22, సెప్టెంబర్ 2015, మంగళవారం

ప్రాంజలి ప్రభ - ఇది కధ కాదు -ఆనంద పారవశ్యం -10

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ -  ఇది కధ కాదు ఆనంద పారవశ్యం -10

సర్వేజనా సుఖోనిభావంతు

కలఁడు మేదిని యందుఁగలఁ డుదకంబులఁ, గలఁడు 
వాయువునందుఁ గలఁడు వహ్నిఁ
గలఁడు భానునియందుఁ గలఁడు సోమునియందుఁ, 

గలఁ డంబరంబునఁ గలఁడు దిశలఁ
గలఁడు చరంబులఁ గలఁ డచరంబులఁ, గలఁడు

 బాహ్యంబునఁ గలఁడు లోనఁ
గలఁడు సారంబులఁ గలఁడు 

కాలంబులఁ, గలఁడు ధర్మంబులఁ గలఁడు క్రియలఁ

గలఁడు కలవానియందును గలఁడు లేని
వానియందును గలఁడెల్లవానియందును
నింక వేయును నేల సర్వేశ్వరుండు
కలఁడు నీయందునాయందుఁ గలఁడు కలఁడు

ఎఱ్ఱాప్రెగడ విరచిత "నృసింహపురాణము" నుండి





మనసులో ఊహలు గాలిలో తేలుతూ
కోడె వయసు వాన జల్లులో  తడవాలని తపిస్తూ
వయ్యారాల వలపులుతో వాకిట గుమ్మాన ఎదురు చూస్తూ
ఉల్లాసాల తనువు తపనల తన్మయత్వం కోసం వయ్యారి చూపులతొ
సహజ సౌందర్యాన్ని అరాద్యునికి అర్పించాలని ఆత్రుత కన్నులతొ
ఈ మకరంద మాధుర్యాన్ని అందుకోవటానికి వచ్చే తుమ్మేదకోసం  
మేలి ముసుగు తీసి ముత్యాలాంటి ఆధరాల పొందు కోసం
ఎంతసేపు ఇంకెంతసేపు వేచి ఉండాలో అని ఎడమ చెవితో విన్న మాట హెచ్చరిస్తుంది మనసులోని భావాలను తెలిపి ఆనంద పారవశ్యంలో మునిగి పోయింది


మనసిజ పుష్ప బాణము మాటికి గ్రుచ్చగా
వయ సొచ్చిన వగ లాడి సిగ పట్టు లాడగా
వయ్యారి వగలాడి వలపుతడిసి పట్టుపట్టగా
గుట్టు రట్టు చేసి బెట్టు బెట్టు అంటావేముగుడా 




నీ చూపుల్లో కాంతి - ఉషోదయ కాంతితో సరికాదు
నీ దంతాల్లో కాంతి - మాణిక్య కాంతితో సరికాదు
నీ పలుకుల్లో కాంతి - వక్భూషనాలతో సరికాదు
నీ అడుగుళ్ళోకాంతి - సప్తపదులతో సరిపోదు

నీ కదలికల్లో కాంతి - నెమలి పించాల కదలికతో సరికాదు
నీ ఆశయాలల్లో కాంతి - మబ్బులో మేరుపలతో సరికాదు
నీ వలువలల్లో కాంతి - చాందినీ గుడ్డలతో సరికాదు
నీ పిల్లల్లో కాంతి - మెరిసేటి హరివిల్లుతొ సరిపోదు

నీల మేఘముల - నీల పుష్పముల - నీల సంద్రములఁ జూడఁగా
నీలదేహు వర - నీల కేశముల - నీల పింఛ మగుపించుఁగా
నీలమోహనుని - నీలకంఠమున - నీలరత్నముల నెంచఁగా
బేల డెందమున - నీలకంఠములు - వేల నాట్యముల నాడుఁగా

నింగిలో మొయిలు - నింగిలోఁ బులుఁగు - నింగిలో వెలుఁగు బిల్చె నన్
నింగిలో శశియు - నింగిలో మిసయు - నింగిలో మురువు బిల్చె నన్
రంగ మీ వసుధ - రంగుతో వెలిఁగె - రంగవల్లి సురనర్తకీ
రంగులన్ సఖి యొ-సంగుమా బ్రదుకు - రంగమండపము నాయకీ
 
ప్రేమయే ప్రగతి - ప్రేమయే సుగతి - ప్రేమయే సుమతి రాధికా
ప్రేమయే క్షణము - ప్రేమయే యుగము - ప్రేమయే జగము మాధవా
ప్రేమయే నభము - ప్రేమయే శుభము - ప్రేమణీ కనకమల్లికా
ప్రేమయే భవము - ప్రేమయే శివము ప్రేమికా హృదయపాలకా
 
నల్లనౌ తిమిర వీథిలో - నగుచుఁ - దెల్లఁగా మెఱిసెఁ దారకల్
చల్లగా నలరె వెన్నెలల్ - సరస -చల్లనౌ రజని వేళలో
హృల్లతల్ విరియ సొంపుగా - నిచట -నుల్లముల్ మురిసి పొంగఁగా
వల్లకిన్ ద్వరగ మీటవా - స్వరపు -పల్లకిన్ గులికి సాగెదన్

వాసన లేని పువ్వు, బుధ వర్గము లేని పురంబు,
భక్తి విస్వాసము లేని భార్య, గుణవంతుడు గాని కుమారుడున్,
సదాభ్యాసము లేని విద్య, పరిహాసము లేని వాచ్య ప్రసంగముల్,
గ్రాసము లేని కొలువు, కొఱగానివి పెమ్మయ సింగ ధీమణీ.

గారెలు లేని విందు , సహకారము లేని వనంబు ,
తొలుత ఓంకారము లేని మంత్రము , అధికారము లేని ప్రతిజ్ఞ ,
వాక్చమత్కారము లేని తెల్వి, గుణకారము లేనటువంటి లెక్క,
వాసము లేని ఇల్లు , కొఱగానివి పెమ్మయ సింగ ధీమణీ.

మచ్జిక లేని చోట అనుమానం వచ్చిన చోట
మెండుగా కుత్యిలున్న చోట రాజు కరునించని చోట
వివేకు లున్నచో అచ్చట మోసమండ్రు
కరుణాకర పెమ్మయ సింగ ధీమణీ.

-- జక్కన చెప్పిన 'పెమ్మయ సింగధీమణి' శతకము నుంచి

కవిత హ్రుదయులకు ఆనంద పారవశ్యము కొరకు ఇందు పొందు పరుస్తున్నాను
శ్రీ.జెజ్జాల మోహన రావు గారికి కృతజ్ఞతాంజలులు..




ఆడవారు బొంకు లాడువారు - మగవారు రంకు కట్టు వారు
ఆడవారు బొట్టు పెట్టి తిట్టు వారు - మగవారు పట్టు పట్టి కొట్టు వారు
ఆడవారు ఒట్టు పేట్టి పెట్టు వారు - మొగవారు పెట్టి కొట్టి వట్టనేవారు
ఆడవారు ఆరోగ్యాన్ని చూసెవారు - మగవారు అనారోగ్యం కోసం వెతికేవారు 

ప్రాంజలిప్రభ , శుభోదయం.మిత్రులందరికి  శుభాకాంక్షలు.

"ము"ఖ పరిచయం లేకపోయిన ము
"ఖ"పుస్తక మిత్రులతో చెలిమిని చేస్తూ వారి
"పు"రోగతి నాకాంక్షిస్తూ .. వేకువజాము నుండి మ
"స్త"కాలకు పని పెడుతూ,చేతి వేళ్ళనే
"క"లములుగా చేసుకొని వానికి పనికల్పించి
"మి"హిరుడు రాకముందే మేల్కొని మి
"త్రు"లకు శుభోదయం పల్కుతూ శ్రీ
"ల"క్ష్మీ పతి అనుగ్రహం కోరుతూ ఒకే
"కు"టుంబంలా కలసి మెలసి వున్న
"స్నే"హితులకు
"హి"తులకూ
"తు"ష్టిని పుష్టిని యొసగుమని
"ల"క్ష్మీకాంతుని ప్రార్థిస్తూ ఈ సత్స్నేహం
"దినదిన ప్రవర్దమానంకావాలనీ మ
"నో"ల్లాసం అందరికి కలగాలని నిత్యో
"త్స"వం కావాలని సతతము సకల
"శు"భఫలాలు పొందాలని ఎల్లప్పుడూ
"భా"షామతల్లిని కొలుస్తూ వుండాలని
"కాం"క్షిస్తూ ఆహరహం క్షరంకాని అ
"క్ష"రాలతో మన స్నేహ పరీమళా
"లు"దశదిశలా వ్యాపించాలని ఆకాంక్షిస్తున్నాను.

(మొదటి అక్షరాలను గమనించండి.)

                   ఇంకా ఉంది

1 కామెంట్‌:

  1. మంచి పద్యములను, కవితలను అందించారు. ధన్యవాదములు.
    గారెలు లేని... పద్యంలో 4వ పాదం
    .... సా
    కారము లేని పూజ కొరగానివి పెమ్మయ సింగధీమణీ!

    మచ్చిక లేని ... పద్యం పూర్తిగా లేదు. పరిశీలించండి.

    రిప్లయితొలగించండి