29, ఏప్రిల్ 2015, బుధవారం

Selfconfidence -14 (Family -comedy- Question and answeres)

ఓం శ్రీ రాం                    ఓం శ్రీ రాం               ఓం శ్రీ రాం 
మనోధైర్యానికి మార్గాలు -14


విఘ్నేశ్వరుడు : ఏమిటి నారదా ఉదయమే నాదగ్గరకు వచ్చావు, ఇప్పుడు భూలోకంలోకి వెళ్దామని అడుగకు, మరి ఏమైనా అడుగు సమాధానము చెపుతాను. 

నారదుడు : నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి నాకు మీరు అవి తీర్చగలరు. 

విఘ్నేశ్వరుడు : నారదా నీకు కూడా సందేహాల, నీవు లోక సంచారుడవు, అన్ని విషయాలు నీకు బాగా తెలుసు, ఆయినప్పటికి నీకు మాట ఇచ్చాను, అడుగు నాకు తెలిసినవి నీకు తెలియపరుస్తాను, తెలియనివి మాతా పితలను అడిగి తెలుసుకుందాం, దానికైతేనే నేను చెప్పగలను. 

నారదుడు: మహాప్రభు మీకు తెలియని విషయాలు ఉంటాయా, నేను భూలోకంలో మానవుల గురించి ప్రశ్నలు వేద్దామని అనుకుంటున్నాను. 

విఘ్నేశ్వరుడు : అడుగు నారదా, ప్రతి వినాయక చవితికి వారి భాదలు నాకు వ్యక్తం చేస్తారు, అవి అన్ని నేను తీరుస్తున్నాను అయినా నీవు అడుగు. 

(1). మానవులు ఆలోచించాల్సిన ముఖ్యమైన మూడు  అంశాలు ఏవి? 
ఒకటి : మనకు కనిపించే ఈ ప్రపంచం 
రెండు : మనకు కనిపించని దేవుడు 
మూడు: ఈ రెంటితో సంభంధం పెట్టుకొనే మనం 

(2).    విత్తు ముందా చెట్టు ముందా అని ఎప్పుడు వాదనకు దిగుతారు మానవులు ఎందుకు,  ఏది ముందు. ?
అదేమిటి నారద పాలసముద్రం లో పుట్టినది వృక్షం కదా, అదేముందు. 

(3). పరుగెత్తి పట్టుకోనేదేది, పరుగెత్తి పట్టుకోలేనిది ఏది ?
పరుగెత్తి పట్టు కొనేది బంతి, పట్టు కోలేనిది బంతి ఆకారములో ఉన్న నీటి  బిందువు.

(4). పసి పిల్లలకు కావలసినది ఏది ? అక్కర్లేనిది ఏది ?
కావలసినది రొమ్ము పాలు, అక్కర్లేనిది పాలు లేని రొమ్ము. 

(5). పసి పిల్లలు ఇష్టపడేది ఏది ? ఇష్టం కానిది ఏది ?
 ఇష్టపడేది "నిద్ర" , ఇష్టం కానిది చీమలు కుట్టే నిద్ర 

(6). పసిపిల్లలను కొందరు ప్రేమిస్తారు, కొందరు ద్వేషిస్తారు ఎందుకు ?
ప్రేమిస్తారు అందరు, నాకు పుట్టలేదే అని ద్వేషిస్తారు కొందరు. 

(7). పసి పిల్లలు ముందు ఆకర్షించేది ఎవ్వరిని, తరువాత ఎవ్వరిని ? 
ముందు "తల్లిని" తర్వాత తండ్రిని, బొమ్మలను 

(8). పసి పిల్లలు వెలుతురు చూసి ఏడుస్తారు ఎందుకు ?
సూర్యకిరణాల వేడిని తట్టు కోలేని పసిహృదయాలు, భూలోకంలో  పుట్టాను నేను ఏంచేయాలో తెలియక ఏడుస్తారు. 

(9). పసిపిల్లలను జాగర్తగా చూడాలి ఎందుకు ?
కొందరి కళ్ళు పాపిష్టివి, దిష్టి తగలుతుంది, కొన్ని జంతువులు  అతి ప్రేమ చూపించి తింటాయి. 

(10). పావురాల్లను చూసి పిల్లలు సంతోష పడతారు ఎందుకు ?
అవి ఎవ్వరికి ఏమి హాని చేయవు, పిల్లలు సంతోష పడతారు, కాని పెద్దలే వాటిని వండుకొని తింటారు 

(11) వయసులో ఉన్నవారికి నచ్చేది ఏది, నచ్చనిది ఏది?
నచ్చేది "  ప్రేమ  " నచ్చనిది "సలహా" "

(12.) వయసులో ఉన్నవారికి కావలసినది ఏది, అక్కరలేనిది ఏది ?
కావలసినది  "ఉద్యోగము మరియు పెళ్లి " , 
అక్కరలేనిది "చెడు అలవాటు "

(13) ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కలసి వెళ్తుంటే మంచిమాట, 
చెడు మాట ఏది ?
మంచిమాట: "అన్నా చెల్లెలు అని " లేదా ప్రేమికులని, 
 చెడు మాట లేచి పోయేవారని.

(14) పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు తెలుసుకోవలసినవి ఏవి ?
ఒకరి కొకరు మనసు విప్పి మాట్లాడుకొని, కష్ట సుఖాలు అనుభవించి మనస్సు  ప్రశాంత పరుచు కోవటమే జీవితం
 
నారద ఈరోజుకు  నీవు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చాలు , రే పు మరికొన్ని విషయాలు తెలుసుకుందువు, పూజా వేలైనది, తల్లి తండ్రులకు పాద పూజ చేయవలెను.

నారదుడు : అటులనే మహాప్రభు నేను ఒక్కసారి భూలోక సంచారం చేసి  వస్తాను. 

తెలియనివి తెలుసు కోవటం మంచిది . 
మంచిని ఆదరించటం అందరికి మంచిది

28, ఏప్రిల్ 2015, మంగళవారం

Self Confidence-13 ( Sanskrit slokaala telugu vachassu)

ఓం శ్రీ రామ్                    ఓం శ్రీ రామ్                         ఓం శ్రీ రామ్

 మనోధైర్యానికి మార్గాలు -13

""ఈశ్వర వంశంబు విశ్వంబు: ఈశ్వరుండు  భూతంబుల  నొకటితో నొకటి జేర్చు, నెదవాపు...,... "
( అంటూ  ఈ దృష్టి యావత్తు ఎలా భగవంతుడి స్వా ధీనమై ఉందో  ఉద్ఘాదిమ్చాడు.  ఈ విశ్వమంతా ఈశ్వరాధీనం, పరమేశ్వరుడే ప్రాణులను ఒకరితో ఒకరిని కలుపుతూ  విడదీస్తూ ఉంటాడు)
 .
తల్లిదండ్రుల గొప్పదనం
 

ఈ సమస్త భూమికంటే బరువైనది తల్లి. ఆకాశముకన్నా ఉన్నతుడు తండ్రి. ఒక్కసారి తల్లికీ, తండ్రికీ నమస్కరించినచో గోవును దానం చేసిన ఫలము దక్కును. సత్యం తల్లి...జ్ఞానము తండ్రి. పది మంది ఉపాధ్యాయుల కంటే ఆచార్యుడు గొప్పవాడు. వందమంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రి కంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి. వారికి సేవ చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలము, వెయ్యిసార్లు కాశీయాత్ర చేసిన ఫలము, వందసార్లు సముద్ర స్నానము చేసిన ఫలము  దక్కుతాయి. ఏ పుత్రుడూ, ఏ పుత్రికా మాతృదేవతను సుఖంగా ఉంచరో, సేవించరో వారి శరీరమాంసాలు శునక మాంసము కన్నా హీనమని వేదం చెబుతుంది. ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంది, కన్నతల్లి కంటనీరు తెప్పించితే దానికి లక్ష గోవులు దానమిచ్చినా, వేయికి పైగా అశ్వమేధ యాగాలు చేసినా పోదు. తను చెడి బిడ్డలని చెడగొట్టిన తండ్రిని అసహ్యించుకున్నా తప్పులేదు. చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా అది తప్పేనని ధర్మశాస్త్రము చెప్తోంది. తల్లిని మించిన దైవం లేదు, గాయత్రికి మించిన మంత్రం లేదు.


దయచేసి ప్రతి తల్లిదండ్రులు చదవండి...............హాలిడేస్ లో పిల్లలకు సినిమాలు, షాపింగులు అంటూ తిప్పడమే కాకుండా ఇలా కూడా చేసి చూడండి..........ప్లీజ్..........

1.దగ్గరలోని బ్యాంకుకు తీసుకుని వెళ్ళండి....అవి ఎలా పనిచేస్తున్నాయో........  ఏ.టి.యం. ఎలా పనిచేస్తుందో..........వాటివలన లాభాలేంటో చెప్పండి.

2.వీలు చూసుకుని అనాద శరణాలయాలకు,వృద్ధాశ్రమాలకు తీసుకుని వెళ్ళండి. వారి బాధలను,కష్టాలను వారికి అర్థం అయ్యేలా చెప్పండి........

3.నదుల దగ్గరికి, సముద్రాల దగ్గరికి, తీసుకునివెళ్ళండి.........తప్పక వారికి ఈతను నేర్పండి..........

4.రెండు చెట్లను వారికి ఇచ్చి, వారిని చక్కగా పెంచమని చెప్పండి....చక్కగా పెంచిన వారికి మంచి బహుమతిని ఇస్తానని వారిని ప్రోత్సాహించండి.........

5.మీ పిల్లల ముందు రక్తదానం చేయండి. రక్తం యొక్క ఆవశ్యకతను వారికి తెలియచేయండి.......అమ్మా, నాన్నలు  రియల్ హీరోలు  అనుకునేలా ప్రవర్తించండి ...

6.గవర్నమెంట్ హాస్పటల్ కు తీసుకుని వెళ్ళండి.........రోగులు పడే పాట్లను......ఆక్సిడెంట్లు అయితే ఎంత కష్టపడాలో వారికి తెలుపండి.......

7.సొంత గ్రామానికి తీసుకుని వెళ్ళి ,తాతయ్య,అమ్మమ్మ,బామ్మల ,అత్తల, మామల బాబాయ్ ల, ఆప్యాయతలని వారికి రుచి చూపించండి.........అందరూ కలసి మెలసి వుంటే ఎంత బా్గుంటుందో చూపండి.......వ్యవసాయం గురించి, రైతు ఎంత కష్టపడితే మనం అన్నం తింటున్నామో, ఆహార పదార్థాలను వృద్ధాచేయడం ఎంత తప్పో వారికి తెలియజేయండి...... 

8.దగ్గరలోని, పోలీసు స్టేషను, కోర్టు, జైలుకు తీసుకును వెళ్ళండి., జైలు లోని శిక్షలు, గురించిన అవగాహన వస్తే వారు అలాంటి తప్పులు చేయకుండా ఉండటానికి వీలు ఉంటుంది........

9.దగ్గర కూర్చో పెట్టుకుని వారి కోరికలేంటో తెలుసుకుని ......వారు కోరినవన్నీ కాకుండా ఏది అవసరమో వాటిని మాత్రమే తీర్చి......వారికోసమే మీరు ఉన్నారన్న నమ్మకాన్ని కలిగించండి............

10.అన్ని మతాల దేవాలయాలకు తీసుకుని వెళ్ళండి........మీకు తెలిసిన
విషయాలను వారికి చెప్పండి..

మంచి వాక్యాలు "జి మేలు" ద్వారా పంపండి - 
మనవంతు మనం విజ్ఞాననాన్ని అందరికి పంచుటకు ఉపకరిద్దాం - ఒకరికి ఒకరం తెలుగును వృద్ధికి సహకరించు కుందాం
 

Self Confidence -12 (comedy children small story)

ఓం శ్రీ రామ్                    ఓం శ్రీ రామ్                         ఓం శ్రీ రామ్
 మనోధైర్యానికి మార్గాలు -12

విఘ్నేశ్వరుడు : ఏమిటి నారదా ఇల్లాంటి బస్సు ఎక్కిన్చావు 

నారదా :  మీరే స్వయంగా ప్రజల కష్టాలు తెలుసు కుంటారని ఇది ఎక్కించాను. 

