుగుతుంది. భగవన్నామస్మరణలో నిమగ్నమైన మనస్సు భక్తి పారవశ్యమై ఒలలాడుతుంది. అలా సంసారం నుండి మనస్సును భగవంతునివైపు మరలించిన కొద్ది చింతలు తగ్గుతూ వస్తాయి. చివరికి సంపూర్ణ చిత్త శాంతి చేకూరుతుంది
ఎవరైతే ఒక్కసారి భగవన్నామరుచిని ఆస్వాదిస్తారో అలాంటివారు ఎలాంటి ప్రలోభాలకూ, ఆకర్ష ణలకూ లోను కారు అని హనుమంతుని కథను వివరిస్తాను
" ఒకసారి హనుమంతుడు, రావణాసురుని భవనంలో ప్రవేశించి, అక్కడ స్పటిక స్తంబాలను చూస్తు ఉండుట ఒక స్త్రీ చూసెను వెంటనే తన మాయా రూపాన్నిప్రకటించి అందమైన స్త్రీగా మారి ఏంతో ఆత్మీయతగా పళ్ళను స్వీకరించమని వేడుకుంది, అందచందాలతో ప్రలోభ పెట్టింది. కాని హనుమంతుడు ఎటువంటి ప్రలోభాలకు లొంగ కుండా తన కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకొని సీత కొరకు క్షణకాలం కుడా వ్యర్ధం చేయక వెతికెను.
."మరణం ప్రకృతిః శరీరిణాంవికృతిర్జీవితముచ్యతే బుధైః
క్షణమప్యవతిష్ఠతే శ్వసన్ యది జంతుర్నను లాభవానసౌ"
.
విజ్ఞులు మరణము ప్రకృతిసిద్ధమైనదని జీవితము యాదృచ్చికము అని నుడువుతారు.
ఒక్క క్షణము శ్వాస పీల్చి వదలినామంటే ఆక్షణము జీవితమును సాదినట్లనుకొనవలెను.
.
రఘువంశము(మహాకవి కాళీదాసు)
పులి-కంకణము-బాటసారి .!
.
నీతి చంద్రిక - పరవస్తు చిన్నయ సూరి మిత్రలాభము
.
ఒక ముసలి పులి స్నానముచేసి దర్భలు చేతఁబట్టుకొని కొలని
గట్టుననుండి 'యోయి తెరువరీ, యీ పయిఁడి కంకణము వచ్చి పుచ్చుకొ'మ్మని పిలిచి చెప్పెను. ఒక పాంథుఁడా మాట విని 'యిది నా భాగ్యముచేతనే వచ్చుచున్నది. ఏల సందేహపడవలె'నని చింతించి, 'యేదీ కంకణము చూపు'మని యడిగెను. పులి చేయిచాఁచి 'యిదిగో హేమ కంకణము చూడు'మని చూపెను. 'నీవు క్రూర జంతువవు కాఁబట్టి యేలాగున నిన్ను నమ్మవచ్చు'నని పాంథుఁడు పలికెను. ఆమాట విని పులి యిట్లనియె. 'ఓరీ పాంథా! విను, మునుపు యౌవనమందు మిక్కిలి దుష్టుఁడనయి యుంటిని. అనేకములగు గోవులను మనుష్యులను వధించి మితిలేని పాపము సంపాదించి భార్యాపుత్రులను బోఁగొట్టుకొని యేకాకినయి నిలిచితిని. అనంతర మొక పుణ్యాత్ముండు నా యందు దయచేసి, యికమీదట గోవులను, మనుష్యులను వధింపకు, సత్కార్యములు చేయుమని చెప్పెను. అది మొదలుకొని పాపకృత్యములు విడిచి మంచి కార్యములు చేయుచున్నవాఁడను, వృద్ధుఁడను, బోసి నోరి వాఁడను. గోళ్ళు పోయినవి, లేవ సత్తువలేదు. నన్ను నీవేల నమ్మవు? నీవు దరిద్రుఁడవు కాఁబట్టి యిది నీకు దానము సేయవలెనని కోరితిని. సంశయపడక యీ కొలనిలో స్నానము చేసి వచ్చి పసిఁడి కంకణము పుచ్చుకొమ్ము' అనఁగానే వాఁడు పేరాసచేత దాని మాటలకు లోఁబడి కొలనిలో స్నానము చేయ బోయి మొలబంటి బురదలో దిగఁబడెను. అప్పుడు పులి చూసి 'యయ్యయ్యో, పెను రొంపిలో దిగఁబడితివి గదా! నేను వచ్చి నిన్ను లేవ నెత్తెదను. భయపడకు' మని తిన్నతిన్నఁగా సమీపించి వానిని బట్టుకొనెను. ఈలాగున వాఁడు తగులుకొని - 'క్రూరజంతువును నమ్మరాదు. నమ్మి యీ గతి తెచ్చుకొంటిని. మించినదానికి వగచి యేమి ప్రయోజనము? ఎవ్వరికైన విధి తప్పించుకో వశముగాదు.' అని చింతించుచు దానిచేత భక్షింపఁబడియె.
.
కాఁబట్టి సర్వవిధముల విచారింపని పని చేయరాదు. చక్కఁగా విచారించి చేసిన పనికి హాని యెప్పటికి రాదు."

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి