అత్తా-కోడలు
ఏమిటండి అదేపనిగా నన్ను చూస్తున్నారు. నీవు కాఫి పట్టుకొని అలా వస్తూ ఉంటే నాకు నమ్దూరు వ్రాసిన యంకి పాట గుర్తుకొచ్చి నా మనసు ఒక్కసారి కలుక్కు మన్నది. ఏమై దండి మీకు ఒంట్లో బాగోలేదా డాక్టర్కు చూపిమ్చుకుమ్దా పదండి. రోగానికి దాచు కొకూడ దండి అన్నది భార్య పద్మ . " ఏమిటా రోగం " ఇలా చెపూతా అంటు కాఫీ అక్కడ పెట్టు, కంట్లో ఏదో నలక పడింది ఒక్కసారి చూడు అన్నాడు భర్త శ్రీనివాస్ . ఆ ఉండండి నేను చూస్తా అంటు ముందుకు వంగింది అమ్మామ్తముగా ఒక్కసారి ముందుకు లాక్కొని ముద్దు పెట్టుకున్నాడు ఇది రోగం తెలిసిందా అన్నాడు , ఏమిటండి ఎప్పుడు పడితే అప్పుడా అంటే ఎట్లా దానికి ఒక పద్దతి ఉంది. మనకు ఒక పాప ఉంది. ఇక్కడ అత్తయ్యగారు ఉన్నారు, ఎవరైనా చూస్తె ఏమనుకుంటారు. ఏమను కోరు కొత్త పెళ్లి జంట మనం వారి మద్య పొకూడదు అంటారు అన్నాడు. సరే లేండి మీకు ఎప్పుడూ కొత్తే, ఎమీ లెదె పాప పుట్టిం తర్వాత నీ అందాలు బాగే పెరిగాయే ఒట్టు, నీ తోడు, అబ్బ "ఏమిటండి మాటలు" నాతొ అంటే అన్నారు, నేను నీకు బానిసను, మీరు ఎట్లా ఉమ్డమంటే అట్లా ఉండేదాన్ని, ఆడమంటే ఆడే దాన్ని, సుఖం ఇవ్వమంటే ఇచ్చేదాన్ని కదండి, అంటు మరొక్క ముద్దు ఇచ్చి కాఫీ అమ్దిమ్చి నేమ్మదిగ్గా వెనక్కు తిరిగింది, నా బంగారు శ్రీమతి అన్నాడు. బంగారం కరుగుతుంది కదా అని ఇష్టం వచ్చిన రూపాల్లో నగలు తయారు చేసుకుంటారు నేను మనిషిని, అదే ఆపని మాత్రం చేయకండి. అంటుంటే ఒక్కటే నవ్వు. ఆ నవ్వుల్లో కాఫీ పడింది శ్రీనివాసు చేతినుమ్ది పద్మమీద, సారి అంటు చాతిని తుడవ బోయాడు. చాల్లెండి మీ సరసం, నేను కావాలని పోయలేదు సారి సారి సారి . ఇప్పటికి మూడు సారులు చెప్పారు. నెను బాతు రూమ్కు పొయి కడుక్కొని చీర మార్చు కొని వస్తా బుద్దిమంతుడుగా కూ ర్చోండి . నీకెమన్న బాత్రూమ్లో సహాయము చేయ మంటవా . ఇప్పటిదాకా చేసింది చాలు అమ్మ్మో మీరు బాత్రూమ్లోకి వస్తే ఎమ్కెముంది. ఏమవుతుంది
ఏమవు తుందా మనమ్మాయిని కనుక్కొని చెప్పుతా అంటుంటే ఒక్కటే నవ్వు, ఒకటే నవ్వు ఎవరే అక్కడన్నది ఆ " టి. వి '. కట్టేయ్యండి. ప్రొద్దున్నే ఈ నవ్వులెంటో అన్నది అత్తయ్యగారు. అమ్మ అదికాదే అంటుంటే పద్మ ముందుకు వచ్చి పెదాలు తాకి ముద్దిచ్చి వెళ్ళుతూ మీరు సత్యహరిచంద్రులు ఏది చెప్పాలో ఎదిచెప్పకూడదొ తెలియని అమాయకులు ఉండండి ఇప్పుడే వస్తా కాస్త టి.వి వాల్యూమ్ పెంచండి అత్తయ్యగారు వచ్చినా రావచ్చు అంటు లోపలకు వెళ్ళింది పద్మ.
పద్మ చీర మార్చుకొని వస్తూనే ఏమిటో, పాపారు విశేషాలు, పాపరంతా మాకు ఓటేయండి, మాకు ఓటేయండి, అంటు పేపరు అంతా మేము ఇది చేస్తాము , ఇది చేస్తాము అని వ్రాసినారు. ఆ ఏమ్చేస్తారండి మా మహిలా బిల్లు ఇంతవరకు పాస్ చేయలేదు. అభయ బి ల్లు పెట్టారు మానభంగాలు తగ్గాయ అన్నది. అట్లా అనకే అట్లా అనకె ఏమ్కేట్లా అనాలి, స్కూలు కెల్లె విద్యార్ధులను ఎత్తుకేలుతున్నారు ఎవరన్నా పట్టించు కుంటున్నారా, పిల్లలను అమ్ముతుంటే పట్టుకున్నారు, చదవలేదా పాపారు. చదవి మీరు ఎన్నెనా చెప్పండి పేపరులో ఇవ్వాళా వేసిన యాక్సిడెంట్లని, అఘాఇత్యాలని వ్రాస్తారు వాటి గురించి మరునాడు గాని వారం రోజులుదాక కాని ఎటువంటి సమాచారము వ్రాయరు, ఎవరన్న అడిగితె మేము ఈరోజు కారోజు విషయాలు చెప్పటమే మా పాపారు లక్షణం మరలా పాత వేస్తె తప్పుమ్టారు. అంటే ప్రశ్నలు చదువుకొనే పాపారు మీరు చెదివేది అవునా అన్నది పద్మ . అమ్మో నీకు రాజకీయము బాగాతెలుసే. రాజకీయ మంటే ప్రత్యక చదువుకాదు. ప్రజల హృదయాలలో ఉండే భాద అర్ధం చేసుకొనే తెలివి, భాదను తీర్చె తెలివి ఉంటే చాలు అన్నది.
ఆ నేననేదే ముంది, మీరు మొగవారు ఏమి మాట్లాడినా చెల్లుతుంది. మేము ఎదన్న మాట్లాడితే గద్దర్ది అంటారు కాదా , " అసలు ఆడ దంటే మొగవాడిలో సగం " అంటారు అన్నది. అర్ధనారీస్వరుడన్నారు, అర్ధనారిస్వరి అనలేదు కదా.
ఇది మాత్రం తప్పు "ఆమెలోనే అతడు సగం తెలుసా"
ఎమ్డుకంటే " woman " అంటే స్త్రీ , man అంటే పురుషుడు ఓ.కే ఇప్పుడు MAN ఎవరిలో ఉన్నాడు " WOMAN " లో అంటే స్త్రీలొ ఉన్నట్టు నిజమా, నిజమే అన్నది పద్మ
ఇప్పు డు FeMALe అంటే స్త్రీ , తీసుకొ దానిలో male ఉంది, మేల్ అంటే పురుషుడు ఎవరిలో ఉన్నాడు ఫిమేల్ లో ఉన్నాడు అంటే స్త్రీలొ ఉన్నట్టు నిజమా, నిజమే అన్నది పద్మ
ఇప్పుడు she అంటే ఆమె కదా, కాదన్న దెవరు అందులో he అతడు ఉన్నాడు అవును . అంటే స్త్రీలొ ఉన్నట్టు నిజమా, నిజమే అన్నది పద్మ.
మీరెంత తెలివిగాలవారండి మొగవాల్లంతా స్త్రీలో ఉన్నట్లు niruupimchare బలేవారే అంటు నవ్వు కున్నారు. ఎంటే ఆ నవ్వుlu ఆ టి.వి వాల్యూమ్. కట్టేయ్యండి ప్రొద్దున్నే ఈ నవ్వులెంటో అన్నది అత్తయ్యగారు.
అట్లాగే అమ్మ అన్నాడు కొడుకు శ్రీనివాసు
ఇదిగో అబ్బాయి నేను కోడలిపిల్ల (మనవరాలుతో) కలసి గుడికి వెళ్లి వస్తాము ఇంట్లోనే ఉండు అన్నది. ఏదైనా అటో చేసుకోనివేల్లండి. గుడి దగ్గరే డబ్బులు ఎందుకు దండగా అన్నది. సరే మీరు జాగర్తగా వెళ్లి రండి. పద్మ నీదగ్గర ఫోన్ ఉందిగా గుడిలోకి వేల్లగానే సై లెంటులో పెట్టు, లేదా అక్కడ కౌంటర్లో ఇచ్చి టోకెన్ తీసుకో అన్నాడు. అట్లాగేనండి.
ఒక గంట తర్వాత తిరిగివచ్చారు ఇద్దరు. ఎమిజనం ఏమి జనం, దేవుడ్ని చూడ నిస్తెన అందరు తోసె వారే చిన్న పెద్ద చూసెవారె లేరు అన్నది వస్తూనె కాంతమ్మ.
అవునండి జనం బాగున్నారు. పనమ్మాయి కూడా కాస్త నసిగింది. గాలివేలుతురు సరిగాలేదు ఒక్కటే తోపిడి అందుకనే దూరమ్ నుంచి దండం పెటుకొని వచ్చాము.
మంచి పనిచేసారు, కాస్త విశ్రాంతి తీసు కోండి అన్నాడు శ్రీనివాసు.
సరే నాకు ఆఫిసు నుండి ఫోన్ వచ్చింది కాస్త పనుమ్దట చూసుకొనివస్తా మీరు అన్నం తినేయండి, నాకు కారేజ్ పెట్టి ఉంచు వర్కర్ను పంపిస్తా అన్నాడు అట్లాగేనండి.
సరే ఒక ఉపాయము సాయంత్రము ఫోన్ చేస్తా వచ్చెయి పాపను అమ్మదగ్గర ఉంచు చూస్తు ఉమ్టుందిలే అన్నాడు సరే జాగర్తగా వెళ్ళండి.
భోజనము చేసి క్యారేజి సర్ది వర్కర్కు ఇచ్చి కాస్త కునుకు తీసిమ్ది పద్మ
అ త్త య్య గారికి పాపను చూస్తు ఉండమని చెప్పి మార్కెట్ కు వెళ్ళింది పద్మ.
నేను పిల్లల కన్న తల్లినే నమ్మ, నాకు నీవు అంత మరి గట్టిగా చెప్పా నక్కరలేదు. నీవు వెళ్ళు అమ్మాయని నేను చూస్తాను, త్వరాగా రండి. బజారంతా కొనటానికి ప్రయత్నిమ్చాకండి. ఇంట్లో ఒక ముసలిది ఉన్నది అని గుర్తుమ్చు కోండి. అట్లాగే అత్తయ్యగారు వెల్లి వస్తాను అన్నది. పద్మ.
ఏ మండి అమ్మ యిని వదిలి వచ్చాను నాకు భయముగా ఉందండి త్వరగా ఇంటికి వేల్లుదాము. మిగతావి త్వరవాత తీసు కుందాం అంటు అటో ఎక్కి ఇంటికి చేరారు ఇద్దరు.
లోపలకు పొతూనె అమ్మాయి నీటితొ ఆడుకుంటున్నది. ఏమిటండి పాపను చూడ మంటే సెనక్కాయలు వలుచుకొని తింటున్నారు మీరు అన్నది కోపంగా పద్మ.
అనమ్మా అను ఇంట్లో ఒక్క సెనక్కయతినకూడదు, ఒక్క స్వీట్ తినకూడదు, పిల్లకు కాపలా ఉండాలి, ఇంటికి కాపాలా ఉండాలి, నేనొక ఇంటికి నౌకర్ని కదా కొడాలా అన్నది.
ఏమిటండి అంత పెద్ద మాటలు అంటున్నారు జాగర్తగా మాట్లాడండి. సేనక్కాయతోక్కులు పిల్ల నోట్లో పెట్టు కుంటే ఏమౌతుందో అని భయముతో అన్నాను తప్ప మీమ్మల్ని నేనేమనగలను అన్నది.
నామీద అంత నమ్మకము లేక పోతే, నీ పిల్లను తీసుకెల్ల పొయావా, అవునండి తెలిసికూడా వదలి వెళ్ళాను, నాచేప్పుతో నేనే కొట్టు కొనేటట్లు మాట్లాడారు మీరు.
ఇందులో నేను ఏమి తప్పు మాట్లాడానమ్మ అంత కోపము వచ్చింది.
శ్రీనివాసు వస్తూనె మీ ఇద్దరి మద్య గొడవ మోదలయిందా, అది ఇప్పుడేఉ తేలదు మూదొ ప్రపంచ యుద్దాహము వచ్చి ఆగిపోవునేమోగాని అత్తా కోడల మద్య సమరం ఆగదు, అమ్మకు వయసొచ్చిన పౌరుషము తగ్గని ప్రేమ, ఇకచేప్పలంటె నాభార్యకు కన్నా బిద్దమీద ఈగ వాలిన తట్టు కోలేదు అది కన్నప్రేమ అంటు
పద పద్మ పాపను తీసుకొని లోపలకు అన్నాడు.
ఏకోశాన అమ్మ అని మర్యాద నీలొ ఉన్నదా, పెళ్ళాం వెనకేసుకు వస్తున్నావు, కొడుకా
అదికాదమ్మ మీ ఇద్దరి మద్య తగాదా వద్దని దాన్నేగా నేను అరిచింది. అన్నాడు. అవును పెళ్ళాంను వెనకేసుకోక ఈ అమ్మమాటలు నీకుచెవి కేక్కవు, సరే తప్పు అంత నా భార్యది కాస్త విశ్రాంతి తీసుకొమ్మ. సరే నీమాట నేను కాదంటానా అన్నది. మూతి తిప్పుతూ .
అమ్మ ఏమైంది అట్లా అరిచావు, ఎమయిందా నాసార్ధం ఆఇమ్ది. చూసి నడవద్ద అమ్మ, అవున్రా అను కాస్త లేపారా అట్లా చేయి గుమ్జకురా
ఎమయింది అత్తయ్యగారు.ఇదిగో ఈ చెయ్ ఇట్లా పటుకో, నెమ్మదిగా నడిపిద్దాము అన్నాడు. అమ్మో నడుం నెప్పిగా ఉందిరా డాక్టర్కు ఫోన్ చేయరా, ఇదిగో చేసాను అత్తయ్యగారు 10 నిమిషాలలో వస్తారుట అన్నది పద్మ. నెమ్మదిగా మంచం దగ్గర కుర్చీలో కూర్చొబె ట్టండిరా అని కేక పెట్టింది.
ఇమ్తకీ డాక్టర్ ఎప్పుడొస్తాడురా.
అదిగో వచ్చాడు. డాక్టర్ నా ప్రాణాలు ఉంటాయా పోతాయా చెప్పండి. భాద తట్టుకోలేక పోతున్నాను. ఇమీ కాలేదు మీరు మునిపటి లాగా 7 రోజుల్లో తిరగ గలరు. ఇప్పుడు ఇంక్షన్, మందులు వ్రాసాను వెంటనే తెప్పించండి. నేను పొయి తెస్తాను అమ్మను చూస్తు ఉండండి. నేను అప్పటిదాకా ఈ మందు ఇంజక్ క్షన్ ఇస్తాను అన్నాడు డాక్టర్ ఆమెకు కాస్త ఉపసమనము కలుగుతుంది, లేచాక మంచం మీద పడుకోమనండి .
నరం కదిలింది ఈ తైలం రోజు రెండు పూటలా వ్రాయండి తగ్గి పోతుంది. అంటున్నాడు. ఇదిగోండి డాక్టర్ మందులు తెచ్చాను అన్నాడు శ్రీనివాసు డాక్టర్ ఇంజక్క్షన్ చేసి ఈమె వద్ద ఎవరైనా హమేషా ఉండాలి అని చెప్పి వెళ్ళాడు.
ఏమండి నేను ఈరొజు మీ అమ్మదగ్గర కాపలాగ ఉంటాను, అమ్మాయి లేస్తే చెప్పండి, మీరు వెళ్లి పడుకొండి అసలే రేపు ఆఫీసుకు పోవాలి. అన్నది పద్మ. పద్మకు కుడా కుర్చీలొ కునుకు పట్టింది.
ఇద్దరు పడుకున్నారు కదా అని శ్రీనివాసు లోపలకు వెళ్ళాడు.
అప్పుడే పద్మకు అత్తా కోడలు కొట్టు కున్నట్లు కల వచ్చింది. ఉలిక్కి పడి లేచింది. భర్తను పిలిచింది. నాకు భయముగా ఉంది మీరు కూ డా ఇక్కడే ఉండండి.
ఎందుకే భయము కల వచ్చింది. అందులో అందులో అత్తయ్యగారిని చీపురు కట్టతో కొట్టానండి. మీరెమనుకొ కండి.ఇది కల కాదే అవును కలే . వివరంగా చెప్పు , చేప్పా లంటే నే భయమేస్తుమ్డంది అన్నాది.
" ఒసేయి ముదరష్టపుదానా, మదమెక్కి కోట్టు కుంటు న్నావే, ఆకూర్చొవటమేమిటే, వంటి మీద గుడ్డ ఎక్కడుందో కూడా చూడ కుండా కాల్లుపు కుంటు మరీ కూర్చున్నావు.
ఏమిటత్తగారు నన్ను పిల్చారా, అబ్బే లేదమ్మా నీపని నీవు చేసుకో అన్నది. ఆ ఇంకా గిన్నెలు తోమలా, త్వరగా తోమండి. తర్వాత బట్టలు ఉతకాలి అన్నది. వళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. మీ అబ్బాయి వచ్చి ఎవరు తోమారు అని అడిగేతే ఏమి చెప్పా లి అత్తయ్యగారు. పనిమనిషి తోమిమ్దని చెప్పు, లేదా నీ ఇష్టమొచ్చింది చెప్పు అన్నది విసురుగా.
అవునే మా అబ్బాయిని బుట్టలో వేసుకున్నావు నోటికోచ్చినట్లుగా పెలుతున్నావు, ఈ ముసలిదానికి కాఫీ పెట్టి ఇవ్వవచ్చుగా అన్నది. మీరు పనిమనిషి కాదు అత్తయ్యగారు, మీరు ఇంటి మనిషి అన్నాది. మర్యాదలకు ఏమి తక్కువలేదు అత్తయ్యగారు అంటావు పనులన్నీ చెయిమ్చు కుమ్టావు అన్నది.
నామోగుడనే వాడుంటే నీ చేత ఇన్ని మాటల అనిపిమ్చు కోనేదాన్న. అసలు మావయ్యగారిని చంపింది మీరెట, ఎవరన్నారు,
నన్నొక పిచ్చిదాన్ని చేసి ఆడిస్తున్నారు. ముందు అబ్బాయి రాని నీవు నాచేత చేయించే పనులన్ని చేపుతా అన్నది.
ఏమిటే అంటున్నావు ముసలి మూడు పూటలా కంచాలు కంచాలు తిమ్టున్నావు, ఈ కాస్త పని చేయమంటే గోనుగుతావు.
నేను గోనుగు తున్నానా ఈ చేత్తో తిరగలి తిప్పినదాన్ని, ఈ చేత్తో కారం దంచినదాన్ని, తెలుసా అన్నది రోషముగా. అది తెలిసే ఈ చిన్న పనిచేయమన్నా నిన్ను, ఇది చిన్న పనా బట్టలు ఉతకటం, అసలు ఈ చేత్తో నిన్నుఒక్కటిస్తె లంకిణి నెలకు కర్చుకున్నట్లు కర్చు కుమ్టావు అన్నది. అసలు నేనేవరను కున్నావే ఛాయా దేవి అక్కను, సూర్య్వా కాంతం చెల్లెలిని జాగర్త, నాజోలుకు రాకు అన్నది కోపంగా.
నామీద అబ్బాఇకి లేనిపోనివి చెప్పి బయటకు గెంటింమ్చాలని అనుకున్నవో చూరుపట్టు కొని వ్రేలాడుతాను జాగర్త అన్నది. నీవు కోడలివి కోడలిగా ఉండు, అత్తగా వచ్చి నీ జుట్టు పట్టుకున్నా నంటే ఊడి చేతిలోకి వస్తుంది. ఏమిటే నా జుట్టు పట్టు కుమ్టావా నీ కెంత ధైర్యము చూడు ఇప్పుడు నేన్నేమి చేస్తాను అంటు చీపురు కట్ట తీసుకొని అత్తని వెంబడించి కొట్టింది, ఉమ్డవే ఉండు నీ పని చెప్పుతా అంటు కారం తీసుకొని వచ్చి కొడలిమీద చల్లింది. ఇక కొట్టవే కొట్టు అన్నది. అంతె మంట మంట అంటు బిందెడు నీళ్లు మీద పోసుకుంది కోడలు. ఇంకా మంట మంట అంటు బావిదగ్గర ఉన్న తొట్టిలో నీరుచల్లు కుంది. ఇల్లంతా ఎగిరింది. గంతులేసింది. అత్తా జోలికి ఎప్పుడు రాకు కోడలిపిల్ల అన్నది.
అమ్మో ఇది కలా నాకే నీవు చెపుతుంటే వల్లుజల దరిమ్చిమ్ది.గ్లాసుడు నీళ్లు త్రాగాడు శ్రీనివాసు. అవునండి అందుకే భయమన్న ఇది కల కదా నీవు భయపదనవసరములెదు అమ్మ అలాంటిది కాదు. చాల మంచిది.
అత్తయ్యకు రెండు రోజ్జుల్లో తగ్గుతుంది కదాండి అన్నది.
ఓపికతో కోడలు ఆత్తయ్యకుసేవాలు చేసిన ప్రభావము వళ్ళ కోలుకుంది ఆఇల్లి సంతోషాలతో నిండి పోయింది..
అందుకే అన్నారు అత్తలేని కోడలు ఉత్తమురాలు
కోడలులేని అత్తా గుణవంతురాలు
అత్తా కోడలు ఉన్న ఇల్లు నిత్య సౌభాగ్యాలు, సంతోషాలు, మరియు సరిగమలు . .