విఘ్నేశ్వరుడు : మరి ఇంత ఘోరంగా ఉంటారా మానవులు

నారదుడు :  ఇప్పుడే కదా మీరు ఎక్కింది ఇంకా ముందు తెలుసుకో గలుగుతారు 
విఘ్నేశ్వరుడు : సరే నారద ఇంకా బస్సు కదలదే  , ఏమిటి నారద ఇంత  మంది ఎక్కారు ఇది పుష్పక విమానము లాగున్నది. ఇంత  మందిని తీసు కెల్తుందా, ఒక వైపు చవట కంపు వస్తున్నది,  మరోవైపు ఆడవారు,  మొగవారు  మద్యలో వేలాడుతున్నారు, ఒకరి కొకరు రాసుకొని ముందుకు పోతున్నారు, ఇది తప్పు కదా నారదా, చూడు  అక్కడ, ఎట్లా ఉమ్మి వెస్తూన్నదో అక్కదో ఒక స్త్రీ, ఆ ప్రక్కన ఉన్న స్త్రీ పై చేతులు వేసి ఏదో చెస్తున్నాడు, ఇదేమి లోకం నారదా, ఇటు చూస్తె కోళ్ళ గంపలు ఎక్కించారు, అటు చూస్తె పళ్ళ బుట్టలు, పూల బుట్టలు, వాటి ప్రక్కనే చేపల బుట్టలు అన్ని ఇందులోనే పోవాలా నారదా, నన్ను చూసి ఆ " స్త్రీ "  ఏదో అంటుంది నారద నాకేం అర్ధం కావటం లేదు నారదా  ఒక్క సారి విడమరిచి చెప్పు నారదా!
నారదుడు : ఐరవతములాగున్నావు,  రెండు సీట్లు కలసి కూర్చున్నావు,  నాకేం సిగ్గు లేదు,  నేను నీ వళ్ళో కూర్చోనా అని అడుగు తుంది. 

విఘ్నేశ్వరుడు : అదికాదు నారద ఇంకా ఏదో అడుగు తున్నది

నారదుడు :     ఆవిషయం చెప్పనా,

విఘ్నేశ్వరుడు :  చేపమనే కదా నిన్ను అడిగింది

నారదుడు : కొండంత నాకు నీవు అండగా ఉంటె నా వ్యాపారం జోరుగా సాగుతుంది,  ఉంటావా అని అడుగుతుంది, పూటకో  అమ్మాయిని నీకు. 

విఘ్నేశ్వరుడు : ఈ మానవులు ఎప్పుడు మారుతారు, సెల్ లేకుండా డ్రైవింగ్ చేయమంటే చేయరు, జంతువులను ఎక్కించుకో కూడదంటే  ఎక్కిన్చుకుంటారు,  ఇంత వరకు టికెట్టు కొట్టినవారు లేరు, చేయ్ చూపిన చోట బస్సు ఆపుతున్నారు, చేతులు బయట పెట్ట కూడదంటే  పెట్టుతున్నారు,  ఆలస్యంగా బయలు దేరుతారు, తొందరగా పోవాలని వేగం పెంచుతున్నారు ఈ లోకం ఎప్పుడు మారుతుంది నారదా, అన్ని బస్సులు ఇదే రకమా?

నారదుడు :  ఇవి ఒక రకం ప్రజల కష్టాలు, డబ్బు మనది కాదనుకుంటే సుఖాలు వచ్చే బస్సులు కూడా ఉన్నాయి దానికి పోదామా  

విఘ్నేశ్వ రుడు : ఆ బస్సు కుడా ఎక్కి చూద్దామ్ 

 నారదుడు: ఆదిగో అదే బస్సు "గరుడ " ఎక్కుదాం పదా 

విఘ్నేశ్వ రుడు : ఏమిటి ఎంతకు కదలదు

నారదుడు : పూర్తిగా నిండాకా, ఏ. సీ.  వేస్తారు, అప్పుడు  బయలు దేరుతుంది బస్సు . 

విఘ్నేశ్వ రుడు : కనీసము ఆ టి. వి.  పెడితే  బాగుండును కదా
నారదుడు : ఏమిటి టి .వి. చూస్తారా

విఘ్నేశ్వరుడు : కలియుగ భామలు ఎలా ఉంటారో చూద్దామని 

నారదుడు : అదిగో నేనే ఆన్ చేసాను మీ కొసమ్ చూడండి

విఘ్నేశ్వరుడు : ఏమిటి ఆ ముద్దులు ఆ నాయకా నాయకుల పాటలు 

నారదుడు : మొత్తం పాట  వినండి మహాప్రభు  

విఘ్నేశ్వరుడు : అట్లాగే
 

"మారక మారక అని మదిని తోలచకు మదనా 
మత్తు మత్తుగా మైమరిపించి వేళ్ళకు మదనా
మరుమల్లెల వాసన చూసి ఎత్తులు వత్తవా మదనా 
మనసు మనసు కలవక మతి పోగొడతావా మదనా

గాలిలా వెంబడించి మనసు దోచావే మాధురి 
గాళంవెసి గలగలా మనసును మర్చావే మాదరి
సవ్వడి చేసి సర్దుకొని, దోచుకొని  పొంమంటావా  మాధురి
మనసు కలవక ముందే మతి పోగోడుతున్నావు మాధురి 

వరుస వరుస అని ఒకటే వరసగా వేదించకు మదనా 
వలపులన్ని వయ్యారంగా వడుపుగా ఉంచాను మదనా
  వద్దు వద్దు అనక వచ్చి వలపును జుర్రుకోవే మదనా 
వడిసిపట్టు వదలక వలపు ముద్దు తీసుకోవేమి మదనా

జల జల జారే నదిలా జాలువారే కొంగు జార్చవే మాధురి
జవసత్వాలు ఉడి కించి నన్ను ఉల్లాస పరచవే మాధురి
జయాప జయాలు ఉండవే ఉండవు దీనికి మాధురి
జల్లు పడుతుంది జలదరింపు తగ్గించి పోవే మాధురి"
  
విఘ్నేశ్వరుడు:  బాగుంది నారదా పాట, బస్సు చాలా వేగంగా పోతున్నది నారదా 

నారదుడు : ఒక్కసారి బ్రేక్ వేస్తాడు మత్తులో ఉన్నాడు జాగర్త 

విఘ్నేశ్వరుడు: : అమ్మ , నాన్న అని కెవ్వు మని కాక పెడుతూ దొర్లి  పడ్డాడు

పర్వతీ పరమేశ్వరులు : ఏమైంది తండ్రి,  అంత  గావు కేక పెట్టావు, 

విఘ్నేశ్వరుడు: : నేను ,నారదుడు కలసి భూలోకంలో వెళ్ళినట్లు కలవచ్చింది, గరుడ బస్సు ఎక్కి నట్లు, బ్రేక్ వేయటం వల్ల పడ్డట్టు కల వచ్చింది. 

పార్వతీ పరమేశ్వరులు : బాబు నీకు  అంత  తొందరెందుకు, భూలోకం వెళ్లాలని ఆశ ఎందుకు, మేము చెపుతాము అప్పుడు వెళ్ళవచ్చు 
   
విఘ్నేశ్వరుడు: : మాతా.   పితలార నేను ఆవిషయమే నారదునికి చెపుతున్నాను అమ్మానాన్నల అనుమతి తీసుకొని భూలోకం  పోదామని అన్నాను. 

పార్వతీ పరమేశ్వరులు: "  బాబు జాగర్త, మేము లోకాలన్నిటిని జాగర్తగా గమనించాలి", నారదా నీ గాణామృతముతో మా బాబుకు జోల పాడు నిద్ర పోతాడు. భూలోకాన్ని చూసి భయపడి నట్టున్నాడు   

నారదుడు :  అటులనే 
కలలు నిజము కావు- కలలు భయ పెడతాయి -
 కష్టపడే వారికి కలలే రావు - దిగులు పడేవారికి కళలు వస్తాయి  


26, ఏప్రిల్ 2015, ఆదివారం

Self Confidence-11 ( comedy children small story )

ఓం శ్రీ రామ్                    ఓం శ్రీ రామ్                         ఓం శ్రీ రామ్
 మనోధైర్యానికి మార్గాలు -11




విఘ్నేశ్వరుడు : నారదా, నారాద, మంచు పర్వతము కదులు తున్నది 
                   ఏమిటి 
నారదుడు : మహాప్రభు 25-04-2015 ఈరోజు నేపాల్ రాజదాని నగరమైన
            ఖాట్మాండ్ లో, భారత దేశంతో పాటు అనేక దేశాలలో కూడా 
            భూమి ప్రకంపించి, భూకంపం వచ్చింది, దాని ప్రబావం అయి 
            ఉంటుంది.

 విఘ్నేశ్వరుడు : నామనసు తొలిచి వేస్తుంది నారదా, వెంటనే వెళ్లి రక్షణ
           కల్పించాలని ఆశగా ఉన్నది నారదా. 

నారదా : మన సహచరులు అక్కడ రక్షిమ్చుతున్నారు మహాప్రభు,

విఘ్నేశ్వరుడు :అట్లాకాదు నారదా, తక్షణమే మనలోకంలో ఉన్న సకల సదుపాయాలు అక్కడ కుడా కల్పించాలి, వెంటనే మన పుష్పక విమానము మీద, ఆహార పదార్దములు, మందులు, వస్త్రములు కొంత ధనమును, వాటితో పాటు మనగణాలు అన్ని అక్కడ ఉన్న వారికి సేవచేసి తరించాలి , ఇది  నా ఆజ్ఞగా భావించి వెంటనే ఏర్పాట్లు చేయి. 

నారదుడు : అటులనే ఇప్పుడే మెసేజ్ వెళ్ళింది, బయలు దేరింది పుష్పక విమానము, ఇక మనము బయలు దేరుదామా భూలోకానికి. 

విఘ్నేశ్వరుడు : అటులనే నారదా, తల్లి తండ్రులకు నమస్కరించి, అనుమతిని తీసుకొని పోయదము అయిన ఒక్కసారి  నీదగ్గర ఉన్న ల్యాబ్ టాప్ తీయుము,  అక్కడ పరిస్తితి ఎట్లా ఉన్నదో చూద్దాము.   

భూకంపంలొ చనిపోయిన ప్రతి ఒక్కరికి నివాళి అరిపిస్తున్నాను

   అందమైన నేపాల్ కళలన్ని ఒక్కసారి నేల కూలినాయి
   ఖాట్మండ్ లో అనేక భవనాలు చిగురుటాకులవలె కూలినాయి
   వైద్య సిబ్బంది, సహాయ రక్షణ దళాలు పనిచేస్తున్నాయి
శిధిలాలక్రింద ఉన్నవారిని రక్షించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి 

విఘ్నేశ్వరుడు : నారదా అన్ని దేశాల ఏకమై భూకమ్ప భాధితులను రక్షిమ్చుతారు నీవు భాధపడకు. అందులో గూగుల్ పర్సన్ ఫైండర్ సేవలు అందించడం మెదలు పెట్టాయి. మనం కూడా పంపినాము. 
అక్కడ పిల్లలు పెద్దలు వారి ఆర్తనాదమునకు నా మనసు భాదలో మునుగి పోతున్నది. అక్కడ చూడు ఎలా విలపిస్తున్నారో 

నారదుడు : అవును మహప్రభు, వారు మిమ్మల్నే తలుస్తున్నారు 

విఘ్నేశ్వరుడు : అందుకే నారదా విను 
భూమాత మా బ్రతుకు బుగ్గి పాలు చేసింది విఘ్నేశ్వరా 

రాలిపడిన చినుకులా ఇగిరి పోయింది 
రాలిన ఎండు టాకులా ఎగిరి పోయింది 
గాలికి కదిలే మేఘంలా కదిలిపోయింది 
గాలికి నిప్పురగిలి కారుచిచ్చులా మారింది

వేడి ఎడారిలో నడవలేకుండా చేసింది
రాక్షసి లా మాయను కమ్మి ముంచేసింది 
దీపం చుట్టు తిరిగే పురుగులా మార్చింది
విలపించే ఆర్తనాదాల మద్య బ్రతుకైంది


మేము తప్పేమీ చేసాము విఘ్నేశ్వరా 
మాకు శిక్ష వేసావు ఎందుకు విఘ్నేశ్వరా 

భూమి ప్రకంపించింది, సమస్తము ముంచేసింది 
నీడలావచ్చి మాయమైనది, లేత ఆకులనే రాల్చింది 
అగ్నిని రగిల్చింది, మంచినీరు బురదనీరుగా మార్చింది 
మా భాద ఎవరికీ చెప్పేది, ప్రగతి అంతా నేల పాలైనది 

కట్టుకోవటానికి బట్టలేదు, ఉండటానికి ఇల్లు లేదు 
తినటానికి తిండి లేదు, సేద తీర్చటానికి మందిరం లేదు
శవాలను తీసె దిక్కు లేదు, రోగులను రక్షించే మార్గం లేదు 
 మా భాద ఎవరికీ చెప్పేది, ప్రగతి అంతా నేలపాలైనది 

తల్లి తండ్రులు కానరాక విలించే పిల్లలు కొందరు 
భర్త పిల్లలు కానరాక విలపించే తల్లులు కొందరు 
కుటుంబమే కానరాక బ్రతికిన ముదుసలులు కొందరు
మా భాద ఎవరికీ చెప్పేది, ప్రగతి అంతా నేలపాలైనది  

  
మేము తప్పేమీ చేసాము విఘ్నేశ్వరా 
మాకు శిక్ష వేసావు ఎందుకు విఘ్నేశ్వరా

నారద ఇక చూడ లేక పోతున్నాను, అక్కడ ఎవరో పాడుతున్నారు ఏమిటి నారదా 

ఆమె మనసు చలించింది పాడు కుంటుంది వినండి
  
రావోయి రావోయిరావోయిరావోయి రావోయి మాయింటికి 
మీకు చేస్తాము మర్యాదలు ఈపూటకి

భయపడవద్దు వకిటముందు ఉంది వాటర్ సంపు 
ముంగిట మురికి కాలువ  మరిగిన  వాసన  కంపు 
చీకటైన కలకలమంటూ వేలువచ్చు దోమల గుంపు
కరంటుపోతుంది, కిటికీ తెరిచినా పోదు చవట కంపు 

రావోయి రావోయిరావోయిరావోయి రావోయి మాయింటికి 
మీకు చేస్తాము మర్యాదలు ఈపూటకి

మెత్తటి ఇడ్లి పెడతాము, పళ్ళు కదిలితే అడగద్దోయి
కమ్మని కాఫీ ఇస్తాము, నోరు చెడితే మాత్రము తిట్టద్దోయియి 
పడ్లు పెడతాము, వాసనచూడకుండా తప్పకతినాలోయి
పంచభక్షములు పెడతాము, పురుగులు ఉంటె అనకూడదోయి         

రావోయి రావోయి మాయింటికి 
మీకు చేస్తాము మర్యాదలు ఈపూటకి
  
మంచంలేదను కోకోయి.అందుబాటులో వీది అరుగున్దోయి
వక్కడినే అను కోకోయి, నీకుతోడుగా పక్షిరెట్టలు ఉంటాయి 
దుప్పటి లేదనుకోకోయి, కోకోయి, చెట్లఆకులు నిన్నుకప్పివేవెస్తాయి  
కబురులు లెవనుకోకోయి, నీకు  తోడుగా కుక్కలుంటాయి             

రావోయి రావోయి మాయింటికి 
మీకు చేస్తాము మర్యాదలు ఈపూటకి

సెల్ ప్రక్కన పెట్టుకోవోయి, భయమేస్తే ఎవరినైనా పిలవాలోయి
టి. వి.  ప్రక్కన ఉంచుకోవోయి, నీవు కాలక్షేపానికి చూడచ్చోయి
చంబుదగ్గర ఉంచుకోవోయి, దాహానికి,మరోరకానికి పనికొస్తుందోయి
బైక్ దగ్గర ఉంచుకోవోయి, నిద్ర రాకపోతే మీ యింటికి పోవచ్చోయి  
    
రావోయి రావోయి మాయింటికి 
మీకు చేస్తాము మర్యాదలు ఈపూటకి

విఘ్నేశ్వరుడు : నారద్ ఆమె పిచ్చి మాయం చేద్దాం తక్షణం, ఆమె ఇంటికి పోయి ఆతిద్యం తీసు కుందామా నారదా 
మహాప్రభు నేను ఆ అరుగు మీద పడుకోలేను, నన్నువదిలేయండి , భూలోకానికి తర్వాత పోదాం 
అటులనే నారదా 

అనుభ వించే వారికి తెలుస్తుంది భాద -
 కాలక్షేపం మాట్లాడే వారికి ఎం తెలుస్తుంది భాద